Thursday, September 6, 2012

విఘ్నేశ్వరుడు - 22


అవ్వ ఒక రోజున ఫలవృక్షాలతో నిండి వున్న మార్గం గుండా వెళ్తూండగా ఒక అందమైన బాలకుడు చెట్టుమీద కూర్చుని పాడుకుంటున్నాడు. చెట్టు నిండా పళ్ళు విరగపండి వున్నవి. ఆ కురవ్రాణ్ణి పలకరించి మాట్లాడాలని అవ్వకు బుద్ధిపుట్టింది. ‘‘నా…ునా! ఒక పండు ఇలా పడె…్యువూ!
 
నోరూరుతున్నది,'' అని అన్నది. బాలుడు నవ్వుతూ, ‘‘అవ్వా! ఏ పండు కావాలి? చెట్టు నిండా రకరకాల పళ్ళున్నవి. ముసలితనాన్ని పోగొటే్ట పండు ఇమ్మంటావా? మృత్యువును దూరంచేసే పండా? ధనరాసుల్నిచ్చే పండా? ఎలాంటి పండు కావాలి?'' అన్నాడు.
 
అవ్వకు ఆ బాలుడు సుబ్రహ్మణ్యేశ్వరుడే అని తెలిసిపోయింది. ఆమె చేతులెత్తి మ్రొక్కుతూ, ‘‘సుబ్రహ్మణ్యస్వామీ! ఎంత పంచినా తరగని అపార జ్ఞాన సంపదనిచ్చే పండు ఇవ్వు, తండ్రీ! జ్ఞానఫలాన్ని అనుగ్రహించు!'' అంటూ సాగిలపడింది. సుబ్రహ్మణ్యస్వామి నిజరూపంతో దండాన్ని ధరించి నెమలిపై సాక్షాత్కరించాడు. అవ్వ శిరస్సు బళ్ళెపు మొనతో సుతారంగా తాకి అనుగ్రహించాడు.
 
అవ్వకు ఒక్కసారిగా విశ్వస్వరూపమైన ఓంకారతత్వము, బ్రహ్మజ్ఞానము, జీవన్ముక్తిమార్గము తెలిసి అపారమైన జ్ఞానం కలిగింది. సుబ్రహ్మణ్యేశ్వరుడు అవ్వను ఆశీర్వదించి ఆ క్షణమే అంతర్థానమ…్యూడు. అవ్వ కాలినడకను ఊరూరా, వాడవాడా జ్ఞానాన్ని, భƒక్తిని, ఉత్తమ జీవన ధర్మాలను సామాన్యులకు తెలిసే మాటలలో ప్రబోధిస్తూ దేశ సంచారం చేసింది.

అవ్వ నోటి నుంచి వచ్చిన మధుర వాక్కులు, కవితలాగ గీతాలై ప్రజాసామాన్యంలో వ్యాప్తిపొంది చిరస్థాయిగా నిలిచాయి. అవ్వ అలా వెళ్తూ చీకటి పడ్డ వేళకు ఒక అరణ్య మార్గానికి వచ్చింది. ఆకాశంలో మేఘాలు దట్టంగా క్రమ్ముకొచ్చాయి. చిట్ట చీకటిగా ఉంది. ఉండి ఉండి మెరుస్తున్నది. తుప్పర పడుతున్నది. అవ్వ కాలికి రాయి తగిలి పడిపోయింది. చేతనున్న ఊతకర్ర దూరంగా పడింది.
 
ఆ చీకటిలో ఎవరో వస్తున్న పాదధ్వని మధురంగా వినిపించింది. అవ్వ తల ఎత్తి చూసింది. అప్పుడే మెరిసింది. మెరుపు వెలుగులో ముద్దుగా, బొద్దుగా దోరపు బొజ్జతో ఒక బాలుడు కనిపించాడు. ఆ బాలుడు అవ్వను లేవనెత్తి కర్ర తెచ్చి అందించాడు. అవ్వ పట్టిన కరన్రు బాలుడు కదలకుండా పట్టుకుని, ‘‘అవ్వా! ఎక్కడికి వెళ్తున్నావు? ఏ క్షేత్రం చూడాలని వెళ్తున్నావు? ఏ తీర్థం సేవిస్తావు?'' అని అడిగాడు. ‘‘నా…ునా! నాకు ఈ పుడమి అంతా ఒకే ఒక దివ్యక్షేత్రం.
 
ప్రత్యేకంగా క్షేత్రాలు, తీర్థాలు సేవించాలని నాకు లేదుగాని నేను చేరవలసిన క్షేత్రాన్ని ఎలాగ చేరాలో దారి కనిపించడంలేదు. ఇంతకూ నువ్వెవరో ఏమిటో! పసివాడివి ఈ చీకటిలో వస్తున్నావెందుకు?'' అని అవ్వ అన్నది. ‘‘అవ్వా! నేను నీ ఆబాల్య సన్నిహితుణ్ణి. పుట్టినప్పటి నుంచీ నన్నెరిగున్నదానివే, చీకటిలో గుర్తించలేకపోతున్నావు! ఇంతకూ నువ్వు చేరాలనుకుంటున్న ఆ క్షేత్రం ఏమిటో చెప్పావు కాదు!'' అన్నాడు ఆ బాలుడు.
 
‘‘చెప్పి ఏం లాభం! తీసుకెళ్తావా? అది శివసన్నిధానం అనే మహాక్షేత్రం!'' అన్నది అవ్వ. ‘‘ఓష్‌! ఈ మాత్రం దానికేనా, అదెంత పని నాకు! నీ చెయ్యి పట్టుకుని తీసుకెళ్తాను పద!'' అంటూ బాలుడు అవ్వ చేతిని పట్టుకుని అడుగు వేశాడు. రెండో చేత ఊతకరత్రో అవ్వ అడుగు ముందుకు వే…ుబోతుండగా పెద్ద మెరుపు మెరిసింది.
 
ఆ కాంతిలో తన చేతిని తొండంతో పట్టుకుని నడిపించే విఘ్నేశ్వరుణ్ణి చూసి అవ్వ కన్నులు మూసి, ‘‘దేవా! చిన్ననాటి నుంచీ నువ్వే నడిపిస్తున్నావు, నేను కన్నులు మూసుకున్నా తెరిచినా ఒకటే!'' అని అనుకుంటూ కళ్ళు తెరవకుండానే విఘ్నేశ్వరుడు ఎక్కిస్తూ తీసుకెళ్తుంటే ఎన్నో ఎన్నో మెట్లు ఎక్కుతూ, అలా ఎంత కాలం గడిచిందో తెలీకుండా వెళ్ళింది.

అలా వెళ్ళగా వెళ్ళగా, ‘‘అవ్వా! శివసాన్నిధ్యాన్ని సమీపించాము!'' అని అన్న విఘ్నేశ్వ రుడి మాటకు అవ్వ కన్నులుతెరిచి చూసింది. అక్కడ వెలుగు తప్ప మరేమీ కనిపించలేదు. కిందికి చూస్తే అనేక నక్షత్ర మండల సముదా…ూలు సోపాన పంక్తుల్లాగ కనిపించాయి. ఎన్నెన్నో సూర్యకుటుంబాలు, తోకచుక్కలు, వా…ుురూపంలో తిరుగుతూ పెరుగుతూన్న జ్యోతులు, వెలుగు చక్రాల్లాగ గిర్రున తిరుగుతున్న తేజో మండలాలతో నిండిన అనంత విశ్వం పాదాల దిగువ కన్నుల పండువుగా వున్నది.
 
విఘ్నేశ్వరుడు అవ్వచేతినివదిలి, ‘‘అవ్వా! శివసన్నిధానాన్ని చేరుకున్నావు. ఇక్కడ కాలం అనేది లేదు. నాశము అనేది లేదు. ఇదే సృష్టి స్థితి ల…ూలకు అతీతమైన శివుని సన్నిధానం, అసలు కైలాసం! విశ్వనాథుడు విశ్వేశ్వరుడైన శివుణ్ణి దర్శించు!'' అని చెప్పి అంతర్థానమ…్యూడు. అవ్వకు లింగాకారంగా మీదకూ కిందకూ ఒకేలాగ వ్యాపించి వున్న గొప్ప జ్యోతి కనిపిం చింది. ఆ జ్యోతిలో ప్రమథ గణాలు చేస్తున్న స్తోత్రం ఓంకార ధ్వనిగా వినిపిస్తున్నది. విశ్వేశ్వరుడైన శివ
 
 
ుడు కనిపించాడు. అతని కిరుపక్కలా, విఘ్నేశ్వరుడు, పార్వతి, కుమార స్వామి, నంది మొదలైన వారంతా ఉన్నారు. అవ్వకు శివ సాక్షాత్కారమైంది. శివుడు ప్రీతితో తన అభ…ు హస్తాన్ని అవ్వ తలపై వుంచి అనుగ్రహించాడు. ఆ విధంగా అవ్వ శివసా…ుుజ్యాన్ని పొందింది. మంటప చిత్రాల్లో, చెరుకుగడ పట్టివున్న విఘ్నేశ్వరుడిని ఒక రైతు కుతూహలంగా చూస్తూండడం గమనించి పావనమిశ్రుడు కథ ఆరంభించాడు: రాజంతటి భూస్వామి ఒకడు ఏటేటా వినా…ుక పూజలు, ఉత్సవాలు ఘనంగా జరిపిస్తూ, గణేశ భక్త శిరోమణి అనిపించుకున్నాడు.
 
అతనికి అనేక పంట పొలాలతో పాటు పెద్ద చెరుకు తోట ఉంది. ఆ చెరుకుతోట పని అంతా చూసుకుంటూ ప్రతి ఏటా పుష్కలంగా చెరుకు పండించి భూస్వామికి మంచి రాబడి చేకూర్చే పాలేరు, మనస్సులో విఘ్నేశ్వరుణ్ణి నమ్మిన భక్తుడు. ‘‘ఈసారి మరింత బాగా పండించు గణేశా!'' అని మనస్సులో మొక్కుతూ చెరుకు నాటి ఏడాదికేడాది తన …ుజమానికి మరింత లాభం చూపించేవాడు. పాలేరూ అతని భార్యా, పదేళ్ళ కొడుకూ ముగ్గురూ చెమటోడ్చి పని చేసేవారు. భూస్వామి మాత్రం చాలా తగ్గించి కూలి ఇచ్చేవాడు, అదీ సరిగా ఇచ్చేవాడు కాదు.

పాలేరు అమా…ుకుడు, అల్పసంతోషి. ఏమీ అనేవాడు కాడు. భూస్వామి భార్య ఉత్తమురాలు. మంచి అయినా చెడ్డ అయినా మనస్సులో గణేశుడికే నివేదించుకునేది. పాలేరుకి కూలి ఇవ్వడంలో భర్త మరీ అన్యా…ుం చేస్తూంటే, ‘‘పాపం, వాళ్ళు పడే కష్టానికి మీరిచ్చేది ఏ మాత్రం? సరిగా ఇవ్వండి!'' అనేది. ‘‘బాగానే ఉంది నీ బోడి సలహా! ఇలా మిగుల్చుకుంటూ వస్తేనే గదా మనం గణేశ ఉత్సవాలు జరిపించేది!'' అనేవాడు భూస్వామి. ఆమె ‘‘కష్టపడేవాళ్ళ నోట మట్టిగొట్టి పూజలూ, ఉత్సవాలూ జరపకపోతేనేం? గణేశా, ఈ…ునకు మంచి బుద్ధి కలిగించు!'' అని అనుకునేది.
 
ఆ ఏడాది చెరుకు ఏనుగు తొండాల్లాగ మరింత విశేషంగా పండింది. వెేు్యసి చెరు కులు కట్టిన మోపులు బళ్ళతో భూస్వామి దివాణం చేరుతున్నాయి. ‘‘అంతా గణేశ్వరుడి ద…ు. ఊరికే పోతా…ూ, పూజలూ, ఉత్సవాలూ. మరి దేనికి చేయిస్తున్నాం!'' అన్నాడు భూస్వామి. ‘‘అంతేగాని మన పాలేరు శ్రమ ఏమీ లేదంటారు, అంతేనా?'' అని భార్య అన్నది. ‘‘బాగానే ఉంది నీ వల్లమాలిన జాలి! అలా పాలేర్లనూ, జీతగాళ్ళనూ వెనకేసుకొస్తే మనం కూడా వాళ్ళ వెనక్కే వెళ్ళవలసి ఉంటుంది.
 
ఈ మనుషుల్లో ఏముంది, అంతా ఆ వినా…ుక దేవుడి మహిమ!'' అన్నాడు భర్త. ‘‘ఓ విఘ్నేశ్వరా! ఈ…ునకు జ్ఞానోద…ుం కలిగించవలసింది నీవే!'' అని ఆమె మనసులో ప్రార్థించింది. పాలేరు కొడుక్కి విఘ్నేశ్వరుడంటే ప్రాణం. వినా…ుక చవితికి తెల్ల కలువలూ, ఎర్ర తామరలూ, పూలూ, పత్రీ ప్రతి ఇంటికీ పూజకు తెచ్చి ఇచ్చేవాడు. వినా…ుక చవితి వచ్చింది. కురవ్రాడి ప్రా…ుంతో పాటు బుద్ధి కూడా ఎదుగుతున్నదేమో, వాడు చెరుకు మోపుల్ని భూస్వామి దివాణానికి చేరవేయిస్తున్న తండ్రి దగ్గర కెళ్ళి, ‘‘నాన్నా, మనం కూడా వినా…ుకుడికి పెట్టుకుందాం, ఒక చెరుకుగడ తీసుకెళ్తా!'' అన్నాడు.
 
పాలేరు ఒక చెరుకు తీసి కొడుక్కిచ్చాడు. వాడు దాన్ని ఇంటికి తీసుకెళ్తున్నాడు. అది భూస్వామి కంటబడింది. భూస్వామి ఉగ్రనరసింహావతారుడై, ‘‘ఏమిరా, నా చెరుకంతా నీ ఇంటికి చేరవేయిస్తున్నావా?'' అంటూ పాలేరుపై విరుచుకుపడి నానా మాటలూ అంటూ, కొరడాతో కొడుతూంటే, భూస్వామి వెంట నున్న పరివారమూ, గ్రామస్థులూ చూస్తూ ఊరుకున్నారేగాని కిక్కురుమనలేదు.


భూస్వామి పలుకుబడి అలాంటిది! అతడేం చేసినా చెల్లుతుంది. ఎదురు తిరిగి అడిగేవాడు లేడు. పాలేరు తాళుకోలేక, ‘‘చవితి కదా వినా …ుకుడికి పెట్టుకుందామని పట్టుకెళ్ళమని ఇచ్చాను, ఒక్కటంటే ఒక్క చెరుకు!'' అన్నాడు. భూస్వామి, ‘‘ఏమిటీ! మీ జాతి తక్కువ వాళ్ళకి పూజలూ, వినా…ుకుడూనా?'' అన్నాడు. పాలేరు, ‘‘కడజాతి అయితే అయిందిగాని, దేవుడూ భక్తీ ఉండవా?'' అన్నాడు.
 
భూస్వామి హేళనగా, ‘‘నీ ముఖానికి భక్తి కూడానా! నక్కకూ, నాగలోకానికీ ఉన్నంత దూరం! చెరుగ్గెడ పట్రా!'' అన్నాడు. పాలేరు, ‘‘ఒక్క చెరుకు కోసం అలా రాపాడిపోతారేమ…్యూ? బళ్ళతో చెరుకు దింపుకున్నది చాలదా, ఒక్క చెరుకుతో ఏం బావుకుంటావ…్యూ?'' అన్నాడు. భూస్వామి, ‘‘ఎంత మాట కూశావురా! ఒకటి కాదు పది కాదు వెయ్యి చెరుకులైనా నాకు పూచికతో సమానం తెలుసా! తెల్లవారే సరికి నువ్వు వెయ్యి చెరుకులు తినాలి! నమిలిన పిప్పి అంతా పోగు కనిపించాలి! 

లేకుంటే చెరుకొక్కింటికి వెయ్యి కొరడా దెబ్బలు తింటావు తెలిసిందా!'' అంటూ పాలేరును పెడరెక్కలు విరిచి కట్టించి, భృత్యులచేత వాణ్ణి బందీలాగ చెరుకు నిలవ చేసే సాలలో త్రోయించి వెయ్యి చెరుకుల మోపు వాడి ముందు పడవేయిం చాడు. భూస్వామి గొప్ప తిక్కమనిషి. ఎంత తోస్తే అంత. పాలేరును ఉంచిన సాల చుట్టూరా భటుల్ని కాపలా పెట్టాడు. భూస్వామి భార్య, ‘‘విఘ్నేశా! పాలేరు ఉత్త అమా…ుకుడు.
 
చెరుకు తినడానికి పూనుకుంటే పాపం నిష్కారణంగా చస్తాడు. తినకపోతే నా భƒర్త దెబ్బలు కొడతాడు. వాణ్ణి ఎలాగ కాపాడతావో మరి!'' అని మనసులో అనుకుంది. పాలేరుకి ఏమీ తోచలేదు. చేసేది లేక విఘ్నేశ్వరుణ్ణి తలచుకుంటూ, చీకటి పడే వేళకు అలాగే నిద్రలో పడిపో…ూడు. తెల్లవారుతూనే భూస్వామి వెళ్ళిచూస్తే, తెల్లగా హిమాల…ు పర్వతం లాగ చెరుకు పిప్పిపోగు కనిపించింది. భూస్వామి దె…్యుం పట్టినవాడిలాగ పెద్ద కేక పెట్టి తెరిచిన నోరు తెరిచినటే్ట ఉండిపో…ూడు.
 
ఆ కేక విని వచ్చిన భార్యతో భూస్వామి, ‘‘అంతా సర్వనాశనం! సాలలో ఒక్క చెరుకు మిగలకుండా అంతా పిప్పి పిప్పి! పాలేరు కాడు, భూతం! వాడు మనల్ని తినేస్తాడు పద!'' అంటూ అరుస్తూంటే, ఆమె నవ్వి, ‘‘వాడు భూతమూ కాదు, తిననూ లేదు! నేను కళ్ళారా చూశాను. అప్పటికింకా తెల్లారలేదు. ఏనుగు ఘీంకారం విని, కిటికీ లోంచి చూశాను. పెద్ద ఏనుగు చెరుకు మేస్తూ కనిపించి మా…ుమైంది!'' అన్నది.
 
‘‘ఏనుగేమిటి, నీ మొహం! ఈ చుట్టుపక్కల ఏనుగన్నది ఉన్నట్టు వినలేదు,'' అని భూస్వామి అంటూండగా, కొంత మంది వినా…ుక ఉత్సవశాల నుంచి పరుగున వచ్చి, ‘‘రాత్రి నుంచీ పందిట్లో పూజలో పెట్టిన వినా…ుక విగ్రహం కనిపించటంలేదు. అంతటా వెతికాము,'' అని చెప్తూనే సాలలోకి చూస్తూ, ‘‘అదుగో, విగ్రహం, అదుగో!'' అంటూ అటుకేసి వెళ్ళారు.

No comments:

Post a Comment