Saturday, August 31, 2013

శ్రీ వేంకటేశ్వరుని సింగారము

ప|| శ్రీ వేంకటేశ్వరుని సింగారము వర్ణించితే | యే విధాన దలచిన యిన్నటికి దగును ||
చ|| కరిరాజు గాచిన చక్రము పట్టిన హస్తము | కరి తుండమని చెప్పగా నమరును |
వరములిచ్చేయట్టి వరద హస్తము కల్ప- | తరు శాఖయని పొలుప దగు నీకును ||
చ|| జలధి బుట్టిన పాంచజన్య హస్తము నీకు | జలధి తరగయని చాటవచ్చును |
బలు కాళింగుని తోక పట్టిన కటి హస్తము | పొలుపై ఫణీంద్రుడని పొగడగ దగును ||
చ|| నలిన హస్తంబుల నడుమనున్న నీయుర- | మలమేలు మంగ కిరవన దగును |
బలు శ్రీ వేంకట గిరిపై నెలకొన్న నిన్ను | నలరి శ్రీ వేంకటేశుడన దగును ||

తాత్పర్యము

శ్రీ వేంకటేశ్వర స్వామి వారి సింగార వైభవము ఎన్నెన్నో ఉపమానాలకు తగినదై యున్నది.
గజేంద్రుని కాపాడటానికి ప్రయోగించిన చక్రమును పట్టిన చేయి, సముద్రములో పుట్టిన పాంచజన్యము అనే శంఖమును పట్టిన చేయి, బలమాదాంధుడైన

కాళింగుని తోకబట్టి మదమణచిన చేయి అందరికీ వరాలిచ్చే వరద హస్తము సాక్షాత్తు కల్పవృక్షము కొమ్మగా చెప్పవచ్చును. అతని దివ్య కరకమలాల

నడుమనున్న విశాలమైన వక్షము, నిత్య అనపాయినియైన అలవేలు మంగమ్మకు నెలవై అలరారుచున్నది.
ఇన్ని వైభవాలతో వేంకటగిరిని వెలసిన ఆ సింగార మూర్తిని "శ్రీ వేంకటేశ్వరుడు" అని సంభావించతగును.

శ్రీ రాజరాజేశ్వరీ అష్టకము

అంబా శాంభవి చంద్రమౌళి రబలా వర్ణా ఉమాపార్వతి
కాళి హైమవతీ శివా త్రినయనీ కాత్యాయనీ భైరవీ
సావిత్రీ నవయవనా శుభకరీ సామ్రాజ్యలక్ష్మీ ప్రదా
చిద్రూపి పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ

అంబా మోహిని దేవతా త్రిభువనీ ఆనంద సంధాయనీ
వాణి పల్లవపాణీ వేణు మురళీగాన ప్రియలోలినీ
కల్యాణీ ఉడు రాజబింబవదనా ధూమ్రాక్ష సంహారిణి
చిద్రూపి పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ

అంబానూపుర రత్నకంకణధరీ కేయూర హేరావళి
జాతీ చంపక వైజయంతి లహరీ గ్రైవేయ వైరాకితా
వీణా వేణు నినోద మండితకరా వీరాసనే సంస్థితా
చిద్రూపి పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ

అంబా రౌద్రాణి భద్రకాళి భగళా జ్వాలాముఖీ వైష్ణవీ
బ్రహ్మనీ త్రిపురాంతకీ సురనుతా దేదీప్యమానోజ్వలా
చాముండాశ్రిత రక్షపోష జననీ దాక్షాయణీ వల్లవీ
చిద్రూపి పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ

అంబా శూలధనుః కుశాంకుశధరీ అర్ధేందుబింబాధరీ
వారాహీ మధుకటభప్రశమనీ వాణీ రమాసేవితా
మల్లాద్యాసుర మూకదైత్యదమనీ మాహేశ్వరీ అంబికా
చిద్రూపి పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ

అంబా సృష్టి వినాశ పాలనకరీ ఆర్యా విసంశోభితా
గాయత్రీ ప్రణవాక్ష రామృతసరః పూర్ణానుసంధీకృతా
ఓంకారీ వినుతా సురార్చిత పదా ఉద్దండ దైత్యాపహా
చిద్రూపి పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ

అంబా శాశ్వత ఆగమాది వినుతా ఆర్యా మహాదేవతా
యా బ్రహ్మాది పిపీలికాంత జననీ య వై జగన్మోహినీ
యా పంచ ప్రణవాది రేఫ జననీ యా చిత్కళామాలినీ
చిద్రూపి పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ

అంబా పాలిత భక్త రాజి రనిశం అంబాష్టకం యః పఠే
అంబాలోకకటాక్ష వీక్ష లలితా ఐశ్వర్య మవ్యాహతా
అంబా పావన మంత్రరాజ పఠనా ద్దంతీశ మోక్ష ప్రదా
చిద్రూపి పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ

కాకులు పితృదేవతలు

కాకులను పితృదేవతలుగా భావించి అన్నం పెట్టే పద్ధతిని ఇప్పటికీ పాటిస్తూనే వున్నాం. జ్యోతిష్యాన్ని బట్టి నవగ్రహాలకు వాహనాలున్నాయి. దీనిప్రకారం శని భగవానునికి కాకి వాహనంగా పరిగణిస్తారు.

సాధారణంగా ఏదైనా నోములు, వ్రతాలు ఆచరిస్తే.. నైవేద్యానికి తయారు చేసిన ఆహారంలో కాస్త దానం చేయడం ద్వారానో, కాకులకు పెట్టడం ద్వారా ఆ వ్రతం పరిపూర్ణమైందని భావించాలి. వ్రతాలు చేస్తున్నప్పుడు ఆకలి ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ దానం చేయడం, నోరులేని జీవాలకు పెట్టడం చేయాలి.

కాకి అనేది శనిభగవానుని అనుగ్రహం పొందింది. అందుచేత కాకి అన్నం పెడితే అది శనిభగవానునికే దానం చేసినట్లవుతుందని విశ్వాసం. ఇతర పక్షుల కంటే పిలిచిన వెంటనే వచ్చే కాకికి అన్నం పెట్టడం ఇప్పటికీ మరిచిపోలేదు.

ఇంకా పితృదేవతలు కాకుల రూపంలో మనతో ఉంటారని, అందుకే వారు మరణించిన తిథులు, అమావాస్య రోజుల్లో అన్నం పెట్టడం ఆనవాయితీగా వస్తుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..!

పద్మావతీ వివాహానంతరం, స్వామివారు శేషాద్రికొండపై తొండమానుడు నిర్మించిన మందిరంలో కొలువున్నాడు. ఆనాటి నుండి బ్రహ్మదేవుడు ఉత్సవాలను ప్రారంభించాడు. శ్రీనివాసుని ఉత్సవాలకై బ్రహ్మదేవుడు ఉత్సవ శ్రీనివాసుడు, ఉగ్రశ్రీనివాసుడు, సర్వాధిక శ్రీనివాసుడు, శ్రీలేఖక శ్రీనివాసుడు అంటూ నాలుగు మూర్తులను వేద సంప్రదాయం ప్రకారం నిర్మించాడు. ఆ మూర్తులు ఇప్పటికీ సంప్రదాయబద్ధంగా పూజలందుకుంటున్నాయి. ఇలా బ్రహ్మ ద్వారా ప్రారంభింపబడిన బ్రహ్మోత్సవాలలో శ్రీనివాసుని వైభవం శోభాయమానమై లోక కళ్యాణకారకమవుతోంది. నాడు బ్రహ్మాది దేవతలచే పూజింపబడిన వేంకటేశ్వర స్వామి, సప్తర్షులు, జగద్గురు ఆదిశంకరాచార్య, శ్రీరామానుజాచార్య, శ్రీ కులశేఖరాళ్వారులు, శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యులు, శ్రీకృష్ణ దేవరాయలు వంటివారి సేవలందుకున్నాడు. శ్రీ తిరుమల తిరుపతి మహాక్షేత్రంలో భక్తజన సంరక్షణార్థం శ్రీమన్నారాయణుడు అర్చావతారుడై వెలసి ఉన్నాడు.

వేంకటాద్రి సమమ్ స్థానమ్ బ్రహ్మాండే నాస్తి |
వెంకటేశ సమో దేవో న భూతో నభవిష్యతి || అని కంఠోక్తిగా చెప్పబడింది.

అనగా వేంకటాచలానికి తుల్యమైన దివ్యక్షేత్రం, ఈ బ్రహ్మండమంతటిలోనూ మరొకటి లేదు. అంటే బ్రహ్మాండం అంతటిలోనూ మహోత్తమమైన దివ్యక్షేత్రం శ్రీ వేంకటాచల క్షేత్రం తిరుమల. శ్రీ వేంకటేశ్వరునితో సరితూగగల మరొక దైవం ఎవ్వరూ ఇంతకు పూర్వం లేరు. ఇకముందు భవిష్యత్తులో ఉండబోరు. భూత, భవిష్యత్, వర్తమానాలలో సరిసాటిలేని పరమదైవం శ్రీ వేంకటేశ్వరుడు. అలాంటి శేషాద్రివాసునికి జరిగే బ్రహ్మోత్సవాలకు ఆ పేరు ఎందుకు ఏర్పడిందనే విషయం తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే.

పరమదైవమైన శ్రీ వేంకటేశ్వరునికి చతుర్ముఖ బ్రహ్మ జరిపించిన ఉత్సవాలే బ్రహ్మోత్సవాలు. శ్రీనివాసుని ప్రీత్యర్థంగా, ఆయన కుమారుడైన బ్రహ్మదేవుడు ప్రారంభించిన ఉత్సవాలు కావడం వల్ల, వీటికి బ్రహ్మోత్సవాలనే పేరు వచ్చింది. నవ (తొమ్మిది) సంఖ్యకు- బ్రహ్మాభిదాఖ్య సంఖ్య అని ప్రసిద్ధి. ముందురోజున జరిగే అంకురారోపణం, ధ్వజారోహణం, చివరోజున జరిగే శ్రీ పుష్పయాగం- ఇవి మినహాయించగా మధ్యలో తొమ్మిది రోజులుగా జరిగే ఉత్సవాలు కనుక ఈ ఉత్సవాలకు బ్రహ్మోత్సవాలని నామాంకితం చేయబడిందని, ఆగమ శాస్త్ర ప్రమాణ వాక్యం.

ఈ బ్రహ్మోత్సవాలను శ్రీ వేంకటాచలేశ్వరుని అనుగ్రహం కోరి జరిపించడం వల్ల విధాతకు సకల మనోరథప్రాప్తి కలిగిందని కాబట్టి ఇవి బ్రహ్మత్సవాలుగా ప్రసిద్ధి చెందాయని పురాణాలు చెబుతున్నాయి. శ్రీ వేంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం, సూర్యుడు కన్యారాశిలో ఉన్న సమయంలో జరుగుతాయి. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమితో ప్రారంభమవుతాయి. ఆ ప్రారంభ దినానికి ముందు రోజున మృత్తికా గ్రహణం, అంకురారోపణం, ధ్వజారోహణం జరుపబడతాయి. అదే రోజున ప్రప్రథమంగా శ్రీ వేంకటేశ్వరుని సేనానాయకుడైన శ్రీ విష్వక్సేన భగవానుని యథావిధిగా పూజిస్తారు. విష్వక్సేనుల వారిని చతుర్వీథుల ఉత్సవం పేరిట ఊరేగించి, తీసుకుని వస్తారు. విష్వక్సేనుడు దేవాలయానికి తిరిగివచ్చిన తర్వాత యాగశాలలో, మృత్తికా గ్రహణం అంకురారోపణం చేస్తారు.

అలాగే ధ్వజరోహణం ఎలా చేస్తారంటే.. ఒక దృఢమైన నూతన వస్త్రంపైన శ్రీ వేంకటేశ్వరుని వాహనమైన గరుత్మంతుని చిత్రాన్ని లిఖిస్తారు. ఆ చిత్రించిన నూతన వస్త్రాన్ని శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవాలయ ధ్వజస్తంభ శిఖరాగ్రంపైన ఎగురవేస్తారు అర్చకులు. దీనినే ధ్వజారోహణం అంటారు. గరుత్మంతుడు తన ప్రభువైన శ్రీ వేంకటేశ్వరునికి జరగబోతున్న బ్రహ్మోత్సవాలకు ఊర్ధ్వలోకాలోని సకల దేవతా గణాలను విచ్చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నట్లుగా, ఆ సమయంలో వేదపండితులు మంత్రపఠనం చేస్తారు. ఆ విధంగా శ్రీ వేంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతాయి.

సృష్టికర్త అయిన బ్రహ్మ తొమ్మిది రూపాలు !

ప్రళయం సంభవించి భూలోకమంతా జలమయమయినప్పుడు, బ్రహ్మదేవుడు ఉద్భవించి, ఆ తరువాత ఎన్నో లోకాలను, దేవగణాలను, వివిధరకాల జలసమూహాలను, స్థలచరాలను సృష్టించాడు. అందుకే బ్రహ్మని జగత్స్రష్ట అంటారు. విశ్వకర్మన్, బ్రహ్మణస్పతి, హిరణ్యగర్భ అనే పేర్లతోనూ మొదటగా ఉద్భవించినవాడు కాబట్టి పరబ్రహ్మ, పరమాత్మగానూ చెప్తారు. సమస్తమయిన మంగళప్రద కార్యాలలో బ్రహ్మను స్మరించటం, పూజించటం ఉండేది. సర్వతోభద్ర, లింగతోభద్ర, వాస్తుమండల మొదలైన వాటిలో వారికి ప్రాధాన్యం ఇచ్చేవారు.

బ్రహ్మ, నారాయణ, పురుషుడు, మహానుభావుడు అనే పేర్లతో శాస్త్రాలలో కనిపిస్తాడు. దేవదానవ, యక్ష, కిన్నెర, రాక్షసులందరికీ బ్రహ్మదేవుడు తాతగారే. సృష్టి రచానాకారుడు అవ్వడంచేత ఇతడు ధర్మపక్షపాతి. దేవదానవ మానవులు ఎవరైనా సరే సమస్యలలో చిక్కుకుంటే ముందు బ్రహ్మ దగ్గరకే వెళతారు.

సృష్టి ఆరంభములో హిరణ్యగర్భం నుంచి స్వయంభువుగా బ్రహ్మ ఉద్భవించాడని చెబుతారు. విష్ణువు నాభి నుండి వెలువడిన కమలమే బ్రహ్మ ఆసనం. ఆ కమలంలోని బొడ్డుని సుమేరు పర్వత స్వరూపంగా భావిస్తారు. వేదాలు, పురాణాలు, స్మృతులు అన్నీ బ్రహ్మని సృష్టికర్తగా చెప్తారు.

బ్రహ్మదేవుడు తొమ్మిది రూపాలలో భక్తులను అనుగ్రహిస్తాడు.

బ్రహ్మ తొమ్మిది రూపాలు:-
1. కుమారబ్రహ్మ
2. అర్కబ్రహ్మ
3. వీరబ్రహ్మ
4. బాలబ్రహ్మ
5. స్వర్గబ్రహ్మ
6. గరుడబ్రహ్మ
7. విశ్వబ్రహ్మ
8. పద్మబ్రహ్మ
9. తారకబ్రహ్మ

ఇలా తొమ్మిది రూపాలతో తొమ్మిది శివలింగాలను ప్రతిష్ఠించి బ్రహ్మదేవుడు పూజించిన పుణ్యప్రదేశమే మనరాష్ట్రంలోని అలంపూర్ క్షేత్రం. ఇటువంటి అరుదైన క్షేత్రం మనదేశంలో ఇదే.

శ్రీ వెంకటేశ మంగళాశాసనం

శ్రియః కాంతాయ కల్యాణనిధయే నిధయే‌உర్థినామ్ |
శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళమ్ || 1 ||
లక్ష్మీ సవిభ్రమాలోక సుభ్రూ విభ్రమ చక్షుషే |
చక్షుషే సర్వలోకానాం వేంకటేశాయ మంగళమ్ || 2 ||
శ్రీవేంకటాద్రి శృంగాగ్ర మంగళాభరణాంఘ్రయే |
మంగళానాం నివాసాయ శ్రీనివాసాయ మంగళమ్ || 3 ||
సర్వావయ సౌందర్య సంపదా సర్వచేతసామ్ |
సదా సమ్మోహనాయాస్తు వేంకటేశాయ మంగళమ్ || 4 ||
నిత్యాయ నిరవద్యాయ సత్యానంద చిదాత్మనే |
సర్వాంతరాత్మనే శీమద్-వేంకటేశాయ మంగళమ్ || 5 ||
స్వత స్సర్వవిదే సర్వ శక్తయే సర్వశేషిణే |
సులభాయ సుశీలాయ వేంకటేశాయ మంగళమ్ || 6 ||
పరస్మై బ్రహ్మణే పూర్ణకామాయ పరమాత్మనే |
ప్రయుంజే పరతత్త్వాయ వేంకటేశాయ మంగళమ్ || 7 ||
ఆకాలతత్త్వ మశ్రాంత మాత్మనా మనుపశ్యతామ్ |
అతృప్త్యమృత రూపాయ వేంకటేశాయ మంగళమ్ || 8 ||
ప్రాయః స్వచరణౌ పుంసాం శరణ్యత్వేన పాణినా |
కృపయా‌உ‌உదిశతే శ్రీమద్-వేంకటేశాయ మంగళమ్ || 9 ||
దయా‌உమృత తరంగిణ్యా స్తరంగైరివ శీతలైః |
అపాంగై స్సించతే విశ్వం వేంకటేశాయ మంగళమ్ || 10 ||
స్రగ్-భూషాంబర హేతీనాం సుషమా‌உ‌உవహమూర్తయే |
సర్వార్తి శమనాయాస్తు వేంకటేశాయ మంగళమ్ || 11 ||
శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీతటే |
రమయా రమమాణాయ వేంకటేశాయ మంగళమ్ || 12 ||
శ్రీమత్-సుందరజా మాతృముని మానసవాసినే |
సర్వలోక నివాసాయ శ్రీనివాసాయ మంగళమ్ || 13 ||
మంగళా శాసనపరైర్-మదాచార్య పురోగమైః |
సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళమ్ || 14 ||

శ్రీ పద్మావతీ సమేత శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే నమః

Friday, August 30, 2013

సాయినాథుని దినచర్య


ప్రత్యక్షదైవంగా హిందువుల పూజలందుకుంటున్న షిర్డీ సాయిబాబా జీవనశైలి యోగులందరికి ఆదర్శప్రాయంగా ఉండేది. ఆ జీవనశైలి సామాన్య మానవులకు ఆచరణ సాధ్యం కానిది. ఆయన దినచర్య ఎలా ఉండేదంటే...

బాబా ప్రతిరోజూ తెల్లవారుఝామున నాలుగు గంటలకే నిద్రలేచేవారు. బాబా ఒకరోజు ద్వారకామాయిలోనూ, మరొకరోజు చావడిలోనూ నిద్రించేవారు. చావడిలో పడుకున్న మరుసటి రోజు ఉదయం సాయినాథుని భక్తులు మేల్కొలిపి ద్వారకామాయికి తీసుకువచ్చేవారు. ద్వారకామాయిలో కొద్దిసేపు కూర్చుని ధునివైపు చూస్తూ గడిపేవారు. అనంతరం ముఖం కడుక్కునేందుకు లేచేవారు. అప్పటికే గంగాళం నిండా భక్తులు నీళ్ళు సిద్ధం చేసేవారు. ఈ సమయంలో బాబా చాలా కోపంగా కనిపించేవారు. అందువల్ల ఆయన వద్దకు వెళ్ళేందుకు భక్తులు సాహసించేవారు కాదు.

ముఖం కడుక్కున్న తర్వాత కుడిచేతి మణికట్టుకు రోజూ నేతిలో ముంచిన గుడ్డతో కట్టు కట్టుకునేవారు. భక్తులే ఈ కట్టు కట్టేవారు. కట్టు కట్టిన తర్వాత కట్టు కట్టిన వారికి బాబా ఒక రూపాయి ఇస్తుండేవారు. చేతి మీద ఎటువంటి గాయం కనిపించకపోయినా బాబా కట్టుకట్టించుకునే వారు. ఇలా ఎందుకు చేసేవారో తెలియదు.

ప్రతిరోజూ ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో బాబా బిక్షకు వెళ్లేవారు. కేవలం ఐదు ఇళ్లలో మాత్రమే బిక్షాటన చేసేవారు. భిక్షాటన ద్వారా వచ్చిన పదార్థాలతో కొన్ని ధునిలో వేసి, కొంత భాగాన్ని పేదవారికి పంచిపెట్టి, మరికొంత భాగం పశుపక్షాదులకు కేటాయించి, మిగిలిన అతి కొద్ది భాగాన్ని తను తినేవారు బాబా. ఆ తర్వాత లెండీకి బయలుదేరేవారు.

సాయినాథునికి ఎండ తగలకుండా కొందరు భక్తులు ఆయనకు గొడుగు పట్టేవారు. లెండీకి వచ్చిపోయే సమయంలో మాత్రమే బాబా పాదరక్షలు ధరించేవారు. లెండీకి చేరుకోగానే భక్తులు బయటే నిలబడేవారు. బాబా లోనికి వెళ్ళి ఒకటి రెండు గంటలు లెండీలో యోగ సాధన చేస్తూ గడిపేవారు. తిరిగి 11గంటల ప్రాంతంలో ద్వారకామాయి చేరుకునేవారు.

ద్వారకమయికి సాయి చేరుకోగానే మండపంలో గాయకుల గానం మొదలయ్యేది. ఆ సమయంలోనే భక్తులు నైవేద్యాలు తెచ్చిపెట్టేవారు. ఆ నైవేద్యాలను భక్తులకే పంచిపెట్టేవారు బాబా. మధ్యాహ్నం 12 గంటల సమయంలో హారతి జరిగేది. హారతి సమయంలో బాబాకు భక్తులు వెండి సింహాసనం తెచ్చేవారు. అయితే బాబా మాత్రం ఎప్పుడూ దానిలో కూర్చునేవారు కాదు.

హారతి ముగిసిన తర్వాత గురుస్థానం వద్ద ప్రసాదం పంచిపెట్టేవారు. సమాధి మందిరంలో ఈనాటికీ హారతి ముగియగానే బాబాను దర్శించుకుని వచ్చిన భక్తులకు బయట ప్రసాదాలు పంచుతూ ఉంటారు. ఈ ప్రసాదం ఉదయం నుండీ బాబాకు భక్తులు సమర్పించిన నైవేద్యం నుండి సేకరించినవి.

సమాధి మందిరం వద్ద బాబా విగ్రహం వద్ద రెండు స్టీలు డ్రమ్ములు ఉంటాయి. బాబా దర్శనానికి వెళ్ళే భక్తులు ఆ డ్రమ్ములలోనే బాబాకు తాము నైవేద్యంగా సమర్పించుకోవాలనుకున్న లడ్డూలు, పాలకోవాలు మొదలైన ప్రసాదాలను ఉంచుతారు. వాటినే భక్తులకు తిరిగి పంచిపెడతారు.

సాయినాథుని హారతి అనంతరం ప్రసాదం స్వీకరించిన భక్తులు ఇళ్లకు వెళ్ళిపోయేవారు. సాయంత్రం తిరిగి లెండీ వద్ద కొంతసేపు గడిపి, తిరిగి చావడిలోనో, ద్వారకామాయిలోనే నిద్రకు ఉపక్రమించేవారు బాబా.

శ్రీ గాయత్రీదేవి దివ్యశక్తి


ఓం శ్రీ గణేశాయనమః 
ఓం శ్రీ గాయత్రీ దేవ్యై నమః
ఓం గాయత్రీ మహామంత్రము
ఓం భూర్భువ స్వః
త త్సవితు ర్వరేణ్యమ్
భర్గో దేవస్య ధీమహి
ధియో యో నః ప్రచోదయాత్ !!

సర్వవిజ్ఞాన, శబ్దశాస్త్రముల రహస్యమయాధారముపై గాయత్రీ మహా మంత్రాక్షరముల సంపుటి జరిగింది. ఈ మహామంత్రోచ్ఛారణ మాత్రముచే సూక్ష్మ దేహము నందున్న శక్తికేంద్రములు అనేకములైనవి. స్వయముగా మేలుకొనుచుండును. సూక్ష్మ దేహములోని అంగప్రత్యంగములలో అనేక చక్రోపచక్రాలూ, గ్రంధులూ, మాతృకలూ - ఉపత్యక, మేరుభ్రమరాదిగాగల రహస్య సంస్థానములున్నవి. వీటి వికాసమాత్రముచే సాధారణుడు సైతము అగణిత శక్తులకు అధినేత కాగలుగును. గాయత్రీ పవిత్ర మంత్రోచ్ఛారణా క్రమమును అనుసరించు కంఠము, జిహ్వ, దంతములు, తాలువులు, ఓష్ఠములు, మూర్థము మొదలైన వాటి నుండి గుప్తస్పందనము విశేషముగా జరుగుచుండును. ఏతత్ స్పందనము అనేక శక్తి కేంద్రములను స్మృశించి, వాటి నిద్రావస్థను రూపుమాపి చైతన్యమును కలుగజేయుచుండును. యోగీశ్వరులు, మునీశ్వరులు మొదలైన మహాత్ములు తపస్సు ద్వారా దీర్ఘకాలమున సాధించునట్టి మహా కార్యములను గాయత్రీ మహా మంత్రోపాసకులైన వారు అనతికాల వ్యవధిలోనే సాధించగలుగుచున్నారు.

భగవత్యాధకుల మధ్యగల విశేష దూరమును దూరమొనర్చుటకు చతుర్వింశత్యక్షరయుక్త మగు ఈ గాయత్రీ మహామంత్రమే మహత్తరమైన దివ్యాధారమైయున్నది. భూతములపై నున్నవారు మెట్ల సహకారముతో మహోన్నత సౌధము నధిరోహించ గలుగునట్లు గాయత్రీ మహా మంత్రోపాసకుడు 24 బీజాక్షరముల సహకారముతో భూమికలను క్రమక్రమముగా దాటుచూ గాయత్రీ మహామాతృ చరణారవింద సన్నిధిని చేరుకొనగలుగును. మహోత్తమమై పరమ పవిత్రమైన గాయత్రీ మహామంత్రములోని ప్రత్యేక బీజాక్షరము ఒక్కొక్క మంత్రసమమై మహత్తర శక్తి సంపన్నమైయున్నది. ఇందు ధర్మశాస్త్రము తేజరిల్లు చున్నది. ఇయ్యక్షరముల వ్యాఖ్యాన మూర్తి అయిన బ్రహ్మదేవుడు వేదచతుష్టయ ప్రచారార్థము మహత్తర తపస్సు చేసెను. ఆ బీజాక్షరముల మహత్తరార్థములను వ్యక్తము చేయవలెనని మహర్షులు ధర్మశాస్త్ర గ్రంథములును ప్రాదుర్భవింప జేసినారు. విశ్వవ్యాప్తమై యున్న విజ్ఞాన సర్వస్వము ఈ 24 బీజాక్షరములలో నిక్షిప్తమై యున్నది.

వరకక్ష్మి వ్రతము

గణపతిపూజ
ఓం శ్రిగురుభ్యోన్నమః, మహాగాణాదిపతయే నమః, మహా సరస్వతాయే నమః. హరిహిఓమ్,
దేవీంవాచ మజనయంత దే వాస్తాం విశ్వరూపాః పశవోవదంతి! సానోమంద్రేష మూర్జం దుహానా దేనుర్వాగస్మా నుపసుష్టుతైతు| అయంముహూర్త సుముహూర్తోఅస్తూ|| యశ్శివో నామ రూపాభ్యాం యాదేవి సర్వమంగళా ! తయోసంస్మరనాత్పుమ్సాం సర్వతో జయమంగళం||
 శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం| ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే||
తదేవలగ్నం సుదినంతదేవా తారాబలం చంద్రబాలన్తదేవ! విద్యాబలం దైవబలన్తదేవ లక్ష్మిపతే తేంఘ్రియుగంస్మరామి|| యత్రయోగీశావర కృష్ణో యత్రపార్దో ధనుద్దరః| తత్ర శ్రీ విజయోర్భూతి ద్రువానీతిర్మతిర్మమ|| స్మృతే సకలకల్యాణి భాజనం యత్రజాయతే| పురుషస్తమజంనిత్యం వ్రాజామిస్హరణం హరిం|| సర్వదా సర్వ కార్యేషు నాస్తితెశామ మంగళం| యేషాంహ్రుదిస్తో భగవాన్ మంగళాయతనం హరిం| లాభాస్తేశాం జయస్తేషాం కుతత్తేషాం పరాభవః|| యేశామింది వరష్యామో హృదయస్తో జనార్దనః| ఆపదామప హర్తారం దాతారం సర్వసంపదాం| లోకాభిరామం శ్రీ రామం భూయోభూయోనమామ్యాహం|| సర్వమంగళ మాంగల్యే శివేసర్వార్ధసాదికే| శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే||
శ్రీ లక్ష్మి నారాయనాభ్యాం నమః| ఉమా మహేశ్వరాభ్యాం నమః| వాణీ హిరణ్య గర్భాభ్యాం నమః| శాచీపురంధరాభ్యాం నమః| అరుంధతి వశిష్టాభ్యాం నమః| శ్రీ సీతారామాభ్యాం నమః| సర్వేభ్యోమహాజనేభ్యో నమః|
ఆచ్యమ్య:
ఓం కేశవాయ స్వాహాః, నారాయణాయ స్వాహాః, మాధవాయ స్వాహాః గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, హృషీకేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్దాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, , నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీ కృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః
ప్రాణాయామము:
ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఓంభూః ఓం భువః ఓగుం సువః, ఓం మహః ఓంజనః ఓంతపః ఓగుం సత్యం ఓంతత్స వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్.
ఓమాపోజ్యో తీరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం. మమోపాత్త దురితక్షయద్వారా శ్రీపరమేశ్వర వుద్దిస్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీమహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య ఆద్యబ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరత వర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన సంవత్సరము పేరు .......... సంవత్సరే, .......ఆయనే, ....... మాసే, .......పక్షే ,......తిది, ,,,,,,,,వాసరే శుభయోగే శుభకరణ ఏవంగుణ విశేషణ, విశిష్టాయాం, శుభతిథౌ శ్రీమాన్ ... గోత్రః ...నామధేయః (ధర్మ పత్నీ సమేతః) మమ ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిధ్యర్థం, పుత్రపౌత్రాభివృద్ధ్యర్థం, సర్వాభీష్ట సిద్ధ్యర్థం, మహా గణాధిపతి ప్రీత్యర్థం ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే, తదంగ కలశారాధనం కరిష్యే.
కలశారాధన: (కలశమునకు గంధము, కుంకుమబొట్లు పెట్టి,ఒక పుష్పం, కొద్దిగా అక్షతలువేసి, కుడిచేతితో కలశమును మూసి ఈ క్రింది మంత్రమును చెప్పవలెను).

శ్లో.. కలశస్యముఖేవిష్ణుః కంఠేరుద్ర సమాశిత్రాః మూలేతత్రస్థితో బ్రహ్మమధ్యే మాతృగణాస్మృతాః
కుక్షౌతు సాగరాసర్వే సప్తద్వీపోవసుంధరా ఋగ్వేదోథ యజుర్వేద స్సామవేదో హ్యదర్వణః
అంగైశ్చ సహితాసర్వే కలశౌంబుసమాశ్రితాః ఆయాంతు శ్రీవరలక్ష్మీ పూజార్ధం దురితక్షయ కారకాః
మం: ఆ కలశే షుధావతే పవిత్రే పరిశిచ్యతే ; ఉక్థైర్యజ్ఞేషు వర్ధతే, ఆపోవా ఇదగుం సర్వం
విశ్వా భూతాన్యాపః ప్రాణావాఆపః పశవ ఆపోన్నమాపోమ్రుతమాపః
సమ్రాడాపోవిరాడాప స్వరాదాపః చందాగుశ్యాపో జ్యోతీగుష్యాపో యజోగుష్యాప
సత్యమాపస్సర్వా దేవతాపో భూర్భువస్సువరాప ఓం.
శ్లో.. గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి; నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు ఏవం కలశపూజాః
కలశోదకాని పూజాద్రవ్యాణి సంప్రోక్ష, దేవంసంప్రోక్ష, ఆత్మానం సంప్రోక్ష (అని పఠించి ఆ నీటిని దేవునిపై, పూజాద్రవ్యములపై, తమపై అంతటాచల్లవలెను.)
మం: ఓం అసునీతేపునరస్మాసు చక్షు పునః ప్రాణామిహనో దేహిభోగం| జోక్పస్యేమ సూర్యముచ్చరంతా మృళయానా స్వస్తి|| అమ్రుతంవై ప్రాణా అమ్రుతమాపః ప్రానానేవయదా స్థాన ముపహ్వాయతే|| స్తిరోభవ| వరదోభవ| సుముఖోభవ| సుప్రసన్నోభవ| స్తిరాసనంకురు | స్తిరోభవ| వరదోభవ| సుముఖోభవ| సుప్రసన్నోభవ| స్తిరాసనంకురు |
మం: ఓం గణానాంత్వా గణపతిగుం హవామహే! కవింకవీనా ముపశ్రవస్తమం జ్యేష్టరాజం బ్రహ్మణాం బ్రహంణస్పత ఆనశ్రుణ్వన్నూతి భిస్సీద సాదనం|| శ్రీ మహా గణాధిపతయే నమః | ధ్యానం సమర్పయామి. ఆవాహయామి ఆసనం సమర్పయామి | పాదయో పాద్యం సమర్పయామి | హస్తయో అర్గ్యం సమర్పయామి | శుద్ధ ఆచమనీయం సమర్పయామి |
మం: ఆపోహిష్టామ యోభువహ తాన ఊర్జే దధాతన మహేరణాయ చక్షశే|
యోవశ్శివతమొరసః తస్యభాజయ తేహనః ఉషతీరివ మాతరః
తస్మా అరణ్గామామవః యస్యక్షయాయ జిన్వద ఆపోజనయదాచానః||
శ్రీ మహాగణాదిపతయే నమః | శుద్దోదక స్నానం సమరపయామి. స్నానానంతరం శుద్దాచమనీయం సమర్పయామి |
మం: అభివస్త్రాసువసన న్యరుశాభిదేను సుదుగాః పూయమానః| అభిచంద్రా భర్తవేనో హిరణ్యాభ్యశ్వా స్రదినోదేవసోమ||
శ్రీ మహా గణాదిపతయే నమః వస్త్రయుగ్మం సమర్పయామి |
మం: యజ్ఞోపవీతం పరమంపవిత్రం ప్రజాపతైర్ యత్సహజం పురస్తాత్|
ఆయుష్య మగ్ర్యం ప్రతిముంచ శుబ్రం యజ్ఞోపవీతం బలమస్తుతెజః||
శ్రీ మహా గణాదిపతయే నమః యజ్ఞోపవీతం సమర్పయామి |
మం: గంధద్వారాం దురాధర్శాం నిత్యపుష్టాంకరీషిణీం| ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపహ్వాయే శ్రియం||
శ్రీ మహా గణాదిపతయే నమః గందాన్దారయామి |
మం: ఆయనేతే పరాయణే దూర్వారోహంతు పుష్పిణీ హద్రాశ్చ పున్దరీకాణి సముద్రస్య గృహాఇమే ||
శ్రీ మహా గణాదిపతయే నమః గంధస్యోపరి అలంకారణార్ధం అక్షతాం సమర్పయామి |


అధఃపుష్పైపూజయామి.
ఓం సుముఖాయనమః ఓం ఏకదంతాయనమః ఓం కపిలాయనమః ఓం గజకర్నికాయనమః ఓం లంభోదరయానమః
ఓం వికటాయనమః ఓం విఘ్నరాజాయనమః ఓం గానాదిపాయనమః ఓం దూమ్రకేతవే నమః
ఓం గణాధ్యక్షాయ నమః ఓం ఫాలచంద్రాయనమః ఓం గజాననాయనమః ఓం వక్రతుండాయ నమః
ఓం శూర్పకర్ణాయ నమః ఓం హీరంభాయ నమః ఓం స్కందాగ్రజాయ నమః ఓం సర్వసిద్దిప్రదాయకాయ నమః
ఓం శ్రీ మహాగానాదిపతయే నమః నానావిధ పరిమళపత్ర పూజాం సమర్పయామి.
వనస్పతిర్భవైదూపై నానాగంధైసుసంయుతం | ఆఘ్రేయస్సర్వ దేవానాం దూపోయం ప్రతిగృహ్యాతాం || ఓం శ్రీ మహాగానాదిపతయే నమః దూపమాగ్రాపయామి.
సాజ్యంత్రివర్తి సంయుక్తం వన్హినాంయోజితం ప్రియం గ్రుహానమంగళం దీపం త్రిలోఖ్యతిమిరాపహం | భక్త్యాదీపం ప్రయశ్చామి దేవాయ పరమాత్మనే | త్రాహిమాం నరకాద్ఘోర దివ్యిజ్యోతిర్నమోస్తుతె || ఓం శ్రీ మహాగానాదిపతయే నమః దీపం దర్శయామి | దూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి ||
నైవేద్యం: ఓం భూర్భువస్సువః | ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి| ధియోయోనః ప్రచోదయాత్ || సత్యన్త్వర్తేన పరిశించామి| అమృతమస్తు|| అమృతోపస్త్హరణమసి ||
శ్లో: నైవేద్యం షడ్రసోపేతం ఫలలడ్డుక సంయుతం | భక్ష్య భోజ్య సమాయుక్తం ప్రీతిప్రతి గృహ్యాతాం || ఓం శ్రీ మహాగానాదిపతయే నమః మహా నైవేద్యం సమర్పయామి. ఓం ప్రానాయస్వాహా
మధ్యే మధ్యే పానీయం సమర్పయామి || అమ్రుతాపితానమసి || వుత్తరాపోషణం సమర్పయామి || హస్తౌ ప్రక్షాళయామి || పాదౌ ప్రక్షాళయామి || శుద్దాచమనీయం సమర్పయామి || ఫూగిఫలై సమాయుక్తం ర్నాగవల్లిదళైర్యుతం | ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యాతాం || ఓం శ్రీ మహాగానాదిపతయే నమః తాంబూలం సమర్పయామి | మం: హిరణ్యపాత్రం
ఓం శ్రీ మహాగానాదిపతయే నమః నీరాజనం సమర్పయాం ||
శ్లో: సుముఖశ్చైక దంతశ్చ కపిలో గజకర్ణికః | లంభోదరైశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః || దూమ్రాకేతుర్గనాధ్యక్షో ఫాలచంద్రోగాజాననః | వక్రతుండశూర్పకర్ణౌ హేరంభస్కందపూర్వజః || షోడశైతాని నామాని యఃపఠే చ్రునుయాదపి | విద్యారంభే వివాహేచ ప్రవేశే నిర్ఘమేతదా | సంగ్రామే సర్వ కార్యేషు విఘ్నస్థస్యనజాయతే | ఓం శ్రీ మహాగానాదిపతయే నమః సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి |
శ్లో: యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ, తానితాని ప్రనక్ష్యంతి ప్రదక్షిణం పదేపదే || పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః | త్రాహిమాం క్రుపయాదేవ శరణాగతవత్సల అన్యదా శరణంనాస్తి త్వమేవా శరణంమమ | తస్మాత్కారుణ్యభావేన రక్షరక్షో గణాధిపః || ఓం శ్రీ మహాగానాదిపతయే నమః ఆత్మప్రదక్షణనమస్కారం సమర్పయామి ||
యస్యస్మ్రుత్యాచ నామోక్య తవః పూజ క్రియాదిషు | న్యూనంసంపూర్ణ తామ్యాటి సద్యోవందే గణాధిపం || మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిపః | యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే || అన్యా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజానేనచ భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ మహాగానాధిపతి దేవతా సుప్రీతా సుప్రసన్న వరదా భవతు | ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్థితి భావంతో బృవంతు || శ్రీ మహా గణాధిపతి ప్రసాదం శిరసా గృహ్న్నామి ||
మం: యజ్ఞేన యగ్నమయదంతదేవా స్తానిధర్మాని ప్రధమాన్యాసన్ తేహనాకం మహిమానస్సచన్తే యత్రపూర్వే సాధ్యాస్సంతి దేవాః||
శ్రీ మహాగానాదిపతయే నమః యధాస్థానం ప్రవేశాయామి, శోభనార్దే పునరాగమనాయచ.

వరలక్ష్మి వ్రతము
ప్రాణ ప్రతిష్ట:
మం: ఓం అసునీతేపునరస్మాసు చక్షు పునః ప్రాణామిహనో దేహిభోగం| జోక్పస్యేమ సూర్యముచ్చరంతా మృళయానా స్వస్తి|| అమ్రుతంవై ప్రాణా అమ్రుతమాపః ప్రానానేవయదా స్థాన ముపహ్వాయతే|| స్తిరోభవ| వరదోభవ| సుముఖోభవ| సుప్రసన్నోభవ| స్తిరాసనంకురు |
హి స్వామినీ, సర్వ జగన్నాయకే యావత్పూజావసానకం తావత్వం ప్రీతిభావేన కలశేస్మిన్ చేత్రేస్మిన్ సంనిన్దిమ్కురు. ఆవాహితోభవ, స్తాపితోభవ, సుప్రసన్నోభవ, వరదోభవ స్తిరాసనం కురు, ( అని పుష్పాక్షితలు కలశముపై చిత్రపతముపై వేయవలెను)
అధధ్యానం:
పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే | నారాయణప్రియే దేవి సుప్రీతా భావ సర్వదా ||
క్షీరోదార్ణవ సంభూతే కమలే కమలాలయే | సుస్తిరా భావమే గేహే సురాసుర నమస్కృతే ||
శ్రీ వరలక్ష్మిదెవ్యై నమః ధ్యానం సమర్పయామి.
సర్వమంగళ మాంగళ్యే విష్ణు వక్షస్థలాలయే | ఆవాహయామి దేవి త్వాం సుప్రీతా భావ సర్వదా||
శ్రీ వరలక్ష్మిదెవ్యై నమః మావాహయామి.
సుర్యాయుత విభాస్పూర్తే స్ఫురద్రత్న విభూషితే| సింహాసనమిదం దేవీ గృహ్యాతాం సమర్పయామి||
శ్రీ వరలక్ష్మిదెవ్యై నమః రత్న సింహాసనం సమర్పయామి.
శుద్దోదకంచ పాత్రస్థం గంధపుష్పాది మిశ్రితం| అర్ఘ్యం దాస్యామితే దేవి గృహ్యాతాం హరివల్లభే||
శ్రీ వరలక్ష్మిదెవ్యై నమః అర్ఘ్యం సమర్పయామి.
సువాసిత జలం రమ్యం సర్వతీర్ధం సముద్భవం|పాద్యం గృహాన దేవి త్వం సర్వదేవ నమస్కృతే||
శ్రీ వరలక్ష్మిదెవ్యై నమః పాద్యం సమర్పయామి.
సువర్ణ కలశానీతం చందనాగరు సంయుతం| గృహాణాచమనం దేవి మయాదత్తం శుభాప్రదే||
శ్రీ వరలక్ష్మిదెవ్యై నమః ఆచమనీయం సమర్పయామి.
పయోధది ఘ్రుతోపెతం శర్కరా మధుసంయుతం|పంచామృత స్నానమిదం గృహాన కమలాలయే||
శ్రీ వరలక్ష్మిదెవ్యై నమః పంచామృత స్నానం సమర్పయామి.
గంగాజలం మయానీతం మహాదేవ శిరస్థితం| శుద్దోదక స్నాన మిదం గృహాన పరమేశ్వరి||
శ్రీ వరలక్ష్మిదెవ్యై నమః శుద్దోదక స్నానం సర్పయామి.
సురార్చితాంఘ్రి యుగళేదుకూల వసనప్రియే| వస్త్రయుగ్మం ప్రదాస్యామి గృహాణ సురపూజితే||
శ్రీ వరలక్ష్మిదెవ్యై నమః వస్త్రయుగ్మం సమర్పయామి.
కేయూర కంకణాదేవి హర నూపుర మేఖలా| విభూషణాన్య మూల్యాని గృహాణ ఋషిపూజితే||
శ్రీ వరలక్ష్మిదెవ్యై నమః ఆభరణాన్ సమర్పయామి.
తప్త హేమక్రుతం దేవి మాంగళ్యం మంగళప్రదం | మయాసమర్పితం దేవి గృహాణ త్వం శుభప్రదం||
శ్రీ వరలక్ష్మిదెవ్యై నమః మాంగళ్యం సమర్పయామి.
కర్పూరాగారు కస్తూరిరోచనాది సుసంయుతం| గంధం దాస్యామి తే దేవి స్వీకురుష్వ శుభప్రదే||
శ్రీ వరలక్ష్మిదెవ్యై నమః గంధం సమర్పయామి.
అక్షతాన్ దవళాన్ దివ్యాన్ శాలియాన్ తండులాన్ శుభాన్| హరిద్రా కుంకుమోపేతాన్ స్వీకురుష్వాబ్దిపుత్రికే||
శ్రీ వరలక్ష్మిదెవ్యై నమః అక్షతాన్ సమర్పయామి.
మల్లికా జాజి కుసుమై శ్చమ్పక ర్వకులైరపి| శాతపత్రైశ్చ కల్హారై పూజయామి హరిప్రియే||
శ్రీ వరలక్ష్మిదెవ్యై నమః పుష్పాణి సమర్పయామి.
అధాంగ పూజ :
చంచలాయై నమః - పాదౌ పూజయామి; చపలాయై నమః - జానునీ పూజయామి; పీతాంబరాయై నమః - ఊరూంపూజయామి
కమలవాసిన్యై నమః - కటిం పూజయామి ; పద్మాలయాయై నమః - నాభిం పూజయామి ; మదనమాత్రే నమః - స్థనౌ పూజయామి
కంభుకంట్యై నమః - కంటం పూజయామి ; సుముఖాయై నమః - ముఖం పూజయామి ; సునేత్రాయై నమః - నేత్రౌ పూజయామి
రమాయి నమః - కర్ణౌ పూజయామి ; కమలాయై నమః - శిరః పూజయామి ; శ్రీ వరలక్ష్మై నమః - సర్వాణ్యంగాని పూజయామి
వరలక్ష్మి అష్టోత్తర శతనామావళి
ఓం ప్రకృత్యై నమః ఓం వికృత్యై నమః ఓం విద్యాయై నమః ఓం సర్వభూతహితప్రదాయై నమః ఓం శ్రద్ధాయై నమః ఓం విభుత్యై నమః
ఓం సురభ్యై నమః ఓం పరమాత్మికాయై నమః ఓం వాచ్యై నమః ఓం పద్మాలయాయై నమః ఓం పద్మాయై నమః ఓం శుచయే నమః
ఓం స్వాహాయై నమః ఓం స్వధాయై నమః ఓం సుధాయై నమః ఓం ధన్యాయై నమః ఓం హిరణ్మయ్యై నమః ఓం లక్ష్మి నమః
ఓం నిత్యపుష్టాయై నమః ఓం విభావర్యై నమః ఓం ఆదిత్యై నమః ఓం దిత్యే నమః ఓం దీప్తాయై నమః ఓం వసుధాయై నమః
ఓం వాసుదారిన్యై నమః ఓం కమలాయై నమః ఓం కాంతాయై నమః ఓం కామాక్షై నమః ఓం క్రోధసంభవాయై నమః
ఓం అనుగ్రహప్రదాయై నమః ఓం బుద్ధయే నమః ఓం అనఘాయై నమః ఓం హరివల్లభాయై నమః ఓం అశోకాయై నమః
ఓం అమృతాయై నమః ఓం దీప్తాయై నమః ఓం లోకశోకవినాశిన్యై నమః ఓం ధర్మనిలయాయై నమః ఓం కరుణాయై నమః
ఓం లోకమాత్రే నమః ఓం పద్మప్రియాయై నమః ఓం పద్మహస్తాయై నమః ఓం పద్మాక్షై నమః ఓం పద్మసుందర్యై నమః
ఓం పద్మోద్భవాయై నమః ఓం పద్మముఖ్యై నమః ఓం పద్మనాభప్రియాయై నమః ఓం రమాయై నమః ఓం పద్మమాలాధరాయై నమః
ఓం దేవ్యై నమః ఓం పద్మిన్యై నమః ఓం పద్మగంధిన్యై నమః ఓం పుణ్యగంధాయై నమః ఓం సుప్రసన్నాయై నమః
ఓం ప్రసాదాభిముఖ్యై నమః ఓం ప్రభాయై నమః ఓం చంద్రవదనాయై నమః ఓం చంద్రాయై నమః ఓం చంద్రసహోదర్యై నమః
ఓం చతుర్భుజాయై నమః ఓం ఛన్ద్రరూపాయై నమః ఓం ఇందిరాయై నమః ఓం ఇందుశీతలాయై నమః ఓం ఆహ్లాదజనన్యై నమః
ఓం పుష్ట్యై నమః ఓం శివాయై నమః ఓం శివకర్యై నమః ఓం సత్యై నమః ఓం విమలాయై నమః ఓం విశ్వజనన్యై నమః
ఓం తుష్టయై నమః ఓం దారిద్ర్యనాశిన్యై నమః ఓం ప్రీతిపుష్కరిన్యై నమః ఓం శాంతాయై నమః ఓం శుక్లమాల్యాంబరాయై నమః
ఓం శ్రియై నమః ఓం భాస్కర్యై నమః ఓం బిల్వనిలయాయై నమః ఓం వరారోహాయై నమః ఓం యశస్విన్యై నమః
ఓం వసుంధరాయై నమః ఓం ఉదరాంగాయై నమః ఓం హరిణ్యై నమః ఓం హేమమాలిన్యై నమః ఓం ధనదాన్యకర్యే నమః
ఓం సిద్ధయే నమః ఓం త్రైనసౌమ్యాయై నమః ఓం శుభప్రదాయే నమః ఓం నృపవేష్మగతానందాయై నమః ఓం వరలక్ష్మి నమః
ఓం వసుప్రదాయై నమః ఓం శుభాయై నమః ఓం హిరణ్యప్రాకారాయై నమః ఓం సముద్రతనయాయై నమః ఓం జయాయై నమః
ఓం మంగళాదేవ్యై నమః ఓం విష్ణు వక్షస్థలాయై నమః ఓం విష్ణుపత్న్యై నమః ఓం ప్రసన్నాక్ష్యై నమః ఓం నారాయనసమాశ్రితాయై నమః
ఓం దారిద్రద్వంసిన్యై నమః ఓం దేవ్యై నమః ఓం సర్వోపద్రవ నివారిన్యై నమః ఓం నవదుర్గాయై నమః ఓం మహాకాళ్యై నమః
ఓం బ్రహ్మావిష్ణుశివాత్మికాయై నమః ఓం త్రికాలజ్ఞానసంపన్నాయై నమః ఓం భువనేశ్వర్య నమః ఓం శ్రీ వరలక్ష్మై నమః


దశాంగం గగ్గులోపెతం సుగంధిం సుమనోహరం | ధూపం దాస్యామి దేవేశి వరలక్ష్మి గృహానతం ||
శ్రీ వరలక్ష్మిదెవ్యై నమః దూపమాఘ్రాపయామి.
ఘ్రుతవర్తి సమాయుక్తం అంధకార వినాశకం | దీపం దాస్యామి తే దేవి గృహాణ ముదితాభవ ||
శ్రీ వరలక్ష్మిదెవ్యై నమః దీపం దర్శయామి.
నైవేద్యం షడ్రసోపేతం దదిమాద్వాజ్య సంయుతం| నానాభాక్ష్య ఫలోపెతం గృహాణ హరివల్లభే ||
శ్రీ వరలక్ష్మిదెవ్యై నమః నైవేద్యం సమర్పయామి.
ఫూగీఫల సమాయుక్తం నాగవల్లి దళైర్యుతం | కర్పూర చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యాతాం ||
శ్రీ వరలక్ష్మిదెవ్యై నమః తాంబూలం సమర్పయామి.
నీరాజనం సమానీతం కర్పూరేణ సమన్వితం | తుభ్యం దాస్యామహం దేవీ గృహ్యాతాం విశ్నువల్లభే ||
శ్రీ వరలక్ష్మిదెవ్యై నమః నీరాజనం సమర్పయామి.
పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే | నారాయనప్రియే దేవి సుప్రీతా భవ సర్వదా ||
శ్రీ వరలక్ష్మిదెవ్యై నమః మంత్రపుష్పం సమర్పయామి.
శ్లో: యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ | తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదేపదే ||
పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపసంభవ | త్రాహిమాం క్రుపయాదేవి శరణాగతవత్సలా ||
అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ | తస్మాత్కారుణ్య భావేన రక్ష రక్షజనార్ధన ||
శ్రీ వరలక్ష్మిదెవ్యై నమః నమస్కారాన్ సమర్పయామి.
తోరపూజ: ( తోరమును అమ్మవారివడ్డ వుంచి అక్షతలతో ఈ క్రింది విధముగా పూజింపవలెయును )
కమలాయై నమః ప్రధమగ్రందిం పూజయామి; రమాయి నమః ద్వితీయగ్రందిం పూజయామి
లోకమాత్రేనమః త్రుతీయగ్రందిం పూజయామి; విశ్వజనైన్య నమః చతుర్ధగ్రందిం పూజయామి
వరలక్ష్మైనమః పంచామగ్రందిం పూజయామి; క్షీరాబ్దితనయాయ నమః షష్ఠమగ్రందిం పూజయామి
విశ్వసాక్షినై నమః సప్తమగ్రందిం పూజయామి; చంద్రసహోదరై నమః అష్టమగ్రంధిం పూజయామి
వరలక్ష్మై నమః నవమగ్రందిం పూజయామి.
ఈ క్రింది శ్లోకమును చదువుతూ తోరమును కుడిచేతికి కట్టుకోవలెను.
బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం | పుత్రపౌత్రాభి వృద్దించ సౌభాగ్యం దేహిమే రమే ||
వాయన దానము: (వాయనమిచ్చునప్పుడు ఈ క్రింది శ్లోకమును చదువుతూ వాయనము ఇవ్వవలెను.
వాయనము అనగా: ముత్తైదువులకు పసుపు కుంకుమ, రవికె, పండ్లు, దక్షిణ, పుస్తకము పళ్ళెంలో పెట్టి దానము ఇవ్వవలెను).
ఇందిరా ప్రతిగృహ్నాతు ఇందిరా వై దదాతి చ |ఇందిరా తారకోభాభ్యాం ఇందిరాయై నమోనమః ||
(ఈ శ్లోకముతో వాయనము ఇచ్చి అక్షతలు పుచ్చుకొని వ్రాతకతను చదువుకోవలెను).
వరలక్ష్మీ వ్రత- కథ
1. సూత మహాముని శౌనకుడు మొదలైన మహర్షులని చూసి యిలా అన్నాడు. 'ఓ మునీశ్వరు లారా! స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలుగు వ్రతమొకటి పూర్వము శివుడు పార్వతికి చెప్పాడు. దానిని చెప్తాను వినండి'.
2. ఒక రోజు కైలాస పర్వతమున శివుడు తన సింహాసనము మీద కూర్చుని ఉండగా, పార్వతీదేవి ఆయనని సమీపించి, 'దేవా! లోకంలో స్త్రీలు ఏ వ్రతం చేస్తే సర్వసౌభాగ్యములను, పుత్రపౌత్రాదులను కలిగి సుఖసంతోషాలతో ఉంటారో అటువంటి వ్రతమేదో సెలవీయండి' అని అడుగగా పరమేశ్వరుడిలా చెప్పాడు. 'ఓ దేవీ! స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపత్తులనిచ్చే వ్రతం ఒకటి ఉంది. దాని పేరు వరలక్ష్మీ వ్రతం. ఆ వ్రతమును శ్రావణమాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారము రోజు చేయవలెను'.
3. పార్వతీదేవి ' నాథా! ఆ వరలక్ష్మీ వ్రతము ఎలా చేయాలి , ఏ దేవతను పూజించాలి? ఏ విధంగా చేయాలి? దీనినెవరైనా యింతకు ముందు చేసారా? ఆ వివరములన్నీ చెప్పండి' అని అడుగగా శివుడు పార్వతీదేవిని చూసి, ఓ కాత్యాయనీ! వరలక్ష్మీ వ్రత విశేషాలు చెప్తాను విను. పూర్వము మగధ దేశమున కుండినమనే ఒక పట్టణం ఉంది. ఆ పట్టణము నిండా బంగారు ప్రాకారములు, బంగారు గోడలు గల ఇళ్ళు ఉన్నాయి. అందులో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉన్నది. ఆమె పతియే ప్రత్యక్ష దైవముగా భావించి, తెల్లవారు ఝామునే లేచి, స్నానం చేసి, పతిదేవుని పూవులతో కొలిచి ఆ తర్వాత అత్తమామలకు అవసరమైన అనేక సేవలు చేసి, యింటి పనులన్నీ ఓర్పుతో, నేర్పుతో చేసుకుంటుండేది. అందరితో ప్రియంగా, మితంగా మాట్లాడుతుండేది. గయ్యాళిగా కాకుండా , ఇంత అణకువగా నున్న ఆ మహా పతివ్రతను చూసి మహాలక్ష్మికి ఆమె మీద అనుగ్రహం కలిగింది.
4. ఒకరోజు ఆ మాహాయిల్లాలికి కలలో ప్రత్యక్షమై మహాలక్ష్మి ఇలా చెప్పింది. 'ఓ చారుమతీ! నేను వరలక్ష్మీ దేవిని. నీ నడవడిక చూసి, నాకు నీ మీద అనుగ్రహం కలిగి నీకు ప్రత్యక్షమయ్యాను. శ్రావణమాసంలో శుక్ల పక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజు నువ్వు నన్ను పూజించితే నీకు కోరిన వరములిస్తాను' అలా ప్రత్యక్షమైన అమ్మ వారని చూసి ఎంతో మురిసిపోయిన చారుమతీ దేవి కలలోనే వరలక్ష్మీ దేవికి ప్రదక్షిణ , నమస్కారములు చేసి ;
నమస్తే సర్వలోకానాం జనన్యై పుణ్య మూర్తయే శరణ్యే త్రిజగ ద్వంద్యే విష్ణు వక్షస్థలాలయే
అని అనేక విధములు స్తోత్రం చేసింది.
'ఓ జగజ్జననీ! నీ కటాక్షంబు కలిగితే జనులు ధన్యులవుతారు. విద్వాంసులవుతారు. సకల సంపన్నులవుతారు. నేను పూర్వ జన్మలలో చేసిన పూజఫలం వల్ల నీ దర్శనము నాకు కలిగింది'. అనగా వరలక్ష్మీ దేవి సంతోషము చెందింది. ఆ వెంటనే మెలకువ వచ్చి నాలుగు వైపులా చూస్తే చారుమతికి వరలక్ష్మీ దేవి కనబడ లేదు. అప్పుడామెకు అర్థమైంది తాను కలగన్నానని. వెంటనే భర్తనీ, అత్తమామలని లేపి చెప్పగానే వాళ్ళు కూడా చాలా సంతోషించారు. 'ఈ స్వప్నము చాలా ఉత్తమమైనది. దేవి ఆనతి ప్రకారం నువ్వు తప్పకుండా ఆ వ్రతం చెయ్యి' అన్నారు. చారుమతి తన యిరుగు పొరుగున ఉన్న స్త్రీలకు కూడా చెప్పింది. వాళ్ళు , చారుమతి ఎంతో ఉత్కంఠతో శ్రావణ మాసం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూడసాగారు.
5. వారు ఎంతో ఎదురు చూసిన పౌర్ణమి ముందు శుక్రవారము రానే వచ్చింది. ఈ రోజే కదా వరలక్ష్మీ దేవి చెప్పిన రోజని ఎంతో ఉత్సాహంతో చారుమతి మొదలగు స్త్రీలందరూ పూజకుపక్రమించారు. ప్రాతః కాలమే లేచి తలారా స్నానం చేసి, పట్టు బట్టలను కట్టుకున్నారు. చారుమతి యింట్లో అందరూ చేరారు. అక్కడ ఒక ప్రదేశంలో గోమయముతో అలికారు. ఒక మంటపం ఏర్పరిచారు. దాని మీద ఒక ఆసనం వేసారు. ఆసనం పైన కొత్త బియ్యము పోసి , మర్రిచిగుళ్ళు, మామిడాకుల అలంకారలతో కలశం ఏర్పరిచారు. అందులోకి వరలక్ష్మీ దేవిని అవాహనము చేసారు. చారుమతి మొదలగు స్త్రీలంతా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేసారు. “పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవీ సుప్రీతా భవసర్వదా” అను ఈ శ్లోకంతో ధ్యాన వాహనాది షోడశోపచార పూజ చేసారు. తొమ్మిది సూత్రములు గల తోరాన్ని కుడి చేతికి కట్టుకున్నారు. వరలక్ష్మీ దేవికి అనేక రకములైన పిండి వంటలు చేసి నైవేద్యం పెట్టారు.
6. దాని తర్వాత ప్రదక్షిణం చేస్తుండగా ఆ స్త్రీలందరికీ ఘల్లుఘల్లు మని శబ్ధం వినపడింది. వెంటనే తమ కాళ్ళను చూసుకుంటే గజ్జెలు మొదలైన ఆభరణములు కనిపించాయి. చారుమతి మొదలైన స్త్రీలంతా వరలక్ష్మీ దేవి కృపా కటాక్షములు కలిగాయని ఎంతో మురిసి పోయారు. రెండో ప్రదక్షిణం చేయగానే చేతులకు ధగధగ లాడే నవరత్నాలతో కూడిన కంకణములు మొదలైన ఆభరణములు కనిపించాయి. ఇంక వాళ్ల ఆనందం ప్రత్యేకించి చెప్పేదేముంది? మూడవ ప్రదక్షిణం పూర్తి కాగానే అ స్త్రీలంతా సర్వభూషణాలంకృతులయ్యారు. చారుమతి మొదలైన ఆ స్త్రీల యిళ్ళన్నీస్వర్ణమయాలయ్యాయి. వాళ్ళకి రథగజ తురగ వాహనాలు ప్రసాదింపబడ్డాయి.
7. చారుమతి యింటి నుంచి ఆ స్త్రీలను తీసుకుని పోవడానికి వారి వారి యిళ్ళ నుంచి గుర్రాలు, ఏనుగులు, రథాలు, బండ్లు వచ్చాయి. ఆ స్త్రీలు, చారుమతి కలిసి వారి చేత శాస్త్ర ప్రకారం పూజ చేయించిన బ్రాహ్మణోత్తమునికి గంధం, పుష్పం, అక్షింతలతో పూజించి 12 కుడుములు వాయనమిచ్చి , దక్షిణ తాంబూలములిచ్చి నమస్కరించారు. బ్రాహ్మణుడు వారిని ఆశీర్వదించారు. వరలక్ష్మీ దేవికి నైవేద్యం గా పెట్టిన పిండివంటలను బంధుమిత్రులతో తిని తమ కోసం వచ్చిన గుర్రాలు, ఏనుగులు మొదలైన వాహనాలలోవారి యిండ్లకు బయలు దేరారు. వారు దోవలో చారిమతి భాగ్యమును, తమ భాగ్యమును ముచ్చటించుకుంటూ వెళ్ళారు. లక్ష్మీదేవి తనంతట తానే స్వప్నములో వచ్చి ప్రత్యక్షమవట మంటే మాటలా? చారుమతి ఎంత అదృష్టవంతురాలు అనుకున్నారు. చారుమతికి ప్రత్యక్షమైన విధానం తన మటుకే దాచుకుని తను ఒక్కతే పూజించకూండా, తమ అందరికీ చెప్పి, తమకి కూడా ఇంతటి సౌభాగ్యం కలగజేసిన చారుమతి ఎంతటి పుణ్యురాలు, అలాంటి ఆమె పరిచయం కలిగి ఉండిన తామెంత భాగ్యవంతులు అని ఎంతో మురుసిపోయారు. అప్పటి నుంచీ చారుమతితో సహా వారందరూ క్రమం తప్పకుండా ప్రతీ సంవత్సరం ఈ పూజ చేస్తూ పుత్రపౌత్రాభి వృద్ధి కలిగి, ధన కనక వస్తు వాహనములు కలిగి, సుఖ సంతోషాలతో ఉన్నారు. కావున 'ఓ పార్వతీ! ఈ ఉత్తమమైన వ్రతమును చేస్తే, అలా ఎదుటి వారికి చెప్పి చేయిస్తే సర్వసౌభాగ్యములు కలిగి శుభముగా ఉంటారు. ఈ కథను విన్నవారికి, చదివిన వారికి కూడా వరలక్ష్మీ ప్రసాదము వలన సకల కార్యములూ సిద్ధించును' అన్నాడు పరమశివుడు.
8. సూత మహాముని శౌనకుడు మొదలగు వారితో 'మునులారా! విన్నారుగా చారుమతి ఎదుటివారి మంచి కూడా ఎలా కోరిందో! ఎదుటి మనిషికి మంచి కలగాలని కోరుకుంటే అమ్మవారు యింకా ప్రసన్నురాలై మీరు కోరకుండానే మీకు మంచి చేస్తుంది' అన్నారు.
(వరలక్ష్మీ వ్రత కల్పము సమాప్తము.)
(కథాక్షతలు అమ్మవారి మీద వేసి, మీ మీద వేసుకోండి.)

లక్ష్మీదేవి పూజ ఫలం


'దీపం జ్యోతిః పరంబ్రహ్మ దీపం సర్వతమోపహమ్‌
దీపేన సాధ్యతే సర్వమ్‌ సంధ్యా దీపన్నమోస్తుతే'

జ్యోతిని పరబ్రహ్మ స్వరూపం గా, మనోవికాసానికి, ఆనందాని కి, సజ్జనత్వానికి, సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావిస్తాం.పూర్వం దుర్వాస మహర్షి ఒకసారి దేవేంద్రుని ఆతిథ్యానికి మెచ్చుకొని ఒక మహిమాన్వితమైన హారాన్ని వారంగా ప్రస్తాడు. ఇంద్రుడు దాన్ని తిరస్కార భావంతో తన వద్ద నున్న ఐరావతము అనే ఏనుగు మెడలో వేయగా అది ఆ హారాన్ని కాలితో తొక్కి నాశనం చేస్తుంది. అది చూసిన దుర్వాసుడు ఆగ్రహం చెంది దేవేంద్రుని శపిస్తాడు.

దీంతో శాపగ్రస్తుడైన దేవేంద్రుడు రాజ్యాధిపత్యం కోల్పోయి, సర్వసంపదలు పోగొ ట్టుకొని దిక్కుతోచని స్థితిలో దేవేంద్రుడు శ్రీహరిని ప్రార్థిస్తాడు. అప్పుడు శ్రీ మహా విష్ణువు దేవేంద్రునికి ఒక సూచన ఇస్తాడు. ఒక జ్యోతిని వెలగించి దానిని శ్రీ మహా క్ష్మి స్వరూపంగా తలచి పూజించమని, ప్రార్ధించమని చెప్తాడు.
మహావిష్ణువు చెప్పిన విధంగా దేవేంద్రుడు పూజించడంతో దానికి తృప్తి చెందిన లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. అప్పుడు దేవేంద్రుడు తిరిగి త్రిలోకాధిపత్యా న్ని, సర్వసంపదలను పొందుతాడు ఆనందంతో జీవిస్తాడు . ఆ తర్వాత ఒకసారి లక్ష్మీదేవితో తల్లీ నీవు కేవలం శ్రీహరి వద్దనే ఉండుట న్యాయమా ! నీ బిడ్డలు నీ కరుణాపొందే మార్గం లేదా అని ఆ తల్లిని అడుగుతాడు.

అప్పుడు ఆ తల్లి లక్ష్మీదేవి తనను త్రికరణ శుద్దిగా ఆరాధించే భక్తులకు వారి అభీష్టాలకు అనుగుణంగా... మహర్షులకు మోక్ష లక్ష్మి రూపంగా, విజయాన్ని కోరే బిడ్డలకు విజయలక్ష్మిగా, విద్యార్థులు నన్ను భక్తి తో ఆరాధిస్తే విద్యా లక్ష్మిగా, ఐశ్వర్యాన్ని కోరి నన్ను కొలిచేవారికి ధనలక్ష్మిగా, వారి సమస్త కోరికలు నెరవేర్చే వరలక్ష్మిగా వారికి ప్రసన్నురాలనవుతానని దేవేంద్రుని సమాధానం ఇస్తుంది. ఆ తల్లిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో పూజిస్తారో వారికి ఆ తల్లి ప్రసన్నురాలై వారి కోర్కెలు నిరవేర్చుతుంది.

శాశ్వత నిలయం :

గురుభక్తితో దేవతలను, పితృదేవతలను పూజించేవారు.. సత్యం పలికే వారు.. దాన ధర్మాలు చేసేవారు.. భార్యను గౌరవించేవారు.. బ్రాహ్మణుల పట్ల భక్తి చూపేవారు.. పగటిపూట నిద్రపోని వారు.. వృద్ధులు.. బలహీనులు.. అసహాయులైన స్త్రీలు.. పేదవారి పట్ల కరుణగల వారు.. పారిశుద్ధ్యాన్ని పాటించేవారు.. అతిథులకు పెట్టిన తర్వాతే భోజనం చేసేవారు శ్రీ మహాలక్ష్మికి అత్యంత ఇష్టులు అవుతారు. వారి ఇళ్లలోనే శ్రీదేవి ఎల్లప్పుడూ ఉంటుంది. పెద్దస్థాయిలో ఉండే అధికారుల.. మంత్రుల ఇళ్లలో మహాలక్ష్మి నివాసముంటుంది. అందుకే ఆయా వ్యక్తుల ముఖాల్లో ఒక విధమైన ఆకర్షణ, కళ ఉంటాయి. దీన్నే లక్ష్మీకళ అంటారు.

అయితే అసత్యాలు పలికే వారి వద్ద, ఇతరుల మనస్సును గాయపరిచే వారివద్ద లక్ష్మీదేవి నివాసముండదు. ఇంట్లో వెంట్రుకలు గాలికి తిరగాడితే లక్ష్మీ కటాక్షం దక్కదు. బయటికి వెళ్లి కాలును శుభ్రం చేసుకోకుండా ఇంటికి వచ్చే వాళ్ల ఇంట లక్ష్మీదేవి నివాసముండదు. తల్లిదండ్రులను లెక్కచేయని వారింట, గోళ్లు కొరికేవారింట శ్రీదేవి ఉండదని పురోహితులు అంటున్నారు.లక్ష్మీదేవి సకల సంపదలతోపాటు సౌభాగ్యాన్ని అందించే దేవత. అందుకే సౌభాగ్యవంతులందరూ శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మిని అర్చిస్తారు.

శుక్రుడికి ప్రత్యాధి దేవత మహాలక్ష్మీ మానవులకు కళలు అబ్బాలన్నా, బోగభాగ్యాలు ఉండాలన్నా, వాహన యోగం కలగాలన్నా మంచి ఇల్లు, మంచి తిండి, మంచి కళత్రం, అందం వీటన్నిటినీ ప్రసాదించేది శుక్రుడే అని గ్రహించాలి. శుక్రుడు భాగ్యకారకుడు. ఎవరైనా శుక్రుడి అనుక్షిగహం పొందాలంటే మహాలక్ష్మిని పూజించి తమ కోర్కెలను నిజం చేసుకోవచ్చు

వరలక్ష్మి వ్రత కధ (శ్రావణ శుక్రవారం కధ)


ఒకనాడు పరమేశ్వరుడు కైలాస గిరియందు సకల మునిగణ సంసేవితుడైయున్న సమయంబున పార్వతీ దేవి వినయంబుగా, “ప్రాణేశ్వరా! స్త్రీలు సకలైశ్వర్యములు కలిగియుండుటకు ఆచరించదగిన వ్రతమేదియో సెలవీయు”డని కోరెను. అంతట పరమేశ్వవరుడు, “దేవీ! వరలక్ష్మి వ్రతమనునది స్త్రీలకు సౌభాగ్యమొసగును. దానిని శ్రావణమాసమందు పౌర్ణమికు ముందు వచ్చు శుక్లపక్ష శుక్రవారము నాడు చేయవలెను” అనెను. అది విని యామె, “స్వామీ! ఆవ్రతం ఎలా ఆచరించవలెనో సెలవీ”య వేడెను. మరియు, “ఆ వ్రతాన్ని మునుపు ఎవరాచరించి తరించారో తెలుపగోరెద” ననెను. అంతట పరమేశ్వరుడు “ఓ పడతీ! ఆ వ్రతకధను చెప్పెదను వినుము” అని కధ చెప్పెను.

పూర్వము మగధ రాజ్యమున కుండిన నగరమను నొక పురము గలదు. అది బహుసుందరమయిన పట్టణము. అందు చారుమతి యను ఒక సాధ్వి కలదు. ఆమె సద్గుణములకు మెచ్చి ఆదిలక్ష్మి ఆమె స్వప్నమున ప్రత్యక్షమై ఆమెతో, “చారుమతీ! నీసధ్గుణములకు నేను మెచ్చితిని నీకు కావలయు వరములనొసగు తలంపు నాకు కలిగెను. కావున నీవు శ్రావణ పౌర్ణమి ముందు వచ్చు శుక్రవారమునాడు వరలక్ష్మీ వ్రతము చేయుము. అప్పుడు నీవు కోరిన కోరికలను దీర్చెద” నని చెప్పి మాయమయ్యను. వెంటనే ఆమె మేల్గాంచి, తన స్వప్న వృత్తాంతము తన భర్తకు నివేదింప నతడునూ మిగుల సంతోషించి ఆమెనా వ్రతమును చేయుటకు ప్రోత్సహించెను. ఆస్వప్న వృత్తాంతము తెలిసిన ఆ పట్టణ స్త్రీలు శ్రావణమాసం కొరకు ఎదురుచూచుచుండిరి. అంతలో శ్రావణమాసము వచ్చెను. అంతట చారుమతి వారందరితో కలసి నిర్ణీత దినమున స్నానాదులు ఆచరించి, ఒక చోట ఆవు పేడతో అలికి, బియ్యముతో మంటపమేర్పరచి మర్రిచిగుళ్ళు మొదలగు పంచ పల్లవులతో కలశంబేర్పరచి, అందు వరలక్ష్మిని ఆవాహనం చేసి, సాయంత్రమైనంత నధిక భక్తితో



లక్ష్మీo క్షీరసముద్రరాజతనయాం| శ్రీ రంగథామేశ్వరీం|

దాసీభూత సమస్తదేవ వనితాం| లోకైక దీపాంకురాం|

శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవః| బ్రహ్మేంద్ర గంగాధరాం|

త్వాం త్రిలోక్య కుటుంబినీం సరసిజాం వందేముకుందప్రియాం||



అని స్తుతించి, తొమ్మిది రంగులు గల తోరణము కుడిచేతికి గట్టుకొని, యధాశక్తిని లక్ష్మీదేవికి ఫలభక్ష్య పానీయ పాయసాదులు నైవేద్యముగా సమర్పించి, ప్రదక్షణ మొనర్చెను. అట్లు వారు ప్రదక్షణము చేయుచుండగా ఘల్లు ఘల్లు మని ధ్వని వినిపించుటచే వారు క్రిందకి చూడగా వాళ్ళ కాళ్ళకు గజ్జెలు, అందెలు మున్నగు ఆభరణములు కనిపించెను. కానీ భక్తి తప్పక వారు రెండొవసారి ప్రదక్షణము చేయగా వారి హస్తములు నవరత్నఖచిత కంకణ సుందరము లయ్యెను. మూడవ ప్రదక్షణము చేసిన వెంటనే వారి యిండ్లు సకల సంపత్సమృధ్ధము లయ్యెను. పిమ్మట చారుమతీ వ్రతము చేయించిన బ్రాహ్మణులకు యధావిధిగా యధాశక్తిని దక్షిణ తాంబూలాదుల నొసంగి సంతుష్టిని చేసి పంపి, వ్రత ప్రసాదములను బంధుమిత్రాదులకు పెట్టి, తానునూ భుజించి, సుఖముగా నుండెను. ఆమె లోకోపకారముగా నిట్టి వ్రతమును జేయించినందులకు ఊరిలోనివారందరూ ఆమెను వేనోళ్ళ బొగడిరి. నాటి నుండి స్త్రీలందరూ ఆ వ్రతమును ప్రతి సంవత్సరమూ చేయుచుండిరి. ఆ వ్రతమును అన్ని వర్ణముల వారునూ జేయవచ్చును. ఆ వ్రతాచరణము వలన వరలక్ష్మీ ప్రసాదము కలిగి సకల కార్యములందునూ విజయము చేకూరును.

వర మహాలక్ష్మి అష్టకమ్


నమస్తే స్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే! 
శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే!!

నమస్తే గరుడారూఢే డోలాసుర భయంకరీ!
సర్వపాప హరేదేవి మహాలక్ష్మీ నమోస్తుతే!!

సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్ట భయంకరీ!
సర్వదుఃఖ హరేదేవి మహాలక్ష్మీ నమోస్తుతే!!

సిద్ధిబుద్ధి ప్రదేదేవి భుక్తిముక్తి ప్రదాయిని!
మంత్రమూర్తే సదాదేవి మహాలక్ష్మీ నమోస్తుతే!!

అద్యంత రహితే దేవి ఆదిశక్తి మహేశ్వరీ!
యోగజ్ఞే యోగసంభూతే మహాలక్ష్మీ నమోస్తుతే!!

స్థూల సూక్ష్మే మహారౌద్రే మహాశక్తి: మహోదరే!
మహాపాప హరేదేవి మహాలక్ష్మీ నమోస్తుతే!!

పద్మాసన స్థితే దేవి పరబ్రహ్మ స్వరూపిణీ!
పరమేశి జగన్మాత ర్మహాలక్ష్మీ నమోస్తుతే!!

శ్వేతాంబరధరే దేవి నానాలంకార భూషితే!
జగస్థితే జగన్మాత ర్మహాలక్ష్మీ నమోస్తుతే!!

మహా లక్ష్మీష్టకం స్తోత్రం యః పఠేద్భక్తిమాన్నరః!
సర్వసిద్ధి మావాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా!!

ఏకకాలే పఠేన్నిత్యం మహాపాప వినాశనం!
ద్వికాలం యఃపఠేన్నిత్యం ధనధాన్య సమన్వితః!!

త్రికాలంయః పఠేన్నిత్యం మహాశతృ వినాశనమ్!
మహాలక్ష్మీ ర్భవేన్నిత్యం ప్రసన్నా వరదా శుభం!!

తులసీ స్తోత్రమ్


జగద్ధాత్రి నమస్తుభ్యం విష్ణోశ్చ ప్రియవల్లభే
యతో బ్రహ్మాదయో దేవా: సృష్టి స్థిత్యన్తకారిణః

నమస్తులసి కళ్యాణి నమో విశ్నుప్రియే శుభే,
నమో మోక్షప్రదే దేవి నమః సమ్పత్ర్పదాయికే

తులసీ పాతు మాం నిత్యం సర్వాపద్భ్యోపి సర్వదా
కీర్తితా వా స్మ్రతా వాపి పవిత్రయతి మానవం నమామి

శిరసా దేవీం తులసీం విలసత్తమామ్ యాం దృష్ట్యా
పాపినో మర్త్యా: ముచ్యన్తే సర్వకిల్భిశాత్ తులస్యా రక్షితం

సర్వం జగదేతచ్చరాచరమ్, యా వినిర్హన్తి పాపాని దృష్ట్యావా
పాపిభిర్నరై: సమస్తులస్యతితరాం యస్యై బద్ధ్వాంజలిం
కలౌ కలయన్తి సుఖం సర్వం స్త్రియో వైష్యాస్తథాపరే తులస్యా నాపరం
కించిద్ద్తివతం యయా పవిత్రతో లోకో విష్ణుసంగేన వైష్ణవః తులస్యాః
పల్లవం విష్ణో: శిరస్యరోపితం కలౌ ఆరోపయతి సర్వాణి శ్రేయాంసి
వరమస్తకే తులస్యాం సకలా దేవా వసన్తి సతతం యతః అతస్తా మర్చయేల్లోకే
సర్వాన్దేవాన్సమర్చయన్ నమస్తులతి సర్వజ్ఞే పురుషోత్తమ వల్లభే పాహి మాం
సర్వపాపేభ్యః సర్వసమ్ప్రదాయిమే ఇతి స్తోత్రం పురా గీతం పుండరీకేణ
ధీమతా విష్ణు మర్చయతా నిత్యం శోభనైస్తులసీదలై: తులసీ
శ్రీ మహాలక్ష్మీర్విద్యా విద్యా యశస్వినీ, ధర్మాధర్మాననా దేవీ
దేవ దేవమనః ప్రియా లక్ష్మీ ప్రియసఖీ దేవీ ద్యౌర్భూమి రచలా చలా,
షోడశైతాని నామాని తులస్యాః కీర్తయన్నరః లభతే సుతరాం
భక్తి మన్తే విష్ణుపదం లభేత్ తులసీ భూర్మహాలక్ష్మి: పద్మినీ శ్రీర్హరి ప్రియా
తులసి శ్రీ సఖీశుభే పాపహారిణి పుణ్యదే నమస్తే నారదనుతే

నారాయణ మనః ప్రియే ఇతి శ్రీ పుండరీక కృతం తులసీస్తోత్రమ్

దీపం లేని ఇల్లు


దీపం లేని ఇల్లు ప్రాణం లేని శరీరం వంటిదే. మామూలుగా ప్రమిద అనేది మట్టితో చేసినదై ఉంటుంది. మన శరీరం పంచభూతాలతో తయారైంది. దీపపు ప్రమిద శరీరానికి ప్రతీక. దానిలోని నూనె లేక నెయ్యి మనలోని ప్రేమ వంటిది. ప్రేమను, స్నేహాన్ని జిడ్డుతో పోల్చి చెబుతుంటారు. ప్రేమ స్నేహితుల మధ్య ఉంటే అది స్నేహం, అదే తోటి సోదరుల యందు ఉంటే అది ఆదరం, అదే పెద్దల యందు ఉంటే గౌరవం. అది భగవంతుని యందు ఉంటే దాన్ని భక్తి అంటారు. అయితే ఈ ప్రేమ భగవంతుని కోసం ప్రకాశించ గలిగితే మన జన్మ ధన్యం. అలా ప్రకాశింపచేయాలంటే మనకు శాస్త్రముల తోడు కావాలి. శాస్త్రములకు గుర్తు మనం పెట్టే వత్తులు. ఒక వత్తి మాత్రమే వేసి వెలిగించకూడదు. రెండు వత్తులు కలిపి వెలిగించాలి. రెండు దీపాలు వెలిగించాలి. కొందరు ఒకే దీపం వెలిగిస్తారు, వారు ఒకే ప్రమిదలో రెండు దీపాలు వెలిగించాలి. ఒక వత్తు వేదాన్ని, రెండో వత్తు ఆ వేదాలను వివరించే వ్యాఖ్యాణ గ్రంథములు. వ్యాఖ్యాణ గ్రంథములు అంటే రామాయణ, మహాభారతం, ప్రబంధాలు మొదలైనవి. ధర్మ శాస్త్రములు, ఇతిహాసాలు, పురాణాలు, ఆగమాలు మరియూ ప్రబంధాలు ఇవన్నీ కలిపి వ్యాఖ్యాణ గ్రంథములు అని అంటారు. ఇవి వేదంలోని అర్థాలని మరింత స్పష్టంగా కనిపించేట్టు చేస్తాయి. కనుక ననకు వేదమూ అవసరమే, వ్యాఖ్యాణ గ్రంథములు అవసరమే.

వత్తులు దేవుడి వైపు తిరిగి ఉండాలి. అందులో వెలిగే నిప్పే మనలోని జ్ఞానం. నేను అని చెప్పే ఆత్మకు స్వరూపం అణుమాత్రం, జ్ఞానమే తన స్వభావం. జ్ఞానమే ఆత్మ స్వరూపం. ఆ జ్ఞానం వికసించగలగాలి. అప్పుడు ఎదురుగుండా ఉండే రూపం మనకు చక్కగా దర్శనం ఇస్తుంది. వెలిగే జ్యోతి ప్రమిద అంచు వద్ద ఉండాలి. దీపం మధ్యలో జ్యోతి వచ్చేట్టు వెలిగించడం పద్దతి కాదు. అట్లాచేస్తే ప్రమిద అంచు యొక్క నీడ దేవుడిపై పడుతుంది. దీప కాంతి దేవుడిపై పడాలి, అప్పుడు స్పష్టంగా దర్శించవచ్చు.

భూమి, జలం మరియూ తేజస్సు ఈ మూడు ద్రవ్యాలను వాడి భగవంతుడు విశ్వరచన చేసాడు. ఇక్కడ మనం ఈ మూడు ద్రవ్యాలు దీపంలో చూడవచ్చు. భూమికి సూచకంగా ప్రమిద, జలానికి సూచకంగా నెయ్యి మరియూ తేజస్సుకి సూచకంగా జ్యోతి. ఈ మూడింటిని భగవన్మయం చేయగలగాలి. కేవలం బయటకి కనిపించే వస్తువులే కాదు, భగవంతుడు ఇచ్చినవి మనలో ఎన్నో ఉన్నాయి. మన మనస్సుని పాత్రను చేసి, మన ప్రేమనే నెయ్యిగా పోసి, మనం భగవంతుని కొరకు చేసే చింతనలే వత్తులు, ఆపై మన జ్ఞానమే జ్యోతి అని భావించాలి. అంటే లోపల బయట కనిపించని వస్తువులన్నీ పరమాత్మమయం చేయడమే దీపం పెట్టే ఆంతర్యం.

శ్రీ వేంకటేశ్వర మంగళాశాసనము


శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినామ్‌ | 
శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళమ్‌ ||

లక్ష్మీ సవిభ్రమాలోక సుభ్రూ విభ్రమ చక్షుషే |
చక్షుషే సర్వలోకానాం వేంకటేశాయ మంగళమ్‌ ||

శ్రీవేంకటాద్రి శృంగాగ్ర మంగళా భరణాంఘ్రయే |
మంగళానాం నివాసాయ శ్రీనివాసాయ మంగళమ్‌ ||

సర్వావయవ సౌందర్య సంపదా సర్వచేతసామ్‌ |
సదా సమ్మోహనాయాస్తు వేంకటేశాయ మంగళమ్‌ ||

నిత్యాయ నిరవద్యాయ సత్యానంద చిదాత్మనే |
సర్వాంతరాత్మనే శ్రీమద్వేంకటేశాయ మంగళమ్‌ ||

స్వత స్సర్వవిదే సర్వశక్తయే సర్వశేషిణే |
సులభాయ సుశీలాయ వేంకటేశాయ మంగళమ్‌ ||

పరస్మై బ్రహ్మణే పూర్ణ కామాయ పరమాత్మనే |
ప్రయుంజే పరతత్త్వాయ వేంకటేశాయ మంగళమ్‌ ||

ఆకారతత్త్వ మశ్రాంత మాత్మనా మనుపశ్యతామ్‌ |
అతృప్త్యామృత రూపాయ వేంకటేశాయ మంగ్ళమ్‌ ||

ప్రాయస్స్వ చరణౌ పుంసాం శరణ్యత్వేన పాణినా |
కృపయా దృశ్యతే శ్రీమద్వేంకటేశాయ మంగళమ్‌ ||

దయామృత తరంగిణ్యా స్తరంగైరివ శీతలైః |
అపాంగై స్సించతే విశ్వం వేంకటేశాయ మంగళమ్‌ ||

స్రగ్భూషాంబర హేతీనాం సుషమావహ మూర్తయే |
సర్వార్తి శమనాయాస్తు వేంకటేశాయ మంగళమ్‌ ||

శ్రీవేంకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే |
రమయా రమమాణాయ వేంకటేశాయ మంగళమ్‌ ||

శ్రీమత్సుందర జామాతృ మునిమానసవాసినే |
సర్వలోక నివాసాయ శ్రీనివాసాయ మంగళమ్‌ ||

మంగళా శాసనపరై ర్మదాచార్య పురోగమైః |
సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళమ్‌ ||

ఇది శ్రీ వేంకటేశ్వర మంగళాశాసనము

లక్ష్మీదేవి అంటే


లక్ష్మీదేవి అంటే ఒక్క ధనమే కాదు. మనిషికి వున్న ప్రతి నైవుణ్యమూ లక్ష్మీదేవే. ఆవిడ తలపై వుండకూడదు అంటే మనిషికున్న ధనంవల్లగానీ, నైపుణ్యం వల్లగానీ వచ్చే అహంకారం తలకెక్కకూడదు. దీనికి ఒక పురాణ కధ చెప్తారు. పూర్వం జంభాసురుడు అనే రాక్షసుడు త్రిలోకాధిపత్యం కోసం శివుడి గురించి ఘోర తపస్సు చేస్తాడు. అతని తపస్సుకి మెచ్చిన శివుడు ప్రత్యక్షమై అతను కోరుకున్న వరం ఇచ్చాడు. ఇంకేముంది. జంభాసురుడు దేవతల మీద దండయాత్ర చేసి ఇంద్ర పదవి చేజిక్కించుకుని ఇంద్రుణ్ణి తరిమి కొట్టాడు. పాపం ఇంద్రుడు ఇతర దేవతలను తీసుకుని బ్రహ్మ దేవుడూ, దేవతల గురువైన బృహస్పతి దగ్గరకెళ్ళి సమాలోచన చేశాడు. వారు దగ్గరలో సహ్యాది పర్వతంపైన వున్న దత్తాత్రేయుని శరణువేడమని, ఆయన తప్ప ఇంద్రుని ఆపద తీర్చేవరెవరూ లేరని సలహా ఇస్తారు.

ఇంద్రుడు వారి సలహాపై దత్తాత్రేయుని శరణువేడుతాడు. దత్తాత్రేయుడు చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తాడు. అసలు ఇంద్రుణ్ణి గుర్తుపట్టనట్లు వుంటాడు. ఇంద్రుడు అతణ్ణి పరి పరివిధాల ప్రార్ధించి నువ్వు తప్ప వేరే గతి లేదంటే, చివరికి కరుణించి తన నిజస్వరూపం చూపిస్తాడు. ఇంద్రుని ప్రార్ధనలాలకించి, ఉపాయం చెబుతాడు. నువ్వు దేవతలతో సహా వెళ్ళి జంభాసురుడిని నా ఆశ్రమం దగ్గరకు తీసుకు రమ్మంటాడు. దత్తాత్రేయుని ఆజ్ఞ ప్రకారం ఇంద్రుడు తన సైన్యంతో సహా వెళ్ళి జంభాసురునితో యుధ్ధం చేస్తున్నట్లు నటిస్తూ వెనక్కి వెనక్కి నడుస్తూ దత్తాత్రేయుని ఆశ్రమం దగ్గరకు తీసుకొస్తారు.

యుధ్ధం చేస్తూ ముందుకు వస్తున్న జంభాసురుడు దత్తాత్రేయుని ప్రక్కన వున్న ఆయన భార్య అనఘా దేవిని చూస్తాడు. ఆమె అమోఘ సౌందర్యం చూసి మోహిస్తాడు. ఆమెను తనతో తీసుకు వెళ్ళాలని ప్రయత్నిస్తాడు. అనఘా దేవి భర్త వంక చూస్తుంది. దత్తాత్రేయుడు వెళ్ళమని సైగ చేస్తాడు. అప్పుడు అనఘాదేవి జంభాసురుడికి ఒక షరతు విధిస్తుంది. నాకు నీ శిరస్సుపై నాట్యం చెయ్యాలని వుంది, అలా నాట్యం చెయ్యనిస్తే వస్తాను అని చెబుతుంది. జంభాసురుడు అంత అద్భుత సౌందర్యరాశి తన శిరస్సుపై నాట్యం చెయ్యటానికి సంతోషంగా అంగీకరిస్తాడు. అనఘాదేవి జంభాసురుని శిరస్సుపై నాట్యం చేస్తుండగా ఆ తన్మయత్వంలో, ఆ మత్తులో జంభాసురుడి సైన్యాన్ని సురసేనలు దునుమాడుతాయి. నాట్యమయినా ఆ పరాకులోనే వున్న జంభాసురుణ్ణి ఇంద్రుడు సంహరిస్తాడు.

ఇది ఎలా సాధ్యమయింది. అనఘాదేవి సాక్షాత్తూ మహాలక్ష్మి స్వరూపం. మహలక్ష్మి తమదగ్గరవుందని ఎవరికైతే గర్వం వస్తుందో లక్ష్మి వాళ్ళ నెత్తికెక్కుతుందంటారు. మనిషి దగ్గర లక్ష్మి ఏ రూపంలోనైనా వుండచ్చు, అందం, ఐశ్వర్యం, విద్య, ఏదైనా కళలో నైపుణ్యం, ఇలా. లక్ష్మి తమ దగ్గర వున్నదని సంతోషించి, దానిని ద్వినియోగపరచినంత మటుకూ పర్వాలేదు. కానీ, ఎవరికైనా తనకున్న నైపుణ్యాన్ని చూసుకుని గర్వం బాగా తలకెక్కినప్పుడు, కన్నూ మిన్నూ గానక ప్రవర్తించినప్పుడు, మనిషి పతనానికి అది మొదలు. తమంత వారు లేరన్న గర్వం ఎవరికి వస్తుందో, వారి తలమీద లక్ష్మీదేవి నాట్యమాడుతూ వారి పతనానికి కారణమవుతుంది. విపరీతమైన అహంకారం వున్నవారికి లక్ష్మి తలమీద నాట్యంచేసి అణచి వేస్తుందని ఈ కధ తెలియజేస్తుంది.

లక్ష్మీదేవి మన ఇంటికి రావాలంటే


లక్ష్మీదేవి మన ఇంటికి రావాలంటే మనం చేయాల్సిన పని ఏమిటో ఈ కథ చదివితే తెలుస్తుంది. 

ఒక రోజు రాజు ,మంత్రి మారువేషంలోరాజ్యంలోతిరుగుతుండగా ఒక బందిపోటు గుంపు వాళ్ళపై దాడి చేస్తారు రాజు,మంత్రి వాళ్ళతో ప్రతిఘటిస్తుంటారు అటువైపుగా వెళ్ళుతున్న రుద్రసేనుడు అది చూసి తన వంతు సాయం చేస్తాడు . దానికి మారువేషంలోవున్న రాజు మెచ్చి'' నీకు ఏమి బహుమానం కావాలో కోరుకో'' అని అంటాడు .

కాని రుద్రసేనుడు ''తమరు ఆపదలో ఉంటే కాపాడానేగాని ఏదో ఆశించి మాత్రం కాదు'' అని వీరోచితంగా అంటాడు . దానికి రాజు సంతోషించి ''నీకు ఎప్పుడు ఏ సాయం కావాలన్న తనని కోరమని ''చెప్పి వెళ్ళిపోతాడు .

ఇదంతా తన భార్య శాంతశీలకు చెబుతాడు రుద్రసేనుడు .అప్పుడు ఆమెకు ఒక విషయం గుర్తుకు వస్తుంది .

అదేమిటంటే కొద్ది రోజులక్రితం తను కట్టేలకని అడవిలోకివెళ్ళినప్పుడు అక్కడ ఒక మునీశ్వరుడు తారసపడతాడు .

ఆ మునీశ్వరుడు ''తల్లి ఒకవిషయం చెబుతాను శ్రద్దగా విను . లోకమంతా చీకటిగా అది కూడా శ్రుక్రవారం రోజు ఎవరి ఇంట్లోను దీపం లేకుండావుండి ని ఇంట్లో మాత్రం దీపం పెట్టి గుమ్మానికి అడ్డంగా కూర్చో అప్పుడు చీకటిని భరించలేక నల్లని చీర ధరించిన ఒకామే నీ ఇంట్లో నుంచి వెళ్ళటానికి ప్రయత్నిస్తూ౦ది.

అప్పుడు నువామేని అడ్డగించి బయట వెళ్ళితే లోపలికి రాకుడదని షరతు విధించు అప్పుడామె నేను లోపల వుండే ఈ వెలుగుని భరించలేను చీకటిలోకి వెళ్ళిపోతానంటుంది.ఇంకొకామే పట్టుపితాంబరాలతో ధగధగామెరిసే నగలతో ఇంట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తుంది అమెనికుడా అడ్డగించి లోపలికి వెళ్ళితే బయటకు వెళ్ళకూడదు అని షరతు విధించు అమె అప్పుడు బయటి చీకటిని భరించలేను లోపలికి వెళ్ళిపోతానంటు౦ది .

ఆమె ఇంట్లోకి ప్రవేశించగానే నీవు ఐశ్వర్యవంతురాలవు అవుతావని ''మునీశ్వరుడు చెప్పినది గుర్తుకువస్తుంది . వెంటనే శాంతశీల రాజు వద్దకు వెళ్ళి తాను ఎవరో చెప్పి వచ్చే శుక్రవారం రాజ్యంలో ఎవరి ఇంట్లోను దీపం పెట్టకుండా ఉండేలా చూడాలని కోరుతుంది .

వెంటనే రాజు ఆమె కోరిక మేరకు రాజ్యంలోఎవరు శుక్రవారంరోజు దీపం పెట్టకూడదని చాటింపు వేయిస్తాడు. మునీశ్వరుడు చెప్పినట్లు చేసి శాంతా శీల ఐశ్వర్యవంతురాలవుతుంది కాని శుక్రవారం ఎవరూ దీపం పెట్టకుండా రాజుగారితో ఆజ్ఞ వేయిచినందుకు చాలా బాధపడుతూ వుంటుంది.

అప్పుడు లక్ష్మీదేవిని ప్రార్ధించగా లక్ష్మీదేవి ప్రసన్నురాలై ''ఇకపై ప్రతి శుక్రవారం సంధ్యాసమయంలో దీపం పెడతారో వారందరి ఇళ్లకు నేను వస్తాను ''అని వరం ప్రాసాదిస్తుంది . ఎవరైతే ప్రతి శుక్రవారం సంధ్యాసమయంలో తప్పకుండా దీపం వెలిగిస్తారో వారు శ్రీ మహాలక్ష్మి కరుణాకటాక్షానికి పాత్రులవుతారు

దీపం లక్ష్మీదేవిరూపం


దీపం జ్యోతి పరబ్రహ్మమ్ దీపం జ్యోతి పరాయణమ్ 
దీపేన హారతే పాపమ్ దీప దేవి నమోనమః

దీపం పరబ్రహ్మ స్వరూపం. వెలుగుతున్న వత్తి ప్రకాశాన్ని ఇస్తుంది. ఆ కాంతి వలయం అందరిదీ. దీపం పాప ప్రక్షాళన చేస్తుంది. దీపానికి ఒక అద్భుతమైన శక్తి ఉంది. అదే...అంధకారాన్ని పటాపంచలు చేయడం. అంధకారమంటే కేవలం చీకటిగా ఉండడమే కాదు.... మనసులోని అజ్ఞానం కూడా అంధకారమే! ఈ అంధకారాన్ని పటాపంచలు చేసి జ్ఞానాన్ని ప్రసాదించే మాత లక్ష్మీదేవి. ఈ అద్భుతశక్తి కలిగి ఉన్న దీపానికి ప్రతీకే లక్ష్మీదేవి. కాబట్టే దీపానికి మనం నమస్కరిస్తున్నాము. దీపానికి నమస్కరించడమే కాదు. నమస్కరించి ప్రదక్షిణలు చేసి, పండుగలు చేసుకుంటున్నాం. దీపావళి ఇటువంటి పండుగేకదా!

ఈ దృష్టితో చూస్తే దీపానికి ఎంతో ప్రాధాన్యత ఉంది కాబట్టే....ఏ పని ప్రారంభించాలన్నా దీపం వెలిగించి ప్రారంభిస్తాం. దైవారాధననూ దీపం వెలిగించే ప్రారంభిస్తాం. దీపారాధన చేయకుండా అసలు ఏ పుణ్యకార్యం చేయరు. దీపానిది ఎప్పుడూ ఊర్ధ్వదృష్టే. అధో దృష్టి దానికిలేదు. అంటే కిందకి చూడదు. ఎప్పుడూ పైకే చూస్తూ వెలుగుతుంది. మన మనసు ఊర్ధ్వ జగత్తుపైనే లగ్నం కావాలని చెబుతుంటుంది దీపం. ఇక్కడ ఊర్ధ్వ జగత్తు అంటే కేవలం స్వర్గ లోకం మాత్రమే కాదు. జీవితంలో ఎదుగుదల అని. ఎన్ని కష్టాలు వచ్చినా, ఆశావాదంతో జీవిస్తూ, శక్తివంతమైన దీపాన్ని దైవారాధన చేసే సమయంలో కొన్ని సూత్రాలు పాటిస్తూ దేవుని వద్ద ఉంచాలి. అమ్మవారి పూజలో నూనె దీపాన్ని ఎడంవైపు, ఆవు నెయ్యి దీపాన్ని కుడివైపు వెలిగించాలి. జపం చేసేటప్పుడు జపమాలపై వస్త్రం కప్పి ఉంచాలి. మాల బయటకు కనిపించకూడదు. దీపం శివునికి ఎడంవైపు, విష్ణువుకు కుడివైపు ఉండాలి. ఏ దైవానికైనా దీపం ఎదురుగా మాత్రం ఉంచరాదు.

శివ సందర్శన విధి


సాధారణ దేవాలయాల్లో మనం దర్శనం చేసుకునే విధానం, శివాలయంలో విధానం వేరు వేరుగా ఉంటుంది. అందికే, శివాలయం దర్శిస్తే అందరు దేవుళ్ళని దర్శించినట్టే అని చెప్పబడింది. శివాలయంలో ఉండే శివలింగానికి మొత్తం 5 ముఖాలు ఉంటాయి. అందులో నాలుగు ముఖాలు నాలుగు దిక్కులను చూస్తుంటే, ఐదవ ముఖం ఊర్ధ్వముఖమై (పైకి/ఆకాశంవైపు చూస్తూ) ఉంటుంది. 5 ముఖాల్ని 5 పేర్లు నిర్ధేశించబడ్డాయి. అందుకే శివాలయంలో ఏ దిక్కున కూర్చుని అయినా పూజ చేయవచ్చు అంటారు. శివాలయాలు అన్నింటిలో అత్యంత మహిమ కలిగినది. కోరిన కోర్కెలు వెంటనే తీర్చేది.

పశ్చిమాభిముఖమైన శివాలయం అంటే మీరు గుడిలోకి వెళ్ళగానే శివలింగం పశ్చిమం వైపు చూస్తూ ఉంటుంది. అలా శివలింగానికి ఎదురుగా ఉన్న ద్వారం పశ్చిమంవైపు ఉన్నా లేదా శివలింగం పశ్చిమం వైపు చూస్తున్నా దానిని సద్యోజాత శివలింగం అని అంటారు. అప్పుడు మనం తప్పకుండా అటువంటి శివలింగాన్ని చూసినప్పుడు, ఓం సద్యోజాత ముఖాయ నమః అని స్మరించుకోవాలి. శ్రీకాళహస్తీశ్వర క్షేత్రంలో ఉన్న శివలింగం సద్యోజాత శివలింగం. శివలింగం తూర్పు వైపుకు చూస్తూ ఉంటే, అటుంటి శివలింగాన్ని తత్పురుష ముఖం అని అంటారు. తత్పురుష ముఖం అనేది మనల్ని తిరోదానాన్ని చేస్తూ ఉంటుంది. అంటే చీకటిలో ఉంచటం. అది మనల్ని మాయ చేత కప్పి బడేస్తూ చీకటిలో ఉంచుతూ ఉంటుంది. ఆ మాయ కమ్మి ఉండడం చేతనే మనం అన్ని రకాల పాపాలు చేస్తూ ఉంటాము. ఆ మాయని కప్పి ఉంచే ముఖమే ఆ సద్యోజాత ముఖం. సద్యోజాత ముఖం పూజించ తగినదే. ఏ మాత్రం అనుమానం లేదు. మనల్ని రక్షించినా, శిక్షించినా అన్నీ ఆ పరమేశ్వరుడేగా.

తూర్పుని చూస్తూ ఉండే శివలింగం వాయువు మీద అధిష్ఠానం కలిగి ఉంటాడు. మనకు ప్రతీ శివాలయాల్లోనూ ఈ 5 ముఖాలు ఉంటాయి. శివాగమనంలో చెప్పినట్లుగా మనం తప్పకుండా శివాలయంలో ఏ దిక్కువైపు వెళితే ఆ శివలింగం పేరుని స్మరించాలి. ముఖాలు మనకు 5 ఫలితాలని కలుగజేస్తాయి. ఆ 5 ముఖాలలో నుండే సృష్టి, స్థితి, లయ, తిరోదానము, అనుగ్రహము యివ్వబడతాయి. అన్ని ముఖాలు పూజనీయమైనవే. అన్ని ముఖాల్ని మనం పూజించి తీరాల్సిందే. శివలింగం దక్షిణంవైపు చూస్తూ ఉంటే అటువంటి ముఖం దక్షిణామూర్తి స్వరూపం. మనకు శివాలయంలో దక్షిణంని చూస్తూ తప్పకుండా దక్షిణామూర్తి ఉండి తీరాలి. అసలు దక్షిణామూర్తి విగ్రహం లేకుండా శివాలయాలు కట్టకూడదు.

శివలింగం దక్షిణానికి చూసే ముఖాన్ని దక్షిణామూర్తి స్వరూపంగా చూడమని చెప్తారు. ఆ ముఖాన్నే అఘోర ముఖం అంటారు. ఈ అఘోర ముఖం అగ్నిహోత్రానికి అంతటికీ అధిష్ఠానం అయి ఉంటుంది. ఈ సమస్త ప్రపంచాన్ని లయం చేసే స్వరూపమే ఈ అఘోర ముఖం. ఈ అఘోర ముఖమే సమస్త ప్రపంచాన్ని లయం చేసి, మళ్ళీ మనకు జన్మను ఇస్తూ ఉంటారు. మనకు మృత్యువుపట్ల భయం పోగొట్టేది, మనకి జ్ఞానం ఇచ్చేది ఇదే. మీరు జాగ్రత్తగా గమనిస్తే చిన్న పిల్లలకు చదువు దగ్గరనుండి, సంపద దగ్గరనుండి, పెద్దలకు మోక్షము వరకు దక్షిణామూర్తి ఇవ్వలేని సంపద, విద్యలేనేలేదు. చదువుకు, సంపదకు, మోక్షానికి అధిష్ఠానం అయి ఉంటాడు. ప్రతిరోజూ ఒక్క 2 నిమిషాలు దక్షిణామూర్తిని ధ్యానం చేస్తే మోక్షము కరతళామలకము. వారి అంత్యమునందు సాక్షాత్తు ఈశ్వరుడే గుర్తుపెట్టుకుని మోక్షాన్ని ప్రసాదిస్తాడు. ధ్యానం చేయటానికి అత్యంత మంగళకరమైన స్వరూపం, అందమైన స్వరూపం, శాంతమైన స్వరూపం దక్షిణామూర్తి స్వరూపం.

ఉత్తరం వైపు చూసే ముఖాన్ని "వామదేవ'' ముఖం అని అంటారు. ఇప్పటిదాకా 4 దిక్కుల్ని చూస్తున్న, 4 దిక్కులా గురించి తెలుసుకోగలిగాం. ఇక చివరి ముఖం శివలింగంపైన (అంటే ఆకాశంవైపు చూస్తూ ఉండే ముఖం)ఉండే ముఖం. ఆ ముఖాన్ని "ఈశాన ముఖం'' అంటారు. మనం లిగంపైన చూసి, ఓం ఈశాన ముఖాయ నమః అని స్మరించుకోవాలి. ఈశాన ముఖ దర్శనం మనం మిగిలిన నాలుగు ముఖాల్ని దర్శించిన తరువాతనే దర్శించాలి. అప్పుడే విశిష్ట ఫలితం అని చెప్పబడింది. మనకు కాశీలో ఉండే ముఖం అఘోర ముఖం. కాశీలో శివలింగం ఉత్తరం వైపు కూర్చుని, దక్షిణంవైపు చూస్తూ ఉంటుంది. ఉత్తరం వైపు చూసి "వాసుదేవ ముఖం'' నీటి మీద అధిష్ఠానం అయి ఉంటుంది. ఈ వాసుదేవ ముఖమే మనకు సమస్త మంగళము ఇచ్చే ముఖం.

వాసుదేవ ముఖం అంటే ఏమిటి అనేది మనకు శివపురాణంలో చెప్పబడింది. యదార్తమునకు అదే విష్ణు స్వరూపం. అందుకే విష్ణువు, శివుడు ఒకరే ... రెండు లేనే లేవు .... శివపురాణంలో రాస్తే ఎలా నమ్మాలి అని ఎవరికైనా సంశయం ఉంటే ఒకటి గమనించండి. శివపురాణంని రాసినది వేదవ్యాసుడు. వ్యాసుడే విష్ణువు ... విష్ణువే వ్యాసుడు. వ్యాసాయ విష్ణు రూపాయ, వ్యాస రూపాయ విష్ణవే, నమో వైబ్రహ్మ విధయే వాశిష్టాయ నమో నమః ఉన్న పరమాత్మ ఒక్కడే ... రెండు కాదు. చాలామంది వేరుగా చూస్తూ పొరబడుతున్నారు. కృష్ణ అని పిలిచినా నేనే పలుకుతాను. మూర్తి అని పిలిచినా నేనే పలుకుతాను. ఈ వాసుదేవ ముఖాన్ని ఓం వాసుదేవాయ నమః అని అంటే మనకు అనారోగ్యం కలగకుండా చూస్తాడు.

అంతేకాక ఈ వాసుదేవ ముఖాన్ని ఓం వాసుదేవాయ నాహం అని అంటే మనకు మూడు ఫలితాలని కూడా ఇస్తుంది. అవి ఒకటి మీ దగ్గర ఏదైతే ఉందొ అది మీ చేయి జారిపోకుండా మీతోనే ఉంచుతాడు. ఉదాహరణకు మీ దగ్గర ఒక కోటి రూపాయలు ఉన్నాయి లేదా ఒక మంచి ఉద్యోగంలో ఉన్నారు, ఎటువంటి కారణము చేతనూ మీరు అవి కోల్పోకుండా కాపాడుతూ ఉంటాడు. రెండు ... మనకు ఉత్తరోత్తరాభివృద్ధిని ఆయనే ఇస్తారు. ఉదాహరణకు ... ఉన్న కోటిని ధర్మబద్ధంగా రెండు కోట్లు చేస్తారు. (ఇది ఉదాహరణ మాత్రమే మీకు ఈజీగా అర్థమవ్వాలని) మూడు ... మనకు ఉన్నదానిని అనుభవించే ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. ఉదాహరణకు ... ఇప్పుడు తీపి పదార్థాలను కొనగలిగే శక్తి ఉండి, తినలేని స్థితిలో (షుగర్ ఉందనుకోండి) ఉంటే, అప్పుడు ఉన్న దాన్ని అనుభవించటం అని అనరు కదా. అటువంటి స్థితి కలుగకుండా కాపాడతాడు.

తురువాత ఈశాన ముఖము. శివాలయంలో లింగ దర్శనం అయ్యాక ఒకసారి పైకి చూసి ఓం ఈశాన ముఖాయ నమః అని స్మరించుకోవాలి. ఆ ఈశాన ముఖమే మనకు మోక్షాన్ని ప్రసాదించేది. ఈ ఈశాన ముఖం ఆకాశంకి అధిష్ఠానం అయి ఉంటుంది. శివాలయంలో మనకు బలిపీఠం అని ఉంటుంది. అక్కడికి ప్రదక్షిణంగా వెళ్ళినప్పుడు మనలో ఉండే అరిషట్ వర్గాలని మనం అక్కడ బలి ఇస్తున్నట్లుగా సంకల్పం చేసుకుని ముందుకు సాగాలి.

శివాలయంలో పురుషులకి ప్రత్యేకమైన వస్త్రధారణ నిర్దేశించబడింది. పురుషులు కేవలం పంచె మాత్రమే ధరించి, పైన ఉండే ఉత్తర్వ్యంని నడుముకు కట్టుకొని మాత్రమే ప్రదక్షిణాలు చేయాలి. అలా ఎవరైతే చేస్తారో వారిపట్ల పరమశివుడు అత్యంత ప్రసన్నుడవుతాడు. ముందుగా చెప్పినట్లు పదఘట్టన వినకూడదు జాగ్రత్త. మీరు శివాలయంలో ఎట్టి పరిస్థితులలోనూ విభూధిని కాని, బిల్వపత్రాలని కాని, కుంకుమను కాని, ప్రసాదాన్ని కాని ఎట్టి పరిస్థితులలో నందీశ్వరుడి మీద పెట్టకూడదు. సాధారణంగా చాలామంది నందిమీద విభూధిని, బిల్వఆకులను వేస్తూ ఉంటారు. అది మహాపాపంగా పరిగణించబడింది.

అష్టలక్ష్మీ స్వరూపాలు

భక్తాభీష్ట ప్రదాయిని, ధర్మసంవర్ధిని అయిన జగన్మాత శ్రీమహాలక్ష్మి అష్టలక్ష్మీ రూపాల్లో ఈ జగత్తుని పరిపాలిస్తోంది. విష్ణుమూర్తి ధరించిన మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన, పరుశురామ, రామ, కృష్ణ, బుద్ధ, కల్క్యావతారాలు ఏ రకంగా జగత్కల్యాణానికి ఉద్దేశింపబడ్డాయో, అలాగే విష్ణువు పత్నియైన లక్ష్మీదేవి అవతారాలు కూడా జగత్కల్యాణ కారకాలే. స్థితి కార్య నిర్వహణలో లక్ష్మీనారాయణులు ఇరువురూ సమాన బాధ్యతలని వహిస్తారు. ధర్మ సంరక్షణ, సమాజ సంక్షేమం కోసం దుష్టశిక్షణ చేసి శిష్టరక్షణ చేశాడు నారాయణుడు. సమాజం వ్యక్తుల సమూహం కాబట్టి ఆయా వ్యక్తుల సంరక్షణకోసం, అభివృద్ధి కోసం, ఉన్నతి కోసం లక్ష్మీదేవి అష్టలక్ష్మీ రూపధారణ చేసింది. 

ఒక మాతృమూర్తి తన కన్నా బిడ్డలని సరైనమార్గంలో పెంచటం కోసం రోజూ ఎన్నో రకాల అవతారాలను ఎత్తుతుంది. వాత్సల్యపూరితంగా అనునయిస్తునే తప్పు చేస్తే దండిస్తుంది. మనకి విద్యాబుద్ధులు నేర్పిన ప్రథమగురువు అయిన ఆ తల్లే అవసరమైప్పుడు ధైర్యాన్ని నూరిపోసి వీరత్వాన్ని వృద్ధి చేస్తుంది. ముఖ్యంగా ధర్మచింతన, యుక్తాయుక్త విచక్షణా జ్ఞానం, కరుణ, జాలి, వివేకం ఇవన్నీ ఆ అమ్మ పెట్టిన భిక్షలే. ఒక సాధారణ మాతృమూర్తే తన పిల్లల కోసం ఇంత కష్టపడుతూవుంటే, ఆ జగన్మాత లక్ష్మీదేవి సంగతి చెప్పాలా, అనేక కోట్ల జీవరాశులలో ఎవరికి ఏ కష్టం వచ్చినా అందరూ ఆ తల్లినే తలుచుకుంటారు. అందరికీ అన్ని రకాల శక్తులను అందించటం కోసం ఈ అష్టలక్ష్మీ రూపాలను ఎంచుకుంది ఆ తల్లి. అన్ని శక్తులను ఒకే రూపంలో యివ్వొచ్చుకదా.

భిన్నత్వంలో ఏకత్వాన్ని చూడగలగటమే మన సంస్కృతి ప్రత్యేకత. నిజానికి పరబ్రహ్మతత్వం నిర్గుణమైనది, నిరాకారమైనది, ఆదిమధ్యంతాలు లేనిది. వాచామగోచరమైనది అని వేదాలు ఘోషిస్తున్నాయి. కాని సాధకుని మనఃస్థితిని దృష్టిలో వుంచుకుని అతని మనస్సంతుష్టి కోసం, ఆ పరబ్రహ్మ తత్వానికి రూపాన్ని అందించటం జరిగింది. నిరాకార పరబ్రహ్మ పైన దృష్టిని నిలిపి ధ్యానం చేయడంకంటే సాకార రూపంపై దృష్టిని నిలిపి ధ్యానం చేయడం సులువు కాబట్టి ప్రాథమిక స్థితిలో సాధకుడికి సాకారరూపం అవసరమవుతుంది. ఆ విధంగా వచ్చినవే త్రిమూర్తులు, ముగ్గురమ్మలూ, అష్టదిక్పాలకులు, నవగ్రహాలు, మొదలైనవి ఒక్కొక్కదేవతామూర్తి ఒక్కో రకమైన శక్తికి ఆదిదేవతగా పురాణాల్లో చెప్పబడింది. శరన్నవరాత్రులలో అమ్మవారిని కొలుస్తాం. శివరాత్రికి పరమేశ్వరుడిని, వైకుంఠ ఏకాదశికి శ్రీమన్నారాయణుని పూజిస్తాం.

గీతాచార్యుడి నుంచి సాయినాథుడి వరకూ దేవుడొక్కడే అని ఎన్నిరకాలు బోధించినా ఈ రకమైన బహు దేవతారాధన సమాజంలో నెలకొని వుండడానికి కారణం అనాది నుంచీ మనలో నెలకొని వున్న ప్రగాఢ భక్తి విశ్వాసాలే. ఎక్కడ విశ్వాసం వుందో అక్కడే ఫలితం కన్పిస్తుంది. ఆధునిక సమాజంలో కూడా వేరువేరు పనులకి వేరువేరు వ్యక్తుల వద్దకి వెళ్ళి సలహా పొందుతూ వుంటాం. ఏ రంగానికి సంబంధించిన విషయాల్ని ఆ రంగానికి సంబంధించిన నిపుణుల్ని అడిగి తెలుసుకుంటాం.. బహు దేవతారాధన కూడా ఇలాంటిదే. సరైన చిరునామా రాస్తేనే మన అర్జీ సరైన చోటికి వెళ్ళి సమాధానం వస్తుంది. లేదంటే ఎప్పటికో రావొచ్చు. లేక రాకపోనూవచ్చు. దేవతల విషయంలో ఈ సామ్యం వర్తిస్తుంది. ఇంతకుమించిన ఎన్నో వేదాంత విజ్ఞాన రహస్యాలు ఈ దేవతారూపాలలో నిబిడీకృతమై వున్నాయి.

శ్రీ మహాలక్ష్మీదేవి అష్టలక్ష్మీ రూపాల్లో జగత్తుకి సమస్త రకాలయిన శక్తుల్ని, పరిపుష్టిని ప్రసాదిస్తోంది. ప్రాణులకు మూలాధారమైన శక్తిప్రాణశక్తి. ఆ శక్తిని ప్రసాదించే తల్లి ఆదిలక్ష్మీదేవి. శారీరక, మానసిక ఆరోగ్యాలు పరిపూర్ణంగా వుండాలంటే ఆదిలక్ష్మీదేవి అనుగ్రహం వుండాలి. పుట్టిన బిడ్డకి స్తన్యాన్ని అందించి ఆకలి తీర్చి తన పొత్తిళ్ళలో పెట్టుకుని కాపాడేది మన మాతృమూర్తి. అలాగే మనకి అవసరమైన ఆహారాన్ని సమకూర్చేది ధాన్యలక్ష్మీదేవి. సమస్త రకాలైన ధాన్య సంపదని, పాడిపంటలనీ ప్రసాదించే ఈ తల్లి అనుగ్రహం వల్ల శరీరానికి ధారుఢ్యం, బలం చేకూరుతాయి. శరీర వృద్ధికి ఈ తల్లి అనుగ్రహం అవసరం. కార్యం సాధించాలంటే కేవలం శారీరక బలం చాలదు. దైర్యసాహసాలు, మనోబలం కావలి. వీటిని ప్రసాదించే ధైర్యలక్ష్మీదేవి. అవసరమైన సామయమ్లో ధైర్యం ప్రసాదించి మనల్ని కార్యసాధకులని చేస్తుంది ఆ తల్లి. సకల శుభకారిణి గజలక్ష్మీదేవి. మనం సాధించిన విజయం శుభకారిణి అయ్యేలా అనుగ్రహిస్తుంది. శుభం అంటే మనకి మాత్రమే మంచిదని కాదు. సమాజహితానికి కారణభూతమయ్యేది, మన విజయం వల్ల అందరూ సుఖపడాలి అదే నిజమైన శుభం.

ముత్తయిదువలు వైభవ లక్ష్మీ రూపంలో గజలక్ష్మిని పూజించి అఖండ సౌభాగ్యాన్ని పొందుతారు. జీవితంలో మనం అభివృద్ధి సాధిస్తే సరిపోదు. మన ఆనందంలో పాలు పంచుకోవడానికి పిల్లలు కావాలి. వాళ్ళు మంచి విద్యాబుద్ధులు కలిగి వుండాలి. మన జ్ఞానవిజ్ఞాన ఆచార సంస్కృతీ వైభవాలని ముందు తరానికి తీసుకెళ్ళాలి. అటువంటి సత్సంతనాన్ని ప్రసాదించేది సంతానలక్ష్మీ. సర్వేసర్వత్రా మనకి విజయాన్ని ప్రసాదించేది విజయలక్ష్మీ మాత. మనం ఏ ఉద్దేశ్యంతో ఒక కార్యాన్ని చేస్తామో ఆ లక్ష్యం నెరవేరేలా ఈ తల్లి అనుగ్రహిస్తుంది. ఈ రకంగా ఆరువిధాల శక్తులను అనుగ్రహించిన ఆ జగన్మాత మనకి సద్ వివేచన, విద్యాబుద్ధులకి తగిన గుర్తింపు కలిగి సంఘంలో గౌరవం, భోగభాగ్యాలు కలుగుతాయి. అష్టమ అవతారమైన ధనలక్ష్మీ రూపంలో ఆ తల్లి మనకు సకలైశ్వర్యాలను అనుగ్రహిస్తోంది. అంతేకాక శాశ్వతమైన భక్తి, జ్ఞాన, వైరాగ్యాలను ముక్తినీ కూడా ప్రసాదిస్తుంది. జీవితంలో అందరికీ ఏదో ఒక దశలో సమస్యలు వస్తాయి. ఆయా సమస్యల పరిష్కారం కోసం అశాశ్వతమైన వ్యక్తులను, వ్యవస్థలను నమ్ముకోవడం కంటే ఆ లక్ష్మీమాతనే నమ్ముకోవడం అత్యంత ఉత్తమం. మన మనస్సు నడవడిక మంచిదయితే ఆ తల్లి తప్పక కరుణిస్తుంది.

వరలక్ష్మి వ్రత కధ

వరలక్ష్మి వ్రత కధలో స్త్రీ పేరు చారుమతి. చారుమతి అంటే మంచి మనసు కలది అర్ధం. ఆమె నిత్యం భర్తను దైవంగా భావించి సేవలు చేసేది. ఏ రోజు భర్తను కించపరిచేది కాదు. రోజు ఉదయమే నిద్రలేచి స్నానం పూర్తిచేసుకునేది. అత్తమామలను ప్రేమతో ఆదరించి, సపర్యలు చేసేది. ఇంటి పనుల విషయంలో ఓర్పుతో, నేర్పుతో మెలుగుతూ, ఎవరితోనూ గొడవ పడకుండా, అందరితోనూ సఖ్యతగా మెలిగేది. ఇన్ని మంచి లక్షణాలు ఉన్నాయి కనుకనే చారుమతిని అనుగ్రహించాలాని శ్రీ మహాలక్ష్మీ భావించి, కలలో కనిపించింది. ఇవేమి చేయకుండా, కేవలం లక్ష్మీపూజ మాత్రమే చేస్తాము, అత్తమామలను, తల్లిదండ్రులను చూసుకోము అనుకునేవాళ్ళ పట్ల లక్ష్మీదేవి దయ చూపదని
ఈ కధ ద్వారా గ్రహించాలి.

అమ్మవారి కలలో కనిపించి చెప్పిన వ్రతవిధానం తాను మాత్రమే ఆచరించి సంపద పొందాలని చారుమతి భావించలేదు. ఇరుగుపొరుగు వారందరికి తన స్వప్న వృత్తాంతం చెప్పింది. అందరితో కలిసి వరలక్ష్మీ వ్రతం ఆచరించింది. కేవలం తన స్వార్ధం మాత్రమే చూసుకోలేదు. అందరూ బాగుండాలని తలచింది. అందుకే పూజ ఫలిచింది. లక్ష్మీకటాక్షం కలగాలంటే ముందు స్వార్ధం త్యజించాలన్నది వరలక్ష్మీ కధ సారాంశం.

అందరి కోసం కోరింది కనుకనే అమ్మవారు కరుణించింది. ఎవరు అందరూ బాగుండాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటారో, వారికి కోరకుండానే వరాలిస్తాడు పరమాత్ముడని గ్రహించాలి.
నిత్యం 'లోకాసమస్తాః సుఖినోభవంతుః'(సమస్త లోకాలు బాగుండలి)
అని ప్రార్ధించాలి.

ఓం నమో లక్ష్మీనారాయణాయ

హనుమత్ స్తవః


గోష్పదీకృత వారాశిం మశకీకృత రాక్షసమ్,
రామాయణమహామాలా రత్నం వందే నిలాత్మజమ్.

అంజనానందనం వీరం జానకీ శోకనాశనమ్,
కపీశ మక్షహంతారం వందే లంకాభయంకరమ్.


కబళీకృతమార్తాండం గోష్పదీకృత సాగరమ్,
తణీకృత దశగ్రీవం ఆంజనేయం నమామ్యహమ్.

ఉల్లంఘ్య సింధో స్సలిలం సలీలం,
యః శోకవహ్నిం జనకాత్మజాయాః
ఆదాయ తేనైవ దదాహ లంకాం
నమామి తం ప్రాంజలి రాంజనేయమ్.

ఆంజనేయ మతిపాటలాననం
కాంచనాద్రి కమనీయ విగ్రహమ్,
పారిజాత తరుమూల వాసినం
భావయామి పవమాన నందనమ్.

యత్ర యత్ర రఘునాథ కీర్తనం
తత్ర తత్ర కృత మస్తకాంజలిమ్,
బాష్పవారి పరిపూర్ణలోచనం
మారుతిం నమత రాక్షసాంతకమ్.

మనోజవం మారుతతుల్యవేగం
జితేంద్రియం బుద్ధిమతాం వరిష్ఠమ్,
వాతాత్మజం వానరయూథముఖ్యం
శ్రీరామదూతం శిరసా నమామి.

త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ,
హనుమన్ యత్న మాస్థాయ దుఃఖక్షయకరో భవ.

శ్రీ జానకీశోకహర్తా హరి మర్కట మర్కటః,
లక్ష్మణప్రాణదాతా చ పాయాన్మాం రామకింకరః.

బుద్ధిర్బలం యశో ధైర్యం నిర్బయత్వ మరోగతా,
అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాత్ భవేత్.

దూరీకృత సీతార్తిః
ప్రకటీకృత రామవైభవస్ఫూర్తిః,
దారిత దశముఖకీర్తిః
పురతోమమ భాతుః హనుమతో మూర్తిః

ఇతి శ్రీ హనుమత్ స్తవః

హరిహరసుతుడు అయ్యప్పస్వామి

కలియుగంలో మనిష్యులను ఉద్దరించడానికి భగవంతుడు ఎన్నో అవతారాలను ధరించాడు. అటువంటి అవతారమే హరిహరసుతుడు అయ్యప్పస్వామి.

అయ్యప్పస్వామి కరుణాకటాక్షాలకోసం దీక్ష పూని, ఓ మండలంరోజుల పాటు ఆ దీక్షను కొనసాగించి,తర్వాత ఇంట్లో పూజచేసి, అఖండదీపాన్ని వెలిగించి, ఆత్మదీప దర్శనం కోసం ఇరుముడిని ధరించి శబరిమలయాత్రను ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా కొంతమంది అయ్యప్ప స్వామికి మండలదీక్ష (48 రోజులదీక్ష) ఎందుకు? ఒకరోజు, ఐదురోజుల దీక్ష కూడ చేయవచ్చుగా అని అడుగుతున్నారు. అడగడమే కాదు, ఆ పద్దతుల్లో దీక్షలు చేపట్టి జ్యోతి దర్శనానికి బయలుదేరుతారు. ఆ వాదప్రతివాదనలను అలా వుంచితే, మండలదీక్షలో ఓ గూఢార్థం ఉంది. మనిషి పుడుతున్నప్పుడు, అప్పుడున్న నక్షత్రస్థితి, రాశిస్వభావం, ఇంకా అప్పటి గ్రహస్థితులు, ఆ మనిషి భవిష్యత్తు జీవితాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ఆ దృష్టితో చూసినప్పుడు


నక్షత్రాలు - 27
రాశులు - 12
గ్రహాలు - 09
మొత్తం - 48

వీటి ప్రభావం నుంచి తప్పుకుని, భగవానుని పాదపద్మాలను ఆశ్రయించి, ఆత్మసాక్షాత్కారమనే జ్యోతి దర్శనానికే 48 రోజుల దీక్ష చేస్తున్నాం. ఇదే మండలదీక్షలోని అంతరార్థం. అందుకే మండలకాలంపాటు దీక్ష.

భగవంతుడు ఒక్కడే

భగవంతుడు ఒక్కడే కానీ రూపాలు వేరువేరుగా ఉంటాయియని మనకు తెలుసు .బ్రహ్మదేవుడనగానే నాలుగు ముఖాలతో కమలాసనం మీద కూర్చున మూర్తి కళ్ళకు కడుతుంది .
విష్ణువు నాభిలో తామరపువ్వుతో లక్ష్మీదేవి సరసన ఉండగా శేషతల్పం మీద శయనించి ఉంటాడు .శంఖం ,చక్రం ,గదమొదలైనవి అయన చిహ్నాలు .శరీరం నిండా భస్మం అలుదుకొని ఉంటాడు .సర్పాన్ని హారంగా వేసుకుంటాడు .చర్మా౦బరం కట్టుకుంటాడు.ఒక్కోసారి దిగంబరంగాను ఉంటాడు .రుద్రాక్ష మాల వేసుకుని ఉంటాడు .కుడి చేతిలో జపమాల ఉంటంది .అయన నంది వాహనుడు .ఇవన్ని శివుడి చిహ్నాలు.

'లిం 'అంటే మాములు చూపులకు కనిపించకుండా లోపల ఉన్నదానిని ,అంటే 'లీన'మై ఉన్నదానిని 'గం '(గమయంతి )అంటే ఒక గుర్తు రూపంలో తెలియజేస్తుంది కనుక అది.'లింగ 'మై౦దన్నమాట. పన్నెండు తావులు -పన్నెండురూపాలు పరమేశ్వరుడు పరిపూర్ణుడు .అయన అంతటా ఉంటాడు.అన్ని తెలసి ఉంటాడు .అటువంటి పరిపూర్ణ రూపంలో ఉన్నప్పుడు ఆయనకు ఆకారం ఉండదు .ఇతరులకు తనూ కనిపిచాలనుకున్నప్పుడు అంబతో కలసి (సాంబ )కనిపిస్తాడు .ఆయనే సాంబమూర్తి .

రూపంలేని స్తితి నుంచి సాంబమూర్తిగా మారడానికి మధ్యలోఇంకో రూపం ఉంది .దానిని 'ఆరూపం 'అంటారు .అదే శివలిగం . మొట్టమొదట్ట పరమేస్వారుడు జ్యోతిర్మయలింగాకారంలో అవతరించాడు .దాని మొదలు .తుది కనుక్కోవడంలో బ్రహ్మవిష్ణువులు కూడా భంగపడ్డారు .ఈ జ్యోతిర్లింగావిర్భావం జరింగింది అర్ధరాత్రి సమయంలో !అదే శివరాత్రి అయింది .

ఈ ఆవిర్భావకాలాన్నేలింగోద్భవ కాలం అంటారు .జ్యోతిర్లింగాలుమన దేశంలో పన్నెండు చోట్ల తాను వ్యాపించి ఉంటానని ,ప్రత్యేకించి పన్నెండు చోట్ల పన్నెండురూపాలలో ఉంటానని శివుడంటాడు.అవే ద్వాదశజ్యోతిర్లింగాలు. ఈ బ్రహ్మ౦డమే జ్యోతిర్లింగ౦. అదే హిరణ్యగర్బుడు కూడా.ఈ జ్యోతిర్లింగా౦ ప్రకటితమవడమే సృష్టి మనకు తెలిసిన కాలము ,ప్రదేశము అనే పరిమితులకు అతీతంగా పరమసత్యంగా భాసించే పరమాత్మ రూపమే జ్యోతిర్లింగ౦.

అయిదు రకాల లింగాలు శివలింగాలను అయిదు రకాలుగా చెబుతారు .వాటిలో మొదటిది స్వయంభులింగం ,అంటే తనంతట తానుగా అవతరించింది .రెండోవది బిందులింగం.ఇది ధ్యాన పూర్వకమైనలింగం.మూడోది ప్రతిస్టాలింగం,ఆగమశాస్త్ర పద్దతిలోమంత్రపూర్వకంగా ప్రతిష్టి౦చినది.నాలుగోవది చరలింగం .దీనిని అభ్యాత్మిక లింగంమని కూడా అంటారు .అయిదోవది గురులింగం .శివుని విగ్రహమే గురులింగం.

ఆరు రకాల ద్రవ్యాలు అష్టాదశ పురాణాలలో ఒకటైన 'లింగపురాణం 'శివలింగం మహిమను సమగ్రంగా వివరిస్తుంది .ఈ పురాణం ప్రకారం ,దేవశిల్పి అయిన విశ్వకర్మ కరకాల వస్తువులతో లింగాలను తయారు చేసి దేవతలకు ఇస్తూ ఉంటాడు .ప్రధానంగా లింగాలు ఆరు రకాల పదార్థాలతో తయారుచేస్తారు .

అవి:

రాతితో తయారు చేసే శైలజ లింగాలు లేదా శిలాలింగాలు ,రత్నాలు,వజ్రలు మొదలైన వాటితో తయారు చేసేవి రత్నాజలింగాలు లోహ లేదా ధాతాజలింగాలు ,మట్టితో చేసేవి మృత్తికాలింగాలు,అప్పటికప్పుడు దేనితోనైన తయారుచేసేవి క్షణిక లింగాలు ,చెక్కతో తయారు చేసేవి దారుజ లింగాలు. ఎవరు ఏ లింగాలని పూజించాలి లింగ పురాణం ప్రకారం బ్రహ్మవేత్తలు రసలింగాన్నీ శౌర్య ప్రధానులైన క్షత్రియులు బాణలింగాన్నీ,వాణిజ్య ప్రధానలైన వైశ్యులు స్వర్ణలింగాన్నీఅర్చించాలి .

స్పటిక లింగాన్నిమాత్రం ఎవరైనా అర్చించవచ్చు.స్త్రి విషయాని కొస్తే ,భర్త జీవించి ఉన్నవారు స్పటికలింగాని ,భర్త జీవించి లేనివారు స్పటికలింగాన్ని కానీ రసలింగాని కాని అర్చిస్తే మంచిదని లింగ పురాణం చెబుతోంది .స్త్రి లలో అన్ని వయస్సుల వారు స్పటిక లింగాన్ని అర్చించవచ్చు. ఏలింగాన్ని పూజ ఏ ఫలితం? ఏ లింగాన్ని పూజించడం వల్ల ఏఫలితముంటు౦దొకూడా లింగ పురాణం వివరించింది.

ఉదాహరణకు రత్నాజ లింగాన్నిపూజిస్తే ఐశ్వర్య౦ ,వైభవం సిద్దించి పరిపూర్ణత కలుగుతుంది .ధాతుజలింగం భోగ విలాసాలనిస్తుంది .మృత్తికాలింగం కూడా శిలా లింగంలాగానే పరిపూర్ణతనునిస్తుం ది.కాల్చిన మట్టితో చేసిన లింగం శ్రేష్టమైనది .అన్నిటిలోకి ఉత్తమం శిలా లింగం ,మధ్యమం లోహ లింగం . అతి పవిత్ర బాణలింగం అన్ని రకాల లింగాలలోనూ అత్యంత పవిత్రమైనది బాణలింగాలు .ఇవి నర్మదానదిలో ఎక్కువగా లభిస్తాయి .ఇవి తెల్లాగా ,చిన్నగా అండాకారంలో నదీ ప్రవాహం వల్ల సహజంగా నునుపుదేలి ఉంటాయి.

రత్నాజ లింగాలలో ఏ లింగాన్ని ఏ మాసంలో పూజిస్తే ఉత్తమ ఫలితం లభిస్తుందో కూడాలింగ పురాణం చెప్పింది .వైశాఖంలో వజ్రలింగాన్ని ,జ్యేష్ట౦లోమరకత లింగాన్ని,శ్రావణంలో నిలపు లింగాన్ని ,భద్రపదంలో పద్మరాగ లింగాన్ని ,ఆశ్వయుజంలో గోమేధికలింగాన్ని ,కర్తికంలో ప్రవాళలింగాన్ని ,మార్గశిరంలో వైడూర్య లింగాన్ని పుష్యమాసంలో పుష్పరాగ లింగాన్ని ,మాఘమాసంలో సూర్యకాంత లింగాన్ని ,ఫాల్గుణ౦లో స్పటిక లింగాన్ని పూజించాలి .వీటికి ప్రత్యామ్నాయంగా వెండి ,రాగి లింగాలను కూడా పూజించవచ్చు.

స్తావర,జంగమ లింగాలు జగత్తంతా శివమయం ,అంటే లింగమయమే .బ్రహ్మ౦డమే లింగరుపమైనప్పుడు ,సృష్టి స్తితిలయలన్నింటికి లింగమే ఆధారమైనప్పుడు సృష్టిలో స్తావరాలు (కదలనవి-పర్వతాలు ,చెట్లు మొదలైనవి )జంగమాలు(కదిలేవి -మనుషులు.జంతువులు,పక్షులు ,క్రిమికీటకాలు మొదలైనవి )కూడాలింగ రూపాలే అవుతాయి .వీటికి స్తావర లింగాలు అంటారు .వీటిని పూజించడం ,సేవిచడం కూడా శివపుజలోకే వస్తుంది.

లింగ పూజ చేసేవారు ఉత్తర ముఖంగా కూర్చోవాలని,రుద్రాక్ష ,భస్మం ,మారేడు అనే మూడువస్తువులు వారి వద్ద తప్పనిసరిగా ఉండాలని శివపురాణం చెబుతోంది.

నృసింహస్తుతి

లక్ష్మీకటాక్షసరసీరుహరాజహంస
పక్షీంద్రశైలభవనం భవనాశమీశం
గోక్షీరసార ఘనసార పటీరవర్ణం
వందే కృపానిధిం అహోబలనారసింహం

ఆద్యంతశూన్యమజమవ్యయ మప్రమేయం
ఆదిత్యచంద్రశిఖిలోచన మాదిదేవం
అబ్జాముఖాబ్జ మదలోలుప మత్తభ్రుంగం
వందే కృపానిధిం అహోబలనారసింహం

కోటీరకోటి ఘటికోజ్జ్వల కాంతికాంతం
కేయూరహారమణికుండల మండితాంగం
చూడాగ్రరంజిత సుధాకరపూర్ణబింబం
వందేకృపానిధిం అహోబలనారసింహం



వరాహవామననృసింహసుభాగ్యమీశం
క్రీడావిలోలహృదయం విభుదేంద్రవంద్యం
హంసాత్మకం పరమహంసమనోవిహారం
వందేకృపానిధిం అహోబలనారసింహం

మందాకినీ జననహేతుపదారవిందం
వృందారకాలయ వినోదనముజ్జ్వలాంగం
మందారపుష్పతులసీరచితాన్ఘ్రిపద్మం
వందే కృపానిధిం అహోబలనారసింహం

తారుణ్యకృష్ణతులసీదళదామరాభ్యాం
దాత్రీరమాభిరమణం మహనీయరూపం
మంత్రాదిరాజ మతదానవమానభంగం
వందేకృపానిధిం అహోబలనారసింహం

నవగ్రహ పీడాహర స్తోత్రం

గ్రహాణామాది రాదిత్యోలోక రక్షణ కారకః
విషయ స్థాన సంభూతాం పీడాం హరతుమే రవి:
రోహిణీ శస్సుధామూర్తి స్సుధాగాత్రస్సురాళనః

భూమిపుత్రో మహాతేజా జగతాం భయకృత్నదా
వృష్టికృదృష్టి హర్తాచ పీడాం హరతు మేకుజః

ఉత్పాత్రూపోజగతాం చంద్రపుత్రో మహాద్యుతిః
సూర్యప్రియకరో విద్వాన్ పీడాం హరతుమే బుధః

దేవమంత్రీ విశాలాక్షః సదాలోకహితేరహః
అనేక శిష్య సంపూర్ణః పీడాం హరతుమే గురుః

దైత్యమంత్రీ గురుస్తేషాం ప్రాణదశ్చమహామతిః
ప్రభుస్తారాగ్రహాణాంచ పీడాం హరతుమే భ్రుగుః

సూర్యపుత్రో దీర్ఘదేహో విశాలాక్ష శివప్రియః
మందచారః ప్రసన్నాత్మా పీడాం హరతుమే శనిః

మహాశ్రీరామ మహావక్త్రో దీర్ఘదంస్త్రో మహాబలః
అతనుశ్చోర్ధ్వకేశశ్చ పీడాం హరతుమే శిఖీ

అనేక రూప్వర్వైశ్చ శతశో ధసహస్రశః
ఉత్పాతరుజోజగతాం పీడాం హరతుమే తమః

సరస్వతీస్తోత్రం....

యా కుందేందు తుషారహారధవళా యా శుభ్రవస్త్రావృతా
యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా |
యా బ్రహ్మాచ్యుతశంకరప్రభృతిభిర్దేవైస్సదా పూజితా
 సా మాం పాతు సరస్వతీ భగవతీ నిశ్శేషజాడ్యాపహా..

సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి |
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా

సరస్వతి నమస్తుభ్యం సర్వదేవి నమో నమః |
శాంతరూపే శశిధరే సర్వయోగే నమో నమః

పిల్లలు చేత రోజు ఈ శ్లోకం చదివించండి....

మట్టి గణపతి మోరియా


మహా గణపతి పూజ వెనుక అనేక పర్యావరణ సూత్రాలను మన పూర్వీకులు పొందుపరిచారు. వినాయక చవితి పూజా విధిలో ఈ సూత్రాలను పాటిస్తుంటాం.

-కొత్త మట్టితో వినాయకున్నితయారు చేయడం 


 -ఇరవై ఒకటి పత్రాలతో పూజ చేయడం


-నవరావూతుల అనంతరం పత్రితో సహా వినాయక ప్రతిమను నిమజ్జనం చేయడం. 


శివపార్వతుల ముద్దుబిడ్డ వినాయకుడు. ఆయన జన్మంలోనే పర్యావరణ రహస్యం దాగుంది. నలుగు పిండితో తయారైన బొమ్మకు ఆది శక్తి పార్వతీదేవి ప్రాణవూపతిష్ఠ చేసింది. అనంతరం ఏనుగు తలను అతికించి ఆది దేవుడు పరమేశ్వరుడు పునః ప్రాణ ప్రతిష్ఠ చేశారు. ఆనాటి నుంచి యుగాలు మారుతున్నా, కాలం మార్తున్నా మహాగణపతి పూజలందుకుంటూనే ఉన్నాడు. సమాజంలో అనేక వర్గాల వారుంటారు. వారందరినీ కలిపి మానవత్వమే మహా మతం అన్న ఏకైక నినాదంతో కూడుకున్నదే మహాగణపతి పూజ. ఈ సృష్టిలో సర్వజీవులు సమానమే అని చాటిచెప్పడమే వినాయక జనన రహస్యం. మానవరూపంలో ఉన్న వినాయకునికి ఏనుగు తలను అమర్చడం, మూషికుడిని (ఎలుకను) వాహనంగా అమర్చడంలోనే సర్వవూపాణులు సమానమనే అర్ధం చెబుతోంది. హారంగా ఔషధ మొక్కల ఆకులు తినడంలోనే పర్యావరణ రహస్యం దాగుంది.

మట్టి వినాయకుడు-అసలు రహస్యం
వినాయకుడి విగ్రహాన్ని కొత్త మట్టితోనే చేయాలని మన పూర్వీకులు చెప్పేవారు. కొత్త మట్టి అంటే తొలకరి జల్లులు పడిన తర్వాత మట్టి వాసన వెదజల్లే సమయంలో తీసిన మట్టి అని అర్ధం. ఈ మట్టిని వినాయక చవితికి ముందే అంటే వర్షాకాలం ఆరంభానికి ముందే తవ్వితీస్తారు. మట్టి తవ్వాలంటే సహజంగానే ఎవరైనా చెరువులు, కుంటల దగ్గరకు వెళతారు. అలా చేయాలనే ఈ పనిని పెద్దలు పురమాయించారని చెబుతుంటారు. వర్షాకాలం వచ్చిందంటే చాలు చెరువులు, వాగులు, కుంటలు నిండిపోతాయి. మరీ ఎక్కువగా వానలు పడితే పక్కనే ఊర్లు కూడా మునిగిపోతాయనే ఆలోచన చేసేవాళ్లు. అందుకే అలా జరుగకుండా ఉండాలంటే చెరువులు, కుంటల్లో పూడికలు తీయాలి. నీరు నిల్వ ఉండాలే కానీ అవి ఊర్ల మీద పడకూడదని భావించేవారు. వానల వల్ల మట్టి కొట్టుకెళ్లి చెరువుల్లో చేరిపోతుంటుంది. కాబట్టి ముందుగా పూడిక తీయాల్సిందే. ఆ పని పూర్వం రోజుల్లో గ్రామస్తులే చేసేవారు. అలా చేసేందుకు ఉత్సాహంగా ఆ పని పూర్తి చేసేందుకు మత పెద్దలు వినాయక ప్రతిమలను మట్టితోనే చేయాలన్న నిబంధన పెట్టారు.

పత్రిపూజ-రహస్యం
గణనాథుడ్ని 21 పత్రితో పూజించడం ఆచారంగా వస్తుంది. అలా తొమ్మిది రోజులు చేయమని శాస్త్రం కూడా చెబుతోంది. పత్రి పూజకు మనం ఎంచుకునేవి మామూలు ఆకులు కాదు. అవి ఔషధ మొక్కలకు సంబంధించిన ఆకులు. అందుకే వ్రతకల్పంలో పేర్కొన్న పత్రాలతోనే పూజించాలే కానీ వేరే వాటితో చేయకూడదు. ఔషధపవూతాల నుంచి విడుదలయ్యే ఔషధ గుణాలు గాలిలో కలిస్తాయి. దీంతో ఊర్లో అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. వైరస్, బాక్టీరియా వంటి వాటి వల్ల ఇబ్బందులు పోతాయి. ఇలా తొమ్మిదిరోజులు చేయడమన్నది వైద్యుల పరిభాషలో చెప్పాలంటే ఒక కోర్సు. ఏ మందైనా డాక్టర్ ఇచ్చేటప్పుడు మూడు రోజులో, వారం రోజులో వాడమని చెప్పినట్లుగానే పూర్వీకులు పత్రిలోని ఔషధ గుణాలతో ఊరు బాగుపడాలంటే తొమ్మిది రోజులు పూజలు చేయమని చెప్పారని చెబుతుంటారు.

నిమజ్జనం-అసలు రహస్యం
నవరావూతుల తర్వాత వినాయక ప్రతిమను సమీపంలోని చెరువులోనో, లేదంటే కుంటలోనూ నిమజ్జనం చేయడం కూడా ఆచారంగానే వస్తుంది. చెరువులు, కుంటలు లేని చోట బావిలోనే నిమజ్జనం చేయవచ్చు. 21 రకాల పత్రి, ప్రతిమలోని మట్టి నీటిలో కలిశాక 23 గంటలకు తమలోని ఔషధ గుణాలున్న ఆల్కలాయిడ్స్‌ను నీళ్లలోకి వదిలేస్తాయి. ఈ ఆల్కలాయిడ్స్ వల్ల నీళ్లలోని ప్రమాదకరమైన బ్యాక్టీరియా నశిస్తుంది. ఆక్సిజన్ శాతం పెరుగుతుంది. ఇదే వినాయక నిమజ్జనం వెనుక దాగి ఉన్న పర్యావరణ పరమ రహస్యం.

వినాయక పూజలో ఉన్న విశిష్టతల విశేషాలు.

వినాయక పూజలో ఉన్న విశిష్టతల విశేషాలు. ఏకవింశతి పత్ర పూజ ఏకవింశతి అంటే 21 రకాలు. వీటి వివరాలు - అవి ఆరోగ్యానికి ఉపయోగపడే విధానం:

1.బృహతి పత్రం (వాకుడు ఆకు) :- ఇది ఉబ్బసాన్ని తగ్గిస్తుంది

2.మాచి పత్రం (మాచి ఆకు ):- ఒతిడిని తగ్గించి మానసిక ఉల్లాసాన్ని ఇస్తుంది.
 

3.బిల్వపత్రం (మారేడు ఆకు) :- మధు మేహం,విరేచనాలకు విరుగుడుగా పని చేస్తుంది.

4.దూర్వ పత్రం (గరికె గడ్డి) :- రోగ నిరోధకంగా పని చేస్తుంది.

5.దత్తుర పత్రం (ఉమ్మేత):- ఊపిరితితులను వ్యకోచిమ్పచేసి ఉబ్బసం తగ్గేలా చేస్తుంది.

6.బదరి పత్రం (రేగు ఆకు):- చర్మ వ్యాధులకు మంచి విరుగుడు.

7.తుర్యా పత్రం(తులసి):-శరీరంలో ఉష్ణాన్ని నియమ్త్రిస్తుంది. అందుకే ప్రతి ఇంట్లో తులసి చెట్టు ఉండాలి. ఆ గాలికి జలుబు,దగ్గు వంటివి దరి చేరవు.

8.అపామార్గ పత్రం(ఉత్తరేణి): -దగ్గు ,ఉబ్బసంకి బాగా పని చేస్తుంది.

9.చూత పత్రం(మామిడి ఆకు):-నోటి దుర్వాసన,చిగుళ్ళ వాపు వంటి సమస్యల నుంచి ఉపసమనం ఇస్తుంది.

10.జాజి పత్రం(జాజి ఆకు):- చర్మ రోగాలు,స్త్రీ సంభంద వ్యాధులకు మంచిది.

11.గండకి పత్రం(అడవి మొల్ల యుధిక):- అతిమూత్ర సమస్యనుంచి ఉపసమనం ఇస్తుంది.

12.అశ్వత పత్రం(రావి ఆకు):-చాల ఓషధగుణాలు ఉన్నాయి.

13.అర్జున పత్రం(మద్ది ఆకు):-రక్త స్తంభనం,గుండె ఆరోగ్యానికి ఇది చాల సహాయకారి.

14.అర్క పత్రం(జిల్లేడు ఆకు) :-నరాల బలహీనత ఉన్నవరికిది దివ్య ఒషధం.చర్మ వ్యాధులను నివారిస్తుంది.

15.విష్ణు క్రాంతం(పొద్దు తిరుగుడు ఆకు):-దీనిపై జరిగిన ఎన్నో పరిశోధనలు చెబుతున్న దేమిటంటే ఇది మంచి స్కిన్ కేర్ మందుగా పనిచేస్తుంది.

16.దాడిమ పత్రం(దానిమ్మ ఆకు):- వాంతులు,విరేచనాలు,అరికడుతుంది.శరీరంలో ఉన్నా హానికారక క్రిములను నాశనం చేస్తుంది.

17.దేవదారు(దేవదారు ఆకు):-శరీర వేడిని తగ్గిస్తుంది.

18.మరువాకం(మరువం ఆకు):-మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది.

19.సింధువార పత్రం(వావిలాకు):-కీల్లనోప్పులకు మంచి మందు.

20.శమీ పత్రం(జామ్మీ చెట్టు):-నోటి వ్యాధులను తగ్గిస్తుంది.

21.కరవీర పత్రం(గన్నేరు ఆకు):-గడ్డలు, పుండ్లు తగ్గటానికి దీని వేరు,బెరడు వాడతారు.

రకరకాల పదార్ధాలతో రూపొందిన శివలింగాలు

రకరకాల పదార్ధాలతో రూపొందిన శివలింగాల గురించి పురాణాలు వివిధ సందర్భాల్లో వర్ణించాయి. ఏయే శివలింగాలను పూజిస్తే ఏయే ఫలితాలు కలుగుతాయో చూడండి...

1. గంధలింగం: రెండు భాగాలు కస్తూరి. నాలుగు భాగాలు గంధం, మూడు భాగాలు కుంకుమను కలిపి ఈ లింగాన్ని చేస్తారు. దీనిని పూజిస్తే శివ సాయిజ్యం లభిస్తుంది.

2. పుష్పలింగం: నానావిధ సుగంధ పుష్పాలతో దీనిని నిర్మిస్తారు. దీనిని పూజిస్తే రాజ్యాధిపత్యం కలుగుతుంది.

3. నవనీతలింగం: వెన్నతో చేసిన ఈ లింగాన్ని పూజిస్తే కీర్తి సౌభాగ్యాలు కలుగుతాయి.

4. రజోమయలింగం: పుప్పొడితో నిర్మించిన ఈ లింగాన్ని పూజించడం వల్ల విద్యాధరత్వం సిద్ధిస్తుంది. శివ సాయుజ్యాన్ని పొందగలం.

5. ధాన్యలింగం: యవలు, గోధుమలు, వరిబియ్యపు పిండితో ఈ లింగాన్ని నిర్మిస్తారు. దీనిని పూజించడం వల్ల సంపదల వృద్ధి, సంతానం కలుగుతుంది.

6. తిలిపిస్టోత్థలింగం: నూగుపిండితో చేసిన ఈ లింగాన్ని పూజిస్తే ఇష్టసిద్ధి కలుగుతుంది.

7. లవణలింగం: హరిదళం, త్రికటుకం, ఉప్పు కలిపి చేసిన ఈ లింగాన్ని పూజిస్తే వశీకరణ శక్తి.

8. కర్పూరాజ లింగం: ముక్తిప్రదమైనది.

9. భస్మమయలింగం: భస్మంతో తయారు చేస్తారు. సర్వ సిద్ధులను కలుగచేస్తుంది.

10. శర్కరామయలింగం: సుఖప్రదం.

11. సద్భోత్థలింగం: ప్రీతిని కలిగిస్తుంది.

12. పాలరాతి లింగం: ఆరోగ్యదాయకం

13. వంశాకురమయ లింగం: వంశవృద్ధిని కలిగిస్తుంది. దీనిని వెదురు మొలకలతో తయారు చేస్తారు.

14. కేశాస్థిలింగం: వెంట్రుకలు, ఎముకలతో తయారు చేస్తారు. ఇది శత్రునాశనం చేస్తుంది.

15. పిష్టమయలింగం: ఇది పిండితో తయారు చేయబడుతుంది. ఇది విద్యలను ప్రసాదిస్తుంది.

16. దధిదుగ్థలింగం: కీర్తిప్రతిష్టలను కలిగిస్తుంది.

17. ఫలోత్థలింగం: ఫలప్రదమైనది.

18. ధాత్రిఫలజాతలింగం: ముక్తిప్రదం.

19. గోమయలింగం: కపిలగోవు పేడతో ఈ లింగాన్ని తయారు చేస్తారు. దీనిని పూజిస్తే ఐశ్వర్యప్రాప్తి కలుగుతుంది. భూమిపై పడి మట్టి కలసిన పేడ పనికిరాదు.

20. దూర్వాకాండజలింగం: గరికతో తయారుచేయబడిన ఈ లింగం అపమృత్యుభయాన్ని తొలగిస్తుంది.

21. వైడూర్యలింగం: శత్రునాశనం, దృష్టిదోషహరం

22. ముక్తాలింగం: ముత్యంతో తయారుచేయబడిన ఈ లింగం ఇష్టసిద్ధిని కలిగిస్తుంది.

23. సువర్ణనిర్మితలింగం: బంగారంతో చేసిన ఈ లింగం ముక్తిని కలిగిస్తుంది.

24. రజతలింగం: సంపదలను కలిగిస్తుంది.

25. ఇత్తడి – కంచులింగం: ముక్తిని ప్రసాదిస్తుంది.

26. ఇనుము – సీసపులింగం: శత్రునాశనం చేస్తుంది.

27. అష్టథాతులింగం: చర్మరోగాలను నివారిస్తుంది. సర్వసిద్ధిప్రదం.

28. తుsసషోత్థలింగం: మారణక్రియకు పూజిస్తారు.

29. స్పటిక లింగం: సర్వసిద్ధికరం, అనుకున్న కార్యాలను సఫలీకృతం చేస్తుంది.

30. సీతాఖండలింగం: పటికబెల్లంతో తయారు చేసింది. ఆరోగ్యసిద్ధి కలుగుతుంది. శివలింగంలో శివశక్తుల సమ్మేళనం జరగడం వలన ప్రచండమైన ఊర్థస్సు ఉద్భవిస్తుంది. దాని ప్రతికూల ఫలితాలు మనపై పడకుండా ఉండేందుకు శివలింగంపై జలధారను పోస్తుండాలి. ఆ దారనుంచి సూక్ష్మమైన ఓంకారం ఉద్భవిస్తుంది. ఇదే నిర్గుణబ్రహ్మ. ఇలా జీవుడు మంత్రపూర్వక ధారాభిషేకం ద్వారానిర్గుణ బ్రహ్మను తెలుసుకుంటాడు

ఏకబిల్వం శివార్పణం

“ఏకబిల్వం శివార్పణం” అని మారేడు దాళలలతో శివుని పూజిస్తారు.
మూడు దళములు కలసి ఒక్క అండముననే ఉండును కావున, దీనికి బిల్వము అని పేరు వచ్చింది. ఈ మూడు రేకులకు ఆధ్యాత్మికంగా,


“పూజకుడు – పూజ్యము – పూజ”,
“స్తోత్రము – స్తుత్యము – స్తుతి”,


“జ్ఞాత – జ్ఞేయము – జ్ఞానము “ అని అర్థాలు చెప్పు చున్నారు. ఈ విధంగా (3×3) మూడు, మూడును వేర్వేరుగా భావించుటయే త్రిపుటిజ్ఞానము, ఇదియే అజ్ఞానము, వేరువేరుగా కనిపించినను, ఆధారకాండము ఒక్కటే అయినట్లు, “ఓ మహాదేవా!” సృష్టి, స్థితి, లయ కారకుడవైన నీవే “మారేడుదళము” నందు మూడు పత్రములుగా వేరువేరుగా వున్నట్లు తోచుచున్నావు.


“పూజకుడవు నీవే, పూజింపబడునది నీవే, పూజాక్రియవు నీవే” – అనే భావంతో అభేదబుద్ధితో పూజించుటయే సరియైన పద్ధతి, మరియు పుణ్యఫల ప్రదము. ఈ విధమైన భావముతో పూజించకుండుటయే అజ్ఞానము మరియు పాపహేతువు. ఈ జ్ఞానరహస్యమును తెలుసుకుని – బిల్వపత్రరూపముతో “త్రిపుటి జ్ఞానమును” నీ పాదములచెంత నేను సమర్పించుచున్నాను. ‘శివోహం – శివోహం ‘ అను మహావాక్య జ్ఞానమును, స్థిరపర్చునదియే బిల్వార్చనయగును.

పవిత్రమగు ఈశ్వర పూజకు ఈ “బిల్వపత్రము” సర్వశ్రేష్ఠమైనది మరియు అతి పవిత్రమైనది. శివార్చన లకు మూడు రేకులతోనున్న పూర్తి బిల్వదళముననే ఉపయోగించవలెను. ఒకసారి కోసిన బిల్వపత్రములు, సుమారు 15 రోజులవరకు పూజార్హత కల్గియుండును. వాడిపోయినను దోషములేదు, కాని మూడురేకులు మాత్రము తప్పనిసరిగా ఉండవలెను.
ఏకబిల్వ పత్రంలోని మూడు రేకులలో ఎడమవైపునది బ్రహ్మ అనియు, కుడీవైపునది విష్ణువనియు, మధ్యనున్నది సదాశివుడనియు, పురాణములలో తెలియుచున్నది. మరియు బిల్వదళములోని ముదుభాగమునందు అమృతమును, వెనుక భాగమున యక్షులును వుండుటచేత, బిల్వపత్రము యొక్క ముందుభాగమును శివునివైపు వుంచి పూజించాలి.


బిల్వవనము కాశీక్షేత్రముతో సరిసమానమైనది అని శాస్త్రములలో తెలుపుచున్నారు. మారేడుచెట్టు వున్నచోట ఆ చెట్టు క్రింద శివుడు ఉంటాడు.

శ్లో!! బిల్వానాం దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం!
అఘోర పాపసమ్హారం ఏకబిల్వం శివార్పణం!


బిల్వపత్రము యొక్క దర్శనంవలన పుణ్యము లభించును, వాటిని స్పృశించుట వలన సర్వపాపములు నశించును. ఒక బిల్వపత్రమును శివునికి భక్తిశ్రధ్ధలతో అర్పించుటవలన, ఘోరాతిఘోరమైన పాపములు సైతము నిర్మూలమగును. ఇట్టి త్రిగుణములు గల బిల్వదళమును నీకు అర్పించుచున్నాను. నన్ను అనుగ్రహింపుము.

బిల్వాష్టకం

త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం
త్రిజన్మపాపసంహారం ఏకబిల్వం శివార్పణం
త్రిశాఖైః బిల్వపత్రైశ్చ అచ్ఛిద్రైః కోమలైః శుభైః
శివపూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం
అఖండ బిల్వ పత్రేణ పూజితే నందికేశ్వరే
శుద్ధ్యంతి సర్వపాపేభ్యో ఏకబిల్వం శివార్పణం
సాలిగ్రామ శిలామేకాం విప్రాణాం జాతు చార్పయేత్
సోమయజ్ఞ మహాపుణ్యం ఏకబిల్వం శివార్పణం
దంతికోటి సహస్రాణి వాజపేయ శతాని చ
కోటికన్యా మహాదానం ఏకబిల్వం శివార్పణం
లక్ష్మ్యాస్తనత ఉత్పన్నం మహాదేవస్య చ ప్రియం
బిల్వవృక్షం ప్రయచ్ఛామి ఏకబిల్వం శివార్పణం
దర్శనం బిల్వవృక్షస్య స్పర్శనం పాపనాశనం
అఘోరపాపసంహారం ఏకబిల్వం శివార్పణం
కాశీక్షేత్రనివాసం చ కాలభైరవదర్శనం
ప్రయాగేమాధవం దృష్ట్వా ఏకబిల్వం శివార్పణం
మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపిణే
అగ్రతః శివరూపాయ ఏకబిల్వం శివార్పణం


ఫలశృతి 


బిల్వాష్టకమిదం పుణ్యం యః పఠేత్ శివసన్నిధౌ
సర్వపాప వినిర్ముక్తః శివలోకమవాప్నుయాత్