Monday, June 18, 2012

మొగలిపూవు పూజకు అర్హత లేని పువ్వని అంటారు. నిజమేనా?

పూర్వం బ్రహ్మ విష్ణువులు నేను గొప్పంటే నేను గొప్పని కలహించుకుంటూ ఉండగా, అపుడు వారి మధ్య ఒక శివలింగం పుట్టి బ్రహ్మను, నా శిరస్సు ఎక్కడుందో కనుక్కోవలసిందని; విష్ణువును నా పాదాలేక్కడున్నాయో కనుక్కోవలసిందని ఆదేశించింది. హంసరూపంలో బ్రహ్మ పైకి; ఆదివరాహరూపంలో విష్ణువు క్రిందికి వెళ్లారు. బ్రహ్మకు లింగంశిరస్సు, విష్ణువునకు లింగపాదాలు కన్పించలేదు. మన్వంతరాలు తిరిగిపోయాయి. ఇద్దరూ తిరిగి పోరాడుకున్న స్థలానికే వచ్చారు. విష్ణువు నాకు లింగంపాదాలు కనిపించాలేదన్నాడు. బ్రహ్మ తానూ లింగం శిరస్సు చూచానని; మొగిలిపూవును, కామధేనువును వెంటబెట్టుకొని వచ్చి మొగలిపూవుచేత చూచినట్లు సాక్ష్యం చెప్పించాడు. కామధేనువు నడగ్గా అది తన తోకను అడ్డంగా ఊపి ఇది అబద్ధమని తెలియజేసింది. అప్పుడు విష్ణువు మొగలిపూవు అబద్ధం చెప్పింది కనుక అది పూజకర్హం కాదనీ, కామధేనువు వృష్ఠభాగంతో సత్యం తెలిపింది కనుక ఆవుకు వెనుకభాగం పూజార్హమగుగాక యనిన్నీ శాపం పెట్టాడు. అందువల్ల మొగలి పూవు పూజకర్హం కాకుండా పోయింది. ఆవు వెనుకభాగమే పూజింపబడుతోంది. మల్లె, గులాబీ మొదలైన పూవులు కూడా పూజకనర్హాలే! మల్లె కేవలం అలంకారానికి మాత్రమే!

నమస్కార విధానం

నమః – అనగా త్యాగమని వాచ్యార్థం. నేను నీకంటే తక్కువవాడను. నీవు నాకంటే గొప్పవాడవు అనే “దాస్యభావం” (దైవానికి దైవవిషయాలకు) స్ఫురిస్తుంది.

“నాకు నేను ఉపయుక్తుడను కాను”, కాబట్టి, నీవే నన్ను ఉద్దరించగలవాడవు అని ‘ఆత్మార్పణము చేసుకోవటం’ అనునిక అపూర్వయోగాన్ని “నమః" అను పదం సూచిస్తోంది. తన నికృష్ణతను, పూజ్యడగువాని ఉత్కృష్ణతను చూపటానికి నమస్కారంలో ఓ రహస్యం ఉంది. నమస్కారం వంటి తారక మంత్రం ఇంకొకటి లేదు. శత్రువు యొక్క శత్రుభావాన్ని సమూలంగా పోగొట్టగల శక్తి ఈ నమస్కారానికి ఉంది. నమస్కారంతో సకలార్థసిద్ధిని పొందవచ్చు.

శ్రీకృష్ణ పరమాత్మకు ఒక్కసారి నమస్కరించితే పది ఆశ్వమేథయాగాల అనంతరం చేయబడు అవభృథస్నానంతో సమానమని, భారతంలో చెప్పబడింది.

నమస్కారం వలన దైన్యభావం అలవడతాయి. దీనిచే మనలోని అహంకారం తగ్గుతుంది. దైన్యమనగా (నిరాడంబరత) సేవాభావమని అర్థం. సేవాభావం వలన, భగవద్భక్తి పెంపొంది, భగవంతునిపట్ల ఆరాధనాభావం కలుగుతుంది. అట్టి ప్రేమారాధానమే ‘భక్తి’. అట్టి భక్తితో సాధింపరాని సిద్ధులు లేవు. భక్తియే ఆత్మా సాక్షాత్కార జ్ఞానానికి మూలం. పరమభాక్తియే మోక్షప్రాప్తికి ఉత్తమ సాధనం. నమస్కారము – కాయకము, వాచికము, మాసికము అని మూడు విధాలు.

    కాయకము: ఇది శారీరకమైనది, రెండు అరచేతులు కలిపి చేసే నమస్కారం. పడుకుని అష్టాంగాల్ని నేలపైమోపి చేయబడు సాష్టాంగ నమస్కారం, మరియు ధ్యాన ముద్ర నమస్కారము. (ఎడమబోటనివేలిపై కుడి బొటనవేలు ఉంచి, పరస్పరం పట్టుకుని, ఇతర వ్రేళ్ళను సాచి ఉంచితే మహాముద్ర అవుతుంది) ఈ ధ్యానముద్ర నమస్కారంతో, భావంతుని దానించితే సత్ఫలితాలు సిద్ధిస్తాయి.
    వాచికము: నోటితో ఉచ్ఛరించునది. “నమః”, “నమస్కారము” మొదలగు శబ్దములతో మనమనోభావాన్ని తెలుపటం.
    మాసికము: దైవంపట్ల, మనఃపూర్వకమైన ‘నమస్కార’ భావమును మనస్సునందే ఏకాగ్రతతో తలచుట.

ఏవిధమైన నమస్కారమైనప్పటికీ ఆత్మార్పణ చేసుకొనుటయే అవుతుంది. కాయక నమస్కారంతో (శారీరక నమస్కారాలు) అష్టాంగము, పంచాంగము, త్రయ్యంగము, ఏకంగము అని నాలుగు విధానాలున్నాయి.

అష్టాంగ నమస్కారము: అష్టాంగ నమస్కారం ఉత్తమమైనది, ముఖ్యమైనది, తప్పని సరిగా ఆచరించవలసినది.

“శిరోహస్తౌచ కర్ణౌచ చుబుకమ్ బాహు యుగ్మం అష్టాంగ చ నమస్కారమ్” అనగా శిరస్సు, రెండుచేతులు, రెండుచెవులు, గడ్డం, రెండు భుజాలు వీనిని నేలపై ఆనించి చేయబడు నమస్కారం ‘అష్టాంగము’ అని చెప్పబడుతోంది. దేవతలకు, గురువులకు, పెద్దలకు ఈ విధమైన నమస్కారం చేయాలి. (స్త్రీలు ఈవిధమైన నమస్కారాన్ని చేయరాదు).

పంచాంగ నమస్కారము: “శిరోహస్తౌచ బాహుచ కృత్యా జానునీ, సంస్థితా ఇదం పంచాంగ మేవోక్తమ్”

అనగా శిరస్సు, రెండుచేతులు, రెండు భుజాలు, మోకాళ్ళు నేలపై ఆన్చి (మోకాళ్ళపై వంగి) చేయబడు నమస్కారం పంచాంగ నమస్కారమని పిలువబడుతోంది. ఈ విధమైన నమస్కారం స్త్రీలకు ఉత్తమమైనది.

త్రయ్యంగ నమస్కారము: “హస్తౌ బద్ధ్వాతు ముకళ వమ్మార్నిదేశేనియోజయేత్”

రెండుచేతులు ముకుళించి (జోడించి) తలపై ఉంచి చేయబడుతున్న నమస్కారం త్రయ్యంగ నమస్కారం.

ఏకంగా నమస్కారము: “ఏకాంగంతు నమస్కారం శిరసైనా కృతాభవేత్”

తలను మాత్రం వంచి చేయబడు నమస్కారం “ఏకాంగ” నమస్కారమని పిలువబడుతుంది. తప్పనిసరి పరిస్థితుల్లోనే (చేతులను జోడించి నమస్కరించ లేని పరిస్థితులలోనే) ఈ పద్ధతిలో నమస్కరించాలి.

‘గురువు’కు ఈ క్రింది విధంగా నమస్కరించటం శ్రేయస్కరం.

“వ్యత్యప్త పాణినా కార్యమున సంగ్రహణం గురోః |

సవ్యేన సవ్యః స్పృష్టవ్యో దక్షిణేవ చ దక్షణ: ||”

అనగా రెండు చేతులులను మార్చి పట్టుకుని (అనగా కుడిచేతిలో గురువు యొక్క కుడిపాదాన్ని, ఎడమచేతిలో గురువుయొక్క ఎడమపాదాన్ని) పట్టుకుని నమస్కరించాలి. మీ పాదపద్మాలే నాకు శరణ్యమనే భక్తి భావనతో గురువుకు నమస్కరించాలి.

“ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాంకరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాం గముచ్యతే”

వక్షఃస్థలాన్ని, శిరస్సును భూమికితాకించి, దృష్టితో దైవాన్ని చూస్తూ, మనస్సులో దైవమును ప్రార్థన చేస్తూ, ‘నమః’ అని పలుకుతూ, రెండు పాదాగ్రాలను కలుపుతూ, రెండు చేతులతో నమస్కరిస్తూ, రెండు చెవులను నేలకు తాకిస్తూ బోర్లపడి నమస్కరించటం “సాష్టాంగ నమస్కారం” అనబడుతుంది. ఈ విధమైన నమస్కారంలో కాయికము, వాచికము, మానసికము అనబడు త్రివిధాలైన నమస్కారాలు అంతర్గర్భితాలై ఉన్నాయి. అనగా మనస్సు చేత చింతించుట, వాక్కుచే ‘నమః’ అని అనటం, బోర్లగిలి అష్టాంగనమస్కారం చేయుట కలిసున్నాయి. ఇంకా రెండుచేతులు, రెండుకాళ్ళు, వక్షస్థలం, నొసలు, రెండు భుజాలు మొత్తం ఎనిమిది అంగాలను నేలకు తాకుతున్నట్లు బోర్లగిలి నమస్కరిస్తున్నందువల్ల “సాష్టాంగ నమస్కారం” అని పిలువబడుతోంది. ఈవిధమైన “సాష్టాంగ నమస్కారం” శ్రేష్టమైనది. స్త్రీలు సాష్టాంగ నమస్కారాలు చేయరాదు.

నమస్కారాలు చేయటంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. మొక్కుబడిగా, హడావుడిగా కాక మనస్ఫూర్తిగా నమస్కరించాలి. రెండు చేతులను పూర్తిగా కలిపి హృదయస్థానాన్నిగాని, నుదుటనుగాని స్పర్శిస్తూ నమస్కరించాలి. నమ్రతభావనతో నమస్కరించాలి. ఇవన్నీ పూర్తిగా పాటించి నమస్కరిస్తేనే ‘నమస్కారం’ యొక్క నమ్రతాక్రియకు పరిపూర్ణత సిద్ధిస్తుంది. 3,5,7,9,12 సంఖ్యలలో నమస్కారాలు చేయడం శ్రేయస్కరం.

నవగ్రహ ప్రదిక్షిణ

గ్రహగతులమూలంగా మనిషికి ఎదురయ్యే ఆటుపోట్ల నుండి తట్టుకోవడానికి సులభమైన ప్రక్రియ నవగ్రహ ప్రదక్షిణలు. వీటివల్ల ఉత్పన్నమయ్యే దైవికశక్తి మనిషిని కాపాడుతుంటుంది. నిర్దిష్టమైన పధ్ధతి ప్రకారం నవగ్రహ ప్రదక్షిణలు చేస్తే విశేషఫలితం ఉంటుంది.

చాలామంది ప్రదక్షిణలు చేస్తూ నవగ్రహాలను తాకి నమస్కారాలు అర్పిస్తుంటారు. వీలైనంతవరకూ వాటిని తాకకుండానే ప్రదక్షిణలు చేయడం ఉత్తమం.

నవగ్రహాల మధ్య తేజస్వి ఐన సూర్యుడు తూర్పుముఖంగా ఉంటాడు. సూర్యుని ముందు శుక్రుడు కూడా తూర్పుముఖముగా ఉంటాడు. సూర్యుడికి కుడివైపు కుజుడు దక్షిణాభిముకంగా ఉంటాడు.

శుక్రునికి కుడివైపు పడమర ముఖంగా చంద్రుడు ఉండగా, ఎడమవైపు బుధుడు ఉత్తరాభిముఖంగా ఉంటాడు. సూర్యునికి వెనుకవైపు శని మహాత్ముడు పశ్చిమాభిముఖంగా వుంటాడు. శనికి ఎడమవైపు రాహువు ఉత్తరాభిముఖంగానూ, కుడివైపు కేతువు దక్షిణాభిముఖంగానూ, ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఇది ప్రశస్తమైన ప్రతిష్ట.

సూర్యునిచూస్తూ లోనికి ప్రవేశించి ఎడమ వైపునుండి (చంద్రునివైపు నుండి) కుడి ప్రక్కకు తొమ్మిది ప్రదక్షణలు చెయ్యడం శ్రేష్టం. ప్రదక్షిణలు పూర్తయిన తరువాత కుడి వైపు నుండి ఎడమవైపునకు (అనగా బుధుడి వైపు నుండి) రాహువునూ కేతువునూ స్మరిస్తూ రెండు ప్రదక్షిణలు చేయవచ్చు.

చివరగా వరుసగా సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, కుజుడిని, బుధుడిని, బృహస్పతిని, శుక్రుడిని, శని మహాత్ముని, రాహువును, కేతువును, స్మరిస్తూ ఒక్కక ప్రదక్షిణచేసి నవగ్రహాలకు వీపు చూపకుండా వెనుకకు రావాలి.

గ్రహదోషాల నుండి తప్పుకోవడానికి నవగ్రహప్రదక్షిణ కంటే ఉత్తమమయిన మార్గం లేదన్నది స్పష్టం 

దేవాలయ ప్రాశస్త్యం

దేహం దేవాలయం వంటిది. అందులో ప్రతిష్ఠమైన సనాతనుడైన జీవత్మాయే పరమాత్మా. విశ్వవ్యాప్తంగా వెలసియున్న దేవాలయాలన్నీ  మానవ కల్యాణానికై ఏర్పాటు చేయబడినవే. అవి జాతి మాత కులభేదాలకు అతీతంగా నిర్మించబడ్డాయి. అది దేవాలయం, చర్చి, మసీదు, జైన మందిరం, మఠం మరేదైనా కావచ్చు. వాటి లక్ష్యం ఒక్కటే. మానవ మస్తిష్కంలోని దుష్టబుద్ధిని  తొలగించి మానవత్వాన్ని పెంపొందిచడమే.

మానవుడంటే శారీరిక, మానసిక మహాశక్తులుగల వాడని నేటి శాస్త్ర విజ్ఞానం చెబుతోంది. కాని, తత్త్వం విచారిస్తూ చెప్పుకోవలసిన విషయం మరొక్కటుంది. దేవుడు సత్యం, శాంతం, దయ, జ్ఞానం, తృప్తి, త్యాగం మున్నగు మహానీయ గుణాలు గలవాడని అర్థం. వీటిని కలిగియున్న వాడే మహాత్ముడు. అట్టి సద్గుణ సంపత్తిని కలిగి ఉన్న కారణానే శ్రీషిరిడి సాయిబాబా, శ్రీరామకృష్ణ పరమహంస, శ్రీవివేకానంద మున్నగువారు మహాత్ములై భగవత్ గుణాలను కలిగి మానవులను ఆదర్శప్రాయులైయ్యారు.

పైన పేర్కొన్న గుణాలన్నీ మానవులలో కొరవడిన కారణం వల్లనే మానవులు దానవులై మారణహోమాన్ని సృస్తిస్తూ, మహోపద్రవకారకులుగా నేడు ప్రపంచాన్ని కుదిపెస్తున్నారు. పుట్టుక చేత మానవుడు మంచివాడే. పెరుగుదలలో క్రమంగా పరార్థాన్నివీడి స్వార్థాన్ని పెంచుకొని, సత్య, దయాశౌచాలకు తిలోదకాలిచ్చి, సాటి మానవులతో సహకరించిక నికృష్ట జీవితాన్ని గడుపుతున్నాడు. ఈవిధమైన మానవత్వ లేమి చేత ప్రపంచమంతా నేడు అశాంతికి గురౌతోంది.

దేవాలయాలు శాంతికి నిలయాలు కావాలి. అక్కడి ప్రశాంత వాతావరణం, ధర్మబోధ, మానవ మహోన్నతికి బీజం వేయాలి. వ్యక్తుల దురాలోచనలు వారి నుండి దూరం కావాలి. అవగుణాలను గురించి ఆలోచింపజేసి వాటి నిర్మూలనకు కృషి చేసేటట్లు చూడాలి. ఇట్టి ఆదర్శాలను చిత్తశుద్దితో దేవాలయాలు నిర్వహించగలిగినపుడు వాటి మనుగడ మహోన్నతమై ఉంటుంది. లేనినాడు వాటి ఉనికి నామమాత్రంగా మిగిలిపోతుంది.

నేటి దేవాలయాలు నిర్వాహణలో ఈ ప్రయత్నం ఏ మాత్రం సాగుతున్నదన్న విషయాన్ని ప్రతి దేవాలయ నిర్వాహకులు ఆత్మవిమర్శ చేసుకోవలసిన అవసరమెంతైనా వుంది.

దైవారాధనపూజ మానసికమైనదిగా మరియు ఆధ్యాత్మికమైనదిగా ఉంటోంది. వీటిని ఆర్భాటంగా నిర్వహించనక్కరలేదు. ఎవరో మనల్ని మెచ్చుకోవలేననిగాని, ఏంటో గొప్పగా నిర్వహింపబడిందని పేరు తెచ్చుకోవడానికి గాని చేయరాదు. అటువంటివి ప్రయోజన శూన్యాలు. భగవంతుడు అటువంటి డాంబిక, ఆరాధనా పూజాకార్యక్రమాలను ఆశీర్వదించడు అనడానికి తార్కాణమైనాకథా వృత్తాంతం గురువాయురులో జరిగిన కథ.

కేరళరాష్ట్రంలో నేటికీ ప్రసిద్ధి చెందిన శ్రీకృష్ణ పుణ్యక్షేత్రం గురువాయూరు. అక్కడ వాసుదేవుడను శ్రీకృష్ణ భక్తుడు గలడు. నిరంతరం శ్రీకృష్ణుని సేవిస్తూ పూజా పురస్కారాలను మిక్కిలి ఆటోపంగా నిర్వహిస్తూ శ్రీకృష్ణుని సందర్శనానికి కాంక్షించుతున్నాడు.

ఒకరోజున భగవంతుని ప్రార్థిస్తూ తన కోర్కెను మన్నించి దివ్యసందర్శన భాగ్యాన్ని కలుగాజేయుమని వేడుకొని నిద్రించాడు. పరమాత్మ వాసుదేవుని భక్తిని పరీక్షించి కరుణింపదలచాడు. అతనికి స్వప్నంలో నేను నిన్నుఅనుగ్రహించడానికి రేపు మధ్యాహ్నం రానున్నాను అనే మాటలు వినిపించాయి.భక్తుని హృదయం ఉప్పొంగిపోయింది. అతనికి నిద్రపట్టలేదు. ఎలాగో రాత్రి గడిచింది. ఉదయాన్నేలేచి శుచియై శ్రీకృష్ణ విగ్రహాన్ని సుగంధ ద్రవ్యాన్ని కలిపినా స్వచ్చమైన జలంతో అభిషేకించాడు. పట్టుపీతాంబరాలను కట్టబెట్టాడు. పరిమళాన్ని వెదజల్లు పుష్పాలతో అలంకరించాడు. మిక్కిలి కాంతివంతమగు దీపాలను వెలిగించాడు. అగరువత్తులను వెలిగించి ధూపం వేశాడు. చందన, కర్పూర సువాసనలను గుబాళింపచేశాడు. షడ్రుచులతో కూడిన ఆహారపదార్థాలను పంచభక్ష్య పరమాన్నాలను సిద్ధపరిచాడు.

మేళతాళాల రణగోణధ్వనులు ఉత్సవస్ఫూర్తినిస్తున్నాయి. పూజా పురస్కారాలను మిక్కిలి ఆడంబరంగా నిర్వహించాడు. కార్యక్రమమంతా పూర్తియైనది. ఇక భగవంతుని రాక నైవేద్య సమర్పణ మిగిలి ఉంది. శ్రీస్వామివారు చెప్పిన సమయమాసన్నమైనది. భక్తునిలో ఉత్కంట పెరిగింది. చుట్టూ చేరిన జనసందోహం మిక్కిలి ఆతురతతో ఎదురుచూస్తున్నారు.

ఇంతలో అచ్చటికి ఒక వృద్ధుడు కర్రచేతపట్టుకొని, నడుంవంగిపోయి పొట్ట వెన్నమొక అంటుకొనియుండగా, కాళ్ళు తడబడుచుండగా, ఆకలితో ఆర్తనాదం చేయుచూ మెల్లగా నడిచి వచ్చి భిక్షాన్నమడిగాడు. తానూ ఎదురుచూచుచున్న శ్రీకృష్ణుడు రాకపోగా, ఈ ముదుసలి వచ్చి శ్రీక్రుష్ణునికై ఏర్పాటు చేయబడిన నైవేద్యాన్ని ఆహారంగా అడిగి వాతావరణాన్ని భంగపరిచాడని వాసుదేవ భక్తునికి అసహనమేర్పడింది. కోపంతో మంచి చెడ్డలాలోచించక శ్రీకృష్ణవిగ్రహం వద్ద నున్న దండాన్ని తీసికొని వృద్ధునిపై విసిరాడు. ఆ దండమతనికి నడుంకి గట్టిగా తగులటం వలన నడుం విరిగి కుప్పకూలిపోయాడు. జనసందోహం తన చుట్టుముట్టినంతలో అతడంతర్హిడయ్యారు. జరిగిన అపరాధానికి మిక్కిలి చింతిస్తూ వాసుదేవుడు శ్రీకృష్ణుని విగ్రహంచెంత తలవాల్చాడు. విగ్రహం నడుం కూడా విరిగి క్రింద బదియున్నది. ఎంత వింత దృశ్యం? ఆ దృశ్యం నుండి వినిపించిన పల్కులివి, “వాసుదేవా! ఎంతోకాలంనుండి నారాకకై ఎదురుచూస్తున్నావు. నేను రాగానే నిర్దయుడవై కర్ర విసిరి నాకు దూరమైతివి. దైవం మానవరూపం అన్న విషయం నీకు తెలియదా! అందరియందున్నభగవదాత్మ ఒక్కటేయని నేను భగవద్గీతలో ప్రవచించలేదా? విగ్రహారాధనకు ప్రాధాన్యమిచ్చి ప్రాణమున్న మనుష్యుని హింసించావు. దయగల హృదయమే భాగవన్నిలయం. ఇకమీదట మానవత్వ లక్షణాలను పెంపొందించుకొని దైవత్వంను పొందుమని ఆశీర్వదించాడు. వాసుదేవుడు తన తప్పిదాన్ని తెలుసుకొని మానవ సేవలో తన శేషజీవితాన్ని గడిపి శ్రీకృష్ణ సాయున్యమును పొందాడు. ఈ కథను తెలుసుకొన్న తరువాత ఆరాధనా పూజాకార్యక్రమాలు మానసికమై ఉంది సాటి మానవులపై కరుణాదృష్తి కల్గియుండవలెనని తెలుస్తోంది గదా!

దేవాలయ ప్రాంగణంలో ప్రశాంతతను ఇచ్చే వాతావరణం ఉంటుంది. భగవంతునిసేవలో కొంత సేదదీరుతాము. తాము చేస్తున్న పనులు సరియైనవా, కావా అని ఆత్మవిమర్శ చేసుకునే వీలవుతుంది. భగవదారాధన చేస్తూ అసత్య దోషాలను అసంబద్ధ కార్యకలాపాలను నిర్వహించడానికి మనసులో జంకుకల్గుతుంది. సాతివారితో మీలాగే తీరు చాల సవ్యంగా ఉంటుంది. తన కష్టాలను భగవంతునికి విన్నవించుకొని భక్తిభావమును పెంపొందించుకోవడానికి వీలు కలుగుతుంది. ఈ కారణాల వలన ఉదాత్తమైన వ్యక్తిత్వము పెంపొందుతుంది.

భగవదారాధకులకు కష్టాలు రావా? వారంతా సుఖంగా ఉనారా? వీటికి సమాధానం బాహుళ్యమైనది. త్యాగయ్య, పోతన్న, శ్రీరామకృష్ణ పరమహంస, శ్రీరమణమహర్షి, నందనారు, కబీరు మున్నగు వారంతా గొప్ప భక్తులు. వారు సైతం అనేక కష్టాలకు గురైయ్యారు. అయినప్పటికీ వారికి వచ్చిన ప్రమాదం లేదు. వారు భగవంతుని సేవలో కృతకృత్యులై అవ్యాజానందాన్ని పొంది మోక్షప్రాప్తిని పొందారు. కొన్ని సందర్భాలలో కష్టాలు వారి వారి సమార్త్యాలను, సాధారణంగా పురాకృత కర్మల వలన వస్తుంటాయి. సామర్థాన్ని పెంచుకొని సత్కర్మలను ఆచరించటం వలన కష్టాలను ఎదుర్కోడానికి శక్తి, నివారణానికిమార్గాలు లభిస్తాయి. భగవంతుని నమ్ముకుని సేవించువాడు తనకు ఎదురయ్యే ఆతుపోట్లును తట్టుకొని దైన్యాన్ని వీడి, ధైర్యమును తెచ్చుకొని, భగవదారాదనలో శాంతిని పొంది స్థిత ప్రజ్ఞుడవుతాడు.

ధరఖర్వాతుడోకండు సూర్యకరసంతప్త ప్రధానాంగుడై

త్వరతోడన్ బరువెత్తి చేరి నిలిచెన్ తాళద్రుమచ్చాయత

చ్చిరమున్ తత్ఫలపాత వేగమున విచ్చెన్ శబ్దయోగంబుగా

బోరిదైవోపహతుండు పోవుకడకున్ పోవుంగదా యాపదాల్.

“బట్టతలవాడొకడు ఎండ వేడిమికి తట్టుకొనలేక ఏ చెట్టూ లేని కారణాన, తాటిచెట్టు కన్పించగా, పరుగు పరుగున వెళ్ళి దాని క్రింద నీడకై నిలుచున్నాడు. అదే సమయంలో ఆ తాటిచెట్టు నుండి తాటిపండు అతని తలపై పడటం వలన తల పగిలింది. దైవానుగ్రహం లేని వానికే అలా ఆపదలు సంభవిస్తున్నాయి”  అని అన్నారు.

దీనినిబట్టి దైవోపహతుడెట్టి కార్యం చేయబోయినా ఫలించక ప్రమాదం సంభవిస్తుందనడం అనుభవైకవేద్యం. చాలామంది తాము భగవదారాధకులమని, తమ కష్టాలు తీరటంలేదని, తమ పూజలు ఫలించటం లేదని చెబుతుంటారు. ఈ అనుభవం కూడా సత్యమైనదే.

మన ప్రార్ధనలకు సమాధానం రాలేదు. కోర్కెలు సఫలము కాలేదు. మనశ్శాంతి కలగటం లేదు. కారణమేమిటి? ప్రార్ధనలో నిశ్చలత్వం అవసరం. అది సంసార బంధాల నుండి విముక్తి కొరకుగానుండుట సమంజసం. ప్రార్ధన లేదా పూజలో నా మనస్సు నిలవటం లేదని చాలామంది చెబుతుండటం జరుగుతుంటుంది. ఇది కూడా యదార్థమే. నిశ్చలతత్త్వమెట్లు కలుగుతుంది? నిస్సంగత్వే నిశ్చలత్వత్త్వమని జగద్గురు శ్రీ శంకర భగవత్పాదాచార్యుల వారి బోధన.

కోర్కెలు ఇహలోక సౌఖ్యాల కొరకు మాత్రం పరిమితం గాక జన్మ రాహిత్యాన్ని కోరునట్టివై ఉండటం కూడా ముఖ్యం. పరహితం లేని కోర్కెలు ఫలించవు. ధర్మాన్ని విడిచి ఏ పని జేసినా అది వ్యర్థమే. పరమధర్మాన్నే మహాభారతంలో వివరించిన తీరును గురించి తెలుసుకొందాం.

ఒరులేయవి యొనరించిన

నరవర అప్రియము తన మనంబున కగు తా

నొరులకవి యొనరించకునికి

పరాయణము పరమధర్మ పతమండ్రు జనుల్.

ఇతరులు ఏది చేస్తే నీకు ఇష్టముండదో అట్టి దానిని నీవు ఇతరులకు చేయకుండుటయే పరమధర్మమని భావం. ఇంతకన్నా మహోదాత్తమైన విషయమేమి ఉంటుంది? మానవత్వం ఈ పద్యంలో వెల్లివిరియటం లేదా దానిని ఆచరణలో పెట్టగలిగినవాడు మానవుడు ఇలలోనే మహానుభావుడవుతాడు కదా!

భౌతిక సంబంధమైన వాంఛలను విడనాడి, తనకు భగవంతుడిచ్చిన ఆయుర్దాయ కాలాన్ని సద్వినియోగం చేసికొంటూ, జాతస్య మరణం ధృవ మను సత్యాన్ని మరువక, మానవ విధులను సక్రమంగా నిర్వహించి వైరాగ్య భావంతో యోగాభ్యాసాన్ని అవలంబించి తద్వారా మనస్సును భగవంతునిపై లగ్నం చేసిన అదే నిర్వాణపథం. జీవబ్రహ్మైక్య  రహస్యం కూడ. అప్పుడు మానసికస్థితి నిశ్చలముగ ఉండి మానవుడు ఋషితుల్యుడవుతాడు. జీవిత పరమార్ధాన్ని సాధించిన మానవుడే మహాత్ముడైన భగవంతుడి రూపం.

మనలో ధర్మభావమును నింపడానికి ప్రతిగ్రామంలో, ప్రతీ పట్టణంలో మన పెద్దలు దేవాలయాలను నిర్మించారు. వేదవిదులు, త్రికాలవేత్తలు అయిన మహాఋషులు, విశ్వశాంతికై, సర్వజన ఆత్మోద్ధరనకై, మహిమాన్వితాలైన దేవాలయాలను స్థాపించి, నిత్య సత్య జ్ఞానమర్గాన్ని విశ్వశాంతికి ప్రచారం చేయడానికి దోహదం చేసారు. నిత్యం దేవాలయదర్శనాన్ని చేసుకునేవారు, గీతలో శ్రీకృష్ణపరమాత్మ చెప్పినట్లు, సమస్త ప్రాణుల పట్ల ద్వేషభావం లేనివాడై, వాటి పట్ల సమభావాన్ని కలిగి ఉంటాడు.

మండలదీక్ష ఏం చెబుతోంది?

ఈ కలియుగంలో మనలను ఉద్దరించడానికి భగవంతుడు ఎన్నో రూపాలను ధరించాడు. అటువంటి అవతారమే హరిహరసుతుడు అయ్యప్ప స్వామి! ఆ స్వామి కరుణాకటాక్షాలకోసం దీక్ష పూని, ఓ మండలంరోజుల పాటు ఆ దీక్షను కొనసాగించి, అనంతరం ఇంట్లో పూజ చేసి, అఖండదీపాన్ని వెలిగించి, ఆత్మదీప దర్శనం కోసం, ఇరుముడిని ధరించి శబరిమలయాత్రను ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా కొంతమంది అయ్యప్ప స్వామికి మండలదీక్ష (48 రోజులదీక్ష) ఎందుకు? ఒకరోజు, ఐదురోజుల దీక్ష కూడ చేయవచ్చుగా అని అడుగుతున్నారు. అడగదమేకాదు, ఆ పద్ధతుల్లో దీక్షలు చేపట్టి  జ్యోతి దర్శనానికి బయలుదేరుతున్నారు. ఆ వాదప్రతివాదనలను అలావుంచితే, మండలదీక్షలో ఓ గూడార్థం ఉంది. మనిషి పుడుతున్నప్పుడు, అప్పుడున్న నక్షత్రస్థితి, రాశి స్వభావం, ఇంకా అప్పటి గ్రహస్థితులు, ఆ మనిషి భవిష్య జీవితాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ఆ దృష్టిలో చూసినపుడు,

నక్షత్రాలు – 27

రాశులు – 12

గ్రహాలు -  09

వీటి ప్రభావం నుంచి తప్పుకుని, భగవానుని పాదపద్మాలను ఆశ్రయించి, ఆత్మసాక్షాత్కారమనే జ్యోతి దర్శనానికే 48 రోజుల దీక్ష చేస్తున్నాం. ఇదే మండలదీక్షలోని అంతరార్థం. అందుకే మండలకాలంపాటు దీక్ష!

పదకవితా పితామహుడు!

భారతదేశం ప్రాచీన కాలం నుండి భగవంతుడు, ఆత్మ, పారలౌకికత మొదలైన ఆధ్యాత్మిక విషయాలనే పరమ సత్యాలుగా భావించి, వాటి ప్రత్యక్షానుభూతికై సకల ప్రయత్నాలు చేసింది. భారతదేశం ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి గలదిగా ఉండడానికి కారణం ఏమిటన్న విషయాన్ని పరిశీలిస్తే, దివ్య గుణాతీతులై భాగవత్సాక్షాత్కారం పొందిన మహాపురుషులు భారతావనిలో అవతరించడమేనని నిశ్చయంగా బోధపడుతుంది. భారతదేశం భాగవత్సాక్షాత్కార ప్రాతిపదికపై ప్రతిష్టతమైంది. అవతార పురుషులైన ఆదిశంకరులు, రామకృష్ణ పరమహంస, అరవిందులు, రమణమహర్షి మున్నగు వారు అవతరించి తమ ఆధ్యాత్మిక ఉపదేశాలతో, జగత్కారణుడైన ఈశ్వరుని సాక్షాత్కరించు కోవడానికి ఉపకరించే మార్గాలను ఏర్పరిచారు. అలాగే సంకీర్తనాచార్యులైన అన్నమయ్య, పురందరదాసు, త్యాగయ్య, క్షేత్రయ్య మున్నగు భక్తశిఖామణులు భక్తి ఉద్యమానికి తమ కీర్తనలతో బాటలు వేసి, ఎందరో భక్తులకు మార్గనిర్దేశం చేశారు.

కృతయుగం ధ్యానానికి, త్రేతాయుగం క్రతువులకు, ద్వాపరయుగం అర్చనకు, కలియుగం సంకీర్తనకు ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రజలలో దైవచింతన, భగవదనురాగం ఏర్పడడానికి సంకీర్తనాచార్యులే కారణమనవచ్చు. భౌతికమైన భోగభాగ్యాలను వదలి, తన జీవితాన్ని శ్రీవేంకటేశ్వరనాథునికి అంకితం చేసిన కారణజన్ముడు, పదకవితాపితామహుడు, సంకీర్తనాచార్యుడైన అన్నమాచార్యులు. భక్తి సుమాలతో తెలుగుదేశాన్ని పరిమళభరితం చేసాడు. మహానుభావుడైన అన్నమయ్య సంకీర్తనలు తెలుగుజాతిని తరింపజేసే మహోజ్వల సంపద. వారి కీర్తనలుమధురభక్తికి గర్భస్థలి. రచనాకౌశలంతో అనన్య సామాన్య ప్రతిభ చూపుతూ, 32 వేల సంకీర్తనా కావ్యాన్ని సృష్టించాడు.

“వేదాదుల నుండి ఆగమాల వరకు విస్తరించిన భక్తి సామ్రాజ్యానికి పదకవితా పితామహుడు అన్నమాచార్యులవారి కీర్తనలే నిలయాలు. శ్రీవేంకటాచలపతి కీర్తనలతో జీవితాన్ని ధన్యం చేసుకున్న పుణ్యచరితుడాయన!”

మన తెలుగులో తోలి వాగ్గేయకారునిగా ప్రసిద్ధి చెందినవాడు. ఇది 600 సం||ల నాటి చరిత్ర. వాగ్గేయకారుడంటే స్వయంగా పాటలు పాడేవాడని అర్థం. అన్నమయ్య వేంకటనాథునికి సుప్రభాత కీర్తన పాడితే, నిద్ర లేచేవాడు. జోలపాడితే నిడురపోయేవాడు. శ్రీవారి సతీమణి అలిమేలుమంగమ్మ అన్నమయ్య పాటకు నాట్యం చేసేది. అన్నమయ్య సంకీర్తనలు భక్తిప్రయోగశాల. పామరుల కోసం వారిలో దైవభక్తిని పాడుకోల్పాలనే సంకల్పంతో అచ్చతెలుగుభాషలో సామాన్య జనరంజక శైలిలో పాటలు వ్రాసి, ప్రచారం చేసినవాడు.

సమసమాజ నిర్మాణం కోసం సంఘ సంస్కరణ భావాలతో సాంఘిక ప్రయోజనాన్ని ఆశించిన అన్నమయ్య, తన ఆస్తినంతా వెంకన్నకు దానం చేశాడు. “బ్రహ్మ మొక్కటే, పరబ్రహ్మ మొక్కటే" అన్న సత్యాన్ని అందరికీ తెలియజేసి, “మెండయిన బ్రాహ్మణుడు మెట్టు భూమియొకటే, చండాలుడుండేటి సరిభూమి యొకటే” అన్న సమతావాదాన్ని శాశ్వతంగా చరిత్రపుటల్లో లిఖించిన ఈ దివ్యసామ్యవాద సిద్ధాంతకర్త మనందరికీ ముక్తిమార్గం చూపాడు.

అట్టి మహనీయుడు కడపజిల్లా రాజంపేట తాలూక తాళ్ళపాక గ్రామంలో క్రీ.శ.1408లో లక్కమాంబ, నారాయణసూరులకు పుణ్య ఫలంగా, ఏడుకొండలవాని వరప్రసాదంగా జన్మించాడు. అయితే, అన్నమయ్య తాట నారాయనయ్యకు గ్రామదేవత చింతలమ్మ ప్రత్యక్షమై, నీ మూడోతరంలో ఒక గొప్ప హరిభక్తుడు జన్మిస్తాడని తెలిపింది. అది వాస్తవరూపం దాల్చింది. అన్నమయ్యకు శైశవదశలోనే తిరుమలేశుని భక్తి చిగురించింది. వెంకన్నపేరు చెబితేకాని, పాలు త్రాగే వాడు కాదు. వేంకటపతి మీద జోలపాట పాడుతుంటే తల వూపేవాడు. అన్నమయ్య ఐదేండ్ల వయసులోనే గురువులకు ఏకసంథాగ్రాహిగా పాఠాలు అప్పజెప్పేవాడు. ఆట పాటల్లో  తెలూతూ, పిల్లల పాటలకు రాగం పాడి, తాళం వేసేవాడు. బాల్యంలో కవుల పాటల్లో జానపదుల పాటలలో శృతి కలిపేవాడు. ఇలా పాటలు పాడే అన్నమయ్యకు ఇంటిపని మీద శ్రద్ధ లేకపోయింది. ఇంటివారు పశువులకు గడ్డి తెమ్మని అడవికి పంపారు. కొడవలి తీసుకొని, తంబురతో వెళ్ళాడు. గడ్డి కోస్తూ చిటికెన వ్రేలు తెగింది. ‘అమ్మా’ అని అరిచాడు. తనకెవరూ లేరని, తిరుపతికి వెళ్ళే యాత్రీకుల గుంపుతో ఆడుతూ, పాడుతూ తిరుపతి చేరాడు. గ్రామదేవత గంగమ్మగుడిని దర్శించాడు. తరువాత తిరుమలకు ప్రయాణమై, ఆంజనేయుని, నరసింహస్వామిని దర్శించుకొని, ఎత్తుగా వ్యాపించియున్న ఆదిశేషుని రూపంలోని పర్వత శిఖరాలు చూశాడు. “అదివో అల్లదివో హరివాసము, పదివేల శేషుల పడగలమయమ”ని చిందులు తోక్కూతూ పాడాడు.

తరువాత అలిపిరిగోపురం దాటి కొండలెక్కి మోకాళ్ళ పర్వతం చేరాడు. 8 సంవత్సరాల వయసుగల అన్నమయ్య అలసిపోయి సమీపంలో వెదురు పొదలలో చెప్పులతో వాలిపోయాడు. అన్నమయ్య దుస్థితిని  అలిమేలు మంగ చూసి, కరుణించి, తన ఒడిలో కూర్చోబెట్టుకొని, “లేచి ఇలా చూడు!” అన్నది. “కళ్ళు కనపడడం లేదా" న్నాడు అన్నమయ్య. “చెప్పులు వీడితే, కనబడుతుంది అన్నది” అని చెప్పింది అలిమేలు మంగమ్మ.

చెప్పులు వీడి చూస్తే, తేజోవంతమైన పర్వతాలు, దశావతారాలు మున్నగునవి కనిపించాయి. మంగమ్మ ప్రసాదం తినిపించింది. పలుకులమ్మ అనుగ్రహంతో ఆశువుగా అలిమేలు మంగపై ఒక శతకం వ్రాసాడు. “అమ్మకు తాళ్ళపాక ఘనుడన్నడు పద్య శతంబు సెప్పె, కోకొమ్మని వాగ్ప్రసూనముల కూరిమితో అలిమేలు మంగకున్” అని ఆమెకు ఆ శతకాన్ని అంకితం చేశాడు. తరువాత పుష్కరిణిలో స్నానం చేసి,వరాహస్వామిని దర్శించాడు. తిరుమలేశుని దర్శనానికి ముందుగా వరాహస్వామిని దర్శించడం ఆనవాయితీ. అసలు వరహాస్వామియే తిరుమలేశుని కొండపై ఉండడానికి అనుమతించాడు. వరాహస్వామి దర్శనానంతరం, తిరుమలేశుని దర్శించి, గరుడ కంభానికి, విమాన వేంకటేశ్వరునికి, యోగ నరసింహస్వామికి నమస్కరించి దర్శనం చేసుకున్నాడు. తిరుమలేశుని సన్నిధిలో బంగారువాకిళ్ళ వద్ద నిలిచి, అనిర్వచనీయమైన అనుభూతితో శంఖ చక్ర పీతాంబరాదులు ధరించిన ఆ దివ్య మంగళ విగ్రహాన్ని ఒళ్ళంతా కళ్ళు చేసుకొని చూసి ఆధ్యాత్మికానందానికి లోనయ్యాడు.
అతని హృదయకుహారం నుండి భావ గీతికలు వెలువడ్డాయి. “పొడగంటిమయ్య మిమ్ము పురుషుత్తోమా, మమ్ము నెడయకవయ్య కోనేతిరాయడా!” అని పాడి, అర్చకులను ఆశ్చర్యపరిచాడు. తర్వాత తిరుమలలోని పవిత్రతీర్థాలలో స్నానం చేసి, గుడ్డలు ఆరేలోపుగా స్వామిపై ఆశువుగా ఒక శతకం వ్రాశాడు.

ఒకరోజు అన్నమయ్య స్వామిదర్శనానికి వెళ్ళినపుడు దేవాలయం తలుపులు మూసి వున్నాయి. నిరుత్సాహపడ్డ అన్నమయ్య ఆవేదనారూపమైన   ఒక గీతం పాడగా, వెంటనే తలుపులు తెరచుకున్నాయి. అర్చకులు అన్నమయ్యను లోనికి తీసుకుని వెళ్ళి ప్రసాదాలందించారు. స్వామి ఎదుట నిలుచుకొని, ఒక శతకాన్ని స్వామికి అర్పించాడు. తిరుమలలో ఘన విష్ణువనే వైష్ణవయతికి స్వామి కలలో దర్సనమిచ్చి, అన్నమయ్యకు ముద్రధారణ చేయవలసినదిగా తన ముద్రికను అందజేశాడు. హరినామ సంకీర్తన చేస్తూ, తన వద్దకు వచ్చిన అన్నమయ్యకు ముద్రదారణ చేశాడు. దాంతో అన్నమయ్య వైష్ణవుడై, అన్నమాచార్యుడయ్యాడు.

తల్లిదండ్రులకు చెప్పకుండా తిరుమల చేరిన అన్నమయ్యను తల్లిదండ్రులు వెదకి, వెదకి ఘనవిష్ణువు వద్ద విష్ణుతత్వాన్ని తెలుసుకుంటున్న అన్నమయ్యను చూశారు. అన్నమయ్య వారిని చూసి, తల్లి ఒడిలో వాలిపోయాడు. తల్లి లక్కమాంబ అన్నమయ్యను తాళ్ళపాక రమ్మన్నది. కాని పెరుమాళ్ళును వదలి రాలేనన్నాడు అన్నమయ్య. ఇంతలో గాఢనిద్ర పొందిన అన్నమయ్యకు స్వామి స్వప్నంలో దర్సనమిచ్చి, తాళ్ళపాక వెళ్ళమన్నాడు. ఆయన ఆదేశం ప్రకారం తాళ్ళపాక వెళ్లాడు. తాళ్ళపాకలో భగవత్సంకల్పం వల్ల తిమ్మక్క, అక్కమల్లను వివాహమాడాడు.

గృహస్థ ధర్మాన్ని ఆచరిస్తూ, దైవచిన్తనలో కాలం గడిపాడు. మరల తాళ్ళపాక నుండి తిరుమల వచ్చి, స్వామి దర్శనం చేసుకున్నాడు. హఠాత్తుగా ఆయన కంఠం నుండి ఒక కొత్త పాత అవతరించింది. “బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానే పాదము…పరమ యోగులకు పరిపరి విధముల వరమోసగెడి నీ పాదము” అని తిరుమలేశుని పాదాలు అన్నమయ్య హృదయపీఠంలో తిష్ఠ వేశాయి. దాని ఫలితంగా వేంకటేశ్వరుడు దర్శనమిచ్చి, “రోజుకొక సంకీర్తన నీ నోట వినవలె, నీ సంకీర్తనలు తప్ప మరెవ్వరివీ నే ఆలకించను. ఇది నా ప్రతిజ్ఞ” అని అదృశ్యుడయ్యాడు.

స్వామి ఆదేశం ప్రకారం సంకీర్తనా యజ్ఞం ప్రారంభించాడు. ఊరూరాతిరుగుతూ, తేనెలొలికే తెలుగు తీయదనం ఉట్టిపడేవిధంగా కీర్తనలు పాడుతూ, భక్తులను మైమరపించేవాడు. ఇలా దేశసంచారం చేస్తూ, అన్నమయ్య శఠకోపయతిని దర్శించడానికి అహోబిలం వెళ్ళాడు. అది వైష్ణవక్షేత్రం. అక్కద యోగనరసింహస్వామిని దర్శించాడు. శఠకోపయతి వద్ద పుష్కరకాలం ఆయన సేవలు చేస్తూ, వైష్ణవ ఆగమాలు అభ్యసించి, విష్ణుతత్వాన్ని, శరణాగతి తత్వాన్ని జీర్ణించుకొన్నాడు.దానిని అందరికీ ఉపదేశించడానికి సిద్ధమయ్యాడు. “బ్రహ్మ మొక్కటే, పరబ్రహ్మ మొక్కటే, కందువగు హీనాదికము లిందులేవు, అందరికీ శ్రీహరే అంతరాత్మ” అని వాడవాడలా వైష్ణవ తత్వాన్ని ప్రచారము చేశాడు. అన్నమయ్య పాండిత్యాన్నిమెచ్చుకున్న సాళువ నరసింహరాయులు, తాళ్ళపాక వెళ్ళి, ఆయనకు ఘనసన్మానం చేసి, తనకు తోడుగా ఉండమని ప్రార్థించాడు. వైష్ణవ ధర్మవ్యాప్తికి రాజాశ్రయం ఉపకరిస్తుందని భావించి, అంగీకరించాడు. తన సంకీర్తనలతో విశిష్టాద్వైతాన్ని వ్యాప్తి చేయసాగాడు.

ఒకనాడు రాజు తన కొలువుదీరి, మంత్రులు, సామంతులు సభలో వుండగా ఒక కీర్తన ఆలపించామన్నాడు. మధురమైన శృంగారకీర్తన ఆలపించాడు. “ఏమొకో చిగురుటధరమున ఎడయెడ కస్తూరి నిండెను, భామిని విభునకు వ్రాసిన పత్రిక కాదుగదా….నిలువునా పెరుకంగా అంటిన నెత్తురు కాదు గదా!” ఆ పాత విన్న రాజు పరవశించి, తన మీద అలాంటి ఒక పాటను వ్రాయమని కోరినపుడు అన్నమయ్య “నరహరి కీర్తననానిన జిహ్వ, నోరులను నుతింప నోపదు”, “హరి ముకుందుని కోరునాడు జిహ్వ, నిను కొనియాడ నేరదెంతైన” అని చెప్పి సభనుండి వెళ్ళిపోయాడు. దానిని అవమానంగా భావించిన నరసింహరాయులు అన్నమయ్యను కారాగారబద్ధుణ్ణి చేశాడు. అప్పుడు అన్నమయ్య స్వామి రక్షణ కోరి ఇలా పాడాడు. “నీ దాసుల భంగములు నీవు చూతురా, యేదని చూచేవు నీకు నేచ్చరించవలెనా… చనువుతో మా గొరికె సారె విన్నవించితిమి, విని శ్రీ వేంకటేశుడ వేగ రక్షించ రాదా!” అని పాత పాడిన వెంటనే, సంకెళ్ళు విడిపోయాయి. భటుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న రాజు, మరల సంకెళ్ళతో బంధించమన్నాడు. అప్పుడు అన్నమయ్య మరో కీర్తన పాడడంతో మరల సంకెళ్ళు తెగి కిందపడ్డాయి. అప్పుడు రాజు అన్నమయ్య గొప్పతనాన్ని గ్రహించి, క్షమించమని కోరితే, అన్నమయ్య క్షమిస్తూ, “భాగవతుల నవమానించుట భగవంతుని అవమానించినట్లే” అని చెప్పి, తిరుమల వెళ్ళిపోయాడు. ఆనాడు అన్యమతస్తుల దండయాత్రలో దేవాలయాలు ధ్వంసమయ్యాయి. కంట బడిన స్త్రీలను మానభంగం చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో యాత్ర సాగిస్తున్న అన్నమయ్య విగ్రహాలను తస్కరించి, అన్నమయ్య ఉన్న గుడిని కూల్చారు. పెల్లుబికిన దుఃఖంతో దీనంగా ఒక పాత పాడగా, అన్యమత సైనుకులు ఏర్పరుచుకున్న గుడారంలో మధ్య ఒక వానరం ప్రవేశించి, గుడారాన్ని నేలమట్టం చేసింది. అన్నమయ్య విగ్రహాలు మరల ఆయనకు దక్కాయి. ఇది స్వామి కరుణా కటాక్షమని భావించి, జీవితాన్ని శాశ్వతంగా స్వామిసన్నిధిలో గడుపుతూ, ఉత్సవాలలో పాల్గొనేవాడు.

ఒక శుభదినాన స్వామి అన్నమయ్య తేనెలూరే శృంగార కీర్తన పదాలను విని తన్మయుడై, ముసి ముసి నవ్వులు నవ్వసాగాడు. స్వామికి నైవేద్యంగా మామిడి పండ్లను సమర్పించాడు. స్వామి ఆరగింపైన దానిని రుచి చూడగాపుల్లగా వున్నాయి. స్వామికి ఎంత అపచారం చేశానని బాధపడి, మామిడిచెట్టును తాకి, ఈ పండ్లు తీయదనాన్ని పొందుగాక అని తిరుమలేశుని ప్రార్థించగా, అవి మధుర ఫలాలుగా మారి అందరినీ ఆశ్చర్యపరిచాయి.

దానితో అన్నమయ్య కీర్తి విశ్వవ్యాప్తమైంది. అన్నమయ్య మహిమలు విన్న  పురందరదాసు తిరుమల వచ్చి అన్నమయ్యను కలుసుకున్నాడు. ఆయన పాటలు విన్న పురందరుడు తన జన్మ ధన్యమైనదన్నాడు. అప్పుడు అన్నమయ్య “నీవు రంగవిఠలుడి అనుగ్రహానికి పాత్రుడవై, ఆయన చేత నీళ్ళు తెప్పించుకుని సంధ్య వార్చిన పుణ్యాత్ముడవు” అన్నాడు. అట్టి మహనీయుడు కాలధర్మం చెందడానికి కొద్ది ఘడియలముందు కుమారుడైన పెద తిరుమలయ్యను పిలిచి, “నేటితో నా సంకీర్తనాయజ్ఞం పూర్తవుతుంది. ఇక నీవు ఆ శ్రీనివాసునికి దినానికి ఒక సంకీర్తన చొప్పున సమర్పించు, ఇది నీ బాధ్యత” అని చేతిలోని తంబూర, చిడతలను అతనికి అందజేశాడు. దుందుభి సంవత్సరం ఫాల్గుణ బహుళ ద్వాదశి అంటే క్రీ.శ.1503లో కుమారుని తల నిమురుతూ, గంభీరంగా నడుస్తూ, తిరుమలేశుని తేజోరూపంలో కలసిపోయాడు. అలా అన్నమయ్య జీవితం స్వామిసేవలో ధన్యమయింది.

ధ్వజస్తంభం దేవాలయానికి వెన్నుముక వంటిదా?

ధ్వజస్తంభం పిడుగుల నుండి రక్షించేదిగా ఉంటుంది. ఒకవేళ ధ్వజస్తంభానికి దగ్గరలో దానికంటే ఎత్తుగా ఏదైనా కట్టడాలు కడితే ఆ కట్టడాలు పిడుగు దెబ్బలకు, అగ్నికి గురి కావడానికి అవకాశం మెండు. ధ్వజస్తంభాన్ని దేవాలయపు వెన్నుముకగా తెలుపడం జరుగుతుంది. దేవాలయం యొక్క నడుము భాగంలో స్థంభం అడుగు భాగం ఉంటుంది. ఈ ధ్వజస్తంభం గర్భగుడిలో దాకా అడ్డంగా వేనుబాములోలె పడుకోబెట్టినట్లు భావిమ్చాబడుతుంది. కానీ దాన్ని ఆకాశంలోకి నిటారుగా నిల్పడం జరుగును. దాని ఎత్తు ఖచ్చితంగా లెక్కించబడి ఉంటుంది. దాని తలపై ధ్వజస్తంభ వాహక దేవత ప్రతిష్టించబడి ఉంటుంది. ధ్వజస్తంబం పైన కుండలినీశక్తిని ముద్రించిన పతాకం ఏర్పరచబడి ఉంటుంది. ఈ కుండలినీశక్తి కలిగువున్న జండాను పైకి ఎత్తడమంటే, ప్రాణాయామం ద్వారా భక్తుని కుండలినీశక్తిని జాగృత పరచి సహస్రారానికి కోనిపోవడం అనే అర్థాన్నిఇస్తుంది.

ప్రాచీనా భారతంలో విద్యారంగం.

న చోరహార్యం నచ రాజ హార్యం

న భ్రాతృభాజ్యం నచ బారకారి

వ్యయేకృతే వర్థత ఏవనిత్యంవిద్యాదానం సర్వ ధన ప్రదానం

చోరులు దొంగలిచలేనిది, ప్రభువులు స్వాదీనం చేసుకోలేనిది, సోదరులు పంచుకోలేనిది, ఖర్చు చేసిన కొద్దీ దిడిన ప్రవర్ధమానమయ్యేది అయిన విద్యాసంపద, అన్ని సంపదలలోకెల్లా ప్రధానమైనది.

భౌతిక సంపదలన్నింటికంటే, ఉత్తమోత్తమైనదిగా విద్యాసంపదను ప్రాచిఇన భారత సమాజం గుర్తించింది. ప్రస్తుత సమాజంలో సామాజిక ప్రజానికం విద్యనూ కేవలం లఔకిక విద్య గానే పరిగణిస్తున్నారు. ప్రాచీనా భారతదేశంలోవిద్యకు మానవుని సంపూర్నవ్యక్తిత్వంగల ఉన్నతునిగా తీర్చిదిద్దే విధానంగా గుర్తింపు ఉండేది. కానీ, పాశ్చాత్యులు విద్యనూ లఔకిక జీవనయాత్రకు సిద్ధం చేసే శిక్షణగా భావించారు. అయితే, భారతీయులు డానికి పైసోపానమైన ఉత్త్రజన్మకు కూడా అనుకూలమార్గమైన పద్ధతినిఅవలంబించారు. ఈ రెండింటిని సమన్వయాన్ని మన ప్రాచీనులు సాధించారు. మానవాభ్యుదయానికి ప్రధానమైన విద్యారంగం, ప్రాచీనభారతంలో అత్యున్నత ప్రమాణాలతో పరిడవిల్లింది. ప్రాచీన భారత సాహిత్యాన్నీ, శాసనాలను, తదితర స్మృతిచిహ్నాలను పరశీలించినట్లయితే, ఆనాటి విద్యావిదానపు విశిష్టత, విద్యాసంపద, అందులోని శాస్రీయ దృక్పధం, మానవతా విలువలు ద్యోతకమవుతాయి.

వేదవిదులైన నాటిరాజులు, కర్మిష్టులైన అగ్రహారాలను దానంగా ఇచ్చేవారు. ఆ అగ్రహారాలలో అన్ని వసతులతో కూడిన గ్రుహాలుండేవి. ఆ గృహాలే విధ్యాపీఠాలుగా విరాజిల్లేవి. అలాగే దేవాలయాలు, మాఠాలు, అరణ్యకళాశాలలో కూడా విద్యాబోధన జరుగుతుండేది. వేదాధ్యయనం, వ్యాకరణం, స్వరశాస్త్రం, దర్శనములు, ధర్మశాస్త్రములు, పురాణాలు, చంధోలంకారాలను విప్రులు నేర్చుకోగా, మిగిలినవారు వైద్యం, వ్యవసాయం, వాణిజ్యం, సైనికశిక్షణ తదితరాలను అభ్యసించేవారు. శ్రమవిభజ ఆధారంగా సమాజంలో వివిధ వర్గాలకు ఉపయుక్తాలైన విద్యను నేర్చేవారు.

ఆరోజులలో విద్యాలయాలను నిర్మంచేందుకు కొన్ని ప్రామాణికమైన నియమాలుండేవి. ఊరికి దూరంగా, విశాలమైన ప్రదేశంలో ప్రకృతి శోభల మధ్య, ఫలవృక్షాలతో, పుష్పలతాదులతో, ఒషదీలతలతో, కూరగాయల పాడులతో నిండిన ప్రదేశాన్ని ఎంచుకునేవారు. గురువు నివాసానికై ఒక మందిరాన్ని, విద్యార్థుల్ వసతి గ్రుహానికై ఒక మందిరాన్ని నిర్మించేవారు. అక్కడి ప్రకృతి శో, ప్రశాంత వాతావరణం మనసుకు ఎంతో ఆహ్లాదాన్నికలుగజెస్తూ విద్యపై ఏకాగ్రతను దోహదం చేసేవి. ప్రతిదినం విద్యాబోధన ఓ పెద్ద పందిరి క్రింద జరుగుతుండేది. ప్రస్తుతం నగరాలలో కిక్కిరిసిన జనావాసాల మధ్య బహుళ అంతస్తుల భవనాలలో పాఠశాలలను నిర్వహిస్తుండటాన్ని చూస్తోంటే, మన విద్యావిధానం ఎంతో లోపభూయిష్టంగా ఉందో తెలుస్తోంది. విద్యార్థులకు కనీస అవసరమైన ఆటస్థలం కూడ ఈనాటి చాలా విద్యాలయాలలో కరువైంది. విద్యార్థులు స్వయంగా తయారుచేసుకున్న కొబ్బరి ఆకుల చాపలపై కూర్చునేవారు. గురువు విద్యార్ధుల నడుమ క్రుష్ణాజినంపై కూర్చుని జ్ఞానముద్ర ధరించిన వెంటనే విద్యార్ధులందరూ ఏకకంఠముతో ప్రార్ధన చేసేవారు.

ఓం సహానావవాతు సహనఔ భువక్తు

నహ వీర్యం కరవావహై: తేజస్వి

నావదీతమస్తు మా విద్విషావహై

ఓం శాంతి: శాంతి: శాంతి:

ఆ పరమాత్మ మనతో పాటూ ఉండి మనలను రక్షించుగాక. ఆ పరమాత్మ మన కూడ ఉండి మనకు సుఖమును కలిగించుగాక. మన విద్యకు బలం కలుగునట్లుగా మనం ప్రయత్నింతుము.  మన అధ్యయనం ఆచరణ ప్రభావం కలుగునది అగుకాక. మనం ద్వేశారహితులమై  ఉందుముగాక. ఓం శాంతి: ఓం శాంతి: ఓం శాంతి:

పాఠ్యాంశాన్ని ఒక విద్యార్ధి చదువగా, ఆచార్యుడు అర్ధాన్ని వివరిస్తాడు. వెంటనే మరొక విద్యార్థి తిరిగి వివరింగా చెబుతాడు. మిగిలిన విద్యార్థులందరికీ అప్పటికే విషయం  పూర్తిగా అర్ధమయ్యేది. కఠినమైన అంశాలను  సైతం గురువు సరళంగా బోదించేవాడు. ప్రతిదినం విద్యార్ధులను సునిశితంగా గమనిస్తూ, వారి గ్రహణశక్తిని, బుడ్డి బలాన్ని పరీక్షిస్తూ పాఠ్యాంశాన్ని పూర్తిగా నేర్పేవారు. ప్రతి విద్యార్థి పాఠ్యాంశాన్ని నూటికి నూరుపళ్ళు అవగతం చేసుకున్న పిదపే, తరువాతి అంశం బోధింపబడేది. సంశయాన్ని మనసులో ఉంచుకుని పాఠాన్ని ముగించే విద్యార్థులు ఉందేవారు కాదు. ఆరోజు పరీక్షలలో నూటికి నూరు గుణములు వచ్చిన విద్యార్ధే ఉత్తీర్ణుడైనట్లు లెక్క. నిరంతర మననం, నిరంతర పఠనం, ఏకాగ్రత ముఖ్య సూత్రాలుగా ఉండేవి.శబ్దార్ధములుగానీ, తాత్పర్యములుగానీ వ్రాసుకోవడం ఉండేదికాదు. సహాధ్యాయులతో  కలసి చర్చించడం ద్వారా మేధాశక్తిని పదును పెట్టుకునేవారు. కొంతమంది విద్యార్దులే దిగువ తరగతి వారికి పాఠం చెప్పే సంప్రదాయం ఉండేది. గురువు ఎదుటనే శిష్యుడు పాఠాన్ని బోధించే పద్దతి భారతీయ విద్యా రంగంలో విశిష్టమైనదిగా గుర్తింపు ఉండేది. ఈ పద్దతి వలన విద్యార్థులకు తమ జ్ఞానాన్ని పెంపోందిచుకొనడమేకాక, చక్కని బోధనాశక్తి అలవడేది.

పిల్లలకు ఐదు సంవత్సరాలు నిండిన వెంటనే అక్షర స్వీకారం చేసేవారు. నాటి విద్యాసంవత్సర శ్రావణ పూర్ణిమ నాటి ఉపకర్మతో ఆరంభమై పుష్యశుద్ద పూర్ణిమ నాటి ఉత్సర్జన వ్రతంతో అంతమయ్యేది. ఇది వేదాధ్యయనానికి సంబంధించినది. అష్టమి, చతుర్దశి, అమావాస్య, పౌర్ణమి అనాధ్యాయ దినాలుగా పాటింబడేవి. అతివృష్టి, అనావృష్టి, భూకంపం, గ్రహణము మరియు ప్రకృతి వైపరీత్య సమయాలలో కూడ సెలవులుండేవి. ఇవిగాక పండుగలకు, యుద్దములు, దండయాత్రలకు కూడా సెలవులిచ్చేవారు. ఉన్నతవిద్య అంతా సంస్కృతభాషలో ఉండేది. వైదికవిద్యకు ఉపనయనం తోలి విధిగా ఉండేది. ఉపనయనానంతరం బాలుడు బ్రహ్మచర్య దీక్ష వహించి గురు శుశ్రూషతో విద్యార్జన సాగించేవారు. బ్రహ్మచారి పాటించవలసిన క్రమశిక్షణ చాలా కఠినంగా ఉండేది. బ్రహ్మచారి ఆశ్రమంలో నివశిస్తూ, అగ్నికార్యానికి ఇంధన సేకరణ, పశుపాలన, భిక్షాటనం చేయాలి. భూశయనం, త్రికాలశేతజల స్నాం, సంధ్యావందనం, అగ్నికార్యం విధిగా ఆచరించాలి. సాత్వికాహారం తప్పనిసరి. విధేయత, జితేంద్రియత్వం, శ్రద్దబుద్ధులు, జిజ్ఞాస, సాంఘీకసేవ, ప్రకృతి సౌందర్యోపాసన, నియమబద్ద జీవనం ప్రధాన లక్ష్యాలుగా ఉండేవి. సహాధ్యాయులతో బ్రహ్మచర్య దీక్షలోని భాగమే.

నాటి గురువులకు కూడ చక్కని నియామవళి ఉండేది. కఠిన శిక్షలు విధంపరాదు. శిక్ష అవసరమని తోస్తే చీల్చిన వెదురు బద్దతో వీపుపై వడ్డింపవల్నేగానీ, కర్కశంగా, విచక్షణారహితంగా శిక్షింపరాదు. దీనికి భిన్నంగా ప్రవర్తిస్తే, అట్టి గురువు రాజుచే శిక్షితుడవుతాడు. భయపెట్టడం, ఉపవాసం, అకాల శీత జల స్నానం, ఆస్రమబహిష్కరణం వంటి శిక్షలు ఉన్నట్లు తెలుస్తోంది. గురువు శాంతికాముడై సహనంతో విద్యార్థిని సంపూర్నవ్యక్తిగా తీర్చిదిద్దు శక్తిమంతుడై ఉండేవాడు. ప్రతి విద్యార్థిని ప్రత్యెక శ్రద్దతో విజ్ఞాననిధిగా, సుశీల సంపన్నునిగా తీర్చిదిద్ది ప్రజ్ఞామూర్తులుగా గురువులు ఉండేవారు. నాటి గురుశిష్య సంబంధం ఒక అపూర్వమైన విషయం. గురువు పిత్రుసమానుడు. శిష్యుడు పుత్ర సమానుడు. శిష్యులకు భక్తి గౌరవాలు, ఉర్వులకు వాత్స్ల్య ఆదాములు సమస్థాయిలో ఉండేవి. విద్యార్జనాటో పాటు ఆశ్రమ నిర్వహణ భారాన్ని విద్యార్దులే చూసేవారు. ఫలితంగా లోకజ్ఞత మెండుగా ఉండేది. నేటి అధ్యాపకులు తమ వృత్తిని ఎంతో ఉన్నతమైనడిగా గుర్తించి, శాస్త్రజ్ఞానంతో పాటు అధ్యాపకులుగా తమ అర్హతలు సమీక్షించుకోవలసిన అవసరం ఉంది. నేటి వార్తాపత్రికలలోని కొన్ని కధనాలను పరశీలించినట్లయితే కొంత మంది అధ్యాపకుల విపరీత ధోరణులు మనకు ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. మేధావులు, విద్యావేత్తలు ఈ దొరనిపట్ల దృష్టి సారించి జాగరూకత వహించాల్సి ఉంది.

విద్య పూర్తయిన పిమ్మట బ్రహ్మచారి సమావర్తన, స్నాతక కర్మలను ఆచరించి గురుదక్షిణ సమర్పించాలి. జీవనభ్రుతికై ఆచార్యుడు గురుకులంనుండి కదలవలసిన అవసరమే ఉండేది కాదు. రాజులు, సంపన్న గృహస్థులు వార్శికములను ఇవ్వడం, భూదానాలను చేయడం జరుగుతుండేది. ఆ విధంగా పరిపాలకులు, ప్రజలు విద్యారంగాన్ని కంటికి రెప్పలా కాపాడుతుండేవారు. మహాభారతంలో ప్రఖ్యాతి చెందిన ఆశ్రమాల గురించిన ప్రస్తావన ఉంది. ఈ ఆస్రమాలలోగల వివిధ స్థానములు ఒక్కొకటి ఒక్కొక్క ప్రత్యెక విద్యకు ప్రసిద్ధి చెంది ఉన్నాయి.

అగ్నిస్ధానం: ఇందు అగ్నికార్యములు, ఔపాసనాది కార్యములు జరుగ్తుండేవి.

బ్రహ్మస్ధానం: ఇందు కేవలం వేదాధ్యయనం జరుగుతుండేది.

విష్ణుస్థానం: ఇచ్చట రాజనీతి, అర్ధశాస్త్రాన్ని బోధించే వారు.

మహేంద్రస్థానం: సైనిక శిక్షణకు సంబందించినది.

వైవస్వత స్థానం: ఖగోళ విజ్ఞాన భాగం.

సోమ స్థానం: వృక్ష శాస్త్ర భాగం.

గరుడ స్థానము: ఇది రవాణా, వర్తక, వ్యాపారాలకు సంబందించినది.

కార్తికేయ స్థానము: సైన్య సమీకరణం, యుద్ధ సన్నాహము, పర్యవేక్షణ వంటి వ్యూహాత్మక విద్యలలో శిక్షణ జరుగుతుండేది.

ఇలా ప్రఖ్యాతి చెందిన ఆశ్రమాలలో ప్రముఖమైనది నైమిశారణ్యక విశ్వవిద్యాలయం. ఈ ఆశ్రమ నిర్వాహకుడైన శౌనకునకు కులపతి అనే బిరుదు ఉండేది. ఇక్కడ వేదాంతం, శాస్త్ర విజ్ఞానం, మతం తదితర విషయాలపై గోష్ఠులు జరుగుతుండేవి. మరోక ప్రసిద్ధి చెందిన ఆశ్రమం కణ్వమహర్షి నిర్వహాణలో మాలినీ నదీతీరలో ఉండేది. మాలినీనది సరయూనదికి  ఉపనది. ఈ ఆశ్రమ సమీపంలో అనేక ఆశ్రమాలుండేవి. వేదఘోషలతో, పవిత్ర త్రేతాగ్నులతో ఈ ప్రాంతమంతా పునీతమై ఉండేది. ఈ ఆశ్రమాలలో చంధస్సు, వ్యాకరణం, తర్కం, న్యాయశాస్త్రం, క్షేత్రగణితం, ద్రవ్యగుణశాస్త్రం, జీవశాస్త్రం అభిమాన విద్యలుగా అభ్యసించిన పండితులుండేవారని ప్రతీతి.

ప్రయాగలో భరద్వాజుని ఆశ్రమం, చిత్రకూటంలో అత్రి ఆశ్రమం కూడ పేరెన్నికగలవి. వ్యాసుని ఆశ్రమంలొ సుమంతుడు, వైశంపాయనుడు, జైమినివంటి మహర్షులు పాండిత్యంలో చరిత్ర ప్రసిద్ధులై ఉండేవారు.సైలుడు బ్రహ్మవిద్యలో విఖ్యాతి గాంచాడు. విదేహరాజైన జనకుని ఆస్థానం శాస్త్రచర్చలకు, సిద్దాంత స్థపనమునకు పేరెన్నికగన్నది. అష్టావక్రుడు తన వాదనాపటిమతో సర్వసభ్యులను ఓడించి జనకునిచే ప్రశంసింపబడెను. ప్రతికళాపరిషత్తుకు అనుబంధంగా ఆచార్యశాఖలుండేవి. ఈ పరిషత్తులలోని పండితులు వివాదాంశలపై తీర్పును ఇచ్చేవారు. వారి తీర్పులు శిరోధార్యంగా ఉండేవి.

ప్రపంచమ్ళో ప్రపథమంగా ఖగోళశాస్త్రం, రేఖాగణితం, వ్యాకరణం, వేదాంతం మనదేసంలోనే అభ్యసింపబడ్డాయన్నది విదితమే. వైద్యశాస్త్రం, శస్త్రచికిత్సావిధానం అత్యున్నత ప్రమాణాలతో అభ్యసింపబడినట్లు చారిత్రక ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. వైద్యాలయాలను స్థాపించిన మొదటిదేశంగా భారతదేశం ప్రసిద్ధి చెందింది. ఇచ్చటి వైద్యుల నిపుణతను చూసిన అలెగ్జాండర్ ఆశ్చర్యచకితుడయ్యాడట! పాటలీపుత్రములోని ఒక వైద్యాలయాన్ని సందర్శించిన ఫాహియన్ ఇలా వ్రాసాడు. “ఇచ్చట బీదలు, అనేక దీర్ఘరోగ పీడితులు చికిత్సకై వచ్చి పూర్తి స్వస్థతతో వెళ్ళేవారు. ఇచ్చటి వైద్యులు అంకిత భావంతో చేసే సేవలు నిరుపమానమైనవి”.

తక్షశిల విశ్వవిద్యాలయం వైద్యవిద్యకు ప్రసిద్ధి గాంచి ఉందేది. చరకుడు, శుశ్రుతుడు, వైద్యవిద్యాపండితులు. వీరి వద్ద కనీసం ఏడు సంవస్తరాలు కఠన విద్యను అభ్యసించి నిష్ణాతులైన వైద్యులెందరో మెసపతోమియా, అరేబియా దేశాలకు పంపబడేవారని తెలుస్తోంది. సంస్కృత భాషలోగల శుశ్రుతుని వైద్యవిద్యా గ్రంథాలు అరబిక్ భాషలోకి అనువదించబడ్డయి. పశు వైద్యవిజ్ఞానం కూడ భారదేసంలోనే బాగా అభివృద్ధి చెందింది. నేటి వైద్యవిద్యారంగాన్ని నాటి వైద్య విద్యతో పోల్చినపుడు ఎంతటి వ్యాపరధోరణి వ్యాప్తి చెందిందన్న విషయాన్ని తెలుసుకోగలం.

క్రీ.పూ.7వ శతాబ్దం వరకు మనదేశం అక్షరాస్యత విషయంలో అగ్రగామిగా ఉండటమేగాక, అనేక విజ్ఞాన రంగాలలో ప్రతిభావంతుల సంఖ్య ఎక్కువగ ఉన్నట్లు తెలుస్తోంది. క్రీ.పూ. 4వ శతాబ్దం నుండి 11వ శతాబ్దం వరకు భారతాన్ని సందర్శించిన విదేశీపండితులెందరో భారతీయ విద్యాప్రాభవాలను ప్రముఖంగా ప్రశంసించారు. తక్షశిల, నలంద, వల్లభి, విక్రమశిల, నవద్వీపము, జగదల, ఓదంతపురి వంటి జగద్విఖ్యాత విశ్వ విద్యాలయాలయములకు భారతదేశం పుట్తినిల్లు. ఇలాంటి విద్యాలయలన్నీ మహమ్మదీయుల దండయాత్రలలో నేలమట్ట మయ్యాయి. బ్రిటిష్ వారు మనదేశంలో ప్రవేశించే నాటికి, ఆయా గ్రామాలలోని ప్రజలే సమాజాలుగా ఏర్పడి విద్యాలయాలను నిర్వహించే పద్ధతి ఉండేది. ఆ విద్యాలయాలు భారతీయ సంస్కృతి ఔన్నిత్యాన్ని కాపాడుతూ ఉత్తమస్థాయిలో విద్యాభోధనను గావించేవి. ఈస్టిండియా కంపెనీ ఏజెంట్లు ఈ విద్యాసంస్థలలో ఇంగ్లీషు విద్యను పాశ్చత్యపద్ధతిని ప్రవేశపెట్టారు.

సమకాలిన విద్యారంగంలో భారతీయ సంస్కృతి, విలువలు, ఔన్నత్యం మృగ్యం కావడానికి ఆనాటి బిటిష్ పాలకులు నాటిన విషబీజాలే కారణం. ప్రపంచీకరణ నేపథ్యంలో విద్యార్థులపై ఒత్తిడి, తల్లిదండ్రుల అందోళనలు, నైతికవిలువల్ పతనం, వ్యాపారధోరణులువంటి అనర్థాలతో నేటి విద్యారంగం సతమతమవుతోంది. విజ్ఞుడైన ప్రతి భారతీయ పౌరుడు మేల్కొని మన మహోన్నత ప్రాభవాన్ని పరిరక్షంచుకోవలసిన సమయమిది. అందుకై అందరూ నడుం బిగించక తప్పదు.

శ్రీమద్రామాయణం

భారతీయ పౌరాణిక రాజమైన రామాయణం, విశ్వానికి ఆధారం ధర్మం. ఆ ధర్మాన్ని ప్రతిష్టించినది వేదం. వేదవేద్యుడగు పరమపురుషుడు శ్రీరాముడు. నీలమేఘుడు కోదండరాముడు. ప్రపంచమంతట పవిత్ర కావ్యంగా పుణ్య ప్రదం. సంస్కృతంలో రచింపబడి అనేక భాషలలోకి తర్జుమా చేయబడింది. ఈ పవిత్ర గ్రంథం. వాజ్మయమంతా శ్రిరామమయం. అటువంటి రామాయణం నాటక, కీర్తన, పద్య, హరికథా జానపద సాహిత్యంలో, ప్రబంధకవులకు మూలవస్తువుగా ఉంది.

సంస్కృతంలో ఆధ్యాత్మరామాయణం, వాసిష్ఠ రామాయణం ఉన్నాయి. ఇవికాక, రామాయణ రత్నాకరం, ఉమా సంహిత, అగస్త్యసంహిత , పాంచరాత్రాగస్థ పద్మసంహిత, పరాసరసంహిత శ్రీరామపూర్వోత్తరాపిన్యుపనిషత్, తారాసారోపనిషత్, రామచంద్ర కథామృతం, ప్రసన్న రత్నావళి, రామాయణ సారసంగ్రహం, రామహృదయోపనిషత్ లు రామకథను ప్రస్తావిస్తున్నాయి.

కాళిదాసు – రఘువంశం

భట్టి – రావణవధ

కుమారదాసు – జానకీ హరణము

భోజరాజు – చంపూరామాయణం

దేవయార్యుడు – ప్రసన్నరామాయణం

సాళువనరసింహరాయ – రామాభ్యుదయం

వామనభట్టుబాణుడు – రఘునాథ చరితం

అభినందుడు – రామచరితం

మాధవ విద్యారణ్యుడు – రామోల్లాసం

వేంకటనాథకవి – అభినవ రామాభ్యుదయం

మధురవాణి – రామాయణ సంస్కృతానువాదం

రాజచూడామణి – రామకథ

చక్రకవి – జానకీ పరిణయం

వేంకటేశుడు – రామచంద్రోదయం, రామకర్ణామృతం

శరభోజి – రాఘవ చరిత్రము

విష్వక్సేనుడు – రామచరితము

గోపాలరాజు – రామచంద్రోదయం

పద్యకావ్యాలు

క్షేమేంద్రునిరామాయణం, శాక్యమల్లుని ఉదార రాఘవం , చిత్రకవి జానకీపరిణయం, రఘునాథుని రామచరితం, శేషకవి కళ్యాణ రామాయణం, వీరరాఘవుని భాద్రాద్రిరామాయణం, రఘునందనవిలాసం, విక్రమరాఘవం, ఉత్తర రాఘవం.

ద్వర్ది కావ్యాలు

రాఘవ పాండవీయము, హరిదాట్ట సూరి రాఘవ వైషదీయం, సోమేశ్వరకవి రాఘవయాదనీయం, ధనంజయుని రాఘవ పాండవీయం, వెంకటాధ్వరి యాదవ రాఘవీయం.

త్ర్యర్ది కావ్యాలు

చిదంబర కవి రాఘవ యాదవ రాఘవీయం, అనంతాచార్య యాదవ రాఘవ పాండవీయం.

చంపూకావ్యాలు

భోజరాజీయం, లక్ష్మణుడు, రాజశ్యాముడు, ఘనశ్యాముడు, ఏకామ్రానాధుడు, యతీరాజు, శంకరాచార్యుడు, హరిహరనాధుడు, వేంకటాధ్వరి, ఉత్తరరామాయణం.

గద్యకావ్యాలు

వాసుదేవుడు, దేవవిజయగని, సార్వభౌముల కావ్యాలు. నన్నయ – రాఘవాభ్యుదయం, ఎర్రన రామాయణం, తిక్కన నిర్వచనోత్తర రామాయణ, మొల్ల, రఘునాధరామాయణం, నాద, బసవ, శ్రీపాద, గోపీనాధ, రంగనాధ రామాయణం, శారద, ఆంధ్ర వాల్మీకి రామాయణం, వరదరాజరామాయణం, తాళ్ళపాక అన్నమాచార్యుని ద్విపదరామాయణం, దాశరధ, రామోదయం, రామచంద్రో పాఖ్యానం వంటి పలు కావ్యాల ద్వారా రామాయనాన్ని చదువుకుంటున్నాము.

దేవాలయంలోని దేవతా విగ్రహానికి ఎదురుగా నిలబడి ఎందుకు ప్రార్ధన చేయరాదు?

పిల్లలు దేవతా విగ్రహానికి నిలబడి ఉంటే పక్కకు జరిగి నిలబడమని పెద్దలు మందలిస్తారు. అనేక దేవాలయాలలో ఈ సమస్య లేకుండేలాగా విగ్రహానికి ఎదురు భాగంలో ఇనుప కంచెను నిర్మిస్తారు. విగ్రహాన్ని సూటిగా కాకా కాస్త ఎడంగా కుడివైపునకు కానీ, ఎడమవైపునకు కానీ నిలబడి దేవుడిని చూస్తూ ప్రార్థించవచ్చు. సూటిగా దేవుడి దృష్టి పదేలాకాక ౩౦ డిగ్రీలు పక్కగా చేతులు జోడించి నిలబడి ప్రార్ధనలు చేయాలి. దేవతా విగ్రహం నుండి వెలువడే దైవ కృపాశక్తి సర్పగాతిలో తరంగాలుగా ప్రవహిస్తూ భక్తుడిని చేరుతుంది. కావున విగ్రహం వద్ద ఉన్నప్పుడు చేతులు జోడించి ఉంచి కళ్ళు మూసుకొని పరిపూర్ణంగా దైవధ్యానంలో మినిగి ఉండాలి.

అలా చేతులు జోడించి ఉండటం వాళ్ళ మెదడు నుండి ప్రాణశక్తి కలిగువుంటుంది. కావున అలా నమస్కారం పెట్టి ఉంచడం ద్వారా శారీరిక  బలం, బుద్ధిబలం మరియు ఆత్మవిశ్వాసం పొందబడుతారు. మానవదేహం సూటిగా దైవ విగ్రహం నుండి వెలువడుతున్న దివ్యకిరణాలను భరించలేదు. కావున విగ్రహానికి సూటీగా ప్రార్ధన చేయరాదని చెప్పబడింది.

రామయణకాలంలో ప్రజల జీవనవిధానం

నేటికీ మనకు రామరాజ్యం ఆదర్శప్రాయం. ఆ కోదండరాముని రాజ్యంలో ప్రజా జీవస్దితిగతులు ఎలా ఉండేవన్నది ఆసస్తికరం.

అవిచ్చిన్నంగా సాగిపోతుండే భారతీయ సంస్కృతిని అర్ధం చేసుకునేందుకు, భారత రామాయణ గ్రంధాల పఠనం అత్యంతావస్యకం. ఆనాటి భారతీయ సంప్రదాయాలు, రాజకీయ, సాంఘిక పరస్దితులు ఆ గ్రంధాలలో సజీవంగా చిత్రించబడ్డాయి. సాధారణ ప్రజల ఆచార వ్యవహారాలే ఏ సంఘ సంస్కృతినైనా ప్రతిబింబిస్తాయి. ఈ సిద్దాంతాం ఆధారంగా రామాయాణకాలంనాటి సంఘ పరిస్ధితులను పరిశీలిస్తే, ధర్మానుగుణమైన రాజ్యాంగం ద్వారా నీతినియమాలతో నియతమైన ఆ కాలంనాటి సాంఘీకవ్యవస్థలో సదాచారాలకు పెద్దపీట అన్న విషయం స్పష్టమవుతోంది. అందుకే రామాయణకాలంనాటి కొన్ని ఆచారాలు భారతీయులందరికీ నేటికీ ఆదర్శప్రాయాలు.

ఆరోజుల్లో అతిదిసత్కారానికి అత్యున్నతమైన స్థానం ఉండేది. గృహస్థ నిర్వహించాల్సిన పంచ యజ్ఞాలలో అతిథి సత్కారం కూడా చేర్చబడింది. సత్కరించే వారి శక్తిని, హోదానుబట్టి అవసరమైన మార్పులు జరిగేవి. సర్వ సామాన్య పరిస్థితులలో అర్ఘ్యపాద్యాలు, మధుపర్కం, గోవు, ఆసనం తప్పకుండా సమర్పించేవారు. అతిథులను స్వాగతించిన తరువాత కుశల ప్రశ్నలు ఉండేవి. ఉదాహరణకు తనకు స్వాగతం పలికిన సబరిని రాముడు ఇలా కుశలప్రశ్నలను వేసాడు. ‘తపస్వినీ! అన్ని విఘ్నాలను జయించావు కదూ! తపస్సు వర్దిల్లుతున్నది కదూ! కోపం, ఆహారం చెప్పుచేతల్లోనే ఉన్నట్లే కదూ! నియమాలను నిర్వహిస్తూన్నావు కదూ! మనసుకు సుఖం, శాంతి కలుగుతున్నాయి కదూ. మధురభాషిణీ! నీ గురుశుశ్రూష ఫలించింది కదూ!’

కలుసుకున్నవారు పెద్దవారైతే నమస్కరించడం, సమవయస్కులైతే కౌగలించుకోవడం, చిన్నవారైతే అభినందనలను స్వీకరించడం జరుగుతుండేది. పిల్లలు బయలుదేరేముందుపెద్దల ఆజ్ఞను తీసుకోవడం మరచిపోయేవారు కాదు, తల్లిదండ్రులు, పురోహితులు, పెద్దలు మంత్రపూర్వకంగా పిల్లలను ఆశీర్వదించే వారు. స్నేహితులపై కనబరిచే ఆత్మీయతకు అనుగుణంగా ఒకరితో ఒకరు సెలవు తీసుకునే సమయంలో తిరిగి కనిపిపిచండి, తిరిగి కలవడానికే సెలవు పుచ్చుకుమ్తున్నాం, తిరిగి రావడానికే సెలవు తీసుకొంది అనే మాటలను సంస్కృతంలో చెప్పేవారు సెలవు అనే మాటను అనాగరికంగా, అనుచితంగా భావించేవారు. ప్రజలు రాజులను ఎంత గౌరవంగా చూసుకునేవారో, అంటే గౌరవంగా రాజులు ప్రజలను కూడా చూసుకునేవారు. దశరథ మహారాజు తనకు నమస్కరించిన సభాసదులను చేతులు జోడించి ప్రతి నమస్కారం చేసేవాడు. రావణుడు సైతం తనపాదాలను స్పృశించిన సభాసదులను సముచితరీటిన ఆదరించాడు. తన సేనాదిపతులను చేతులు జోడించి పలుకరించేవాడు.

రాజభవనంలో రాజుల దర్శనానికి వచ్చేవారేవరైనా సరే, ముందుగా ద్వారపాలకుని ద్వారా విషయం తెలియబరచడం తప్పనిసరిగా ఉండేది. వారు అనుమతించిన తరువాతే దర్శనం లభించేది. తండ్రిగారి అంత:పురంలోకి తండ్రి దర్శనానికై రాముడు కూడ వర్తమానాన్ని పంపుకోవలసి వచ్చింది. అయితే సుమంత్రుని వంటి వయోవృద్ధులకు ఎలాంటి ఆటంకాలు ఉండేవి కావు. ఆశ్రమాలలో నివసించే గురువులను దర్శించేందుకు పోయినప్పుడు కూడా వర్తమానం పంపడం ఆచారంగా ఉండేది. అంత:పుర వ్యవహారాలలో పట్టపురాణి ప్రధాన స్థానం వహించేది. ఆకాలంనాటి సంభోధనా పధ్ధతిఎంతో ఆత్మీయంగా ఉండేది.

ఆనాటి వస్త్రాభరణ అలంకారాలు

ఆనాటి ప్రజల రకరకాల వస్తాలంకరణలతో, ఆభరణ అలంకారాలతో విలసిల్లుతుండేవారు. ఆకాలంలో సైనికులు సైతం చిత్ర విచిత్రమయిన వస్త్రధారణ పట్ల అమితమయిన శ్రద్ధను చూపించేవారు. నగిషీ చేసిన వస్త్రాలను ధరించడం బాగా వాడుకలో ఉండేది. బంగారు జలతారు పట్టు పీతాంబరాలు, రత్నాలు పొదిగిన రత్నాంబ్రాలు, రామాయణంలో వర్ణించబడ్డాయి. నాటి మానవ జీవితంలోనే కాక, భావాలలో, లోకోక్తులలో వస్త్ర ప్రశంస కనుబడుతుంటుంది. కౌశేయాలు, అంటే పట్టువస్త్రములు బాగా వాడుకలో ఉండేవి. అందుకే సీతను ఎన్నో ఘట్టాలలో కౌశేయవాశిని అని పిలువడం జరిగింది.

ప్రత్తినూలుతో, జనపనారతో తయారుచేసిన వస్త్రములను గురించి తక్కువగా ప్రస్తావించబడింది. జనపనారను జనపనారను ంచ జనపనారతో తయారుచేసిన తాళ్ళు పెనువేసుకునేందుకు ఎక్కువగా ఉపయోగించేవారు. లంకలో హనుమంతుని జనుపనారతోనే బంధించారు. అయన తోకకు ప్రత్తినూలు బట్టల పాత పీలికలు చుట్టబడినాయి. సంనబట్టలకు సూక్ష్మవస్త్రములని, విలువగల వస్త్రములకు మహార్హవస్త్రములని, జలతారు, అమ్చుబట్టలకు సంవీత వస్త్రములని పేర్లుండేవి. అలాగే పంచెలను వసనము, అంశుకము, అర అనే పేర్లతో పిలిచేవారు.

తలపాగకు ఉష్ణీషం అని పేరు. విద్యార్థులు దోవాతిని ధరించేవారు. పైపంచెను ధరించేవారు కాదు. మారీచినితో ప్రప్రధమంగా రాముడు పోరాడినపుడు ఏకవస్త్రధరుడే. ఇక, గృహస్తులు పంచేకట్టుకుని, ఉత్తరీయాన్ని కూడా ధరించేవారు. ఇంచుమించు ఈనాటి కండువావంటిది. యుద్ధమో లేక కాయకష్టం చేయాల్సి వచ్చినపుడు, ఉత్తరీయాన్ని నడుముకు కట్టుకునేవయు. సాధారణంగా స్త్రీలు పట్టుచీరలనే కట్టుకునేవారు. పురుషుల్లా ఉత్తరీయం వేసుకున్నపటికీ, ఆ వేసుకోవడం వేరుగా ఉండేది. రంగువస్త్రములను విరివిగా ధరించేవారు. అప్పుడు కుట్టు వస్త్రములు లేకపోయినప్పటికీ,కుట్టుపని తెలిసి ఉండకపోలేదు. రామాయణంలో సూదికి ‘సూచీ’ అనే పదం, దర్జీకి ‘తున్నవాయ’ అనే పదం ప్రయోగించబడింది. రాజసేవకులు ధరించిన కంచుకాలు ఇంచుమించు పోడుగుకోట్ల వంటివే.

ఆరోజుల్లో కళాశక్తి

సంగీతం ఆ నాటి ప్రజలజీవితాలలో అవిభాజ్యమైన ఒక అంశంగా ఉంది. అందరూ సంగీతాన్ని ఆదరించేవారు. పట్టణాలలో రథాల గరగర ధ్వనితోపాటు, సంగీతవాయిద్యాల శ్రావ్యసంగీతం వినిపిస్తుంది. రాజులజీవితాలు సంగీత మాధుర్యంలో మునకలు వేసేవి. దశరధుడు, రాముడు, భరతుడ, రావణుడు సూర్యోదయం కాగానే వాద్యాల మధురధ్వనులు, వందిమాగధుల స్తుతులతో మేలుకోలుపబడేవారు. రావణుడు తర దర్బారుకు సహస్త్ర శంఖ, కాహాళ, తూర్య ధ్వనులతో వచ్చేవాడు. వనవాసం నుంచి రాముడు అయోధ్యకు వేంచేసినపుడు గాయకులూ శంఖాలు,దుందుభి నాదాలతో స్వాగతం పలికారు.

ప్రాచీనకాలంలో యుద్దసమయాలలో కూడా సంగీతం ఉండేది. యద్ద సంగీతాన్ని ‘యుద్ధగాంధర్వం’ అని పిలిచేవారు. ఇక యుద్ధాలు లేనప్పుడు సేనలు వాద్య సంగీతంలో తలమునకలయ్యేవి. సైనికులకి భేరినాదం యుద్ధ ఆహ్వా సూచకంగా పరిగణింపబడేది. ఆనాటి వాద్యాలలో వీణ అత్యధిక ప్రాచుర్యాన్ని పొందింది. సంగీతంతో పాటు నృత్యం కూడా బాగా ప్రాచుర్యంలో ఉండేది. రాముని వివాహమహోత్సవంలో అప్సరసలు నృత్యం చేయగా, గంధర్వులు మధురగీతాలను ఆలపించేవారు.

ఆయన జన్మదినం, రాజ్యాభిషేక సమయాలలో కూడా ఇలాంటి ఏర్పాట్లే జరిగాయి. పట్టణాలలో ఉద్యానవనాలు నిర్మించబడేవి. స్త్రీపురుషులు క్రీడావినోదార్ధం ఉద్యాన వనాలకు వెళ్ళేవారు. ఇక లంకలో అశోకవనం రావణునికి ప్రీతిపాత్రమైనది. ఆవనాన్ని చూసినపుడు ఇంద్రియ నిగ్రహంగల ఆంజనేయుడు కూడా ముగ్ధుడయ్యాడు. అంత:పురాలతో పాటు రాణులు విశ్రాంతి వినోదాల నిమిత్తం ఉద్యానవనాలను నిర్మించేవారు. అవి ప్రమాద వనాలని పిలువబడేవి. ఊరికి దూరంగా క్రీడాస్థలాలు నిర్మింపబడేవి.

విద్యావికాసం

సంఘంలో నిరర్క్షరాస్యతను దూరం చేసి మంచి నాగరికతను పెంపొందించడానికి ప్రాచీనకాలపు విద్య యొక్క ముఖ్యోద్దేశం. విద్యార్థులు పరిశుభ్రత, వినమ్రత, విధేయత, సత్ర్పవర్తన తదితర గుణాలపై విద్య మళ్లించేది. భారతీయ సంస్కృతికి మూలభూత సిద్ధాంతమైన  మతము, నీటి ఆనాటి విద్యలలో ఎక్కువ ప్రభావాన్ని కలిగి ఉండేవి. నాటి విద్యావ్యవస్థలో వేదవేదాంగాములు, కర్మకాండల పరిజ్ఞానం అని వార్యంగా ఉండేది.

రామయణకాలంలోని ప్రారంభ శ్లోకాలలో వాల్మీకి నారదునితో తన కావ్యనాయకుడు శరీరం, మనస్సు, ఆత్మలలో పరిష్కృత గుణాలను కలిగినవాడై ఉండాలని విన్నవించాడు. వాల్మీకి దృష్టిలో ఆదర్శపురుషుడు – గుణవంతుడు, పరాక్రమవంతుడు, ధర్మజ్ఞుడు, పరోపకారి, సత్యభాషి, ద్రుడప్రతిజ్ఞగలవాడు, విద్వాంసుడు, ప్రియదర్శనుడు, క్రోధాన్ని జయించువాడు, భూతదయగాలవాడు, యుద్ధంలో అజేయుడై ఉండాలి. నారదుని దృష్టిలో రాముడే పై గుణాలను కలిగినవాడు. ఆ యుగంలో రాముడు సర్వోత్తమమైన విద్యలను పొందిన రాజకుమారుడు. అయినప్పటికి అన్యులను తక్కువగా భావించేవాడు కాదు. పౌరకార్యాలను నిర్వర్తిస్తూ ప్రజల సుఖదు:ఖాలలో పాలుపంచుకునేవాడు. ఆనాటి విద్యావంతలు తమ సాంఘిక కర్తవ్యాలను పాటించేందుకు ఋణానిత్రీణి అనే సిద్దాంతాన్ని ప్రతిపాదించారు. దీనినిబట్టి ఈలోకంలో పుట్టిన ప్రతి వ్యక్తి దేవఋణం, ఋషి ఋణం , పితృఋణం అనే మూడు ఋణాలను తీర్చుకోవలసి ఉంది. యజ్ఞాల అనుష్టానం, శాస్త్ర అధ్యయనం, సంతానోత్పత్తి ద్వారా మనిషి ఈ ఋణాలనుంచి విముక్తుడవుతున్నాడు.

ఒక యుగంలోని వాజ్మయం ఆనాటి సంఘానికి అద్దం వంటిది. ఆనాటి వాజ్మయానికి చరమ నిదర్శనం వాల్మీకి రామాయణమే. వాజ్మయంలో  జీవిత విశ్లేషణ, జీవితపు గొప్పదనం, జీవితపు అభివ్యక్తీకరణం ప్రతి పాదింపబడిన శ్రేష్టకావ్యం రామాయణం. వాజ్మయంలో ఒక కొత్తకోలబద్దను, నూతన ఆదర్శాలను నెలకొల్పినందు వల్లనే రామాయణం ఆదర్శ కావ్యమైంది. వేదాలలోని పురాతనవాదం, బ్రాహ్మణాలలోని రహస్యవాదం, ఉపనిషత్తులలోని అద్యాత్మవాదం, సూత్రాలలోని సంక్షేపవాదం తరువాత ప్రజలు రామాయణానికి స్వాగతం పలికారు. సరళమైన కతాప్రవాహం, భావాల మార్మిక ప్రకటీకరణం, సంగీత నాద సౌందర్యం – ఈ మూడింటి మనోహరమైన సమ్మేళనమే రామాయణ కావ్యం. రాముని జీవితాన్ని గురించి వాల్మీకి రచించిన రసమధుర మహాకావ్యం రామాయణం. ధర్మానుయాయులగు హిందూజాతి అస్తిత్వం ఒక ప్రత్యెక విలువగా ఉన్నంతకాలం రామాయణం ఎల్లప్పూడు భారతీయుల సభ్యత, గోప్పదన్నాన్ని, దాని సౌరభాన్ని నలుదిక్కులా విరజిమ్ముతుంది. ఆమధ్య, దేశంలో ఆధ్యాత్మిక విషయాశక్తి తగ్గడంలో రామకథకు మూలమయిన రామాయణ పఠనం తగ్గి, నాటి ఉదాత్త విషయాలు మరుగునపడిపోయాయి. అయితే, ప్రస్తుత యువతకు మన సాంస్కృతిక వారసత్వం పట్ల ఆసక్తి పెరుగుతుండటం ముదావహం. యువతకు మన పురాణాల పట్ల అనురక్తి కలుగుతుండటం ఒక శుభ పరిణామం. అది భవిష్యతరాలకు మన పెట్టుబడి వంటిదనేచెప్పాల్సి ఉంటుంది.

తులసీ తీర్థం ప్రభావితమైనదా?

దేవాలయానికి వెళ్ళినపుడు అక్కడ మనం తీర్థాన్ని తీసుకుంటాం. తీర్థానికి తనకంటూ కొన్ని వైభవ గుణాలున్నాయి.

హిందూ కుటుంబాలలో తులసి మొక్కను నాటి, పెంచి పోషిస్తారు. పవిత్ర జలాన్ని తులసి ఆకులతో జోడించడం ద్వారా ఆ జాలం ఎంతో ప్రభావితమవుతుంది. ఆ జం ఔషద గుణాలను పోపొందుతుంది.

విదేశాలలో ఓ విధమైన శుద్ధ జలాన్ని ‘క్లిస్ట్రర్డ్ వాటర్’ అని పిలుస్తారు. క్లిస్టర్డ్ వాటర్లో ప్రమాదకరమైనటు వంటి వ్యాపించి ఉన్న కాలుష్యం లేదని అమెరికాన్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ జాలం ఎంతో శుద్దిచేయబడిన నట్టిదై మినరల్స్ కలిగి వాడిన వారిని ఆరోగ్యవంతంగా మరియు జాగృతంగా ఉంచుతుంది. ఒక గ్లాసెడు మామూలు నీటిలో రెండు చుక్కల క్లస్టర్డ్ వాటర్ కలిపినట్లయితే ఆ నీరంతా ఆరోగ్యప్రదమైన పానీయంగా మారుతుంది. తులసిని కలిపినా నీరు కూడా క్లస్టర్డ్ వాటర్ కలిపిన జలంలాంటి గుణం ఉందని కనుగొనడం జరిగింది.

తులసీ జలాన్ని త్రాగడానికి గుడికి వెళ్ళవలసిన అవసరంలేదు. దాని ఇంటివద్దనే తయారు చేసుకోవచ్చు. మన ఋషులకు తులసీ జాలం యొక్క గొప్పతనం తెలుసుకాబట్టే దాన్ని వాడమని మనకు తెలిపారు.

Sunday, June 17, 2012

దేవతార్చన లో పుష్ప విలాసం!!!


పరమశివుడు అభిషేక ప్రియుడైతే, శ్రీమహావిష్ణువు అలంకార ప్రియుడు. అలంకార ప్రియుడైన శ్రీ మహావిష్ణువు ఈ కలియుగంలో భక్తుల కోర్కెలను తీచే కల్పతరువుగా తిరుమల వేంకటాద్రిపై కొలువై ఉన్నాడు. తిరుమలలో శ్రీవేంకటేశ్వరునికి పుష్పాలను సమర్పించే తీరు ఓ విశిష్టతతో కూడుకున్నదనిపిస్తుంటుంది. శ్రీవారి అలంకరణకు వినియోగించే పుష్పహారాల శైలి అత్యద్భుతం. ముక్యంగా బ్రహ్మోత్సవాల సమయంలో మలయప్పస్వామి అలంకరన విషయంలో తిరుమల యావత్తూ పుష్పమాలంకృతమవడం, అడుగడుగునా భక్తులను అనందపార్వశంలో ముంచెత్తుతుంటుంది.

‘త్రివర్గ సాధనం పుష్పం – పుష్టి – శ్రీ – స్వర్గ మోక్షదం’

అని అన్నారు. అంటే  పువ్వులు పుష్టిని (శక్తిని), సంపదలని స్వర్గాన్ని కూడ ప్రసాదిస్తాయన్నమాట.

‘పుష్పైర్దేవా: ప్రసీదంతి ‘

పుష్పాల ద్వారా దేవతలు ప్రీతి చెంది మనిషి కోరుకున్నవి లభింపజేస్తారు. అందుకే ప్రతి పూజలో పుష్పాలుంటాయి.

పత్రం పుష్పం తోయం మోమే బక్త్యా ప్రహచ్చతి
తదహం భక్త్యు పహృత మశ్నామి పయతాత్మన:

అని శ్రీకృష్ణ  పరమాత భగవద్గీతలో చెప్పాడు కదా! అంటే పరిశుద్ధాంత:  కరుణుడైన భక్తుడు ప్రీతిపూర్వకంగా ఆకునుగానీ, పువ్వునుగానీ,పండునుగానీ, చివరకు కొంచెం జలాన్నిగానీ ఇస్తే, దానినే నేను ఆరగిస్తున్నాను అని పరమాత్మ చెప్పాడు.   పువ్వులలో మరో ప్రత్యేకత ఏమిటంటే, ఇవి ధనిక పేద తారతమ్యం లేకుండా అందరికీ అందుబాటులో ఉంటాయి. భగవంతునికి అర్పించే పూజాద్రవ్యాలలో పువ్వులకు ఓక విశిష్టస్థానం వుంది. ఆ పరమాత్మకు విదురుడు, ద్రౌపది, పత్రాన్ని అందించి కృతార్ఠులవ్వగా, గజేంద్రుడు పుష్పాన్ని, శబరి ఫలాన్ని, రంతిదేవుడు తోయమును భక్తితో సమర్పించుకుని ధన్యులయ్యారు.

నిజమైన పుష్పార్చన
అహింస ప్రథమ పుష్పం, పుష్ప నింద్రియ నిగ్రహ:
సర్వభూత దయా పుష్పం, క్షమాపుష్పం విశిష్యతే
ద్యానపుష్పత్తప:  పుష్పం, జ్ఞాన పుష్పంతు స్ప్తమం
సత్యం చై నాషంఅమం పష్ప, మే భిస్తుష్యతి కేశన:

అహింస, ఇంద్రియ నిగ్రహం, భూతదయ, క్షమ, ధ్యానం, తపస్సు, జ్ఞానం,  సత్యం అనే ఎనిమిది సద్గుణాలతో కూడిన నిజమైన పుష్పాలతో భగవంతుని అర్చించాలని భావం. ఈ సద్గుణాలు లేకుండా లక్ష పుష్పార్చన చేసినప్పటికీ ఫలితం శూన్యం.

ఏ తదేవ పరం ధ్యాన, పూజైషేక పరమతా
యదనారత మంతస్త, మృద్ చినాత్మ వేదనం అని ‘యోగ  వాశిష్టం ‘ చెబుతోంది. ఈ సద్గుణాలు లేకుండా పుష్పార్చన, పూజలు చేయడం మట్టి కంటె వ్యర్థమే. అయితే పుష్పాలు లేకుండా చేసే పూజ సంపూర్ణమయిన పూజ అనిపించుకోదు.

పూజకు పుష్పం

పుణ్య సంవర్థనాచ్ఛాపి, పాపౌఘ పరిహారత:
పుష్కార్థక ప్రదానచ్ఛ, పుష్ప మిత్యభిదీయతే – అని ‘కులార్ణవ తంత్రం ‘ వక్కాణిస్తోంది. అంటెఏ పాపపరిహారానికి, పుణ్య సంవర్థనానికి, ఐశ్వర్యప్రాప్తికి పుష్పపూజ తప్పనిసరి అని దీనర్థం. పూజలో ఎన్ని హంగులు, ఆర్భాటాలు చేసినప్పటికీ పువ్వులు లేకపోతే, ఆ పూజ ప్రయోజనం శూన్యమే .

పుష్పైర్దేవా: ప్రసీదంత్, పుష్పే దేవాశ్చ సంస్ఠితా:
న రత్నే: న సువర్నేవ,  న విత్తే న చ భూరిణా
తథా ప్రసాద మాయాని, యథా పుష్పై జనార్థన:

విష్ణు ధర్మోత్తర పురాణం, స్కాందపురాణం, కొన్ని తంత్ర గ్రంథాలలో ఇదే విధంగా చెప్పబడింది.

పుష్ప సేకరణ విధి

స్నాత్వామధ్యాహ్న సమయే నఛింద్యాత్ కుసుమంపర:
దేవతాస్తన్న గృహణంతి, భస్మీ భవతి కాష్టవత్

మధ్యాహ్నం తరువాత పువ్వులనుకోస్తే, ఆ పువ్వులను దేవతలు స్వీకరించరు. అటువంటి పుష్పార్చన కాల్చిన కట్టె కంటే అధ్వాన్నమవుతుంది.

పువ్వులను కోసేముందు ఈ క్రింది శ్లోకాన్ని పఠిస్తూ కోయాలని పెద్దలు చెప్పరు.

నమస్తే కుసుమా ధారే, నమసే కమలాశాYఏ
పుష్పాణి విష్ణు పూజార్థం, ఆహరిష్యే తవజ్ఞయా

పూజకు పనికిరాని పువ్వులు
అక్రితాన్య ప్రదాత్తాని, చౌర్య  లబ్దాని యానిచ
శూద్రా హృతాని నా భూమౌ, పతితా తదైవ చ
పరండార్కచ పత్రేషు, చా హృతానికరే  తథా
పటా హృతని యాన్స్య, వ్ర్ణయేత్తాని యత్న తపి

పురుగులు పట్టిన పువ్వులను, సగంగా చీలిపోయిన వాటినీ, ముక్కలుగా నలిగిపోయిన పూవులను, బాగా వడలిపోయిన పూవులను, ఎలుకలు కొరికి పువ్వులను ఎవరి దగ్గరైనా అడిగి తెచ్చిన పువ్వులను, కాళ్ళకు తగిలిన పుష్పాలను, వేరే దేవాలయాలలో కింద పడిన పూవులను పూజకు ఉపయోగించకూడదని అర్థం.

పూజలో పుష్పాలు

పుష్పం నా యది నా పాత్రం
ఫలం నేష్ట మథో ముఖం
దు:ఖదం తత్సమాఖ్యాతం
యథోత్సవం తహర్పణం
లక్ష్మీ సరస్వతి పుష్పేషు లక్ష్మీ
ర్వ సతి పుష్కరే
ప్ష్పాంజతా నతోద్దోష్:
బిల్వ పత్ర మథోముఖం

పుష్పాలలో లక్ష్మీదేవి నివస్తిస్తుంది. అందువల్ల భగవంతునికి అర్పించేప్పుడు  పువ్వులు క్రింది ముఖభాగంగా ఉండకుండా జాగ్రత్తపడాలి. అయితే పుష్పాంజలి సమర్పించే సమయంలో ఈ విషయానికి అంత ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరం లేదు. తులసీ దళాలకు, బిల్వ పత్రాలకు ఈ విధానం వర్తించదు. ఏ విధంగానైనా ఆ పుష్పాలను లభించకపోయి నట్లయితే శ్రీహరి పూజకు తులసీ దళాలను సమర్పించుకోవడమే ఉత్తమమైన పద్ధతి అని వృద్ధ గౌతమ స్మృతి చెబుతోంది. పరమేశ్వరునికి పసుపురంగు దేవకాంచనం, విష్ణువుకు నల్లకలువ, అమ్మవారికి మల్లి,మందారం, లలితా పరమేశ్వరీ దేవికి చంపక, కుంద, కేసర, శిరీష పుష్పాలంటే ఇష్టమని చెప్పబడింది. లలితాపరమేశ్వరి ఈ పుష్పాలనే తన శిరోజాలలో అలంకరించుకుంటుందట. అలాగే ఆ తల్లి కదంబ వనాలలో సంచరిస్తూ కదంబపువ్వులను అలంకరించుకుంటుందట.

శివ వివర్జయత్ కందం, ఉన్మత్తంచ హరే తథా
దేవీ నామర్క మందారౌ, సూర్యస్య తగరం తథా
కేతకీ భావ పుష్పైశ్చ, నైవార్చ శంకర స్తథా
గణేశం తులసీ పత్రై, దుర్గాం నైనతు దూర్వయా

అని పద్మపురణాం చెబుతోంది. సాధారణంగా శివపూజకు బిల్వం, తుమ్మి, మందార, రేల, తామర, శంఖపుష్పం, నాగలింగం పువ్వులను ఉపయోగించడం జరుగుతుంది కానీ, శివ పూజకు మొగలిపువ్వులను, తీగమల్లెపువ్వులను, విష్ణుపూజకు ఉమ్మెత్తుపువ్వులను, స్త్రీదేవతల పూజకు జిల్లేడుపూలను, పారిజాతాలను దుర్వారాలను వాడరు. సూర్యునిపూజకు నందివర్థనాలను, విఘ్నేశ్వరపూజకు తులసీదళాలను ఉపయోగించకూడదు.

అలాగే విప్పపూలు, అశోకపుష్పాలు, గోరింటపువ్వులు, వేపపువ్వులు, విష్ణుక్రాంతపూలు, వాయిలిపువ్వులు, తుమ్మపూలు, పెద్దగన్నేరుపూలు, మందారపూలు, మొగ్గమల్లె, దత్తూరపూవ్వులు, నందివర్థనాలు, అవిశ, డొమ్మడోలు పువ్వులు శ్రీహరిపుజకు పనికిరావు. భాద్రపద మాసంలో మొగలిపువ్వులను పూజకు ఉపయోగించ రాదని చెప్పబడింది.

కొన్ని పుష్పాల ప్రత్యేకత

పర్వతమంత బంగారాన్ని భగవంతునికి సమర్పించినంత పుణ్యం, ఒక్క సంపంగి పువ్వును సమర్పిస్తే వస్తుంది.

సౌవర్ణాచ్చ ప్రసూనాస్తూ, మత్ర్పియం నాస్తి పాండవ
మేరుతుల్య సువర్ణాని, దత్త్వా భవతియత్ఫలం
ఏకేన స్వర్ణ పుష్పేన, హరిం సంపూజ్య తత్ఫలం
సువర్ణ కురుమైర్దివ్యై, యైర్నధితో హరి:
రత్న హీనై: సువర్ణాద్యై:, సభవేజ్జన్మ జన్మని

సంపంగి పూలతో పూజచేయనివాడు మరుజన్మలో సువర్ణ రత్నాలా హీనుడవుతాడట. ఆయుష్షుకోసం దుర్వారపూలతో, సంతానంకోసం దత్తొరపూలతో రుద్రదేవుని పూజించాలట. ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క విధమైన పూలతో శ్రీహరిని అర్చించితే పుణ్యప్రాప్తి కలుగుతుంది. చైత్రమాసంలో కమలాలు, జాజులు, సంపంగి పువ్వులు, బిల్వపత్రాలు, వైశాఖ మాసంలో మొగలిపూవులు, ఆషాఢమాసంలో కమలాలు, కదంబపుష్పాలు, శ్రావణ మాసంలో అవిశెపూవులు, దూర్వారాలు, భాద్రపదంలో సంపంగులు, మల్లెలు, సింధూరాలు, ఆశ్వయుజ మాసంలో తీగమల్లెలు, మల్లెపూవులు, కార్తీకంలో కమలాలు, సంపంగులు, మార్గశిరమాసంలో బకుల పుష్పాలు, పుష్యమాసంలో తులసి, మాఘ, ఫాల్గుణ మాసాల్లో అన్ని రకాల పుష్పాలు శ్రీమహావిష్ణువు పూజకు ఉపయోగించడంవల్ల విశేష పుణ్యప్రాప్తి కలుగుతుంది.

సాధారణంగా చెట్టునుంచి ఆరోజు కోసిన పూలను జలంతో ప్రోక్షించి స్వామి పూజకు ఉపయోగిస్తుంటాము. కానీ, కొన్ని పుష్పాలను కొన్ని రోజులపాటు నిలువ ఉంచిన తరువాత కూడ్ పూజకు ఉపయోగించవచ్చు ఉదాహరణకు కలువపూలను ఐదు రోజులవరకు, కమలాలను పదకొండు రోజులవరకు నిలువ ఉంచినప్పటికి పూజకు వినియొగించవచ్చని ‘భవిష్యపురాణం’ పేర్కొంటోంది. బిల్వ పర్తాలాను, తులసీదళాలను, అవిశపూలను, వాడిపోయినప్పటికీ పూజకు ఉపయోగించవచ్చు. ఒకవేళ ఈ పువ్వులు చిద్రమైనప్పటికీ పూజకు ఉపయొగించవచ్చని ‘మేరుతంత్రం’ చెబుతోంది.

పువ్వులు ప్రత్యేకమైన కంపనాలను కలుగజేస్తాయి. ఆ కంపనాలు రంగుతో పాటు అతి చక్కని శాంతిని మనసుకు కలిగిస్తాయి. అందుకే పువ్వులకు అంతటి ప్రాముఖ్యత. కొన్ని పువ్వుల కారణంగా యుధ్ధాలు కూడ జరిగాయి. పారిజాత పుష్పం కోసం సత్యభామ పంతం పట్టగా, అందుకోసం, శ్రీకృష్ణుడు ఇంద్రునితో యుధ్ధానికి దిగాల్సి వచ్చింది. సౌగంధిక పుష్పంపై మోజుపడ్డ ద్రౌపది కోసం భీముడు, కుబేరుని అనుచరులతో తలపడ్డాడు కదా! అందుకే పువ్వులకు అంతటి ప్రాముఖ్యత.

గాయత్రీ మంత్రం



గాయత్రీ మంత్రంలోని 24 బీజాక్షరాలలో 24 దేవతలున్నారన్నది మన పెద్దలమాట. గాయత్రీమంత్రం పరబ్రహ్మ స్వరూపం.   మోక్షపదాన్ని ఇస్తుంది. అందుకే గాయత్రీమంత్రానికి అంతటి ప్రాముఖ్యత.

ఓం భూర్భవస్సువ: తత్సవితుర్వరేణ్యం
భర్గో దేవస్య ధీమహి ధియో యోన: ప్రచోదయాత్

గాయత్రీమంత్రం  24 అక్షరాలలో -

1. “తత్”  -  గణేశుడు ,  
2. “స”  -  నృసిం హస్వామి,   
3. “వి”  -  విష్ణు,  
4. “తు”  -  ఈశ్వరుడు,  
5. “వ”  -  శ్రీకృష్ణ,  
6. “రే”  -  రాధాదేవి,    
7. “ణి”  -  లక్ష్మీదేవి,  
8. “యం”  -  అగ్నిదేవుడు,  
9. “భ”  – ఇంద్రుడు,  
10. “గో”  – సరస్వతీదేవి,  
11. “దే”  – దుర్గాదేవి,  
12. “వ”  -  హనుమాన్,  
13. “స్య”  -  భూదేవి,  
14.  “ధీ”  -  సూర్యభగవానుడు,  
15. “మ”  -  శ్రీరామచంద్రుడు,  
16. “హి”  -  సీతాదేవి,  
17. “ధి”  -  చంద్రుడు,  
18. “యో”  -  యమధర్మరాజు,  
19. “యో”  -  బ్రహ్మదేవుడు,  
20. “న:”  -  వరుణదేవుడు,  
21. “ప్ర”  -  నారాయణుడు,  
22. “చో”  – హయగ్రీవుడు,  
23. “ద”  -  హంసదేవత,  
24. “యత్”  -  తులసీమాత.

ఇందులో ఎవరి ఇష్టదేవతను వారు ఆ దేవత గాయత్రీ మంత్రంతో జపించి ఆ దేవతా అనుగ్రహాన్ని పొందవచ్చు.  ఉదయం 108 సార్లు, సాయంత్రం 108 సార్లు చొప్పున 40 రోజులపాటు ఆ దేవతాచిత్రం ముందు కూర్చుని ధూప, నైవేద్యాలతో పూజించి, ఆ దేవత మంత్రాలను 108 సార్లు జపించితే అనుకున్న కోరికలు నెరవేతురాయి.


అష్ట సిద్ధులు


యోగసాస్త్రంలో ఎనిమిది సంఖ్యను ‘ మాయ ‘ కు సంకేతంగా చెబుతారు. తొమ్మిది సంఖ్యను పరమాత్మకు ప్రతీకక్గా చెబుతారు. భగవద్గీతలో  అష్టవిధమాయల ప్రస్తావన కనిపిస్తుంది. పంచభూతాలు, మనసు, బుద్ధి, అహంకారం కలిస్తే ఎనిమిది అవుతాయి. పంచభూతాలకు పంచేంద్రియాలు ప్రతీక  గనుక మన శరీరమే ఒక  ‘ మాయామహలు ‘ గా గ్రహించాలి.

అష్టమాయల వల్లనే అష్టకష్టాలు సంప్రాప్తిస్తాయి.  అష్టమాయల్ని  జయించాలంటే – ” ఓం నమోనారాయణాయ” అనే అష్టాక్షరీ మంత్రాన్ని ఆశ్రయించాలని పెద్దల మాట.  అలా ఆశ్రయించిన ప్రహ్లాదుడు, ద్రువుడు, గజేంద్రుడు, అంబరీషుడు, ద్రౌపతి, అర్జునుడు – ఇలా ఎందరో భక్తులు సదా గట్టేక్కారు.

శ్రీదత్తాత్రేయ మహాగురువులు అష్టసిద్ధుల్ని తమ బిడ్డలుగా చెప్పారు. తమ భక్తులకు వారి అనుగ్రహం ఉంటుందన్నారు.

“విభూతిర్భూతి  హేతుత్వాద్భసితం తత్త్వ భాస్యత్”  – అష్ట ఐశ్వర్యాలుగా చెప్పే అష్టసిద్ధుల్ని విభూతులని కూడా అంటారు. ఇంతకీ ఏమిటీ అష్టసిద్ధులు?

అణిమ, మహిమ, గరిమ, లషిమ, ప్రాప్తి, ప్రాకమ్యం, ఈశిత్వం , వశిత్వం – అనే ఎనిమిదీ అష్టసిద్ధులు.

మోక్షమార్గాన ప్రయాణించే సాధకుణ్ని ప్రలోభ పెట్టి, పక్కదోవపట్టించి, ఒక్కోసారి పతనావస్థకు గురి చేసే ప్రమాదకర శక్తులే అష్టసిద్ధులని కొందరు మహాయోగులు చెబుతారు.

సిద్ధులు లభించగానే బుద్ధులు మారిపోతాయి. అహంకారం ఆవహిస్తుంది. విచక్షణ నశిస్తుంది. నిగ్రహం నీరుకారిపోతుంది. ఇలాంటి దుస్థితి కలగరాదని కోరుకునే వారు అష్టసిద్ధుల్ని తిరస్కరిస్తారు. లేదా వాటిని కేవలం సిద్ధులకోసమే యోగం అభ్యసిస్తారు. వాటిని ప్రదర్శిస్తూ ప్రజల్ని మభ్యపెడుతుంటారు. ఇవన్నీ మొక్షప్రాప్తికి ఆటంకాలే!

దేవభూమిగా వినుతించే హిమలయాల్లో అక్కడ క్కడ మంచు గుహల్లో తపస్సులో నిమగ్నులైన ఋషులు కనిపిస్తుంటారు. ఒక గుహలో జీవానందుడు, సత్యానందుడనే ఇద్దరు ఋషులు బహుకాలం తప్పస్సు చెయ్యగా, అప్రయత్నంగా ఇద్దరికీ అష్టసిద్ధులు లభించాయి. జీవానందుడు  తనకు లభించిన సిద్ధులతో తబ్బిబ్బై, వాటిని ప్రదర్శించాడానికి జనసీమల్లోకి వెళ్ళాడు. సత్యానందుడు తన సిద్ధుల్ని శివార్పణంచేసి తన తపస్సు కొనసాగించాడు.

జీవానందుడు అష్టసిద్ధుల ప్రదర్శనతో ప్రజలచేత బ్రహ్మరథం పట్టించుకున్నాడు. ఒక పెద్ద ఆశ్రమం, అనేకమంది శిష్యులతో ఆడంబర జీవితం గడపసాగాడు. అతని దగ్గరకు రాజు, రాజోద్యోగులు, రాణి, ఆమె సఖులు ఇట్లా ఉన్నత వర్గాలవారు వస్తూపోతుండటంతో జీవానందుడు తనను తానే భగవత్స్వరూపుడిగా  ప్రకటించుకుని అనేక పూజలు, సేవా సపర్యలు సాగించుకుంటూ విలాసమయ జీవితానికి అలవాటుపడ్డాడు. ఇలా ఉండగా మహారాణి వచ్చిన సమయంలో జీవానండుడి శిష్యవర్గం లోని ఒక పూర్వాశ్రమ చోరుడు, ఆమె మెడలోని విలువైన హారం దొంగిలించాడు. ఇంకేముంది? గందరగోళం, రాజభటులు తనిఖీలు చేయ్యటం, ఆభరణం ఆశ్రమంలోనే దొరకడంతో, జీవానందుడి సహితంగా అందరికీ కారాగా శిక్షపడింది. జీవానందుడి ఆశ్రమం మూతపడింది. శిక్ష పూర్తిచేసుకున్న జీవానందుడు నేరుగా హిమలయాల్లో ఉన్న తన గుహకుచేరుకున్నాడు. అక్కడ సత్యానందుడు దివ్యతేజస్సుతో వెలిగిపోతున్నాడు. అతని సమీపంలో ఒక సహజ హిమలింగం కనిపించింది. గుహనిండా పరిమళాలు గుబాళిస్తున్నాయి. జీవానందుడు తన అనుభవాలు చెప్పి, సత్యానందుడి అనుభవాలు అడిగాడు.

“నేను నాకు లభించిన అష్టసిద్ధుల్ని ఈశ్వరార్పణ చేశాను. నా తపస్సు కొనసాగించాను. ఇదుగో ఈ శివలింగం ఉన్నచోటనే పరమశివుడు ప్రత్యక్షమై సాయుజ్యభక్తిని ప్రసాదించాడు. నేనిప్పుడు కనులు తెరిచినా, మూసినా, సర్వత్రా శివరూపాన్నే చూస్తున్నాను” అన్నాడు సత్యానందుడు.

జీవానందుడు పశ్చాత్తాపపడి, సత్యానందుణ్ని తన గురువుగా స్వీకరించి, తానుకూడా ఈశ్వర సాక్షాత్కారం కోసం తీవ్రంగా తపస్సు చెయ్యసాగాడు. మరెన్నడూ అష్టసిద్ధుల ప్రలోభాలకు జీవానందుడు లోనుకాలేదు.

ఏకాదశరుద్రులు, ద్వాదశాదిత్యులు అంటే ఎవరు?


శివోమహేశ్వర: శంభు: శ్రీ కంఠోభవ ఈశ్వర:
మహాదేవ: పశుపతి: నీలకంఠో వృషధ్వజ:
పరమేశ ఇమే రుద్రా, ఏకాదశ సమీరితా:.

అని శివతత్త్వ రత్నాకరం. దీనిని బట్టి 1. శివుడు, 2. మహేశ్వరుడు, 3. శంభుడు, 4. శ్రీకంఠుడు, 5. భవుడు,  6. ఈశ్వరుడు, 7. మహాదేవుడు, 8. పశుపతి, 9. నీలకంఠుడు, 10. వృషధ్వజుడు, 11. పరమేశుడు అనువారు ఏకాదశరుద్రులు.

మరో పక్షం ననుసరించి -
1. అజుడు, 2. ఏకాపాదుడు, 3. అహిర్భుధ్న్యుడు , 4. త్వష్ట, 5. రుద్రుడు, 6. హరుడు, 7. శంభుడు, 8. త్ర్యంబకుడు, 9. అపరాజితుడు, 10. ఈశానుడు, 11. త్రిభువనుడు ఏకాదశరుద్రులుగా పేర్కొనబడ్డారు.

ఇంకా కొన్ని మతభేదాలు ఉన్నాయి. వాటి ప్రకారం పై పేర్లలో కొన్నింటికి బదులు వృషాకపి, కపర్ది, శర్వుడు మొదలైన పేర్లు వినబడుతున్నాయి.

ఇలాగే ద్వాదశాదిత్యులు అన్న విషయంలో కూడా భేదాలు కానవస్తున్నాయి. ఒక మతాన్ని అనుసరించి ఈ క్రిందివారు ద్వాదశాదిత్యులవుతారు.

1. ధాత, 2. మిత్రుదు, 3. అర్యముడు, 4. శుక్రుడు, 5. వరుణుడు, 6. అంశుడు, 7. భగుడు, 8. వివస్వంతుడు, 9. పుమ్షుడు, 10.సవిత, 11. త్వష్ట మరియు 12. విష్ణువు.

మరోక పక్షంలో వీటిలో కొన్ని పేర్లకు బదులు -

1. జయంతుడు, 2. భాస్కరుడు, 3. భానుడు, 4. హిరణ్యగర్భుడు, 5. ఆదిత్యుడు ఇత్యాదిగా గల నామాలు పేర్కొనబడివున్నాయి.

మంత్రం చివరిలో ‘ ఓం శాంతి శాంతి శ్శాంతి: ‘ అని అంటారు ఎందుకు?



ఏ ప్రార్థన చివరిలోనయిన మన ‘ ఓం శాంతి శాంతి శ్శాంతి: ‘ అని మూడుసార్లు ఉచ్చరిస్తుంటాం. ఆ విధంగా మూడుసార్లు అనడంద్వారా మూడు రకాలయినటువంటి తాపాలు (బాధలు) తొలగాలని భగవంతుడిని ప్రార్థించడమన్నమాట.

ఓం శాంతి:  (ఆధ్యాత్మిక తాపం చలారుగాక)
ఓం శాంతి: (అధి భౌతిక తాపం చల్లరుగాక)
ఓం శాంతి: (అధివైవిక తాపం చల్లరుగాక)

1. ఆధ్యాత్మిక తాపం అంటె, శరీరానికి సంబంధించి నటువంటి వివిధ రకాలయిన రుగ్మతలు (రోగాలు మొదలైనవి) తొలగాలని
2. అధి భౌతిక తాపం అంటే, దొంగలు మొదలైన వారివల్ల కలిగే బాధలు, ప్రమాదాలు తొలగాలని.
3. అధి దైవికతాపం అంటే, దైవవశంవల్ల కలిగే బాధలు – యక్షులు, రాక్షసులు మొదలైనవారివల్ల కలిగే ఊహకు కూడా అందని బాధలు – ప్రమాదాలు మొదలైనవి తొలగాలని ప్రార్థించడమన్నమాట.ఇ

‘ఓం శాంతి శ్శాంతి శ్శాంతి:’ అని మూడుసార్లు చెప్పడంలో ఇంత అర్థం దాగివుంది.


ఉపవాసం


ఉపవాసం మనిషి ఆరోగ్యవంతమైన జీవితానికి, మానసిక స్థైర్యానికి, సత్త్వసిద్ధికి ఉపకరిస్తుంది.

ఆహార శుద్ధే సత్వశుద్ధి: అని అన్నారు. అంటే ఆహార లక్షణాన్ని బట్టే మానవుని మనసు ఉంటుందన్నమాట. ఆధ్యాత్మికపథంలో పయనిస్తున్నవారు తమ శారీరక ఆరోగ్యం కోసం మితాహారం, క్రమాహారం, సాత్వికాహారం అంటూ విభజించి తీసుకుంటుంటారు. దీనిని దృష్టిలో పెట్టుకునే మనవాళ్ళు ” ఆత్యాహార మానాహారం నిత్యం యోగీ వవర్జయేత్ “  అని అన్నారు. అతిగా తినడం, అసలు తినకుండా ఉండటం కూడా మంచిది కాదన్నారు. జీవించడానికే తినాలిగానీ తినడానికే జీవించకూడదు.

మితాహారం: కడుపులో సగభాగం అన్నం తదితర ఆహార పదార్థాల చేత, పాతికభాగం నీటి చేత నింపి, మిగిలిన పాతికభాగం గాలికోసం ఖాళీగా ఉంచాలి. ఈ విధంగా ఆహారాన్ని స్వీకరించడమే మితాహార పద్ధతి.  ఇలా ఐందుకు చెప్పరంటే,  అధికంగా  తింటే భగవధ్యానం కుదరదు. అధిక మైన ఆహారం వలన శరీరం  బరువెక్కి, మత్తుగా మారి పూజ, ధ్యానం వంటి విషయాలపై ఆసక్తిని నిలుపలేము. అందుకే మితంగా తినడం, మితంగా నిద్రించడం అత్యంతావశ్యకం అని అన్నారు.

క్రమాహారం: ఈ ఆహార విధానాన్ని మరలా సాత్త్విక, రాజసిక, తామసిక ఆహార విధానాలంటూ మూడు విధాలుగా విభజించారు.  క్రమాహారం అంటే ప్రతిరోజు దాదాపు ఒకే సమయానికి, పరిమితంగా సమతులమైన ఆహారాన్ని తీసుకోవడం. ఇలా తినడం వల్ల మానసిక ఆరోగ్యం చక్కగా ఉంటుంది. సాత్త్వికాహారం వలన మానసిక ఉద్రేకం తగ్గుతుంది.  క్రమమైన సాత్త్వికాహారం అనేక శారీరకరోగాలను నిరోధించి ఆయు: ప్రమాణాన్ని పెంచుతుంది. కాబట్టి ఈ ఆహార నియమాలకు తోడుగా ఉపవాసదీక్షను ఏర్పరిచారు. ఇందులోకూడ ఆరోగ్యరహస్యాలు ఇమిడి ఉన్నాయి.

వారంలో ఉన్న ఏడురోజులకు ఏడుగురు అధిపతులున్నారు. ఏమి ఆశించి ఉపవాసం చేస్తారనేదాన్ని బట్టి వారు వారంలో ఏరోజు ఉపవాసం చేయాలనేది ఆధారపడి వుంటుంది. ప్రతిరోజుకు ఒక్కో గ్రహం అధిపతి. ఒక్కో గ్రహాదిపతి కృప పొందేందుకు ఒక్కోవిధమైన ఉపవాసం పాటించాల్సి ఉంటుంది.

సూర్య గ్రహ అనుగ్రహం పొందాలనుకునేవారు ఆదివారం ఉపవాసముంటారు. కంటి సమస్యలు, చర్మ, హృదయ సంబంధ వ్యాధులతో బాధపడేవారు సూర్యుని ఆరాధిస్తే మంచిది. సూర్యగ్రహ ఆరాధనవల్ల గౌరవం, కీర్తిప్రతిష్టలు లభించడంతో పాటు శత్రువుల పీడ నివారణ అవుతుంది. సూర్యునికోసం ఉపవాసముండేవారు సూర్యాస్తమయం లోపల రోజుకి ఒకసారి మాత్రమే భోజనం చేస్తారు. సూర్యాస్తమయం తరువాత ఏమీ తీసుకోరు. తినే ఆహారంలో ఉప్పు, నూనె ఉండకూడదు. తామసిక ఆహారం ఉపవాసమున్నవారు తినరు. సూర్యుడికి ప్రార్థనలుచేసి సూర్యునికి సబంధించిన కథను చదవడంగానీ, వినడంగానీ చేస్తారు. అలా చదివిన తరువాతే ఆహారం తీసుకుంటారు. సూర్యుని అనుగ్రహం పొందాలనుకునేవారు కెంపును ధరించాలి.

గోధుమలు, ఎర్రధాన్యం, బెల్లం, బంగారం, రాగి ఆభరణాల్లో కెంపు దానమివ్వాల్సి ఉంటుంది. దానం ఇవ్వడానికి సూర్యాస్తమయం ఉత్తమమైన సమయం.

సోమవారానికి అధిపతి చంద్రుడు. సోమవారం శివపార్వతులకు పూజలు చేస్తారు. ఆనందకరమైన వివాహజీవితం కావాలనుకునేవారు  సోమవారం నాడు శివపార్వతులకు ప్రత్యేకమైన పూజలు నిర్వహించాలి. పెళ్ళి కావల్సినవారు సరైన జీవితభాగస్వామి కోసం శివపార్వతులకు పూజలు చేసి ఉపవాసం ఉంటారు. సోమవారం మూడురకాల ఉపవాసాలుంటారు. ఈరోజు ఉండే ఉపవాసాన్ని సౌమ్యప్రదోష మంటారు. ఏదైనా పొరపాటు జరిగితే, ఆ తప్పును ఒప్పుకుంటూ 16 సోమవారాలు ఉపవాసదీక్ష వహిస్తారు. ఉపవాసం చేసేవిధానం ఒకటే కానీ ఆరోజు చదువుకోవాల్సిన కథలు మాత్రం వేరుగా ఉంటాయి.  భోజనం రోజుకి ఒకసారే చేస్తారు. తృణధాన్యాలు తీసుకోవచ్చు. శివపార్వతులకు ప్రార్థనలు చేసిన తర్వాత తగిన కథ చదువుకోవాలి. చంద్రుడి అనుగ్రహం కోసం ముత్యాలు, వెండి ధరించాలి. బియ్యం తెల్లటిదుస్తులు, శంఖం, వెండి, ముత్యాలాంటి వాటిని దానమివ్వాలి.

మంగళవారానికి అధిపతి కుజుడు. జాతకంలో కుజగ్రహం సరిగా లేనివారు ఆ దోషనివారణకు పన్నెండు మంగళవారాల ఉపవాసముండటం శుభప్రదం. మంగళవారం హనుమంతుడికి ప్రత్యేక ప్రార్థనలు చేయాలి. దుస్తులు, పూలు ఎర్రటివి ధరించడం శ్రేయస్కరం. గోధుమలు, బెల్లంతో చేసిన ఆహారం రోజుకి ఒక సారి మాత్రమే తినాలి. హనుమకు పూజ చేసిన పిదప కథ చదువు కోవాలి.

బుధవారానికి అధిపతి బుధుడు. బుధవారం ఉపవాసం ఉండదల్చుకున్నవారు రోజుకి ఒకసారి ఆకుపచ్చటి ఆహార పదార్థాలు తినాలి. విష్ణుమూర్తికి పూజచేసుకుని కథ చదువుకోవాలి. బుధగ్రహం అనుగ్రహం పొందాలనుకునేవారు బంగారంతో పొదిగిన పచ్చని  (ఎమరాల్డ్) ధరించాలి. పెసలు, కస్తూరి, నీలపు దుస్తులు, బంగారం, రాగి వంటి వాటిని దానమివ్వాలి.
గురువారానికి అధిపతి బృహస్పతి. జ్ఞానసముపార్జనకు, సంపదకు గురుగ్రహం అనుగ్రహం ముఖ్యం. పసుపు పచ్చని దుస్తులు ధరించి గురువుకు ప్రార్థనలు చేసి కథ చదువుకోవాలి. రోజుకి ఒకసారే భోజనం చేయాలి. బంగారంలో పొదిగిన కనక పుష్యరాగాన్ని ధరించాలి. పసుపు, ఉప్పు, పసుపచ్చని దుస్తులు, బియ్యం వంటివాటిని దానమివ్వాలి.

శుక్రవారానికి అధిపతి శుక్రుడు. రోజుకి ఒకపూటే భోజనం చేయాలి. భోజనంలో పాయసం ఉండాలి. శుక్రుడి అనుగ్రహం పొందాలనుకునేవారు వజ్రాన్ని ధరించాలి. బియ్యం, తెల్లటి దుస్తులు, ఆవు, నెయ్యి, వజ్రాలు, బంగారం దానమివ్వలి. శుక్రవారం సంతోషిమాతకు పూజ చేసుకుని కథ చదువుకోవాలి. అమ్మవారికి హారతివ్వాలి. కటిక ఉపవాసముండాలి. పుల్లటి పదార్థాలు తినకపోవడమేకాదు, ఎవరికీ శుక్రవారం దానమివ్వకూడదు. ఇలా 16 శుక్రవారాలు ఉపవాసముండాలి. చివరి శుక్రవారం మగపిల్లలకు భోజనం పెట్టాలి.

శనివారానికి అధిపతి శని. శనికి నల్లటి వస్తువులు, నల్లని దుస్తులు, నల్లని నువ్వులు, ఇనుము, నూనె లాంటి పదార్థలు ఇష్టం. శనిదేవతకు పూజచేసుకుని కథ చదువుకొని హారతి ఇవ్వాలి. శని ప్రీతికోసం నీలం రాయిని ధరించాలి.  నూనేతో నిండిన ఇనుపపాత్ర, నల్ల గొడుగు, నల్లటి చెప్పులు, నల్లటి దుస్తులు, నల్లనువ్వులు  మొదలైన వాటిని దానమివ్వాలి. ఇలా మన ఉపవాసంలో ఆరోగ్యరహస్యాలతో పాటు కుంటుంబక్షేమమూ దాగుంది.

పరశురామావతారం


లోకంలో ధర్మరక్షణకు, దుష్టశిక్షణకు నారాయణుడు ఆవిర్భవించిన దశావతారాల్లో  ఆరోది పరశురామావతారం. భూభారాన్ని హరించి, క్షత్రియుల గర్వాన్ని అణచి, శాంతిని నెలకొల్పడానికి సాక్షాత్ విష్ణువే సూర్యతేజస్సుతో మనుష్య రూపంలో పరశురాముడుగా అవతరించాడని ( రామో విష్ణుర్మానుష రూప ధృక్ ) విష్ణుధర్మోత్తర పురాణం (35-22), అగ్నిపురాణం (4-12) భాగవతం (9-16-27) వివరించాయి. బ్రాహ్మణుడైన జమదగ్నికి, క్షత్రియవంశానికి చెందిన రేణుకకు పుత్రుడుగా వైశాఖ శుక్ల తదియనాడు పరశురాముడు పుట్టాడు. భృగువంశంలో పుట్టడంవల్ల భార్గవరాముడని ఖ్యాతిపొందాడు. హిమాలయాలపై పరశురాముడు చేసిన తపస్సుకు శివుడు సంతసించి, అతనికి ఒక గండ్రగొడ్డలిని అనుగ్రహించాడు.  భారతం (శాం.ప. 49-33). శత్రువులను హింసించే ఈ గండ్రగొడ్డలిని ‘పరశు:’ (పరాన్ శ్రుణాతీతి పరశు:) అంటారు. కనుక అంతవరకు అతనికున్న రాముడనే పేరు పరశురాముడిగా మారి సార్థకమైంది.

కార్తవీర్యార్జునుడు అనే రాజు జమదగ్ని వద్ద ఉన్న కామధేనువును బలాత్కారంగా అపహరించాడు. దాన్ని విడిపించడానికి పరశురాముడు తన గొడ్డలితో కార్తవీర్యుడిని వేయి భుజాలను విరగగొట్టి, మస్తకాన్ని ఖండించి, ధేనువును తిరిగి తన తండ్రివద్ద చేర్చాడు. కార్తవీర్యుని కుమారులు ఆగ్రహించి, జమద్గని వధించారు. ఈ విషయం తెలిసిన పరశురాముడు తీవ్రశోకం చెంది, భూమిపై క్షత్రియులు లేకుండేట్లుగా చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు – భారతం, (శాం.ప 49-52)  తండ్రి శవంపై పడి తల్లి 21 సార్లు గుండెలు బాదుకోవడం పరశురాముడు చూశాడు. అందుకే అతడు కార్తవీర్య కుమారుల్ని వధించడం తోపాటు – భూమిపై 21 సార్లు దండెత్తి క్షత్రియ రహితంగా చేసి, చివరకు ఆ భూమిని కశ్యపుడికి దక్షిణగా ఇచ్చాడని (త్రి:  సప్తకృత్వ: పృథి వీం ని: క్షత్రా మకరోద్విభు:) అగ్నిపురాణం (4-19), భారతం (శాం.ప. 49-64), భాగ. (9-16-19 26, 27) వివరించాయి.

మానవులకు తల్లికంటే తండ్రే శ్రేష్ఠమైన దైవమని (పితాపరం దైవతం మానవానం) పరాశరగీత (297-2) తెలిపిన సూక్ష్మధర్మాన్ని పరశురాముడు రుజువు చేశాడు. ఒకసారి రేణుక నదీజలాన్ని తేవడానికి వెళ్ళింది. అక్కడ అప్సరసలతో క్రీడించే గంధర్వరాజును చూసి, వానిపై రేణుకకు కొంచెం స్పృహ కలిగింది. ఆలస్యంగా వచ్చిన ఆమె మనసును జమదగ్ని గ్రహించి, ఆగ్రహించి, ఆమెను వధించమని తమ కుమారులను ఆజ్ఞాపించాడు.  అన్నలెవరూ తల్లిని వధించలేదు కనుక పరశురాముణ్ణీ వరం కోరుకోమ్మంటే – తల్లి, అన్నలపై ఎలాంటి ద్వేషం లేనందువల్ల వారిని తిరిగి బతికించమన్నాడు!  అందుకే వారు మళ్ళీ బతికారు – భాగ. (9-16-8)

పరశురాముడు అవతారపురుషుడైనా అతణ్ణి ఓడించిన సందర్భం ఒకటుంది. శివధనస్సు  విరిచి, వివాహితుడై సీతాదేవితో వచ్చే దశరథరాముణ్ణి ఎదిరించి పరశురాముడు భంగపడ్డాదు – రామాయణం (బా.కాం.76-21, 22). ఇందుకు కారణం లేకపోలేదు.  ‘పరశురామా! దశరథరాముడి సందర్శనం అయ్యాక, నీవు శస్త్రం పట్టవద్దు. ఎందుకంటే నీ వైష్ణవ తేజస్సు అతనిలో ప్రవేశిస్తుంది. అది సురకార్యం నిర్వహిస్తుంది. నీలో వైష్ణవ తేజస్సు ఉన్నంతకాలమే నీవు శత్రుగణాలను చెండాడగలవు (తవ తేజోహి వైష్ణవం రామం ప్రవేక్ష్యతి) అని శంకరుడు పరశురాముణ్ణి లోగడ హెచ్చరించడమే దీనికి కారణం – వి.ధ.పు (66-13,14). ఒక విష్ణు అవతారం మరో విష్ణు అవతారాని ఓడించిన సదర్భం ఇదొక్కటే!

శంఖాన్ని పూరించడం వల్ల వచ్చిన శబ్దాన్ని గొప్పగా ఎందుకు భావిస్తారు?

దేవాలయాలలో శంఖాన్ని ఊదడాన్ని మనం వింటాం. ఇది ఇతరమైన నాదాలతో ముఖ్యంగా ఘంటానాదంతో దేవతా పూజ చేయుచున్నప్పుడు వినబడుతుంది. విగ్రహ దైవం చుట్టూ కుడి నుండి ఎడమవైపు దీపాన్ని చూపుతున్నప్పుడు లేదా మంగళహారతి ఇస్తున్నప్పుడు కానీ మనం శంఖారావాన్ని వింటాం. ఇలా హారతుల సమయంలో శబ్ద – దృశ్య దివ్య అనుభవాన్ని భక్తులు అనుభవిస్తారు. శంఖం నుండి ఉత్పన్నమయ్యే శబ్దం మంగళకరమైన మరియు దివ్యమైన ‘ఓం’ కారంలో ధ్వనిస్తుంది. శంఖారావాన్ని బహిరంగంగా (యుద్ధాన్ని) ఏదైనా ప్రకటిస్తున్నప్పుడు వినిపించడం జరుగుతుంది. మనందరి స్మృతిలో ఉన్న పౌరానిక యుద్దమైన కురుక్షేత్రం శంఖారావంతో ప్రారంభమైంది. శంఖాన్ని బాగా తోమి కొన్ని మందులలో దాన్ని ప్రాధాన్యతతో వాడుతారు. శంఖానికి ఉన్న ఔషదీయ గుణాల కారణంగానే దాన్ని వాడడాం జరుగును. శంఖారావ శబ్దం మన మెదడులో ప్రకంపనలు సృష్టించి అనుకూల ప్రభావాన్ని కలుగజేస్తుందని ఆధునిక శాస్త్రం తెలుసుకున్నది.

ప్రమాదాల నుంచి రక్షించే మహామృత్యుంజయ మంత్రం



మకార మననం ప్రాహుస్త్ర  కారస్త్రాణ ఉచ్యతే
మనన త్రాణ సమ్యుక్తో మంత్ర ఇత్యభిధీయతీ

‘మా కారం అంటే మననం చేయడం. అంటే పదేపదే  ఉచ్ఛరించడం. ‘ త్ర ‘ కరం అంటే త్రాణము. అంటే రక్షించేది. కాబటి మంత్రమంటే పదే పదే ఏకాగ్రతతో ఉచ్ఛరించేవారిని రక్షించేదని అర్థం.  సాధనకు, కార్యసిద్ధికి ప్రత్యేకమైన ఫలితాలకు సిద్ధిత్వాని కలిగించేదే మంత్రం.

దైవాధీనం జగత్సర్వం
మంత్రాధీనంతు దైవతం

జగత్తంతా దైవానికి ఆధీనమై ఉంటుంది.  అట్టి దైవం  మంత్రానికి ఆధీనమై ఉన్నాడు. ఈ సూక్తిననుసరించి మంత్రోపాసనకు దైవం వశమవుతోందని తెలుస్తోంది. శక్తివంతమైన బీజాక్షరాలతో ఏర్పడినవే మంత్రాలు. శక్తికి శబ్దానికి అవినాభావ సంబంధం ఉంది. శబ్దంలోనిదే స్పందన. సక్రమమైన రీతిలో జరిగే మంత్రోచ్ఛారణ వలన, మంత్రాల లోనున్న బీజాక్షరాలలో స్పందన కలిగి అద్భుతమైన మహాశక్తి  ఉత్పన్నమవుతుంది. అది మన ఊహకందనిది.

ఉదాహరణకు, ‘ఓం నమ: శివాయ ‘ అనే మంత్రం సకల శుభాలను కలిగిస్తుందని పెద్దల వాక్కు.

కితస్య బహుభిర్మం త్రై:
కింతిర్థై: కిం తపోధ్వరై:
యస్య నమశ్శివాయేతి

మంత్రో హృదయ గోచర: అని అన్నారు. అంటే, ఎవరి హృదయంలో నిరతరం “ఓం నమ: శివాయ”  అనే మంత్రం జపించబడుతుంటుంతో, వారికి ఇతర మంత్రాలతో, తీర్థయాత్రలతో, యజ్ఞయాగాదులతో పని లేదని భావం.  ఓం నమశ్శివయ (షడక్షరీ) నమశ్శివాయ (పంచాక్షరీ) మంత్రాలలో ఏ ఒక్క మంత్రాన్ని అయినా శ్రద్ధతో జపించే  వ్యక్తి  సమస్త శుభాలను  పొందగలుగుతాడు.

అలాగే మనకు ఆయురారోగ్యాన్ని, సౌభాగ్యాన్ని, దీర్ఘాయువును, శాంతిని, తృప్తిని ఇచ్చేది మహామృత్యుంజయ మంత్రం. ఇది శుక్లయజుర్వేద మంత్రం. శైవులు దీనిని రుద్రాభిషేకంలో, వైష్ణవులు పాచరాత్రదీక్షలో హోమభస్మధారన మంత్రంగా చెప్పుకుంటారు.

ఇది అందరికీ, అంటే శైవులకు,  వైష్ణవులకు, మాధ్వులకు ప్రాఅణికమయిన మంత్రం.

దీనిని త్ర్యంబకం యజామహే
సుగంధిం పుష్టివర్థనం
ఉర్వారుక మివ బంధనాత్
మృత్యోర్ముక్షీయ మామృతాత్

ఈ మహా మృత్యుంజయ మంత్రాన్ని జపించడం వల్ల, దైవ ప్రకంపనలు మొదలై, మనలను ఆవరించి ఉన్న దుష్టశక్తులను తరిమికొడతాయి. తద్వారా మంత్రాన్ని పఠించినవారికి ఓ శక్తివంతమైన రక్షణ కవచం ఏర్పడుతుంది. ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు, దురదృష్టాల నుంచి బయటపడేందుకు,మహా మృత్యుంజయ మంత్రాన్ని పఠిస్తుంటారు. ఈ మంత్రానికి సర్వరోగాలను తగ్గించే శక్తి ఉంది.

ఈ మహామృత్యుంజయ మంత్రానికి మార్కండేయ మంత్రం అనే పేరు కూడా ఉంది. మార్కండేయుడు ఈ మంత్రమును పఠించి, మృత్యువు నుంచి బయటపడ్డాడని ప్రతీతి. ఇంకా పరమశివుని రుద్రస్వభావాన్ని సూచిస్తూ ఈ మంత్రం రుద్రమంత్రమని, ఆ స్వామి మూడు కన్నులను సూచిస్తూ మృతసంజీవనీ మంత్రమని పిలువబడుతోంది.

ఈ మంత్రాన్ని త్ర్యంబక మంత్రమనడంలో కూడా ఎంతో గూఢార్థం ఉంది.  శివతత్వంలో “మూడు” కు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఆ స్వామి త్రినేత్రుడు, త్రిగుణాకారుడు, త్రి ఆయుధుడు, త్రిదళాలతో కూడిన బిల్వాలను ఇష్టపడేవాడు, మూడు అడ్డురేఖలను నామంగా కలిగినవాడు, త్రిజన్మ పాప సంహారుడు, త్రిశూలధారుడు, త్రికాలధిపతి, త్రిలోకరక్షకుడు, మరి ఆస్వామి మంత్రాన్ని జపించితే మనకు రక్షణ లభించకుండా ఉంటుందా? అందులో సందేహమేముంది. ఈ మహామృత్యుంజయ మంత్రాన్ని ప్రాత: కాలన్నే 108 సార్లు, ప్రదోషకాలంలో 108 సార్లు పఠిస్తే ఎటువంటి రోగాలు దరిచేరవు. ఈ మంత్రం యొక్క గూఢార్థాన్ని తెలుసుకున్నప్పుడు మనకు అపరిమితానందం కలుగుతుంది.

ఓం: భగవంతుడు ప్రప్రథమంగా సూక్ష్మ జ్యోతిగా వెలుగొంది, అనంతరం చెవులకు వినబడేట్లుగా ఓ నాదం వినబడిందనీ, ఆ నాదమే ప్రణవ నాదమని, అదే ఓంకారమని చెప్పబడింది. ఇదొక శక్తి స్వరూప ధ్వని. అ-ఉ-మల సంగమమమే ఓంకారం. ఋగ్వేదం నుండి  ‘ అ ‘ కారం. యజుర్వేదం నుండి ‘ ఉ ‘ కారం, సామవేదం నుండి ‘ మ ‘ కారాలు పుట్టి,ఆ మూడింటి సంగమంతో ‘ ఓంకారం ‘ ఉద్భవించింది. ఓంకారానికి మూలం నాదం. ఆ నాదం భగవద్రూపం. ఓంకారం ప్రార్థనగా మనకు ఉపకరిస్తుటుంది. అందుకే ప్రతి మంత్రం ఓంకారంతో ప్రారంభమై ఓంకారంతోనే ముగుస్తుంటుంది. నామం శబ్ద ప్రతీక. సర్వ శబ్దాలను తనలో నిమగ్నం చేసుకునే శబ్దాక్షరం ఓంకారం. కాబట్టి ప్రతి మంత్రానికి ఓంకారం ముందుండి, ఆ మంత్రానికి శుభాన్ని, మంగళాన్ని చేకూర్చుతుంది. అందుకే దేహద్వారాలైన ఇంద్రియాలన్నిటినీ నిగ్రహించి, మనస్సును స్థిరపరచుకుని, యోగధారణ బలంతో ప్రాణశక్తిని సహస్రారంలో నిలిపి, పరబ్రహ్మ స్వరూపమైన ప్రణవాన్ని ఉచ్ఛరిస్తూ పరమాత్మను స్మరించాలి.

త్ర్యంబకం: భూత, భవిష్యత్, వర్తమానాలకు శివుని మూడవ నేత్రం ప్రతిరూపం. ఇంద్ర, అగ్ని, సామతత్వాలను కలిగి ఉన్నందున శివుడు త్రినేత్రుడనబడుతున్నాడు. త్ర్యంబక మంటే మూడు నేత్రాలని అర్థం. శివుని భ్రూమధ్యంలో నున్న సూక్ష్మరూప నేత్రం మూడవ నేత్రం. ఇది అతీంద్రియ శక్తికి మహాపీఠం. దీనినే జ్యోతిర్మఠం అని అంటారు. శివుని మూడవ నేత్రానికి దాహకశక్తి, సంజీవన శక్తి రెండూ ఉన్నాయి. ఆ స్వామి తన ప్రసన్నవదనంతో, చల్లని చూపులతో మనలను సదా రక్షిస్తున్నాడు. అందుకే ఆ స్వామిని త్యంబకం అని  కీర్తిస్తున్నాం.

యజామహే: అంటే ద్యానిస్తున్నానని అర్థం. అంతేగా మరి. సర్వవేళలా మనకు రక్షగా ఉన్న స్వామిని మనస్ఫూర్తిగా ధ్యానించాలి. ఒకప్పుడు సముద్ర మథనం జరిగింది. అకస్మాత్తుగా సెగలు కక్కుతూ హాలాహలం పైకి వచ్చింది. ఆ విష్పు ప్రచండ జ్వాలలకు సమస్తలోకాలు తల్లడిల్లిపోయాయి. సర్వత్రా ఆర్తనాదాలు…హాహాకారాలు.  సమస్తలోకజనం ఆ స్వామిని ధ్యానించగా, ఆ దృశ్యాన్ని చూసి క్రిగిపోయిన స్వాఇ, హాలాహలన్ని తన కంఠంలో నిలుపుకుని నీలకంఠుడై సమస్తలోకాలను కాపాడాడు. ఆ స్వామిని ప్రార్థిద్దాం.

సుగంధిం: సు-మంచిదైన, గంధ – సువాసన ద్రవ్యం. ఆ స్వామి మనపై మంచి సువాసనలతో కూడుకున్న గంధం నలుదిశలా పరిమళాలను వెదజల్లినట్లు మనలను తన భక్త జన వాత్సల్యమనే సుగంధాన్ని ఇచ్చి పెంచుతున్నాడు. ఆయనకు తన పిల్లలమైన మన పట్ల అలవికానంత ప్రేమ, వాత్సల్యం, ఆయన ఎంత భక్తజన ప్రియుడంటే, ఆ స్వామిని పూజించడానికి మందిరం కావాలని ఆడగడు. చెట్టుకింద, గట్టుమీద ఎక్కడైనా ఆయన లింగరూపాన్ని పెట్టుకుని పూజించవచ్చు. ఆయనకు నైవేద్యం కూడా అవసరం లేదు. ఒక బిల్వపత్రం, ఒక కొబ్బరికాయ, జలాభిషేకం చేసినా స్వామి సంతోషించి మన కోరికలను నెరవెరుస్తాడు.

పుష్టివర్థనం : మనం పుష్టిగా ఉండేట్లు సాకుతున ఆ స్వామి సర్వత్రా నెలకొనిఉన్నాడు. సృష్టియావత్తు ఆయన ఆధీనంలో ఉంది. ఆయన మనలను తప్పక కాపాడుతాడు. ఇందుకు గుహుని కథే ఒక ఉదాహరణ. గుహుడనే వేటగాడు ఒకరోజున ఏదైనా జంతువును వేటాడాలని వెదికి వెదికి విసిగి పోయాడు. చీకటి పడుతున్నా అతని కంట ఒక జంతువు కూడ కనబడలేదు. ఈలోపు ఎక్కడి నుంచో ఒక పులి వచ్చి అతడిని వెంబడించసాగింది. దాని బారి నుంచి తప్పుకోవడానికై వేటగాడు పరుగులు పెడుతూ ఒక చెట్టుపైకి ఎక్కాడు. అయినా ఆ పులి అతడిని వదల్లేదు.  చెట్టుకిందే ఉన్న పులి గుహుడు ఎప్పుడు దిగి వస్తాడా అని కాపుకాయసాగింది. గుహుడు ఎక్కిన చెట్టు ఒక మారేడు చెట్టు. ఏమీ తోచక ఒక్కొక్క మారేడు దళాన్ని కిందికి తుంపి విసిరేయసాగాడు. ఆ దళాలు చెట్టు మొదట్లో నున్న శివలింగంపై పడసాగాయి. ఆరోజు శివరాత్రి కూడా. పులిభయంతో వేటగాడు, వేటగానిని తినాలన్న కాంక్షతో పులి, జాగరణ చేయడంతో, శంకరుడు రెండు జీవాలకు మోక్షాన్ని ప్రసాదించాడు. అందుకే సర్వ వ్యాపకుడైన ఆ స్వామి మనలను కంటికి రెప్పలా కాపాడుతుంటాడు.

ఉర్వారుకం – ఇవ – బంధనం :  దోసకాయ పక్వానికి వచ్చినపుడు, దానికి తొడిమ నుంచి విముక్తి లభించినట్లుగానే ఆ స్వామి మనలను అన్ని సమస్యల నుంచి గట్టెక్కించుతాడు.

మృతోర్ముక్షీయ: అలా సమస్యల నుంచి గట్టెక్కించే స్వామిని, మనలను మృత్యువు నుంచి కూడ రక్షణ కల్పించమని కోరుకుంటున్నాం. మృత్యువు అంటే భౌతికపరమైన మరణం మాత్రమేకాదు. ఆధ్యాత్మికపరంగా చేతనం లేకుండా ఉండటం కూడా మృత్యు సమానమే.   భక్తి ప్రవత్తులు లేని జీవనం కూడా నిర్జీవమే.
ప్రకృతిలో అందాన్ని ఆస్వాదించలేక అంతా వికారంగా ఉందనుకునేవారికి, అంతా వికారంగానే కనబడుతుంది. ప్రతి విషయానికి సందేహపడే సదేహప్రాణికి అంతా అనుమానమయంగానే ఉంటుంది. ఇటువంటి వన్నీ చావువంటివే. ఇలా మనలను అన్నిరకాల మరణాల నుంచి విముక్తులను చేసి, మన జీవితాలను సంతోషమయం చేయమని స్వామిని ప్రార్థిస్తున్నాం మనం.

అమృతాత్ : స్వామి అల్ప సంతోషి, సులభప్రసన్నుడు. అందుకే శ్రీనాథమహాకవి ఆయనను ఈ క్రింది విధంగా స్తుతించాడు.

శివుని శిరమున కాసిన్ని నీళ్ళు జల్లి
పత్తిరిసుమంత నెవ్వడు పార వైచు
కామధేను వతడింట గాడి పసర
మల్ల సురశాఖి వానింట మల్లె చెట్టు

శివలింగంపై కాసిని నీళ్ళు చల్లి, మారేడు పత్రిని లింగంపై విసిరేసినప్పటికీ, ఆ భక్తుని ఇంట కామధేనువు ఇంటి పశువుగా మారుతుంది. కల్ప తరువు ఆ భక్తుని ఇంట మల్లెచెట్టుగా ఉంటుంది. అంతటి దయామయుడు పరమశివుడు.

మనకున్న చిరంజీవులలో  ఆంజనేయస్వామి ఒకరని మనకు తెలుసు. అయితే ఆ ఆంజనేయునికి చిరంజీవత్వాన్ని ప్రసాదించింది శివుడే. ఆ కథ ప్రకారం,

రావణ వథానంతరం అయోధ్యకు చేరుకున్న రామ చంద్రుడు ప్రజారంజకంగా పరిపాలన గావిస్తున్నాడు. ఒకరోజు అగస్త్యమహర్షి తదితరులు శ్రీరామచంద్ర మూర్తిని దర్శించుకుని హనుమంతుని ప్రశంసించ సాగారు. అప్పుడు శ్రీరాముడు, మహావీరుడైన లక్ష్మణుని ప్రశంసింపక, ఎందుకు హనుమంతుని పొగుడుతున్నారని అడిగాడు. అప్పుడు అగస్త్యాది మునులు, హనుమంతుడు రుద్రాంశ సంభూతుడని, హనుమంతునితో సరితూగగల బలపరాక్రమ వంతులు ఎవరూ లేరని, అతని బలం గురించి అతనికి తెలియకపోవడమే శాపమని, అందుచేతనే అతడు వాలిని సంహరించలేకపోయాడని చెప్పారు. అలాగే నూరు యోజనాలు దాటి లంకను చేరడం, అతి చిన్న రూపాన్ని ధరించడం, సీతమ్మవారిని దర్శించడం, లంకాదహనం వంటివన్నీ సామాన్యులు చేయలేరని చెప్పారు. అదేవిధంగా బాల హనుమ, సూర్యుని చూసి ఎగిరి వెళ్ళి, ఇంద్రుని వజ్రాయుధ ఘాతానికి గురై భూమిపై పెడతాడు. అప్పుడు ఆంజనేయుని తండ్రి వాయుదేవుడు కుమారుని ఉజ్జయినికి తీసుకెళ్ళి శివార్చన చేసి, శివుని కరుణతో బాల ఆంజనేయుడు చిరంజీవిగా ఉండేట్లు వరాన్ని పొందాడు. ఇప్పటికీ మనం ఉజ్జయినిలో ఆంజనేయునికి చిరంజీవత్వాన్ని అనుగ్రహించిన హనుమత్కేశ్వర లింగాన్ని చూడగలం.

ఈ విధంగా స్వామి తన భక్తులను మృత్యువు నుంచి కాపాడి, ఆయురారోగ్యాలతో కూడిన జీవితాన్ని ప్రసాదిస్తాడు.

ఈ మృత్యుంజయ మంతాన్ని శ్రద్ధతో పఠిస్తే, అకాలమృత్యువులు, ప్రమాదాల నుంచి రక్షణ లభిస్తుంది.

ఇంత మహిమాన్వితమైన మహామృత్యుంజయ మంత్రాన్ని జపించడం వల్ల, దైవిక ప్రకంపనలు మన చుట్టూ ఆవరించి, సమస్త దుష్ట శక్తులు మన దరికి చేరకుండా కాపాడబడతాము.

మృత్యుర్యస్వాప సేచనం అని శ్రుతులు చెబుతున్నాయి. అంటే మృత్యువు శివునికి ఊరగాయ వంటిదని అర్థం. మృత్యువును జయించాలనుకునే వ్యక్తులు పరమశివుని రక్షణకోరితే సరిపోతుందని ఋగ్వేదం అంటున్నది. తనను ఆశ్రయించేవారి యొక్క మృత్యువును నివారించేవాడు కాబట్టి శివుడు మృత్యుంజయుడు అని కూడ పిలువబడుతున్నాడు. ఎవరైతే పుణ్యభీతితో శివుని ఉపాసిస్తారో, వారికి ఆ జన్మలోనే కర్మసంచయాన్ని (ఆగామితో సహా) పటాపంచలు చేసే శక్తిని శివుడు ప్రసాదిస్తాడు. అందుకు మృత్యుంజయ మంత్రాన్ని శ్రద్ధగా పఠించి ఆయురారోగ్యాలను పొందుదాం.


ఏదైనా రాసేటప్పుడు పేపరుపైన “శ్రీ” కారం రాస్తారెందుకు?


“శ్రీ”  లక్ష్మీ ప్రదమైనది. మంగళకరమైనది మరియు మోక్ష దాయకమైనది. “శ్రీ” కారమున “శవర్ణ”, “రేఫ”, “ఈ” కారములు చేరి, “శ్రీ” అయినది. అందు “శవర్ణ” , “ఈ” కారములకు, “లక్ష్మీ దేవి” ఆధిదేవత, “రేపము” నకు, అగ్ని దేవుడు దేవత.

“శ్రియ మిచ్దేద్దు  తాశనాత్!” అను పురాణ వచనానుసారముగా “అగ్నీ లక్ష్మీ ప్రదుడే, శుభకరుడే. ఈ ఇధంగా “శ్రీ” లోగ మూడు వర్ణములకు శుభదేవతలే కారకులు.

మరియు, “శ” వర్ణమునకు గ్రహము “గురుడు”, “రేఫ “ఈ” కరములకు గ్రహములు “గురుడు”, “శుక్రుడు” గురు, శుక్ర గ్రహములు రెండూ శుభకరులే కావున “శ్రీ” శుభాన్ని సూచిస్తుంది. శుభాన్ని కోరుతుంది.
నిఘంటువులో, “కమలా శ్రీర్హరి ప్రియా” అని ఉండటంతో, లక్ష్మీ నామలలో “శ్రీ” ఒకటి అని తెలియుచున్నది. కావున శుభకరమైంది.

ఇన్ని విధాలుగా “శ్రీ” సర్వశ్రేష్టవాచకమైనది. ప్రతి శుభకార్యానికి, “శ్రీ” కారం తలమానికమై వెలుగొందుచున్నది. “శ్రీ” శుభసూచికయేకాదు, గౌరవప్రదమైనది కూడా. ఏ మతమందైననూ, ఏ ప్రాంతమందైననూ, ఏ భాషయందైననూ, “శ్రీ” అను పదము గౌరవ సూచకముగా, శుభసూచకముగా వాడుతుంటారు.

ఈశ్వర పూజకు మారేడు దళాలు ఎందుకు?


“ఏకబిల్వం శివార్పణం” అని మారేడు దాళలలతో శివుని పూజిస్తారు.
మూడు డళములు కలసి ఒక్క అండముననే ఉండును కావున, దీనికి బిల్వము అని పేరు వచ్చింది. ఈ మూడు రేకులకు ఆధ్యాత్మికంగా,

“పూజకుడు – పూజ్యము – పూజ”,
“స్తోత్రము – స్తుత్యము – స్తుతి”,

“జ్ఞాత – జ్ఞేయము – జ్ఞానము “  అని అర్థాలు చెప్పు చున్నారు.  ఈ విధంగా  (3×3) మూడు, మూడును వేర్వేరుగా భావించుటయే త్రిపుటిజ్ఞానము, ఇదియే అజ్ఞానము, వేరువేరుగా కనిపించినను, ఆధారకాండము ఒక్కటే అయినట్లు, “ఓ మహాదేవా!” సృష్టి, స్థితి, లయ కారకుడవైన నీవే “మారేడుదళము” నందు మూడు పత్రములుగా వేరువేరుగా వున్నట్లు తోచుచున్నావు.

“పూజకుడవు నీవే, పూజింపబడునది నీవే, పూజాక్రియవు నీవే” – అనే భావంతో అభేదబుద్ధితో పూజించుటయే సరియైన పద్ధతి, మరియు పుణ్యఫల ప్రదము.  ఈ విధమైన భావముతో పూజించకుండుటయే అజ్ఞానము మరియు పాపహేతువు. ఈ జ్ఞానరహస్యమును తెలుసుకుని – బిల్వపత్రరూపముతో “త్రిపుటి జ్ఞానమును” నీ పాదములచెంత నేను సమర్పించుచున్నాను.  ‘శివోహం – శివోహం ‘ అను మహావాక్య జ్ఞానమును, స్థిరపర్చునదియే బిల్వార్చనయగును.

పవిత్రమగు ఈశ్వర పూజకు ఈ “బిల్వపత్రము” సర్వశ్రేష్ఠమైనది మరియు అతి పవిత్రమైనది. శివార్చన లకు మూడు రేకులతోనున్న పూర్తి బిల్వదళముననే ఉపయోగించవలెను. ఒకసారి కోసిన బిల్వపత్రములు, సుమారు 15 రోజులవరకు పూజార్హత కల్గియుండును. వాడిపోయినను దోషములేదు, కాని మూడురేకులు మాత్రము తప్పనిసరిగా ఉండవలెను.

ఏకబిల్వ పత్రంలోని మూడు రేకులలో ఎడమవైపునది బ్రహ్మ అనియు, కుడీవైపునది విష్ణువనియు, మధ్యనున్నది సదాశివుడనియు, పురాణములలో తెలియుచున్నది. మరియు బిల్వదళములోని ముదుభాగమునందు అమృతమును, వెనుక భాగమున యక్షులును వుండుటచేత, బిల్వపత్రము యొక్క ముందుభాగమును శివునివైపు వుంచి పూజించాలి.

బిల్వవనము కాశీక్షేత్రముతో సరిసమానమైనది అని శాస్త్రములలో తెలుపుచున్నారు. మారేడుచెట్టు వున్నచోట ఆ చెట్టు క్రింద శివుడు ఉంటాడు.

ఇంటి ఆవరణలో ఈశాన్యభాగమున మారేడు చెట్టు వున్నచో, ఆపదలు తొలగి సర్వైశ్వర్యములు కల్గును. తూర్పున వున్నచో సుఖప్రాప్తి కల్గును, పడమరవైపున వున్నచో సుపుత్రసంతానము కల్గును. దక్షిణవైపున వున్నచో యమబాధలు వుండవు.

శ్లో!!  బిల్వానాం దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం!
అఘోర పాపసమ్హారం ఏకబిల్వం శివార్పణం!

బిల్వపత్రము యొక్క దర్శనంవలన పుణ్యము లభించును, వాటిని స్పృశించుట వలన సర్వపాపములు నశించును. ఒక బిల్వపత్రమును శివునికి భక్తిశ్రధ్ధలతో అర్పించుటవలన, ఘోరాతిఘోరమైన పాపములు సైతము నిర్మూలమగును. ఇట్టి త్రిగుణములు గల  బిల్వదళమును నీకు అర్పించుచున్నాను. నన్ను అనుగ్రహింపుము.

సమవర్తనం అంటే ఏమిటి?


విద్యాభాస కాలాన్ని బ్రహ్మచర్య కాలంగా చెప్పబడుతుంది. బ్రహ్మచారి తన విద్యాభాసం పూర్తి చేసుకుని తిరిగి ఇంటికి వచ్చినప్పుడు, తల్లిదండ్రులు మరియు బంధువులు అతనికి మంగలహారతులచ్చి సాదరంగా ఆహ్వానిస్తారు. బ్రహ్మచారితో పాటు అతని గురువు మరియు తోటి విద్యార్థులు కూడా సాదరంగా సకల మర్యాదలతో ఆహ్వానించడం జరుగుతుంది.

విద్యాభాస కాలంలో గురువు విద్యార్థికి తండ్రిలా తన బాధ్యతలన్నీ నిర్వహిస్తాడు. కావున అట్టి గురునికి తగిన ఆసనమేసి కూర్చుండబెట్టి, పుష్పమాల వేసి బహుమతులిచ్చి విద్యార్థి తల్లిదండ్రులు ఆదరిస్తారు. గురువు తన సిష్యుదిని దీవించి సమావర్తన కార్యాన్ని పూర్తి చేస్తాడు.

నేటి కొత్త తరం వారికి ఈ సమవర్తనములో ఎత్తి విశేషము కనిపించకపోవచ్చు, కానీ అది ఎంతో అర్థమైనటువంటింది. జ్ఞానాన్ని ఆర్జించిన విద్యార్థిని మరియు జ్ఞానాన్ని విద్యార్థికి అందించిన గురువును గౌరవించి ఆడరించడమంటే పరోక్షంగా జ్ఞానాన్ని ఆరాధించినట్లే అవుతుంది. ఈ కార్యంలో గురు శిష్యుల మధ్య ఉన్న సంబంధాన్ని కూడా గౌరవించి గుర్తించబడుతుంది.

హనుమంతుడి జన్మరహస్యాలు


భక్తులెందరో హనుమంతున్ని ఆదర్శనీయ దైవంగా ఆరాధిస్తారు. అతణ్ణి మహాహలుడు, బుద్ధిశాలి, కపిశ్రేష్టుడు, సర్వశాస్త్ర పారంగతుడు, స్వామిభక్తి పరాయణుడు, రామదూత అంటూ ఎన్నోవిధాలుగా ప్రస్తుతిస్తారు. తల్లి అంజనాదేవి కనుక అతణ్ని ఆంజనేయుడంటారు. అతని తండ్రి ఎవరనే విషయంలో శివమహాపురాణం, రామాయణం, పరాశరసంహిత మొదలైన గ్రంథాల్లోని వైవిధ్యగాథలతో అతడి దివ్యజననం ముడివడి ఉంది.
రామకార్యంలో సహాయపడాలనే ఉద్దేశంతో శివుడు తన వీర్యాన్ని స్థలనం చేశాడు. దాన్ని సప్తర్షులు సాదరంగా పొందుపరచి, గౌతముడి కూతురైన అంజనాదేవిలో చెవిద్వారా ప్రవేశపెట్టారు. ఫలితంగా శంభుడు మహాబల పరాక్రమాలగల వానరదేహంతో ఆమెకు జనించాడని (శంభుర్జజ్ఞే కపి తనుర్మహాబల పరాక్రమ:)  శివమహాపురాణం (శతరుద్ర సమ్హిత 20-7) తెలిపింది. అలా హరాంశతో పుట్టిన హనుమంతుడే రుద్రావతార భగవానుడుగా శ.రు.సం. (20-14, 37) స్పష్టం చేసింది.

అంతేకాదు, హనుమంతుణ్ని శివసుతుడుగా (మహాదేవత్మజ:) కూడా శ.రు.సం (20-32) వర్ణించింది. తండ్రే తనయుడవుతాడనే (ఆత్మావై పుత్రనామాసి) సూక్తివల్ల, హనుమంతుణ్ని శివనందనుడుగా, శివావతారుడుగా కీర్తిస్తారు. శివుని పదకొండో అవతారమే హనుమంతుడని పరాశర సంహిత ధ్రువీకరించింది. త్రిపురాసుర సంహారంలో విష్ణువు పరమశివుడికి సహకరించినందుచేత రుద్రుడు కృతజ్ఞుడై హనుమంతుడిగా అవతరించి, రావణసంహారంలో విష్ణు అవతారుడైన శ్రీరాముడికి సహకరంచాడని ఈ సంహిత చెబుతోంది. ఉపకారం పొందిన లోకులు కృతజ్ఞతతో మెలగాలనేదే ఇక్కడి సందేశం. రాక్షస సంహారం కోసం విష్ణువు సూచనపై త్రిమూర్తుల తేజస్సును పరమశివుడు మింగుతాడు. ఆ శివవీర్యాన్ని పార్వతీదేవి భరించలేక అగ్నిదేవుడుకి ఇస్తుంది. అగ్ని కూడా భరించలేక వాయుదేవుడికి ఇస్తాడు. వాయువు ఆ శివవీర్యాన్ని ఒక పండుగా మలచి, పుత్రుడికొసం తప్పస్సు చేసే అంజనాదేవికి ఇస్తాడు. ఆ పండును అంజని తిన్న పహలితంగా ఆమె గర్భం దాల్చి, కాలక్రమంలో కుమారుణ్ని ప్రసవించింది.   అతడే ఆంజనేయుడు. వాయుప్రసాది కావడంచేత వాయునందనుడనే పేరు కలిగిందని ఈ సంహిత వివరించింది. భగవదనుగ్రహం వల్లనే పుత్రుడు పుట్టడు కనుక కన్యత్వ దోషం లేదని ఆకాశవాణి ధైర్యాన్నిచ్చిందంటారు.

దేవలోకంలొని పుంజికస్థల అనే శ్రేష్ఠమైన అప్సరసకాంత బృహస్పతి శాపంవల్ల భూలోకంలో వానర ప్రభువైన కుంజరుని కుమార్తెగా జన్మించింది. ఆమే అంజనాదేవి; వానరరాజైన కేసరి భార్య అయింది – వాల్మీకి రామాయణం (కిషిందకాండ 66-8). కేసరి అడవులకు తపస్సు చేసుకోవడానికి వెళ్ళినపుడు, అంజనను వాయువుకు అప్పజెప్పాడు. అంజన అందానికి ఒకసారి వాయుదేవుడు మోహితుడై, ఆమెను కౌగలించుకొన్నాడు. తాను మనస్సు చేతనే ఆమెను అనుభవించాడు కనుక, ఏకపత్నీ వ్రతం భగ్నం కాలేదని ధైర్యం చెప్పి తేజస్వి – బలశాలి – బుద్ధిమంతుడు – పరాక్రమవంతుడు అయిన పుత్రుడు పుడతాడని అంజనిని తృప్తిపరచాడు – కి.కాం (66-16, 18,19) . సంతసించిన అంజన ఒక గుహలో వైశాఖ బహుళ దశమినాడు బాలుణ్ని ప్రసవించింది. అతడే ఆంజనేయుడు. ఉదయించే సూర్యుణ్ని చూసిన ఆ బాలుడు దాన్ని తినే పండనుకొని ఆకాశంవైపు 300 యొజనాలు ఎగిరి సూర్యతేజస్సును ఆక్రమించుకొంటున్నాడు. అప్పుడు కోపగించిన ఇంద్రుడు తన వజ్రాయుధంతో ఆంజనేయుణ్ని కొట్టాడు. ఆ దెబ్బకు ఆంజనేయుడు హనువు (గడ్డం) విరిగింది. అప్పటినుంచే అతనికి హనుమంతుడనే పేరు వచ్చింది – కి.కాం. (66-24).

అలా కేసరికి క్షేత్రజ (భార్యకు ఇతరుల వల్ల పుట్టిన) పుత్రుడుగాను, వాయువుకు ఔరస (చట్ట బధ్ధమైన) పుత్రుడుగాను, శివవీర్యం వల్ల పుట్టినందుచేత శంకరసువనుడుగాను లోకప్రసిధ్ధమైన పేర్లు హనుమంతుడి జన్మ రహస్యాల్లోని పవిత్రతను వెల్లడిస్తున్నాయి. అలా హనుమంతుడి విశిష్ట జన్మ రామేశ్వరులను అనుసంధానించినట్లుగా రామేశ్వరం వద్ద భావిసేతు నిర్మాణానికి కూడా హేతువైంది.

మన పురాణాలలో ‘గుర్రం’


మన సంస్కృతిలో ప్రతీజీవికి ప్రాముఖ్యత ఉంది. ఇందుకు రాక్రణం ఆ సర్వేశ్వరుడు సకలజీవులలో ఉండటమే కాక, సమయం, సందర్భం వచ్చినపుడు ఆయా జీవుల రూపాలను ధరించి మనలను అనేక దుష్టశక్తుల బారినుండి కాపాడాడు. ఇతిహాసాలను పరికించినపుడు ప్రతిజీవి యొక్క నెపథ్యం మనకు అవగతమవుతుంటుంది. అటువంటి పురానప్రాముఖ్యం గల జీవులలో ‘గుర్రం’ ఒకటి. గుర్రం పుట్టుక గురించి అనేక కథనాలున్నాయి.
సాగరమథన సమయంలో ఉచ్చైశ్శ్రవమనే గుర్రం పుట్టిందనీ, ఇంకా గుర్రాల పుట్టుక గురించి ఈ క్రింది విధంగా చెప్పడం జరిగింది.
సామవేదం నాలుక నుంచి, బ్రహ్మదేవుడు హోమం చేస్తున్నప్పుడు ఆయన కన్నుల నుంచి, అగ్నినుంచి, అష్టదిక్పాలకులయందు గుర్రం ఉద్భవించిందని చెబుతుంటారు. ఒకానొకప్పుడు లక్ష్మీదేవి శాపానికి గురైన బ్రహ్మదేవుడు ఒక విచిత్ర రూపాన్ని సంతరించుకుని, ఆ రూపం ఒక అండంగా (గుడ్డు) మారి, ఆ గుడ్డు నుంచి ఎనిమిది గుర్రాలు పుట్టాయట. ఈ గుర్రాల యొక్క లక్షణాలు కూడ పేర్కొనడం జరిగింది.
ఇక, ఆ సర్వేశ్వరుడే గుర్రం రూపం ధరించిన సంభవం కూడ మన ముందుంది. శ్రీమహావిష్ణువు ధరించిన అనేక అవతారాలలో హయగ్రీవ అవతారం కూడ ఒకటి. పూర్వం హయశీర్షుడనే రాక్షసుడు దేవిని ప్రార్థించి తనకు మనిషి దేహం, గుర్రం తల రూపంగల వాని చేతుల్లోనే మరణం సంభవించాలని కోరుకుంటాడు. దేవి వరమీయడంతో వరగర్వితుడైన ఆ రాక్షసుడు, బ్రహ్మ దగ్గరున్న వేదాలను దొంగిలించాడు. సృష్టికర్త అయోమయంలో పడిపోగా, ఈ సంగతిని గమనించిన ఇంద్రుడు శ్రీహరి సాయం కోసం పరుగుపరుగున వైకుంఠానికి వెళ్ళాడు. అయితే అప్పటికే రాక్షసంహారంతో అలసిపోయిన విష్ణువు, తన చేతిలోని విల్లుపైనే తలవాల్చి, నిల్చున్న భంగిమలోనే నిద్రించసాగాడు. స్వామిని నిద్రలేపేందుకు ఇంద్రుడు భయపడుతుండగా, అక్కడకు వచ్చిన శివుడు, ధనస్సు నారిని తెపినట్లయితే, విల్లు కదిలి, విష్ణువుకు మెలకువ వస్తుందని చెబుతాడు.  శివుడు చెప్పిన ఉపాయం అందరికీ నచ్చినప్పటికీ, ఆ విల్లును తెంపేదెవరు? అప్పుడు అక్కడే తచ్చాడుతున్న వ్రమి అనే కీటకం, యజ్ఞభాగాల్లో వాటా ఇచ్చినట్లయితే ఆ వింటినారిని కొరికి తెంపుతానని ఇంద్రునితో అంటుంది. అందుకు ఇంద్రుడు సరేననడంతో ఆ కీటకం వింటినారిని కొరుకుతుంది. ఫలితంగా గట్టిగా బిగించిన వింటి నారి తెగడంతో అది కత్తిలా శ్రీమహావిష్ణువు మెడను ఖండించింది. ఆ సంఘటనకు దేవతలు దు:ఖిస్తుండగా, అక్కడ ప్రత్యక్షమైన జగన్మాత, హయశీర్షుని చావు రహస్యాన్ని గురించి వాళ్ళకు చెప్పి, శ్రీహరి మొండేనికి గుర్రపు తల అతికించమని చెబుతుంది. జగన్మాత చెప్పినట్లు బ్రహ్మ చేయగా, నారాయణుడు హయగ్రీవుడై హయశీర్షుని సంహరించి వేదాలను ఉద్ధరించాడని కథ.
వేరొక కథ ప్రకారం, మధుకైటభులనే రాక్షసులు వేదాలను అపహరించి పాతాళంలో దాక్కుంటారు. వారిని సమ్హరించేదుకై పాతాళానికెళ్ళిన శ్రీహరి, అక్కడ గుర్రపు తల, మనుష్యశరీరంగల రూపును ధరించి గుర్రంలా పెద్దగా సకిలిస్తాడు. ఆ ధ్వనికి భయపడిన రాక్షససోదరులు, ఆ ధ్వని ఎక్కడినుంచి వచ్చిందోనని తెలుసుకోడానికి తాము దాక్కున్న చోటు నుంచి బయటకు వస్తారు. సరిగ్గా అదే సమయంలో శ్రీహరి వారు దాచిన వేదాలను తిరిగి సంగ్రహించి, బ్రహ్మదేవునికి అందజేసి, తిరిగి మధుకైటభుల్లున్న ప్రాంతానికి వచ్చి వార్ని సంహరిస్తాడు.
శ్రీహరి సకిలింపును గురించి తలచుకున్నప్పుడు మనకు అశ్వత్థామ గుర్తుకొస్తాడు. కృపి, ద్రోణుల పుత్రుడైన అశ్వత్థామ పుట్టగానే ఉచ్చైశ్శ్రవంలా (గుర్రం) సకిలించాడట. అందుకే అతని అశ్శ్వత్థామ అనే పేరు స్థిరపడిందట.
అలాగే గరుత్మంతుని కథ కూడా ఆ ఉచ్చైశ్శ్రవమనే గుర్రంతో ముడిపడిందే. గరుత్మంతుని తల్లి వినిత, ధరణీ దక్షుల కూతురైన ఈమె కశ్యప ప్రజాపతి భార్య. ఈమె సవతులలో కద్రువ ఒకామె. ఒకసారి కద్రువ, వినతలు సాగరతీరాన విహరిస్తూ ఉచ్చైశ్శ్రవాన్ని చూసి, దాని తోక నలుపా తెలుపా అన్న విషయంలో పోటీ పెట్టుకుంటారు. పోటిలో ఓడిపోయినవారు, గెలిచినవారికి దాస్యం చేయాలనేది పందెం. ఇంద్రుని గుర్రమైన ఉచ్చైశ్శ్రవం తోక తెల్లగానే ఉంటుంది. అదే విషయాన్ని గరుత్మంతుని తల్లి వినత చెబుతుంది. కానీ సర్పాలకు తల్లియైన కద్రువ కావాలనే ఆ గుర్రం తోక నల్లగా ఉందని పందెం వేసి, ఆ అబద్ధాన్ని నిజం చేయడానికి వెయ్యిమంది సర్పకుమారుల దగ్గరకెళ్ళి ఆ గుర్రం తోకకు వేలాడి, తోకను నల్లగా చేయమంటుంది. అందుకామె కొడుకులు ఒప్పుకోరు. దాంతో కోపోద్రిక్తురాలైన కద్రువ, తన కొడుకులను జనమేజయుడు చేసే యాగములొ నశించమంటూ శాపం పడుతుంది. ఆమె శాపానికి భయపడిన కర్కోటకుడనే కొడుకు, తల్లి మాట ప్రకారం గుర్రం తోక పట్టుకుని వేలాడి, ఆ గుర్రం తోక నల్లగా కనిపించేట్లు చేస్తాడు. ఫలితంగా గరుత్మంతుని తల్లి వినత, కద్రువకు దాసి అవుతుంది. గరుత్మంతుడు తల్లిని దాస్యవిముక్తురాలిని చేయడం వేరే కథ.
మహాభారత యుద్ధంలో రథాలకు అత్యంత ప్రాముఖ్యత కనిపిస్తుంది. అలాగే రథాలను లాగే గుర్రాలకు కూడా రథాన్ని బట్టి సైన్యంలోని శ్రేణులు ఏర్పడుతుండేవి. ఈ శ్రేణులు అర్థరథ, సమరథ, మహారథ, అతిరథలంటూ పిలువబడేవి. రథి, సారథుల మధ్య అన్యోన్యత ఉండేది. రథాన్ని, రథికుడిని రక్షించడానికి రథచక్ర రక్షలుండేవారు. ఎవరి రథాలకు వారి ప్రత్యేక ధ్వజాలుండేవి. ప్రతివారి ఆయుధాలకు, ధ్వజాలకు, శంఖాలకు పేరులండేవి. ద్రోణాచార్యుని గుర్రాల ఎరుపు రంగుతో మెరిసిపోతుండగా, ధర్మరాజు రథానికున్న గుర్రాలు మాత్రం తెల్లటి గుర్రాలు ఉండేవట. అర్జునుని రథపు గుర్రాలు కూడా తెలుపువే. పాండవులలో అశ్వికదళానికి నకులసహదేవులు నాయకత్వం వహించగా, కౌరవుల పక్షాన శకుని అశ్విక సైన్యానికి అథిపతిగా ఉండేవాడు.
ఈ విధంగా మహాభారత యుద్ధంలో అశ్విక సైన్యానికి ఎనలేని ప్రాముఖ్యత ఉండేది. వేగంగావెళ్ళే అశ్వికసైన్యం శత్రువుల మీదకు అలలు అలలుగా మీదపడుతుండెదట. శత్రుసైన్యాన్ని వెనుక నుంచి ముట్టడించటానికి అశ్వదళాన్ని ఉపయోగించేవారట. అశ్వహృదయం అంటే గుర్రాలను నియత్రించే మంత్రం. శ్రీకృష్ణునికి అశ్వహృదయ విద్య తెలుసునని, ఆ విద్యను సైంధవ వధనాడు ప్రదర్శించాడనీ, నకులునికి అశ్వశిక్షణ బాగా తెలుసునని మహాభారతం ద్వారా మనకు తెలుస్తోంది.

ఇక రామాయణంలో శ్రీరాముడు అశ్వమేథ యాగం చేసి వదిలిన గుర్రాన్ని శ్రీరామచంద్రమూర్తి కుమారులు కట్టివెయడం, వారితో లక్ష్మణాదులు తలపడటం తదితర కథ మనకు తెలిసిందే. ఇంతకీ కారణం ఒక యాగాశ్వమే! సూర్యభగవానుడు తన ఏడుగుర్రాల రథంపై వస్తుండటాన్ని చిత్రపటాల్లో చూస్తుంటాం. ఆ ఏడు గుర్రాల పేర్లు : గాయత్రి, బృహతి, ఉష్ణిక్కు, జగతి, త్రిష్టుప్పు, అనుష్టుప్పు, పంక్తి. ఒకానొకప్పుడు సూర్యుడు, సూర్యునిభార్య సంజ్ఞాదేవి గుర్రాల రూపాలను ధరిస్తారు. ఆ సమయంలో వారికి నాసత్యుడు, దశ్రుడు అనే కుమారులు కలుగుతారు. వారే అశ్వినీదేవతలు. ఇలా గుర్రానికి సంబంధించిన ఎన్నో విషయాలు మన పురాణాలలో కనబడుతుంటాయి.

అంతేకాదు, గుర్రానికి ప్రాముఖ్యతగల ఒక తీర్థం కూడా కన్యాకుబ్జం సమీపంలో ఉంది. విశ్వామిత్రుని తండ్రి గాధి. ఆయనకు సత్యవతి అనే కూతురు కూడా ఉంది. ఆమెను తనకిచ్చి పెళ్ళి చేయవలసిందిగా గాధిని రుచీక మహర్షి కోరుతాడు. అది విన్న గాధి తనకు ఒక చెవి నలుపుగా, శరీరమంతా తెలుపుగా ఉండే వెయ్యిగుర్రాలను తనకిస్తే పిల్లనిచ్చి పెళ్ళి చేస్తానంటాడు. ఏమీ పాలుపోని రుచికుడు వరుణదేవుని ప్రార్థించగా, ప్రత్యక్షమైన వరుణుడు రుచికునితో, ‘ నీకు తలచిన చోట, తలచినపుడు ఆ గుర్రాలు లభిస్తాయని ‘ చెబుతాడు. రుచికుడు తనకు గంగానది ఉత్తరాన వెయ్యుగుర్రాలు కావాలని కోరగా అవి అక్కడ ప్రత్యక్షమవుతాయి. అప్పట్నుంచి ఆ ప్రదేశం అశ్వతీర్థంగా పేరుగాంచింది.

అగ్ని పురాణంలో గుర్రానికి సంబంధించిన విషయాలను ధన్వంతరి వివరించాడు. గుర్రం మనసులో బ్రహ్మ, బలంలో విష్ణువు, పరాక్రమంలో గరుత్మంతుడు, రెండు పక్కలా రుద్రగణాలు, బుద్ధిలో బృహస్పతి, మర్మస్థానంలో విశ్వేదేవులు, నేత్రాలలో సూర్యచంద్రులు, చెవులలో అశ్వినీకుమారులు, జఠరాగ్నిలో స్వధ, నాలుకపై సరస్వతీ, వేగంలో వాయుదేవుడు, వెనుక భాగంలో స్వర్గం, కాలిగిట్టలలో అన్ని పర్వతాలు, రోమకూపాలలో నక్షత్రగణాలు, హృదయంలో చంద్రకళ, తేజస్సులో అగ్ని, పిరుదులలో రతి, లలాటంలో జగత్పతి, వక్ష: స్థలంలో వాసుకి ఉంటారట.
అందుకే గుర్రాన్ని ఉపయోగించడానికి కొన్ని నియమాలను మన పూర్వులు ఏర్పరిచారు. గుర్రంలో దేవతలంతా ఉంటారని భావిస్తూ, గుర్రం కుడి చెవిలో మంత్రరూపంలో చెప్పి గుర్రాన్ని ఎక్కడం మంచిదట. తొలిసారిగా గుర్రాన్ని ఎక్కి స్వారీ చేసేందుకు అశ్వని శ్రవణ హస్త, ఉత్తరాషాడ, ఉత్తరాభాద్ర, ఉత్తరఫల్గుణీ నక్షత్రాలు మంచివట. గుర్రపు స్వారీ చేయడానికి శిశిర, హేమంత, వసంత ఋతువులు తగినవట. గ్రీష్మ, శరత్, వర్ష ఋతువులు గుర్రపుస్వారీకి మంచిది కాదట. పండుగల సమయాలలో కూడా గుర్రాలకు ఉన్న ప్రాముక్యత అంతా ఇంతా కాదు.
కొయ్యగుర్రాల ఆట మనకు తిరునాళ్ళలో తప్పకుండా కనిపించే దృశ్యం. సాధారణంగా వైష్ణవాలయ వాహనోత్సవాలలో శేషవాహణం, సింహవాహనం తదితర వాహనాలతో పాటూ స్వామివార్లు అశ్వవాహనంపై ఊరేగింపుగా రావడాన్ని చూస్తుంటాం.