Friday, September 7, 2012

రామాయణం - సుందరకాండ 7


లంక అంతా పరశురామ ప్రీతి చేసిన హనుమంతుడు అశోకవనంలో ఉన్న సీత వద్దకు తిరిగి వచ్చి, ఆమెకు నమస్కారం చేసి, ‘‘నా అదృష్టం చేత నీకేమీ అపాయం కలగలేదు. రాముడు త్వరలోనే వానరులనూ, భల్లూకాలనూ వెంటబెట్టుకుని వస్తాడు. నాకు సెలవిప్పించు,’’ అన్నాడు. అతను ఆమె వద్ద సెలవు పుచ్చుకుని అరిష్టమనే పర్వతం పైకి ఎక్కి సముద్రం పైకి చూసి తన శరీరాన్ని పెంచాడు.

అతను ఒక్కసారి బలంగా తొక్కగానే ఆ పర్వతంలోని శిలలు పిండి అయ్యూయి; అందులో ఉండే మృగాలన్నీ భయపడి చెల్లాచెదరుగా పరిగెత్తాయి. హనుమంతుడు అవతలి ఒడ్డుకు ప్రయాణమైన వాడై ఆకాశంలోకి లేచాడు. అతను మేఘాల మధ్య సముద్రంలో వెళ్ళే ఓడలాగా గాలిలో తేలిపోతూ, సముద్రాన్ని లంఘించాడు. త్వరలోనే అతనికి దూరాన మహేంద్ర పర్వతం కనబడింది.

దాన్ని చూస్తూనే అతను ఉత్సాహంతో సింహనాదం చేశాడు.హనుమంతుడెప్పుడు వస్తాడా అని ఆత్రంగా ఎదురు చూస్తున్న అంగదుడు మొదలుగాగల వానరులకు ఆ సింహనాదం విని  పరమానందమయింది. అందరికీ పెద్ద వాడయిన జాంబవంతుడు వానరులందరినీ చేరదీసి, ‘‘మన హనుమంతుడు పని చక్కచెట్టుకుని మరీ వస్తున్నాడు. అతని కంఠధ్వని వింటే అలాగే తోస్తున్నది,’’ అన్నాడు. వానరులు ఆనందంతో కుప్పిగంతులు వేశారు. కొందరు హనుమంతుణ్ణి చూడటా నికి చెట్లెక్కి, అతన్ని పిలుస్తున్నట్టుగా కొమ్మ లాడించారు.


లంక అంతా పరశురామ ప్రీతి చేసిన హనుమంతుడు అశోకవనంలో ఉన్న సీత వద్దకు తిరిగి వచ్చి, ఆమెకు నమస్కారం చేసి, ‘‘నా అదృష్టం చేత నీకేమీ అపాయం కలగలేదు. రాముడు త్వరలోనే వానరులనూ, భల్లూకాలనూ వెంటబెట్టుకుని వస్తాడు. నాకు సెలవిప్పించు,’’ అన్నాడు. అతను ఆమె వద్ద సెలవు పుచ్చుకుని అరిష్టమనే పర్వతం పైకి ఎక్కి సముద్రం పైకి చూసి తన శరీరాన్ని పెంచాడు.

అతను ఒక్కసారి బలంగా తొక్కగానే ఆ పర్వతంలోని శిలలు పిండి అయ్యూయి; అందులో ఉండే మృగాలన్నీ భయపడి చెల్లాచెదరుగా పరిగెత్తాయి. హనుమంతుడు అవతలి ఒడ్డుకు ప్రయాణమైన వాడై ఆకాశంలోకి లేచాడు. అతను మేఘాల మధ్య సముద్రంలో వెళ్ళే ఓడలాగా గాలిలో తేలిపోతూ, సముద్రాన్ని లంఘించాడు. త్వరలోనే అతనికి దూరాన మహేంద్ర పర్వతం కనబడింది.

దాన్ని చూస్తూనే అతను ఉత్సాహంతో సింహనాదం చేశాడు.హనుమంతుడెప్పుడు వస్తాడా అని ఆత్రంగా ఎదురు చూస్తున్న అంగదుడు మొదలుగాగల వానరులకు ఆ సింహనాదం విని  పరమానందమయింది. అందరికీ పెద్ద వాడయిన జాంబవంతుడు వానరులందరినీ చేరదీసి, ‘‘మన హనుమంతుడు పని చక్కచెట్టుకుని మరీ వస్తున్నాడు. అతని కంఠధ్వని వింటే అలాగే తోస్తున్నది,’’ అన్నాడు. వానరులు ఆనందంతో కుప్పిగంతులు వేశారు. కొందరు హనుమంతుణ్ణి చూడటా నికి చెట్లెక్కి, అతన్ని పిలుస్తున్నట్టుగా కొమ్మ లాడించారు.


 చివరికతడు ఇలా అన్నాడు:  ‘‘సీత మహా పతివ్రత అనటానికి సందేహం లేదు. ఆమె రాముడి కొరకే జీవిస్తూ చాలా కష్టాలకు గురి అవుతున్నది. నేనొక్కణ్ణే లంకను బూడిద చేసి వచ్చినప్పుడు, మన మందరమూ కలిసి రావణుడి బలాలన్నిటినీ హతమార్చ లేక పోతామా? మనలో జాంబవంతుడూ, అంగదుడూ, పనసుడూ, నీలుడూ, అజేయులైన మైందద్వివిదులూ... ఇందరున్నారు.

మనం రావణుణ్ణి చంపి సీతను రాముడి వద్దకు చేర్చటం బాగుంటుందేమో!’’ అంగదుడు హనుమంతుడి మాటను బలపరుస్తూ, ‘‘మనం సీతను చూసి కూడా ఆమెను తీసుకుపోక పోవటం అనుచితం. రాముడి వద్దకు వెళ్ళి, ‘సీతను చూశాం, కాని తీసుకు రాలేదు,’ అనటం ఏమీ బాగుండదు. అసలు హనుంతుడు అక్కడి రాక్షస వీరులందరినీ చంపనే చంపాడు. సీతను తీసుకు రావటం తప్ప మనకు పెద్ద పని కూడా లేదు,’’ అన్నాడు.

ఈ మాట విని జాంబవంతుడు, ‘‘యువరాజా, నీది చాలా మంచి ఆలోచనే. దీన్ని గురించి రాముడేమంటాడో తెలుసుకుని ఆయన చెయ్యమన్నట్టు చేద్దాం,’’ అన్నాడు లౌక్యంగా. దీనికి అంగదుడే గాక మిగిలిన వానర వీరులు కూడా సమ్మతించారు. తలపెట్టిన పని సానుకూలం కావటమూ, రాముడికి చెప్పవలసిన సమాచారం ఉండటమూ, యుద్ధంచేసే అవకాశం ఉండటమూ మొదలైన అంశాలతో వానరులు ఉద్రేకోత్సాహాలు చెంది తిరుగుముఖం పట్టారు.

వారు గాలిలో ఎగురుతూ మధువనం చేరుకుని, అంగదుడి అనుమతితో అక్కడి చెట్ల మీద ఉన్న తుట్టెల నుంచి తేనె తాగారు, సంతోషం పట్టలేక రకరకాల ఆట లాడారు, కేకలు పెట్టారు, ఒకరి నొకరు తరుముకున్నారు, చెట్ల మీదుగా పరిగెత్తారు. మధువనానికి రక్షకుడు దధిముఖుడు, సుగ్రీవుడి మేనమామ. వానరులు వనంలోని తేనె అంతా తాగెయ్యటమే గాక, చెట్లన్నీ ధ్వంసం చేసి, పూలన్నీ రాల్చెయ్యటం చూసి మండిపడి అతను వానరులను వనం విడిచి పొమ్మని కేక లేశాడు. కొందరిని కొట్టాడు. కొందరితో మంచి మాటలాడాడు. కొందరిని బతిమాలుకున్నాడు. కాని అందరూ అతన్ని పట్టుకుని ఏడిపించుకు తిన్నారు కొందరతన్ని రక్కి, కొరికారు కూడా.


హనుమంతుడు వానరులకు ప్రోత్సాహమిస్తూ, ‘‘మీ ఇష్టం వచ్చినట్టు తేనె తాగండి. ఎవరడ్డొస్తారో నేను చూస్తాను,’’ అన్నాడు. అంగదుడు హనుమంతుణ్ణి బలపరుస్తూ, ‘‘హనుమంతుడు కూడని పని చెయ్యమన్నా నేను చేసేస్తాను. అలాటప్పుడు మంచి పని చెయ్యమంటుంటే మానటమెందుకూ!’’ అన్నాడు. వానరులు అంగదుడి మాటలకు హర్షధ్వానాలు చేశారు.

వారు తేనె తాగిన కైపులో చిత్తం వచ్చినట్టు చేశారు. మధువనంలోని కాపలా వాళ్ళందరినీ కట్టేశారు, పళ్ళన్నీ తినేశారు. కొందరు సింహనాదాలు చేశారు, కొందరు సన్నగా కూశారు, మరి కొందరు పడుకుని నిద్రపోయారు. మధువనమంతా నాశనమవుతూండటం చూసి దధిముఖుడు తన కాపలా వాళ్ళ నందరినీ కూడగట్టుకుని, చెట్లూ, రాళ్ళూ మొదలైన ఆయుధాలతో అంగదాది వానర వీరులపై తలపడ్డాడు. హనుమంతుడు మొదలుగా గల వారు అతని మీద కలియబడ్డారు. మత్తులో ఉన్న అంగదుడు, దధిముఖుడు తన తాత అన్న స్ఫురణ  కూడా లేకుండా, అతన్ని పడదోసి ఘోరంగా కుమ్మాడు. దధిముఖుడికి స్పృహ  తప్పింది.

కొంత సేపటికి అతను తెలివి తెచ్చుకుని, తన చేతిలో ఉన్న చెట్టుతో తప్పతాగి ఉన్న వానరులను తరిమాడు. తరవాత అతను తన వారితో, ‘‘వీళ్ళందరినీ ఇక్కడ పడి ఉండనివ్వండి. నేను వెళ్ళి సుగ్రీవుడితో జరిగినదంతా చెబుతాను. తరవాత సుగ్రీవుడే వాళ్ళ తలలు తీసేస్తాడు,’’ అని చెప్పి శీఘ్ర గమనాన సుగ్రీవుడి వద్దకు వెళ్ళాడు. సుగ్రీవుడు తన మేనమామను చూసి ఆశ్చర్యపడి, ‘‘ఏమిటి విశేషం?’’ అని అడిగాడు.

‘‘మీ నాన్నగారి కాలంలో గాని నీ కాలంలోగాని దేవతలకైనా ప్రవేశింపరాని మధువనాన్ని అంగదుడు మొదలైన వానరులు ధ్వంసం చేసి పెట్టారు. కావలివాళ్ళు పొమ్మంటే కొట్టారు, తల కిందులుగా వేళ్ళాడ గట్టారు. మధువనంలోని తేనె అంతా తాగేస్తున్నారు,’’ అని దధిముఖుడు సుగ్రీవుడితో చెప్పాడు. ఆ సమయంలో లక్ష్మణుడక్కడికి వచ్చి, దధిముఖుణ్ణి చూసి, ‘‘ఇతనేమిటో ఫిర్యాదు చేస్తున్నాడు?’’ అన్నాడు.


‘‘సీతను వెతకటానికి దక్షిణంగా వెళ్ళిన నా వాళ్ళు మధువనానికి వస్తూనే వనమంతా అల్లకల్లోలం చేసి తేనెలు తాగేస్తున్నారట. పని సానుకూలం చేసుకురాకపోతే వారట్లా ప్రవర్తించరు. వారు సీతను చూసే వచ్చారు. అందుకు సమర్థుడైన హనుమంతుడు వాళ్ళ వెంట ఉండనే ఉన్నాడు. పని ముగించుకు వచ్చిన పొగరులోనే వాళ్ళు కాపలా వాళ్ళను కూడా కొట్టారు,’’ అన్నాడు సుగ్రీవుడు.

సుగ్రీవుడు చేసిన ఊహ రామలక్ష్మణులకు పరమానందం కలిగించింది. సుగ్రీవుడు దధిముఖుడితో, ‘‘వానరులు మధువనంలోని తేనె తాగినందుకు చాలా సంతోషించానని చెప్పు. వాళ్ళ కోసం నేనూ, రామలక్ష్మణులూ వేచి ఉన్నాం. వారిని త్వరగా రమ్మను,’’ అన్నాడు. దధిముఖుడు వారు ముగ్గురికీ ప్రణామం చేసి, శీఘ్ర గమనాన ఆకాశమార్గాన మధువనానికి తిరిగివచ్చే సరికి వానరులకు కైపు దిగిపోయింది.

ఆతను అంగదుడితో, ‘‘యువరాజా, మేము నిన్నడ్డగించామని కోపించకు. తెలియక పొరపాటు జరిగిపోయింది. నేను వెళ్ళి మీరు వచ్చినట్టు మీ పినతండ్రికి చెప్పగా, ఆయన సంతోషించి మిమ్మల్నందరినీ త్వరగా రమ్మన్నాడు,’’ అన్నాడు. అంగదుడు తన వారితో, ‘‘మనం ఇక్కడ విశ్రాంతి తీసుకున్నాం గనక, ఇక బయలుదేరుదాం. మనం వస్తున్న సంగతి రామలక్ష్మణులకు అప్పుడే తెలిసిపోయింది,’’ అన్నాడు. అంగదుడూ, అతని వెనుకగా మిగిలిన వారూ ఆకాశంలోకి లేచారు. వారు కిష్కింధను చేరవస్తూ చేసిన సింహనాదాలు సుగ్రీవుడికి వినిపించాయి.


అతను ఆనందంతో తోక చాచి ఆడించాడు. ఇంతలో వానరులు హనుమంతుణ్ణీ, అంగదుణ్ణీ ముందుంచుకుని, రాముడున్న చోటికి వచ్చి వాలారు. ‘‘వానరులారా, సీత ఎక్కడ ఉన్నది? నన్ను గురించి ఏ భావంతో ఉన్నది? అన్ని విషయాలూ నాకు వివరంగా చెప్పండి,’’ అని రాముడు వానరుల నడిగాడు.

వానరులు హనుమంతుణ్ణి ముందుకు తోశారు.  హనుమంతుడు రాముడికి జరిగినదంతా చెప్పి, సీత ఇచ్చిన చూడామణిని రాముడి చేతిలో పెట్టి, ‘‘రామా, చిత్రకూటం మీద మీరుండేటప్పుడు కాకి ఉదంతం ఒకటి నీకు గుర్తుగా ఉండగలందులకు సీత చెప్పింది. తనకింకొక్క మాసమే గడువున్నదని నీతో చెప్పమన్నది. ఆమె చాలా అధైర్యం చెంది ఉన్నది. సముద్రం దాటి లంకకు వెళ్ళే ఉపాయం ఆలోచించండి,’’ అన్నాడు.

సీత పంపిన చూడామణిని చూడగానే రామలక్ష్మణులకు దుఃఖం ఆగలేదు. రాముడు శోకవివశుడై, ‘‘సీత కనిపించకుండా ఈ చూడామణి కనిపించటం కన్న వేరే దుఃఖమేముంటుంది? సీత ఇంక ఒక్క నెలపాటే జీవించి ఉంటుందా? ఆమె ఉన్న చోటు తెలిసి అక్కడికి వెళ్ళకుండా, ఇక్కడ ఒక్క నిమిషమైనా ఎలా ఉండటం? ఆ భయంకర రాక్షస స్త్రీల మధ్య సీత ఇంత కాలం ఎలా ఉన్నది?’’ అని ఆక్రోశించాడు. అతను సీత అన్న మాటలన్నీ హనుమంతుడి చేత చెప్పించుకుని విన్నాడు. హనుమంతుడు అంతా చెప్పి, ‘‘ఆమె నిన్ను సేనతో వచ్చి రావణుణ్ణి చంపి తనను కాపాడమన్నది.

అందుకు తగిన ప్రోత్సాహం నన్నే ఇవ్వమన్నది. వానర సేనలు సముద్రం దాటి లంకకు రాలేవేమోనని ఆమె సంశయించింది. తనకు విమోచనం ఉండేదేమోనని భయపడుతున్న సీతను నేను అనేక రకాల ఓదార్చాను. నన్ను మించిన వారు సుగ్రీవుడి వద్ద వేలాది వానరులున్నారని చెప్పాను. రావణుడు మొదలైన వారు నాశనమైపోతారనీ, ఆమె తన భర్తతో అయోధ్యకు తిరిగి వెళుతుందనీ ధైర్యం చెప్పాను,’’ అన్నాడు.

                                        [సుందరకాండ సమాప్తం.]






No comments:

Post a Comment