హోమాగ్ని నుండి పుట్టిన భ
ుంకరమైన జంతువు అదృశ్యం కాగానే కాలుడు
విఘ్నా సురరూపం దాల్చి కాలపాశాన్ని విసిరాడు. కాలపాశం గిరగిరా తిరుగుతూ
ప్రళ
ుంగా అంతా చుట్టబెట్టింది. అభినందనుడు పరాక్ర మించి దాన్ని
ఛేదించడానికి
ుత్నించి నేల కొరిగాడు. కాలపాశం మరింత విజృంభించి జీవకోటిని
అంతమొందిస్తూంటే వశిష్ఠుడు మొదలైన సప్తమహర్షులు, ఋషులు, లోకకళ్యాణం
కోరేవారంతా కలిసి బ్రహ్మను ప్రార్థించారు.
బ్రహ్మ, ‘‘కాలపాశాన్ని తప్పించడం ఎవరి తరమూ కాదు. కాలప్రభావాన్ని
అరికట్టి - కాలుణ్ణి నిగ్రహించగలవాడు గణేశుడొక్కడే!'' అని చెప్పి వారందరితో
కలిసి గణేశ్వరుడిని ప్రార్థించాడు. మహాగణాధిపతి స్వస్తికాపీఠంపై ఆశీనుడై
సాక్షాత్కరించాడు. తన చేతనున్న పాశాన్ని వదిలాడు. గణేశుడి పాశం క్షణంలో
కాలపాశాన్ని ఉచ్చు పన్ని పట్టినట్లు గణాధిపతి ముందు కట్టి పడేసింది.
కాలుడు పరాభవంతో మండిపడుతూ మరింత భీకరజుగుప్సాకరంగా విఘ్నాసుర రూపం
చూపుతూ కాలదండాన్ని ఎత్తి ఝళి పించాడు. గణేశుడు అంకుశాన్ని వదిలాడు. అంకుశం
విఘ్నాసురుడి వెన్నెముకలో గుచ్చింది. విఘ్నాసురుడు అంకుశం తాకిడితో అలా
అలా కుదించుకుపోయి, అంకుశం వెన్నంటి తరుముతూండగా శరణు కోరుతున్నట్లుగా
గణేశుడి రెండు పాదాల ఇరుకున పడి బందీగా చిక్కుకున్నాడు.
గజముఖుడు విఘ్నాసు రుణ్ణి రెండు పాదాలతో గట్టిగా నొక్కాడు. అప్పుడు
కాలుడు విఘ్నాసురుడి నుంచి బ
ుటపడి గణేశుడికి మ్రొక్కుతూ, ‘‘గణేశా! నీ
మహావిశ్వపాశం ముందు ఈ భూమికి, సూర్యోద
ుం సూర్యాస్తమ
ూలకుమాత్రమే
సంబంధించిన నా కాలపాశం ఎంత! విశ్వాన్ని అదుపులో ఉంచే నీ అంకుశం ముందు నా
దండమేపాటిది! పర్వతంలాంటి భూతాన్ని నీ వాహనరూపాలైన చిటె్టలుకలు తుదముట్టిం
చాయి!
నీవు విఘ్నాసురుణ్ణి అధీనంలో పెట్టు కొన్న విఘ్నేశ్వరుడివి! దేవా,
నన్ను మన్నించు!'' అని వేడుకున్నాడు. విఘ్నేశ్వరుడు, ‘‘కాలా! ఇతరుల పని
నెత్తిని వేసుకోవడం కోరి ముప్పుతెచ్చుకోవడమే! నీ ధర్మాన్ని నువ్వు సక్రమంగా
నిర్వర్తించు! ఇక ఇక్కడ నుంచి కదిలి, వెళ్ళు,'' అని మంద లించాడు. కాలుడు
మెలివేసిన చేతులతో చెవులు పట్టుకుని మూడుసార్లు వంగి లేచి, లెంపలు
వేసుకొని, ‘‘బుద్ధ్ది బుద్ధి!
ఆ ఇంద్రుడి మాట విని గడ్డి కరిచాను. బుద్ధి వచ్చింది దేవా! విఘ్నే
శ్వరుడవైన నిన్ను నమ్మి కొల్చినవారి దాపులకు నేను పోను. వారిని వ్యాధులు
సోకవు. వారికి విఘ్నాలుండవు!'' అని చెప్పి శలవు తీసు కున్నాడు. కాలుణ్ణి
విఘ్నేశ్వరుడు భంగపుచ్చిన ప్పుడే కాలపాశంవల్ల నేలకొరిగిన అభినందన మహారాజు
మొదలైనవారంతా సజీవులై నిద్ర లేచినట్లు లేచారు. ఆకాశం నుంచి పూలజల్లు
కురిసింది. వినా
ుకుణ్ణి విఘ్నేశ్వరుడనీ, విఘ్నరాజు అనీ అందరూ కీర్తించారు.
అప్పట్నించీ, ఏ మంచిపనికైనా, శుభకార్యా నికైనా స్వస్తికను ముగ్గుగా
తీర్చిదిద్దడం, పసుపు ముద్దను విఘ్నేశ్వరుని ప్రతిరూపంగా ఉంచి పూజించడం
సంప్రదా
ుంగా నిలిచింది. ‘‘కాలపురుషుణ్ణి భంగపుచ్చి పాదాక్రాం తుణ్ణి
చేసుకొన్న విఘ్నేశ్వరుడి మీద విశ్వాసం కలవారూ, విఘ్నేశ్వరుడి ఆశీర్వాదబలం
ఉన్నవారూ కాలప్రవాహానికి ఎదురీత ఈది నిలద్రొక్కుకొని, విజ
ుం సాధించగలరు!''
అని చెప్పి పావనమిశ్రుడు ముగించాడు. ఒకనాటి సా
ుంకాలం ఒక బాలిక పావన
మిశ్రుడి దగ్గిరకువచ్చి, అతడి చిటికెనవేలు పట్టుకొని ఒక కుడ్యచిత్రం
దగ్గరకు తీసుకు వెళ్ళింది. ఆ చిత్తరువులో అసమాన సౌందర్యంగల ఒక కన్య
విఘ్నేశ్వర విగ్రహానికెదురుగా మోక రిల్లినమస్కరిస్తున్నది.
ముక్కుపచ్చలారని ఆమె తల ముగ్గుబుట్టలా ఉంది. పావన మిశ్రుడు ఆ కథ
చెప్పడం ప్రారంభించాడు: ఒక పుణ్యదంపతులకు విఘ్నేశ్వరుని ఆరాధించిన
వరప్రసాదంగా రత్నంలాటి ఆడ పిల్ల పుట్టింది. పుడుతూనే ఆ శిశువు పురిటి గదికి
ఎదురుగా గూటిలో ఉన్న విఘ్నేశ్వర ప్రతిమను విప్పారిన కన్నులతో చూస్తూ, ఆ
బొమ్మ పిలుస్తున్నట్లుగా క్యారుమన్నది.
ఆ పాప ఉ
్యూల తొట్టిలో ఊగుతూ ఎప్పుడూ గూటిలో వున్న గణేశవిగ్రహాన్ని
చూసుకుంటూ నవ్వులతో కేరింతాలు కొడుతూ ఆడుకొనేది. ఆ పిల్లకు సుందరి అని పేరు
పెట్టారు. పేరుకు తగ్గట్టుగా సుందరి గొప్ప సౌందర్య వతిగా పెరిగి పెళ్ళి
ఈడుకు వచ్చింది. సుంద రికి సౌందర్యంతో బాటు గొప్ప బుద్ధి, తెలివి
తేటలు,అందరికీ హితవుకూర్చే మాటతీరూ కలిగి ఉండటం చూసి, ఆమెను జ్ఞానసుం దరి
అన్నారు.
సుందరి అసమాన సౌందర్యం గురించి ఊరూరా చెప్పుకోసాగారు. శాపవశాన పుట్టిన
గంధర్వకన్య అనీ, భూమ్మీద అవతరించిన దేవసుందరి అనీ అన్నారు. ఆమె పాణిగ్రహ
ణానికి గొప్ప ధనసంపన్నులూ, అధికార బలం గలవారూ అసంఖ్యాకులుగా సుందరి
తలిదండ్రులను ఒత్తిడిచేశారు. సుందరి గురించి విన్న ఆ రాజ్యమేలే మహారాజే, ఆ
కన్యకారత్నాన్ని తన రాణివాసానికి తీసుకు పోవడానికి పరివారంతో రాజధాని నుండి
బ
ులుదేరి వస్తున్నాడని తెలిసింది.
సుందరి ప్రతినిత్యమూ ఆరాధించే నదీ ఘట్టాన ఉన్న విఘ్నేశ్వర శిలావిగ్రహం
ముందు మోకరిల్లి, కన్నులు మూసి నమస్కరిస్తూ, ‘‘విఘ్నేశ్వరా! శైశవం నుంచీ
నిన్నే నమ్మినదాన్ని. సంసారంలో కొట్టుకుపోవడం నాకు ఇష్టం లేదు. నన్ను
ముసలిదాన్ని చెయ్యి! జ్ఞాన సంపద నాకు అనుగ్రహించు! పుట్టినందుకు
ప్రెూజనకరమైన పని నా చేత చేయించు!'' అని ధ్యానిస్తున్న ఆమె నల్లని కొప్పు
వెండిలాగ మెరుస్తూ నెరిసింది.
పాలబుగ్గలు సొట్టలు సొట్టలు పడ్డవి. నుదురు అడ్డంగా ముడుతలు దేరింది.
నదికి వచ్చినవారంతా నివ్వెరపోతూ చూస్తున్నారు. అమ్మాయి అవ్వ అయింది!
‘‘అమ్మాయి సుందరీ! ఏమిటమ్మా ఇది?'' అంటూ కంటనీరు పెట్టుకొంటున్న తండ్రి,
తల్లితో, ‘‘నేను అమ్మాయినీ కాను, సుందరినీ కాను, అవ్వను! మీరు
సంతోషించడానికి బదులు విచారిస్తారెందుకు? మీరిచ్చిన జన్మను సార్థకంగా
చేసుకొనే అవకాశాన్ని గణేశుడు అనుగ్రహించాడు.
నా కంటె అజ్ఞానులైనవారికి నాకు తెలిసిన హితవచనాలు చెప్తాను. జ్ఞాను
లైనవారినుండి తెలి
ునివి తెలుసుకుంటాను. అజ్ఞానదశలో ఉన్నవారంతా
పసిపిల్లలవంటి వారే. అంతా నా పిల్లలే. వారికి నేను అవ్వను! నా పుట్టిన రోజు
ఈ రోజే కదా. ఇదే నా పండగరోజు! పాద
ూత్రకు బ
ులుదేరు తున్నాను, నన్ను
ఆశీర్వదించండి!'' అని అవ్వ అంటూ అక్కడ పడి ఉన్న చెట్టుకొమ్మను ఊతకరగ్రా
పట్టుకొని చిన్నగా నవ్వుతూ లేచి నిలబడింది.
అప్పుడే అక్కడికి చేరుకున్న రాజును చూసి అవ్వ, ‘‘ప్రజల ధన ప్రాణ
గౌరవాలను, కన్యలను రక్షణలో ఉంచవలసిన నువ్వే, ఒక కన్యను ఎత్తుకుపోవచ్చావు.
ఊళ్ళు, ఇళ్ళు దోచుకొనే దండునా
ుకుడివా? రాజువా?'' అని అడిగింది. సిగ్గుతో
సగం చచ్చిపోయిన మహారాజు కత్తినీ, కిరీటాన్నీ తీసి దూరంగా పెట్టి, అవ్వ
పాదాలకు ప్రణమిల్లి, ‘‘మహాత్మురాలా! నీ దర్శనంతో నా అజ్ఞానం తొలగింది. నేను
నా రాజసాన్ని వదిలి ప్రజకు సేవకుడిననుకుంటూ వర్తిస్తాను!'' అన్నాడు.
కారణజన్మురాలని అంతా అవ్వను కీర్తి స్తుండగా బ
ులుదేరుతున్న అవ్వను
పల్ల కిలో సంచారం చే
ులవసిందనీ, సర్వవిధ ప్ర
ూణసౌకర్యాలు అమర్చుతాననీ రాజు
ప్రాథే
ుపడ్డాడు. అవ్వ నిరాకరించి, ‘‘రాజా! చెప్పులకు కూడా నోచుకోని అతి
సామాన్యులైన కష్ట జీవుల మధ్యకు అందలమెక్కి వెళ్ళి ఏ మొగంతో నీతులు
బోధించగలను? నువ్వు ప్రజకు విద్యా సౌభాగ్యాలను చేకూర్చు. నీ పని నువ్వు
చెయ్యి!
నేను సామాన్యురాలిగా, సామాన్యులందరితో ఒకటిగా నేను చే
ు గల్గినది
చేసుకుపోతాను. విఘ్నేశ్వరుడు, అతని ముద్దుల తమ్ముడు సుబ్రహ్మణ్యే శ్వరుడు
అన్నీ చూసుకుంటారు. వారే నాకు రక్ష!'' అని చెప్పింది. అవ్వ కర్ర ఊతగా కాలి
నడకను బ
ులు దేరి, జ్ఞానపీఠమైన ఒక మఠాన్ని చేరుకొంది. పీఠాధిపతికి
మ్రొక్కి, ‘‘అ
్యూ! నాకు జ్ఞానం ఉపదేశించండి!'' అని కోరింది.
పీఠాధిపతి సంశయిస్తూ, ‘‘అమ్మా! నువ్వు స్ర్తీవి, జ్ఞానోపదేశం పొంది ఏం
ప్రెూజనం?'' అన్నాడు. అవ్వ, ‘‘నీరూ, దీపమూ మగవాడికేగాని స్ర్తీకి
ఉపెూగపడవా? ఉపెూగించలేదా? గ్రుడ్డివాడి చేతనున్న దీపం ఇతరులకు దారి
చూపించగలదు కదా! జీవిలోని జ్ఞాన స్వభా వం మగదా? ఆడదా? ఏదీ కానిది, అన్నీ
అయినది, అన్నిటా ఉన్నది ఒకటే అని అంటూనే పుట్టుకచేత ఎక్కువ తక్కువలు,
అర్హతలు ఎంచడం జ్ఞానుల పనేనా?'' అని అన్నది.
పీఠాధిపతి, ‘‘మహాత్మురాలా! జ్ఞాన పీఠంపై ఉండవలసింది నేను కాదు,
జ్ఞాన రూపిణివయిన నీవే!'' అని అన్నాడు గౌరవంగా లేచి నిలబడుతూ. అవ్వ,
‘‘పీఠాలు, మఠాలు ఎందుకు? అందరికీ తేలికగా అర్థమే్యులాగ దగ్గిరికెళ్ళి
ఎక్కువమందికి జ్ఞానం అందించడం మంచిది కదా! పంచభక్ష్య పా
ుసాల రాజభోజనం
ఒకడికి పెటే్టకంటే, అంతా తినేది పదిమందికీ పెడితే మంచిది కాదా!'' అని
అన్నది. ‘‘ఔను!
నేనూ అదే అనుసరిస్తాను,'' అని శిరసు వంచి నమస్కరించాడు పీఠాధిపతి.
అవ్వ అలా వెళ్తూండగా ఒక మంచినీటి బావి దగ్గిర నలుగురు స్ర్తీలు, నీళ్ళు
తోడుకొని తీసుకెళ్ళే విష
ుంలో ఒకామె చెప్తున్నది వింటున్నారు. ఆవిడ
శాసిస్తున్నట్టు, ‘‘ఎవరు ముందు వచ్చినా, వెనక వచ్చినా నేను ముందు
తోడుకెళ్ళాలి.
తర్వాత ఈవిడగారు, తర్వాత ఆమె, ఆ తర్వాత ఆ మనిషి!'' అని అంటున్నది.
దూరంగా ఒక బాలిక, ‘‘కాసిని నీళ్ళు పొ
్యుండమ్మా, గొంతారిపోతున్నది!'' అంటూ
దీనంగా అరుస్తున్నది. నలుగురు స్ర్తీలు ఏక కంఠంతో, ‘‘దూరం, దూరంగా పోవే! ఈ
చా
ులకు రాకు!''
అంటూ కసిరినట్టు అరుస్తూండగా, చాలా దూరం ఎండలో నడిచి వచ్చిన బాలిక
శోషి ల్లుతూ పడిపోయింది. అప్పుడు అవ్వ వెళ్ళి తన జాడీ చెంబుతో బాలిక నోట్లో
నీళ్ళుపోసి తాగించింది. మిగిలిన నీరు అవ్వ తాగి దాహం తీర్చుకుంది. అది
చూసి నలుగురు స్ర్తీలూ ఆశ్చర్యంతో నోళ్ళు నొక్కుకుంటూ, ‘‘హవ్వ! ఎంత పని
చేశావు, అవ్వా! అది తాగగా మిగిలిన నీరు నువ్వు తాగుతావా! అది జాతి
తక్కువది!'' అన్నారు.
అవ్వ త్రేన్చి శాంతంగా, ‘‘శ్రీమతుల్లారా! అసలు జాతే లేనిదాన్ని నేను!
అయితే ఆ పిల్లలో, నాలో నీళ్ళే నాళాల్లో ప్రవహిస్తూ న్నందువల్ల నీళ్ళే
మమ్మల్ని సేదదేర్చాయి!'' అంటూ కుతూహలంగా వెళ్ళి వాళ్ళ కడవ, బిందెల్లోకి
చూసి ఆశ్చర్యంతో, ‘‘మీ శరీరం నిండా పాలే ఉంటా
ునుకుంటున్నాను. మరి మీకు
నీళ్ళెందుకు? త్రాగడానికి కాదు గదా? అమ్మల్లారా! మీకు పుణ్యముంటుంది,
నీళ్ళు మాకు వదలండి. మీరు పాలే త్రాగండి!''
అని అంటూ తన చెంబు నిండా నీళ్ళు పోయించుకున్నది. నలుగురు స్ర్తీలూ
అవ్వ మాటల్లో దాగి ఉన్న సత్యాన్ని గ్రహించి సిగ్గుపడి, బుద్ధి
తెచ్చుకున్నారు. అవ్వ అలా వెళ్తూండగా ఒక ఊళ్ళో జీవాల బలులు సాగుతున్నవి.
జనం భ
ుపడుతున్న ట్లుగా దేవతకు మ్రొక్కుతున్నారు. అవ్వ, ‘‘ఎంత అన్యా
ుం
చేస్తున్నారే, తల్లీ! వాళ్ళేమో మాంసాన్ని మంచి రుచులతో వంట చేసుకొని
తింటారు. నిన్ను పచ్చి నెత్తురు తిని బతికే క్రూరజంతువుగా అవమానిస్తు
న్నారు. తల్లిని అవమానించే పిల్లలైపో
ూరు వీళ్ళంతా!''
అని అంటున్న మాటలు జనం విని, ‘‘అపచారం! అపరాధం! అమ్మతల్లికి ఆగ్రహం
వస్తే అంతా మసి చేస్తుంది!'' అంటూంటే, అవ్వ, ‘‘లంచం పెట్టలేదని ఏ తలై్లనా
పిల్లల్ని చంపుతుందా? మీరు ఊరికే భ
ుపడుతున్నారు. అంతే! భ
ూన్నే భక్తి
అనుకుంటున్నారు! మీ కోరికల్ని అమ్మకు అంటగట్టుతున్నారు! నిజమైన భక్తి అమ్మ
మీద మీకు కలిగిననాడు మీకు భ
ుమూ ఉండదు, అపదలూ ఉండవు!'' అని చెపుతూ వారికి
అర్థమే్యులాగ భక్తి మార్గాన్ని ఉపదే శించింది.
No comments:
Post a Comment