Friday, July 20, 2012

మంగళగౌరీ వ్రతము

శ్రావణ మాస వ్రతాలు అనగానే ప్రధానంగా గుర్తుకు వచ్చేది "వరలక్ష్మీ వ్రతం". ఆ తరువాత శ్రావణమాసంలో మహిళలు ఆచరించే మరో ప్రధాన వ్రతం “మంగళ గౌరీ వ్రతం". దీనికే "శ్రావణ మంగళవార వ్రతం" అని,"మంగళ గౌరీ నోము" అని పేర్లు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మహిళలకు సౌభాగ్యకరమైన “ఐదవతనం" కలకాలం నిలుస్తుందని ప్రతీతి. ఈ వ్రతాన్నిగురించి స్వయంగా శ్రీ కృష్ణుడు ద్రౌపదికి వివరించినట్లు పురాణాలు పేర్కొన్నాయి.

ఒకసారి ద్రౌపది శ్రీ కృష్ణుని వద్దకు వెళ్లి "అన్నా!మహిళలకు వైధవ్యాన్ని కలిగించని వ్రతం ఏదైనా ఉంటే చెప్ప" మని అడగ్గా, శ్రీ కృష్ణుడు వెంటనే "మంగళగౌరీదేవి మహాదేవత. ఆది పరాశక్తియే మంగళగౌరీగా ప్రసిద్ధిచెందింది. త్రిపురాసుర సంహార సమయంలో పరమశివుడు మంగళగౌరీదేవిని పూజించి విజయం సాధించాడు. అంగారకుడు మంగళగౌరీ దేవిని పూజించి గ్రహరాజై, మంగళవారానికి అధిపగా వెలుగొందుతున్నాడు. ఆ మంగళగౌరీని పూజిస్తూ, శ్రావణ మాస మంగళవారాలలో వ్రతాన్నిఆచరించినట్లయితే వైధవ్యం ప్రాప్తించదు. ఈ వ్రతాన్ని ఆచరించినవారు సకల సౌభాగ్యాలతో వర్ధిల్లుతారు - అని చెప్పాడని పురాణ కథనం. పురాణకాలం నుంచీ ఈ వ్రతం ఆచరణలో ఉన్నట్లు తెలుస్తోంది.

మంగళగౌరీ వ్రతాన్ని ఎవరు చేయవచ్చు?

మంగళగౌరీ వ్రతాన్నికొత్తగా పెళ్ళయిన ముత్తైదువులు చేయాలి.అంటే వివాహం జరిగిన అనంతరం వచ్చే శ్రావణమాసంలో ఈ వ్రతాన్ని చేయడం ప్రారంభించాలి.శ్రావణమాసంలో వచ్చే మొదటి మంగళవారంనాడు ఈ వ్రతాన్ని చేయడం ప్రారంభించి, ఆ నెలలో ఎన్ని మంగళవారములు వస్తే అన్నివారాలు వ్రతాన్నిచేయాలి.ఒకవేళ ఏవైనా ఆటంకములు ఏర్పడినా ఏదైనా ఒక వారంగానీ,రెండు వారాలు గానీ చేయలేకపోతే, అందుకు ప్రత్యామ్నాయ మార్గాన్ని మన పురాణాలు సూచించాయి. శ్రావణమాసంలో ఎన్ని మంగళవారాలు చేయడానికి వీలు కలుగదో,అన్నిమంగళవారాలు భాద్రపద మాసంలోని శుక్ల పక్షంలో వచ్చే మంగళవారాలలో చేయవచ్చు.

అంటే మహాలయ పక్షాలు ప్రారంభం కావడానికి ముందే ఈ వ్రతాన్ని పూర్తి చేయాలి. ఈ విధంగా పెళ్ళయిన సంవత్సరం నుంచి మొత్తం ఐదు సంవత్సరాల పాటు ఈ వ్రతాన్ని చేసి ఉద్యాపన చేయాలి.

మంగళగౌరీ వ్రత నియమాలు

తొలిసారిగా నోమును ప్రారంభించేటప్పుడు వ్రతం చేస్తున్నవారి తల్లి ప్రక్కనే వుండి వ్రతాన్ని చేయించడం శ్రేష్టం. అలాగే తొలి వాయనాన్ని తల్లికే ఇవ్వడం మంచిది. ఒకవేళ తల్లి లేకపోయినట్లయితే అత్తగానీ, లేదా ఇతర ముత్తైదువుల సహాయంతోగానీ వ్రతాన్ని ఆచరించవచ్చు.

వ్రతమును చేసేరోజు ఉదయం నిద్రలేస్తూనే ముందుగా భర్త పాదాలకు , అనంతరం తల్లిదండ్రులు , అత్తమామలు, ఇతర పెద్దలకు పాదాభివందనం చేసి వారి ఆశీర్వాదం పొందాలి. వ్రతం ఆచరించే నాటి ముందు రోజు రాత్రి ఫలహారం భుజించి ఉపవాసం ఉండడం శ్రేష్టం. వ్రతాన్నిఆచరించే మహిళలు తప్పనిసరిగా కాళ్ళకు పారాణి పెట్టుకోవాలి.

వ్రతాన్ని పాటించే రోజు రాత్రి ఉపవాసం ఉండాలి.

వ్రతాన్ని ఆచరించే నాటి ముందు రోజు, వ్రతం రోజూ దాంపత్య సుఖానికి దూరంగా ఉండాలి.

వ్రతానికి తప్పనిసరిగా ఐదుగురు ముత్తైదువులను పేరంటానికి పిలిచి వారికి వాయనములు ఇవ్వాలి. అయితే కొన్నిప్రాంతాల్లో మొదటి వారం ఐదు మంది, రెండవవారం పదిమంది, ఈ విధంగా రెట్టింపుతో ముత్తైదువులను ఆహ్వానించి వాయనములు ఇచ్చే ఆచారం ఉంది .ఇది చేసేవారి శక్తిని బట్టి ఉంటుంది.

ఒకే మంగళగౌరీదేవి విగ్రహాన్ని ఆ నెలలో వచ్చే అన్ని వారాల్లో ఉపయోగించాలి. వారానికొక కొత్త విగ్రహాన్ని ఉపయోగించకూడదు. ఆ సంవత్సరం వ్రతం పూర్తయిన తరువాత, వినాయక చవితి పండుగ పిదప, వినాయకుడి నిమజ్జనంతో పాటు అమ్మవారినీ నిమజ్జనం చేయాలి.

పూజకు గరికె, ఉత్తరేణి, తంగేడుపూలు తప్పనిసరిగా వాడాలి.

మంగళగౌరీ వ్రతానికి కావలసిన వస్తువులు

పసుపు, కుంకుమ వాయనమునకు అవసరమైన వస్తువులు. ఎర్రటి రవికె గుడ్డ, గంధము, పూలు, పండ్లు, ఆకులు, వక్కలు, తోరములకు దారము, టెంకాయ, పసుపుతాడు , దీపపు సెమ్మెలు -2, ఐదు వత్తులతో హారతి ఇవ్వడానికి అవసరమైన హారతి పళ్ళెం, గోధుమపిండితో గానీ, పూర్ణంతో గానీ చేసిన ఐదు ప్రమిదలు, కర్పూరం , అగరవత్తులు, బియ్యము, కొబ్బరిచిప్ప ,శనగలు, దీపారాధనకు నెయ్యి మొదలైనవి.

మంగళగౌరీని ప్రతిష్టించుకునే విధం

వ్రతాన్ని ఆచరించే రోజున ఉదయాన్నేలేచి తల స్నానం చేసి,ఇంటిని శుభ్రంగా కడగాలి. పూజగదిలో గానీ, ఇంట్లో వ్రతం చేయదలుచుకున్న ప్రాంతంలో గానీ, ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ మండపం పైన బియ్యపు పిండితో అష్టదళ పద్మములను ముగ్గుగా తీర్చిదిద్దాలి. దానిపైన బియ్యాన్ని పోసి బియ్యం పై ఒక కొబ్బరి చిప్పను ఉంచాలి. దానిమీద జాకెట్ బట్ట ఉంచి, తమలపాకులను పెట్టి, ఆ పైన మంగళగౌరీని ప్రతిష్టించుకోవాలి. మంగళగౌరీని సాధారణంగా పసుపుతో చేసుకోవటం మంచిది.అయితే ఒక మాసమంతా ఉంచుకోవాలి కాబట్టి, పసుపుకు గోధుమ పిండిని కలిపి మంగళగౌరీని తయారు చేసుకోవాలి.

మంగళగౌరీని ఐదు ముఖాలతో తయారు చేసుకోవాలి. అంటే పసుపు, గోధుమ పిండి మిశ్రమముతో ఒక పీఠముగా చేసుకుని, దానిపై నాలుగు మూలలా చిన్న స్తంభాలుగా ఉంచాలి. వాటి మధ్యలో ఐదవదాన్నిఉంచాలి. ఈ విధంగా మంగళగౌరీని ఐదు ముఖాలతో తయారు చేసుకుని పీఠముపై ప్రతిష్టించి, కుంకుమ, పూలను అలంకరించాలి.

పైన చెప్పినటువంటివే ప్రస్తుతం "మంగళగౌరీ" విగ్రహాలు వెండి లేదా బంగారపువి మార్కెట్టులో లభిస్తాయి. కొందరు వాటిని కూడా ఉపయోగిస్తున్నారు. వాటిని ఉపయోగించి లేదా పసుపుతో చేసి ప్రతిష్టించుకోవాలి. ఈ మంగళగౌరీ దేవికి వెనుక భాగాన గౌరీదేవి ఫొటోను కూడా ఉంచుకోవచ్చు. పూజా పీఠాన్ని ఎవరి శక్తి కొద్దీ వారు అలంకరించు కోవచ్చు. ఈ విధంగా అమ్మవారిని ప్రతిష్టించుకుని వ్రతాన్నిచేసుకోవాలి. గౌరీదేవి ఫొటో దొరకని వారు పార్వతీదేవి రూపాలకు చెందిన ఫొటోలను పెట్టుకోవచ్చు.

మంగళగౌరీ వ్రత విధానం

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్
ప్రసన్నవదనం ధ్యాయేత్సర్వ విఘ్నేపశాంతయే.
(అని ముందుగా గణపతిని ధ్యానించి తదుపరి ఆచమనం చేయాలి)
ఓం కేశవాయ స్వాహా: (చేతిలో నీరు తీసుకుని స్వీకరించాలి)
ఓం నారాయణ స్వాహా:
ఓం మాధవాయ స్వాహా:
ఓం గోవిందాయనమ: (చేతులు కడుక్కోవాలి)
ఓం విష్ణవేనమ: (కళ్ళు తుడుచుకోవాలి)
ఓం మధుసూదనాయ నమ:
ఓం త్రివిక్రమాయ నమ:
ఓం వామనాయ నమ:
ఓం శ్రీధరాయ నమ:
ఓం హృషీకేశాయ నమ:
ఓం పద్మనాభాయ నమ:
ఓం సంకర్షణాయ నమ:
ఓం వాసుదేవాయ నమ:
ఓం ప్రద్యుమ్నాయ నమ:
ఓం అనిరుద్ధాయ నమ:
ఓం పురుషోత్తమాయ నమ:
ఓం అధోక్షజాయ నమ:
ఓం నారసింహాయ నమ:
ఓం అచ్యుతాయ నమ:
ఓం జనార్దనాయ నమ:
ఓం ఉపేంద్రాయ నమ:
ఓం హరయే నమ:
ఓం శ్రీకృష్ణాయ నమ: (కొంచం నీళ్ళను చేతిలోకి తీసుకుని నేలపై చిలకరిస్తూ)

“ ఉత్తిష్టంతు భూచపిశాచా: యేతే భూమి భారకా:
యేతేషామ విరోథేన బ్రహ్మకర సమారభే !! ” (అనే శ్లోకాన్ని పఠించాలి)
“ ఓం భూ: ఓం భువ: ఓం సువ: ఓం మహ:
ఓం జన: ఓం తప: ఓం సత్యం ఓం తత్ సవితుర్వరేణ్యుం
భర్గో దేవస్య ధీమహి ధియోయోన: ప్రచోదయాత్
ఓం మపోజ్యోతి ఈరసోమృతం బ్రహ్మ భుర్భవస్సురోమ్ "

మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం శుభే శోభన ముహూర్తే అద్యబ్రహ్మాణ: ద్వితీయ పరార్థే శ్వేత వరాహకల్పే, వైవస్వత మన్వంతరే కలియుగ ప్రథమ పాదే జంబూ ద్వీపే భరత్ వర్షే, భరతఖండే, మేరో: దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య....(శ్రీ శైలానికి, వ్రతం చేసే వారి ఊరు ఏ దిక్కులో ఉందో, ఆ దిక్కుని చెప్పాలి.) ప్రదేశే, కృష్ణా, కావేరి మధ్యప్రదేశే ( ఏ నదుల మధ్య ప్రాంతంలో వుంటే ఆ నదుల పేర్లు చెప్పాలి)

స్వశోభన గృహే, సమస్త దేవతా, బ్రాహ్మణ, హరిహర సన్నిథౌ, వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన శ్రీపార్థివ నామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ శ్రావణ మాసే శుక్ల కృష్ణ పక్షే...తిథౌ (తిథి పేరు)....వాసరే (వారం పేరు).... శుభనక్షత్రే శుభయోగే శుభకరణే ఏవం గుణ విశేషణ విశిష్టాయం శుభతిథౌ, శ్రీమత్యా: గోత్రస్య, శర్మణ: ధర్మపత్నీ శ్రీమతీ...గోత్రవతీ (గోత్రం పేరు)... నామధేయవతి (పేరు) అహం మమోపాత్త దురితక్షయద్వారా యావజ్జీవ సామాంగల్య సిద్ధ్యర్థ పుత్ర, పౌత్ర సంపత్సౌభాగ్య సిద్ధ్యర్థం మమ వివాహ ప్రథమ వర్షాది పంచమ వర్ష పర్యంతరం శ్రీమంగళగౌరీ వ్రతం కరిష్యే. అద్య శ్రీ మంగళగౌరీ దేవతా ముద్దిశ్య శ్రీ మంగళగౌరీ దేవతా ప్రీత్యర్థం, సంభవద్భిర్త్రవై: సంభవితానియమేన ధ్యానవాహనాది షాడోశోపచార పూజాం కరిష్యే...(నీటిని విడవాలి)

ఈ విధంగా సంకల్పం చెప్పుకొన్న తర్వాత కలశపూజ చేయాలి.

కలశ పూజ

పూజకు మాత్రమే ఉపయోగించే ఒక గ్లాసును గానీ, పంచపాత్రను గానీ తీసుకుని, అందులో నీరు పోసి అక్షతలు, పువ్వులు, తమలపాకులను ఉంచాలి. దానికి బయట మూడు వైపులా గంధాన్నిరాసి, కుంకుమను పెట్టాలి.

ఈ విధంగా చేసి, దానిపై కుడిచేయి నుంచి క్రింది శ్లోకాన్ని పఠించాలి.

కలశస్య ముఖే విష్ణు కంఠే ఋద్రసమాశ్రిత:
మూలేతత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాత్రుగణ: స్థితా:
కుక్షౌ తుస్సాగరస్సర్వే సప్తద్వీపా వసుంధరా
ఋగ్వేదోధ యజుర్వేదో స్సామ వేదో హ్యధర్వణ :
అంగైశ్చ స్సహితా స్సర్వే కలశాంబు సమాశ్రితా:
ఆయాంతు గణపతి పూజార్ధం దురితక్షయకారకా:
గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి
నర్మదే సింధూకావేర జలేస్మిన్ సన్నిధిం కురు !!

అంటూ శ్లోకాన్ని చదివి కలశంలోని నీటిని పుష్పముతో ముంచ భగవంతుని పైన, పూజాద్రవ్యముల పైన, పూజ చేయువారు తలపైన చల్లుకోవాలి.

(గమనిక: పూజలో అవసరమైన సమయంలో ఈ కలశంలోని నీటినే ఉపయోగించాలి. ఆచమనం చేసేందుకు ఉపయోగించే జలాన్ని పూజకు ఉపయోగించరాదు. అలాగే కలశంలోని నీటిని ఆచమనమునకు ఉపయోగించరాదు. ఏ వ్రతంలోనైనా, పూజలోనైనా ఇది తప్పనిసరిగా పాటించవలసిన నియమం)

కలశపూజ అనంతరం పసుపుతో గణపతిని చేసుకుని, మండపంలో తమలపాకు పై నుంచి, వ్రతం నిర్విఘ్నంగా జరగాలని ముందుగా గణపతిని పూజించాలి.

అదౌ నిర్విఘ్నేన వ్రత పరిసమాప్త్యర్థం గణపతి పూజాం కరిష్యే.
"వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ
నిర్విఘ్నం కరుమేదేవో సర్వ కార్యేషు సర్వదా !!”
ఆగచ్ఛ వరసిద్ధి వినాయక, అంబికా ప్రియనందన
పూజా గృహణ సుముఖ, నమస్తే గణానాయక"

ఓం సుముఖాయ నమ:
ఓం ఏకదంతాయ నమ:
ఓం కపిలాయ నమ:
ఓం గజకర్ణికాయ నమ:
ఓం లంబోదరాయ నమ:
ఓం వికటాయ నమ:
ఓం విఘ్నరాజా రాయనమ:
ఓం గణాధిపాయ నమ:
ఓం ధూమకేతవే నమ:
ఓం వక్రతుండాయ నమ:
ఓం గణాధ్యక్షాయ నమ:
ఓం ఫాలచంద్రాయ నమ:
ఓం జగాననాయ నమ:
ఓం శూర్పకర్ణాయ నమ:
ఓం హేరంబాయ నమ:
ఓం స్కంద పూర్వాజాయ నమ:
ఓం శ్రీ మహాగణాథిపతయే నమ:
నానావిథ పరిమళపత్ర పుష్పాణి సమర్పయామి.
ఓం శ్రీ మహాగణాథిపతయే నమ:ధూపం ఆఘ్రాపయామి.
ఓం శ్రీ మహాగణాథిపతయే నమ: దీపం దర్శయామి.

(అనంతరం స్వామీ వారి ముందు పండ్లుగాని బెల్లాన్ని గాని నైవేద్యంగా ఉంచాలి).

ఓం భూర్భువస్సువః తత్సవితుర్వర్యేణ్యం ,

భర్గోదేవస్య థీమహి థియోయోన:, ప్రచోదయాత్...

(నీరు నివేదన చుట్టూ చల్లుతూ) సత్యం త్వర్తేన పరిషించామి, అమ్రుతమస్తు అమృతో పస్తరణమసి... ఓం ప్రాణాయ స్వాహా, ఓం అపానాయ స్వాహో, ఓం వ్యానాయ స్వాహా, ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా, ఓం బ్రహ్మేణ్యే స్వాహో గూడ సహితఫల నివేదనం సమర్పయామి, మధ్యే మధ్యే పానీయం సమర్పయామి.(నీటిని వదలాలి).

శ్రీ మహాగణాథిపతయే నమ: తాంబూలం సమర్పయామి, తాంబూలానంతరం ఆచమనం సమర్పయామి.( కర్పూరం వెలిగించి నీరాజనం ఇవ్వాలి).

శ్రీ మహాగణాథిపతయే నమ: కర్పూర నీరాజనం సమర్పయామి.

నీరాజనానంతరం, ఆచమనీయం సమర్పయామి.!

అనేన మాయా చరిత గణపతి అర్చనేన భగవత: సర్వాత్మక: శ్రీ గణపతిర్దేవతా

సుప్రీత, సుప్రసన్న వరాదభవతు ! మమ యిష్టకామ్యార్థ సిద్ధిరస్తు !!

వినాయకునికి నమస్కరించి అక్షతలు తల మీద చల్లుకోవాలి.ఈ విధంగా మహాగణపతి పూజను ముగించిన అనంతరం మంగళగౌరీ వ్రతాన్ని ప్రారంభించాలి. పూజను ప్రారంభించే ముందు తోరణములను తయారు చేసుకోవాలి.

తోర పూజ

తెల్లటి దారమును ఐదు పోగులు తీసుకుని దానికి పసుపు రాసుకోవాలి. ఆ దారానికి ఐదు పూలు, ఐదు చోట్ల కట్టి ముడులు వేయాలి. అంటే ఐదు పోగుల దారమును ఉపయోగించి, ఐదు పువ్వులతో ఐదు ముడులతో తోరములను తయారు చేసుకుని, పీఠం వద్ద ఉంచి, పుష్పములు, పసుపు, కుంకుమ, అక్షతలు వేసి, తోరములను పూజించి ఉంచుకోవాలి. ఈ విధంగా తోరములను తయారు చేసుకున్న అనంతరం పూజకు ఉపక్రమించాలి.

Tuesday, July 17, 2012

మొగలిపూవు పూజకు అర్హత లేని పువ్వని అంటారు. నిజమేనా?

పూర్వం బ్రహ్మ విష్ణువులు నేను గొప్పంటే నేను గొప్పని కలహించుకుంటూ ఉండగా, అపుడు వారి మధ్య ఒక శివలింగం పుట్టి బ్రహ్మను, నా శిరస్సు ఎక్కడుందో కనుక్కోవలసిందని; విష్ణువును నా పాదాలేక్కడున్నాయో కనుక్కోవలసిందని ఆదేశించింది. హంసరూపంలో బ్రహ్మ పైకి; ఆదివరాహరూపంలో విష్ణువు క్రిందికి వెళ్లారు. బ్రహ్మకు లింగంశిరస్సు, విష్ణువునకు లింగపాదాలు కన్పించలేదు. మన్వంతరాలు తిరిగిపోయాయి. ఇద్దరూ తిరిగి పోరాడుకున్న స్థలానికే వచ్చారు. విష్ణువు నాకు లింగంపాదాలు కనిపించాలేదన్నాడు. బ్రహ్మ తానూ లింగం శిరస్సు చూచానని; మొగిలిపూవును, కామధేనువును వెంటబెట్టుకొని వచ్చి మొగలిపూవుచేత చూచినట్లు సాక్ష్యం చెప్పించాడు. కామధేనువు నడగ్గా అది తన తోకను అడ్డంగా ఊపి ఇది అబద్ధమని తెలియజేసింది. అప్పుడు విష్ణువు మొగలిపూవు అబద్ధం చెప్పింది కనుక అది పూజకర్హం కాదనీ, కామధేనువు వృష్ఠభాగంతో సత్యం తెలిపింది కనుక ఆవుకు వెనుకభాగం పూజార్హమగుగాక యనిన్నీ శాపం పెట్టాడు. అందువల్ల మొగలి పూవు పూజకర్హం కాకుండా పోయింది. ఆవు వెనుకభాగమే పూజింపబడుతోంది. మల్లె, గులాబీ మొదలైన పూవులు కూడా పూజకనర్హాలే! మల్లె కేవలం అలంకారానికి మాత్రమే! 

తీర్థం

మనం ఆలయానికి స్వామి దర్శనానికై వెళ్లినప్పుడు, పురోహితులు ‘అకాల మృత్యు హరణం, సర్వవ్యాధి నివారణం సమస్త పాప క్ష్యకరం, శ్రీ పరమేశ్వర పాదోదకం పావనం శుభం’ అనే మంత్రాన్ని చదువుతూ తీర్థాన్ని ఇస్తుంటారు. రాకూడని కాలంలో మృత్యువుతో సమానమైన బాధ రాకుండా ఉండేందుకై, సమస్త వ్యాదుల నివారణకు, సమస్త పాపాలనుండి బయట పడటానికి, పరమేశ్వరుని పాదోదకాన్ని స్వీకరిస్తున్నానని అర్థం. స్వామికి పంచామృతాలతో స్నానాన్ని చేయించగా వచ్చిన తీర్థం కాబట్టి, ఓ విధమైన ఔషధ శక్తిని పొందిన దీనిని నీరు అని పిలువకుండా ‘తీర్థం’ అని అన్నారు. ఈ తీర్థంలో పవిత్ర మంత్ర శక్తి ఉంటుంది. అది మనకు శుభం కలిగిస్తుంది.

నమస్కార విధానం

నమః – అనగా త్యాగమని వాచ్యార్థం. నేను నీకంటే తక్కువవాడను. నీవు నాకంటే గొప్పవాడవు అనే “దాస్యభావం” (దైవానికి దైవవిషయాలకు) స్ఫురిస్తుంది.

“నాకు నేను ఉపయుక్తుడను కాను”, కాబట్టి, నీవే నన్ను ఉద్దరించగలవాడవు అని ‘ఆత్మార్పణము చేసుకోవటం’ అనునిక అపూర్వయోగాన్ని “నమః" అను పదం సూచిస్తోంది. తన నికృష్ణతను, పూజ్యడగువాని ఉత్కృష్ణతను చూపటానికి నమస్కారంలో ఓ రహస్యం ఉంది. నమస్కారం వంటి తారక మంత్రం ఇంకొకటి లేదు. శత్రువు యొక్క శత్రుభావాన్ని సమూలంగా పోగొట్టగల శక్తి ఈ నమస్కారానికి ఉంది. నమస్కారంతో సకలార్థసిద్ధిని పొందవచ్చు.

శ్రీకృష్ణ పరమాత్మకు ఒక్కసారి నమస్కరించితే పది ఆశ్వమేథయాగాల అనంతరం చేయబడు అవభృథస్నానంతో సమానమని, భారతంలో చెప్పబడింది.

నమస్కారం వలన దైన్యభావం అలవడతాయి. దీనిచే మనలోని అహంకారం తగ్గుతుంది. దైన్యమనగా (నిరాడంబరత) సేవాభావమని అర్థం. సేవాభావం వలన, భగవద్భక్తి పెంపొంది, భగవంతునిపట్ల ఆరాధనాభావం కలుగుతుంది. అట్టి ప్రేమారాధానమే ‘భక్తి’. అట్టి భక్తితో సాధింపరాని సిద్ధులు లేవు. భక్తియే ఆత్మా సాక్షాత్కార జ్ఞానానికి మూలం. పరమభాక్తియే మోక్షప్రాప్తికి ఉత్తమ సాధనం. నమస్కారము – కాయకము, వాచికము, మాసికము అని మూడు విధాలు.

కాయకము: ఇది శారీరకమైనది, రెండు అరచేతులు కలిపి చేసే నమస్కారం. పడుకుని అష్టాంగాల్ని నేలపైమోపి చేయబడు సాష్టాంగ నమస్కారం, మరియు ధ్యాన ముద్ర నమస్కారము. (ఎడమబోటనివేలిపై కుడి బొటనవేలు ఉంచి, పరస్పరం పట్టుకుని, ఇతర వ్రేళ్ళను సాచి ఉంచితే మహాముద్ర అవుతుంది) ఈ ధ్యానముద్ర నమస్కారంతో, భావంతుని దానించితే సత్ఫలితాలు సిద్ధిస్తాయి.

వాచికము: నోటితో ఉచ్ఛరించునది. “నమః”, “నమస్కారము” మొదలగు శబ్దములతో మనమనోభావాన్ని తెలుపటం.

మాసికము: దైవంపట్ల, మనఃపూర్వకమైన ‘నమస్కార’ భావమును మనస్సునందే ఏకాగ్రతతో తలచుట.

ఏవిధమైన నమస్కారమైనప్పటికీ ఆత్మార్పణ చేసుకొనుటయే అవుతుంది. కాయక నమస్కారంతో (శారీరక నమస్కారాలు) అష్టాంగము, పంచాంగము, త్రయ్యంగము, ఏకంగము అని నాలుగు విధానాలున్నాయి.

అష్టాంగ నమస్కారము: అష్టాంగ నమస్కారం ఉత్తమమైనది, ముఖ్యమైనది, తప్పని సరిగా ఆచరించవలసినది.

“శిరోహస్తౌచ కర్ణౌచ చుబుకమ్ బాహు యుగ్మం అష్టాంగ చ నమస్కారమ్” అనగా శిరస్సు, రెండుచేతులు, రెండుచెవులు, గడ్డం, రెండు భుజాలు వీనిని నేలపై ఆనించి చేయబడు నమస్కారం ‘అష్టాంగము’ అని చెప్పబడుతోంది. దేవతలకు, గురువులకు, పెద్దలకు ఈ విధమైన నమస్కారం చేయాలి. (స్త్రీలు ఈవిధమైన నమస్కారాన్ని చేయరాదు).

పంచాంగ నమస్కారము: “శిరోహస్తౌచ బాహుచ కృత్యా జానునీ, సంస్థితా ఇదం పంచాంగ మేవోక్తమ్”

అనగా శిరస్సు, రెండుచేతులు, రెండు భుజాలు, మోకాళ్ళు నేలపై ఆన్చి (మోకాళ్ళపై వంగి) చేయబడు నమస్కారం పంచాంగ నమస్కారమని పిలువబడుతోంది. ఈ విధమైన నమస్కారం స్త్రీలకు ఉత్తమమైనది.

త్రయ్యంగ నమస్కారము: “హస్తౌ బద్ధ్వాతు ముకళ వమ్మార్నిదేశేనియోజయేత్”

రెండుచేతులు ముకుళించి (జోడించి) తలపై ఉంచి చేయబడుతున్న నమస్కారం త్రయ్యంగ నమస్కారం.

ఏకంగా నమస్కారము: “ఏకాంగంతు నమస్కారం శిరసైనా కృతాభవేత్”

తలను మాత్రం వంచి చేయబడు నమస్కారం “ఏకాంగ” నమస్కారమని పిలువబడుతుంది. తప్పనిసరి పరిస్థితుల్లోనే (చేతులను జోడించి నమస్కరించ లేని పరిస్థితులలోనే) ఈ పద్ధతిలో నమస్కరించాలి.

‘గురువు’కు ఈ క్రింది విధంగా నమస్కరించటం శ్రేయస్కరం.

“వ్యత్యప్త పాణినా కార్యమున సంగ్రహణం గురోః |

సవ్యేన సవ్యః స్పృష్టవ్యో దక్షిణేవ చ దక్షణ: ||”

అనగా రెండు చేతులులను మార్చి పట్టుకుని (అనగా కుడిచేతిలో గురువు యొక్క కుడిపాదాన్ని, ఎడమచేతిలో గురువుయొక్క ఎడమపాదాన్ని) పట్టుకుని నమస్కరించాలి. మీ పాదపద్మాలే నాకు శరణ్యమనే భక్తి భావనతో గురువుకు నమస్కరించాలి.

“ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాంకరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాం గముచ్యతే”

వక్షఃస్థలాన్ని, శిరస్సును భూమికితాకించి, దృష్టితో దైవాన్ని చూస్తూ, మనస్సులో దైవమును ప్రార్థన చేస్తూ, ‘నమః’ అని పలుకుతూ, రెండు పాదాగ్రాలను కలుపుతూ, రెండు చేతులతో నమస్కరిస్తూ, రెండు చెవులను నేలకు తాకిస్తూ బోర్లపడి నమస్కరించటం “సాష్టాంగ నమస్కారం” అనబడుతుంది. ఈ విధమైన నమస్కారంలో కాయికము, వాచికము, మానసికము అనబడు త్రివిధాలైన నమస్కారాలు అంతర్గర్భితాలై ఉన్నాయి. అనగా మనస్సు చేత చింతించుట, వాక్కుచే ‘నమః’ అని అనటం, బోర్లగిలి అష్టాంగనమస్కారం చేయుట కలిసున్నాయి. ఇంకా రెండుచేతులు, రెండుకాళ్ళు, వక్షస్థలం, నొసలు, రెండు భుజాలు మొత్తం ఎనిమిది అంగాలను నేలకు తాకుతున్నట్లు బోర్లగిలి నమస్కరిస్తున్నందువల్ల “సాష్టాంగ నమస్కారం” అని పిలువబడుతోంది. ఈవిధమైన “సాష్టాంగ నమస్కారం” శ్రేష్టమైనది. స్త్రీలు సాష్టాంగ నమస్కారాలు చేయరాదు.

నమస్కారాలు చేయటంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. మొక్కుబడిగా, హడావుడిగా కాక మనస్ఫూర్తిగా నమస్కరించాలి. రెండు చేతులను పూర్తిగా కలిపి హృదయస్థానాన్నిగాని, నుదుటనుగాని స్పర్శిస్తూ నమస్కరించాలి. నమ్రతభావనతో నమస్కరించాలి. ఇవన్నీ పూర్తిగా పాటించి నమస్కరిస్తేనే ‘నమస్కారం’ యొక్క నమ్రతాక్రియకు పరిపూర్ణత సిద్ధిస్తుంది. 3,5,7,9,12 సంఖ్యలలో నమస్కారాలు చేయడం శ్రేయస్కరం.

నవగ్రహ ప్రదిక్షిణ

రహగతులమూలంగా మనిషికి ఎదురయ్యే ఆటుపోట్ల నుండి తట్టుకోవడానికి సులభమైన ప్రక్రియ నవగ్రహ ప్రదక్షిణలు. వీటివల్ల ఉత్పన్నమయ్యే దైవికశక్తి మనిషిని కాపాడుతుంటుంది. నిర్దిష్టమైన పధ్ధతి ప్రకారం నవగ్రహ ప్రదక్షిణలు చేస్తే విశేషఫలితం ఉంటుంది.
చాలామంది ప్రదక్షిణలు చేస్తూ నవగ్రహాలను తాకి నమస్కారాలు అర్పిస్తుంటారు. వీలైనంతవరకూ వాటిని తాకకుండానే ప్రదక్షిణలు చేయడం ఉత్తమం.

నవగ్రహాల మధ్య తేజస్వి ఐన సూర్యుడు తూర్పుముఖంగా ఉంటాడు. సూర్యుని ముందు శుక్రుడు కూడా తూర్పుముఖముగా ఉంటాడు. సూర్యుడికి కుడివైపు కుజుడు దక్షిణాభిముకంగా ఉంటాడు.

శుక్రునికి కుడివైపు పడమర ముఖంగా చంద్రుడు ఉండగా, ఎడమవైపు బుధుడు ఉత్తరాభిముఖంగా ఉంటాడు. సూర్యునికి వెనుకవైపు శని మహాత్ముడు పశ్చిమాభిముఖంగా వుంటాడు. శనికి ఎడమవైపు రాహువు ఉత్తరాభిముఖంగానూ, కుడివైపు కేతువు దక్షిణాభిముఖంగానూ, ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఇది ప్రశస్తమైన ప్రతిష్ట.

సూర్యునిచూస్తూ లోనికి ప్రవేశించి ఎడమ వైపునుండి (చంద్రునివైపు నుండి)  కుడి ప్రక్కకు తొమ్మిది ప్రదక్షణలు చెయ్యడం శ్రేష్టం. ప్రదక్షిణలు పూర్తయిన తరువాత కుడి వైపు నుండి ఎడమవైపునకు (అనగా బుధుడి వైపు నుండి) రాహువునూ కేతువునూ స్మరిస్తూ రెండు ప్రదక్షిణలు చేయవచ్చు.

చివరగా వరుసగా సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, కుజుడిని, బుధుడిని, బృహస్పతిని, శుక్రుడిని, శని మహాత్ముని, రాహువును, కేతువును, స్మరిస్తూ ఒక్కక ప్రదక్షిణచేసి నవగ్రహాలకు వీపు చూపకుండా వెనుకకు రావాలి.
గ్రహదోషాల నుండి తప్పుకోవడానికి నవగ్రహప్రదక్షిణ కంటే ఉత్తమమయిన మార్గం లేదన్నది స్పష్టం

ద్వాదశ జ్యోతిర్లింగ దర్శనం

సౌరాష్ట్రదేశే విశదేతిరమ్యే జ్యోతిర్మయం చంద్రకలావతంసం
భక్తి ప్రదానాయ కృపావతీర్ణం తం సోమనాథం శరణం ప్రప్రద్యే
శ్రీశైల శృంగే విబుధాతింసంగే తులాద్రితుంగే పి ముదావసంతం
త మర్జునం మల్లిక పూర్వమేకం నమామి సంసార సముద్ర సేతుం
అవంతికాయం విహాతావతారం ముక్తిప్రదానాయ చ సజ్జనానాం
అకాల మృత్యోః పరిరక్షణార్థం వందే మహాకాల మహాసురేశం
కావెరికా నర్మదయోః పవిత్రే సమాగమే సజ్జనతారణాయ
సదైవ మాంధాతృపురే వసంతమోంకార మీశం శివమేకమీడే
పూర్వోత్తరే ప్రజ్జ్వలికా నిధానే సదా వసంతం గిరిజాసమేతం
సురాసురాధిత పాదపద్మం శ్రీవైద్యనాథం తం మహం నమామి
యామ్యే సదంగే నగరేతి రమ్యే విభూషి తాంగం వివిధైశ్చభోగైః
సద్భక్తిముక్తి ప్రదమీశ మేకం శ్రీనాగనాథం శరణం ప్రపద్యే
మహాద్రిపార్శ్వే చ తటేరమంతం సంపూజ్యమానం సతతం మునీంద్రైః
సురాసురైర్యక్ష మహోరగాద్వైః కేదారమీశం శివమేకమీడే
సహ్యద్రిశీర్షే విమలే వసంతం గోదావరీతీర పవిత్ర దేశే
యద్దర్శనా త్పాతకమాశునాశం ప్రయాతి తం త్ర్యంబకమీశమీడే
సుతామ్రపర్ణీ జలరాశియోగే నిబధ్యసేతుం విశిఖై రసంఖ్యైః
శ్రీరామచంద్రేణ సమర్పితం తం రామేశ్వరాఖ్యం నియతం నమామి
యం ఢాకినీ శాకినికా సమాజే నిషేవ్యమాణం పిశితాశనైశ్చ
సదైవ భీమాది పద ప్రసిద్ధం తం శంకరం భక్తిహితం నమామి
సానంద మానంద వనే వసంత మాననందకందం హతపాపబృందం
వారాణసీనాథ మనాథనాథం శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే
ఇలాపురే రమ్యవిశాలకేస్మిన్ సముల్లసంతం చ జగద్వరేణ్యం
వందే మహోదారతర స్వభావం ఘృష్ణేశ్వరాఖ్యం శరణం ప్రపద్యే
జ్యోతిర్మయ ద్వాదశాలింగకానాం శివాత్మనాం ప్రోక్తమిదం క్రమేణ
స్తోత్రం పఠిత్వామనుజోతి భక్త్యాఫ్లం తదాలోక్య నిజం భజేచ్ఛ

జ్యోతిస్వరూపుడైన మహేశుడు ఈ పవిత్ర భారతావనిలో పన్నెండుచోట్ల జ్యోతిర్లింగ స్వరూపంలో వెలసి భక్తులను కరుణిస్తున్నాడు. భారతదేశంలోని నాలుగుదిక్కులలో పన్నెండు జ్యోతిర్లింగాలున్నాయి. సముద్రపు ఒడ్డున రెండు (బంగాళాఖాతతీరంలో రామేశ్వరలింగం, అరేబియా సముద్రతీరాన సోమనాథలింగం) పర్వత శిఖరాలలో నాలుగు (శ్రీశైలంలో మల్లిఖార్జునుడు, హిమాలయాలలో కేదారేశ్వరుడు, సహ్యాద్రి పర్వతాలలో భీమశంకరుడు, మేరుపర్వతాలపై వైద్యనాథలింగం) మైదాన ప్రదేశాలలో మూడు (దారుకావనంలో నాగేశ్వరలింగం, ఔరంగాబాద్ వద్ద  ఘృష్ణేశ్వర లింగం, ఉజ్జయినీ నగరంలో మహాకాళేశ్వర లింగం) నదుల ఒడ్డున మూడు (గోదావరీతీరాన త్ర్యంబకేశ్వర లింగం, నర్మదాతీరానా ఓంకారేశ్వరుడు, గంగానదీతీరాన విశ్వేశ్వరుడు). ఇలా మొత్తం పన్నెండు జ్యోతిర్లింగ రూపాలలోనున్న ఈ లింగాలు పరమశివుని తేజస్సులు. ఇవి ద్వాదశాదిత్యులకు ప్రతీకలు. పదమూడవ లింగం కాలలింగం. తురీయావస్థను పొందిన జీవుడే కాలలింగము. తైత్తీరీయోపనిషత్తుననుసరించి 1. బ్రహ్మ 2. మాయ 3. జీవుడు 4. మనస్సు 5. బుద్ధి 6. చిత్తము 7. అహంకారము 8. పృథ్వి 9. జలము 10.తేజస్సు 11. వాయువు 12. ఆకాశం – ఈ పన్నెండు తత్త్వాలే పన్నెండు జ్యోతిర్లింగాలు. ఇవన్నీ ప్రతీకాత్మకంగా మన శరీరంలో ఉన్నాయి. ఖాట్మండులోని పశుపతినాథలింగం ఈ పన్నెండు జ్యోతిర్లింగాలకు శిరస్సు వంటిది. ఈ జ్యోతిర్లింగాలలొ ఒక్కొక్క జ్యోతిర్లింగానికి ఒక్కొక్క మహిమ ఉంది. ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించినా, స్పృశించినా అనేక మహిమలు మన జీవితాలలొ ప్రస్ఫుటమవుతుంటాయి. పన్నెండు జ్యోతిర్లింగాలను దర్శించుకోలేనివారు, కనీసం ఒక్క లింగాన్నైనా దర్శించగలిగితే అనంతకోటి పుణ్యం లభిస్తుందనేది పెద్దలవాక్కు.

1. సోమనాథ జ్యోతిర్లింగం

స్వామి సోమనాథునిగా వెలసిన కథ స్కాంద పురాణంలో ఉంది.

బ్రహ్మదేవుని మానసపుత్రుడైన దక్షప్రజాపతికి అశ్విని నుంచి రేవతి వరకు 27 కుమార్తెలున్నారు. తన కుమార్తెలను చంద్రునికి ఇచ్చి ఘనంగ వివాహం జరిపించాడు దక్షుడు. అయితే చంద్రుడు రోహిణిని మాత్రం అనురాగంతో చూస్తూ, మిగిలినవారిని అలక్ష్యం చేయసాగాడు. మిగిలినవారు తండ్రితో ఈ విషయాన్నీ మొరపెట్టుకోగా, దక్షుడు అల్లుడైన చంద్రుడిని మందలిస్తాడు. అయినప్పటికీ, చంద్రుని ప్రవర్తనలో మార్పురాకపోవడంతో, క్షయరోగగ్రస్తుడవు కమ్మని చంద్రుని శపిస్తాడు దక్షుడు. ఫలితంగా చంద్రుడు క్షీణించసాగాడు. చంద్రకాంతి లేకపోవడంతో ఔషధాలు, పుష్పాలు ఫలించలేదు. ఈ

పరిస్థితిని చూసిన సమస్తలోకవాసులు, తమ కష్టాలు తీరేమార్గం చూపమని బ్రహ్మ దేవుని ప్రార్థించారు. బ్రహ్మ ఆదేశాన్ననుసరించి ప్రభాసక్షేత్రంలో మహామృత్యుంజయ మంత్రానుష్ఠానంగా శంకరుని ఆరాధించిన చంద్రుడు, పార్థివలింగాన్ని ప్రతిష్టించి పూజించగా, శంకరుడు ప్రత్యక్షమై, చంద్రుని రోగ విముక్తుని గావించి, కృష్ణపక్షంలో చంద్రకళలు రోజు రోజుకీ తగ్గుతాయనీ, శుక్లపక్షంలో దిన మొక కళ చొప్పున పెరుగుతుందని అనుగ్రహించాడు. ఆనాటి నుండి చంద్రుని కోరిక మేర, అతని కీర్తిదిశదిశలా వ్యాపించేందుకై చంద్రుని పేరుతో సోమనాథునిగా, కుష్టు వంటి మహా రోగాలను తగ్గించే సోమనాథ్ జ్యోతిర్లింగరూపునిగా పార్వతీదేవిసమేతంగా వెలసి భక్తులను కరుణిస్తున్నాడు.

2. మల్లిఖార్జున జ్యోతిర్లింగం

శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి కోపోద్రిక్తుడై తల్లిదండ్రులను వదలి, క్రౌంచపర్వతానికి చేరుకోగా, కుమారుని వదలి ఉండలేని పార్వతీపరమేశ్వరులు ఈ ప్రాంతంలోనే ఆగిపోయారని పురాణ కథనం. అందుకే "శ్రీశైల శిఖరాన్ని దర్శించుకుంటే పునర్జన్మ ఉండద"ని అంటారు. అలాగే పర్వతుడనే ఋషి తపఃఫలంగా పరమశివుడు ఇక్కడ లింగరూపంలో ఆవిర్భవించాడని మరోకథనం.

కాశ్యాంతు మరణాన్ముక్తిః స్మరణా దరుణాచలే
దర్శనాదేవ శ్రీశైలే పునర్జన్మ న విద్యతే

కాశీ క్షేత్రంలో మరణం, అరుణాచలంలో భగవన్నామస్మరణం, శ్రీశైలంలో లింగ దర్శనం ముక్తిదాయకాలు. కృతయుగంలో హిరణ్యకశిపుడు, త్రేతాయుగంలో రావణ సంహారానంతరం శ్రీరామచంద్రుడు, ద్వాపరయుగంలో అరణ్యవాసానంతరం పాండవులు, శ్రీశైలానికి వచ్చి భ్రమరాంబ సమేత మల్లిఖార్జునస్వామివారిని దర్శించుకున్నట్లు పురాణ కథనం. సీతారాముల రామసహస్రలింగం, సీతాసహస్రలింగాలను ప్రతిష్టించినట్లు ప్రసిద్ధి. ఈ కలియుగంలో ఆదిశంకరాచార్య, ఆచార్యనాగార్జునుడు, కృష్ణదేవరాయలు, ఛత్రపతి శివాజీ వంటివారెందరో స్వామిని దర్శించుకుని పూజలు జరిపించారు.

3. మహాకలేశ్వర జ్యోతిర్లింగం

పరమేశ్వరునికి స్మశానమంటే అత్యంత ఇష్టం. ఈ భూమిపైనున్న సిద్ధక్షేత్రాలలో నైమిశారణ్యం – పుష్కరం – కురుక్షేత్రం ముఖ్యమైనవి. కురుక్షేత్రం కంటే పదిరెట్లు కాశీ పుణ్యప్రదమైనది. కాశీ కంటే మహాకాలవనం పదిరెట్లు గొప్పది. తీర్థాలలో అత్యుత్తమైనది ప్రభాసం – శ్రీశైలం – దారుకావనం. వీటన్నికంటే మహాకాలవనం గొప్పది. ఎందుకంటే, స్మశానం – ఎడారి – పాలంపీఠం – అరణ్యం అంటూ ఐదు ఒకేచోట ఉన్న ప్రదేశం ఉజ్జయిని.

పూర్వం వేదప్రియుడనే శివభక్తునికి దేవ ప్రియుడు, ప్రియమేధుడు, సుకృతుడు, ధర్మవాహి అనే నలుగురుకుమారులుండేవారు. ఈ నలుగురు కూడా శివభక్తులే. ఇదిలా ఉండగా, రత్నమాల పర్వతంపై నివసిస్తున్నా దూషణాసురుడనే రాక్షసుడు, వీరి పూజలకు ఆటంకాన్ని కలిగిస్తూ, అందరినీ హింసిస్తూండేవాడు. ఆ రాక్షసుని బాధలను తట్టుకోలేని అన్నదమ్ములు పార్థివలింగాన్ని ప్రతిష్టించి పూజించాగా, శివుడు మహాకాలుడై ఆవిర్భవించి, దూషణాసురుని,అతని సైన్యాన్ని భస్మం చెసాడు. అప్పట్నుంచి ఉజ్జయినీ నగరంలో విలసిల్లుతున్న మహాకాలేశ్వరుడు త్రిభువన లింగాలలో ప్రసిద్ధునిగా వెలుగొందుతున్నాడు.

4.ఓంకారేశ్వర జ్యోతిర్లింగం

ఒకసారి వింధ్యపర్వతం తనకంటే గొప్పవారేవారూ లేరని విర్రవీగుచుండగా, నీకంటే మేరుపర్వతం గొప్పదని నారదమహర్షి చెప్పగా, కుపితుడై, ఓంకార క్షేత్రానికెళ్ళి శివదేవుని పార్థివలింగాన్ని భక్తితోపూజిస్తూ తపస్సు చేసాడు. శివుడు ప్రత్యక్షమై వరాన్ని కోరుకొమ్మనగా, వింధ్యుడు ‘స్వకార్యాన్ని సాధించుకునే శక్తిని ప్రాదించమని’ వేడుకున్నాడు. శివుడు ఆ వరాన్ని అనుగ్రహించాడు. అప్పుడు సమస్త దేవతలంతా స్వామివారిని ఓంకారేశ్వరంలో కొలువై ఉండమని ప్రార్థించారు. వారి కోరికను మన్నించిన స్వామి ప్రణవాకారంలో ఓంకారేశ్వరునిగా కొలువైయ్యాడు. ఇదిలా ఉండగా, శివుని నుంచి వరాన్నిపొందిన వింధ్యుడు, వరగర్వంతో ఎంతో ఎత్తుకు పెరిగి సూర్యచంద్రుల గమనానికి కూడా అడ్డుతగలసాగాడు. వింధ్యుని చేష్ట వలన సమస్తలోకాలు అంధకారంలొ తల్లడిల్లాయి. అప్పుడు దేవతల మొరలను ఆలకించిన పరమేశ్వరుడు వింధ్యుని గర్వమణచమని అగస్త్యమునిని పురమాయించాడు. అగస్త్యుని రాకను గమనించిన వింధ్యుడు మర్యాద పూర్వకంగా తన ఎత్తును తగ్గించి గౌరవించగా, తాను తిరిగి వచ్చేంతవరకు ఎత్తు పెరగకుండా ఉండమని దక్షిణాదికి వెళ్ళి మరల ఉత్తరాదికి వెళ్ళలేదు అగస్త్యుడు. ఫలితంగా వింధ్యుడు ఎత్తు పెరలేదు.

5.వైద్యనాథ జ్యోతిర్లింగం

వైద్యానాథ జ్యోతిర్లింగ విషయంలో అనేక భేధాభిప్రాయాలున్నాయి. మహారాష్ట్ర పర్లీ గ్రామంలోనిదే అసలైన జ్యోతిర్లింగమని, గంగా ఖేడలోనిలింగం, పంజాబ్ కీరగ్రామం లోని లింగం, హిమాచల్ ప్రదేశ్ లోని పఠాన్ కోట్ కు సమీపంలోని లింగం, కర్ణాటకలోని గోకర్ణ లింగం…ఇవన్నీ శివుని ఆత్మలింగాలేనన్న వాదన బలంగా ఉంది. అయితే జార్ఘండ్ వైద్యనాథంలో వెలసినదే అసలైన జ్యోతిర్లింగమని విజ్ఞుల వాదన. పూర్వం రావణాసురుడు కఠోరనియమాలతో, ఒక చెట్టుకింద అగ్ని గుండాన్ని ఏర్పరచి, పార్థివలింగాన్ని, ప్రతిష్టించి, శివపంచాక్షరీమంత్రంతో, హవన కార్యక్రమంతో నిష్ఠతో ప్రార్థించగా,శివుడు రావణుని కోరికననుసరించి తన ఆత్మలింగాన్ని ప్రసాదించాడు. అయితే ఆ లింగాన్ని భూమికి తాకించిన వెంటనే అక్కడే స్థిరపడుతుందని హెచ్చరించాడు. ఆత్మలింగంతో లంకానగరాంకి తిరుగు ప్రయాణమైన రావణుడు సంధ్యావందనం చేసేందుకు ఒక పశువుల కాపరికి (దేవతల కోరికపై వినాయకుడు ఈ వేషాన్ని ధరించాడు) లింగాన్ని ఇవ్వగా, ఆ కాపరి ఆత్మలింగాన్ని కిందపెడతాడు. ఫలితంగా ఆ లింగం అక్కడే స్థిరపడుతుంది. రవణుడు ఎంతగా ఆత్మలింగాన్ని పెకలించి లంకానగరానికి తీసుకెళదామని ప్రయత్నించినప్పటికీ ఫలితం ఉండదు. వైధ్యనాథ్ దేవాలయంలో ఒక విశేషం ఉంది. సాధారణంగా శివాలయ మందిర శిఖరంపై త్రిశూలం ఉంటుంది కానీ, ఈ ఆలయ మందిర శిఖరంపై పంచశూలం ఉంది. మరి ఏ ఇతర జ్యోతిర్లింగ ఆలయాలలో ఇలాంటి అమరిక లేదు. పంచాక్షరీమంత్రంగా కలిగిన పంచముఖ శివునకు పంచప్రాణాలు అంతర్నిహితంగా కలిగిన శివతత్త్వమే ఇందులోని గూఢార్థం.

6. నాగేశ్వర జ్యోతిర్లింగం

పశ్చిమ సముద్ర తీరాన, దారుకుడనే రాక్షసుడు, ‘దారుక’ అనే తన భార్యతో కలిసి ప్రజలను చిత్రహింసలు గురిచేయసాగాడు. యజ్ఞయాగాదులను నాశనం చేస్తూ, ముని జనులను హింసించసాగారు. వీరి హింసను తట్టుకోలేని ఋషులు ఔర్వమహర్షికి విన్న వించుకున్నారు. ఔర్వమహర్షి ఆ రాక్షస దంపతులను సతీసమేతంగా మరణించునట్లుగా శపించాడు. ఆ మునిశాపం భూమి పైనే పనిచేస్తుంది. కనుక, రాక్షదంపతులు సముద్రమధ్యంలో నివాసమేర్పరుచుకుని సముద్రయానం చేశేవారిని పీడించసాగారు. ఇలా కనబడిన ప్రయాణీకులందరి ధనవస్తువులను అపహరిస్తూ చెరసాలలో బంధించసాగారు. అలా బంధింపబడినవారిలో సుప్రియుడోకడు. ఇతడు పరమ శివభక్తుడు. రాక్షసబాధలను తట్టుకోలేక సుప్రియుడు ఆర్తనాదం చేయగా, దివ్యతేజః పుంజము కళ్ళు మిరిమిట్లు గొలుపునట్లు ప్రకాశించింది. ఆ కాంతికి దారుకునితోపటు సమస్త రాక్షసులు నేలకొరిగారు. అక్కడ పరమశివుడు నాగరూపమై జ్యోతిర్లింగమైవెలిసాడు. ఈ స్వామికి దర్శించి, సేవించుకున్నవారికి శాశ్వత పుణ్యలోకవాసం సిద్ధిస్తుందని ప్రతీతి.

7. కేదారేశ్వర జ్యోతిర్లింగం

ఒకప్పుడు బదరికావనంలోని నరనారాయణులు అరీంత్యంత నిష్ఠాగరిష్ఠులై తపస్సు చేయసాగారు. వారు కేదారక్షేత్రానికెళ్ళి మందాకినిలో స్నానం చేస్తూ, పార్థివలింగాన్ని ప్రతిష్టించి పూజ చేయసాగారు. వారి తపస్సుకు మెచ్చిన పరమశివుడు ప్రత్యక్షమై వరం కోరుకొమ్మనగా, జ్యోతిర్లింగ రూపంలో వెలసి, జనులను గర్భవాసనరకమునుంచి తొలగించి ముక్తిని ప్రసాదించమని ప్రార్థించారు. ఈ క్షేత్రం అత్యంత ప్రాచీనమైనది. నరనారాయణులు, పంచపాండవులు, ఉపమాన్యుమహర్షి, ఆదిశంకరులవారు ఈ దివ్య క్షేత్రాన్ని దర్శించుకున్నట్లు ఆధారాలున్నాయి. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఏడవదిగా ప్రసిద్ధి పొందిన ఈ కేదారేశ్వరలింగం హిమాలయాలపై సముద్రమట్టానికి 11,760 అడుగుల ఎత్తులో ఉంది. కేదారేశ్వర జ్యోతిర్లింగం లింగాకారంగాకాక పట్టక రూపంలో ఉంటుంది. స్వామిని భక్తులు తాకి అభిషేకాలు చేస్తుంటారు. వైశాఖ శుద్ధ పాడ్యమి మొదలు ఆశ్వయుజ బహుళ చతుర్దశి వరకు ఆరుమాసాలు మాత్రమే ఆలయ తెరచి ఉంటుంది. దీపావళి రోజునస్వామికి నేటితోవెలిగించిన దివ్యజ్యోతి ఆరుమాసాల తరువాత తెరచినప్పటికీ వెలుగుతూకనిపిస్తుంది. ఆరునెలల పాటూ ఆలయం మూసి ఉన్న సమయంలో కొండదిగువన ఉర్విమఠంలో స్వామి కొలువై  భక్తులకు దర్శన మిస్తుంటాడు. ఇక్కడ స్వామి అర్చనకై బిల్వ దళాలు దొరకనందున రుద్రప్రయాగ నుండి బ్రహ్మకమలాలను తెప్పించి పూజ చేస్తారు. ఇక్కడ అమ్మవారైన కేదారగౌరి ఆలయానికి దక్షిణం వైపు సింహాద్వారముంది. ఆలయ సభామంటపంలో నంది, పాండవులు, ద్రౌపది, కుంతి, శ్రీకృష్ణ భగవానుని విగ్రహాలున్నాయి. దేవాలయం పైభాగంలో కనిపించే మూడు శిఖరాలు త్రిశూలాన్ని తలపిస్తాయి. దేవాలయానికి ఎనిమిది దిక్కులలో రేతకుండం, శివకుండం, భృగుకుండం, రక్తకుండం, వహ్ని కుండం, బ్రహ్మతీర్థం, హంసకుండం, ఉదకకుండం అంటూ అష్టతీర్థాలున్నాయి. స్వామికి అభిషేకం చేసేందుకు ఇక్కడ గంగనీరు దొరకదు. కాబట్టి, భక్తులు హరిద్వార్, రుద్రప్రయాగ వంటి చోట్ల నుండి సీసాలలో గంగను పట్టుకెళ్ళి స్వామికి అభిషేకం చేయిస్తుంటారు.

8. త్ర్యంబకేశ్వర జ్యోతిర్లింగం 

ఈ క్షేత్రాన్ని త్రిసంధ్యాక్షేత్రమని కూడా పిలుస్తుంటారు. త్ర్యంబకేశ్వరుడు స్వయంభువుడు. అమ్మవారు త్ర్యంబకేశ్వరి. స్వామివారి ఆకృతి విచిత్రంగా ఉంటుంది. ఇక్కడ పానవట్టం మధ్యలో లింగం ఉండదు. ఆ స్థానంలో రుబ్బురోలు లోపలిభాగంవలె గుంటతో లోతుగా ఉంటుంది. పరమశివుడు తిమూర్త్యాత్మకంగా, త్రిగుణాత్మకమన్నట్లు మూడు భాగాలుగా ఉంటుంది. వనవాసంలోనున్న శ్రీరామచంద్రులవారు సీతా, లక్ష్మణ సేమేతంగా పంచవటిలో పర్ణశాలను నిర్మించుకుని ఉంటుండగా, లంకేశ్వరుని సోదరి శూర్పణక శ్రీరాముని కామించాగా, అందుకు తగిన ప్రాయశ్చిత్తంగా లక్ష్మణుడు ఆమె ముక్కుచెవులను కోసి, ఇంటిదారి పట్టించాడు. శూర్పణఖ ముక్కు (నాసిక) కోసిన ప్రాంతమే నేడు ‘నాసిక్’గా పిలువబడుతోంది. ఇక్కడే గోదావరి పుట్టింది. ఇక్కడ బ్రహ్మగిరి అనే పర్వతం ఉంది. ఈ పర్వత శిఖరాగ్రాన గౌతమమహర్షి అహల్యసమేతంగా తపస్సు చేస్తున్న సమయం. జనహితం కోరి, గౌతమ ముని ద్వారా దివి నుంచి గంగను భూమికి రప్పించాలని నిర్ణయించిన మునులు అందుకు తగిన పథకాన్ని రచించారు. గౌతమమహర్షి తన ఆశ్రమంలో వరిపైరును సాగుచేస్తున్నాడు. ఆ వరి పైరు పైకి దర్భతో సృష్టించిన ఆవుదూడలను పంపించారు ఆ మునులు. తపస్సులో నున్న గౌతమ మహర్షి ఒక దర్భతో వాటిని తోలగా, దర్భ తాకినంతనే అవి చనిపోయాయి. మునుల పన్నాగం ఫలించింది. గోహత్యాపాతకం నుంచి బయటపడాలంటే గంగను భూమికి రప్పించి, ప్రాయశ్చిత్తంగా స్నానం చేయమన్నారు.  వెయ్యేళ్ళు శివుని ప్రార్థించి గంగను భూమికి రప్పించాడు గౌతమ మహర్షి. గౌతమ మునీంద్రుల తపస్సువలన భూమికి తీసుకురాబడి నందున కారణంగా ‘గౌతమీనది’ అని, గోవు ప్రాణం వదిలిన ప్రదేశం నుంచి ప్రవహించిన కారణంగా ‘గోదావరి’ అని ప్రఖ్యాతి చెందింది. ఈ పుణ్య గోదావరీ నది దీనజనోద్ధరణ నిమిత్తమై దారణా, ప్రవరా, అజంతా, ఎల్లోరా గుహలను దాటుకుంటూ ప్రాణహిత, చంద్రావతీ, శబరిప్రాంతాలలో ప్రవహిస్తూ, దక్షిణ వాహినిగా మారి సుమారు 900 కి.మీ. ప్రయాణం చేసి మహరాష్ట్రంలో కోటిపల్లి దగ్గర సాగరుని చేరుకుంటుంది. గౌతమీనది పుట్టిన త్ర్యంబకంలో స్వయంభువునిగా వెలసిన స్వామి, భక్తులను తన కరుణాపూరిత దృక్కులతో కాపాడుతున్నాడు.

9. రామేశ్వర జ్యోతిర్లింగం

రానణాసురుని వధించిన శ్రీరామచంద్రుడు సీత,లక్ష్మణ హనుమత్సమేతంగా పుష్పక విమానంలో అయోధ్యానగరానికి తిరిగి వస్తూ, గంధమాదవ పర్వతంపై కాసేపు విమానాన్ని ఆపాడు. అక్కడున్న మునివరులను బ్రహ్మవంశానికి చెందిన రావణుని చంపిన పాపాన్నుండి బయటపడే మార్గాన్ని చెప్పమని అడుగుతాడు. అప్పుడు ఆ మహర్షులు, శివలింగాన్ని ప్రతిష్టించి, పూజించడం కంటే ఉత్తమమైన మార్గం లేదని చెబుతారు. శ్రీరాముడు శివలింగాన్నొకటి తీసుకురమ్మని హనుమను పురమాయించగా, శివలింగాన్ని తెచ్చేందుకు కైలాసానికి బయలుదేరుతాడు ఆంజనేయుడు. అయితే శివలింగాన్ని ప్రతిష్టించేందుకు ముహూర్తం సమీస్తున్న కొలదీ హనుమ రాక ఆలస్యమైంది. వేరే మార్గం లేక మునివరుల సలహాననుసరించి సీతచే సైకత లింగాన్ని (ఇసుకలింగాన్ని) ప్రతిష్టింపజేస్తాడు శ్రీరాముడు. ఈలోపు కైలాసం నుంచి శివలింగంతో తిరిగి వచ్చిన హనుమంతుడు, శివలింగ ప్రతిష్ట జరిగిందని తెలుసుకొని పరిపరి విధాలుగా చింతిస్తాడు. ఆంజనేయుని బాధను గమనించిన శ్రీరాముడు సైకతలింగాన్ని తొలగించి, రాజతాచలంనుంచి తను తీసుకువచ్చిన లింగాన్ని ప్రతిష్టంచమని చెబుతాడు. రాముని మాటలను విన్న ఆంజనేయుడు ఉత్సాహముతో ఇసుకలింగాన్ని తొలగించడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నించి విఫలుడవుతాడు. చివరకు తోకతో లింగాన్ని పెకిలించడానికి  ప్రయత్నిస్తాడు. ఆంజనేయుని అవస్థలను గమనించిన శ్రీరామచంద్రుడు, సుమూహుర్త బలం, మంత్రబలం సైకత లింగానికి మహత్యాన్ని కలిగించాయని, కాబట్టి కైలాసం నుంచి తీసుకువచ్చిన లింగాన్ని సైకత లింగం పక్కన ప్రత్రిష్టించమని చెప్పాడు. అలా శ్రీరాముడు ప్రతిష్టించిన లింగం రామేశ్వరలింగమని, హనుమంతుడు ప్రతిష్టించిన లింగం హనుమదీశ్వరలింగమని పూజలందుకొంటున్నాయి. రామేశ్వరలింగాన్ని పూజించినవారికి బ్రహ్మహత్యాది దోషాలు తొలగిపోతాయి. కాశీయాత్ర చేసినవారు గంగాజలంతో రామేశ్వరలింగాన్ని అభిషేకిస్తే ఈశ్వరానుగ్రహం కలుగు తుందని ఋషివాక్కు, సమస్త ఐశ్వర్యసిద్ధి కలుగుతుంది.

10. భీమశంకర జ్యోతిర్లింగం

త్రేతాయుగంలో భీమాసురుడనే రాక్షసుడు సహ్యాద్రిపై తల్లి కర్కటితో కలిసి జీవిస్తూ, ప్రజలను పీడిస్తూండేవాడు. కర్కటి, పుష్కసి – కర్కటుల కూతురు. లేక లేక పుట్టిన కూతుర్ని అత్యంత గారాబంగా పెంచసాగారు ఆ రాక్షసదంపతులు. యుక్తవయస్కురాలైన కర్కటిని విరాధునికి ఇచ్చి పెండ్లి చెసారు. ఆ విరాధుడు, శ్రీరామునిటొ జరిగిన యుద్ధంలో మరణించగా, మరలా కర్కటి తల్లిదండ్రులను ఆశ్రయించింది. ఒకరోజు అగస్త్యుని శిష్యుడైన సుతీక్షణుడు భీమానదిలో స్నానం చేస్తుండగా, కర్కటి తల్లిదండ్రులు అతనిని కబళీంచేందుకు ప్రయత్నించి, అ ముని శాపానికి గురై భస్మమయ్యారు. తల్లిదండ్రులను కోల్పోయిన కర్కటి అనాథగా ఆ మిగిలింది. అనాథగా సహ్యపర్వతంపై తిరుగుతున్న కర్కటిని చూసి, మోహావేశుడైన రావణుని సోదరుడు కుంభకర్ణుడు, ఆమెను బలాత్కరించి, లంకా నగరానికి వెళ్ళిపోయాడు. ఫలితంగా కర్కటి గర్భనతై భీమాసురునికి జన్మనిచ్చింది. తన తల్లి కథను విన్న భీమాసురుడు, దీనంతాటికి కారకుడు రామావతారం ధరించిన విష్ణువేనని, విష్ణువుపై తన పగను తీర్చుకోవాలని, వేయి సంవత్సరాలపాటు బ్రహ్మ గురించి తపస్సుచేసి వరాలను పొందాడు. ఎల్లలోకవాసులను గడగడలాడించిన భీమాసురుడు కామరూప దేశాధిపతి సుదక్షిణుని ఓడించి కారాగృహంలో బంధించాడు.అతని భార్య సుదక్షిణాదేవిని కూడ బంధిస్తాడు. కారాగారంలో సంకెళ్ళతో బంధింపబడినప్పటికీ ఆ దంపతులు, మానస గంగాస్నానం చేస్తూ, ఇసుకలింగాన్ని చేసి ఆరాద్ హించసాగారు. వారి పూజలను చూసిన భీమాసురుడు ఈ లింగం మిమ్ములను రక్షిస్తుందా అంటూ తన కరవాలాన్ని విసురుతాడు. రాక్షసుని కత్తి పార్థివలింగాన్ని తాకినంతనే కోటి సూర్యప్రభలతో స్వామి జ్యోతిర్లింగంగా ఆవిర్భవించి, త్రిశూలంతో రాక్షస సంహారం గావించాడు. సకలలోకవాసులు సంతోషించారు. అప్పట్నుంచి స్వామి లోకకళ్యాణార్థం అక్కడనే ఉంటూ భక్తజనా వళిని కరుణిస్తున్నాడు. ఎందరో భక్తుల కోరికలను ఈడేరుస్తున్నాడు.

11. విశ్వేశ్వర జ్యోతిర్లింగం

ఈ సృష్టికి ముందునుంచే కాశీపురం పరమ పవిత్రమై విరాజిల్లుతోంది. ఇక్కడ పరమశివుడు సగుణరూపాన్ని ధరించాడు. ఆ స్వరూపం శివశక్తి సమ్మేళనం. స్త్రీ, పురుష రూపాలకు భిన్నంగా ఉన్న ఆ రూపం ప్రకృతి,పురుషులు ఉదయించారు. పరమాత్మ తన నుండి తేజాన్ని వెలువరించి ఐదుక్రోసులమేరగల ఒక మహాపట్టణాన్ని ప్రకృతి పురుషులు తపస్సు చేయడానికి నిర్మించారు. అదే కాశి పట్టణం. పరమాత్మ అదేశానుసారం పురుషుడు సృష్టి నిర్మాణ సామార్థ్యాన్ని పొందేందుకు ఘోర తపస్సు చేసాడు. పరమపురుషుడైన శ్రీమహావిష్ణువు తపస్సు చేస్తుండగా, ఆ తపస్సు వేడికి అతని శరీరం నుండి నీరు కాలువలై ప్రవహించసాగాయి. ఆ జల ప్రదేశాన్ని చూసి ఆది నారాయణుడు ఆశ్చర్యచకితుడై తల ఊపాడు. ఆ ఊపుకు మణులతో కూడిన చెవి కమ్మ ఊడి ఒకచోట పడింది. ఆ చెవి పోగు ఊడి పడిన స్థలమే ‘మణికర్ణి’గా ప్రసిద్ధమైంది. అనంతమైన జలరాశినుండి కాశీపట్టణాన్ని పరమశివుడు తన శూలాగ్రంతో ధరించి కాపాడాడు. జాలం పైభాగంలో యోగనిద్రాపరవశుడైయున్ననారాయణుని నాభికమలం నుండి బ్రహ్మ ఉదయించి, శివాజ్ఞను అనుసరించి సృష్టి చేయడానికి ఉద్యుక్తుడయ్యాడు. ముందుగా బ్రహ్మ పంచాశత్కోటి యోజన పరిమితమగు బ్రహ్మాండాన్ని సృజించి, నాలుగు వైపులా పద్నాలుగు భువనాలను నిర్మించాడు. ఆ బ్రహ్మాండం మజ్జిగలో వెన్నముద్ద వలె తేలియాడసాగింది. ఐరావతాదులతో బ్రహ్మాండం సుస్థిరంగా నిలిచి ఉంది. ఈ బ్రహ్మాండంలో సగం మధ్య భాగం, మిగిలిన సగభాగంలో సగం ఊర్థ్వభాగం, ఇక మిగిలిఉన్న పాతికభాగం అథోలోకమని చెప్పబడుతోంది. అప్పుడు దేవతలంతా పరమశివుని ప్రార్థించి, భూలోక వాసులను కాపాడేందుకు ఇక్కడే శాశ్వతంగా ఉండమని విన్నవించుకున్నారు. వారి మొరలను ఆలించిన పరమశివుడు విశ్వేశ్వరనామంతో జ్యోతిర్లింగమై కాశీ పట్టణంలో వెలసి భక్తులను అనుగ్రహిస్తున్నాడు. ఈ క్షేత్రపాలకుడు కాలభైరవుడు, అష్టభైరవులు, ఢుంఢితో సహా 56 గణపతులు, నవదుర్గలు కాశీలో కొలువై ఉన్నారు. కాశీలో ంగ్గంగాస్నానం చేసి, విశ్వేశ్వరుని, భిందు మాధవుని, డుంఢిగణపతిని, దండపాణిని, కాలభైరవుని, కుమారస్వామిని, అన్నపూర్ణను సేవించుకోవాలి. కాశీయాత్ర చేయలేనివారు, కాశీ పేరును తలచుకుంటే చాలు, యాత్రాపుణ్యఫలం దక్కుతుంది. కాశీలో మరణించిన వారికి కుడిచెవిలో శ్రీరామ తారక మంత్రోపదేశం లభించి మొక్షం సిద్ధిస్తుంది. రామేశ్వరం నుంచి ఇసుకను తీసుకొచ్చి కాశీ విశ్వేశ్వరుని అభిషేకిస్తే, ఎంతో పుణ్యం కలుగుతుంది. ఇక్కడ గంగాస్నానం చేసిన వారికి ముక్తి, అన్నపూర్ణాదేవిని పూజించినవారికి భుక్తికి లోటుండదు.

12. ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగం

పూర్వం  సమీపంలో సుధర్ముడు – సుదేహ అనే దంపతులుండేవారు. వీరికి ఎంతకాలమైనప్పటికి సంతానభాగ్యం కలుగలేదు. ఒకరోజు ఆ ఇంటికి బ్రహ్మతేజోవిరాజితుడైన ఓ యతీశ్వరుడు భిక్ష కోసం వచ్చాడు. అతనిని సాదరంగా ఆహ్వానించిన దంపతులు ఆ యతీశ్వరునికి భోజన సదుపాయాలను ఏర్పాటు చేశారు. భోజనం చేస్తున్న సమయంలో ఆ దంపతులకు సంతాన భాగ్యం లేదన్న విషయాన్ని తెలుసుకున్న యతీశ్వరుడు, సగంలోనే భోజనాన్ని వదిలెసి వెళ్ళసాగాడు. సంతానంలేనివారి ఇంట్లో భోజనం చేయకూడదన్నది యతీశ్వరుని నియమం. ఆ దంపతలు యతీశ్వరుని కాళ్ళపై బడి ప్రార్థించగా, త్వరలోనే సంతాన భాగ్యం కలుగుతుందని దీవించాడు. పెళ్ళికి ముందు సుదేహ జాతక చక్రాన్ని పరశీలించిన పండితులు, ఆమెకు సంతానప్రాప్తి లేదని చెబుతారు. ఆ విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకున్న సుదేహ, తన చెల్లెలు ఘశ్మకు పెళ్ళి చేసుకోమని భర్తకు చెబుతుంది. సుధర్ముడు ఒప్పుకోకపోయినప్పటికి, సుదేహ పట్టుబట్టి భర్తకు రెండవ పెళ్ళి జరిపిస్తుంది. అలా కొంతకాలం సుఖంగా ఉన్నారు. పరమపతివ్రతయైన ఘశ్మ, అక్క సుదేహను తల్లిల్లా, భర్త్నను దైవసమానునిగా భావించి సేవిస్తుండెది. అచిరకాలంలోనే ఘశ్మ గర్భవతి అయింది. ఒక శుభదినంలో ఘశ్మ మగబిడ్డను ప్రసవించింది. ఆ పిల్లవాడు దినదినప్రవర్ధమానంగా పెరగసాగడు. అయితే, సుదేహ మనసులో అసూయాజ్వాలలు రేగాయి. తన చెల్లెలు, చెల్లెలి కొడుకుపై ఈర్ష్యాద్వేషాలు పెంచుకోసాగిది. ఒకరోజు రాత్రి సుదేఅ, పసివాని గొతుకోసి, తలను మొండేన్ని వేరువేరుగ చెరువులోకి విసిరివేసింది. ఇదంతా తెలియని ఘశ్మ ఉదయాన్నే లేచి, కాలకృత్యాలను తీర్చుకుని, స్నానం చేసేందుకు సరోవరానికి వెళ్ళింది. అక్కడ ఆమె కుమారుడు తల్లి పాదాల దగ్గరకు ఈదుకుంటువచ్చి, ‘అమ్మా! నేనొక పీడకల కన్నాను. అందులో నేను చచ్చి బ్రతికినట్లు కనిపించింది’. అని చెప్పాడు. కొడుకు చెప్పిన సంగతిని విన్న

ఘశ్మ దిగ్ర్భమజెంది, ఎందుకిలా జరిగింది? ఇది కలా? నిజమా? అని ఆలొచించసాగింది. అలా ఆమె దీర్ఘాలొచనలోనుండగా, శివుడు ప్రత్యక్షమై, సుదేహ చేసిన ఘోరకృత్యాన్ని చెప్పి, ఆమెను శిక్షిస్తానని పలుకుతాడు. అప్పుడు శివుని కాళ్ళపై బదిన ఘశ్మ, తన అక్కకు ఎటువంటి దండన వద్దని, మారుగా ఆమెకు మంచి బుద్ధి, సౌశీల్యాన్ని అనుగ్రహించమని ప్రార్థించింది. ఆమె ప్రార్థనను విని సంతసించిన శివుడు, ‘తల్లీ! నీ కోరిక ప్రకారమే జరుగుతుంది. ఇకపై నేను ఘృష్నేశ్వరనామంతో ఇక్కడె కొలువై ఉండగలవాడను. నీవు దీర్ఘసుమంగళివై చిరకాలం వర్థిల్లి, చివరకు నా లోకాన్ని చేరుకుంటా’ వని ఆశీర్వదించి అంతర్థానమయ్యాడు.

ఘృష్ణేశ్వర లింగాన్ని పూజించిన వారికి పుత్రశోకం కలుగదని ప్రతీతి.

శ్రీ పంచముఖాంజనేయ అవతారం…

ఈస్వామి ఐదుముఖాలతో, పది భుజాలతో, పది ఆయుధాలను ధరించి దర్సనమిస్తుంటాడు. తూర్పున వానరముఖం, దక్షిణాన నారసింహ ముఖం, పశ్చిమాన గరుడముఖం, ఉత్తరాన వరాహముఖం, పైభాగంలో హయగ్రీవ వదనంతో ఈ స్వామి విలసిల్లుతుంటాడు. ప్రతి ముఖంలో త్రినేత్రుడై ప్రకాశిస్తుంటాడు. స్వామి పది చేతులలో 1.కత్తి, 2.ఢాలు, 3.పుస్తకం, 4.అమృత కలశం, 5.అంకుశం 6.గిరి, 7.హలము, 8.కోడు, 9.సర్పము, 10.వృక్షము కనిపిస్తుంటాయి. ఈ ఆయుధాలన్నీ శత్రువుల గర్వాన్ని అణచి, జ్ఞానదీపాన్ని వెలిగించి, మోక్షప్రాప్తిని సిద్ధింపజేసేవే. ఇది ఆంజనేయుని పరిపూర్ణరుద్రావతారం. ఈ అవతార మూర్తిని విభీషణుని కుమారుడైన నీలుడు లంకారాజ్యానికి యువరాజుగా పరిపాలన చేస్తున్న సమయం. అత్యంతబల సంపన్నుడైన నీలుడు సమస్త విద్యలలో పండితుడు. ధర్మాచరణంపట్ల అనురాక్తిగాలవాడు. సంపదలలో కుబేరునికి దీటైనవాడు. అయినప్పటికీ నీలునికి తృప్తి కలుగలేదు. అతని మనసులో ఇంకా ఐశ్వర్యాన్ని సేకరించాలన్న తపన, ఒకరోజు నీలుడు తండ్రి విభీషణునితో, “తండ్రీ! మనకు సంపదలకు, వైభావాలకు లోటు లేదు. కానీ, ఎంత ఉన్నప్పటికీ, మన దగ్గర చింతామణి, కామధేనువు, కల్పవృక్షాలు లేవు. అవి లేకపోవడం నా మనసెంతో వేదనకు గురవుతోంది. విష్ణుస్వరూపుడైన శ్రీరామచంద్రమూర్తికి నువ్వు భక్తుడవు. నీకు ఆ మహనీయుడు ఆరాధ్యదైవం. అయినప్పటికీ, నువ్వు వాటిని సాధించాలేకపోయావు. వాటిని నువ్వెందుకు పొందలేకపోయావు? అయితే, నువ్వు నాకిప్పుడు అనుమతినిస్తే క్షణకాలంలో వాటిని సాధించి తీరుతాను. నన్ను ఆశీర్వదించు తండ్రీ!” అని పలికాడు.

కొడుకు మాటలు విన్న విభీషణుడు, “పుత్రా! రామభక్తిని మించిన సంపదలు మనకెందుకు? ఆ మహనీయుని అనుగ్రహం ఉంటే చాలు, అదే మనకు సర్వానందదాయకమైంది. దానిని మించిన సిరిసంపదలతో మనకేమి పని? అంతకు మించి పేరు పెన్నిధులు మనకెందుకు? చింతామణి, కామధేనువు, కల్పవృక్షాలు రామభక్తికి సరితూగేవి కావు. అందువల్లనే వాటి పట్ల నాకు అనురక్తి లేదు. వాటిపై నీకు అమిత ఇష్టం అయినట్లయితే, వాటిని నువ్వు సాధించుకో. అయితే ఒక విషయం, మన భూలోకవాసులం కనుక అవి మనకు సులువుగా లభించవు. వాటిని పొందాలంటే దైవశక్తిని సంపాదించాలి. దైవశక్తి కావాలంటే దేవతలను ఆరాధించాలి. అందుకై ముందుగా గురువులను ఆరాధించి, వారి ఆశీస్సులను పొందాల్సి ఉంటుంది. తద్వారా లోకోత్తరశక్తులను పొందగలిగితే, అటుపై నీ కోరిక నెరవేరుతుంది” అని హితవచనాలను పలికాడు.

తండ్రి ఆజ్ఞను శిరసావహించిన నీలుడు, తండ్రికి ప్రదక్షిణ నమస్కారాలను చేసి, కులదైవమైన శుక్రాచార్యుని ఆశ్రయించి పన్నెండు సంవత్సరాలు భక్తిప్రపత్తులతో సేవించి, గురువును ఆనందపరిచాడు. నీలుని మనసులోని కోరికను మన్నించిన శుక్రుడు, “నాయనా, నీలా! నీ కోరిక నెరవేరాలంటే, అందుకు తగిన పరమాద్భుతమైన మంత్రాన్ని ఉపదేశిస్తాను. ఆ మంత్రం శ్రీరామచంద్రుని పరమభక్తాగ్రేసరుడైన ఆంజనేయుని పరమ పవిత్ర మంత్రరాజము. దానికితోడు ఒక వ్రతం గురించి కూడ చెబుతానూ. ఆంజనేయుని అవతారాలలో పంచముఖ ఆనంజనేయుని భక్తిశ్రద్ధలతో పూజిస్తే, ఎంతటి అసాధ్యమైన పని అయినప్పటికీ సుసాధ్యమవుతుంది. అంటే, సాధించలేనిదంటూ ఏమీ ఉండదు" అని తెలిపి, దివ్యమైన హనుమ మంత్రాన్ని నీలునికి బోధించి, వ్రతం కూడ చేయించాడు. నీలుడు శుక్రుని ఘనంగా సత్కరించి, ధ్యాన నిమగ్నుడయ్యాడు.

కొంతకాలం తరువాత నీలుని ప్రార్థనకు సంతుష్టుడైన హనుమంతుడు, పంచాముఖాంజనేయ రూపంలో నీలునికి దర్శనమిచ్చాడు. నీలుని బహువిధాలుగా స్వామిని స్తుతించగా, నీలుని మనసెరిగిన ఆంజనేయుడు, “భక్తా, నీలా! నీ కోరిక త్వరలో నేరావేరుతుంది. నువ్వు నా పరమభక్తుడవు. నీ తండ్రి అత్యంత మిత్రుడు. ఆత్మబంధువుకంటే ఎక్కువ. ఆందుకే నువ్వు నాకు అత్యంతప్రీతి పాత్రుడవు. నువ్వుకోరుకున్న విధంగానే చింతామణి మొదలైన దివ్యసంపదలు నీకు సొంతమవుతాయి. వాతితొపాటు శీలసౌందర్యాది విశేషగుణ  నిధియైన వసుందరిని కూడ పొందగలవు. అందుకే ఈ పవిత్రక్షేత్రం నీ పేరుతో నీలాద్రిగా వ్యవహరింపబడుతుంది” అని నీలుని అనుగ్రహించి అదృశ్యమయ్యాడు. తన కోరికలను సిద్ధింపజేసుకున్న నీలుడు గురువు శుక్రుడు, తల్లిదండ్రులకు మొక్కి, వారి ఆశీర్వాదాలను అందుకున్నాడు. అనంతరం దేవలోకంపై దండయాత్ర చేయ సంకల్పించిన నీలుడు, ఇంద్రుని వద్దకు దూతను పంపి తన ఉద్దేశ్యాన్ని వినిపింపజేసాడు. “ఓయీ ఇంద్రా! గతంలో మా పెద్దనాన్న కొడుకు చేతిలో పరాజితుడవై బందిపబడ్డావు. ఇప్పుడు విభీషణుని కుమారుడనైన నేను, నీతో యుద్ధం చేయాలనుకుంటున్నాను.  నాతో యుద్ధం చేసి పరాభింపబడతావా? లేక చింతామణి, కామధేనువు, కల్పతరువు మున్నగు సంపదలను ఇస్తావా? ఏది ఏమైనా, నువ్వు నాతో యుద్ధం చేయలేవు కనుక, ఆ దివ్యరత్నాలను నాకివ్వు, బ్రతికిపో. నీలుని సందేశాన్ని విన్న ఇంద్రుడు మండిపడ్డాడు. “ఎంతోమంది రాక్షసులను తుదముట్టించాను. ఈ నీలుడు నాతో అనవసరంగా కయ్యానికి కాలు దువ్వుతున్నాడు. నీలునికి నా వజ్రాయుధసామర్థ్యం తెలిసినట్లు లేదు. వందల, వేల కోట్లకొలది రాక్షసులను నా వజ్రాయుధం సంహరించింది. అదలావుంటే, నీలుడొకలెక్క?! అందుకే ఈ దూతను శిక్షించి, పరాభావించి పంపించండి" అని ఇంద్రుడు ఆజ్ఞాపించడంతో దేవతలు రాయబారిని పంపారు. రాయబారి నీలునికి ఈ ఉందంతాన్ని చెప్పగా, ఆగ్రహించిన నీలుడు దేవలోకంపై యుద్ధభేరిని మోగించాడు.

దేవతలకు, రాక్షసులకు మధ్య భయంకరమైన యుద్ధం ప్రారంభమైంది. కామరూప విద్య పాండిత్య ప్రవీణులైన దానవుల మాయోపాయాలకు దేవతలు ఎదురొడ్డి నిలువలేకపోయారు. ఇంద్రుడు రెట్టించిన పౌరుషంతో నీలుపైకి ఉరికి, “ఓయీ! నీలా! వాలి నా పుత్రుడు. అతడు నీ పెదనాన్న చంకలో పెట్టుకుని సప్త సాగరాలలో ముంచగా, ఎలాగో ప్రాణాలను దక్కించుకుని బ్రతికిన విషయం నీకు తెలియదా?!” అని ఇంద్రుడు చెబుతుండగా, నీలుడు మరింతగా రెచ్చిపోయి యుద్ధాన్ని చేయసాగాడు. నీలుడు ప్రయోగించిన అస్త్రాలను ఇంద్రుడు భగ్నం చేయగా, ఇంద్రుని వజ్రాయుధాన్ని నీలుడు ఒక్క బాణంతో అణిచి వేశాడు. ఇంద్రుడు అంకుశంతో విజృభించగా, నీలుడు దానిని గదాఘాతంతో ఖండించాడు. అనంతరం నీలుడు పదునైన కత్తిని చేతబూని ఇంద్రుని శిరస్సును ఖండించేందుకు ముందుకు ఉరకగా, అక్కడ ప్రత్యక్షమైన బ్రహ్మ నీలునితో, "ఓయీ నీలా! నీ తండ్రి రామభక్తుడు, రాముడంటే శ్రీమహావిష్ణువే. ఆ మహావిష్ణువుకు సోదరుడు. ఈ ఇంద్రుడు. అందువల్ల ఇతడు నీకు మిత్రుడేగానీ, శత్రువుకాదు. ఇతనితో తగవులాట వద్దు. ఇద్దరూ స్నేహితులుగా మసలండి. నీ కోరికను నేను నెరవేరుస్తాను. చింతామణి వంటి దివ్య వస్తువులన్నింటిని నేను అనుగ్రహిస్తాను. నీకు మరో విషయాన్ని చెబుతాను. శ్రద్ధగా విను.

పూర్వం అత్రిమహాముని హిమాలయ పర్వత సానువుల్లో సంచరిస్తుండగా, ఆ మహనీయుని నేత్రాల నుండి దివ్యతేజస్సు వెలువడింది. ఆ తేజస్సు, అందులోని వృక్షాలతో కూడి పలురీతులుగా వ్యాపించింది. వాయుదేవుడు ఆ దివ్యతేజాన్ని రెండు రాశువులుగా విభజించగా, అందులో నుంచి సౌందర్యనిధియగు చంద్రుడు ఉద్భవించాడు. రెండవ రాశి నుంచి త్రిభువన సుందరియైన వనసుందరి జనించింది. ఆ సౌందర్యవతి మధువుతో పెంచబడింది. అమృతస్వరూపిణి కాబట్టి దివ్యమణులతో పాటుగా కన్యామణి కూడ గ్రహించి సుఖించు. నువ్వు పంచముఖ ఆంజనేయుని ఆరాధించనందువల్ల మాకు కూడ గౌరవ పాత్రుడవయ్యావు అని చెప్పాడు.  బ్రహ్మ ఇలా చెప్పడమే కాక, మహత్తర శక్తి సంయుతమైన హనుమద్ర్వతాన్ని ఉపదేశించాడు. ఇంద్రునిచే చింతామణి మొదలైన దివ్యమైన వస్తుసంపదల తోడుగా సౌందర్యరాశియైన వనసుందరిని కూడ అర్పింపజేసాడు. ఆవిధంగా హనుమదనుగ్రహం వలన ప్రాప్తించిన సంపదలతో నీలుడు హనుమద్భక్తులలో అగ్రగణ్యునిగా వెలుగొందాడు. నీలునికి హనుమంతుడు మాఘమాసం ఆర్ధ్ర నక్షత్రంతో కూడిన దినంలో ప్రత్యక్షమయ్యాడు. అలాగే లంకలో సీతాదేవికి పంచాముఖాంజనేయ రూపాన్ని స్వామి ప్రదర్శించినట్లు మనకు తెలుస్తోంది. రావణవధ జరిగిన అనంతరం, లోకాలకు దుష్టరాక్షసపీడ విరగడైందని శ్రీరామచంద్రుడు తృప్తిపడుతున్న సమయంలో ఆకాశవాణి ఈ తీరుగా పలికింది. “శ్రీరామచంద్రా! రావణసంహారం జరిగిందని నువ్వు తృప్తి పడుతున్నావు. అంతటితో నీ కర్తవ్యం ముగియలేదు. గగనతలాన వేలవేల యోజనాల దూరంలో శతకంఠుడనే రాక్షసుడు తిరుగూన్నాడు. కడు దుష్టుడైన ఆ రాక్షసుడు, మహాబలశాలి. ఎవరినైనా ఎదిరించి నిలువగల అసాధ్యుడు. నువ్వు వాడిని కూడ సంహరించితేనే నీ అవతారానికి పూర్ణత్వము సిద్ధించినట్లవుతుంది”. ఆకాశవాణి పలుకులను విన్న రాముడు దీర్ఘాలోచనలో పడి, చివరకు ఆ రాక్షస సంహారానికి అంజనేయుడే తగినవాడని నిర్ణయించి, హనుమను పిలిచి, “హనుమా! ఆకాశవాణి పలుకులను విన్నావు కదా! రావణ సంహార విషయంలో నీవెంతో సాయపడ్డావు. శతకంఠుని సంహార విషయం గురించి కాస్త ఆలోచించు, ఇందుకు నువ్వు సమర్థుడవు" అని ప్రేరేపించాడు.

శ్రీరామ ఆజ్ఞను తలదాల్చిన ఆంజనేయుడు శతకంఠుని సంహరించే కార్యక్రమానికి ఉపక్రమించాడు. వెంటనే తన తోకను వేయి యోజనాల దూరానికి పెంచాడు. తన రూపాన్ని విపరీతంగా పెంచడంతో, సముద్రాలన్నీ కప్పి వేయబడి, భువి నుంచి దివికి దారి ఏర్పడటమేకాక, ఆకాశంలో నక్షత్రాలన్నీ హనుమంతుని శరీరంపై, దర్భలపై నీటిబిందువుల్లా గోచరించాయి. అప్పుడు ఆంజనేయునికి అంతరీక్షంలోగల శతకంఠుని నగరం కనబడింది. దాని ప్రాకారాలు భగభగమని మండే అగ్నిగోళాలవలె ఉన్నప్పటికీ, వాయునందనుడు దానిని పెకలించి సముద్రంలోకి విసిరేసాడు. శ్రీరామచంద్రుని సైన్యమంతా తన తోకపై నడిచేత్లు చేసి అంతరిక్షపురానికి చేరుకునేట్లు చేసాడు. అలా అందరూ శతకంఠుని నగరానికి చేరుకున్నారు. అప్పుడు శ్రీరామునికి, శతకంఠునికి మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది. శ్రీరాముడు తన దివ్యాస్త్రాలతో ఆ రాక్షసుని తలలను ఖంఢిస్తున్నప్పటికి, ఆ తలలు తిరిగి జనించసాగాయి. అప్పుడు ఆ రాక్షసుని రక్తపుబొట్లు నేలపై పడుతుండగా, వాటి నుంచి లెక్కకు మిక్కిలిగా శతకంఠులు ఉద్భవించసాగారు. వాతితో పోరాడిన శ్రీరాముడు విసికి వేసారిపోయాడు. ఆయన పరివారం నీరసించింది. అనేకులు మూర్చిల్లారు. అప్పుడు శ్రీరాముని చూసిన సీత భయపడింది. మార్గానంతరం తెలియక చింతించసాగింది.

సరిగ్గా అక్కడకు గర్గముని వచ్చాడు. ఆయన సీతను చూసి, హనుమంతుని ద్వాదశాక్షర మంత్రాన్ని ఉపదేశించి భయాన్ని పోగొట్టాడు. సీతాదేవి ఆ మంత్రాన్ని నిష్టతో జపించగా, హనుమంతుడు శక్తియుక్తులతో పరిపూర్ణుడై విజృభించాడు. ఆంజనేయస్వామి పంచముఖం మూర్తియై వెలుగొందుతూ రాక్ష్సుని మాయాశక్తులను వీక్షిస్తూ, అతని కదలికలన్నింటిని అరికట్టేడు. ఆయన ప్రతి వదనంలో మూడేసి కళ్ళున్నాయి. దశ భుజాలలో దశ విధ ఆయుధాలను ధరించి ప్రళయకాల రుద్రుడై విహరించాడు. శతకంఠుడు పలువిధాలైన రూపాలను ధరించగా, ఆంజనేయుడు కూడ అన్ని రూపాలను ధరించాడు. సీతామాతను కూడ యుద్ధం చేయాల్సిందిగా ప్రార్థించాడు. ఆంజనేయుని అభ్యర్థనను విన్న సీతాదేవి పతిదేవుని తలచుకుని శక్తి స్వరూపిణియై, శక్తివంతమైన అస్త్రాన్ని సంధించింది. శతకంఠుడు స్త్రీ చేతిలో మరణించాల్సి ఉన్నందున, సీత వదిలిన దివ్యాస్త్ర ప్రభావానికి నేలకొరిగాడు. ఇదే పంచముఖాంజనేయస్వామి మహిమాన్విత గాథ.

పూజకు అవసరమైన ముఖ్య వస్తువులు:

☀ పూజ వేళ ఉపయోగించుటకుగాను విడివిడిగా పాత్రలలో జలము, ఉద్దరిణేలు, లేదా చెంచాలు కావలెను.
☀ ఏదైవమును పూజించుచున్నామో ఆ దైవము యొక్క చిత్రము లేదా ప్రతిమ, అది కూడా లేనప్పుడు బంగారు, లేదా వెండితో చేసిన కాసు.
☀ ముఖ్యముగా " వినాయక " పూజకు " వరలక్ష్మి " పూజకు పాలవెల్లి కట్టితీరావలెను.
☀ దీపారాధనకు కుందెలు, ప్రత్తితో చేసిన వత్తులు, ఆవు నెయ్యి, అవి వెలిగించుటకు ఒక అగ్గి పెట్టె, ధూపారాధనకు సాంబ్రాణి.
☀ పూజ నిమిత్తము అక్షతలు, పువ్వులు, పసుపు, కుంకుమ.
☀ ఇతరేతరోపచారార్దము - తమలపాకులు, వక్కలు, ఆగరువత్తులు, పసుపు, కుంకుమ, గంధము, హారతికర్పూరము, కొబ్బరికాయలు.
☀ ప్రధానముగా కలశము, దానిపైకి ఒక కొబ్బరికాయ, రవికెల గుడ్డ.
☀ వినాయకపూజకు తప్పనిసరిగా 21 రకములు పత్రి కావలెను.
☀ నివేదన ( నైవేద్యం ) నిమిత్తముగా బెల్లము ముక్క ( గుడశకలం ), అరటిపళ్ళు ( కదళిఫళం ) - కొబ్బరి ( నారికేళఫలం ) ఇవి సాదారణావాసరములు. ఇంకను ప్రత్యేకించి వడపప్పు ( ముద్గసూపం ), కడుప ( ఉండ్రములు ), గుదపిష్ట ( బెల్లం చలిమిడి ), శర్కర పిష్ట (పంచదార చలిమిడి ), పానకము ( బెల్లముదయిన గుదపానీయం - పంచాదారధైన శర్కర పానీయం ఏదైనా తియ్యగానే ఉంటుంది కనుక మధురపానీయం అన్నాచాలు ).
☀ సూర్యుడికి పాయసమే నైవేద్యం , వినాయకుడికి రకరకాల కుడుములు స్ర్తీ దేవాతారాధానలో చలిమిడి, పానకం ప్రత్యేకంగా నివేదించితీరాలి.
☀ ఇవిగాక భక్తులు యదాశక్తి - సూపాపూపధేనుధుగ్తసద్యోఘతాదులతో భక్ష్య భోజ్య లేహ్య చోష్య పానియాదికాలతో మహా నైవేధ్యములు కూడా సమర్పిన్చుకోనవచ్చును. 

దేవాలయములో ప్రదిక్షిణ చేసేటప్పుడు గబగబా అడుగులు వేయకూడదట ఎందుకు?

మనము దేవాలయమునకు వెళ్ళాలనుకున్నప్పుడు, స్వామివారిని దర్శించడానికి ముందు దేవాలయంలో ప్రదక్షిణించడంలో తొందర పనికిరాదు. మనస్సును ప్రశాంతపరచి, స్వామివారిని మనస్సును ధ్యానిస్తూ మంత్రం గాని, అష్టోత్తరం గాని, ఇవి ఏవి తెలియని వారు ఆ స్వామివారి నామజపము చేస్తూ భక్తితో ఆ దైవం చుట్టూ ప్రదక్షిణ చేయాలి. ఆలయంలోని గర్భగుడిలో దేవతా విగ్రహం ఉంటుంది. ప్రతి నిత్యం పురోహితులు జరిపే అర్చనలలోని మంత్రాల ద్వారా ఆ మంత్రాలలో ఉండే శక్తిని విగ్రహం క్రిందనున్న యంత్రం ఆ శక్తిని గ్రహించి, ఆ శక్తి ద్వారా మన కోర్కెలను తీరుస్తుంది. కనుక భగవదర్శనానికి వెళ్ళినప్పుడు మన మది నిండా భగవంతుని రూపమే నింపి నిదానంగా ప్రదక్షిణ చేసి ఆ స్వామి కౄపకు పాత్రులు కావాలి.

వేదాంగములు

1. శిక్ష: వేదములందలి అక్షరములను, స్వరములను ఉచ్చరించు రీతిని వవరించి చెప్పును. దీనిని పాణిని రచించెను.

2. వ్యాకరణము: సుశబ్ద, అపశబ్దముల భోధించును. దీనిని గూడ పాణినియే రచించెను. ఇది ఆధునిక భాషా శాస్త్రము లకు మూలము. ఇందు 8 అధ్యాయములు కలవు.

3. ఛందస్సు: పింగళుడు. ఛందోవిచితి అనబడు 8 అధ్యాయముల ఛందో శాస్త్రము రచించెను. మంత్ర ములందుగల వౄత్తివిశేషములు బోధించెను.

4. నిరుక్తము: వేదమంత్రములందుగల కఠినపదముల భావమును బోధించును. దీనిని యాస్కుడు రచించెను.

5. జ్యోతిషము: ఇది కాలనియమమును బోధించు శాస్త్రము. లగధుడు, గర్గుడు మొదలగువారు రచించిరి. ఇది ఆయా కాలములందు చేయవలసిన యజ్ణ్జ యాగాది విధులకు సంబంధించిన కాలవిశేషము లను బోధించును.

6. కల్పము: ఇది ఆయా మంత్రములు పఠిచుచు చేయ వలసిన కార్యములను బోధించును. అశ్యాలాయనుడు, సాంఖ్యాయనుడు మున్నగువారీ శాస్త్రమును రచించిరి.

శఠగోపము – పాదుకాధారణం


నీపాద కమలసేవయు
నీ పాదార్చకుల తోడి నెయ్యము నితాం
తాపార భూతదయయును
తాపల మందార నాకు దయసేయగదే!!

మనం దేవాలయాలకు వెళ్ళినపుడు భగవద్దర్శనం అయ్యాక అర్చక స్వామి శఠగోపము మననెత్తి మీద పెడాతారు.  భగవంతుని పాదాల ముద్రలున్న పాదుకలు ఈ కీరిటము వంటి శఠగోపంపైన మనకు దర్శనమిస్తాయి.

ఈ శఠగోపము వెండితోకాని, పంచ లోహాలతో కాని, ఇత్తడితో కాని, బంగారంతో చేయించి దేవాలయాల్లో వాటిని స్వామి పాదుకలుగా భావిస్తారు. కనుకనే ఆ పాదుకలను మన నెత్తిపై అర్చకస్వాములు పెట్టేటపుడు ఇలా భావించాలి.

‘దేవాధిదేవా! దేవతలంతా నీ పాదాలకు పూజించి అజరామరులైనారు. అట్టి నీ పాదాలను నా శిరస్సుపై ధరిస్తున్నాను. నీ పాదధూళితో నన్ను పునీతునిగా చేయుము స్వామీ!’ అని వేడుకుంటున్నాము. కామ క్రోధాదులను నశింపచేసి మనలను తరింపచేసేవి శ్రీవారి పాదములే.

‘బ్రహ్మ కడిగిన పాదము! బ్రహ్మము తానె నీ పాదము!
చెలగి వసుధ గొలిచిన పాదము
బలి తలమోసిన పాదము
పరమయోగులకు పరిపరి విధముల వరమొసగెడి పాదము
తిరు వేంకటగిరి తిరమని చూపిన పరమపదము నీ పాదము
బ్రహం కడిగిన పాదము! బ్రహ్మము తానె నీ పాదము!’

అంటూ అన్నమాచార్యులవారు స్తుతించారు. అనేకమంది వాగ్గేయకారులు స్తుతించిన ఆ దివ్య పాదాలను మనం శిరసా ధరించేటపుడు ఆ భావన రావాలి. ‘శ్రీరామ పాదమా! నీ కౄపచాలున్ చిత్తమునకురావే’ అంటూ త్యాగయ్య శ్రీరామ పాదారవిందములను కొనియాడారు.

విభీషణ, సుగ్రీవాదులు శరణాగతి వేడిన పాదాలను, భరతుడు పాదుకా పట్టాభిషేకం చేసి సిమ్హాసనం ఎక్కిస్తే రాజ్యము ఏలిన పాదాలను మనం శిరస్సున ధరిస్తున్నామనే భక్తి భావన మనలో రావాలి. శత్రువుకైనా అభయమివ్వగల పాదుకలను మనం శిరసునుంచి వినమ్రతతో వంగి నెత్తిన పెట్టుకొని నమస్కరించడం మన సంప్రదాయం.

వేలాదిమమంది భక్తులు వరుసలో నిలబడితే వారి నెత్తిపై పాదుకలుంచే ఖంగారుతో అర్చకస్వాములు మన నెత్తిమీద టపాటపా మొత్తుతూన్నట్లే భావించి, దానితోనే మన జన్మ చరితార్ధమయిందని చాలమంది భావిస్తారు. కాని అందులో అంతరార్థం చాలా ఉంది.

అర్చకస్వామి మన శిరస్సుపై పాదుకలుంచేటపుడు సాక్షాత్తు పరమేశ్వరుని పాదాలను పాదధూళిని మనం ధరిస్తున్న అనుభూతితో  ఈ క్రింది శ్లోకం చదవాలి.

శివ పాదుకలు ధరించేటపుడు చదవలసిన శ్లోకం:
శ్లో !! హిరణ్యగర్భాది సురా సురాణాం
కిరీట మాణిక్య విరాజ మండితం
శివస్య త్వత్పాద సరోజయగ్మం
మదీయ మూర్దాన మలం కరోతు!!

పై శ్లోకానికి భావం: ఓ సాంబా! శివా! బ్రహ్మాదిదేవతలు తమ తమ కిరీటాలను నీ పాదాలకు తాకి నమస్కరిస్తుంటే వాటి కాంతిచేత విరజమానమైన నీ పాదాలు నా శిరస్సునలంకరించుగాక!

ఈ శ్లోకం పాదుకలు ఇచ్చేవారు కూడా చదవాలి. మదీయ (నాయొక్క) అనేచోట (నీయొక్క) అని చదవాలి.

విష్ణాలయంలో కాని, శ్రీకౄష్ణ, శ్రీరామాలయాల్లో కాని పాదుకలు శిరసా ధరించేటపుడు ఈ క్రింది శ్లోకం చెప్పుకోవాలి.

శ్లో!! గదాపునశంఖ రధాంగ చక్ర
ధ్వజారవిందాంకుశ వజ్రలాంఛనం
విక్రమత్వచ్ఛరణాంబుజ ద్వయం, మదీయ మూర్థాన మలం కరోతు!!

శ్రీమహావిష్ణువు పాదాలలో గద, శంఖ, చక్రము, ధ్వజము, పద్మము, అంకుశం, వజ్రము మొదలైన శుభప్రదమైన లాంచనములుంటాయి. ఆ స్వామి పాదం క్రింద పెడితే ఆ భూమిపై ఆ గుర్తులు కానవస్తాయన్నమాట.  శ్రీకౄష్ణావతారంలో ఆక్రూరుడు మధున నుండి బౄందావనానికి వెడూతుంటే బాలగోపాలుని చరణ చిహ్నాలను చూసి పులకిత గాత్రుడై అక్కడి పాద ధూళితీసి శిరస్సున ధరించినట్లు భాగవతంలో చెప్పబడింది.

‘ఓ త్రివిక్రమా! అటువంటి నీ చరణములు నాశిరస్సున ధరిస్తున్నాను.’ ‘శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే’ అంటూ మనం పాదుకలు శిరస్సున ధరించాలి భక్తితో.

అర్చకస్వామి ఈ పాదుకలు మన నెత్తిపై ఉంచేటప్పుడు ఆ శ్లోకంలో మదీయ (నాయొక్క) అన్నచోట త్వదీయ (నీయొక్క) అని చదవాలి.

దైవ కౄపకుపకరించే మార్గాలు!

ప్రార్థన, పూజ అనేవి నేడు హిందూ మతంతో అభిన్నమై పోయాయి. ధ్యానం ద్వారా భగవంతునితో తాదాత్మ్యం చెందడం ఆధ్యాత్మిక జీవితంలో అత్యున్నత అనుభూతిగా పరిగణింపబడుచున్నది. తీవ్రసాధనలు, కఠోర తపస్సు, భగవత్కౄప – వీటి ద్వారా ఈ అనుభూతి కలుగుతుంది. ఏ ఒకరిద్దరు సాధకులు మాత్రమే తిన్నగా ఈ స్థితికి అర్హులై ఉంటారు. అత్యధికశాతమంది ప్రారంభనుండే క్రమేపి వెళ్లవలసినవారై ఉంటారు. ఇటువంటి ప్రారంభ సాధనే ప్రార్థన.

ఈ ప్రపంచమూ, దానొలోని వస్తువులూ మనకు వాస్తవంగా ద్యోతకమవడం సహజం. కాని, ప్రాపంచిక వాస్తవికత కంటే ఉన్నతమైన సత్యం మరొకటి ఉన్నదని, ఆ సత్యమే ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నదనీ జీవితానుభవాలు మనకు తెలియచేస్తాయి. ఆ సత్యవస్తువైన భగవంతునితో అనుసంధానము ఏర్పరచుకోవాలని భావించడం సహజం. స్పష్టంగా కాకపోయినా ఏదో అస్పష్టమాత్రంగా గ్రహించిన ఆ భగవంతుని వైపుగా చేతులు జోడిస్తాడు మానవుడు. తనకు మార్గం చూపమనీ, ఆ పరిపూర్ణ స్త్యస్వరూపమైన భగవంతుని మన స్ఫూర్తిగా వేడుకొంటాడు. ఇదే ప్రార్థన.

ప్రార్థన విధములు, అనేకములు ఉండవచ్చు. మనిషి మనిషికి మారవచ్చు. కాని, దాని ముఖ్యోద్దేశం అందరికీ ఒకటే. ఒక జీవికి భగవంతునికి మధ్య ప్రత్యేకమైన బాంధవ్యమును పెంపొందించటానికి పనిసి వచ్చే సాధనమే ప్రార్థన. అంటే సౄష్టికి, సౄష్టికర్తకు మధ్యవుండే బంధాన్ని బలపరిచేదే ప్రార్థన.

సాధారణంగా దేనినైనా స్వీకరించే స్థితిలో ఉండటం మనస్సు ప్రవౄత్తి. అందుచేతనే ఆధ్యాత్మిక జీవితంలో తొలిమెట్టు ప్రార్థన. ఈ ప్రార్థనా ఫలితంగా భగవంతుని అనుగ్రహజనితవీక్షణం, విశ్వాసం, ప్రేమ, బలిమి రూపాలలో ప్రసరించిమన మనస్సును నింపుతుంది. మొత్తానికి ప్రార్థన మనిషికి ఆధ్యాత్మిక జ్ణ్జానమును పొందుటకు కావలసిన మనో వికాసమును కలుగజేస్తుంది.

ప్రార్థన చేయు విధానములు

ప్రార్థనను మూడు విధాల ఆచరించవచ్చు. అవి కాయిక, వాచిక, మానసలుగా పేర్కొనవచ్చు.

ఆచారకర్మ లేక ఒక పూజను చేయడం కాయిక పూజ కిందికి వస్తుంది. భగవంతుని పొగుడుతూ పాడుత, వేదములలోని ధ్యాన శ్లోకములను పఠించుట, భక్తి గీతములను పాడుత – వాచిక ప్రార్థన అనబడును. నిశ్శబ్దముగా మనసులో భగవంతుని ధ్యానము చేసుకొనుట మానస ప్రార్థనగా పేర్కొనవచ్చు.

ప్రార్థనవల్ల కలిగే ఫలితములు

ప్రతి పనికి ఫలమున్నట్లే ప్రార్ధనవలన కూడా మనిషికి ఫలితము దక్కుతుంది. ఇది రెండు విధాలుగా ఉండును. ఒకటి దౄష్టఫలం (కనిపించునది) రెండవది అదౄష్టఫలం (కంటికి కనిపించనిది)

దృష్టఫలం

ప్రార్థన చేయుట వలన మునుముందుగా మనిషి కలిగే ప్రయోజనమేమనగా తన శక్తి సామర్ఘ్యములు పరిమితిగలవని, అందరికన్నా బలవంతుడు పైనున్న భగవంతుడని ఒప్పుకోవడం వల్ల వచ్చే ఉపశమనము. పరిస్థితులు మన అదుపులో లేనప్పుడు జగద్రక్షకుడైన పరమేశ్వరుని పార్థించి, ఆయన దయకే మన కర్మఫలాన్ని వదలి వేసినప్పుడు మనకు ఆదుర్దా తగ్గి మనశ్శాంతి కలుగుతుంది.

అదృష్ట ఫలము

దైవప్రార్థన వలన మనకంటికి కనబడకుండా వచ్చే ఫలితాన్ని పుణ్యమంటారు. ఇహమునందును పరమునందును కలిగే సుఖము మనిషి చేసుకొన్న పుణ్యము మీద ఆధారపడి ఉండును.

ప్రార్థన యొక్క పరమార్థం

మనవులు వేరువేరు ఉద్దేశములతో, ఆశయములతో దైవ  ప్రార్థన చేస్తుంటారు. శ్రీ కౄష్ణ భగవానుడు భగవద్గీతలో భక్తులను నాలుగు విధాలుగా పేర్కొన్నాడు. మొదటి రకం భక్తుని ఆర్త అని పిలుస్తారు. ఈ వ్యక్తి తను కష్టములలోనున్నపుడు, క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నపుడు భగవంతుని జ్ణ్జాపకము తెచ్చుకొనును. పరిస్థితులు తనుకు అనుకూలముగానున్నపుడు దానికంతకు కారణము తనే అని భావించును. రెండవ రకము భక్తుని ఆర్దార్థి అంటారు. ఇతడు ఆధ్యాత్మిక చింతన కలిగి తన జీవితము మీద భగవంతుడు దయచూపుతున్నడన్న విషయమును గ్రహించియుండును. కాని, ఇతదు తన స్వప్రయోజనము ఆశించే దైవప్రార్థన చేయును.

ఆర్థార్థి దౄష్టి ఎప్పుడు ఇహసుఖములమీద, భౌతిక సంపదలమీదే ఉండును. ఆర్త భక్తుని వలె ఆర్థార్థి భక్తుడు కూడా కష్టములనుండి విముక్తి కలిగించుటకే దైవప్రార్థన చేయును. మూడవ రకము భక్తుని జిజ్ణ్జాసుడంటారు. ఇతడు మోక్షమును పొందుటకు, జీవితము లోని అశుభములను పారద్రోలుటకు జ్ణ్జాన సంపాదన చేయును. మోక్షము సంపాదించుట అందరి జీవితాశయమైనప్పటికి, ఒక్క జిజ్ణ్జాసు మాత్రమే జ్ణ్జాన సంపాదన వలనే మోక్షము లభించునన్న సత్యము గ్రహించి దానికై పాటుపడును. అతని ప్రార్థన – జ్ణ్జానము సంపాదించుటకు కావలసిన బుద్ధికుశలత, మనోవికాసము తనకు కలుగచేయమని వెడుకొనుత. నాలుగవ రకం భక్తుడు జ్ణ్జాని. ఇతడు తనయందే భగవంతున్నాడని తలచును. తనకు భగవంతుని భేదములేదని తలచును. జ్ణ్జాని చేసే ప్రార్థన  సర్వోత్తమమైనది. అది జ్ణ్జానమును విశదీకరించు సాధన.

పూజ

ప్రార్థన మూలంగా మనం భగవంతుని నుండి అనేకములు పొందుతాం. అందుచేత పరిపక్వత చెందిన మనస్సుతో భగవంతునికి కొన్నిటికి సమర్పిస్తాం. ఇలా వచ్చి పుచ్చుకోవడాలు కొనసాగుతున్నపుడు, మనం క్రమక్రమంగా భగవంతుని సమీపిస్తాం.  ధ్యాన స్థితి నెలకొంటుంది. ధ్యానస్థితిని ఉపాసన అని పేర్కొంటారు. ఉపాసన (ఉప ఆసన) అంటే దగ్గరగా ఉండడం. భగవంతునికి దగ్గరగా ఉండడమన్నమాట.

అర్హులైన కొందరి జీవితంలో ప్రార్థనే ధ్యానంగా రూపాంతరం చెందడం కద్దు. కాని, అనేకులకు ప్రార్థనకు, ధ్యానానికి నడుమ ఒక మెట్టు ఆవశ్యకమవుతుంది. అదే పూజ. ఈ విధంగా పూజ మానవుణ్ణి భగవంతుని దగ్గరకు తీసుకొని పోతుంది. భగవద్దర్శనం కలిగిస్తుంది.

పూజకు మూలాధారమైనవి:

1. త్యాగం: దైవం నిమిత్తం ఒక వస్తువును త్యాగం చేయడం, అంటే సమర్పించడం పూజ.

అది ఒక పుష్పమే కావచ్చు.  పదార్థమే కావచ్చు. మనస్సే కావచ్చు, పనియే కావచ్చు. ఎలాటిదైనా దానిని త్యాగభావంతో సమర్పించాలి. ప్రార్థనద్వారా పరిపక్వత సంతరించుకొన్న మనస్సుతో సమర్పించాలి. పత్రం, పుష్పం, ఫలం< తోయం – వీటిలో వేటినైనా స్వీకరిస్తానని భగవద్గీతలో భగవానుడు తెలిపే ఉన్నాడు. కాని దాన్ని సభక్తికంగా సమర్పించాలని ఆయన వక్కాణించాడు.

2. పవిత్రత: హిందూమతం మూడు రకాల పవిత్రతను ప్రస్తావిస్తుంది.

మొదటిది అధి భౌతికం: భౌతిక స్థితిలో అంటే బాహ్యమైన పవిత్రత. పూజాద్రవ్యాలన్నిటిని మంత్రోచ్ఛారణ చేస్తూ నీటితో శుభ్రపరచడమే ఇది.

రెండవది అధి దైవతం: ఒక్కో వస్తువుకూ, శరీరంలోని ఒక్కో అంగానికి ఒక దివ్యరూపం ఉంటుంది. అవి ఒక్కోదేవత అధీనంలో ఉంటాయి. ఈ దేవతను అధిష్టానదేవతగా పేర్కొంటారు. ఈ దెవతలను గంట, దీపం, శంఖం, పువ్వులు, నీరు ఇత్యాదులతో ఆవాహన చేయడం వల్ల ఆ వస్తువులు పవిత్రీకరింప బడతాయి.

మూడవది ఆధ్యాత్మికం:- మానవ ఆత్మ శాశ్వతంగా పవిత్రమైనది. స్వయంప్రకాశమైనది. పాపం, అపవిత్రతలు మనస్సుకే వర్ణిస్తాయి. అందుచేత మనస్సున పవిత్రీకరించడం మూలంగా ఆత్మ తన స్వాభావిక ప్రకాశాన్ని, వైభవాన్ని అభివ్యక్తీకరిస్తుంది.

నాలుగవై దివ్యబంధం:- పూజించే వ్యక్తికి, ఇష్టదైవానికి మధ్య ఒక బంధం నెలకొనాలి. పూజించే విగ్రహంలో భగవంతుడు నెలకొని ఉన్నట్లు భావించాలి. అక్కడ నెలకొని ఉన్న ఆయనతో పూజించే వ్యక్తి ఎడతెగని బంధాన్ని ప్రేమబంధాన్ని ఏర్పరచుకోవాలి.

పూజాక్రియ:- వేదకాలంలో ప్రార్థనల ద్వారా, యజ్ణ్జాలద్వారా దైవంతో అనుసంధానం ఏర్పరచుకొన్నారు. తదనంతర కాలంలో అది పూజగా రూపుదిద్దుకొని పెంపొందింది.

సామన్యంగా దైనందిన పూజలో ఆరుమెట్లున్నాయి. అవి 1. ఆయత్తం (పూర్వాంగం), 2. పవిత్రీకరణ (శుద్ధి), 3. తనను దివ్యునిగా చేసుకోవడం (భూరుశుద్ధి), 4. దైవాన్ని ఆవాహన చేయడం (ఆవాహన), 5. సేవ (ఉపహారం) 6. ముగింపు (పుష్పాంజలి). ఇవేకాక ప్రసాదం, హారతి కూడా పుజాకార్యక్రమంలో భాగమై ఉన్నాయి.

ప్రసాదం: పూజలలో అభిషేకింపబడిన, నివేదింపబడినవన్నీ తుదకు ప్రసాదంగా పంచిపెట్టబడతాయి. ప్రసాదం మన దేహాలను పవిత్రీకరిస్తుందని విశ్వాసం. అదేకాక ప్రసాదం అనే సంస్కౄత పదానికి అనుగ్రహం అని అర్థం. అందుచేత ప్రసాదం పుచ్చుకోవడం భగవంతుని అనుగ్రహం పొందడమవుతుంది.

ఆరాత్రికం (ఆరతి): ధూపం, దీపం ఇత్యాదులను దైవ సమక్షంలో చూపించే క్రియ ఇది. ఈ సమయంలో విగ్రహంలో దైవం ఉనికి విశిష్టంగా అభివ్యక్తీకరణ చేసుకుంటుందని భక్తుల విశ్వాసం. సామన్యంగా ఆరతి సమయంలో గంట, శంఖం వంటి వాటిద్వారా నాదం వెలువరింప చేస్తారు. అందువల్ల ఆ వేళలో మనస్సు ఏకాగ్రమై దైవచింతనకు దోహదం చేస్తోంది.

‘హారతి ఇతి హారతీ – దౄష్టిదోషాన్ని హరించేది హారతి. అందుకే దాన్ని నీరాజనం అని కూడా అంటారు. దేవుడిపైన దర్శించాడానికి వచ్చిన ఎంతోమంది దౄష్టి పడుతుంది. ఆ దౄష్టి దోషం తొలగడానికి అర్చకులు హారతి ఇచ్చి, భక్తులందరికీ చూపెడతారు. అప్పుడు అక్కడ ఉన్న భక్తులందరూ ఆ హారతికి దణ్ణం పెట్టుకోవాలి భక్తిగా. చిన్నపిల్లలకు, శుభ కార్యాల్లోనూ హారతితో దిష్టితీసి పెరట్లో ఓ మూల పడేస్తారు. అలాగే దేవుడికి మంగళం కలగాలని హారతి ఇచ్చి, శ్లోకాలు చదివి, ఆ హారతిని ఒక పక్కన పెడతారు. ఇది సరైన పద్ధతి.

దీపారాధన

దీపంజ్యోతి: పరబ్రహ్మ దీప: సర్వతమోపహ:!!
దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపో నమోస్తుతే!!
దీపంజ్యోతిపరబ్రహ్మ తత్వాన్ని తెలుపుతుంది. అజ్ణ్జానాంధకారాన్ని తొలగిస్తుంది.

దీపారాధన సంధ్యా సమయాలకే పరిమితమైన వ్యవహారం కాదు. నిత్య పూజలో, వైదిక కర్మల్లో, పండుగల్లో వ్రతాల్లో, చివరకు ప్రారంభోత్సవాది సాంఘిక కార్యకలాపాలన్నింటిలో దీప ప్రజ్ణ్జ్వలన ప్రప్రథమ అంశం. ఏ పూజ చేసినా, ఏ వ్రతం ఆచరించినా దీపారాధన చేయకుండా మొదలు పెట్టరు.

మన పెద్దలు దైవకౄపకు ఇలాంటి పద్ధతులను చెప్పారు.

ఓంకారం

“ఆన్ని మంత్రాలోకి శక్తివంతమైన ఏకాక్షర మంత్రం ‘ఓం;’. దినినే ప్రణవమని అంటారు. మంత్రోచారణం జీవునికి, పరమాత్మ అనుగ్రహాన్ని సులభతరం చేసే సాధనం. ఉదాహరణకు బిడ్డ తన తల్లిని ‘అమ్మా’ అని పిలువగానే, ఆ తల్లి ఎన్ని పనులతో సతమతమవుతున్న;;ప్పటికి ఆప్యాయంగా ఆ బిడ్దను గుండెకు హత్తుకుంటుంది కదా! అలాగే సకల దేవత్తముర్తులు, మంత్రోచ్చారణతో మనం మననం చేయగానే మన పట్ల ప్రసన్నులవుతున్నారు.

ఈ నేపధ్యంలో ‘అసలు మంత్రం అంటే ఏమిటి?’ అన్న సందేహం కొంత మందికి కలుగవచ్చు.

మననాత్ త్రాయతే 
ఇతి మంత్ర: అని అన్నారు. అంటే మననం చేయడం వలన రక్షించేది అని అర్ధం, అటువంటి మహా శక్తివంతమైన మంత్రాలను మన ౠషులు, తమ అమోఘ తపశ్శక్తితో, భగవదావేశంలో పలికిన వాక్యాలే మంత్రాలు.

‘ఐం’, ‘శ్రీం’, ‘హ్రీం’, ‘క్లీం’ అనే బీజాక్షరాలను అయా దేవతల పేర్లతో కలిపి జపించినపుడు శక్తివంతములైన మహా మంత్రాలవుతున్నాయి. మన్ ఇష్టదేవతను ప్రసన్నం చేసుకోవడమే మంత్రంలక్ష్యం. ఈ మంత్రాలు మూడు విధాలు.  క్షుద్రంతో ఉచ్చాటన చేసే తామస మంత్రాలు, యుద్ధంలో గెలుపు కోసం చేసే రాజలమంత్రాలు, ఆధ్యాత్మిక సాధనకై జపించే సాత్వికమంత్రాలు, చంధోబద్దంగా ఉన్నవి ‘ౠక్కులూ గద్యాత్మకంగా ఉన్న మంత్రాలు ‘యజస్సులూ.

ఇక అన్ని మంత్రాలకు ముందు ‘ఓం’ కారాన్ని చేర్చి జపిస్తాం. ఎందుకంటే ‘ఓం’ కారం లేని మంత్రం ఫలవంతం కాదు. అలాంటి మంత్రం ప్రాణవయువులేని నిర్జీవశరీరం వంటిది. ఈ ఓంకారం ఆ సర్వేశ్వరుని మంచి ఓక జ్యోతిగా ప్రారంభమై, అందునుంచి ఒక నాదం ధ్వనించింది. ఆ ధ్వనే ‘ఓంకారం’.  ‘ఓం’ నుంచి వేదరాశులే ఉద్భవించాయి. ౠగ్వేదంనుండి ‘ఆకారం, యజుర్వేదం నుండి ‘ఊకారం, సామవేదం నుండి ‘మాకారం కలసి ‘ఓంకారం’ ఏర్పడిందని ౠషివాక్కు.
సకలవేదరూపం ఓంకారం.”

బ్రహ్మ కడిగిన పాదము

అన్నమాచార్య విరచితమైన ‘బ్రహ్మ కడిగిన పాదమూ సంకీర్తనంలోని, ‘బ్రహ్మ కడిగిన పాదమూ వెనుక ఓ అసక్తికరమైన పురాణోదంతం ఉంది.

   హిమవంతుని కుమార్తె గంగ. ఆమైను బ్రహ్మదేవుడు దత్త పుత్రికగా స్వీకరించి శివునికిచ్చి వివాహం జరిపిస్తాడు. శివుని వెంట వెళ్తున్న గంగను చూసి, బ్రహ్మ పుత్రికావాత్సల్యంతో దు:ఖితుడైనాడు. తండ్రిని ఓదార్చిన గంగ జలరూపంలో బ్రహ్మ కమండలంలోపలికి, స్త్రీ రూపంలో శివుని వెంట వెళ్ళింది.


   కొంతకాలం తర్వాత శ్రీమన్నారాయణుడు వామనునిగా అవతరించాడు. బలి దగ్గర మూడడుగుల నేలను దానమడిగి, ముల్లోకాలను అక్రమించి, ఒక పాదంతో సత్యలోకాన్ని ఆక్రమించాడు. అప్పుడు బ్రహ్మదేవుడు శ్రీహరి పాదాన్ని భక్తి పారవశ్యంతో తన కమండలంలోని గంగాజలంలో కడిగాడు. అలా పరమపావన విష్ణుపాదాన్ని చేరుకున్న గంగ. అక్కడే భగీరధుడు తన తపశ్శక్తితో భూమికి రప్పించాడు. అందుకే గంగను ‘విష్ణుపాదోద్భవా మని అన్నారు. ఈ ఉదంతాన్నే అన్నమయ్య ‘బ్రహ్మ కడిగిన పాదమూ అనే సంకీర్తనంలో ఉదహరించారు.

సప్తమాతృకలు

సర్వదేవతలూ శక్తిస్వరూపాలేనని స్పష్టంచేసే గాథలు అనేకం పురాణాల్లో చెప్పబడ్డాయి.

పరాశక్తి ‘సప్తమాతృకలూగా అవతరించిది. బ్రహ్మ, విష్ణు, శివాది దేవతల శక్తులే సప్తమాతృకలు.


1. బ్రహ్మాణి: ఈ మాతృమూతి బ్రహ్మశక్తిరూపిణి, బ్రహ్మవలె హంస వాహిని, అక్షమాల, కమండలం ధరించిన శక్తి.
2. మహేశ్వరి: శివుని శక్తి. శివునివలె వృషభంపై కూర్చుని త్రిశూలాన్ని, వరదముద్రని ధరించి, నాగులను అలంకరించుకొని చంద్రరేఖని శిరస్సుపై ధరించి ప్రకాశించే మాత.
3. కౌమారి: కుమారస్వామి శక్తి. శక్తి (బల్లెం) హస్త. మయూర వాహనారూఢ.
4. వైష్ణవి: విష్ణుశక్తి. శ్రిమాహావిష్ణువువలె గరుడవాహన్నని అధిరోహించి, చేతులలో శంఖ చక్ర గదా శార్జ్గ, ఖడ్గ, ఆయుధాలు ధరించిన మాత.
5. వారాహి: హరి అవరారమైన యజ్ఞవరహుని శక్తి. వరాహముఖంతో వెలిగే తల్లి.
6. నారసిమ్హి: విష్ణువు ధరించిన నరసింహావతార శక్తి. సింహముఖంతో, నరదేహంతో, అగ్నిమయకాంతితో దివ్యంగా ప్రకాశించే జనని.
7. ఐంద్రీ: ఇంద్రశక్తి. ఐరావతంపై కూర్చొని వజ్రయుధాన్ని ధరించిన సహస్రనయన ఈ జగదంబ.

– ఇవీ సప్తమాతృకలు. అంటే స్ర్వదేవతలు అమ్మ రూపాలే. జగదంబ రాక్షససంహారం చేస్తుండగా, సప్తమాతృకలు ఆవిర్భవించి ఆమెకు సహకరించాయి.

ఇలా ‘సర్వంశక్తిమయం’ అనే భావన బలపడాలి. ఆ భావనే భక్తి. ఆ భక్తే ముక్తి అవుతుంది. అదే మానవ జీవిత సార్థకత. ఆ అమ్మ అనుగ్రహమే అసలైన వరం. ఆ వరమే అందరం అర్ధించాలి. అందుకు చిత్తశుద్ధితో ఆ జగదంబను శరణు వేడాలి.

పురాణములు

మానవులు పాటించవలసిన ధర్మములు, చేయవలసిన కౄత్యములు, దర్శించవలసిన క్షేత్రములు, గురించి తెలుపునవి పురాణములు. ఇవి కధల రూపంలో వుండును. పురాణములందు ముఖ్యమైనవి 18.

1) బ్రహ్మపురాణము 
2) పద్మ 
3) విష్ణు 
4) శివ 
5) భాగవత 
6) లింగ 
7) వరాహ 
8) నారదీయ 
9) మార్కండేయ 
10) అగ్ని 
11) భవిష్య 
12) బ్రహ్మవైవర్త 
13) స్కంద 
14) వామన 
15) కూర్మ 
16) మత్స్య 
17) గరుడ 
18) బ్రహ్మాండపురాణములు

తులసిదళ మహిమ



శ్రీహరి వంచనతో శీలాన్ని కోల్పోయిన తులసీ, అదే శ్రీహరి కరుణ వలన గండకీ అనే పేరిట అతిపుణ్యనదమైంది. తులసీ కేశాల నుంచి పుట్టిన తులసి మొక్క దేవపూజలో ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇటువంటి తులసికి కొన్ని మహిమలూ ప్రత్యేకతలు ఉన్నాయి.


తులసి వున్న ప్రదేశం సర్వపవిత్ర తీర్ధాలకు సమనం. తులసి ఆకులు రాలిపడే చోట సర్వదేవతలూ వుంటారు. తులసీపత్ర స్నానం చేసినవాడు సర్వతీర్ధాలలోను స్నానమాచరించిన ఫలాన్ని పొందుతాడు. సర్వ యజ్ణ్జాలను చేస్తే ఎంతఫతమో! అంతఫలం తులసీపత్ర స్నానం వల్ల సంపాదించవచ్చు.


తులసీదళ దానం వేయి అమౄతభాండాల దానానికి సమనం. శ్రీహరి సమర్పించిన ఒక తులసీదళం సైతం పై ఫలాన్నే ఇస్తుంది. తులసీదళ దానం పదివేల గోవులు దానం చేసే ఫలానికి సమం. మరణకాలంలో తులసీ జల సేవనం చేస్తే విష్ణులోకం లభిస్తుంది. రోజూ తులసీ తీర్ధం సేవిస్తే జీవన్ముక్తుడుయి, గంగాస్నానం ఫలం కలుగుతుంది. నిత్యం తులసీదళాలతో శ్రీహరిని పూజిస్తే లక్ష అశ్వమేధాల ఫలం కల్గుతుంది. ఇందులో ఏ మాత్రం సంశయం వలదని సాక్షాత్ ఆ శ్రీహరే తులసికి చెప్పాడని శ్రీబ్రహ్మవైవర్తన పురాణ ప్రకౄతి ఖండంలోని 21వ అధ్యాయమైన తులస్యోపాఖ్యానం పేర్కొంటున్నది.


తులసి మాలతో జపంచేసినా, తులసీదళమాలను దేహం మీద దరించినా ఇదే ఫలం కలుగుతుంది. తులసీదళాలను సంరక్షించకుండా వదిలివేస్తే సూర్య, చంద్రులున్నంత వరకూ “కాలసూత్రా మనే నరకానికి పోతారు (మరిగిన నీటితో నిండివుండే నరకం అది). తులసీదళాలను పట్టుకొని అసత్యమాడే వారు, అబద్దపు ఒట్టు పెట్టేవారు 14 ఇంద్రులు ఉన్నంత కాలం ‘కుంభిపాకం’లో అలమటిస్తారు.  


త్రుంచరాని రోజులు


నరా నర్యశ్చ ఆం దౄష్ట్యా తులవాం దాతుమక్షమా:


తేన నాన్నూ చ తులసీం తాం వదంతి పురావిద:


                                   – ప్రకౄతిఖండం – తులస్యోపాఖ్యానం


అంటే పోల్చడానికి, వర్ణించడానికి వీలుకానిది కాబట్టి, ఆమెకు ‘తులసీ అన్న పేరు సార్ధకమైనదని పైశ్;లోక అర్ధం. ఇటువంటి పవిత్రమైన తులసిని సంధ్యాసమయాల్లో, నూనెరాసుకుని, స్నానం చేయకుందా, మైల ఉన్నప్పుడు, పూర్ణిమ, ద్వాదశి, అమావాస్య రవిసంక్రమణ దినాల్లో త్రుంచరాదు. అలాచేస్తే సాక్షాత్తూ ఆ శ్రీహరి శిరస్సుని త్రుంచినంత పాపం కల్గుతుంది.  


శ్రార్ధకర్మ, వ్రతాలు, గోదానం, ప్రతిష్టలకు, దేవతార్చనకు వాడె తులసిని మూడు రోజులవరకూ నిల్వ చేసుకొని వాడవచ్చు. శ్రీహరి పూజకు సమర్పించిన తులసి క్రిందపడినా, నీటపడినా శుద్దమైన దాని క్రిందేలెక్క.  


అందువల్లే “త్రిరాత్రం తులసీ వ్రతం శుద్దం పర్యుషితం సతి” అని బ్రహ్మవైవర్తనం తులసిని కీర్తిస్తున్నది.  


ఈశ్వరార్పణమస్తు !!!


దేవాలయాల ముఖద్వారాలు…..


దేవాలయాల ముఖద్వారాలు ఎక్కువగా తూర్పు దిశగా ఉంటాయి. కొన్నింటికి పశ్చిమంగాను, ఉత్తరంగాను, దక్షిణంగాను ఉంటాయి. ఈ దిశా నిర్ణయం, అందులోని దైవాన్ని బట్టి ఉంటుందా? ముఖ్యమైన దేవతలలో, ఎవరెవరు ఏయే దిశగా ఉండాలో తెలు పగలరు. దేవాలయ సిమ్హద్వారం పడమటి దిక్కుకు ఉండడం దోషమా?


గౄహవాస్తుకు, దేవాలయాల వాస్తుకు కొన్ని భేధాలు సహజంగా ఉంటాయి. దేవాలయల విషయంలో పాంచరాత్ర శైవాది ఆగమాలున్నాయి. వాటిని బట్టి దేవాలయ నిర్మాణాలుంటాయి. ఈ ఆగమాలలో కూడా కొన్ని భేధాలుంటాయి. సిమ్హద్వారాల విషయంలో దోషాలుండకుండా ఉండడానికే నాలుగువైపులా ద్వారాలు పెట్టే విధానం ఉంది. ఫలాన దైవానికి ఫలాన దిక్కుననే ముఖద్వారం ఉండాలన్న నియమం అంతగా లేదనే చెప్పాలి.

ఉపవేదములు

1. అయిర్వేదము (వైద్యశాస్త్రము)
2. ధనుర్వేదము (శస్ర్తాస్త్రవిద్య మరియు రాజ ధర్మశాస్త్రం)
3. గాంధర్వవేదము (గానశాస్త్రము)
4. అర్ధవేదము (కళలు , రాజకీయ, ఆర్ధిక, వ్యవసాయ, గోరక్ష వ్యాపార విషయముల శాస్త్రము)


వేదాంగములు

1. శిక్ష: వేదములందలి అక్షరములను, స్వరములను ఉచ్చరించు రీతిని వవరించి చెప్పును. దీనిని పాణిని రచించెను.

2. వ్యాకరణము: సుశబ్ద, అపశబ్దముల భోధించును. దీనిని గూడ పాణినియే రచించెను. ఇది ఆధునిక భాషా శాస్త్రము లకు మూలము. ఇందు 8 అధ్యాయములు కలవు.

3. ఛందస్సు: పింగళుడు. ఛందోవిచితి అనబడు 8 అధ్యాయముల ఛందో శాస్త్రము రచించెను. మంత్ర ములందుగల వౄత్తివిశేషములు బోధించెను.

4. నిరుక్తము: వేదమంత్రములందుగల కఠినపదముల భావమును బోధించును. దీనిని యాస్కుడు రచించెను.

5. జ్యోతిషము: ఇది కాలనియమమును బోధించు శాస్త్రము. లగధుడు, గర్గుడు మొదలగువారు రచించిరి. ఇది ఆయా కాలములందు చేయవలసిన యజ్ణ్జ యాగాది విధులకు సంబంధించిన కాలవిశేషము లను బోధించును.

6. కల్పము: ఇది ఆయా మంత్రములు పఠిచుచు చేయ వలసిన కార్యములను బోధించును. అశ్యాలాయనుడు, సాంఖ్యాయనుడు మున్నగువారీ శాస్త్రమును రచించిరి.

రాముడి ఆవులింత….

రాముడు సీతాలక్ష్మణులు ఇద్దరితో కైసి అడవికి వెళ్ళాడు. కాని పధ్నాలుగేళ్ళు వనవాసం ముగించుకుని ముగ్గురుని తీసుకుని అయోధ్యకు మరలిచ్చాడు.

ఆమూడో వ్యక్తి ఆంజనేయస్వామి!

ఆంజనేయస్వామి పవనపుత్రుడు. పవన మంటే గాలి. అదే ప్రాణం కూడా. రామునికి ప్రాణం ఆంజనేయుడు. జీవినుంచి ప్రాణాన్ని విడదీస్తే ఏమవుతుంది? జీవే ఉండదు. అలాగే ఆంజనేయుడు లేకుండా రాముడు ఉండడు.

రామునికి హౄదయం ఆంజనేయుడు. ఆంజనేయునికి హౄదయం రాముడు. మనిషి నుంచి హౄదయాన్ని ఎలా వేరుచేయలేమో, రాముణ్ణే ఆంజనేయుని అలాగే వేరుచేయలేం.

రాముడు అయోధ్యకు వచ్చి, పట్టాభిషేకం కూడా జరిగి చాల రోజులైంది. ఓసారి ఏమయిందంటే….

సీతాదేవికి ఆంజనేయుడంటే ప్రాణమే. అతని మీద ఆమెకు పుత్రవాత్సల్యం. ఎందుకంటే, ఏడాదిపాటు లంకలో ఉండి, రామవియోగంతో కన్నీరు మున్నీరుగా గడిపిన తర్వాత, మండు వేసవిలో మలయమారుతం వీచినట్లుగా మొదటిసారి రాముని కబురు మోసుకొచ్చిన అప్తబంధువు ఆంజనేయుడే. ఆనంద భాష్పాలతో, మసకబారిన అరచేతిలో ఉంచుకుని దర్శించిన ఆ క్షణాలు ఇప్పటికీ తీయని గుర్తులే. ఆ అంగుళీయకంలో ఆనాడు తను తన ప్రియరాముని ఆకౄతినే దర్శించింది. దానికి ప్రతిగా తన చూడామణిని రామునికిమ్మని ఆంజనేయుని చేతికిచ్చింది. ప్రేయసీ ప్రియుల మధ్య ప్రేమ లేఖలు మొసినవారిమీద ఎవరికైనా ఒకవిధమైన ప్రత్యేక ప్రేమాదరాలు సహజంగానే ఉంటాయి.

కాని, తనిప్పుడున్నది అయోధ్యలో! అంత:పురంలో! ఆర్యపుత్రుల అనురాగభరిత సన్నిధిలో!

ఈ ఆంజనేయుడేమిటి!! పగలనక, రాత్రనక ఎప్పుడూ ఆర్యపుత్రుని వెన్నంటే ఉంటాడు? ఆయనా అంతే…వారించరు సరికదా, క్షణకాలం ఆంజనేయుడు కనిపించకపోతే విలవిల లాడిపోతారు. ఏడాదిపాటు తన వియోగంలో కూడా అంతగా వేగిపోయి ఉండరేమో!

 సీతాదేవి ముఖంలొ అప్రన్నత చోటు చేసుకుంది.

ఆమె దిర్ఘాలోచనలో పడి పోయింది. మా చెడ్డ చిక్కొచ్చి పడిందే!

ఈ ఆంజనేయుడి వల్ల ఆర్య పుత్రునితో ఏకాంతమే దుర్లభమై పోయిందే!

దీర్ఘంగా నిట్టుర్చింది సీతమ్మ. అంతలో ఆదుగుల చప్పుడు! అందులో కూడా మౄదుత్వమో! అది ఆర్యపుత్రుల అడుగుల సవ్వడే.

ఆ వెనుకే ఆంజనేయుడా!

పెళ్ళయి ఇంత కాలమైనా రాముడి సాంగత్యం తనకెప్పుడూ నిత్యనూతనంగానే ఉంటుంది. హౄదయానికి రెక్కలొచ్చి రివూన ఎగురుతుంది. ముఖంలో కోటికాంతులు విచ్చుకుంటాయి. అడుగులు తడబడతాయి. పెదవులు వణుకుతాయి.

కానీ ఈరోజు భిన్నమైన అనుభవం. ముఖం మరింత వాడి పొయింది. నీళ్ళు తిరిగిన కనుకొనల్లోంచి ఓసారి రామునివైపు చూసి అంతలోనే ముఖం తిప్పేసుకుంది.

రాముడు గమనించాడు.

అంతవరకు ఆయన అధరాలపై మెరిసిపోయిన మందహాసం మాయమై ముఖంలో ఒకింత అందోళన చోటు చేసుకుంది.

‘దేవి! శరీరం స్వస్ధంగా లేదా?” ఆ గొంతులో కలవరపాటు , అనునయం.

పవనాల తాకిడికి జలజల కురిసే మేఘంలా ఆమె కళ్ల నుంచి ఆశ్రుబిందువులు తపతప రాలాయి.

ఇటు రామునిలో, అటు ఆంజనేయునిలో ఇనుమడిపించిన ఆందోళన.

‘దేవి! ఏం జరిగింది?’ రాముడు ఆమెకు దగ్గరగా జరిగి ఆమె ముఖంలోకి చూస్తూ అడిగాడు.

సీత చివాలున ముఖం పక్కకు తిప్పుకుంది. కాసేపు నిశ్శబ్దం.

‘ఆర్యపుత్రులతో కాస్త ఏకాంతం కోరుతున్నానూ దు:ఖంతో సీతమ్మ గొంతు వణికింది.

రాముడు క్షణం నివ్వెరపోయాడు. ఆంజనేయుడివైపు చూశాడు. ఆంజనేయుడు నొచ్చుకుంటూ బయటికి నడిచాడు.

‘మీరు నాతోపాటు ఆ కోతిని కూడా కట్టుకున్నారా?’ సీతమ్మ నిష్ఠూరంగ్గ అడిగింది.

రాముడు విస్తుపోయాడు. సీత ఎప్పుడూ ఇంత నిష్ఠూరంగ్గ మాట్లాడదే! పైగా తమిద్దరికీ ఎంతో ప్రేమాస్పదుడైన ఆంజనేయుని కోతి అనడమా! వింతగా ఉందే.

 ’మీతో ఏకాంతమే దుర్లాభంగా ఉంది. ఇంత కన్న లంకలో ఉన్నప్పుడే బాగుందనిపిస్తోంది. అప్పుడు మీరు ఎదురుగా లేకపోయినా, మధురమైన మీ ఊహలతోనైనా బతికాను. ఇప్పుడు మీరు ఎదురుగా ఉండీ లేనట్లే ఉంటున్నారు. నాకు ఊహల తోనెనా ఆరాధించే అవకాశమే లేకుండా పోయింది అంది సీతమ్మ. ఉబికివచ్చే కన్నీటిని ఆపుకోడానికి సతమతమవుతూ.

‘ఆంజనేయుడికి కూడా తెలియకూడాని రహస్యాలు మనమధ్య ఏముంటాయి దేవి?’ రాముడు అడిగాడు.

ఆ ప్రశ్నకు రామునివైపు చివాలున చూసింది సీత. దు:ఖం మరింత ముంచుకొచ్చి మట్లాడ లేకపోయింది. మూడో మనిషికి తెలియకూడని రహస్యాలు భార్యాభర్తల మధ్య ఉంటాయని కూడా ఈయనకు తెలియదా! భార్యను కూడా విస్మరించి పూర్తిగా భక్తులతోడిదే లోకమా! ఎంత అవతార పురుషులైతే మాత్రం భార్యతో మాత్రమే ఉంచుకోవలసిన ఏకాంత క్షణాలుండవా?

“ఆంజనేయుడు బ్రహ్మచారి కనుక భర్తకు మాత్రమే చెప్పవలసిన రహస్యాలు భార్యకుంటాయని తెలియదు. కానీ మీరు బ్రహ్మచారి కాదు గదా! నన్నొదాన్ని కట్టుకున్నారు గదా!” దు:ఖంతో సీతమ్మ గొంతు తిరిగాయి.

రాముడు చలించిపోయాడు. కళ్ళల్లో నీళ్ళు గిర్రున తిరిగాయి. సీతకు దగ్గరకు తీసుకుని “దేవి! చెప్పు. నువ్వు ఏం చేయమంటే అదే చేస్తానూ అన్నాడు.

‘మీరు నిత్యము కొంతసేపు కేవలం నాతోనే గడపాలి. మనిద్దరం తప్ప మూడో మనిషి ఉండకూడదు;’ అంది సీతమ్మ కొంత తెప్పరిల్లి.

రాముడి మదిలో క్షణకాలం పాటు ఏవేవో ఆలోచనలు మెదిలాయి. ‘తన ప్రాణమూ, తన హౄదయమూ అయిన ఆంజనేయుని విడిచి తను ఉండగలడా? ఆంజనేయుడు మాత్రం ఉండగలడా?

అయినా అర్థాంగి మాటను శిరసా వహించడం తన కర్తవ్యం అనుకున్నడు. ‘సరే, అలాగే’ అన్నాడు.

ఆ మాటతో సీత ముఖంలో వేయిదీపాలకాంటి వరబూసింది. వర్షం మధ్యలో మబ్బుచాటునిండి చటుక్కున బయటపడే సూర్యకాంతిలా భర్త ముఖంలోకి తౄప్తిగా, ఆనందంగా చూసింది.

‘మందిరం అవతల అంతసేపూ కాలుగాలిన పిల్లిలా తిరిగిన ఆంజనేయుడు ఓసారి లోపలికి తొంగిచూసాడు. రాముడు అతణ్ణి లోపలికి పిలిచి, నాయనా! కాసేపు మన ఉద్యానవనంలో వహరించు. తోటనిండా పళ్ళు విరకాసి ఉన్నాయి. తౄప్తిగా ఆరగించు. మళ్ళీ కబురుచేసినప్పుడు వద్దువుగానీ అన్నాడు. ఆ గొంతులో ఎంత దాచుకున్న బాధ ధ్వనించనే ధ్వనించింది.

ఆంజనేయుడి ముఖం వాడిపోయింది. అయినా తన స్వామి అజ్ణ్జ! మారుమాట్లాడకుండా అమ్మకూ, అయ్యకూ మొక్కి, భారంగా అడుగులు వేస్తూ అక్కడినుంచి నిష్ర్కమించాడు.

నేరుగా ఉద్యానవనానికి దారితీశాడు. ఫలపుష్పాలతో కళకళ లాడుతున్న ఆ ఉద్యానవనం అతనికి వల్లకాడునే తలపింపచేసింది. సర్వం కోల్పోయినవాడిలా అక్కడ శిలావేదికమీద కూర్చుని కళ్ళు మూసుకున్నాడు. ఆ కళ్ల ముందు రాముడు, ఆ పెదవులపై రామనామం. క్రమంగా ఆ వనమంతా రామనామంతో నిండిపోయింది. అక్కడి ప్రతిచెట్టూ, పుట్టా, పిట్టా రామనామ స్వరూపంగా మారిపోయాయి. జగమంతా రామమయం అయిపోయింది.

ఆంజనేయుడు ఈ లోకంలో లేడు.

అక్కడ అంత:పురంలో తన అభ్యంతర మందిరంలో రాముడు ఆన హంసతూలికా తల్పంమీద కూర్చుని ఉన్నాడు. సీత ఏవేవో ముచ్చట్లు చెబుతోంది. కాని తనలో ఏదో వెలితి. అంతలో ఆయనకు ఆవులింత వచ్చింది. ఆ వెంటనే మరోసారి…మరోసారి…మరోసారి..ఆవులింతలు వస్తూనే ఉన్నాయి.

సీత మొదట్లో మామూలు ఆవులింతలే అనుకుంది. కానీ ఒకదానివెంట ఒకటిగా అవి వస్తూనే ఉన్నాయి. ముచ్చట్లు అపి ఆర్యపుత్రుల ముఖంలోకి ఆందోళనగా చూసింది.

రాముడు ఆసౌకర్యంగా శయ్యమీద ఒకపక్కకు ఒరిగాడు. ఆవులింతలు ఆగలేదు.

సీత ఒక్క ఉదుటున లేచి పరిచారికను పిలిచింది.

‘ఆర్యపుత్రులకు స్వస్థంగా లేదు. వెంటనే రాజవైద్యుని పిలిపించూ. అని ఆదేశించింది.

 కాసేపటికి రాజవైద్యుడు వచ్చి, రాముని పరిక్షించాడు. ఎటువంటి లోపమూ కనిపించలేదు. ‘తల్లీ! ఏలినవారి ఆరోగ్యంలో ఎటువంటి తేడాలేదు. ఆవులింతలకు కారణం బోధపడడం లేదూ అన్నాడు.

‘మరేమిటి మార్గం?’ సీత నేత్రాలు శ్రావణమేఘాలయ్యాయి.

‘జోతిష్కులకు కబురు చేయించడమ్మా, వారేమైనా కారణం కనిపెట్టగలరేమో చూద్దాం’ అన్నాడు రాజవైద్యుడు.

జోతిష్కుడు వచ్చి శ్రీరామచంద్రులవారి జాతకచక్రం పరిశీలించి ఏవో లెక్కలు వేసి ‘ప్రభువు గ్రహస్థితిలో ఎటువంటి వైపరీత్యమూ లేదు. వారి ఈ ఆవులింతలు ఎందుకు వస్తున్నాయో? ‘అన్నాడు.

 సీతమ్మ ఆందోళనతో ఇంకెవరికెవరికో కబురు పంపిచి రప్పిస్తూనే ఉంది. ఎవరికీ ఏమి అంతుబట్టలేదు. అర్థరాత్రి సమీపించింది. సీతమ్మకు ఏమి చేయాలో పాలుపోలేదు, చివరిగా లక్ష్మణ స్వామికి కబురు చేసింది.

లక్ష్మణస్వామి వచ్చాడు. చూశాడు. ఆయనకీ కారణం బోధపడలేదు. ఏం చేస్తే రాముని ఆవులింతలు తగ్గుతాయో ఉపాయం తోచలేదు. అలోచిస్తూ అంతలోనే ఏదొ గుర్తొచ్చినట్లు నలువైపులా పరికించి ‘ఆంజనేయుడేడి?’ అని అడిగాడు.

సీత ముఖం చిన్నబోయింది.

కానీ, ఆ ప్రశ్నతో అక్కడున్నవారందరూ తెప్పరిల్లారు. ‘ఆవునవును మనం మరచిపోయాం. ఆంజనేయుడున్నాడుగా! అతడు మంచి బుద్దిశాలి. తప్పకుండా ఏదో చిట్కా చెబుతాడూ అన్నాడు.

‘ఆంజనేయుడు ఉద్యానవనానికి వెళ్ళాడూ అంది సీతమ్మ. ఆ గొంతులో ఏదో తప్పు చేశానన్న ధ్వని ‘ఆంజనేయుణ్ణి తీసుకు రండీ ఆదేశించాడు లక్ష్మణుడు.

పరుగు పరుగున సేవకులు ఉద్యానవనానికి వెళ్ళారు. ఓ మూల నుంచి రామభజన వారికి వినిపించింది. ఆ ధ్వని వచ్చినవైపు వెళ్ళారు. ఆంజనేయస్వామి పద్మాసనంలో నిమీలిత నేత్రాలతో కూర్చుని ఉన్నాడు.

‘ఆంజనేయా! ఆంజనేయా!’ పిలిచారు. పిలిచి పిలిచి అలసిపోయారు.

ఆంజనేయడు కళ్ళు విప్పలేదు. భూమి కంపించినా సరే ఆంజనేయుడు ఆ సమాధ్యావస్థ నుంచి బయటకు రాడని వారికి అర్థమైంది. తిరిగివెళ్ళి లక్ష్మణస్వామికి వన్నవించుకున్నారు.

ఈసారి లక్ష్మణస్వామి స్వయంగా బయలుదేరాడు. వెళ్ళి ఆంజనేయుని ఎదుట నిలబడ్డాడు. ‘సేవకులు చెప్పింది నిజమే. ఈ స్థితిలో ఆంజనేయుని ధ్యానానికి ఎవరు భంగం కలిగించ లేరు. కానీ ఆంజనేయుడు రామకార్యదురంధరుడు! కనుక రామునికి ఆపద సంభవించిందంటే చటుక్కున కళ్ళు విప్పుతాడు!’ అనుకున్నాడు లక్ష్మణుడు.

‘ఆంజనేయా! రామునికి ఆపద వాటిల్లిందయ్యా!’ అన్నాడు.

పిడుగు పడ్డట్టుగా ఆంజనేయుడు చటుక్కున కళ్ళు విప్పాడు. ‘నా రామయ్యకు ఆపదా? నా రమాయ్యకు ఆపదా?’ అంటూ ఒక్క ఉదుటున లేచి రాముని అభ్యంతర మందిరం వైపు పరుగు తీశాడు. ఒక్క అంగలో వెళ్ళి రాముని పాదాలమీద వాలాడు.

‘స్వామీ! మీకేమైంది?’ రాముని పాదాలను ఆంజనేయుని ఆశ్రువులు అభిషేకించాయి.

రాముడు రెండు చేతులతో ఆంజనేయుణ్ణి పైకి లేవదీసి, ‘నాకేమి కాలేదయ్యా హనుమా! నేను బాగానే ఉన్నానూ అన్నాడు నవ్వుతూ.

ఆశ్చర్యం! రాముని ఆవులింతలు ఆగిపోయాయి. రాజవైద్యుడితో సహా అక్కడున్న వారందరూ ఆశ్చర్య పోయారు. ఆశ్చర్యపోనివారు ఇద్దరే…లక్ష్మణస్వామి, సీతమ్మ!

కాని సీతమ్మలో అపరాధ భావన. ‘ఆంజనేయుడు మరి ఆర్యపుత్రుల వారి ప్రాణం కదా! ఆ ప్రాణాన్ని దూరం చేసి నేను నా రాముణ్ణి కష్టపెట్టానూ అనుకుంటూ పక్కకు తిరిగి కళ్ళు తుడుచుకుంది.

'ఓం నమో భగవతే వాసుదేవాయా’


“ఓం నమో భగవతే వాసుదేవాయ” మంత్రరాజంలో బీజాక్షరాలు 12. ఒక్కొక్క బీజాక్షరం 12 మాసాలకు, 12 రాశి చక్రాలకు ప్రతీక.
బీజాక్షరం రాశి అవయవ పాలన


ఓం  మేషం  శిరస్సు
వౄషభం  ముఖం
మో  మిధునం  కంఠం, బాహువులు
 కర్కాటకం  ఊరస్సురో భాతి
 సింహం  హౄదయం
 కన్య  బొడ్దు
తే తుల  పొట్ట
వా వౄశ్చికం జననేంద్రియాలు
సు ధనస్సు వెన్ను, తొడ
దే మకరం మోకాళ్ళు
వా కుంభం కింది కాళ్ళు
మీనం పాదాలు

హనుమంతుడి సందేశం


హనుమంతుడంటే ఒక అంకితభావం. బుద్ధిబలం, స్థిరమైన కీర్తి, నిర్భయత్వం, వాక్ నైపుణ్యం – వీతన్నింటి సమ్మేళనం. అంటే ఈ లక్షణాలన్నింటికీ అసలైన సిసలైన ఉదాహరణ హనుమంతుడు అని భావం.
సముద్రంలో నూరు యొజనాల దూరాన్ని ఒక గోవు గిట్ట చేసిన గుంటలోని నీళ్లను దాటినట్లుగా దాటడం, విశ్వవిజేతలైన రాక్షస వీరుల నేకులను దోమల్లాగ నలిపి వేయటం, బంగారు మేడల లంకా నగరాన్ని తన తోకకున్న మంటతో భస్మీపటనం చేయటం – ఇవన్నీ హనుమంతుడి వీరత్వాన్ని లోకానికి తెలియజేసిన అనేక సంఘటనల్లో కొన్ని మాత్రమే.

హనుమంతుడు సాటిలేని బలం కలవాడు, మేరు పర్వతం లాంటి శరీరం కలవాడు, రాక్షసజాతి అనే కారడవిని కాల్చివేసిన కారు చిచ్చులాంటి వాడు అంటూ ఇంతా చెబితే – సముద్రమంత ఉన్న అతడి శక్తిలో నీటిబొట్టంత చెప్పినట్లు లెక్క. సముద్రాన్ని దాటడానికి లేచిన హనుమంతుడు అంగదాది వీరులతో ‘నేను లంకా నగరానికి వెళుతున్నాను. ఎప్పటికి తిరిగి వస్తానో చెప్పలేను గానీ, సీతమ్మ జాడను కేవలం తెలుసుకోవటం కాదు – ఆ తల్లిని చూసే వస్తాను. ఇది థత్యం. నా రాక కోసం ఎదురుచూస్తూ ఉండండీ అన్నాడు. కర్తవ్య నిర్వహణ కోసం వెళుతున్న ఏ ఉద్యోగికైనా, ఏ వ్యక్తికైనా ఉండవలసిన మొట్టమొదటి లక్షణమిదే! ఆత్మ ప్రత్యయం. ఆత్మ విశ్వాసం. ఇదే విజయానికి తొలి మెట్టు. ఇదే హనుమంతుడు మనకిస్తున్న సందేశం.
‘నీ వెవరివీ అని ఎవరైనా అడిగితే హనుమంటుడు తన గురించి తాను చెప్పుకొనే మొదటి మాట – ‘నేను కోసలేద్రుడి దాసుడినీ. కొంచెం వివరంగా చెప్పమంటే ‘ఎంత అసాధ్యమైన కార్యాన్నయినా అనాయసంగా నెరవేర్చగలిగిన శ్రీరామచంద్రుడి సేవకుడినీ అంటాడు. మనం మన సంస్థ తరపున మరోక సంస్థకు వెళ్ళినపుడు మనల్ని పరిచయం చేసుకోవలసిన విధానమిదే! ‘నేను ఈ విధమైన ప్రశస్తి కలిగిన ఈ సంస్థకు సంబంధిచిన ఉద్యోగిని. నా పేరు ఫలానా….’ మన వలన సంస్థకూ, సంస్థ వలన మనకూ కీర్తి రావటమంటే ఇదే! ఇదే హనుమంతుడు మనకిస్తున్న సందేశం.

‘వినయం వల్లనే వ్యక్తిత్వం రాణిస్తుందీ అనేదానికి హనుమంతుడే నిదర్శనం. ఆయన సముద్రాన్ని దాటి ‘అబ్బా! ఇది సామాన్యమైన పని ఏమి కాదూ. మాలో ఏ నలుగురో ఆయిదుగురో దీనికి సమర్ధులు అంటూ సుగ్రీవుడి పేరు, మరొక ఇద్దరు ముగ్గిరి పేర్లు చెప్పి, చిట్టచివరనే తన పేరుని చెప్పుకొన్నాడు. మనకంటే పెద్దవాళ్ళు మన బౄందంలో ఉన్నప్పుడు మనం ఎంత గొప్పవాళ్ళమైనా వారి పేర్ల తరవాతే మన పేరు చెప్పుకోవటమే బెట్టుగా ఉంటుంది. ఇదే హనుమంతుడు మనకిచ్చిన సందేశం. మనకన్న అధికులముందు అణిగిమణిగి ఉండటం మనకు అవమానమేమి కారు. ఆ ఆణుకువ వలన ఒక పని సానుకూల మయ్యేట్లుగా ఉన్నట్లయితే, ఆ ఆణుకువ అవసరం కూడా! ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించినప్పుడు హనుమంతుడు రెండు చేతులూ జోడించి శిరస్సును వంచి దానికి నమస్కరించాడు. ఆ బంధానికి కట్టుబడ్డాడు. ఒక్క విదిలింపు విదిలిస్తే ఆ బంధం వీడిపోతుంది. కానీ ఆయన దానికి కట్టుబడే ఉన్నాడు ఎందుకూ అంటే – ఆ ఇంద్రజిత్తు స్వయంగా తనను రావణుడి వద్దకు తీసుకొని వెళతాడు కనుక. రావణుడిని వెతికే శ్రమ తనకు తప్పుతుంది కనుక. ‘పెద్దల మాటకు బద్ధులుకండి. మన గౌరవానికేమి హాని ఉండదూ. ఇదే హనుమంతుడు మనకిచ్చిన సందేశం.
ఈ సందేశాల్ని అర్థం చేసుకొని, మన అనుదిన జీవితంలో ఆచరిద్దాం.

దైవ కౄపకుపకరించే మార్గాలు!

ప్రార్థన, పూజ అనేవి నేడు హిందూ మతంతో అభిన్నమై పోయాయి. ధ్యానం ద్వారా భగవంతునితో తాదాత్మ్యం చెందడం ఆధ్యాత్మిక జీవితంలో అత్యున్నత అనుభూతిగా పరిగణింపబడుచున్నది. తీవ్రసాధనలు, కఠోర తపస్సు, భగవత్కౄప – వీటి ద్వారా ఈ అనుభూతి కలుగుతుంది. ఏ ఒకరిద్దరు సాధకులు మాత్రమే తిన్నగా ఈ స్థితికి అర్హులై ఉంటారు. అత్యధికశాతమంది ప్రారంభనుండే క్రమేపి వెళ్లవలసినవారై ఉంటారు. ఇటువంటి ప్రారంభ సాధనే ప్రార్థన.

ఈ ప్రపంచమూ, దానొలోని వస్తువులూ మనకు వాస్తవంగా ద్యోతకమవడం సహజం. కాని, ప్రాపంచిక వాస్తవికత కంటే ఉన్నతమైన సత్యం మరొకటి ఉన్నదని, ఆ సత్యమే ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నదనీ జీవితానుభవాలు మనకు తెలియచేస్తాయి. ఆ సత్యవస్తువైన భగవంతునితో అనుసంధానము ఏర్పరచుకోవాలని భావించడం సహజం. స్పష్టంగా కాకపోయినా ఏదో అస్పష్టమాత్రంగా గ్రహించిన ఆ భగవంతుని వైపుగా చేతులు జోడిస్తాడు మానవుడు. తనకు మార్గం చూపమనీ, ఆ పరిపూర్ణ స్త్యస్వరూపమైన భగవంతుని మన స్ఫూర్తిగా వేడుకొంటాడు. ఇదే ప్రార్థన.

ప్రార్థన విధములు, అనేకములు ఉండవచ్చు. మనిషి మనిషికి మారవచ్చు. కాని, దాని ముఖ్యోద్దేశం అందరికీ ఒకటే. ఒక జీవికి భగవంతునికి మధ్య ప్రత్యేకమైన బాంధవ్యమును పెంపొందించటానికి పనిసి వచ్చే సాధనమే ప్రార్థన. అంటే సౄష్టికి, సౄష్టికర్తకు మధ్యవుండే బంధాన్ని బలపరిచేదే ప్రార్థన.

సాధారణంగా దేనినైనా స్వీకరించే స్థితిలో ఉండటం మనస్సు ప్రవౄత్తి. అందుచేతనే ఆధ్యాత్మిక జీవితంలో తొలిమెట్టు ప్రార్థన. ఈ ప్రార్థనా ఫలితంగా భగవంతుని అనుగ్రహజనితవీక్షణం, విశ్వాసం, ప్రేమ, బలిమి రూపాలలో ప్రసరించిమన మనస్సును నింపుతుంది. మొత్తానికి ప్రార్థన మనిషికి ఆధ్యాత్మిక జ్ణ్జానమును పొందుటకు కావలసిన మనో వికాసమును కలుగజేస్తుంది.

ప్రార్థన చేయు విధానములు

ప్రార్థనను మూడు విధాల ఆచరించవచ్చు. అవి కాయిక, వాచిక, మానసలుగా పేర్కొనవచ్చు.

ఆచారకర్మ లేక ఒక పూజను చేయడం కాయిక పూజ కిందికి వస్తుంది. భగవంతుని పొగుడుతూ పాడుత, వేదములలోని ధ్యాన శ్లోకములను పఠించుట, భక్తి గీతములను పాడుత – వాచిక ప్రార్థన అనబడును. నిశ్శబ్దముగా మనసులో భగవంతుని ధ్యానము చేసుకొనుట మానస ప్రార్థనగా పేర్కొనవచ్చు.

ప్రార్థనవల్ల కలిగే ఫలితములు

ప్రతి పనికి ఫలమున్నట్లే ప్రార్ధనవలన కూడా మనిషికి ఫలితము దక్కుతుంది. ఇది రెండు విధాలుగా ఉండును. ఒకటి దౄష్టఫలం (కనిపించునది) రెండవది అదౄష్టఫలం (కంటికి కనిపించనిది)

దృష్టఫలం

ప్రార్థన చేయుట వలన మునుముందుగా మనిషి కలిగే ప్రయోజనమేమనగా తన శక్తి సామర్ఘ్యములు పరిమితిగలవని, అందరికన్నా బలవంతుడు పైనున్న భగవంతుడని ఒప్పుకోవడం వల్ల వచ్చే ఉపశమనము. పరిస్థితులు మన అదుపులో లేనప్పుడు జగద్రక్షకుడైన పరమేశ్వరుని పార్థించి, ఆయన దయకే మన కర్మఫలాన్ని వదలి వేసినప్పుడు మనకు ఆదుర్దా తగ్గి మనశ్శాంతి కలుగుతుంది.

అదృష్ట ఫలము

దైవప్రార్థన వలన మనకంటికి కనబడకుండా వచ్చే ఫలితాన్ని పుణ్యమంటారు. ఇహమునందును పరమునందును కలిగే సుఖము మనిషి చేసుకొన్న పుణ్యము మీద ఆధారపడి ఉండును.

ప్రార్థన యొక్క పరమార్థం

మనవులు వేరువేరు ఉద్దేశములతో, ఆశయములతో దైవ  ప్రార్థన చేస్తుంటారు. శ్రీ కౄష్ణ భగవానుడు భగవద్గీతలో భక్తులను నాలుగు విధాలుగా పేర్కొన్నాడు. మొదటి రకం భక్తుని ఆర్త అని పిలుస్తారు. ఈ వ్యక్తి తను కష్టములలోనున్నపుడు, క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నపుడు భగవంతుని జ్ణ్జాపకము తెచ్చుకొనును. పరిస్థితులు తనుకు అనుకూలముగానున్నపుడు దానికంతకు కారణము తనే అని భావించును. రెండవ రకము భక్తుని ఆర్దార్థి అంటారు. ఇతడు ఆధ్యాత్మిక చింతన కలిగి తన జీవితము మీద భగవంతుడు దయచూపుతున్నడన్న విషయమును గ్రహించియుండును. కాని, ఇతదు తన స్వప్రయోజనము ఆశించే దైవప్రార్థన చేయును.

ఆర్థార్థి దౄష్టి ఎప్పుడు ఇహసుఖములమీద, భౌతిక సంపదలమీదే ఉండును. ఆర్త భక్తుని వలె ఆర్థార్థి భక్తుడు కూడా కష్టములనుండి విముక్తి కలిగించుటకే దైవప్రార్థన చేయును. మూడవ రకము భక్తుని జిజ్ణ్జాసుడంటారు. ఇతడు మోక్షమును పొందుటకు, జీవితము లోని అశుభములను పారద్రోలుటకు జ్ణ్జాన సంపాదన చేయును. మోక్షము సంపాదించుట అందరి జీవితాశయమైనప్పటికి, ఒక్క జిజ్ణ్జాసు మాత్రమే జ్ణ్జాన సంపాదన వలనే మోక్షము లభించునన్న సత్యము గ్రహించి దానికై పాటుపడును. అతని ప్రార్థన – జ్ణ్జానము సంపాదించుటకు కావలసిన బుద్ధికుశలత, మనోవికాసము తనకు కలుగచేయమని వెడుకొనుత. నాలుగవ రకం భక్తుడు జ్ణ్జాని. ఇతడు తనయందే భగవంతున్నాడని తలచును. తనకు భగవంతుని భేదములేదని తలచును. జ్ణ్జాని చేసే ప్రార్థన  సర్వోత్తమమైనది. అది జ్ణ్జానమును విశదీకరించు సాధన.

పూజ

ప్రార్థన మూలంగా మనం భగవంతుని నుండి అనేకములు పొందుతాం. అందుచేత పరిపక్వత చెందిన మనస్సుతో భగవంతునికి కొన్నిటికి సమర్పిస్తాం. ఇలా వచ్చి పుచ్చుకోవడాలు కొనసాగుతున్నపుడు, మనం క్రమక్రమంగా భగవంతుని సమీపిస్తాం.  ధ్యాన స్థితి నెలకొంటుంది. ధ్యానస్థితిని ఉపాసన అని పేర్కొంటారు. ఉపాసన (ఉప ఆసన) అంటే దగ్గరగా ఉండడం. భగవంతునికి దగ్గరగా ఉండడమన్నమాట.

అర్హులైన కొందరి జీవితంలో ప్రార్థనే ధ్యానంగా రూపాంతరం చెందడం కద్దు. కాని, అనేకులకు ప్రార్థనకు, ధ్యానానికి నడుమ ఒక మెట్టు ఆవశ్యకమవుతుంది. అదే పూజ. ఈ విధంగా పూజ మానవుణ్ణి భగవంతుని దగ్గరకు తీసుకొని పోతుంది. భగవద్దర్శనం కలిగిస్తుంది.
పూజకు మూలాధారమైనవి:

1. త్యాగం: దైవం నిమిత్తం ఒక వస్తువును త్యాగం చేయడం, అంటే సమర్పించడం పూజ.

అది ఒక పుష్పమే కావచ్చు.  పదార్థమే కావచ్చు. మనస్సే కావచ్చు, పనియే కావచ్చు. ఎలాటిదైనా దానిని త్యాగభావంతో సమర్పించాలి. ప్రార్థనద్వారా పరిపక్వత సంతరించుకొన్న మనస్సుతో సమర్పించాలి. పత్రం, పుష్పం, ఫలం< తోయం – వీటిలో వేటినైనా స్వీకరిస్తానని భగవద్గీతలో భగవానుడు తెలిపే ఉన్నాడు. కాని దాన్ని సభక్తికంగా సమర్పించాలని ఆయన వక్కాణించాడు.

2. పవిత్రత: హిందూమతం మూడు రకాల పవిత్రతను ప్రస్తావిస్తుంది.

మొదటిది అధి భౌతికం: భౌతిక స్థితిలో అంటే బాహ్యమైన పవిత్రత. పూజాద్రవ్యాలన్నిటిని మంత్రోచ్ఛారణ చేస్తూ నీటితో శుభ్రపరచడమే ఇది.

రెండవది అధి దైవతం: ఒక్కో వస్తువుకూ, శరీరంలోని ఒక్కో అంగానికి ఒక దివ్యరూపం ఉంటుంది. అవి ఒక్కోదేవత అధీనంలో ఉంటాయి. ఈ దేవతను అధిష్టానదేవతగా పేర్కొంటారు. ఈ దెవతలను గంట, దీపం, శంఖం, పువ్వులు, నీరు ఇత్యాదులతో ఆవాహన చేయడం వల్ల ఆ వస్తువులు పవిత్రీకరింప బడతాయి.
మూడవది ఆధ్యాత్మికం:- మానవ ఆత్మ శాశ్వతంగా పవిత్రమైనది. స్వయంప్రకాశమైనది. పాపం, అపవిత్రతలు మనస్సుకే వర్ణిస్తాయి. అందుచేత మనస్సున పవిత్రీకరించడం మూలంగా ఆత్మ తన స్వాభావిక ప్రకాశాన్ని, వైభవాన్ని అభివ్యక్తీకరిస్తుంది.

నాలుగవై దివ్యబంధం:- పూజించే వ్యక్తికి, ఇష్టదైవానికి మధ్య ఒక బంధం నెలకొనాలి. పూజించే విగ్రహంలో భగవంతుడు నెలకొని ఉన్నట్లు భావించాలి. అక్కడ నెలకొని ఉన్న ఆయనతో పూజించే వ్యక్తి ఎడతెగని బంధాన్ని ప్రేమబంధాన్ని ఏర్పరచుకోవాలి.

పూజాక్రియ:- వేదకాలంలో ప్రార్థనల ద్వారా, యజ్ణ్జాలద్వారా దైవంతో అనుసంధానం ఏర్పరచుకొన్నారు. తదనంతర కాలంలో అది పూజగా రూపుదిద్దుకొని పెంపొందింది.

సామన్యంగా దైనందిన పూజలో ఆరుమెట్లున్నాయి. అవి 1. ఆయత్తం (పూర్వాంగం), 2. పవిత్రీకరణ (శుద్ధి), 3. తనను దివ్యునిగా చేసుకోవడం (భూరుశుద్ధి), 4. దైవాన్ని ఆవాహన చేయడం (ఆవాహన), 5. సేవ (ఉపహారం) 6. ముగింపు (పుష్పాంజలి). ఇవేకాక ప్రసాదం, హారతి కూడా పుజాకార్యక్రమంలో భాగమై ఉన్నాయి.

ప్రసాదం: పూజలలో అభిషేకింపబడిన, నివేదింపబడినవన్నీ తుదకు ప్రసాదంగా పంచిపెట్టబడతాయి. ప్రసాదం మన దేహాలను పవిత్రీకరిస్తుందని విశ్వాసం. అదేకాక ప్రసాదం అనే సంస్కౄత పదానికి అనుగ్రహం అని అర్థం. అందుచేత ప్రసాదం పుచ్చుకోవడం భగవంతుని అనుగ్రహం పొందడమవుతుంది.

ఆరాత్రికం (ఆరతి): ధూపం, దీపం ఇత్యాదులను దైవ సమక్షంలో చూపించే క్రియ ఇది. ఈ సమయంలో విగ్రహంలో దైవం ఉనికి విశిష్టంగా అభివ్యక్తీకరణ చేసుకుంటుందని భక్తుల విశ్వాసం. సామన్యంగా ఆరతి సమయంలో గంట, శంఖం వంటి వాటిద్వారా నాదం వెలువరింప చేస్తారు. అందువల్ల ఆ వేళలో మనస్సు ఏకాగ్రమై దైవచింతనకు దోహదం చేస్తోంది.

‘హారతి ఇతి హారతీ – దౄష్టిదోషాన్ని హరించేది హారతి. అందుకే దాన్ని నీరాజనం అని కూడా అంటారు. దేవుడిపైన దర్శించాడానికి వచ్చిన ఎంతోమంది దౄష్టి పడుతుంది. ఆ దౄష్టి దోషం తొలగడానికి అర్చకులు హారతి  ఇచ్చి, భక్తులందరికీ చూపెడతారు. అప్పుడు అక్కడ ఉన్న భక్తులందరూ ఆ హారతికి దణ్ణం పెట్టుకోవాలి భక్తిగా. చిన్నపిల్లలకు, శుభ కార్యాల్లోనూ హారతితో దిష్టితీసి పెరట్లో ఓ మూల పడేస్తారు. అలాగే దేవుడికి మంగళం కలగాలని హారతి ఇచ్చి, శ్లోకాలు చదివి, ఆ హారతిని ఒక పక్కన పెడతారు. ఇది సరైన పద్ధతి.
దీపారాధన

దీపంజ్యోతి: పరబ్రహ్మ దీప: సర్వతమోపహ:!!
దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపో నమోస్తుతే!!

దీపంజ్యోతిపరబ్రహ్మ తత్వాన్ని తెలుపుతుంది. అజ్ణ్జానాంధకారాన్ని తొలగిస్తుంది.
దీపారాధన సంధ్యా సమయాలకే పరిమితమైన వ్యవహారం కాదు. నిత్య పూజలో, వైదిక కర్మల్లో, పండుగల్లో వ్రతాల్లో, చివరకు ప్రారంభోత్సవాది సాంఘిక కార్యకలాపాలన్నింటిలో దీప ప్రజ్ణ్జ్వలన ప్రప్రథమ అంశం. ఏ పూజ చేసినా, ఏ వ్రతం ఆచరించినా దీపారాధన చేయకుండా మొదలు పెట్టరు.
మన పెద్దలు దైవకౄపకు ఇలాంటి పద్ధతులను చెప్పారు.

Monday, July 16, 2012

అసలు దేవాలయం అంటే ఏమిటి?

హిందూధర్మంలో దేవాలయాలకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. అసలు ఈ దేవాలయమంటె ఏమిటి? ఈ దేవలయాలు ఎందుకు? అన్న ప్రశ్నలు తలెత్తినప్పుడు, ‘దేవానాం దేవస్య వా ఆలయా అని సమధానమిచ్చారు మన ఋషిపుంగవులు. దేవాలయం ప్రార్థన కోసం, పూజ కోసం, దేవతావిగ్రహాలను, ఇతర ఆరాధ్య వస్తువులను ప్రతిష్టించి, వాటి రక్షణకోసం కట్టించిన కట్టడమే దేవాలయమని అన్నారు. అందుకే మనవాళ్ళూ దేవలయాన్ని సప్తసంతానాలలో ఒకటిగా పేర్కొన్నారు. కొడుకు లేక కూతురు, తటాకం, కావ్యం, విధానం, ఆలయం, వనం, భూదేవస్థాపనం అనేవి సప్తసంతానాలుగా చెప్పబడ్డాయి. దేవాలయన్ని దేవగృహం, దేవగార, దేవాయతనం, దేవకులం, మందిరం, భవనం, స్థానం, దేవస్థానం, వెష్మం, కీర్తనం, హర్మ్యం, విహారం అని, విమానం, ప్రాసాదం అని పిలవడం జరుగుతోంది.

మన సంస్కృతి, కళలు, శిల్పం, వాస్తు, వేదాంతం పురాణం మొదలైన వాటి సంగమ స్థానం హిందు దేవాలయం.

పరిపూర్ణమైన, సుందరమైన ఆలయమంటె మానవశరీరం. ఇక్కడ “తత్” (ఆత్మ) ఇల్లు చేసుకొని జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, పంచభూతాలు, పంచప్రాణాలు, పంచవిషయాలు అంతరంగ వృత్తులు (అంత: కరణ, మనస్సు, చిత్త, బుద్ధి, అహంకారాలు) తమ క్రియలను నిర్వహించడానికి అవకాశాన్ని కల్పించి ఇచ్చింది.

దేహమే దేవాలయం. దేహంలో ఉన్న జీవమే పరమత్మ. జీవాత్మ పరమాత్మకంటె వేరన్న అజ్ఞానమే నిర్మాల్యం; నేనే అతనని పూజించలి అని అగమాలు ఘోషిస్తాయి. దేవాలయం ఒక దేహం లాంటిది. శిఖరం శిరస్సు; గర్భగృహం మెడ, ముందరి మంటపం ఉదరం; ప్రాకారపు గోడలు కాళ్ళూ; గోపురం పాదాలు; ధ్వజ స్తంభమే జీవితం. ఇలా ఆలయం భగవన్మూర్తిగా భావింపబడుతోంది. అందువల్లనే దేవలయాన్ని పవిత్రంగా భావిస్తున్నాము. ఆ స్థలాన్ని పుణ్యక్షేత్రంగా పరిగణిస్తున్నము. అక్కడే మనం విశ్వసిస్తున్నాము.

దేవాలయ ప్రాచీనత

భగవంతుడు లేకుండా మానవుడు జీవించలేడననీ, శివుని అజ్ఞ లేనిదే చీమైనాకుట్టందనీ, అందుకనే భగవన్మూర్తిని ఒకచోట ప్రతిష్ఠించి ఆరాధిస్తున్నాము. భగవత్సాక్షాత్కారం కోసమే ప్రతి హిందువు తపన పడతాడు. ప్రయత్నిస్తాడు. అదే పవిత్ర స్థలం. అదే దేవాలయం. ఇది భౌతిక శరీరం (ఫిజికల్ బాడీ) మానసిక శరీరం (సైకిక్ బాడీ), తైజసిక శరీరాలను (సూపర్ కాన్ షియస్ బాడీ) ప్రతిబింబిచే ఒక ప్రతీక. అందువల్లనే దేవాలయం భగవంతుడికి మానవుడికి ఉన్న ఒక కొక్కీ (లింక్) అని విజ్ఞుల  అభిప్రాయం. దేవాలయ నిర్మాణం ఎప్పుడు, ఎక్కడ ఆరంభింపబడిందో చెప్పడం కష్టం. వేదకాలాల్లో దేవాలయాలు లేవనీ, విగ్రహారాధనా పద్ధతి, దేవాలయాల నిర్మాణం వెదకాలపు చివరిదశలో, రామాయణ, మహాభారత కాలల్లో ఆరంభమైందనీ, వేదకాలపు యాగశాలలే కాలక్రంగా దేవాలయాలుగా రూపొందాయని పలువురి అభిప్రాయం.

‘దేవాలయాలు వైదికయుగంలో నిర్మితములైనట్లు కనబడదు. దేవతా స్వరూపము, దేవతల వాహనములు, ప్రతిమా వర్ణనము మొదలైన విషయములకు సంబంధించిన వాక్యములు వేదములందు కొన్ని గలపు గాని, విగ్రహారాధన ఆచరణ లోనికి వచ్చిన తర్వాత గాని, దేవాలయ నిర్మాణమునకు అవకాశముండదు. విగ్రహారాధన ఏర్పడిన వెంటనే దేవాలయ నిర్మాణము సైతము ప్రారంభింపబడినది. బ్రహ్మస్వరూపమైన ఆత్మకు దేహము నిలయమైనట్లుగా, దేవతా విగ్రహానికి దేవాలయం నిలయముగా భావించి, దేవాలయ నిర్మాణము శరీర నిర్మణము ననుసరించి కావించినారు.

దేవాలయ వాస్తు

దేవాలయాలను మనం రెండువర్గాలుగా విభజించుకోవచ్చు. 1.గ్రామదేవతాలయలు 2.శిష్టదేవతాలయాలు. మొదటివర్గం గ్రామరక్షణ కోసం తరతరాలుగా గ్రామసంస్కృతిలో నిలద్రొక్కుకున్న ఎల్లమ్మ, మారమ్మ, పోచమ్మ, మైసమ్మ మొదలైన దేవతల చిన్న చిన్న గుడులు. గ్రామదేవతలలో అధికం స్త్రిలే . ఒక విధంగా వీరు శక్తిదేవతలు. ఈ దేవలయాల్లో చెప్పుకోదగ్గ వాస్తుశిల్పం కనపడదు. ఆలయాలు సాధారనంగా ఉంటాయి. ఇక రెండవవర్గం బ్రహ్మ, విష్ణు, శివ, విఘ్నేశ్వర మొదలైన శిష్టదేవతలు లేక నాగరీక దేవతల ఆలయాలు, ఈ దేవతలను పూజించేవాళ్ళు సామన్యంగా బ్రహ్మణులు. అగమాలలో చెప్పిన రీతిగా ఈ దేవతలకు షోడశోపచారాలు, చతుష్పష్టి ఉపచారాలు జరుగుతాయి.

శిష్టదేవాలయాలు వాస్తు శాస్త్రానుగుణంగా నిర్మించబడ్డాయి. గృహ, గ్రామ, నగర, దేవాయతన, ప్రాసాద, దుర్గ, ఆరామ, తటాక, సేతుబంధ ఇత్యాది నిర్మాణ లక్షణాలను తెలిపే శిల్పశాస్త్రమే వాస్తుశాస్త్రం. ఈ వాస్తు సంప్రదాయం ఆగమాల మీద ఆధార పడింది, ఆగమాలలో దేవాలయ నిర్మాణం, ఉత్సవాలు పేర్కొనబడ్డాయి, కామిక, కారణ ఆగమాలలో నియమ నిబంధనలు చెప్పబడ్డాయి. వాస్తుశాస్త్రం త్రిమూర్తుల నుండి ఇంద్ర, బృహస్పతి, నారదులకు అనుగ్రహింపబడిందనీ, వాళ్ళ ద్వారా అనేక ఋషులకు సంక్రమించిదని అంటారు. పురాతన పట్టణాలు, కట్టడాలు వాస్తు శాస్త్రానుగుణంగా నిర్మింప బడుతుండేవి.

వేదకాలంలో యజ్ఞాలకోసం శాలలను, వేదికలను, ఇటుక, కొయ్య, వెదురులతో నిర్మించేవారు. ఇవన్నీ శిల్పసూత్రాన్ని అనుసరించే నిర్మింపబడుతుండెవి. అవే భారతఖండ వాస్తువిద్యకు మూలరూపాలని కొంతమంది అభిప్రాయం. ఆర్యులు ఆర్యావర్తం ప్రవేశించడానికి మిందే ఈ దేశంలో నెలకొన్న ద్రావిడులు అనేక శతాబ్దాలుగా తమదే అయిన ఒక సంస్కృతిని పెంపొందించుకొంటూ వచ్చారనీ, ఆర్యులు వాళ్ళనుంచి వాస్తువిద్యను నేర్చుకొన్నారనీ కొంతమంది అభిప్రాయం. మొదట్లోవెదురుచే నిర్మింపబడి, అనంతరం కొయ్యలతో కట్టడాలు నిర్మంపబడి ఉందవచ్చు. ఆ తర్వాత మన్ను, ఇటుకలతో నిర్మింపబడి క్రీ.శ 4వ శతాబ్ది తర్వాత విడివిడి రాళ్ళతో గృహాలు, దేవాలయాలు నిర్మింపబడడం మొదలయ్యాయి. ఇటుకలు, రాళ్ల పురాతన కట్టడ అవశేషాలు ఇప్పటికీ నిలిచి ఉన్నాయి. వాస్తుకళ క్రమేపి ఏ విధంగా వృద్ధి చెందిందో ఇవి చూపెడతాయి.

ఆధునిక విద్వాంసులు ఉత్తర హిందూస్థానపు దేవాలయ రీతిని “ఇండోఆర్యన్” శైలి అనీ, దక్షిణ హిందూస్థానపు రీతిని “ద్రావిడశైలి” అని అంటారు. వాస్తు శైలి దృష్టిచే ద్రావిడ వాస్తురీతి వికాసాన్ని ఐదు కాలాలుగా విభజించడం జరిగింది.

1. పల్లవుల కాలం క్రీ.శ. 600-900
2. చోళుల కాలం క్రీ.శ. 900-1150
3. పాండ్యుల కాలం క్రీ.శ. 1150-1350
4. విజయనగర కాలం క్రీ.శ.1350-1565
5. ఆధునిక కాలం క్రీ.శ. 1600 – ….. (నాయక) పైన పేర్కొనబడ్డ ఐదు ప్రధాన రాజవంశాలు దక్షిణ దేవాలయ వాస్తు పరిణామానికి తోడ్పడ్దాయి.

భారతదేశంలోని దేవాలయాలను, వాటి రచనా శైలికి అనుగుణంగా మూడు విధాలుగా వర్గ్రీకరించారు. 1.గర్భగృహం మీదున్న గోపురం ఎత్తుగా ఉంది. వక్రరేఖాకృతిలో ఉన్న “నాగర” శైలి. ఇటువంటి దేవాలయాలు క్రింద నుండి శిఖరం దాకా చతురస్రాకారంలో ఉంటాయి. ఇది ఉత్త్ర భారదేశంలోని దేవలయాల్లో గమనింపవచ్చు. 2. గర్భగృహమ్మీది గోపురం భిన్నాగ్ర పిరమిడ్ లో ఉన్నది. “ద్రావిడ” శైలి ఈ లక్షణం పల్లవులు, చోళులకు చెందిన దక్షిణ భారత దేవాలయాల్లో కనిపిస్తుంది. 3. ఈ రెండు లక్షణాలను లోనున్నది “వేసర” శైలి.

ఉత్తర హిందూ దేవాలయ వాస్తు సంప్రదాయంలోని ఆలయాలు లంబప్రవృద్ధి దేవాలయాలు, ఆలయ శిఖరాలు చాల ఎత్తులో నిర్మింపబడి ఉంటాయి. దక్షిణ హిందూ దేవాలయ వాస్తు సంప్రదాయంలోని ఆలయాలు ప్రస్తవిస్తరణ దేవాలయాలు. వీటినే ద్రావిడ పద్ధతికి చైందిన దేవాలయాలుగా పరిగణిస్తున్నాము. ఈ పద్ధతికి చైందిన ఆలయాలలో విస్తీర్ణ మెక్కువగా కనిపిస్తుంది. దీనికి ఉదాహరణలుగా శ్రీకాళహస్తి, మధుర దేవాలయాలను తీసుకోవచ్చు. సహస్ర స్తంభ మండపాలు, అనేక ప్రాకారాలు, దాదాపు 200 అడుగుల ఎత్తుండే గోపురాలు, 15-20 ఎకరాల విస్తీర్ణం ఆక్రమించిన అంగణాలు, విశాల కల్యాణ మంటపాలు ఇత్యాది ఈ ఆలయ లక్షణాలుగా కనిపిస్తాయి. ఆంధ్రదేశంలో చాళుక్యులు, కాకతీయులు, విజయనగర రాజ వంశాలవారు దేవాలయ నిర్మాణానికి విశేష కృషి గావించారు. వీరి వాస్తుశిల్పం, దేవాలయ నిర్మాణం, వీటికి నిదర్శనం నేటికి చెక్కు చెదరక నిలిచి ఉన్న దెవాలయాలు.

దేవాలయ నిర్మాణం

దేవాలయ నిర్మాణంలో మొట్టమొదటి అంశం ఆలయ నిర్మాణానికి భూమిని ఎన్నుకోవడం ఉంది. పవిత్రములైన దేవాలయాలు సాధారణంగా నదీతీరాల్లోకాని, నీటి బుగ్గలు ఉన్న పర్వతాగ్రాల మీద కానీ కట్టబడి వుండడాన్ని మనం గమనించవచ్చు. పుణ్యక్షేత్ర సమీపంలోను, నదీ తీరంలోను సముద్రతీరంలోను, నదీసంగమస్థానంలోను, పర్వతాగ్రంలోను, పర్వతపార్శ్వంలోను, వనంలోను, ఉపవనంలోను, ఉద్యానవనంలోను, సిధ్ధదుల ఆశ్రమంలోను, గొప్ప గ్రామంలోను, పురంలోను, పట్టణంలోను, రమ్య ప్రదేశాలలోను, దేవాలయాలను కట్టాడానుకి సంకల్పించాలట. ఈ ప్రదేశాలన్నీ ప్రకృతి పరిసరాలు, దేవాలయ నిర్మాణానికి అనువైన  ప్రదేశాలు. అందు వల్లనే బృహత్సంహీత ఇలా చెప్తుంది.

నదీ, శైల, నిర్ఘర, ప్రదేశాలలోని వనాల్లోను, పట్టన ఉద్యానవనాల్లోను, దేవతలు విహరిస్తారు. ఇవి భగవంతుడి వాసస్థానలే కాకుండా శుభం, శాంతిని కలిగించే ప్రదేశాలు.

అలాగే “శిల్పప్రకాశ” ఇలా పేర్కోన్నది.

- నదీ రహితమైన భూమి, పాషాణంతో కూడుకొన్న నేల దేవాలయ నిర్మాణానికి పనికిరావు. ఇసుకతో కూడుకొన్న భూమి అనువైనది, బురదగానున్న భూమిని, స్మశాన భూమిని పరిత్యజించాలి. దేవాలయ నిర్మాణానికి ఉపకరించే రాయి. రప్ప, శిల, లోహం ఇత్యాదులు మనుష్యరూపాన్ని నిర్మించే అస్తిపంజరాన్ని పోలి ఉంటాయి. ఈ శరీరానికెలా అలంకార ప్రాయంగా వస్థాభరణాలు అవసరమో, ఆలయానికి, విగ్రహానికి కూడ అలంకార ప్రాయమైన రచన అంతే అవసరం.

ఆలయానికి అనువైన ప్రదేశాన్ని ఎంపిక చేసుకొన్న తర్వాత ఆలయ నిర్మాణం ఆరంభమవుతుంది. దేవాలయ నిర్మాణంలో అతి ముఖ్యమైన అంశం వాస్తు పురుష మండలాన్ని రచించడం. వాస్తు పురుషుడి చిత్రాన్ని వ్రాసి పూజించడంవల్ల, ఆ పురుషుడు మరియు అతనితో ఉన్న దేవతలు అక్కడె నెలకొని ఆలయ నిర్మాణ కార్యాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తారట. భూమిని 81 లేక 64 చతురస్రాకార విభాగాలుగా విభజించి మధ్యలో స్తంభాన్ని కాని, అగ్నిని కాని స్తాపించి, పూజ చేస్తారు. మధ్యలో ఉన్న ఈ చదరాన్ని బ్రహ్మస్థాన మంటారు. ఒక్కొక్క చతురస్రాకార విభాగంలోను ఒక్కొక్క దేవతను ఆవాహన చేస్తారు. మధ్యనున్న చద రమే వాస్తు యొక్క కేంద్ర స్థానం. ఇక్కడే వాస్తు పురుషుడుంటాడు. వాస్తుపురుషమండలాన్ని స్థాపించిన తర్వాత “గర్భన్యాస” మనే విధిని మానవుల్లో “గర్భాదానా” నికి  సమానంగా పూర్వులు విధించారు. భూమాత – అనుగ్రహం కోసం ఈ కర్మను ఆచరిస్తారు. గర్భగృహ ద్వారం వచ్చే ప్రదేశానికి వెనుక నిర్దిష్టస్థానంలో 25 చతురస్రాకార పల్లలు (తగ్గులు) ఉన్న రాగిపాత్రలో వివిధ శాస్త్ర సమ్మతాలైన వస్తువులను నేలలో పుడ్చడమే గర్భన్యాస కర్మం. నిర్మాణానికి ఉపయోగపడే వస్తోపకరణాలకు పూజ జరిగిన అనంతరం నిర్మాణ కార్యక్రమం సాగుతుంది.

దేవాలయ ప్రధాన భగాలు

దేవాలయంలో ప్రధాన భాగం చతురస్రాకారంలో ఉన్న “గర్భ గృహం” లేదా “గర్భగుడి” ఇది దేవాలయానికి హృదయంలాంటిది. మనుష్య శరీరంలో ఆత్మ దాగి ఉన్నట్టుగాదేవాలయంలో భగవంతుదు కూడ మానవుడికి అత్యంత సులభంగా దృగ్గోచరం కాకుండేతట్టుగా “గర్భగృహం” లో ఆవాసస్థానం పొంది ఉన్నాడు. ఇదే “మూలవిగ్రహం” లేదా “మూలబేరం” అనబడుతోంది. గర్భగృహంలో ప్రవేశద్వారం తప్పితే మరి ఎలాంటి కిటికీలు కానీ ఉండవు. సాధారాణంగా చీకటి అలుముకొని ఉంటుంది. ఈ చీకటి భక్తుణ్ణి విగ్రహం మీదికి దృష్టిని కేంద్రికరింపచేస్తుంది. ఈ లోకాన్ని  మరచి తన్మయత్వాన్ని పొందుతాడు భక్తుడు. తనకు తెలీయనటువంటి అనుభూతిని పొందుతాడు. భక్తుడికి భగవదాకర్హణ, సంపర్కం, ఆశీస్సులు ఇక్కడే లభిస్తాయి. భక్తుడు తనలో దైవాన్ని, సత్యాన్ని చూస్తాడు.

గర్భగృహం పైభాగంలో గోపురం ఉంటుంది. దీన్నే విమానం అంటారు.. ఇదే దేవాలయ వైభవానికి నిదర్శనం. ఇది సాధారణంగా పోతపోసిన విగ్ర్హాలతో అలంకరించబడిఉంటుంది. విమానంమీద శిఖరం ఉంటుంది. శిఖ వున్నది శిఖరం. దాని మీద కలశం వుంటుంది. గర్భగృహంచుట్టు భక్తులు గుడి తిరగడానికి “ప్రదక్షిణాపథం” ఉంటుంది. వేసర పద్ధతిలో నిర్మించబడ్డ ఆలయాల్లో ఇది సాధారణంగా ఉండదని అంటారు.

గర్భగృహం ముందు భాగంలో “ముఖమంటపం” వుంటుంది. దీన్నే “అర్ధమంటపం” అని “శుకనాసి” అనీ అంటారు. ఇది చతుస్రాకారంలో కానీ, దీర్ఘ చతుస్రాకారంలో కానీ ఉండి ప్రక్కలలో గోపురం కానీ, శిఖరం కానీ కలిగి ఉంటుంది. గర్భగృహం ముఖమంటపాలను మహామంటపానికి (హాలు) కలిపే చిన్నమార్గాన్ని “అంతరాలం” అంటారు. కొన్ని ఆలయాల్లో ముఖమంటంపమే అంతరాళంగా ఉంతుంది. మహామంటపాన్ని “నృత్తమంటపం” లేదా “నవరంగ” అని కూడ అంటారు. అర్థ మంటపం ప్రవేశ ద్వారాల్లో ఇరువైపులా ద్వారపాలకులు ఉంటారు. గర్భగృహం లేదా అంతరాళం లేదా మంటపం ముందుభాగంలో ద్వజస్తంభం ఉంటుంది. దానిమీద వున్న లాంఛనం మూలదేవత వాహనం.

ద్వజస్తంభం సమీపంలో దేవుడి పాదచిహ్నం లేదా పద్మం వున్నబలిపీఠం ఉంటుంది. బలిపీఠమ్మీద పరివార దేవతలకు బలి అన్నం పెడతారు. బలిపీఠానికి ఎదురుగా దీపస్తంభం వుంటుంది.

సాధారణంగా, దేవాలయం ప్రాకారపు గోడలతో చుట్టబడి ఉంటుంది. దీనికి ప్రధానద్వారం, తక్కిన మూడు ద్వారాలు ఉంటాయి. ఈ ద్వరాలమీద ఆకాశాననంటే గోపురాలు ఆకర్షణీయంగా ఉంటాయి. ముఖ్యంగా ప్రాకారం మహద్వారం మీదన్న గోపురాలు అనేక అంతస్తులను కలిగి కళాత్మకంగా ఉంటాయి. కొన్ని దేవాలాయలో 2, 3, ప్రాకారాలు కూడా ఉంటాయి. ప్రాకారం లోపల ప్రధానాలయంతో పాటు మరికొన్ని చిన్న చిన్న మందిరాలు కూడ ఉంటాయి. కళ్యాణమంటపం, యోగశాల, పాకశాల, స్వామిపుష్కరిణి, ఉత్సవమూర్తుల నుంచే గది ఇత్యాదులు సర్వసాధారణంగా ఉంటాయి.

సాధారణంగా శివాలయం పట్టణానికి ఈశాన్య దిశలోను, విష్ణ్యాలయం పశ్చిమదిశలోను, సూర్యదేవాలయం తూర్పు దిక్కులోను, దుర్గ ఆలయాలు ఉత్తరదిశలోను, బ్రహ్మాలయం పట్టణ మధ్యభాగంలోను ఉండాలట.

సామాన్యంగా శివాలయాల్లో లింగమే మూలబేరంగా ఉంటుది. లింగం ఎత్తునుబట్టి శివాలయాలు ఉత్తమోత్తమ, ఉత్తమ, మధ్యమ మున్నగు విధాలుగా వర్గీకరించబడతాయి. గర్భగుడిలో లింగంతోపాటు ఇచ్చ, మరియు క్రియా అనే శక్తులు ఉంటాయి. ప్రవేశా ద్వారానికి ఇరువైపులా ద్వారపాలకులు ఉంటారు. వినాయకుడు, దక్షిణామూర్తి, విష్ణువు లేదా ఆర్థనారీశ్వరుడు, లింగోద్భవ, బ్రహ్మ, దుర్గ మరియు చండీశ్వరాలయాలు సాధారణంగా ప్రధాన ఆలయం చుట్టూ ఉంటాయి. రెండవ ప్రాకరంలో సూర్య, వినాయక, సుబ్రహ్మణ్య, గజలక్ష్మి మరియు భారతదేశం అంతటా ఇదంతా ఒకే లాగ ఉండదు. శైవాలయాల్లో గర్భగుడికి ముందు నంది విగ్రహం ఉంటుంది వైష్ణవాలయల్లో గర్భ గుడికి ముందు బలిపీఠం, ధ్వజస్థంభాలు కలిగిన గరుడ విగ్రహం ఉంటుంది. తక్కిన చిన్నచిన్న దేవుళ్ళ విగ్రహాలు, ఆలయాలు కూడా ఆలయప్రాంగణంలో ఉంటాయి. ప్రవేశ ద్వారానికి ఇరువైపులా ద్వారపాలకులు ఉంటారు. భక్తులు స్నానం చేయడానికి “తీర్థం” లేదా “పుష్కరిణి” ఆలయ సమీపంలో ఉంటుంది. ప్రసిధ్ధ పుణ్యక్షేత్రాలు, దేవాలయాల చెంత “పుణ్యతీర్థాలు” ఉంటాయి. దైవానికి కాక జలానికి ప్రాధాన్యం ఉన్న ప్రదేశాలను సాధారంగా “పుణ్యతీర్థా” అంటారు.

ప్రాచీన కాలంనుంచీ ఆంధ్రదేశం శిల్పకళకు, చిత్రకళకు, వాస్తుకళకు, పుణ్యక్షేత్రాలకు, ఇలా మన ఔన్నత్యాన్ని తెలుసుకోవడానికి నేడు మనకు ఉన్న పుణ్యక్షేత్రాలు – దేవస్థానాలు కూడ ఒక సాధనంగా ఉపకరిస్తున్నాయి. శిధిలప్రాయమయిన దేవలయాల్లో కూడ నేటికి పుజా పునస్కారాలు జరుగుతునే ఉన్నాయి. భగవంతుడి మీద ఉన్న భక్తి విశ్వాసాలు దీనికి ప్రత్యక్ష కారణాలైతే, నాటి విగ్రహ శిల్పసౌందర్యాన్నీ, దేవాలయ నిర్మాణాన్ని మట్టిపాలు చేసుకోలేక, నాటి ఆంద్రమహా వైభవాన్ని గుర్తుచేసుకొని వాటిని పునరుద్ధరించాలనే మహదాకాంక్ష ప్రరోక్ష కారాణంగా కనిపిస్తుంది.

ఎన్నో దేవాలయాలు పరమత ద్వేషం వల్ల మట్టిపాలయ్యాయి. పోయినవి పోగా ఉన్న వాటినైనా నిలుపుకొని వాటిని పునరుద్ధరించాల్సిన అవసరం ఎంతైనా వుంది. అది మనందరి కర్తవ్యం.

నేడున్న దేవాలయాలను దర్శంచి  మనంతా గర్వపడాలి. వీటి సందర్శనం పూర్వ జన్మ సుకృతమనే చెప్పాలి. అదొక మహాభాగ్యం అట్టి మహాద్భాగ్యం కోసమే మనం “తీర్థయాత్రలు” చేయాలి. ఇది ప్రతియొక్కరి ధర్మమని హిందువుల విశ్వాసం.

తీర్థ యాత్రలవల్ల ఆయాప్రాంతాల, అయా ప్రాంతాల జనుల పరిచయం ఏర్పడుతుంది. తద్వారా భావసమైక్యత, దేశ సమైక్యత ఏర్పడుతుంది.