కుమారస్వామికి తన పెళ్ళి ఆగిపోవడానికి కారణమైన విఘ్నేశ్వరుడి మీద చాలా
గుర్రుగా ఉంది. ఒకనాడు అతడు తల్లితో, ‘‘వాజమ్మకాక జేజెమ్మ ఎలాగౌతాడమ్మా
అన్న! నలుగు ముద్ద తిండిముద్దకే గాని ఘనకార్యం చే
ు గలడా?'' అన్నాడు
విఘ్నేశ్వరుడికేసి చేయి చూపుతూ ఎకసక్కెంగా. వినా
ుకుడు గుడ్ల నీరు
పెట్టుకొని, ‘‘చూడమ్మా! తమ్ముడు నన్ను ఎంతలేసి మాటలంటున్నాడో...'' అంటూ
ఏడ్చినంత పనిచేశాడు.
కుమారస్వామి మాటలకు పార్వతికి కూడా కోపం వచ్చింది. వినా
ుకుణ్ణి
అక్కున చేర్చుకొని బుజ్జగిస్తూ, ‘‘నాన్నా, నేను చేసిన బొమ్మవని వాళ్ళకు
అక్కసురా! తండ్రి చంపనే చంపేశాడు,తమ్ముడు ఇలాగ దెప్పుతున్నాడు. పోనీలే,
వాళ్ళ అజ్ఞానం వాళ్ళకే తలవంపు!'' అంది. ‘‘తమ్ముడు అజ్ఞాని అయితే అవుతాడు
గాని, నాన్నకు అజ్ఞానం ఏమిటమ్మా, నీ పిచ్చిగాని...'' అన్నాడు గణపతి ఎంతో
ఆశ్చర్యంగా.
పార్వతి ఏదో తలంచుకొని,‘‘నాకు కాదురా పిచ్చి, ఆ శంకరమహాదేవుడికే
పిచ్చిఎక్కి విష్ణుదేవుడి జగన్మోహిని అవతారం వెంటబడి నవ్వులపాలవలేదా
ఏమిటి!'' అన్నది. ‘‘ఆ తర్వాతేం జరిగిందమ్మా?'' అన్నాడు గణపతి. ‘‘ ఏదో ఘోరమే
జరిగింది, వాళ్ళిద్దరి మధ్యా ఒక భైరవుడనే కారుచీకటిలాంటి భూతపిల్లడు
పుట్టాడట!'' అంది తల్లి.
‘‘భైరవుడెక్కడుంటాడమ్మా? వాణ్ణి చూడా లని వుంది!'' అన్నాడు కొడుకు.
‘‘ఎక్కడో ఉంటాడు. నల్లటిబట్టలు కడతా డట, వాడిదగ్గిరికి పొరబాటున కూడా
వెళ్ళకు సుమీ, చూస్తే ఝడుసుకుంటావు!'' అంది పార్వతి. ‘‘ఝడుసుకోవడమంటే
ఏమిటమ్మా? అది కూడా తెలుసుకోవద్దూ?''అన్నాడు గణపతి వింతగా చూస్తూ.
‘‘పెళ్ళాడితే నీకే తెలుస్తుంది!''అంది పార్వతి.
‘‘అదా సంగతి! భార్యారత్నాలు అంటే అంత భ
ుంకరం అన్నమాట! అందుకే
మొత్తుకుంటున్నాను. నేను పెళ్ళి చేసుకో నమ్మా!'' అన్నాడు గణేశుడు.
కుమారస్వామి అందుకొని, ‘‘అదే నీ ఘనకార్యం! నేను ఇప్పుడే పోయి సూర్యుణ్ణి
చుట్టి వస్తాను!'' అంటూ నెమలినెక్కి తుర్రు మన్నాడు. విఘ్నేశ్వరుడు తిన్నగా
వెళ్ళి మేరుపర్వతం ఎక్కి చిట్టచివర శిఖరాగ్రం మీద కుదురుగా కూర్చున్నాడు.
మేరుపర్వతం చుట్టూరా సూర్యుడు తిరుగుతూంటాడు.అక్కడ సూర్యాస్తమ
ుం
అనేది ఉండదు. కుమారస్వామి శ్రమపడి సూర్యుడి చుట్టూరా ప్రదక్షణం చేసి వచ్చి
అన్న మేరు పర్వతం ఎక్కి కూర్చున్నాడని తెలుసుకొని, ఎంతో విచారంగా ముఖం
వేలవేసి ఊరు కున్నాడు. ‘‘ఏం కుమారా, ఎందుకు అలా తల వేలా డదీసుకున్నావు?''
అని పార్వతి ఆశ్చర్యపోతూ అడిగింది.
‘‘అమ్మా! నేను ఎంతో కష్టపడి సూర్యుడి చుట్టూరా తిరిగితే, అన్న
సునా
ూసంగా సూర్యుణ్ణే తన చుట్టూరా త్రిప్పుకుంటు న్నాడమ్మా! నిజం
చెప్పాలంటే అన్న చేసినదే ఘనకార్యం!'' అన్నాడు కుమారస్వామి ఎంతో విచారంగా.
కొద్ది రోజుల తర్వాత పార్వతి మళ్ళీ పెళ్ళి ప్రస్తావన తెచ్చింది.
‘‘అమ్మా! సౌందర్యంలో నీకు సమఉజ్జీ అయిన సుందరి కనిపిస్తే పెళ్లాడాలని
ఉందమ్మా!'' అన్నాడు విఘ్నేశ్వరుడు. పార్వతి చురక తగిలినట్లు పెదవి కరుచు
కొని, ‘‘అలాగైతే ఇంటి మొగసాల కూర్చొని, దారివెంట వచ్చేపోేు వాళ్లను
చూస్తూండరా, కుంకా!'' అంటూ అక్కడి నుంచి అవతలికి కదిలింది.
‘‘అలాగే తల్లీ! నీ ఆజ్ఞ!'' అని వినా
ు కుడు వీధిలో కూర్చుని కొంతసేపు
తూర్పుకు మరికొంతసేపు ఉత్తరంకూ, అలాగ ఎనిమిది దిక్కులకూ ముఖం పెట్టి
చూడసాగాడు అదేపనిగా. పార్వతి అతని వింత చేష్టకు వింతగా చూసి, ‘‘ఏం నా
ునా,
కనిపిం చింది?'' అని అడిగింది. విఘ్నేశ్వరుడు, ‘‘అమ్మా! ఏదిక్కు చూసినా
నాకు మరేదీ కనిపించలేదు. జగజ్జననివైన నీవే ఎనిమిది చేతులతో ఎనిమిది
దిక్కులా కనిపిస్తున్నావమ్మా!'' అన్నాడు. పార్వతి ఆనందంతో మైమరచిపోయింది.
‘‘నా
ునా! విఘ్నరాజా! అందరు దేవుళ్ళూ తూర్పు ముఖంగా ఉండి పూజలందుకోవా
లని ని
ుమం వుందిగాని, నీవు ఎటు ముఖం పెట్టి ఉన్నా ఆరాధనీ
ుుడవే!'' అని వరం
ఇచ్చింది. అతని పెళ్ళిమాటే మర్చిపోయి, ముద్దుల కొడుకు మురిపెంపు మాటలు
శివుడితో ఒక టికి రెండుసార్లు చెప్పి చెప్పి ఆనందించింది. చివరకు పార్వతి
పట్టుబట్టి పెళ్ళి ప్రస్తావన తెచ్చింది.
‘‘అమ్మా! తమ్ముడు దేవసేనాధిపతి పద విలో ఉన్నాడు. అతను ఇద్దర్ని
పెళ్ళాడినా తగును. నేను ఊరికే తింటూ కూర్చున్నాను.
ఎలాపెళ్ళిచేసుకునేది?''అన్నాడు విఘ్నరాజు. శివుడు, ‘‘నువ్వు నా
ప్రమథగణాలన్నిటికీ గణనాథుడివిగా ఉండు!'' అన్నాడు. ‘‘నాన్నగారూ! ఉండమంటే
సరా? అర్హత ఉండాలి గదా! తమ్ముడు ఎలాగూ సేనాధి పత్యంలో ఆరితేరి ఉన్నవాడు,
ఉండనే ఉన్నాడు గదా!'' అన్నాడు విఘ్నేశ్వరుడు. ప్రమథులు కుమారస్వామినే అభిమా
నించారు.
శివుడు, ‘‘లేదు, నా గణాలకు గణనాథు డుగా విఘ్నేశ్వరుడే ఉండాలి! కుమార
స్వామికి దేవసేనాధిపత్యం ఉండనే ఉంది. అదీగాక, రెండు పనులు చూసుకోవడం
శ్రమకూడా!'' అన్నాడు. విఘ్నేశ్వరుడు, కొంతసేపు ఆలోచించి, ‘‘నాన్నగారూ,
ఏదేనా పరీక్షపెట్టి నెగ్గినవారికే గణనా
ుకత్వం ఇవ్వడం సమంజసంగా ఉంటుంది
గదా!'' అన్నాడు.
దేవతలు, ప్రమథులు కలిసి ఒక పందెం పెట్టారు. ఈ భూమ్మీదున్న అన్ని
క్షేత్రాల్ని, తీర్థాల్ని ఎవరు ముందు సేవించి తిరిగి వస్తారో వారు
గెల్చినట్టు అని. కుమారస్వామి నెమలి మీద ఎగిరి వెళ్ళాడు. వినా
ుకుడు లోలోపల
సంతోషిస్తూ చక్కా చతికిలబడి కూర్చున్నాడు. అప్పుడు విష్ణువు అతణ్ణి
ఏకాంతానికి తీసుకెళ్ళి, ‘‘నా
ునా! మేము నిన్ను అభిమా నిస్తున్న వాళ్ళం. నీ
ఓటమి మా దేవతలందరి ఓటమీ అవుతుంది.
మాకు తలవంపులు తేవ డంనీకు భావ్యం కాదు. అదీగాక తండ్రి గొప్ప దనం
తన
ుుడు నిరూపించితేనే జన్మసార్థ్ధ కత అవుతుంది. నువ్వేమీ తిరగనక్కరలేదు.
నేను చెప్పినట్టు చేస్తే చాలు!'' అని విఘ్నేశ్వ రుడి చెవిలో రహస్యం
ఉపదేశించాడు. పార్వతి ‘హమ్మ
్యు' అనుకుంటూ విష్ణువును కృతజ్ఞతగా చూసింది.
విఘ్నేశ్వరుడు మఠం వేసి కన్నులు మూసి శివపంచాక్షరీ మంత్రాన్ని భక్తితో
జపిస్తూ కూర్చున్నాడు. కుమారస్వామి వెళ్ళినచోటల్లా అంత కంటే ముందే
విఘ్నేశ్వరుడు ఎలుక మీద వచ్చి తీర్థమాడి సేవించి వెళ్ళినట్లు తెలుసు కుని
ఆశ్చర్యపడుతూ హతాశుడై తిరిగి వస్తూనే తాను ఓడిపోయినట్లూ, విఘ్నేశ్వరుడిదే
విజ
ుమనీ చెప్పాడు. విఘ్నేశ్వరుడు తమ్ముడితో చేతులు కలిపి శివుడి వద్దకు
తీసుకెళ్ళి, ‘‘తమ్ముడూ! నేను జయించనూ లేదు. నీవు ఓడనూ లేదు.
మనం ఇద్దరం నిమిత్తమాత్రులం. జయిం చింది నాన్నగారే! శివపంచాక్షరీ మహిమ
అలాంటిది. గెలిచినది శివనామం, గెలిపిం చింది విష్ణువు!'' అని జరిగింది
చెప్పాడు. విఘ్నేశ్వరుడూ, కుమారస్వామీ చెరో పాదమూ పట్టుకొని తండ్రికి
భక్తితో మ్రొక్కారు. కుమారస్వామి అందరి మధ్య నిలబడి, ‘‘విఘ్నేశ్వరుడికి
ప్రమథగణాధిపత్య పట్టాభి షేకం సత్వరమే జరగాలి.
శివుడి ఆజ్ఞ అందరికీ శిరోధార్యము!'' అని నొక్కి చెప్పాడు. దేవతలు
సంతోషించారు. సిద్ధ, సాధ్య,
ుక్ష, భూతగణాలవారంతా హర్షం ప్రకటించారు.
ప్రమథగణ ప్రముఖులైన భృంగీశ్వర, శృంగీ శ్వర, చండీశ్వర, నందీశ్వరులు మాత్రం
వ్యతి రేకించారు. లోగడ పుత్రగణపతి రూపంతో వాళ్ళను విఘ్నేశ్వరుడు శృంగభంగం
చేశాడు.
ఆ అక్కసుతో వారు, ‘‘కుమారస్వామికి తన బలాలు అంటూ దేవగణసేనలు ఉన్నాయి.
మేము శివుడి నమ్మిన బంట్లుగా శివగణంగా మొదటనుంచీ పరిగణింపబడుతున్నాం. అటు
వంటప్పుడు విఘ్నేశ్వరుడు మాకు అధిపతి ఎలాగ అవుతాడు? గణపతి అనిపించుకో
డానికి కూడా అతనికి తనది అంటూ ఎలాంటి బలగమూ లేదు. గణాధిపత్య పట్టాభిషేకం
దేనికి?'' అని కుళ్ళు వెళ్ళబోసుకున్నారు. శివుడు కళ్ళెరజ్రేశాడు. ‘‘నా
నిర్ణ
ూన్నే అధిక్షేపించగలంత గొప్పవారైపో
ూరా మీరు!'' అని ప్రమథనా
ుకుల్ని
ఈసడించుకున్నాడు.
విఘ్నేశ్వరుడు శాంతంగా, ‘‘ ఔను, ఔను, నిజమే నా గణాలు ఎక్కడ? లేవు
కాబోలు! అన్నట్టు పుత్రగణపతిగా ఉన్నప్పుడు నాకూ కొంత బలగం ఉన్నట్లు
అనుమానం, ఆ గణాలు ఎక్కడ? ఎక్కడ? '' అని అరిచాడు. అప్పుడు కొటానుకోట్ల
విఘ్నేశ్వరుడి లాంటి వారు దిక్కులు ఈనినట్లు పుట్టుకొచ్చి దిక్కులు
పిక్కటిల్లేలాగ జ
ుజ
ుధ్వానాలు చేస్తూ విఘ్నేశ్వరుడి బలాలుగా వచ్చి
నిల్చున్నారు.
వారందరికీ తలా నాలుగు చేతులున్నాయి. నాలుగు చేతుల్లో అనేక ఆ
ుుధాలు,
పరి కరాలు,చిత్రవిచిత్ర వస్తుజాలమూ ఉన్నాయి. కొందరి చేతుల్లో గంటాలు,
లేఖినులు, కుంచెలు, రంగులు ఉంటే మరికొందరి చేతుల్లో శూలాలు, విల్లమ్ములు,
కత్తులు, గదలు ఉన్నాయి.
కొందరు కొడవళ్ళు, సుత్తులు, కత్తులు, రంపాలు, ఉలులు, శేనాలు పట్టుకొని
ఉన్నారు. మరికొందరు వీణలు, మృదంగాలు, వేణువులు, డప్పులు వాయిస్తున్నారు.
మూలికలు, ఔషధాలు, పానీ
ూలు, నాగళ్ళు, రాట్నాలు, నవరత్నా భరణాలు, పూలమాలలు,
పండ్లూ, తినుబం డారాలు మొదలైనవెన్నో పట్టుకొని ఉన్నారు.
వారిమధ్య దేవుళ్ళూ దేవతలూ ప్రమథాది గణాలవాళ్ళు బి
్యుం రాశిలో రాళ్ళలా
అక్క డక్కడ కనిపించారు. విఘ్నేశ్వర రూపులు కొందరు ఆకాశంలో ఎగురుతూ
అంతరిక్షానికి దూసుకుపోతు న్నారు. ఆ గణాధిపగణాల చేతుల్లో ఛత్ర చామరాలు,
వీవనలు, వింజామరాలు ఆడు తున్నవి. ఆకాశంలో రెపరెపలాడుతున్న అరుణారుణ
పతాకాల్ని, ఇంకా అనేక రంగు రంగుల ధ్వజాల్ని పట్టుకొని ఉన్నారు.
వారు రత్నభూషితమైన పెద్ద భద్రసింహాసనాన్ని తెచ్చారు. విఘ్నేశ్వరుణ్ణి
దానిపై కూర్చుండ బెట్టి ఛత్రచామరాలు పట్టారు. శ్వేతఛత్రం ముత్యాల జాలరులతో
ప్రకాశించింది. చిటె్ట లుక సింహాసనం కింద ఆనందంతో చిందులు వేసింది. పార్వతి
మరొకసారి మళ్ళీ మైమరిచి భద్రసింహాసనాశీనుడైన విఘ్నేశ్వరుడికి
నమస్కరించబోయింది.
‘‘అమ్మా! అమ్మా! వద్దు, నీ ముద్దుల కుమా రుణ్ణి,'' అని విఘ్నేశ్వరుడు
వారిస్తూ చేతులూ పేసరికి అంతా అదృశ్యమై, విఘ్నేశ్వరుడు ఒక్కడూ విన
ుంగా
తల్లికి ప్రణమిల్లాడు. ‘‘విఘ్నేశ్వరా!''అన్న పిలుపు శంఖధ్వనిలా
వినిపించింది. ఆ పిలిచింది విష్ణువు. విఘ్నేశ్వ రుడు అటు చూడకుండానే,
‘‘నువ్వు చెప్ప బోేుది నాకు తెలుసు!'' అన్నాడు.
‘‘నీకు తెలిసినా, అది అందరికీ కూడా తెలి
ూలి కదా, అదే
చెబుతున్నాను!'' అంటూ విష్ణువు, ‘‘విఘ్నేశ్వరుడి పెళ్ళి వేయి విఘ్నాల
సామెతగా విఘ్నేశ్వరుడు కల్పించుకున్న విఘ్నాలు ఇప్పటికి వెయ్యీ పూర్త
్యూయి! ఇటుపైని విఘ్నం కల్పించుకోడానికి వీల్లేదు, కల్పించుకొన్నా
చెల్లదు!'' అని గట్టిగా పలికాడు.
No comments:
Post a Comment