పూర్వకాలములో
ఒకానొక విప్రునకు నలుగురు కుమార్తెలు వుండేవారు. పెద్ద పిల్లలు
ముగ్గురికి వివాహాలు జరిగివారి భర్తలు చనిపోయి విధవరాళ్ళు అయ్యారు. ఆ
బ్రాహ్మణ దంపతులు కుమార్తెల దుస్థితికి ఎంతగానో బాధపడుతుండేవారు. ఆఖరు
కుమార్తెకు యుక్త వయస్సు వచ్చింది. ఆమెకు వివాహం చెయ్యాలన్న వుబలాటం
వున్నా అక్కగార్లవలె వైధవ్యం పోడుతుందేమో అని బాధ పాడుతుండేవాడు.
నిరంతరం భగవంతుడిని తలచుకుంటూ ఈ బిడ్డనైనా సుమంగళిగా వుద్దరించమని మొరపెట్టుకునేవాడు. ఒకనాడు గౌరీదేవి కలలో కనిపించి నీవు నీ కుమార్తె చేత ఉదయ కుంకుమ నోము నోయించమని చెప్పింది. ఆమె మాటలు యందు నమ్మకము కలిగి అలా చేయడం వలన తన కుమార్తెకు వైధవ్యం తొలగిపోతుందనే నమ్మకము కలిగి తన ఆఖరి కుమార్తె చేత ఉదయ కుంకుమ నోమును నోయించాడు. వ్రత ప్రభావం వలన ఆమెకు భార్తలభించాడు. పూర్నాయుష్కుడు వైధవ్య భయం తొలగి పోయింది. ఈ ఉదయ కుంకుమ నోముని నోచుకుని గోరిదేవిని ధూప దీప నైవేద్యాలతో పూజించిన వారికి మాంగల్యము, సిరిసంపదలు, కలుగుతాయి.
ఉద్యాపన: కన్నె పిల్లలు చేసుకుని తీరవలసిన నోము ఇది. ఉదయాన్నే స్నానం చేసి చక్కగా బొట్టు కాటుక పెట్టుకొని పసుపు గౌరీ దేవిని చేసి ఫల పుష్పాదులతో ధూప దీప నైవేద్యాలతో ఆచరించాలి. ఒక ముత్తైదువు నకు గౌరీదేవి పేరున పసుపు పువ్వులు రవికల గుడ్డ తాంబూలము ఇచ్చి ఆమె ఆశీస్సులు పొందాలి.

No comments:
Post a Comment