Friday, January 2, 2015

విష్ణు సహస్రనామం వైశిష్టం


ఎందు చేత అంటే . జాగృత్ అవస్థ అనగా ఇంద్రియములు పనిచేయట . పడుకోవటం అంటే నిద్రావస్థ మనసు ఇంద్రియములు వెనక్కు లాకుంటుంది. దీనికి అది దేవత పరమేశ్వరుడు . అందుకే పడుకునే ముందు "శివ శివ" అని 11 మార్లు చెప్పాలి. నిద్ర లేచినాక జాగ్రుతవస్థ , విష్ణువు స్తితి కారకుడు కావున "శ్రీహరి శ్రీహరి శ్రీహరి " అని ౩ మార్లు చెప్పాలి . నిద్ర లేచిన తరువాత శుచిగా ఉంటామని ఆస్కారం లేదు. కావున విష్ణు సహస్రనామం చెప్పటానికి సుచి సమయం అంటూ శాస్త్రం లో ఎక్కడ చెప్పలేదు .
మంచం మీద ఎటువంటి పని చేయకూడదు ( కొత్త బట్టలు పెట్టకూడదు , మందు వేసుకోకుడదు , చివరికి మనషి చనిపోయే సమయం లో మంచం మీద ఉంచకూడదు ). మనకి మంచం మేద ఎటువంటి దుస్వప్నము వచ్చిన తెల్లవారి గజేంద్ర మోక్షం చదువుకుంటే దోషం పోతుందని అంటారు. మనం అంత వరకు ఉండలేము కాబట్టి .
గోవింద నామం చెప్పమంటారు.విష్ణు సహస్రం ఏ కారణం చేత విడువరదని శాస్త్రం చెప్పుచున్నది .

దేవాలయం లో 8 మన్దిగ విభాగిస్తారు . అర్చకుడి 8 వంతు చరముర్తి అంటారు
1 ) శికరం 2 ) ప్రకారం 3 ) గోడ 4 ) ముఖ మంటపం 5 ) అర్ధ మంటపం 6 ) ధ్రువ మూర్తి 7 ) విమాన మూర్తి
8 ) అర్చకుడు

ఎవరితే విష్ణు సహస్రనామంస్తోత్రం గొప్ప వరం ఎవరితే పారాయణము చేస్తారో ఇహమునందు రక్షణ లబిస్తుంది

లక్ష్మీదేవి అవరతరణ

లక్ష్మీదేవి అవరతరణకు సంబంధించిన పురాణాల్లోఅనేక కధలు ఉన్నాయి. వివిధ కల్పాలతో లక్ష్మీదేవి అవతరణకు సంబంధించిన గాథలు వేర్వేరుగా ఉన్నా ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్న గాథ మాత్రం ఒక్కటే. క్షీరసాగర మధనం సమయంలో లక్ష్మీదేవి ఉద్భవించిన కథ. ఆ కథ ప్రకారం...

ఒకసారి దూర్వాస మహాముని స్వర్గానికి వెళ్లాడు. ఆ సమయంలో ఐరావతం మీద ఇంద్రుడు నందనవనంలో విహరిస్తున్నాడు. దుర్వాస మహాముని రావడాన్ని ఇంద్రుడు గుర్తించలేదు. దీనితో మండిపడిన దుర్వాస మహాముని ''నీకు ఇంద్రపదవి నుండి పతనం ప్రాప్తించుగాక.. నీ సమస్త ఐశ్వర్యం సముద్రంలో కలిసిపోగాక'' - అని శపిస్తాడు.

దుర్వాస మహాముని ఇంద్రుని శపించిన తర్వాత రాక్షసులు స్వర్గంపైకి దండెత్తి స్వర్గాన్ని స్వాధీనం చేసుకుంటారు దుర్వాస మహాముని శాపం ప్రకారం ఇంద్రుని ఐశ్వర్యమంతా ఆయనకు దూరమవుతుంది. దీనితో ఇంద్రుడు బ్రహ్మ, విష్ణువులకు మొరపెట్టుకోగా, సముద్రాన్ని మధించడమే తరుణోపాయమని చెబుతారు.

ఆ తర్వాత అమృతం కోసం క్షీర సాగరాన్ని మధిస్తున్న సమయంలో కల్పవృక్షం, కామధేనువుతో పాటు లక్ష్మీదేవి ఉద్భవించి, మహా విష్ణువును వరిస్తుంది.

ఇది చాలామందికి తెలిసిస్న గాథ. ఈ కథ కాకుండా భ్రుగుమహర్షి కుమార్తెగా లక్ష్మీదేవి జన్మించినట్లు మరో కధనం కూడా ప్రచారంలో ఉంది. ఆ కథ ప్రకారం....

భ్రుగుమహర్షి భార్య ఖ్యాతి పుత్రికా సంతానం కావాలని ఆశపడింది. ఆ కోరిక నేరవేరేందుకు జగన్మాత అనుగ్రహం కోసం తపస్సు చేస్తుంది. జగన్మాత అనుగ్రహం మేరకు అష్టైశ్వర్యాలను ప్రసాదించే లక్ష్మీదేవి ఆమెకు కూతురిగా జన్మింస్తుంది. భ్రుగుమహర్షి కుమార్తె కనుక ఆమెను భార్గవిగా పిలుస్తారు. ఇదే కాక వామనావతార గాథలో సైతం లక్ష్మీదేవి జననానికి సంబంధించిన కథ ఉంది.

శ్రీ వెంకటేశ్వరుడు వెంట్రుకలే ఎందుకు అడుగుతాడు?

మనకి పాపాలు అన్ని ఎక్కడ ఉంటాయి అంటే వెంట్రుకుల మొదళ్ళుని ఆశ్రయించి ఉంటాయ్. ఆ పాపాలు తీసేయడానికి స్వామి తల వెంట్రుకలు అడుగుతాడు. కలియుగంలో ఏది ఇవ్వాలన్న అందరికి కక్కుర్తి. మన ప్రమేయం లేనిది, మనం పెంచాల్సిన అవసరం లేని దానిని, తనంతట తాను పెరిగేది, భగవంతుని కృప చేత ఉండేది మాత్ర మే ఆయన తీసుకుంటాడు. కాబట్టి తిరుమల వెళ్ళండి, మీ తల వెంట్రుకలు ఇవ్వండి & మీ పాపాలు తొలగిపోతాయ్.

వేంకటాచలం చాలా ప్రసిద్ధమైన క్షేత్రం. తిరుమల తర్వాత కాశి కి మళ్లి అంత ప్రత్యేకత ఉంది. మీరు కాశి అడుగు పెట్టినంత మాత్రం చేతనే మీ పాపాలు అన్ని చెట్లు ఎక్కి కుర్చుంటాయి . మీరు ఏడు
రాత్రులు గనక గడిపితే, మీ పాపాలు పూర్తిగా తొలగిపోతాయ్.

వేంకటశ్వరుడు అంటే?

వేం - పాపము
కట - తీసేయడం
శ్వరుడు - తొలగించేటటు వంటివాడు .

కలియుగంలో ఎవరికీ భగవంతునికి పాదాల యందు మనస్సు నిలబడదు. కలి యొక్క ప్రభావం వల్ల భౌతిక సుఖాల వైపు ఎక్కువ మోజు ఉంటుంది. మనస్సుని నిగ్రహించడం అంత సులభం కాదు. చాలా పాపాలు చేస్తూ ఉంటాం. ఈ పాపాలు చేసేటటు వంటి వారిని ఉద్ధరించడానికి పరమాత్మ "శ్రీ వేంకటేశ్వరుడు" గా ఆవిర్భవించారు. ఆ పాపాల్ని తీసేయగలిగే శక్తి ఆ పరమాత్మకే ఉంది.

ఇక తిరుమల కొండకి వస్తే, సాక్షాత్తు వేదములే ఆ కొండకి రాళ్ళు అయ్యాయి. ఒక్కొక్క యుగం లో ఒక్కో అవతారం ఎత్తి ఆయన ధర్మాన్ని రక్షించాడు.

కృత యుగం - నరసింహావతారం,
త్రేతా యుగం - శ్రీరాముడుగా,
ద్వాపరి యుగం లో - శ్రీ కృష్ణుడుగా,
& కలియుగం లో శ్రీ వేంకటేశ్వరుడుగా అవతరించాడు.

మిగిలిన అవతారారలో చేసినట్లుగా కలియుగం లో స్వామి దుష్ట సంహారం ఏమి చెయ్యలేదు. కత్తి పట్టి ఎవ్వరిని సంహరించలేదు. ఆయన చాలా కాలం వరకు నోరు విప్పి మాట్లాడేవారు. తొండమాన్ చక్రవర్తి మీద కోపం వచ్చి మాట్లాడ్డం మానేశారు.

కాబట్టి ఆ వేంకటాచల క్షేత్రం పరమపావనమైనటువంటి క్షేత్రం. తిరుమల కొండ సామాన్యమైన కొండేమీ కాదు. ఆ కొండకి, శ్రీ వేంకటేశ్వరునికి ఒక గొప్ప సంబంధం ఉంది. తిరుముల కొండకి ఒక్కో యుగం ఒక్కో పేరు ఉండేది.
కృత యుగం లో - వృషా చలం,
త్రేతా యుగం లో - అంజనా చలం
తరువాత కలియుగం లో - వేంకటా చలం అని పేరు వచ్చింది. యుగాలు మారిపోయినా ఆ కొండ అలాగే ఉంది. ఈ కొండ శ్రీ మహావిష్ణువు యొక్క క్రీడాద్రి.. తిరుమల చాల పవిత్రమైనటు వంటి స్థలం.

పురాణాల పేర్లు చెప్పే శ్లోకం

సత్రయాగం జరుగుచున్నప్పుడు అష్టాదశపురాణాలను తెలుపుతూ సూతుడు ఋషులకు చెప్పిన శ్లోకం. భాగవత పురాణము ప్రధమ స్కందము లో చెప్పబడింది.

మద్వయం భద్వయం చైవ బ్రత్రయం వచతుష్టయం
అనాపద్లింగకూస్కాని పురాణాని పృథక్ పృథక్
పైన చెప్పిన వాటిలో:
"మ" ద్వయం -- మత్స్య పురాణం, మార్కండేయ పురాణం
"భ" ద్వయం -- భాగవత పురాణం, భవిష్య పురాణం
"బ్ర" త్రయం -- బ్రహ్మ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం, బ్రహ్మాండ పురాణం
"వ" చతుష్టయం -- విష్ణు పురాణం, వరాహ పురాణం, వామన పురాణం, వాయు పురాణం
మిగిలిన వాటి పేర్ల మొదటి అక్షరాలు మాత్రమే తీసుకుని శ్లోకపాదం కూర్చటం జరిగింది:
అ -- అగ్ని పురాణం
నా -- నారద పురాణం
పద్ -- పద్మ పురాణం
లిం -- లింగ పురాణం
గ -- గరుడ పురాణం
కూ -- కూర్మ పురాణం
స్కా -- స్కాంద పురాణం
అష్టాదశ పురాణములలో శ్లోకాలు [3]
బ్రహ్మ పురాణం - బ్రహ్మదేవుడు మరీచికి బోధించినది. 10,000 శ్లోకములు కలది.
పద్మ పురాణము - బ్రహ్మదేవునిచే చెప్పబడినది. 55,000 శ్లోకములు కలది.
విష్ణు పురాణం - పరాశరుని రచన. దీనిలో 63,000 (8,000?) శ్లోకములు ఉన్నాయి.
శివ పురాణం - వాయుదేవునిచే చెప్పబడినది. ఇందులో 24,000 శ్లోకాలున్నాయి.
లింగ పురాణము - నందీశ్వరుని రచన. 11,000 శ్లోకాలు ఉన్నది.
గరుడ పురాణం - విష్ణుమూర్తి గరుత్మంతునికి చెప్పిన ఈ పురాణంలో 19,000 (16,000?) శ్లోకాలున్నాయి.
నారద పురాణము - నారద మహర్షి రచన. 24,000 (25,000?) శ్లోకములు కలది.
భాగవత పురాణం- శుకమహర్షి పరీక్షిత్తునకుపదేశించినది. 18,000 శ్లోకములు కలది.
అగ్ని పురాణం - భృగుమహర్షిచే చెప్పబడినది. 16,000 (8,000?) శ్లోకములు కలది.
స్కంద పురాణం - కుమారస్వామిచే చెప్పబడినది. 80,000 (లక్ష?) ఇందు శ్లోకములు ఉన్నాయి.
భవిష్య పురాణం లేదా భవిష్యోత్తర పురాణం - శతానీకుడు సుమంతునకు బోధించినది. 14,500 (31,000?) శ్లోకములు ఉన్నాయి.
బ్రహ్మవైవర్త పురాణం - వశిష్ట మహర్షి అంబరీషునకు ఉపదేశించినది. 18,000 (12,000) శ్లోకములు కలది.
మార్కండేయ పురాణం - పక్షులు క్రోష్టి(జైమిని)కి చెప్పినట్లుగా మార్కండేయమహర్షి రచించెను. 9,000 (32,000?) శ్లోకములు ఉన్నది.
వామన పురాణము - బ్రహ్మదేవుని రచన - 14,000 శ్లోకములు కలది.
వరాహ పురాణం - శ్రీవరాహమూర్తి భూదేవికి ఉపదేశించినది. ఇందు 24,000 శ్లోకములు ఉన్నాయి.
మత్స్య పురాణం - శ్రీమత్స్యావతారుడైన విష్ణువు మనువునకు ఉపదేశించెను. దీనిలో 14,000 శ్లోకాలున్నాయి.
కూర్మ పురాణం - శ్రీకూర్మావతారుడైన విష్ణువు ఉపదేశించెను. దీనిలో 17,000 (6,000) శ్లోకాలున్నాయి.
బ్రహ్మాండ పురాణం - బ్రహ్మదేవుని రచన- 1,100 (12,200?) శ్లోకములున్నది.
దేవతాప్రాముఖ్యాన్ని గుణాన్ని చెప్పే శ్లోకం
ఈ క్రింది శ్లోకం అష్టాదశ పురాణాలను మూడు విధాలుగా విభజిస్తూ వైష్ణవ, శైవ, బ్రహ్మ పురాణాలుగా చెబుతుంది.

వైష్ణవం నారదీయం చ తధా భాగవతం శుభం గారుడంచ తధా పాద్మం
వరాహం శుభదర్శనే సాత్వికాని పురాణాని విష్ణ్వేయాని శుభానిదై
బ్రహ్మాండం బ్రహ్మ వైవర్తం మార్కండేయం తధైవ చ భవిష్యం వామనం బ్రహ్మరాజ నిబోధతే
మాత్స్య కౌర్మం తధా లైంగ శైవం స్కౌందం ఆగ్నేయంచ షడేతాని తామసాని భోధమే


ఇలాంటిదే మరొక శ్లోకం

బ్రాహ్మం పాద్వం వైష్ణవంచ శైవం వైంగం చ గారుడమ్
నారదీయం భాగవతం ఆగ్నేయం స్కాంద సంజ్ఞికమ్
భవిష్యం బ్రహ్మవైవర్తం మార్కండేయం చ వామనమ్
వారాహం మత్స్య కౌర్మాణి బ్రహ్మాండాఖ్యమితి త్రిషట్

వైష్ణవ పురాణాలు - సాత్విక గుణాన్ని
బ్రహ్మ పురాణాలు - రాజస గుణాన్ని
శైవ పురాణాలు - తామస గుణాన్ని ప్రధానంగా కలిగి ఉంటాయి అని పై శ్లోకం అర్థం

అసలీ పురాణమంటే అర్థమేమిటి?

పురాణాలలో సర్వశాస్త్రాలు ఇమిడి ఉన్నాయని పెద్దలంతా చెబుతూ ఉంటారు. అసలీ పురాణమంటే అర్థమేమిటి? పురాణాలు ఎన్ని ఉన్నాయి? వాటన్నిటినీ ఎవరితో పోల్చి చెబుతారు? అనే విషయాలను గురించి వివరించి చెబుతుంది ఈ కథా సందర్భం. పద్మపురాణం ఆది ఖండంలో దీనికి సంబంధించిన వివరణ ఉంది.

పురాణాలు మొత్తం పద్దెనిమిది. వీటికంటూ కొన్ని ప్రత్యేక లక్షణాలున్నాయి. ఈ పురాణాలన్నీ శ్రీ మహావిష్ణువు స్వరూపంతో సరిపోతాయి. అందుకే శ్రీమహావిష్ణువును పురాణ పురుషుడని అంటూ ఉంటారు. ఆ నారాయణుడి
1) హృదయం పద్మపురాణం
2) చర్మం వామన పురాణం
3) తొడలు భాగవత పురాణం
4) మెదడు మత్స్యపురాణం
5) పృష్ణభాగం కూర్మపురాణం
6) కుడికాలు చీలమండ వరాహ పురాణం
7) బొడ్డు నారదపురాణం వెంట్రుకలు స్కందపురాణం
9) ఎడమ భుజం శివపురాణం
10) కుడి భుజం విష్ణుపురాణం
11) ఎడమపాదం అగ్నిపురాణం
12) కుడిపాదం మార్కండేయ పురాణం
13) కుడిమోకాలు భవిష్యపురాణం అని పద్మపురాణంతోపాటు ఇతర పురాణాలు కూడా వివరించి చెబుతున్నాయి.

పురాణానికి కొన్ని ప్రత్యేక లక్షణాలున్నాయి. ఆ లక్షణాలున్నదే పురాణం అవుతుంది. ప్రధానంగా పురాణానికి అయిదు లక్షణాలను పేర్కొన్నారు. కాలక్రమంలో కొంతమంది పది లక్షణాలు కూడా ఉన్నాయని చెప్పారు.

అయిదు లక్షణాలలో
1) సర్గం
2) ప్రతిసర్గం
3) వంశం
4) మన్వంతరం
5) వంశాను చరితం
పురాణానికి ఈ అయిదు లక్షణాలు ఉంటాయని పురాణాలతోపాటు, నిఘంటువులు కూడా స్పష్టం చేస్తున్నాయి. అయితే ఈ అయిదు లక్షణాలు మనకున్న పద్దెనిమిది పురాణాలలో ఒక్కోదానిలో ఒక్కొక్క లక్షణం ఎక్కువగా, మరో లక్షణం తక్కువగా వర్ణితమై కనిపిస్తుంది. ఎక్కువ తక్కువుల మాటఎలాఉన్నా అయిదు లక్షణాలు మాత్రం ఉండి తీరాల్సిందే.

వీటిలో
1) మొదటిదైన సర్గం అనే దానికి అర్థం సృష్టి అని, ఈ సృష్టి అంతా ఎలా జరిగింది? పంచతన్మాత్రలు, పంచభూతాలు ఎలా ఉద్భవించాయి? అని వివరించటమే సర్గం.
2) రెండో లక్షణం ప్రతిసర్గం. సర్గానికి వ్యతిరేకం ప్రతిసర్గం. అంటే సృష్టి ఎలా లయమవుతుంది? ప్రళయాలు ఎన్ని రకాలు? అవి ఎలా ఏర్పడుతాయి? అని వివరించటమే ప్రతిసర్గం
3) మూడో లక్షణమైన వంశంలో సృష్టి ప్రారంభం నుంచి ఎంతమంది రాజులు, వారి వంశాలు, ఆవిర్భవించాయి. వారి వంశాలు వర్ణనతో పాటు రుషుల వంశాలకు సంబంధించిన విషయ వివరణలు ఈ లక్షణంలో కనిపిస్తాయి.
4)నాలుగో లక్షణం మన్వంతరం. ఇది కాలగణనాన్ని చెబుతుంది. పద్నాలుగు మన్వంతరాల విషయాలు, వాటి అధిపతులు, వారికి సంబంధించిన విషయాలన్నీ దీనిలో వస్తాయి.
5)అయిదో లక్షణమే వంశాను చరితం. దీనిలో సృష్టి మొదలైన దగ్గర నుంచి పాలించిన రాజులు, చక్రవర్తుల, రుషుల వంశ చరిత్రలు వర్ణితమవుతాయి.

ఇలా ఈ అయిదు ప్రధాన లక్షణాలు తొలినాళ్ళ నుంచి అంతా పురాణాలకు ఉంటాయని, ఉండాలని చెబుతూ వస్తున్నారు. కాలక్రమంలో కొంతమంది ఈ అయిదు లక్షణాలను పది లక్షణాలుగా చేసి అలాంటి పది లక్షణాలు పురాణాలకు ఉండాలని చెప్పారు. సర్గ, విసర్గ, వృత్తి, రక్షణ, అంతరాలు, వంశం, వంశాను చరితం, సంస్థ, హేతువు, అపాశ్రయం అనే పది లక్షణాలను అనంతర కాలంలో వచ్చిన వారు పేర్కొన్నారు.

1) సర్గ అంటే ఇక్కడ కూడా సృష్టి అనే అర్థం.
2) విసర్గ అంటే జీవుల సృష్టి అని అర్థం చెబుతారు.
3) వృత్తి అనే పదానికి మనిషి తన జీవితాన్ని సాగించటానికి ఏ ఏ వస్తువులను వాడుతారో వాటిని గురించిన విషయాల వివరణ.
4) రక్షణ అంటే భగవంతుడు ధర్మ రక్షణకోసం అవతరించే తీరు అని అర్థం.
5) అంతరాలు అంటే మన్వంతరాల వివరణ.
6) వంశం అంటే రాజుల, రుషుల, వంశాల వివరణ.
7) వంశాను చరితం అంటే రాజుల, రుషుల వంశ క్రమంలో ఉన్న అన్ని తరాల చరిత్ర వివరణ. సంస్థ అంటే ప్రళయానికి సంబంధించిన వివరణ.
9) హేతువు అని అంటే జీవుడి జనన మరణాలకు మధ్యన ఉన్న కర్మ సంబంధమైన విషయం. జీవుడు చేసే కర్మను బట్టే అతడి జీవితమైనా, సృష్టి అయినా అంతమవుతుందని చెప్పే విషయానికి సంబంధించిన వివరణ.
10) అపాశ్రయం అని అంటే పరబ్రహ్మం అని అర్థం. ఆ పరబ్రహ్మ శక్తినే అపాశ్రయ శక్తి అని అంటారు. దానికి సంబంధించిన వివరాలు దీంట్లో ఉంటాయి.

ఈ పది లక్షణాలు భాగవతం ద్వితీయ స్కందంలో మళ్ళీ కొద్దిపాటి తేడాతో కనిపిస్తున్నాయి. సర్గ, ప్రతిసర్గ, స్థానం, పోషణం, ఊతయం, మన్వంతరం, ఈశాను కథ, నిరోధం, ముక్తి, ఆశ్రయం... ఈ పది లక్షణాలు పేర్లలో తేడా ఉన్నా అర్థం మాత్రం ఒకటేనని పురాణజ్ఞలు వివరించి చెబుతున్నారు.

Sri Rama Rama Rameti



అయ్యప్పస్వామి స్వరూపాలు

శ్రితజనప్రియం స్వామి చించితప్రదం 
శృతి విభూషణం స్వామి సాధుజీవనం 
శృతి మనోహరం స్వామి గీతాలాలసం 
హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే

నారాయణుడు, పరమశివుడు ఇద్దరూ ఒక్కరే అని పురాణాలు చెబుతున్నాయి. అయ్యప్పస్వామి పూజలో శంకరునికి ఇష్టమైన పాలాభిషేకం ఉంటే, విష్ణువుకు ఇష్టమైన హోమమూ ఉంటుంది. తలపై ధరించే చంద్రునిముడిలో శంకరునికి సంబంధించిన మూడునేత్రాలు ఉంటాయి. కొబ్బరికాయ, నెయ్యి ఉండగా, పిన్ ముడిలో జీవించడానికి అవసరమైన వస్తువులుంటాయి. విష్ణువు స్థితికారుడు కాదా మరి! శంకరుని నిరాడంబరమైన నేలపడక, తెల్లవారుఝామున స్నానం, చెప్పులులేని నడక, భస్మధారణ వంటివి కనిపిస్తుండగా, మెడలోని పుష్పమాల శ్రీహరి మెడలోని వనమాలను తలపిస్తుంది.

పానవట్టంపై కూర్చోబెట్టిన శివలింగంగా కనిపిస్తున్న అయ్యప్పస్వామి, ఎడమచేతి వయ్యారపు వంపుతో విష్ణువు మోహీనీ అవతారానికి ప్రతీకగా కనిపిస్తున్నాడు. ఒంటినిండా భస్మం హరరూపాన్ని తలపిస్తుంటే, ముఖాన ఉండే తిరునామం హరిరూపాన్ని చూపిస్తుంది. మెడలోని రుద్రాక్షమాల శంకరునిది అయితే, తులసిమాల శ్రీహరికి ఇష్టం అయినది. అయ్యప్పస్వామి దీక్ష శంకరునికి ఇష్టమైన కార్తీకమాసంలో ప్రారంభమై, శ్రీహరికి ఇష్టమైన మార్గశిరమాసంలో ముగుస్తుంది.

అయ్యప్పస్వామి గుడికి ఉన్న పద్దెనిమిది మెట్లు, మోక్షము అనే మేడకు ఉన్న పద్దెనిమిది మెట్లు అని శాస్త్రవచనం. ఇంకా ఈ 18 మెట్లు గురించి మన పురాణాలు ఇలా చెబుతున్నాయి. ఆవాహన సమయంలో అష్టదిక్పాలకులు (8), త్రిమూర్తులు (3), వారి భార్యలు (3), ఇంద్రుడు (1), బృహస్పతి (1), ఆదిపరాశక్తి (1), సూర్యుడు (1) అంటూ మొత్తం పద్దెనిమిది మంది, దివి నుండి భువికి దిగిరాగా, దేవాలయ ప్రతిష్ఠనాడు మృదంగ, భేరి, కాహళ, దుందుభి, తుంబురు, మర్దల, వీణ, వేణు, నూపుర, మట్టుక, డిండిమ, ఢమరుక, ఢక్క, దవళ, శంఖ, పటహ, జజ్జరి, జంత్ర, అనే 18 వాయిద్యాలను మ్రోగించారు.

పరమేశ్వరుడు లింగరూపంలో భక్తులకు దర్శనమిస్తాడు

పరమేశ్వరుడు లింగరూపంలో భక్తులకు దర్శనమిస్తాడు. ఆ లింగరూపాన్ని దర్శించుకునే వారికి సకలసంపదలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. అందులో కీలకమైన పంచలింగాలు. పృథ్విలింగం, ఆకాశలింగం, జలలింగం, తేజోలింగం, వాయులింగములను పంచభూతలింగాలు అంటారు.

1. పృథ్విలింగం:
ఇది మట్టిలింగం. కంచిలోఉంది. ఏకాంబరేశ్వర స్వామి అంటారు. పార్వతీదేవిచే ఈ లింగం ప్రతిష్టించబడినది. ఇక్కడున్న అమ్మవారి పేరు కామాక్షీదేవి. అష్టాదశ పీఠాలలో ఇది ఒకటి.

2. ఆకాశలింగం:
ఇది తమిళనాడులోని చిదంబర క్షేత్రంలో ఉన్నది. ఆకాశలింగ దర్శనం రహస్యమైనది. ఆకాశంవలే శూన్యంగా కనిపిస్తుంది. లింగ దర్శనముండదు. అందువల్లనే చిదంబర రహస్యం అనే పేరు వచ్చినది. ఈ క్షేత్రంలో నటరాజస్వామి, శివకామ సుందరి అమ్మవార్లు మాత్రమే ఉంటారు.

3. జలలింగం:-
ఈ లింగం క్రింద ఎప్పుడూ నీటి ఊట ఉండటం వలన దీనిని జలలింగం అంటారు. ఇది తమిళనాడులోని తిరుచురాపల్లికి సమీపంలో జంబుకేశ్వర క్షేత్రంలో ఉంటుంది. ఈ స్వామి పేరు జంబుకేశ్వరుడు. అమ్మవారి పేరు అఖిలాండేశ్వరి. బ్రహ్మహత్యా పాతక నివారణకోసం పరమేశ్వరుడు జంబూక వృక్షం క్రింద తపస్సు చేసినందుకే ఇక్కడి శివునికి జంబుకేశ్వరుడని పేరువచ్చెను.

4. తేజోలింగం:
తమిళనాడులోని అరుణాచలంలో తిరువన్నామలై క్షేత్రంలో తేజోలింగం ఉన్నది. అరుణాచల శిఖరాగ్రంపై అగ్నిశిఖ ఒకటి ఆవిర్భవించి తేజోలింగ రూపమయ్యాడు శివుడు. ఈయన పేరే అరుణాచలేశ్వరుడు. అమ్మవారి పేరు అరుణాచలేశ్వరి.

5. వాయులింగం:
ఆంధ్రప్రదేశ్ తిరుపతికి దగ్గరలోని శ్రీ కాళహస్తీశ్వరస్వామి ఆలయంలోని లింగమే వాయులింగం. ఈయన పేరు కాళహస్తీశ్వరుడు. అమ్మవారి పేరు ఙ్ఞానప్రసూనాంబ. సాలెపురుగు, పాము, ఏనుగులకు మోక్షము ప్రసాదించిన క్షేత్రం. ఇవే పంచభూతలింగాలుగా ప్రసిద్ధి చెందినవి.
 —

ఆంజనేయస్వామికి అభిషేకం.....



ఆవుపాలతో - సర్వసౌభాగ్యాలు
ఆవుపెరుగుతో- కీర్తి మరియు ఆరోగ్యప్రాప్తి
ఆవునెయ్యి -ఐశ్వర్యం
తేనె - తేజస్సువృధ్ధి
పంచదార - దు:ఖాలు నశిస్తాయి
చెరకురసం - ధనం వృధ్ధి చెందుతుంది
కొబ్బరినీళ్ళతో - సర్వసంపదలు వృధ్ధిచెందుతాయి .
విబూధి తో - సర్వపాపాలు నశిస్తాయి
పుష్పోదకం - భూలాభాన్ని కలుగజేస్తుంది
బిల్వజలాభిషేకం- భోగభాగ్యాలు లభిస్తాయి
గరికనీటితో - పోగొట్టుకున్న ధన,కనక,వస్తు ,వాహనాదులను తిరిగిపొందగలుగుతారు.
రుద్రాక్షోదకం తో - ఐశ్వర్యం
సువర్ణోదకం తో - దారిద్ర్యాన్ని పోగొడుతుంది
అన్నంతో అభిషేకం తో - సుఖం కలిగి ఆయుష్షుపెరుగుతుంది.
ద్రాక్షారసంతో - జయం కలుగుతుంది
కస్తూరిజలాభిషేకంచేస్తే - చక్రవర్తిత్వాన్ని ప్రసాదిస్తుంది.
నవరత్నజలాభిషేకం - ధనధాన్య, పుత్ర సంతానం, పశుసంపద లభింపజేస్తుంది
మామిడిపండ్లరసం తో - చర్మ వ్యాధులు నశిస్తాయి
పసుపునీటితో - సకలశుభాలు ,సౌభాగ్యదాయకం
నువ్వులనూనె తో అభిషేకిస్తే - ,అపమృత్యు నివారణ .
సింధూరంతో అభిషేకంతో- శని దోషపరిహారం

భయాందోళనలను రూపుమాపే శ్వేతార్క ఆంజనేయ స్వామి



తెల్ల జిల్లేడు మొక్క కాండం మీద ఆంజనేయ రూపాన్ని చెక్కి శ్వేతార్క ఆంజనేయ స్వామిని రూపొందిస్తారు. శ్వేతార్క ఆంజనేయ స్వామిని చెక్కేవారు ఆ సమయంలో నియమనిష్టలతో ఉండాలి. స్వామివారికి ఇష్టమైన కాషాయరంగు దుస్తులు ధరించాలి. బ్రహ్మచర్యం పాటించాలి.

శ్వేతార్క ఆంజనేయ స్వామిని ''హనుమజ్జయంతి'' నాడు పూజించడం శ్రేష్టం. లేదా అక్షయతృతీయ నాడు శ్వేతార్క ఆంజనేయ స్వామి పూజ జరుపుకోవడం ఉత్తమం. ఈ రోజుల్లో వీలు కుదరకపోతే, మంగళవారం లేదా శనివారం నాడు ప్రార్ధించవచ్చు. ఆవేళ దశమి తిధి గనుక కలసివస్తే మరీ మంచిది.

ఇంతకీ శ్వేతార్క ఆంజనేయ స్వామి ప్రత్యేకత ఏమిటి అనే సందేహం రావడం సహజం. దుష్ట శక్తుల పీడనుండి, గ్రహాల దుస్థితినుండి రక్షిస్తాడు శ్వేతార్క ఆంజనేయ స్వామి. అంతేకాదు, బారారిష్ట దోషాలను తొలగిస్తాడు శ్వేతార్క ఆంజనేయ స్వామి.

కొందరు పిల్లలకు పుట్టుకతో బాలారిష్ట దోషాలు వస్తాయి. ఈ దోషాలు పిల్లలు పదమూడో ఏట అడుగు పెట్టేవరకూ అనేక రకాలుగా పీడిస్తాయి. ఇలా బాలారిష్ట దోషాలు ఉన్న చిన్నారులు ఏదో ఒక జబ్బు బారిన పడుతుంటారు. కొందరు పిల్లలు బుద్ధిమాంద్యంతో బాధపడతారు. ఇంకొందరు చిన్నారులు చీటికిమాటికి అనారోగ్యం చేసి అవస్త పడుతూ, బాగా చిక్కిపోతారు. కొందరు బాలలు స్కూలుకు వెళ్ళమని మారాం చేస్తారు. వారిని ఎంత ఒప్పించినా స్కూలుకు పంపడం సాధ్యపడదు. మరికొందరు పిల్లలు మంచి తెలివి ఉండి కూడా చదువుకోరు. సోమరులుగా తయారౌతారు. ఆరోగ్యం దెబ్బ తినడం, చదువుకు దూరం కావడమే కాకుండా కొందరు చిన్నారులు భయాందోళనలకు గురవుతారు. ఈ రకమైన బాలారిష్టాల నుండి గట్టేక్కిస్తాడు శ్వేతార్క ఆంజనేయ స్వామి.

దెయ్యాలు, భూతాలు అనే మాటలు మనకు తరచూ వినిపిస్తుంటాయి. గాలి సోకడం, దెయ్యం పట్టడం, చేతబడులు లాంటి తాంత్రిక శక్తుల మాట వింటే చాలు భయాందోళనలు ఆవరిస్తాయి. వీటి బారిన పడినవారి జీవితం అల్లకల్లోలం అవుతుంది. ఇలాంటి దుష్ట శక్తుల బారినుండి శ్వేతార్క ఆంజనేయ స్వామి కాపాడతాడు.

శ్వేతార్క ఆంజనేయ స్వామిని ఎలా అర్చించాలి అంటే, పూజ ప్రారంభించే రోజున పొద్దున్నే స్నానం చేసి, పూజాస్థలంలో కడిగిన పీట ఉంచాలి. ఆ పీటకు పసుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టాలి. పీటమీద ఎరుపు రంగు వస్త్రాన్ని పరిచి, దానిమీద ఒక పళ్ళాన్ని ఉంచాలి. ఆ పళ్ళెంలో అక్షింతలు, పూలు, సింధూరం జల్లి, వాటిమీద శ్వేతార్క ఆంజనేయ స్వామిని ఉంచాలి.

శ్వేతార్క ఆంజనేయ స్వామికి సింధూరం అలంకరించి, పూలమాల వేసి, దీపారాధన చేయాలి. ధ్యాన, ఆవాహనాది విధులతో శ్వేతార్క ఆంజనేయ స్వామిని ఆరాధించాలి. తర్వాత అష్టోత్తర శతనామ పూజ చేయాలి.
శ్వేతార్క ఆంజనేయ స్వామిని భక్తిపూర్వకంగా ప్రార్ధించాలి. జపమాల చేత ధరించి -
''ఓం ఆంజనేయాయ విద్మహే
వాయుపుత్రాయ ధీమహి
తన్నో హనుమాన్ ప్రచోదయాత్''
అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి.

జపం ముగిసిన తర్వాత శ్వేతార్క ఆంజనేయ స్వామికి ధూప, దీప, నైవేద్యాలు సమర్పించాలి. నీరాజనం, మంత్రపుష్పం మొదలైన సేవలు ముగిసిన తర్వాత శ్వేతార్క ఆంజనేయ స్వామి పాదాల వద్దనున్న అక్షింతలు తీసి, తలమీద జల్లుకోవాలి.

ఆ తర్వాత శ్వేతార్క ఆంజనేయ స్వామికి ఉద్వాసన చెప్పి, విగ్రహం తీసి, పూజా మందిరంలో ప్రతిష్టించుకోవాలి. ఇలా శ్వేతార్క ఆంజనేయ స్వామిని మన పూజా మందిరంలో ప్రతిష్టించుకున్న పిదప రోజూ చేసే పూజా కార్యక్రమాలు పూర్తయ్యాక శ్వేతార్క ఆంజనేయ స్వామిని ధ్యానించాలి.
''ఓం ఆంజనేయాయ విద్మహే
వాయుపుత్రాయ ధీమహి
తన్నో హనుమాన్ ప్రచోదయాత్'' మంత్రాన్ని 11 సార్లు జపించాలి.
ఇలా శ్వేతార్క ఆంజనేయ స్వామిని భక్తి ప్రపత్తులతో పూజించేవారికి ఎలాంటి బాధలు, భయాలు ఉండవు. ఏ విధమైన చీడలు, పీడలు సోకవు. అనుకున్న పనులు నిర్విఘ్నంగా నెరవేరతాయి.

Ganapati Pooja




కాత్యాయని వ్రతాన్ని ఎలా చేయాలి ? ఎందుకు చేయాలి



కాత్యాయని వ్రతాన్ని కన్యలు ఆచరించవచ్చు. వివాహము రద్దైన వారు, పెళ్లికి ఆటంకాలను ఎదుర్కొనే వారు. వివాహము అయి విడాకులు తీసుకున్నవారు, తరచూ వివాహ ప్రయత్నాలు విఫలమైనట్లు అనిపించే వారు ఈ వ్రతాన్ని అనుసరించవచ్చు.

ఇంకా మనసుకు నచ్చే వరుడు కోసం అన్వేషణ చేస్తున్నవారు, కుజదోషము జాతక చక్రములో వున్నవారు, ఆర్థిక స్తోమత లేక వివాహమునకు ఆటంకములు కలవారు ఆచరించవచ్చును. స్త్రీ జాతక చక్రములో రాహుకేతు దోషములు కలవారు కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు.

వ్రతాన్ని ఎలా ఆచరించాలి.. నియమాలేంటి ?
మంగళవారం రోజున ఈ వ్రతాన్ని ఆరంభించాలి. మంగళవారం కృత్తిక నక్షత్రమైతే ఇంకా మంచిది.
నాగ పంచమి, సుబ్రహ్మణ్య షష్ఠి,నాగుల చవితి పర్వ దినములలో ఈ వ్రతము ఆచరించవచ్చును.
దేవినవరాత్రులు కూడా ఈ వ్రతము ఆచరించవచ్చును.

బంగారముతో కానీ, పసుపు కొమ్ములతో కానీ వారి శక్తానుసారముగా మంగళ సూత్రములు కలశమునకు అలంకరించుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసి వండిన అప్పాలను ఏడింటిని నైవేద్యముగా సమర్పించాలి. ఏడు చెరుకు ముక్కలను (తొక్క తీసినవి) కూడా నైవేద్యముగా సమర్పించాలి.

వ్రతము పూర్తీ చేసిన తరువాత వ్రతకథ విని కథాక్షతలను అమ్మవారి మీద వుంచి పిదప ఆ అక్షతలను శిరస్సుపై పెద్దలచే వేయించుకుని ఆశీర్వాదము తీసికుని రాత్రి భోజనము చేయాలి.

మంగళ వారములు భక్తితో జరుపవలెను. మధ్యలో ఏ వారమైన ఆటంకము వచ్చినచో ఆ పై వారము జరుపుకోవచ్చు. ఇలా ఏడు వారాలయ్యాక ఏడో మంగళవారము ఉద్యాపన జరుపుకోవాలి.

ఉద్యాపన రోజున ఏడుగురు ముత్తైదువులను పిలిచి తలంటి పోయాలి. అలా కానీ వారు ఉదయం ముత్తైదువుల గృహమునకు వెళ్లి కుంకుడు కాయలు, పసుపు, తలస్నానమునకు ఇచ్చి రావాలి.

ఉద్యాపన రోజున ఏడుగురు ముత్తైదువులకు ఏడు అప్పాలు, ఏడు చెరుకు ముక్కలు, ఏడు రవికలు వాయనమిచ్చి (ఒక్కరికి చీర ఇచ్చి ) వారిచే అక్షతలు వేయించుకుని ఆశీర్వాదము పొందాలి

ముందుగా పసుపుతో గణపతిని చేసి గణపతికి పూజ చేయాలి. తరువాత పసుపు రాసిన పీటపై బియ్యం పోసి దానిపై కలశమును వుంచి కలశములో పవిత్రమైన నీరుసగము పోయాలి.

అమ్మ వారి విగ్రహము (ఉన్నచో ) లేదా ప్రతిమగా రూపాయి వుంచాలి. ఇంటిలో తూర్పు వైపున ఈశాన్య దిక్కున శుభ్రము చేసి ముగ్గులు వేసి ఎర్ర కండువ పరిచి దాని మీద బియ్యంపోయవలెను.

బియ్యం పైన రాగి చెంబు కానీ , ఇత్తడి చెంబు కానీ ఉంచి టెంకాయను వుంచి దానిపై ఎర్రని రవిక కిరీటంలా పెట్టాలి. (కలశస్థాపన చేయాలి). ఈ వ్రతములో ఎర్రని పువ్వులు ఎర్రని అక్షతలనే వాడటం శ్రేష్ఠం. వ్రతము అయిన తరువాత వండిన భోజన పదార్దములు నైవేద్యం పెట్టాలి. షోడశోపచార పూజ జరుపుకోవాలి. వ్రత మండపములో పార్వతీపరమేశ్వరుల ఫోటో ఖచ్చితముగా ఉండాలి.

సాయం కాలము ఈ వ్రతము ఆచరించవలెను. పగలంతా ఉపవాసము ఉండవలెను. వ్రతము పూర్తి అయిన తరువాత భోజనము చేయాలి. వ్రతం ఆచరించే రోజు శిరస్నానం చేయాలి.

పగలు నిద్రపోరాదు. చివరి వారములో పుణ్య స్త్రీలకు దక్షిణ తాంబూలాదులతో కనీసం 7 కాత్యాయనీ వ్రత పుస్తకములను సమర్పించాలి. ఆర్ధిక స్తోమత లేని వారు వ్రతం ఆచరించలేని వారు ఏడుగురు వివాహం కాని కన్యలకు ఏడు పుస్తకములను ఇచ్చిన చాలా మంచిది...

మనసు వ్యాకులముగా ఉన్నప్పుడు చదువుకోవలసిన పద్యము :-

నమోస్తు రామాయ సలక్షణాయ
దేవైచ్య తస్మై జనకాత్మ జాయై
నమోస్తు రుద్రేంద్ర యమాని వేభ్యో
నమోస్తు చంద్రార్క మరుద్గణ్నేభ్యహ
ధర్మాత్మా సత్య సంధశ్చరామో దాశరధిర్యది
పౌరుషేచా ప్రతిన్ద్వన్దహ శరైనం జాహిరా వణీమ్
ఓం నమో రామ చంద్రాయ !

గాయత్రి

గణేశ గాయత్రి - ఓం ఏకదంష్ట్రాయ విద్మహే వక్రతుండాయ ధీమహి, తన్నోదంతిః ప్రచోదయాత్.

నృసింహ గాయత్రి - ఓం ఉగ్రనృసింహాయ విద్మహే వజ్రనఖాయ ధీమహి, తన్నోనృసింహః ప్రచోదయాత్.

విష్ణు గాయత్రి - ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి, తన్నోవిష్ణుః ప్రచోదయాత్. 

శివ గాయత్రి - ఓం పంచవక్త్రాయ విద్మహే మహాదేవాయ ధీమహి, తన్నోరుద్రః ప్రచోదయాత్

కృష్ణ గాయత్రి - ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి, తన్నోకృష్ణః ప్రచోదయాత్.

రాధా గాయత్రి - ఓం వృషభానుజాయై విద్మహే కృష్ణ ప్రియాయై ధీమహి, తన్నోరాధా ప్రచోదయాత్.

లక్ష్మీ గాయత్రి - ఓం మహాలక్ష్మ్యేచ విద్మహే విష్ణుప్రియాయై ధీమహి, తన్నోలక్ష్మీః ప్రచోదయాత్.

అగ్ని గాయత్రి - ఓం మహా జ్వాలాయ విద్మహే అగ్నిదేవాయ ధీమహి, తన్నో అగ్నిః ప్రచోదయాత్.

ఇంద్ర గాయత్రి - ఓం సహస్ర నేత్రాయ విద్మహే వజ్రహస్తాయ ధీమహి, తన్నోఇంద్రః ప్రచోదయాత్.

సరస్వతీ గాయత్రి - ఓం సరస్వత్యై విద్మహే బ్రహ్మపుత్ర్యై ధీమహి, తన్నోదేవీ ప్రచోదయాత్.

దుర్గా గాయత్రి - ఓం గిరిజాయై విద్మహే శివప్రియాయై ధీమహి, తన్నోదుర్గా ప్రచోదయాత్.

హనుమద్గాయత్రి - ఓం అంజనీ సుతాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి, తన్నోమారుతిః ప్రచోదయాత్.

పృథ్వీ గాయత్రి - ఓం పృథ్వీదేవ్యై విద్మహే సహస్రమూర్త్యై ధీమహి, తన్నోపృథ్వీ ప్రచోదయాత్.

సూర్య గాయత్రి - ఓం భాస్కరాయ విద్మహే దివాకరాయ ధీమహి, తన్నోసూర్యః ప్రచోదయాత్.

రామ గాయత్రి - ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి, తన్నోరామః ప్రచోదయాత్.

సీతా గాయత్రి - ఓం జనక నందిన్యై విద్మహే భూమిజాయై ధీమహి, తన్నోసీతాః ప్రచోదయాత్.

చంద్ర గాయత్రి - ఓం క్షీర పుత్రాయ విద్మహే అమృతతత్త్వాయ ధీమహి, తన్నోశ్చంద్రః ప్రచోదయాత్.

యమ గాయత్రి - ఓం సూర్యపుత్రాయ విద్మహే మాహాకాలాయ ధీమహి, తన్నోయమః ప్రచోదయాత్.

బ్రహ్మ గాయత్రి - ఓం చతుర్ముఖాయ విద్మహే హంసారూఢాయ ధీమహి, తన్నోబ్రహ్మః ప్రచోదయాత్.

వరుణ గాయత్రి - ఓం జలబింబాయ విద్మహే నీల పురుషాయ ధీమహి, తన్నోవరుణః ప్రచోదయాత్.

నారాయణ గాయత్రి - ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి, తన్నోనారాయణః ప్రచోదయాత్.

హయగ్రీవ గాయత్రి - ఓం వాగీశ్వరాయ విద్మహే హయగ్రీవాయ ధీమహి, తన్నోహయగ్రీవః ప్రచోదయాత్.

హంస గాయత్రి - ఓం పరమహంసాయ విద్మహే మాహాహాంసాయ ధీమహి, తన్నోహంసః ప్రచోదయాత్.

తులసీ గాయత్రి - ఓం శ్రీతులస్యై విద్మహే విష్ణుప్రియాయై ధీమహి, తన్నో బృందాః ప్రచోదయాత్.

కామ గాయత్రి' - ఓం కామదేవాయ విద్మహే పుష్పబాణాయ ధీమహి, తన్నోనంగః ప్రచోదయాత్.

ఈ మంత్రముతో అమ్మవారిని ప్రతి నిత్యం స్తుతించేవారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని విశ్వాసం. ఇంకా పూర్వజన్మల పాపాలు హరింపబడి, సుఖసంతోషాలు చేకూరుతాయి. అలాగే ఈతిబాధలు తొలగిపోయి వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి వంటి శుభఫలితాలుంటాయని పురాణాలు చెబుతున్నాయి.

అష్టవిధ కాళికా మూర్తులు.

తమో గర్భంలో దాగివున్న వెలుగుని, మృత్యు గర్భంలో దాగి వున్న చేతనను, ఆ విద్యలో బీజ భూతంగా నిద్రాణ స్థితిలో ఉన్న జ్!నానాన్ని మేల్కొలిపే ప్రాణ రూపమైన మహా ప్రచండాగ్ని కాళికా దేవి. అలాంటి కాళికా మూర్తుల వర్ణన ఏమిటంటే.. 1. దక్షిణ కాళిక 2. సిద్ధ కాళిక 3. గుహ్య కాళిక 4. శ్రీ కాళిక 5. భద్ర కాళిక 6. చాముండా కాళిక 7. శ్మశాన కాళిక 8 .మహాకాళిక.

ఇంకా సిద్ధుల ధ్యాన పరంపరను అనుసరించి కాళికాదేవి అనేక రూపాలలో ఆయా క్షేత్రాలలో సాక్షాత్కరిస్తుంది. కాళీ మంత్రాలలో అనేక బేధాలు ఉన్నాయి. 22 అక్షరాల మంత్రం ప్రసిద్ధిమైంది. పంచదశాక్షర మంత్రం, పంచాక్షరం, షడక్షరి సప్తాక్షరం, ఏకాక్షర మంత్రము ఇలా పలుమంత్రాలను మంత్ర రత్నాకరం పేర్కొంది. ఈ మంత్రాల సాధనలో నిర్దేశించిన ప్రకారం జపహోమ తర్పణాలు కుడా చెప్పబడ్డాయి.

కాలాన్ని నడిపించేది, సాధకుల మృత్యు భయాన్ని పోగొట్టేదీ కాళికాదేవి. కఠినతరమైన ఆ ఉపాసన చేయగలిగితే అనంత శుభ ఫలాలు అందుతాయి. శిధిలాలను తొలగించి నూతన నిర్మాణాన్ని చేపట్టిన విధం మహాకాళిక తత్వంలో ప్రకటితమవుతుంది.

కాళికా ఉపాసన ఇప్పటికీ ఉజ్జయిని ప్రాంతాలలో అధికంగా ఉంది. వంగ దేశం ఈ దేవతకు ప్రధాన ఆవాస స్థానం. ఇప్పటికీ ఉజ్జయిని ప్రాంతాలలో కాళ్ ఉపాసన అనేక రహస్య మార్గాలలో చేసేవారు ఎందరో సాధకులు ఉన్నట్లు చెబుతారు.

కనక ధారా స్తోత్రం.

వందే వందారు మందారమిందిరానంద కందలం
అమందానంద సందోహ బంధురం సింధురాననమ్

అంగం హరేః పులకభూషణమాశ్రయంతీ
భృంగాంగనేవ ముకుళాభరణం తమాలమ్ |
అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా
మాంగల్యదాస్తు మమ మంగళదేవతాయాః || 1 ||

ముగ్ధా ముహుర్విదధతీ వదనే మురారేః
ప్రేమత్రపాప్రణిహితాని గతాగతాని |
మాలాదృశోర్మధుకరీవ మహోత్పలే యా
సా మే శ్రియం దిశతు సాగర సంభవా యాః || 2 ||

ఆమీలితాక్షమధిగ్యమ ముదా ముకుందమ్
ఆనందకందమనిమేషమనంగ తంత్రమ్ |
ఆకేకరస్థితకనీనికపక్ష్మనేత్రం
భూత్యై భవన్మమ భుజంగ శయాంగనా యాః || 3 ||

బాహ్వంతరే మధుజితః శ్రితకౌస్తుభే యా
హారావళీవ హరినీలమయీ విభాతి |
కామప్రదా భగవతో‌உపి కటాక్షమాలా
కళ్యాణమావహతు మే కమలాలయా యాః || 4 ||

కాలాంబుదాళి లలితోరసి కైటభారేః
ధారాధరే స్ఫురతి యా తటిదంగనేవ |
మాతుస్సమస్తజగతాం మహనీయమూర్తిః
భద్రాణి మే దిశతు భార్గవనందనా యాః || 5 ||

ప్రాప్తం పదం ప్రథమతః ఖలు యత్ప్రభావాత్
మాంగల్యభాజి మధుమాథిని మన్మథేన |
మయ్యాపతేత్తదిహ మంథరమీక్షణార్థం
మందాలసం చ మకరాలయ కన్యకా యాః || 6 ||

విశ్వామరేంద్ర పద విభ్రమ దానదక్షమ్
ఆనందహేతురధికం మురవిద్విషో‌உపి |
ఈషన్నిషీదతు మయి క్షణమీక్షణార్థం
ఇందీవరోదర సహోదరమిందిరా యాః || 7 ||

ఇష్టా విశిష్టమతయోపి యయా దయార్ద్ర
దృష్ట్యా త్రివిష్టపపదం సులభం లభంతే |
దృష్టిః ప్రహృష్ట కమలోదర దీప్తిరిష్టాం
పుష్టిం కృషీష్ట మమ పుష్కర విష్టరా యాః || 8 ||

దద్యాద్దయాను పవనో ద్రవిణాంబుధారాం
అస్మిన్నకించన విహంగ శిశౌ విషణ్ణే |
దుష్కర్మఘర్మమపనీయ చిరాయ దూరం
నారాయణ ప్రణయినీ నయనాంబువాహః || 9 ||
గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి
శాకంబరీతి శశిశేఖర వల్లభేతి |
సృష్టి స్థితి ప్రళయ కేళిషు సంస్థితాయై
తస్యై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై || 10 ||

శ్రుత్యై నమో‌உస్తు శుభకర్మ ఫలప్రసూత్యై
రత్యై నమో‌உస్తు రమణీయ గుణార్ణవాయై |
శక్త్యై నమో‌உస్తు శతపత్ర నికేతనాయై
పుష్ట్యై నమో‌உస్తు పురుషోత్తమ వల్లభాయై || 11 ||

నమో‌உస్తు నాళీక నిభాననాయై
నమో‌உస్తు దుగ్ధోదధి జన్మభూమ్యై |
నమో‌உస్తు సోమామృత సోదరాయై
నమో‌உస్తు నారాయణ వల్లభాయై || 12 ||

నమో‌உస్తు హేమాంబుజ పీఠికాయై
నమో‌உస్తు భూమండల నాయికాయై |
నమో‌உస్తు దేవాది దయాపరాయై
నమో‌உస్తు శార్ంగాయుధ వల్లభాయై || 13 ||

నమో‌உస్తు దేవ్యై భృగునందనాయై
నమో‌உస్తు విష్ణోరురసి స్థితాయై |
నమో‌உస్తు లక్ష్మ్యై కమలాలయాయై
నమో‌உస్తు దామోదర వల్లభాయై || 14 ||

నమో‌உస్తు కాంత్యై కమలేక్షణాయై
నమో‌உస్తు భూత్యై భువనప్రసూత్యై |
నమో‌உస్తు దేవాదిభిరర్చితాయై
నమో‌உస్తు నందాత్మజ వల్లభాయై || 15 ||

సంపత్కరాణి సకలేంద్రియ నందనాని
సామ్రాజ్య దానవిభవాని సరోరుహాక్షి |
త్వద్వందనాని దురితా హరణోద్యతాని
మామేవ మాతరనిశం కలయంతు మాన్యే || 16 ||

యత్కటాక్ష సముపాసనా విధిః
సేవకస్య సకలార్థ సంపదః |
సంతనోతి వచనాంగ మానసైః
త్వాం మురారిహృదయేశ్వరీం భజే || 17 ||

సరసిజనిలయే సరోజహస్తే
ధవళతమాంశుక గంధమాల్యశోభే |
భగవతి హరివల్లభే మనోఙ్ఞే
త్రిభువనభూతికరీ ప్రసీదమహ్యమ్ || 18 ||

దిగ్ఘస్తిభిః కనక కుంభముఖావసృష్ట
స్వర్వాహినీ విమలచారుజలాప్లుతాంగీమ్ |
ప్రాతర్నమామి జగతాం జననీమశేష
లోకధినాథ గృహిణీమమృతాబ్ధిపుత్రీమ్ || 19 ||

కమలే కమలాక్ష వల్లభే త్వం
కరుణాపూర తరంగితైరపాంగైః |
అవలోకయ మామకించనానాం
ప్రథమం పాత్రమకృతిమం దయాయాః || 20 ||

దేవి ప్రసీద జగదీశ్వరి లోకమాతః
కళ్యాణగాత్రి కమలేక్షణ జీవనాథే |
దారిద్ర్యభీతిహృదయం శరణాగతం మాం
ఆలోకయ ప్రతిదినం సదయైరపాంగైః || 21 ||

స్తువంతి యే స్తుతిభిరమీభిరన్వహం
త్రయీమయీం త్రిభువనమాతరం రమామ్ |
గుణాధికా గురుతుర భాగ్య భాగినః
భవంతి తే భువి బుధ భావితాశయాః || 22 ||

సువర్ణధారా స్తోత్రం యచ్ఛంకరాచార్య నిర్మితం
త్రిసంధ్యం యః పఠేన్నిత్యం స కుబేరసమో భవేత్ ||
 —

ధనలక్ష్మి రూపేణ పాలయమామ్!!



ధిమిధిమి ధింధిమి ధింధిమి ధింధిమి! దుందుభినాదసుపార్ణమయే!!
ఘుమఘుమ ఘుంఘుమ ఘుంఘుమ ఘుంఘుమ! శంఖ నినాద సువాద్యనుతే!1
వేదపురాణేతిహాససుపూజిత! వైదిక మార్గ ప్రదర్శయుతే!!
జయ జయ హే మధుసూదన కామిని ధనలక్ష్మి రూపేణ పాలయమాం!!

ప్రతి శుక్రవారం ఉదయం అమ్మవారిని రకరకాల పూలతో పూజించి, నైవేద్యము పెట్టి, పై విధంగా స్తుతిస్తే సకలశుభాలు కలుగుతాయి. కార్తీక, ఆషాఢ, శ్రావణ మాసాలలో ఇది చాలా ముఖ్యం.

అయి! కలి కల్మషనాశిని! కామిని! వేదిక రూపిణి! వేదమయే!!
క్షీరసముద్భవ మంగళ రూపిణి! మంత్రనివాసిని మంత్రనుతే!!
మంగళ దాయిని! అంబుజవాసిని! దేవగణా శ్రిత పాదయుతే!!
జయజయ హే మధుసూదన కామిని ధాన్యలక్ష్మి! సదా పాలయమాం.

భావం:
కలిమి కలిగించే ధాన్యలక్ష్మీ, మా మనసుల్లో కల్మషాన్ని తొలగించు తల్లీ. వేదాలకు రూపమైన ఆదికి, అంతానికి మూలమైన తల్లీ మము కాపాడుము. పాలసముద్రం నుంచి జనించిన మంగళదాయినీ దేవీ మంత్రాల్లో నివసించే మాతా దేవగణాల పూజలను అందుకునే ధాన్యలక్ష్మీ నీకు జయము.

లక్ష్మీం క్షీరసముద్రరాజ తనయాం శ్రీరంగధామేశ్వరీం!
దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురామ్!
శ్రీ మన్మంద కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం!
త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియామ్!

ప్రతి రోజూ లక్ష్మీదేవిని పై తరహాలో స్తుతిస్తే సకల శుభాలు కలగడమే కాకుండా అష్టైశ్వర్యాలు మన ఇంట్లోనే ఉంటాయనేది భక్తుల నమ్మకం.

సుమనసవందిత సుందరి మాధవి! చంద్రసహోదరి హేమమయే||
మునిగణవందిత మోక్షప్రదాయిని| మంజులభాషిణి! వేదనుతే||
పంకజవాసిని! దేవసుపూజిత! సద్గుణవర్షిణి! శాంతియుతే||
జయ! జయ! హే మధుసూదనకామిని! ఆదిలక్ష్మి! సదా పాలయమామ్ ||

భావము:
సుందరమైన మోము కలిగిన, చంద్రునికి సహోదరివైన ఆదిలక్ష్మీదేవి నిను మేము ముందుగా పూజిస్తాము. మునిగణాలు కొలిచే, మోక్షాన్ని ప్రసాదించే మంజులాదేవీ మాపై కృప చూపించుము. పంకజములో నివసించే ఓ చల్లని తల్లీ మాకు విజయములు చేకూర్చుము. దేవగణాదులచే నిత్యం పూజించబడే శాంతిస్వరూపిణి నీకు జయము జయము.

కుజ దోషం నివారణ మార్గం:

మన పురాణాలలో కుజ గ్రహం ను,అంగారకుడు అని,మంగళుడు అనే నామాలు ఉన్నాయి.అలాగే కుజుడు భూమి పుత్రుడు అని కూడా తెలుసు..ఒక సారి కుజుడు తన తల్లి తండ్రుల అనుమతి తీసుకోని వినాయకుడి గురించి తపస్సు చేయడానికి నర్మదా నది తీరంలో ఒక ప్రదేశంను ఎంచుకొని నిరాహారంగా 1000 సంవత్సరాలు గణపతి గురించి తపస్సు చేసినాడు.అలా 1000 సంవత్సరాలు కుజుడు తపస్సు చేసినా తరువాత మాఘ బహుళ చవితి చంద్రోదయం నాడు వినాయకుడి ప్రతక్ష్యమయ్యాడు.అలా ప్రతక్ష్యమైన వినాయకుడు ఎలా ఉన్నాడు అంటే దశా భుజాలు కలిగి బాలుడి గా ఉన్నాడు.అదే విధంగా వినాయకుడి తలమీద ఒక చంద్ర వంక కూడా ఉన్నదీ.

వినాయకుడు,అంగారకుడు తో ఇలా అన్నాడు." నీ తపస్సుకు మెచ్చితిని నీకు ఏమి వరం కావాలో అని కోరుకొమ్మన్నాడు.అప్పుడు అంగారకుడు ఎంతో సంతోషించి ఆ వినాయకుడిని ఎన్నో విధములుగా స్తుతించాడు.అలా ప్రతక్ష్యమైన వినయకుడ్నిని అంగారకుడు తనకు " అమృతం" కావాలని,అదే విధంగా నేను ఎప్పడు నీ నామ స్మరణ చేస్తుండాలని అని వరమియమని అంగారకుడు కోరుకొన్నాడు అప్పుడు వినాయకుడు తదాస్తు అని దీవించి ,నీవు ఎర్రని రంగులో ఉన్నావు ఎర్రని వస్త్రం కట్టుకోన్నావు,ఈ దినం మంగళవారం.కనుక ఇక నుంచి నీ పేరు మంగళుడు అని వరం ఇచ్చి వినాయకుడి అంతర్ధానం అయ్యాడు.ఆ తర్వాత అంగారకుడు(మంగళుడు) అమృతం ప్రాప్తిస్తుంది

అమృతం సేవించిన తరువాత కుజుడు(మంగళుడు) ఒక ఆలయం కట్టించి అందులో వినాయకుడిని ప్రతిష్టించి ,ఆ వినాయకుడిని శ్రీ మంగళమూర్తి అని పేరు పెట్టాడు.ఈ ఆలయం ఇప్పటికి మన భారత దేశంలో ఉంది.అదేవిధంగా వినాయకుడు ఇంకొక వరం కుజుడికి ప్రసాదించాడు. ఎవరైతే అంగారక చతుర్ధి రోజు( బహుళ చతుర్ధి ,కృష్ణ పక్షంలో వచ్చే చతుర్ధి లేదా పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్ధి రోజు) మంగళవారం రోజున ఉపవాసం ఉండి వినాయకుడికి భక్తి శ్రద్దలతో పూజచేస్తారు వారికీ ఉన్న అన్ని కుజగ్రహ దోషాలు అన్ని తొలగిపోతాయి.అని వరం ప్రసాదించాడు అలాగే వినాయకుడి అనుగ్రహం కూడా కలుగుతుంది.ఈ పూజా ఫలం ఎటువంటిది అంటే ఒక సంవత్సరం సంకష్టి వ్రతం అంటే ఒకక్క నెలలో ఒక చతుర్ద్ది వస్తుంది..అలా 12 నెలలు ఎవరు వ్రతం చేస్తారో?అలా చేయడం వల్ల ఎలాంటి పుణ్య ఫలం వస్తుందో ఈ ఒక్క అంగారక చతుర్ధి రోజున చేసీ వినాయకుడి వ్రతం వల్ల కలేగే ఫలితం సమానం..అలాగే అన్ని దోషాలు,ముఖ్యంగా కుజ దోషాలు సంపూర్ణంగా నివారించాబడతాయి.

అన్నపూర్ణాష్టకం

నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ
నిర్ధూతాఖిల ఘోర పావనకరీ ప్రత్యక్ష మాహేశ్వరీ |
ప్రాలేయాచల వంశ పావనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || 1 ||

నానా రత్న విచిత్ర భూషణకరి హేమాంబరాడంబరీ
ముక్తాహార విలంబమాన విలసత్-వక్షోజ కుంభాంతరీ |
కాశ్మీరాగరు వాసితా రుచికరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || 2 ||

యోగానందకరీ రిపుక్షయకరీ ధర్మైక్య నిష్ఠాకరీ
చంద్రార్కానల భాసమాన లహరీ త్రైలోక్య రక్షాకరీ |
సర్వైశ్వర్యకరీ తపః ఫలకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || 3 ||

కైలాసాచల కందరాలయకరీ గౌరీ-హ్యుమాశాంకరీ
కౌమారీ నిగమార్థ-గోచరకరీ-హ్యోంకార-బీజాక్షరీ |
మోక్షద్వార-కవాటపాటనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || 4 ||

దృశ్యాదృశ్య-విభూతి-వాహనకరీ బ్రహ్మాండ-భాండోదరీ
లీలా-నాటక-సూత్ర-ఖేలనకరీ విఙ్ఞాన-దీపాంకురీ |
శ్రీవిశ్వేశమనః-ప్రసాదనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || 5 ||

ఉర్వీసర్వజయేశ్వరీ జయకరీ మాతా కృపాసాగరీ
వేణీ-నీలసమాన-కుంతలధరీ నిత్యాన్న-దానేశ్వరీ |
సాక్షాన్మోక్షకరీ సదా శుభకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || 6 ||

ఆదిక్షాంత-సమస్తవర్ణనకరీ శంభోస్త్రిభావాకరీ
కాశ్మీరా త్రిపురేశ్వరీ త్రినయని విశ్వేశ్వరీ శర్వరీ |
స్వర్గద్వార-కపాట-పాటనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || 7 ||

దేవీ సర్వవిచిత్ర-రత్నరుచితా దాక్షాయిణీ సుందరీ
వామా-స్వాదుపయోధరా ప్రియకరీ సౌభాగ్యమాహేశ్వరీ |
భక్తాభీష్టకరీ సదా శుభకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || 8 ||

చంద్రార్కానల-కోటికోటి-సదృశీ చంద్రాంశు-బింబాధరీ
చంద్రార్కాగ్ని-సమాన-కుండల-ధరీ చంద్రార్క-వర్ణేశ్వరీ
మాలా-పుస్తక-పాశసాంకుశధరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || 9 ||

క్షత్రత్రాణకరీ మహాభయకరీ మాతా కృపాసాగరీ
సర్వానందకరీ సదా శివకరీ విశ్వేశ్వరీ శ్రీధరీ |
దక్షాక్రందకరీ నిరామయకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || 10 ||

అన్నపూర్ణే సాదాపూర్ణే శంకర-ప్రాణవల్లభే |
ఙ్ఞాన-వైరాగ్య-సిద్ధయర్థం బిక్బిం దేహి చ పార్వతీ || 11 ||

మాతా చ పార్వతీదేవీ పితాదేవో మహేశ్వరః |
బాంధవా: శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయమ్ || 12 ||

సర్వ-మంగల-మాంగల్యే శివే సర్వార్థ-సాధికే |
శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణి నమో‌உస్తు తే || 13 ||

హోమ భస్మం లేదా విభూతి ధారణతో నవగ్రహ బాధలు తొలగిపోతాయి.

1. హోమభస్మ ధారణతో మనిషిలో ఉండే అన్ని రకాల దోషాలు నివారించబడతాయి. 

2. హోమ భస్మ ధారణతో దేవుని అనుగ్రహం కలిగి అన్ని పలును నిరాటకంగా జరుగుతాయి. 

3. భస్మ ధారణతో అన్ని రకాల గోచర, అగోచర, దృశ్య, అదృశ్య రోగాలు తొలగిపోతాయి.

4. శ్రీ మహాగణపతి హోమంలోని భస్మాన్ని ఉపయోగిస్తే అన్ని పనులు నిరాటంకంగా జరుగుతాయి.

5. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి హోమంలోని భస్మాన్ని ధరిస్తే ఇంట్లో ఉండే కలహాలు తొలగి అందరికీ శాంతి లభిస్తుంది.

6. శ్రీ దుర్గా హోమంలోని భస్మాన్ని ధరిస్తే సకల శత్రువుల నాశనం జరిగి ప్రశాంతత గల జీవితాన్ని సాగించవచ్చు.

7. శ్రీ ధన్వంతరి హోమంలోని భస్మాన్ని ధరిస్తే అన్ని రోగాలు నివారించబడి దేహం వజ్రసమానంగా మారుతుంది.

8. శ్రీ నవగ్రహ హోమంలోని భస్మాన్ని ధరిస్తే ఎంటువంటి గ్రహాల చెడు ప్రభావం ఉండదు.

9. శ్రీ మహా మృత్యుంజయ హోమంలోని భస్మంతో అన్ని రకాల అకాల మృత్యువులు తొలగిపోతాయి

10. శ్రీ లలిత త్రిపుర సుందరి, శ్రీ రాజరాజేశ్వరి దేవి, శ్రీ గాయత్రి దేవి హోమం, శ్రీ చక్ర హోమాల్లోని భస్మాన్ని ధరిస్తే అన్ని పనుల్లో విజయం సిద్ధించడంతో పాటు జీవితాంతం సౌఖ్యదాయక జీవితాన్ని కలిగి వుంటారు.

11 శ్రీ సుదర్శన హోమం భస్మధారణతో శత్రువుల నిర్మూలనం జరుగుతుంది.

12. శ్రీ లక్ష్మీ నారాయణ హోమంలోని భస్మాన్ని ధరిస్తే భార్యాభర్తల మధ్య స్పర్ధలు తొలగిపోతాయి.

13. హోమ భస్మధారణతో ఎటువంటి మాంత్రికుల బాధ, దృష్టి, శాపం, గ్రహ బాధలు వేధించవు.

హోమంలోని భస్మాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నేలపై ఉంచకూడదు.

Slokalu



Sivuniki Pradakshina Chese Paddati



maha mrutyunjaya mantram



lakshmi nivasa sdhanalu



gayatri mantram



ganapati mantram



saraswathi mantram



శ్రీ మహా లక్ష్మి దేవి అవతారము



లక్ష్మీం క్షీరసముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం
దాసీభూతసమస్తదేవ వనితాం లోకైక దీపాంకురాం
శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం

కమలాలను రెండు చేతులతో ధరించి, అభయ వరద హస్త ముద్రలను ప్రదర్శిస్తూ, గజరాజు సేవిస్తుండగా శ్రీమన్మహాలక్ష్మీ రూపములో అమ్మ దర్శనమిస్తుంది. మహాలక్ష్మీదేవి సర్వమంగళకారిణి. ఐశ్వర్య ప్రదాయిని. అష్టలక్ష్ముల సమిష్ఠి రూపమే మహాలక్ష్మి.

డోలాసురుడనే రాక్షసుడను సంహరించిన దేవత.శక్తి త్రయములో అమ్మ మధ్యశక్తి. ఈ దేవిని ఉపాసిస్తే ఫలితాలు శీఘ్రముగా కలుగుతాయని పురాణములు చెబుతున్నాయి.

“యాదేవీ సర్వ భూతేషు లక్ష్మీరూపేణ సంస్థితా” అంటే అన్ని జీవులలోనూ ఉండే లక్ష్మీ స్వరూపము దుర్గాదేవి అని చండీస్తుతి చెబుతుంది. మహాలక్ష్మీదేవిని పూజిస్తే సర్వమంగళ మాంగల్యాలు కలుగుతాయి. ఎరుపు రంగు పుష్పములతో అమ్మను పూజించవలెను.

“ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మీ స్వాహా” అనే మంత్రమును 108 మార్లు జపించవలెను.

శ్రీ సాయిబాబా అష్తోత్తరములు

ఓం శ్రీ సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ మహారాజ్ కి జయ

1. ఓం శ్రీ సాయి నాథాయనమః
2. ఓం శ్రీ సాయి లక్ష్మీనారాయణాయ నమః
3. ఓం శ్రీ సాయి కృష్ణరామశి వ మారుత్యా ది రూపాయ నమః
4 ఓం శ్రీ సాయి శేషసాయినే నమః
5 ఓం శ్రీ సాయి గోదావరితట షిరిడివాసినే నమః
6 ఓం శ్రీ సాయి భక్త హృదయాలయాయ నమః
7 ఓం శ్రీ సాయి సర్వ హృదయ వాసినే నమః
8 ఓం శ్రీ సాయి భూతవాసాయ నమః
9 ఓం శ్రీ సాయి భూత భవిష్యత్భావ వర్జితాయ నమః
10. ఓం శ్రీ సాయి కాలాతీతాయ నమః
11. ఓం శ్రీ సాయి కాలాయ నమః
12. ఓం శ్రీ సాయి కాలకాలాయ నమః
13. ఓం శ్రీ సాయి కాలదర్పదమనాయ నమః
14. ఓం శ్రీ సాయి మృత్యుంజయాయ నమః
15. ఓం శ్రీ సాయి అమర్త్యాయ నమః
16. ఓం శ్రీ సాయి మర్త్యాభయ ప్రదాయ నమః
17. ఓం శ్రీ సాయి జీవధారాయ నమః
18. ఓం శ్రీ సాయి సర్వాధారాయ నమః
19. ఓం శ్రీ సాయి భక్తావనసమర్ధాయ నమః
20. ఓం శ్రీ సాయి భక్తవన ప్రతిఙ్ఙాయ నమః
21. ఓం శ్రీ సాయి అన్నవస్త్రదాయ నమః
22. ఓం శ్రీ సాయి ఆరోగ్యక్షేమదాయ నమః
23. ఓం శ్రీ సాయి ధన మాంగల్య ప్రదాయ నమః
24. ఓం శ్రీ సాయి బుధ్ధిసిధ్ధిదాయ నమః
25. ఓం శ్రీ సాయి పుత్ర మిత్ర కళత్ర బంధు దాయ నమః
26. ఓం శ్రీ సాయి యోగక్షేమవహాయ నమః
27. ఓం శ్రీ సాయి ఆపద్బాంధవాయ నమః
28. ఓం శ్రీ సాయి మార్గబంధవే నమః
29. ఓం శ్రీ సాయి బుధ్ధి ముక్తి స్వర్గాపవర్గదాయ నమః
30. ఓం శ్రీ సాయి ప్రియాయ నమః
31. ఓం శ్రీ సాయి ప్రీతివర్ధనాయనమః
32. ఓం శ్రీ సాయి అంతర్యామినే నమః
33. ఓం శ్రీ సాయి సచ్చిదాత్మనే నమః
34. ఓం శ్రీ సాయి నిత్యానందాయ నమః
35. ఓం శ్రీ సాయి పరమసుఖదాయ నమః
36. ఓం శ్రీ సాయి పరమేశ్వరాయ నమః
37. ఓం శ్రీ సాయి పరబ్రహ్మణే నమః
38. ఓం శ్రీ సాయి పరమాత్మనే నమః
39. ఓం శ్రీ సాయి ఙ్ఙానస్వరూపిణే నమః
40. ఓం శ్రీ సాయి జగతఃపిత్రే నమః
41. ఓం శ్రీ సాయి భక్తానాం మాతృ దాతృ పితామహాయ నమః
42. ఓం శ్రీ సాయి భక్తాభయ ప్రదాయ నమః
43. ఓం శ్రీ సాయి భక్త పరాధీనాయ నమః
44. ఓం శ్రీ సాయి భక్తానుగ్రహకారాయ నమః
45. ఓం శ్రీ సాయి శరణాగతవత్సలాయ నమః
46. ఓం శ్రీ సాయి భక్తిశక్తి ప్రదాయ నమః
47. ఓం శ్రీ సాయి ఙ్ఙానవైరాగ్యదాయ నమః
48. ఓం శ్రీ సాయి ప్రేమప్రదాయ నమః
49. ఓం శ్రీ సాయి సంశయహృదయ దౌర్బల్య పాపకర్మ వాసనా క్షయకరాయ నమః
50. ఓం శ్రీ సాయి హృదయగ్రంధి భేదకాయ నమః
51. ఓం శ్రీ సాయి కర్మధ్వంసినే నమః
52. ఓం శ్రీ సాయి శుధ్ధ సత్వస్ధితాయ నమః
53. ఓం శ్రీ సాయి గుణాతీత గుణాత్మనే నమః
54. ఓం శ్రీ సాయి అనంతకళ్యాణగుణాయ నమః
55. ఓం శ్రీ సాయి అమితపరాక్రమాయ నమః
56. ఓం శ్రీ సాయి జయినే నమః
57. ఓం శ్రీ సాయి దుర్దశాక్షోభ్యాయ నమః
58. ఓం శ్రీ సాయి అపరాజితాయ నమః
59. ఓం శ్రీ సాయి త్రిలోకేష్వవిఘాతగతయే నమః
60. ఓం శ్రీ సాయి అసక్యరహితాయ నమః
61. ఓం శ్రీ సాయి సర్వశక్తిమూర్తయే నమః
62. ఓం శ్రీ సాయి సురూపసుందరాయ నమః
63. ఓం శ్రీ సాయి సులోచనాయ నమః
64. ఓం శ్రీ సాయి బహురూప విశ్వమూర్తయే నమః
65. ఓం శ్రీ సాయి అరూపవ్యక్తాయ నమః
66. ఓం శ్రీ సాయి అచింత్యాయ నమః
67. ఓం శ్రీ సాయి సూక్ష్మాయ నమః
68. ఓం శ్రీ సాయి సర్వాంతర్యామినే నమః
69. ఓం శ్రీ సాయి మనోవాగతీతాయ నమః
70. ఓం శ్రీ సాయి ప్రేమమూర్తయే నమః
71. ఓం శ్రీ సాయి సులభదుర్లభాయ నమః
72. ఓం శ్రీ సాయి అసహాయసహాయాయ నమః
73. ఓం శ్రీ సాయి అనాధనాధ దీనబాంధవే నమః
74. ఓం శ్రీ సాయి సర్వభారభృతే నమః
75. ఓం శ్రీ సాయి అకర్మానేకకర్మ సుకర్మిణే నమః
76. ఓం శ్రీ సాయి పుణ్యశ్రవణకీర్తనాయ నమః
77. ఓం శ్రీ సాయి తీర్థాయ నమః
78. ఓం శ్రీ సాయి వాసుదేవాయ నమః
79. ఓం శ్రీ సాయి సతాంగతయే నమః
80. ఓం శ్రీ సాయి సత్పరాయణాయ నమః
81. ఓం శ్రీ సాయి లోకనాథాయనమః
82. ఓం శ్రీ సాయి పావనానఘాయ నమః
83. ఓం శ్రీ సాయి అమృతాంశవే నమః
84. ఓం శ్రీ సాయి భాస్కరప్రభాయ నమః
85. ఓం శ్రీ సాయి బ్రహ్మచర్యతపస్చర్యాది సువ్రతాయ నమః
86. ఓం శ్రీ సాయి సత్యధర్మపరాయణాయ నమః
87. ఓం శ్రీ సాయి సిథ్థేశ్వరాయ నమః
88. ఓం శ్రీ సాయి సిధ్ధసంకల్పాయ నమః
89. ఓం శ్రీ సాయి యోగేశ్వరాయ నమః
90. ఓం శ్రీ సాయి భగవతే నమః
91. ఓం శ్రీ సాయి భక్తవత్సలాయ నమః
92. ఓం శ్రీ సాయి సత్పురుషాయ నమః
93. ఓం శ్రీ సాయి పురుషోత్తమాయ నమః
94. ఓం శ్రీ సాయి సత్యతత్త్వబోధకాయ నమః
95. ఓం శ్రీ సాయి కామాది సర్వ అఙ్ఙాన ధ్వంసినే నమః
96. ఓం శ్రీ సాయి అభేదానందానుభవ ప్రదాయే నమః
97. ఓం శ్రీ సాయి సమ సర్వమత సమ్మతాయ నమః
98. ఓం శ్రీ సాయి శ్రీ దక్షిణామూర్తయే నమః
99. ఓం శ్రీ సాయి శ్రీ వేంకటేశరమణాయ నమః
100. ఓం శ్రీ సాయి అద్భుతాననందచర్యాయ నమః
101. ఓం శ్రీ సాయి ప్రపన్నార్తిహరాయ నమః
102 ఓం శ్రీ సాయి సంసారసర్వదుఃఖక్షయకరాయ నమః
103. ఓం శ్రీ సాయి సర్వవిత్సర్వతోముఖాయ నమః
104. ఓం శ్రీ సాయి సర్వాంతర్బహిస్థితాయ నమః
105. ఓం శ్రీ సాయి సర్వమంగళకరాయ నమః
106. ఓం శ్రీ సాయి సర్వాభీష్టప్రదాయ నమః
107. ఓం శ్రీ సాయి సమరస సన్మార్గస్థాపనాయ నమః
108. ఓం శ్రీ సాయి సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః

ఓం శ్రీ సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ మహారాజ్ కి జయ

శ్రీ కాళహస్తిలొ భక్త కన్నప్ప

అర్జునుడు పరమేశ్వరసాయుజ్యం పడయుటకు తిన్నడుగా కలియుగమున జన్మించెను.పోత్తపినాడు అని తెలుగు దేశంలో గల ప్రాంగణంనందు" ఉడుమూరు` అను బోయపల్లె కలదు.అందు నాధనాధుడు-తండే అను బోయ దంపతులకు శివను గ్రహంచే ఓకే మగ శిశువు కలిగెను.ఆ బాలునకు తిన్నాడు అని పేరు పెట్టిరి.అతడు విల్లు విద్యలో దిట్ట అయ్యెను.ఒకనాడతాను వేటాడి అలసిపోయి చెట్టు క్రింద నిద్రించుచుండ శివుడు సాక్షాత్కారించి ఇట్లు అనెను.ఇక్కడ కొండ దగ్గర మొగలేటి ఒడ్డున శివుడు ఉన్నాడు.పోయి అతనిని కలువుము అని చెప్పెను.వెంటనే మేల్కొని చూడగా ఒక అడవి పంది కనిపించెను.ఆ పందిని వేటాడుచు దాని వెంట పడగాఅది తిరిగి తిరిగి శివుడుఉన్నచోటికి వానినిదెచ్చెను.అప్పుడు తిన్నాడు ఆ చోటనే శివుని సానిధ్యంను నిలిచిపోయి తన్మయుడై శివుని పరిపరివిధముల తన నివాస గ్రహంకు రమ్మని ప్రాద్ధించెను.కాని తన వేడుకోలు ఫలింపకపోగా నాతడచ్చటనే శివుని యెద్ద నిలిచిపోయాను.ప్రతిదినం నిద్రనుండి మేల్ఖోని ఈశ్వరుని తుష్టి యొనర్ప దగ్గర అరణ్యమునకు వెళ్లి పందిని వేటాడి చంపి,కాల్చి మాంస ఖండముల రుచి చూచి,పక్వమైన వానిని యేరి ఆకు దొప్పల యందుఉంచుకొని ఫల,పుష్ప,బిల్వదళంబులను శిరంఫై మోపి చంకయందు వింటిని,వీపున నమ్ములపోదయు పుక్కిట సువర్ణముఖినది తీర్ధంను గొని తన యరాధ్య దైవంముకడ కరుదేన్చెను.నోటితో తెచ్చిన గంగతో శివనభిషేకించి,ఆకుదోప్పలతో తెచ్చిన మాంసశకలంబులను మహా నైవేద్యంగా శివుడు ప్రీతి చెందగా తిన్నాడునందించి చుండెను.

అసమయమున శివగోచరుడను సదాచార సంపన్నుడైవ నొక బ్రాహ్మణుడు కుడా వచ్చి స్వామిని ప్రతి దినం అర్చించి పోవుచుండెను.చాలాకాలం నుండి పూజించుచున్న ఆ బ్రాహ్మణునికి కొత్తగా చేయుచుండిన తిన్నడి పూజలు,ఎంగిలి అమంగళంగా కనపడెను.దానికాతడు విచారించి " స్వామి నీ ఆలయం ఇటివల కొన్ని దినములుగా నీ రీతిగా రోతగా మారుటకు కారణమేమి మరి మరి ప్రాద్ధించి " తెలుపకున్న ప్రాణములు విడుతానని శాపదంబు చేసెను. అప్పుడు స్వామి వాక్కుగా ఇట్లు వినబడెను.ఒక చెంచు ఈ విధంగా పూజ చేయ చున్నాడు.అతడు గొప్ప భక్తుడు,వాని భక్తికి ఎంత మహిమ గలదో నీవు కుడా చూతువుగాక !. అని అతనిని తన వెనుక దాగియుండి అంతయు గంచామనేను.

కొంతః సేపటికి వాడుక మేరకు తిన్నాడు యధాప్రకారంగా వచ్చి స్వామికి అభిషేకమాచారించి తాను తెచ్చిన మాంసమును తినమనేను.కాని స్వామి తినలేదు.ఇంతలో స్వామికి ఒక కన్ను వెంట నీరు కారటం ఆరంభించెను. క్రమముగా అది అధికమై ఉండటం తిన్నాడు గమనించి స్వామికి కంటి జబ్బు వచ్చిందని చాలా భాధపడెను.వైద్యం చేసి నయం చేయాలనీ చూచాడు. గుడ్డను చుట్టగా చుట్టి నోటి ఆవిరి పెట్టి కంటి కద్దినాడు.తంగోడాకు మెత్తినాడు.నిమ్మరసంతో నూరి వేసినాడు. కలువ పూలు తెచ్చి కంటికి రుద్దినాడు.అడవి అంతయు తిరిగి వెదకి వెదకి ఎన్నో మూలికలు తెచ్చి వేసినాడు.ప్రయోజనం లేకపోయాను.అంతటితో కంటి నుండి నెత్తురు కుడా కారడం ఆరంభించెను.చివరకు కంటికి కన్నే మందు అని అనుకోని బావంతో తనకంటినొక దానిని పెకలించి స్వామి కంటిఫై అంటి పెట్టెను.దానితో స్వామి కన్ను నెమ్మదించెను.ఈ కొత్త కన్ను తొలుతటి కంటికన్నా మిక్కిలి ప్రకాశంగా కనబడెను.కాని వేను వెంటనే రెండోవ కంటి నుండి నెత్తురు కారడం ఆరంభించెను.తిన్నడప్పుడు.ఒక నవ్వు నవ్వి `ఓ స్వామి , నీ దయచే కంటికి మందు ఉన్నదీ. ` అని కాలితో నెత్తురు కారుచున్న స్వామి వారి రెండోవ కంటికి గుర్తుకై అదిమిపెట్టిన తన రెండోవ కంటిని పెకలింపబోయాను.వెంటనే శివుడు తిన్నని భక్తి పారవశ్యంకు మెచ్చి సతీ సమేతుడై ప్రతక్ష్యమై తిన్ననికి,ఆ బ్రాహ్మణునికి శివ సాయుజ్జ్యం నొసగెను.ఆనాటి నుండి తిన్నాడు శివునకు కన్నిచ్చిన సార్ధకంగా కన్నప్ప అను పేరు వచ్చి లోకులకు భక్తిమార్గ ప్రదిపకుడను శ్రీ కాళహస్తి క్షేత్రంలో భక్త శిరోధార్యంమై వేలుగొండుచున్నాడు.దేవాలయంకు దక్షిణపు శ్రేణిలోలో నున్న పర్వతం ఫై కన్నప్ప గుడియున్నది.ఈ నాటికీ భక్తులు ఆ కొండనెక్కి భక్తుడైన కన్నప్పను దర్శించుకొని ధన్యులుఅగుచున్నారు.

పరివార దేవతలు
బృగు మహర్షి అర్ధ నారీశ్వర లింగమును ప్రతిష్టించేను.అగస్త్య ప్రతిస్టితమైన నీలకంఠెశ్వర లింగం,మణికంఠెశ్వరుడు.ఆత్రేయ ప్రతిష్టితుడు.వ్యాస ప్రతిస్టత లింగం ప్రాశస్తమైనది.మర్కేండేయ ప్రతిష్టత లింగం,ప్రతిభా మూర్తి మృతుంజయేశ్వర లింగం. మర్కేండేయని కాలుని బారినుండి రక్షించిన వరమూర్తి సహస్ర లింగేశ్వరుడు,ఇంద్రాది దేవతా ప్రతిస్టతమూర్తి ఇవిగాక సప్త ఋషి ప్రతిస్టతo. రామ పరుశురామ ప్రతిస్టతములైన లింగములు కుడా గలవు.కరువు కటాకంలో మృతుంజేయశ్వర స్వామికి సహస్ర ఘటాభిషేకం చేయిoచిన వర్షములు కురియును. కాలభైరవుడు ఇచ్చట క్షేత్రపాలకుడు ఇవిగాక ధర్మరాజు, యమధర్మరాజు,చిత్రగుప్తుల చేత ప్రతిస్టితంలైన లింగములు కలవు.వివిధ గణపతి మూర్తులు సుబ్రమణ్యస్వామి,సూర్య శని గ్రహ మూర్తులు గూడా కలవు. వీరందరూ శ్రీ కాళహస్తిశ్వర స్వామికి పరివార దేవతలై యున్నారు.

శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ వరదరాజస్వామి,శ్రీ వీర రాఘవ స్వామి వారలు కుడా ఈ దేవాలయంన గలరు.నిలువెత్తు కన్నప్ప విగ్రహం చూడ గంభీరంగా నుండును. కాశి విశ్వేశ్వరుడు ఇచ్చట వెలసి యున్నాడు. శ్రీ శంకర చార్యుల వారి స్పటిక లింగం ఉదాత్తమైనది. 63 నాయనర్లు లోహ విగ్రహములు కుడా కలవు.


మండపములు
శిల్ప చిత్రకళా ఖండములుగా మండపములు,స్తంభములు,వర్ణ చిత్రములు ఈ దేవాలయంన పెక్కుగలవు.నగరేశ్వర మండపం, గుర్రపు సాని మండపం, నూరు కాళ్ళ మండపం, (రాయల మండపం) పదు నాల్గుకాళ్ళ మండపం, కోట మండపం పెర్ఖోనదగినవి. నూరు కాళ్ళ మండపం ఎంతో శిల్పమయమైనది. పదహారు కాళ్ళ మండపంలోనే 1529 లో శ్రీ కృష్ణ దేవరాయల సోదరుడైన అచ్చుత రాయల పట్టాభిషేకం మహోత్సవంజరిగింది. కోట మండపం బహు ఉదాత్తమైనది.అమ్మవారి దేవాలయ ప్రాంగణంన అస్త్తోతర లింగ ముఖ ద్వారమున ఫై కప్పులోని చిత్రకళ వైభవం వర్ణించనలవికాదు. ఆ రంగులు శత శతాబ్దాలుగా ఈనాటి వానివాలే నిత్య నూతనంగా కనబడుచున్నవి.

నటరాజ రంగ స్టలము- బ్రహ్మ గుడి

పల్లవుల నాటి శిల్ప కళ ఖండములకు,చతురస్రాకార సభా మండప వేదికలకు,నిర్మాణ కౌశల్యంకు ప్రతికములైన చోటు నటరాజ రంగ స్టలము,ఇచ్చట పంచముఖేశ్వరస్వామి విగ్రహం సుందరం అపురూపమైనది.దేవాలయ మాద్యంతంను శిల్పకళమాయం,రాతి దులములు,సహస్రమునకు ఫైగా గల రాతి స్తంభములు అత్యద్భుత మానవ కళా సృష్టికి నిదర్సనములు. దర్సనియములు,కనకదుర్గ చలమునన్నుది. ఈమె వార శృంగార మూర్తి,దసరా శరన్నవ రాత్రుల్లో ఉత్సవములు జరుగును.విద్య క్షేత్రంన శ్రీ సుబ్రమణ్యస్వామి దేవాలయం ఉన్నదీ.ఇచ్చటనే కుమారస్వామి నారదునికి బ్రహ్మోపదేసం చేసెను.ఆడి కృతిక ఉత్సవం ( ఆషాడ మాసం) ప్రఖ్యాతిగా జరుగును.

దేవాలయ పరిపాలక- వసతులు

దేవాలయంకు పరిపాలన వ్యవస్టగా నొక ధర్మ కర్త్తల మందలి బోర్డు కలదు. దేవాదాయ శాఖలోని ఒక ఉప కమిషనర్ హోదాలో కార్యనిర్వహణఉద్యోగిగా నియమితులై పరిపాలన జరుపబడుతున్నది. శ్రీ కాళహస్తిశ్వర స్వామి వారి వసతి గృహం, బాలజ్ఞానంబ సత్రం,శంకర ముని వసతి గృహం,త్రినేత్ర నట రాజ వసతి గృహం,శివ సదన్,భరద్వాజ సదన్లు దేవస్తానం అద్వర్యంలో యాత్రికుల సౌకర్యార్ధం గలవు.

శ్రీ కాళహస్తి రాహు-కేతు క్షేత్రం

పుత్ర శోకంకు గురియైన వశిష్ట మహర్షికి అయన తపఃఫలితంగా పరమేశ్వరుడు పంచముఖ నాగలింగేశ్వరుడుగా దర్సనమిచ్చి అయన ఆర్తిఫై బాపేను. ఈ నాగ లింగంను బ్రహ్మదేవుడు కుడా పూజించి సృస్ట్రీంఛి సృష్టి కార్యమును విగ్నంలేక చేయసాగెను. నాగరూప వేశేషంచే నీ క్షేత్రంకు `రాహు కేతు క్షేత్రం అని` పేరు వచ్చినది.సర్పదోషములు,రాహు కేతు గ్రహముల దోషం ఉన్నవారు ఈ స్వామిని పూజించి దోష నివారణలు అగుట కానవచ్చును. స్వామి కవచం నవగ్రహ కవచంకే అలంకారం,ఆరాధనలు చేయుదురు.

శ్రీ దక్షిణమూర్తి విశిష్టత
ఆలయ ప్రవేశ ద్వారం దక్షిణంవైపున ఉన్నదీ.అందు ఉత్తర ముఖముగా ప్రవేసింపగానే చిన్మ్రాద్రతో నుండు దక్షిణమూర్తిని చూడవచ్చును.చందోగ్యంలో నారద సనత్వుకుమార సంవాధోపదేశ ఘట్టమును ఈ మూర్తి స్వరూపం విశదికరించినట్ట్లుగా నగును. దీని చేత నిధి జ్ఞానప్రధాన క్షేత్రంమైనది.ఇట్టి దక్షిణమూర్తి విగ్రహం మరేచ్చట లేడు.. ఇది వైదికాయతనం,వైదిక సంప్రదయమిచ్చుట గలదని తెలియనగున.

భక్తుల కావాసం
బ్రహ్మ విష్ణు ఇంద్రాది దేవతలు,భరద్వాజ ,వసిస్ట్ట,అగస్యది మహర్షులు జగద్గురువు శంకరాచార్యులు వంటి మత పెద్దలు,రామకృష్ణది అవతార మూర్తులు,శైవనాయన్మారులు నలుగురు మరియు ధూర్జటి,సత్కిరులవంటి మహాకవులు,యాదవ ప్రభువు, మధుర నుండి వచ్చిన వేశ్య కన్యలు,కన్నప్ప మున్నగు భక్తవ రెన్యులచే కొలువబడి వారల తరింపచేసిన ప్రతిబా మహిమాన్వితుడు శ్రీ కాళహస్తిశ్వర స్వామి.


తీర్ధ రాజములు
శ్రీ వేదవ్యాసముని ప్రణితమైన స్టలపురాణానుసారం ఇచ్చట 36 తీర్ధములు గలవు.అందు ముఖ్యంగా సహస్రలింగాల తీర్ధం,హరహర తీర్ధం,భరద్వాజ తీర్ధం (లో బావి) మర్కేందేయ తీర్ధం,మూక తీర్ధం, సూర్య చంద్ర పుష్కరిణిలు ముఖ్యమైనవి.ఇవి దక్షిణ కైలాస పర్వతంలోనున్నవి.గాక ప్రాశస్తములైనవి.

ఈ తీర్ధంలో స్నానములు పాపములను పోగొట్టుటతో పాటు జ్ఞానోదయం గూడా కిలిగించునవి.పెద్దలు చెప్పుదురు.ఈ తీర్ధముల స్నానం చే దేహ శుద్దియు,క్షేత్రవాసంచే అంతఃకరణ శుద్ధియు నేర్పాడుచున్నదని శాస్త్రవాదం.

రాహు -కేతు కాల సర్ప దోష పూజ

రాహు-కేతు క్షేత్రంగా ప్రసిద్ది చెందిన శ్రీ కాళహస్తిశ్వరఆలయంలో అత్యంత మహిమాన్విత పూజ` రాహు-కేతు సర్ప దోష నివారణ పూజ `` రాహు కేతు దోషం వున్నవారు ,గ్రహదోషములు, సర్పదోషములు కలవారు,వివాహం కానివారి, సంతానం లేనివారు,దీర్గకాలిక సమస్యలతో సతమతమౌతున్నవారు ఈ ఆలయంలో రాహుకేతు సర్ప దోష నివారణ పూజలు జరుపుకొంటె దోష నివారణ పొంది,తప్పక సత్ఫలితాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం,నిదర్శనం కుడా. ఈ దివ్య క్షేత్రంలో ఎంతో ప్రాధాన్యత సంతరించుకొన్న ఈ పూజలు జరుపుకోనుటకు దేశ విదేశాల నుండి వేలాది భక్తులు రాహు కేతు సర్ప దోష నివారణ పూజ జరుపుకొని సత్ఫలితాలు పొంది మళ్ళి వచ్చిమ్రొక్కులు తిర్చుకొంటున్నారు.

శ్రీ అధిదేవతా ప్రత్యదిదేవతా సహిత రాహు-కేతు సర్ప దోషములు ఉన్నవారు రాహు-కేతు స్వరుపులైఇచట వెలిసిన శ్రీ కాళహస్తిశ్వరులను ఆరాధించిన దోష నివృత్తి అగును.

శ్రీ కాళహస్తిని దక్షిణ కైలాసము- దక్షిణ కాశి అంటారు.

ఈశ్వరుని అజ్ఞా చేత బ్రహ్మ దేవుడు కైలాసమున గల శిఖరములో ముఖ్యమైన శివానందైక నిలయమును,శిఖరమును శ్రీ కాళహస్తి క్షేత్రంలో స్తాపించి,శివుని పూజించి ధన్యుడాయేను.దీని వలన శ్రీ కాళహస్తిలో వెలసిన పర్వతమునకు దక్షిణ కైలాసము అని పేరు వచ్చెను.

శ్రీకాళహస్తిశ్వరాలయం అనుకోని సువర్ణముఖినది ఉత్తర వాహినిగా,ఆలయమునకు అనుకోని ప్రవహించుచున్నది. పక్షిమ భాగమున,తిరుమంజన గోపురమున్ కేదురగానున్న నదిస్నాన ఘట్టమునకు,మణికర్ణిక ఘట్టము అని పేరు. కాశి వాలే ఇచ్చట ఉత్తరవాహిని నదియు,మణికర్ణికా స్నానఘట్టమును నుండుటచే దీనికి దక్షిణకాశియని పేరు గలిగినది.ఇక్కడ కుడా శివుడు జీవులకు తారక మంత్రోపదేశంగా గావించుచున్నాడట.

ఆలయ నిర్మాణ పద్ధతి
భారత దేశమందలి ఆలయముల వాలేగాక శ్రీ కాళహస్తిశ్వరుని ఆలయ నిర్మాణంలోనొకవిసిస్థతగలదు.ఇచ్చటవినాయకుడు,శ్రీకాళహస్తిశ్వరుడు,దక్షిణామూర్తి,అమ్మవార్లు, ఒక్కకరు దిక్కునకు వెలసియున్నారు.దీనిని బట్టి జీవులు తరింప బడుటకు మూల మగు ధర్మార్ధకామ మోక్షములను చతుర్విద పురుషార్ధక సూచనమే ఈ దేవాలయముఅని మనస్సుకు తోచుచున్నాదని పెద్దల నమ్మిక.మొదటి దైవ ధర్మము,ఆత్మధర్మమూగ ఉత్తరాభి ముఖ్యమైన శ్రీ పాతాళ గణపతి ఉనికిలో తెలియనగును.రెండొవది అర్ధము.ఆత్మజ్ఞానోపదేశానార్ధముగా ఉమా దేవి స్వరూపమైన శ్రీ జ్ఞాన ప్రసూనాంభిక దేవి తుర్ఫుముఖముగా నిలిచి ముముక్షవులకు బోధించుచుండెను.ముడోవడైన కామము ,దక్షిణ ముఖముగా నుండి(మహాద్వారముకు ఎదురుగా) సత్సశిసుందర దక్షిణామూర్తిత్వం,గురుస్వరూపంలో జీవులకు ఇహ పర కార్యంబులు సిద్దించుట తధ్యమని తెలియనగును.

తుదిగా మోక్షము మోక్షదికారియైన పరమశివుని స్వరూపమగు శ్రీ కాళహస్తిశ్వరుడు పశ్చిమాభిముకముగా నిలిచి అస్తమయ సూర్యుని మూలమున జీవునకు మరణము తధ్యం అని తెలుప బడింది.అప్పటికప్పుడే శివ సాయుజ్య[ప్రాప్తికి ప్రయత్నం జేయవలయును సుక్ష్మ సందేశము అందించు చున్నాడు. ఇట్లు మనవోజ్జివన సాధనములు అయిన ధర్మార్ధకామమోక్షములను నొక ప్రతికయే శ్రీ కాళహస్తిశ్వరాలయం.

స్వర్ణముఖినది
అగస్త్య మహాముని తన శిష్య గణంబులతో దక్షిణ దిగ్భాగమునకు వచ్చి తపము చేయుచుండెను.అప్పుడు వారికీ నీరు లబింపకుండుటచే బ్రహ్మను గూర్చి ఘోర తపమాచరించెను.బ్రహ్మ ప్రతక్ష్యమైన తపమునకు మెచ్చి వర ప్రసాదముగా ముని కోరిన విధంగా ఆకాశగంగను ప్రసాదించెను.గంగాదేవి సువర్ణముఖి స్రవంతి రూపమున అగస్త్య పర్వతంలో అవతరించి ,శ్రీ కాళహస్తి మీదుగా ఉత్తర వాహినియై తుర్ఫు సముద్రమున కలిగియున్నది.ఈ నాటి నదిలో అనేక తీర్ధరాజములు విలసితములై దక్షిణ కైలాసం నానుకొని ప్రవహించుచున్నది.

వేయి లింగాల కోన
ఇది ఒక ప్రకృతి రమణీయమైన స్టల రాజము.ఈ కొనలో యక్చేశ్వరలింగం కలదు. ఇందు యక్ష రూపంన పరమేశ్వరుడు దేవతలకు దర్శనమెచ్చును. ఉమాదేవి అను జ్ఞాన ప్రసూనాంభదేవి దేవేంద్రులకు జ్ఞానోపదేశం చేసినదిఇచ్చట.అనేక మహర్షులు ,శిష్యులకు తత్వోచోపదేసం చేసిన చోటు ఇచ్చటనే.సహస్రలింగ తిర్డరాజము కలదు.

భరద్వాజ తీర్ధం
దేనిని `లోబావి అని అందురు.ఇందు భరద్వాజముని ఒకప్పుడు తప్పస్సు చెసినట.ఇచ్చట చతురస్రాకారంగా నొక పద్మ సరోవరం కలదు. భైరవునికోన, మర్కేండేయ తీర్ధములు ప్రకృతి సంపదకు పుట్టినిల్లు.


పాతాళగంగ-మూక తీర్ధం
దేవాలయంలోని మూక తీర్ధం నత్తి ముగాలను పోగొట్టి వాక్చాతుర్యంను కలిగించును.

శ్రీ కాళహస్తిలొ శ్రీ జ్ఞాన ప్రసునాoభికాదేవి

పార్వతిదేవికి పరమశివుడు పంచాక్షరీ మంత్రములను భోదించి నిశ్చల చిత్తంతో జపింపవలయుననెను. జపము సేయునప్పుడు ఆమెకు మందబుద్ది ఆవరించి నియమం విస్మరించెను.అపుడు శివుడు కోపించి ఆమెను భూమిఫై మానస్త్రీగా అవుతావని శపించెను.అపుడామే శాపవిమోచనకై శివుని ప్రాద్దింపగా భూలోకమున కైలాసగిరి ప్రాంతమున ఈశ్వరుని లింగమును పుజించమని అనతిచ్చెను.పార్వతి దేవి నారదుని సాయంతో భూమికివచ్చి ఘోర తపంబాచరించెను.శివుడు ప్రతక్ష్యమయ్యేను.ఆమెను తన అర్ధాంగమున అర్ధనారిశ్వరత్వమున నిలుపుకొనెను.అప్పటి నుండి ఆమె జ్ఞానప్రసూనాంభిక అను పేరుతో శ్రీ కాళహస్తిశ్వరస్వామి వారి సన్నిధ్యమున వెలసినది.ప్రణవ పంచాక్షరి జపసిద్ధిని పొంది జ్ఞానప్రదిప్తిని భక్త జన లోకమునకు ప్రసాదించుటచే ఆమెకు జ్ఞాన ప్రసూనంబాయను పేరు సార్దక నామమై విరాజిల్లుతుంది.

వాయులింగం

పంచభూత లింగములో శ్రీకాళహస్తిశ్వర లింగం వాయులింగంగా ప్రఖ్యాతి గాంచినది.కంచిలో ఎకంబరేశ్వరుడు,ప్రుద్విలింగంగా,తిరుచ్చిరాప్పల్ల మధ్య తిరువానైక్కావాల్ లేక శ్రీరంగంకు దగ్గరలోని జంబుకేశ్వరమున జల లింగం,అరుణచలంలో తేజో లింగం,శ్రీకాళహస్తి లో వాయు లింగంగా,చిదంబరంలో ఆకాశలింగంగా వెలసినవి ప్రతీతి. కృతయుగంలో ఇక్కడ స్వామి వాయురూపంలోనే యుండి మహాయోగులకు స్పర్సమాత్రమునే గ్రహింపదగి యుండిడివాడట.త్రేతాయుగంలో స్వర్ణరూపం,ద్వారప యుగంలో రజత రుపంను,ప్రస్తుత కలియుగంలో శ్వేత శిలా రూపమును పొంది తన సహజ వాయుతత్వ నిదర్సనముగా గర్బలయంలో స్వామికి కుడి ప్రక్కనున్న దీపముల రెండిటిని ఎల్లప్పుడూ చలింప చేయుచుండుట గమనింపదగినవి.


గోపురములు

ఈ అలయంకు నాలుగు దిక్కులలోను గోపురములు కలవు.ఇవిగాక రాజగోప్రురము సుమారు 120 అడుగుల ఎత్తుగలది ఒకటి కలదు.దీనిని శ్రీ కృష్ణదేవరాయలు 1516 లో కట్టించినట్లు శాసన ప్రమాణం కలదు.స్వామివారి గ్రామోత్సవంకు పోవునప్పుడు ఈ గోపురం నుండే వచ్చును.ఆలయం జేరుకోనుటకు ముందు తేరు విధి కెదురుగా నుండు భిక్షాల గోపురం నుండియే వచ్చును.జంగమ రూపుడైన శివుని సేవించి తరించిన దేవదాసి "బిక్షాలు దీనిని కట్టించినట్లు చెప్పబడింది.ఈ గోపుర నిర్మాణం యాదవ నరసింహరాయల కాలంలో జరిగినట్లు చెప్పబడుతుంది.ఈ గోపర నిర్మాణం యాదవ నరసింహ రాయల కాలంలో జరిగి నట్లు చెప్పుదురు.

తుర్ఫువైపున ఆలయప్రవేశద్వారముగా బాలజ్ఞానంబ గోపురం కలదు. ఉత్తరం వైపునున్న గోపురంను సూర్య పుష్కరిణి,కుడివైపున చంద్ర పుష్కరిణి యున్నవి.స్వామి వారి అభిషేకమునకు,వంటకు నీళ్ళు ఈ సూర్య పుష్కరిణి,కుడివైపున చంద్ర పుష్కరిణి యున్నవి.స్వామి వారి అభిషేకంనకు,వంటకు నీళ్ళు ఈ సూర్య పుష్కరిణి నుండియే తీసుకోని పోబడును.ఈ గోపురము నుండి సువర్ణ ముఖినదికి పోవచ్చును.దక్షిణ వైపునున్న గోపురం ద్వార కన్నప గుడికి,బ్రహ్మగుడికి పోవచ్చును.

ఈ దేవాలయ పూజా విధానము-ఉత్సవములు

ఈ దేవాలయమును వైదిక- అగము విధానములో పంచకాల పూజలు జరుగును.ఉదయం నుండి మధ్యాహం వరకు మూడు సార్లు అభిషేకములు సాయంత్రం సమయ ప్రదోషకాలమును ఒక అభిషేకము స్వామి అమ్మవార్లకు జరుగును. ఇచ్చటి గురుకులు(పూజారులు) బరద్వాజముని వంశియులైన భరద్వాజ గోత్రికులు,స్టానం వారు,ఇచ్చట శివరాత్రికి పదిరోజులు బ్రహ్మోత్సవము ముఖ్యమైనవి.మరియు దసరా రోజులలో అమ్మవారి ఉత్సవం వేశేషం గడించింది.ఇవిగాక ఏటేట రెండుసార్లు గిరి ప్రదక్షణము,జనవరి నేలలో కనుమ పండుగ రోజున మరియు శివరాత్రి అయిన నాలుగోవ రోజున జరుగును.

శ్రీ కాళహస్తి క్షేత్ర మహిమ

చారిత్మాక ప్రాశస్త్యం
క్రీస్తు పూర్వం ఒకటి రెండు శతాబ్దంలో వ్రాయబడిన తమిళ గ్రంధములో శ్రీ కాళహస్తిని దక్షిణ కైలాసముగా పేర్కొనబడినది.రెండు మూడోవ శతాబ్దంలో అరవైముగ్గురు శైవనాయన్మారులను శివ భక్తులలో ముఖ్యులైన అప్పర్ సుందరర్,సంభంధర్,మణిక్యవాచగర్ అనువారలు ఈ క్షేత్రమును సందర్శించి కీర్తించారు.మూడోవ శతాబ్దంలో సట్కిరర్ అను ప్రసిద్ధ తమిళ కవీశ్వరుడు రత్నముల వంటి నూరు తమిళ అందాదిలో శ్రీ కాళహస్తిశ్వరుని సోత్రరుపంగా కీర్తించాడు.జగద్గురు శ్రీ శ్రీ శ్రీ ఆదిశంకరులు వారి ఈ క్షేత్రమును సందర్శించి అమ్మవారి ఎదుట శ్రీ చక్ర ప్రతిస్థాపన గావించియున్నారు.వారె స్పటికలింగము నొకటి నెలకోల్పినారు.పల్లవ,చోళ ,విజయనగర రాజుల కాలపు శిల్ప కళ వైపుణ్యం ఈ క్షేత్రమును వెలసినవి.క్రి.శ. 1516 లో శ్రీ కృష్ణదేవరాయలు పెద్ద గాలిగోపురమును , నూరు కాళ్ళ మండపమును (రాయల మండపము) నిర్మించినారు

శ్రీకాళహస్తిశ్వరస్వామి మహత్యం

శ్రీకాళహస్తిశ్వరస్వామి స్వయంభువు,శ్రీ అనగా సాలె పురుగు,కళా అనగా పాము,హస్తి అనగా ఏనుగు,ఈ మూడు జంతువులు శివభక్తి వలన సాయుజ్యం పొంది శివునిలో గలసిపోయినవి.అందువలన ఇచ్చట స్వామి వారికీ శ్రీ కాళహస్తిశ్వరుడు అని ఈ పురముకు శ్రీ కాళహస్తి అనియు పేరు వచ్చెను

సాలె పురుగు- శివ సాయుజ్యం
కృతయుగంలో చెలది పురుగు తన శరీరం నుంచి వచ్చు సన్నని దారంతో కొండఫైనున్న శివునికి గుళ్ళ గోపురాలు ప్రాకారములు కట్టి శివుని పూజించుచుండెను.ఒకనాడు శివుడు పరిక్షింపదలచి అక్కడ మండుచున్న దేపములో తగిలి సాలీడు రచించిన గుడి గోపురములను తగులబడిపొవుచున్నట్లు చేసిను. ఇది చుసిన సాలీడు దీపమును మ్రింగుటకు పోగా శివుడు ప్రతక్ష్యమై దాని భక్తికి మెచ్చి వరము కోరుకోమనెను.అపుడు సాలీడును మరల తనకు జన్మ లేకుండా చేయమని కోరుకొనెను.అందుకు శివుడు సమ్మతించి సాలిడుని తనలో ఐఖ్యమైనపోవునట్లు చేసిను.ఈ విధముగా సాలీడు శివసాయుజ్జ్యము పొంది తరించింది

నాగు పాము-ఏనుగు-శివారాధన చేసి తరించుట
ఏనుగు పాముల కథ త్రేతాయుగమున జరిగినది.ఒక పాము పాతాళము నుండి పెద్ద పెద్ద మణులను తెచ్చి ప్రతి దినము శివలింగమునకు పూజ చేసి పోవుచుండెను.త్రేతాయుగం ముగిసి,ద్వాపరయుగం వచ్చినది.అప్పుడు ఏనుగు శివలింగమునకు పూజచేసి పోవుచుండెను.త్రేతాయుగం ముగిసి ద్వాపరయుగం వచ్చినది.అప్పుడు ఏనుగు శివలింగమును సేవింపజొచ్చెను.అది స్వర్ణముఖి నదిలో స్నానమాచరించి తొండముతో నీరు,పుష్పములు,బిల్వదళములు తెచ్చి,పాము సమర్పించిన మణులను త్రోసివేసి,తాను తెచ్చిన నీటితో అభిషేకం చేసి పుష్పములతో అలంకరించి పూజించి వెడలి పోవుచుండెను.మరునాడు ఉదయం పాము వచ్చి చూచి తాను పెట్టి వెళ్ళిన మణులను గానక వానికి బదులు బిల్వములు,పుష్పములు పెట్టియుండుట గాంచెను.అప్పడు పాము మనస్సున చాలా బాధపడి వాడుక ప్రకారం ఏనుగు ఉంచి వెళ్ళిన పువ్వులను త్రోసివేసి,తాను ఇట్లు కొంత కాలము వరకు పాము ఉంచిన మణులను ఏనుగు ,ఏనుగు ఉంచిన పుష్పదులను పాము శుబ్రపరచి తమ తమ ఇష్టనుసరముగా పూజచేసి ఈశ్వరుని సేవించుచు వచ్చినవి..ఒక రోజు పాము విసుగెత్తి తన మణుల త్రోయబడి ఉండుటకు కోపం చెంది.ఈ విషయమునకు కారణము తెలుసుకొన గోరి ప్రక్కనే యున్నా పొదలో దాగి పొంచి యుండెను.అది గమనించిన పాము కోపముతో తన శత్రువుఅయిన ఏనుగు తొండములో దూరి కుంభస్టలమున నిలిచి డానికి ఉపిరి ఆడకుండా చేసిను.ఈ భాధకు ఏనుగు తాళ్ళజాలక ఈశ్వర ధ్యానంతోతొండముతో శివలింగము తాకి శిరస్సును గట్టిగా రాతికిమోది తుదకు మరణించెను.ఆ శిలాఘతమునకు ఏనుగు కుంభస్టలమున నుండిన పాము గూడా చచ్చి బయటబడినది.ఇట్లు ఇద్దరు తమ తమ నిజ స్వరూపంతో రుద్ర గణములుగా మరి స్వామి ఐఖ్యమొందిరి.

ఈ స్మృతి చిహ్నంగా కాళము పంచ ముఖ ఫణాకారముగా శిరోపరిభాగమునకు ఏనుగు సూచకముగా రెండు దంతములను,సాలె పురుగు అడుగు భాగంలోనూ,తన లింగాకృతిలో నైక్యమొనరించుకొని శివుడు శ్రీ కాళహస్తిశ్వరుడుగా ఇచ్చట దర్సనం ఇచ్చుచున్నాడు.ఆనాటి నుండి ఈ పుణ్యక్షేత్రంకు `శ్రీ -కళా-హస్తి అని పేరు వచ్చింది

Thursday, January 1, 2015

శివాలయం దర్శిస్తే అందరు దేవుళ్ళని దర్శించినట్టే

సాధారణ దేవాలయాల్లో మనం దర్శనం చేసుకునే విధానం, శివాలయంలో విధానం వేరు వేరుగా ఉంటుంది. అందికే, శివాలయం దర్శిస్తే అందరు దేవుళ్ళని దర్శించినట్టే అని చెప్పబడింది. శివాలయంలో ఉండే శివలింగానికి మొత్తం 5 ముఖాలు ఉంటాయి. అందులో నాలుగు ముఖాలు నాలుగు దిక్కులను చూస్తుంటే, ఐదవ ముఖం ఊర్ధ్వముఖమై (పైకి/ఆకాశంవైపు చూస్తూ) ఉంటుంది. 5 ముఖాల్ని 5 పేర్లు నిర్ధేశించబడ్డాయి. అందుకే శివాలయంలో ఏ దిక్కున కూర్చుని అయినా పూజ చేయవచ్చు అంటారు. శివాలయాలు అన్నింటిలో అత్యంత మహిమ కలిగినది. కోరిన కోర్కెలు వెంటనే తీర్చేది.

పశ్చిమాభిముఖమైన శివాలయం అంటే మీరు గుడిలోకి వెళ్ళగానే శివలింగం పశ్చిమం వైపు చూస్తూ ఉంటుంది. అలా శివలింగానికి ఎదురుగా ఉన్న ద్వారం పశ్చిమంవైపు ఉన్నా లేదా శివలింగం పశ్చిమం వైపు చూస్తున్నా దానిని సద్యోజాత శివలింగం అని అంటారు. అప్పుడు మనం తప్పకుండా అటువంటి శివలింగాన్ని చూసినప్పుడు, ఓం సద్యోజాత ముఖాయ నమః అని స్మరించుకోవాలి. శ్రీకాళహస్తీశ్వర క్షేత్రంలో ఉన్న శివలింగం సద్యోజాత శివలింగం. శివలింగం తూర్పు వైపుకు చూస్తూ ఉంటే, అటుంటి శివలింగాన్ని తత్పురుష ముఖం అని అంటారు. తత్పురుష ముఖం అనేది మనల్ని తిరోదానాన్ని చేస్తూ ఉంటుంది. అంటే చీకటిలో ఉంచటం. అది మనల్ని మాయ చేత కప్పి బడేస్తూ చీకటిలో ఉంచుతూ ఉంటుంది. ఆ మాయ కమ్మి ఉండడం చేతనే మనం అన్ని రకాల పాపాలు చేస్తూ ఉంటాము. ఆ మాయని కప్పి ఉంచే ముఖమే ఆ సద్యోజాత ముఖం. సద్యోజాత ముఖం పూజించ తగినదే. ఏ మాత్రం అనుమానం లేదు. మనల్ని రక్షించినా, శిక్షించినా అన్నీ ఆ పరమేశ్వరుడేగా.

తూర్పుని చూస్తూ ఉండే శివలింగం వాయువు మీద అధిష్ఠానం కలిగి ఉంటాడు. మనకు ప్రతీ శివాలయాల్లోనూ ఈ 5 ముఖాలు ఉంటాయి. శివాగమనంలో చెప్పినట్లుగా మనం తప్పకుండా శివాలయంలో ఏ దిక్కువైపు వెళితే ఆ శివలింగం పేరుని స్మరించాలి. ముఖాలు మనకు 5 ఫలితాలని కలుగజేస్తాయి. ఆ 5 ముఖాలలో నుండే సృష్టి, స్థితి, లయ, తిరోదానము, అనుగ్రహము యివ్వబడతాయి. అన్ని ముఖాలు పూజనీయమైనవే. అన్ని ముఖాల్ని మనం పూజించి తీరాల్సిందే. శివలింగం దక్షిణంవైపు చూస్తూ ఉంటే అటువంటి ముఖం దక్షిణామూర్తి స్వరూపం. మనకు శివాలయంలో దక్షిణంని చూస్తూ తప్పకుండా దక్షిణామూర్తి ఉండి తీరాలి. అసలు దక్షిణామూర్తి విగ్రహం లేకుండా శివాలయాలు కట్టకూడదు.

శివలింగం దక్షిణానికి చూసే ముఖాన్ని దక్షిణామూర్తి స్వరూపంగా చూడమని చెప్తారు. ఆ ముఖాన్నే అఘోర ముఖం అంటారు. ఈ అఘోర ముఖం అగ్నిహోత్రానికి అంతటికీ అధిష్ఠానం అయి ఉంటుంది. ఈ సమస్త ప్రపంచాన్ని లయం చేసే స్వరూపమే ఈ అఘోర ముఖం. ఈ అఘోర ముఖమే సమస్త ప్రపంచాన్ని లయం చేసి, మళ్ళీ మనకు జన్మను ఇస్తూ ఉంటారు. మనకు మృత్యువుపట్ల భయం పోగొట్టేది, మనకి జ్ఞానం ఇచ్చేది ఇదే. మీరు జాగ్రత్తగా గమనిస్తే చిన్న పిల్లలకు చదువు దగ్గరనుండి, సంపద దగ్గరనుండి, పెద్దలకు మోక్షము వరకు దక్షిణామూర్తి ఇవ్వలేని సంపద, విద్యలేనేలేదు. చదువుకు, సంపదకు, మోక్షానికి అధిష్ఠానం అయి ఉంటాడు. ప్రతిరోజూ ఒక్క 2 నిమిషాలు దక్షిణామూర్తిని ధ్యానం చేస్తే మోక్షము కరతళామలకము. వారి అంత్యమునందు సాక్షాత్తు ఈశ్వరుడే గుర్తుపెట్టుకుని మోక్షాన్ని ప్రసాదిస్తాడు. ధ్యానం చేయటానికి అత్యంత మంగళకరమైన స్వరూపం, అందమైన స్వరూపం, శాంతమైన స్వరూపం దక్షిణామూర్తి స్వరూపం.

ఉత్తరం వైపు చూసే ముఖాన్ని "వామదేవ'' ముఖం అని అంటారు. ఇప్పటిదాకా 4 దిక్కుల్ని చూస్తున్న, 4 దిక్కులా గురించి తెలుసుకోగలిగాం. ఇక చివరి ముఖం శివలింగంపైన (అంటే ఆకాశంవైపు చూస్తూ ఉండే ముఖం)ఉండే ముఖం. ఆ ముఖాన్ని "ఈశాన ముఖం'' అంటారు. మనం లిగంపైన చూసి, ఓం ఈశాన ముఖాయ నమః అని స్మరించుకోవాలి. ఈశాన ముఖ దర్శనం మనం మిగిలిన నాలుగు ముఖాల్ని దర్శించిన తరువాతనే దర్శించాలి. అప్పుడే విశిష్ట ఫలితం అని చెప్పబడింది. మనకు కాశీలో ఉండే ముఖం అఘోర ముఖం. కాశీలో శివలింగం ఉత్తరం వైపు కూర్చుని, దక్షిణంవైపు చూస్తూ ఉంటుంది. ఉత్తరం వైపు చూసి "వాసుదేవ ముఖం'' నీటి మీద అధిష్ఠానం అయి ఉంటుంది. ఈ వాసుదేవ ముఖమే మనకు సమస్త మంగళము ఇచ్చే ముఖం.

వాసుదేవ ముఖం అంటే ఏమిటి అనేది మనకు శివపురాణంలో చెప్పబడింది. యదార్తమునకు అదే విష్ణు స్వరూపం. అందుకే విష్ణువు, శివుడు ఒకరే ... రెండు లేనే లేవు .... శివపురాణంలో రాస్తే ఎలా నమ్మాలి అని ఎవరికైనా సంశయం ఉంటే ఒకటి గమనించండి. శివపురాణంని రాసినది వేదవ్యాసుడు. వ్యాసుడే విష్ణువు ... విష్ణువే వ్యాసుడు. వ్యాసాయ విష్ణు రూపాయ, వ్యాస రూపాయ విష్ణవే, నమో వైబ్రహ్మ విధయే వాశిష్టాయ నమో నమః ఉన్న పరమాత్మ ఒక్కడే ... రెండు కాదు. చాలామంది వేరుగా చూస్తూ పొరబడుతున్నారు. కృష్ణ అని పిలిచినా నేనే పలుకుతాను. మూర్తి అని పిలిచినా నేనే పలుకుతాను. ఈ వాసుదేవ ముఖాన్ని ఓం వాసుదేవాయ నమః అని అంటే మనకు అనారోగ్యం కలగకుండా చూస్తాడు.

అంతేకాక ఈ వాసుదేవ ముఖాన్ని ఓం వాసుదేవాయ నాహం అని అంటే మనకు మూడు ఫలితాలని కూడా ఇస్తుంది. అవి ఒకటి మీ దగ్గర ఏదైతే ఉందొ అది మీ చేయి జారిపోకుండా మీతోనే ఉంచుతాడు. ఉదాహరణకు మీ దగ్గర ఒక కోటి రూపాయలు ఉన్నాయి లేదా ఒక మంచి ఉద్యోగంలో ఉన్నారు, ఎటువంటి కారణము చేతనూ మీరు అవి కోల్పోకుండా కాపాడుతూ ఉంటాడు. రెండు ... మనకు ఉత్తరోత్తరాభివృద్ధిని ఆయనే ఇస్తారు. ఉదాహరణకు ... ఉన్న కోటిని ధర్మబద్ధంగా రెండు కోట్లు చేస్తారు. (ఇది ఉదాహరణ మాత్రమే మీకు ఈజీగా అర్థమవ్వాలని) మూడు ... మనకు ఉన్నదానిని అనుభవించే ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. ఉదాహరణకు ... ఇప్పుడు తీపి పదార్థాలను కొనగలిగే శక్తి ఉండి, తినలేని స్థితిలో (షుగర్ ఉందనుకోండి) ఉంటే, అప్పుడు ఉన్న దాన్ని అనుభవించటం అని అనరు కదా. అటువంటి స్థితి కలుగకుండా కాపాడతాడు.

తురువాత ఈశాన ముఖము. శివాలయంలో లింగ దర్శనం అయ్యాక ఒకసారి పైకి చూసి ఓం ఈశాన ముఖాయ నమః అని స్మరించుకోవాలి. ఆ ఈశాన ముఖమే మనకు మోక్షాన్ని ప్రసాదించేది. ఈ ఈశాన ముఖం ఆకాశంకి అధిష్ఠానం అయి ఉంటుంది. శివాలయంలో మనకు బలిపీఠం అని ఉంటుంది. అక్కడికి ప్రదక్షిణంగా వెళ్ళినప్పుడు మనలో ఉండే అరిషట్ వర్గాలని మనం అక్కడ బలి ఇస్తున్నట్లుగా సంకల్పం చేసుకుని ముందుకు సాగాలి.

శివాలయంలో పురుషులకి ప్రత్యేకమైన వస్త్రధారణ నిర్దేశించబడింది. పురుషులు కేవలం పంచె మాత్రమే ధరించి, పైన ఉండే ఉత్తర్వ్యంని నడుముకు కట్టుకొని మాత్రమే ప్రదక్షిణాలు చేయాలి. అలా ఎవరైతే చేస్తారో వారిపట్ల పరమశివుడు అత్యంత ప్రసన్నుడవుతాడు. ముందుగా చెప్పినట్లు పదఘట్టన వినకూడదు జాగ్రత్త. మీరు శివాలయంలో ఎట్టి పరిస్థితులలోనూ విభూధిని కాని, బిల్వపత్రాలని కాని, కుంకుమను కాని, ప్రసాదాన్ని కాని ఎట్టి పరిస్థితులలో నందీశ్వరుడి మీద పెట్టకూడదు. సాధారణంగా చాలామంది నందిమీద విభూధిని, బిల్వఆకులను వేస్తూ ఉంటారు. అది మహాపాపంగా పరిగణించబడింది.

సాష్టాంగ నమస్కారం

స + అష్ట + అంగ = సాష్టాంగ.
అనగా 8 అంగములతో నమస్కారం చేయడం. అలా నమస్కారం చేసే సమయంలో ఈ శ్లోకం చదవాలి.

శ్లో !! ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా !
పద్భ్యాం కరాభ్యాం కర్నాభ్యాం ప్రణామం సాష్టాంగ ఉచ్యతే !!

అష్టాంగాలు : ఉరసు అంటే తొడలు, శిరసు అంటే తల, దృష్టి అనగా కళ్ళు, మనసు అనగా హృదయం, వచసు అనగా నోరు, పద్భ్యాం - పాదములు, కరాభ్యాం - చేతులు, కర్నాభ్యాం - చెవులు.

బోర్లా పడుకుని పై శ్లోకం చదువుకుంటూ నమస్కరించి ఆయా అంగములు నెలకు తగిలించాలి.

స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేకూడదు.

అంజనాదేవి జీవిత చరిత్ర

పూర్వం ఒక మహర్షి శివుని కోసం కొన్ని వందల సంవత్సరాలపాటు ఘోర తపస్సును ఆచరిస్తాడు. అప్పుడు అమరావతీ నగరానికి రాజయిన ఇంద్రుడు.. ఆ ముని చేస్తున్న ఘోరతపస్సును చూసి ఎక్కడా తన అమరావతీ నగరాన్ని శివునితో వరంగా కోరుకుంటాడోనన్న భయం అతనిలో కలుగుతుంది. దాంతో ఇంద్రుడు ఎలాగైనా ఆ మహర్షి తపస్సును భంగం కలిగించాలని నిర్ణయించుకుంటాడు.
అప్పుడు ఇంద్రుడు తన రాజ్యంలో వున్న ‘‘పుంజికస్థల’’ అనే అప్సరసను ముని తపమును భంగం కలిగించాల్సిందిగా ఆజ్ఞాపించి, పంపిస్తాడు. మునిని చూసి ఆ అప్సరస లోలోపల భయపడుతున్నప్పటికీ చేసేదేమీలేక అతని తపమును భంగం కలిగించడానికి అహర్నిశలు ప్రయత్నిస్తుంది. తన అందాచందాలతో, నృత్యగీతాలతో ఆ మహర్షి తపస్సును భంగం కలిగిస్తుంది. తన తపస్సును భంగం కలిగించిందన్న కోపంతో మహర్షి ఆమెను.. ‘‘నువ్వు వానర యోనియందు జన్మించుగాక’’ అని శపిస్తాడు.
అప్పుడు ఆ అప్సరస భయంతో ఎలాగైనా తనను ఈ శాపం నుంచి విముక్తి కలిగించాల్సిందిగా కోరుకుంటూ.. వినయభావంతో అనేక రకాలుగా ప్రార్థిస్తుంది. చివరికి ఆ ముని ఆమెను అనుగ్రహించి.. ‘‘నువ్వు ఎప్పుడు ఏ రూపంలో ధరించాలని అనుకుంటావో.. అప్పుడు ఆ రూపాన్ని నువ్వు పొందవచ్చు’’ అని వరాన్ని ప్రసాదిస్తాడు.


కొన్నాళ్ల తరువాత ముని విధించిన శాపం మేరకు ఆ పుంజికస్థల అనే అప్సరస వానరిగా జన్మిస్తుంది. ఆమెకు నచ్చిన విధంగా యదేచ్ఛగా సంచరించేందుకు కూడా అవకాశం లభించింది. ఈమే ‘‘అంజనాదేవి’’. ఈమె వానర రాజు అయిన కేసరిని వివాహం చేసుకుంది. ఎంతో అందగత్తె అయిన అంజనాదేవిని కేసరి చాలా అనురాగంతో చూసుకునేవాడు. ఆమెకు అన్నివిధాలుగా సౌకర్యాలను కల్పించేవాడు.
ఒకానొకరోజు ఈ వానర దంపతులు మానవ రూపాలను ధరించి తమ రాజ్యంలోనే విహరించసాగారు. సంతోషంగా విహరిస్తున్న సమయంలో వాయువు చాలా వేగంగా వీస్తుంది. అప్పుడు ఒక వాయువుతరంగం అంజనాదేవి చీర చెంగును ఎగరగొడుతుంది. దాంతో ఆమెను ఎవరో స్పృజించినట్లుగా అనిపిస్తుంది. దానికి ఆమె కోపంతో.. ‘‘నా పాతవ్రత్యాన్ని భంగం కలిగించడానికి సాహసించింది ఎవరు? నేనిప్పుడే వారిని శపిస్తాను’’ అని చెబుతుంది.
అందుకు సమాధానంగా వాయుదేవుడు.. ‘‘దేవీ! నేను వాయుదేవుడిని. నా స్పర్శవల్ల నీ పాతివ్రత్యము భంగం కాలేదు. అయితే శక్తిలో నాతో సమానమైన ఒక సుపుత్రుడు నీకు కలుగుతాడు. నేను అతనిని అన్నివేళలా రక్షిస్తాను. అంతేకాదు.. బాలల నుంచి పెద్దలవరకు అందరూ అతనిని ఆధ్యాత్మికంగా ఆదరిస్తానరు. ఎవరు అతనిని తిరస్కరించేవారు వుండరు. అతడు భగవంతునికి సేవ చేసుకుంటూ.. ఆదర్శమార్గంలో సత్కీర్తిని పొందుతాడు’’ అని చెబుతాడు. తరువాత కేసరీదంపతులు అక్కడి నుంచి వెళ్లిపోతారు.
వాయుదేవుడు చెప్పిన విధంగా.. శంకరుని అంశతో అంజనాదేవికి శ్రీమత్ వైశాఖ బహుళ దశమినాడు పరాక్రమవంతుడైన హనుమంతుడు అవతరిస్తాడు.

‘‘శ్రీరామ దూతం శిరసానమామి’



‘‘సత్యం’’ ఒక్కటే కాలానికి చిక్కక, లొంగక, కాలగర్భంలో కలయక, దివ్వప్రభలతో తేజరిల్లుతూనే ఉంటుంది. ఇందుకు ప్రత్యక్ష నిదర్శనాలు మన ‘‘రామాయణ, భారత, భాగవత’’ గ్రంధాలు. ఇవి కేవలం కథలు అయితే, ఏనాడో వాటికి కాలదోషం పట్టేది. అలా కాక, అవి ఇప్పటికీ కాలంతో సమానంగా పరుగులుతీస్తూ.. జాతిని జాగృతం చేస్తున్నామంటే.. వాటిలోని ప్రతిపాత్ర సత్యబలంతో జీవం పోసుకున్నవే. ధర్మసంకల్పంతో రూపం దాల్చినవే.

‘‘శ్రీరామ’’ అనగానే వెంటనే మనకళ్ళముందు కదిలే పాత్ర ‘‘హనుమంతుడు’’. ఏడుకాండల గ్రంధమయిన ‘‘రామాయణం’’లో.. .ఎప్పుడో నాల్గవకాండ అయిన ‘‘కిష్కింధాకాండ’’లో ప్రవేశించిన ‘‘హనుమంతుని పాత్ర’’ నేటికీ ఆబాలగోపాలాన్ని అలరిస్తూనే ఉంది. పలకరిస్తూనే ఉంది. ఎందుకంటే....
శివాంశ సంభూతుడు:

రామాయణం ‘‘హరి, హర తత్త్యాత్మకం
శ్రీరాముడు శిష్ణ్యాంశ సంభూతుడు. హనుమంతుడు శివాంశసంభూతుడు. దీనికి సంబంధించిన కథ రామాయణంలోనే ఉంది. శివపార్వతుల కళ్యాణం జరిగింది. వారిరువురు ఏకాంత శయ్యామందిరం చేరారు. వారికి జన్మించబోయే పుత్రునివల్లే తారకాసంహారం జరగాలి. అందుకోసమే శోభనమందిరం వెలుపల దేవతలతో కొండంత ఆశతో, వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. నెలలు, మాసాలు దొర్లిపోతున్నాయి. శివ పార్వతులు శోభన మందిరం నుంచి బయటకు రాలేదు. లోపల ఏం జరుగుతోందో తెలియని సందిగ్ధస్థితి దేవలది. చూచి రమ్మని అగ్నిని, వాయువును లోపలకు పంపారు దేవతలు. అదే సమయంలో ‘శివతేజస్సు’ బహిర్గత మవుతోంది. లోపలకు ఎవరో వచ్చారన్న సందేహం పార్వతికి కలిగింది. వెంటనే శివునకు దూరంగా జరిగింది. శివుడు తన తేజస్సును భూపతనం కానివ్వకుండా బంధించి దానిని అగ్నికి, వాయువుకు చెరిసగం పంచి పంపాడు. తనకు చెందవలసిన శివతేజస్సును అగ్ని, వాయువులు తన్నుకు పోతూంటే పార్వతికి దుఃఖం ఆగలేదు. దేవతలు చేసిన కార్యభంగానికి కోపగించి ‘దేవతలకు స్వభార్యల వలన సంతానం పుట్టకుండుగాక’ అని శపించింది.

అగ్నిదేవుడు తన దగ్గరున్న ‘శివతేజస్సు’ను భరించలేక గంగానది గర్భంలో ఉంచాడు. గంగ కూడా శివతేజస్సును భరించలేక ఒడ్డుకు నెట్టింది. ఆ శివతేజస్సు రెల్లు పొదల్లో పడి ఆరుముఖలతో ‘షణ్ముణుడు’ జన్మించాడు
వాయువు తన దగ్గరున్న ‘శివతేజస్సు’ను, సంతానంకోసం తపస్సు చేస్తున్న ‘అంజనాదేవి’ గర్భంలో నిక్షిప్తంచేసాడు. అంజనాదేవి గర్భం ధరించింది. నవమాసాలు నిండాయి. అంజనాదేవికి ప్రసవవేదన మొదలైంది. ఆ రోజు వైశాఖ బహుళ దశమి తిధి: పుర్వాభాద్ర నక్షత్రం.ఆ శుభ ముహూర్తంలో శివాంశతో అంజనా గర్భసంభూతుగా ‘‘ఆంజనేయుడు’’ జన్మించాడు.

బాల ప్రాయంలోనే ఆంజనేయుడు తన శక్తి ఏమిటో లోకానికి చాటాడు. బాల భీమని పండుగా భావించి, దానిని మ్రింగాలనే ఉద్దేశ్యంతో ఆకాశానికి ఎగిరాడు. ఆరోజు అమావాస్య, సంపూర్ణసూర్యగ్రహణం. అదే సమయానికి సూర్యగ్రహణం చెయ్యడానికి రాహువు వచ్చాడు. ‘‘ఈ సూర్యుడు నాదంటే నాది’’ అని రాహువుకు, బాలాంజనేయునికి మధ్య ఘర్షణ జరిగింది. విసుకుచెందిన ఆంజనేయుడు తన తోకతో రాహువును చుట్టి బలంగా విసిరివేసాడు. రాహువు దేవేంద్రుని ముందుపడి జరిగినది చెప్పాడు. కృద్ధుడైన దేవేంద్రుడు వజ్రాయుధాన్ని పంపాడు. వజ్రాయుధ ఘాతానికి ఆంజనేయుని దవడ ఎర్రగా వాచిపోగా, స‌్పృహతప్పి నేలమీద పడ్డాడు. హనుమ (దవడ) వాచినవాడు కనుక ఆనాటి నుంచి ‘‘హనుమంతుడు’’ అని సార్ధక నామధేయుడయ్యాడు. తన కుమారుని దురవస్థ చూసి... వాయువు దేవతలపైన అలిగి స్తంభించాడు. సృష్టిమొత్తం సంక్షోభంతో అల్లకల్లోలమైంది. బ్రహ్మదిదేవతలు వాయువును ప్రస్నం చేసుకోవడం కోసం, అందరూ హనుమంతునికి తలోక వరం ఇచ్చారు. ఏ అస్త్రము హనుమంతుని బాధించవు, బంధించవు అని దీవించారు. సహజ బల సంపన్నుడైన హనుమంతుడు ఇప్పుడు వర బలసంపన్నుడయ్యాడు. అసలే కోతి... పైగా బాల్యం... దానికితోడు వరబలం హనుమంతుని అల్లరికి అంతేలేదు. అతని చిలిపిచేష్టలకు సహనం నశించిన ఋషులు ‘‘నీవు శక్తి హనుడవు అగుగాక’’అని శపించారు. ఆ తర్వాత అంజనాదంపతుల ప్రార్ధనకు ప్రసన్నులైన ఋషులు ‘‘ెవరైనా చెబితేనే అతని శక్తి అతనికి తెలుస్తుంది’’అని శాపాన్ని కాస్త మార్పు చేసారు.

ఆదిత్యుడే ఆచార్యుడు
హనుమంతునికి విద్యలు బోధించడానికి సాహసం చేసి ఎవరూ ముందుకు రాలేదు. హనుమంతుడు నిరుత్సాహం చెందక సూర్యుని దగ్గరకు వెళ్లి విద్యాదానం చెయ్యమని ప్రార్ధించాడు. ‘‘నాయనా.. క్షణకాలం కూడాఆగకుండా నిరాలంబపధంలో నిరంతరం సంచరించే నేను నీకేం విద్యాదానం చెయ్యగలను? నువ్వేం నేర్చుకోగలవు?’’ అన్నాడు సూర్యుడు. ‘‘గురుదేవా... మీతో సమానంగా సంచరిస్తూనే విద్యలు నేర్చుకుంటాను’’అని వినయంగా పలికాడు హనుమంతుడు. గురువు అంగీకరించాడు. శిష్యుడు అనుసరిస్తున్నాడు. విద్యాభ్యాసం మొదలైంది. అచిరకాలంలోనే సకల విద్యలు గ్రహించాడు హనుమ. ఇదీ హనుమంతుని బాల్య కథ. ఈ కథను... జాంబువంతుడు.... సాగర తీరంలో వానరులకు వినిపించాడు.

తొలికలయిక:
రామాయణంలో హనుమంతుని పాత్ర కిష్కింధ కాండలో పరిచయం అవుతుంది. తొలి పరిచయంతోనే ా పాత్ర స్వరూప, స్వభావాలు, పటిష్టతను పరిచయం చేస్తాడు ఆదికవి’’వాల్మీకి.
రావణాపహృత అయిన సీతాదేవిని అన్వేషిస్తూ రామలక్ష్మణఉలు ఋష్యమాకం చేరుకున్నారు. దూరం నుంచి వారిని చూస్తూనే ప్రాణభయంతో పరుగులు పరుగులు తీసాడు సుగ్రీవుడు. చెంతనున్న హనుమంతుడు... సుగ్రీవునికి ధైర్యంచెప్పి... యతిరూపం ధరించి రామలక్ష్మణఉల దగ్గరకు వచ్చాడు. ‘‘అద్యూ క్షత్రియవంశ సంజాతుల్లా కనిపిస్తున్న మీరు.. అందుకు విరుద్ధంగా నారబీరలు, జటాజూతాలు ధరించడం చూస్తూంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. పోనీ మహర్షులాని అనుకుందామంటే... మీ చేతిలోని ధనర్పాణ, కరవాలాలు చూస్తూంటే మీరు ఋషులు కాదనిపిస్తోంది. తమరెవరు? ఏ కార్యార్గమై యిలా వచ్చారు? ఓ... నాగురించి చెప్పలేదు కదూ.. నా పేరు హనుమంతుడు. వానరసార్వ భీముడైన వాలి, తన తమ్ముడయిన సుగ్రీవుని సందేహించి, అతని భార్యను అపహరించి, రాజ్యం నుంచి తరిమికొట్టాడు. నేను ా సుగ్రీవుని మంత్రిని’’ అన్నాడు.
విన్నరాముడు పరమానంద భరితుడై, లక్ష్మణునితో:
‘‘నా సృగ్వేద వినీతస్య నా యజర్వేద ధారణం:
నా సామవేద విదుష: శక్యమేవం విభాషితుయ్’’
లక్ష్మణా.. చతుర్వేదాలు, సమస్త శాస్త్రాలు, నవ వ్యాకరణాలు అధ్యయనం చేసినవాడు మాత్రమే ఇంత మఈదు మధురంగా మాట్లాడగలడు.
‘‘అవిస్తర మసందిగ్ధం అవిలంబితమనధ్యమ్
ఉర:స్థం కంఠగం వాక్యం వర్తతే మధ్యమస్వరమ్’’
చెప్పవలసిన విషయంలో సందిగ్ధం లేదు. సాగతీతలు లేవు. గొంతు చించుకోవడం, కనుబొమలు ఎగురవేయటం, తలతిప్పడం వంటి అవలక్షణాలు లేకుండా, తను చెప్పాల్సింది మృదుమధురంగా మధ్యమ స్వరంలో చెప్పాడు. ఇంతటి వాక్చాతుర్యంగల ఈ ధీమంతునితో చాలా జాగ్రత్తగా సంభాషించు’’అని లక్ష్మణుని హెచరిస్తాడు రాముడు. ఈ ఒక్కచోట తప్ప... రాముడు లక్ష్మణుని హెచ్చరించిన సందర్భం రామాయణంలో మరెక్కడా కనబడదు. మానవులు ఎలా మాట్లాడాలో మనకు ఈ సన్నివేశంలో నేర్పుతాడు ‘‘హనుమంతుడు’’

అగ్నిసాక్షిగా రామ, సుగ్రీవుల మధ్య మైత్రీ బంధం కల్పించాడు హనుమ. ధర్మభ్రష్టుడైన వాలిని సంహరించి, సుగ్రీవుని కిష్కింధాధిపతి చేస్తానని శ్రీరాముడు మాటిచ్చాడు. వాలి సంహారం జరిగింది. సకల వానర సంఘాలూ, వారి సేనాధిపతులు నల, నీల, గజ, గవయ, గవాక్ష, మైంద, ద్వివిదాది మహావీరులందరూ భయభ్రాంత హృదయులై నిలబడి పోయారు. వాలి మృతదేహం మీద పడి, తార విలవిల విలపిస్తూంటే, ఆమెను ఓదార్చేధైర్యం ఎవ్వరికీ చాలలేదు.

అప్పుడు హనుమంతుడు తారను సమీపించి ‘‘మహారాణీ.. ఇంతకాలం ీ సర్వ వానరకోటిని మీ కనుసన్నలలో నడిపించి, కిష్కింధను పాలించిన మీరు... వీర మరణం పొందిన భర్త గురించి ఇలా శోకించడం తగదు. ఇప్పుడు ఈ సమస్త వానరప్రజ మీ ఆదేశంకోసం ఎదురు చూస్తున్నారు. కనుక, శోకాన్ని ఆపి, నీ బిడ్డ అంగదుని ఈ కిష్కింధకు సామ్రాట్టుగా అభిషిక్తుని చెయ్యి’’ అన్నాడు.
శ్రీరాముడు వాలిని సంహరించినది సుగ్రీవుని కిష్కింధాధి పతిగా అభిషిక్తుని చెయ్యడానికి గానీ, అంగదుని కాదు. ఈసంగతి హనుమంతునకు తెలియక కాదు అలా అన్నది.. ఎందుకలా అన్నాడంటే....
వాలిమరణంతో సర్వవానరకోటి సుగ్రీవుని పట్ల ద్వేషంతో, పగతో ఉంటారు. నిజానికి కిష్కింధకు ఏలిక వాలి అయినా, తెరవెనుక నుంచి కిష్కింధను పాలించిన పట్టమహిషి తార. భర్త మరణం ఆమెలో ప్రతీకార జ్వాల రగిల్చితే వానరులంతా సుగ్రీవునకు ప్రతిపక్షం అవుతారు. అప్పుడు సుగ్రీవుడు కిష్కిందాధిపతి కావడం కల్ల... వానరులంతా సహకరిస్తేనే సుగ్రీవుడు సీతాన్వేషణ చేయగలడు. తార కోపాన్ని శాంతింపచేసి, సుగ్రీవుని పక్షానికి వచ్చేలా చెయ్యాలంటే... ముందు తార, సుగ్రీవుని కిష్కింధాధిపతిగా అంగీకరించాలి. తను అన్న మాటకు తార నుంచి ఏ సమాధానం వస్తుందో హనుమకు తెలుసు. అలాంటి సమాధానమే వచ్చింది.
‘‘హనుమా.. సుగ్రీవుడే సర్వవానరకోటికి ప్రభువు. అతనికే పట్టాభిషేకం జరగాలి’’ అంది తార. ఆమెచేత అలా పలికించగల ధీమంతుడు హనుమంతుడు. అదీ ఆయన రాజకీయనిఫుణత.

తిరుగులేని రామ ‘‘దూత’’
వానర వీరులంతా నీతాన్వేషణకు బయలు దేరారు.
దక్షిణ సాగరతీరానికి చేరారు అంగద, జాంబువంత, హనుమదాదులు. అనితర సాధ్యమైన శతయోజన విస్తీర్ణమయిన సాగరాన్ని లంఘించాడు. ఈ సాగర తరణంలో...
మైనాకుని మన్ననలందాడు
సురసను యుక్తితో జయించాడు
సింహకను సంహరించాడు
లంకిణిని ఓడించి, శత్రుదుర్వేధ్యమయిన లంకలో ఒంటరిగా సీతాన్వేషణ సాగించాడు. ఈ కార్యంలో ఎందరో దేవ, గంధర్వ కన్నర, గంధర్వాది సుందరాంగనలు నగ్నంగా, అర్థనగ్రంగా హనుమంతునికి దర్శనమిచ్చారు. హనుమ హృదయం చివుక్కుమంది. ‘‘పరస్త్రీని చూడడమే పానం... పైగా ఇలా నగ్నంగా చూడడం మరింత పాపం’’ అనుకుని
‘‘నహిమే పరదారాణాం దృష్టిర్విషయవర్తినీ
అయం చాత్ర మయాదృష్ట: పరదార పరిగ్రహ:’’
‘‘సీతాదేవి కనిపిస్తుందేమో నని చూసానేగానీ, నా మనస్సు కామవశీభూతం కానప్పుడు నేనెందుకు బాధపడాలి. సర్వ పాపపుణ్యాలకు ప్రధానమైన మనస్సు, నిర్మలంగా, నిశ్చలంగా ఉన్పప్పుడు నేను బాధపడక్కర లేదు’’ అనుకున్నాడు.. అది హనుమ స్త్రీ భక్తి. ాత్మపరిశీలన.
అశోక వనంలో సీతాదేవిని చూసాడు. ఆమెకు రామాంగుళి ఇచ్చి ధైర్యం చెబుతూ... ‘‘అమ్మా.. నా భుజాన్ని ఎక్కు. క్షణకాలంలో నిన్ను రామసన్నిధికి చేరుస్తాను’’ అంటాడు. అప్పుడు సీతాదేవి.. ‘‘అలా చేయడం నా రామునకు గౌరవంకాదు. అయినా, ఇంత చిన్న ాకారంగల నీవు, నన్నెలా రాముని దగ్గరకు చేర్చగలవు’’ అంది. అప్పుడు హనుమంతుడు తన విశ్వరూపాన్ని సీతాదేవికి చూపించి, ధైర్యం చెబుతూ...
‘‘మద్విశిష్టాశ్చ తుల్చాశ్చ సన్తి తత్ర వనౌకస:
మత్త: ప్రత్యవరం: కశ్చిన్నాస్తి సుగ్రీవ సన్నిదే’’
‘‘అమ్మా.. సుగ్రీవుని సన్నిధానంలో నన్ను వానరవీరులందరిలోను అతి సామాన్యుడను నేనే. దూతల సామాన్యులనే తప్ప మహమహులను పంపరు కదా’’ అన్నాడు. అదీ హనుమంతునివినయం, నమ్రత.
ఒంటిచేత్తో అశోకవన ధ్వంసం చేసిన హనుమ.. సామాన్యుడా?
శత్రుసభలో నిర్భయంగా రావణునకు హితబోధ చేసిన హనుమ... సామాన్యుడా?
సుందర లంకానగరాన్ని క్షణకాలంలో అగ్నికి ఆహుతి చేసిన హనుమ... సామాన్యుడా?
‘‘సీతాదేవిని చూసాను’’ అని చెప్పి... ఇటు వానరుల ప్రాణాలు, అటు శ్రీరాముని ప్రాణాలు కాపాడిన హనుమ... సామాన్యుడా?
ఇంద్రజిత్తు సంధించిన బ్రహ్మస్త్ర ప్రయోగానికి రామలక్ష్మణులతో సహా సర్వవానరులూ మూర్చపోతే, సంజీవినీ పర్వతాన్ని తెచ్చి అందరికీ ప్రాణదానం చేసిన హనుమ... సామాన్యుడా?
అసలు హనుమలేని రామకథను మనం ఊహించగలమా? ఆస్వాదించగలమా? ఆనందించగలమా?
హనుమలేనిదే రాముడు లేడు. ఎందుకంటే...
రాముడు విష్ణ్వాంశ సంభూతుడు.
హనుమ ఈశ్వరాంశ సంభూతుడు.
శివకేశమవిద్దరూ ఒకరిని విడిచి ఒకరుండరు.
‘‘శఇవాయా విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే
శివస్య హృదయం విష్ణు: విష్ణోశ్చ హృదయంశివ:’’
అందుకే రామనాయం ఎక్కడుంటే హనుమ అక్కడుంటాడు
శివుడు.. అభిషేక ప్రియుడైన, బోళా శంకరుడు
హనుమ... రామనామాభిషేక ప్రియుడైన, బోళావానజుడు
సామాన్యులమైన మనం,ఆ మహావీరునకు ఏమివ్వగలం? జన్మదిన కానుకగా, భక్తిగా ఒక్క ‘‘రామనామాన్ని’’ ఇవ్వడంతప్ప... ఇంకేం చెయ్యగలం?
యత్ర యత్ర రఘునాధ కీర్తనమే
తత్ర తత్ర కృత మస్త కాంజవియ్
బాష్పవారి పరిపూర్ణలోచనమ్
మారుతిం నమత రాక్ష సాంతకమ్