Sunday, August 2, 2015

శ్రీ మహాభారతంలో కథలు - గాంధారి శాపం

కురు పాండవ యుద్ధంలో ధృతరాష్ట్ర పుత్రులు అందరూ హతమయ్యారు. ఐశ్వర్యం పోయింది. బంధువులంతా నాశనమయ్యారు. “ఇంత దారుణం జరిగినా చావురాలేదు నాకు” అని వాపోయాడు ధృతరాష్ట్రుడు.
వ్యాసమహాముని ధృతరాష్ట్రుణ్ణి ఓదారుస్తూ, “నాయనా! ఎవ్వరి ప్రాణాలూ శాశ్వతం కాదు. ఈ సత్యాన్ని మనస్సుకు బాగ పట్టించుకున్నావంటే ఇంక నీకే దుఃఖం వుండదు. ఇప్పుడు విచారిస్తున్నావు కాని , జూదమాడేనాడు విదురుడెంత చెప్పినా విన్నావా? దైవకృత్యాన్ని మనుషులు తప్పించగలరా?” అన్నాడు.
“రాజా! ఒకనాడు దేవసభకు వెళ్ళాను నేను. దేవతలతో, మహామునులతో మట్లాడుతున్న సమయంలో భూదేవి ఏడుస్తూ వచ్చిందక్కడికి.
‘నా భారం తొలగిస్తానని మీరంతా బ్రహ్మసభలో ప్రతిజ్ఞలు పలికారు. ఇప్పుడిలా ఎందుకు ఆలస్యం చేస్తున్నారో తెలీడం లేదు. ఇంక నా భారం తొలిగే మార్గమేమిటి?’ అని దేవతలను ప్రశ్నించిందామె.
‘ధృతరాష్ట్రుడనే రాజుకు నూరుగురు కొడుకులు పుడతారు. వాళ్ళలో పెద్దవాడైన దుర్యోధనుడి వల్ల నీ భారమంతా నశిస్తుంది. వాణ్ణి చంపడానికీ, రక్షించడానికీ ముందుకు వచ్చి భూమిమీద వున్న రాజులంతా సేనలతో సహా కురుక్షేత్రంలో హతులవుతారు. ఆ దుర్యోధనుడు కూడా తమ్ములతో పాటు మరణిస్తాడు. అంతటితో నీ భారం తీరిపోతుంది. వెళ్ళు! నిశ్చింతగా భూతధారణం చెయ్యి ‘ అన్నాడు నారాయణుడు చిరునవ్వుతో.
“విన్నావు కదా రాజా! మరి కౌరవులు నాశనమయ్యారంటే ఆశ్చర్యమేముంది! విధిని ఎవరు తప్పిస్తారు?”
ధృతరాష్ట్రుడు ధైర్యం తెచ్చుకుని గాంధారినీ, కుంతినీ, కోడళ్ళనూ వెంటపెట్టుకుని యుద్ధభూమికి బయలుదేరాడు.
పెదతండ్రి వస్తున్నాడని తెలిసి ధర్మనందనుడు ముందే అక్కడికి వెళ్ళాడు. అతని వెంట తమ్ములూ ద్రౌపదీ కృష్ణుడూ కూడా వున్నారు.
ధర్మరాజు కంటపడగానే ధృతరాష్ట్రుడి కోడళ్ళందరూ బిగ్గరగా ఏడ్చారు. దుఃఖంతో, అవేశంతో పేరుపేరునా పాండవులందర్నీ నిందించారు.
కళ్ళనీళ్ళు కారుస్తూ మౌనంగా తల వంచుకున్నాడు ధర్మరాజు. ధృతరాష్ట్రుడి పాదాలకు నమస్కరించాడు. తరువాత పాండవులు కృష్ణసహితంగా వెళ్ళి గాంధారికి నమస్కరించారు.
కోపంతో మండిపడిందామె.
“శత్రువుల్ని చంపొచ్చు. కాని ఈ గుడ్డివాళ్ళిద్దరికీ ఊతకర్రగా ఒక్కణ్ణయినా మిగల్చకుండా అందర్నీ నాశనం చేశారే! మీకు అపకారం చెయ్యనివాడు వందమందిలో ఒక్కడైనా లేకపోయాడా? ఒక్కణ్ణి అట్టేపెడితే మీ ప్రతిజ్ఞ భంగమౌతుందా? అ ఒక్కడూ మిమ్మల్ని రాజ్యం చెయ్యనివ్వకుండా అడ్డగిస్తాడా? ఇంతకూ ఏడీ మీ మహారాజు?” ఎర్రబడిన ముఖంతో ప్రశ్నించింది.
అజాతశత్రుడు మోకరిల్లాడు. గాంధారి తలవంచి దీర్ఘంగా నిట్టూర్చింది. నేత్రాలను బంధించిన వస్త్రం సందులోంచి ఆ మహాసాధ్వి దృష్టి లిప్తపాటు ధర్మరాజు కాలిగోళ్ళ మీద పడింది. ఆ గోళ్ళు వెంటనే ఎర్రగా కందిపోయాయి. అది చూసి హడలిపోయి కృష్ణుడి వెనకాల దాగాడు అర్జునుడు.
మహాజ్ఞానీ, సంయమనం కలదీ కనుక గాంధారి కోపాన్ని శమింప చేసుకుని “నాయనా! వెళ్ళి కుంతీదేవిని చూడండి” అంది.
కానీ ఇంతటికీ కారణమైన కృష్ణుడి పట్ల ఆమె క్రోధం కట్టలుతెంచుకుంది.
“వాసుదేవా! ఇలా రావయ్యా” అని పిలిచింది గాంధారి.
“కృష్ణా! కౌరవ పాండవ కుమారులు తమలో తాము కలహించుకున్నప్పుడు నువ్వు నచ్చచెప్పకపోయావు. కదన రంగాన కాలూనినప్పుడూ నువ్వు అడ్డుపడకపోయవు. సమర్ధుడవై వుండి కూడా ఉపేక్ష చేశావు. అందర్నీ చంపించావు. దేశాలన్నీ పాడుబెట్టావు. జనక్షయానికి కారకుడైన జనర్థనా! దీని ఫలం నువ్వు అనుభవించవలసిందే. నా పాతివ్రత్య పుణ్యఫల తపశ్శక్తితో పలుకుతున్నాను – నువ్వు వీళ్ళందర్నీ ఇలా చంపావు కనుక ఈనాటికి ముప్ఫై ఆరో సంవత్సరంలో నీ జ్ఞాతులు కూడా వీళ్ళలాగే పరస్పరం కలహించుకుని చస్తారు. అదే సమయాన నువ్వు దిక్కులేక నీచపు చావు చస్తావు. మీ కుల స్తీలు కూడా ఇలాగే అందర్నీ తలుచుకుని ఏడుస్తారు. ఇది ఇలాగే జరుగుగాక” అని శపించిండి గాంధారి.
సమ్మోహకరంగా చిరునవ్వు నవ్వాడు కృష్ణుడు.
“అమ్మా! ఈ శాపం యాదవులకు ఇదివరకే ఇచ్చారు కొందరు మునులు. నువ్విప్పుడు చర్చిత చర్వణం చేశావు. యదువంశీయులను దేవతలు కూడా చంపలేరు. అందుచేత వాళ్ళలో వాళ్ళే కొట్టుకుచస్తారు. పోనీలే కానీ అందువల్ల నీకేం వస్తుంది చెప్పు?” అన్నాడు నవ్వుతూనే.
పుత్రశోకంతో పరితపిస్తూ అవధులెరగని ఆక్రోశంతో అచ్యుతుని శపించిన గాంధారి జవాబు చెప్పలేక మౌనం వహించింది.

పుష్పక విమానం

భారతీయ పురాణాలలో ప్రస్తావించబడ్డ గాలిలో ఎగరగలిగే ఒక వాహనం. ఎంతమంది ఇందులో కూర్చున్నా మరొకరికి చోటు ఉండటం దీని విశేషం.
రామాయణంలో పుష్పక విమానం గురించిన వర్ణన ఉంది. యుద్ధానంతరం సీతతో కూడి సకాలంలో అయోధ్య చేరడానికి రాముడు దీనిని ఉపయోగించాడు.
సుందర కాండ ఎనిమిదవ, తొమ్మిదవ సర్గలలో పుష్పక విమానం విపులంగా వర్ణించబడింది. సీతాన్వేషణా సమయంలో హనుమంతుడు పుష్పక విమానాన్ని చూశాడు.
నిజానికి ఇది బ్రహ్మ దేవుడి కోసం విశ్వకర్మ సర్వవిధ రత్నములతో 'పుష్పకం' అనే పేరుగల ఒక దివ్య విమానాన్ని స్వయంగా నిర్మించాడట. ఐతే కుబేరుడు తీవ్రమైన తపస్సు చేసి, బ్రహ్మను మెప్పించి ఆ విమానాన్ని బ్రహ్మ అనుగ్రహముతో కానుకగా పొందాడట. పిమ్మట రావణుడు, తన సోదరుడైన కుబేరుని జయించి ఆ పుష్పక విమానాన్ని తన స్వంతం చేసుకున్నాడట.
ఇంతకీ ఆవిమానంలో మనం ఉహించినట్టుగా కేవలం ఆసనాలు మాత్రమే ఉండవు. ఎందుకంటే మన హనుమంతుడు లంకలో ప్రవేశించినప్పుడు, రావణుడు కానుకగా పొందిన పుష్పకము లోపల చూడగానే సాక్షాత్తు స్వర్గలోకమే అవతరించిందా? అన్న భ్రాంతి కలిగిందట. ఇక ఆ పుష్పకము యజమాని మనసు ననుసరించి మనో వేగముతో పయనిస్తుందట. అసలు శత్రువులకు దొరికే పరిస్థితి ఎప్పుడూ ఉండదుట. అంతే కాదు ఆ విమానానికి బయట లోపలివైపున విశిష్టమైన శిల్ప రీతులు గోచరిస్తాయట. కర్ణ కుండలాలతో శోభిస్తున్న ముఖములుగల వారు, మహా కాయులు, ఆకాశంలో విహరించే రాక్షసులు తమ ప్రభువుకు అనుకూలంగా ప్రవర్తించే వారు, విశాల నేత్రములు గల వారు, అతి వేగముగా సంచరించ గల వేలాది భూతగణాల వారు ఆ విమానాన్ని మోస్తున్నట్టుగా దాని వెలుపలి భాగంలో శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. అదంతా చూసిన హనుమ ఈ విమానం రావణుడి స్థాయికి తగినట్టు దర్పంగా ఉంది అనుకున్నాడట. ఇంకా చెప్పాలంటే మెరుపు తీగల్లాంటి నారీ మణులు ఎందరెందరో ఆ విమానంలో ఉండటమే గాక అనేక సుందర దృశ్యాలు చిత్రీకరించ బడి ఉన్నాయట. వాటిలో అవి భూమి మీద పర్వత పంక్తులా? అన్నట్టుగా చిత్రించిన చిత్రాలు ఆ పర్వతాల మీద వృక్ష సమూహములు పుష్పాలు వాటి కేసరములు, పత్రములు స్పష్టముగా చిత్రీకరించబడి ఉన్నాయట.

కురుక్షేత్ర యుద్ధంలో ప్రముఖ వ్యూహాలు

మహాభారతంలో జరిగిన కురుక్షేత్ర యుద్ధంలో పాండవులు ఏడు అక్షౌహిణీలు, కౌరవులు పదకొండు అక్షౌహిణీల సైన్యంతో యుద్ధాన్ని ప్రారంభించారు. రోజుకొక వ్యూహం నిర్మించి ఆ ఆకారంలో తమ సైన్యాలను నిలిపేవారు. అందులో కొన్ని ప్రముఖమైన వ్యూహాలు..
1. క్రౌంచారుణ వ్యూహం : పాండవ సేనాని దృష్టద్యుమ్నుడు క్రౌంచపక్షి ఆకారంలో సైన్యాన్ని నిలుపుతాడు.
2. గరుడ వ్యూహం : యుద్ధం మొదలైన మూడవ రోజున భీష్ముడు గరుడపక్షి ఆకారంలో ఈ వ్యూహాన్ని నిర్మించాడు. దీనినే సువర్ణ వ్యూహం అని కూడా అంటారు.
3. శకట వ్యూహం : మహాభారత యుద్ధ పదకొండవ రోజున ద్రోణుడు బండి ఆకారంలో ఈ వ్యూహాన్ని నిర్మించి సైన్యాన్ని నిలిపి తాను కేంద్ర స్థానంలో నిలబడ్డాడు.
4. చక్ర వ్యూహం : పదమూడవ రోజు ద్రోణుడు ఈ వ్యూహాన్ని రచించాడు. దీనినే పద్మవ్యూహం అని కూడా అంటారు. చక్రాకారంలో సైన్యాన్ని నిలుపుతారు. దీనిని చేదించడం అందరికీ సాధ్యం కాదు. అభిమన్యుడు ఈ వ్యూహంలో ప్రవేశించినా బయటకు రాలేక కౌరవుల మోసానికి బలయ్యాడు.
5. మకర వ్యూహం : ఐదవ రోజున భీష్ముడు ఈ వ్యూహాన్ని నిర్మించి మకరాకారంలో సైన్యాన్ని నిలిపి యుద్ధరంగంలో చెలరేగిపోయి పాండవులకు చాలా నష్టాన్ని కలిగించాడు.
6. బార్హస్పత్య వ్యూహం : పదిహేడవ రోజున బృహస్పతి సహకారంతో కర్ణుడు ఈ వ్యూహాన్ని పన్నుతాడు.
7. శృంగాటక వ్యూహం: ఎనిమిదవ రోజు భీష్ముని వ్యూహానికి ప్రతిగా దృష్టద్యుమ్నుడు ఈ వ్యూహాన్ని నిర్మించి త్రికోణాకారంలో సైన్యాన్ని నిలుపుతారు.
8. శ్యేన వ్యూహం: ఈ వ్యూహాన్ని కూడా భీష్ముడి మకర వ్యూహానికి ప్రతిగా దృష్టద్యుమ్నుడు డేగ ఆకారంలో నిర్మించాడు. ఐదవరోజు నిర్మించిన ఈ వ్యూహాన్ని డేగ వ్యూహం అని కూడా అంటారు.
9. అర్ధచంద్ర వ్యూహం : మూడవ రోజు భీష్ముడు పన్నిన గరుడ వ్యూహానికి ప్రతిగా దృష్టద్యుమ్నుడు అర్ధచంద్ర వ్యూహాన్ని నిలుపుతాడు.
10. మండల వ్యూహం : ఏడవ రోజున భీష్ముడు మండలాకారంలో వ్యూహాన్ని రచించి కౌరవ సైన్యాన్ని నిలుపుతాడు.
11. మండలార్ధ వ్యూహం : పన్నెండవ రోజు ద్రోణుడు పన్నిన గరుడ వ్యూహానికి ప్రతిగా ధర్మరాజు మండలార్ధ వ్యూహాన్ని నిర్మించి పాండవ సేనను నిలుపుతాడు.
12. వజ్ర వ్యూహం : ఏడవ రోజున భీష్ముడు కౌరవ సేనను మండల వ్యూహంలో నిర్మించగా ధర్మరాజు పాండవ సేనను వజ్ర వ్యూహంలో రచిస్తాడు.
13. సూచీ ముఖ వ్యూహం : ఆరవరోజు దృష్టద్యుమ్నుడు పాండవ సేనను మకర వ్యూహంలో నడిపింపగా భీష్ముడు కౌరవసేనను క్రౌంచ వ్యూహంలో నిలుపుతాడు. కాని ఈ రెండు వ్యూహాలు భంగపడదంతో అభిమన్యుడు సూచీ ముఖ వ్యూహాన్ని రచించి సూది ఆకారంలో సైన్యాన్ని నిలుపుతాడు.
14. వ్యాల వ్యూహం : నాలుగవ రోజు భీష్ముడు కౌరవ సేనను చుట్ట చుట్టుకున్న పాములా నిలుపుతాడు. ఇది చాలా కష్టమైన వ్యూహం. ఈ వ్య్హూహం ద్వారా సైన్యాల స్తంభనను అంచనా వెయ్యడం కష్టం.
15. సర్వతోభద్ర వ్యూహం : తొమ్మిదవ రోజు భీష్ముడు సైన్యాన్ని సర్వతోభద్ర వ్యూహంలో నిలిపాడు.
16. మహా వ్యూహం : భీష్ముడు రెండవ రోజు ఈ వ్యూహాన్ని నిర్మించి అజేయుడై శత్రు సైన్యాన్ని హడలగొట్టించాడు.

శ్రీకాళహస్తిశ్వరస్వామి మహత్యం

శ్రీకాళహస్తిశ్వరస్వామి స్వయంభువు,శ్రీ అనగా సాలె పురుగు,కళా అనగా పాము,హస్తి అనగా ఏనుగు,ఈ మూడు జంతువులు శివభక్తి వలన
సాయుజ్యం పొంది శివునిలో గలసిపోయినవి. అందువలన ఇచ్చట స్వామి వారికీ శ్రీ కాళహస్తిశ్వరుడు అని ఈ పురముకు శ్రీ కాళహస్తి అనియు పేరు వచ్చెను
*
సాలె పురుగు- శివ సాయుజ్యం
కృతయుగంలో చెలది పురుగు తన శరీరం నుంచి వచ్చు సన్నని దారంతో
కొండఫైనున్న శివునికి గుళ్ళ గోపురాలు ప్రాకారములు కట్టి శివుని
పూజించుచుండెను.ఒకనాడు శివుడు పరిక్షింపదలచి అక్కడ మండుచున్న
దేపములో తగిలి సాలీడు రచించిన గుడి గోపురములను తగులబడిపొవుచున్
నట్లు చేసిను.
ఇది చుసిన సాలీడు దీపమును మ్రింగుటకు పోగా శివుడు ప్రతక్ష్యమై దాని భక్తికి మెచ్చి వరము కోరుకోమనెను.అపుడు
సాలీడును మరల తనకు జన్మ లేకుండా చేయమని కోరుకొనెను.అందుకు శివుడు
సమ్మతించి సాలిడుని తనలో ఐఖ్యమైనపోవునట్లు చేసిను.ఈ విధముగా
సాలీడు శివసాయుజ్జ్యము పొంది తరించింది
*
నాగు పాము-ఏనుగు-శివారాధన చేసి తరించుట:
ఏనుగు పాముల కథ త్రేతాయుగమున జరిగినది.ఒక పాము పాతాళము నుండి
పెద్ద పెద్ద మణులను తెచ్చి ప్రతి దినము శివలింగమునకు పూజ చేసి
పోవుచుండెను.త్రేతాయుగం ముగిసి,ద్వాపరయుగం వచ్చినది.అప్పుడు ఏనుగు శివలింగమునకు పూజచేసి పోవుచుండెను.
త్రేతాయుగం ముగిసి ద్వాపరయుగం
వచ్చినది.అప్పుడు ఏనుగు శివలింగమును సేవింపజొచ్చెను.అది స్వర్ణముఖి
నదిలో స్నానమాచరించి తొండముతో నీరు,పుష్పములు,బిల్వదళములు
తెచ్చి,పాము సమర్పించిన మణులను త్రోసివేసి,తాను తెచ్చిన నీటితో
అభిషేకం చేసి పుష్పములతో అలంకరించి పూజించి వెడలి పోవుచుండెను.
మరునాడు ఉదయం పాము వచ్చి చూచి తాను పెట్టి వెళ్ళిన మణులను గానక వానికి
బదులు బిల్వములు,పుష్పములు పెట్టియుండుట గాంచెను.
అప్పడు పాము మనస్సున చాలా బాధపడి వాడుక ప్రకారం ఏనుగు ఉంచి
వెళ్ళిన పువ్వులను త్రోసివేసి,తాను ఇట్లు కొంత కాలము వరకు పాము ఉంచిన
మణులను ఏనుగు ,ఏనుగు ఉంచిన పుష్పదులను పాము శుబ్రపరచి తమ తమ
ఇష్టనుసరముగా పూజచేసి ఈశ్వరుని సేవించుచు వచ్చినవి..
ఒక రోజు పాము విసుగెత్తి తన మణుల త్రోయబడి ఉండుటకు కోపం చెంది.ఈ
విషయమునకు కారణము తెలుసుకొన గోరి ప్రక్కనే యున్నా పొదలో దాగి
పొంచి యుండెను.అది గమనించిన పాము కోపముతో తన శత్రువుఅయిన ఏనుగు
తొండములో దూరి కుంభస్టలమున నిలిచి డానికి ఉపిరి ఆడకుండా చేసిను.ఈ
భాధకు ఏనుగు తాళ్ళజాలక ఈశ్వర ధ్యానంతోతొండముతో శివలింగము తాకి
శిరస్సును గట్టిగా రాతికిమోది తుదకు మరణించెను.
ఆ శిలాఘతమునకు ఏనుగు కుంభస్టలమున నుండిన పాము గూడా చచ్చి బయటబడినది.ఇట్లు ఇద్దరు తమ తమ నిజ స్వరూపంతో రుద్ర గణములుగా మరి స్వామి
ఐఖ్యమొందిరి.
ఈ స్మృతి చిహ్నంగా కాళము పంచ ముఖ ఫణాకారముగా శిరోపరిభాగమునకు
ఏనుగు సూచకముగా రెండు దంతములను,సాలె పురుగు అడుగు భాగంలోనూ,తన లింగాకృతిలో నైక్యమొనరించుకొని శివుడు శ్రీ కాళహస్తిశ్వరుడుగా ఇచ్చట
దర్సనం ఇచ్చుచున్నాడు.ఆనాటి నుండి ఈ పుణ్యక్షేత్రంకు `శ్రీ -కళా- హస్తి అని పేరు వచ్చింది.
*
చారిత్మాక ప్రాశస్త్యం
క్రీస్తు పూర్వం ఒకటి రెండు శతాబ్దంలో వ్రాయబడిన తమిళ గ్రంధములో
శ్రీ కాళహస్తిని దక్షిణ కైలాసముగా పేర్కొనబడినది.రెండు మూడోవ
శతాబ్దంలో అరవైముగ్గురు శైవనాయన్మారులను శివ భక్తులలో ముఖ్యులైన అప్పర్ సుందరర్,సంభంధర్,మణిక్యవాచగర్ అనువారలు ఈ క్షేత్రమును సందర్శించి కీర్తించారు.
మూడోవ శతాబ్దంలో సట్కిరర్ అను
ప్రసిద్ధ తమిళ కవీశ్వరుడు రత్నముల వంటి నూరు తమిళ అందాదిలో శ్రీ
కాళహస్తిశ్వరుని సోత్రరుపంగా కీర్తించాడు.జగద్గురు శ్రీ శ్రీ శ్రీ
ఆదిశంకరులు వారి ఈ క్షేత్రమును సందర్శించి అమ్మవారి ఎదుట శ్రీ
చక్ర ప్రతిస్థాపన గావించియున్నారు.వారె స్పటికలింగము నొకటి
నెలకోల్పినారు.
పల్లవ,చోళ ,విజయనగర రాజుల కాలపు శిల్ప కళ
వైపుణ్యం ఈ క్షేత్రమును వెలసినవి.క్రి.శ. 1516 లో శ్రీ కృష్ణదేవరాయలు పెద్ద గాలిగోపురమును , నూరు కాళ్ళ మండపమును( రాయల మండపము) నిర్మించినారు
శ్రీకాళహస్తి పట్టణం చిత్తూర్ జిల్లలో ఆంధ్ర ప్రదేశ్ రాస్త్ర్హం లోనిది.కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమలకు కేవలం 40
కిలోమీటర్లు దూరంలో వెలసినది.పట్టణమునకు మూడు కిలోమీటర్ల దూరంలో
రైల్వేస్టేషన్ రేణిగుంట గూడూర్ మార్గం కలదు. ఈ క్షేత్రంను చేరుకొనుటకు
దేశంలోని అన్ని వైపుల నుండి బస్సు,రైలు విమాన సౌకర్యాలు గలవు

తొలి ఏకాదశి

తొలి ఏకాదశి ఆషాడ శుద్ధఏకాదశి నాడు ఆచరిస్తారు. ఆషాడమాసము లోనే ప్రత్యక్షనారాయణుడు తన మార్గాన్ని దక్షిణాయనములోనికి మార్చుకునేది.ఈ పండుగ దాదాపు దక్షిణాయనము ప్రారంభము అయిన తరువాత మొదటి పండుగని తొలి ఏకాదశి గా ప్రజలు చేస్తారు.ఈ పండుగ పూర్వ కాలములో ఏరువాక వేడుకల్లో భాగముగా చేసేవారు.
తొలి ఏకాదశి వైష్ణవం లో ముఖ్యమైన పండుగ. విష్ణుమూర్తి తన లోక పాలకత్వానికి కొద్దిగా విశ్రాంతినిస్తూ ఆషాడ శుద్ధ ఏకాదశి నాడు శేషువు పైన శయనించుటకు ప్రారంభించిన రోజు అందుకని తోలి ఏకాదశి అని శయనైక ఏకాదశి అని పిలుస్తారు.దశమి నాడు ముక్కోటి దేవతలు విష్ణువు ను పూజించి సేవిస్తారు.
ఆయన ఈరోజున యోగనిద్రకు ఉపక్రమిస్తాడు. ఆదిశేషువు పైన తన యోగనిద్రకు ఉపక్రమిస్తాడు అందువలన శేషశయన ఏకాదశి అని పిలుస్తారు.అందువలన దశమి నాటి రాత్రి నుంచి ముక్కోటి దేవతలు అయినను అర్చిస్తారు.
ఈ ఏకాదశిని పద్మఏకాదశి గా కూడా పిలుస్తారు.విష్ణువు లోక పాలకుడు. ప్రజల చైతన్యానికి ప్రతిక. మరి విష్ణువు యోగ నిద్ర అంటే.
ఈ యోగ నిద్ర అనేది భూమి పై రాత్రి సమయాలు పెరుగుతాయి అన్నదానికి సూచన.తద్వార ప్రజలలో నిద్రా సమయాలు పెరుగుతాయి.
భవిష్యోత్తరపురాణం లో కృష్ణుడు ధర్మరాజుకు ఈ ఏకాదశి మహత్యం వివరించాడని వున్నది.
సూర్య వంశం లో ప్రఖ్యాతరాజు మాంధాత. అతడు ధర్మము తప్పడు,సత్యసంధుడు. అతని రాజ్యం లో ఒకసారి తీవ్ర కరువు వచ్చింది. దానితో ప్రజలు పడరాని పాట్లు పడుతుంటే అంగిరసుడు సూచన పై ఈ శయనైక ఏకాదశి వ్రతాన్ని భక్తితో చేస్తాడు దానితో వర్షం వచ్చి కరువు తీరి ప్రజలు సుఖంగా వున్నారని పురాణాలు చెపుతున్నాయి

లోకహితం కోసం శివుడు ఎన్ని రూపాలు ధరించాడు. .?

ఓంకార స్వరూపుడైన శివుడు లోకహితం కోసం ఎన్ని రూపాలు ధరించాడు. ఈ విషయంపై శివపురాణం ఓసారి తిరగేస్తే.. అందులో శివుడు ఎనిమిది రూపాలు ధరించినట్టు పేర్కొంటోంది. అవేంటంటే...
రుద్రుడు : దుఃఖ నివారకుడైన అగ్నిని అధిష్టించి ఉంటాడు.
శర్వుడు : జీవుల మనుగడ కోసం భూమిని అధిష్టించి ఉంటాడు.
భవుడు : ఈ జగానికి అత్యంతావశ్యకమైన జలాన్ని ఆశ్రయించి ఉంటాడు.
ఉగ్రుడు : జగత్తు కదలికలకు కారకుడైన వాయువును అధిష్టించి ఉంటాడు.
భీముడు : ఆకాశాన్ని ఆశ్రయించి ఉంటాడు.
పశుపతి : సంసారబద్ధులైన జీవులను పాపవిముక్తులను చేసేందుకై జీవాత్మను అధిష్టించి ఉంటాడు.
ఈశానుడు : ఈ చరాచర జీవులను శాసించే సూర్యునిలో ప్రకాశిస్తుంటాడు.
మహాదేవుడు : తన చల్లని కిరణాలతో జీవులను పాలించు చంద్రునిలో ప్రకాశిస్తుంటాడు.

కర్ణుడు కవచ కుండలాలతో ఎందుకు పుట్టాడు?

కర్ణుడు.. కుంతీదేవికి పుట్టలేదు. కుంతీదేవి కూడా నవమాసాలు మోసి ‘కర్ణుని’ కనలేదు. కర్ణుడు పసిబిడ్డగా సూర్యుని ద్వారా కుంతీదేవికి ఇవ్వబడ్డాడు... అంతే. కన్యగా ఉన్న కుంతికి., దూర్వాసమహర్షి ఇచ్చిన మంత్రం ‘సంతాన సాఫల్య మంత్రం’. ఆ మంత్రంతో ఏ దేవతను ఆవాహన చేస్తే, ఆ దేవత వచ్చి సంతానాన్ని మాత్రమే ఇచ్చి వెళ్లిపోతారు తప్ప మరే వరాలు అనుగ్రహించరు. ఆ మంత్ర ప్రభావం అలాంటిది.
పూర్వకాలంలో ఒక రాక్షసుడు ఉండేవాడు. వాడు బ్రహ్మదేవుని గురించి ఘోరమైన తపస్సు చేసి అభేద్యమైన వెయ్యి కవచాలు వరంగా పొందాడు. అప్పటినుంచి వాడికి ‘సహస్రకవచుడు’ అనే పేరు స్థిరపడిపోయింది. ఆ వరగర్వంతో వాడు సర్వలోకాలనూ నానా హింసలకు గురిచేసి ఆనందిస్తూండేవాడు. వాడి బాధలు పడలేక సకల ప్రాణికోటి శ్రీ మహావిష్ణువును శరణు కోరగా ‘భయపడకండి..నేను నర, నారాయణ రూపాలలో బదరికావనంలో తపస్సు చేస్తున్నాను. వాడికి అంత్యకాలం సమీపించినప్పుడు వాడే నా దగ్గరకు వస్తాడు. అప్పుడు నేనే వాడిని సంహరిస్తాను’ అని వారికి ధైర్యం చెప్పి పంపాడు.
హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత నరసింహస్వామి రెండురూపాలుగా విడిపోయాడు. నర రూపం ‘నరుని’గానూ., ‘సింహ’ రూపం ‘నారాయణుని’గా ‘ధర్ముని’ కుమారులుగా జన్మించాడు. వారే నర, నారాయణులు. వారిరువురూ పుట్టుకతోనే పరాక్రమవంతులు, విరాగులు. అందుకే వారిరువురూ ఆయుధధారులై బదరికావనంలో ఏకాగ్రచిత్తులై తపోదీక్ష వహించారు. ఏ ఆటంకం లేకుండా వారి తపస్సు కొనసాగుతోంది.
ఒకసారి ప్రహ్లాదుడు బదరికావనం సందర్శించి వెడుతూ.. నర, నారాయణులను చూసి, వారి ప్రక్కన ఆయుధాలు ఉండుట గమనించి..‘తాపసులైన వీరికి ఆయుధాలతో పనేమి? వీరెవరో కపట తాపసులైయుండవచ్చు’ అని భావించి వారికి తపోభంగం గావించి, వారిని యుద్ధానికి ఆహ్వానించాడు. వారిమద్య భీకరయుద్ధం జరిగింది. ఎంతకాలమైనా ప్రహ్లాదుడు వారిని జయించ లేకపోవడం చూసి, ఆశ్చర్యపడి శ్రీ మహావిష్ణువును ధ్యానించాడు. శ్రీహరి ప్రత్యక్షమై ‘ప్రహ్లాదా.. నర నారాయణులు నా అంశతో జన్మించినవారు. వారిని నీవు గెలవలేవు’ అని చెప్పాడు. ప్రహ్లాదుడు తన తప్పు తెలుపుకుని నర,నారాయణులను క్షమించమని వేడుకుని అక్కడ నుంచి వెళ్లిపోయాడు.
నర,నారాయణుల తపస్సు కొనసాగుతోంది. వారి తపస్సుకి ఇంద్రుడు భయపడి., వారికి తపోభంగం చేసిరమ్మని అప్సరసలను పంపాడు. వారు తమ రూప, వయో, నృత్య, గానాలతో నర,నారాయణుల తపస్సుకు భంగం కలిగించాలని ఎంతో ప్రయత్నించారు.. కానీ, ఫలితం శూన్యం. అప్పుడు నారాయణుడు వారిని దగ్గరకు పిలిచి, ‘మీ అందాలు మమ్ములను ఆకర్షించలేవు. ఇంద్రపదవి ఆశించి మేము ఈ తపస్సు చేయడంలేదు అని మా మాటగా మహేంద్రునకు తెలియజెప్పండి’ అని తన తొడమీద చరిచాడు. ఆ శబ్దం నుంచి ఓ అసాధారణ, అద్భుత సౌందర్యరాశి జన్మించింది. తన ఊరువుల(తొడల) నుంచి పుట్టిన ఆ సుందరికి ‘ఊర్వసి’ అని పేరు పెట్టి, ఆమెను ఆ అప్సరసలకు ఇస్తూ, ‘ఈమెను మా బహుమతిగా మహేంద్రునకు ఇవ్వండి’ అని చెప్పి వారిని పంపాడు. మహేంద్రుడు తన తప్పు తెలుసుకుని నర,నారాయణులను క్షమించమని వేడుకున్నాడు.
నర,నారాయణుల తపస్సు కొనసాగతోంది. ఆ సమయంలో వరగర్వాంధుడైన ‘సహస్రకవచుడు’ వారిదగ్గరకు వచ్చి, వారిని యుద్ధానికి ఆహ్వానించాడు. అప్పుడు నారాయణుడు అతనితో ‘రాక్షసేశ్వరా..నీ సమరోత్సాహం మాకు ఆనందం కలిగించింది. కానీ, మేమిద్దరం కలిసి నీ ఒక్కనితో యుద్ధం చెయ్యడం ధర్మం కాదు. కనుక, మాలో ఒకడు నీతో యుద్ధం చేస్తూంటే మరొకడు తపస్సు చేసుకుంటాడు. అతని తపస్సుకు ఎలాంటి అంతరాయం కలుగకూడదు. ఇందుకు నీకు సమ్మతమైతే యుద్ధం చేస్తాను’ అన్నాడు.
సహస్రకవచుడు ఈ ఒప్పందానికి సమ్మతించాడు. నరుడు తపస్సు చేస్తున్నాడు. నారాయణుడు యుద్ధానికి దిగాడు. యుద్ధం భీకరంగా సాగుతోంది. అలా వేయి సంవత్సరాలు గడిచిన అనంతరం నారాయణుడు సహస్రకవచుని వేయి కవచాలలో ఒక కవచాన్ని భేదించగలిగాడు. అప్పటికి అలసిన నారాయణుడు తపస్సుకు ఉపక్రమించగా, నరుడు సహస్రకవచునితో యుద్ధానికి దిగాడు. మరో వేయి సంవత్సరాలు గతించిన అనంతరం నరుడు సహస్రకవచుని మరో కవచాన్ని భేదించాడు.
ఇలా నర,నారాయణులిరువురూ కలిసి ఆ సహస్రకవచుని తొమ్మిది వందల తొంభై తొమ్మిది కవచాలు భేదించారు. ఇక సహస్రకవచునికి ఉన్నది ఒకేఒక కవచం. అది గమనించిన సహస్రకవచునికి భయం పుట్టి, యుద్దరంగం వదిలి, పరుగు పరుగున సూర్యుని దగ్గరకు వెళ్లి అభయం ఇమ్మని వేడుకున్నాడు. అప్పుడు సూర్యుడు ‘కలకాలం నేను నీకు అభయం ఇవ్వలేను., నర,నారాయణుల అనంతరం నీకు నానుంచి విడుదల కలిగిస్తాను’ అన్నాడు. సహస్రకవచుడు సమ్మతించి సూర్యుని దగ్గర ఉండిపోయాడు. కుంతి మంత్రబలానికి కట్టుబడి వచ్చిన సూర్యుడు., ఆ సహస్రకవచునే.., పసిబిడ్డగా మార్చి, కుంతి చేతికి అందించాడు. అందుకే కర్ణుడు సహజ కవచ కుండలాలతో జన్మించాడు. ఆ కర్ణుని సంహరించడానికే నర,నారాయణులిరువురూ.. కృష్ణార్జునులుగా జన్మించి, కురుక్షేత్ర రణభూమిలో కర్ణుని సంహరించారు.

శుక్రవారం – అష్ట లక్ష్మీప్రదం

హిందూ సంప్రదాయంలో లక్ష్మీదేవి సిరి సంపదల దేవత. వివిధ భాగ్యాల అధిష్టాన దేవతలుగా ఈ లక్ష్మీ దేవియే అష్ట లక్ష్మిలుగా పూజింపబడుతుంది. దేవాలయాలలో అష్ట లక్ష్మిలు ఒకే చోట అర్చింపబడడం సంప్రదాయం.
ఈ అష్ట లక్ష్మిలు:-
ఆదిలక్ష్మి :-
"మహాలక్ష్మి" అనికూడా అంటారు. నాలుగు హస్తాలతో, ఒక చేత పద్మం, మరొక చేత పతాకం ధరించి, రెండు చేతులందు అభయ వరద ముద్రలు కలిగి ఉంటుంది.
ధాన్యలక్ష్మి :-
ఎనిమిది చేతులతో, పచ్చని వస్త్రాలతో ఉంటుంది. రెండు చేతులలో పద్మాలు, ఒక చేత గద, మూడు చేతులలో వరి కంకి, చెరకు గడ, అరటి గెల కలిగి రెండు చేతులు వరదాభయ ముద్రలతో ఉంటుంది.
ధైర్యలక్ష్మి :-
"వీరలక్ష్మి" అని కూడా అంటారు. ఎనిమిది చేతులు కలిగినది. ఎర్రని వస్త్రములు ధరించినది. చక్రము, శంఖము, ధనుర్బాణములు, త్రిశూలము, పుస్తకము (?) ధరించినది. రెండు చేతులు వరదాభయ ముద్రలలో నుండును.
గజలక్ష్మి :-
రాజ్య ప్రదాత. నాలుగు హస్తములు కలిగిన మూర్తి. ఇరువైపులా రెండు గజాలు అభిషేకం ఛేస్తుంటాయి. ఎర్రని వస్త్రములు ధరించినది. రెండు చేతులలో రెండు పద్మములు కలిగినది. రెండు చేతులు వరదాభయ ముద్రలలో ఉంటాయి.
సంతానలక్ష్మి :-
ఆరు చేతులు కలిగినది. రెండు కలశములు, ఖడ్గము, డాలు ధరించినది. వడిలో బిడ్డ కలిగియున్నది. ఒకచేత అభయముద్ర కలిగినది. మరొక చేయి బిడ్డను పట్టుకొనియున్నది. బిడ్డ చేతిలో పద్మము ఉన్నది.
విజయలక్ష్మి :-
ఎనిమిది చేతులు కలిగినది. ఎర్రని వస్త్రములు ధరించినది. శంఖము, చక్రము, ఖడ్గము, డాలు, పాశము ధరించినది. రెండు చేతుల వరదాభయ ముద్రలు కలిగినది.
విద్యాలక్ష్మి :-
శారదా దేవి.చదువులతల్లి.చేతి యందు వీణ వుంటుంది.
ధనలక్ష్మి :-
ఆరు హస్తాలు కలిగిన మూర్తి. ఎర్రని వస్త్రాలు ధరించినది. శంఖ చక్రాలు, కలశము, ధనుర్బాణాలు, పద్మము ధరించిన మూర్తి. అభయ ముద్రలోనున్న చేతినుండి బంగారునాణేలు వర్షిస్తున్నట్లు చిత్రింపబడుతుంది.
కొన్ని చోట్ల ఐశ్వర్యలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి, రాజ్యలక్ష్మి, వరలక్ష్మి అనే పేర్లు ఉంటాయి.
ప్రార్ధన:
అష్టలక్ష్మీ నమస్తుభ్యం వరదే కామరూపిణి
విష్ణు వక్షఃస్థలారూఢే భక్తమోక్ష ప్రదాయిని
శంఖచక్ర గదా హస్తే మహాలక్ష్మీ నమోస్తుతే
జగన్మాత్రేచ మోహిన్యై మంగళం శుభమంగళం

మంగళగిరిపై వెలసిన శ్రీ పానకాల నరసింహస్వామి :

దేవుని ముందు పెట్టిన ప్రసాదాన్ని దేవుడు తింటే అది చూసి పులకించని భక్తులు ఉండరు.కానీ అల ఎక్కడైనా జరుగుతుందా అంటే ఆ ప్రశ్నకు సమాధానము మంగళగిరి శ్రీ పానకాల నరసింహ స్వామి. ఈ విషయాన్ని వివరంగ తెలుసుకునే ముందు ఇక్కడి స్థల పురాణాన్ని కాస్త తెలుసుకుందాము.
ఈ క్షేత్రం విజయవాడ మరియు గుంటూరు కు అతి చేరువలో ఉంది.విజయవాడ నుంచి ప్రతి 10 నిమిషాలకు గుంటూరు కు బస్సు సౌకర్యం కలదు. ఆ మార్గ మధ్య లోనే ఈ ఆలయం కలదు.
మన రాష్ట్రము లోని అన్ని ప్రధాన పట్టణాల నుండి బస్సు లేదా రైల్ ప్రయాణం ద్వారా ఈ ఆలయాన్ని సులభంగా చేరుకోవచ్చు.మీకు ఈ ఆలయ సందర్శనార్ధం ఎలాంటి సమాచారాన్నైనా అందిచటానికి మా బ్లాగ్ సిద్ధoగా ఉంది.

స్థల పురాణం:
ఇక్కడ రెండు రకాలైన కథలు బాగా ప్రాచుర్యంలో ఉన్నాయి.
వాటిలో ....
మొదటిది
పూర్వం ఈ ప్రాంతాన్ని పారియాత్ర అను రాజు పాలించేవాడు.అతనికి సంతానము లేకపోవుటచే, సంతానం కొరకు దేశంలోని అన్ని పుణ్యక్షేత్రాలను తిరిగగా అతనికి ఒక శిశువు జన్మించాడు.అతనికి హస్తసృంగి అని పేరు పెట్టాడు. కానీ దురదృష్టవసాత్తు అ పిల్లవాడు అoగవికలాంగుడిగా జన్మించాడు.ఆ రాజు తన పుత్రుని చూసి చాల విచారపడ్డాడు.తండ్రి బాధ చూసి హస్తసృంగి బాధాతప్త హృదయంతో అడవులకు వెళ్లి భగవంతుని సాక్షాత్కారం కోసం ఘోరమైన తపస్సు చేసాడు.అంతట శ్రీమహావిష్ణువు ప్రత్యక్షమవగా హస్తసృంగి తనకు తన జీవితాంతం భగవంతుని పాదాల చెంత ఉండాలని ఉండాలని చెప్పగా, శ్రీమహావిష్ణువు హస్తసృంగిని ఒక కొండగా మార్చివేసి దానిపై శ్రీమహావిష్ణువు నరసింహ అవతారం లో కొలువయ్యాడు.అదియే ఇప్పటి పానకాల నరసింహస్వామి ఆలయం.
మరియొక కథ కూడా ఈ ఆలయం గూర్చి ప్రచారం లో ఉంది.
మహిషాసుర వధ జరిగిన తరువాత దుర్గమ్మ ఆగ్రహాగ్నితో రగిలిపోయింది. అప్పుడు ఆమె అగ్ని తన రెండవ కంటి ద్వార ఒక కొండపైకి వదిలి ఆ కొండను పెళ్ళగించి గాలిలోకి విసిరివేసింది. అదియె ఇప్పటి నరసింహ స్వామి కొలువైన కొండ.కాని దుర్గమ్మ నుంచి వెలువడిన ఆ అగ్నిజ్వాలలు మాత్రం ఆ కొండ నుండి అలాగే వెలువడుతున్నాయి.తరువాతి కాలంలో నరసింహ స్వామి హిరణ్యకసిపున్ని చంపిన తరువాత అలాంటి అగ్నిజ్వాలల తోనే రగిలిపోయాడు.అప్పుడు ప్రహ్లాదుడు ఆయనను స్తుతించగా ప్రసన్నుడై తన నుంచి వెలువడుతున్న అగ్నిజ్వలను తను అదుపుచేసుకోదలచి అనువైన ప్రాంతాన్ని వెతకుచున్న సమయంలో అప్పటికే అగ్నితో రగులుతున్న ఈ కొండ కనిపించి అక్కడే తనకు అనువైన ప్రాంతo అని తలచి నరసింహ స్వామి ఇక్కడే కొలువైయ్యాడు. కాని అగ్ని జ్వాలలు మాత్రం చల్లారలేదు.
బ్రహ్మదేవుడు ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ స్వామిని పానకంతో అభిషేకించగా అగ్నిజ్వాలలు పూర్తిగా ఆరిపోయాయి. అప్పటినుంచి ఇక్కడ పానకంతో అభిషేకించడం ఆనవాయితీగా మారింది.
ఇక్కడ చెప్పుకోతగ్గ విశేషం ఏమిటంటే స్వామి భక్తులు ఇచ్చిన పానకాన్ని అర్చకులు స్వామి నోటిలో పోస్తే నరసింహుడు ఆ పానకాన్ని గుటకలు వేస్తూ సంతోషంగా స్వీకరిస్తాడు.గుటకలు వేసిన శబ్దం కూడా స్ఫష్టంగా వినిపిస్తుంది.స్వామికి భక్తులు ఇచ్చిన పానకాన్ని అర్చకులు స్వామి కి అందివ్వగా స్వామి దానిని త్రాగి మరల కొంత పానకాన్ని బయటకు వదులుతాడు.దానినే భక్తులు ప్రసాదంగా స్వీకరిస్తారు.మరియొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇక్కడ నిరంతరం పానకం నైవేద్యం వల్ల అక్కడ పానకం నేలపై పడినా అక్కడ ఒక్క చీమ కూడా ఉండదు మరియు ఒక ఈగ కూడా వాలదు.
భగవంతుడుకి ఇచ్చిన ప్రసాదాన్ని భగవంతుడే తింటే వచ్చే అలౌకిక ఆనందాన్ని భక్తులు సొంతం చేసుకుంటారు. ఇది ప్రతి తెలుగువాడు ఖచ్చితంగా చూడదగ్గ ప్రాంతం.

ధ్రువనక్షత్రం కథ

ఉత్తానపాదుడు అనే రాజుకు ఇద్దరు భార్యలు. వారి పేర్లు సునీతి, సురుచి. రాజుగారికి సురుచి అంటే ఎంతో ప్రేమ. ఆమె కొడుకు ఉత్తముడు. పెద్ద భార్య అయిన సునీత పేరుకే రాణి. దాసికన్నా హీనంగా చూసేవాడు. సునీత కొడుకు ధ్రువుడు, ఇతడు తండ్రి ప్రేమకు దగ్గరగా ఉండాలనుకొనేవాడు. కాని తండ్రి, పిన తల్లి అయిన సురుచి ఇంట్లోనే ఎక్కువగా గడిపేవాడు. అందువల్ల ద్రువునికి తండ్రి ప్రేమ కరువైంది.
ఒక రోజు తండ్రితో గడపాలని ధ్రువుడు పినతల్లి ఇంటికి వెళ్ళాడు. తండ్రి ఒడిలో ఉత్తముడు కూర్చొని ఉన్నాడు. ధ్రువుడు సంతోషంతో తండ్రి వద్దకు వెళ్ళాడు. తండ్రి ద్రువుడ్ని చీదరించుకున్నాడు. తండ్రి నిరాదరణకు ద్రువునికి దుఃఖం ఆగలేదు. అది చూసి పినతల్లి అయిన సురుచి కఠినంగా "ధ్రువా! నీవు నా కడుపున పుడితే మీ తండ్రిగారి తొడపై కూర్చొనే అదృష్టం కల్గేది. ఇప్పుడైనా ఈ సురుచి కడుపున పుట్టించమని శ్రీహరిని ప్రార్ధించు. అప్పుడు నీకు ఉత్తమ స్థానం లభిస్తుంది" అన్నది పినతల్లి సురుచి.
జరిగిన విషయమంతా తల్లితో చెప్పాడు ధ్రువుడు. అప్పుడు తల్లి "నాయనా ధ్రువా! నీ పినతల్లి నిజమే చెప్పింది. తండ్రి ప్రేమ కోసమే కాకుండా ఒక పెద్ద ఆశయం పెట్టుకొని శ్రీహరిని గూర్చి తపస్సు చెయ్యి ఫలితం ఉంటుంది" అన్నది తల్లి.
తల్లి మాటలకు ధ్రువుడు సంతోషపడి, తపస్సు చేయుటకు బయలుదేరాడు. దారిలో ద్రువునకు నారద మహర్షి ఎదురయ్యాడు. విషయం తెలిసుకొని నవ్వుతూ "నాయనా ధ్రువా! పసివాడివి పినతల్లి మాటలకు ఇంత పట్టింపా? తపస్సు అంటే మాటలు కాదు! చాలా కష్టము. నీ నిర్ణయం మార్చుకో" అన్నాడు. నారదుని మాటలకు ధ్రువుడు "మహర్షీ! పినతల్లి మాటలకు నాలో రేపిన బాధ అంత,ఇంత కాదు. ఉత్తముని కన్న నేను గొప్ప స్థానం సంపాదించాలి. అది పొందడానికి నేను కఠోర తపస్సు చేస్తాను" అని చెప్పాడు. "పట్టుదల గట్టిదే. నిశ్చలమైన మనస్సుతో తపస్సు చెయ్యి" అని ఆశీర్వదించి నారదుడు వెళ్ళిపోయాడు. ధ్రువుడు యమునా తీరాన ఉన్న మధువనానికి వెళ్ళి, దీక్షతో కొన్ని సంవత్సరాలు కఠోర తపస్సు చేశాడు.
అతని తపస్సుకు మెచ్చి నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు. ధ్రువుడు ఆనందంతో పొంగిపోయి ఎన్నో స్తోత్రాలను స్తుతించాడు. అంతట విష్ణుమూర్తి "ధ్రువా! నీ మనస్సునందున్న కోరిక నెరవేరుస్తున్నాను. ఇంత వరకు ఎవరికీ దక్కని ఉన్నత స్థానాన్ని నీవు పొందుతావు. మహారాజువై గొప్పగా రాజ్యమేలుతూ, సుఖ సంతోషాలతో జీవించి చివరకు నక్షత్రమై, ఉత్తర దిక్కులో స్థిరంగా వెలుగుతావు. లోకమంతా ఆ నక్షత్రాన్ని 'ధ్రువ నక్షత్రం' అని పిలుస్తారు" అని వరమిచ్చి అంతర్దానమైనాడు. నేటికీ కనబడే ఉత్తర ద్రువంపై ఉన్న నక్షత్రమే ధ్రువనక్షత్రం. ధ్రువుడు గొప్ప లక్ష్యంతో తపస్సు చేసి, అనుకున్నది సాధించాడు. పట్టుదల ధృడ సంకల్పం ఉంటే ఏ పనైనా సాధించ వచ్చు అని మనందరం తెలుసుకోవాలి.

భోజనానికి ముందు కాళ్ళు ఎందుకు కడుక్కోవాలి?

“అన్నం పరబ్రహ్మస్వరూపం” అని ఆర్యవాక్యం.
మనిషి మాటలు నేర్చి, వివేకం తెలిసి, వికసించి విజ్ఞానవంతుడైన తరువాత ఆహారానికి వున్న విలువను గుర్తించాడు. మానవుని ప్రాధమిక అవసరాలన్నిటిలోకి ఆహారమే ముఖ్యమైనది అని తెలిసిన
తరువాత సహజంగానే భక్తిభావం పెరిగింది. “ఆహార ఉపాహారాల యిష్టత లేనివానికి సుఖాపేక్ష ఉండదు. సుఖాపేక్ష లేనివానికి సంతుష్టత ఉండదు. ఆహారాన్ని సక్రమంగా తీసికోననివానికి ఏ
కోరికలు ఉండవు” అని చెబుతుంది భగవద్గీత.
పూర్వకాలంలో భోజనశాలను ప్రతినిత్యం ఆవుపేడతో అలికి సున్నంతో నాలుగువైపులా గీతలు (ముగ్గులు) వేసేవారు. దీనివలన
సూక్ష్మక్రిములు భోజన శాలలలోనికి ప్రవేశించేవి కావు. మనుషులను హానిచేసే సూక్షక్రిములులను చంపే శక్తి (పెన్సిలిన్) ఆవుపెడలోనూ, ఆవు మూత్రంలోనూ ఉంది.
భోజనం చేసిన తరువాత క్రిందపడిన ఆహారపదార్థాలను తీసివేసి మరలా నీతితో అలికి శుభ్రపరిచేవారు. చీమలు మొదలైన కీటకాలు
రాకుండా వుండేవి.
మనకు శక్తిని ప్రసాదించి, మన ప్రాణాలను కాపాడి, మనలను చైతన్య వంతులను చేసి నడిపించే ఆహారాన్ని దైవసమానంగా భావించి గౌరవించి పూజించటంలో తప్పులేదుకదా! చేతులు కడుక్కోకపోతే నీ ఆరోగ్యం మాత్రమే చెడుతుంది. కాళ్ళు కడుక్కోకపోతే
కుంటుంబంలోని వారందరి ఆరోగ్యం చెడిపోతుంది. బయటనుండి ఇంటిలోనికి ప్రవేశించే ముందు తప్పనిసరిగా కాళ్ళు కడుక్కోవటం కూడా మన ఆచారాల్లో ఒకటి. ఎవరైనా బంధువులు ఇంటికి
వచ్చినపుడు ముందుగా కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు (పాద్యం) ఇస్తారు. తరువాత త్రాగటానికి
మంచినీరు (ఆర్ఘ్యం) ఇస్తారు.
“మనం బయట ఎక్కడెక్కడో తిరుగుతాం. తెలియకుండా అశుద్ధ పదార్థాలను త్రోక్కుతాం. అదే కాళ్ళతో రావటం వల్ల కుటుబంలోని అందరి ఆరోగ్యాలకూ హాని జరుగుతుంది కదా! ముఖ్యంగా పసిబిద్దలకు మరింత హానిదాయకం” ఇపుడు మన ప్రశాంతంగా తీరికగా అన్నం తింటున్నామా! కాలిబూట్లతో అన్నం తింటున్నాం.
పరుగులు తీస్తున్నాం. “బిజీ!బిజీ!బిజీ!”. అనవసరమైన అవసరాలకోసం అర్థంలేని జీవితమ గడుపుతున్నాం. కాళ్ళు కడుక్కోవటం విషయం అటుంచి చేతులు కూడా కడుక్కోలేని బిజీ
అయిపోతున్నాం. ఇక ఆహారాన్ని గౌరవించే ఓపికా తీరికా ఎవరికిఉంది?

ఈ ఆలయంలో నాలుగు వందల ఏళ్లుగా ఆరని దీపం....

భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతున్న సీతారామచంద్రస్వామి
మానేరు నదీతీరం మధ్య ఉన్న ఆ గ్రామానిది ప్రత్యేకత..
అచంచెలమైన భక్తి విశ్వాసం ఆ గ్రామస్థుల నిత్యపూజలకు
నిదర్శనం.. గ్రామంలోని సీతారామచంద్ర స్వామి దేవాలయంలో
నందాదీపం తరతరాలుగా వెలుగుతోంది.
పూర్వీకులు వెలిగించిన ఆ దీపాన్ని గ్రామస్థులు భక్తి శ్రద్ధలతో కాపాడుతున్నారు. జ్యోతి వెలిగితేనే ఆవునూరు సిరిసంపదలతో
తులతూగుతుందని వారి ప్రగాఢ విశ్వాసం..
సిరిసిల్ల/ఆవునూరు: ముస్తాబాద్ మండలం ఆవునూరులోని సీతారామచంద్రస్వామి దేవాలయంలో నందా దీపం తరతరాలుగా వెలుగుతోంది. ఈ దీపానికి 400 ఏళ్ల చరిత్ర ఉందని ప్రతీతి. నిత్యం
దీపధూప నైవేద్యాలతో సీతారామచంద్రస్వామిని పూజిస్తూ అచంచెల భక్తిభావాన్ని చాటుకుంటున్నారు గ్రామస్థులు.
జ్యోతి వెలిగినంతకాలం తమ గ్రామంలో సిరిసంపదలకు
లోటు ఉండదనేది ఇక్కడి ప్రజల నమ్మకం. నందాదీపంగా పిలిచే ఆ జ్యోతి వెలుగులకు నాలుగు వందల ఏళ్ల చరిత్రకు ఆధారాలు
లేకపోయినా దీపం నిత్యం వెలుగుతూనే ఉందని నాలుగు తరాలకు చెందిన గ్రామస్థులు పేర్కొంటున్నారు. ఆలయంలో కొలువుదీరిన
సీతారామచంద్రస్వామి భక్తుల కొంగుబంగారమై కోరినకోరికలు తీరుస్తున్నాడు. పీచర వంశీయులు ఇక్కడ బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. ఆలయం మానేరు నదీతీరంలోని
పచ్చని పొలాల మధ్య ఉండడంతో ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణ కనిపిస్తుంది. మరోవైపు ఆలయ అభివృద్ధిపై కమిటీ ప్రత్యేక శ్రద్ధతో పర్యవేక్షిస్తుంది.

ధర్మ సూత్రాలు

1. వాల్మీకి శ్రీరామ పట్టభిషేకానంతరం రామాయణ రచన చేశాడు. ముందుగా ఊహించి వ్రాసినది కాదు.
2. వినాశ కాలం వచ్చినవారు వివేకమును కోల్పోయి ధర్మవిరుద్ధమైన పనులు చేసి నశిస్తారు.
3. ఎవరిపాప కర్మలకు వారే బాధ్యులు. కానీ, పాపంలో భాగం కూడా పిల్లలకు రావటం తప్పదు.
4. రావణుడు, ఆంజనేయుడు నవ వ్యాకరణాలు చదివిన సర్వ శాస్త్రవేత్తలు.
5. పరమార్థం తెలియనిదే జీవితానికి ప్రయోజనం లేదు.
6. వ్యాసమహర్షి మహాభారతాన్ని కురుక్షేత్రము అయిన తరువాత చాలాకాలంకి వ్రాసిరి.
7. కైవల్య ముక్తి అంటే మోక్షమే. జీవన్ముక్తి అంటే జీవించి ఉండగనే ముక్తుడై యుండడం. జీవన్ముక్తికి ప్రారబ్దము నశించగావిదేహముక్తుడవుతాడు.
8. భగవత్కథలు ఎప్పుడూ మిధ్యలు కావు. ఇది పెద్దలమాట.
9. పున్నామ నరకం నుంచి రక్షించే వాడే పుత్రుడు.
10. నవగ్రహ స్తోత్ర పఠనంవల్ల నవగ్రహాలు ప్రసన్నములై శుభ ఫలాన్ని యిస్తాయి.
11. ఇతరులకు అపకారం చేసి, ఇతరుల బాధలవల్ల సంతోషము పొందే దుర్మార్గుడిని ఖలుడు అంటారు.
12. జమ్మి చాల పవిత్రమైన చెట్టు. అగ్ని స్వరూపము.
13. బ్రహ్మకపాలంలో పిండ ప్రదానం చాల మంచిపని. అంత మాత్రంచేత తద్దినాలు ఎగ్గొట్ట కూడదు. శరీరం ఉన్నంతవరకు పితృ దేవతలకు తద్దినం పెట్టుట శాస్త్రీయ ధర్మము.
14. ఇతరుల ఐశ్వర్యాన్ని చూసి ఎప్పుడూ దుఃఖపడకూడదని, సత్పురుషులను, ద్వేషించకూడదని, స్త్రీలను పరాభవించకూడదని, పరద్రవ్యాన్ని అన్యాయంగా అపహరించకూడదని, మహాభారతం ద్వారా గ్రహించిన నీతి.
15. భగవంతుని త్రికరణశుద్ధిగా పరమోత్తమ భక్తితో ఆశ్రయించిన భక్తులకు దేహాభిమానముగానీ, అహంకారముగానీ ఏమాత్రము వుండకూడదు.
16. పూర్వ కర్మను బట్టి ఇప్పటి జీవితంలో సుఖదుఃఖాలు సంప్రాప్త మౌతాయి.
17. దేవాలయల్లో ధ్వజస్థంభాలు పవిత్రమైనా, కాపురాలుండే ఇళ్ళపైన వాటి నీడ పడడం శాస్త్ర విరుద్ధం.
18. అశ్వథామ, బలి చక్రవర్తి, వ్యాస మహర్షి, హనుమంతుడు, విభీషణుడు, కృపాచార్యుడు, పరశురాముడు, ఈ ఏడుగురు చిరంజీవులు.
19. గురువునకు, దైవమునకు ఎప్పుడూ వంగి నమస్కారం పెట్టగూడదు. సాష్టాంగం గానే పెట్టాలి.
20. శివాలయానికి ఎదురుగా ఇల్లు కట్టగూడదు.
21. జగమెరిగినవాడు అంటే తత్త్వవేత్త అన్నమాట. అతనికి దేహాభిమానం లేదు.
22. రాధ గోకులమునందు పరాశక్తి. శ్రీకృష్ణుడు పరమాత్మ. శక్తి, శక్తిమంతుల అభిన్నమైన ప్రేమ, భక్తులకు ఆదర్శం.
23. గాయత్రీ మంత్రం జపమాలతో చేసిన ఉత్తమము. విశేష ఫలం.
24. గాంధారి గర్భవతి గా వున్నప్పుడు, సేవ చేసిన మరొక స్త్రీకి కలిగిన ధృతరాష్ట్రుని కుమారుడు యుయుత్సువుడు.
25. విష్ణుమూర్తికి ఇద్దరు కుమారులు, బ్రహ్మ మరియు మన్మథుడు.
26. భక్తివల్ల జ్ఞానము, రక్తివల్ల అజ్ఞానము కలుగును.
27. కృతయుగమునందు తప్పస్సు, త్రేతాయుగమునందు జ్ఞానము, ద్వాపరయుగమునందు యజ్ఞము, విశేష ప్రాముఖ్యమును పొందియున్నవి. కలియుగమున దానము చేయుటయే ముఖ్య కర్తవ్యము.
28. ఏకాదశి వ్రత ఉపవాసమునకు దశమినాటి రాత్రి భోజనం చేయకూడదు. ఏకాదశి పూర్తి ఉపవాసం. ద్వాదశి ఘడియలు ఉండగానే భుజించుట సంప్రదాయం. దీనినే విష్ణువాసం అంటారు.
29. శివుడు అభిషేక ప్రియుడు కావున లింగరూప అభిషేకమే ఆయనకు ప్రియం.
30. మానవ జన్మకు జ్ఞానం విశేషం.

62 కళలు అంటారు..అవి ఏవి?

62 కాదు. చతుష్టష్టి కళలు అంటారు. అనగా 64. వీటినే విద్యాలని కూడ అంటారు. ఈ లెక్కలో కూడ కొన్ని మతభేదాలున్నాయి. కొందరు వేదాలన్నింటిని ఒక్కటిగా లెక్కించారు. కొందరు వాటిని నాలుగుగా చూపారు.
1. వేదం
2. శాస్త్రం
3. ధర్మశాస్త్రం (స్మృత్రి)
4. వ్యాకరణం
5. జ్యోతిశ్శాస్త్రం
6. ఆయుర్వేదం
7. సంగీతశాస్త్రం (గాంధర్వం)
8. కవిత్వం
9. స్వరశాస్త్రం
10. సాముద్రికశాస్త్రం
11. కొక్కోకం (కామశాస్త్రం)
12. శకునశాస్త్రం
13. మల్లయుద్ధవిద్య
14. గారుడం
15. వాక్చమత్కృతి
16. అర్థవేదం
17. దేశభాషా పాండిత్యం
18. వివిధ లిపిజ్ఞానం
19. లేఖనం
20. రథగమనం
21. రత్నపరీక్ష
22. అస్త్రవిద్య
23. పాకశాస్త్రజ్ఞానం
24. శిక్ష
25. వృక్షదోహదాలు
26. ఆగమశాస్త్రం
27. ఇంద్రజాలికం (గారడీ)
28. కల్పం
29. కుట్టుపని
30. శిల్పశాస్త్రనైపుణ్యం
31. రసవిద్య (బంగారం చేయటం – రసవాదం)
32. నృపాలనిధి (రాజనీతిశాస్త్రం)
33. అంజనవిశేషాలు (కాటుకలు)
34. వాయుజలస్తంభన
35. ధ్వనివిశేషం
36. ఘటికాశుద్ధి
37. పశురక్షణ
38. విహంగ భేదాగమన విద్య
39. చిత్రలేఖనం
40. అభినయశాస్త్రవిద్య
41. దొంగతనం
42. వాస్తుశాస్త్రం
43. మణిమంత్రౌషధసిద్ధి
44. లోహకార విద్య
45. స్వప్న శాస్త్రం
46. అష్టసిద్ధులు
47. వడ్రంగం
48. మూలికౌషదసిద్ధి
49. చర్మకారక విద్య
50. గణితశాస్త్రం
51. సూతికాకృత్యం
52. కార్యకారణవిద్య
53. చరాచారాన్యధాకరణం
54. తంతువిద్య
55. యోగవిద్య
56. వ్యవసాయం
57. ప్రశ్నశాస్త్రం
58. వ్యాపారం
59. మిగ్రభేదం
60. వేట
61. తుఅరగారోహణవిద్య
62. అలంకారాలు
63. ఉచ్చాటనం
64. నృత్యం.
వీనిలో కొన్నింటిని తీసివేసి కొందరు; అదృశ్యవిద్య, ధాతుపరీక్ష, శాంతి, నాటకం, పురాణం, సుషిణ, అనర్ధ, ఘనా అనేవాటిని చేర్చారు.

పుణ్యాన్ని ప్రసాదించే ‘గంగ’

పవిత్రమైన గంగానది స్పర్శతో ఎన్నో జీవితాలు పునీతమయ్యాయి. చీకటి అనే అజ్ఞానం తొలగిపోయి జ్ఞానకాంతులు వెల్లివిరిశాయి. అందుకే ఆ పుణ్యనది జ్ఞానగంగ!
గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతీ
నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు
ఎక్కడ, ఏ నీళ్ళలో స్నానం చేస్తున్నప్పటికీ పై శ్లోకంలో పేర్కొన్న ఏడు నదులను స్మరించుకోవాలని పెద్దలవాక్కు. ఆ నదుల వరుసలో ప్రథమ తాంబూలం గంగానదికే. గంగ పేరును తలచుకుంటేనే ప్రతి ఒక్క భారతీయుని హృదయం భక్తితో పులకిస్తుంది. పశుపక్ష్యాదులకు, వృక్ష, మానవజాతికి ప్రాణాధారమైన నీటికే ‘గంగ’ పర్యాయపదమైనదంటే, ఆ తల్లి మన జీవనంలో ఎలా మమేకమైపోయిందో ఊహించుకోవచ్చు. అలా ఈ నేల మీద ప్రతి పుణ్యనది గంగా ప్రతి రూపమే, దివి నుంచి భువికి దిగివచ్చిన పావనగంగ పుట్టుక వెనుక ఒక రహస్యమైన కథ ఉంది.
భగీరథ ప్రయత్నం
మనలో ఎవరైనా అత్యంతకష్టమైన పనిని చేయ సంకల్పించినపుడు భగీరథప్రయత్నం అని అంటుంటాం. గంగమ్మతల్లి ఈ భూమికి రావడానికి వెనుక గల అసలు కారణం కూడ భగీరథ ప్రయత్నమే. భూలోకంలో సగరుడు పరిపాలిస్తున్న సమయం. అతనికి కేశిని, సుమతి అనే ఇద్దరు భార్యలు, కేశినివల్ల అసమంజసుడు అనే కొడుకు, సుమతి వల్ల అరవైవేలమంది పుత్రులు కలిగారు. అసమంజసుడు పేరుకు తగ్గట్టుగా క్రూరునిగా దుష్టకృత్యాలను చేస్తుండేవాడు. చిన్న పిల్లల్ని నదిలోకి విసిరేసి పైశాచిక ఆనందాన్ని పొండుతుండేవాడు. ప్రజలతడిని అసహ్యించుకుని సగరునికి మొరపెట్టుకోగా, అతడు కొడుకును రాజ్యం నుంచి వెళ్ళగొట్టాడు. అనంతరం సగరుడు ఏడు ఆశ్వమేథ యాగాలను తలపెట్టి, అశ్వాన్ని విడిచి, దానివెంట అరవైవేలమంది కొడుకులను పంపాడు. గుర్రం దేశమంతా తిరిగి చివరకు సముద్రంలో ప్రవేశించింది. అప్పడు ఆ గుర్రాన్ని చూసిన ఇంద్రుడు, వాయువును పిలిచి విషయాన్ని చెప్పగా, వాయువు ఆ గుర్రాన్ని బంధించి తీసుకెళ్ళి రాసాతలంలోని కపిలముని ఆశ్రమంలో కట్టేశాడు. సగరపుత్రులకు ఆ తర్వాత గుర్రం కనిపించకపోవడంతో రాజ్యానికి తిరిగి వెళ్ళి తండ్రికి జరిగిన విషయాన్ని చెప్పారు. అశ్వమే లేనప్పుడు ఇక అశ్వమేథ యాగానికి అర్థమేముంది? అని సగరుడు కుమిలిపోతాడు. గుర్రంతో తిరిగి వస్తే తప్ప, మరలా రాజ్యప్రవేశం లేదని కొడుకులను ఆజ్ఞాపించాడు సగర చక్రవర్తి. తండ్రిమాటకు ఎదురు చెప్పలేకపోయిన సగర పుత్రులు సముద్రంలోకి వెళ్ళి రసాతలానికి చేరుకొని అక్కడ కపిలమహర్షి ఆశ్రమంలో కట్టివున్నా అశ్వాన్ని చూశారు. కపిలుడే ఆ గురాన్ని దొంగిలించాడని భావించిన సగరపుత్రులు, కపిలుని దూషిస్తూ అనుచింతంగా ప్రవర్తించగా, ముని కోపంతో కనులు తెరవగా, ఆ జ్వాలల్లో భస్మమైపోయారు.
ఈలోపు అసమంజసుని అంశుమంతుడు అనే కుమారుడు కలుగగా, సగరుడు అతడికే రాజ్యాన్ని అప్పగించాడు. అతడు పినతండ్రుల జాడ కోసం ప్రయత్నిస్తాడు. అలా రసాతలానికి చేరుకున్న అతనికి పినతండ్రుల బూడిదకుప్పలుగా కనబడతారు. గరుత్మంతుని ద్వారా తన పినతండ్రులకు ఉత్తమగతులు కలగాలంటే గంగలోపునీతం చేయడం తప్ప మరోమార్గం లేదని తెలుస్తుంది. ఆ ప్రయత్నంలో కొన్ని తరాలు గడచినా తర్వాత భగీరథుని ప్రయత్నం ప్రారంభమవుతుంది. భగీరథుడు తన పూర్వీకులు కపిలుని ఆగ్రహానికి గురై భస్మమైన సంగతిని తెలుసుకుని, వారికి సద్గతులు కలగాలంటే, ఆ భస్మరాశులపై గంగను ప్రవహింపజేస్తే ఫలితముంటుందని తెలుసుకుంటాడు. గంగను తలచుకుని తప్పస్సు చేసిన భగీరథుడు, ఆమెను ఒప్పిస్తాడు. అయితే తానూ కిందికి ప్రవహిస్తున్నపుడు, తనను భరించగల శక్తి శివునికే ఉంది. కాబట్టి ఆయన భారిస్తానంటే, తను భూమిపైకి రావడానికి సమ్మతమేనని గంగ చెబుతుంది. భగీరథుడు తీవ్రమైన తప్పస్సుతో శివునికూడ ఒప్పిస్తాడు. ఆవిధంగా గంగమ్మ తల్లి భూమిపై వచ్చిందని పురాణ కథనం.
అయితే భూమిపైకి దిగిన గంగ జహ్నుముని ఆశ్రమం లోకి వెళ్లగా కోపగించుకున్న జహ్నుముని గంగను నోటపడతాడు. అప్పుడు భగీరథుడు ఆ మునిని ప్రార్థించగా, కరుణించి తన చెవుల నుండి విడిచి పెడతాడు. అలా భగీరథుని ప్రయత్నం వలన భూమికి వచ్చిన గంగ భాగీరథి అని పిలువబడి, అనంతరం జహ్నుముని వలన జాహ్నవి అయింది. చివరకు నగరపుత్రుల భస్మం మీదుగా గంగ ప్రవహించగా, వారికి ఉత్తమగతులు లభించాయి. అలా భగీరథప్రయత్నం ఫలించింది.
ఇలా గంగ గురించి అనేక పురాణాలలో వివిధ కథలను చూడగలం. ఒక కథ ప్రకారం, ఒకసారి నారదుడు భూలోకానికి రాగా, హిమాలయ ప్రాంతాలకు చేరుకునేసరికి సాయంతమయింది. అక్కడి ప్రకృతి సౌందర్యానికి పరవశించిపోతుండగా, అప్పుడే అతనికి వీనుల విందోనరిస్తూ చక్కని సంగీతధ్వనులు వినిపించసాగాయి. ఆ ప్రకృతిమాట అందించిన పారవశ్యంలో మునిగిపోయి ముందుకు కదిలిన నారదుడు బండరాళ్ళపై పాకుకుంటూ వెళ్తున్న బృందాన్ని చూశాడు. చూపులకు ఎంతో అందంగా కనిపించినప్పటికీ, ఏదో ఒక అవయవ లోపంతో ఉండటం కనిపించింది. నారదుడు విషయమేమిటని అడగ్గా, తాము గంధర్వులమనీ, తాము సంగీతంలోని రాగాలమనీ, ఏ గాయకుడైనా పాడుతున్నప్పుడు, వారి గొంతులో అపశ్రుతులు దొర్లినా, గాత్రంలో గర్వం, అహంకారం పొడసూపినా, రాగలక్షణాలను పట్టించుకోపోయినా తమకు దెబ్బలు తగులుతుంటాయని చెప్పారు. అందుకేమైనా తరుణోపాయం లేదా? అని నారదుడు అడగ్గా, శివుడు గానం చేస్తే, తమకు ఈ దురవస్థ తప్పుతుందని చెప్పారు. వారి మాటలను విన్న నారదుడు, కైలాసానికి వెళ్ళి శివుని పాడాల్సిందిగా అభ్యర్థించాడు.
నారదుని అభ్యర్థనను విన్న శివుడు, పాడేందుకు తన కెలాంటి అభ్యంతరాలు లేవనీ, అయితే, తను పాడుతున్నప్పుడు విని ఆనందించగలిగే శ్రోతలు కావాలని షరతు పెట్టాడు. శ్రోతలుగా బ్రహ్మ, విష్ణువులను ఆహ్వానించిన నారదుడు, అంగవైకల్యం గల గంధర్వులను అక్కడకు రప్పించాడు. శివుని గానంతో విశ్వమంతా మునకలేసింది. క్షణంలో గంధర్వుల అంగవైకల్యం మాయమైంది. అంతటితో కథ ఆగితే విశేషం ఏముంది. శివుని పాటలో మునిగి మైమరచిపోయిన విష్ణువు దేహం కరిగిపోయి నీరై ప్రవహించడం మొదలైయింది. ఈ సంగతిని గమనించిన బ్రహ్మ, ఆ నీటిని తన కమండలంలోకి తీసుకున్నాడు. కొన్ని యుగాలపాటు ఆ నీరు కమండలంలోనే ఉండిపోయింది.
దివినుంచి భువికిదిగిన గంగ శివుని జటలపై ముందుగా కాలిడి, అనంతరం ఈ భూమిపై అడుగుడిన విషయం మనకు తెలిసిందే. అయితే, అదే గంగను శివుడు తన జటలో బంధించిన ఉందంతం ఒకటి ఉంది.
పూర్వం కాలంలో ఒకసారి భూమిపై భయంకర దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. ఎటుచూసినా నీతి చుక్క లేక భూమి బీటలు వారింది. ఆ స్థితిని చూసిన మునీశ్వరులంతా సత్యలోకానికి వెళ్ళి బ్రహ్మదేవునితో, “స్వామీ! నిత్య నైమిత్తిక కర్మలను ఆచరించడానికి, స్నాన, పానాలకు మాకు నీరే లేదు. మమ్ములను అనుగ్రహించి నీతి ఎద్దడిని తొలగించు స్వామీ!” అని వేడుకున్నారు. వారి ప్రార్థనలను ఆలకించిన చతుర్ముఖుడు తన కమండలంలోని ఒక బిందువును వదిలాడు.
ఆ చిన్న నీతి బిందువే మహా ప్రవాహమై రంగత్తుంగ తరంగాలతో ఉవ్వెత్తున లేచి గలగలా ధ్వనులతో ప్రవహిస్తూ తుదకు ఈ భూమండలాన్నంత ఆక్రమించేట్లుగా విజృంభించింది. జరుగబోయే ఉపద్రవాన్ని గమనించిన శంకరుడు సకల లోకవాసులను కాపాడేందుకు ఆ జలాన్ని తన జటాజూటంలో బంధించి ఒక బిందువును మాత్రం ప్రజోపయోగాని కోసం మానస సరోవరంలో వదిలాడని కథనం.

నమస్కార విధానం

నమః – అనగా త్యాగమని వాచ్యార్థం. నేను నీకంటే తక్కువవాడను. నీవు నాకంటే గొప్పవాడవు అనే “దాస్యభావం” (దైవానికి దైవవిషయాలకు) స్ఫురిస్తుంది.
“నాకు నేను ఉపయుక్తుడను కాను”, కాబట్టి, నీవే నన్ను ఉద్దరించగలవాడవు అని ‘ఆత్మార్పణము చేసుకోవటం’ అనునిక అపూర్వయోగాన్ని “నమః" అను పదం సూచిస్తోంది. తన నికృష్ణతను, పూజ్యడగువాని ఉత్కృష్ణతను చూపటానికి నమస్కారంలో ఓ రహస్యం ఉంది. నమస్కారం వంటి తారక మంత్రం ఇంకొకటి లేదు. శత్రువు యొక్క శత్రుభావాన్ని సమూలంగా పోగొట్టగల శక్తి ఈ నమస్కారానికి ఉంది. నమస్కారంతో సకలార్థసిద్ధిని పొందవచ్చు.
శ్రీకృష్ణ పరమాత్మకు ఒక్కసారి నమస్కరించితే పది ఆశ్వమేథయాగాల అనంతరం చేయబడు అవభృథస్నానంతో సమానమని, భారతంలో చెప్పబడింది.
నమస్కారం వలన దైన్యభావం అలవడతాయి. దీనిచే మనలోని అహంకారం తగ్గుతుంది. దైన్యమనగా (నిరాడంబరత) సేవాభావమని అర్థం. సేవాభావం వలన, భగవద్భక్తి పెంపొంది, భగవంతునిపట్ల ఆరాధనాభావం కలుగుతుంది. అట్టి ప్రేమారాధానమే ‘భక్తి’. అట్టి భక్తితో సాధింపరాని సిద్ధులు లేవు. భక్తియే ఆత్మా సాక్షాత్కార జ్ఞానానికి మూలం. పరమభాక్తియే మోక్షప్రాప్తికి ఉత్తమ సాధనం. నమస్కారము – కాయకము, వాచికము, మాసికము అని మూడు విధాలు.
1. కాయకము: ఇది శారీరకమైనది, రెండు అరచేతులు కలిపి చేసే నమస్కారం. పడుకుని అష్టాంగాల్ని నేలపైమోపి చేయబడు సాష్టాంగ నమస్కారం, మరియు ధ్యాన ముద్ర నమస్కారము. (ఎడమబోటనివేలిపై కుడి బొటనవేలు ఉంచి, పరస్పరం పట్టుకుని, ఇతర వ్రేళ్ళను సాచి ఉంచితే మహాముద్ర అవుతుంది) ఈ ధ్యానముద్ర నమస్కారంతో, భావంతుని దానించితే సత్ఫలితాలు సిద్ధిస్తాయి.
2. వాచికము: నోటితో ఉచ్ఛరించునది. “నమః”, “నమస్కారము” మొదలగు శబ్దములతో మనమనోభావాన్ని తెలుపటం.
3. మాసికము: దైవంపట్ల, మనఃపూర్వకమైన ‘నమస్కార’ భావమును మనస్సునందే ఏకాగ్రతతో తలచుట.
ఏవిధమైన నమస్కారమైనప్పటికీ ఆత్మార్పణ చేసుకొనుటయే అవుతుంది. కాయక నమస్కారంతో (శారీరక నమస్కారాలు) అష్టాంగము, పంచాంగము, త్రయ్యంగము, ఏకంగము అని నాలుగు విధానాలున్నాయి.
అష్టాంగ నమస్కారము: అష్టాంగ నమస్కారం ఉత్తమమైనది, ముఖ్యమైనది, తప్పని సరిగా ఆచరించవలసినది.
“శిరోహస్తౌచ కర్ణౌచ చుబుకమ్ బాహు యుగ్మం అష్టాంగ చ నమస్కారమ్” అనగా శిరస్సు, రెండుచేతులు, రెండుచెవులు, గడ్డం, రెండు భుజాలు వీనిని నేలపై ఆనించి చేయబడు నమస్కారం ‘అష్టాంగము’ అని చెప్పబడుతోంది. దేవతలకు, గురువులకు, పెద్దలకు ఈ విధమైన నమస్కారం చేయాలి. (స్త్రీలు ఈవిధమైన నమస్కారాన్ని చేయరాదు).
పంచాంగ నమస్కారము: “శిరోహస్తౌచ బాహుచ కృత్యా జానునీ, సంస్థితా ఇదం పంచాంగ మేవోక్తమ్”
అనగా శిరస్సు, రెండుచేతులు, రెండు భుజాలు, మోకాళ్ళు నేలపై ఆన్చి (మోకాళ్ళపై వంగి) చేయబడు నమస్కారం పంచాంగ నమస్కారమని పిలువబడుతోంది. ఈ విధమైన నమస్కారం స్త్రీలకు ఉత్తమమైనది.
త్రయ్యంగ నమస్కారము: “హస్తౌ బద్ధ్వాతు ముకళ వమ్మార్నిదేశేనియోజయేత్”
రెండుచేతులు ముకుళించి (జోడించి) తలపై ఉంచి చేయబడుతున్న నమస్కారం త్రయ్యంగ నమస్కారం.
ఏకంగా నమస్కారము: “ఏకాంగంతు నమస్కారం శిరసైనా కృతాభవేత్”
తలను మాత్రం వంచి చేయబడు నమస్కారం “ఏకాంగ” నమస్కారమని పిలువబడుతుంది. తప్పనిసరి పరిస్థితుల్లోనే (చేతులను జోడించి నమస్కరించ లేని పరిస్థితులలోనే) ఈ పద్ధతిలో నమస్కరించాలి.
‘గురువు’కు ఈ క్రింది విధంగా నమస్కరించటం శ్రేయస్కరం.
“వ్యత్యప్త పాణినా కార్యమున సంగ్రహణం గురోః |
సవ్యేన సవ్యః స్పృష్టవ్యో దక్షిణేవ చ దక్షణ: ||”
అనగా రెండు చేతులులను మార్చి పట్టుకుని (అనగా కుడిచేతిలో గురువు యొక్క కుడిపాదాన్ని, ఎడమచేతిలో గురువుయొక్క ఎడమపాదాన్ని) పట్టుకుని నమస్కరించాలి. మీ పాదపద్మాలే నాకు శరణ్యమనే భక్తి భావనతో గురువుకు నమస్కరించాలి.
“ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాంకరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాం గముచ్యతే”
వక్షఃస్థలాన్ని, శిరస్సును భూమికితాకించి, దృష్టితో దైవాన్ని చూస్తూ, మనస్సులో దైవమును ప్రార్థన చేస్తూ, ‘నమః’ అని పలుకుతూ, రెండు పాదాగ్రాలను కలుపుతూ, రెండు చేతులతో నమస్కరిస్తూ, రెండు చెవులను నేలకు తాకిస్తూ బోర్లపడి నమస్కరించటం “సాష్టాంగ నమస్కారం” అనబడుతుంది. ఈ విధమైన నమస్కారంలో కాయికము, వాచికము, మానసికము అనబడు త్రివిధాలైన నమస్కారాలు అంతర్గర్భితాలై ఉన్నాయి. అనగా మనస్సు చేత చింతించుట, వాక్కుచే ‘నమః’ అని అనటం, బోర్లగిలి అష్టాంగనమస్కారం చేయుట కలిసున్నాయి. ఇంకా రెండుచేతులు, రెండుకాళ్ళు, వక్షస్థలం, నొసలు, రెండు భుజాలు మొత్తం ఎనిమిది అంగాలను నేలకు తాకుతున్నట్లు బోర్లగిలి నమస్కరిస్తున్నందువల్ల “సాష్టాంగ నమస్కారం” అని పిలువబడుతోంది. ఈవిధమైన “సాష్టాంగ నమస్కారం” శ్రేష్టమైనది. స్త్రీలు సాష్టాంగ నమస్కారాలు చేయరాదు.
నమస్కారాలు చేయటంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. మొక్కుబడిగా, హడావుడిగా కాక మనస్ఫూర్తిగా నమస్కరించాలి. రెండు చేతులను పూర్తిగా కలిపి హృదయస్థానాన్నిగాని, నుదుటనుగాని స్పర్శిస్తూ నమస్కరించాలి. నమ్రతభావనతో నమస్కరించాలి. ఇవన్నీ పూర్తిగా పాటించి నమస్కరిస్తేనే ‘నమస్కారం’ యొక్క నమ్రతాక్రియకు పరిపూర్ణత సిద్ధిస్తుంది. 3,5,7,9,12 సంఖ్యలలో నమస్కారాలు చేయడం శ్రేయస్కరం.
Swami Vivekananda Quotes Telugu's photo.

Swami Vivekananda Quotes Telugu's photo.

దేవుళ్ళు పూజించిన శివలింగాలు..

శివ పరమాత్మను పూజించేందుకు సకల దేవతలు శివలింగాలను పొందారు. అవి:
విష్ణువు – ఇంద్ర లింగం
బ్రహ్మ – స్వర్ణలింగం
లక్ష్మి – నెయ్యితో చేయబడిన లింగం
సరస్వతి – స్వర్ణలింగం
ఇంద్రుడు – పద్మరాగ లింగం
యమధర్మరాజు – గోమేధక లింగం
వాయుదేవుడు – ఇత్తడి లింగం
చంద్రుడు – ముత్యపు లింగం
కుబేరుడు – స్వర్ణలింగం
నాగులు – పగడపు లింగం
అశ్వినీదేవతలు – మట్టితో చేయబడిన లింగాలు

మనలోని శక్తి ఆ పరాశక్తే!

ఈ పుణ్యభూమిలో భగవంతుని ఎదోఒక రూపంలో ఆరాధించడం జరుగుతుంటుంది. అయితే అన్ని విధాలైన పూజలలో శక్త్యారాధాన జరుగుతుంటుంది. ఆ శక్తి రూపమే జగన్మాత. చిత్ ప్రధానమైనది బ్రహ్మవిద్య. శక్తి ప్రధానమైనది శ్రీవిద్య. ఈ రెంటికీ భేదం లేదు. ఈ జగత్తు సృష్టి స్థితిలయలను కలిగించే బ్రహ్మమే శక్తి. ఆమె శ్రీమాత. జగజ్జనని. మూలప్రకృతి. మహామాయ. పిపీలికాది బ్రహ్మపర్యంతం వ్యాపించిన శక్తి ఆమె. పరతత్వానికి స్త్రీ పురుష బేధం లేదు. అయితే శక్తి అనే శబ్దం స్త్రీలింగం అయినందున పరబ్రహ్మమైన పరాశక్తి త్రిపురసుందరిగా పూజలందుకుంటొంది.

ఆ తల్లి ఆవిర్భావాన్ని బ్రహ్మాండాపురాణంలోని లలితాపాఖ్యానం ద్వారా తెలుసుకోగలం. అందులో హాయగ్రీవుడు శ్రీమాత ప్రాదుర్భావాన్ని, ప్రాభవాన్ని సవివరంగా చెబుతాడు. అనంతరం అగస్త్యుని కోరికపై ఆ తల్లి నామాలను చెబుతాడు. అదే శ్రీలలితా సహస్రం. లోకోత్తర లావణ్య భావంతో, చిన్మయ చైతన్యంతో, అణువు అణువులో ఆడిపాడి ఓలలాడే లీలావతి లితాపరమేశ్వరీదేవి. సమస్తలోక కల్యాణమే ఆమె లక్ష్యం. ఆమె హృదయంలో కరుణా సముద్రం పొంగిపొరలుతుంటుంది. చతుష్పష్టి కళలలో ఆమె ఆరితేరిన కళానిధి. ఆమె మృదుమధుర పలుకులలో సకల కళలు ఉట్టిపడుతుంటాయి. భూదేవి దాహాన్ని తీర్చే తీయని మధుధారలంటే ఆ తల్లికి అమితమైన ఇష్టం. తన చల్లని చూపులతో ఈ సమస్తలోకాలను అనుగ్రహిస్తోంది. ఈ లోకంలో ఆమెను మించిన మంచితనాన్ని మనం ఎక్కడా చూడలేం. సహస్రారం చేరేందుకు దారి చూపే వారుణీనాడి ఆమె చేతిలొ ఉంది. అందుకే ఆమె అనుగ్రహం లభించిన వారికి తెలుసుకోవలసింది అంతా పూర్తిగా తెలిసిపోతుంది.

ఆమె మానస సరోవరంలో మందగమనంతో సంచరించే రాజహంసలా తన భక్తుల మనోమందిరంలో నెలకొని ఉంటుంది. మంత్రరూపంలో గోచరించే ఆ తల్లిని ఆరుగురు దేవతలు ఆరాధిస్తారు. హృదయం, శిరస్సు, శిఖ, నేత్రత్రయం, కవచం, ఆస్త్రం – ఇది ప్రతి మంత్రానికి ఉండే అంగన్యాసం. ఇందులో పరమేశ్వరి ఆంగికంగా ఉంటుంది. సాంగంగా, పరమేశ్వరిని ఆరాధించినవాళ్ళకు కీర్తిప్రతిష్టలు, సంపదలు, సమృద్ధి, ప్రజ్ఞ, వైరాగ్యం, ధర్మం అనే ఆరు గుణాలు అలవడుతాయి.

ఆ పరమేశ్వరి తత్త్వాన్ని అర్థం చేసుకునేందుకు చతుర్వింశతి (24) తత్వాలే సోపానాలు. పంచభూతాలు (భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం) పంచ తన్మాత్రలు (శబ్దం, స్పర్శ, రూపం, రసం గంధం) పంచేంద్రియాల జంటలు (కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు) మనస్సు, బుద్ధి, అహంకారం, మహత్తు, వీటిద్వారా ఆ తల్లిని తెలుసుకోవాలి. వీటిలో, వీటికి అతీతంగా ఉండే పర్మేశ్వరి తత్త్వాసన, తత్త్వ సింహాసనంపై ఆసీనురాలైన తత్వాసనిని చూడగలిగిన తాత్వికుడు, ఆ తల్లికి తన అంతరంగాన్ని చెప్పుకుంటాడు.

ప్రపంచంలో ప్రతి పదార్థంలో ఎదో ఒక శక్తి ఉంది. ఆ శక్తికి మూలం పరాశక్తి. పరమేశ్వరిలోని అపరిమేయమైన పరాశక్తి అన్ని పదార్థాలలో వేర్వేరుగా ప్రతిఫలిస్తుంటుంది. ఆమెను మించిన శక్తిలేదు. శక్తిని ఆమె అనుగ్రహం వల్లనే సాధించుకోవలసి ఉంటుంది. అందుకు అచంచలమైన దీక్ష కావాలి. ఉత్కృష్టమైన నిష్ట కావాలి. ఆమె శక్తికే కాదు, జ్ఞానానికి కూడ పరాకాష్ఠ. ఈ సమస్త విశ్వంలోని ప్రజ్ఞా విశేషాలన్నీ అవ్యక్తదశలో పరావాక్కులో ఒదిగి ఉంటాయి. ఆ పరావాక్కే పరాశక్తి.

ఘనీభవించిన జ్ఞానమే కరిగి వాగ్రూపంలో ప్రవహిస్తుంది. అనంతమైన జ్ఞానం అమెలో ఇమిడి ఉన్నందువల్ల ఆమె జ్ఞానానందంలో తేలిపోతుంటుంది.

ఆమె పేరు చెబితేనే మాంగల్యం ఫలిస్తుంది. మంగళ ధ్వనులు వినిపిస్తాయి. ఆమెను దర్శించుకున్న ప్రతి బిందువు మహా సింధువులా పొంగిపోతుంది. ఆమె చరిత్రను తెలుసుకున్నవారికి ఆ తల్లి కరుణాకటాక్షాలు పూర్తిగా లభిస్తాయి. ఆమె సాయుజ్యమే అఖండమైన సామ్రాజ్యం. ఆ తల్లి కటాక్షవీక్షణం ప్రసరిస్తేచాలు, సమస్త ఐశ్వర్యాలు మన ముందుకొచ్చి పడతాయి. అన్యులను కూడ ధన్యులను చేసే కరుణామయి. అందరికీ ఆనందాన్ని పంచిపెట్టే కారుణ్యమూర్తి ఆ తల్లి. ఆ తల్లిని నిత్యం ప్రార్థించుకుంటే సమస్తశుభాలు కలుగుతాయి అన్ని విధాలైన కష్టాలు తొలగిపోతాయి.

వర్ణాశ్రమధర్మం అంటే ఏమిటి?

వర్ణాశ్రమధర్మం అంటే సాంఘిక జీవనం సాఫీగా సాగాతానికీ, ఒకే వృత్తిని అందరూ అవలంబించకుండా వుండతానికీ, మానవ సదుపయోగానికీ వర్ణాశ్రమ ధర్మం ప్రవేశ పెట్టడం జరిగింది.

1. వర్ణధర్మ ప్రారంభం ఎలా జరిగిందంటే, సూక్ష్మబుద్ధి, సాతవిక యోచన వున్నవారినీ, పాపభీతి అహింసాప్రవృత్తి, వున్నవారినీ, కాయకష్టం చేయలేని బలహీనుల్ని, ఒక భాగంగా విభజించారు. వీరే బ్రాహ్మణులు. అయితే ఈ విభాగంలోనివారు ధర్మప్రవృత్తికి కట్టుబడి, తమ వృత్తికి లోబడి వుండకపోతే వాళ్ళను బ్రాహ్మణులుగా పరిగణించేవారు కాదు. సంఘ బహిష్కారం జరిగించేవారు. క్రూరమృగాలున్నఅడవులకు నేట్టేవారు.

2. ధైర్యసాహాసాలు, దేహశక్తి, పోరాటపటిమతో పాటూ రక్షణా శక్తి గలిగిన వారని నాయకులుగా నియమించుకొన్నారు. వీరే ‘క్షత్రియులు’. తమ గుంపులోనివారిని మరొక గుంపువారినుండి ఏ ఆపదా రాకుండా కాపాడటం, క్రూర జంతువుల బారినుండి స్త్రీలకూ, వృద్ధులకు, పసివారికి రక్షణ కల్పించటం ఈ వర్ణంవారి బాధ్యత.

3. తెలివితేటలూ, ధర్మబుద్ధి, న్యాయవివక్ష కలిగి వినిమయ దక్షత కలిగినవార్నిని ఆహార పదార్థాలు అందరికీ, అన్నీ అందటంకోసం వస్తుమార్పిడి జరగటం కోసం నియమించబడినవారే ‘వైశ్యులు’. ఎవరు ఏ విధమైన ఆహార పదార్థాలు సేకరించినా అవి అందరకూ వస్తుమార్పిడి పద్ధతిలో అందేట్లు చేయటం వీరి కర్తవ్యం.

4. ఒక గుంపులో వేయిమంది జనంవుంటే పదిమందిని నాయకులుగానూ, ఇద్దరినీ ఆహార వస్తువుల మార్పిడికిగాను, ఇద్దరినీ (బ్రాహ్మణులను) న్యాయరక్షణకు గానూ, నియమించుకొని మిగిలిన వారందరూ వ్యవసాయ వృత్తికీ, అడవులలోని కందమూలాలకూ ఫలసేకరణకు వెళ్ళేవారు. అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్ణానికి చెందినవారు పదిమంది వుంటే మిగిలిన  తొంభైమంది శూద్రవర్ణంవారు వుండేవారు.
అందరూ నియమానికి కట్టుబడి వుండేవారు.

గుంపులు గుంపులుగా వుంది బ్రతుకు సాగించే ఆనాటి జనంలో ఒక దురాచారం వుండేది. ఎదుటి గుంపులో స్త్రీలను మాటువేసి అపహరించుకొని పోయేవారు. శాశ్వతంగా తమవద్దనే వుంచుకోనేవారు. అబలలైన స్త్రీలు దౌష్ట్యానికి తలవంచి జీవించేవారు. తమ గుంపులోని స్త్రీలను ఎదుటి గుంపువారు అపహరించుకొని పోవటం అవమానంగానూ, చేతగానితనంగాను భావించేవారు. సమయం చూచి మాటువేసి అవతలి గుంపువారి ఆడవారిని బలాత్కరంగా ఎత్తుకొచ్చి స్వంతం చేసుకొనేవారు.
ఈవిధంగా సాగుతుండేది వారి జీవనం.
ఈ పరిస్థితులలో – రక్షణకు క్షత్రియవర్ణం, ధర్మన్యాయ నిర్ణయానికి బ్రాహ్మణ వర్ణం, అందరికీ అవసరమయ్యాయి. ఈ రెండు వర్ణాలవారు పెద్దలయ్యారు. అయితే ఎవరు ధర్మం తప్పి చరించేవారు కాదు.
బుద్ధిచాతుర్యం, నియమపాలన, శాకాహార నియమం కలిగిన బ్రాహ్మణ వర్ణం అందరి అభిమానాన్ని, మెప్పునీ సాధించారు. క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాలను శాసించేస్థితికి ఎదిగారు. నాలుగు వర్ణాలలో వీరే అగ్రస్థానం సాధించారు. చాల నియమబద్ధంగా కూడా వుండేవారు. పర స్త్రీలవంక కన్నెత్తి చూచేవారు కాదు. ఒక స్త్రీతోనే నియమబద్ధంగా వుండటం శూద్ర క్షత్రియ వైశ్య వర్ణాలవారిని ఎంతో ఆకర్షించింది. అందరూ బ్రాహ్మణ వర్ణాన్ని అగ్రవర్ణంగా అభిమానించి గౌరవించటం మొదలు పెట్టారు.
అప్పటికి భాష వున్నా లిపి లేదు. చతుర్వర్ణాలలో బుద్ధివంతులైన బ్రాహ్మణవర్ణమే భాషకు లిపిని సమకూర్చారు. క్షత్రియ వైశ్యవర్ణాలవారికి లిపిని నేర్పించి విద్యావంతులను చేయటమే కాకుండా న్యాయ నీతి ధర్మ సూత్రాలు రచించారు. అవన్నీ అందరికీ ఆమోదయోగ్యం అయ్యాయి.
బుద్ధికుశలత వున్నా బ్రాహ్మణ వర్ణం అగ్రవర్ణం అయింది. (ఈనాడు మనం చూస్తున్న బ్రాహ్మణ వర్ణానికి, ఆనాటి బ్రాహ్మణ వర్ణానికి ఏ విధమైన సారూప్య సంబంధాలు లేవంటే లేవని చెప్పటం దుస్సాహసమే అవుతుంది. క్షమించాలి.)
ఆనాటి బ్రాహ్మణ వర్ణానికి వర్ణ వివక్ష యింత నీచంగా లేదు. వుండివుంటే పరం బ్రహ్మర్షి సద్బ్రాహ్మణుడైన వశిష్టమహర్షికి పంచమ జాతికన్య అయిన అరుంధతి భార్యగా అయ్యేది కాదు గదా!
ఆ|| పాపవర్తనుండు బ్రాహ్మణుండయ్యును
నిజము శూద్రుకంటె నీచ తముడు
సత్యశౌచ ధర్మశాలి శూద్రుండయ్యు
అతడు సద్విజుండయనిరి మునులు
(శ్రీ మహాభారతం పంచమాశ్వాసం అరణ్యపర్వం 137)
గౌతముని శాపంవల్ల బ్రాహ్మణులు ధర్మదూరులై అపమార్గాన్ని అవలంబించి, సదాచారానికి దూరమై, ధనలోభానికి లొంగిపోయారు. శాస్త్రాలను తలక్రిందుల చేసారు. అసంబద్ధ ఆచారాలను అక్రమ సాంప్రదాయాలను అమాయక జనసామాన్యుల్లోకి చొప్పించారు. ఇది త్రేతాయుగంలో చివరి భాగాన జరిగిందని అంచనా.
అయితే అందరూ గమనించవలసిన విషయం ఒక్కటుంది. శ్రీ మద్రామాయణం వ్రాసిన వాల్మీకి బ్రాహ్మణుడు కాదు. భారతీయులు మాత్రమే కాదు బ్రాహ్మనవర్ణం ఆరాధించి పూజించే అయోధ్య రాజైన శ్రీరాముడు బ్రాహ్మణుడు కాదు. శ్రీకృష్ణుడు బ్రాహ్మణుడు కాదు. బ్రహ్మర్షి విశ్వామిత్రుడు బ్రాహ్మణుడు కాదు. ఇలా చెప్పుకుంటూ పొతే చాల వుంది!!
బ్రాహ్మణ – క్షత్రియ – వైశ్య – శూద్ర జాతులే కాక ఐదవ జాతిగా (పంచమజాతి) కొందరిని విభజించటం జరిగింది. వారే మాల మాదిగాలుగా ఊరికి దూరంగా ప్రత్యేకంగా వుంటూ వచ్చారు. మాంసాహారం వీరికి ప్రధానాహారం. చెప్పులు కుట్టటం చర్మ సాధానాలు తయారుచేయటం, కూలిపని చేయటం వీరికి ముఖ్యవృత్తిగా శాసించటం జరిగింది. శ్మశానాలను కాపలా కాయటం కూడా వీరి బాధ్యతే!!
పంచమజాతి వారికి ఆలయ ప్రవేశం వుండేది కాదు. వారికి ప్రత్యేక ఆచారాలు, ప్రత్యేక దేవతలు, ప్రత్యేక వస్త్రధారణ వుండేవి. మారెమ్మ, మహంకాళమ్మ, పోతమ్మ, కంకాళమ్మ మొదలైన దేవతలను కొలవటం, మాంసాహారులు కావటం వాళ్ళ జంతు బలులు ఇవ్వటం వారికి ఆచారమయింది.

అన్నదములైన హిందువులు కులాల పేరుతో విడిపోయి హిందూ శక్తినీ, హిందూ మతాన్నీ, హిందూ ఆదర్శాన్నీ , హిందూ తత్వాన్ని కకావికలు చేసారు. ప్రపంచ దేశాలలో ఎక్కువ కులాలు ఉన్న దేశంగా భారతేదేశం నమోదు అయింది.

హిందీ భాషను భారతీయుల భాషగా చేయాలనీ, భారతీయు లందరికీ ఒకే భాష వుండాలనీ ఎంతో మంది ప్రయత్నం చేసారు. కానీ మాతృభాషా వ్యామోహం వున్నా మన భారతీయులు అంగీకరించలేదు. దురదృష్టం!
“మానవ కల్యాణంకోసం నియమించు కొన్న వర్ణాశ్రమ ధర్మ వెర్రితలలు వేసి వికృతరూపం దాల్చి, విషపు కోరలు చాచి హిందూమతాన్ని వేయి ముక్కలుగా చేసింది. ప్రపంచ నాగరికతలో పేరుపొందిన హిందువులు వర్ణధర్మంతో విడిపోయారు. శూద్ర వర్ణం వ్రక్కలైపోయి వివిధ కులాలుగా మారిపోవటం జరిగింది. ఇపుడు మన కులాల సంఖ్య మూడువేలుకు పైనే వుంది.”

వర్ణాశ్రమ ధర్మ కాలక్రమంలో నశించిపోయింది. ధనసంపాదన జీవిత ధ్యేయంగా మారి అన్ని వర్ణాలవారూ అన్ని ధర్మాలనూ మన్నిస్తున్నారు.
శుభం సర్వేజనా: సుఖినోభవంతు.

వటపత్ర శాయి అనగా?

మర్రి ఆకు మీద శయనించిన దేవుడు అని. ఈ వృత్తాంతం మార్కండేయ మహర్షి చరిత్రలో ఉంటుంది. మార్కండేయుడు ఆరు మన్వంతరములు తపస్సు చేశాడు. ఏడో మన్వంతరములో ఇంద్రుడు తపస్సును చెడగొట్టడానికి అందమైన అప్సరసలను పంపాడు. వారి నాట్య హోయలకు మార్కండేయుడు చలించలేదు.
చలించని మార్కండేయునికి శ్రీమహావిష్ణువు ప్రత్యక్షమై ‘ఏం వరం కావాలో కోరుకో’ అనగా ‘నీ మాయను చూడాలని ఉంది’ అని అడుగుతాడు.

ఆ తర్వాత కొన్ని రోజులకి ప్రచండ గాలీ, ధారాపాత వర్షమూ విపరీతంగా వచ్చి సముద్రాలు పొంగాయి. నీటి తో సమస్తం మునిగిపోతుంది. మార్కండేయుడు మోహశోకాలతో విష్ణుమాయతో నీటిపై జీవించాడు. అలా తిరుగుతున్న అతనికి ఓ చోట మర్రిఆకుపై శయనిస్తున్న బాలుడు కనిపించాడు. చేతి వ్రేళ్ళతో కాలిని పట్టుకుని నోట ఉంచుకొని చీకుతూ కనిపించాడు. అతడే వటపత్రశాయి.

మహావిష్ణువు ఆదేశంతో మర్రి ఆకుపై నున్న వటపత్రశాయి కడుపులోకెళ్లి చూస్తాడు. నీట మునిగిన సమస్త భూమీ, ప్రాణ కోటి కనిపిస్తుంది.


మళ్ళీ మరోచోట సృష్టి ప్రారంభము చేస్తాడని తెలుసుకుంటాడు మార్కండేయుడు. శ్రీమాహావిష్ణువు వరం ప్రకారం విష్ణు మాయను తెలుసుకుంటాడు.

మొగలిపూవు పూజకు అర్హత లేని పువ్వని అంటారు. నిజమేనా?

పూర్వం బ్రహ్మ విష్ణువులు నేను గొప్పంటే నేను గొప్పని కలహించుకుంటూ ఉండగా, అపుడు వారి మధ్య ఒక శివలింగం పుట్టి బ్రహ్మను, నా శిరస్సు ఎక్కడుందో కనుక్కోవలసిందని; విష్ణువును నా పాదాలేక్కడున్నాయో కనుక్కోవలసిందని ఆదేశించింది. హంసరూపంలో బ్రహ్మ పైకి; ఆదివరాహరూపంలో విష్ణువు క్రిందికి వెళ్లారు.

బ్రహ్మకు లింగంశిరస్సు, విష్ణువునకు లింగపాదాలు కన్పించలేదు. మన్వంతరాలు తిరిగిపోయాయి. ఇద్దరూ తిరిగి పోరాడుకున్న స్థలానికే వచ్చారు. విష్ణువు నాకు లింగంపాదాలు కనిపించాలేదన్నాడు. బ్రహ్మ తానూ లింగం శిరస్సు చూచానని; మొగిలిపూవును, కామధేనువును వెంటబెట్టుకొని వచ్చి మొగలిపూవుచేత చూచినట్లు సాక్ష్యం చెప్పించాడు. కామధేనువు నడగ్గా అది తన తోకను అడ్డంగా ఊపి ఇది అబద్ధమని తెలియజేసింది. అప్పుడు విష్ణువు మొగలిపూవు అబద్ధం చెప్పింది కనుక అది పూజకర్హం కాదనీ, కామధేనువు వృష్ఠభాగంతో సత్యం తెలిపింది కనుక ఆవుకు వెనుకభాగం పూజార్హమగుగాక యనిన్నీ శాపం పెట్టాడు. అందువల్ల మొగలి పూవు పూజకర్హం కాకుండా పోయింది. ఆవు వెనుకభాగమే పూజింపబడుతోంది. మల్లె, గులాబీ మొదలైన పూవులు కూడా పూజకనర్హాలే! మల్లె కేవలం అలంకారానికి మాత్రమే!

గుడిలో ఎందుకు ప్రదక్షిణలు చేస్తారు?

“ప్రదక్షిణం” లో ‘ ప్ర ‘ అనే అక్షరము పాపాలకి నాశనము… ‘ ద ‘ అనగా కోరికలు తీర్చమని , ‘ క్షి ‘ అన్న అక్షరము మరుజన్మలో మంచి జన్మ ఇవ్వమని. ‘ ణ ‘ అనగా అజ్ఞానము ప్రారద్రోలి ఆత్మజ్ఞానము ఇవ్వమని. గుడిలో భగవంతుడి చుట్టూ తిరిగే ప్రదక్షిణంలో ఇంత అర్థం ఉంది. పూర్వం ఆదిలో వినాయకుడు పార్వతీ, పరమేశ్వరుల చుట్టూ తిరిగి విశ్వానికి ప్రదక్షిణ చేసిన ఫలం పొందాడు. కాన భగవంతుని చుట్టూ చేసే ప్రదక్షిణ విశ్వ ప్రదక్షిణమవుతుంది. ఆత్మ ప్రదక్షిణ అవుతుంది. భగవంతుడా! నేను అన్నీ వైపుల నుంచి నిన్నే అనుసరిస్తూ ధ్యానిస్తున్నానని అర్థం.

అదివో అల్లదివో శ్రీహరి వాసము

అదివో ...ఓ.ఓ.ఓ
గోవింద గోవింద గోవింద గోవింద గోవింద
అదివో అల్లదివో శ్రీహరి వాసము
పదివేలు శేషుల పడగలమయము
అదివో అల్లదివో శ్రీహరి వాసము
పదివేలు శేషుల పడగలమయము
అదివో అల్లదివో శ్రీహరి వాసము
ఏడు కొండల వాడా వెంకట రమణ గోవిందా గోవిందా
అదే వేంకటాచల మఖిలోన్నతము
అదివో బ్రహ్మాదుల కపురూపము
అదివో నిత్యనివాస మఖిలమునులకు
వెంకటరమణ సంకట హరణ
నారాయణ నారాయణ
అదివో నిత్యనివాస మఖిలమునులకు
అదే చూడుడు అదే మ్రొక్కుడు ఆనందమయము
అదే చూడుడదె మ్రొక్కుడానందమయము
అదివో అల్లదివో శ్రీహరి వాసము
వడ్డికాసులవాడా వెంకటరమణ గోవిందా గోవిందా
ఆపదమొక్కులవాడా అనాధ రక్షకా గోవిందా గోవిందా
కైవల్య పదము వెంకటనగ మదివో
శ్రీ వేంకటపతికి సిరులైనది
భావింప సకల సంపద రూపమదివో అదివో అదివో
వెంకట రమణ సంకట హరణ
భావింప సకల సంపద రూపమదివో
పావనములకెల్ల పావనమయము
అదివో అల్లదివో శ్రీహరి వాసము
వెంకటేశా నమో శ్రీనివాసా నమో
ఏడు కొండల వాడా వెంకట రమణా గోవిందా గోవిందా
అదివో అదివో అదివో

బిల్వ వృక్షం ఎక్కడ పుట్టింది?

శ్రీమహావిష్ణువు తన సతితో కలిసి శివుని గూర్చి తపస్సు చేస్తుండగా లక్ష్మీదేవి కుడిచేతి నుంచి బిల్వవృక్షం జన్మించింది. మహాశివుడు ప్రత్యక్షమై జగద్రక్షణ భారాన్ని శ్రీమహావిష్ణువుపై ఉంచాడు.

శ్రీవృక్షమనే పేరుతో కూడా పిలిచే బిల్వ వృక్షంనుదేవతలు స్వర్గంలోనూ, మందార పర్వతం పైనా, వైకుంఠంలోనూ నాటారు. శివుని కిష్టమైన ఈ బిల్వ వృక్ష ఆకులతో ఏ రోజైనా పూజ చేయవచ్చు. సోమవారం కోస్తే సోమవారం నాడే పూజకి వినియోగించాలి.

ఎండినా, కోసి రెండు మూడు రోజులైనా శివ పూజకు వాడకూడదు. బిల్వ వృక్షానికి ప్రదక్షిణలు చేస్తే సమస్త దోషాలు పోతాయి. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. బిల్వ వృక్ష పత్రం లక్ష బంగారు పూవులతో సమానం.