Wednesday, September 12, 2012

గణేశుని నోము

పూర్వం ఒకానొక ఊరిలో ఒక పుణ్యవతి గత జన్మలో గణేశు నోము నోచి వ్రతమును నియమాను సారము సమాప్తి చేయక వుల్లంఘించింది.    అందుచేత ఆమెకు ఈ జన్మలో దు:ఖము సంభవించినది.  అనుదినం కడుపారా తిన్నా ఎంతటి వేడుకలో పాల్గొన్నా ఆమెకు ఏమి తోచేదికాడు.  స్థిమితం కలిగేది కాదు.  దు:ఖం మున్చుకొస్తుండేది.    ఒక్కత్తే కూర్చుని ఎడుస్తుండేది.  తోటి మగువలందరూ ఆమెను దూషిస్తూ వుండేవారు.   

           కారణం తెలియకుండా దు:ఖిస్తున్న ఆమెను చూసి పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమై ఆమెతో నీవు ఒక పామును నీ కొడుకు పడుకున్న పక్కమీద ఉంచు, అది కరాచి నీ కొడుకు చనిపోయినచో నువ్వు ఎడువవలసినది.  నిన్నెవ్వరు నిందించారు అని చెప్పిరి.  వారి ఆదేశానుసారము ఆమె ఒక పామును కొడుకు పక్క వేయగా అది ఆ కొడుకునకు బంగారు మొలత్రాడు అయ్యింది.   


             నా ఏడుపు కారణం దొరకలేదని అడవికి పోయి ఏడవసాగింది.  పార్వతి పరమేశ్వరులు ప్రత్యక్షమై ఏమి జరిగినది అని ప్రశ్నించారు.  మీరు చెప్పిన ప్రకారము చేసినందున ఆ పాము నా బిడ్డ కి బంగారు మొలత్రాడై పోయినది.  అందువల్లనా ఏడుపుకు కారణం దొరకలేదని చెప్పింది.  పార్వతి పరమేశ్వరులు ఆమెకు ఒక తేలును ఇచ్చి దానిని నీ మనుమరాను బొట్టు పెట్టెలో పెట్టు, పెట్టె తెరవగానే  నీ మనుమరాలిని  తేలు  కుట్టి  ఏడ్చినప్పుడు  నువ్వు కూడా  ఆ కారణంగా  ఏడువ  వచ్చు  అన్నారు .  ఆ ప్రకారం  ఆమె ఆ తేలును బొట్టు పెట్టెలో పెట్టింది .  మనుమరాలు  ఆ పెట్టెని  తెరవగానే  ఆ తేలు  బంగారు బొట్టు చుక్కగా  మారిపోయింది .  ఈ పర్యాయం  కూడా  తన  ఏడుపుకు కారణం దొరకలేదని అడవికి వెళ్లి రోదించసాగింది.  పార్వతి పరమేశ్వరులు ప్రత్యక్షమై సంగతి తెలుసుకున్నారు.  పిల్లిని ఇచ్చి దానిని ఇంటికి తీసుకువెళ్ళి చంపి దాని కారణంగా ఏడువ వచ్చు అని చెప్పినారు.  ఆ ప్రకారం ఆ పిల్లిని ఇంటికి తీసుకుని పోయి చంపి తాను ఎడువడానికి ఇరుగు పొరుగు వారిని పిలిచింది.  తీరా ఆ ఇరుగు పొరుగు వారు ఇంటికి రాగా ఆ పిల్లి కాస్తా బంగారు పిల్లిగా మారి పోయింది.  


              ఇరుగు పొరుగు వారంతా నవ్వుకుని పెల్లిపోగా ఏమి చెయ్యాలో తోచక వున్న ఆమె చెంతకు పార్వతీ పరమేశ్వరులు వచ్చి నువ్వు నీ గత జన్మలో గణేషుని నోమును ఉల్లంఘించి నందువల్లె నీకీ అకారణ దు:ఖం.  ఇది తోలగాలంటే నువ్వు గణేషుని నోమును నోచుకోవడమే నీకు మార్గం అని చెప్పారు.  ఆమాటలు మదికేక్కిన మగువ గణేషుని నోమును నోచుకున్నది. 
 దాని ప్రభావం వలన ఆమెకు దు:ఖం తొలగిపోయి సుఖ సంతోషాలతో జీవించింది.  
ఉద్యాపన:  కొత్త మూకుడులో అయిదు గిద్దేల నూనె పోసి వత్తిని వేసి వెలిగించాలి.  స్వయం పాకంను దక్షిణ తామ్బూలాడులతో శివాలయంలో నంది దగ్గర పెట్టాలి.  

సౌభాగ్య గౌరీ నోము

పూర్వము ఒక రాజ్యంలో ఆ రాజ్యాన్ని పరిపాలించే రాజు, రాణి ఇద్దరు తమ రాజ్యంలోని ప్రజలను కన్నబిద్దలవలె పరిపాలిస్తున్దేవారు.  ఆ రాజుగారి భార్య గౌరీ పూజలతో నిరంతరం కాలం వెళ్ళబుచ్చుతూ వుండేది.  గుణవంతులైన పుత్రులు, మురిపములోలికించే మనుమాలతో ఆ రాజ దంపతులు హాయిగా బ్రతుకుతున్నారు.  పార్వతీ పరమేశ్వర్లు ఆమె భక్తికి మెచ్చి అతని సద్గుణాలను పరీక్షించాలన్న కోరిక కలిగింది.  

           ఆ రాజుకు విరోధి అల్ప బలవంతుడైన మరొక సామంతుదాయన మీదకు దండెత్తి వచ్చేలా చేసారు.  దైవబలం జతపదినందున సామంతరాజు ఈ రాజుతో హోరాహోరి యుద్దముచేసినాడు.  ఎందరో సైనికులు వీరస్వర్గం అలంకరించినారు.  బందు కోటి మరణించారు.  ఆఖరుకు ఆ రాజు కూడా యుద్దంలో మరనిన్హినాడు.  మహారాణి కిన్చితైనబెదరక యుద్ధభూమికి వచ్చింది.  యమదూతలు విగత జీవులైన వారి ప్రాణాలను తీసుక పోతున్నారు.   


           అంత మహారాణి వారిని నిలువరిచి యమదూతలారా మీకిదేటిసాహాసం.   నా పసుపు కుంకుమలు నిలిచి ఉండేటందుకు పసుపు వాయనమిచ్చిన దానను.  మా సిరి సంపదలు భోగభాగ్యాలు ఉండగలందులకు బంగారం వాయనమిచ్చాను.  వసతి వాకిలి నిలిచేటందుకు తెల్ల చీరలు వాయనమిచ్చాను.  పొలం తోటలు వనాలు ఉండేటందుకు తోపు చీర వాయనమిచ్చినాను.  బిడ్డలా క్షేమం నిమిత్తం కుడుములు, అరిసెలు వాయనమిచ్చాను.  
పొరుగువారి పచ్చదనాన్ని కోరి పొగడపూలిచ్చాను.  బంధువుల బాగుకై బంతిపూలిచ్చాను.  రాజ్యం సుభిక్షంగా ఉండుటకు రత్నాలు దేశాశాంతిని కోరి చల్ల పునుకులు పాడిపంటల పెంపునకు పాయసము పేరుప్రతిష్టలు అభివృద్దికి గారెలు, ప్రాణభయము లేకుండా పానకము, కోరికలు నేరవేరుతకు కొబ్బరిబొండాలు, స్వర్గలోక ప్రాప్తికై స్వర్ణ రాశి వాయనములిచ్చాను.  అకాల మరణం కలుగాకున్డుతకు అరటిపళ్ళు వాయనమిచ్చాను.  మీరు నా భర్త ప్రాణాలు గైకొనలేదు.  నా ప్రజలను యమపురికి తరలించలేరు.  పొందు పొందు తొలగిపొండు అని పలికింది.  ఆమె మాటలకు ఆమె చేసిన పుణ్య వాయనముల ప్రభావమునకు వెరచి యమభటులు ఉత్త చేతులతో మరలిపోయారు.  పార్వతి పరమేశ్వరులు ఆమె  ఔనత్యానికి సంతసించి సాక్షాత్కరించి ఆమె భర్తను పరనించిన తదితరులను బ్రతికించారు.  

ఉద్యాపన:  కథలో చెప్పిన వస్తువులను పుణ్య స్త్రీలకు వీలయినప్పుడల్లా వాయనమియ్యాలి.  అయిదుగురు ముత్తైదువులను పిలిచి గౌరీ దేవిని ఆరాధించి వారికి పసుపు, కుంకుమ రైకల గుడ్డ దక్షిణ తామ్బూలాడులతో ఒక్కొక్కరికి ఐదేసి వస్తువులు వాయనమివ్వాలి.  

మాఘ గౌరీ నోము

  పూర్వం ఒక గ్రామంలో ఒక బ్రామ్హన దంపతులకు లేక లేక ఒక కుమార్తె పుట్టింది.  ఆమెను అల్లారుముద్దుగా పెంచారు.  యుక్త వయస్సు రాగానే ఆ కన్యకు అత్యంత వైభవంగా వివాహం చేసారు.  పెళ్లి అయిన ఐదవ నాడే వరుడు మరణించి  ఆ కన్యా విధవరాలైంది.  కుమార్తె ప్రారబ్ధమునకు ఆ తల్లి దండ్రులు ఎంతగానో దు:ఖించారు.  తీర్ధయాత్రల వలన పుణ్యము ప్రశాంతత కలుగుతుందని ఆ దంపతులు తమ కుమార్తెను తీసుకుని పుణ్య క్షేత్రాలు దర్శిస్తూ తిరుగుతూ వున్నారు.   

           ఇలా తిరుగుతున్నా వారికి ఒకనాడు ఒక చెరువు వద్ద ముత్తైదువులు ఒకచోట, విధవరాల్లందరూ ఒక చోట చేరి పద్మములతో పూజలు చేస్తూ కనిపిస్తోన్నారు.  అదేమిటో తెలుసుకొనవలేనన్న కుతూహలం కలిగి వారు ఆ చెరువు వద్దకు వెళ్ళారు.  అక్కడగల పుణ్య స్త్రీలలో వున్న పార్వతీదేవి వృద్దురాలి రూపంలో కనిపించింది.  వీరిని సమీపించింది.  


దంపతులు ఆమెను అక్కడ జరుగుతున్నదేమిటి అని ప్రశ్నించారు .  వృద్ద రూపంలో వున్న పార్వతీదేవి చేరదీసి ఇది పుణ్యకా వ్రతమని చెప్పి వారి కుమార్తెను చెరువులో చేయించి దోసెడు ఇసుకను ఆమెచేత గట్టున వేయించింది  .  ఆ ఇసుక  పసుపుగా మారింది.  మరల స్నానం చేయించి దోసెడు ఇసుక గట్టున వేయించాగా అది కుంకుమ గా మారింది.  మూడవ పర్యాయము స్నానం చేయించి దోసెడు ఇసుకను ఒడ్డున వేయించాగా అది కొబ్బరికాయగా మారింది.  ఆ నాలుగు అయిదుసార్లు ఆ వితంతువు చేత చేయించగా బెల్లముగా జీలకర్రగా మారింది.  అంట అమ్మవారు ఓ దంపతుల్లారా! చింతించక మీ బిడ్డ వైధవ్యం తొలగి పోయే మార్గం చెబుతాను మీ అమ్మాయిచేత అయిదు సంవత్సరాలు మాఘ గౌరీ నోమును నూయించండి అని చెప్పి మాయమైనది.   

             అంత ఆ తల్లి దండ్రులు ఆనందిన్చినవారై తమ కుమార్తెను తీసుకుని స్వగ్రామం వెళ్లి కుమార్తె చేత మాఘ గౌరీ నోముని అయిదు సంవత్సరాలు చ్యించారు.  అంట ఆమెకు పునర్వివాహమై జీవితకాలం ముమంగాలిగా జీవించింది.   


ఉద్యాపన:  ఈ నోమును మాఘమాసములో అమావాస్య వెళ్ళిన పాడ్యమి నాడు పొదలు పెట్టాలి.  ఆ నెల రోజులు ప్రతిరోజూ స్నానం చేసి నీలాతరేవులో పసుపుతో గౌరీదేవిని పెట్టి పువ్వులు, పసుపు, కుంకుమ లతో పూజించాలి.  మొదటి సంవత్సరము సేరుమ్బావు (1-1/4kg) పసుపు రెండవ సంవత్సరము  
సేరుమ్బావు
  (1-1/4kg)  కుంకుమ,  మూడవ సంవత్సరము (1-1/4kg) కొబ్బరి, నాలుగవ సంవత్సరము 1-1/4kg బెల్లము, అయిదవ సంవత్సరము సేరుమ్బావు (1-1/4kg) జీలకర్ర ముత్తైదువులకు దానమివ్వాలి.  ఉద్యాపన చెప్పుకుని ముత్తైదువులకు భోజనము పెట్టి, పసుపు, కుంకుమ, రవికెల గుడ్డలు ఇవ్వాలి.  

ఉదయ కుంకుమ నోము

  పూర్వకాలములో ఒకానొక విప్రునకు నలుగురు కుమార్తెలు వుండేవారు.  పెద్ద పిల్లలు ముగ్గురికి వివాహాలు జరిగివారి భర్తలు చనిపోయి విధవరాళ్ళు అయ్యారు.  ఆ బ్రాహ్మణ దంపతులు కుమార్తెల దుస్థితికి ఎంతగానో బాధపడుతుండేవారు.    ఆఖరు కుమార్తెకు యుక్త వయస్సు వచ్చింది.  ఆమెకు వివాహం చెయ్యాలన్న వుబలాటం వున్నా అక్కగార్లవలె వైధవ్యం పోడుతుందేమో అని బాధ పాడుతుండేవాడు.   

                నిరంతరం భగవంతుడిని తలచుకుంటూ ఈ బిడ్డనైనా సుమంగళిగా వుద్దరించమని మొరపెట్టుకునేవాడు.  ఒకనాడు గౌరీదేవి కలలో కనిపించి నీవు నీ కుమార్తె చేత ఉదయ కుంకుమ నోము నోయించమని చెప్పింది.  ఆమె మాటలు యందు నమ్మకము కలిగి అలా చేయడం వలన తన కుమార్తెకు వైధవ్యం తొలగిపోతుందనే నమ్మకము కలిగి తన ఆఖరి కుమార్తె చేత ఉదయ కుంకుమ నోమును నోయించాడు.  వ్రత ప్రభావం వలన ఆమెకు భార్తలభించాడు.  పూర్నాయుష్కుడు వైధవ్య భయం తొలగి పోయింది.  ఈ ఉదయ కుంకుమ నోముని నోచుకుని గోరిదేవిని ధూప దీప నైవేద్యాలతో పూజించిన వారికి మాంగల్యము, సిరిసంపదలు, కలుగుతాయి.   


ఉద్యాపన:  కన్నె పిల్లలు చేసుకుని తీరవలసిన నోము ఇది.  ఉదయాన్నే స్నానం చేసి చక్కగా బొట్టు కాటుక పెట్టుకొని పసుపు గౌరీ దేవిని చేసి ఫల పుష్పాదులతో ధూప దీప నైవేద్యాలతో ఆచరించాలి.  ఒక ముత్తైదువు నకు  గౌరీదేవి పేరున పసుపు పువ్వులు రవికల గుడ్డ తాంబూలము ఇచ్చి ఆమె ఆశీస్సులు పొందాలి.  

అనంతపద్మనాభుని నోము

పూర్వకాలంలో ఒక గ్రామంలో నిరుపేద దంపతులుండేవారు.  వారికొక కుమార్తె వుండేది ఆమెను అల్లారుముద్దుగా పెంచి చదువు సంధ్యలు నేర్పించారు.  యుక్త వయస్సు వచ్చిన కుమార్తెకు వివాహం చెయ్యాలని కాలినడకన దూర తీర గ్రామాలకు వెళ్లి చక్కని వరుణ్ణి నిశ్చయించారు.  వివాహం చేసి ఆమెను అత్తా వారింటికి సాగనంపారు.  కుమార్తెకు అత్తవారింటికి వెళ్ళేటప్పుడు వుల్లది ఏదైనా ఇచ్చి పంపించమని భార్యకు చెప్పాడు.  ఆ ఇల్లాలు ఇంట్లో వున్న కాస్త వరిపిందిని మూటగట్టి కూతురుకిచ్చింది.   

              నవవదూవరులిద్దరూ వారి స్వగ్రామమునకు కాళీ నడకన బయలుదేరారు.  వెళ్తూ మార్గ మధ్యలో సంధ్య వార్చుకోవడానికి ఆమె భర్త చెరువుకు వెళ్ళాడు.  ఈ లోపున నవవధువు ఆ చుట్టూ పక్కల తిరుగుతూ కొందరు పూజచేసుకుంటూ వుండడం చూసింది.  వారి దగ్గరకు వెళ్లి ఆ పూజ వివరాలను అడిగి తెలుసుకుంది.  తన దగ్గర వున్న పిండితో పద్మనాభుని బొమ్మను చేసి చెట్టు మొదలు దగ్గర ప్రతిష్టించుకుని భక్తితో పూజ చేసింది.  సంధ్య వార్చుకుని భర్త వచ్చే సరికి ఆమె పూజ ముగించుకుంది.  భర్త తోపాటు గ్రామానికి బయలు దేరింది మార్గ మధ్యలో వారికి ఆకలికాగా ఆమె భర్త తన అత్తా గారిచ్చిన పిండితో తినడానికి ఏమైనా చెయ్యమని అడిగాడు.  అందుకామె పిండిలేదని బొమ్మను చేసి పూజచేసుకున్న వైనాన్ని చెప్పి చేతిని గల తోరాలను సాక్ష్యంగా చూపింది.  అతడు విసుగుకొని ఆతోరంతీసిపారేయ్యమన్నాడు.  ఎదురు చెప్పలేక చేతికున్న దారపు పోగులను తీసివేసింది.   


                అందుమీదట నోము వుల్లన్ఘిన్చినట్లయింది.  వారి ప్రయాణము కాదు  దుర్భరమైంది.    ఆకలి ఎక్కువైపోయింది. జవసత్వాలు సన్నగిల్లి పోయాయి.  యేమిటిదని ఆ వరుడు పరిపరి విధాల పరితపించాడు.  ఇదంతా తోరం తీసి పారేసి పద్మనాబుని వ్రత ఉల్లంఘన చేయడం వల్లనే జరిగి ఉంటుందని అనుకుని అనుమతిస్తే మళ్ళీ ఆ వ్రతం మొదలు పెట్టి భక్తి శ్రద్దలతో పూర్తి చేస్తాను మన బాధలు తొలగి పోతాయి అన్నది.  అందుకు అతడు అంగీకరించగా ఆ వధూవరులు మరింత భక్తి శ్రద్దలతో స్వామికి నివేదించవలసిన పూజాద్రవ్యాలను పూజా విధి విధానాలను అనుసరించి మనసున తలచు కుంటూ అనంత పద్మనాభుని వ్రతం చేసారు.  స్వామీ అనుగ్రహం కలిగి ఆ వ్రత మహిమ వల్ల ప్రయాణం సుఖంగా సాగింది.  చెట్లు ఫలాలు లభించగా వాటిని తిని ఆకలి తీర్చుకున్నారు.  ఇంటికి చేరుకునేసరికి రాజుగారి ఆస్థానము నుండి రాజ పురోహితునిగా రావసిందని ఆహ్వానము వచ్చింది.  అటుపై ఆ దంపతులకు జీవితం ఆనందంగా సాగింది.   


ఉద్యాపన:  వార్షికంగా ఈ నోముకన్యాలు, వివాహిత వనితలు స్సుసుకోదగినది.  పిండితో దామోదరుని బొమ్మను చేసి ప్రీతితో పూజ చేసి కొబ్బరికాయ కొట్టి ధూప దీప నైవేద్యాలతో పూజించాలి.  ఆ రోజున ఒక సద్బ్రాహ్మనునికి భోజం పెట్టి దక్షిణ తాంబూలాలివ్వాలి.

శాకాదానము నోము

పూర్వము ఒక రాజ్యములో రాజు భార్య మంత్రి భార్య కలిసి శాఖ దానము నోమును నోచారు.  ఒక సంవత్సరము పాటు మంత్రి భార్య ప్రతి రోజు ఒక తోటకూర చెట్టును కొంత దక్షిణతో కలిపి ఒక విప్రునకు దానమిస్తుండేది.  రాజు భార్య సంవత్సరమునకు సరిపడు తోటకూర చెట్లు తెప్పించి విప్రులను రప్పించి వారికి దక్షిణ తామ్బూలాడులతో ఒక్క సారిగా దానమిచ్చింది.  కాలం గడుస్తున్దగ్తా మంత్రి భారీ సుఖ సంతోషములతో ఆనందముగా జీవిస్తున్నది.  రాజు భార్యకు సుఖ శాంతులు లేక కష్టాలతో జీవిస్తుండేది.  

               ఈ విషయం మంత్రి భార్య వద్దకు వెళ్లి చెప్పి మనమిద్దరమూ శాఖ దానము చేసితిమిగాడా మరి నీకు సుఖ శాంతులు కలుగుటకు కారణమేమిటి అని ప్రశ్నించినది.  అందుకా మంత్రి భార్య మహారాణి ఒక్క సారిగా వ్రతమును పూర్తి చేయాలన్న తొందరపాటు భావంతో మీరు వ్రత నియమాన్ని కూడా ఉల్లంఘించి సంవత్సరం రోజులపాటు ప్రతీ రోజు పంచవలసిన తోటకూర చెట్లను దక్షిణ ను ఒకే రోజు పంచడం వల్ల వ్రత విధి విదానాలను ఆచరించ కుండా వ్రతమును పూర్తి చేసినందువల్ల మీకు మనఃశాంతి లోపించి దు:ఖము కష్టములు కలుగుటకు కారణమని మరలా శాఖ దానము నోమును నోచి భక్తితో ప్రతి రోజు శాఖమును దక్షినలతో కలిపి ఏడాదిపాటు దానము చేయవలసినదని మంత్రి భార్య రాజు భార్యకు చెప్పింది.  ఆమె మాటల యందు నమ్మకము వుంచి రాజు భార్య శాఖ దాన నోమును భక్తితో వ్రాతవిది విదానములతో నియమముతో వ్రతమును పూర్తి చేసినందువల్ల ఆమె స్థితి మారి కష్టాలు తొలగి సుఖ సంతోషాలతో ఆనందముగా జీవించింది.  
ఉద్యాపన:  ఒక బ్రాహ్మణుడిని పిలిచి తలంటి నీళ్ళు పోసి తోటకూర చెట్టును పదమూడు నాణాలను దక్షిణగా ఆ విప్రునకు దానమివ్వాలి.  

 పూర్వము ఒకానొక గ్రామంలో ఒక వృద్ద పెరంటాలుండేది.    ఆమె చేయని వ్రతాలు నోచని నోములు లేవు.  కాని ఆమెకు మాట కటువుగా   వుండేది.  చెట్లలో చీత్కారం చోటుచేసుకునేది.  ఆ కారణం వల్ల ఆ గ్రామస్తులేవ్వరికి ఆ ముడుసలిపట్ల ఉండవలసిన ఆదరాబిమానాలు ఉండేవి కావు.  కాని ఆమెను ఎవరూ దూషించేవారు కాదు .   సమస్త దేవతలా కరుణా కటాక్షాలతో ఆమె జీవితం సజావుగా సాగిపోతుండేది.  

          ఒకనాడు కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు లోకంలో జరిగే విషయాలు విశేషాలను ముచ్చటించు కుంటున్నారు  .  పార్వతి పరమేశ్వరుని కాళ్ళు వత్తుచున్నది.   ఆమె చేతులు కఠినముగా ఉన్నందువల్ల పరమేశ్వరుడు ఆమెను పాదాలను పట్టవద్దన్నాడు.  నాదా!  నా చేతులెందుకు కఠినముగా వున్నాయో ఈ కాఠిన్యం పోయి మృదువైయ్యే మార్గామేమితో హేప్పమని వేడుకుంది.  దేవి నీవేవరిపట్లనో కాఠిన్యము పోయి మృదువైయ్యే మార్గమేమిటో  చెప్పమని వేడుకుంది.  దేవి నేవేవరిపట్ల నో కాఠిన్యముగా ఉండడమే ఈ నీ చేతులు ఠినత్వమునకు గల కారణం ఇందుకు నీవు నీళ్ళాట రేవుకు వెళ్లి వచ్చీపోయే వనితలకు తలంటి నీళ్ళు పోయవలసిందని ఇందువాళ్ళ ఒక భక్తురాలికి తలంటి నీళ్ళు పోయడం వల్ల స్నానం చేయిన్చేదవో వారికి గల కాఠిన్యము కూడా నశించి పోవునని పరమేశ్వరుడు పార్వతీ దేవికి ఉపదేశించాడు.  
            ఆమాటమేరకు పార్వతి భూలోకానికి వచ్చి నీళ్ళాట రేవు వద్ద నిలబడి వచ్చీపోయే మగువలను పిలచి తలంటి నీళ్ళు పోస్తూ వచ్చింది.  అలా వచ్చినవారందరికీ తలంటు పోయగా అహంకారవతియై ఒక వృద్ద పేరంటాలు రేవుకు వచ్చింది.  పార్వతి ఆమెను తలంటి నీళ్ళు పోస్తాను రమ్మన్నది.  నేను ఎన్నో వ్రతాలు హేసాను ఇదేమి వ్రతము?  తలారా స్నానం చేయవచ్చిన నాకు తలంటుతానంటే కాదనడం ఎందుకు అని అలగేకాని  తలవంచుకుని కూర్చున్నది ఆ ముదుసలి పేరంటాలు.  పార్వతి ఆమెకు తలదిద్ది స్నానం చేయించి సాగనంపింది.  ఆ ముదుసలి వెళుతూ కనీసం పార్వతీ దేవిని మర్యాద కోసమైనా మన్నింపు మాటలతో తనియింప చేయలేదు.  అయినా పార్వతి తన చేతులు మరుడువుగా మారడం వల్ల ఆ ముదుసలి పెరంటాలిని అనుగ్రహించి సిరిసంపదలు ప్రసాదించింది.  

             పలు నోములు నోచితినన్న అహంకారం ధనదాన్యాది సిరులున్నాయన్న అహంభావం ఆ వ్రుద్దురాలిలో కలిగాయి.  తనంతటి దానను కనుకనే పార్వతి  స్వయంగా వచ్చి తలారా స్నానం చేయిన్చిందన్న గర్వం కలగడంతో ఆమె అందరి పట్ల చులకనగా ప్రవర్తిస్తుండేది.  ఈ విషయాన్ని గమనించిన పార్వతి ఆమె సిరులే ఆమె అహంకారానికి కారణమని సిరిని తొలగిస్తే ఆమె స్థిరపడుతుందని నిశ్చయించుకుంది.  విఘ్నేశ్వరుడ్ని పిలిచింది.  ఆమె అహంకారాన్ని వివరించి ఆమె భాగ్యాన్ని తీసివేయవలసిందని చెప్పి పంపించింది.  ఆమె ఇంటికి గణపతి వెళ్ళాడు.  ఆమె విఘ్నేశ్వరునికి ఉండ్రాళ్ళు పెట్టింది.  పార్వతి పుత్రుడు ప్రసన్నుడై ఆమెకు మరికొంత సిరిని అనుగ్రహించాడు.  
             ఈ సంగతి తెలిసిన పార్వతి బాగా ఆలోచించి నందిని ఆమెవద్దకు పంపించింది వచ్చిన నందిని ఆ వృద్ద పేరంటాలు ఆరాధించి శనగలు వాయనమిచ్చింది.  దానితో నందికేశ్వరుడు ఆమెకున్న భాగ్యాన్ని తీయకుండా వెనుదిరిగి పోయాడు. ఆ తదుపరి పార్వతి భైరవుడ్ని పంపించింది.  వచ్చిన భైరవునకు వృద్ద పేరంటాలు గారెలు పెట్టింది.  అందుకా భైరవుడు ఆమె సిరులు తొలగించకుండా వేణు తిరిగి వచ్చెను.  పార్వతి చంద్రుడిని పంపించింది.  వచ్చిన చంద్రునకు వృద్దురాలు చలిమిడి చేసి పెట్టింది.  చంద్రుడు ఏ విధంగాను ఆమె సిరులు తొలగించకుండా వెను తిరిగెను.  

               అటుపై పార్వతి సూర్యుడిని పంపించగా ఆ వృద్దురాలు క్షీరాన్నాన్ని ఆరగించమని పెట్టింది.  అందుకా సూర్యుడు ప్రసన్నుడై ఆమె సిరులపట్ల ఏవిధమైన చర్య తీసుకోలేదు.  కుమారస్వామిని వృద్దురాలి సిరులు తొలగించుటకు  పార్వతి పంపించగా చక్రపోగాలిని పెట్టి వృద్దురాలు తన ప్రమాదాన్ని తప్పించుకుంది.    వీరివల్ల సాద్యం కాదని సిరులను తొలగించుటకు పరమేశ్వరుడిని పంపించింది పార్వతి.  వచ్చిన సదాశివునికి ఆ వృద్ద భక్తురాలు చిమ్మిలిని పెట్టింది.  శంకరుడు వచ్చిన పని కాదని వెను తిరిగి వెళ్ళాడు.  

                ఇంకా పార్వతీ దేవి స్వయముగా తానె కార్యసాధన నిమిత్తం వృద్ద పేరంటాలు ఇంటికి వచ్చింది.  తన ఇంటికి వచ్చిన పార్వతిదేవిని సాదరంగా ఆహ్వానించి పీఠంవేసి  కూర్చోబెట్టి భక్తురాలు పసుపు వ్రాసింది.  కుంకుమ బొట్టు పెట్టింది.  ధూప దీప నైవేద్యాడులతో ఆరాధించింది.  పులగం వండి నివేదించింది.  పార్వతీ దేవి ప్రసన్నురాలై తన నిర్ణయాన్ని విరమించుకుంది ఆమె కాఠిన్యము తగ్గింది.  మనస్సు తనువూ మ్రుదువైయ్యాయి.  ఆమెకు మరింత సిరిసంపదలను ఆగ్రహించింది.  

                ఓ భక్తులారా!  నీవు నేను పంపించిన దేవతలకు నివేదించిన పదార్ధాలు నివేదించి పూజాపూర్వక ఉద్యాపన చేసిన వారికి సమస్త దేవతల అనుగ్రహం కలిగి కాఠిన్యము తొలగి పటుత్వంగా రూపొంది సమస్త సిరులు సమస్త భోగాలు కలుగుతాయని పార్వతి వచ్చింది. 
ఉద్యాపన:  కొద్ది కొద్దిగా నవ ప్రసాదాలను చేయాలి.  పార్వతీదేవిని ఆరాధించాలి ప్రసాదాలను నంది తదితరులకు నివేదించాలి.  అయిదు మానికల బియ్యం అత్తెసరుగా వండి ఇదుమూరాల అన్గావస్త్రముతో మూటగట్టి వెండితో చేసిన నందికి నివేదించి అత్తెసరును బంధువులకు వడ్డించాలి. దక్షిణ తామ్బూలాడులతో ఒక సద్బ్రామ్హమనులకు స్వయం పాకం ఇవ్వాలి. 

మారేడుదళాల నోము

పూర్వం ఒకానొక దేశపు రాజకుమారుడు ఆయువుడు తీరి చనిపోయాడు.  రాజపీనుగు తోడులేకుండా పోరాదుకనుక నా కుమారుని శవానికి తోడుగా పోవుటకు ఎవరైనా తీసుకు రావలసిందని మృతుని తండ్రియైన మహారాజు భటులను పంపాడు.  ఆ భటులు ఎంతగా తిరిగినా చచ్చిన వానికి తోడుగా పోవుటకు గాని తమ వారి నేవరైనా తోడుగా పంపించుటకు గాని ఏ ఒక్కరూ అంగీకరించలేదు.   

           ధనాశ పరులైన ఒక బ్రాహ్మణ వనితా తన సవతి బిడ్డను ఎత్తుకు ఎట్టు ధనం పుచ్చుకుని పంపించుటకు అంగీకరించినది.  ఆమె కోరిన ప్రకారం ధనమిచ్చి రాజు భటులు పిల్లను తీసుకుని వెళ్ళారు.  అలా తీసుకుని వచ్చిన ఆ పిల్లను రాకుమారుని శవంతోపాటు కటి స్మాశానానికి తీసుకుని వెళ్ళుతున్నారు.  ఆకస్మికంగా చీకట్లు కమ్ముకుని పెద్ద వర్షం కురిసింది.  ఆ వర్షంలో చెకటిలో ముందుకు పోలేక శవాన్ని శివాలంముండు దింపి వారంతా తప్పుకుని వెళ్ళారు.  ఆ బాలిక కట్లు వూడదీసుకుని ఆలయం చుట్టూ ప్రదక్షిణం చేసి ఆలయం లోపలకు వెళ్లి పార్వతీ పరమేశ్వరులు ముందు కూర్చుని తన దుస్థితికి పరితపిస్తూ భోరుభోరున ఏడ్వసాగింది.  కరునామయులైన ఆ దంపతులు ఆమెను ఆగ్రహించి అక్షతలు జలాన్ని ఇచ్చి రాకుమారుని శవంపై చల్లమన్నారు.  మారేడు దళం నోచుకోవలసినదని చెప్పారు  ఆ ఆది దంపతులు ఆదేశానుసారం ఆ చిన్నది మారేడు దలముల నోమును నోచి శవం పై మంత్ర జలాన్ని సంప్రోక్షించి అక్షింతలు వేసింది.  రాకుమారుడు నిద్రమేల్కొన్న్ట్టు సజీవుడై లేచి కూర్చున్నాడు.  జరిగిన విషయాన్ని యావత్తు ఆమె వల్ల విన్నాడు.   


          ఇంతలో తెల్ల వారుతుండగా రాజు తాలూకు జనులు శవాదాహన సంస్కారం చేయడానికి వచ్చారు బ్రతికి వున్న రాకుమారుడిని చూసి ఆశ్చర్య పడ్డారు.  వారిని అంతఃపురానికి తీసుకువెళ్ళారు.  రాజ దంపతులు ఎంతగానో ఆనందించి ఆ బాలికతో తమ కుమారునికి వివాహం చేసారు.   


ఉద్యాపన:  మారేడు దలములను వెండితోను బంగారముతోను చేయించి మారేడు దలములను మూడింటిని కలిపి మూడు దోసిళ్ళ బియ్యంతో శివునకు పూజచేసి నిరుపేదలకు అన్న దానం చేయ వలెను.  

కన్నె తులసి నోము

  పూర్వము ఒకానొక ఊరిలో ఒక చిన్నది వుండేది.  ఆమెకు సవతి తల్లి పోరు ఎక్కువగా వుండేది.  అది భరించలేక ఆ చిన్నది తన అమ్మమ్మ గారి ఇంటికి వేల్లిపోయినది.  సవతి తల్లి ఆ పిల్లను తీసుకు రమ్మని భర్తను వేదించేది.  అందకు అతడు అంగీకరించలేదు.  ఒకనాడు సవతి తల్లి తన భర్తతో ఆ పిల్లను తీసుకు రమ్మని ఎంతగానో పట్టు పట్టింది.  అప్పుడు ఆమె భర్త నువ్వే వెళ్లి తీసుకొని రమ్మన్నాడు.  చేసేది లేక సవతి తల్లి ఆ చిన్న దాని తాతగారించికి వెళ్ళింది.  పిల్లను పంపించమని అడిగింది.  వారు అంగీకరించలేదు.  వారితో జగదమాది ఆఖరికి ఎలాగైతేనేం వాళ్ళను ఒప్పించి ఆ చిన్న దానిని తన వెంట ఇంటికి తీసుక వచ్చింది.  

              ఒక రోజున ఆ చిన్నది తన సవతి తల్లి తులసి పూజ చేయడం చూసింది.  తనకు కూడా ఆసక్తి కలిగి ఇంట గల అరిసెలు తెచ్చి నైవేద్యం పెట్టి తులసి దేవిని పూజించింది.  ఆమె భక్తికి మెచ్చి తులసి దేవి సాక్షాత్కరించి ఓ చిన్నదానా!  గత జన్మలో నువ్వు కన్నె తులసి నోము నోచి ఉల్లంఘించి నందువల్ల  నీకు తల్లి పోయి సవతి తల్లి కలిగింది.  కనుక నువ్వు కన్నె తులసి నోము నోచుకోమన్నది.  ఆ తులసీ దేవి చెప్పిన ప్రకారం ఆ చిన్నది కన్నె తులసి నోమును భక్తి శ్రద్దలతో నోచి సంవత్సరాంతమున ఉద్యాపన చేసుకున్నది.  నాటి నుండి ఆ సవతి తల్లి ఆమె పట్ల ప్రేమానురాగాలు కలిగి ఎంతో ఆదరణతో చూసుకునేది.  
ఉద్యాపన:  తులసమ్మకు పదమూడు జతల అరిసెలు నైవేద్యము పెట్టి పూజచేయ్యాలి.  ఒక కన్యకు తలంటు నీళ్ళు పోసి పరికిణి, రవిక ఇచ్చి అరిసెలు వాయనమివ్వాలి.  

పదహారు ఫలాల నోము

పూర్వకాలంలో ఒకానొక రాజ్యంలో ఓ రాజుగారి భార్య మంత్రి భార్య పదహారు ఫలాల నోము నోచుకున్నారు.  రాజు భార్యకు గుణహీనులు, గ్రుడ్డివారు కుంటివారు కుమారులుగా పుట్టారు.  మంత్రి భార్యకు రత్నమాణిక్యాల్లాంటి సుగుణ గుణ సంపన్నులు కలిగారు.  ఇందుకు రాజు భార్య ఎంతగానో చింతించింది.  మంత్రి భార్యను కలుసుకుని ఏమమ్మా!  నువ్వు నేను కలిసే గదా పదహారు ఫలాల నోమును నోచుకున్నాము.  మరి నాకిట్టిబిడ్డలు, నీకు అటువంటి బిడ్డలు పుట్టుటకు కారణమేమిటి అని అడిగింది.  

            అందుకా మంత్రి  భార్య బాగా ఆలోచించి రాణి గారికి ఈ విధంగా చెప్పింది.  మహారాణి!  మీరు వ్రాతకాలంలో వినియోగించే పళ్ళను ఒక రోజు ముందుగానే సమకూర్చుకుని వాటిని కోటలో నిలువచేసినారు.  వాటిలో వున్న వంకర పళ్ళు, మచ్చలున్న పళ్ళు, పాడైన పళ్ళను గుర్తించక, వాటిని వేరుచేయక పేరంటాల్లకు పంచిపెట్టారు.  అలా అశ్రద్ధ చేసినందువల్ల మీకు కలిగిని సంతానం
కుంటి, గుడ్డి, గుణహీనులు అయ్యారు.  మీరు విచారించకండి ఈ పదహారు ఫలాల నోము చాలా శక్తివంతమైన నోము, స్త్రీలపాలిట పెన్నిది, కనుక మీరు మరలా  పదహారు ఫలాల నోమును నోయండి.  చక్కనైనవి శుబ్రమైనవిగా వున్న ఫలాలను సమకూర్చుకుని వాటిని ముత్తైదువులకు పువ్వులు, దక్షిణ తాంబూలాదులతో వాయనమివ్వండి అని చెప్పింది.

           రాణి మంత్రి భార్య చెప్పిన ప్రకారం మంచి పళ్ళను సమకూర్చుకుని, ఎంతో భక్తి శ్రద్దలతో పదహారు ఫలాల నోమును నోచుకున్నది.  అలా ఈ నోము విశేషం వలన ఆమె సంతానం సర్వాంగ సుందరంగా మారడం జరిగింది.  అందుకా రాణి ఎతగానో ఆనందించింది.  

ఉద్యాపన:  పరిశుబ్రమైన పదహారు రకాల పళ్ళు ఎంచుకొని సమకూర్చుకోవాలి.  ఒక్కొక్క పండును, పువ్వులను దక్షిణ తామ్బూలాలను  ముత్తైదువునకు  ఇవ్వాలి.   తదుపరి సంతర్పణం చెయ్యాలి. 

బచ్చలిగౌరి నోము

 పూర్వం ఒకానొక ఊరిలో ఒక ఇల్లాలు చక్కగా ఆనందంగా సంసారం చేసుకుంటున్నది.  ఆమెను పుట్టింటికి తీసుకెళ్ళడానికి ఆమె అన్నగారు వచ్చాడు.  ఆనందంతో ఆ ఇల్లాలు నవగాయ పిండివంటలు చేసింది.  చారుపోపునకు పెరటిలో కరివేపాకు కోసుకురంమని అన్నగారిని పంపింది.  కరివేపాకు రెమ్మలు తుంచుతున్న ఆ అన్నగారిని పాము కరిచింది, నురుగులు కక్కుతూ నేలపై పడిపోయాడు.  ఎంతకూ అన్నగారు పెరటిలోనుండి రాకపోవదముతో ఆమె పెరటిలోనికి వచ్చి నురగలు క్రక్కుతూ క్రింద పది వున్న అన్నగారిని చూసింది.  భోరుభోరున ఏడుస్తున్న ఆమెకు పార్వతీ దేవి వృద్ద స్త్రీ రూపంలో వచ్చి ఊరడించి లోనికి వెళ్లి బచ్చల గౌరీ నోమును నోచుకోమ్మంది,   నీ అన్న బ్రతుకుతాడని చెప్పి వెళ్లి పోయింది.  అది జగన్మాత వాక్కుగా గుర్తించి ఆ ఇల్లాలు బచ్చల గౌరీ నోమును నోచింది.  ఆమె అన్న బ్రతికాడు ఆనాటినుండి ఈ నోమును నోచుకుని స్త్రీలు, అన్నా చెల్లెళ్ళు సుఖముగా వున్నారు.  
ఉద్యాపన:  శక్తి మేరకు బంగారంతోగాని, వెండితో గాని, బచ్చాలికాయను చేయించి ఆ బచ్చలి కాయను గౌరీదేవికి నివేదించి, బచ్చలి చెట్టును, బచ్చలి కాయను దక్షిణ తామ్బూలములను ఒక ముత్తైదువుకు వాయన మివ్వాలి.  

పసుపుగౌరి నోము కథ

పూర్వము ఒక గ్రామములో ఒక పుణ్య స్త్రీ వుండేది.  పతి భక్తి కలిగిన ఇల్లాలు నిరంతరం పతిసేవాలు చేస్తూ అతనీ పాదాలను కళ్ళకు  అద్దుకుంటూ సంసారమును సాగిస్తుండేది.  ఆమె భర్తకు ఉబ్బస వ్యాధి, మాట్లాడడానికి కూడా ఎంతో కష్టంగా వుండేది.  ఆహార పానీయాలు కూడా సవ్యంగా జరిగేవి కావు.  తగ్గు ముఖం పట్టని వ్యాధితో నిరంతరం మంచాన పది మగ్గుతుండేవాడు.  తాను చనిపోతానని భయపడుతూ భార్యతో ఎంతో అధైర్యంగా అంటూ ఉండేవాడు.  ఆ మాటలకు ఆ ఇల్లాలు బాధ పడుతున్న భర్తకు ధైర్యవచానాలను చెప్పి ఒడార్చుతుండేది.  రాను రాను అతనికి మరణ భయం పెరిగింది.  యమభటులు తనను తీసుకుపోవడానికి వస్తున్నారని తాను చని పోతున్నానని పలవరించే వాడు ఎంతో ధైర్యంగా వున్న ఆమెలో భయాందోళనలు పెరుగుతూ ఉండేవి.  పార్వతీ దేవిని తలచుకుని తను సుమంగళిగా తనువూ చాలించాలని అనుగ్రహించమని వేడుకునేది.  

             ఒకనాడు భర్త భయాందోళనలతో  సొమ్మసిల్లి పడిపోయాడు.  కదలికలేని భర్తపై బడి తల్లీ!  మహేశ్వరీ నీకిది తగునా స్త్రీకి వైద్యమెంతో దుర్భరం ఈ వైద్యము నాకు కలుగజేయుట నీకు ధర్మమా అని పరిపరివిధాల రోదిన్చిండ్.  అందుకా పరమేశ్వరి బిడ్డా! లే ఎందుకలా  కుమిలి పోతావు నీ కొంచ్చిన బాధభయం ఏమీలేవు.  నీవు పసుపు గౌరీ నోము నోచుకో నీ అయిదవతనానికి కొరతరాదు  .  ఈ నోమును నోచిన కులకాంతకు నిత్యసోవ్భాగ్యం పసుపు కుంకుమ కొన్ని వేల జన్మలు సౌభాగ్యం కలుగుతుంది.  లేచి కృతనిశ్చయురాలివై గౌరీదేవిని ఆరాధించు ఇందుకు సమయం సందర్భం అక్కరలేదు.  తోచినదే తడవుగా ఇలా ఈ పసుపు గౌరినోమును ఏడాదిపాటు నోచుకోవాలి.  అట్టి వారు పుణ్య స్త్రీగా తనువూ చాలిస్తుంది  నీ భర్త ఆరోగ్యం కుదుటపడి ఆరోగ్య వంతుడు అవుతాడు .   అని పలికి ఆశీర్వదించి అంతర్దానమైనది.  నిత్య సుమంగళిగా ఆమె నోము నోచుకున్నది.  ఆమె భర్త పూర్ణ ఆరోగ్య వంతునిగా చిరకాలం జీవించి తరించారు.  
ఉద్యాపన:  కథలో చెప్పబడిన మాటలు ప్రతి రోజు అనుకుంటూ అక్షింతలు నెత్తిన వేసుకుని సంవత్సరాంతమున సోలడు పసుపు వెదురు బుట్టలలో వుంచి అందులో నల్లపూసలు లక్క జోళ్ళు రవికెల గుడ్డ దక్షిణ తాంబూలాలు వుంచి ఒక పుణ్య స్త్రీ కి వాయనం ఇవ్వాలి.  ఒక ముదుసలి పెరంతాలికి భోజనం పెట్టాలి.  

కైలాసగౌరి నోము

  పూర్వము ఒక రాజ్యములో మహారాజు తన కుమార్తెను అతి గారాబముగా పెంచి పెద్ద దానిని చేశాడు.  యుక్త వయస్సు రాగానే దేశ దేశాలు గాలించి అత్యంత సుందరాంగుడిని    వెతికి అతనితో తన కుమార్తెకు అత్యంత వైభవంగా వివాహం జరిపించాడు.  రాజు కుమార్తె అత్తవారింటికి వెళ్ళింది.  ఆమె భర్త వేశ్యాలోలుడు.  భార్యను సరిగా చూసేవాడు కాదు భర్త  అనురాగానికి దూరమై  ఆమె ఎంతగానో దు:ఖిస్తుండేది.  మహారాజు కూడా ఎంతగానో బాధపడేవాడు.  తన బిడ్డ బ్రతుకుని సరిదిద్ద వలసినదిగా పరమేశ్వరరుడిని ప్రార్ధించేవాడు.  ఆ చిన్నది సైతం తన బ్రతుకు బాగుకై పార్వతి దేవిని నిరంతరం ప్రార్దిస్తుండేది.  

             ఒకనాటి వేకువజామున ఆ పార్వతీదేవి ఆమెకు కలలో కనబడి బిడ్డా! కైలాస గౌరినోము నోచుకో నీ బ్రతుకు సరియౌతుంది.  నీవు నీ భర్త అనురాగాన్ని పొందగాలుగుతావు అని చెప్పింది.  ఆ ప్రకారం రాకు కూతురు కైలాస గౌరీ నోము నోచింది.  అందుకు ఫలితంగా ఆమె భర్తకు, వెలయాలిపై మమతానురాగాలు తొలగిపోయాయి.  ఉంపుడు గత్తెల  కపట ప్రేమ పట్ల అసహ్యత కలిగింది.  భార్యపట్ల ప్రేమ సంతృప్తి కలిగింది.  ఆనాటి నుండి రాజు కుమార్తె ఆమె భర్తే యొక్క అనురాగం పెంపొంది ఆమె సంసార యాత్ర సుఖంగా జరుగుతుండేది.  వారిని చూచినా వారు పార్వతీ పరమేశ్వరులని ప్రశంసిస్తుండేవారు.  

ఉద్యాపన:  పార్వతీ దేవి ఆలయంలో గాని నదీ తీరమునండుగాని అయిదు కుంచాల కుంకుమ అయిదు కుంచాల పసుపు ముత్తైదువులకు దక్షిణ తాంబూలాలు పుష్పములతో పంచిపెట్టి వారి ఆశీస్సులు  పొందాలి.

త్రినాధుని నోము

పూరకాలములో ఒక నిరుపేద విప్రుడు ఉండేవాడు.  అతనికి లేకలేక ఒక కుమారుడు కలిగాడు ఆబిడ్డడికి తల్లి వద్ద చాలినన్ని పాలు లేక ఆకలితో అలమటించు చుదేవాడు.  ఒక ఆవుని సంపాదిస్తే బిడ్డడికి పాల ఇబ్బంది ఉండదని నిర్ణయించుకున్నాడు.  అందుకుగాను ఇంటిలో గల కొద్దిపాటి మంచాలు కుంచాలు అమ్మి వచ్చిన సొమ్ముతో సంతకు బయలుదేరినాడు.  యెంత ధరకైన పాడి ఆవును కొనాలని ఆ బ్రాహ్మణుడు సంతలో తిరుగుతున్నాడు.  

         సంత జరిగే ప్రాంతానికి సమీపాన గల గ్రామంలో ఒక సంపన్నుని ఆవు ఇరుగు పొరుగు వారి పొలాలను పాడు చేస్తుండేది.  నిత్యం తగువులు తీర్మానాలతో విసిగిపోయిన అతడు దానిని ఎవరికైనా ఇచ్చి వేయాలని ఎంతో  ప్రయత్నిచినాడు  .    దానిని తీసుకోగాలన్డులకు ఎవ్వరూ ముందుకు రాలేదు.  సంతకు తోలుకు వెళ్తే దీని సంగతి తెలియని వారు ఖరీదు చేస్తారని నిర్ణయించుకొని ఆ సంపన్నుడు దానిని సంతకు తోలుకు వచాడు.  ఏ వెలకైనా అమాలని అతడు, ఏ వెలకైనా కొనాలని విప్రుడు సంతలో తారసపడ్డారు.  వదిలిపోతే చాలని అతడు దొరికితెచాలని యితడు ఉన్నందున ఆ ఆవు బార్హమ్నునకు అమ్మబడినది.  

          దానిని తోలుకుని స్వగ్రామానికి బయలుదేరిని విప్రుడు ఆనంద పారవశ్యంతో ఆదమరచి వుండగా ఆ ఆవు తప్పించుకుని పారి పోయింది.  అది దొరకక విప్రుడు ఒక చెట్టు నీడను కూర్చుని విచారిస్తున్నాడు.  విచారించి విచారించి తిరిగి సంతకు వెళ్లి వేదకాలని దాని యజమాని వైనం తెలుసుకుని అతని ఇంటికి గాని వేల్లిందేమో తీసితెచ్చుకోవాలని నిర్ణయించుకున్నాడు.

            అలా వెళ్తున్న ఆ బ్రాహ్మణునకు త్రిమూర్తులు సాక్షాత్కరించి ఓయీ!నీవు ఎక్కడికి వెళ్ళుతున్నావు అని ప్రశ్నించారు.  ఆవును వెదుకుటకు వెళ్ళుచున్నాను అని విప్రుడు సమాధానం చెప్పాడు.  నువ్వు సంత దిక్కుగా గ్రామానికి వెళ్ళుతున్నావు గనుక నీవు తిరిగి వచ్చేటప్పుడు గంజాయి, ఆకు, వక్క, నూనె తెచ్చి పెట్టవలసినదిగా మూడు పైసలిచ్చారు.  అలాగేనని అంగీకరించి విప్రుడు సంతలో ఆవు అగుపించక తిరిగివస్తూ తెలేకలగానుగకు వెళ్లి ఒక పైసా నూనే ఇమ్మని చెంగుచాచాడు  ఇతడెవరో అమాయకుడని ఆలోచించి ఆగానుగా యజమాని సోలను తిరగేసి నూనెను అతని చెంగులోనికి కొలిచాడు.  ఆ విప్రుడు కొట్టుదిగేసరికి ఆ తెలికలవాని పాత్రల్లో నూనె అంటా మటుమాయమైయ్యింది.    అతడు లబూదిబూమని మొరపెట్టుకోగా చుట్టూ పక్కల వారంతా చేరి విషయాని తెలుసుకున్నారు.  విప్రుడిని మోసగించిన కారణం వల్ల అలా జరిగిందని గ్రహించారు.  అతడిని వెతుక్కుంటూ వెళ్ళి కిరాణా కొట్టు మీద ఆకు వక్కలు కొనుక్కుంటున్న ఆ విప్రుడిని చూసి అయ్యా! మీకు నూనె కొత్తాయన తక్కువ కొలిచాదట రండి సరిగా కొలిచిస్తాదట అని చెప్పి తీసుకెళ్ళి నూనె ఇప్పించారు.  అతడు తిరిగి వస్తుండగా త్రిమూర్తులు కనబడి అయ్యా నువ్వు మా కొరకై తెచ్చిన వస్తువులతో త్రినాధ పూజా చెయ్యి ణీ కష్టాలు తొలగుతాయి అని ఈ పూజలో నీకేమి ఖర్చు ఉండదని చెప్పి పంపించాడు.  అతడు ఇంటికి వెళ్ళి త్రినాధ పూజను గురించి భార్యకు చెప్పి దంపతులు ఇద్దరుకూడా భక్తి శ్రద్దలతో పూజా చేసారు.  త్రిమూర్తులు పూజా చేయడం వల్ల పోయిన ఆవు దొరికింది.  ఆ ఆవు అల్లరి చిల్లరిగా తిరగడం మాని చక్కగా పాలివ్వసాగింది.  బిడ్డది పాల బెడద తీరింది.  ఆయవారంవల్ల తిది వార నక్షత్రాలు చెప్పడం వల్ల కొద్దో, గొప్పో దానం ముట్టి వారి ఆర్ధిక ఇబ్బందులు తొలగనారంభించాయి.  

             ఈ పూజా చేసిన వారికి సంసార సంభందమైన ఇబ్బందులు తొలగి జీవితం ప్రశాంతంగా సాగుతుంది. 

నాగపంచమి నోము

 పూర్వకాలంలో ఒకానొక గ్రామంలో ఒక శ్రీమంతురాలు వుండేది.  ధనగర్వం గాని అహంకారం గాని లేని సుగుణవతి, విద్యావినయంగల సౌజన్యురాలు.  పెద్దలపట్ల వినయవిదేయతలతోను పనివారి పట్ల కరుణ, దయ సానుబూతిగల సద్గుణ సంపన్నురాలు  .   ఈ సుగునవతికి ఒక తీరని బాధ వుండేది.  చెవిలో చీము కారుతుండేది.  రాత్రులందు సర్పం కలలో కనబడి కాటు వేయబోతుండేది.  ఇందువల్ల ఆమె మనస్సులో ఎంతో కలవరపడుతుండేది.  ఎన్ని పూజలు చేయించినా ఎన్ని శాంతులు చేయించినా కలలో పాములు కనబడడం కాటు వేయడం తగ్గలేదు.  

              ఇందుపై ఆమె తనకు కనబడిన వారందరికీ తన బాధలు చెప్పుకుని తరుణోపాయం చెప్పమని వేడుకునేది.  ఒకనాడు ఒక సన్యాసి వాళ్ళ ఊరుకు వచ్చాడు.  ఆ సాదువు త్రికాలజ్ఞానుదని విని అతనివద్దకు వెళ్ళిన తన ఇంటికి పాదపూజకు ఆహ్వానించింది.  అతిధి మర్యాదలు పాదపూజలు సమారాధన గడిచాక ఆమె తన బాధలను చెప్పి ఇందుకు గల కారణమేమై ఉంటుందని, ఇవి తొలగే మార్గామేమితని వినయపూర్వకముగా వేడుకున్నది.
             అందుకా సాదు పుంగవుడు  తీవ్రంగా ఆలోచించి ఇది నీకు సర్పదోశంవల్ల సంభవించినది.  ఏమిచేసినా నాగేంద్రుని అనుగ్రహం నీకు సిద్దించడం లేదంటే, దానికి గల కారణం నీ వ్యాధి, భయాందోళనలు తోలగాలన్నదే నీ లక్షంగానే సుస్థిర భక్తితో ఆరాధించి శ్రద్దని చూపనందువల్ల నీకీ దుస్థితి నిన్నింకా వేధిస్తుంది.   నీవు గత జన్మలో నాగపూజా చేసే వారిని ఆక్షేపణ చేయడం నీవు పూజలు చేయకపోగా చేసేవారిని చెడగొట్టడం, చులకన చేయడం నీవు చేసిన మహాపరాధం.  నాగేంద్రుడు దయామయుడు, తనను నమ్మినవారిని ఉద్దరించే కరుణా సముద్రుడు కనుక నీ విషయం పట్ల విశ్వాసముంచి నాగ పంచమి నోము నోచినట్లయితే నీ కలతలు తొలగుతాయి.  చెవి చక్కబడుతుందని చెప్పి  ఆ వ్రత విధానము దాని నియమాలను గురించి వివరించి వెళ్ళిపోయెను.  ఆ సాధువు ఉపదేశించిన వ్రత విధాన క్రమమున ఎంతో భక్తి శ్రద్దలతో నాగపంచమి నోము నోచి ఆ వ్రత ప్రబావం వల్ల తన భయాందోళన లు తొలగి సంతోషముగా వున్నది.  

ఉద్యాపన:  శ్రావణ మాసంలో శుక్ల పంచమినాడు చేయవలసిన నోము ఇది.  అభ్యంగన స్నానం చేసి మాదిగా శుచిగా ఏకాగ్రతతో ఉంది నాగేంద్రుడిని  ఆరాధించాలి.  నాగేంద్రుడి వెండి విగ్రహం చేయించి పాలు పానకం వడపప్పు నివేదించి తాంబూల పహ్ల పుష్పాదులు నారికేళం సమర్పించాలి.  నాడు ఉపవాసం వుండాలి.  నిరాహారం జాగరణ మరింత శ్రేయస్కరం.

కేదారేశ్వర (కార్తీక) నోము

పూర్వకాలంలో  ఒకానొక గ్రామంలో ఒక నిరుపేద కుటుంబం వుండేది.  ఆ పేద దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు వున్నారు.  వారి కుటుంబము జరుగుబాటు చాలా దుర్భరంగా ఉన్నందువల్ల పెద్ద వాళ్ళయిన కుమార్తేలిద్దరూ అడవికిపోయి కట్టెలు ఏరుకుని వచ్చి వాటిని గ్రామంలో అమ్మి కుటుంబ పోషణ కొనసాగిస్తున్దేవారు.  ఇలా కాలం గడుస్తుండగా ఒకనాడు వాళ్ళు పుల్లలు ఏరుకుని గ్రామానికి వస్తుండగా పోలిమేరలోని ఒక నీటిలో ఏదో పూజ చేసుకుంటుండడము  చూసి ప్రసాదము తెచ్చుకోవాలని అక్కడకు వెళ్ళారు.  పూజా క్రమం చూసి ముచ్చట పది ఆ అమ్మాయిలూ ఈ పూజగురించి చేసే విదాన్నాన్ని గురించి ఇంటి యజమానిని అడిగి తెలుసుకున్నారు.  ప్రసాదం తీసుకుని ఇంటికి వెడుతున్న వాళ్ళకు ఆ పూజ తాము కూడా చేసుకోవాలన్న ఆశ కలిగింది.  ఒక చెట్టు మొదట తమ గంపలు దింపి అక్కడ శుబ్రం చేసి మర్రి ఆకులు పళ్ళు ఊడలు, పత్రీ ప్రోగుచేసుకుని వచ్చి నువ్వే మాదేవుదవని అక్కడగల ఒక రాతిని ఆ చెట్టు మొదలులో పెట్టి పూజ చేసి స్వామి ఇవే తమల పాకులు ఆకులు చేక్కలనుకో అని మర్రి ఆకులు, పళ్ళు పెట్టారు.  ఇవే బూరేలనుకో అని మర్రి పళ్ళను నైవేద్యంగా పెట్టారు.  ఇవే తోరాలనుకో అని మర్రి ఊడలు స్వామీ ముందు పెట్టి భక్తి టో పూజ పూర్తి చేసారు అక్కాచెల్లెళ్లు.  ఇంటికి బయలు దేరుతూ వాళ్ళు తమతమ గంపలను నెత్తిన ఎట్టుకోబోగా వాటిల్లోని పుడకలన్ని బంగారపు పుడకలుగా మారి వున్నాయి.  వారు ఆయనత ఆనందంతో ఇంటికి వెళ్లి తల్లి తండ్రులకు జరిగిన సంగతంతా చెప్పి ఆ పుడకలను అమ్ముకుని శ్రీమంతులైనారు.  

               సిరిసంపదలు పెరిగిన ఆ సుందరాంగులను తూర్పునుండి ఒక మహారాజు వచ్చి పెద్దామేను, పడమరనుండి  ఒక మహారాజు వచ్చి చిన్నామేను పరిణయము చేసుకున్నారు.  వారి వారి రాజ్యాలకు వెళుతూ శ్రద్దా భక్తులతో ప్రతి ఏటా కార్తీక మాసంలో ఈ నోమును నోచుకున్తున్దవలసిందని చెప్పారు.  ఆ ప్రకారముగా చేస్తూ వాళ్ళు కాలం గడుపుతున్నారు.  కుమారుడు పెరిగి పెద్దవాడయ్యాడు. కార్తీక నోమును భారీగా చెయ్యాలని సంకల్పించుకున్నాది.  పాత తోరాలను తీసి పెరటిలో కాకరపాదు మీద వేశాడు.  బంగారపుతోరాలు చేయించాడు.  నవగాయ పిండివంటలతో గారెలు, బూరెలు క్షీరాన్నంతో భోజనాలు పెట్టాడు.  గ్రామస్తులంతా అతనిని ఎంతగానో ప్రశంసించారు.  కానీ కేదారేశ్వరిని కరుణ మందగించింది.  ఏడాదికేడాది వారి సిరి సంపదలు తొలగి పేదరికం దాపురించింది.  తినడానికి తిండిలేని దుస్తుతి కలిగింది.  ఏ పని చెయ్యాలన్న జరగక పోగా కష్టాలు కుగుతున్దేవి.  ఆ ఇల్లాలు తమ పెరటిలో విరగ కాసిన కాకర పాదును చూసి కొన్ని కాయలు కోసి కొడుకిచ్చి అంగడికి వెళ్లి చారెడు నూకలు పప్పు ఉప్పు తీసుకురమ్మని పంపించింది.  ఆవి తీసుకు వెళ్లి అతడు షావుకారు అంగడి ముందు నిలుచున్నాడు.  యెంత సేపటికి ఆ షావుకారు చూడలేదు.  తరువాత చూసి ఏమిటి తీసుకోచావని ప్రశ్నించాడు.  అయ్యా ఈ కాకరకాయలు తీసుకుని చారెడు బియ్యం ఇప్పించండి మీ పేరు చెప్పుకుని ఈ పూట కింత గంజితాగుటాము అన్నాడు.  అలానా మీకు దారపోయడానికి మాకేం మధ్యన్తరపు సిరికలుగలేదు.  వెళ్ళు వెళ్ళు అని కసురుకున్నాడు.  కాళ్ళా వెళ్ళా పది బ్రతిమిలాడినా యితడు  వదిలేల లేడు అని దోసెడు బియ్యం పప్పు ఉప్పు ఇప్పించి పంపించాడు.  ఆ పూటకు వాళ్ళు ఆకలు తీర్చుకుని మరునాడు మరికొన్ని కాయలు కోసి మరో అంగడికి వెళ్లి అమ్ముకుని రమ్మని పంపింది.  

             వాటిని పట్టుకుని అంగడి వీధికి వెడుతున్న బాలుడిని షావుకారు ఆపి ఏమి కావాలంటే అవి ఇస్తాను రోజు ఆ కాయలు నాకే ఇవ్వవలసినదిగా చెప్పి భారీగా సెచ్చాలు బియ్యం ఇచ్చాడు.  ఆ షావుకారు ఎందువల్ల అతనికింత దయకలిగిందంటే ముందు రోజున తను తీసుకున్న కాకరకాయలు కూర చేసే నిమిత్తము కొస్తే వాటిల్లో నుండి బంగారం ముద్దలుగా రాలి పడ్డాయి.  ఇవి ఇంకెవరికి దక్కకూడదని ఆ షావుకారు యెంత ఇవ్వడానికైనా సిద్దపడ్డాడు.  రోజు కుర్రవాడు దగ్గర కాకరకాయలు కొంతుండేవాడు.  కాకరకాయలు అయిపోయాయి.  ఆ షావుకారు చిల్లి గవ్వ కూడా ఇవ్వడం మాని వేశాడు.  

              ఇక గత్యంతరము లేక తల్లి తన కుమారుడిని ప్రయాణము చేసి తూర్పునగల పెద్ద అక్క దగ్గరకు పంపించింది.  కష్టసుఖాలు చెప్పి ఏమైనా సహాయాన్ని అడగమన్నది.  అతడు అక్క గారి ఇంటికి చేరుకొని నౌకర్లు లోపలకు పెల్లనివ్వకపోతే అక్కడే వుండగా తల ఆరబోసుకోవడానికి మెడ మీదకు వచ్చిన అక్కగారు తమ్ముడిని చూసి లోపలకు తీసుకు వెళ్ళింది.  అక్కగారికి ఇంటి పరిస్థితులన్నీ చెప్పాడు.  ఒక గుమ్మడికాయను దోలిపించి అందులో వరహాలు పోసి తమ్ముడికిచ్చి తిన్నగా వెళ్లి దానిని అమ్మకు ఇవ్వవలసినదిగా చెప్పి పంపింది.  తిరిగి వస్తూ అక్కగారిచ్చిన చద్ది తినాలని ఆ గుమ్మడికాయను నేలమీద పెట్టి చద్ది తింటున్నాడు.  అంతలో ఒక పెద్ద గద్ద వచ్చి దాని తన్నుకు పోయింది.  చేసేదేమిలేక ఉత్త చేతులతో ఇంటికి వెళ్ళలేక పడమట వున్న చిన్న అక్కగారి వద్దకు వెళ్ళాడు. నౌకరు వల్ల  అతని రాకను విని ఆమె బయటకొచ్చి తముడిని లోపలకు తీసుకు వెళ్ళింది కష్ట సుఖాలు అడిగి తెలుసుకున్నది.  ఒక చెప్పుల జతలో వరహాలు పెట్టి కుట్టించి దానిని ఎక్కడా విడవక తిన్నగా ఇంటికి వెళ్ళు అని చెప్పి పంపించింది.  ఆ అక్క ఏమి ఇవ్వలేదు.  ఈ అక్కా ఏమి ఇవ్వలేదు అని బాధపడుతూ ఇంటికి బయలు దేరాడు.  ఎండ తీవ్రతకు దాహం వేసి ముఖం కడుక్కుని కాసిన్ని మంచి నీళ్ళు త్రాగాలని నిర్ణయించుకున్నాడు.  అక్క గారు ఆ జోళ్ళను ఎక్కడా విడవ వద్దు అని చెప్పడం వల్ల చెప్పులతోనే చెరువులోనికి దిగాడు కాని ఆ బురదలో కూరుకుపోయి యెంత వెదికినా జోళ్ళు  దొరకలేదు.  

          ఈ సంగతంతా చెప్పి పెద్ద అక్కగారిని సాయం అడగాలని తిరిగి ఆమె వద్దకు వెళ్ళాడు.  అది కార్తీక మాసం ఆమె కార్తీక నోము నోచుకున్తున్నది.  ఆడంబరంగా నోము నోయడంవల్లనే తన పుట్టింటిన దారిద్రము తాన్దవిస్తుందని గ్రహించి తమ్ముడిచేత ఆ నోము నోయించి ఆడంబరము కాదు నాయనా ముఖ్యం అని చెప్పి ఇంటికి వెళ్లి కేదారనోమును నోయండి అని చెప్పి కొంత డబ్బిచ్చి పంపించింది.  అతడు ఇంటికి వస్తుండగా గుమ్మడికాయ పండు తను లోగడ విడిచిన చోట కనిపించింది.  చెరువు ఎండి చెప్పులు పైకి వచ్చాయి.  వాటిని తీసుకుని ఇంటికి వచ్చి విషయాలన్నీ వివరించి కేదార నోమును భక్తి ప్రపత్తులతో జరిపించాడు.  క్రమక్రమముగా సిరులు పుంజుకుని తిరిగి పూర్వ వైభావముతో జీవించారు.  

ఉద్యాపన:  ఇది కార్తీక మాసములో సోమవారాల్లో ముఖ్యముగా మూడవ సోమవారము, కార్తీక పౌర్ణమి రోజు కుటుంబ సామ్ప్రదాయమైతే ఆ రోజున చేయాలి.  ఉదయం నుండి ఉపవాసము ఉంది సాయంత్రము పరమేశ్వరుణ్ణి ఫల, పుష్ప పత్రితో పూజించాలి.  పాత తోరాలను కొత్తవాతితోపాటు స్వామీ సన్నిదానాపెట్టాలి  .    స్వామికి బూరెలు నైవేద్యం పెట్టాలి.  ఈ బూరేలను నోము నోచుకున్న కుటుంబీకులు మాత్రమె తినాలి.  పున్నమి చంద్రుడిని చూచి ఆహారం తీసుకోవాలి.  తోరాలు చేతికి కట్టుకుని కాసేపు ఉంచుకుని తీసి వాటిని మరుసటి సంవత్సరానికి భద్రపరచాలి.  ఈ నోమును కోడళ్ళకు కొడుకులకు ఉద్యాపన చెప్పి అప్పగించి వంశ పారంపర్యంగా చేసు కుండటం సాంప్రదాయం.

దంపతుల తాంబూల నోము

  పూర్వం గంగానదీ తీరమున విప్రవతి అనబడే బ్రాహ్మణ అగ్రహారం వుండేది.  ఆ గ్రామంలోని బ్రాహ్మణ కుటుంబాలలో గోపాల శర్మ అనబడే విప్రిత్తముని కుటుంబము పెద్ద కుటుంబము.  ఆయనకు ముగ్గురు కుమారులు పెద్ద వారిద్దరికీ వివాహాలు అయి చక్కగా జీవిస్తున్నారు.  మూడవవానికి కూడా వివాహం చేశాడు.  అదేమీ ప్రార్బ్ధమోగాని ఆ కోడలు కాపురానికి రాగానే అందరితోను చీటికి మాటికి గొడవలు జరుగుతుండేవి.  అయినవారు కానివారు ఆమె మీద నిందలు మోపి అనరాని మాటలతో దుర్భాశలాడుతుండేవారు.  వారందరితో ఎంతో మంచిగా మసలుకోవాలన్న ఆమెకు సాధ్యమయ్యేది  కాదు.  

           కాలం గడచి పోతున్నదేకాని పరిస్థితులలో ఎటువంటి మార్పు రాకపోగా నిందలు నిష్టూరాలు ఎక్కువై పోయాయి.  అందుకు తమవల్ల దోషమేమితో తెలియని ఆ చిన్న కోడలు వారందరి మధ్య మసలుకోలేక ఒకనాటి రాత్రి ఊరూ పోలిపెరలోని శివాలయానికి వెళ్లి గోడుగోడున విలపించాసాగింది.  తనతప్పేమిటి ఈ ముప్పు తీరాలంటే ఏమి చెయ్యాలి, చావే నాకు శరణ్యమా!  అని అమాయకంగా ప్రశ్నించింది.  ఆమె ఆవేదనకు జాలిపడ్డ శివుడు సాక్షాత్కరించి బిడ్డా నీ వలన దోషమేమిలేదు.  నేవెంత సౌమ్యంగా వినయవిధేయతలతో మసలుకున్నా చులకనగా హేళనగా నీ జీవితమూ సాగుతుంది.  ఇందుకు గల కారణము గత జన్మలో దంపతతాంబూలాల నోము నోచి మధ్యలో ఆపివేశావు.  ఆ కారణం చేత స్త్రీలకు పురుషులకు నీపట్ల ద్వేశాభావాలు కలుగుతున్నది.  ఇది తోలగాలంటే నీవు నీ ఇంటికి పోయి దంపతతాంబూలాల నోము నోచుకో ఈ నోముకారనముగా నీ చుట్తో గల ఇరుగు పొరుగు వారు నీ ఇంటివారు మేట్టినిన్తివారు నీమీద ప్రేమానురాగాలు కలిగి నిన్ను ఆదరిస్తారు.  అని ప్రభోదించాడు.  

              ఆమె ఆ ప్రకారం ఇంటికి వెళ్లి దంపతతాంబూలాల నోము నోచుకోని అయినవారందరిలో గౌరవమర్యాదలు మన్ననలతో హాయిగా జీవిస్తారు. 
ఉద్యాపన:  పార్వతీ పరమేశ్వరులకు పీటం ఏర్పాటు చేసి శతనామావలితో ఆ ఆదిదంపతులను ఆరాధించాలి.  గుణవంతులైన దంపతులను ఆహ్వానించి వాళ్లకు తలంటి నీళ్ళు పోసి నూతన వస్త్రాలు కట్టబెట్టి పంచ భక్ష్య పరమాన్నాలతో భోజనాలు ఆరగిమ్పజేసి దక్షిణ తాంబూలాలతో గౌరవించి వారికి పాదాభివందనం చేసి వాళ్ళ ఆశీస్సులు తీసుకోవాలి.  ఇలా పదిహేను వారాలు చేసి ఆఖరున అన్న సంతర్పణ చేయాలి.  ఇలా చేయడము వలన సాతివారిలో తోటివారిలో మేటిగా గుర్తిమ్పబడి గౌరవ మర్యాదలు గల జీవితాన్ని గడపగలుగుతారు. 

శివరాత్రి నోము

పూర్వకాలములో ఒకానొక దేశంలో ఒక బ్రాహ్మణ పండితుడు ఉండేవాడు.  అతడెంతటి విద్యాసంపంనుదో అంతటి దారిద్రము అతడిని వేదిస్తుండేది.  యెంత ప్రయత్నించినా చేతికి చిల్లి గవ్వైనా లభించేదికాడు.  ఇందుకు జతగా అతడి ఆరోగ్యం కూడా అంతంతమాత్రంగా వుండేది.  ఈ దుర్భర పరిస్తులతో మరొకర్ని యాతన పెట్టడం ఇష్టం లేక దేనికని వివాహం చేసుకోలేదు.  నా అన్నవారెవరూ లేక సేవలు చేసే ఇల్లాలు లేక అతడు ఎంతగానో బాధపడుతుండేవాడు.  క్రమక్రమంగా అతడికి జీవితం మీద విరక్తి కలిగింది.  ప్రాణాలు తీసుకోవడా శాస్త్రసమ్మతం కాదని నారు పోసినవాడు నీరు పొయ్యక పోతాడా అని కాలాన్ని గడుపుతుండేవాడు.  క్రమక్రమంగా ఓర్పు నశించింది.  ఇంకా ప్రాణ త్యాగం ఒక్కటే తనకు తప్పనిసరి మార్గమని నిర్ణయించుకున్నాడు.  నీటిలో పడాలి, అగ్నికి ఆహుతికావాలి. కత్తి కటార్లతో పొడుచుకోవాలి, విషాన్ని తినాలి అని పలు విధాలుగా ఆలోచిస్తూ క్రమంగా నిద్రలోకి ఒదిగిపోయాడు.  నిద్రలో అతనికి పరమేశ్వరి సాక్షాత్కరించి ఓయీ! ప్రాణం తీసుకోవాలని దేనికి ప్రాకులాదేడవు.  సదాశివుడు కన్నా దయామయుడు లేదు ఆ శంకురుని కరుణా కటాక్షములను పొంది తరించు అని చెప్పింది.  మేల్కొన్న విప్రుడు ఒక పండితోత్తముని దగ్గరకు వెళ్లి తన బాధలను తనకు వచ్చిన కళను చెప్పి శివ కరుణ కొరకు తానేమి చెయ్యాలి అని ప్రశ్నించాడు.  విప్రోత్తమా పార్వతి పరమేశ్వరులు  జననీ జనకులు  కదా జగదాంబ నిన్ను కరుణించి ఈశ్వర కటాక్షం పొందమని ప్రభోదించింది.  ధన్యుడవు శివునకు ప్రీతియైన రోజు శివరాత్రి ప్రతిమాసంలో ఆఖరి మూడవరోజు శివరాత్రౌతుంది.  ఆనాడు నీవు నదీ స్నానం చేసి ఉపవాసముండి ఆరాత్రంతా శివనామార్చనతో జాగారం గడిపి ప్రత్యూష కాలంలో శివలింగాన్ని పూజించి ఇలా మహా శివరాత్రి వరకు గడువు ఆనాడు కలిగిని మేరకు ఎవరికైన ఒకరికి ఒక ఫలమో తృణమో ఇచ్చి నమస్కరించి వారి ఆశీస్సులు పొందు నీ బాధలు తీరుతాయి.  దారిద్యము తొలగిపోతుంది .    ఆరోగ్య వంతుడవు అవుతావు అని చెప్పగా ఆ ప్రకారంగా భక్తి శ్రద్దలతో శివరాత్రి నోము నోచుకుని అతడు జీవితాంతం సుఖముగా వున్నాడు. 
ఉద్యాపన:  ప్రతి మాసశివరాత్రి నాడు శివలింగార్చనతో నిరాహారము జాగారము చేయాలి.  ఇలా సంవత్సరకాలం ప్రతి మాసశివరాత్రి నాడు చేసి ఆ మరునాడు ఒక నిరుపేదకు కలిగిన మేరకు దానం చెయ్యాలి.  మహా శివరాత్రి పర్వదినాన క్షణమైనా వ్యర్ధం చెయ్యక శివాక్షరిని జపించాలి.  శివునకు అర్చన చెయ్యాలి.  ఆనాడు శక్తి కలిగిన మేరకు అన్నదానం ఆర్ధిక సహాయము నిరుపేదలకు అందించి వారి ఆశీస్సులు పొందాలి.  

తులసినోము

పూర్వకాలంలోసకలపూజలు.కాం భారతదేశమున గల విన్ద్యపర్వతాలకు దిగువ కాన్చానపురం అనే దేశం వుండేది.  దానిని ధర్మ శీలుడనే రాజు పరిపాలిస్తుండేవాడు.  ఆయనకు లేక లేక ఒక్కగానొక్క కూతురు. ఆమెకు వివాహము జరిగితే నెల తిరక్కునడగానే   వైధవ్యం కలుగుతుందని ఆమె జాతకాన్ని పరిశీలించిన దైవజ్ఞులు చెప్పారు.  అందువల్ల ధర్మశీలుడు తన కుమార్తెకు, వివాహం చేసే ప్రయత్నమూ విరమించుకున్నాడు.  ఇలా కొంతకాలం గడుస్తుండగా రాజుగారి ఆస్థాన విద్వాంసుడైన మహీశ్వర బట్టునకు తండ్రికి తగ్గ తనయుడు అనదగిన కుమారుడున్దేవాడు.  అతడు రాజకుమార్తె అందచందాలు గుణగణాలు విని ఆమెను వివాహం చేసుకోవలెనని నిర్ణయించుకున్నాడుసకలపూజలు.కాం .  
            ఒకానొక శుభ దినమునా బ్రాహ్మణ యువకుడు రాజు దర్శనం చేసుకున్నాడు.  మహారాజు ఆ యువకుడికి తగిన మర్యాదలు చేసి తన దర్శనానికి వచ్చిన కారణం ఏమిటని ప్రశ్నించినాడు.  మహారాజా!  మీరు అనుగ్రహిస్తానంటే నాదొక కోరిక సమస్త శాస్త్రాలు చదువుకున్న వాణ్ని విద్యలన్నింటిని ఆరితెరిడిన వాడిని మీరు సరేనంటే మీ కుమార్తెను వివాహము చేసుకోవాలనుకుంటున్నాను.  మీసకలపూజలు.కాం  అనుమతికై వచ్చాను అన్నాడు.  ఆ మాటలకు మహారాజు ముఖం వెలవెల బోయింది.  విప్రకుమారా!  ఆమెకు వైధవ్యం ఉన్నందువల్లనే తెలిసి తెలిసి ఒక యువకుడిని అర్దాయుష్కుడిని చేసే కన్యాదానానికి వెరచి ఊరుకున్నాను.  నీవు వివాహం చేసుకుంటా నన్నావు  .   నా కుమార్తెకు నీకనా రూప గుణ సంపన్నుడు దొరకడం దుర్లభం కాని నిన్ను అర్దాయుష్కుడిని చేసి బ్రాహ్మణ హత్యా దోషమును పొందలేను నన్ను మన్నించు అన్నాడు.  

          అందుకా బ్రాహ్మణ బాలుడు మహారాజ మీ కాభయం సందేహం అక్కరలేదు.  నేను పూర్నాయుష్కుడిని అని జ్యోతిష్కులుసకలపూజలు.కాం  ఎంతోమంది చెప్పియున్నారు.  అయినా ఇందుకు నాకు తెలిసిన మేర ఒక ఉపాయము చెబుతాను.  ఒక నెలరోజులపాటు నన్ను అనుమతిన్తించండి. హిమాలయ పర్వతాలలో ఋషులను దర్శనము చేసుకొని వారి ఆశీర్వాదము పొంది వస్తాను.  ఈ లోగా మీ అమ్మాయి చేత తులసినోము నోచుకునేలా తగిన ఏర్పాట్లు చేయండి.  అక్షయ సౌభాగ్యాలను అనుగ్రహించే చల్లని తల్లి శ్రీ తులసి స్త్రీల పాలిత కల్పవల్లి అందువల్ల మీ అమ్మాయికి సుమంగళి జీవితమూ లభిస్తుంది.  పూర్వం దేవతలు తమకు కలుగుతున్న అపజయాన నివారణకు శ్రీ తులసిని ఆరాధించారు.  ఆ మాటలకు ఆ రాజు ముగ్ధుడై బ్రాహ్మణ కుమారా నీమాటలు న మదికేక్కాయి.  నా కుమార్తె చేత తులసి వ్రతం చేయిస్తాను నువ్వు ఋషిపుంగవుల  దీవెనలను పొంది సంవత్సరాన్తమునాటికి రావల్స్సిందని చెప్పాడు.  అంతట ఆ బ్రాహ్మణ యువకుడు తుఅలై వ్రత విధి విధానములను వ్రత నియమములను వివరించి వెళ్ళిపోయాడు.   రాకుమార్తె తులసి వ్రతం సమాప్తి కావడంతో బ్రాహ్మణ యువకుడు రాజ్యానికి వచ్చి ఆమెతో వివాహితుడై కాంచన పురాన్ని చిరకాలం పరిపాలించాడు.  

ఉద్యాపన:  కార్తీక మాసం ఈ వ్రతానికి తగిన కాలం.  శ్రీమన్నారాయణుని
సకలపూజలు.కాం విగ్రహాన్ని తులసి మొక్క వద్ద వుంచి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు పంచామృత స్నానం చేయించి ఆవాహనం చేయాలి.  ముత్తైదువులకు యధోచితంగా పసుపు కుంకుమ గాజులు దానమివ్వాలి.  పుష్ప ఫలాడులతో వారిని సత్కరించాలి. 

రథసప్తమి నోము

   పూర్వకాలంలో ఒకానొక మహారాజుకు లేక లేక ఒక కూతురు జన్మించింది.  ఆమెను అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు.  కాని ఆమె పుట్టుక కారణంగా రాజ్యంలో కొన్ని కలతలు ఏర్పడుతున్దేవి.  మహారాజు ఏ పని తలపెట్టినా జరిగేదికాడు.  ఇందుకు విఙులను పిలిచి శాంతి చేయించాలని నిర్ణయించారు.  రాజ్యంలోగల ప్రజ్ఞావంతులు అయిన విప్రులను పిలిపించి అన్ని విషయాలను వివరించాడు.  ఈ దుస్థితి తొలగే మార్గం ఏదైనా చెప్పమని అడిగాడు.  ఆ విప్రోత్తములందరూ ఒకటై ఆలోచించారు.  

           రాజా ఈమె గత జన్మలో వితంతువు అంతకు ముందు జన్మలో రధకారుని భార్య రధకారుడు చేసే ప్రతి పనిని విమర్శించి అతని పనులకు అడ్డుతగులుతుండేది.  అందువల్ల పై జన్మలో విధవరాలైంది.  తన కుటుంబ పోషణ భారం ఆమెదేకావడం వల్ల తప్పనిసరై వ్యభిచారం చేసి సంసారం సాగించింది.  వ్యభిచారం కారణంగా అనేక దుష్కృత్యాల పాలైంది.  ఆమె రథసప్తమి నోమును నోస్తే తమకు ఈ గండాలుండవు.  ఆమెకు  గల గతజన్మ పాతకాన్ని రూపు మాసి పోతాయి అని చెప్పారు.  

           వేద జ్ఞానుల భూతభవిష్యత్ వర్తమానాలు తెలిసిన వేత్తలు నాకు నారాజ్యానికి గల సిరిసంపదలు మీరే, కనుక నాయందు నా పుత్రిక యందు పరిపూర్ణ ప్రేమాభిమానాలు కలుగచేసి నన్ను నా రాజ్యాన్ని కాపాదేతందుకు మీరందరూ రథసప్తమి నోమును నాకుమార్తేచేతనో యుంచండి వ్యయభారాలకు వేరవకండి అన్నాడు రాజు.  అందుకు వారందరూ ప్రభువు ఆజ్ఞ ప్రకారము రాజకుమార్తె చేత రథసప్తమి నోమును నోయించారు.  అరిష్టాలను తొలగిపోయాయి.  సుఖ శాంతులతో జీవితాన్ని గడిపారు.  

ఉద్యాపన:  సూర్యభగవానుడు మన కర్మలకు సాక్షి ప్రతి రోజు సూర్యోదయ  కాలములో ఆ మహానీయునకు నమస్కరించుకుని మనం మన నిత్య కార్య క్రమాలకు పూజుకోవారి.  

శతగాయత్రి-మంత్రావళి


 శతగాయత్రి-మంత్రావళి


                         -: బ్రహ్మ గాయత్రి :- 

1. వేదాత్మనాయ విద్మహే హిరణ్య గర్భాయ ధీమహి తన్నో బ్రహ్మః ప్రచోదయాత్.//

2. తత్పురుషాయ విద్మహే చతుర్ముఖాయ ధీమహి తన్నో బ్రహ్మః ప్రచోదయాత్.//

3. సురారాధ్యాయ విద్మహే వేదాత్మనాయ ధీమహి తన్నో బ్రహ్మః ప్రచోదయాత్. // 
  
                        -: విష్ణు గాయత్రి :-  

4. నారాయణాయ  విద్మహే వాసుదేవాయ  ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్  //  

5. లక్ష్మీనాధాయ   విద్మహే చక్రధరాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్//
 
6. దామోదరాయ   విద్మహే చతుర్భుజాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్ //
      
                                                       -: శివ గాయత్రి :-
  
7. శివోత్తమాయ విద్మహే మహోత్తమాయ ధీమహి తన్నశ్శివః ప్రచోదయాత్ //  

8. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నోరుద్రః ప్రచోదయాత్.//

9.  సదాశివాయ  విద్మహే జటాధరాయ ధీమహి తన్నోరుద్రః  ప్రచోదయాత్//

10. పంచవక్త్రాయ  విద్మహే అతిశుద్ధాయ ధీమహి తన్నో రుద్రః  ప్రచోదయాత్ //
 
11. గౌరీనాధాయ  విద్మహే సదాశివాయ ధీమహి తన్నశ్శివః   ప్రచోదయాత్ //

12. తన్మహేశాయ విద్మహే వాగ్విశుద్ధాయ ధీమహి తన్నశ్శివః ప్రచోదయాత్ // 

                              -: వృషభ గాయత్రి :-      

13. తత్పురుషాయ విద్మహే చక్రతుండాయ ధీమహి తన్నో నందిః ప్రచోదయాత్.//
 
14. తీష్ణశృంగా విద్మహే వేదపాదాయ ధీమహి తన్నో నందిః  ప్రచోదయాత్.//
     
                      -: చండీశ్వర గాయత్రి :-   

15. ద్వారస్థితాయ విద్మహే శివభక్తాయ ధీమహి తన్నశ్చండః ప్రచోదయాత్.//

16. చండీశ్వరాయ విద్మహే శివభక్తాయ ధీమహి తన్నశ్చండః ప్రచోదయాత్.//  
                                                                       

                     -: భృంగేశ్వర గాయత్రి :-   

17. భృంగేశ్వరాయ విద్మహే శుష్కదేహాయ ధీమహి తన్నోభృంగి ప్రచోదయాత్.//
                               
                             -: వీరభద్ర గాయత్రి :- 

18. కాలవర్ణాయ విద్మహే మహాకోపాయ ధీమహి తన్నోభద్రః ప్రచోదయాత్.// 

19. చండకోపాయ  విద్మహే వీరభద్రాయ ధీమహి తన్నోభద్రః ప్రచోదయాత్.//

20. ఈశపుత్రాయ విద్మహే మహాతపాయ ధీమహి తన్నోభద్రః ప్రచోదయాత్.//                                                

                          -:  శిఖరగాయత్రి :- 
   
21. శీర్ష్యరూపాయ విద్మహే శిఖరేశాయ  ధీమహి తన్న స్థూపః   ప్రచోదయాత్.//

                           -: ధ్వజగాయత్రి :- 
 
22. ప్రాణరూపాయ విద్మహే త్రిమేఖలాయ    ధీమహి తన్నోధ్వజః ప్రచోదయాత్.//  
                       
                           -: దత్త గాయత్రి :-    
23. దిగంబరాయ విద్మహే అవధూతాయ   ధీమహి తన్నో దత్తః ప్రచోదయాత్.//                                                                                                                                                                                      
                  -: శాస్త [అయ్యప్ప] గాయత్రి :- 

 24.భూతనాధాయ   విద్మహే మహాదేవాయ   ధీమహి తన్నశ్శాస్తా ప్రచోదయాత్.//      
 
                        -: సుదర్శన గాయత్రి :- 
   
25. సుదర్శనాయ   విద్మహే జ్వాలాచక్రాయ   ధీమహి తన్నశ్చక్రఃప్రచోదయాత్.//                        


26. సుదర్శనాయ   విద్మహే యతిరాజాయ   ధీమహి తన్నశ్చక్రఃప్రచోదయాత్.//                                             
      

                       -: మత్స్య గాయత్రి :-

27. జలచరాయ    విద్మహే మహామీనాయ   ధీమహి తన్నోమత్స్యః     ప్రచోదయాత్.//                  

                         -: కూర్మ గాయత్రి :-

28. కచ్చపేశాయ    విద్మహే మహాబలాయ   ధీమహి తన్నోకూర్మ:      ప్రచోదయాత్.//    

                   -: వాస్తుపురుష  గాయత్రి :-

29. వాస్తునాధాయ    విద్మహే చతుర్బుజాయ   ధీమహి తన్నో వాస్తుః     ప్రచోదయాత్.//  


                     -: శ్రీ గణపతి  గాయత్రి :-

30. తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ   ధీమహి తన్నో విఘ్నః    ప్రచోదయాత్.//  
31. ఆఖుధ్వజాయ విద్మహే వక్రతుండాయ  ధీమహి తన్నో విఘ్నః    ప్రచోదయాత్.//

                      -: శ్రీ కృష్ణ గాయత్రి :-

32. దామోదరాయ విద్మహే వాసుదేవాయ  ధీమహి తన్నో కృష్ణః  ప్రచోదయాత్.//


33. గోపాలకాయ విద్మహే గోపీ ప్రియాయ  ధీమహి తన్నో కృష్ణః  ప్రచోదయాత్.//


34. వాసుదేవాయ విద్మహే రాధాప్రియాయ  ధీమహి తన్నో కృష్ణః  ప్రచోదయాత్.//

                         -: శ్రీ రామ గాయత్రి :-

35. దాశరధాయ విద్మహే సీతావల్లభాయ  ధీమహి తన్నో రామః ప్రచోదయాత్.//


36. ధర్మ రూపాయ విద్మహే  సత్యవ్రతాయ  ధీమహి తన్నో రామః ప్రచోదయాత్.//

                   -: శ్రీ ఆంజనేయ గాయత్రి :-


37. ఆంజనేయాయ విద్మహే  మహాబలాయ  ధీమహి తన్నో  కపిః  ప్రచోదయాత్.//


38. పవనాత్మజాయ విద్మహే  రామభక్తాయ  ధీమహి తన్నో  కపిః  ప్రచోదయాత్.//

                  -: శ్రీ హయగ్రీవ గాయత్రి :-


39. వాగీశ్వరాయ విద్మహే  హయగ్రీవాయ  ధీమహి తన్నో హగ్ం సహః ప్రచోదయాత్.//


                   -: శ్రీ స్కంద గాయత్రి :-

40. తత్పురుషాయ విద్మహే  మహాసేనాయ  ధీమహి తన్నో స్కందః  ప్రచోదయాత్.//

41. తత్పురుషాయ విద్మహే  శిఖిధ్వజాయ  ధీమహి తన్నో స్కందః  ప్రచోదయాత్.//


42. షడాననాయ విద్మహే శక్తిహస్తాయ ధీమహి తన్నో స్కందః  ప్రచోదయాత్.//

                 -: శ్రీ సుబ్రహ్మణ్య గాయత్రి :-

43. భుజగేశాయ విద్మహే ఉరగేశాయ ధీమహి తన్నో నాగః  ప్రచోదయాత్.//


44. కార్తికేయాయ విద్మహే వల్లీనాధాయ ధీమహి తన్నో నాగః ప్రచోదయాత్.//

                     -: శ్రీ గరుడ గాయత్రి :-

45. తత్పురుషాయ విద్మహే  సువర్ణపక్షాయ  ధీమహి తన్నో గరుడః ప్రచోదయాత్.//


                      -: శ్రీ అనంత గాయత్రి :-

46.  అనంతేశాయ విద్మహే మహాభోగాయ  ధీమహి తన్నో  నంతః ప్రచోదయాత్.//

             -: శ్రీ ఇంద్రాద్యష్టదిక్పాలక గాయత్రి :-

47.   దేవరాజాయ విద్మహే వజ్రహస్తాయ ధీమహి తన్నో   ఇంద్రః    ప్రచోదయాత్.//

48. వైశ్వానరాయ విద్మహే లాలీలాయ ధీమహి తన్నో   అగ్నిః   ప్రచోదయాత్.//

49. కాలరూపాయ విద్మహే దండధరాయ ధీమహి తన్నో   యమః ప్రచోదయాత్.//

50. ఖడ్గాయుధాయ విద్మహే కోణ స్థితాయ ధీమహి తన్నో   నిఋతిః ప్రచోదయాత్.//


51. జలాధిపాయ  విద్మహే తీర్థరాజాయ ధీమహి తన్నో  పాశిన్  ప్రచోదయాత్.//

52. ధ్వజహస్తయ విద్మహే ప్రాణాధిపాయ   ధీమహి తన్నో  వాయుః ప్రచోదయాత్.//

53. శంఖ హస్తయ విద్మహే  నిధీశ్వరాయ  ధీమహి తన్నో  సోమః ప్రచోదయాత్.//


54. శూలహస్తయ విద్మహే  మహాదేవాయ  ధీమహి తన్నో  ఈశః  ప్రచోదయాత్.//


               -: శ్రీ ఆదిత్యాది నవగ్రహ గాయత్రి :-


55. భాస్కరాయ  విద్మహే  మహా ద్యుతికరాయ  ధీమహి తన్నో  ఆదిత్యః  ప్రచోదయాత్.//

56. అమృతేశాయ విద్మహే  రాత్రించరాయ  ధీమహి తన్న శ్చంద్రః  ప్రచోదయాత్.//

57. అంగారకాయ  విద్మహే  శక్తి హస్తాయ  ధీమహి తన్నో  కుజః  ప్రచోదయాత్.//

58. చంద్రసుతాయ విద్మహే  సౌమ్యగ్రహాయ  ధీమహి తన్నో బుధః  ప్రచోదయాత్.//

59. సురాచార్యాయ విద్మహే  దేవ పూజ్యాయ  ధీమహి తన్నో గురుః  ప్రచోదయాత్.//

60.  భార్గవాయ విద్మహే  దైత్యాచార్యాయ  ధీమహి తన్నో శుక్రః  ప్రచోదయాత్.//

61.  రవిసుతాయ  విద్మహే  మందగ్రహాయ  ధీమహి తన్నో శనిః  ప్రచోదయాత్.//

62. శీర్ష్యరూపాయ విద్మహే  వక్రఃపంథాయ  ధీమహి తన్నో రాహుః ప్రచోదయాత్.//

63. తమోగ్రహాయ విద్మహే  ధ్వజస్థితాయ ధీమహి తన్నో కేతుః  ప్రచోదయాత్.//

                   -: శ్రీ సాయినాథ  గాయత్రి :-

64. జ్ఞాన రూపాయ విద్మహే  అవధూతాయ  ధీమహి తన్నస్సాయీ ప్రచోదయాత్.//

                    -: శ్రీ వేంకటేశ్వర  గాయత్రి :-

65. శ్రీ నిలయాయ  విద్మహే  వేంకటేశాయ  ధీమహి తన్నోహరిః  ప్రచోదయాత్.//

                   -: శ్రీ నృసింహ   గాయత్రి :-

66. వజ్రనఖాయ  విద్మహే  తీష్ణదగ్ ష్ట్రాయ  ధీమహి తన్ః సింహః    ప్రచోదయాత్.//

                     -: శ్రీ లక్ష్మణ  గాయత్రి :-

67. రామానుజాయ  విద్మహే  దాశరధాయ   ధీమహి తన్ః శేషః   ప్రచోదయాత్.//

                    -: శ్రీ క్షేత్రపాల  గాయత్రి :-

68. క్షేత్రపాలాయ విద్మహే క్షేత్రస్థితాయ    ధీమహి తన్క్షేత్రః ప్రచోదయాత్.//

                       -: యంత్ర  గాయత్రి :-

69. యంత్రరాజాయ  విద్మహే మహాయంత్రాయ  ధీమహి తన్నోః యంత్రః ప్రచోదయాత్.//

                        -: మంత్ర  గాయత్రి :-

70. మంత్రరాజాయ  విద్మహే మహా మంత్రాయ  ధీమహి తన్నోః  మంత్రః ప్రచోదయాత్.//


                    -: శ్రీ సరస్వతీ  గాయత్రి :-

71. వాగ్దేవ్యైచ  విద్మహే  బ్రహ్మపత్న్యై చ  ధీమహి తన్నోవాణీః ప్రచోదయాత్.//



                       -: శ్రీ లక్ష్మీ  గాయత్రి :-

72. మహాదేవ్యైచ విద్మహే  విష్ణుపత్న్యై చ  ధీమహి తన్నో లక్ష్మీః    ప్రచోదయాత్.//


73. అమృతవాసిని  విద్మహే  పద్మలోచని  ధీమహి తన్నో లక్ష్మీః    ప్రచోదయాత్.//


                     -: శ్రీ గౌరి  గాయత్రి :-
74. గణాంబికాయ   విద్మహే  మహాతపాయ  ధీమహి తన్నో గౌరీః ప్రచోదయాత్.//

75. మహా దేవ్యైచ   విద్మహే   రుద్ర పత్న్యై చ  ధీమహి తన్నో గౌరీః ప్రచోదయాత్.//

                     -: శ్యామలా  గాయత్రి :-

76. శుకప్రియాయ    విద్మహే  క్లీం కామేశ్వరి   ధీమహి తన్ః  శ్యామలా ప్రచోదయాత్.//

77.  మాతంగేశ్వరి    విద్మహే  కామేశ్వరీచ   ధీమహి తన్ః  క్లిన్నే ప్రచోదయాత్.//


                        -: భైరవ  గాయత్రి :-

78. త్రిపురాదేవి   విద్మహే  కామేశ్వరీచ   ధీమహి  తన్నో   భైరవీ ప్రచోదయాత్.//

                         -: శక్తి  గాయత్రి :-

79.  త్రిపురాదేవి   విద్మహే  సౌః శక్తీశ్వరి  ధీమహి  తన్ః  శక్తిః    ప్రచోదయాత్.//

              -: శ్రీ కన్యకాపరమేశ్వరీ గాయత్రి :-

80.  బాలారూపిణి   విద్మహే పరమేశ్వరి ధీమహి  తన్ః  కన్యా   ప్రచోదయాత్.//

81.  త్రిపురాదేవి   విద్మహే  కన్యారూపిణి  ధీమహి  తన్ః   కన్యా   ప్రచోదయాత్.//

                      -: శ్రీ బాలా గాయత్రి :-

82.  త్రిపురాదేవి   విద్మహే కామేశ్వరిచ   ధీమహి  తన్నో   బాలా ప్రచోదయాత్.//

                      -: శ్రీ సీతా గాయత్రి :-

83.  మహాదేవ్యైచ  విద్మహే  రామపత్న్యై చ ధీమహి  తన్నః సీతా ప్రచోదయాత్.//


                    -: శ్రీ దుర్గా గాయత్రి :-


84.  కాత్యాయనాయ  విద్మహే కన్యకుమారి  ధీమహి   తన్నో  దుర్గిః ప్రచోదయాత్.//

                 -: శ్రీ శూలినీ దుర్గా గాయత్రి  :-

85. జ్వాలామాలిని  విద్మహే మహాశూలిని   ధీమహి   తన్నో  దుర్గా ప్రచోదయాత్.//

                      -: శ్రీ ధరా  గాయత్రి :-

86. ధనుర్దరాయ   విద్మహే సర్వసిద్దించ   ధీమహి   తన్నో  ధరా ప్రచోదయాత్.//

                        -: శ్రీ హంస  గాయత్రి :-

87. హంసహంసాయ   విద్మహే పరమహంసాయ   ధీమహి   తన్నో  హంసః  ప్రచోదయాత్.//

                    -: శ్రీ ముక్తీశ్వరీ  గాయత్రి :-

88. త్రిపురాదేవి   విద్మహే ముక్తీశ్వరీ   ధీమహి  తన్నో   ముక్తిః ప్రచోదయాత్.//


                   -: శ్రీ గంగా దేవీ  గాయత్రి :-

89. త్రిపధగామినీ   విద్మహే  రుద్రపత్న్యై చ   ధీమహి  తన్నో   గంగా ప్రచోదయాత్.//


90. రుద్రపత్న్యై చ   విద్మహే సాగరగామిని   ధీమహి  తన్నో   గంగా ప్రచోదయాత్.//

                    -: శ్రీ యమునా  గాయత్రి :-

91. యమునా దేవ్యైచ   విద్మహే తీర్థవాసిని   ధీమహి  తన్నో   యమునా ప్రచోదయాత్.//

                                           -:  శ్రీ  వారాహీ  గాయత్రి :-


92. వరాహముఖి  విద్మహే ఆంత్రాసనిచ  ధీమహి  తన్నో   వారాహీ ప్రచోదయాత్.//

                                         -:  శ్రీ  చాముండా  గాయత్రి :-


93. చాముండేశ్వరి   విద్మహే చక్రధారిణి  ధీమహి  తన్నః చాముండా    ప్రచోదయాత్.//

                                           -:  శ్రీ   వైష్ణవీ  గాయత్రి :-


94. చక్రధారిణి   విద్మహే వైష్ణవీ దేవి  ధీమహి  తన్నః శక్తిః   ప్రచోదయాత్.//


                                    -:  శ్రీ    నారసింహ   గాయత్రి :-
 
95. కరాళిణిచ   విద్మహే నారసింహ్యైచ  ధీమహి  తన్నః సింహేః   ప్రచోదయాత్.//


                                             -:  శ్రీ    బగాళా గాయత్రి :-

96.  మహాదేవ్యైచ  విద్మహే  బగళాముఖి  ధీమహి   తన్నో అస్త్రః    ప్రచోదయాత్.//

                                         -:    శ్రీ    సాంబ సదాశివ గాయత్రి :-

97.  సదాశివాయ  విద్మహే సమాస్రాక్షాయ  ధీమహి    తన్నః సాంబః    ప్రచోదయాత్.//


                                                -:    శ్రీ    సంతోషీ  గాయత్రి :-

98.  రూపాదేవీచ   విద్మహే శక్తిరూపిణి   ధీమహి    తన్స్తోషి    ప్రచోదయాత్.//

                                          -:  శ్రీ    లక్ష్మీ గణపతి  గాయత్రి :-

99.  తత్పురుషాయ విద్మహే  శక్తియుతాయ  ధీమహి తన్నో దన్తిః ప్రచోదయాత్.//

100.  దశభుజాయ   విద్మహే  వల్లభేశాయ  ధీమహి తన్నో దన్తిః ప్రచోదయాత్.//

                                          సర్వే జనాః  స్సుఖినోభవంతు.