Showing posts with label విఘ్నేశ్వరుడు. Show all posts
Showing posts with label విఘ్నేశ్వరుడు. Show all posts

Thursday, September 6, 2012

విఘ్నేశ్వరుడు - 24

అక్క చెల్లెళ్ళు ప్రసన్నవదనా, మోహనా వరసగా విగ్రహాల్ని చూసుకుంటూ వెళ్ళి, నిరుత్సాహంగా మరలబోతూ, అవతల పిల్లల కోలాహలానికి ఆశ్చర్యంగా చూశారు.
‘‘అక్కడ ఒక తక్కువ రకం రంగుల విగ్రహం ఉందిలెండి!'' అంటూ ఎవరో అనడం వాళ్ళకు వినిపించింది. అది విని మోహన, ‘‘పదవే, అక్కా! అదేదో తక్కువలోనే దొరుకుతుందిలా ఉంది!'' అంటూ ప్రసన్నవదన చేయి పుచ్చుకుని అటు దారితీసింది. అంతా ఆడా, మగా జనం ప్రదర్శనశాలలో ఒక్కరు మిగలకుండా వారిని వెంబడించారు. ప్రసన్నవదన వెళ్ళి, వరహాల సంచిని విగ్రహం ముందు పెట్టి, తన మెడలోని పచ్చల రత్నాల హారాన్ని తీసి విచిత్రుడి చేతికి కంకణంలాగ చుట్టింది. అది చూసి జనం, ‘‘వీళ్ళకేదో పిచ్చి ఉంది! అలాంటి గొప్ప విగ్రహాల్ని కాదని ఇక్కడ డబ్బు ధారపోస్తున్నారు!'' అన్నారు.
ప్రసన్నవదన వాళ్ళతో, ‘‘ఇక్కడున్న విగ్రహంలో ఏ విశేషాన్ని చూసి పిల్లలంతా మురిసి ముచ్చట పడుతున్నారో, ఆ విశేషమే మమ్మల్ని ముగ్థుల్ని చేసింది. బాల దీవనలు బ్రహ్మ దీవనలు, పిల్లలు దైవ సమానులనీ అంటారు. అందుకే వారి ఎన్నికను శిరసావహించాము,'' అన్నది.
‘‘మట్టి శిల్పంలో లేని రూపసౌందర్యాన్ని, సొంపుల్ని సామాన్యమైన జేగురు, సున్నము, బొగ్గు మొదలైన రంగులతోనే ఎంతో మూర్తివంతంగా తీర్చిదిద్దిన చిత్రకారుని ప్రతిభ అమోఘంగా ఉంది. మా బహూకరణం అతి స్వల్పం!''అని మోహన అన్నది.

ఆ సమ…ుంలో, విచిత్రుడి వృద్ధ జననీ జనకులు అక్కడికి వచ్చారు. ‘‘నా…ునా, పావనా! వాతాపి గణేశుడి కృప వల్ల మా అన్వేషణ ఫలించింది, ఇంతవాడివై కనిపించావు!'' అంటూ కుమారుణ్ణి కౌగిలించుకుని ఆనందబాష్పాలు రాల్చారు. అప్పుడు విచిత్రుడు బాల్యం దాటుతున్న నవ…ుువకుడు. తల్లిదండ్రులను చూసి మహదానందం పడ్డాడు. గతం అంతా గుర్తుకొచ్చింది. తన పేరేమిటో తెలిసింది. వారి సమాగమాన్ని చూసి, ప్రసన్నవదన తృప్తిపడుతూ, ‘‘ఇప్పుడిప్పుడే మా కోరిక నెరవేరింది, మా మొక్కు చెల్లించుకుంటాము,'' అని చెప్పింది.
క్షణాల మీద జనం అక్కడ పెద్ద పందిరి వేశారు. విశాలమైన వేదిక అమర్చారు. ప్రసన్నవదన వినా…ుక విగ్రహాన్ని అంటిపెట్టుకు కూర్చుని తాళాలు వాయిస్తూ, ‘‘తాండవ నృత్యకరీ గజానన...'' అని కీర్తన మొదలుపెట్టింది. వేదికపై మోహన విద్యుల్లతలాగా నృత్యం చేస్తూంటే, జనం పరవశించిపోతూ ఆనందతరంగాల్లో ఊగిపోతున్నారు. ప్రసన్నవదన గానం గజానన పండితుడికి వినిపించింది!
అప్పుడు గజాననుడు శతాధిక వృద్ధుడై ఇల్లు కదలలేని స్థితిలో ఉన్నాడు. అతనికి ఎక్కడలేని జవసత్వాలు వచ్చాయి. పరుగులాంటి నడకతో పందిట్లోకి చేరుతూనే ప్రసన్నవదనను చూసి చేతులెత్తి జోడించి సాగిలపడి అలాగే కదలా మెదలక ధ్యానముద్రలో ఉండిపో…ూడు.
నృత్యం చేస్తూ, చేస్తూ మోహన పెద్దదైన వినా…ుక విగ్రహాన్ని అవలీలగా భుజానికెత్తుకుంది. అది చూసి తెప్పరిల్లిన జనం, ‘‘అంత బరువƒు మో…ులేవమ్మా!'' అని అంటూంటే మోహన,‘‘నాకు అలవాటేగా!'' అని చెప్తూ విగ్రహాన్ని, భుజాన మోస్తూ, నాట్యంచేస్తూన్న నడకతో బ…ులుదేరింది. జనం అంతా ఆమె వెనకనే వెళ్ళారు. ఆ సందట్లో ఎప్పుడో అదృశ్యమైన ప్రసన్నవదన సంగతే ఎవరికీ పట్టలేదు.
ధ్యానముద్ర నుండి గజాననుడు కళ్ళు తెరిచాడు. ఎదురుగా విగ్రహమున్నచోట మెరుస్తున్న వరహాలతో నిండుగా ఉన్న బంగారు జలతారు సంచి కనిపించింది. పాదాలచెంత విచిత్రుడు మోకరిల్లి కూర్చుని ఉన్నాడు. గజాననుడు విచిత్రుడితో, ‘‘ఆల…ు మంటప కుడ్యాలను గణేశ లీలల చిత్రశోభితం చెయ్యి! అందుకు కావలసిన ధనాన్ని ప్రసన్నవదనుడైన విఘ్నేశ్వరుడే ఆనందంగా అందించాడు గదా!'' అంటూ లేచాడు.


గజానన విచిత్రులిద్దరూ ఊరేగింపుగా వెళ్తున్న జనంతో కలిశారు. మోహన విగ్రహంతో ఆల…ు పుష్కరిణికి చేరుకుని తటాక సోపానాలు దిగుతూ మా…ుమై, ఆమెకు మారుగా చిటె్టలుక విగ్రహాన్ని వీపున మోస్తూ నీటిలోకి పరుగు తీసింది. ఆ రోజే విగ్రహాల్ని జల నిమర్జనం చేసే ఉత్సవ దినం.
విగ్రహం తటాక మధ్యానికి చేరుకుని, కోటి పూర్ణిమల కాంతిపుంజంగా భాసించింది. ఆ కాంతిలో అభ…ుహస్తంతో ఆశీర్వదిస్తూ విఘ్నేశ్వరుడు లీలగా కనిపించి, అంతర్థానమ…్యూడు.
గజాననుడు విచిత్రుణ్ణి గాఢాలింగనం చేసుకుని,‘‘నా…ునా,పావనా!నీ మూలంగా వాతాపి నగరానికి పావనత మిశ్రమమైంది. నీవు పావన మిశ్రుడివి!'' అని చెప్పాడు, అంటూ పావనమిశ్రుడు ఆగకుండా, ‘‘గర్భాల…ు ముఖద్వారం మీది చిత్తరువు మహాభారత రచన...'' అంటూ చెప్పుకు పోతుంటే, …ుువ చిత్రకారుడు, ‘‘గురుదేవా!'' అంటూ పావనమిశ్రుడి పాదాలను చేతులతో చుట్టి, ‘‘మీ పావన చరిత్రను విన్న నేను ధన్యుణ్ణి! నా పేరు ఆనందుడు. మీ పావన నామాక్షరి మొదటి రెండు అక్షరాల్ని మార్చి, నా పేరు ముందు చేర్చి, ‘వపానందుడు' అనిపించుకుంటాను. ఈ మంటపం పావన చిత్రాల…ుం! ఈ చిత్రాలకు ప్రతికృతులు రచిస్తాను. ముందుతరం వారికి మీరు చెప్పిన కథలన్నీ చెప్తాను. అనుగ్రహించండి!'' అంటూ భక్తితో శిరస్సు వంచాడు.

మెరుస్తున్న వెండి జుట్టుతో, ముడతలు పడ్డ విశాల ఫాలంతో వార్థక్యం పైబడ్డా, మనసుకు ముసలితనం రానివ్వని పావనమిశ్రుడు …ుువకుడి తలపై చేత్తో ఆశీర్వదిస్తూ, మందహాసం చేసి మళ్ళీ చెప్పసాగాడు :
వ్యాసుడు తాను చెప్పబోేు మహాభారతాన్ని వ్రా…ుగల సమర్థుడు ఎవరా అని ఆలోచిస్తూండగా, బ్రహ్మ సాక్షాత్కరించి, విఘ్నేశ్వరుణ్ణి లేఖకుడిగా పెట్టుకోమన్నాడు. బ్రహ్మ ఆదేశానుసారం వ్యాసుడు విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థించాడు. విఘ్నేశ్వరుడు ప్రసన్నుడై, ‘‘వ్యాసా! నీ ధోరణిలో నీవƒు చెప్పుకుపోతూండాలి, నా వంక చూడకూడదు సుమీ!'' అని చెప్పి వ్రాతకు కూర్చున్నాడు.
విఘ్నేశ్వరుడు తన దంతం ముక్కనే గంటంగా పట్టి, మోపినది ఎత్తకుండా వ్రాస్తున్నాడు. వ్యాసుడు అరమోడ్పు కన్నులతో ధ్యానమగ్నుడై చెప్తున్నాడు. ఎదురుగా హిమాల…ు శిఖరాగ్రం నుంచి పడుతున్న జలపాతం మధ్యమావతి రాగంలాగా మంద్ర గంభీరంగా నేపథ్య సంగీతం లాగా శృతి పోస్తున్నది. దేవదారు వనాలు తలలూపుతూన్నవి. జలజల పారే నదాలు అనంత రాగమాలికలు ఆలపిస్తున్నవి. మహాభారతరచన ధారావాహికంగా, నిర్విరామంగా సాగుతూన్నది.
పుట్టు గ్రుడ్డి, ధృతరాష్ర్టుడు హస్తినాపుర సింహాసనాన్ని అలంకరించాడు. తమ్ముడు పాండురాజు సామ్రాజ్యభారాన్ని మోస్తూ విస్తరింపజేశాడు. పాండురాజుకు పంచపాండవులూ, ధృతరాష్ర్టుడికి నూరుగురు కౌరవులూ పుట్టారు.
చిన్ననాటి నుంచే కౌరవ పాండవుల మధ్య స్పర్థ, అసూ…ులు వర్థిల్లాయి. వ్యాసుడు చెప్తున్నాడు విఘ్నేశ్వరుడు వ్రాస్తున్నాడు. సభాపర్వం సాగుతున్నది. మ…ుసభలో పరాభవం పొందిన దుర్యోధనుడు ప్రతీకారంగా పాండవుల్నీ వారి భార్య ద్రౌపదినీ జూదంలో గెల్చుకుని ద్రౌపదీ వస్త్రాపహరణ తలపెట్టాడు. భీముడు దుర్యోధనుడి రక్తం తాగుతానని సింహగర్జన చేశాడు.
పాండవులు వనవాసం చేశారు. విరాటరాజు కొలువులో అజ్ఞాతవాసం చేస్తున్నారు. సైరంధ్రిగా ఉన్న ద్రౌపదిని కీచకుడు అవమానించి భీముడి చేతిలో ముద్ద ్యూడు.

ఉత్తర గోగ్రహణంలో బృహన్నల విజ…ుుడ…్యూడు. మహాభారతంలో సుందరకాండగా విరాటపర్వం సాగింది. జలపాతం కళ్యాణిరాగం ధ్వనిస్తున్నది. అభిమన్యుడికి ఉత్తరకు వివాహం జరిగింది. కృష్ణుడు రా…ుబారం వెళ్ళి పాండవులకు ఐదు ఊళ్ళు ఇస్తే చాలన్నాడు. దుర్యోధనుడు సూది మొనపాటి నేల కూడా ఇవ్వనన్నాడు. …
ుుద్ధం అనివార్యమైంది. హిమాల…ు ఝరి కదన కుతూహల రాగం ఆలపిస్తూ శిఖరాలు విరిగి పడుతున్నవా అన్నట్లుగా పడి హెచ్చిపడుతూన్నది. హిమానీ నదాలు గుర్రాల్లా దౌడు తీస్తున్నాయి.
కృష్ణుడు అర్జునుడి రథసారధి అ…్యూడు. అర్జునుడికి భగవద్గీతను ఉపదేశిస్తున్నాడు. జలపాతం సామసౌరాష్ట్ర దేవగాంధార రాగాలను వినిపిస్తున్నది. భీష్ముడు అంపశ…్యు చేరాడు. ద్రోణుడు పద్మవ్యూహం పన్నాడు. అభిమన్యుణ్ణి పదిమందీ కలిస్తేనేగానీ చంపలేకపో…ూరు. సుభద్ర పుత్రశోకం లాగ జలపాతధ్వని ముఖారి రాగంగా వినిపిస్తున్నది.
అర్జునుడు విజృంభించాడు. ద్రోణుడి తల ద్రుష్టద్యుమ్నుడు నరికాడు. అనేక అనర్థాలు సంతరించుకున్న కర్ణుడిని నమ్ముకున్న దుర్యోధనుడు కర్ణుడి చావƒుతో చిత్త…్యూడు. భీముడు దుశ్శాసనుణ్ణి చంపాడు. దుర్యోధనుడి తొడలు విరగ్గొట్టాడు.
జూదంలో ఓడిపోయిన ధర్మరాజు తమ్ములతో …ుుద్ధంలో విజ…ుదుందుభి మ్రోగించాడు. కృష్ణుడు అవతారం చాలించాడు. పరీక్షత్తుకు పట్టంకట్టి పాండవులు ద్రౌపదితో మహాప్రస్థానం బ…ులుదేరారు. ధర్మానికి చావు లేదు, చివరకు నిలబడేది ధర్మమొక్కటే అన్నట్లుగా ధర్మరాజు మేరు శిఖరాగ్రం మీద నిలబడ్డాడు.
జలపాత ధ్వని క్షణిస్తూన్నది. అంతటా గంభీర నిశ్శబ్దం ఆవరించుకున్నది. వ్యాసుడు చెప్పింది విఘ్నేశ్వరుడు వ్రాస్తున్నాడా? లేక విఘ్నేశ్వరుడు వ్రాసింది వ్యాసుడు చెపుతున్నాడా? అన్నట్లు చకచకా భారత రచన సాగింది. సత్యలోకంలో పద్మాసనంపై బ్రహ్మ సంతృప్తిగా చిరునవ్వు చిందిస్తూ, సాభిప్రా…ుంగా సరస్వతి వంక చూశాడు. వెంటనే సరస్వతీ దేవి వీణ మీటుతూ శ్రీరాగాన్ని పలికించింది. మహాభారతం చెప్పడం పూర్తి కావస్తున్నది. చివరి పర్వంలో వున్నది.

సరస్వతీదేవి సత్యలోకం నుంచి మంగళాచరణంగా శ్రీరాగం ఆలాపిస్తున్న వీణానాదం, తాను చెప్పుతున్న కథనానికి అంతరా…ుంగా వ్యాసుడి చెవిని సోకింది. ఇంకా చెప్పవలసినది చాలా ఉంది. వ్యాసుడు ఆదమరుపుగా లేఖకుడి దెసతేరి చూశాడు. మరుక్షణంలో విఘ్నేశ్వరుడు అంతర్థానమ…్యూడు.
మహాభారత గ్రంథం మీద ఆకాశం నుండి అక్షంతల్లాగ పువ్వులు జలజలా రాలాయి. వ్యాసుడు ఆత్రంగా గ్రంథాన్ని విప్పి పరిశీలనగా చూశాడు. తాను ఇంకా చెప్పదలచినదంతా ఒక్కఅక్షరం తేడా లేకుండా సంపూర్ణంగా వ్రా…ుబడి ఉంది.
వ్యాసుడు ఆనందాశ్చర్యాలతో పులకించిపోతూండగా, మహతి వీణపై హంసధ్వనిరాగం వినిపించింది. నారదుడు వస్తూనే, ‘‘ఏమిటి మహాభారత మహర్షీ! ఆశ్చర్యపడిపోతూ చూసుకుంటున్నావు?'' అన్నాడు. వ్యాసుడు జరిగినది చెప్పాడు.
‘‘అంటే, నీవు చెప్పేది చెప్పకుండానే ముందుగానే నీ లేఖకుడు వ్రాసుకుంటూ వచ్చాడన్న మాట!'' అన్నాడు నారదుడు మందహాసం చేస్తూ. ‘‘ఔను, నారదా! అదే జరిగింది. అటువంటి లేఖకుడు ఎలాంటి తపస్సులు చేసినా ఎవరికీ లభించడు కదా! నేను ధన్యుణ్ణి! నా సంకల్పం జ…ుప్రదమైంది. మహాభారతాన్ని ‘జ…ుం'అని కూడా పేర్కొంటున్నాను!'' అనిచెప్తూ వ్యాసుడు చేతులు జోడించి విఘ్నేశ్వరుణ్ణి భక్తితో ధ్యానించాడు. మహాభారతం దగ్గర పెద్ద జ్యోతి పెరుగుతూ కనిపించింది. ఆ జ్యోతి విఘ్నేశ్వరుడి ఆకారంగా రూపొందింది.
విఘ్నేశ్వరుడు సాక్షాత్కరించి, ‘‘వ్యాసమహర్షీ! నీ మహాభారతం అద్వితీ…ు మహాకావ్యమై పంచమవేదంగా పరిగణింపబడుతూ కీర్తింపబడుతుంది!''అని, వ్యాసుణ్ణి ఆశీర్వదిస్తూ అంతర్హితుడ…్యూడు. విఘ్నేశ్వరుడిచేత అతని దంతపు గంటంతో లిఖింపబడి అక్షరసిద్ధి పొందిన మహాభారతం అన్ని కాలాల్లో సారస్వతాకాశంలో మిలమిల మెరిసే చుక్కల్లో చందమామగా నిలిచింది.  

విఘ్నేశ్వరుడు - 23

సాలలో ఇంత గొడవ జరుగుతున్నా, పాలేరు ఇంకా నిద్రిస్తూనే ఉన్నాడు. పక్కనే పత్రిపూలతో నిండిన గణేశ విగ్రహం ఉంది. నేలంతా చెరుకు పానకంతో బురద, బురదగా బాగా తడిసి ఉంది. కాపలావాళ్ళను పిలిపించి అడిగితే వాళ్ళు, ‘‘చాలా రాత్రయింది, పాలేరు నిశ్చింతగా నిద్ర తీస్తున్నాడు, మాకూ కునుకొచ్చింది. అంతలో ఏనుగు అరుపుతో కళ్ళు తెరిచాము. పెద్ద ఏనుగు చీకట్లో తెల్లగా కనిపించింది.

చెరుకంతా లాగి మేసేస్తున్నది, గానుగలాగ పిప్పంతా ఊసేస్తున్నది; మాకు చెడ్డ భ…ుమేసింది. పారిపో…ూం!'' అంటూ వాళ్ళింకా భ…ుంతో వొణికి పోతూనే చెప్పారు. భూస్వామిలో గొప్ప పరివర్తనం కలిగింది. అలాగే వెళ్ళి పాలేరు పాదాలకు మ్రొక్కు తూన్నట్టు సాగిలపడిపో…ూడు. పాలేరు మేల్కొన్నాడు. లేచి నుంచున్నాడు. భూస్వామి అతని పాదాలు వదలకుండా శిరస్సుతో మ్రొక్కుతూనే ఉన్నాడు. భూస్వామి భార్య విఘ్నేశ్వర విగ్రహానికి ప్రణమిల్లి, ‘‘స్వామీ! ఇన్నాళ్ళకు మమ్మల్ని అనుగ్రహించావు.

ధన్యులం!'' అని అంటూ జరిగిందంతా పాలేరుకు చెప్పింది. మహాద్భుతాన్ని విన్న జనం తండోపతండాలుగా అక్కడికి చేరుకుంటున్నారు. దివాణం క్రిక్కిరిసిపోయింది. నేలపై ఏనుగు పాదాల గుంటల్లో నిలిచిఉన్న చెరుకురసాన్ని తీర్థంగా సేవిస్తూ, చెరుకు పిప్పిని విఘ్నేశ్వర మహాప్రసాదంగా పట్టుకువెళ్తున్నారు. పాలేరు, భార్య పిల్లవాడితో కలిసి వినా…ుక విగ్రహానికి దణ్ణాలు పెడుతూ, ‘‘చిన్న పత్రి పిసరైనా వేసి నిన్నెన్నడూ పూజించలేదు. నీ కోసమని పంపిన చెరుకు నీకు పెట్టనైనా లేదు.

నా కోసం ఎందుకింత శ్రమపడ్డావ…్యూ? ఏనుగు రూపంతోనైనా అందరికీ కనిపించావు, నాకు కనిపించావు కావు. నువ్వు వచ్చినప్పుడు నిద్దర పోయిన దద్దమ్మను!'' అంటూ పిల్లవాడిలాగ బావురుమన్నాడు. అప్పుడు విగ్రహం స్థానంలో చెరుకుగడ పట్టుకొని, విఘ్నేశ్వరుడు పాలేరు ముందు సాక్షాత్కరించాడు. పాలేరు కొడుకు తీసుకు వెళ్ళిన చెరుకుగడే అతని చేతిలో ఉంది! విఘ్నేశ్వరుడు పాలేరును తన తొండంతో దగ్గిరకు తీసుకొని, అభ…ుహస్తంతో అతని తల నిమురుతూ, ‘‘నా…ునా! కులాలు, జాతులు ఆచారాలు నేను పెట్టినవి కావు.

అంతా ఈ మా…ుదారి మనుషులు కల్పించుకున్నవే. నా దగ్గిర ఎక్కువ తక్కువలకు చోటు లేదు! అందుకే నీకు కనిపించాను!'' అని చెప్పి అంతర్థానమ…్యూడు. జనులందరూ చేతులెత్తి జోడిస్తూ పాలే రుతో, ‘‘నీ మూలంగా మాకు గణేశుని దర్శన భాగ్యం కలిగింది,'' అంటూ పదే పదే మ్రొక్కుతూ బ్రహ్మరథం పట్టారు. ‘‘ఇక్షు అంటే చెరుకు, సహస్ర-ఇక్షు, వెయ్యి చెరుకుల గణపతి; సహస్రేక్షు గణ పతిగా విఘ్నేశ్వరుడు కీర్తింపబడ్డాడు.

చెరుకు గడ పట్టుకొన్న వినా…ుక విగ్రహం ప్రతిష్ఠింప బడి అక్కడ గొప్ప ఆల…ుం వెలిసింది,'' అని పావనమిశ్రుడు కథ ముగించాడు. ఆల…ు మంటపంలోని చిత్రాల కథలన్నీ పావనమిశ్రుడు చెప్పాడు గాని ముఖద్వారం మీద చిత్రింపబడినది మాత్రం మిగిలి ఉంది. అది చాలా పెద్ద చిత్తరువు. మంటపం లోని చిత్రాలన్నీ ఒక ఎత్తు అది ఒక్కటి ఒక ఎత్తు! చిత్రలేఖన ప్రతిభ అంతా అందులో ఉంది. ప్రతి రోజూ ఆ చిత్రాన్ని పరీక్షగా నిల్చుని చాలాసేపు తదేకంగా చూస్తూండే …ుువకుడొకడు పావనమిశ్రుడి పాదాలకు నమస్క రించి, ‘‘మహాశ…ూ!

ఈ ఆల…ు మంటపంలోని చిత్రాలను ఎవరు చిత్రించారు? ఆ మహాశిల్పి చరిత్ర ఏమైనా ఉంటే చెప్పండి! ఆ ముఖద్వారం మీద వున్న చిత్రానికి నా కళ్ళూ, మనస్సూ అంకితమైపో…ూయి. ఆ చిత్తరువు గురించిన గాథ కూడా ద…ుతో చెప్పి చిత్ర చరిత్ర సంపూర్ణం చె…్యుండి!'' అన్నాడు. పావనమిశ్రుడు ఆ …ుువకుణ్ణి సాద రంగా చూసి, ‘‘నా…ునా! చూడగా నువ్వూ చిత్రకారుడిలాగ కనిపిస్తున్నావు! ముఖ ద్వారం మీది చిత్తరువు నాకూ అభిమాన చిత్రమే.

దాని గాథ తర్వాత చెప్పి విఘ్నేశ్వర చరిత్ర సంపూర్ణం చేస్తాను! నువ్వడిగిన చిత్ర శిల్పికి చరిత్ర లేకపోలేదు, ఉంది!'' అంటూ కన్నులు మూసి ఏదో గుర్తు తెచ్చుకుంటు న్నట్లు ధ్యానించి, కాస్సేపైనాక చెప్పడం ప్రారంభించాడు: వాతాపి నగరానికి సాధువుల గుంపుతో పధ్నాలుగేళ్ళప్రా…ుంగల వాడొకడు వచ్చి వాతాపి గణపతి ఆల…ుం వదలకుండా అలాగే ఉండిపో…ూడు. అతని ఊరేదో పేరేదో అతనికే తెలి…ుదు.
అతని నుదుట పెద్ద గా…ుం మానిన గుర్తు చూసి, పాపం ఏదో దెబ్బ తగిలి స్మృతి పోగొట్టు కొన్నవాడులాగుంది, అని అంతా అనుకున్నారు. ఆ బాలుడు మూగవాడా అన్నట్లు అటే్ట మాట్లాడే వాడు కాడు. గోడల మీద బొమ్మలు గీస్తుండే వాడు. మంటపం రాతిపలకల నేలమీద సుద్దతో బొమ్మలు గీస్తూండేవాడు. గీస్తూన్నంత సేపూ అతని ముఖం పూర్ణచంద్రబింబంలాగ నవ్వుతూ వెలుగుతూండేది.

అంచేత చిత్రా నందుడు, చిత్రముఖుడు అనీ, అతడు ఎక్కు వగా విఘ్నేశ్వరుడి బొమ్మల్నే వేస్తూండడం వల్ల విఘ్నేశ్వర చిత్రకారుడు అనే పేరును లుప్తాక్ష రిగా విచిత్రుడు అని అక్కడివారు అంటూండేవారు. అప్పటికి గజాననపండితుడు చాలా వృద్ధు డ…్యూడు. రోజూ సా…ుంత్రం ఇంటి దగ్గిర పిల్లలకు విఘ్నేశ్వరుడి కథలు చెప్పుతూండే వాడు. విచిత్రుడు ఆ కథలను అతిశ్రద్ధగా అరుగుమీద చెవికోసుకొని వింటూండేవాడు. కథ విన్న మర్నాడు ఆ కథకు సంబంధించిన చిత్రం ఏ గోడమీదనో కనిపించేది. గజానన పండితుడికి విచిత్రుడి మీద చాలా వాత్సల్యం.
ఇంటిలోపలికి పిల్చినా విచిత్రుడు గడపమీద ద్వారం వెలుపలే కూర్చుని వింటూ, ‘‘స్వామీ, ఇక్కడ కూచుని వింటేనే నాకొక్కడికే చెబుతున్నట్లు ఎంతో బాగా వినిపిస్తున్నది!'' అనేవాడు. విచిత్రుడు చిత్రించే విఘ్నేశ్వరుడి బొమ్మలు చూసి గజాననుడు మురిసిపోతూ, విఘ్నేశ్వరుడికి సంబంధించిన అనేక కథలను ప్రత్యేకంగా అతనికి చెబుతూండేవాడు. విచిత్రుడి వెనక ఎప్పుడూ పిల్లలు గుంపులుగా ఉండేవారు. అతను బొమ్మలు వేస్తూంటే నిశ్శబ్దంగా చూసి ఆనందిస్తూ, తర్వాత చిన్న చిన్న బొమ్మలు వేస్తూండేవారు.

ఊళ్ళో పిల్లలకు చిత్రకళ అబ్బింది. విచిత్రుడు పగలంతా వీధుల్లో గోడల మీద జేగురుముక్కతోనో, సుద్దరాయితోనో బొమ్మలు వేస్తూ, వాతాపి గణపతి ఆల…ుంలో పంచే ప్రసా దంతో గడిపి, రాత్రి ఆల…ు మంటపం మెట్ల మీద ఓ వారగానో, ఊరి చివరనున్న వాడలో ఏ పంచకిందనో ఆదమరిచి నిద్ర పోేువాడు.

ఆ వాడలో కుమ్మరులు, చర్మకారులు, పంచములు మొదలైనవారుండేవారు. విచిత్రుడంటే ప్రాణం పెటే్టవారు. ఏ అపరాత్రి వేళ విచిత్రుడు వచ్చినా అతని కోసం ఉంచిన దాన్ని పెట్టి తినిపించి మరీ విచిత్రు డికి పడక సదుపా…ుం చేసి ఆ తరువాతే నిదుర పోేువాళ్ళు. ఆ విధంగా విచిత్రుడు పెరిగి పెద్ద…్యూడు. తానెవరో తనకే తెలి…ుకుండా మరిచి పోయిన విచిత్రుడికి అన్నలూ తల్లీ తండ్రీ అందరూ ఉన్నారు!

వాతాపి నగరానికి కొంత దూరంలో ఉన్న ఒక ఊళ్ళో మధ్యతరగతి కుటుంబంలో విచిత్రుడు పుట్టాడు. తండ్రి మూలంగా అతనికి అతి బాల్యంలోనే బొమ్మలు గీ…ుడం అబ్బింది. బొమ్మలు వె…్యుడానికే పుట్టాడా అన్నట్లు ఆ కురవ్రాడికి మరేది అబ్బలేదు. అన్నలు, వదినలు అతణ్ణి ఈసడించుకొని ఇంటినుంచి తరిమేశారు. కురవ్రాడికి విఘ్నేశ్వరుడంటే చాలా ఇష్టం. వాతాపి నగరానికి బ…ులుదేరివస్తూ, తిండీతిప్పలు లేని నీరసంతో మార్గంలో ఒక కరుకురాతి మీద పడిపో…ూడు.

దెబ్బ తగిలి తెలివితప్పి పడిఉన్న అతణ్ణి సాధువులు కొందరు కాపాడి తమ వెంట వాతాపి నగరానికి తెచ్చారు. అదీ విచిత్రుడి బాల్యచరిత్ర. ఆ ఏడాది వాతాపి నగరంలో వినా…ుక చతుర్థి ఉత్సవాలకు ఒక చిత్రకళా ప్రదర్శన ఏర్పాటు జరిగింది. నిలువెత్తు వినా…ుక విగ్రహాలను చిత్ర కళా ప్రతిభ కనపరుస్తూ రంగులు వేసి ప్రదర్శనలో పెట్టాలి.
అన్నిట్లో గొప్పగా ఉన్న విగ్రహాన్ని వెయ్యి బంగారు కాసులకు నవరాత్రి ఉత్సవాలు నిర్వహించేవారు కొంటారు. రత్నఖచిత స్వర్ణకంకణాన్ని నగరపాలకులు చిత్రకారుడికి బహూకరిస్తారు. ఆ పోటీ ప్రదర్శనకు ఆస్థాన చిత్ర కారులూ, గొప్ప గొప్ప చిత్రకళా నిపుణులూ చాలా మూల్యాన్ని వెచ్చించి దేశాంతరాల నుంచి తెప్పించిన రంగులు, బంగారు పూతలు, రంగురంగుల మెరుపురేకులు, రంగురాళ్ల పొళ్ళు ఉపెూగించి, మెరుగుపూత పెట్టిన విఘ్నేశ్వర విగ్రహాలను ప్రదర్శనలో పెట్టారు. విచిత్రుడికి ఒక కుమ్మరి మిత్రుడున్నాడు. విచిత్రుడు దగ్గిరుండి చెప్పిన విధంగా అతడు బంకమట్టితో విఘ్నేశ్వర విగ్రహాన్ని చేశాడు.

 విచిత్రుడు సున్నము, మసి, జేగురు, పచ్చమట్టి, ఆకుపసర్లను ఉపెూగించి విగ్రహానికి రంగులు దిద్దాడు. విచిత్రుడు రంగులు వేసిన ఆ విగ్రహాన్ని చిత్రకార ప్రముఖులు ప్రదర్శనలో పెట్టనివ్వ లేదు. విచిత్రుడు ప్రదర్శన నిర్వాహకులతో, ‘‘అ…్యూ! ద…ుతో చిట్ట చివర్న నా విగ్రహాన్ని కూడా ఉంచండ…్యూ! ఉడతాభక్తిగా నేను కూడా నాకు వచ్చినంతగా విఘ్నేశ్వరుడికి రంగులు వేశానని అనుకుంటూ, ఆ గొప్ప గొప్ప విఘ్నేశ్వరుల సరసన నా విఘ్నేశ్వరుడు కూడా ఉంటే చూసుకోవాలని ఉంద…్యూ!

అంతకు తప్ప మరే కోరికా లేదు!''అని ఎంతో ప్రాథే…ుపడ్డాడు. కానీ, ‘‘కులగోత్రాలు, ఊరూ పేరూ లేనివాడివి, కడజాతులతో తిరిగేవాడివి. అలాంటి నీ చేతుల్లో త…ూరైన విగ్రహానికి వంశప్రతిష్ఠలుగల ప్రఖ్యాత మహా చిత్రకారుల విగ్రహాల సరసన ప్రదర్శించడానికి అర్హత లేదు!''అని నొక్కి వక్కాణించారు ప్రదర్శన నిర్వాహ కులు.
విచిత్రుడు చాలా విచారపడ్డాడు. కుమ్మరి మిత్రుడు, ‘‘ప్రదర్శన పందిట్లో పెట్టకపోతే పో…ూరు, మనం విగ్రహాన్ని వేరేచోట పెడదాం పద!'' అని విచిత్రుడికి నచ్చజెప్పి, ప్రదర్శనశాలకు దగ్గర్లో ఉన్న ఒక అరటిచెట్టు మొదట విగ్రహాన్ని పెట్టి, విచిత్రుణ్ణి తనతోబాటు అక్కడ కూర్చుండ బెట్టుకున్నాడు.

ప్రదర్శనశాలలో పెద్దవాళ్ళు విగ్రహాలను చూస్తూ, గుంపులు గుంపులుగా చేరి, విగ్రహా లకు ఉపెూగించబడిన రంగుల విలు వల గురించి, చిత్రకారుల పదవీ కుల గోత్రాల గొప్పలూ చెప్పుకుంటూ ఉంటే, పిల్లలంతా విచిత్రుడి వినా…ుక విగ్రహం దగ్గిరికి చేరి హర్షధ్వానాలు చేస్తూ ఆసక్తితో చూస్తున్నారు. ఆ సమ…ుంలో ఆకాశం నుంచి జారిపడ్డ జంటమెరుపుల్లాగ ఉన్న ఇద్దరు తరుణులు, ప్రదర్శనశాలకు వచ్చారు.

వారు నిండుగా ధరించిన రత్నా భరణాల కాంతి మిరుమిట్లు గొల్పుతున్నది. జనం వారిని చూసి విస్తుబోతూంటే, పెద్దామె, ‘‘కళానంద నగరం మాది. మాకు నచ్చిన వినా…ుక విగ్రహం కోసం పదివేల వరహాలు పట్టుకుతిరుగుతున్నాం!'' అంటూ చేతనున్న బంగారు జలతారు అల్లిక సంచిని గలగల్లాడించింది. అక్కడ ఉన్న చిత్రకారులు చరచరా వారివారి విగ్రహాల దగ్గిరికి వెళ్ళి నిల్చున్నారు. ‘‘మా అక్క ప్రసన్నవదన గొప్ప గా…ునీ మణి.
అంతేకాదు, గొప్ప తిండిపోతు. నైవేద్యపుష్ఠి, విగ్రహపుష్ఠి తర్వాతనే గాత్రపుష్ఠి. బొజ్జపెంచి పాడి చూడు, అనే గా…ుక సిద్ధాంతాలకు తార్కాణం మా అక్క ప్రసన్నవదన!'' అంటూ సుకుమారంగా సమ్మోహనాస్ర్తంలాగున్న చిన్నామె కాలి మువ్వలు ఘల్లుమనిపించింది. ‘‘మా చెల్లి మోహన గొప్ప వాగుడు కా…ు, అంతకంటె గొప్ప నర్తకీమణి! చూడ్డానికి చిన్నారి చిట్టిలాగుందే కాని, నన్నే అవలీలగా ఎత్తి తిప్పేస్తుంది!

అద్భుతమైన అంత శక్తి సామర్థ్యాలున్నాయి ఆ చిన్నదానికి. నృత్యంలో దాని చురుకుదనం చూడశక్యం కాదు!'' అని ప్రసన్న వదన చెప్పింది. ‘‘మా చేత పాడించడం, ఆడించడం, ఆ ఇంద్రుడికీ, కుబేరుడికీ సాధ్యం కాదు. అలాంటి ఆటపాటల్ని, మాకు కావలసిన విగ్రహం ముందు జరుపుతామని మొక్కు కున్నాం!'' అని మోహన చెప్పింది. వారి మాటలకు పరవశించిపోతూన్న జనం మంత్రించినట్లుగా పక్కకు తప్పుకుని విశాలంగా దారి చేశారు.     

విఘ్నేశ్వరుడు - 22


అవ్వ ఒక రోజున ఫలవృక్షాలతో నిండి వున్న మార్గం గుండా వెళ్తూండగా ఒక అందమైన బాలకుడు చెట్టుమీద కూర్చుని పాడుకుంటున్నాడు. చెట్టు నిండా పళ్ళు విరగపండి వున్నవి. ఆ కురవ్రాణ్ణి పలకరించి మాట్లాడాలని అవ్వకు బుద్ధిపుట్టింది. ‘‘నా…ునా! ఒక పండు ఇలా పడె…్యువూ!
 
నోరూరుతున్నది,'' అని అన్నది. బాలుడు నవ్వుతూ, ‘‘అవ్వా! ఏ పండు కావాలి? చెట్టు నిండా రకరకాల పళ్ళున్నవి. ముసలితనాన్ని పోగొటే్ట పండు ఇమ్మంటావా? మృత్యువును దూరంచేసే పండా? ధనరాసుల్నిచ్చే పండా? ఎలాంటి పండు కావాలి?'' అన్నాడు.
 
అవ్వకు ఆ బాలుడు సుబ్రహ్మణ్యేశ్వరుడే అని తెలిసిపోయింది. ఆమె చేతులెత్తి మ్రొక్కుతూ, ‘‘సుబ్రహ్మణ్యస్వామీ! ఎంత పంచినా తరగని అపార జ్ఞాన సంపదనిచ్చే పండు ఇవ్వు, తండ్రీ! జ్ఞానఫలాన్ని అనుగ్రహించు!'' అంటూ సాగిలపడింది. సుబ్రహ్మణ్యస్వామి నిజరూపంతో దండాన్ని ధరించి నెమలిపై సాక్షాత్కరించాడు. అవ్వ శిరస్సు బళ్ళెపు మొనతో సుతారంగా తాకి అనుగ్రహించాడు.
 
అవ్వకు ఒక్కసారిగా విశ్వస్వరూపమైన ఓంకారతత్వము, బ్రహ్మజ్ఞానము, జీవన్ముక్తిమార్గము తెలిసి అపారమైన జ్ఞానం కలిగింది. సుబ్రహ్మణ్యేశ్వరుడు అవ్వను ఆశీర్వదించి ఆ క్షణమే అంతర్థానమ…్యూడు. అవ్వ కాలినడకను ఊరూరా, వాడవాడా జ్ఞానాన్ని, భƒక్తిని, ఉత్తమ జీవన ధర్మాలను సామాన్యులకు తెలిసే మాటలలో ప్రబోధిస్తూ దేశ సంచారం చేసింది.

అవ్వ నోటి నుంచి వచ్చిన మధుర వాక్కులు, కవితలాగ గీతాలై ప్రజాసామాన్యంలో వ్యాప్తిపొంది చిరస్థాయిగా నిలిచాయి. అవ్వ అలా వెళ్తూ చీకటి పడ్డ వేళకు ఒక అరణ్య మార్గానికి వచ్చింది. ఆకాశంలో మేఘాలు దట్టంగా క్రమ్ముకొచ్చాయి. చిట్ట చీకటిగా ఉంది. ఉండి ఉండి మెరుస్తున్నది. తుప్పర పడుతున్నది. అవ్వ కాలికి రాయి తగిలి పడిపోయింది. చేతనున్న ఊతకర్ర దూరంగా పడింది.
 
ఆ చీకటిలో ఎవరో వస్తున్న పాదధ్వని మధురంగా వినిపించింది. అవ్వ తల ఎత్తి చూసింది. అప్పుడే మెరిసింది. మెరుపు వెలుగులో ముద్దుగా, బొద్దుగా దోరపు బొజ్జతో ఒక బాలుడు కనిపించాడు. ఆ బాలుడు అవ్వను లేవనెత్తి కర్ర తెచ్చి అందించాడు. అవ్వ పట్టిన కరన్రు బాలుడు కదలకుండా పట్టుకుని, ‘‘అవ్వా! ఎక్కడికి వెళ్తున్నావు? ఏ క్షేత్రం చూడాలని వెళ్తున్నావు? ఏ తీర్థం సేవిస్తావు?'' అని అడిగాడు. ‘‘నా…ునా! నాకు ఈ పుడమి అంతా ఒకే ఒక దివ్యక్షేత్రం.
 
ప్రత్యేకంగా క్షేత్రాలు, తీర్థాలు సేవించాలని నాకు లేదుగాని నేను చేరవలసిన క్షేత్రాన్ని ఎలాగ చేరాలో దారి కనిపించడంలేదు. ఇంతకూ నువ్వెవరో ఏమిటో! పసివాడివి ఈ చీకటిలో వస్తున్నావెందుకు?'' అని అవ్వ అన్నది. ‘‘అవ్వా! నేను నీ ఆబాల్య సన్నిహితుణ్ణి. పుట్టినప్పటి నుంచీ నన్నెరిగున్నదానివే, చీకటిలో గుర్తించలేకపోతున్నావు! ఇంతకూ నువ్వు చేరాలనుకుంటున్న ఆ క్షేత్రం ఏమిటో చెప్పావు కాదు!'' అన్నాడు ఆ బాలుడు.
 
‘‘చెప్పి ఏం లాభం! తీసుకెళ్తావా? అది శివసన్నిధానం అనే మహాక్షేత్రం!'' అన్నది అవ్వ. ‘‘ఓష్‌! ఈ మాత్రం దానికేనా, అదెంత పని నాకు! నీ చెయ్యి పట్టుకుని తీసుకెళ్తాను పద!'' అంటూ బాలుడు అవ్వ చేతిని పట్టుకుని అడుగు వేశాడు. రెండో చేత ఊతకరత్రో అవ్వ అడుగు ముందుకు వే…ుబోతుండగా పెద్ద మెరుపు మెరిసింది.
 
ఆ కాంతిలో తన చేతిని తొండంతో పట్టుకుని నడిపించే విఘ్నేశ్వరుణ్ణి చూసి అవ్వ కన్నులు మూసి, ‘‘దేవా! చిన్ననాటి నుంచీ నువ్వే నడిపిస్తున్నావు, నేను కన్నులు మూసుకున్నా తెరిచినా ఒకటే!'' అని అనుకుంటూ కళ్ళు తెరవకుండానే విఘ్నేశ్వరుడు ఎక్కిస్తూ తీసుకెళ్తుంటే ఎన్నో ఎన్నో మెట్లు ఎక్కుతూ, అలా ఎంత కాలం గడిచిందో తెలీకుండా వెళ్ళింది.

అలా వెళ్ళగా వెళ్ళగా, ‘‘అవ్వా! శివసాన్నిధ్యాన్ని సమీపించాము!'' అని అన్న విఘ్నేశ్వ రుడి మాటకు అవ్వ కన్నులుతెరిచి చూసింది. అక్కడ వెలుగు తప్ప మరేమీ కనిపించలేదు. కిందికి చూస్తే అనేక నక్షత్ర మండల సముదా…ూలు సోపాన పంక్తుల్లాగ కనిపించాయి. ఎన్నెన్నో సూర్యకుటుంబాలు, తోకచుక్కలు, వా…ుురూపంలో తిరుగుతూ పెరుగుతూన్న జ్యోతులు, వెలుగు చక్రాల్లాగ గిర్రున తిరుగుతున్న తేజో మండలాలతో నిండిన అనంత విశ్వం పాదాల దిగువ కన్నుల పండువుగా వున్నది.
 
విఘ్నేశ్వరుడు అవ్వచేతినివదిలి, ‘‘అవ్వా! శివసన్నిధానాన్ని చేరుకున్నావు. ఇక్కడ కాలం అనేది లేదు. నాశము అనేది లేదు. ఇదే సృష్టి స్థితి ల…ూలకు అతీతమైన శివుని సన్నిధానం, అసలు కైలాసం! విశ్వనాథుడు విశ్వేశ్వరుడైన శివుణ్ణి దర్శించు!'' అని చెప్పి అంతర్థానమ…్యూడు. అవ్వకు లింగాకారంగా మీదకూ కిందకూ ఒకేలాగ వ్యాపించి వున్న గొప్ప జ్యోతి కనిపిం చింది. ఆ జ్యోతిలో ప్రమథ గణాలు చేస్తున్న స్తోత్రం ఓంకార ధ్వనిగా వినిపిస్తున్నది. విశ్వేశ్వరుడైన శివ
 
 
ుడు కనిపించాడు. అతని కిరుపక్కలా, విఘ్నేశ్వరుడు, పార్వతి, కుమార స్వామి, నంది మొదలైన వారంతా ఉన్నారు. అవ్వకు శివ సాక్షాత్కారమైంది. శివుడు ప్రీతితో తన అభ…ు హస్తాన్ని అవ్వ తలపై వుంచి అనుగ్రహించాడు. ఆ విధంగా అవ్వ శివసా…ుుజ్యాన్ని పొందింది. మంటప చిత్రాల్లో, చెరుకుగడ పట్టివున్న విఘ్నేశ్వరుడిని ఒక రైతు కుతూహలంగా చూస్తూండడం గమనించి పావనమిశ్రుడు కథ ఆరంభించాడు: రాజంతటి భూస్వామి ఒకడు ఏటేటా వినా…ుక పూజలు, ఉత్సవాలు ఘనంగా జరిపిస్తూ, గణేశ భక్త శిరోమణి అనిపించుకున్నాడు.
 
అతనికి అనేక పంట పొలాలతో పాటు పెద్ద చెరుకు తోట ఉంది. ఆ చెరుకుతోట పని అంతా చూసుకుంటూ ప్రతి ఏటా పుష్కలంగా చెరుకు పండించి భూస్వామికి మంచి రాబడి చేకూర్చే పాలేరు, మనస్సులో విఘ్నేశ్వరుణ్ణి నమ్మిన భక్తుడు. ‘‘ఈసారి మరింత బాగా పండించు గణేశా!'' అని మనస్సులో మొక్కుతూ చెరుకు నాటి ఏడాదికేడాది తన …ుజమానికి మరింత లాభం చూపించేవాడు. పాలేరూ అతని భార్యా, పదేళ్ళ కొడుకూ ముగ్గురూ చెమటోడ్చి పని చేసేవారు. భూస్వామి మాత్రం చాలా తగ్గించి కూలి ఇచ్చేవాడు, అదీ సరిగా ఇచ్చేవాడు కాదు.

పాలేరు అమా…ుకుడు, అల్పసంతోషి. ఏమీ అనేవాడు కాడు. భూస్వామి భార్య ఉత్తమురాలు. మంచి అయినా చెడ్డ అయినా మనస్సులో గణేశుడికే నివేదించుకునేది. పాలేరుకి కూలి ఇవ్వడంలో భర్త మరీ అన్యా…ుం చేస్తూంటే, ‘‘పాపం, వాళ్ళు పడే కష్టానికి మీరిచ్చేది ఏ మాత్రం? సరిగా ఇవ్వండి!'' అనేది. ‘‘బాగానే ఉంది నీ బోడి సలహా! ఇలా మిగుల్చుకుంటూ వస్తేనే గదా మనం గణేశ ఉత్సవాలు జరిపించేది!'' అనేవాడు భూస్వామి. ఆమె ‘‘కష్టపడేవాళ్ళ నోట మట్టిగొట్టి పూజలూ, ఉత్సవాలూ జరపకపోతేనేం? గణేశా, ఈ…ునకు మంచి బుద్ధి కలిగించు!'' అని అనుకునేది.
 
ఆ ఏడాది చెరుకు ఏనుగు తొండాల్లాగ మరింత విశేషంగా పండింది. వెేు్యసి చెరు కులు కట్టిన మోపులు బళ్ళతో భూస్వామి దివాణం చేరుతున్నాయి. ‘‘అంతా గణేశ్వరుడి ద…ు. ఊరికే పోతా…ూ, పూజలూ, ఉత్సవాలూ. మరి దేనికి చేయిస్తున్నాం!'' అన్నాడు భూస్వామి. ‘‘అంతేగాని మన పాలేరు శ్రమ ఏమీ లేదంటారు, అంతేనా?'' అని భార్య అన్నది. ‘‘బాగానే ఉంది నీ వల్లమాలిన జాలి! అలా పాలేర్లనూ, జీతగాళ్ళనూ వెనకేసుకొస్తే మనం కూడా వాళ్ళ వెనక్కే వెళ్ళవలసి ఉంటుంది.
 
ఈ మనుషుల్లో ఏముంది, అంతా ఆ వినా…ుక దేవుడి మహిమ!'' అన్నాడు భర్త. ‘‘ఓ విఘ్నేశ్వరా! ఈ…ునకు జ్ఞానోద…ుం కలిగించవలసింది నీవే!'' అని ఆమె మనసులో ప్రార్థించింది. పాలేరు కొడుక్కి విఘ్నేశ్వరుడంటే ప్రాణం. వినా…ుక చవితికి తెల్ల కలువలూ, ఎర్ర తామరలూ, పూలూ, పత్రీ ప్రతి ఇంటికీ పూజకు తెచ్చి ఇచ్చేవాడు. వినా…ుక చవితి వచ్చింది. కురవ్రాడి ప్రా…ుంతో పాటు బుద్ధి కూడా ఎదుగుతున్నదేమో, వాడు చెరుకు మోపుల్ని భూస్వామి దివాణానికి చేరవేయిస్తున్న తండ్రి దగ్గర కెళ్ళి, ‘‘నాన్నా, మనం కూడా వినా…ుకుడికి పెట్టుకుందాం, ఒక చెరుకుగడ తీసుకెళ్తా!'' అన్నాడు.
 
పాలేరు ఒక చెరుకు తీసి కొడుక్కిచ్చాడు. వాడు దాన్ని ఇంటికి తీసుకెళ్తున్నాడు. అది భూస్వామి కంటబడింది. భూస్వామి ఉగ్రనరసింహావతారుడై, ‘‘ఏమిరా, నా చెరుకంతా నీ ఇంటికి చేరవేయిస్తున్నావా?'' అంటూ పాలేరుపై విరుచుకుపడి నానా మాటలూ అంటూ, కొరడాతో కొడుతూంటే, భూస్వామి వెంట నున్న పరివారమూ, గ్రామస్థులూ చూస్తూ ఊరుకున్నారేగాని కిక్కురుమనలేదు.


భూస్వామి పలుకుబడి అలాంటిది! అతడేం చేసినా చెల్లుతుంది. ఎదురు తిరిగి అడిగేవాడు లేడు. పాలేరు తాళుకోలేక, ‘‘చవితి కదా వినా …ుకుడికి పెట్టుకుందామని పట్టుకెళ్ళమని ఇచ్చాను, ఒక్కటంటే ఒక్క చెరుకు!'' అన్నాడు. భూస్వామి, ‘‘ఏమిటీ! మీ జాతి తక్కువ వాళ్ళకి పూజలూ, వినా…ుకుడూనా?'' అన్నాడు. పాలేరు, ‘‘కడజాతి అయితే అయిందిగాని, దేవుడూ భక్తీ ఉండవా?'' అన్నాడు.
 
భూస్వామి హేళనగా, ‘‘నీ ముఖానికి భక్తి కూడానా! నక్కకూ, నాగలోకానికీ ఉన్నంత దూరం! చెరుగ్గెడ పట్రా!'' అన్నాడు. పాలేరు, ‘‘ఒక్క చెరుకు కోసం అలా రాపాడిపోతారేమ…్యూ? బళ్ళతో చెరుకు దింపుకున్నది చాలదా, ఒక్క చెరుకుతో ఏం బావుకుంటావ…్యూ?'' అన్నాడు. భూస్వామి, ‘‘ఎంత మాట కూశావురా! ఒకటి కాదు పది కాదు వెయ్యి చెరుకులైనా నాకు పూచికతో సమానం తెలుసా! తెల్లవారే సరికి నువ్వు వెయ్యి చెరుకులు తినాలి! నమిలిన పిప్పి అంతా పోగు కనిపించాలి! 

లేకుంటే చెరుకొక్కింటికి వెయ్యి కొరడా దెబ్బలు తింటావు తెలిసిందా!'' అంటూ పాలేరును పెడరెక్కలు విరిచి కట్టించి, భృత్యులచేత వాణ్ణి బందీలాగ చెరుకు నిలవ చేసే సాలలో త్రోయించి వెయ్యి చెరుకుల మోపు వాడి ముందు పడవేయిం చాడు. భూస్వామి గొప్ప తిక్కమనిషి. ఎంత తోస్తే అంత. పాలేరును ఉంచిన సాల చుట్టూరా భటుల్ని కాపలా పెట్టాడు. భూస్వామి భార్య, ‘‘విఘ్నేశా! పాలేరు ఉత్త అమా…ుకుడు.
 
చెరుకు తినడానికి పూనుకుంటే పాపం నిష్కారణంగా చస్తాడు. తినకపోతే నా భƒర్త దెబ్బలు కొడతాడు. వాణ్ణి ఎలాగ కాపాడతావో మరి!'' అని మనసులో అనుకుంది. పాలేరుకి ఏమీ తోచలేదు. చేసేది లేక విఘ్నేశ్వరుణ్ణి తలచుకుంటూ, చీకటి పడే వేళకు అలాగే నిద్రలో పడిపో…ూడు. తెల్లవారుతూనే భూస్వామి వెళ్ళిచూస్తే, తెల్లగా హిమాల…ు పర్వతం లాగ చెరుకు పిప్పిపోగు కనిపించింది. భూస్వామి దె…్యుం పట్టినవాడిలాగ పెద్ద కేక పెట్టి తెరిచిన నోరు తెరిచినటే్ట ఉండిపో…ూడు.
 
ఆ కేక విని వచ్చిన భార్యతో భూస్వామి, ‘‘అంతా సర్వనాశనం! సాలలో ఒక్క చెరుకు మిగలకుండా అంతా పిప్పి పిప్పి! పాలేరు కాడు, భూతం! వాడు మనల్ని తినేస్తాడు పద!'' అంటూ అరుస్తూంటే, ఆమె నవ్వి, ‘‘వాడు భూతమూ కాదు, తిననూ లేదు! నేను కళ్ళారా చూశాను. అప్పటికింకా తెల్లారలేదు. ఏనుగు ఘీంకారం విని, కిటికీ లోంచి చూశాను. పెద్ద ఏనుగు చెరుకు మేస్తూ కనిపించి మా…ుమైంది!'' అన్నది.
 
‘‘ఏనుగేమిటి, నీ మొహం! ఈ చుట్టుపక్కల ఏనుగన్నది ఉన్నట్టు వినలేదు,'' అని భూస్వామి అంటూండగా, కొంత మంది వినా…ుక ఉత్సవశాల నుంచి పరుగున వచ్చి, ‘‘రాత్రి నుంచీ పందిట్లో పూజలో పెట్టిన వినా…ుక విగ్రహం కనిపించటంలేదు. అంతటా వెతికాము,'' అని చెప్తూనే సాలలోకి చూస్తూ, ‘‘అదుగో, విగ్రహం, అదుగో!'' అంటూ అటుకేసి వెళ్ళారు.

విఘ్నేశ్వరుడు - 21


హోమాగ్ని నుండి పుట్టిన భ…ుంకరమైన జంతువు అదృశ్యం కాగానే కాలుడు విఘ్నా సురరూపం దాల్చి కాలపాశాన్ని విసిరాడు. కాలపాశం గిరగిరా తిరుగుతూ ప్రళ…ుంగా అంతా చుట్టబెట్టింది. అభినందనుడు పరాక్ర మించి దాన్ని ఛేదించడానికి …ుత్నించి నేల కొరిగాడు. కాలపాశం మరింత విజృంభించి జీవకోటిని అంతమొందిస్తూంటే వశిష్ఠుడు మొదలైన సప్తమహర్షులు, ఋషులు, లోకకళ్యాణం కోరేవారంతా కలిసి బ్రహ్మను ప్రార్థించారు.
 
బ్రహ్మ, ‘‘కాలపాశాన్ని తప్పించడం ఎవరి తరమూ కాదు. కాలప్రభావాన్ని అరికట్టి - కాలుణ్ణి నిగ్రహించగలవాడు గణేశుడొక్కడే!'' అని చెప్పి వారందరితో కలిసి గణేశ్వరుడిని ప్రార్థించాడు. మహాగణాధిపతి స్వస్తికాపీఠంపై ఆశీనుడై సాక్షాత్కరించాడు. తన చేతనున్న పాశాన్ని వదిలాడు. గణేశుడి పాశం క్షణంలో కాలపాశాన్ని ఉచ్చు పన్ని పట్టినట్లు గణాధిపతి ముందు కట్టి పడేసింది.
 
కాలుడు పరాభవంతో మండిపడుతూ మరింత భీకరజుగుప్సాకరంగా విఘ్నాసుర రూపం చూపుతూ కాలదండాన్ని ఎత్తి ఝళి పించాడు. గణేశుడు అంకుశాన్ని వదిలాడు. అంకుశం విఘ్నాసురుడి వెన్నెముకలో గుచ్చింది. విఘ్నాసురుడు అంకుశం తాకిడితో అలా అలా కుదించుకుపోయి, అంకుశం వెన్నంటి తరుముతూండగా శరణు కోరుతున్నట్లుగా గణేశుడి రెండు పాదాల ఇరుకున పడి బందీగా చిక్కుకున్నాడు.

గజముఖుడు విఘ్నాసు రుణ్ణి రెండు పాదాలతో గట్టిగా నొక్కాడు. అప్పుడు కాలుడు విఘ్నాసురుడి నుంచి బ…ుటపడి గణేశుడికి మ్రొక్కుతూ, ‘‘గణేశా! నీ మహావిశ్వపాశం ముందు ఈ భూమికి, సూర్యోద…ుం సూర్యాస్తమ…ూలకుమాత్రమే సంబంధించిన నా కాలపాశం ఎంత! విశ్వాన్ని అదుపులో ఉంచే నీ అంకుశం ముందు నా దండమేపాటిది! పర్వతంలాంటి భూతాన్ని నీ వాహనరూపాలైన చిటె్టలుకలు తుదముట్టిం చాయి!
 
నీవు విఘ్నాసురుణ్ణి అధీనంలో పెట్టు కొన్న విఘ్నేశ్వరుడివి! దేవా, నన్ను మన్నించు!'' అని వేడుకున్నాడు. విఘ్నేశ్వరుడు, ‘‘కాలా! ఇతరుల పని నెత్తిని వేసుకోవడం కోరి ముప్పుతెచ్చుకోవడమే! నీ ధర్మాన్ని నువ్వు సక్రమంగా నిర్వర్తించు! ఇక ఇక్కడ నుంచి కదిలి, వెళ్ళు,'' అని మంద లించాడు. కాలుడు మెలివేసిన చేతులతో చెవులు పట్టుకుని మూడుసార్లు వంగి లేచి, లెంపలు వేసుకొని, ‘‘బుద్ధ్ది బుద్ధి!
 
ఆ ఇంద్రుడి మాట విని గడ్డి కరిచాను. బుద్ధి వచ్చింది దేవా! విఘ్నే శ్వరుడవైన నిన్ను నమ్మి కొల్చినవారి దాపులకు నేను పోను. వారిని వ్యాధులు సోకవు. వారికి విఘ్నాలుండవు!'' అని చెప్పి శలవు తీసు కున్నాడు. కాలుణ్ణి విఘ్నేశ్వరుడు భంగపుచ్చిన ప్పుడే కాలపాశంవల్ల నేలకొరిగిన అభినందన మహారాజు మొదలైనవారంతా సజీవులై నిద్ర లేచినట్లు లేచారు. ఆకాశం నుంచి పూలజల్లు కురిసింది. వినా…ుకుణ్ణి విఘ్నేశ్వరుడనీ, విఘ్నరాజు అనీ అందరూ కీర్తించారు.
 
అప్పట్నించీ, ఏ మంచిపనికైనా, శుభకార్యా నికైనా స్వస్తికను ముగ్గుగా తీర్చిదిద్దడం, పసుపు ముద్దను విఘ్నేశ్వరుని ప్రతిరూపంగా ఉంచి పూజించడం సంప్రదా…ుంగా నిలిచింది. ‘‘కాలపురుషుణ్ణి భంగపుచ్చి పాదాక్రాం తుణ్ణి చేసుకొన్న విఘ్నేశ్వరుడి మీద విశ్వాసం కలవారూ, విఘ్నేశ్వరుడి ఆశీర్వాదబలం ఉన్నవారూ కాలప్రవాహానికి ఎదురీత ఈది నిలద్రొక్కుకొని, విజ…ుం సాధించగలరు!''
 
అని చెప్పి పావనమిశ్రుడు ముగించాడు. ఒకనాటి సా…ుంకాలం ఒక బాలిక పావన మిశ్రుడి దగ్గిరకువచ్చి, అతడి చిటికెనవేలు పట్టుకొని ఒక కుడ్యచిత్రం దగ్గరకు తీసుకు వెళ్ళింది. ఆ చిత్తరువులో అసమాన సౌందర్యంగల ఒక కన్య విఘ్నేశ్వర విగ్రహానికెదురుగా మోక రిల్లినమస్కరిస్తున్నది.

ముక్కుపచ్చలారని ఆమె తల ముగ్గుబుట్టలా ఉంది. పావన మిశ్రుడు ఆ కథ చెప్పడం ప్రారంభించాడు: ఒక పుణ్యదంపతులకు విఘ్నేశ్వరుని ఆరాధించిన వరప్రసాదంగా రత్నంలాటి ఆడ పిల్ల పుట్టింది. పుడుతూనే ఆ శిశువు పురిటి గదికి ఎదురుగా గూటిలో ఉన్న విఘ్నేశ్వర ప్రతిమను విప్పారిన కన్నులతో చూస్తూ, ఆ బొమ్మ పిలుస్తున్నట్లుగా క్యారుమన్నది.
 
ఆ పాప ఉ…్యూల తొట్టిలో ఊగుతూ ఎప్పుడూ గూటిలో వున్న గణేశవిగ్రహాన్ని చూసుకుంటూ నవ్వులతో కేరింతాలు కొడుతూ ఆడుకొనేది. ఆ పిల్లకు సుందరి అని పేరు పెట్టారు. పేరుకు తగ్గట్టుగా సుందరి గొప్ప సౌందర్య వతిగా పెరిగి పెళ్ళి ఈడుకు వచ్చింది. సుంద రికి సౌందర్యంతో బాటు గొప్ప బుద్ధి, తెలివి తేటలు,అందరికీ హితవుకూర్చే మాటతీరూ కలిగి ఉండటం చూసి, ఆమెను జ్ఞానసుం దరి అన్నారు.
 
సుందరి అసమాన సౌందర్యం గురించి ఊరూరా చెప్పుకోసాగారు. శాపవశాన పుట్టిన గంధర్వకన్య అనీ, భూమ్మీద అవతరించిన దేవసుందరి అనీ అన్నారు. ఆమె పాణిగ్రహ ణానికి గొప్ప ధనసంపన్నులూ, అధికార బలం గలవారూ అసంఖ్యాకులుగా సుందరి తలిదండ్రులను ఒత్తిడిచేశారు. సుందరి గురించి విన్న ఆ రాజ్యమేలే మహారాజే, ఆ కన్యకారత్నాన్ని తన రాణివాసానికి తీసుకు పోవడానికి పరివారంతో రాజధాని నుండి బ…ులుదేరి వస్తున్నాడని తెలిసింది.
 
సుందరి ప్రతినిత్యమూ ఆరాధించే నదీ ఘట్టాన ఉన్న విఘ్నేశ్వర శిలావిగ్రహం ముందు మోకరిల్లి, కన్నులు మూసి నమస్కరిస్తూ, ‘‘విఘ్నేశ్వరా! శైశవం నుంచీ నిన్నే నమ్మినదాన్ని. సంసారంలో కొట్టుకుపోవడం నాకు ఇష్టం లేదు. నన్ను ముసలిదాన్ని చెయ్యి! జ్ఞాన సంపద నాకు అనుగ్రహించు! పుట్టినందుకు ప్రెూజనకరమైన పని నా చేత చేయించు!'' అని ధ్యానిస్తున్న ఆమె నల్లని కొప్పు వెండిలాగ మెరుస్తూ నెరిసింది.
 
పాలబుగ్గలు సొట్టలు సొట్టలు పడ్డవి. నుదురు అడ్డంగా ముడుతలు దేరింది. నదికి వచ్చినవారంతా నివ్వెరపోతూ చూస్తున్నారు. అమ్మాయి అవ్వ అయింది! ‘‘అమ్మాయి సుందరీ! ఏమిటమ్మా ఇది?'' అంటూ కంటనీరు పెట్టుకొంటున్న తండ్రి, తల్లితో, ‘‘నేను అమ్మాయినీ కాను, సుందరినీ కాను, అవ్వను! మీరు సంతోషించడానికి బదులు విచారిస్తారెందుకు? మీరిచ్చిన జన్మను సార్థకంగా చేసుకొనే అవకాశాన్ని గణేశుడు అనుగ్రహించాడు.

నా కంటె అజ్ఞానులైనవారికి నాకు తెలిసిన హితవచనాలు చెప్తాను. జ్ఞాను లైనవారినుండి తెలి…ునివి తెలుసుకుంటాను. అజ్ఞానదశలో ఉన్నవారంతా పసిపిల్లలవంటి వారే. అంతా నా పిల్లలే. వారికి నేను అవ్వను! నా పుట్టిన రోజు ఈ రోజే కదా. ఇదే నా పండగరోజు! పాద…ూత్రకు బ…ులుదేరు తున్నాను, నన్ను ఆశీర్వదించండి!'' అని అవ్వ అంటూ అక్కడ పడి ఉన్న చెట్టుకొమ్మను ఊతకరగ్రా పట్టుకొని చిన్నగా నవ్వుతూ లేచి నిలబడింది.
 
అప్పుడే అక్కడికి చేరుకున్న రాజును చూసి అవ్వ, ‘‘ప్రజల ధన ప్రాణ గౌరవాలను, కన్యలను రక్షణలో ఉంచవలసిన నువ్వే, ఒక కన్యను ఎత్తుకుపోవచ్చావు. ఊళ్ళు, ఇళ్ళు దోచుకొనే దండునా…ుకుడివా? రాజువా?'' అని అడిగింది. సిగ్గుతో సగం చచ్చిపోయిన మహారాజు కత్తినీ, కిరీటాన్నీ తీసి దూరంగా పెట్టి, అవ్వ పాదాలకు ప్రణమిల్లి, ‘‘మహాత్మురాలా! నీ దర్శనంతో నా అజ్ఞానం తొలగింది. నేను నా రాజసాన్ని వదిలి ప్రజకు సేవకుడిననుకుంటూ వర్తిస్తాను!'' అన్నాడు.
 
కారణజన్మురాలని అంతా అవ్వను కీర్తి స్తుండగా బ…ులుదేరుతున్న అవ్వను పల్ల కిలో సంచారం చే…ులవసిందనీ, సర్వవిధ ప్ర…ూణసౌకర్యాలు అమర్చుతాననీ రాజు ప్రాథే…ుపడ్డాడు. అవ్వ నిరాకరించి, ‘‘రాజా! చెప్పులకు కూడా నోచుకోని అతి సామాన్యులైన కష్ట జీవుల మధ్యకు అందలమెక్కి వెళ్ళి ఏ మొగంతో నీతులు బోధించగలను? నువ్వు ప్రజకు విద్యా సౌభాగ్యాలను చేకూర్చు. నీ పని నువ్వు చెయ్యి!
 
నేను సామాన్యురాలిగా, సామాన్యులందరితో ఒకటిగా నేను చే…ు గల్గినది చేసుకుపోతాను. విఘ్నేశ్వరుడు, అతని ముద్దుల తమ్ముడు సుబ్రహ్మణ్యే శ్వరుడు అన్నీ చూసుకుంటారు. వారే నాకు రక్ష!'' అని చెప్పింది. అవ్వ కర్ర ఊతగా కాలి నడకను బ…ులు దేరి, జ్ఞానపీఠమైన ఒక మఠాన్ని చేరుకొంది. పీఠాధిపతికి మ్రొక్కి, ‘‘అ…్యూ! నాకు జ్ఞానం ఉపదేశించండి!'' అని కోరింది.
 
పీఠాధిపతి సంశయిస్తూ, ‘‘అమ్మా! నువ్వు స్ర్తీవి, జ్ఞానోపదేశం పొంది ఏం ప్రెూజనం?'' అన్నాడు. అవ్వ, ‘‘నీరూ, దీపమూ మగవాడికేగాని స్ర్తీకి ఉపెూగపడవా? ఉపెూగించలేదా? గ్రుడ్డివాడి చేతనున్న దీపం ఇతరులకు దారి చూపించగలదు కదా! జీవిలోని జ్ఞాన స్వభా వం మగదా? ఆడదా? ఏదీ కానిది, అన్నీ అయినది, అన్నిటా ఉన్నది ఒకటే అని అంటూనే పుట్టుకచేత ఎక్కువ తక్కువలు, అర్హతలు ఎంచడం జ్ఞానుల పనేనా?'' అని అన్నది.


 పీఠాధిపతి, ‘‘మహాత్మురాలా! జ్ఞాన పీఠంపై ఉండవలసింది నేను కాదు, జ్ఞాన రూపిణివయిన నీవే!'' అని అన్నాడు గౌరవంగా లేచి నిలబడుతూ. అవ్వ, ‘‘పీఠాలు, మఠాలు ఎందుకు? అందరికీ తేలికగా అర్థమే్యులాగ దగ్గిరికెళ్ళి ఎక్కువమందికి జ్ఞానం అందించడం మంచిది కదా! పంచభక్ష్య పా…ుసాల రాజభోజనం ఒకడికి పెటే్టకంటే, అంతా తినేది పదిమందికీ పెడితే మంచిది కాదా!'' అని అన్నది. ‘‘ఔను!
 
నేనూ అదే అనుసరిస్తాను,'' అని శిరసు వంచి నమస్కరించాడు పీఠాధిపతి. అవ్వ అలా వెళ్తూండగా ఒక మంచినీటి బావి దగ్గిర నలుగురు స్ర్తీలు, నీళ్ళు తోడుకొని తీసుకెళ్ళే విష…ుంలో ఒకామె చెప్తున్నది వింటున్నారు. ఆవిడ శాసిస్తున్నట్టు, ‘‘ఎవరు ముందు వచ్చినా, వెనక వచ్చినా నేను ముందు తోడుకెళ్ళాలి.
 
తర్వాత ఈవిడగారు, తర్వాత ఆమె, ఆ తర్వాత ఆ మనిషి!'' అని అంటున్నది. దూరంగా ఒక బాలిక, ‘‘కాసిని నీళ్ళు పొ…్యుండమ్మా, గొంతారిపోతున్నది!'' అంటూ దీనంగా అరుస్తున్నది. నలుగురు స్ర్తీలు ఏక కంఠంతో, ‘‘దూరం, దూరంగా పోవే! ఈ చా…ులకు రాకు!''

అంటూ కసిరినట్టు అరుస్తూండగా, చాలా దూరం ఎండలో నడిచి వచ్చిన బాలిక శోషి ల్లుతూ పడిపోయింది. అప్పుడు అవ్వ వెళ్ళి తన జాడీ చెంబుతో బాలిక నోట్లో నీళ్ళుపోసి తాగించింది. మిగిలిన నీరు అవ్వ తాగి దాహం తీర్చుకుంది. అది చూసి నలుగురు స్ర్తీలూ ఆశ్చర్యంతో నోళ్ళు నొక్కుకుంటూ, ‘‘హవ్వ! ఎంత పని చేశావు, అవ్వా! అది తాగగా మిగిలిన నీరు నువ్వు తాగుతావా! అది జాతి తక్కువది!'' అన్నారు.
 
అవ్వ త్రేన్చి శాంతంగా, ‘‘శ్రీమతుల్లారా! అసలు జాతే లేనిదాన్ని నేను! అయితే ఆ పిల్లలో, నాలో నీళ్ళే నాళాల్లో ప్రవహిస్తూ న్నందువల్ల నీళ్ళే మమ్మల్ని సేదదేర్చాయి!'' అంటూ కుతూహలంగా వెళ్ళి వాళ్ళ కడవ, బిందెల్లోకి చూసి ఆశ్చర్యంతో, ‘‘మీ శరీరం నిండా పాలే ఉంటా…ునుకుంటున్నాను. మరి మీకు నీళ్ళెందుకు? త్రాగడానికి కాదు గదా? అమ్మల్లారా! మీకు పుణ్యముంటుంది, నీళ్ళు మాకు వదలండి. మీరు పాలే త్రాగండి!''
 
అని అంటూ తన చెంబు నిండా నీళ్ళు పోయించుకున్నది. నలుగురు స్ర్తీలూ అవ్వ మాటల్లో దాగి ఉన్న సత్యాన్ని గ్రహించి సిగ్గుపడి, బుద్ధి తెచ్చుకున్నారు. అవ్వ అలా వెళ్తూండగా ఒక ఊళ్ళో జీవాల బలులు సాగుతున్నవి. జనం భ…ుపడుతున్న ట్లుగా దేవతకు మ్రొక్కుతున్నారు. అవ్వ, ‘‘ఎంత అన్యా…ుం చేస్తున్నారే, తల్లీ! వాళ్ళేమో మాంసాన్ని మంచి రుచులతో వంట చేసుకొని తింటారు. నిన్ను పచ్చి నెత్తురు తిని బతికే క్రూరజంతువుగా అవమానిస్తు న్నారు. తల్లిని అవమానించే పిల్లలైపో…ూరు వీళ్ళంతా!''
 
అని అంటున్న మాటలు జనం విని, ‘‘అపచారం! అపరాధం! అమ్మతల్లికి ఆగ్రహం వస్తే అంతా మసి చేస్తుంది!'' అంటూంటే, అవ్వ, ‘‘లంచం పెట్టలేదని ఏ తలై్లనా పిల్లల్ని చంపుతుందా? మీరు ఊరికే భ…ుపడుతున్నారు. అంతే! భ…ూన్నే భక్తి అనుకుంటున్నారు! మీ కోరికల్ని అమ్మకు అంటగట్టుతున్నారు! నిజమైన భక్తి అమ్మ మీద మీకు కలిగిననాడు మీకు భ…ుమూ ఉండదు, అపదలూ ఉండవు!'' అని చెపుతూ వారికి అర్థమే్యులాగ భక్తి మార్గాన్ని ఉపదే శించింది. 

విఘ్నేశ్వరుడు - 20


గజానన పండితుడి ఇంట కామధేనువులాంటి గంగిగోవు ఉన్నది. నందుడు అనేవాడు దాని బాధ్యతలు నిర్వహిస్తూ, గజానన పండితుడికి రోజూ చిక్కటి పాలు పితికి తెచ్చి ఇచ్చేవాడు. ఒకనాడు స్వరకేసరి నందుణ్ణి మంచిగా లోబర్చుకొని, వాడు చె…్యువలసినదంతా నూరిపోశాడు. గణపతి నవరాత్రి ఉత్సవాలకు కుమా ర్తెనూ, అల్లుణ్ణీ, మనుమడు గణేశభట్టునూ తీసుకురావడానికి దగ్గిరలోనే ఉన్న కళ్యాణి నగరానికి గజాననుడి భార్య రెండు రోజుల క్రితమే వెళ్ళి ఉన్నది.
 
గజాననుడి అమరగానాన్ని విని తరించ డానికి దూరదూరాల నుంచి రసజ్ఞులైన శ్రోతలు తండోపతండాలుగా వాతాపినగ రానికి చేరుకొంటున్నారు. ఆనాడే ప్రారంభ దినం. వాతాపిగణపతి ఆల…ు ప్రాంగణంలో గజాననుడు తొలిపాట వినిపించవలసిన రోజు, వినా…ుక చతుర్థి! వేకువనే నందుడు స్వరకేసరి చెప్పిన ప్రకారంగా లోటాలో ఉన్న నీళ్ళలో పితికి తెచ్చిన పాలు కొన్ని పోసి, లోటాను అలాగే తీసుకెళ్ళి గజాననుడికి ఇచ్చాడు.
 
గజాననుడు లోటాలోని నీళ్ళపాలను జూసి నివ్వెరపడి, ‘‘ఇదేమిటి నందా! ఎన్నడూ లేంది ఈరోజు పాలలో నీళ్ళుపోసి తెచ్చా వేమిటీ?'' అని అడిగాడు. వెంటనే నందుడు, ‘‘ఆ గణేశుడి సాక్ష! నేను పాలల్లో నీళ్ళు పోసి తేలేదు, ప్రమాణం చేసి చెపుతా!''అని బోరవిరుచుకుని అరిచాడు.
 
గజానన పండితుడి దగ్గర విన…ుంగా ఉండే నందుడు, అంత నిర్భ…ుంగా అరవడం చూసి ఆశ్చర్యపడుతూ వీధిలోని వాళ్ళు నలుగురూ వచ్చి మూగారు. వీధిని పోతూన్న వాడల్లే వెళ్తూన్న స్వరకేసరి ఆగి దూరంగా నిలబడిపోయి లోలోపల ముసిముసిగా నవ్వుకొంటూ చూడసాగాడు.

గజాననపండితుడు చిరుకోపంతో కను బొమలు ముడిచి, ‘‘నందా! ప్రమాణందాకా వచ్చావూ? ఏదీ ప్రమాణం చెయ్యి చూద్దాం!'' అని అన్నాడు. ప్రమాణం చే…ువలసివచ్చేసరికి జంకు పుట్టి నందుడు తటపటాయిస్తూంటే, ‘‘అలా దిక్కులు చూస్తావేం?''అంటూ గజానన పండి తుడు కంచుఘంటలాంటి కంఠధ్వనితో, ‘‘ప్రమాణం చె…్యువేం మరి?''అని గద్దించగా నందుడికి మరింత దిగులు పట్టుకొంది. దూరంగా ఉన్న స్వరకేసరి పెద్దమనిషి లాగ వేగంగా ముందుకు వచ్చి, ‘‘అనగానే సంబరమా, చె…్యురా నందా చెయ్యి!
 
చెప్పింది సరిగ్గా చెప్పి, దీపం ఆర్పు, భ…ుపడతా వెందుకు!'' అంటూ నిబ్బరం చెప్తూన్నట్టు కనుసైగ చేశాడు. నందుడు సగం ధైర్యం తెచ్చుకొని, ఎదురుగా గదిలో స్వర్ణగణేశ ప్రతిమదగ్గిర వెలుగుతున్న దీపం ముందు కెళ్ళి నిల్చుని, భ…ుం భ…ుంగా హీన స్వరంతో, ‘‘నేనేగాని పాలల్లో నీళ్ళుపోసి తెస్తే, నా రెండు చేతులూ పడిపోవాలి! లేదా అలాగ అన్న గొంతుకే పడిపోవాలి!'' అని చెబుతూ, దీపం ఆర్పేస్తూ గట్టిగా కళ్ళు మూసుకున్నాడు.
 
గజాననుడు దిగ్భ్రాంతితో కొ…్యుబారి పో…ూడు. అతని గొంతు బిగుసుకుపోయి మాట రాలేదు. ‘‘అెూ్య! ఎంతపని జరిగింది!'' అని నలుగురూ విచారిస్తూంటే, ‘‘ప్రమాణకాలు చేయించడం అంటే మాటలా మరి!'' అని అంటున్న స్వరకేసరి గొంతు విని నందుడు కళ్ళు తెరిచి, తన చేతులకేమీ కానందుకు ఆనందపడుతూ, గబగబా స్వరకేసరిని చేరు కున్నాడు. ఆ సమ…ుంలో బాలగణేశభట్టు పరు గెత్తుకుంటూ వచ్చి, ‘‘తాత…్యూ!
 
బండి దిగి ముందు నేను పరుగెత్తుకుంటూ వచ్చేశా! అమ్మమ్మా వాళ్ళంతా బండిమీద వస్తున్నారు!'' అని అంటూ తాతగారిని చూసి నివ్వెరబోతూ, నలుగురూ చెప్పినదంతా విని, పెదవులు బిగించి నడుం మీద చేతులుంచి ధాటిగా నిలబడి, ‘‘నందా, ఆగు!'' అన్నాడు. స్వరకేసరితో వెళ్ళిపోబోతూన్న నందుడు మంత్రించినట్టుగా ఠక్కున ఆగిపోయి, గదిలో దీపం వెలుగుతూనే ఉండడం చూసి విస్తుపో…ూడు.

‘‘నువ్వు దీపం సరిగా ఆర్పినట్టులేదు, మళ్ళీ ప్రమాణం చెయ్యి!'' అని శాసిస్తున్నట్టు బాలభట్టు అన్నాడు. భ…ుం లేదు వెళ్ళి ప్రమాణం చెయ్యి అన్నట్లుగా స్వరకేసరి నందుడి వీపు పొడిచి ముందుకు తోశాడు. బాలగణేశభట్టు, ‘‘నందా! సరిగ్గా విను, నేనేగాని నీళ్ళల్లో పాలు పోసి ఇస్తే, నా చేతులు పడిపోవాలి! అని చెప్పి దీపం ఆర్పు! ఊ, త్వరగా కానియ్యి,''అని హుంకరిస్తూ అన్నాడు. నందుడికి ముచ్చెమటలు పోశాయి. అతడు గజగజలాడుతూ, ‘‘అ…్యుబాబో! నేనీ ప్రమాణకం చె…్యును.
 
ఈ స్వరకేసరి చెప్పినట్లుగా, నీళ్ళలో పాలుపోసి తెచ్చి చ్చాను. పాలల్లో నీళ్ళు పో…ులేదని ప్రమా ణంచేశాను. అంతే! నన్ను రక్షంచండి!'' అని అంటూనే గబగబా వెళ్ళి, నీళ్ళల్లో పో…ుగా చెంబులో మిగిలి ఉన్న చిక్కటి పాలను తెచ్చి బాలభట్టు ముందుపెట్టి అలాగే మోకరిల్లు తున్నట్లు పడ్డాడు. అక్కడ చేరినవారంతా గలగలా నవ్వుతూన్న కోలాహలంలో స్వరకేసరి జాడలేకుండా పారి పో…ూడు. అతని కోసం కొందరు పరుగున వెళ్ళారు. అప్పుడు గణేశభట్టు నలుగుర్నీ కలి…ు జూసి, ‘‘చూశారా!
 
ఈ ప్రమాణకాలు చేసే వారూ, వెనుకదన్నుగా చేయించేవారూ ఎక్కువమంది వఠ్ఠి మా…ూవులు! మాటలు మారుస్తూ సత్యాన్నే తికమకపెటే్ట ద్రోహులు. అమా…ుకుల్ని నమ్మించి మోసం చేసే వంచ కులు!'' అని అన్నాడు. ‘‘ఔను! చిన్నవాడివైనా బాగా చెప్పావు. కళ్ళు తెరిపించావు!'' అని కురవ్రాడి తెలివి తేటల్ని మెచ్చుకుంటూ, గజానన పండితుడి గొంతుపట్టు విడిపోయినట్లు తెలుసుకొని, అంతా సంతోషిస్తూ వెళ్ళిపో…ూరు. గణేశభట్టు,‘‘తాత…్యూ!
 
ఆడంబరమూ, అహంకారమూ లేని పండితుడివైన నువ్వే పామరుడిలాగ, ఇలాంటి ప్రమాణాల మా…ులో పడ్డావంటే చాలా చిత్రంగా ఉంది కదా!'' అన్నాడు. గజాననుడు బాలుణ్ణి దగ్గరకు తీసుకుని కన్నులు మూసి, ‘‘ఔను, గణేశా!'' అని అంటూన్న సమ…ుంలో వీధిలో బండి ఆగింది. గజాననుడు కళ్ళు తెరిచి చూస్తే బాలుడు లేడు; అప్పుడే బండి మీంచి కిందికి గణేశ భట్టు దూకడం కనిపించింది.

గజానన పండితుడి ముఖం ఒక్క క్షణం జ్యోతిలాగ వెలిగింది. ‘‘గణేశా!'' అంటూ మహానందంతో ఆనందభైరవి ప్రారంభ స్వరంలాగ అరిచాడు. పావనమిశ్రుడు కథ చెప్పడం ఆపి, ‘‘పిల్లలూ! ముందు వచ్చిన ఆ గణేశభట్టు ఎవరో చెప్పండి?''అని అనడమే తరవాయిగా, ‘‘ఇంకెవరు, మన విఘ్నేశ్వరుడే! వాతాపి గణపతి,'' అంటూ పిల్లలూ, వారితో పెద్దలూ గొంతులు కలిపారు. పావనమిశ్రుడు తిరిగి చెప్పసాగాడు: ‘‘తాతా!'' అంటూ గణేశభట్టు చేతులు చాచి పరుగున వస్తూంటే,‘‘గణేశా!''
 
అంటూ పండితుడు చేతులు చాచి మనవణ్ణి ఎత్తి, ‘‘గణేశా! విఘ్నేశ్వరుడు మనల్ని అనుగ్రహిం చాడు. నీ రూపంలో వచ్చి మన ఇల్లు పావనం చేశాడు. ఇది గజానన మందిరం!'' అని ఆనందపారవశ్యంతో అంటూ అరవై ఏళ్ళు నిండిన ఆ వ…ుస్సులో చిన్నపిల్లవాడిలాగ గంతులేస్తూ, ‘‘తాండవ నృత్యకరీ గజానన ధిమికిట...''
 
అంటూ ఆనందభైరవి రాగంలో సమ్మోహన గాత్రంతో పాడుతూన్న పాట ఘంటానాదంలాగ నగరమంతటా మార్మో గుతూ వినిపించింది. ఆ ఆనందపతాక సన్నివేశంలో స్వరకేసరి పరుగున వచ్చి, గజానన పండితుడి పాదాలు చుట్టివేసి తల ఆన్చి, ‘‘గురుదేవా! క్షమించాను అని అంటేగాని మీ పాదాలు వదలను!'' అని అన్నాడు. గజాననుడు తెప్పరిల్లి, స్వరకేసరిని లేవ నెత్తి, ‘‘స్వరకేసరీ! మనం నిమిత్తమాత్రులం, అంతా ఆ గజాననుడి లీలావిలాసం!
 
నువ్వు సంగీతాన్ని శాస్ర్తీ…ుంగా మథించినవాడివి. నేను భక్తికి, మమతకు ప్రాధాన్యం ఇచ్చి, భక్తితో కూడినప్పుడే సంగీతం ఉన్నతమార్గం అందు కుంటుందని నమ్మినవాణ్ణి, అంతే! ఇకనుంచి స్వర్ణగణేశ విగ్రహాలు అన్నీ నీ అధీనమే! ఆ సత్కారాలేవీ నాకు వద్దు. ఇటుపైని నేను సభల్లో పాడను!'' అని అనగానే గణేశభట్టు, ‘‘తాత…్యూ! నీకోసం నువ్వు ఇంట్లో పాడు కొంటే చాలదు. ఎదుటివారిలో మంచి అభి రుచినో, ఆనందాన్నో, మమతనో, భక్తినో కలి గించినప్పుడేకదా నీ పాటకూ, పాండిత్యానికీ సార్థకత!'' అన్నాడు. గజాననుడు చేతులెత్తి జోడిస్తూ, ‘‘ఓ విఘ్నేశా! ఈ మాటలు నా మనవడి నోటితో నువ్వే అంటున్నావు! ఇంతవరకూ నీవు చెప్పి నట్లుగానే గానం వినిపించాను. ఇక ముందు కూడా నీ ఆనతిప్రకారం అలాగే నిన్ను కీర్తిస్తాను.

వినేవారి హృద…ూల్లో నర్తించు! సత్కారాలు మాత్రం నాకు అందకుండా చూడు!'' అన్నాడు. అప్పుడు స్వరకేసరి, ‘‘గురుదేవా! మీరు రచించిన కీర్తనలను మీ రీతిలో పాడినవారికి ఏటేటా స్వర్ణగణేశ విగ్రహం బహూకరింప బడుతుంది; ఆ విధంగానైనా మా భక్తిగౌరవాల్ని మీపట్ల చూపుకోగల అదృష్టాన్ని అనుగ్రహిం చండి!''అని అంజలిఘటించి అర్థించాడు.
 
గజానన పండితుడికి అరవై ఏళ్ళు పూర్తి అయిన సందర్భంగా, అతను వద్దంటున్నా ఆనాటి సా…ుంకాలం వాతాపిగణపతి ఆల…ు ప్రాంగణంలో ఏర్పాటైన బ్రహ్మాండమైన మహాసభలో పూలజల్లుల మధ్య షష్ఠిపూర్తి మహోత్సవం వైభవంగా జరిగింది. గజానన పండితుడు చేతులు జోడించి, ‘‘ఎందరో మహానుభావులు సంగీతాన్నీ, కవిత్వాన్నీ భక్తికి అంకితం చేసి అదే సన్మార్గమని చెప్పారు!
 
వారందరికీ వందనాలు. నేనూ అదే నమ్మాను. అంతకంటే నాలో మరే విశేషమూ లేదు!'' అని చెప్పి, అనేక రాగమాలికలతో, విఘ్నేశ్వ రుణ్ణి కీర్తిస్తూ అమృతగానాన్ని వినిపించాడు. ఆనాటి శ్రోతల హృద…ూల్లో తాండవించిన విఘ్నేశ్వరుడు ఎప్పటికీ అలాగే నర్తిస్తూ ఉండిపో…ూడు.
 
ఈవిధంగా వాతాపినగర చరిత్రలో గజా ననపండితుడి పేరు సువర్ణాక్షరాలతో నిలిచి పోయింది, అని పావనమిశ్రుడు ముగించాడు. ఒకనాడు చాలామంది పిల్లలు వారి వెనుక పెద్దలు గుమిగూడి ఒక చిత్రాన్ని వింతగా చూస్తున్నారు. ఆ చిత్తరువులో ఒక విచిత్రమైన జంతుభూతం చిత్రించబడి ఉంది.

అప్పుడే మంటపంలోకి ప్రవేశిస్తున్న పావనమిశ్రుడు పిల్లల కుతూహల కారణం గ్రహించి, ‘‘పిల్లలూ! కథ విందురుగాని కోర్చోండి!'' అంటూ చెప్ప మొదలుపెట్టాడు: ఇంద్రుడు సగరచక్రవర్తి …ూగాశ్వాన్ని దాచాడు. పృథుచక్రవర్తి …ూగం సరిగ్గా పూర్తవ కుండా, గుర్రాన్ని దొంగిలించుకుపోతూ పాషండ వేషాలు వేశాడు, చే…ురాని పను లెన్నో చేశాడు.
 
పృథుచక్రవర్తి సంతతివాడైన అభినందను డనే మహారాజు ఇంద్రుడికి భాగం లేకుండా ఉండే ఒక మహా…ూగాన్ని ప్రారంభించాడు. ఇంద్రుడు పట్టరాని ఉక్రోషంతో కాలుడిని ఇచ్చకాలతో, సురభోగాలతో బాగా తృప్తి పరిచి, అభినందనుడి …ూగాన్ని ధ్వంసం చే…ుమని కోరాడు. కాలుడు కాలానికి అధినేత, జీవుల జీవన మరణాలకు కాలుడే మూలము. కాలుణ్ణి కాల…ుముడు, కాలధర్ముడు అని కూడా అంటారు.
 
కాలుడు …ుజ్ఞపురుషుణ్ణి ఆవహించి, అభినందనుడి …ూగ హోమాగ్ని నుండి కనీ వినీ ఎరుగని మహాభ…ుంకరమైన పర్వ తంలాంటి జంతుభూతం వెలువడేలాగ చేశాడు. ఋత్విజులు, అధ్వర్యులు మొదలైన వారంతా పారిపో…ూరు. అభినందనుడు గణేశభక్తుడు. అతని గురువైన వశిష్ఠుడు, ‘‘రాజా! ఇలాంటి అవాం తరం రావచ్చునని తెలిసే హోమగుండానికి ఎదురుగా పెద్ద స్వస్తికాపీఠాన్ని వేయించాను.
 
స్వస్తిక గణేశుని సంకేత చిహ్నం. గణేశ్వరునికి ప్రతిరూపంగా పసుపుముద్దను స్వస్తిక కేంద్రంలో పెట్టి ప్రణమిల్లు! ఆ స్వస్తిక అవాంత రాన్ని నిర్మూలిస్తుంది!'' అని చెప్పాడు. రాజు అలాగే చేశాడు. ఆ స్వస్తిక ముగ్గు కేంద్రం నుంచి అద్భుత ప్రకంపనంతో నాదం వెలువడి, అణువులు విజృంభించి పైకెగిసి మహాజంతుభూతాన్ని ఆవరించాయి.
 
అణువులు పెద్దవిగా పెరు గుతూ ఎలుకలుగా మారాయి. అనేక రంగు రంగుల్లో మెరిసిపోతూన్న చిటె్టలుకలు చీమల బారుల్లాగ భూతజంతువు నిండా పట్టుకొని కొరికి కొరికి, బలవంతమైన సర్పము చలి చీమలచేత చిక్కి చచ్చిన విధంగా చేసినై. భూతజంతువు గిలగిలా తన్నుకొని చచ్చినట్లు చచ్చి అదృశ్యమైంది. 

విఘ్నేశ్వరుడు - 19


గుహ ద్వారాన్ని మూసి ఉన్న కొండంత రాతిని గులకరాయిలాగ తొండంతో లాగేసి, గజ రాజు లోపలికి వెళ్ళి కొంతసేప…్యూక రత్నాల నగలను కట్టలు కట్టలుగా తొండంతో తీసు కొచ్చి సౌదామిని ముందు కుప్పవేసింది. చంద్రహారాల్నీ, కంఠాభరణాల్నీ ఆమె మెడ నిండా వేసి, తండ్రి బిడ్డను బుజ్జగించి చెప్పి నట్లుగా వీపు నిమిరి, మిగతా నగలను ధరిం చినన్ని ధరించి, తక్కినవి మూటగట్టుకొని తీసుకెళ్ళమని సైగచేసి చెప్పింది.
 
సౌదామిని అలాగే చేశాక, ఏనుగు ఆమెను మెల్లగా అరణ్యం దాటించి కళ్యాణినగర సమీపాన విడిచి, అరణ్యంలోకి వెనుతిరిగి వెళ్ళిపోయింది. బంగారు విగ్రహంలాగ నగలతో తళుక్కు, తళుక్కున దేదీప్యమానంగా మెరుస్తున్న కోడలిని చూసి కలహకంఠి నిర్ఘాంతపోయి, కొంతసేపటికి సంబాళించుకొని, మెల్ల మెల్లగా ఆ నగలన్నీ ఎలాగ వచాెూ్చ చెప్పేవరకూ వేధించి, సౌదామిని చెప్పినదంతా విని, ‘‘ఏను గకు వెలగపళ్ళు అంత ఇష్టమన్నమాట!''
 
అని తల పంకించి, వెంటనే సంతకు వెళ్ళి సంచి నిండా వెలగపళ్ళు కొనుక్కు వచ్చింది. నగలు నింపుకొని రావడానికి ఒక గట్టి గోతాన్ని భుజాన వేసుకొని, వెలగపళ్ళ సంచితో ఉత్సాహంగా అడవికేసి కలహకంఠి బ…ులు దేరింది. అరణ్యం ప్రవేశించి కోడలు చెప్పిన గుర్తుల ప్రకారం ఎంత వెతికినా వెలగచెట్టు కనపడక విసిగి, ఒక చింతచెట్టు కింద చతికిలబడి, తినాలని వెలగపండు తీసింది.
 
తినాలనే తీసినా ఎలాగో నిగ్రహించుకొని, వెలగపండు చేత్తో ఎత్తి పట్టుకొని, చుట్టు పక్కల కల…ుజూసి గొంతు సవరించుకొని, ‘‘ఏనుగా రా రావే! వెలగపళ్ళు తినవే! ‘‘నగలెన్నో తేవే! నా కోర్కె తీర్చవే! ఏనుగా రా! వేగంగా రా!'' -- అంటూ భజనపాట మొదలుపెట్టింది.

పాట సాగుతున్నది. ఏనుగు రాలేదుగాని, అడవి దద్దరిల్లేలాగ గాండ్రుమనే అరుపు వినిపించింది. అది ఏనుగు ఘీంకారం కాబోలు అనుకొని కలహ కంఠి సంతోషపడుతూ మెడ చాచి చూడగా దూరంలో పెద్దపులి దూకుతూ రావడం కనిపించింది. భుజం మీది గోతాన్ని వదల కుండా కలహకంఠి తిరిగి చూడకుండా పరుగెత్తి, పరుగెత్తి రొప్పుతూ పడిపోయింది. ఆ పడడం సరిగా గుహ దగ్గిరే పడింది.
 
గుహ తెరిచే ఉంది. తన అదృష్టానికి కలహకంఠి పొంగిపోతూ గుహ లోకి వెళ్ళింది. గుహలో కుప్పలు తెప్పలుగా ఉన్న నగలు చూసి పిచ్చెత్తినదానిలాగ తల ముని గేలాగ నగలన్నీ వేసుకొని, గోతం నిండా నగలు కుక్కి మూతి కట్టి, ఎత్తలేక ఎత్తి, మో…ులేక మోస్తూ, నడవలేక నడుస్తూ గుహ మొదటికి వచ్చేసరికి గుహ మూత బడిఉంది. ఎదురుగా చీకటిలో ఎరగ్రా నిప్పుకణికల్లా మెరుస్తున్న కళ్ళతో, తెల్లగా మెరుస్తున్న కోరపళ్ళతో పగలబడి నవ్వు తున్న పెద్ద బ్రహ్మరాక్షసి చీకటిలో చీకటిలాగ కనిపించింది.
 
ఆ భూతం ప్రతిధ్వనితో గుహ కంపించి పోేులాగ, ��ఓహ్హో! కలహకంఠీ! నువ్వు కోడలిని కాల్చుకుతినే అత్తవైతే, నేను అత్తను చిత్రహింసతో తినేసిన మహాగొప్ప కోడల్ని! నా చరిత్ర విను!�� అంటూ చెప్పడం ప్రారం భించింది: వెనుకటికి నేను చురకత్తిలాంటి అంద కత్తెను. అమ్మా, నాన్నా పెట్టిన పేరు కలహంసి; కాపురానికెళ్ళాక, నా నోటి ప్రతాపానికి ఆ పేటంతటికీ నేను సంపాదించుకొని సార్థక పరుచుకొన్న పేరు కలహదుందుభి.
 
వ్వెంత చెడ్డ అత్తవో, కలహకంఠీ! నా అత్త అంత ఉత్తమురాలు, అమా…ుకురాలు, పరమసాధువు. నేను కాపరానికి వెళ్ళి ఏడాది తిరక్కుండానే నా మొగుడు ఇల్లు విడిచి దేశాలపాల…్యూడు. అంటే నేనెంత ఉత్తమ ఇల్లాలినో ఊహించుకో! నాకు నగల పిచ్చి ఇంతా అంతా కాదు. బంగారు పంటలు పండే భూములు పుట్రలు అమ్మించి రకరకాల నగలు చేయించుకున్నాను. మా అత్త ముక్కుపుల్ల నుంచి అన్నీ నాకే ఇచ్చేసింది.

అటువంటి అమా…ుకురాలైన అత్తను, ఒక పూటైనా సరిగా తిననిచ్చేదాన్నిగాను. చిక్కి శల్యమైన వృద్ధురాలిచేత ఇంటి చాకిరీ అంతా చేయించేదాన్ని. చివరికి నా అత్త, మామ విసిగిపోయి వాతాపిక్షేత్రంలోని విఘ్నేశ్వరుని దర్శించి అక్కడే కన్ను మూద్దామని బ…ులుదేరారు. ఆ సమ…ుంలో నా అత్త చేతుల్లో ఉన్న చిన్న మూట చూసి అదేమిటని దూకుడుగా దాన్ని లాక్కోవడంతో, ఆవిడ తూలి కిందపడిపోయి, ఆ…ూసంతో రొప్పుతూ కన్ను మూసింది.
 
అంతవరకూ ఎంతో సహనంతో నా అత్యా చారాలన్నీ చూస్తూ పల్లెత్తు మాట అనని నా మామగారు, భార్య మరణాన్ని చూసి ఆప లేని దుఃఖంతో, పైకుబికిన కోపంతో, ��పాపిష్ఠి దానా! ఎంత ఘోరానికి ఒడిగట్టావు?నువ్వు మా కోడలివైపోయినావు. లేకుంటే శపించే వాణ్ణి! ఎప్పటికైనా, మా ఒక్కగానొక్క కొడుకు తిరిగి వస్తాడనీ, నువ్వు వాణ్ణి సుఖపెట్టగల వనేఆశతో, అన్నీ సహించాము; కడసారి కోరుతున్నాను - వాడొస్తే సరిగా చూడు!��
 
అని చెబుతూ అలాగే ప్రాణాలు విడిచి భార్య తోనే సహగమనం చేశాడు. ఆ…ున గొప్ప నిష్ఠాపరుడు, తపశ్శాలి. అదే సమ…ుంలో, ఒక సన్యాసి అక్కడికి వచ్చాడు. నా అత్తమామల మృతదేహాలపై పడి భోరున రోదిస్తూ, నేను లాక్కోబోేు టప్పుడు కిందపడిన మూటను తీసి విప్పాడు. అందులో రెండు చిరుగుల బట్టలు తప్ప మరేమీ లేవు. ఆ సన్యాసి నన్ను వజ్రాల్లాంటి కళ్ళతో కాల్చేస్తున్నట్టు చూస్తూ, ��నువ్వు బ్రహ్మ రాక్షసిగా పుట్టవలసినదానివి!��
 
అని అన్నాడు. అంతే, తర్వాత వృద్ధ దంపతుల ఉత్తరక్రి…ులు జరిపి వెళ్ళిపో…ూడు. ఆ సన్యాసి ఎవరో కాదు, నా రూప విలాసా లకు పరవశించి కోరి చేసుకున్న నా భర్తే! అని బ్రహ్మరాక్షసి చెప్పి కాస్సేపాగి మళ్ళీ చెప్ప సాగింది: నా నగల పిచ్చి, ధనవ్యామోహం నన్ను ఎంతవరకు ఈడ్చుకు వచ్చా…ుంటే, నేను కొంతమంది గజదొంగలను చేరదీశాను.
 
దొంగల రాణిని అనిపించుకున్నాను. ఈ గుహలోనే దొంగలు గొప్పగొప్ప నగలను ధనరాసులను పోగుపోస్తూండేవారు. అంతా నా స్వంతం చేసుకోవాలన్న పేరాశతో ఒక నాడు దొంగలకు విషభోజనం పెట్టాను. వాళ్ళు చచ్చేముందు చావు తెగింపుతో కసిగా నన్ను ఇందులో ఉంచి గుహను పెనుబండతో కప్పేశారు.

కలహకంఠీ! ఇదే గుహలో, ఆ నగల్నీ, ధనరాసుల్నీ చూసుకుంటూ అలాగే మాడి మాడి కన్ను మూసి, ఇలాగ భూతాన్నయి పడి ఉన్నాను. నీకు బుద్ధి వచ్చేలాగ చేస్తే, నా పిశాచజన్మ శాపం తీరిపోతుందని, నీ కోడలి కారణంగా నిన్న ఈ గుహలోకి వచ్చిన ఏనుగు వలన తెలిసింది. ఏనుగు నీ కోడలికి ఇచ్చినవన్నీ అసలు నగలే; ఇప్పుడు నువ్వు పెట్టుకున్నవీ, అత్యాశ కొద్దీ పోగుచేసి గోతాం నిండా కట్టుకున్నవీ ఏమిటో ఒక్కసారి చూసుకో!
 
అన్నది బ్రహ్మ రాక్షసి. కలహకంఠి భుజానికెత్తుకొన్న గోతం కట్టు విడి దాంట్లోంచి పాములూ, జెర్రులూ, కొండతేళ్ళూ ఊడిపడుతూ జరజరా గుహ నలుమూలలకూ పాకాయి. ఒంటిమీద పాములూ, తేళ్ళూ పాకు తూంటే బెంబేలు పడిపోతున్న కలహకంఠిని చూసి గుహ మారుమ్రోగుతూండగా బ్రహ్మ రాక్షసి వికవికా నవ్వుతూ, ��నువ్వు కోడలిని కాల్చుకు తినే కలహకంఠివి, నేను అత్త మామల ఉసురుపోసుకున్న కలహ దుందు భిని!
 
ఉత్తమురాలైన నీ కోడల్ని మంచిగా చూసుకొంటే సరేసరి, లేదా ఈ గుహలో నాలాగ బ్రహ్మరాక్షసివై పడి ఉండటం ఇహ నీ వంతు అవుతుంది! విన్నావా, కలహకంఠీ!�� అని చెప్పింది. కలహకంఠి లెంపలువేసుకొని, రాక్షసికి దణ్ణంపెట్టి, ��బుద్ధివచ్చింది, కోడల్ని పువ్వు లాగ చూసుకుంటాను. గుహ నుండి నన్ను బ…ుటపడనిచ్చి, అరణ్యం దాటించు!�� అని మొరపెట్టింది. బ్రహ్మరాక్షసి కలహకంఠిని అడవి దాటించి కళ్యాణినగరం పొలిమేరకు చేర్చి, ��మాట తప్పావో, బ్రహ్మపిశాచివై గుహలో ఉంటావు, జాగ్రత్త!��
 
అని హెచ్చరించి భగ్గుమని మండిపోయి అదృశ్యమైంది. కలహకంఠి బ్రతుకు జీవుడా అని ఇంటికి బిరబిరా వెళ్ళి, సౌదామిని ముందు మోకరిల్లి, మోకాళ్ళు పట్టుకొని, ��అమ్మా, సౌదామినీ! నన్ను మన్నించు. కొడుకూ, కోడలూ చిలకా గోరువంకల్లాగ ఉంటే చూసి సంతోషించడం కంటే నాకీ జన్మకు కావల్సిందేమీ లేదు!�� అన్నది. అత్త పరివర్తనానికి కారణం విఘ్నేశ్వరుడి కటాక్షం అని సౌదామిని సంతోషించింది. కలహ కంఠి తిరిగి కలకంఠి అనిపించుకొన్నది.

పావనమిశ్రుడు కథను ముగించి, ��పిల్లలూ! ఏనుగు ఎవరో చెప్పుకోండి చూద్దాం!�� అన్నాడు. పిల్లలే కాకుండా, పెద్దలు కూడా ఆనందో త్సాహాలతో గొంతెత్తి, ��విఘ్నేశ్వరుడు! మన విఘ్వేశ్వరుడే!�� అంటూ గొల్లున లేచి ప్రసాదం తీసుకొని ఇళ్ళకు వెళ్ళారు. ఆల…ు మంటపంలోని కుడ్యచిత్తరువు లకు సంబంధించిన కథలను, రోజూ పావన మిశ్రుడు చెబుతూంటే, వీనుల విందుగా వింటూన్న పిన్నల, పెద్దల మనస్సులనిండా, విఘ్నేశ్వరుడిపై బలమైన భక్తి వర్థిల్లింది.
 
ఒకనాడు ఒక సంగీత కళాభిమాని, ఒక కుడ్యచిత్తరువులో తంబుర మీటుతూ ఒక విద్వాంసుడు గానం చేస్తూంటే, వివిధ భంగి మల్లో విఘ్నేశ్వరుడు నృత్యం చేస్తూండడం చూసి, ఆ చిత్ర చరిత్ర చెప్పమని కోరాడు. పావనమిశ్రుడు చెప్పడం మొదలుపెట్టాడు: వాతాపినగరం కళలకు కాణాచిగా కవిపండిత, గా…ుక, విద్వాంసులకు పుట్టినిలై్ల విలసిల్లు తూన్నది. గజాననపండితుడు నగరంలో అగ్రగ ణ్యుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి; ముఖ్యంగా గొప్ప గా…ుకుడు.
 
అతని గాత్రంలో సమ్మో హనశక్తి ఉండేది. వాతాపిగణపతిపై ఎన్నెన్నో కీర్తనలు రచించి పాడుతూండేవాడు. అతని మనుమడు బాలగణేశభట్టు టింగుటింగున తాళాలు వాయిస్తూండేవాడు. గజాననుడు �ధిమికిట ధిమికిట తాండవ నృత్యకరీ గజానన...� అనే పల్లవిని ఎత్తుకొని ఆనందపారవశ్యంతో రాగాలు మారుస్తూ, అనేక రాగాల్లో పాడుతూంటే, గజాననుడైన విఘ్నేశ్వరుడు ఇంద్రధనుస్సు రంగుల్లో అనేక రూపాల్లో నర్తిస్తూ శ్రోతల కన్నులకు కటే్టవాడు.

హంసధ్వని రాగంలో తెల్లని రాజహంస లాగ, మా…ూమాళవరాగంలో ఉద…ురవి బింబంలాగ, భైరవిరాగంలో ఎరత్రామరలాగ, హిందోళరాగంలో నీలాకాశంలాగ, నీలాం బరిరాగంలో నీలికలువలాగ, ఆనందభైరవి రాగంలో అరవిచ్చిన తెల్లకలువలపై విరిసిన పున్నమివెన్నెలలాగ విఘ్నేశ్వరుడు లీలగా కనిపించేవాడు.
 
గజాననపండితుడికి సత్కారాలమీద, సన్మానాలమీద కాంక్ష ఏ కోశానా లేకపోయినా, అత్యున్నత సత్కారమైన బంగారుగణేశ ప్రతిమ అతనికే ప్రతి సంవత్సరం వస్తూండేది. ఆ ప్రతిమలతో అతని ఇల్లు నిండిపోయింది. దేశాంతరంగా చాలామంది మహామహా విద్వాంసులకే గజాననుడంటే ఎనలేని గౌర వమూ, గురుభావమూ ఉంటున్నా, వాతాపి నగరంలో కొంతమందికి అతనిపై అసూ…ు బాగా పెరిగింది.
 
వారందరికీ నా…ుకుడు స్వరకేసరి. స్వరకేసరి ఎప్పుడూ విద్వత్తు చూపడానికి గొప్ప తాపత్ర…ుపడేవాడు. అతను గళం విప్పితే సింహగర్జనలు వెలువడేవి. మద్దెల వాయించేవాడిని ముప్పుతిప్పలు పెడుతూ వీరవిహారం చేస్తూన్నట్లు పాడేవాడు. గజానన పండితుడికి అటువంటి విద్వత్తు ప్రదర్శించు కోవాలనే …ూవ లేకపోవడమే కాకుండా, విఘ్నేశ్వరుడిపై భక్తితో తన్మ…ూవస్థలో పడి తాళం తప్పుతూ, మరొకప్పుడు పాడుతూ, పాడుతూ మూగబోతూండేవాడు.
 
అటువంటి సందర్భాలను స్వరకేసరి ప్రభృతులు గజా ననుడికి శాస్ర్తపాండిత్యం లేదనీ, కేవలం అతనిది మనోధర్మగానమనీ గాలిపాట అనీ హేళనగా ప్రచారం చేస్తూ, అక్కసు తీర్చు కుంటూండేవారు. గజాననుడికి ఎవరేమన్నా, ఏమనుకుంటూన్నా ఆ ధ్యాసే ఉండేది కాదు. మనసులోని విఘ్నేశ్వరుడితో ఏకాంతంలో మంతనాలాడుకొంటున్నట్లు పాడేవాడు.
 
అందులో ఏదో అనిర్వచనీ…ుమైన శక్తి వింటున్నవారిని మైమరపించి దివ్యలోకాల్లోని ఆనందసాగరాల్లో ముంచి తేల్చేది. ఏవిధంగానైనా ఆ సంవత్సరం స్వర్ణగణేశ విగ్రహం గజాననపండితుడి ఇల్లు చేరకుండా చే…ుడానికి స్వరకేసరి బాగా ఆలోచించి, ఒక గొప్ప పథకం వేశాడు.

విఘ్నేశ్వరుడు - 18


శతృంజ…ుుడు ఎలుకతో చళుకవర్మను దూరంగా చిన్న ఇంటికి తరిమి, ‘‘నువ్వు, మా మధ్య ఉండవలసినవాడివి కావు. నీ ఎలుక వాహనుడైన విఘ్నేశ్వర భక్తికి తగ్గట్టు,ఆ వాహ నంజాతిదే నీకు తగ్గ ఇల్లాలు! నీ ఇల్లాలు అసూర్యంపశ్యగా ఎవరికీ కనపడకుండా ఉండే అంతఃపురకాంతగా ఉండడానికి ఇంటి నిండా ఎలుక బిలాలు ఉన్నవిలే!''
 
అంటూ ఎకసక్కెం చేశాడు. చళుకుడు తండ్రి మాటలకు ప్రశాంతంగా, ‘‘తండ్రి, కుమారులందరికీ పెళ్ళిచే…ుడ మనేది చాలా గొప్ప విష…ుం! ఎవరికెవ్వరో అది ఏనాడో రాసిపెట్టిందే అంటారు. మన చేతుల్లో ఏమీ లేదు! అంతా ఆ విఘ్నేశ్వరుని ఇచ్ఛ కదా!'' అన్నాడు. చళుకుడు ఉత్తమ గ్రంథాలను చదువుతు న్నప్పుడు చుళుక పక్కనే చేరి వింటూండేది.
 
చళుకుడు విఘ్నేశ్వరుణ్ణి అర్చిస్తూన్నప్పుడు నోటితో చిన్న చిన్న పువ్వులు అందించేది. చళుకుడు తిన్న తర్వాత పెడితేనే తినేది. అలా కాలం గడుస్తూండగా వినా…ుకచవితి దగ్గిరికి వచ్చింది. అందరూ ఇళ్ళకు వెల్లవేసి ధాన్యాలు దంచుకొంటున్నారు. చుళుక రాత్రికి రాత్రి ఎలుకలన్నిటినీ పిలిచింది. ఎలుకలు తోకలు ముంచి ఇంటి గోడలకు సున్నం కొట్టాయి.
 
పళ్ళతో పైపొట్టు వొలిచి ధాన్యాన్ని మెరికల్లా బి…్యుం చేశాయి. వినా…ుకచవితి ఉద…ూన చళుకుని వదినలు స్వ…ుంగా నదీతీరానికి వెళ్ళి బంగారు బిందెలతో నదీజలాన్ని నెత్తినెత్తు కొని వస్తున్నారు. అది చూసి చళుకుడు కొద్ది విచారం కనబరిచాడు.

చుళుక వెంటనే బిందెలో దూరి దొర్లించు కుంటూ నదీతీరాన్ని చేరుకుని ఇవతలకి వచ్చి కొండంత బిందెనూ, పొంగిపొర్లి ప్రవహిస్తూన్న నదిని ఒకసారి తేరిపార చూసి ఒక్క క్షణం హతాశురాలై,‘‘బిందెనైతే దొర్లించుకొచ్చాను గాని, నీళ్ళెలా ముంచగ లను? బిందెతో ఎలా మోసుకెళ్ళగలను? అవివేకురాల్ని, పనికి మాలినదాన్ని, నేనెందుకు బ్రతికి?'' అని అనుకుంటూ వేదనతో తలను అక్కడున్న రాతికేసి బలంగా కొట్టుకోసాగింది.
 
విఘ్నేశ్వరుడు అక్కడ ప్రత్యక్షమై, ఎలు కను చేతితో ముద్దుగా నిమిరాడు. శాప విమోచనమై ఎలుకరూపు మా…ుమై దేవ కాంత కళ్యాణకింకిణి నిజరూపంతో విఘ్నే శ్వరుడి పాదాలమీద భక్తితో ప్రణమిల్లి, అనేకవిధాల స్తుతించింది. విఘ్నేశ్వరుడు సంతోషించి కళ్యాణకింకిణిని ఆశీర్వదించి అంతర్థానమ…్యూడు. కళ్యాణకింకిణి నీళ్ళ బిందెను తలకెత్తుకొని వ…్యూరంగా నడిచి వెళ్తూంటే, దారి పొడవునా ప్రజలు బొమ్మల్లాగ నిల్చుని చూస్తూ, ‘‘ఎవరీ దేవసుందరి? ఎవరింటికి వెళ్తున్నది?'' అని విస్తుపో…ూరు.
 
చళుకవర్మ వదినలు కళ్యాణకింకిణి తమ చిన్నమరిది ఇంటిలోకి వెళ్ళడం చూసి, ముఖాలు వేలాడదీసుకున్నారు. శతృంజ…ుుడు తన అజ్ఞానానికి తనే సిగ్గుపడి, చళుకవర్మను సతీసమేతంగా రాజ మందిరానికి తోడ్కొని వచ్చాడు. చళుకుని అన్నలు తండ్రితో, ‘‘మాకూ అలాంటి ఎలుకలతోనే ఎందుకు పెళ్ళిళ్ళు చే…ులేదు? అలా చేసిఉంటే మాకూ అప్స రసలే త…ూరై వచ్చి ఉండేవారు కదా!'' అని గద్దించి అడిగారు.
 
ఇటువంటి తెలివిమాలిన కొడుకుల కోసమా నేను సర్వశక్తులూ ధారవోసి సామ్రా జ్యాన్ని ఆర్జించిపెట్టింది! అని శతృంజ…ుుడు విరక్తిపొంది తపస్సు చేసుకోడానికి అరణ్యా లకు వెళ్ళిపో…ూడు. చళుకవర్మ అన్నలు అసంతృప్తి, పరస్పర ద్వేషాలతో కలహించి …ుుద్ధాలు చేసి కొట్టుకు చచ్చారు.
 
ఆ తరవాత కొన్నాళ్ళకు ఎంత వద్దంటున్నా వినక, ప్రజలు చళుకవర్మను తమ రాజుగా ప్రకటించుకున్నారు. చళుకవర్మ పాలనలో ప్రజలు ఏ కొరతా లేకుండా సుఖశాంతులతో జీవించారు. చళుకవర్మ కళ్యాణకింకిణి పేరున కళ్యాణి అనే మరొక గొప్పనగరాన్ని నిర్మించాడు. అతనికి కళ్యాణకింకిణి వలన నలుగురు పుత్రులు కలిగారు.

వారు చాళుక్యులుగా పిలువ బడ్డారు. ఆ విధంగా చాళుక్యరాజ వంశాలకు మూలపురుషుడైన చళుకవర్మ కాలంలో వాతాపినగరం అనేక దేవాల…ూలతో, ప్రాకా రాలతో శోభిల్లింది. కళలకు కాణాచిగా, విద్వాంసులకు పండితులకు ఆటపట్టుగా, భూతలస్వర్గం అనిపించుకుంది. నగరాధి దేవతగా విఘ్నేశ్వరుడు ఆరాధింపబడ్డాడు. ఉత్కృష్టశిల్పానికి ప్రామాణికమైన ఆల…ు మంటపశిల్పాన్ని చూడ్డానికి దేశం నలు మూలల నుంచీ రాజులు మొదలు కొని సామాన్య …ూత్రికుల వరకూ ఎల్లప్పుడూ వస్తూండేవారు.
 
చాళుక్యులు నాలుగు దిక్కులా రాజ్యాలు ఏర్పరుచుకొని పాలించారు. చాళుక్యవంశ రాజులు శాఖోపశాఖలుగా దేశమంతటా వ్యాపించి రాజ్యాలు ఏలారు. వాతాపినేలినవారు వాతాపిచాళుక్యులనీ, కళ్యాణినగరాన్ని పాలిం చినవారు కళ్యాణిచాళుక్యులనీ, వేంగినేలిన వారు వేంగీచాళుక్యులనీ, తూర్పు చాళుక్యులు, పశ్చిమ చాళుక్యులు, సౌరాష్ట్ర చాళుక్యులుగా పేరొందారు. కాలక్రమాన వాతాపిని బాదామి అని కూడా వ్యవహరించారు.
 
విఘ్నేశ్వర వినోద గాథలు వాతాపిగణపతిగా విఘ్నేశ్వరుడూ, విఘ్నేశ్వర క్షేత్రంగా వాతాపి నగరమూ దేశాంతరాల పేరు మ్రోగుతున్న కాలంలో, పావనమిశ్రుడు అనే పండితుడు సా…ుంకాలాల్లో వాతాపి గణపతి ఆల…ుమంటపంలో పిల్లలకు విఘ్నేశ్వరుడికి సంబంధించిన కథలను చెపుతూండేవాడు. మంటపం గోడలపై విఘ్నేశ్వరుడి గాథలు చిత్రాలుగా చిత్రితమై ఉన్నాయి. ఆ చిత్తరు వుల్లో వినోదకరమైన ఒక చిత్రాన్ని ఒక పిల్ల వాడు గురువుకు చూపించి ఆ కథ చెప్ప మన్నాడు.
 
పావనమిశ్రుడు కథ ప్రారంభించాడు: ఒక నగరంలో సత్యశర్మ, లోభగుప్త ఇరుగు పొరుగున ఉండేవారు. లోభగుప్తుడి అసలు పేరు లాభగుప్త. కాని అతని లోభితనానికీ, అత్యాశకూ ఊళ్ళోవారంతా లోభగుప్త అనే స్థిరపరిచారు. సత్యశర్మ, లోభగుప్త రోజూ శివాల…ూనికి వెళ్ళేవారు.
 
సత్యశర్మ గర్భగుడిలోకి వెళ్ళే దారిలోనే ఉన్న విఘ్నేశ్వర విగ్రహం ముందు ప్రణమిల్లి స్తోత్రగానం చేశాక శివదర్శనం చేసుకొని వెళ్ళేవాడు. లోభగుప్తుడు గర్భాల…ుం ప్రవేశిస్తూనే శివలింగం ముందు సాగిలిపడి కోటి లాభాలు చేకూర్చమని చాలాసేపు అలాగే ధ్యానిస్తూండే వాడు.

ఒకనాడు సత్యశర్మ శివదర్శనం చేసుకొని వెళ్తూండగా, లోభగుప్తుడు వస్తూన్న సమ …ుంలో నంది విఘ్నేశ్వరుడితో, ‘‘విఘ్నేశ్వరా! నీ భక్తుడు సత్యశర్మ చాలా డబ్బు అవసరంలో ఉన్నాడు. అతణ్ణి ఆదుకోవలసిన అవసరం లేదా?'' అన్నాడు. ‘‘ఔనోయి, నందీ! తప్పక ఆదుకుంటాను. ఈ సా…ుంకాలానికి అతనికి వెయ్యి వర హాలు అందిస్తున్నాను. సత్యశర్మ ఇంట్లో శుభ కార్యం నిర్విఘ్నంగా జరుగుతుంది!'' అని విఘ్నేశ్వరుడు అన్నాడు.
 
రాతి విగ్రహాలు మాట్లాడుకుంటున్న మాటలు ఆశ్చర్యంతో లోభగుప్తుడు విని, క్షణం ఆలస్యం చే…ుకుండా పరుగు పరు గున సత్యశర్మ ఇంటికి వెళ్ళి, ‘‘శర్మా, నువ్వేదో అవసరంలో ఉన్నట్టుంది. ఐదువందల వరహాలు ఇస్తాను, తీసుకో!'' అని చెప్పి వెళ్ళి డబ్బు తీసుకొచ్చాడు. సత్యశర్మ, ‘‘అ…్యూ గుప్తగారూ! నిన్ననే కదా అసలు వడ్డీలతో మీరిచ్చిన రుణం తీర్చక పోతే ఇల్లు ఖాళీచే…ుమని చెప్పారు. ఈ అయిదువందలూ ఎలాగ తీర్చగలను?'' అన్నాడు. లోభగుప్తుడు, ‘‘అదా నీ సందేహం!
 
ఈ ఐదువందలు తీసుకుని సా…ుంకాలానికి నీకు లభించిన మొత్తం ఎంతయితే అంత నాకు ఇస్తే చాలు!'' అన్నాడు. సత్యశర్మ తటపటాయిస్తూంటే, అతని భార్య, ‘‘ముందు ఆ ద్రవ్యాన్ని తీసుకోండి, అవతల పెళ్ళివారు చాలాసేపై కూర్చుని ఉన్నారు!''అని ప్రోత్సహించింది. సత్యశర్మ కుమార్తెకు అప్పుడే పెళ్ళి కుది రింది. వరుడి తల్లీ తండ్రీ అయిదువందల వరహాల విలువచేసే నగలు పిల్లదానికి పెట్టా లని పట్టుబట్టారు.
 
సత్యశర్మ లోభగుప్తుడితో, ‘‘అ…్యూ, సా…ుంకాలానికి నాకు లభించింది ఇవ్వడా నికి నాకెలాంటి అభ్యంతరమూ లేదు. కాని, అలా లభించే ఆస్కారం ఏదీ లేదు...'' అంటూ నసుగుతూంటే, లోభగుప్తుడు, ‘‘అదంతా వదిలెయ్యి, మనం ఇరుగు పొరుగు వాళ్ళం! ఇప్పుడు నేనిస్తే తర్వాత నువ్విస్తావు. ఈ మాత్రం దానికి మొహమాటపడకు!''
 
అంటూ ఐదువందల వరహాల మూట సత్య శర్మ చేత పెట్టాడు. సత్యశర్మ సత్యసంధుడని లోభగుప్తుడికి బాగా తెలుసు. సా…ుంత్రం ఔతున్నదికాని సత్యశర్మకు ఏ వరహాలూ అందిన సూచన కనిపించలేదు. లోభగుప్తుడు కంగారు పడుతూ దేవాల…ూ నికి పరుగెత్తి, విఘ్నేశ్వర విగ్రహం తొండం పట్టుకొని లాగుతూ, ‘‘ఏమ…్యూ, విఘ్నేశ్వరా!

సత్యశర్మకు వెయ్యి వరహాలు త్వరగా ఇప్పించు మరి...'' అని అంటూండగా అతని అరచేయి తొండం సందున ఇరుక్కుపోయి తీస్తే రాకుండా తొండం మరింత గట్టిగా బిగించి నొక్కి పట్టింది. నొప్పితో లోభగుప్తుడు కిరకిరలాడిపో తూంటే, ‘‘సత్యశర్మకు వెయ్యి వరహాలు ఎంత త్వరగా నువ్వు ఇప్పిస్తే అంత త్వరగా నీకు విడుదల!'' అని విగ్రహం నుండి గొంతు వినిపించింది. లోభగుప్తుడు రెండో చేత్తో నెత్తీ నోరూ బాదుకుంటూ, ‘‘అన్యా…ుం దేవుడా, అన్యా …ుం!
 
ఐదు వందలు ముందే ఇస్తిని గదా!'' అని పెడబొబ్బలు పెట్టాడు. ‘‘అదా సంగతి! ఐదువందలు ఇచ్చి వెయ్యి పుచ్చుకొని సునా…ూసంగా అయిదువందల వరహాలు కాజేద్దామని ఎత్తువేశావన్నమాట! ఆశాపాతకుడా, నీ దురాశకు ప్రా…ుశ్చిత్తంగా సత్యశర్మకు మిగతా ఐదు వందలూ ఇవ్వ డమేగాకుండా, అతడికిచ్చిన రుణాన్ని చెల్లు పెట్టి, అతని కుమార్తె వివాహం నీ స్వంత ఇంటి పెళ్ళిలాగ జరిపించు!
 
అప్పుడే నీకు విడుదల!'' అని విఘ్నేశ్వర విగ్రహం నుంచి గంభీర గర్జన వినిపించింది. లోభగుప్తుడు క్షణాలమీద తనవారిని పిలిపించి, సత్యశర్మకు మిగతా ఐదువందల వరహాలూ ఇప్పించి, అతని రుణానికి చెల్లు పెట్టించి, అతని కూతురు పెళ్ళి ఖర్చంతా పెట్టుకుంటానని ప్రమాణం చేశాకనే అతని చేయి ఇవతలికి వచ్చింది. లోభికి మంచి శాస్తి జరిగిందని ఊరు ఊరంతా చెప్పుకున్నారు.


లోభగుప్తుడు సత్యశర్మ కుమార్తె వివాహాన్ని స్వంత కూతురు వివాహంలాగ వైభవంగా జరి పించాడు. అప్పట్నించి బుద్ధి తెచ్చుకొని లోభ గుణాన్ని విసర్జించి, అన్యా…ుంగా ఆర్జించిన ఆస్తిని ధర్మకార్యాలకు వినిెూగించి, విఘ్నే శ్వరుడి ద…ుకు పాత్రుడై, గొప్ప ధార్మికుడని పించుకున్నాడు. కథ ముగించి పావనమిశ్రుడు విఘ్నేశ్వర ప్రసాదాన్ని తెచ్చి పిల్లలకు పంచాడు. పిల్లలు ప్రసాదాన్ని నోట్లో వేసుకొని ఆనందంగా కేరింతాలు కొడుతూ ఇళ్ళకు పరుగెత్తారు.
 
మరొక సా…ుంత్రం ఒక బాలిక మంటపం గోడలపై గల మరో అందమైన చిత్రాన్ని చూపించి కథ చెప్పమన్నది. పావనమిశ్రుడు ప్రారంభించాడు: కళ్యాణినగరంలో కలహకంఠి అనే ధనికు రాలు, కోడలు పుట్టింటి నుంచి ఎక్కువగా నగలు పెట్టుకురాలేదని సాధింపుతో రాచి రంపాన పెట్టి పెట్టి, చివరకు నిర్దాక్షణ్యంగా వెళ్ళగొట్టింది. కలకంఠి అని నామకరణం చే…ుబడినప్ప టికీ కలహకంఠిగా పేరుపొందిన ఆ ధనికఅత్త కోడలు సౌదామిని, పుటె్టడు దుఃఖంతో పుట్టిం టికి బ…ులుదేరి దారి తప్పి అరణ్యంలో పడి, ఆకలితో అలమటించిపోతూ ఒక వెలగచెట్టు దగ్గిర పడిపోయింది.
 
తను పుట్టినింటికెళ్ళి కూడా ప్రెూజనం లేదు. తన పెళ్ళికి చేయించిన నగలకే తండ్రి అప్పులపాల…్యూడు. మరి నగలు పెట్టలేడు. అంచేత ఆ కీకారణ్యంలో చావడమే మేలు! అనుకుంటూండగా చెట్టు నుండి ఒక వెలగ పండు రాలి దొర్లుకుంటూ, అందుకోమన్నట్లు ఆమె చేతి దగ్గిర ఆగిపోయింది. దాన్ని పట్టు కొని సౌదామిని లేచికూర్చుంటుండగా భూమి అదిరేలాగ ఒక పెద్ద ఏనుగు పరుగున రావడం కనిపించింది. సౌదామిని చిన్నతనం నుంచీ విఘ్నేశ్వ రుడిపై గొప్ప భక్తి విశ్వాసాలు కలది.
 
విఘ్నే శ్వరుణ్ణి తలచుకొని ఏనుగు పాదాల కింద పడి చావాలని ఎదురువెళ్ళింది. ఏనుగు ఠక్కున ఆగిపోయింది. ఏనుగు సౌదామిని చేతిలో ఉన్న వెలగ పండును తొండంతో తీసుకొని నోట వేసు కొని, దీవిస్తున్నట్లుగా తొండంతో సౌదామిని తల నిమిరి, చేయి పట్టుకొని తిన్నగా ఒక పెద్ద గుహ దగ్గిరికి తీసుకెళ్ళింది. 

విఘ్నేశ్వరుడు - 17








విఘ్నేశ్వరుడు - 16


వాతాపినగర మధ్యంలో ఉన్న మహాశిల విఘ్నే శ్వర శిల్పంగా రూపొందాలనే కోరిక అగస్త్యుడికి మిగిలిపోయింది. లోపాముద్ర చిత్రకళా ప్రవీణురాలు. ఆమె అక్కడకు వచ్చి మహా శిలను జాగ్రత్తగా పరిశీలించి చూసి, అది ఏ విధంగా రూపొందాలో అలాంటి విఘ్నేశుని రూపరేఖా చిత్తరువును అప్పటికప్పుడే త…ూరు చేసింది. రేఖాచిత్రమైతే త…ూరైందిగాని, ఆ ప్రకా రంగా మహాశిలను మలచగల శిల్పులు, శిల్పా చార్యులు ఎంత ప్ర…ుత్నించినా లభించ లేదు.
 
అగస్త్యుడు చింతాక్రాంతుడై ఎల్లప్పుడూ మహాశిల ఎదురుగా కూర్చొని, చిత్రపటాన్నీ, శిలనూ పదే పదే చూసుకుంటూ కాలంగడుపు తున్నాడు. వచ్చిన శిల్పాచార్యులందరూ చిత్రం చూసి, ‘‘ఇలాంటి శిల్పం మలచటం దేవశిల్పి విశ్వ కర్మకో, దానవశిల్పి మ…ుుడికో తప్ప ఇతరు లకు ఏమాత్రం సాధ్యం కాదు!'' అంటూ వెనక్కు జంకారు. శిల్పులు ఉలులను మహాశిల మీద పరీక్షంచి, ‘‘ఇది వజ్రపాషాణం.
 
దీన్ని చెక్కడా నికి మామూలు ఉలి అసలు పనికేరాదు. అందుకు ప్రత్యేకమైన వజ్రపు ఉలులుండాలి. దేవతలో, …ుక్షులో వచ్చి చెక్కవలసిందే కాని, మానవమాత్రుల తరం కాదు!'' అంటూ చెప్పారు. ఆ సమ…ుంలో దేవశిల్పి విశ్వకర్మ భార్య విష్ణు మానసపుత్రిక విశ్వకళ అలిగి పుట్టింటికి వెళ్ళి ఉన్నది. దాంతో విశ్వకర్మ మతిస్థిరం పోగొట్టుకున్నాడు. దానవశిల్పి మ…ుుడు అతని అప్సర భార్య హేమ తిరిగి దేవలోకానికి వెళ్ళిపోగా, భరించరాని బెంగతో పిచ్చివాడై జాడలేకుండా ఎక్కడో తిరుగుతున్నాడు.

విశ్వకర్మనో, మ…ుుణ్ణో పిలుద్దామన్నా వారి స్థితి అంత అధ్వాన్నంగా ఉంది. అగస్త్యుడికి మహాశిలను విఘ్నేశ్వర విగ్ర హంగా రూపొందించడం సమస్యగా నిలిచి పోయింది. నిద్రాహారాలు మాని అతడు శిలకెదురుగా అలాగే దివారాత్రాలు కూర్చొని విఘ్నేశ్వరుణ్ణి ధ్యానిస్తూ, ‘‘గణపతీ! నా కోరిక కోరికగానే ఉంచేశావు, ఇక నీదే భారం!'' అని స్మరణ చేస్తూ దిక్కులు చూస్తూ నిరీక్షంచ సాగాడు.
 
ఒకనాటి సంధ్యాసమ…ుంలో దోరపు బొజ్జ ఊపుకుంటూ గుజ్జుగా ఉన్న ఒక బాల ప్రా…ుంవాడు అటు వస్తున్నాడు. అతని చేతిలో ఏదో ఉలిలాంటిది పిడితో ధగధగా మెరుస్తున్నది. కండలు తేరి ఉన్నాడు, శిల్పి లాగ కనిపించాడు. అగస్త్యుడు ఆశగా అతని చేతనున్న దాన్ని బాగా పరికించి చూడగా, అది ఏనుగుదంతం కొనముక్క పిడిలో బిగించినట్టుగా తెలుసు కుని ఆశ్చర్యపో…ూడు.
 
ఆ తరుణశిల్పి, అగస్త్యుణ్ణి సమీపించి, ‘‘ఏమిటో మహర్షులవారు మహాశిల ముందు మంతనాలాడుతూ కూర్చున్నారు. ఏమైనా పని దొరుకుతుందేమోనని ఇలా తిరుగు తున్నాను!'' అన్నాడు. అతని మాటలు అమిత మధురంగా అగస్త్యుడికి అనిర్వచనీ…ుమైన పారవశ్యాన్ని కలిగించాయి. ‘‘చిరంజీవీ! ఈ మహాశిలను గణపతి దేవుడి విగ్రహంగా చూడాలని ఎన్నో దినాలుగా ఉవ్విళ్ళూరుతున్నాను,'' అంటూ తన దగ్గ రున్న రేఖాచిత్రాన్ని ఆతృతగా శిల్పికి చూపించి, ‘‘ఇంతకూ నువ్వెవరు? ఏం పని చేస్తావు?'' అని అడిగాడు. ‘‘నేను చేసే పనుల్లో మొదటిది పుష్ఠిగా తినడం, తర్వాత శిల్పం చెక్కటం.
 
నన్ను బాల శిల్పాచార్యుడు అని పిలుస్తూంటారు!'' అని బాలశిల్పి చెప్పాడు. అగస్త్యుడికి అతడి మాటలతీరు మేను పులకరించే నవ్వు పుట్టించాయి. ఆ…ున అతణ్ణి సందేహంగా చూస్తూ, ‘‘మహాశిలను మహాశిల్పంగా రూపొందించే మహాశిల్పి కోసం ఇక్కడ పడిగాపులు పడిఉన్నాను. నువ్వు శిల్పినంటున్నావు గాని, బాలశిల్పివి.
 
అలాంట ప్పుడు, మహాశిల్పాన్ని మలచగలవా అని నిన్ను ఏమని అడగ్గలను!'' అన్నాడు దీర్ఘంగా నిట్టూరుస్తూ. బాలశిల్పి నవ్వి, ‘‘బాలశిల్పినైనంత మాత్రాన నా శిల్పం మహాశిల్పం కాదని అనుకోకు! మహా అని అన్నంత మాత్రాన గొప్పేమీ కాదు.

మన ఉలికి సాధ్యంకానిదేదీ లేదు!'' అంటూ ఉలిని తీసి చూపించాడు. అది ధగధగా వజ్రంలాగా మెరుపులు విరజిమ్ముతున్నది. అగస్త్యుడు చూస్తూండగా బాలశిల్పి దంతం ఉలిని మహాశిల మీదకి విసిరాడు. ఉలి మొన తాకిడితో పెద్ద మెరుపు, కాంతి, ఉరిమిన శబ్దమూ వెలువడ్డాయి. అక్కడ శిలకు ఒక రంధ్రం ఏర్పడింది. ‘‘అది నాభిస్థానము.
 
మూర్తి శిల్పానికి నాభిస్థానము చాలాముఖ్యమైనది; అందునా లంబోదరుడి నాభి! లంబోదరంతో శిల్పం ప్రారంభమవుతున్నదన్న మాట!'' అని బాల శిల్పి చెప్తూంటే, రాతి నుండి ‘లంబోదర లక్ష్మీ కరా...' అంటూ మాళవరాగంలో సన్నగా పాట అగస్త్యుడికి వినిపించింది. ‘‘ఇది అ…ుస్కాంత రాయి! చెక్కుతున్న ప్పడు ప్రచండమైన విద్యుత్తు వెలువడుతుంది. గనక శిల్పం చెక్కడం పూరే్త్యువరకూ, ఈ చుట్టుపక్కల పిట్ట మనిషి ఉండకూడదు.
 
గొప్ప ధ్వనులు కూడా వినిపిస్తాయి. నగరవాసులు భ…ుపడి కంగారుపడనవసరం లేదు. ఓ మహర్షీ, ఇక నీవు వెళ్ళవచ్చు. వెళ్ళి నిశ్చింతగా నిద్ర తీయి. తెల్లవారుఝాముకి శిల్పం పూర్త వుతుంది!'' అని చెప్పాడు బాలశిల్పి. అగస్త్యుడు ఆశ్చర్యపడ్డాడేగాని, అంతకు మించి మరేమీ అతనికి తోచలేదు. అతని బుద్ధి ఏదో నిద్రలో పడ్డట్టుగా ఉంది! కొంచెం తేరుకొని అగస్త్యుడు రేఖాచిత్ర పటాన్ని తీసి బాలశిల్పికి ఇవ్వబోతుంటే, ‘‘ఇదివరకే చూపిం చావుగా, ఒక్కసారి చూస్తే చాలు.
 
పదే పదే చూసు కుంటూ చెక్కేరకం మహాశిల్పిని కాను, శిల్పం ఒక ఆటలాగ చెక్కుకొనే కేవలం బాలశిల్పిని! అంతా అ…్యూక అంత అద్భుతంగా చిత్రం గీచినవారిని వచ్చి చూసుకోమను, సరిగ్గా ఉందో లేదో! చిత్రానికి ఎంత ఇచ్చావో ఏమో గాని, నాకేమాత్రం ప్రతిఫలం ముట్టజెపుతావో చూడాలి!'' అని బాలశిల్పి అన్నాడు. చివరి మాటలు అగస్త్యుడికి దిగులు పుట్టించాయి. తన భార్య లోపాముద్ర కోరికమేరకు తీసి ఉంచిన ధనం తప్పితే తన అధీనంలో ఇంకేమీ లేదు. అంతా పంచిపెటే్టశాడు.
 
శిల్పికి పారి తోషికంగా ఉన్న ఆ కొద్దిపాటి ధనమూ ఇచ్చి వే…ుక తప్పదు. లోపాముద్రకు ఏమని నచ్చ చెప్పడం? ఎలా అనడం? అలా అనుకుంటూ అగస్త్యుడు తిన్నగా ఇంటికి వెళ్ళాడు. అప్పుడు లోపాముద్ర ముఖం తేజోవంతంగా దీపంలాగ వెలిగిపోతున్నది. ఏమిటి సంగతి? అన్నట్లు భార్యవంక చూశాడు.

లోపాముద్ర పొంగిపొర్లే ఆనందంతో, ‘‘అగస్త్యులవారు నన్ను మన్నించాలి! ఋషి పత్ని ఋషిపత్నిలాగే ఉండాలనీ, అదే ధర్మ మనీ నాకు తొలుత నుండీ తెలిసినదే. నగలు, మంచి బట్టలు కావాలని, ధనం సేకరించుకు రమ్మని నేను ఎందుకన్నానో, నాకే ఆశ్చర్యంగా ఉంది ఇప్పుడు. ఏదో ఒక మహత్కార్యం నెర వేరడానికి అనిర్వచనీ…ుమైన ఏదో శక్తి నా నోట ఆ మాటలు పలికించినట్లు తోస్తున్నది. నాకు ఏ ఆభరణాలూ వద్దు. ఏ పట్టుచీరలూ వద్దు.
 
ఏ ధనసేకరణా వద్దు! నాలో అప్పుడు తాత్కాలికంగా ప్రవేశించిన అజ్ఞానం ఇప్పు డిప్పుడే తొలగిపోయింది!'' అని అన్నది. ఆమె మాటలకు అగస్త్యుడు లోలోపల సంతసించాడు. ‘‘శిల్పి కుదిరాడు. శిల్పం త…ూరౌతు న్నటే్ల. తెల్లవారేసరికి పూర్తి అవుతుందట!'' అన్నాడు ఋషి. ‘‘ఏమిటేమిటీ! తెల్లారేసరికి ఆ మహాశిల, శిల్పం అవుతుందా? ఆ శిల్పి మానవుడా, దేవుడా?''అన్నది లోపాముద్ర. ‘‘మానవమాత్రుడే, బాలుడు కూడా.
 
పని పూర్తిచేశాక ప్రతిఫలం ఎలా ఇవ్వాలో, ఎంతి వ్వాలో ఏమీ తోచకుండా ఉంది,'' అన్నాడు అగస్త్యుడు. ‘‘నా నిమిత్తంగా తీసి ఉంచిన ధనం ఉందిగా, అది చాలదా?''అన్నది లోపాముద్ర. ‘‘సరే, తెల్లవారాక ఏదో ఒకలాగ సరిపెట్ట వచ్చు,'' అన్నాడు అగస్త్యుడు. ‘‘అన్నట్టు, రేపు భాద్రపద శుద్ధచతుర్థి, వినా…ుకచవితి రోజు!
 
శిల్పం ధ్యాసలో పడి మీరు నెలలు, తిథులు మరిచినట్లున్నారు,'' అన్నది లోపాముద్ర. ‘‘ఏమిటీ! రేపు వినా…ుకచవితి, విఘ్నే శ్వర శిల్పం త…ూరవడం! చిత్రంగా ఉందే!'' అంటూ అగస్త్యుడు ఆశ్చర్యపడుతూంటే, లోపాముద్ర, ‘‘ఆ శిల్పి బాలుడూ కాడు, మానవమాత్రుడూ కాడు!'' అన్నది. భార్య మాటల్లో ఏదో అద్భుత సత్యం ఉందనిపించింది, అగస్త్యుడికి. చాలా రాత్ర యింది, నిద్ర పట్టలేదు, కుతూహలం పెరి గింది, ఏం జరుగుతున్నదో చూడాలని అగ స్త్యుడు బ…ులుదేరాడు.
 
అగస్త్యుడు మహాశిల సమీపాన్ని చేరేసరికి కనిపించిన దృశ్యానికి అతని ఒళ్ళు జలదరిం చింది. అలాగే అక్కడ చతికిలబడిపో…ూడు. కొన్ని వందల ఉలులు శిల్పాన్ని వాటంతట అవే చెక్కుతున్నవి. రంగు రంగుల విద్యుత్కాం తులు మిరుమిట్లు గొల్పుతున్నవి. ఖణఖణ ధ్వనులతో హోరుమంటూ శబ్దం వెలువడు తున్నది.

ఉలులన్నీ ఏనుగుదంతం కొనముక్క ల్లాగ వజ్రాల్లా మెరిసిపోతున్నవి.అది స్వప్నమో నిజమో తెలి…ుని విభ్రాంతిలో మైకం కమ్మి, అగస్త్యుడు అలాగే సొమ్మసిల్లి నిద్రలో పడి పో…ూడు. అలా నిద్రపోయిన ఋషి కళ్ళు తెరిచే సరికి ఎదురుగా తట్టి లేపుతున్న బాలశిల్పి కనిపించాడు. తూర్పు కొద్దికొద్దిగా తెల్లనవు తున్నది. ‘‘ఏమిటి, మహర్షీ! ఇక్కడ ఇలా నిద్రిస్తూ కలగంటున్నావు? ెూగవిద్యాపారంగతుడ వైన నీకు ఈ కలల నిద్ర ఏమిటి! శిల్పం పూర్త యింది.
 
చిత్రం గీచినవారిని వచ్చి చూసుకో మను; చిత్రించినదంతా సరిగ్గా శిల్పరూపం పొందిందో లేదో!'' అని చిన్నగా నవ్వుతూ బాలశిల్పి అంటూండగా, పళ్ళెరం నిండా కుడుములూ, జలమూ, పూలూ పట్టుకొని లోపాముద్ర అక్కడికి వచ్చింది. అగస్త్యుడు సంభ్రమాశ్చర్యాలతో స్ఫటి కంలాగ మెరిసిపోతూన్న విఘ్నేశ్వర మహా శిల్పాన్ని చూస్తూండగా, బాలశిల్పి అతనితో, ‘‘నాకు ప్రతిఫలం ఏమిస్తావో ఇవ్వు మరి,'' అన్నాడు.
 
అగస్త్యుడు మాట తడబడుతూ, ‘‘మహా శిల్పీ! నీకు ఏమిచ్చినా చాలదు. అయినా చంద్రుడికోనూలుపోగన్నట్లు కొద్దిపాటి ధనం తీసి ఉంచాను. కొంచెం ఆగు. ఇప్పుడే వెళ్ళి తెస్తాను!'' అన్నాడు. బాలశిల్పి, ‘‘సరే, ఇంతకూ రేఖాచిత్ర రచన చేసినందుకు ఏమిచ్చావో అది చెప్పు ముందు? శిల్పం చెక్కడం శ్రమ మాత్రమేగాని అసలు గొప్పతనమంతా శిల్పాకృతికి మూలమైన అత్యద్భుత రేఖాచిత్రానిదే.

 చిత్రణ ఊహా సంపన్నమైన మేధస్సుతో కూడిన అద్భుత కళ!'' అన్నాడు. ‘‘అ…్యూ, బాలశిల్పాచార్యా! చిత్రించిన వారికి వేరే ఏమీ ఇవ్వనవసరం లేదు. ఆ చిత్రం త…ూరుచేసినది నా భార్యే!'' అంటూ లోపా ముద్రను చూపిస్తున్నట్లుగా ఆమె వంక చూశాడు అగస్త్యుడు. లోపాముద్ర ఏదో తన్మ…ూవస్థలో మునిగి ఉన్నది. ‘‘ఏమిమాట మహర్షీ! నేనే అయితే ఒక మహానగరాన్ని నిర్మించడానికి సరిపడే ధనాన్ని చిత్రణకు ఇచ్చి ఉందును, అంత గొప్ప రేఖా చిత్రమది!
 
ఆ ధనం ఆ…ుమ్మకే చెందు తుంది!'' అన్నాడు బాలశిల్పి. అగస్త్యుడు, ‘‘అసలు ఆ ధనాన్ని కొన్నాళ్ళ క్రితం ఆమెకోసమనే తీసి ఉంచాను!'' అని నోరుజారి అన్నాడు. బాలశిల్పి ఆశ్చర్యంగా, ‘‘ఏమిటీ! ఇంతకూ అది స్ర్తీధనమన్నమాట! చెప్పావుగనక సరి పోయింది. నువ్విచ్చినా, నేను పుచ్చుకున్నా ఎంత అన్యా…ుం మూటగట్టుకొనేవారమో కదా! అందులోది చిల్లిగవ్వకూడ నాకు అఖ్ఖర లేదు,'' అంటూ లోపాముద్ర వంక చూసి, ‘‘అమ్మా, నీ చేత్తో ఒక్క బిళ్ళకుడుము నాకు పెట్టు. నాకదే చాలు!
 
చెక్కిందానికి బొక్కిందే కూలి అని బ్రహ్మ, శిల్పుల నుదుట ఎప్పుడో రాసిపెటే్టశాడు!'' అని అన్నాడు. ఆ మాటలు వినడంతోనే లోపాముద్ర కుడుముల పళ్ళెరాన్ని అతని ముందు పెట్టి, సాష్టాంగపడి బాలశిల్పి పాదాలు పట్టుకొని, ‘‘విఘ్నేశా! నీ అనుగ్రహంతో, మా జన్మలు తరించాయి!'' అన్నది. బాలశిల్పి అదృశ్యమ…్యూడు. అగస్త్యుణ్ణి ఆవరించిన మా…ు విడిపో యింది. విఘ్నేశ్వర మహాశిల్పం ముందు ప్రణమిల్లి, ‘‘విఘ్నేశ్వరా!
 
నేనెంతో గొప్ప ెూగబలం గలవాడిననీ, తపశ్శాలిననీ గర్వ పడుతూండేవాడిని. కాని, నీ ముందు వఠ్ఠి అజ్ఞానినైపో…ూను. ఎంతటివాడైనా, నీ మా…ుకు అతీతుడు కాడు!'' అంటూ నమ స్కారాలు చేస్తూ లెంపలేసుకుంటూంటే, శిల్పంలోని దేవతావిగ్రహాలన్నీ పాడుతూ న్నట్లుగా, ‘వాతాపిగణపతి భజేహం!...' అనే కీర్తన హంసధ్వని రాగంలో మారుమ్రోగుతూ 

విఘ్నేశ్వరుడు - 15


పాండవులు నారదుడు చెప్పిన విధంగానే విఘ్నేశ్వరుణ్ణి భక్తిశ్రద్ధలతో అర్చిస్తూ, ధౌమ్యుడు పురోహితుడుగా గణేశవ్రతాన్ని చేసి, మారువేషాలతో విరాటరాజు కొలువులో ఒక సంవత్సరం అజ్ఞాతవాసం జ…ుప్రదంగా ముగించారు. కృష్ణుని అండతో పాండవులు కౌరవులతో …ుుద్ధంచేసి విజ…ుం పొందారు. హస్తినా పురంలో ధర్మరాజు పట్టాభిషిక్తుడై రాజ్యపాలన చేస్తూ, అశ్వమేధ…ూగాన్ని చే…ుడానికి తెలపెట్టాడు. …
 
ూగాశ్వం వెంట సైన్యసమేతంగా అర్జు నుడు బ…ులుదేరాడు. పాండవుల పురోహి తుడైన ధౌమ్యుడు కూడా అతనితో ఉన్నాడు. …ూగాశ్వం అనేక రాజ్యాల మీదుగా వెళ్ళింది. రాజులనేకులు ధర్మరాజు పాలనకు విన…ు విధే…ుతలు ప్రకటించారు. గుర్రం వెళ్తూ, వెళ్తూ ఒక ప్రాంతంలో ఆగిపోయి మరి ముంద డుగు వే…ులేదు. అర్జునుడు ఆశ్చర్యపోయి ధౌమ్యుణ్ణి ఎందుకిలా జరిగిందని అడిగాడు.
 
ధౌమ్యుడు ‘చెపుతా పద' అన్నట్లు చూసి దారి తీశాడు. కొంతదూరం వెళ్ళగా ఒక మహా నగరం కనిపించింది. ఆ నగర మధ్యంలో బ్రహ్మాండమైన విఘ్నేశ్వరుని విగ్రహం ఉన్నది. ఒక పెద్ద కొండరాతిని మలచిన శిల్పం అది. అత్యంత కళాశోభితమై విరాజిల్లు తున్నది. ‘‘అర్జునా! విఘ్నేశ్వర దేవుడిని అర్చించి ప్రణామములు అర్పించు. తరవాత వాతాపి గణపతిగా పేరుపొందిన ఈ దేవుని గురించి, వాతాపినగరం గురించి సవిస్తరంగా చెప్తాను,'' అని అన్నాడు ధౌమ్యుడు.

అర్జునుడు పూజాక్రమం జరిపి, వాతాపి గణపతిని భక్తి ప్రపత్తులతో ఆరాధించాక ధౌమ్యుడు వాతాపినగరంలోకి దారి తీశాడు. అతని వెనుక అర్జునుడు వెళ్ళి నగరాన్ని చూశాడు. ఒకప్పుడు ఆ నగరం మహావైభ వంతో వెలిగిన ఛా…ులు గోచరించాయి. కాని ఇప్పుడు నగరం ఆలనాపాలనా లేక బీడుపడి వున్నది.
 
లెక్కకు రాని కొద్దిమంది పౌరులు అక్కడక్కడా బిక్కుబిక్కుమంటూ కనిపించారు. అర్జునుడి రాకకు వారు చాలా సంతోషంతో స్వాగతం పలికి, పాలనావ్యవస్థ ఏర్పరచి నగరాన్ని పునరుద్ధారణ చే…ుమని ప్రార్థించారు. ‘‘అర్జునా! ఇది వాతాపినగరం. నగర మధ్యంలో ఉన్న విఘ్నేశ్వరుడు అగస్త్య మహా మునిచే నెలకొల్పబడిన అద్భుత శిల్పం. ఇది వాతాపిగణపతి క్షేత్రంగా పిలువబడు తున్నది. దీనిని గురించిన విశేషాలు చెప్తాను విను!''
 
అంటూ ధౌమ్యుడు చెప్పడం ప్రారం భించాడు: గంగ, కవేరుడు అనే రాజర్షి కమండలు వులో పడి కావేరిగా రూపు ధరించి, అతని కుమార్తెగా ఆశ్రమంలో పెరిగింది. అగస్త్యుడు ఆ కన్యను చూసి వివాహం చేసుకుంటానని కవేరుడితో చెప్పాడు. కవేరుడు తన సమ్మతిని తెలిపి, ‘‘అగస్త్యా! కావేరి అభిమతం కూడా తెలుసుకుంటే మంచిది గదా!'' అన్నాడు. అగస్త్యుడు ఆశ్రమంలో కావేరితో చను వుగా ఉంటూ ఉండగా ఒకనాడు కావేరి అతనితో సహ్యపర్వతం మీద వనవిహారం చే…ూలని ఉందని చెప్పింది.
 
అగస్త్యుడు కావేరిని తీసుకెళ్ళాడు. వనవిహారం చేస్తూ ఒక చిన్న మడుగులో తామరపువ్వును చూసి ముచ్చటపడుతూ, కావేరి చరచరా వెళ్ళి, దాన్ని తీసుకోడానికి మడుగులో అడుగు పెట్టింది. నీటి తాకిడితో ఆమె అమాంతంగా జలరాశిగా మారిపోయి, వరదలా పొంగి సహ్యపర్వత శిఖరాల నుండి జలజలా జారుతూ కావేరినదిగా పరవళ్ళు తొక్కుతూ ప్రవహించింది. అగస్త్యుడు కావేరినే తలచుకొంటూ చాలా కాలం బ్రహ్మచారిగానే ఉండిపోయి, గొప్ప తపస్సు చేసి ఋషిశ్రేష్ఠుడు అనిపించు కున్నాడు.
 
ఒకనాడతడు అరణ్యంలో చెట్టు కొమ్మకు తలక్రిందులుగా వ్రేలాడుతున్న పితృదేవతలను చూసి, ‘‘ఎవరు మీరు? ఎందుకిలా ఉన్నారు'' అని అడిగాడు. వారు నిట్టూర్పులు విడుస్తూ, ‘‘మా వంశీ కుడు అగస్త్యుడు ఒక ఇంటివాడై సంతానం కనేవరకూ మాకుఇలాగే ఉండక తప్పదు!'' అని చెప్పారు.

అగస్త్యుడు తన దివ్యదృష్టితో విదర్భ రాజుకు కావేరి అంశతో కుమార్తె పుట్టి, లోపా ముద్ర పేరుతో పెరిగి …ుుక్తవ…ుస్కురాలై ఉన్నట్లు తెలుసుకొని వెళ్ళి, ఆమెను తనకిచ్చి వివాహం చే…ువలసిందిగా విదర్భరాజును కోరాడు. కందమూలాలు తింటూ నార కట్టుకు తిరిగే మునికి, సుకుమారి రాకుమారిని ఎలా ఇవ్వడం? ఇవ్వకపోతే శపిస్తాడేమో అని రాజు సంశ…ుపడుతూ వ్యాకులచిత్తుడై ఉండగా, లోపాముద్ర అగస్త్యుడితో నిరభ్యంతరంగా వెంటనే తన వివాహం జరిపించమని చెప్పింది.
 
విదర్భరాజు ఆ విధంగానే లోపాముద్రను అగస్త్యమహర్షికిచ్చి వివాహం జరిపి అతనితో పంపాడు. అగస్త్యుడు లోపాముద్రతో తన ఆశ్రమా నికి వచ్చాక ఒకనాడు, ‘‘నా పితృదేవతలను పున్నామనరకం నుండి తరింపజే…ుడానికి నీ వలన సంతానం కనాలని నిన్ను వివాహం చేసుకున్నాను!'' అని లోపాముద్రతో అన్నాడు. అప్పుడామె తన ముతక చీర చూసుకొని విచారిస్తూ, ‘‘వివాహం చేసుకోగానే సరా!
 
నేను రాజపుత్రికగా పుట్టి భోగభాగ్యాలతో పెరిగిన దాన్ని. నాకు తగ్గ మంచి బట్టలు, రత్నాభర ణాలు సమకూర్చడం నీ విధి. అందుకు కావ లసినంత ధనం సంపాదించుకు రావడం నీ కర్తవ్యం!'' అన్నది. అగస్త్యుడు భార్య మాటలలోని వాస్తవాన్ని గ్రహించి, అప్పటికప్పుడే ధనసేకరణకు బ…ులుదేరాడు. అతడు చాలామంది రాజుల దగ్గరికి వెళ్ళి, రాజ్యపాలనకు సరి పడగా మిగిలిన ధనాన్ని తనకిమ్మన్నాడు.
 
ఏ రాజు కూడా మిగులు చెప్పలేదు సరికదా, ఎంతో లోటు పడుతూన్నట్లుగా చెపుతూ, తమకు కూడా ఏమైనా ధనలాభం కలిగే మార్గం చూపమని వేడుకున్నారు. అగస్త్యుడు హతాశుడై అరణ్యమార్గంలో వెళ్తూ, ఒకచోట ఉన్నతమైన ఒక మహాశిలను చూశాడు. ఆ రాయి లంబోదరుడైన విఘ్నే శ్వరుడిని పోలినట్టుగా కనిపించింది.
 
ఆ మహా శిలనే విఘ్నేశ్వరుడిగా భావిస్తూ అగస్త్యుడు నమస్కరించి, ‘‘గణపతీ! తపస్సు తప్పితే రెండో ధ్యాస లేనివాణ్ణి. ధన సంపాదనకు విద్యలేవీ నాకు తెలి…ువు. ధనం నాకు ఎలాగ లభిస్తుంది? నీవైనా నాకు ఒకదారి చూపవా?'' అంటూ వేడుకున్నాడు. అప్పుడు, ‘‘ఏమిటి, మహర్షీ! శిలతో మంతనాలాడుతున్నావు!'' అంటూ విఘ్నే శ్వరుడు సాక్షాత్కరించాడు.

అగస్త్యుడు ప్రణమిల్లి మ్రొక్కి తన మొర వినిపించాడు. విఘ్నేశ్వరుడు,‘‘అగస్త్యా! రావలసిన చోటుకే వచ్చావు, రావలసినవాడివే, రావలసిన సమ …ూనికే వచ్చావు. కొంచెం సేపట్లో ఇల్వలుడు నిన్ను భోజనానికి పిలుస్తాడు, వెళ్ళు! ఇల్వ లుడి దగ్గిర అంతులేని ధనరాశి మూలుగుతూ ఉంది. ఇప్పుడు నీ వలన మరొక ముఖ్యమైన కాగల కార్యం కూడా ఉంది!'' అన్నాడు.
 
అగస్త్యుడు, ‘‘గణపతీ! ఈ మహాశిలలో నీ పోలికలు నాకు కనిపించాయి. అందుచేత, ఈ శిల అపూర్వగణపతి విగ్రహంగా రూపొం దాలనే నా కోరిక కూడా సఫలం చెయ్యి!'' అని కోరాడు. విఘ్నేశ్వరుడు, ‘‘అలాగే అవుతుందిలే!'' అని చెప్పి అంతర్థానమ…్యూడు. అగస్త్యుడు చాలా అలసి ఉన్నాడు. ఆక లిగా కూడా ఉంది. ఆ…ూసంగా మహాశిలను ఆనుకొని కూర్చొని అలా చూస్తూండగా, అతి థులను వెంటబెట్టుకుని వస్తున్న ఇల్వలుడు కనిపించాడు.
 
అగస్త్యుడికి విష…ుమంతా తృటిలో తెలిసిపోయింది. ఆ అరణ్యంలో వాతాపి, ఇల్వలుడు అనే గొప్ప మా…ూవులైన రాక్షƒసులు ఋషులను, …ూత్రికులను, బాటసారులను చంపి ధనాన్ని దోచుకొని, పెద్ద రాతిదుర్గంలో పోగుచేస్తున్నారు.
 
ధర్మము మూర్తీభవించిన మహారాజు వేషంతో ఇల్వలుడు ఆతిథ్యానికి తీసుకువచ్చినవారికి విన…ువిధే…ుతలతో మర్యాదలు కుశల ప్రశ్నలు జరుపుతున్న సమ…ుంలో, వాతాపి బాగా కొవ్వుపట్టిన మేకపోతుగా మారుతాడు. ఇల్వలుడు ఆ మేకను తెచ్చి చంపి వండించి, మేక మాంసంతో భోజనం పెడతాడు.

అతిథులు భోజనం ముగించి భుక్తా…ూసంతో విశ్రమి స్తున్న సమ…ుంలో ఇల్వలుడు గొంతెత్తి, ‘‘వాతాపీ!'' అని గట్టిగా పిలుస్తాడు. వాతాపి అతిథుల పొట్టలు చీల్చుకొని వస్తాడు. ఆ దుర్మార్గులు చేస్తున్న పనికి అగస్త్యుడి ఒళ్ళు మండిపోయింది. ఇల్వలుడు అగస్త్యుణ్ణి సమీపించి, వీడెవడో చాలా గొప్ప ఋషిలా ఉన్నాడు. ఇలాంటివాళ్ళన…ు ఎంతమందిని హతమార్చితే అంతమంచిది, అని అనుకుంటూ సవిన …ుంగా వంగి నమస్కరించి అందరిని పిలిచి నటే్ట భోజనానికి ఆహ్వానించాడు.
 
అగస్త్యుడు ఆకలితో అలమటించిపో తూన్నవాడిలాగ పరమానందం కనబరిచి, ‘‘ఓ ధర్మదాతా! నీలాంటివాళ్ళుండబటే్ట ఈ భూమండలం అనంతాకాశంలో ఇలా నిలిచి ఉంది. పద!'' అంటూ ఇల్వలుడి వెంట రాతి దుర్గానికి వెళ్ళి, ‘‘ఓ అన్నదాతా! చాలా రోజు లుగా తిండి లేదు, ఆకలి దహించేస్తున్నది. వెయ్యి …ుజ్ఞాలు జరిపించినవాణ్ణి కావడంవల్ల, మేక మాంసం తప్పితే మరేదీ అరగని రోగం ఒకటి పట్టుకున్నది.
 
అంచేత, ముందు నాకు ఆ మాంసభోజనం పెట్టి నన్ను పంపించు,'' అన్నాడు. ఇల్వలుడు, ‘‘స్వామీ! మీకు ఆతిథ్య మిచ్చే మా భాగ్యం చాలా గొప్పది! మీ కోసమే రాసిపెట్టి ఉన్నది కాబోలు, మా ఇంట చిర కాలం నించీ ఒక మేకపోతు పెరుగుతూ బాగా కొవ్వుపట్టి ఉన్నది!'' అని చెబుతూ వెంటనే మేక రూపంలో ఉన్న వాతాపిని సేవకుల చేత చంపించాడు. అగస్త్యుడు మేకను చూసి, ‘‘ఆహా! ఏం మేక, ఏం మేక! వెయ్యి …ూగాలు చేయించా నన్న మాటే గానీ ఇలాంటి మేకను రుచి చూడ లేదు, నా…ునా!
 
ముందు దీని గుండెకా…ు మొదలైన మేలు ముక్కలన్నీ నాకు పెట్టి, ఆ తర్వాత మిగతాది అతిథులకు పెట్టు! ముందే చెబుతున్నాను, మరేం అనుకోకు. మాంసం తప్ప మరేదీ నేను తినలేను సుమా! నేను తిన గలిగినంతా నాకు వడ్డించాలి, మర్చిపోకు!'' అన్నాడు. ఇల్వలుడు అగ్నిలో మేకను కాల్చి, మాంసం వండించి అగస్త్యుడికి పెట్టాడు.
 
ఎంత వడ్డించినా తినేస్తూ అగస్త్యుడు పూర్తి మేకపోతు మాంసం నిమిషాలలో ఆరగించి గట్టిగా త్రేన్చాడు. ఇల్వలుడు అమిత ఆశ్చ ర్యంతోపాటు కొంచెం భీతి కూడా పడుతూ, ‘‘స్వామీ! తమరు మంచి ఘనాపాఠీల్లా గున్నారే!'' అన్నాడు.

అగస్త్యుడు చిరునవ్వు నవ్వి, ‘‘ఘనా పాఠీలలో ఘనాపాఠీగా మన పేరు ముల్లోకా లకూ తెలుసునోయి! ఏదీ, కాస్త మద్యం తెప్పించు! ఒక కుండెడు చాల్లే!'' అన్నాడు. ఇల్వలుడు మరింత నివ్వెరపోతూ, ‘‘కుండెడు మద్యం తాగుతారా, స్వామీ!'' అన్నాడు. అగస్త్యుడు, ‘‘మన పొట్టకు సముద్రాలే చాలవు!'' అన్నాడు. ఇల్వలుడు, ‘‘అలాగే తాగుదురుగాని, మా వాడు వాతాపి తెప్పిస్తాడు!'' అని చెబుతూ, ‘‘వాతాపీ!''
 
అంటూ గొంతెత్తి కేకవేశాడు. అగస్త్యుడు నెమ్మదిగా, ‘‘ఇంకెక్కడి వాతాపి! వాతాపి మరి రాడు. జీర్ణం, జీర్ణం, వాతాపి జీర్ణం!'' అంటూ కడుపు నిమురుకుంటూ, ‘‘వాతాపి హరించిపో…ూడు!'' అన్నాడు. ఇల్వలుడు ప్రాణభీతితో గజగజ వణికి పోతూ జాడలేకుండా పారిపో…ూడు. ఆ విధంగా వాతాపి ఇల్వలుల దారుణ హత్యా కాండల మా…ూనాటకం అంతమైంది.
 
ఆ తరువాత అగస్త్యుడు మిగతా అతిథు లకు జరిగిందంతా చెప్పి, రాతిదుర్గంలో కుప్పతెప్పలుగా పడి ఉన్న అస్థిపంజరాల్నీ, కపాల రాసులనూ చూపించాడు. వారంతా గుండెలు బాదుకుంటూ, బ్రతికి బ…ుట పడ్డందుకు అగస్త్యుడికి కృతజ్ఞతతో ప్రణమిల్లి మ్రొక్కారు. ఆ దుర్గంలో పదిలంగా భద్రపరిచి ఉన్న ధనరాసుల్ని అగస్త్యుడు చూశాడు. తనకు కావలసినది పోగా మిగిలిన ధనంతో అక్కడ ఒక మహానగరం నిర్మించవచ్చు.
 
వేలాదిమంది ప్రజలు సుఖంగా జీవించవచ్చునని ఆ…ు నకు తోచింది. వెంటనే అగస్త్యుడు అందరికీ ధనాన్ని పంచడం మొదలుపెట్టాడు. ఆ సంగతి విని, సమీప రాజ్యాల నుండి ఎంతోమంది ప్రజలు అక్కడకు చేరుకొని, అగస్త్యుడిచ్చిన ధనంతో ఇళ్ళు కట్టుకొని స్థిరపడ్డారు.
 
అగస్త్యుడికి విఘ్నేశ్వరుడి ఆకారంలాగ కనిపించిన మహాశిల కేంద్రంగా చుట్టూరా ఒక మహానగరం త…ూరయింది. వాతాపి జీర్ణంతో ఏర్పడిన ఆ నగరం వాతాపినగరంగా పేరు పొందింది. అగస్త్యుడు స్వపరిపాలనా సూత్రాలను శిలాఫలకాల మీద చెక్కించి, నగరంలో పెట్టించాడు. ప్రజలే పాలకులుగా ఆదర్శప్రా…ుమైన ప్రజారాజ్యం ఏర్పడింది.

విఘ్నేశ్వరుడు - 14


కృష్ణుడి ఆశ్చర్యానికి రుక్మిణి చిరునవ్వుతో, ‘‘ఔను, నాథా! ఈ రోజు నాలో ఆనందం పొంగి పొర్లుతున్నది. ఆ కన్యకామణికి మీ మీద ఎంత ఆశ! అమాంతంగా మిమ్మల్ని నిధిని దాచుకున్నట్లు తన గుప్పెట్లో ఉంచుకోవాల న్నంత మమత నాకు కనిపించింది!'' అన్నది. ‘‘ఆ కన్యకామణి మమత సరే. మరి, నీ సంగతి చెప్పలేదు!'' అన్నాడు కృష్ణుడు. ‘‘మీ లోపల ఒక అణువునై ఇమిడి ఉండి పోవడమే నాకు కావలసిందల్లా!
 
మీరు ఎవరి గుప్పెట్లో ఉన్నా నేను మీలోనే ఉంటాను గదా!'' అన్నది రుక్మిణి. ‘‘రుక్మిణీ! ఎంతో గొప్ప భావాన్ని ఎంత సూక్ష్మాతి సూక్ష్మంగా నిర్వచించావు! అందుకే నిన్ను కోరి కోరి ఎత్తుకు వచ్చాను!'' అన్నాడు కృష్ణుడు. ‘‘నాకు నిజమని తోచింది చెబుతున్నాను. నాకంటే సత్యభామదే గొప్ప మమత, బల మైనది! ఆ మమతలో, అనంతమైన ప్రకృతి శక్తి అంతా ఉంది. స్వామీ! నాలో ఉన్నది భక్తి ప్రధానమైనది మాత్రమే!''
 
అని చెబుతున్న రుక్మిణిని వారించి, కృష్ణుడు చిరునవ్వు చిందిస్తూ, ‘‘రుక్మిణీ, వేదాంతం మాట్లాడకు!'' అన్నాడు. రుక్మిణి మందహాసం చేస్తూ ఊరుకున్నది. కొద్ది దినాలు గడిచాెూ లేదో, ‘‘కృష్ణుడు శ్యమంతకమణిని అపహరించాడు!'' అనే వార్త కార్చిచ్చులా అంతటా వ్యాపించింది. ఆ విధంగా అందరితో చెప్పి సత్రాజిత్తే మణిని పోగొట్టుకున్న దుఃఖంతో పిచ్చివాడై వీధి వీధులా తిరిగి అరుస్తూ విశేష ప్రచారం చేశాడు.

తన మీద మోపబడ్డ అభాండానికి చింతించి ప్రెూజనం లేదని కృష్ణుడు దిటవు తెచ్చు కొని, ‘‘విఘ్నేశ్వరా! ఇదంతా నీ లీల. తరువాత నీ ద…ు!''అని కొంతసేపు మనసులో ధ్యానించి, శ్యమంతకమణిని అన్వేషించడానికి అరణ్యా ల్లోకి వెళ్ళాడు. జరిగినదేమంటే: సత్యభామను సత్రాజిత్తు వరుసకు తనకు మేనల్లుడైన శతధన్వుడనే రాజుకిచ్చి వివాహం చేసే నిర్ణ…ూనికొచ్చి, తన తమ్ముడు ప్రసేనజిత్తును, శతధన్వుడితో మాటా మంతీ చేసి రమ్మని పంపాడు.
 
ప్రసేనుడు శ్యమంతకమణిని ధరించి అరణ్య మార్గంలో వెళ్తూండగా ఒక సింహం మణి చేత ఆకర్షింప బడి అతణ్ణి చంపింది. ఆ సింహాన్ని జాంబవం తుడు చంపి, మణిని తీసుకుపోయి, తన కుమార్తె జాంబవతికి ఇచ్చాడు. మణిని ధరించి వెళ్ళిన తమ్ముడు తిరిగి రాకపోవడంతో, దిగ్భ్రాంతికి గురైన సత్రాజిత్తు, ఒకప్పుడు మణిని అడిగిన కారణంగా కృష్ణుడే తన తమ్ముణ్ణి సంహరించి మణిని అపహ రించా డని చాటాడు.
 
సత్యభామను పెళ్లాడ్డానికి ఉవ్విళ్ళూరు తున్న శతధన్వుడు, జరాసంధుడు మొదలైన కృష్ణుడి శత్రువులైన రాజులు సత్రాజిత్తును బలపరిచి పగతీర్చుకోడానికి సా…ుపడతా మంటూ కబురు పెట్టారు. మణిని అన్వేషిస్తూ వెళ్ళిన కృష్ణుడు, అరణ్యంలో ఒక చోట చచ్చిపడి ఉన్న ప్రసే నుడినీ, సింహాన్నీ, జాంబవంతుడి అడుగు జాడలనూ చూసి జాంబవంతుడి గుహకు వెళ్ళాడు.
 
గుహలో నవ …ువ్వనవతి, సుందరి అయిన జాంబవతి మణిని బంతిలాగ ఎగరవేసి పట్టుకొంటూ ఆడుకొంటున్నది. జాంబవతి పసిపిల్లగా అరణ్యంలో జాంబ వంతుడికి దొరికిన అనాధ రాజపుత్రిక. అతడామెను తన గుహకు తీసుకు వచ్చి ముద్దుల కూతురుగా పెంచుకొచ్చాడు. మణిని తీసుకొనడానికి కృష్ణుడు ఆమె చేతిని పట్టుకొన్నాడు.
 
జాంబవతి చేతిని విడిపించుకోవడానికి ప్ర…ుత్నించకుండా తల వాల్చి సిగ్గుదొంతరలతో క్రీగంట కృష్ణుణ్ణి చూస్తున్న సమ…ుంలో జాంబవంతుడు గుహకు వచ్చి, కృష్ణుడిపై లంఘించాడు. ఇద్ద రికీ పన్నెండు రోజులపాటు గొప్ప …ుుద్ధం జరిగింది. కృష్ణుడు పిడికిటితో దిమ్మతిరి గేలా జాంబవంతుడి గుండెమీద బలంగా పొడిచాడు. ఆ బలమైన పోటుతో రాముడే కృష్ణుడుగా అవతరించాడని జాంబవంతుడు గుర్తించాడు.

జాంబవంతుడు కృష్ణుడికి ప్రణమిల్లి, ‘‘కృష్ణా! నా కుమార్తె జాంబవతి చేతిని పట్టనే పట్టావు, జాంబవతి నీదే!'' అంటూ శ్యమం తకమణినీ, జాంబవతినీ కృష్ణుడికి భక్తితో సమర్పించాడు. జాంబవతితో జాంబవంతుడు వెంటరాగా కృష్ణుడు మణితో ద్వారకకు వచ్చి, సత్రాజిత్తుకు మణిని అందజేశాడు. జాంబవంతుడు సత్రాజిత్తుకు జరిగిన దంతా చెప్పాడు. సత్రాజిత్తు పశ్చాత్తాపం పొంది కృష్ణుడితో, ‘‘కృష్ణా! సొమ్ము పోయినవాడు పాపాత్ముడు అనేవిధంగా నేను నింద నీపై మోపి మహాప రాధం చేశాను.
 
నన్ను నీ ఇష్టమొచ్చినట్టు దండించు!'' అన్నాడు. కృష్ణుడు సత్రాజిత్తుతో, ‘‘నీ పశ్చాత్తాపమే నీకు దండన!'' అన్నాడు. అప్పుడు సత్రాజిత్తు తన అపచారానికి పరిహారంగా, మన్ననగా శ్యమంతకమణినీ, సత్యభామనూ కృష్ణుడి ఎదుట ఉంచి స్వీక రించమని వేడుకొన్నాడు. కృష్ణుడు సత్యభామను స్వీకరిస్తూ, శ్యమంతకమణిని సత్రాజిత్తునే ఉంచుకో మని తిరిగి ఇచ్చివేశాడు.
 
అప్పుడు సత్యభామ, కృష్ణుడు తనను స్వీకరించిన ఆనందం పొంగి పొర్లుతుండగా, ‘‘చూశావా, నాన్నా! నేను గొప్పదాన్నో, మణి గొప్పదో ఇప్పుడు తెలిసిందా!'' అన్నట్లు సగ ర్వంగా సత్రాజిత్తును చూసి, ‘‘నాన్నా! అంతా ఆ విఘ్నేశ్వరుడి ద…ు. ఒకప్పుడు విఘ్నేశ్వ రుడి మహత్తును గుర్తించలేని వాడివై ఏమో అన్నావు. నేను విఘ్నేశ్వరుణ్ణే నమ్ముకొన్నదాన్ని.
 
నా అభీష్టం నెరవేరింది!'' అంటూ విఘ్నేశ్వరుణ్ణి మనసారా ధ్యానించి చేతులెత్తి మ్రొక్కింది. అప్పుడు విఘ్నేశ్వరుడు ఆకాశంలో లీలగా కనిపించి, ‘‘భగవంతుడు తనకు అత్యంత ప్రి…ుమైన సత్యానికి ఎల్లప్పుడూ వశవర్తిగా ఉంటాడు. సత్యమే అతని సొత్తు!'' అనేఅర్థం స్ఫురించేలాగ, ‘‘సత్యభామా పరిణ…ుంతో కృష్ణుడు సత్యాపతిగా పేరు పడతాడు!'' అని చెప్పాడు.
 
సత్రాజిత్తు భక్తితో విఘ్నేశ్వరుడికి మ్రొక్కి, ‘‘నా అపచారాన్ని మన్నించు దేవా!'' అంటూ లెంపలు వేసుకొన్నాడు. కృష్ణుడు, ‘‘విఘ్నేశా! అంతా నీ లీల. నీ ద…ువలన అపవాదు తొలగించుకొని మణి కంటే అమూల్యమయిన సత్యభామామణిని సంపాదించాను!'' అన్నాడు. విఘ్నేశ్వరుడు, ‘‘శ్యమంతకమణి కథ విన్నవారికి అపనిందలు అంటవు,'' అని చెపుతూ అంతర్థానమ…్యూడు.

సత్రాజిత్తు కృష్ణుడి కాళ్ళు కడిగి కన్యాదానం చేసే తన అదృష్టానికి పొంగిపోతూ, కృష్ణుడితో సత్య భామ వివాహాన్ని మహా వైభవోపేతంగా జరిపించాడు. తరువాత కృష్ణుడు జాంబవతిని వివాహం చేసుకొన్నాడు. జాంబవంతుడు కృష్ణుడితో, ‘‘కృష్ణా! నీవు రామావతారంలో ఉన్నప్పుడు నీతో …ుుద్ధం చే…ూలని అభిలాషను వ్యక్తం చేశాను. నీవంటి అల్లుడిని పొందిన జనకమహారాజు అదృష్టానికి అసూ…ుపడుతున్నానని కూడా అన్నాను.
 
ఆ రెండు కోరికలూ ఈ అవతారంలో ఇప్పుడు తీర్చావు. నేను ధన్యుణ్ణి, జీవన్ము క్తుణ్ణి!'' అని చెప్పి తపస్సు చేసి తరించడానికి అరణ్యాల్లోకి వెళ్ళిపో…ూడు. కొంతకాలం తరువాత శతధన్వుడు కసితో సత్రాజిత్తును చంపి మణిని తీసుకుని కృత వర్మ, అక్రూరులు తోడుగా పారిపో…ూడు. కృష్ణుడు సత్యభామను ఓదార్చి శతధన్వుడిని …ుుద్ధంలో సంహరించాడు. అక్రూర కృత వర్మలు మణితో పారిపో…ూరు.
 
వారిని వెదకి పట్టి కృష్ణుడు మణిని తీసుకొచ్చి, తండ్రి జ్ఞాపక చిహ్నంగా ఉంచుకోమని సత్యభామకు ఇచ్చాడు. కృష్ణుడు మిత్రవింద, కాళింద, భద్ర, నాగ్నజితి, లక్షణ అనేవారిని కూడా వివాహం చేసుకొన్నాడు. ఎనమండుగురు భార్యలతో కృష్ణుడు భోగభాగ్యాలతో తులతూగుతూ ప్రతి ఏటా వినా…ుకచవితిని భక్తిశ్రద్ధలతో జరుపుతూ వచ్చాడు. శ్యమంతకమణి ప్రభావం వల్ల సత్యభామ అంతఃపురం అంతులేని బంగారంతో నిండి పోయింది.
 
ఆ బంగారంతో సత్యభామ రత్న రాసులనూ, అమూల్యాభరణాలనూ, చీని చీనాంబరాలనూ కోకొల్లలుగా తన ఇంట నింపు కొంది. అష్టమహిషులలో తానే ఐశ్వర్యవంతు రాలననే సంపద్గర్వంతో పాటు, తానే అందరి లోకీ అధికురాలననీ, కృష్ణుడికి ఇష్టభార్యననే అహంభావం ఆమెలో క్రమక్రమంగా పెరిగింది. కృష్ణుడి అష్టమహిషులలో జాంబవతి గొప్ప వైణిక విద్వాంసురాలు.
 
నారదుడు ఒకనాడు తన మహతివీణను వాయించుతూ మహదానందంతో గగన మార్గంలో ప…ుని స్తూండగా పరిహాసం చేస్తూన్నట్లుగా పకపక మంటూ నవ్వు వినిపించింది. నారదుడు నివ్వెరపోయి, ‘‘ఎవరా నవ్వేది? ఎందుకు నవ్వుతున్నావు?'' అంటూ నలు దెసలా చూశాడు. ‘‘నారదా! ఇంకా నీవు చాలా నేర్చుకోవలసి ఉంది. నీ వీణావాదానికి నీవు నీలో పొంగి పోతూంటే నవ్వు వచ్చింది!'' అని అశరీరవాణి పలికింది.

నారదుడు, ‘‘ఎవరివద్ద ఇంకా నేర్చు కోవాలి?'' అని అనుకుంటూండగా విఘ్నే శ్వరుడు సాక్షాత్కరించి, ‘‘జాంబవతి వద్ద వీణావాద్యంలోని మెళుకువలన్నీ క్షుణ్ణంగా తెలుసుకో!'' అని చెప్పాడు. ఆ విధంగా నారదుడు కృష్ణుడి అనుగ్ర హంతో జాంబవతి వల్ల వీణావాద్యంలోని మెళు కువలన్నీ క్షుణ్ణంగా తెలుసుకున్నాడు. ఒకనాడు కృష్ణుడు రుక్మిణి అంతః పురంలో ఉండగా నారదుడు పారిజాత పుష్పాన్ని అతని కిచ్చాడు.
 
కృష్ణుడు దాన్ని రుక్మిణికిచ్చాడు. అది విని సత్యభామ అలిగింది. కృష్ణుడు సత్యభామను బుజ్జగించి ఆమెతో గరుడ వాహనంపై ఇంద్రుడి స్వర్గానికి వెళ్ళి, నందన వనంలోని పారిజాత వృక్షానికి వృక్షాన్నే తీసుకు వచ్చి సత్యభామ ఇంటి పెరట్లో నాటాడు. అయినప్పటికీ కృష్ణుడికి తనపై గురి తగ్గి పోతూన్నదేమోననే దిగులు పట్టుకొన్నది సత్య భామకు.
 
కృష్ణుడిని తన చెప్పుచేతల్లో తన మందిరంలో ఉండిపోేులాగ చేసుకోవాలన్న తాపత్ర…ుం పెంచుకొన్నది. నారదుడు ఒకనాడు సత్య ఇంటికి వచ్చి, పుణ్యకవ్రతం ఆచరిస్తే కృష్ణుడు ఆమె అధీనం లోనే ఉంటాడని చెప్పాడు. సత్యభామ వ్రత ని…ుమం ప్రకారం కృష్ణుణ్ణి నారదుడికి దానం చేసింది. నారదుడు కృష్ణుణ్ణి ఎత్తుకెత్తు బంగార మిచ్చి కొనుక్కోవచ్చునని అమ్మకానికి పెట్టాడు. సత్యభామ తన ఇంటనున్న అంతులేని బంగా రాన్ని కృష్ణతులాభారంలో పెట్టింది. శ్యమం తకమణిని కూడా వేసింది. కాని కృష్ణుడు కొంచెమైనా తూగలేదు.

అప్పుడు సత్యభామ గర్వాన్ని విడిచిపెట్టి, రుక్మిణిని కృష్ణుణ్ణి విడిపించుకొనే మార్గం చెప్పమని వేడింది. రుక్మిణి, ‘‘చెల్లీ! కృష్ణుడితో సరితూగ గల సంపద భక్తి ఒక్కటే! భక్తిపూర్వకంగా వేసిన ఒక్క తులసీదళం చాలును!'' అని చెప్పి, సత్యభామకు చిన్న తులసి ఆకు ఇచ్చింది. సత్యభామ ఆ తులసీదళాన్ని కన్నులకద్దు కొని, భక్తిపూర్వకంగా తక్కెడలో వేసింది.
 
కృష్ణుడు కూర్చున్న సిబ్బె పైకి లేచి సమానంగా తూగింది. అప్పుడు నారదుడు తులసీదళాన్ని మాత్రమే తీసుకొని కళ్ళకు అద్దుకొని, కృష్ణుణ్ణి సత్యభామ పరం చేసి వెళ్ళిపో…ూడు. కృష్ణ తులాభారంతో సత్యభామకు జ్ఞానో ద…ుం అయింది. ఐశ్వర్యం మీద, మణి మీద వ్యామోహం నశించి కృష్ణుడే తన పెన్నిధిగా భక్తి భావం కలిగింది. మణివలన లభించిన బంగా రాన్ని అంతటినీ కృష్ణుడు చెప్పినట్లుగా …ూత్రి కులకూ, బాటసారులకూ భోజన వసతి సౌక ర్యాలుగల ధర్మశాలలనేకం, దేశమంతటా తండ్రి స్మృతి చిహ్నాలుగా కట్టించింది.
 
ఆ ధర్మశాలలు సత్రాజిత్తు పేరు స్ఫురించేలాగ సత్రములు అని పిలువబడ్డాయి. అటుపిమ్మట కొంతకాలానికి కృష్ణ బల రాముల చెల్లెలైన సుభద్రకు అర్జునుడితో వివాహం జరిగినప్పుడు, సత్యభామ శ్యమం తకమణిని సుభద్రకు అరణంగా పెట్టింది. ఆ విధంగా శ్యమంతకమణి పాండవులను చేరింది. మణి కూర్చిన బంగారం ధర్మరాజు రాజ సూ…ు…ూగం చే…ుడానికి బాగా ఉపెూగ పడింది.
 
తరువాత ధర్మరాజు జూదమాడి తనతో బాటు తమ్ములనూ, ద్రౌపదినీ, రాజ్యాన్నీ ఓడి పో…ూడు. రాజసూ…ు …ూగం చూసి దుర్యో ధనుడికి కన్ను కుట్టింది. ద్రౌపదిని పరాభవిం చాలనే దుశ్చింత రేపింది. పాండవుల పురోహి తు డైన ధౌమ్యుడు తొలినుండి అనేక అనర్థాలకు కారణమవుతూ వచ్చిన శ్యమంతకమణిని విసర్జించమని చెప్పగా అర్జునుడు మణిని వింటికి సంధించి బలంగా భూమికేసి కొట్టాడు.
 
మణి భూగర్భంలో నిక్షప్త పడిపోయింది. పాండవులు జూదంలో కౌరవులకు ఓడి అరణ్యవాసం చేస్తూండగా, ఒకనాడు నారదుడు వారి వద్దకు వచ్చి, రాజ్య ప్రాప్తికి భక్తిశ్రద్ధలతో విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించి గణేశవ్రతాన్ని చేసి, తరవాత అజ్ఞాతవాసానికి వెళ్ళమని చెప్పాడు.