Wednesday, September 12, 2012

నవరత్న ధారణ విధానము

రత్నధారణము వల్ల కలుగు కష్టములు తొలగి,అదృష్టము వరించునని అనేకులు నేటి కాలమున విశ్వసించుచున్నారు. కాని ఎవరు ఏ రత్నము ధరించవలెనో జాతక రీత్యా గాని,వారి వారి పేర్లను బట్టీ గాని నిర్ణఇంపవలసియున్నది.కొందరు జ్యోతిష్కులు(బంగారపు కొట్లవారు కూడ) నవరత్నాల ఉంగరాలు ధరించినచో,"సర్వ రోగ నివరిణి " వలె అన్ని గ్రహదొషములు తొలగిపోవునని ప్రచ్హరము చేయుచున్నారు.అది సరికాదు. సూర్యాది నవగ్రహములకు ప్రీతికరమైన రత్నములు శాస్త్రములో చెప్పబడినవి.

నవగ్రహములు ప్రీతి కొరకు, ఆయా గ్రహములకు చెప్పబడిన మంత్ర జపములు, హోమములు చేయించి, సంతర్పణము చేసి, నవరత్నములను దానము చేయవలెనని శాస్త్రములొ చెప్పబడినది గాని, ఆ రత్నములను ధరించవలెనని యెచ్చటాను కానరాదు. రత్నపుటుంగరములను ధరింన్చుట తప్పు కాదు. వెనుక చెప్పినట్లు నవరత్నపుటుంగరమును గాని,వారి జాతకరీత్య ఒక్క రత్నమును గాని బంగారముతో ధరించవలెను.రత్నపుటుంగరమునందుఆయా గ్రహదేవతల నావాహచేసి,పూజ-జప-దానములు సలిపి ఉంగరమును ధరించినచో మేలు కలుగును.అవి చేయింపక,పట్టిగా ధరించినచో నిష్ఫలమగునని తెలియవలెను.                                          

నవగ్రహ దోషములు-స్నానౌషధములు
  సిద్ధౌషధ సేవలవలన రోగములు,మంత్ర జపమువలన సకల భయము తీరునట్లుగా ఔషధస్నాన విధానమువలన గ్రహదోషములు నశించును.

సూర్య గ్రహ దోషము తొలగుటకు:
మణిశిల,ఏలుకలు,దేవదారు,కుంకుమ పువ్వు,వట్టివేళ్ళు,యష్టిమధుకము,ఎర్రపుష్పాలు,ఎర్రగన్నేరు పువ్వులు _ ఈ వస్తువులను నీళ్ళూ వేసి కాచి,ఈ నీటితో స్నానము చేయవలెను.

చంద్ర గ్రహ దోషము తొలగుటకు:
గో మూత్రము,ఆవు పాలు,ఆవు పెరుగు,ఆవు పేడ,ఆవు నెయ్యి,శంఖములు,మంచిగంధములు,స్పటికము_ ఈ వస్తువులను నీళ్ళలో వేసి కాచి, ఆ నీటితో స్నానము చేయవలెను.

కుజ గ్రహ దోషము:
మారేడు పట్టూ,ఎర్రచందనము,ఎర్రపువ్వులు,ఇంగిలీకము,మాల్కంగినీ, సమూలంగా పొగడ పువ్వులు _ ఈ వస్తువులను నీళ్ళలో వేసి కాచి ఆ నీటితో స్నానము చేయవలయును.


బుధ గ్రహ దోషము: ఆవుపేడ,తక్కువ పరిమాణములో పండ్లు,గోరోచనము,తేనే,ముత్యములు బంగారము _ ఈ వస్తువులను నీళ్ళలో వేసి కాచి,ఆ నీటితో స్నానము చేయవలయును.

గురు గ్రహదోషమునకు:
మాలతీపువ్వులు,తెల్ల ఆవాలు,యష్టి మధుకం,తేనే _ వస్తువులను నీళ్ళలో వేసి కాచి,ఆ నీటితో స్నానము చేయవలయును.

శుక్ర గ్రహదోషము:
యాలుకలు,మణిశిల,శౌవర్చ లవణము,కుంకుమ పువ్వు_ ఈ వస్తువులను నీళ్ళలో వేసి కాచి,ఆ నీటితో స్నానము చేయవలయును.

శని గ్రహ దోషము:
నల్ల నువ్వులు,సుర్మరాయి,సాంబ్రాణి,సోపు, _ వస్తువులను నీళ్ళలో వేసి కాచి,ఆ నీటితో స్నానము చేయవలయును.

రాహు గ్రహ దోషము:
సాంబ్రాణి,నువ్వు చెట్టు ఆకులు,కస్తూరి,ఏనుగు దంతము(ఏనుగు దంతము లేకపొయినను తతిమ్మా వాటితో) _ ఈ వస్తువులను నీళ్ళలో వేసి ఆ నీటితో స్నానము చేయవలయును.


కేతు గ్రహ దోషము: సాంబ్రాణి,నువ్వుచెట్టు ఆకులు,ఏనుగు దంతం,మేజ మూత్రం ,మారేడు పట్ట_ ఈ వస్తువులను నీళ్ళలో వేసి కాచి ఆ నీటితో స్నానం చేయవలెను. (వారి వారి జాతక రీత్యా ఏ ఉంగరము ధరింపవలెనో తెలియగోరువారు, దైవఙ్ఞుని  సంప్రదించవలెను).  దోషాలు
ఏడురంగుల సమ్మేళనమే మన శరీరం. ఈ రంగులలో ఏ ప్రాథమిక రంగు మనలో లోపించినా, ఆ లోపం కారణంగా మనం అనారోగ్యం కొని తెచ్చుకోవడం జరుగుతుంది. రంగు కిరణాల లోపం కారణంగా మనలో వ్యాధులు వచ్చే అవకాశముంది. ఒక వ్యక్తిని సూర్య చంద్రుల ప్రభావం పడకుండా ఒకచోట ఉంచినప్పుడు ఆ వ్యక్తికి కొన్ని చర్మవ్యాధులు, మరికిన్ని అనారోగ్య లక్షణాలు కనిపించి తీరుతాయి. కాబట్టి గ్రహాల కిరణాలు మనిషిని తాకుతాయని, అలా తాకడం అవసరమని మనకు అర్థమవుతుంది.


ఈ కాస్మిక్ రేస్ లో కొన్ని మనిషి మీద చెడు ప్రభావాన్ని చూపిస్తాయి. మనిషి పుట్టిన సమయాన్ని బట్టి జన్మ, నామ నక్షత్రాలను అనుసరించి కొన్ని గ్రహాల ప్రభావం అతడి మీద ఉంటుంది. ఆయాగ్రహాల ప్రభావం వలన అతడికి అందే కాస్మిక్ రేస్ కారణంగా అతడికి అనారోగ్యం వస్తుంది. ఐతే, ఆయా గ్రహాలకు సంబంధించిన ప్రత్యేక రత్నాలు ధరించడం వలన గ్రహాల నుండి అందే కిరణాల వడపోత జరిగి, ఉపయోగకర కిరణాలు మాత్రమే శరీరంలోకి ప్రవేశిస్తాయి. గ్రహాల నుండి అందే కిరణాల ప్రభావం ఎక్కువ కావచ్చు, లేదా అసలు ప్రభావితం చూపకపోవచ్చు. కాని రత్నం ఆ కిరణాలను న్యూట్రలైజ్ చేసి సరిపడేంత మోతాదులో శరీరానికి గ్రహాల కిరణాల ప్రభావం అందిస్తుంది. కాబట్టి రత్నాలలో దోషాలు వాటి లక్షణాలను తెలుసుకుంటే దోషాలు లేని రత్నాలు ధరించడం వలన ప్రయోజనం ఉంటుంది.

భారతీయ సాహిత్యములో తొమ్మిది సంఖ్యకు అగ్రస్థానమున్నది. నవబ్రహ్మలు, నవరసాలు, నవగ్రహాలు, నవధాన్యాలు, నవనిధులు, నవఖండాలు, నవ ఆత్మ గుణములు, నవ గ్రహదేశములు, నవ చక్రములు, నవదుర్గలు, నవ రత్నాలు మొదలైనవి దీనికి తార్కాణం.
ప్రాచీన కాలం నుండి భారతదేశం "రత్నగర్భ" అని పేర్కొనబడుతూ ఉంది. రోమన్ చరిత్ర కారుడు "ప్లీవీ" ప్రపంచ దేశాలన్నింటిలో హిందూదేశమే ఎక్కువ రత్నాలను ఉత్పత్తి చేస్తుంది అని ప్రాచీన కాలంలోనే వ్రాసాడు. మన ప్రాచీన గ్రంథాలలో రత్నాల పేర్లు తెలుపడమే గాని, వాటి గుణగణాలు, ఉపయోగాలు, మంచి చెడ్డ జాతులను విడదీసి వివరాలు ప్రథమంగా బుద్ధభట్ట "రత్నపరీక్ష" అనే గ్రంథం వ్రాశాడు. తరువాత వరాహమిహిరుడు "బృహత్సంహిత" లోనూ చాలా విషయాలు వ్రాసారు. “రసజలనిధి" అనే గ్రంథంలో రసాయనిక తత్వాన్ని గూర్చి బాగుగా వివరించబడింది.

మహారత్నాలయిన వజ్రం, నీలం, కెంపు, పుష్యరాగం, పచ్చ వీటిని పంచరత్నాలంటారు. వైడూర్యం, గోమేధికం, పగడం, ముత్యం వీటిని ఉపరత్నాలంటారు. రత్నాలలో ఎక్కువ విలువైనది వజ్రం. దీనిని రత్నరాజ మంటారు. వజ్రాలు, పచ్చలు. కెంపులు, నీలాలు ఇవి నిజరత్నాలు. వీటిని ఉత్తమ జాతివిగా భావిస్తారు. కావున ఎక్కువ విలువగలవి, మధ్యమజాతి రత్నాలు, ఆకారపు వయ్యారాలు, కోత పనితనాలు, స్వచ్ఛతయూ కలిగిఉండినచో, ఆ అతిశయం వలన విలువగలవిగాను, తక్కినవి అధమజాతులు చాలా ఉన్నాయి.

No comments:

Post a Comment