Thursday, September 6, 2012

విఘ్నేశ్వరుడు - 9


గణాధిపత్య పట్టాభిషేకానికి పార్వతి ధగధగ మెరిసే రంగుబట్టల్ని ఎన్నికచేసింది. కాని, విఘ్నేశ్వరుడు తెల్లని వస్ర్తాలు ధరించాడు. ‘‘మంచిబట్టలు వేసుకోవలసిన సమ …ుంలో శుక్లాంబరధరుడు అనిపించుకున్నా వేమ…్యూ?'' అన్నది పార్వతి. ‘‘మంచి బట్టలు కదమ్మా వేసుకోవాలి? అవే వేసుకున్నానమ్మా.
 
తెలుపు మంచి తనాన్ని, వివేకాన్ని తెలుపుతుంది!'' అన్నాడు విఘ్నేశ్వరుడు. పట్టాభిషేకం జరిగింది. విఘ్నేశ్వరుడు గణనాథుడు అ…్యూడు. జ…ులక్ష్మి పేరు గల సిద్ధి, విద్యావతి పేరుగల బుద్ధి విఘ్నేశ్వ రుణ్ణి వరించి ఇరుపక్కలా చేరారు. గణనా థుడు సిద్ధి బుద్ధి వినా…ుకుడు అనిపించు కున్నాడు. అదే సమ…ుంలో ఎనిమిది దిక్కుల నుండి అష్టసిద్ధులు ఎనమండు గురు చక్కని కన్యలై వచ్చి వకుళమాలలు వేసి, వినా…ుకుణ్ణి వరించారు.
 
విఘ్నేశ్వరుడు సిద్ధివినా…ుకుడు అనిపించుకున్నాడు. కళ్యాణమహోత్సవాలు వైభవంగా జరిగాయి. విష్ణువు విఘ్నేశ్వరుడితో,‘‘కోటి విఘ్నాలు వచ్చినా వినా…ుకుడి పెళ్ళి ఆగదు! అనే కొత్త సామెత అమలుజరిగింది. ఓ కళ్యాణగణేశా! ఇక నీ చేతిమీదుగా కళ్యాణాలు జరగాలి.
 
అలా జరిగిన కళ్యాణ ఫలంగా అవతరించిన జన్మే జన్మ!'' అన్నాడు. విఘ్నేశ్వరుడు,‘‘అలాగే జరుగుతుందిలే. కౌసల్యకు రాముడివై అవతరించి రావణదశ అంతం చేద్దువుగాని!'' అని అన్నాడు. మళ్ళీ విష్ణువు, ‘‘గజాననా! నీ ప్రసన్న వదనం చూస్తుంటే ఏనుగ అంటే చెప్పలేనంత మక్కువగా ఉందోయి!'' అన్నాడు మంద హాసం చేస్తూ.

విఘ్నేశ్వరుడు, ‘‘మొసలిబారి నుండి గజేంద్రుణ్ణి రక్షంచి కరివరదుడు అనిపించు కుందువులే!''అన్నాడు. ఎనమండుగురు సిద్ధి కన్యలు చామర వింజామరాలు వీస్తూండగా, సింహాసనంపై సిద్ధి బుద్ధులతో చుక్కల్లో చంద్రుడిలాగ విఘ్నేశ్వరుడు ప్రకాశిస్తున్న ఆ సమ…ుంలో, లక్ష్మి ముఖం తిప్పుకొని వెళ్ళిపోబోతూంటే విష్ణువు ఆమెను ఆపి, విఘ్నేశ్వరుడితో, ‘‘సిద్ధి వినా…ుకా! లక్ష్మి స్థిరమైనది కాదు అని వాదు పడుతున్నది. నీ ఒడిలో కాస్త కూర్చుండ నియ్యి! లక్ష్మికి స్థిరత్వం సిద్ధిస్తుందని ఆశి స్తున్నాను!'' అని అన్నాడు.
 
విఘ్నేశ్వరుడు మహానందంతో, ‘‘తల్లి మహాలక్ష్మిని ఒడిపటే్ట నా అదృష్టం ఎంత గొప్పది!'' అని అంటూ లక్ష్మి పాదాలను తొండంతో చుట్టి తన కుడి తొడమీద కూర్చుండ బెట్టుకున్నాడు. అప్పుడు విష్ణువు, ‘‘ఇప్పుడు విఘ్నేశ్వ రుడు ‘లక్ష్మీగణపతి'. తల్లి కుమారుణ్ణి ఏవిధంగా కనిపెట్టుకొని ఉంటుందో అలాగే విఘ్నేశ్వరుడి అనుగ్రహం ఉన్నచోట లక్ష్మి స్థిరంగా ఉంటుంది,'' అని చెప్పాడు. నారదుడు, ‘‘ ఓహో, విఘ్నేశ్వరుడికి ఎన్ని పేర్లు! సిద్ధివినా…ుకుడు, లక్ష్మీగణపతి, శుక్లాంబరధరుడు - ఇంకా ఎన్నో ఎన్నో,'' అని అంటూ మహతివీణను వాయిస్తూ, ‘‘జ…ు జ…ు జనగణనా…ుక జ…ుహే!''
 
అని గానం చేస్తూ లోకాలన్నీ తిరిగాడు. ఒకనాడు విఘ్నేశ్వరుడు ఎలుక వాహ నంపైన ఆకాశమార్గంలో ప…ునిస్తూ వింధ్య పర్వతశ్రేణిని దాటి, ఇంకా దక్షణంగా వెళ్ళి ఒక పెద్ద నల్లని కొండదగ్గిర దిగాడు. కొండ దిగువనే శబరులు డోళ్ళు, డప్పులు కోలా హలంగా వాయిస్తూ పెద ్ద సంబరం జరుపు కుంటున్నారు. విఘ్నేశ్వరుడు తన రూపాన్ని ఉపసంహ రించుకుని అందమైన కురవ్రాడి రూపంతో ఉత్సవాన్ని సమీపించాడు.
 
శబరులు కురవ్రాణ్ణి చుట్టుముట్టి, ‘‘దేవర తనకోసం మంచి చిన్నోడిని పంపి నాడు!'' అంటూ ఎత్తుకుపోయి ఉత్సవం మధ్యలో దింపారు. అక్కడ రక్తపు చారలతో పెద్ద నల్లని గండ శిల ఉన్నది. ఎదురుగా ఒక పసివాడు మూగగా ఏడుస్తూ ఉన్నాడు. ఆ పిల్లవాడి ఒంటినిండా పసుపు రాసి, మొలకు నల్లని గుడ్డ కట్టి, ఎరన్రి మందార మాలతో అలంకరించారు.

విఘ్నేశ్వరుడు శబరనా…ుకుడితో, ‘‘మీ దేవరతో నేను మాట్లాడాలి, నన్ను అతని దగ్గ రికి తీసుకెళ్ళండి!'' అన్నాడు. శబరనా…ుకుడు పకపకా నవ్వుతూ, ‘‘బలే చిన్నోడివే! మా స్వామితోనే మాటలాడ తావా? మా స్వామి కారుచీకటిలాగ మహా భీకరంగా ఉంటాడు. ఎవరూ చూళ్ళేరు. చూస్తే రక్తం కక్కుకొని అలాగే చచ్చిపోతారు!'' అన్నాడు.
 
విఘ్నేశ్వరుడు నవ్వి, తటాలున వెళ్ళి గండశిలను సమీపించి, ‘‘మీ భ…ూన్నే మీ స్వామికి అంటగట్టి భ…ుంకరంగా ఉంటా డని అనుకుంటున్నారు. భ…ూన్నే భక్తి అంటు న్నారు. మీలో ఉండే క్రూరస్వభావమే బలిగా త…ూరైంది. ఇదంతా తప్పు! మీరెవ్వరూ మీ స్వామిని చూసి ఎరగరు. మీ స్వామి ఎన్నడూ ఇలాంటి ఉత్సవాల్నీ, బలినీ కోరలేదు. మీ స్వామి ఎంతో అందంగా ఇలాగ ఉంటాడు,'' అని చెబుతూ అరచేత్తో రాతిని తట్టాడు.
 
నల్లని బండరాయి తెల్లని అరటిదవ్వలాంటి అందమైన స్వామి విగ్రహంగా మారింది. ముణుకులపై చేతులు చాచి కూర్చున్న స్వామి విగ్రహం నవ్వు ముఖంతో మనో హరంగా కనిపించింది. విఘ్నేశ్వరుడు పసి వాడి తల నిమిరాడు. ఆ పిల్లవాడు గొంతెత్తి, ‘‘స్వామీ, నీవే శరణం!'' అంటూ విగ్రహంముందు మోక రిల్లి స్తోత్రం మొదలుపెట్టాడు. నల్లరాయి స్వామివిగ్రహంగా మారడమూ, మూగపిల్లవాడు గొంతెత్తి మాటలు పలక డమూ రెప్పపాటున జరిగాయి.
 
అద్భుతాలకు శబరులు నివ్వెరపాటుతో చేతులెత్తి, భ…ుం భ…ుంగా విఘ్నేశ్వరుడికి మ్రొక్కారు. కురవ్రాడి రూపంతో ఉన్న విఘ్నేశ్వరుడు వారిస్తూ, ‘‘నన్నుకాదు మీరు మ్రొక్కవల సింది. మీ స్వామిని భ…ూన్ని విడిచి ప్రేమతో కొలవండి; మీరు నమ్మిన దేవరను తండ్రి లాగ,అన్నలాగ,స్నేహితుడిలాగ చూసుకోండి.
 
బలులు మొదలైన చెడ్డపనులు మానేసి ఫలపుష్పాలతో, అరటి తోరణాలతో ఆనం దంగా పండగలు చేసుకోండి. ఈ మాటలు వచ్చిన పిల్లవాడే మీకు గురువుగా, స్వామి పూజారిగా ఉంటాడు. నేను మీ స్వామిని చూసి మాట్లాడడానికి ఆ…ున దగ్గరకు వెళ్తున్నాను. త్వరలో మీ స్వామి మీకు దర్శన మిస్తాడు!'' అని చెప్పి చరచరా కొండను ఎక్కుతూ వెళ్ళాడు.

శబరులు కొంతవరకు అతనిని అనుస రించి వెళ్ళి ఆగిపో…ూరు. విఘ్నేశ్వరుడు కురవ్రాని రూపంతోనే పర్వతాగ్రానికి చేరాడు. అక్కడ భైరవస్వామి తల వాల్చుకుని విచారంగా కూర్చుని ఉన్నాడు. అతని శరీరం కారునల్లగా ఉన్నది. విఘ్నేశ్వరుడు పరుగున వెళ్ళి భైరవుణ్ణి రెండు చేతులా చుట్టి ఆలింగనం చేసుకున్న క్షణంలోనే భైరవుడి శరీరం తెల్లగా వెన్నెల కాంతితో ప్రకాశించింది.
 
దివ్యమంగళ రూపాన్ని పొందిన భైరవుడు కురవ్రాణ్ణి ఆనందంతో కౌగలించుకుని, ‘‘నీవు విఘ్నేశ్వరుడివి! నాకు తెలుసు, నీ అనుగ్రహంతో కారుదనం పోయి దైవత్వం సిద్ధిస్తుందని. నేను అవతరించినప్పుడు ఆకాశవాణి చెప్పింది. ఈ కొండ ఎక్కడానికి ఎవ్వరూ సాహసించరు. నన్ను చూసి పక్షులు కూడా ధ్వని చె…్యువు.
 
నన్ను నేనే అసహ్యించు కుంటూ నీ కోసం ఎంతకాలం నుంచో నిరీ క్షస్తూ ఉన్నాను. నీ నిజరూపంతో నా కన్ను లకు విందు చెయ్యి!'' అన్నాడు. విఘ్నేశ్వరుడు నిజరూపాన్ని పొంది అత నితో, ‘‘ఇకనుండి నీవు దైవంగా ఆరాధింప బడే స్వామివి! శివకేశవులిద్దరూ నీలో ఉన్నారు. నీ గురించి అమ్మ చెప్పినప్పట్నించి నిన్ను కలు సుకోవాలని తహతహపడుతూనే ఉన్నాను.
 
మోహం చీకటిలాంటిది! శివుడు మోహపరవ శుడై జగన్మోహినీ రూపం ధరించిన విష్ణువు వెంటబడ్డాడు. శివ, విష్ణువుల తేజస్సులు ఒక టిగా కలసి నీ అవతరణం జరిగింది. అందు వలన నీకు నల్లనిరూపు వచ్చింది. ఇప్పుడు నీ అంత దివ్యమంగళ సుందరుడైన స్వామి మరొకడు లేడు! శబరులకు ఒకసారి కని పించు!'' అన్నాడు. తరవాత విఘ్నేశ్వరుడు కురవ్రాని రూపంతో శబరుల దగ్గరికి వచ్చి, ‘‘మీ స్వామి విగ్రహం ముందు మోకరిల్లి ఏక కంఠంతో ‘స్వామీ! శరణం!' అని పిలవండి.
 
మీ స్వామి మీకు కనిపిస్తాడు! పిలిచినప్పుడల్లా పలుకుతాడు. పంటలు పండించండి, వెళ్ళండి!'' అని చెప్పి అదృశ్యమ…్యూడు. శబరులు నివ్వెరపోయి దణ్ణాలు పెట్టి, విగ్రహం దగ్గరకు చేరుకుని స్వామిని నోరారా పిలుస్తూ మ్రొక్కారు. దివ్యసుందర రూపంతో స్వామి వారికి సాక్షాత్కరించి చిరునవ్వులతో అభ…ుముద్ర పట్టి వారిని ఆశీర్వదించి అంత ర్థానమ…్యూడు.

అప్పటినుంచి శబరులు ఏటేటా మార్గశిరమాసంలో అరటిచెట్టు బోదెను, లేత ఆకును అనేకవిధాలుగా ఉపెూగించి స్వామికి మంటపాలనూ, పందిళ్ళనూ అలంకరణ చేసి, బలులు మొదలైనవి మాని సాత్వికారాధనతో స్వామిని భ…ుంలేని భక్తితో అర్థిస్తూ, నాగరికులై విద్యావంతులై ఉన్నత మానవత్వాన్ని సాధిం చారు.
 
స్వామి నివసించిన కొండపై గొప్ప ఆల…ూన్ని శిల్పకళా నిల…ుంగా నిర్మించి సంగీత నృత్య కవితలతో అలరించి గర్వించ దగ్గ మానవజాతిగా రూపొందారు. కురవ్రాని రూపంలో వచ్చినదెవరో శబరు లకు తెలి…ుదు, వారి దేవరస్వామిేు ఆ రూపంలో వచ్చి తమ అజ్ఞానాన్ని తొలిగించి అనుగ్రహించాడని అనుకున్నారేగాని విఘ్నే శ్వరుని లీల అని ఎరగరు.
 
విఘ్నేశ్వరుడు అలాగ ఎరుకపడి ఉంటే విఘ్నేశ్వరుడే దేవుడని ఆరాధన మొదలపెట్టి, తమ స్వామినే విస్మరించుతారని విఘ్నేశ్వరుడు అజ్ఞాత బాలకుడిగానే ఉండిపో…ూడన్న సంగతి స్వామి పదేపదే తలంచుకుని మనసారా విఘ్నేశ్వరుణ్ణి స్మరిస్తూండేవాడు. కైలాసానికి వెళ్ళి విఘ్నేశ్వరునితో, కుమారస్వామితో ఆనందం పంచుకోవాలని తరచూ ఉవ్వి ళ్ళూరేవాడు.
 
విఘ్నేశ్వరుడు శబరులను సంస్కరించి మూషిక వాహనుడై ఆకాశమార్గంలో క్రిందకు చూస్తూ ఉత్తరదిశగా తిరుగుప్ర…ూణం చేస్తున్నాడు. కొండచరి…ులన్నీ కీకారణ్యా లతో నిండి ఉనాేు్నగాని భూమి అంతా బీడుపడిన మైదానంలాగ కనిపించింది. జలసమృద్ధి ఉంటే కనులపండుగగా పైరు పచ్చగా ఉండవలసింది కాని, నీటి కొరత తీర్చే నదులు లేక సౌభాగ్యశూన్యంగా భూములు వెలవెలపోతున్నవి, ప్రజలు ఆకాశాన్ని మబ్బుల్ని నమ్ముకొని ఏదో ఒకలాగ జీవ…ూత్ర సాగిస్తున్నారు.

‘‘గంగమ్మలాంటి నది కలిగిన ఉత్తరదేశ ప్రజలు ఎంత పుణ్యం చేసి పుట్టారో! అంత గంగ మనకు లేకపోయినా అందులో ఒక పా…ు మనకు ఏ దేవుడైనా కనికరించి ఇవ్వకూడదా? ముక్కోటి దేవుళ్ళున్నారంటారు. ఎందుకూ? ఒక్కరికీ జాలిలేదు,''అంటూ సామాన్య ప్రజలు తమలో తాము అక్కడక్కడ అనుకుంటున్న మాటలు వినిపిస్తూనే ఉన్నాయి విఘ్నేశ్వరుడి పెద్ద చెవులకు.
 
అటు పడమటి దిక్కున ఎత్తయిన పర్వత శ్రేణులు, ఇటు తూర్పున చిన్నచిన్న కొండల బారుతో నిండి ఉన్న భూభాగాలు విశాలంగా తూర్పు సముద్రం వరకూ ఊరికే వున్నాయి. ఎక్కువమంది జనులు జంతువుల్నీ, పక్షుల్నీ వేటాడి తింటూ ఆటవిక జీవనం సాగిస్తున్నారు. సేద్యం మీద ఆధారపడ్డవారు శాపగ్రస్తుల్లా పడరాని అగచాట్లు పడుతూనే ఉన్నారు. సము ద్రంమీద ప్రాణభీతి విడిచి చేపలుపటే్ట జాల రులు విశేషంగా కనిపించారు.
 
చాలీచాలని మేతతో పశుగణాలు బక్కచిక్కి దీనంగా కని పించాయి. తూర్పుతీరం పొడవునా ఎక్కడ జూసినా జాలరిపల్లెలే కనిపించాయిగాని మంచి ఊళ్ళు లేవు. ఉత్తరభూమితో పోల్చి చూస్తే విఘ్నేశ్వ రుడికి చాలావిచారం కలిగింది. హిమాచల సీమలో ఎటు చూసినా సుందర జలపాతా లతో, రమణీ…ు సరోవరాలతో, నదీ నదాలతో మనోహరంగా కనిపించే పచ్చని ప్రకృతి కళ కళలాడుతూ ఆనందదా…ుకంగా ఉంటుంది. ఇక్కడ పడమటి పర్వతాలు దిష్టిబొమ్మల్లాగ బోడిగా ఉన్నాయి.
 
ఆ పర్వతశ్రేణి నడుమ సహ్యాద్రి చేరువనున్న లో…ులో గౌతముడి ఆశ్రమం మసిబొగ్గుల్లో మరకతంలాగ ఆకుపచ్చగా మిలమిలా మెరుస్తున్నది. విఘ్నేశ్వరుడికి ఏదో ఆలోచన వచ్చినట్లుగా తల పంకించాడు. ఎలుకను వేగం పెంచమని హెచ్చరికగా తట్టి దక్షణాదిని, వింధ్యను దాటి ఉత్తరాదిని చేరుకున్నాడు. ఉత్తరభూమి దూరానికి అంతా ఏదో కొత్తగా ఉన్నట్టు కని పించింది. సమీపించేసరికి అక్కడ అంతా అెూమ…ుంగా ఉంది.

No comments:

Post a Comment