Saturday, May 30, 2015

ఏకవింశతి పత్ర పూజ విశిష్టత

 శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం
చతుర్భుజమ్
ప్రసన్నవదనమ్ ధ్యాయే
త్సర్వ విఘ్నోపశాంతయే..

ప్రతి పూజకు ముందు ఈ శ్లోకాన్ని మననం చేసుకుంటుంటాం. ఇందులో వినాయకుని తత్వం నిక్షిప్తమై ఉంది. ’శుక్లాంబరదరమ్’ అంటే తెల్లని ఆకాశం అని అర్థం. తెలుపు సత్వ గుణానికి సంకేతం. ’శుక్లాంబరధరం విష్ణుం’ అంటే సత్వగుణంతో నిండిన ఆకాశాన్ని ధరించినవాడని అర్థం. ’శశివర్ణం’ అంటే చంద్రుని వలె కాలస్వరూపుడని అర్థం. ’చతుర్భుజం’ అంటే ధర్మ, అర్థ, కామ, మోక్షాలనే నాలుగు చేతులతో ప్రసన్నమైన శబ్ద బ్రహ్మమై సృష్టిని పాలిస్తున్నవాడని అర్థం. సర్వవిఘ్నాలను పోగొట్టే విఘ్ననివారకునికి మనసారా నమస్కరిస్తున్నానని ఈ శ్లోకం యొక్క అర్థం. విఘ్నాలను తొలగించి సత్వరఫలాన్ని, శుభములనిచ్చే శుభదాయకుడు గణపతి. హిందువులు జరుపుకునే సర్వశుభకార్యాలలోను విఘ్నేశ్వరుకే అగ్రపూజ.
దేహాన్ని ఆరోగ్యంగా నిలుపుకుంటేనే ధర్మసాధన సాధ్యమవుతుంది. ఈ దృష్టితోనే విజ్ఞులైన మన పూర్వులు మన ఆచారాలలో, సంప్రదాయాలలో ఆరోగ్య సూత్రాలను ఇమిడ్చి, నియమాలను నిర్థారించారు. మన పండుగలు, దైవారాధనలు ఆరోగ్యసూత్రాలతో ముడిపడి ఉన్నాయన్నది నిజం. ఇందుకు వినాయకచవితి పూజ, ప్రప్రథమ ఉదాహ్రణమంటే అతిశయోక్తి కాదు.
వినాయకచవితి రోజున నూనెలేని కుడుములను, ఉండ్రాళ్ళను నివేదించడం మన సంప్రదాయం. వర్షఋతువు కారణంగా
ఆరోగ్యభంగము కలుగకుండా ఉండేందుకు, ఆవిరిపై ఉడికించినవాటిని తినాలని చెప్పేందుకు ఉండ్రాళ్ళ నివేదన. ఆవిరిపై ఉడికినవి సులభంగా జీర్ణమై, పిత్త దోషాలను హరిస్తాయి. నువ్వులు, బెల్లంతో చలిమిడి తయారుచేసి గణపతికి నైవేద్యంగా పెడతాము.నువ్వులు శ్వాసరోగాలను, అధికామ్లం, అజీర్తిని తొలగించి నేత్రరోగాలను రాకుండా చేస్తాయి. బెల్లం జీర్ణశక్తిని కలిగించి, వాత, పిత్త దోషాలను పోగొడుతుంది. మన శరీరానికి ఆరోగ్యాన్ని ఇచ్చే నవధాన్యాలను గమనించిన మన పెద్దలు, వినయకునికి తొమ్మిది(నవ) రోజుల పండుగను ఏర్పాటు చేసి, రోజుకొక ధాన్యంతో ప్రసాదాన్ని పంచే ఏర్పాటు చేసారు.
వినాయకపూజలో పిండివంటలకు, ఫలాలకు ప్రాముఖ్యత ఉన్నప్పటికీ పత్రాలకు ఉన్న ప్రాధాన్యత తక్కువేం కాదు. మన శరీర ఆరోగ్యపరిరక్షణకు కావలసిన పత్రాలు 21 అని గమనించిన మన పెద్దలు, ’ఏకవింశతిపత్రపూజ’ అని పత్రాలతోనే వినాయకుని పూజించే పద్ధతిని ప్రవేశపెట్టారు. శ్రీహరి ఎత్తినవి (10) దశావతారాలైతే, శంకరుని రూపాలు ఏకాదశ (11) కాబట్టి, శివకేశవ అబేధంతో, మొత్తం ఇరవై ఒక్క పత్రాల్తో పూజ జరపాలని చెప్పారు. ఈ పత్రపూజ స్వామికి ప్రీతికరం.
ఈ 21 పత్రాలలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి…
1. మాచీపత్రం
ఇది అన్ని ప్రాంతాలలో లభిస్తుంది. ఆయుర్వేదం ప్రకారం ఇది నులిపురుగులను, కుష్ఠును, బొల్లి, దప్పికను పోగొడుతుంది. త్రిదోషాలను ఉపశమింపజేస్తుంది. ఈ పత్రాలను కాసేపు కళ్ళపై పెట్టుకుని పడుకుంటే నేత్రదోషాలు తగ్గుతాయి. తలపై పెట్టుకుంటే తలనొప్పులు మటుమాయమవుతాయి.. నరాలకు బలాన్నిస్తుంది. ఇది ఘాటైన వాసన కలది కనుక, నాసికా పుటాలు శుభ్రపడతాయి. దీని చూర్ణాన్ని నూనెలో కలిపి ఒంటికి రాస్తే మంచి సువాసన వస్తుంది.
2. బృహతీ పత్రం: వాకుడాకు: నేలమూలిక
దీనిలో తెలుపు, నీలిరంగు పువ్వులు పూసే రెండు రకాలుంటాయి. ఇది కఫాన్ని, వాతాన్ని తగ్గిస్తుంది. జ్వరం, శ్వాసశూల, గుండె జబ్బులను అరికడుతుంది. మలబద్ధకం, మూలవ్యాధులు తగ్గుతాయి. దీని రసాన్ని చర్మరోగాలకు పైపూతగా ఉపయోగిస్తారు. ఇది అన్ని ప్రాంతాలలో దొరుకుతుంది.
3. బిల్వపత్రం: మారేడు పత్రం
ఇది హిందువులకు అతి పవిత్రమైనది . బిల్వపత్రాల రసాన్ని శరీరానికి రాసుకుని స్నానం చేస్తే, పొడ, దురద, గజ్జి వంటి రోగాలు నివారింపబడతాయి. దీని నుంచి వచ్చే గాలిని శ్వాసిస్తే, శ్వాసకోశవ్యాధులు దరిచేరవు. ఈ పత్రాలను నమిలి తింటే మధుమేహానికి మందులా పనిచేస్తుంది. దీనిని గాలిసోకని ప్రాంతాలలో పెడితే పురుగు పుట్రా రావు. స్వచ్చమయిన గాలి కోసం మన పూర్వులు మారేడును పెంచారు.
4. దూర్వాయుగ్మం: గరిక
గరికకు వైద్యగుణాలున్నాయన్న సంగతి చాలామందికి తెలియదు. చిన్న పిల్లలకు ముక్కునుండి రక్తం కారడాన్ని అరికడుతుంది. మూత్రబంధానికి, రక్త పైత్యానికి ఉపయోగపడుతుంది. దీనిని కషాయం చేసి తాగితే, క్రిములను నశింపజేసి, చర్మ రోగాలను తగ్గిస్తుంది.
5. దత్తూర పత్రం ; ఉమ్మెత్త ;
దీనిలో తెల్ల ఉమ్మెత్త, నల్ల ఉమ్మెత్త అని రెండూ రకాలున్నాయి. ఉమ్మెత్త పత్రాల రసం తేలుకాటు, ఎలుక కాటుల విషాన్ని హరిస్తుంది. దీని పత్రాలు,కొమ్మలు, గింజలు, వేర్లు అన్నింటిలో ఔషధ గుణాలున్నాయి. ఉమ్మెత్తరసాన్ని తలపై మర్ధన చేస్తే ఊడిపోయిన వెంట్రుకలు మళ్ళీ వచ్చే అవకాశముంది. కీళ్ళనొప్పులకు, నువ్వుల నూనెను రాసి, ఈ పత్రాలను ఐదారుసార్లు కడితే నొప్పులు తగ్గుతాయి.
6. బదరి పత్రం : రేగు ఆకు :
దీని పత్రాలు కురుపులను త్వరగా నయం చేస్తాయి. రోజు మద్యాహ్నం తరువాత రేగుపళ్ళను తింటే జీర్ణశక్తి పెరుగుతుంది. ఈ పత్రం గాత్రశుద్ధికి మంచిది. ఎముకలకు బలాన్ని ఇస్తుంది. ఇంకా ఎన్నో రోగాలకు ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది.
7. తులసీ పత్రం :
ఇందులొ శ్వేత, కృష్ణ అని రెండు రకాలున్నాయి. ఈ పత్రాల రసం జ్వరం, జలుబు, దగ్గుఅల్ను తగ్గిస్తాయి. క్రిమిరోగాల్తోపాటు నోటి దుర్వాసనను అరికడుతుంది. తులసీతీర్థం గొంతును శుభ్రపరుస్తుంది….. మధుమేహం, గుండెపోటు, రక్తపోటువంటి వ్యాధులను అరికడుతుంది. దీని గాలి సర్వరోగనివారిణి., మూత్రసంబంధమైన వ్యాధులను, వాంతులను అరికడుతుంది.
8. అపామార్గ పత్రం : ఉత్తరేణి పత్రం
ఉత్తరేణి పుల్లతో పండ్లు తోమడంవల్ల చిగుళ్ళవాపు, రక్తం కారడం తగ్గి, దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి.
భోజనం చేసిన తర్వాత వెంటనే విరోచనమై, కడుపునొప్పితో బాధపడేవారు ఈ పత్రాలను కడుపులోకి తీసుకుంటే మంచిది. కుష్టు, చర్మవ్యాధులను తగ్గిస్తుంది. కందిరీగలు, తేనేటీగలు, కుట్టినచోట ఈ పత్రాల రసాన్ని తీసి, పూస్తే నొప్పి తగ్గుతుంది. దీనిని దుబ్బెనచెట్టు అని కూడా అంటారు.
9. చూతపత్రం : మామిడి పతం
లేత మామిడి పత్రాలను నూరి, పెరుగులో కలిపి తింటే అతిసారవ్యాధి తగ్గుతుంది. మామిడి పత్రాలు, లేత కాడలను నమిలితే నోటిపూటలు, చిగుళ్ళ బాధలు త్వరగా తగ్గుతాయి. మామిడికాయ రక్తదోషాన్ని హరిస్తుంది. శరీరానికి ఉష్ణాన్నిచ్చి పుష్టినిస్తుంది. ఒరిసిన పాదాల కురుపులకు, మామిడి జీడి రసంతో పసుపును కలిపి రాస్తే పుండు మానుతుంది. ఈ చెట్టు జిగురుతో ఉప్పు కలిపి వెచ్చబెట్టి, కాళ్ళ పగుళ్ళకి రాస్తే, అమోఘంగా పని చేస్తుంది. దీని పత్రాలను శుభకార్యాలలో తోరణాలుగా కడతాం.
10. కరవీరపత్రం : గన్నేరు పత్రాలు
దీని పత్రాలు కుష్టురోగాన్ని, దురదను తగ్గిస్తాయి. ఈ ఆకుపసరు తలలోని చుండ్రును నివారిస్తుంది. దీని వేరుబెరడుని తీసి ఎంతకు మానని పుండ్లకు పైన కట్టుగా కడతారు. తెల్లగన్నేరు, బిళ్ళగన్నేరు, ఎర్రగన్నేరు అంటూ మూడు రకాలున్నాయి.
11. విష్ణుక్రాంతం : హరిపత్రం
ఆయుర్వేదంలో ఈ పత్రాలను జ్ఞాపకశక్తికి, నరాల అలహీనతకు వాడుతుంటారు. వాతం, కఫాలను నివారిస్తుంది. దంతాలను గట్టిపరుస్తుంది. క్రిములను, వ్రణాలను మటుమాయం చెస్తుంది రకరకాల దగ్గులను తగ్గిస్తుంది. ఇది జ్వరనివారిణి.
12. దాడిమీ పత్రం : దానిమ్మ పత్రం
ఈ చెట్టులోని అన్ని భాగాలు ఉపయోకరమైనవే. పత్రాలు, పళ్ళు, అతిసార, అజీర్ణ వ్యాధులను అరికట్టడానికి వాడతారు. ఈ పండ్లను తింటే రక్తం శుద్ధి అవుతుంది. చర్మం కాంతివంతమవుతుంది. ఇది వాతాన్ని,కఫాన్ని, పిత్తాన్ని హరిస్తుంది. హృదయనికి బలం చేకూరుస్తుంది.
13. దేవదారుపత్రం ;
దీని బెరడు కషాయం శరీరవేడిని తగ్గిస్తుంది. వెక్కిళ్ళను తగ్గించడానికి ఉపయోగపడుతుంది.
14. మరువక వృక్షం ; మరువము:
దీని పత్రాల నుండి తీసిన నూనెను కీళ్ళనొప్పులకు పైపూతగా వాడతారు. శ్వాసరోగాలు, హృద్రోగాలను తగ్గిస్తుంది. తేలు, జెర్రి మొదలైన విషపు పురుగులు కుట్టినపుడు మరువం ఆకులరసాన్ని తీసి కడితేనొప్పి తగ్గుతుంది. ఇది దేహానికి చల్లదనాన్ని చేకూరుస్తుంది. చెవిలోని చీమును, చెవిపోటును తగ్గిస్తుంది. దీనిని పసుపుతో కలిపి రాస్తే గజ్జి, చిడుము మొదలైన చర్మవ్యాధులు తగ్గిపోతాయి. ఇది విరివిగా దొరుకుతుంది.
15. సింధువార పత్రం : వావిలాకు
దీని ఆకులను నీళ్ళలో వేసి మరగకాచి బాలింతలకు స్నానం చేయిస్తే, వాతం రాకుండా ఉండటమే కాకుండా ఒళ్ళునొప్పులు తగ్గడానికి ఉపయోగపడుతుంది. దీని ఆకులను నూరి తలకు కట్టుకుంటే తలనొప్పి తగ్గుతుంది. చిగుళ్ళవాపు తగ్గేందుకు కూడ దీనిని ఉపయోగిస్తారు. దీని ఆకుల కషాయం శూలి మొదలైన వ్యాధులను తగ్గిస్తుంది.
16. జాజి పత్రం
ఇది అజీర్ణ నివారిణి. జాజి ఆకులను తింటే శరీరానికి తేజస్సు వస్తుంది. కంఠస్వరం గంభీరంగా ఉంటుంది. నోటి దుర్వాసన పోతుంది. దీనికి తులసికి ఉన్న గుణం ఉంది. దీనిని చాలామంది పెంచుతుంటారు.
17. గండకీ పత్రం : కామంచి
దీనిని అడవిమల్లె అని కూడ అంటారు. దీని ఆకులరసం మూర్చ రోగాన్ని తగ్గిస్తుంది ఈ ఆకులతో కఫం, వాతం, రక్తపైత్యం,విరేచనాలు అరికట్టబడతాయి. అధికమూత్రాన్ని తగ్గిస్తుంది.
18. శమీపత్రం : జమ్మి పత్రం
దీని గాలి క్రిమిసంహారిణి. వాయు సంబంధమైన రుగ్మతలను నాశనం చేస్తుంది. దీని ఆకులద్వారా మూలవ్యాధి, అతిసారం తగ్గుతాయి. ఈ ఆకులరసాన్ని తలకు రాసుకుంటే జుట్టు నల్లబడుతుంది. ఈ ఆకు రసాన్ని పిప్పి పన్నులో పెడితే నొప్పి తగ్గి దంతం రాలిపోతుంది.
19. అశ్వత్థ పత్రం : రావి ఆకు
ఈ చెట్టును త్రిమూర్తుల రూపంగా పూజిస్తుంటారు దీని వేర్లు బ్రహ్మ, కాండం విష్ణువు, కొమ్మలు, ఆకులను శివరూపంగా భావించి పూజిస్తారు. ఈ చెట్టు నీడను ఇవ్వడంతో పాటు మంచి కాలుష్యనివారిణిగా ఉపయోగపడుతుంది. ఈ చెట్టునుంచి వచ్చేగాలి ఆరోగ్యానికి మంచిది.ఈ ఆకుల, చెక్కరసం విరేచనాలు, నోటి వ్యాధులను తగ్గిస్తుంది. రక్తస్రావాన్ని అరికడుతుంది. ఈ చెట్టునీడ క్రింద కూర్చుంటే, చదివింది చక్కగా ఒంటపడుతుందని మన పెద్దలు చెబుతుంటారు.
20. అర్జున పత్రం : మద్ది ఆకు
ఇది వాత రోగాలను పోగొడుతుంది. కఫాన్ని తగ్గిస్తుంది. ఆకుల రసం కురుపులను తగ్గిస్తుంది. దీని గింజలు తైలాన్ని బెణుకులను తగ్గించేందుకు ఉపయోగిస్తారు. దీని తెల్ల మద్ది అని కూడ అంటారు.
21. అర్కపత్రం : జిల్లేడు పత్రం
ఆయుర్వేదంలో దీనిని 64 రోగాలనివారిణిగా పేర్కొన్నారు. ఇది శరీరానికి వేడిని తగ్గిస్తుంది. అందుకే దీనిని అర్కపత్రమని అన్నారు.దీని ఆకులను నూనెలో కాచి, కీళ్ళకు రాస్తే కీళ్ళనొప్పులు తగ్గుతాయి. ఇది పాము విషాన్ని కూడా హరిస్తుందని అంటారు. వాత, పక్షవాతం, కుష్ఠు, కఫం తదితర వ్యాధులకు మందుగా వాడుతుంటారు. దీని ద్వారా జలుబు తగ్గుతుంది. జిల్లేడు పాలను పసుపుతో కలిపి ముఖానికి రాస్తే ముఖం కాంతివంతమవుతుంది.
ఇలా వినాయక పూజలో ఉపయోగించే పత్రాల ద్వారా మన అనారోగ్య సమస్యలెన్నో తగ్గుతాయి. పత్ర పూజా విధానంలో ఎన్నో వైజ్ఞానిక విశేషాలున్నాయి. ఉదాహరణకు వినాయకునికి వెలగపండును నైవేద్యంగా పెడతాము. వెలగపండు గుజ్జును తేనెలోకలిపి తీసుకుంటే పైత్యం, వాంతులు తగ్గుతాయి.

స్నానం అంటే ఏమిటి? ఇన్ని రకాల స్నానాల వల్ల మనకోచ్చేలాభాలేమిటి?

 మానవుల్ని పవిత్రులను చేసుకోవడానికి భగవంతుడు అనుగ్రహించినవి జలము మరియు అగ్ని. అగ్ని యొక్క దాహక శక్తి మనల్ని దహింప చేస్తుంది కనుక జలముతో శుద్ధి చేసుకోవడం అందుబాటులో ఉన్న శాస్త్ర సమ్మతమైన విషయంగా చెప్పబడింది. హిందూ పురాణాలలో వివిధ రకాలైన స్నానాల గురించి ప్రస్తావించారు. స్నానాలని అయిదు విధాలుగా చెప్పినా చాలా రకాలుగా మనం విభజించు కోవచ్చును. స్నానం ఎప్పుడు చేస్తాం అనే అంశాన్ని పరిగణలోనికి తీసుకుంటే స్నానాలు మూడు విధానాలు. అవి

నిత్య స్నానం : ప్రతీరోజూ చేసే స్నానం నిత్య స్నానం.
నైమిత్తిక స్నానం : ఒక నిమిత్తాన్ని పురస్కరించుకొని చేసేది నైమిత్తికం.


ఉదా : గ్రహణం సమయములో, కక్కిన వెంటనే, క్షౌరం చేసుకున్న తరువాత, చెడ్డకలలు కన్న తరువాత, సంసారసుఖం అనుభవించిన తరువాత, ఎముకను పట్టుకొన్నపుడు, స్మశానానికి వెళ్ళినపుడు స్నానం చేయాలని పెద్దల అభిప్రాయం. ప్రసవించిన స్త్రీని ముట్టుకొన్నప్పుడు, రజస్వలయైన స్త్రీని ముట్టుకొన్నప్పుడు, శవాన్ని ముట్టుకొన్నప్పుడు, శవాన్ని అనుసరించి వెళ్ళిన తరువాత, ఇలా ఒక కారణం చేత చేసే స్నానం నైమిత్తికమన్నమాట.


కామ్య స్నానం : ఒక కోరికతో చేసేది కామ్య స్నానం.
ఉదా : తీర్థాదులలో, పుష్కరాలలో, రధసప్తమికి, కార్తీక మాసంలో, మాఘఫాల్గుణాలలో విశేష ఫలాలనుద్దేశించి చేసేదానికి, తన జన్మనక్షత్రం, వ్యతీపాత, వైదృతియను యోగాలు కలిసే రోజుల్లోగాని, పర్వతిథులలో చేసేది కామ్య స్నానం.


స్నానానికి ఉపయోగించే పదార్ధాన్ని బట్టి స్నానాలు రెండు విధములు.
ముఖ్య స్నానం : ఇది నీటిని ఉపయోగించి చేసేది ఇది మళ్ళీ రెండు రకాలు.
మంత్రం లేదా బ్రాహ్మ్యం : వేదములలో చెప్పబడిన నమక, చమక, పురుష సూక్తములను, మార్జన మంత్రాలను ఉచ్ఛరిస్తూ చేసేది "మంత్ర స్నానం". మంత్రించిన నీళ్ళని నెత్తిమీద చల్లుకోవడమే బ్రాహ్మ్య స్నానం.


"ఓం ఆపోహిష్టామ యోభువః
తాన ఊర్జే దధాతన మహేరణాయచక్షసే
యోవశ్శివతమోరసః
తస్య భాజయతేహనః
ఉశతీరివ మాతరః
తస్మారంగా మామవో
యస్యక్షయాయ చ తనః
ఆపో జన యధాచనః "


అనే మంత్రముతో పైన నీటిని చల్లుకుంటారు. పూజలు చేసేటప్పుడు కూడా గంగేచ, యమునేచ, గోదావరీ, సరస్వతీ, నర్మదా, సింధు, కావేరీ జలేస్మిన్ సన్నిధింకురు అని నీళ్ళని మంత్రించి పూజాద్రవ్యాణి సంప్రోక్ష్య, దేవస్య, ఆత్మానం సంప్రోక్ష్య అని మంత్రించిన నీళ్ళని చల్లాకనే పూజా విధానాలు మొదలుపెడతాం.


వారుణం : ఇది మామూలు నీళ్ళతో చేసేది. మనమందరం ఎక్కువగా చేసేది ఇదే. మనలో నిరంతరం విద్యుత్తు ప్రవహిస్తూ, ఎప్పటికప్పుడు విద్యుచ్ఛక్తి ఉత్పత్తి అవుతూ, బయటకు పోతూ ఉంటుంది. ఇలా నిరంతరం జరుగుతూ ఉంటేనే మనం ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటాం. నిజానికి శుచితో పాటు నీళ్ళతో దేహాన్ని తడపడంవల్ల లోపల ప్రవహిస్తున్న విద్యుచ్ఛక్తిని బయటకు పంపడం కూడా స్నానపు ప్రధాన ఉద్దేశ్యం. అందుకే పొద్దున్నే స్నానం చేయాలనే సంప్రదాయాన్ని ప్రవేశపెట్టారు. శరీరం మీద నీళ్ళు పడినప్పుడు, ఆ నీళ్ళు లోపలి విద్యుచ్ఛక్తిని పీల్చుకుంటాయి. ఆ రకంగా లోపలి విద్యుచ్ఛక్తి బయటకు వెళ్తుంది. ఆ ప్రక్రియ మొదలవగానే చురుకుదనం ప్రవేశిస్తుంది. పుణ్య నదులలో స్నానం ఆచరించడాన్ని కూడా వారుణ స్నానం అంటారు.


అముఖ్యం లేదా గౌణ స్నానం : నీరు లేకుండా చేసే స్నానాన్ని గౌణ స్నానం అంటారు. ఇది అయిదు రకాలు


* ఆగ్నేయస్నానం : హోమ భస్మాన్ని లేపనంగా పూసుకోడాన్ని ఆగ్నేయ స్నానం లేదా విభూది స్నానం అంటారు. అంటే ఒంటి నిండా విభూతి పూసుకుంటే దానిని విభూతి స్నానం అంటారు. భస్మానికి మూడు హంగులు కావాలి. ఒకటి, కాలగలిగే పదార్ధం. రెండు, అది రాజుకుని అంటుకోడానికి తగినంత వేడి. మూడు, ఆ వస్తువు మండడానికి తగినంత ఆమ్లజని సరఫరా. అప్పుడే ఆ వస్తువు కాలుతుంది. కాలగా మిగిలిన దానిని బూడిద అంటాం. విభూది ఒక రకం బూడిదే అలానే నీరు కూడా ఒక రకం బూడిదే. ఉదజని వాయువుని ఆమ్లజని సమక్షంలో మండించగా మిగిలిన బూడిదే నీరు. కనుక, మండవలసిన పదార్ధం అంతా మండిపోగా మిగిలినవే బూడిద, నీళ్ళూను. బూడిద ఒంటినిండా రాసుకోడానికీ, నీళ్ళు ఒంటి మీద పోసుకోడానికీ మధ్య ఉన్న వైజ్ఞానిక పరమైన సారూప్యాన్ని మనవాళ్ళకి తెలిసే ‘విభూది స్నానం’ అన్న పేరు పెట్టడం జరిగింది.


"శ్రీకరంచ పవిత్రంచ శోకరోగ నివారణం|
లోకే వశీకరణం పుంసాం భాస్మత్రైలోక్య పావనం||"


పరమ పవిత్రమైన, అనారోగ్యాలను పోగొట్టే, సంపదలను చేకూర్చే, బాధలను నివారించే, అందరినీ వశంలో ఉంచుకునే విభూతిని ముఖాన పెట్టుకుంటున్నాను- అని ఈ శ్లోక భావం. విభూతి చర్మవ్యాధులను నివారిస్తుంది, రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ప్రతిరోజూ విభూతిని ధరించడం వల్ల రక్తంలో ఉండే దోషాలు, మలినాలు పోయి, రక్తప్రసరణ సవ్యంగా ఉంటుంది. విభూతి క్రిమినాశినిగా పనిచేస్తుంది. నుదురు, భుజాలు మొదలైన శరీర భాగాలపై స్వేదంవల్ల జనించిన క్రిములు కలిగించే రోగాలనుండి రక్షిస్తుంది. శరీర ఉష్ణోగ్రత హెచ్చుతగ్గులు లేకుండా సమంగా ఉండేట్లు చేస్తుంది. ఆకలిని పెంచుతుంది. ఉద్రేకాలను తగ్గించి, శాంత స్వభావాన్ని చేకూరుస్తుంది. విభూతి స్వచ్చమైన తెల్లటి రంగులో ఉంటుంది కనుక ఇది నిర్మలత్వానికి సంకేతం. విభూది అంటే ఐశ్వర్యం అనే భావన కూడా ఉంది కనుక ఈ విభూది స్నానం చేస్తే ఐశ్వర్యవంతులం అవుతామన్న ఉద్దేశ్యంతో కూడా దీనిని ఆచరిస్తాం.


* భౌమస్నానం : పుణ్య నదులలో దొరికే మన్ను లేక పుట్ట మన్ను మొదలైన పవిత్ర మృత్తికను ఒంటి నిండా అలముకొని మృత్తికా మంత్రములతో చేసేది "భౌమ స్నానం". దీనినే mud bath అంటారు. పంచభూతాల్లో మట్టి ఒకటి. మనం కాలు మోపాలన్నా, మనకు సర్వాన్నీ ప్రసాదించే చెట్టుచేమలను పెంచాలన్నా మట్టే కదా అవసరం. మట్టి లేకపోతే మనకు మనుగడే లేదు. పుట్టింది మొదలు, చనిపోయేవరకూ మట్టితో మనకు విడదీయరాని సంబంధం ఉంటుంది. చివరికి తుది శ్వాస విడిచిన తర్వాత ఈ శరీరం మట్టిలోనే కలిసిపోతుంది. భస్మ స్నానం, మృత్తికా స్నానం పూర్తయిన తర్వాతనే క్రొత్త యజ్ఞోపవీతం వేసుకోవాలనేది శాస్త్రం. మట్టిలో ఎన్నో క్రిముల్ని సంహరించే శక్తితో పాటు గాయాలని మాన్పగల శక్తి కూడా ఉంది.


* వాయవ్యస్నానం : ముప్పయి మూడు కోట్ల దేవతులు నివశించియున్న గోవులు నడుస్తుండగా వాటి కాళ్ళ నుండి రేగే మట్టి మన మీద పడేలా నడవడం. విభూతిని పెట్టుకోవడం, గోధూళిలో విహరించడం అనేవి పవిత్రమైన అంశాలుగా పద్మ పురాణం చెప్తోంది. గోధూళిలో ఉండే కమ్మటి వాసన మనకు అనుభవమే! అది శాస్త్రీయంగా కూడా ఎంతో మేలు చేస్తుంది.


* దివ్యస్నానం : లోక భాంధవుడు, జగత్ చక్షువు, కర్మ సాక్షి అయినటువంటి సూర్య భగవానుడు ఆకాశంలో ఉండి సూర్య కిరణాలను వెలువరిస్తున్నపుడు వర్షం నీటిలో తడవడాన్నే దివ్య స్నానం అంటారు. అంటే, ఒక్కోసారి ఎంతమాత్రం మబ్బు పట్టకుండా ఎండలోనే వాన వస్తుంది కదా! అలాంటి వర్షంలో తడవడాన్ని దివ్య స్నానం అంటారు. ఇది చాలా అరుదైనది.


* మానసిక స్నానం : అంటే మానసికంగా చేస్తాం తప్ప నిజంగా చేసే స్నానం కాదు. నిత్యం నారాయణ నామ స్మరణతో కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్య అహంకార ఢంభ దర్పదైన్యాది మాలిన్యాలను మనస్సులో చేరనీక పోవడం "మానస స్నానం". ఇది మహత్తర స్నానం. మహా ఋషుల చేత ఆచరింప బడుతుంది. పైపై స్నానాలు కాకిస్నానాలు ఎన్ని చేసినా లోపలి దేహానికి కూడా చేయించినప్పుడే అది సంపూర్ణ స్నానం అవుతుంది.


ఖస్థితం పుండరీకాక్షం చింతయేత్ పురుషోత్తమం| అనంతాదిత్యసంకాశం వాసుదేవం చతుర్భుజం||
శంఖచక్ర గదా పద్మధారిణం వనమాలినం| ధ్వజ వప్ర అంకుశైర్లక్ష్య పాదపద్మం సునిర్మలం||
త్వత్పాదోదజాం గంగాం నిపతంతీం స్వమూర్ధని| చింతయేత్ బ్రహ్మరంధ్రేణ ప్రవిశంతీం స్వకాంతమం||
తయా సంక్షాళయే త్సర్వమంతర్దేహగతం మలం| తత్ క్షణాత్ విరజా మర్త్యో జాయతే స్ఫటికోపమ:||
ఇదం మానసికం స్నానం ప్రోక్తం హరిహరాదిభి:| సార్దత్రికోటి తీర్ధేషు స్నానాత్కోటి గుణాధికం||
యోనిత్యమాచరేద్దేవం సవియెనారాయణ స్మృత:| కాలమృత్యు మతిక్రమ్య జీవత్యేవ నసంశయ:||


అంటే పరమాకాశంలో ఉండే పురుషోత్తముడయిన వాసుదేవుడిని, నాలుగు భుజములు కలవాడిని, శంఖ చక్ర గద పద్మము వనమాలలను ధరించినవానిని, ధ్వజాదులనే మంగళకరమైన గుర్తులున్నవానిని ధ్యానించాలి. వాని పాద పద్మముల నుండి పుట్టిన గంగను తన శిరస్సుపై పడి బ్రహ్మరంధ్రం వెంబడి హృదయంలో ప్రవేశించే దానిగా భావించాలి. ఆ గంగచేత తన పాపలు పోతున్నట్లుగా చింతించాలి. అప్పుడు స్ఫటికం మాదిరిగా మలినాలు లేకుండా నిర్మలంగా ఉండి మృత్యువును దాటగలరు. ఇలా హరిహరులను తలుచుకుంటూ చేసే మానసిక స్నానం కోటి పుణ్య నదులలో చేసిన స్నానం కన్నా గొప్పది అని దీని భావము.


ఇడా భాగీరథీ గంగా, పింగళా యమునా స్మృతా| తయోర్మధ్యగతా నాడీ, సుషుమ్నాఖ్యా సరస్వతీ||
జ్ఞానహ్రదే ధ్యానజలే రాగద్వేష మలపహే| య:స్నాతి మానసే తీర్ధే సయాతి పరమాం గతిం||
అచ్యుతోహం అనంతోహం గోవిందోహం అహం హరి:| ఆనందోహం అశేషోహం అజోహం అమృతోస్మ్యహం||
నిత్యోహం నిర్వికల్పోహం నిరాకారోహం అవ్యయ:| సచ్చిదానందరూపోహం పరిపూర్ణోస్మి సర్వదా||
బ్రహ్మైవాహం నసంసారీ, ముక్తోహమితి భావయేత్| ఆశక్నువన్ భాపయితుం వాక్యమేతత్ సమభసేత్||
ఏవం య: ప్రత్యహం స్మృత్వా, మానసం స్నానమాచరేత్| సదేహాంతే పరబ్రహ్మపదం యాతి నసంశయ:||


ఎడమ ముక్కులోనున్న ఇడానాడిని భాగీరథిగా, కుడి ముక్కులో నున్న పింగళనాడిని యమునగా, వాటి మధ్యలో నున్న సుషుమ్నును సరస్వతిగా భావించాలి. రాగద్వేషాలనే మాలిన్యాన్ని పోగొట్టే జ్ఞానమనే సరస్సులో స్నానం చేసినట్లు భావించి నేనే అచ్యుతుడను, గోవిందుడను, హరిని, ఆనందరూపుణ్ణి, చావు పుట్టుకలు లేని పరమాత్మ స్వరూపాన్ని నేనే అని భావిస్తూ మనస్సులోనే స్నానం చేస్తున్నట్లుగా భావించి తరించాలి అని దీని భావము.


అభ్యంగన స్నానం : ఇక మిగతా రకాల స్నానాల గురించి చెప్పుకోవాలంటే అభ్యంగన స్నానం ఒకటి. నఖ శిఖ పర్యంతము తలస్నానము చేయుట . ఇది కనీసం నెలకి రెండు సార్లయినా అందరూ చేయాలి! మరి దాని వలన ప్రయోజనాలేమిటో చూద్దాం -


1. వేడినీటి స్నానం --చర్మాన్ని బలపరచి, చర్మంపైగల క్రిములను సంహరిస్తుంది. నూనె మర్దన శరీరంలో రక్తసరఫరా మెరుగుపరచి ఆరోగ్యవంతమైన చర్మాన్నిస్తుంది.
2. సౌనా పేరుతో నేడు చేయబడే స్టీం బాత్ లు --చర్మకణాలను పూర్తిగా శుభ్రపరచి, చర్మ రంధ్రాలు స్వేచ్ఛగా గాలి పొందేలా చేస్తాయి.


3. శరీర వెనుక భాగ చర్మం, పిరుదులు, భుజాలు, మొదలైనవి గట్టిగా వుంటాయి. వేడినీరు తగిలితే ఆ భాగాలలోని నొప్పులు, మంటలు మొదలైనవి తగ్గుతాయి. ముఖంపైన, తలపైన వేడినీరు వాడటం వలన జుట్టు ఊడే ప్రమాదం కూడా వుంది.


4. వేడి నీటి తలంటు స్నానం చర్మానికి నూనెను ఇచ్చి మెత్తబడేట్ల చేస్తుంది. నూనెతో మర్దన, పసుపు శనగపిండిలతో కూడిన పేస్టు రోగాలను తెచ్చే క్రిములను నశింపజేస్తుంది. చర్మం దురదలు, మంట తగ్గుతాయి. అపుడపుడూ అభ్యంగన స్నానం చేస్తే, మెదడు చక్కటి రిలాక్సేషన్ పొంది చురుకుగా వుంటుంది. వేడినీటిలో సువాసన ద్రవ్యాలు వేస్తే అవి చర్మానికి సహజ కాంతి నిచ్చి చెడు వాసనలను పోగొడతాయి.


సముద్ర స్నానము:
మానవుడు సముద్రములో మునుగగానే, అన్ని తీర్థములలోను పుణ్యనదులలోను స్నానము చేసిన పుణ్యము లభించును.


కార్తీక స్నానము:
కార్తీకమాసంలో తైలము రాసుకొని స్నానము చేయకూడదు. పురాణాలను విస్మరించరాదు. కార్తీకమాసంన వేడినీటితో స్నానము కల్లుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పెడు. కాబట్టి వేడినీటితో స్నానము కూడదు. ఒకవేళ అనారోగ్యముగా వుండి యెలాగైనా విడువకుండా కార్తీకమాసవ్రతం చేయాలన్న కుతూహలం కలవారు మాత్రమే వేడినీటి స్నానం చేయవచ్చు. అలా చేసేవారు గంగా, గోదావరీ సరస్వతి యమున నదుల పేర్లను మనసులో స్మరించి స్నానం చేయాలి. 


మానవుల్ని పవిత్రులను చేసుకోవడానికి భగవంతుడు అనుగ్రహించినవి జలము, అగ్ని. అగ్నితో శుద్ధి చేసుకోవడం వీలు బడదు. అగ్ని యందలి దాహక శక్తి మనల్ని దహింప చేస్తుంది కనుక జలముతో శుద్ధి చేసుకోవడం అందుబాటులో ఉన్న శాస్త్ర సమ్మతమైన విషయంగా చెప్పబడింది. హిందూ పురాణాలలో వివిధ రకాలైన స్నానాల గురించి చెప్పబడింది.


మంత్ర స్నానం వేదమందు చెప్పబడిన నమక, చమక, పురుష సూక్తములను, మార్జన మంత్రములను ఉచ్ఛరిస్తూ చేయునది "మంత్ర స్నానం"

భౌమ స్నానం పుణ్య నదులలో దొరుకు మన్ను లేక పుట్ట మన్ను మొదలగు పవిత్ర మృత్తికను ఒంటి నిండా అలముకొని మృత్తికా మంత్రములతో చేనునది "భౌమ స్నానం".

ఆగ్నేయ స్నానం సమస్త పాపములను దగ్ధం చేసే పుణ్య రాశిని చేకూర్చే భస్మమును మంత్ర సహితముగా లేదా శివ నామమును ఉచ్ఛరిస్తూ ధరించి చేయునది "ఆగ్నేయ స్నానం"

వాయువ్య స్నానం ముప్పది మూడు కోట్ల దేవతులు నివశించు గోమాత పాద ధూళి చేత చేయునది "వాయువ్య స్నానం"

దివ్య స్నానం లోక భాంధవుడు, జగత్ చక్షువు, కర్మ సాక్షి అగు సూర్య భగవానుడు ఆకాశంలో ఉండి సూర్య కిరణాలను వెలువరిస్తున్నపుడు వానలో స్నానం చేయడం "దివ్య స్నానం". ఇది అరుదైనది. దీనికి వాతావరణం అనుకూలించాలి.

వారుణ స్నానం పుణ్య నదులలో స్నానం ఆచరించడం "వారుణ స్నానం".

మానస స్నానం నిత్యం నారాయణ నామ స్మరణతో కామ క్రోధ లోభ మోహ మద మత్సర అహంకార ఢంభ దర్పదైన్యాది మాలిన్యాలను మనస్సులో చేరనీక పోవడం "మానస స్నానం". ఇది మహత్తర స్నానం. మహా ఋషులచేత ఆచరింప బడుతుంది. ఈ స్నానం కోసం అందరూ ప్రయత్నం చేయాలి.

విష్ణువు వేయి నామములు- 1-410 వాటి అర్దాలు

1) విశ్వం - మనకు గోచరమగు దృశ్యమాన జగత్తంతయు తానైన వాడు.
2) విష్ణు: - విశ్వమంతయు వ్యాపించి ఉన్నవాడు.
3) వషట్కార: - వేద స్వరూపుడు.
4) భూత భవ్య భవత్ ప్రభు: - భూత భవిష్యత్ వర్త మానము లందలి సర్వమునకు ప్రభువైన వాడు.
5) భూత కృద్ - భూతములను సృష్టించిన వాడు.
6) భూత భృత్ - జీవులందరిని పోషించు వాడు.
7) భావ: - సమస్త చరాచర ప్రపంచమంతయు తానే వ్యాపించిన వాడు.
8) భూతాత్మా - సర్వ జీవ కోటి యందు అంతర్యామిగ ఉండువాడు.
9) భూత భావన: - జీవులు పుట్టి పెరుగుటకు కారణమైన వాడు.
10) పూతాత్మా - పవిత్రాత్ముడు.
11) పరమాత్మ - నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపమై కార్య కారణముల కంటే విలక్షణమైన వాడు.
12) ముక్తానాం పరమాగతి: - ముక్త పురుషులకు పరమ గమ్యమైన వాడు.
13) అవ్యయ: - వినాశము కానివాడు. వినాశము లేని వాడు.
14) పురుష: - నవద్వారములు కలిగిన పురము నందు ఉండువాడు.
15) సాక్షీ - చక్కగా సమస్తమును దర్శించువాడు.
16) క్షేత్రజ్ఞ: - శరీరము లో జరుగు క్రియలన్నింటిని గ్రహించువాడు.
17) అక్షర: - నాశరహితుడు.
18) యోగ: - యోగము చే పొందదగిన వాడు.
19) యోగ విదాంనేతా - యోగ విదులకు ప్రభువైన వాడు.
20) ప్రధాన పురుషేశ్వర: - ప్రకృతి పురుషులకు అధినేత.
21) నారసింహవపు: - నరుని సింహమును బోలిన అవయువములు గల వాడు.
22) శ్రీమాన్ - సదా లక్ష్మీ దేవితో కూడి యుండువాడు.
23) కేశవ: - కేశి యనెడి అసురుని వధించిన వాడు.
24) పురుషోత్తమ: - పురుషులందరిలోను ఉత్తముడు.
25) సర్వ: - సమస్తమును తానై అయినవాడు.
26) శర్వ: - సకల జీవులను సంహరింప జేయువాడు.
27) శివ: - శాశ్వతుడు.
28) స్థాణు: - స్థిరమైనవాడు.
29) భూతాది: - భూతములకు ఆదికారణమైన వాడు.
30) అవ్యయనిధి: - నశించని ఐశ్వర్యము గల వాడు.
31) సంభవ: - వివిధ అవతారములను ఎత్తినవాడు.
32) భావన: - సర్వ జీవులకు సమస్త ఫలముల నొసగువాడు.
33) భర్తా: - సకలములను కనిపెట్టి, పోషించువాడు. సకలమును భరించువాడు.
34) ప్రభవ: - పంచభూతములకు, దేశకాలాదులకు మూలమైనవాడు.
35) ప్రభు: - సర్వశక్తి సమన్వితమైనవాడు.
36) ఈశ్వర: - ఒకరి సహాయములేకనే సమస్త కార్యములు నెరవేర్చగల్గిన వాడు.
37) స్వయంభూ : - తనంతట తానే ఉద్భవించిన వాడు.
38) శంభు: - సర్వశ్రేయములకు మూలపురుషుడు.
39) ఆదిత్య: - సూర్యుని యందు స్వర్ణకాంతితో ప్రకాశించువాడు.
40) పుష్కరాక్ష: - పద్మముల వంటి కన్నులు గలవాడు.
41) మహాస్వన: - గొప్పదియగు వేదరూప నాదము గలవాడు.
42) అనాదినిధన: - ఆద్యంతములు లేని వాడు.
43) ధాతా - నామరూపాత్మకమైన ఈ జగత్తునకు అద్వితీయుడై ఆధారమై యున్నవాడు.
44) విధాతా - కర్మఫలముల నందించువాడు.
45) ధాతురుత్తమ: - సర్వ ధాతువులలో ఉత్తమమైన చిద్రూప ధాతువు తానైనవాడు.
46) అప్రమేయ: - ఏ విధమైన ప్రమాణములకు అందనివాడు.
47) హృషీకేశ: - ఇంద్రియములకు ప్రభువు.
48) పద్మనాభ: - నాభియందు పద్మము గలవాడు.
49) అమరప్రభు: - దేవతలకు ప్రభువైనవాడు.
50) విశ్వకర్మా - విశ్వరచన చేయగల్గినవాడు.
51) మను: - మననము(ఆలోచన) చేయువాడు.
52) త్వష్టా - ప్రళయకాలమున సమస్త భూతములను కృశింపజేసి నశింపజేయువాడు.
53) స్థవిష్ఠ: - అతిశయ స్థూలమైన వాడు.
54) స్థవిరోధ్రువ: - సనాతనుడు, శాశ్వతుడైనవాడు.
55) అగ్రాహ్య: - ఇంద్రియ మనోబుద్ధులచే గ్రహించుటకు వీలులేనివాడు.
56) శాశ్వత: - సర్వ కాలములందున్నవాడు.
57) కృష్ణ: - సచ్చిదానంద స్వరూపుడైన భగవానుడు. సర్వమును ఆకర్షించువాడు.
58) లోహితాక్ష: - ఎఱ్ఱని నేత్రములు గలవాడు.
59) ప్రతర్దన: - ప్రళయకాలమున సర్వమును నశింపచేయువాడు.
60) ప్రభూత: - జ్ఞానైశ్వర్యాది గుణసంపన్నుడు.
61) త్రికకుబ్ధామ - ముల్లోకములకు ఆధారభూతమైనవాడు.
62) పవిత్రం - పరిశుద్ధుడైనవాడు.
63) పరం మంగళం - స్మరణ మాత్రముచే అద్భుతముల నంతమొందించి శుభముల నందించువాడు.
64) ఈశాన: - సర్వ భూతములను శాసించువాడు.
65) ప్రాణద: - ప్రాణి కోటికి ప్రాణశక్తి నొసగువాడు.
66) ప్రాణ: - ప్రాణశక్తి స్వరూపమైనవాడు.
67) జ్యేష్ఠ: - వృద్ధతముడు. (సృష్టికి పూర్వమునుండే ఉన్నవాడు)
68) శ్రేష్ఠ: - అత్యంత ప్రశంసాపాత్రుడు.
69) ప్రజాపతి: - సమస్త ప్రజలకు పతి.
70) హిరణ్యగర్భ: - విశ్వగర్భమున నుండువాడు.
71) భూగర్భ: - భూమిని తన గర్భమునందు ఉంచుకొన్నవాడు.
72) మాధవ: - శ్రీదేవికి భర్తయైనవాడు.
73) మధుసూదన: - మధువను రాక్షసుని వధించినవాడు.
74) ఈశ్వర: - సర్వశక్తి సంపన్నుడైనవాడు.
75) విక్రమీ - శౌర్యము గలవాడు.
76) ధన్వీ - ధనస్సును ధరించినవాడు.
77) మేధావీ - ఏకకాలములో సర్వవిషయగ్రహణ సామర్ధ్యము కలిగినవాడు.
78) విక్రమ: - గరుడుని వీపుపై ఎక్కి ఇచ్ఛామాత్రముచే ఎచ్చటైనను విహరించగలవాడు.
79) క్రమ: - నియమానుసారము చరించువాడు.
80) అనుత్తమ: - తనకంటె ఉత్తములు లేనివాడు.
81) దురాధర్ష: - రాక్షసులు కూడా ఎదుర్కోను శక్యము గానివాడు.
82) కృతజ్ఞ: - ప్రాణులు చేయు కర్మములను చేయువాడు.
83) కృతి: - కర్మకు లేదా పురుష ప్రయత్నమునకు ఆధారభూతుడై యున్నవాడు.
84) ఆత్మవాన్ - తన వైభవమునందే సర్వదా సుప్రతిష్ఠుడై యుండువాడు.
85) సురేశ: - దేవతలకు ప్రభువైనవాడు.
86) శరణ: - దు:ఖార్తులను బ్రోచువాడై, వారి ఆర్తిని హరించువాడు.
87) శర్మ - పరమానంద స్వరూపుడు.
88) విశ్వరేతా: - సర్వ ప్రపంచమునకు కారణమైన పరంధాముడు.
89) ప్రజాభవ: - ప్రజోత్పత్తికి కారణభూతుడైన వాడు.
90) అహ: - పగలువలె ప్రకాశించు వాడు.
91) సంవత్సర: - కాలస్వరూపుడైనవాడు.
92) వ్యాళ: - పామువలె పట్టశక్యము గానివాడు.
93) ప్రత్యయ: - ప్రజ్ఞా స్వరూపుడైనవాడు.
94) సర్వదర్శన: - సమస్తమును దర్శించగలవాడు.
95) అజ: - పుట్టుకలేని వాడు.
96) సర్వేశ్వర: - ఈశ్వరులందరికి ఈశ్వరుడైనవాడు.
97) సిద్ధ: - పొందవలసిన దంతయు పొందినవాడు.
98) సిద్ధి: - ఫలరూపుడైనవాడు.
99) సర్వాది: - సర్వమునకు మూలమైనవాడు.
100) అచ్యుత: - స్వరూప సామర్ద్యముల యందు పతనము లేనివాడు.
101) వృషాకపి: - అధర్మముచే మునిగియున్న భూమిని వరహావతారమెత్తి ఉద్ధరించినవాడు.
102) అమేయాత్మ - అపరిమిత స్వరూపము గలవాడు.
103) సర్వయోగ వినిస్సృతః - సర్వ విధములైన సంగత్యములనుండి విడిపడినవాడు.
104) వసు: - సర్వ భూతములయందు వశించువాడు.
105) వసుమనా: - పరిశుద్ధమైన మనస్సు గలవాడు.
106) సత్య: - సత్య స్వరూపుడు.
107) సమాత్మా: - సర్వప్రాణుల యందు సమముగా వర్తించువాడు.
108) సమ్మిత: - భక్తులకు చేరువై భక్తాధీనుడైనవాడు.
109) సమ: - సదా లక్ష్మీదేవితో కలిసి విరాజిల్లువాడు.
110) అమోఘ: - భక్తులను స్తుతులను ఆలకించి ఫలముల నొసగువాడు.
111) పుండరీకాక్ష: - భక్తుల హృదయ పద్మమున దర్శనీయుడైనవాడు. పద్మనయునుడు.
112) వృషకర్మా - ధర్మకార్యములు నిర్వర్తించువాడు.
113) వృషాకృతి: - ధర్మమే తన స్వరూపముగా గలవాడు.
114) రుద్ర: - దు:ఖమును లేదా దు:ఖ కారణమును పారద్రోలువాడు.
115) బహుశిరా: - అనేక శిరములు కలవాడు.
116) బభ్రు: - లోకములను భరించువాడు.
117) విశ్వయోని: - విశ్వమునకు కారణమైనవాడు.
118) శుచిశ్రవా: - శుభప్రధమై శ్రవణము చేయదగిన దివ్యనామములు కలిగినవాడు.
119) అమృత: - మరణము లేనివాడు.
120) శాశ్వతస్థాణు: - నిత్యుడై, నిశ్చలుడైనవాడు.
121) వరారోహ: - జ్ఞానగమ్యమైనవాడు.
122) మహాతపా: - మహాద్భుత జ్ఞానము కలవాడు.
123) సర్వగ: - సర్వత్ర వ్యాపించియున్నవాడు.
124) సర్వవిద్భాను: - సర్వము తెలిసినవాడు.
125) విష్వక్సేన: - అసురుల సేనలను నిర్జించినవాడు. తాను యుద్దమునకు ఉపక్రమించినంతనే అసురసేన యంతయు భీతితో
పారిపోవుటచే భగవానుడు విష్వక్సేను డాయెను.
126) జనార్దన: - దు:ఖమును కల్గించువాడు. ఆనందము నొసగూర్చువాడు.
127) వేద: - మోక్షదాయకమైన జ్ఞానమును ప్రసాదించు వేదము తన స్వరూపముగా గలవాడు.
128) వేదవిత్ - వేదజ్ఞానమును అనుభవములో కలిగినవాడు.
129) అవ్యంగ: - ఏ కొఱతయు, లోపము లేనివాడు.
130) వేదాంగ: - వేదములనే అంగములుగా కలిగినవాడు.
131) వేదవిత్ - వేదములను విచారించువాడు.
132) కవి: - సర్వద్రష్ట యైనవాడు.
133) లోకాధ్యక్ష: - లోకములను పరికించువాడు.
134) సురాధ్యక్ష: - దేవతలకు కూడా తానే అధ్యక్షుడైనవాడు.
135) ధర్మాధ్యక్ష: - ధర్మాధర్మములను వీక్షించువాడు.
136) కృతాకృత: - కార్య, కారణ రూపములతో భాసించువాడు.
137) చతురాత్మా - విభూతి చతుష్టయము తన స్వరూపముగా గలవాడు.
138) చతుర్వ్యూహ: - నాలుగు విధముల వ్యూహము నొంది సృష్టి కార్యములను చేయువాడు.
139) చతుర్దుంష్ట్ర: - నాలుగు కోరపండ్లు గలిగినవాడు.
140) చతుర్భుజ: - నాలుగు భుజములు కలిగినవాడు.
141) భ్రాజిష్ణు: - అద్వయ ప్రకాశరూపుడు.
142) భోజన: - భోజ్యరూపమైనవాడు.
143) భోక్తా: - ప్రకృతిలోని సర్వమును అనుభవించు పురుషుడు.
144) సహిష్ణు: - భక్తుల అపరాధములను మన్నించి క్షమించ గలిగినవాడు.
145) జగదాదిజ: - సృష్ట్యారంభముననే వ్యక్తమైనవాడు.
146) అనఘ: - పాపరహితుడైనవాడు.
147) విజయ: - ఆత్మజ్ఞానముతో వైరాగ్యసంపన్నుడై, శ్రేష్టమైన జయమునొందువాడు.
148) జేతా: - సదాజయము నొందువాడు.
149) విశ్వయోని: - విశ్వమునకు కారణభూతమైనవాడు.
150) పునర్వసు: - పదే పదే క్షేత్రజ్ఞుని రూపమున ఉపాధుల నాశ్రయించువాడు.
151) ఉపేంద్ర: - ఇంద్రునికి పై నుండువాడు.
152) వామన: - చక్కగా సేవించదగినవాడు.
153) ప్రాంశు: - ఉన్నతమైన శరీరము గలవాడు.
154) అమోఘ: - వ్యర్ధము కాని పనులు గలవాడు.
155) శుచి: - తన దరిచేరు భక్తులను పవిత్రము చేయువాడు.
156) ఊర్జిత: - మహా బలవంతుడు.
157) అతీంద్ర: - ఇంద్రుని అతిక్రమించినవాడు.
158) సంగ్రహ: - ప్రళయకాలమున సమస్తమును ఒక్కచోటికి సంగ్రహించువాడు.
159) సర్గ: - సృష్టియు, సృష్టికారణమును అయినవాడు.
160) ధృతాత్మా - తనపై తాను ఆధారపడినవాడు.
161) నియమ: - జీవులను వారి వారి కార్యములలో నియమింపజేయువాడు.
162) యమ: - లోపలనుండి నడిపించువాడు.
163) వేద్య: - సర్వులచేత తెలుసుకొనదగినవాడు.
164) వైద్య: - సమస్త విద్యలకు నిలయమైనవాడు.
165) సదాయోగి - నిత్యము స్వస్వరూపమునందు విరాజిల్లువాడు.
166) వీరహా - ధర్మరక్షణ నిమిత్తము వీరులైన అసురులను వధించినవాడు.
167) మాధవ: - అర్హులగువారికి ఆత్మజ్ఞానమును ప్రసాదించువారు.
168) మధు: - భక్తులకు మధురమైన మకరందము వంటివారు.
169) అతీంద్రయ: - ఇంద్రియములద్వార గ్రహించుటకు వీలులేనివాడు.
170) మహామాయ: - మాయావులకు మాయావియైనవాడు.
171) మహోత్సాహ: - ఉత్సాహవంతుడు.
172) మహాబల: - బలవంతులకంటెను బలవంతుడైనవాడు.
173) మహాబుద్ధి: - బుద్ధిమంతులలో బుద్ధిమంతుడు.
174) మహావీర్య: - బ్రహ్మాండములను సృష్టించి, పోషించి, లయింపచేయు శక్తిసామర్ధ్యములు కలిగియున్నవాడు.
175) మహాశక్తి: - మహిమాన్విత శక్తిపరుడైనవాడు.
176) మహాద్యుతి: - గొప్ప ప్రకాశము అయినవాడు.
177) అనిర్దేశ్యవపు: - నిర్దేశించుటకు, నిర్ణయించుటకు వీలుకానివాడు.
178) శ్రీమాన్ - శుభప్రదుడు.
179) అమేయాత్మా - ఊహించుటకు వీలులేని మేధాసంపత్తి కలిగినవాడు.
180) మహాద్రిధృక్ - మందర, గోవర్ధన పర్వతములను అవలీలగా ఎత్తినవాడు.
181) మహేష్వాస: - శార్ఙమను (శారంగ ధనువు) గొప్ప ధనువును ధరించినవాడు.
182) మహీభర్తా: - భూదేవికి భర్తయై, రక్షకుడైనవాడు.
183) శ్రీనివాస: - శ్రీమహాలక్ష్మికి నివాస స్థానమైనవాడు.
184) సతాంగతి: - సత్పురుషులకు పరమగతి అయినవాడు.
185) అనిరుద్ధ: - మరొకరు ఎదురించువారు లేనివాడు.
186) సురానంద: - దేవతలకు ఆనందము నొసంగువాడు.
187) గోవింద: - గోవులను రక్షించువాడు.
188) గోవిదాం పతి: - వాగ్విదులు, వేదవిదులైనవారికి ప్రభువైనవాడు.
189) మరీచి: - తేజోవంతులలో తేజోవంతుడైనవాడు.
190) దమన: - తమకప్పగించబడిన బాధ్యతలనుండి తప్పిపోవు వారిని శిక్షించువాడు.
191) హంస: - నేను అతడే (అహం బ్రహ్మస్మి)
192) సుపర్ణ: - అందమైన రెక్కలు గలవాడు.
193) భుజగోత్తమ: - భుజంగములలో ఉత్తముడు.
194) హిరణ్యగర్భ: - బ్రహ్మకు పుట్టుకనిచ్చిన బంగారు బొడ్డుగల సర్వోత్తముడు.
195) సుతపా: - చక్కటి తపమాచరించువాడు.
196) పద్మనాభ: - హృదయపద్మమధ్యమున భాసించువాడు.
197) ప్రజాపతి: - అనంతజీవకోటికి ప్రభువైనవాడు.
198) అమృత్యు: - మరణముగాని, మరణ కారణముగాని లేనివాడు.
199) సర్వదృక్ - తన సహజ జ్ఞానముచే ప్రాణులు చేసినది,చేయునది అంతయు చూచుచుండువాడు.
200) సింహ: - సింహము. పాపములను నశింపజేయువాడు.
201) సంధాతా - జీవులను కర్మఫలములతో జోడించువాడు.
202) సంధిమాన్ - భక్తులతో సదాకూడియుండువాడు.
203) స్థిర: - సదా ఏకరూపము గలవాడు.
204) అజ: - పుట్టుకలేనివాడు.
205) దుర్మర్షణ: - అసురులకు భరింపశక్యము గానివాడు.
206) శాస్తా - శృతి, స్తృతుల ద్వారా శాసించువాడు.
207) విశ్రుతాత్మా - విశేషముగా శ్రవణము చేయబడినవాడు.
208) సురారిహా - దేవతల శత్రువులను నాశనము చేసినవాడు.
209) గురు: - ఆత్మవిద్యను బోధించువాడు.
210) గురుత్తమ: - గురువులకు గురువైనవాడు.
211) ధామ: - జీవులు చేరవలసిన పరమోత్కృష్ణ స్థానము.
212) సత్య: - సత్య స్వరూపుడు.
213) సత్యపరాక్రమ: - సత్యనిరూపణలో అమోఘమైన పరాక్రమము కలవాడు.
214) నిమిష: - నేత్రములు మూసుకొనినవాడు.
215) అనిమిష: - సదా మేలికొనియున్న వాడు.
216) స్రగ్వీ - వాడని పూలమాలను ధరించినవాడు.
217) వాచస్పతి రుదారధీ: - విద్యలకు పతియైనవాడు.
218) అగ్రణీ: - భక్తులకు దారిచూపువాడు.
219) గ్రామణీ: - సకల భూతములకు నాయకుడు.
220) శ్రీమాన్ - ఉత్కృష్ణమైన కాంతి గలవాడు.
221) న్యాయ: - సత్యజ్ఞానమును పొందుటకు అవసరమైన తర్కము, యుక్తి తానే అయినవాడు.
222) నేతా - జగత్తు యనెడి యంత్రమును నడుపువాడు.
223) సమీరణ: - ప్రాణవాయు రూపములో ప్రాణులకు చేష్టలు కలిగించువాడు.
224) సహస్రమూర్ధా - సహస్ర శిరస్సులు గలవాడు.
225) విశ్వాత్మా - విశ్వమునకు ఆత్మయైనవాడు.
226) సహస్రాక్ష: - సహస్ర నేత్రములు కలవాడు.
227) సహస్రపాత్ - సహస్రపాదములు కలవాడు.
228) ఆవర్తన: - జగత్ చక్రమును లేదా సంసార చక్రమును సదా త్రిప్పుచుండువాడు.
229) నివృత్తాత్మా - ప్రపంచముతో ఎట్టి సంబంధము లేనివాడు.
230) సంవృత: - అవిద్యారూపమైన మాయచే కప్పబడినవాడు.
231) సంప్రమర్దన: - తమోగుణ ప్రధానులైన అజ్ఞానులను పీడించువాడు.
232) అహస్సంవర్తక: - రోజులను చక్కగా నడిపెడి ఆదిత్యరూపుడు.
233) వహ్ని: - యజ్ఞములందు హోమకుండములలో హవిస్సును మోసెడి అగ్ని.
234) అనిల: - ప్రకృతిలో వాయు రూపమునను, ప్రాణులలో ప్రాణ రూపమునను ఉండువాడు.
235) ధరణీధర: - భూభారమును భరించువాడు.
236) సుప్రసాద: - చక్కని అనుగ్రహము కలవాడు.
237) ప్రసన్నాత్మా - రాగద్వేషాదులతో కలుషితముగాని పరిశుద్ధ అంత:కరణ కలవాడు.
238) విశ్వదృక్ - విశ్వమునంతటిని ధరించినవాడు.
239) విశ్వభుక్ - విశ్వమును భక్షించువాడు.
240) విభు: - బ్రహ్మ మొదలు సకల రూపములలో గోచరించువాడు.
241) సత్కర్తా - సజ్జనులను సత్కరించువాడు.
242) సత్కృత: - పూజ్యులచే పూజింపబడువాడు.
243) సాధు: - ధర్మప్రవర్తన గలవాడు.
244) జుహ్ను: - భక్తులను పరమపదమునకు నడిపించువాడు.
245) నారాయణ: - నరులకు ఆశ్రయమైనవాడు.
246) నర: - జీవులను కర్మానుసారము ఉత్తమగతికి నడుపువాడు.
247) అసంఖ్యేయ: -అనంతమైన నామరూపాదులు కలవాడు.
248) అప్రమేయాత్మా - అప్రమేయమైన స్వరూపము కలవాడు.
249) విశిష్ట: - శ్రేష్ఠతముడు. మిక్కిలి గొప్పవాడు.
250) శిష్టకృత్ - శాసనము చేయువాడు.
251) శుచి: - నిర్మలుడై, నిరంజనుడైనవాడు.
252) సిద్ధార్ధ: - పొందదగినదంతయు పొందినవాడు.
253) సిద్ధసంకల్ప: - నేఱవేరిన సంకల్పములు కలవాడు.
254) సిద్ధిద: - జీవుల కర్మానుసారముగా ఫలముల నందిచువాడు.
255) సిద్దిసాధన: - కార్యసిద్ధి కనుకూలించు సాధన సంపత్తి తానే అయినవాడు.
256) వృషాహీ - అనేక వృషాహములు (ధర్మ దినములు) ద్వారా సేవింపబడువాడు.
257) వృషభ: - భక్తుల అభీష్టములను నెరవేర్చువాడు.
258) విష్ణు: - సర్వత్రా వ్యాపించి ఉన్నవాడు.
259) వృషపర్వా: - ధర్మమునకు భక్తుల ధర్మ సోపానములను నిర్మించినవాడు.
260) వృషోదర: - ధర్మమును ఉదరమున ధరించువాడు. (ప్రజలను వర్షించునదిగాయున్న ఉదరము గలవాడు.)
261) వర్ధన: - ఆశ్రితులైనవారి శ్రేయములను వృద్ధినొందిచువాడు.
262) వర్ధమాన: - ప్రపంచరూపమున వృద్ధినొందువాడు.
263) వివిక్త: - మాయాస్వరూపమగువాడు.
264) శృతిసాగర: - శృతులకు నిధియైనవాడు.
265) సుభుజ: - జగద్రక్షణము గావించు సుందరమైన భుజములు గలవాడు.
266) దుర్ధర: - లోకములను ధరించి తనను ఒరులు ధరించేందుకు వీలుపడని భూమాతను ధరించినవాడు.
267) వాగ్మీ - వేదజ్ఞానమును వెలువరించినవాడు.
268) మహేంద్ర: - దేవేంద్రునకు కూడా ప్రభువైనవాడు.
269) వసుద: - భక్తుల అవసరములను సకాలములో సమకూర్చువాడు.
270) వసు: - తాను ఇచ్చు ధనము కూడా తానే అయినవాడు.
271) నైకరూప: - ఒక రూపము లేనివాడై, అనేక రూపములు గలవాడు.
272) బృహద్రూప: - బ్రహ్మాండ స్వరూపము గలవాడు.
273) శిపివిష్ట: - సూర్యునియందలి కిరణ ప్రతాపము తానైనవాడు.
274) ప్రకాశన: - సర్వమును ప్రకాశింప చేయువాడు.
275) ఓజస్తేజో ద్యుతిధర: - ఓజస్సు, తేజస్సు, ద్యుతి కలవాడు.
276) ప్రకాశాత్మా - తేజోమయ స్వరూపుడు.
277) ప్రతాపన: - సూర్యాగ్నుల రూపమున భూమిని తపింపచేయువాడు.
278) బుద్ధ: - ధర్మ, జ్ఞాన, వైరాగ్యములకు నిలయమైనవాడు.
279) స్పష్టాక్షర: - ఓం అనెడి దివ్యాక్షరముద్వారా సూచించబడినవాడు.
280) మంత్ర: - వేదమంత్రముల ద్వారా తెలియదగినవాడు.
281) చంద్రాంశు: - చంద్రకిరణముల వంటివాడు.
282) భాస్కరద్యుతి: - సూర్యతేజమువంటివాడు.
283) అమృతాంశూధ్భవ: - చంద్రుని ఆవిర్భావమునకు కారణమైనవాడు.
284) భాను: - స్వప్రకాశ స్వరూపుడు.
285) శశిబిందు: - చంద్రునివలె ప్రజలను పోషించువాడు.
286) సురేశ్వర: - దేవతలకు ప్రభువైనవాడు.
287) ఔషధం - భవరోగహరమగు దివ్యౌషధము తానైనవాడు.
288) జగతస్సేతు: - ప్రపంచమునకు పరమాత్మకు మద్య వంతెనవంటివాడు.
289) సత్యధర్మ పరాక్రమ: - సత్యజ్ఞానాది ధర్మములు, పరాక్రమము కలవాడు.
290) భూతభవ్య భవన్నాద: - జీవులచే మూడుకాలములందు ప్రార్థించబడువాడు.
291) పవన: - సకలమును పవిత్ర మొనర్చువాడు.
292) పావన: - వాయువునందు చలనశక్తి కల్గించువాడు.
293) అనల: - ప్రాణధారణకు అవసరమైన అగ్ని స్వరూపుడు.
294) కామహా - కామములను అంతము చేయువాడు.
295) కామకృత్ - సాత్వికవాంఛలను నెరవేర్చువాడు.
296) కాంత: - అద్భుత రూపవంతుడై, సర్వులచే ఆకర్షింపబడువాడు.
297) కామ: - చతుర్విధ పురుషార్థములను అభిలషించువారిచే కోరబడువాడు.
298) కామప్రద: - భక్తుల కోర్కెలను తీర్చువాడు.
299) ప్రభు: - సర్వోత్కృష్టమైనవాడు.
300) యుగాదికృత్ - కృతాది యుగములను ప్రారంభించినవాడు.
301) యుగావర్త: - యుగములను త్రిప్పువాడు.
302) నైకమాయ: - తన మాయాశక్తిచే అనేక రూపములను ధరించి, ప్రదర్శించువాడు.
303) మహాశన: - సర్వమును కబళించువాడు.
304) అదృశ్య: - దృశ్యము కానివాడు.
305) వ్యక్తరూప: - భక్తుల హృదయములలో వ్యక్తరూపుడై భాసిల్లువాడు.
306) సహస్రజిత్ - వేలకొలది రాక్షసులను సంగ్రామమున జయించువాడు.
307) అనంతజిత్ - అనూహ్యమైన శక్తి సామర్ద్యములు కలవాడై, రణరంగమున ఎదిరించువారిని జయించు శక్తి కలవాడు.
308) ఇష్ట: - ప్రియమైనవాడు.
309) అవిశిష్ట: - సర్వాంతర్యామియైనవాడు.
310) శిష్టేష్ట: - బుధజనులైన సాధుమహాత్ములకు ఇష్టుడైనవాడు.
311) శిఖండీ - శిరమున నెమలిపింఛమును ధరించినవాడు.
312) నహుష: - తన మాయచేత జీవులను సంసారమునందు బంధించువాడు.
313) వృష: - ధర్మస్వరూపుడైనవాడు.
314) క్రోధహా - సాధకులలోని క్రోధమును నశింపచేయువాడు.
315) క్రోధ కృత్కర్తా - క్రోధాత్ములగువారిని నిర్మూలించువాడు.
316) విశ్వబాహు: - బాహువులు విశ్వమంతట కలవాడు.
317) మహీధర: - భూమిని ధరించినవాడు.
318) అచ్యుత: - ఎట్టి వికారములకు లోనుగానివాడు. ( ఎటువంటి మార్పు పొందనివాడు.)
319) ప్రధిత: - ప్రఖ్యాతి నొందినవాడు.
320) ప్రాణ: - అంతటా చైతన్య స్వరూపమై నిండి, ప్రాణులను కదిలించు ప్రాణస్వరూపుడు.
321) ప్రాణద: - ప్రాణ బలము ననుగ్రహించువాడు.
322) వాసవానుజ: - ఇంద్రునకు తమ్ముడు.
323) అపాంనిధి: - సాగరమువలె అనంతుడైనవాడు.
324) అధిష్టానం - సర్వమునకు ఆధారమైనవాడు.
325) అప్రమత్త: - ఏమరు పాటు లేనివాడు.
326) ప్రతిష్ఠిత: - తన మహిమయందే నిలిచియుండువాడు.
327) స్కంద: - అమృత రూపమున స్రవించువాడు.
328) స్కందధర: - ధర్మమార్గమున నిలుపువాడు.
329) ధుర్య: - సర్వ జీవుల ఉత్పత్తి మొదలగు భారములను మోయువాడు.
330) వరద: - వరముల నొసగువాడు.
331) వాయువాహన: - సప్త వాయువులను బ్రహ్మాండమంతటను ప్రవర్తింపచేయువాడు.
332) వాసుదేవ: - అంతటను నిండియున్నవాడు.
333) బృహద్భాను: - ప్రకాశవంతమగు కిరణతేజముచే విశ్వమును ప్రకాశింపచేయువాడు.
334) ఆదిదేవ: - సృష్టి కార్యమును ప్రారంభించినవాడు.
335) పురంధర: - రాక్షసుల పురములను నశింపచేసినవాడు.
336) అశోక: - శోకము లేనివాడు.
337) తారణ: - సంసార సాగరమును దాటించువాడు.
338) తార: - గర్భ, జన్మ, జరా, మృత్యురూపమైన భయమునుండి తరింపజేయువాడు.
339) శూర: - పరాక్రమము గలవాడు.
340) శౌరి: - బలవత్తరములైన ఇంద్రియ మనోబుద్ధులను అణిచినవాడు.
341) జనేశ్వర: - జనులకు ప్రభువు.
342) అనుకూల: - సర్వులకు అనుకూలుడైనవాడు.
343) శతావర్త: - ధర్మ రక్షణార్థము అనేక పర్యాయములు ఆవిర్భవించినవాడు.
344) పద్మీ - పద్మమును చేతియందు ధరించినవాడు.
345) పద్మనిభేక్షణ: - పద్మమువంటి నేత్రములు కలవాడు.
346) పద్మనాభ: - పద్మము నాభియందుండువాడు.
347) అరవిందాక్ష: - కమలరేకులవంటి కన్నులు గలవాడు.
348) పద్మగర్భ: - పద్మగర్భమున నివసించువాడు.
349) శరీరభృత్ - ప్రాణుల శరీరములను పోషించువాడు.
350) మహర్థి: - మహావిభూతులు కలవాడు.
351) బుద్ధ: - ప్రపంచాకారముతో భాసించువాడు.
352) వృద్ధాత్మా - సృష్టికి పూర్వమే ఉన్నవాడు.
353) మహాక్ష: - గొప్ప నేత్రములు గలవాడు.
354) గరుడధ్వజ: - తన పతాకమునందు గరుడ చిహ్నము కలవాడు.
355) అతుల: - సాటిలేనివాడు.
356) శరభ: - శరీరములందు ప్రత్యగాత్మగా ప్రకాశించువాడు.
357) భీమ: - భీకరమైన శక్తి సంపన్నుడు.
358) సమయజ్ఞ: - సర్వులను సమభావముతో దర్శించుటయే తన పూజగా భావించువాడు.
359) హవిర్హరి: - యజ్ఞములలో హవిర్భాగమును గ్రహించువాడు.
360) సర్వలక్షణ లక్షణ్య: - సర్వప్రమాణములచే సిద్ధించు జ్ఞానముచేత నిర్ణయింపబడినవాడు.
361) లక్ష్మీవాన్ - సదా లక్ష్మీదేవి తన వక్షస్థలమందు కలిగినవాడు.
362) సమితింజయ: - యుద్ధమున జయించినవాడు.
363) విక్షర: - నాశములేనివాడు.
364) రోహిత: - మత్స్యరూపమును ధరించినవాడు.
365) మార్గ: - భక్తులు తరించుటకు మార్గము తాను అయినవాడు.
366) హేతు: - సృష్టికి కారణము అయినవాడు.
367) దామోదర: - దమాది సాధనలచేత ఉదారమైన బుద్ధిద్వారా పొందబడువాడు.
368) సహ: - సహనశీలుడు.
369) మహీధర: - భూమిని ధరించినవాడు.
370) మహాభాగ: - భాగ్యవంతుడు.
371) వేగవాన్ - అమితమైన వేగము కలవాడు.
372) అమితాశన: - అపరిమితమైన ఆకలి గలవాడు.
373) ఉద్బవ: - ప్రపంచసృష్టికి ఉపాదానమైనవాడు.
374) క్షోభణ: - సృష్టికాలమందు కల్లోలము కల్గించువాడు.
375) దేవ: - క్రీడించువాడు.
376) శ్రీ గర్భ: - సకల ఐశ్వర్యములు తనయందే గలవాడు.
377) పరమేశ్వర: - ఉత్కృష్ట మైనవాడు.
378) కరణమ్ - జగదుత్పత్తికి సాధనము అయినవాడు.
379) కారణమ్ - జగత్తునకు కారణమైనవాడు.
380) కర్తా - సమస్త కార్యములకు కర్తయైనవాడు.
381) వికర్తా - విచిత్రమైన ప్రపంచమును రచించినవాడు.
382) గహన: - గ్రహించ శక్యముగానివాడు.
383) గుహ: - వ్యక్తము కానివాడు. కప్పబడినవాడు.
384) వ్యవసాయ: - మానవాళి అభ్యున్నతికి తానే కృషిచేయువాడు.
385) వ్యవస్థాన: - సర్వవ్యవహారములను యధావిధిగ నడుపువాడు.
386) సంస్థాన: - జీవులకు గమ్యస్థానమైనవాడు.
387) స్థానద: - వారివారి కర్మానుసారముగా స్థానముల నందించువాడు.
388) ధృవ: - అవినాశియై, స్థిరమైనవాడు.
389) పరర్థి: - ఉత్కృష్టమైన వైభవముకలవాడు.
390) పరమస్పష్ట: - మిక్కిలి స్పష్టముగా తెలియువాడు.
391) తుష్ట: - సంతృప్తుడు.
392) పుష్ట: - పరిపూర్ణుడు
393) శుభేక్షణ: - శుభప్రధమైన దృష్టిగలవాడు.
394) రామ: - నిత్యానంద చైతన్యములో సదా రమించువాడు.
395) విరామ: - సకలజీవులకు విశ్రాంతి స్థానమైనవాడు.
396) విరత: - విషయ వాంఛలు లేనివాడు.
397) మార్గ: - మోక్షమునకు మార్గము తానైనవాడు.
398) నేయ: - ఆత్మజ్ఞానము ద్వారా జీవులను నడిపించువాడు.
399) నయ: - జీవులను నడిపించి పరమపదస్థితికి గొనిపోవువాడు.
400) అనయ: - తనను నడుపువాడు మరొకడు లేనివాడు.
401) వీర: - పరాక్రమశాలియైనవాడు.
402) శక్తిమతాం శ్రేష్ఠ: - శక్తిమంతులలో శ్రేష్ఠుడైన భగవానుడు.
403) ధర్మ: - ధర్మ స్వరూపుడు.
404) ధర్మ విదుత్తమ: - ధర్మము నెఱింగినవారిలో శ్రేష్ఠుడు.
405) వైకుంఠ: - సృష్ట్యారంభమున పంచమహాభూతములను సమ్మేళనము చేసినవాడు.
406) పురుష: - ఈ సర్వముకంటే పూర్వమునుండువాడు.
407) ప్రాణ: - ప్రాణరూపమున చేష్ట కల్గించువాడు.
408) ప్రాణద: - ప్రాణమును ప్రసాదించువాడు. ప్రాణము లిచ్చువాడు.
409) ప్రణవ: - ఓంకార స్వరూపుడు.
410) పృథు: - ప్రపంచరూపమున విస్తరించినవాడు.

లక్ష్మీదేవికి వాహనం గుడ్లగూబ ?

 గొప్ప సంగీత విద్వాంసుడు, మధురమైన గానంతో కౌశికుడు అనే విష్ణుభక్తుడు తన భక్తి, గానమాధుర్యంతో విష్ణువుని మెప్పించి ప్రసన్నం చేసుకున్నాడు. కౌశికుడు మరణించిన తరువాత వైకుంఠం చేరుకున్నాడు. మహావిష్ణువు కౌశికుడిని తన అంతరంగిక సంగీత సభను ఏర్పాటు చేశాడు. త్రిలోకసంచారి నారదునికి ఆ సభలోకి ప్రవేశించడానికి అనుమతి లభించలేదు.

తుంబురుడికి స్వాగత సత్కార్యాలు లభించడం చూసిన నారదుడు తన శత్రువైన తుంబురుడికి లభించిన స్థానం తనకు ఎందుకు దక్కలేదని మండిపడుతూ లక్ష్మీదేవి మందిరంలో నుండి లోనికి ప్రవేశించడానికి ప్రయత్నించాడు. కానీ లక్ష్మీదేవి చెలికత్తెలు నారదుణ్ణి లోనికి అనుమతించలేదు. కోపగించిన నారదుడు లక్ష్మీదేవిని శపించాడు. ఈ విషయం తెలుసుకున్న లక్ష్మీదేవి, మహావిష్ణువు నారదుడి ఎదుట ప్రత్యక్షమై తన పొరపాటును మన్నించమని వేడుకున్నారు. దాంతో నారదుడు శాంతించాడు.

నారదుడు చల్లబడడం చూసిన మహావిష్ణువు నారదునితో ఇలా అన్నాడు … నారదా నీకోపానికి కారణం నాకు తెలుసు. నిజానికి భక్తిజ్ఞానంలో, శీలవర్తనలో తుంబురుడు నీకన్నా గర్విష్టి కాదు. కపట భక్తిని ప్రదర్శించేవారు ఎన్ని తీర్థాలు సేవించినా అవి వ్యర్థం అవుతాయి. భక్తిశ్రద్ధలతో నన్ను కొలిచేవారికి నేను ఎప్పుడూ దాసుడనే. సంగీతంతో నన్ను చేరవచ్చు అనే సత్యాన్ని చాటిచెప్పడానికే నేను తుంబురుడిని, కౌశికులను సత్కరించాను. నీవు ఇచ్చిన శాపం లోకానికి మేలే జరుగుతుంది అని చెప్పాడు.

దీంతో జ్ఞానోదయమైన నారదుడు … ఓ దేవా నా తప్పులను క్షమించు. అవివేకుడిలా ప్రవర్తించాను. నన్ను కాపాడు. తుంబర, కౌశికుల సంగీత పరిజ్ఞానం నాలో లేదు అందుకే ఇంతకీ విపరీతం జరిగి ఉండేది కాదు అంటూ తీవ్ర దుఃఖభారంతో కన్నీళ్లు కారుతుండగా నారదుడు మహావిష్ణువు పాదాలపై పడ్డాడు.
విష్ణువు నారదుణ్ణి పైకి లేపి ధైర్యం చెప్పాడు. సంగీతం నేర్చుకోవాలనే సంకల్పం నిజంగా నీకు ఉంటే నేను చెప్పినట్లు చేయి. ఉత్తరాన మానస సరొవరానికి అవతలివైపు ఒక పర్వత శిఖరం ఉంది. దానిమీద ఒక ఉలూకపతి ఉన్నాడు. అతనికి శుశ్రుష చేసి సంగీతంలో మేటివి అవమని దీవించాడు. మహావిష్ణువుకి కృతజ్ఞతలు తెలిపి మనోవేగంతో మానస సరోవరం చేరుకున్నాడు నారదుడు.

అక్కడికి చేరుకున్న నారదుడికి కమ్మని సంగీతం అస్పష్టంగా వినిపించింది. గాలిలో తెరలు తెరలుగా వస్తున్న ఆ గానమాదుర్యాన్ని అనుసరించి అవతల ఉన్న శిఖరాన్ని చేరుకున్నాడు. అక్కడ గాంధర్వ, కిన్నెర, కింపురుష, అప్సరసలు ఎందఱో సంగీత అభ్యాసం చేస్తూ కనిపించారు. వారి మధ్యలో దివ్యకాంతులతో ప్రకాశిస్తున్న ‘గానబంధు’ నారదుణ్ణి చూసి ఎదురేగి ఆదరంగా ఆహ్వానించి ఆసనం చూపించి కుశలప్రశ్నలు వేశాడు. వచ్చిన కారణం ఏమిటని అడిగాడు.

నారదుడు ‘గానబందు’ వినయానికి, సంగీత పరిజ్ఞానానికి ఆశ్చర్యపోయి తనకు తెలియని ఈ సంగీత సామ్రాట్టు ఎవరు అని ఆలోచించసాగాడు. అతను ఎవరైతే తనకెందుకు తనకు కావలసింది సంగీత విద్య. నారదుడు ఉలూకపతికి నమస్కరించి తానూ వచ్చిన కారణం తెలుపుతూ తుంబుర, కౌశికులు తమ గానమాధుర్యంతో విష్ణువుని ప్రసన్నం చేసుకున్నారని తనకు కూడా అలాంటి దివ్యగాన విద్యని ప్రసాదించమని వేడుకున్నాడు. నారదుడి ఆంతర్యం కనిపెట్టిన గానబంధు ముందుగా తానూ ఎవరో వివరించసాగాడు.

పూర్వకాలంలో ధర్మవర్తనుడు, జాలిగుండెగల భువనేశుడనే రాజు ఉండేవాడు. అతను సంప్రదాయాలను అనుసరించి ధర్మకార్యాలు అన్నీ క్రమం తప్పకుండా నిర్వహిస్తూ ఉండేవాడు. అటువంటి ఉత్తమపాలకుడు సంగీతాన్ని మాత్రం నిషేధించాడు. తన రాజ్యంలో ఎవరైనా గానం ఆలపిస్తే మరణశిక్ష విధించమని మంత్రులకు ఆజ్ఞ ఇచ్చాడు. భగవంతుణ్ణి కూడా భక్తీ గీతాలతో స్తుతించకూడదని చాటింపు వేయించాడు.

ఒకరోజు హరిమిత్రుడు అనే భక్తుడు రాజు ఆజ్ఞను విస్మరించి భగవంతుణ్ణి కీర్తిస్తూ గానం చేశాడు. ఆ గానమాదుర్యంలో మునిగిపోయిన ప్రజలు కూడా పాడకూడదు అన్న విషయాన్ని మరచిపోయారు. వెంటనే రాజభటులు వచ్చి హరిమిత్రున్ని తీసుకువెళ్ళి రాజు ముందు నిలబెట్టారు. రాజు ఆలోచనలో పడ్డాడు. గానం ఆలపించినవాడు బ్రాహ్మణుడు. అతన్ని చంపితే బ్రాహ్మహత్యా దోషం కలుగుతుంది, అందుకే హరిమిత్రుని సంపదను స్వాధీనం చేసుకుని, మరణశిక్షకు సమానమైన దేశబహిష్కరణ శిక్షను విధించాడు.

కొంతకాలానికి రాజు మరణించాడు. మానవుడిగా మరణించిన రాజు మరుసటి జన్మలో గుడ్లగూబగా జన్మించాడు. గుడ్లగూబ రాత్రిళ్ళు మాత్రమే ఆహారాన్ని సంపాదించుకోవాలి. అందుకు తిండి ఒక సమస్యగా తయారయింది గుడ్లగూబకు. గతజన్మ దోషఫలితం వల్ల ఒకసారి నాలుగు రోజులు అయినా ఆహారం లభించలేదు. ఆకలితో అలమటిస్తూ ఆఖరికి మరణాన్ని ఆహ్వానించాడు. గుడ్లగూబగా జన్మించిన రాజు గతజన్మలో తాను చేసిన కొన్ని పుణ్యకార్యాలవల్ల యమధర్మరాజు వచ్చి ఎదురుగా నిలబడ్డాడు.

యమున్ని చూసి … యమధర్మరాజా ఎందుకు ఈ విధంగా నన్ను బాధపెడుతున్నావు. నేను గతజన్మలో రాజుగా ప్రజలపై ఎంతవరకు దయాదాక్షిణ్యాలు చూపించాలో అంతవరకూ చూపించాను. నీవు ఎందుకు నాపై దయ చూపావు అన్నాడు. భువనేశుడి స్థితికి జాలిపడ్డాడు యమధర్మరాజు. తాము చేసిన తప్పు తెలియకుండా ఎవరైనా శిక్ష అనుభవించడం ధర్మం కాదు, తెలిసినప్పుడే కదా పశ్చాత్తాపం కలిగేది అని ఆలోచించిన యమధర్మరాజు భువనేశుడికి అతను చేసిన తప్పు ఏమిటో చెప్పాడు …

గానబంధు! నీవు రాజుగా ఉన్నప్పుడు అనేక సత్కార్యాలు చేసిన మాట నిజమే. కానీ పరమాత్ముణ్ణి వేదమంత్రాలతో మాత్రమె స్తుతించాలని శాసించడం నీ మూర్ఖత్వం. పరమపావనమైన సన్తేఎతమ్తొ హరికీర్తన చేసిన హరిమిత్రున్ని శిక్షించిన పాపం ఏమైనా తక్కువా. ఆ పాప ఫలితం కొండంత అయి నీకు లభించిన పుణ్యఫలాన్ని మించిపోయింది. అదే నేడు నిన్ను పట్టిపీడిస్తుంది. విష్ణుభక్తులకు చేసిన చేసిన కీడు నీకు ఈ అవస్థ తెచ్చిపెట్టింది. దీనినుండి బయటపడటం ఎవరికీ సాధ్యం కాదు.

యమధర్మరాజు చెప్పింది విన్నాక గాని గుడ్లగూబకు తానూ చేసిన తప్పు ఏమిటో అర్థం కాలేదు. ఏ మార్గంలోనైనా భగవంతుణ్ణి స్తుతించవచ్చు అన్న జ్ఞానం కలిగి తానూ చేసిన తప్పును క్షమించి ఈ సంకటం నుండి ఎలాగైనా బయటపడే మార్గాన్ని చూపించమని యమధర్మరాజు పాదాలపై పడి వేడుకున్నాడు.
యమధర్మరాజు హృదయం ద్రవించి … ఉలూకరాజా చేసిన తప్పుకు శిక్ష అనుభవించక తప్పాడు. ఈ పాపానికి మించిన శిక్ష అనుభవించినట్లయితే శిక్ష కాస్తంత తగ్గుతుంది. నీవు అంగీకరిస్తే అక్కడ నున్న గుహలోకి వెళ్ళు. అందులో నీ గతజన్మ దేహం ఉంది. అందులోనుండి రోజూ కొంత మాంసాన్ని చీల్చుకుని భుజించు. అది పూర్తి అయిన అనంతరం నీకు శుభం కలుగుతుంది అని దీవించి అంతర్థానం అయ్యాడు.

ఈ వివరాలు నారదుడికి చెప్పిన గుడ్లగూబ ఓ మహర్షీ ఆ దురదృష్టవంతుడిని నేనే. ఆ తరువాత నేను ఒకరోజు నా శవం దగ్గర కూర్చుని ఉండగా, దివ్య తేజస్వి అయిన ఒక బ్రాహ్మణుడు రథంలో వెళ్తూ నా ముందు ఉన్న శవాన్ని చూసి రథాన్ని ఆపి దగ్గరకి వచ్చి చూసి ఇది భువనేశుని శవంలా ఉంది. ఇక్కడెందుకు పడి ఉంది? దీన్ని ఈ పక్షి తినడం ఏమిటి? అంటూ ఆశ్చర్యాన్ని ప్రకటించాడు.

అప్పటికి నేను ఆ బ్రాహ్మణుడిని గుర్తించాను. అతను నా చేత దేశబహిష్కరణకు గురైన హరిమిత్రుడు. వెంటనే అతని పాదాలపై పడి ప్రార్థించాను. తప్పును క్షమించమని వేడుకున్నాను. దుఃఖ అశ్రువులు నేలపై పడుతుండగా యమధర్మరాజు తెలిపిన విషయం అంతా హరిమిత్రుడికి వివరించాను, హరిమిత్రుడు అది విని చలించిపోయి తన అంతరంగం భావాలకు అనుగుణంగా ఇలా పలికాడు …

నీ బాధలు చూస్తుంటే నాకు ఎంతో విచారం కలుగుతుంది. నీవు నాపట్ల చూపిన కాఠిన్యాన్ని నేను ఆరోజే మరచిపోయాను. నీవు అనుభవించిన బాధలు ఇక చాలు. ఈ క్షణం నుండి నీకు బాధ అనేది లేకుండుగాక. గొప్ప సంగీత విద్వాంసుడవై లోకంలో ఉత్తమ సంగీత విద్యను బోధింతువుగాక అంటూ హరిమిత్రుడు నా కృతజ్ఞతను స్వీకరించి వైకుంఠానికి చేరుకున్నాడు. అతని దీవెనలు ఫలించి నేను ఇలా ఉన్నాను అంటూ గానబందు తన కథను వివరించాడు.

ఆపై నారదుడు గానబందు విద్వాంసుని శిష్యుడు అయ్యాడు. తొలిరోజునే సంగీతం ఎలా నేర్చుకోవాలో అనే విషయం మీద పాఠం చెప్పాడు. సంగీతం ఒక దివ్యకళ అన్నాడు. తపంతోగాని, తామసంతో కాని సంగీతం పట్టుబడదు అని చెప్పాడు. కళ కోసం జీవితాన్నే అర్పించాలి అని అన్నాడు. కష్టపడి నిరంతరం సాధనచేస్తే ఎవరైనా అపురూపమయిన ఈ కలలో ఆధిక్యం సాధించవచ్చు అన్నాడు. నారదుడు గానబంధుపై గౌరవభావం మోహంలో ఉట్టిపడుతుండగా వినయంగా తలవంచుకుని విన్నాడు.

వెయ్యేళ్ళు సంగీత సాధనలో గడిచిపోయాయి. కఠోరదీక్షతో నారదుడు 3,60,006 రాగాలలో మంచి ప్రావీణ్యం సంపాదించాడు. సహచరులు పొగుడుతూ ఉంటే సంగీతంలో ఇక తనకు తిరుగులేదని అనే గర్వంతో ఉబ్బిపోయాడు నారదుడు. అమితానందంతో గురువైన గుడ్లగూబను చేరుకొని కృతజ్ఞతలు తెలుపుతూ గురుదక్షిణ చేల్లిస్తాను. ఏం కావాలో సెలవివ్వమన్నాడు. ఎలాంటి కోరికనైనా సంశయం లేకుండా అడగమన్నాడు.

శిష్యుడి మాటలు విన్న గురువు సంతోషంతో ఓ మహర్షీ! దేవరుషులు అయిన మిమ్మల్ని నేను ఏమి కోరిక కోరగలను. గుడ్లగూబకు కావలసిన అవసరాలు ఏమి ఉంటాయి? నీవు శిష్యుడివి కాబాట్టి ఏదో ఒకటి కోరుకోక తప్పాడు. ఈ భూమి నిలిచి ఉన్నంతకాలం సంగీత కళతో పాటు నేను సహితం లోకంలో గుర్తుండిపోయేలా వరం ప్రసాదించు అని మనసులోని మాట బయట పెట్టడు.

నారదుడు నవ్వి గురువర్యా! ఇది మరీ చిన్న కోరిక … ఈ చిన్ని కోరిక మీకు ఉన్న సంగీత పాండిత్యం తీర్చగలదు. శిష్య ప్రశిష్యకోటి వలన భూతలంలో సంగీతకళ నిలిచి ఉన్నంత వరకు మీ కీర్తికి భంగం కలగదు. మీరు చేసిన ఈ మహోపకార్యానికి గురుదక్షిణగా లక్ష్మీనారాయణుల కటాక్షం, వారి సేవాభాగ్యాన్ని, శాశ్వత సన్నిధానాన్ని ప్రసాదిస్తున్నాను. ప్రళయం సంభవించిన వేళ శ్రీమహావిష్ణువుకి గరుత్మంతునిలా శ్రీమహాలక్ష్మీదేవికి నీవు వాహనమై తరించుగాక అంటూ శిష్యునిగా కానుకను, దేవర్షిగా వరాన్ని సమర్పించి గుడ్లగూబ దగ్గర సెలవు తీసుకుని స్వర్గలోకానికి చేరుకున్నాడు. ఈ విధంగా గానబందు అనే గుడ్లగూబ లక్ష్మీదేవికి వాహనం అయింది.

సకల దేవతా స్వరూపం గోమాత!


సద్గతులనిచ్చే గోవ్రతం

మన దైనందిన జీవితంలో మనతోపాటు మమేకమై కలసిపోయిన జీవి గోవు. గోవుని శ్రీమన్నారాయణుడి రూపంగా
పురాణాలు చెబుతున్నాయి. ఈ చరాచర సృష్టిలోని సమస్త దేవతలు గోవులో నిక్షిప్తం అయి ఉన్నాయని, ఆ కారణంగా గోవును వధించడం, దూషించడం పాపంగా పురాణాల ద్వారా అవగతమవుతోంది. అనాదిగా గోవును దైవస్వరూపంగా పూజిస్తున్నారు.

మన నిత్య జీవితంలో ‘గోవు’ ఓ ప్రధానావసరంగా మనం వినియోగించుకుంటున్నాం. గోవుపాలు, పంచకం, నెయ్యి, పేడ ఇవన్నీ మనకు ఎంతగానో ఉపయోగపడ్తున్నాయి. భౌతిక ప్రపంచంలో మనకు చేదోడువాదోడుగా ఉంటున్న ఈ గోవును పురాణాలలో దైవంగా అభివర్ణించారు. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి రూపమైన గోవును పూజించడం, అందునా ఓ పద్ధతి ప్రకారం పూజించడం సమస్త పుణ్యాలనిస్తుందంటారు. దీనికి సంబంధించి ఓ పురాణ గాథ ఒకటి వాడుకలో ఉంది.

పురాణ గాథ:-
పూర్వమొకపుడు పాండురాజు భార్య అయిన కుంతీదేవి, తన మేనల్లుడు, శ్రీమన్నారాయణుడి అంశ అయిన శ్రీకృష్ణ్భగవానుని దగ్గరకు వెళ్ళి ‘‘మధుసూదనా...స్ర్తిలు దోషభూయిష్టమైన రుతుకాలంలో ఇంట్లోవారిని ముట్టుకోవడం, సూదితో వస్త్రాలను కుట్టడం లాంటి పనులు తెలిసీ తెలియక చేస్తూ వుంటారు. అలాగే పెద్దలను
నిందించడం, స్వపర ద్రవ్యాపహరణం లాంటి దుష్కర్మలు తెలిసికొని, తెలియక కాని చేస్తూ వుంటారు. అలాంటి
దుష్టకార్యాలు చేసినపుడు సంక్రమించిన పాపాలు పోవడానికి ఆచరించాల్సిన వ్రతమొకదానిని చెప్పమని అడిగిందట. దానికి శ్రీకృష్ణ్భగవానుడు, కుంతీదేవిని ఉద్దేశించి, ఆయా పాపాలన్నీ పోవడానికి గోవ్రతమనే వ్రతం
ఉందని దానిని ఆచరిస్తే ఆయా పాపాలన్నీ పోయి, సర్వసౌఖ్యాలు సొంతమవుతాయని చెప్పాడు. ఈ
వ్రతం నాలుగు విధాలుగా ఉంటుందని, దీనిని ఆచరిస్తే పాప విముక్తులై, పుణ్యం సిద్ధిస్తుందని చెప్పాడు. అలాగే జపతపాలు, వ్రతోపవాసాలు తదితరాలవల్ల కలిగే పుణ్యం గోవ్రతంవల్ల కూడా కలుగుతుందని చెప్పాడు.
సూర్యుడు మకరంలోకి ప్రవేశించినపుడు కానీ, రథసప్తమినాడు కానీ, తమ జన్మనక్షత్రానికి అనుకూలమైనపుడు ఈ వ్రతాన్నిఆరంభించాలి. అలాగే రజోదోషం వీడిన స్ర్తిలు 18 నెలల తరువాత ఈ వ్రతాన్ని ఆచరించాలి. మకర సంక్రాంతి, రథ సప్తమి, మంగళవారంతో కూడినకృష్ణచతుర్దశి, కార్తీకం, మార్గశిర మాసాలలో ఈ వ్రతాన్ని ఆచరిస్తే సమస్త దోషాలు మటుమాయవౌతాయి. శ్రీకృష్ణుని సూచనమేరకు కుంతీమాత ఈ వ్రతాన్ని ఆచరించి, సద్గతి పొందింది. ఆనాటినుంచి ‘గోవు’దైవంగా పూజింపబడ్తూ, నీరాజనాలందుకుంటోంది.

గోవ్రతం చేయడానికి నియమాలు:
* ఈ వ్రతం చేసేవారు ప్రాతఃకాలంలోనే నదీ స్నానం చేయాలి.
* నిత్యపూజాదికాలను ముగించుకున్న తర్వాత ఇంటికి తూర్పున మంటపం వేయాలి. అయిదు రంగులతో స్వస్తిక్,
పద్మక, నాగబంధాది మండలాలను నిర్మించాలి.
* లక్ష్మీనారాయణుడి ప్రతిమను బంగారం, వెండి లేదా యథాశక్తి చేయించి పంచామృతాలతో అభిషేకించాలి.
* ఆవు, దూడ కల ప్రతిమను బంగారు, లేదా వెండి లేదా యథాశక్తి చేయించాలి. అనంతరం పంచామృతాలతో అభిషేకించాలి.
* ఆ ప్రతిమలను బియ్యపురాశిలో ఉంచి పంచ పల్లవమాలతో పంచ వల్కలములతో నలంకరించి కలశాన్ని కొత్త వస్త్రాల చాపుతో చుట్టి పూజించాలి.
* అనంతరం దూడ కల్గినటువంటి ఆవును పూజించాలి.
* ఆవును రాత్రి నాలుగు జాములయందు పూజించి పురాణ శ్రవణాదులతో రాత్రి జాగారం చేయాలి.
* తర్వాత సంప్రదాయానుసారంగా అగ్నిప్రతిష్టచేసి, సమిధలు, పాయసాన్ని హవిస్సు చేసి, హోమం చేయాలి.
పూర్ణాహుతినిచ్చిన తర్వాత ఆచార్యునికి ప్రతిమను, వస్త్రాలతో దానమీయాలి.
* గో దానాన్ని శక్తి ఉంటే మిగిలిన దశ/షోడశ దానాలను చేసి పనె నండు మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి.
ఇలా ఈ వ్రతాన్ని ఆచరించేవారు అన్ని వేదాలు చదివితే వచ్చే పుణ్యఫలాలను అన్ని తీర్థాలందు స్నానమాచరించిన
పుణ్యఫలాలను పొంది సద్గతులను పొందుతారని శ్రీకృష్ణ్భగవానుడు చెప్పాడు.

గావో విశ్వస్యమాతర:
గోవు సమస్త విశ్వానికి తల్లి . ” సమస్త జీవరాశిని పాలించి , పోషించి , కాపాడే తల్లి గోమాత ” . అని స్పష్టం చేసింది . ధర్మాసనం మీద ఆసీను రాలైన భారత మాత . ఇది సనాతన ధర్మ దివ్య శంఖారావం . గోవు అందించే ప్రతి అంశము సమస్త సృష్ఠికి ఆశీర్వాదమే.

” మహస్త వేవ గోర్మహమా ” అని శత పధ బ్రాహ్మణం చెపుతుంది . ” గోవు మహిమ ఎంత వర్ణించినా తక్కువే ” అని అర్ధం . ” దేను సదనం రాజీనా౦ ” అని అధర్వణ వేదం స్పష్టం చేసింది . అంటే గోవు సమస్త సంపదలకు మూలం . గావ: స్వర్గస్య సోపానం గావ:స్వర్గేపి పూజితా: ( మహాభారతం) ” గోవులు స్వర్గానికి సోపానాలు . గోవులు స్వర్గం లో కూడా పూజింప బడుతాయి ” . ” గోఘ
భక్తశ్చలభతే యత్ యది చ్ఛతి మానవ: ( మహాభారతం) ” గోభక్తుడైన మానవుడు ఏమి కోరికలు కోరుకుంటాడో అతనికి అవన్నీ లభిస్తాయి ” .

యాయ౦ గావో భేదయిథాకృష౦చిద్ షీర౦చిత్ క్రునుథా సుప్రథీక౦ భద్ర / గృహం కృనుథ భద్రవాచో వృహద ఓవయి ఉచ్చతే సభాసు // ( ఋగ్వేదం )
ఓ గోమాత , నువ్వు బలహీనుడిని కూడా బలవంతుని చేస్తావు . వర్చస్సును తెస్తావు . ఇంటిని సుఖ సంతోషాలతో నింపుతావు . నీ అమృత ప్రాయమైన పాల గురించి అంతా చెప్పుకుంటారు ” . తృునోదకాది సంయుక్తం య: ప్రాపద్యాత్ గవాహ్నికమ్/ సోశ్మెధ సమం పుణ్యం లభతే నాత్ర సంశయ: // ( బృహత్ పరాశర స్మృతి ) ప్రతి దినము గోవులకు నీరు త్రాగించి , గడ్డిని మేతగా తినిపించే వారికి అశ్వమేధ యాగం చేసిననంత పుణ్యం వస్తుంది .
ఇందులో కించత్తు కూడా సందేహం లేదు .

Friday, May 29, 2015

శివ నామ మహిమ

శివుని ఉపాసి౦చు వారు ధన్యులు. కృత కృత్యులు. వారి జన్మ సఫలమగును. వారి కులము ఉద్ధరి౦పబడును. సదాశివ, శివ అ౦టూ శివనామమును జపి౦చు వానిని చెదలు నిప్పును వలె, పాపములు స్పృశి౦చజాలవు. ఓ శివా! నీకు నమస్కారము అని పలికే నోరు పాపములనన్నిటినీ పోగొట్టే పవిత్ర తీర్థము. ఎవనియ౦దు అత్య౦త శుభకరములగు శివనామము, విభూతి, రుద్రాక్షలు అనే మూడు ఉ౦డునో, అట్టివాని దర్శన మాత్రముచేత త్రివేణీ స౦గమములో స్నానము చేసిన ఫలము లభి౦చును. వాని దర్శనము పాపములను పోగొట్టును. ఎవని లలాటముపై విభూతి లేదో, ఎవని శరీరమున౦దు రుద్రాక్ష ధరి౦పబడదో, ఎవని పలుకులు శివనామ భరితములు కావో అట్టి వానిని అధముని వలె త్యజి౦చవలెను. శివనామము గ౦గ వ౦టిది. విభూతి యమున వ౦టిది. రుద్రాక్ష సర్వపాపములను పోగొట్టే సరస్వతీ నది వ౦టిది.

ఈమూడు ఎవని శరీరమున౦దు గలవో, వాని పుణ్యమును ఒకవైపు, త్రివేణీ స౦గమ స్నానము వలన లభి౦చు పుణ్యమును మరియొకవైపు ఉ౦చి విద్వా౦సులే కాక పూర్వము బ్రహ్మ కూడా లోకహితమును కోరి పోల్చి చూసెను. రె౦డి౦టి ఫలము సమానముగను౦డెను. కావున విద్వా౦సులు అన్నివేళలా ధరి౦చవలెను. ఆనాటి ను౦డియూ బ్రహ్మ, విష్ణువు మొదలగు దేవతలు మూడి౦టినీ ధరి౦చుచు౦డిరి. వీటి దర్శనము పాపములను పోగొట్టును.

శివనామమనే దావాగ్ని యెదుట మహాపాపములనే పర్వతములు తేలికగా బూడిదయగునను మాట ముమ్మాటికీ సత్యము. స౦సరమునకు మూలమైన పాపములు శివనామము అనే గొడ్డలితో నిశ్చయముగా నాశమును పొ౦దును. శివనామమున౦దు భక్తి కలిగిన మహాత్ములకు ముక్తి శీఘ్రముగా లభి౦చును. అనేక జన్మములు తపస్సు చేసిన వానికి పాపములన్నిటినీ పోగొట్టే శివనామమున౦దు భక్తి కుదురును. ఎవనికి శివనామము న౦దు అతిశయి౦చిన నిర౦తర భక్తి కుదురునో వానికి మాత్రమే మోక్షము సులభమగుననియు, ఇతరులము దుర్లభమనియు శివపురాణమున౦దు చెప్పబడినది.

అన్నపూర్ణ దేవత

 అన్నపూర్ణ అనగా పార్వతి కి మరోపేరు.అన్నపూర్ణ అంటే ఈశ్వరస్వరూపం. ఈశ్వరుని సతి కూడా .ఇంకా అన్నపూర్ణమ్మను లక్ష్మీ, సరస్వతుల రూపంగానూ కొలుస్తారు. సర్వమంగళకారిణి, అన్నపూర్ణామాతను పూజిస్తే సర్వవ్యాధులు, ఈతిబాధలు తొలగిపోతాయని పురోహితులు అంటున్నారు.జీవుల జీవాన్ని నియమింపజేసి, అనుగ్రహించే కరుణామయి, జగన్మాత అన్నపూర్ణాదేవి, అని ప్రశ్నోపనిషత్ చెప్తోంది.ఈ విషయానే్న, యజుర్వేద తైత్తిరీయ ఆరణ్యకం, బృహదారణ్యకోపనిషత్, భగవద్గీత మనకు అందచేస్తున్నాయి.

శరన్నవరాత్రుల్లో అమ్మవారు.. ఈరోజు.. అన్నపూర్ణ దేవిగా దర్శనమిచ్చింది.. అన్నపూర్ణ దేవి అంటే.. ఓ ఇల్లాలిగా.. ఓ తల్లిగా కుటుంబంలో మహిళకు ఉండే పాత్రను చాటిచెప్పే అవతారం.. అన్నపూర్ణ.. ఆకలితో ఉన్న వారెవరికైనా అన్నం పెట్టి ఆదరించమనే సందేశము…అమ్మవారు మనకు ఇస్తుంది. కుటుంబంలో తల్లిపాత్రకు…ఉన్న ప్రాథాన్యాన్ని…ఈ అవతారము మనకు బోదపడేలా చేస్తుంది.అన్నపూర్ణ దేవి శక్తిని, బుద్ధిని కూడా ఆమే ఇస్తుంది. ‘భిక్షాం దేహీ కృపావలంబన కరీ మాతాన్నపూర్ణేశ్వరి’ అని నిత్యం కొలిచిన వారికి ఈతిబాధలు ఉండవని పురాణాలు చెబుతున్నాయి.

సకల ప్రాణులలో చైతన్య స్వరూపిణి అయి, ప్రాణులకు మంచి బుద్ధిని ప్రసాదించే బ్రహ్మ విద్యాస్వరూపిణి- అన్నపూర్ణాదేవి. అన్నము సమృద్ధిపరచుము, దీనిని వ్రతముగా పాటించాలి. అంటే, ఆహార ధాన్యాల్ని ప్రజలకందరకు సరిపోయేటట్లుగా సమృద్ధిగా దీక్షతో దక్షతగా కృషిచేసి పండించాలి. ఈ కృషిలో అందరూ పాలుపంచుకోవాలి. భూమియే- అన్నము. ఆకాశము అన్నాదము, అనగా భూమి నుండి అన్నమునకు సంబంధించిన పంట పండుతోంది. ఆకాశము భూమిపైగల జలమును సూర్యరశ్మి ద్వారా సేకరించి తిరిగి వర్షరూపమున పంటలకు అందించుచున్నది. భూమియందు ఆకాశము ఆకాశమునందు భూమి ప్రతిష్ఠితమవుతున్నాయి. ఇవి ఒకదానికొకటి అన్నము, అన్నాదులు. ఈ విషయాన్ని తెలుసుకున్నవాడు, అన్నపూర్ణాదేవి అనుగ్రహాన్ని పొందినవాడై, అన్నము, పుత్రపౌత్రాభివృద్ధి పశు సంపద బ్రహ్మవర్చస్సు కలిగి కీర్తిమంతుడవుతాడు.

అన్నం ఎలా పుడుతుందనే విషయాన్నికూడా వేదం వివరించింది. పరబ్రహ్మతత్త్వమునుండియే ఆకాశము ఉద్భవించింది. ఆకాశమునుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్నినుండి జలము, జలమునుండి భూమి, భూమినుండి ఔషధులు (మొక్కలు) ఓషధులనుండి అన్నము, అన్నమునుండి ప్రాణి పుడుతున్నాయి. కనుక పురుషాది ప్రాణికోటి అన్నరసమయము. అన్నరసమయుడైన ఈ పురుషుడే ఆ పరమ పురుషుడు. అనగా పరబ్రహ్మతత్త్వము. ఈ విధముగా జీవబ్రహ్మైక్య స్థితిని ప్రసాదించే కరుణామయి. అన్నపూర్ణాదేవి.
దీనులకు అన్నము ఉదకము దానము చేయుటం ధర్మము. దాన్ని ఆచరిస్తే, శ్రేయస్సు ఆరోగ్యము, సర్వశుభములు కలుగుతాయి. అన్న, ఉదక దానములకు మించిన దానము లేదని, అదే అన్నపూర్ణేశ్వరి ఆరాధన అని పేర్కొన్నది మహాభారతము.ప్రకృతి స్వరూపం- ఋతువులు. శక్తిస్వరూపమే ప్రకృతి. అన్నాన్నిచ్చి శారీరకంగా పుష్ఠివంతులుగా చేసేది, సద్బుద్ధి భిక్ష నొసగి జ్ఞాన పుష్టివంతులగా నొనర్చు కరుణామయి, విశేషంగా అర్చించబడు, మూల ప్రకృతి శక్తి- అన్నపూర్ణాదేవి.

‘‘బిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ’’ అని ఆదిశంకరులు ప్రార్థించిన అన్నపూర్ణాష్టకం తప్పనిసరిగా పారాయణ చేయాలి.

‘‘పూర్ణ మదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే, పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా వశిష్యతే’’ కనుపించనివన్నీ శక్తిచే నిండి ఉన్నాయి. కనిపించేవి అన్నీకూడా ఆ శక్తి చేత వ్యాప్తములై ఉన్నాయి. అఖిల ప్రపంచమూ ఆ పూర్ణ శక్తినుండే వచ్చింది. అయినా, ప్రపంచమంతా నీ నుండే వచ్చినా, ఇంకా ఆ శక్తి ‘పూర్ణమే’. ఆ పూర్ణశక్తియే ‘అన్నపూర్ణ’.

దీపావళినాడు కాశీక్షేత్రంలో అన్నపూరాణ దేవిని, స్వర్ణ ఆభరణాలతో అలంకరించి దేవాలయాన్ని దివ్యకాంతులీనే దీపాలతో అలంకరిస్తారు. ‘కాశీ’ అంటే వెలుగు. అందుకే వారణాసికి కాశీ అని పేరు వచ్చింది.అనంతమైన విశ్వశక్తిని ఆకళింపు చేసుకొని, విశ్వమానవ కల్యాణాన్ని వీక్షించాలని చెప్తోంది, అఖిల భువనసాక్షి- అన్నపూర్ణాదేవి

Sunday, May 24, 2015

శ్రీదుర్గా అష్టోత్తర శతనామస్తోత్రం

దుర్గా శివా మహాలక్ష్మీ-ర్మహాగౌరీ చ చండికా |
సర్వఙ్ఞా సర్వలోకేశీ సర్వకర్మఫలప్రదా || 1 ||

సర్వతీర్థమయీ పుణ్యా దేవయోని-రయోనిజా |
భూమిజా నిర్గుణాధారశక్తిశ్చానీశ్వరీ తథా || 2 ||

నిర్గుణా నిరహంకారా సర్వగర్వవిమర్దినీ |
సర్వలోకప్రియా వాణీ సర్వవిద్యాధిదేవతా || 3 ||

పార్వతీ దేవమాతా చ వనీశా వింధ్యవాసినీ |
తేజోవతీ మహామాతా కోతిసూర్యసమప్రభా || 4 ||

దేవతా వహ్నిరూపా చ సరోజా వర్ణరూపిణీ |
గుణాశ్రయా గుణమధ్యా గుణత్రయవివర్జితా || 5 ||

కర్మఙ్ఞానప్రదా కాంతా సర్వసంహారకారిణీ |
ధర్మఙ్ఞానా ధర్మనిష్టా సర్వకర్మవివర్జితా || 6 ||

కామాక్షీ కామసంహర్త్రీ కామక్రోధవివర్జితా |
శాంకరీ శాంభవీ శాంతా చంద్రసూర్యాగ్నిలోచనా || 7 ||

సుజయా జయభూమిష్ఠా జాహ్నవీ జనపూజితా |
శాస్త్రా శాస్త్రమయా నిత్యా శుభా చంద్రార్ధమస్తకా || 8 ||

భారతీ భ్రామరీ కల్పా కరాళీ కృష్ణపింగళా |
బ్రాహ్మీ నారాయణీ రౌద్రీ చంద్రామృతపరివృతా || 9 ||

జ్యేష్ఠేందిరా మహామాయా జగత్సృష్ట్యాధికారిణీ |
బ్రహ్మాండకోటిసంస్థానా కామినీ కమలాలయా || 10 ||

కాత్యాయనీ కలాతీతా కాలసంహారకారిణీ |
యోగనిష్ఠా యోగగమ్యా యోగధ్యేయా తపస్వినీ || 11 ||

ఙ్ఞానరూపా నిరాకారా భక్తాభీష్టఫలప్రదా |
భూతాత్మికా భూతమాతా భూతేశా భూతధారిణీ || 12 ||

స్వధానారీమధ్యగతా షడాధారాదివర్ధినీ |
మోహితాంశుభవా శుభ్రా సూక్ష్మా మాత్రా నిరాలసా || 13 ||

నిమ్నగా నీలసంకాశా నిత్యానందా హరా పరా |
సర్వఙ్ఞానప్రదానందా సత్యా దుర్లభరూపిణీ || 14 ||

సరస్వతీ సర్వగతా సర్వాభీష్టప్రదాయినీ |


శ్రీ శివాష్టకమ్

ప్రభుం ప్రాణనాథం  విభుం విశ్వనాథం జగన్నత నాథం సదానంద భాజం
భావద్ భవ్యభుతేయ్స్వరం భుతనాథం శివం శంకరం శంభు మిశానమిడే ||

గలే రుండమాలం తనవ్  సర్పజాలం మహాకాల కాలం  గానేశాది పాలం
జటాజుట గంగాతరంగైర్విశాలం  శివం శంకరం  శంభు మిశానమిడే  ||

ముదామకరం  మండనం  మండయంతం  మహామండలం  భస్మభూషా ధరాoతంతమ్
అనాది హ్యపారం  మహామోహారూపం శివం శంకరం  శంభు మిశానమిడే  ||

వటాధో  నివాసం  మహాట్టాట్టహాసం  మహాపాపనాశం సదా సుప్రకాశం
గిరీశం  గణేశం  సురేశం మహేశం శివం శంకరం  శంభు మిశానమిడే   ||

గిరీద్రత్మజ సమగృహితర్ధదేహం  గిరావ్  సంస్థితం  సర్వదా పన్నగేశం
పరబ్రహ్మ బ్రహ్మాది భిర్వంధ్యమానం  శివం శంకరం శంభుమిశానమిడే  ||

కపాలం  త్రిశూలం  కరభ్యం  దధానం పదామ్రోజ నమ్రాయ  కామం  దాధానం
బలీవర్దమానం సురాణం  ప్రధానం  శివం శంకరం శంభుమిశానమిడే   ||

శరచ్చంద్రగాత్రం  గూణానంద పాత్రం  త్రినేత్రం  పవిత్రం  ధనేశస్య  మిత్రం
అపర్ణ కళాత్రం సదా సచ్చరిత్రం  శివం  శంకరం  శంభుమిశానమిడే  ||

హారం సర్పాహారం  చితాభువిహారం భావంవేదసారం  సదా నిర్వికారం
స్మశానే వసంతం  మనోజం దహంతం శివం శంకరం శంభు మిశానమిడే  ||

స్వయం యః  ప్రభాతే  నరః శులపాణీ  పటేత్  స్తోత్రరత్నం  త్రిహప్రప్యారత్నం
సుపుత్రం సుభాగ్యం  సుమిత్రం  కళత్రం విచిత్రై  సమారాధ్య  మోక్షం  ప్రయాతి  ||


శ్రీ బిల్వష్టకం

త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం
త్రిజన్మ పాపసంహారం ఏకబిల్వం శివార్పణం. (1)

త్రిశాఖైః బిల్వపత్రైశ్చ అచ్చిద్రైః కోమలైః శుభైః
తవపూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం. (2)

కోటి కన్యా మహాదానం తిలపర్వత కోటయః
కాంచనం క్షీలదానేన ఏకబిల్వం శివార్పణం. (3)

కాశీక్షేత్ర నివాసం చ కాలభైరవ దర్శనం
ప్రయాగే మాధవం దృష్ట్వా ఏకబిల్వం శివార్పణం. (4)

ఇందువారే వ్రతం స్థిత్వా నిరాహారో మహేశ్వరాః
నక్తం హౌష్యామి దేవేశ ఏకబిల్వం శివార్పణం. (5)

రామలింగ ప్రతిష్ఠా చ వైవాహిక కృతం తధా
తటాకానిచ సంధానం ఏకబిల్వం శివార్పణం. (6)

అఖండ బిల్వపత్రం చ ఆయుతం శివపూజనం
కృతం నామ సహస్రేణ ఏకబిల్వం శివార్పణం. (7)

ఉమయా సహదేవేశ నంది వాహనమేవ చ
భస్మలేపన సర్వాంగం ఏకబిల్వం శివార్పణం. (8)

సాలగ్రామేషు విప్రాణాం తటాకం దశకూపయోః
యజ్నకోటి సహస్రస్చ ఏకబిల్వం శివార్పణం. (9)

దంతి కోటి సహస్రేషు అశ్వమేధ శతక్రతౌ
కోటికన్యా మహాదానం ఏకబిల్వం శివార్పణం. (10)

బిల్వాణాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం
అఘోర పాపసంహారం ఏకబిల్వం శివార్పణం. (11)

సహస్రవేద పాటేషు బ్రహ్మస్తాపన ముచ్యతే
అనేకవ్రత కోటీనాం ఏకబిల్వం శివార్పణం. (12)

అన్నదాన సహస్రేషు సహస్రోప నయనం తధా
అనేక జన్మపాపాని ఏకబిల్వం శివార్పణం. (13)

బిల్వస్తోత్రమిదం పుణ్యం యః పఠేచ్చివ సన్నిధౌ
శివలోకమవాప్నోతి ఏకబిల్వం శివార్పణం.


శ్రీ లింగాష్టకమ్

బ్రహ్మ మురారి సురార్చిత లింగం
నిర్మల భాసిత శోభిత లింగం
జన్మజ దుఃఖ వినాశక లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం (1)

దేవముని ప్రవరార్చిత లింగం
కామదహన కరుణాకర లింగం
రావణ దర్ప వినాశక లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం (2)

సర్వ సుగంధ సులేపిత లింగం
బుద్ధి వివర్ధన కారణ లింగం
సిద్ధ సురాసుర వందిత లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం (3)

కనక మహామణి భూషిత లింగం
ఫణిపతి వేష్టిత షోభిత లింగం
దక్ష సుయజ్న నినాశక లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం (4)

కుంకుమ చందన లేపిత లింగం
పంకజ హార సుశోభిత లింగం
సంచిత పాప వినాశక లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం (5)

దేవగణార్చిత సేవిత లింగం
భావైర్భక్తిభి రేవచ లింగం
దినకర కోటి ప్రభాకర లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం (6)

అష్టదళోపరివేష్టిత లింగం
సర్వసముద్భవ కారణ లింగం
అష్టదరిద్ర వినాశక లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం (7)

సురగురు సురవర పూజిత లింగం
సురవన పుష్ప సదార్చిత లింగం
పరమపదం పరమాత్మక లింగం
తత్ప్రణమామి సదాశివ లింగం (8)

లింగాష్టకమిదం పుణ్యం యః పఠేచ్చివ సన్నిధౌ
శివలోకమవాప్నోతి శివేన సహమోదతే.


శివాషోత్తర శతనామములు

ఓం శివాయ నమః
ఓం మహెశ్వరాయ నమః
ఓం శంభవే నమః
ఓం పినాకినె నమః
ఓం శశిశెఖరాయ నమః
ఓం వామదెవాయ నమః
ఓం విరూపాక్షాయ నమః
ఓం కపర్దినే నమః
ఓం నీలలొహితాయ నమః
ఓం శంకరాయ నమః
ఓం శూలపాణయె నమః
ఓం ఖత్వంగినే నమః
ఓం విష్హ్నువల్లభాయ నమః
ఓం శిపివిశ్హ్నయ నమః
ఓం అంభికానాథాయ నమః
ఓం శ్రీకణ్ఠాయ నమః
ఓం భక్తవత్సలాయ నమః
ఓం భవాయ నమః
ఓం శర్వాయ నమః
ఓం త్రిలొకెశాయ నమః
ఓం శితికణ్ఠాయ నమః
ఓం శివాప్రియాయ నమః
ఓం ఉగ్రాయ నమః
ఓం కపాలినె నమః
ఓం కామారయె నమః
ఓం కాసురసుధానాయ నమః
ఓం గంగాధరాయ నమః
ఓం లలాతాక్షాయ నమః
ఓం కాలకాలాయ నమః
ఓం కృపనిధాయే నమః
ఓం భీమాయ నమః
ఓం పరశుహస్తాయ నమః
ఓం మృగపానయే నమః
ఓం జటాధరాయ నమః
ఓం కైలాసవాసినె నమః
ఓం కవచినే నమః
ఓం కఠొరాయ నమః
ఓం త్రిపురాన్తకాయ నమః
ఓం వృషంకాయ నమః
ఓం వ్రిశ్హభారుదయ నమః
ఓం భస్మొద్ధూలిత విగ్రహాయ నమః
ఓం సామప్రియాయ నమః
ఓం స్వరమయాయ నమః
ఓం త్రయీమూర్తయె నమః
ఓం అనీశ్వరాయ నమః
ఓం సర్వజ్ఞాయ నమః
ఓం పరమాత్మనె నమః
ఓం సొమసూర్యాగ్నిలొచనాయ నమః
ఓం హవీష్ నమః
ఓం యజ్ఞమయాయ నమః
ఓం సోమాయ నమః
ఓం పంచవక్త్రాయ నమః
ఓం సదాశివాయ నమః
ఓం విశ్వెశ్వరాయ నమః
ఓం వీరభద్రాయ నమః
ఓం గణానాథయ నమః
ఓం ప్రజాపతయె నమః
ఓం హిరణ్యరెతసె నమః
ఓం దుర్ధర్శ్హాయ నమః
ఓం గిరీశాయ నమః
ఓం గిరిశాయ నమః
ఓం అనఘాయ నమః
ఓం భుజన్గాభుశణాయ నమః
ఓం భర్గాయ నమః
ఓం గిరిధన్వనే నమః
ఓం గిరిప్రియాయ నమః
ఓం క్రిత్తివాససె నమః
ఓం పురారాతయె నమః
ఓం భగవతే నమః
ఓం ప్రమథాధిపాయ నమః
ఓం మృత్యున్జయాయ నమః
ఓం సూక్ష్మతనవె నమః
ఓం జగద్వ్యాపినె నమః
ఓం జగద్గురవే నమః
ఓం వ్యొమకెశాయ నమః
ఓం మహాసెనజనకాయ నమః
ఓం చారువిక్రమాయ నమః
ఓం రుద్రాయ నమః
ఓం భూతపతయె నమః
ఓం స్థాణవె నమః
ఓం అహిర్బుధ్న్యాయ నమః
ఓం దిగంబరాయ నమః
ఓం ఆశ్హ్తముర్తయే నమః
ఓం అనెకాత్మనె నమః
ఓం సాత్వికాయ నమః
ఓం శుద్దవిగ్రహాయ నమః
ఓం శాశ్వతాయ నమః
ఓం ఖణ్డపరశవె నమః
ఓం అజాయ నమః
ఓం పాశవిమొచకాయ నమః
ఓం మ్రిదయ నమః
ఓం పాశుపతయే నమః
ఓం దెవాయ నమః
ఓం మహాదెవాయ నమః
ఓం అవ్యయాయ నమః
ఓం హరయే నమః
ఓం భగానేత్రభిదే నమః
ఓం అవ్యక్తాయ నమః
ఓం దక్షాధ్వరహరాయ నమః
ఓం హరాయ నమః
ఓం పుష్హదంతభిదే నమః
ఓం అవ్యగ్రాయ నమః
ఓం సహస్రాక్షాయ నమః
ఓం సహశ్రాపడే నమః
ఓం అపవర్గప్రదాయ నమః
ఓం అనన్తాయ నమః
ఓం తారకాయ నమః
ఓం పరమెశ్వరాయ నమః

గణేశ అష్తోత్తరములు

ఓం గం గం గణాధిపతయే నమః

“సర్వవిజ్ఞాహారం  దేవం  సర్వకర్యఫలప్రధం
సర్వసిద్ది  ప్రధాతరం  వందేహం గణనాయకం”

ఓం వినాయకయ నమః
ఓం విఘణరాజయ నమః
ఓం గౌరీపత్రయ నమః
ఓం గాణేశ్వరాయ నమః
ఓం స్కాందగ్రాజయ నమః
ఓం అవ్యయాయ నమః
ఓం పుతయా నమః
ఓం దక్షయ నమః
ఓం అధ్యక్షయ నమః
ఓం ద్విజాప్రియయ  నమః
ఓం  ఇంద్రశ్రిప్రదయ నమః
ఓం  వాణిప్రదయ నమః
ఓం అవ్యయాయా నమః
ఓం సర్వసిద్ధిప్రదాయ నమః
ఓం సర్వతనయాయ నమః
ఓం సర్వరిప్రియయ నమః
ఓం సర్వత్మకాయ నమః
ఓం సృష్టికత్రే నమః
ఓం దేవాయా నమః
ఓం అనేకర్చితాయా నమః
ఓం శివాయ నమః
ఓం శుద్ధాయా నమః.
ఓం బుద్ధీప్రియయ నమః
ఓం. సంతాయ నమః
ఓం  బ్రహ్మచారినే నమః
ఓం గజాననాయ నమః
ఓం  ద్వైమత్రేయాయ నమః
ఓం మునిస్తుత్యాయ నమః
ఓం భాక్తవిఘ్నవినసనయ నమః
ఓం ఏకదంతాయ నమః
ఓం చతుర్బహావే నమః
ఓం చతుర్యయ నమః
ఓం శక్తిసంయుతయ నమః
ఓం లాంబోదారాయ నమః
ఓం శూర్పకర్నాయ నమః
ఓం హరయే నమః
ఓం బ్రహ్మవిడుత్తమయ  నమః
ఓం కలయ నమః
ఓం గ్రహపతయె నమః
ఓం కమినే నమః.
ఓం సోమసూర్యాగ్నీలోచనయ నమః
ఓం పాశాంసంకుసధారయ నమః
ఓం చందాయా నమః
ఓం గుణాతితాయా నమః
ఓం నిరంజనయ నమః
ఓం అకల్మశయ నమః
ఓం స్వయంసిద్ధయా నమః
ఓం సిద్ధర్చితపదంబూజయా నమః
ఓం బీజాపూరఫాలసాక్తాయ .
ఓం వరదాయ నమః
ఓం శాశ్వతయ నమః
ఓం కృతినే నమః
ఓం ద్విజాప్రియయ నమః
ఓం విటాభయయా నమః
ఓం గదినే నమః
ఓం  చక్రినే నమః
ఓం ఇక్షుచాపద్రితే నమః
ఓం శ్రిదయ నమః
ఓం అజయ నమః
ఓం ఉత్పలకరాయ నమః
ఓం  శ్రీపతయె నమః
ఓం స్తుతిహర్శితాయా నమః
ఓం కులద్రిభేత్త్రే  నమః
ఓం  జటిలయా నమః
ఓం కలీకల్మషనాసనాయ నమః
ఓం చంద్రచుదమనయే నమః
ఓం కాంతయ నమః
ఓం పాపహరినే నమః
ఓం సామహితాయా నమః
ఓం ఆశ్రితయా నమః
ఓం శ్రీకరాయ నమః
ఓం సౌమ్యాయ నమః
ఓం భక్తావంఛిదయకాయ నమః
ఓం సంతాయ నమః
ఓం కైవల్యసుఖాధాయ నమః
ఓం సచిదనందవిగ్రహాయ నమః
ఓం జ్ఞానినే నమః
ఓం దయాయుతయా నమః
ఓం దంతయ నమః
ఓం బ్రహ్మద్వేశవివర్జితయా నమః
ఓం ప్రమత్తడైత్యభాయదయ నమః
ఓం శ్రీకంథాయ నమః
ఓం విభూదేశ్వరాయ .
ఓం రమార్చితాయా నమః
ఓం విధయే .
ఓం నగరాజయజ్నోపవితాయే నమః
ఓం స్థులాకంతాయ నమః
ఓం స్వయంకర్తరే నమః
ఓం సమఘోశాప్రియాయ నమః
ఓం పరస్మై నమః
ఓం  స్తులతున్దయ నమః
ఓం  అగ్రన్యే నమః
ఓం  ధీరయ నమః
ఓం వాగిశాయ నమః
ఓం సిద్ధిదాయకయ నమః
ఓం దుర్వబిల్వప్రియాయ నమః
ఓం అవ్యక్తముర్తయే నమః
ఓం అద్భుతమూర్తిమతే .
ఓం శైలేంద్రతనుజోటసాంగ ఖేలనోత్సుకమనాసాయ నమః
ఓం శ్వాలావణ్యసుధాసరాజిత మన్మతావిగ్రహయ నమః
ఓం సమస్తజగథాదారయ నమః
ఓం  మయినె నమః
ఓం ముషికవాహనయ నమః
ఓం హ్రుష్టయ నమః
ఓం తుష్టయ  నమః
ఓం ప్రసంనత్మనే  నమః
ఓం సర్వస్సిద్ధిప్రదయకాయ  నమః

“. శ్రీ విజ్ఞేశ్వర అస్తోతర శతరమావళి హీ”


శ్రీ వేంకటేశ్వర స్వామి సుప్రభాతమ్

కౌసల్యా సుప్రజారామ పూర్వాసంధ్యాప్రవర్తతే ॥ ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యమ్ దైవ మాహ్నికమ్
ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ ॥ ఉత్తిష్ఠ కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు

మాతస్సమస్త జగతాం మధుకైటభారేః ॥ వక్షోవిహారిణి మనోహర దివ్యమూర్తే
శ్రీస్వామినే శ్రితజనప్రియ దానశీలే ॥ శ్రీ వేంకటేశ దయితే తవ సుప్రభాతమ్

తవ సుప్రభాతమరవింద లోచనే ॥ భవతు ప్రసన్నముఖ చంద్రమండలే
విధి శంకరేంద్ర వనితాభిరర్చితే ॥ వృశ శైలనాధ దయితే దయానిధే

అత్ర్యాది సప్త ఋషయస్సముపాస్య సన్ధ్యాం ॥ ఆకాశ సింధు కమలాని మనోహరాణి
ఆదాయ పాదయుగ మర్చయితుం ప్రపన్నాః ॥ శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతమ్

పంచాననాబ్జ భవషణ్ముఖ వాసవాద్యాః ॥ త్రైవిక్రమాది చరితం విబుధాః స్తువంతి
భాషాపతిః పఠతి వాసర శుద్ధి మారాత్ ॥ శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతమ్

ఈశత్ప్రఫుల్ల సరసీరుహ నారికేళ ॥ పూగద్రుమాది సుమనోహర పాలికానామ్
ఆవాతి మందమనిలః సహదివ్య గన్ధైః ॥ శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతమ్

ఉన్మీల్యనేత్ర యుగముత్తమ పన్జరస్తాః ॥ పాత్రావసిష్ఠ కదలీ ఫల పాయసాని
భుక్త్వాస్సలీల మథకేళి శుకాః పఠంతి ॥ శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతమ్

తన్త్రీ ప్రకర్ష మధుర స్వనయా విపన్చ్యా ॥ గాయత్యనన్త చరితం తవ నారదోపి
భాషా సమగ్ర మసత్కృతచారు రమ్యం ॥ శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతమ్

భృంగావళీచ మకరంద రసాను విద్ధ ॥ ఝుంకారగీత నినదైః సహసేవనాయ
నిర్యాత్యుపాంతర ససీ కమలోదరేభ్యః ॥ శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతమ్

యోషాగణేన వరదధ్ని విమధ్యమానే ॥ ఘోషాలయేషు దధిమంథన తీవ్రఘోషాః
రోషాత్కలిం విత ధతే కకుభశ్చ కుంభాః ॥ శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతమ్

పద్మేశమిత్ర శతపత్ర గతాళివర్గాః ॥ హర్తుం శ్రియం కువలయస్య నిజాంగలక్ష్మ్యాః
భేరీ నినాదమివ భిభ్రతి తీవ్రనాదమ్ ॥ శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతమ్

శ్రీమన్నభీష్ట వరదాఖిల లోక భంధో ॥ శ్రీ శ్రీనివాస జగదేక దయైక సింధో
శ్రీ దేవతాగృహ భుజాంతర దివ్యమూర్తే ॥ శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్

శ్రీ స్వామి పుష్కరిణికాప్లవ నిర్మలాంగాః ॥ శ్రేయార్థినో హరవిరించి సనందనాద్యాః
ద్వారే వసంతి వరవేత్ర హతోత్త మాంగాః ॥ శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్

శ్రీ శేష శైల గరుడాచల వేంకటాద్రి ॥ నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్యామ్
ఆఖ్యాం త్వదీయ వసతే రనీశం వదన్తి ॥ శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్

సేవా పరాః శివ సురేశ కృశానుధర్మన్ ॥ రక్షోమ్బునాధ పవమాన ధనాధి నాథాః
బద్ధాంజలి ప్రవిలసన్నిజ శీర్శ దేశాః ॥ శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్

ధాటీషుతే విహగరాజ మృగాధిరాజ ॥ నాగాధిరాజ గజరాజ హయాధిరాజాః
స్వస్వాధికార మహిమాధికమర్థయంతే ॥ శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్

సూర్యేందు భౌమ బుధవాక్పతి కావ్యశౌరి ॥ స్వర్భానుకేతు దివిశత్పరిశత్ప్రధానాః
త్వద్దాస దాస చరమావధి దాస దాసాః ॥ శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్

తత్పాదధూళి భరిత స్పురితోత్త మాన్గాః ॥ స్వర్గాపవర్గ నిరపేక్ష నిజాంతరన్గాః
కల్పాగమా కలనయా కులతాం లభంతే ॥ శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్

త్వద్గోపురాగ్ర శిఖరాణి నిరీక్షమాణాః ॥ స్వర్గాపవర్గ పదవీం పరమాం శ్రయంత
మర్త్యా మనుష్య భువనే మతిమాశ్రయంతే ॥ శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్

శ్రీ భూమినాయక దయాది గుణామృతాబ్దే ॥ దేవాదిదేవ జగదేక శరణ్య మూర్తే
శ్రీమన్ననణ్త గరుడాదిభి రర్చితాంఘ్రే ॥ శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్

శ్రీ పద్మనాభ పురుషోత్తమ వాసుదేవ ॥ వైకుంఠ మాధవ జనార్దన చక్రపాణే
శ్రీ వత్స చిహ్న శరణాగత పారిజాత ॥ శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్

కందర్ప దర్ప హర సుందర దివ్య మూర్తే ॥ కాంతా కుచాంబురుహ కుట్మల లోలదృష్టే
కల్యాణ నిర్మల గుణాకర దివ్యకీర్తే ॥ శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్

మీనాకృతే కమఠకోల నృసింహ వర్ణిన్ ॥ స్వామిన్ పరశ్వథ తపోధన రామచంద్ర
శేషాంశరామ యదునందన కల్కి రూప ॥ శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్

ఏలాలవంగ ఘనసార సుగంధి తీర్థం ॥ దివ్యం వియత్సరితు హేమఘటేషు పూర్ణం
ధృత్వాద్య వైదిక శిఖామణయః ప్రహృష్టాః ॥ తిశ్ఠంతి వేంకటపతే తవ సుప్రభాతమ్

భాస్వానుదేతి వికచాని సరోరుహాణి ॥ సంపూరయంతి నినదైః కకుభో విహన్గాః
శ్రీ వైష్ణవాః సతత మర్థిత మంగళాంతే ॥ ధామాశ్రయంతి తవ వేంకట సుప్రభాతమ్

బ్రహ్మోదయ స్సురవరాస్సమహర్ష యస్తే ॥ సంతస్సనందన ముఖాస్త్వధ యోగివర్యాః
ధామాంతికే తవ హి మంగళ వస్తు హస్తాః ॥ శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్

లక్శ్మీనివాస నిరవద్య గుణైక సింధో ॥ సంసారసాగర సముత్తరణైక సేతో
వేదాంత వేద్య నిజవైభవ భక్త భోగ్య ॥ శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్

ఇత్థం వృషాచలపతే రిహ సుప్రభాతం ॥ యే మానవాః ప్రతిదినం పఠితుం ప్రవృత్తాః
తేషాం ప్రభాత సమయే స్మృతిరంగభాజాం ॥ ప్రఙ్నామ్ పరార్థ సులభాం పరమాం ప్రసూతే


శ్రీ వేంకటేశ్వర గోవింద నామములు

శ్రీ శ్రీనివాసా గోవిందా
శ్రీ వేంకటేశా గోవిందా
భక్తవత్సలా గోవిందా
భాగవతప్రియా గోవిందా
నిత్యనిర్మలా గోవిందా
నీలమేఘశ్యామ గోవిందా
పురాణపురుషా గోవిందా
పుండరీకాక్షా గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకులనందన గోవిందా

* * *

నందనందనా గోవిందా
నవనీత చోర గోవిందా
పశుపాలక శ్రీ గోవిందా
పాపవిమోచన గోవిందా
దుష్టసమ్హార గోవిందా
దురిత నివారణ గోవిందా
శిష్టపరిపాలక గోవిందా
కష్టనివారణ గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకుల నందన గోవిందా

* * *

వజ్రమకుటధర గోవిందా
వరాహమూర్తివి గోవిందా
గోపీజనలోల గోవిందా
గోవర్ధనద్ధార గోవిందా
దశరథనందన గోవిందా
దశముఖ మర్దన గోవిందా
పక్షివాహన గోవిందా
పాండవప్రియ గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకుల నందన గోవిందా

* * *

మత్యకూర్మా గోవిందా
మధుసూదన హరి గోవిందా
వరాహ నరసింహ గోవిందా
వామన భృగురామ గోవిందా
బలరామానుజ గోవిందా
బౌద్ధకల్కిధర గోవిందా
వేణుగాన ప్రియ గోవిందా
వెంకటరమణా గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకుల నందన గోవిందా

* * *

సీతానాయక గోవిందా
శ్రితపరిపాలక గోవిందా
దరిద్రజనపోషక గోవిందా
ధర్మసంస్థాపక గోవిందా
అనాథ రక్షక గోవిందా
ఆపద్బాంధవ గోవిందా
శరణాగతవత్సల గోవిందా
కరుణాసాగర గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకుల నందన గోవిందా

* * *

కమలదళాక్ష గోవిందా
కామితఫలదాతా గోవిందా
పాపవినాశక గోవిందా
పాహిమురారే గోవిందా
శ్రీముద్రాంకిత గోవిందా
శ్రీవత్సాంకిత గోవిందా
ధరణీనాయక గోవిందా
దినకరతేజా గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకుల నందన గోవిందా

* * *

పద్మావతీప్రియ గోవిందా
ప్రసన్నమూర్తీ గోవిందా
అభయహస్త ప్రదర్శన గోవిందా
మర్త్యావతారా గోవిందా
శంఖచక్రధర గోవిందా
శార్గగదాధర గోవిందా
విరజాతీర్థస గోవిందా
విరోధిమర్దన గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకుల నందన గోవిందా

* * *

సాలగ్రామధర గోవిందా
సహస్రనామా గోవిందా
లక్ష్మీవల్లభ గోవిందా
లక్ష్మణాగ్రజ గోవిందా
కస్తూరితిలక గోవిందా
కాంచనాంబరధర గోవిందా
గరుడవాహన గోవిందా
గజరాజరక్షక గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకుల నందన గోవిందా

* * *

వానరసేవిత గోవిందా
వారధిబంధన గోవిందా
ఏడుకొండలవాడ గోవిందా
ఏకస్వరూపా గోవిందా
శ్రీరామకృష్ణా గోవిందా
రఘుకులనందన గోవిందా
ప్రత్యక్షదేవా గోవిందా
పరమదయాకర గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకుల నందన గోవిందా

* * *

వజ్రకవచధర గోవిందా
వైజయంతిమాలా గోవిందా
వడ్డికాసులవాడ గోవిందా
వసుదేవతనయా గోవిందా
బిల్వపత్రార్చిత గోవిందా
భిక్షుక సంస్తుత గోవిందా
స్త్రీపుంరూపా గోవిందా
శివకేశవమూర్తి గోవిందా
బ్రహ్మాండరూపా గోవిందా
భక్త రక్షక గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకుల నందన గోవిందా

* * *

నిత్యకళ్యాణ గోవిందా
నీరజనాభ గోవిందా
హాతీరామప్రియ గోవిందా
హరిసర్వోత్తమ గోవిందా
జనార్దనమూర్తి గోవిందా
జగత్సాక్షిరూపి గోవిందా
అబిషేకప్రియ గోవిందా
ఆపన్నివారణ గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకుల నందన గోవిందా

* * *

రత్నకిరీటా గోవిందా
రామానుజనుత గోవిందా
స్వయంప్రకాశా గోవిందా
ఆస్రితపక్ష గోవిందా
నిత్యశుభప్రద గోవిందా
నిఖిలలోకేశా గోవిందా
ఆనందరూప గోవిందా
ఆద్యంతరహితా గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకుల నందన గోవిందా

* * *

ఇహపరదాయక గోవిందా
ఇభరాజరక్షక గోవిందా
పరమదయాళో గోవిందా
పద్మనాభ హరి గోవిందా
తిరుమలవాసా గోవిందా
తులసీ వనమాల గోవిందా
శేషాద్రి నిలయ గోవిందా
శేష శాయిని గోవిందా
శ్రీనివాస శ్రీ గోవిందా
శ్రీ వేంకటేశా గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకులనందన గోవిందా

* * *

Saturday, May 23, 2015

కాకిమీద బ్రహ్మాస్త్రం

మనం తరచుగా పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వాడుతూ ఉంటాం కదా! అసలు సామెత కాకిమీద బ్రహ్మాస్త్రం.. ఇది రాముడు కాకిమీద వేశాడు.
వనవాసంలో ఉండగా ఒకనాడు లక్ష్మణుడు వనఫలాలు తీసుకురావడం కోసం అడవిలోకి వెళ్ళాడు. ఇక్కడ సీతారాములు ఏకాంతంగా ఉండగా రాముడు సీతాదేవి తొడమీద తలపెట్టుకొని ఆమాట ఈమాట చెప్పుకుంటూ ఉండగా ఎక్కడినుండో ఒక కాకి వచ్చి గాలివలన సీతమ్మ కట్టుకున్న కోక పైట తొలగడంతో స్థానాలని కాకి మాంసం ముద్ద అనుకోని పొడవడం మొదలుపెట్టింది. సీతమ్మ కాకిని తన వద్దకు రాకుండా చేతితో తోలుతూ తూలీ పడడంతో రాముడు చూసి నవ్వుకున్నాడు. అప్పుడు సీతమ్మ మూతి బిగించేసరికి రాముడికి మరికొంత నవ్వు వచ్చి నవ్వుకున్నాడు. అలా ఊసులు చెప్పుకుంటూ రాముడు సీతమ్మ తోడమీదే నిద్రపోయాడు. నిద్రలోకి జారుకున్న రాముడిని కనిపెట్టిన కాకి మళ్ళి సీతమ్మ స్థానాన్ని పొడవడం మొదలుపెట్టింది. ఒకప్రక్క రాముడిని నిద్రాభంగం కాకూడదని సీతమ్మ కాకిని తోలలేక అలాగే ఉండడంతో కాకి సీతమ్మ స్థనాన్ని చీల్చేసింది. దాంతో వేడివేడి నెత్తురు బయటికి వచ్చి నిద్రపోతున్న రాముడి నుదుటిపై వర్షపు చినుకుల వలే బొట్లు పడడం మొదలుపెట్టింది. రాముడు రక్తపు బొట్లును చూసి కోపించి సీతమ్మను చూసి కోపంతో కన్నేర్రజేసి ధనుస్సు లేకపోవడంతో ప్రక్కనే ఉన్న గడ్డిపరక తీసుకొని బ్రహ్మాస్త్రం మంత్రించి కాకిమీద వేశాడు..
అసలు ఈకాకి ఎవరు? రాముడంతటివాడు కాకిమీద బ్రహ్మాస్త్రం ఎందుకు వేయవలసి వచ్చింది?
పూర్వకాలంలో గౌతముడు అహల్య అనేవారు ఉండేవారు. ఈకథ అందరికీ తెలిసినదేకదా! అహల్య అంటే ఇంద్రుడికి విపరీతమైన ప్రేమ. ఒకరోజు రాత్రి గౌతముడిని బయటికి పంపడానికి కాకిలా రూపం మార్చుకొని వచ్చి అహల్య గౌతముడు ఉన్న గుడిసె ముందు అరవడం మొదలు పెట్టాడు. గౌతముడు బయటికివచ్చి కాకి రూపంలో ఉంది ఇంద్రుడే అని కనిపెట్టి అహల్య కోసం ఇన్ని నాటకాలు ఆడతావా! ఉండు నీపని చెప్తాను అని, చేతిలోకి కమండలంలో నీరు తీసుకొని అభిమంత్రించి కాకిరూపంలో వచ్చావు కనుక కాకువైపో! అని శపించాడు.
ఇది తెలుసుకున్న బ్రహ్మ గౌతముడి వద్దకు వచ్చి మహానుభావా! గౌతమా!ఇంద్రుడికి ఇచ్చిన శాపాన్ని ఉపసంహరించు. ఇంద్రుడంటే ముల్లోకాలకు అధిపతి. ఈ మహాయుగం గడిచేవరకు ఇతడే ఇంద్రుడిగా ఉండాలని త్రిమూర్తులమైన మేము నిర్ణయించాం. మా నిర్ణయానికి తిరుగులేదు. కాని నీ శాపం వలన పదవీ బ్రష్టుడైతే ముల్లోకాలలో కల్లోలం ఏర్పడి ప్రజలు నాశనం చెందుతారు. కనుక శాపాన్ని వెనక్కి తీసుకో అని బ్రహ్మదేవుడు ప్రార్థించగా, గౌతముడు అలోచించి శాపం ఉపసంహరించడం కుదరదు. కాని "ఆత్మావై పుత్రనామాసి'' అని కదా శాస్త్రం. అంటే తండ్రే కొడుకు రూపంలో పుడతాడు. తండ్రి చేసిన పాపపుణ్యాల ఫలితమే పిల్లలు. తండ్రి ఆస్తులే కాదు, అప్పులు, తండ్రి చేసిన పాపాలు కూడా పుత్రులు పంచుకోవలసిందే. పుణ్యం చేస్తే మంచి కొడుకు పుడతాడు. అదే పాపం చేస్తే దరిద్రపు సంతానం కలిగి ఏడిపించుకుతింటారు. ఎవరో వచ్చి పిల్లలని చెడగొట్టరు. తల్లిదండ్రులు చేసిన పాపపుణ్యాల ఫలితాలే పిల్లల రూపంలో ప్రతిఫలిస్తూ ఉంటాయి. ఇది కేవలం కొడుకుకే సుమా! కూతురికి చెందదు. పుత్రుడు పైకొస్తే నాఘనత, చెడిపోతే ప్రక్కవాడిని తిట్టడం లాంటివి దండగ.. అందుకే నిత్యం వీలున్నంత వరకు మంచి సంతానం కోసం పుణ్యమే చేయాలి. దానధర్మాలు చేయాలి. వాటి ఫలితాల రూపంలో సంతానం కలుగుతుంది.
అని గౌతముడు తండ్రి పుణ్యం కొడుకే, పాపమూ కొడుకే కనుక నీశాపం కొడుకు అనుభవించు గాక! అని శాపాన్ని మరలించాడు.రాముడు చేతిలో చావుదెబ్బలు తినేవరకు నీకొడుకు కాకి రూపంలోనే సంచరించు గాక! త్రేతాయుగంలో రాముడు వీడిమీద బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తాడు. దాంతో అన్నిలోకాలు తిరిగి మరలా రాముడినే ఆశ్రయిస్తాడు. అప్పుడు నీ కొడుకు శాపం తొలగుగాక! అని గౌతమ మహర్షి శాపానికి విముక్తిని ఇచ్చాడు. అప్పటి నుండి ఇంద్రుడి పుత్రుడు జయంతుడు అనేవాడు కాకిగా మారిపోయాడు.
రామబాణం వేయడంతో కాకి ఎగురుకుంటూ ఎగురుకుంటూ ముందుగా తండ్రైన ఇంద్రుడి దగ్గరకు వెళ్లి రక్షించమని అడిగితె రావణుడి దెబ్బకే దిమ్మతిరిగింది. రామ బ్రహ్మాస్త్రం ఆపడం మావల్లకాదు వెళ్ళు వెళ్ళు అని గెంటేశారు. సకల దేవతల దగ్గరికీ తిరిగాడు. మావల్ల కాదు అన్నారు. ఋషుల దగ్గరికి వెళ్ళాడు ఋషులు బాగా అలోచించి ''రాముడి దగ్గరికి వెళ్లి వీడిని రక్షించమని అడిగితె రక్షిస్తాడు. కాని వీడే తెలుసుకొని శరణు వెడితే వీడికి ఉన్న శాపం పోతుంది. ఈరోజు వీడు తాత్కాలికంగా ఈ బుద్ది విడిచిపెట్టినా ఎప్పటికైనా ప్రమాదమే. అని భావించి విషయం చెప్పకుండా పొమ్మని చెప్పారు. ఈవిధంగా అన్ని లోకాలు తిరిగి తిరిగి చివరికి బ్రహ్మదగ్గరికి వెళ్లి రక్షించు మహాప్రభో అని వేడుకోగా, బ్రహ్మ నవ్వి! ఆ బాణాన్ని వేసింది అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీరాముడు. ఆ రాముడు విడిచిన ఆ రామబాణాన్ని ఆపడం ఆరాముడికే తప్ప ఎవ్వరి తరం కాదు. నేను కాదు కదా ఈ భువన భండాలలో ఏలోకానికి వెళ్ళినా నిన్ను రక్షిస్తామని ఎవ్వరూ హామీ ఇవ్వరు. పో వెళ్ళు ఆయన్నే పట్టుకో అన్నాడు. వెళ్లమనగా శివుడి దగ్గరికి వెళ్ళాడు. నవ్వి ఊరుకున్నాడు. ఇలా తిరిగితిరిగి ఎక్కడ తిరిగిన శాంతి దొరక్క, సౌఖ్యం లేక తన మరణాన్ని ఆపే శక్తి లేక చివరికి రాముడి వద్దకే వచ్చి కాళ్ళమీద పడి మహాత్మా! నన్ను రక్షించు. నీ బాణం నాప్రాణం తీస్తుంది అని శరణు వేడుకున్నాడు.
ఇక్కడ ఒక సందేహం రావచ్చు మీకు. అసలు రామబాణం అందునా బ్రహ్మాస్త్రం వేస్తే ఈకాకి గాడు ఇన్ని లోకాలు ఎలా తిరిగ గలిగాడు. తండ్రితో మాట్లాడడానికి ఆగాడు, దేవతలతో మాట్లాడడానికి, ఋషులతో, బ్రహ్మ దేవుడితో, శివుడితో మాట్లాడడానికి అనేక పర్యాయాలు ఆగాడు కదా ఎందుకని రామబాణం వాడిని సంహరించలేదు? ఇక్కడ రాముడి ఉద్దేశ్యం చంపడం కాదు.ధర్మం చెప్పడం ఉద్దేశ్యం. అందరి దగ్గరికి వెళ్లి వేడుకుంటుంటే అస్త్రం బెదిస్తుంది తప్ప చంపలేదు. గుణపాటం చెప్పడమే ఉద్దేశ్యం.
రాముడు అప్పుడు.. సీతాదేవి వక్షస్థలాన్ని చెల్చడం అంటే వీడు చంపడానికి అర్హుడు. అయినా శరణు వేడాడు కనుక కాపాడాలి. శరణు వేడిన వాడు చంపడానికి అర్హుడు అయినా కాపాడతాను ఇది నా సంకల్పం.
సహృదేవ ప్రసన్నాయ తవాస్మితి చ యాచతే అభయం సర్వభూతేభ్యః తదాం ఏతత్ వ్రతం మమ!!
ఎవడైనా ఒక్కసారి నీవాడిని రక్షించమని పాదాలపై పడితే వాడెవడైనా వాడికి అభయమిస్తాను. చంపడానికి తగిన పాపం చేసినవాడిని కూడా రక్షిస్తాను. ఇది నా నియమం అనిఅభయమిచ్చి రక్షించాడు.
కాకులు పొడుచుకు తింటాయి కదా! అది వాటి ప్రవ్రుత్తి కదా అనే సందేహం రావచ్చు. ఐతే ద్వాపరయుగం వరకు కాకులు బ్రతికి ఉన్న జీవాన్ని దేనిని పొడుచుకు తినలేదు. ద్వాపరయుగం కలియుగ సంధికాలంలో అంటే ధర్మరాజు స్వర్గారోహణ సమయానికి అంటే ఈకాకులు బ్రతికి ఉన్న జీవులని కాకులు పొడుచుకు తినడం, అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలు రావడం విని కలియుగం ఆరంభం అయిందని పాండవులు స్వర్గారోహణ కి వెళ్ళిపోయారు.
నీవు ధర్మం తప్పావు. ఎప్పుడో కలియుగంలో జంతువులను పీక్కు తినాల్సిన నీవు ఇప్పుడు ఆ తప్పు చేసి వదనార్హుడివి అయ్యావు. నన్ను శరణు కోరావు కనుక అభయం ఇచ్చి కాపాడుతున్నాను. ఐతే నేను వేసిన బ్రహ్మాస్త్రం అమోఘం. నిన్ను సంహరించడానికి దానిని నీమీద ప్రయోగించాను. ఆ బ్రహ్మాస్త్రం వ్యర్థం కాకూడదు. బ్రహ్మాస్త్రం వేసినపుడు అవతలి వారిని చంపాలి. చంపడానికి కుదరనప్పుడు నేను వారిని రక్షించాలి అనుకున్నప్పుడు వారి శరీరంలో ఏదో ఒక అవయవం అయినా ఇవ్వాలి. బ్రహ్మాస్త్రాన్ని వృథాగా వెనుకకు తీసుకోకూడదు. అవయవం తీసుకోవడం కూడా చంపడంతో సమానం. కనుక నీశారీరంలో ఏదైనా ఒక భాగాన్ని దానికి ఇచ్చేయ్ అప్పుడు నువ్వు బ్రతుకుతావు అన్నాడు. కాకి బాగా అలోచించి కాళ్ళు పొతే నిలబడడం కష్టం, రెక్కలు పొతే ఎగరడం కష్టం, ముక్కు పొతే తినడానికి లేక చచ్చిపోతాను. ఇక మిగిలింది కళ్ళు. వీటిలో ఒక కన్ను తీసేసుకో అన్నాడు. అదికూడా ఎడమకన్ను ఇవ్వడం పాపం కనుక కుడికన్ను తీసుకో అన్నాడు. బ్రహ్మాస్త్రం వెంటనే చిన్న నొప్పి కూడా కలుగకుండా, కన్ను తీస్తుందో లేదో తెలియకుండా కుడికన్ను పెకిలించి వేసి సముద్రంలోకి వెళ్లి మునిగి పరిశుద్దమై తిరిగి వచ్చి అమ్ములపొదలొ చేరింది. ఆరోజు నుండి కాకికి కుడికన్ను పోయి ఏకాక్షిగా పిలువబడింది.
ఈ కన్నుపోయాక కాకి రాముడివైపు దీనంగా చూసింది. ఈ కాకికి కన్ను పోవడంతోనే మిగిలిన కాకులన్నింటికి కళ్ళు పోయాయి. ఒక వంశానికి రాజైన వాడికి శిక్ష వేస్తె ఆ జాతి జాతి అంతటికీ వెళుతుంది. పాము పడగపై శ్రీకృష్ణుడు నాట్యం చేయగానే శ్రీకృష్ణుడి పాదాలు ప్రతి పాము పడగపై ఉండిపోయాయో అలా కాకులన్నింటికీ కళ్ళు పోయాయి. రాముడు చూసి ''ఓ కాకి! నీ పాపం వలన మీ జాతి అంతటికీ శాపంలా ఎలా మారిందో చూశావా! కుడి కన్ను పోయింది. యావజ్జీవితం దూషిస్తూ ఉంటాయి నిన్ను. కాబట్టి నిన్ను అనుగ్రహిస్తాను అని ''ఈరోజు నుండి నువ్వు కుడి వైపుకి చూస్తే కుడి కన్ను కనిపిస్తుంది. ఎడమ వైపు చుస్తే ఎడమ కన్ను కనబడుతుంది. నువ్వు ఎటు చూస్తే అటువైపు కన్ను మాత్రమే కనబడుతుంది. రెండోవైపు కన్ను మాత్రం కనబడదు. ఈవిధంగా ఒంటి కంటితో కూడా సుఖపడతావు. అని కాకికి వరం ఇచ్చి మొత్తం కాకి జాతిని రక్షించాడు.. కాకపోతే ఎవరో మాట మార్చి పిచ్చుకమీద బ్రహ్మాస్త్రం అని పేరు వచ్చింది.. 

తిరుమలలో ప్రాచీన ముఖ్యతీర్థాలు ?

 1. పాండవ తీర్థము : కురుక్షేత్ర సంగ్రామం సమాప్తం అయిన తరువాత పాండవులు బ్రహ్మహత్యా పాపాలు పోగొట్టుకోడానికి ఈ తీర్థంలో స్నానం చేసి క్షేత్రపాలకుని పూజించి శ్రీనివాసుని దర్శించుకున్నారు. పాండవులు ఈ తీర్థంలో స్నానం చేయడంవల్ల ఈ తీర్థానికి పాండవ తీర్థం అనే పేరు కలిగింది. ఈ తీర్థం దేవాలయానికి ఉత్తరదిశలో ఉంది.
2. సనకసనందన తీర్థము : సనకసనందనాదులు ఇక్కడ తపం ఆచరించి సిద్ధి పొందిన స్థలం. ఈ తీర్థంలో మార్గశిర శుక్లపక్ష ద్వాదశిరోజున స్నానం చేసినట్లయితే సిద్ధి పొందుతారు. ఈ తీర్థం పాపవినాశనం ఉత్తరభాగంలో ఒక మైలు దూరంలో ఉంది.
3. కుమారధారా తీర్థము : మాఘపౌర్ణమి రోజు ఇక్కడ స్నానం చేసినట్లయితే సంతానప్రాప్తి కలగటమే కాక సకల కార్యసిద్ధి కలుగుతుంది. ఈ తీర్థం దేవాలయానికి ఆరుమైల్ల దూరంలో ఉంది.

4. తుంబుర తీర్థము : ఈ తీర్థంలో తుంబుర నారదమహర్షి తపస్సు చేసి తరించిన స్థలం. కాబాట్టి ఈ తీర్థంలో ఫాల్గుణ శుద్ధ పౌర్ణమిరోజు స్నానం చేసినట్లయితే భక్తి జ్ఞానాలు కలిగి సర్వపాపాలు నశిస్తాయి. ఈ తీర్థం ఆలయానికి ఆరుమైల్ల దూరంలో ఉంది. ఈ తీర్థానికి వెళ్ళే దారి మధ్యలో క్షేత్రపురోహితులు ఫాల్గుణ శుద్ధ పౌర్ణమినాడు యాత్రికులకు చలిపందిళ్ళు వేయించి నీరు, మజ్జిగ, పానకాలు ఇస్తారు.
5. నాగతీర్థం : ఈ తీర్థంలో స్నానం చేసినట్లయితే కన్యలు ఉత్తమ పురుషుని పొందుతారు. శ్రీహరి ఆలయానికి ఒక కిలోమీటరు దూరంలో ఉంది.
6. చక్ర తీర్థం : భారత యుద్ధం ముగిసిన తరువాత శ్రీహరి చక్రం పంచ మహాపాతకాలకు గురి అవడం వలన ఈ తీర్థంలో తన సుదర్శన చక్రాన్ని స్నానం చేయించారు. ఇక్కడ స్నానం చేసినట్లయితే వారికి బ్రహ్మ హత్య, శిశు హత్య దోషాలు తొలగి పవిత్రులు అవుతారు. శ్రీహరి ఆలయానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది.
7. జాబాలి తీర్థము : ఈ తీర్థంలో జాబాలి అనే మహర్షి తాపం ఆచరించి తరిచారు. ఈ తీర్థంలో స్నానం చేసినట్లయితే భూతప్రేత పిశాచాలు తొలగటమే కాక మనోవాంఛ సిద్ధిస్తుంది. ఇక్కడ ఆంజనేయస్వామివారి ఆలయం కూడా ఉంది. ఈ ఆలయానికి హథీరాంజీ మఠాధిపతులు నిత్య నైవేద్య ఆరాధనలు స్వామివారికి యిస్తారు. ఈ ఆలయం మఠాధిపతుల ఆధీనంలో ఉంది.
8. బాల తీర్థము : నాగతీర్థం నుండి రెండువందల గజాల దూరంలో ఉంది. ఈ తీర్థంలో స్నానం చేసినట్లయితే వృద్ధులు సహితం బాలురు అవుతారు. సృష్టికి అవరోధం కలుగుతుందని ఈ తీర్థం శిలలతో మూసివేయబడింది. జలం కనిపించదు.
9. వైకుంఠ తీర్థము : ఈ తీర్థంలో స్నానం చేసినవారికీ వైకుంఠప్రాప్తి కలుగుతుంది. ఈ తీర్థం కోవెలకు తూర్పు దిశలో ఒక కిలోమీటరు దూరంలో ఉంది. పురజనులు ఇక్కడ వైకుంఠసమారాధన అప్పుడప్పుడు చేస్తూనే ఉంటారు.
10. శేష తీర్థము : ఈ తీర్థంలో స్నానం చేసినట్లయితే వారికి మరుజన్మ ఉండదు. ఈ తీర్థానికి వెళ్ళటం చాలా కష్టం. పర్వతాలను ఎక్కడం కష్టపడటమే కాక చిన్న ప్రవాహాలను దాటాలి. ఇక్కడ పాచి పట్టి ఉంటుంది. జాగ్రత్తగా దాటాలి. ఈ తీర్థం యొక్క విశేషం ఏమిటంటే ఆదిశేషుడు శిలారూపంలో ఉంటాడు. ఇదే కాక ప్రత్యేకంగా కొన్ని నాగుపాములు ఈ తీర్థంలో తిరుగుతూనే ఉంటాయి. దేవాలయానికి పదికిలోమీటర్ల దూరంలో ఉంది.
11. సీతమ్మ తీర్థము : ఈ తీర్థంలో సీతాదేవి కుశవులకు కరం నూరిపోసింది. బండ అరగటం నేటికీ చూడవచ్చు. ఇక్కడ ఒక బిలం ఉంది. జలం బయటికి కనిపించదు. పొడుగాటి వెదురుకు కొబ్బరి పీచుకట్టి బిలంలో ఉంచి తోడితే నీరు ప్రవహిస్తుంది. ఈ తీర్థంలో స్త్రీలు భక్తితో స్నానం చేసినట్లయితే ముక్తిని పొందుతారు.
12. యుద్ధగళ తీర్థము : ఈ తీర్థంలో రాముడు రావణుని సంహరించిన తరువాత బ్రహ్మహత్య మహాపాతకాన్ని పోగొట్టుకోవడానికి ఈ తీర్థంలో స్నానం చేశాడు.
13. విరజానది : ఈ నది శ్రీస్వామివారి పాదాల క్రింది భాగంలో ప్రవహిస్తున్నది. ఈ నది పైభాగంలో శ్రీవెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది. స్వామివారి రెండవ ప్రాకారంలో పడమటి భాగంలో ఉగ్రాణము ముందున్న భూమికి సమంగా నీరు ఉంది. ఇది ఒక చిన్న బావిలా కనబడుతుంది. ఈ తీర్థాన్ని తలపై ప్రోక్షించుకుంటే మోక్షప్రాప్తి సిద్ధిస్తుంది.
14. పద్మసరోవరము : ఈ సరోవరంలో స్నానం చేసినట్లయితే వారికి సకల భోగభాగ్యాలు కలగటమే కాకుండా భూతప్రేతపిశాచాలు వదిలిపోతాయి. ఈ సరోవరం పద్మావతి మందిరం దగ్గర ఉంది. తిరుపతి నుండి ఈ సరోవరం ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ సరోవరంలోని జలం స్వర్ణముఖి నదిలో కలుస్తుంది.
ఇవే కాక కాయరసాయ తీర్థం, ఫల్గుణి తీర్థము, కటాహ తీర్థము, వరాహ తీర్థము, విష్వక్సేన తీర్థము, పంచాయుధ తీర్థము, బ్రహ్మతీర్థము, సప్తముని తీర్థము, దేవ తీర్థము వంటివి ఇంకా ఎన్నో ఉన్నాయి.