Monday, June 29, 2015

పురుష వాక్కు

విస్పష్టమైన భావవ్యక్తీకరణకు భగవంతుడు మానవులకు ప్రసాదించిన అమోఘమైన వరమే వాక్కు. ఈ వాగ్భూషణం మానవులను మహనీయులుగా తీర్చిదిద్దగలుగుతుంది. పశుపక్ష్యాదులకు లేని సౌకర్యం మానవులకు లభించినందుకు ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొనవలసినదే. అంతే తప్ప ఏ దశలోనూ వాక్కును దుర్వినియోగం చేయరాదు.
ప్రియమైన వాక్కుతో సాధ్యమైనంతగా అందరినీ సంతోషింపచేయాలి. అంతే కాని ఎదుటివారిని నొప్పించే పద్ధతిలో పరుషమైన వాక్కులను పలుకవద్దు అని ఆర్యాశతకకర్తయైన సుందరపాండ్యుడు లోకానికి హితప్రబోధం చేశాడు.
యుద్ధాలలో మనుషలను ఆయుధాలు గాయపరుస్తూ ఉంటాయి. విషం మానవుల ప్రాణాల ను హరిస్తుంది. నిప్పు నిలువునా మనిషిని కాల్చివేస్తుంది. పాపకర్మలు మనిషిని అప్పుడప్పు డూ ఆయా సందర్భాలనుబట్టి పీడిస్తూ ఉంటాయి. కాని ఇవేవీ బాధించని రీతిలో హృదయానికి కుచ్చుకున్న ముల్లులా మనుషలను ప్రతి క్షణం పట్టి పీడించేవి పరుషంగా పలికే పలుకులే .

న తథా రిపుః న శస్త్రం నాగ్నిః న విషం న దారుణో వ్యాధిః
పరితాపయతి చ పురుషం యథా కటుకభాషిణీ వాణీ ॥
అని సుందరపాండ్యుని ఆర్యోక్తి. (ఆర్యావృత్తంలో పలికిన సూక్తి).
కఠినంగా, పరుషంగా మాట్లాడేవారికి ఆప్తులు, ఆత్మీయులు దూరమౌతారు. సన్మార్గంలో పయనించేవారు అట్లే అన్యమార్గంలో పయనించేవారు అనే భేదం లేకుండా స్త్రీలు-పురుషులు చిన్నలు-పెద్దలు అనే తేడా లేకుండా అన్ని కాలాలకు అన్ని ప్రాంతాలకు చెందిన వ్యక్తులందరికీ మనోవేదనను కలిగించేవి పరుషవాక్కులే అనే సత్యాన్ని గుర్తిద్దాం. పుల్లవిరుపు మాటలతో, వ్యంగ్యోక్తులతో, అధిక్షేపాలతో, నిష్ఠరమైన వాక్కులతో హృదయానికి గాయాన్ని కలిగించే విధానానికి స్వ్తిచెప్పే ప్రయత్నాన్ని చేద్దాం.
పాముకాటుతో, విషప్రయోగంతో, అగ్నిప్రమాదంతో ఒకేసారి ప్రాణాలు పోతాయి. ఈ విషాదాన్ని మించినరీతిలో పరుషవాక్కులచేత గాయపడినవారు అటు ప్రాణాలు పోక, ఇటు ప్రశాంతంగా ఉండలేక ప్రతిక్షణం సతమతమవుతూ విలవిలలాడుతూ ఉంటారు. ఇటువంటి బాధ మనవల్ల మరొకరికి కలగడం సరికాదనే సత్యాన్ని గుర్తిద్దాం. ఆచరించే ప్రయత్నం కూడా చేద్దాం.

జ్యోతిర్లింగ దర్శనం-సోమనాథ జ్యోతిర్లింగం

స్వామి సోమనాథునిగా వెలసిన కథ స్కాంద పురాణంలో ఉంది.
బ్రహ్మదేవుని మానసపుత్రుడైన దక్షప్రజాపతికి అశ్విని నుంచి రేవతి వరకు 27 కుమార్తెలున్నారు.
తన కుమార్తెలను చంద్రునికి ఇచ్చి ఘనంగ వివాహం జరిపించాడు దక్షుడు. అయితే చంద్రుడు రోహిణిని మాత్రం అనురాగంతో
చూస్తూ,మిగిలినవారిని అలక్ష్యం చేయసాగాడు.
మిగిలినవారు తండ్రితో ఈ విషయాన్నీ మొరపెట్టుకోగా,దక్షుడు అల్లుడైన చంద్రుడిని మందలిస్తాడు. అయినప్పటికీ, చంద్రుని ప్రవర్తనలో మార్పురాకపోవడంతో,
క్షయరోగగ్రస్తుడవు కమ్మని చంద్రుని శపిస్తాడు దక్షుడు.
ఫలితంగా చంద్రుడు క్షీణించసాగాడు. చంద్రకాంతి లేకపోవడంతో ఔషధాలు, పుష్పాలు
ఫలించలేదు. ఈ పరిస్థితిని చూసిన సమస్తలోకవాసులు, తమ కష్టాలు తీరేమార్గం చూపమని బ్రహ్మ దేవుని ప్రార్థించారు.
బ్రహ్మ ఆదేశాన్ననుసరించి ప్రభాసక్షేత్రంలో మహామృత్యుంజయ మంత్రానుష్ఠానంగా
శంకరుని ఆరాధించిన చంద్రుడు, పార్థివలింగాన్ని ప్రతిష్టించి పూజించగా, శంకరుడు ప్రత్యక్షమై, చంద్రుని రోగ విముక్తుని గావించి, కృష్ణపక్షంలో చంద్రకళలు రోజు రోజుకీ తగ్గుతాయనీ, శుక్లపక్షంలో దిన మొక కళ
చొప్పున పెరుగుతుందని అనుగ్రహించాడు.
ఆనాటి నుండి చంద్రుని కోరిక మేర,
అతని కీర్తిదిశదిశలా వ్యాపించేందుకై చంద్రుని పేరుతో సోమనాథునిగా, కుష్టు వంటి మహా రోగాలను తగ్గించే సోమనాథ్ జ్యోతిర్లింగ రూపునిగా పార్వతీదేవిసమేతంగా వెలసి భక్తులను కరుణిస్తున్నాడు

ఆచమనం

మనం చేసే ఆచమనంలో వైదికాంశాలతోపాటు వైజ్ఞానిక రహస్యాలు కూడా ఇమిడి ఉన్నాయి.మన గొంతులో 'స్వరపేటిక' అనే శరీర అంతర్భాగం వుంటుంది. మనం చేసే ధ్వనులు అంటే మన మాటలు స్వరపేటిక నుండే పుడతాయి. మన ధ్వని గాంభీర్యానికి, స్పష్టతకు ఈ స్వరపేటికే ఆ ధారం.
స్వరపేటికలోకి గాలి జొరబడినప్పుడు అంటే మన శ్వాసకోశాల నుండి వెలువడే ఉచ్ఛ్వాస వాయువు ధ్వని తంతులమీదుగా పయనించినప్పుడు, ఈ ధ్వని తంతువులలో ఏర్పడిన శబ్దాలు బయటకు రావడానికి నోరు, ముక్కు రంధ్రాలు సహాయపడతాయి. అదేవిధంగా నాలుక పెదవులు శబ్దాల ఉచ్ఛారణకు, స్పష్టతకు దోహదం చేస్తాయి.
ప్రతి అక్షరానికి తనదైన ధ్వని ఉంటుంది. నోటిలోని అవయవాలు కదులుతూ ఈ ధ్వనులను ఉత్పత్తి చేస్తాయి. ఈ ధ్వని (అక్షరం) ఏ భాగం నుండి ఉత్పత్తి అవుతుందో దాని ఆధారంగా అక్షరాలను కాంఠ్యాలు, తాలవ్యాలు మొ|| గా విభజించారు.
ఇక మనం వైదిక కర్మలను ఆచరించేటప్పుడు చేసే ఆచమనం వలన మన నాలుకకు, గొంతుకు ఒకరకమైన ఉత్తేజం కలుగుతుంది. అంతేకాకుండా మన గొంతునుండి మాట బయటకు వచ్చేటప్పుడు, ధ్వనితోపాటు గొంతు నుండి వాయువు కూడా బయటకు వస్తుంది. ఈ విధంగా లోపలి నుండి వాయువు బయటకు వచ్చేటప్పుడు ఎలాంటి అడ్డంకి లేకుండా ఉండేందుకు ఆచమనం ద్వారా మనం త్రాగే నీరు ఉపయోగపడుతుంది. నిర్దిష్ట పరమాణంలో మనం తీసుకున్న నీరు గొంతు నుండి వెలుపలివైపు మార్గాన్ని నునుపుగా చేసి మన మాట సులభంగా, స్పష్టంగా వచ్చేందుకు దోహదం చేస్తుంది.
పూజాది వైదిక కార్యాలను ఆచరించేటప్పుడు మంత్రోచ్చారణ చేయవలసి ఉంటుంది. కాబట్టి ఆయా మంత్రాలన్నీ గొంతునుండి ఎలాంటి ఇబ్బంది లేకుండా వచ్చేందుకే మన మహర్షులు ఈ ఆచమన సంప్రదయాన్ని ఏర్పరచారు.
ఇక ఆచమనంలో కేశవాది నామాలను ఉచ్చరించడంలో కూడా ఎంతో వైజ్ఞానిక అంశం ఇమిడి ఉంది. ఆచమనంలో ముందుగా "కేశవాయస్వాహా: అని చెప్పుకుంటారు. 'కే" శబ్దము గొంతునుండి పుడుతుంది. తర్వాత పలికే "నారయణస్వాహా" అనే నామము నాలుక నుండి వస్తుంది. ఇక మూడవసారి చెప్పుకునే "మాధవాయస్వాహా" అనే పదము పెదవుల సహాయంతో పలుక బడుతుంది. కాబట్టి కేశవాది నామాలను పలకడం వలన గొంతుకు, నాలుకకు, పెదవులకు ఒకేసారి వ్యాయామం కలుగుతుంది మరియు ఆ తరువాత వచ్చే శబ్దాలకు ఉచ్చారణ కూడా స్పష్టంగా ఉంతుంది.
మన శరీరము ఒక విద్యుత్ కేంద్రములాంటిది. మన శరీరమంతా విద్యుత్ ప్రవహిస్తూ ఉంటుంది. ఆచమన సమయంలో మనం అరచేతిలో తక్కువ ప్రమాణంలో నీటిని వేసుకున్నప్పుడు ఎలక్ట్రో మాగ్నిటిజమ్ పద్ధతిలో అరచేతిలో ఉన్న నీరు పీల్చుకొంటుంది. ఈ నీటిని త్రాగినప్పుడు, నీరు జీర్ణకోశమును చేరి, అక్కడి గోడలలో ప్రవహించే విద్యుత్తుతో కలిసి, శరీరమంతా ఒకే క్రమపద్ధతిలో విద్యుత్తు ప్రవహించేలాగా చేస్తుంది. ఇలా విద్యుత్తీకరణము చెందిన నీరువల్ల గొంతు, నాలుక, స్వరపేటిక మొ|| భాగాలు కూడా ఉత్తేజము పొందుతాయి.
ఇంతటి వైజ్ఞానికాంశాలు ఇమిడి ఉన్నాయి కాబట్టే, మన మహర్షులు ఆచమనాన్ని ఒక తప్పనిసరి వైదిక నియమంగా ఏర్పరిచారు.

అంజనీపుత్రుడు

యుద్ధంలో సహాయంగా ఉండేందుకు విష్ణు మూర్తి తన శంకు, చక్రాలను
హనుమంతుడికి ప్రసాదించారు. బ్రహ్మదేవుడు తన కమండలాన్ని, పరమ
శివుడు తన మూడో కంటిని ఆంజనేయుడికి ప్రసాదించారు.
ఇలా వివిధ దేవతల నుంచి పది ఆయుధాలు పొందిన అంజనీపుత్రుడు దశభుజుడయ్యాడు.
హనుమాన్... ఈ పేరు వినగానే మనకు వానర రూపంలో ఉండే ఆంజనేయుడు
గుర్తుకు వస్తాడు.
అంతే కాదు భక్తికి మారుపేరుగా, బ్రహ్మచర్యానికి
ప్రతీకగా కూడా ఆంజనేయుడు కీర్తికెక్కాడు. హనుమంతుడు సాధారణంగా చేతిలో
సంజీవని పర్వతంతోనో, లేదా రాముని పాదాల వద్దో మనకు కనిపిస్తాడు.
అయితే పదిభుజాలు, మూడు కళ్లు కలిగిన ఆంజనేయుడిని ఎప్పుడైనా
చూశారా?
అయితే ఆ రూపాన్ని చూసేందుకు తమిళనాడు రాష్ట్రం, నాగపట్నం జిల్లాలోని
ఆనందమంగళంలో ఉన్న త్రినేత్ర దశభుజ వీరాంజనేయ ఆలయానికి
వెళ్లాల్సిందే.
ఈ ఆలయంలో పది భుజాలు, నుదురుపై మూడో కన్ను కలిగిన ఆంజనేయుడు భక్తుల పూజలందుకుంటున్నాడు. త్రేతాయుగంలో విష్ణుమూర్తి రామావతారమెత్తి రావణుడిని సంహరించిన పిమ్మట నారదుడు ఆయనను
కలుసుకున్నాడు.
స్వామి లంక నాశనముతో మీ యుద్ధము పూర్తికాలేదు. రావణుని వారసులు
ఉన్నారు. తండ్రి మృతిపై ప్రతీకారం తీర్చుకునేందుకు వారు తప్పకుండా మీపై
యుద్ధానికి వస్తారు. వారు ప్రస్తుతం సముద్ర అడుగు భాగంలో తపస్సు
చేస్తున్నారు.
వారి తపస్సు పూర్తి కాకముందే మీరు వారిని సంహరించాలని వేడుకున్నాడు.
అప్పుడు రాముడు నారదమహర్షి రామావతారంలో నా కర్తవ్యం
పూర్తయినది. మరికొన్ని రోజుల్లో ఈ అవతారాన్ని చాలించనున్నాను.
ఇందుకు ఇంకెవరినైనా ఎంపిక చేయుమ"ని అన్నాడు. కాగా, రాక్షస వధకు
హనుమంతుడిని పంపించాలని అందరూ నిర్ణయించారు. యుద్ధంలో సహాయంగా ఉండేందుకు విష్ణు మూర్తి తన శంకు, చక్రాలను
హనుమంతుడికి ప్రసాదించారు. బ్రహ్మదేవుడు తన కమండలాన్ని, పరమ
శివుడు తన మూడో కంటిని ఆంజనేయుడికి ప్రసాదించారు.
ఇలా వివిధ దేవతల
నుంచి పది ఆయుధాలు పొందిన అంజనీపుత్రుడు దశభుజుడయ్యాడు.
కైలాసనాధుని నుంచి మూడో కన్ను పొందడంతో ముక్కంటిగా మారాడు.
వానర శ్రేష్టుడు రాక్షస వధ పూర్తిచేసి విజయంతో తిరిగి వచ్చాడు.
ఈ రూపంలో ఆయన రాక్షసులను అంతమొందించి అక్కడ వెలిసినందున ఆ ప్రాంతంలో
ఆలయాన్ని నిర్మించి భక్తులు పూజిస్తున్నారు. రాక్షస వధతో హనుమంతుడు
ఆనందంగా ఉన్నందున ఆ ప్రాంతానికి ఆనందమంగళమ్ అనే పేరు స్థిరపడిందని
భక్తులు చెబుతుంటారు

దేవాలయంను దర్శించుకునే పధ్ధతి దయచేసి చదవండి.

దేవాలయం అంటే దైవం నెలవున్న స్థలం. పరమపవిత్రమైన క్షేత్రం. అఖిలాండకోటి బ్రహ్మాండ
నాయకుడు భక్తుల అభీష్టములు తీర్చడానికి కొలువైఉన్న పరమ పావన నివాసం. అలాంటి
దేవాలయమునకు దర్శనమునకు వెళ్ళునపుడు కొన్ని ధర్మములను / పద్ధతులను ఆచరించాలి.
అప్పుడే ఆ దైవం యొక్క అనుగ్రహమునకు పాత్రులము అవుతాము.
1) ప్రతి భక్తుడు ( స్త్రీ పురుషులు ) గుడికి వెళ్ళే ముందు శుచిగా స్నానం చేసి, విధిగా నుదుట కుంకుమ ధరించాలి.
2) సంప్రదాయమైన వస్త్రములు ధరించాలి. స్త్రీలు చీరలు, పురుషులు ధోవతి-ఉత్తరీయం, ఆడపిల్లలు పరికిణీలు లేదా చుడీదార్ ధరించాలి. ( చాలామంది ఆడపిల్లలు జీన్స్ టీ షర్టులు- మగపిల్లలు షార్టులు ధరించి వెళుతున్నారు.
ఇలా ధరించినవారిని ఆలయ ప్రవెశమునకు అనుమతిని ఇవ్వకుండా యాజమాన్యం చూసుకోవాలి. తల్లి
తండ్రులు ప్రొత్సహించరాదు .)
3) కనీస పూజా సామాగ్రిని తీసుకొని వెళ్ళాలి. పెద్దవారి దగ్గరికి వెళ్ళినా మహాత్ముల దగ్గరికి వెళ్ళినా ఒట్టి చేతితో
వెల్లరాదు. గీతలో పరమాత్ముడు '' పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి" ...ఎవరైతే నాకు భక్తీతో పత్రం కాని పుష్పం కాని ఫలం కాని ఉదకం కాని సమర్పిస్తారొ వాటిని ప్రీతితో స్వీకరిస్తాను'' అన్నాడు.
4) గుడి ముందుకు చేరుకోగానే మొదట కాళ్ళూ చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.
5) ఆలయం ప్రవేశించడానికి ముందు గోపురానికి నమస్కరించి తర్వాత మెట్లకు నమస్కరించాలి.
6) లోనికి ప్రవేశించినప్పటినుండి భగవంతుని నామం జపిస్తూ అన్యమస్కంగా కాకుండా ఏకాగ్రత
అంతా దేవుడిపైనే ఉంచాలి.
7) నామ జపం చేస్తూ మధ్యమ వేగంతో గర్భాలయం చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి పురుషులు స్వామికి కుడి వైపు, స్త్రీలు ఎడమ వైపు నిల్చోవాలి.
8) మొదట మూల విగ్రహం పాదాలను దర్శించి అందులో లీనం కావాలి.తరువాత స్వామి కళ్ళలోకి చూస్తూ లీనం కావాలి.
9) అర్చన చేసుకునేవారు తమ గోత్రము ఇంటిపేరు నక్షత్రము చెప్పుకోవాలి. తీర్థం తీసుకునే  సమయంలో అరచేయిని గొకర్నాక్రుతిలొ ఉంచి చేయి కింద ఏదైనా వస్త్రం ఉంచుకుని '' అకాల మృత్యు  హరణం ...'' అనే మంత్రం స్వయంగా చెప్పుకుంటూ భక్తితో తీర్థాన్ని చప్పుడురాకుండా తీస్కోవాలి.
10) దర్శనం అయిన తరువాత కాసేపు కూర్చొని నామ జపం చేస్తూ ప్రశాంత చిత్తంతో ఉండాలి.
11) ప్రసాదం భక్తులందరికీ పంచి తామూ భక్తితో తీస్కోవాలి.
12) తిరిగి వెళ్ళే ముందు మళ్ళీ స్వామికి నమస్కరించుకుని బయటికి వచ్చిన తరువాత మళ్ళీ గోపురానికి నమస్కరించి వెళ్ళాలి.
13) ఆలయ ప్రదక్షిణలు చేసేటప్పుడు వేగం కూడదు.
14) అనవసరంగా మాట్లాడటం.. పరుషపదజాలం ఉపయోగించకూడదు
15) ఆవలింతలు, జుట్టు పీక్కోవడం, తల గీక్కోవడం, తమలపాకులు వేయకూడదు.
16) జననం, మరణం సంబంధించిన విషయాలపై మాట్లాడకూడదు.
17) టోపీలు, తలకు వస్త్రాలు కట్టుకోవడం చేయకూడదు.
18) ధ్వజస్తంభం, బలిపీఠం, గోపుర స్థలాలను తొక్క కూడదు.
19) ఆకర్షణీయ దుస్తులను ధరించకూడదు.
20) నందీశ్వరుడు, శివలింగానికి మధ్యలో వెళ్ళకూడదు.
21) దర్శనం పూర్తయ్యాక వెనకవైపు కాస్త దూరం నడిచి, తర్వాత తిరగాలి.
22) ఒక చేత్తో దర్శనం చేయకూడదు.
23) భుజాలపై టవల్స్ వేసుకుని దర్శనం చేయకూడదు.
24) ఆలయంలో భుజించడం, నిద్రించడం చేయకూడదు.
25) ఆలయంలో ఎత్తైన ప్రాంతంలో కూర్చోకూడదు.
26) బలిపీఠంలో ఉన్న సన్నిధిని మ్రొక్కకూడదు.
27) ఆలయ ఆస్తులను అపహరించకూడదు.
28) అష్టమి, నవమి, అమావాస్య, పౌర్ణమి, మాస ప్రారంభం, సోమవారం, ప్రదోషం, చతుర్థి రోజుల్లో బిల్వ దళాలను తుంచకూడదు.
29) ఆలయంలో స్నానం చేయకుండా ప్రవేశించకూడదు.
30) మూల విరాట్ వద్ద దీపం లేకుండా దర్శనం చేయకూడదు.
31) ఆలయానికి వెళ్లొచ్చిన వెంటే కాళ్లను కడగకూడదు. కాసేపు కూర్చున్న తర్వాతే ఇవన్నీ
చేయాలి.
32) ఆలయంలోకి ప్రవేశించి, తిరిగి వచ్చేంతవరకు నిదానం ప్రదానంగా ఉండాలి.
33) గోపుర దర్శనం తప్పక చేయాలి.
34) ఆలయంలోని మర్రి చెట్టును సాయంత్రం 6గంటల తర్వాత ప్రదక్షిణలు చేయకూడదు.
35) ఆలయంలోపల గట్టిగా మాట్లాడకూడదు.
36) మన మాటలు, చేష్ఠలు ఇతరులకు ఆటంకంగా ఉండకూడదు.

Saturday, June 27, 2015

తీర్ధ ప్రసాధాల్లో నాలుగు రకాలు

1. జల తీర్ధం
2. కషాయ తీర్ధం
3. పంచామృత తీర్ధం
4. పానకా తీర్ధం
01. జల తీర్ధం
ఈ తీర్ధం ద్వార అకాల మరణం ,సర్వ రోగాలు నివారించాభాడుతాయి .అన్ని కష్ట్టలు , ఉపసమానాన్ని ఇస్తాయి .బుద్ధి ,అధర్మం వైపు పయనించకుండా అడ్డుపడుతుంది .
02. కషాయ తీర్ధం
ఈ తీర్ధం కొల్లాపురంలోని శ్రీమహాలక్ష్మిదేవాలయం ,కొల్లూరు ముకాంబిక దేవాలయం ,హిమాచలప్రదేశ్ లోని జ్వాలమాలిని దేవాలయం ,అస్సాంలోని శ్రీ కామాఖ్య దేవాలయములో ఇస్తారు .రాత్రి పూజ తరువాత తీర్థనీ కషాయం రూపంలోపంచుతారు.వీటిని సేవెంచటం ద్వారా కనిపెంచే -కనిపించని రోగాలు త్వరలో నయం అవుతాయి .
03. పంచామృత అభిషేక తీర్థం
పంచామృత సేవనం ద్వార చేపట్టిన అన్ని పనులు దిగ్విజయంగా పూర్తికావటం మరియు బ్రహ్మలోకం
ప్రాప్తిస్తుంది .
04. పానకా తీర్ధం
శ్రీ మంగళగిరి నరసింహస్వామి దేవునికి ,అహోబిలం నరసింహ దేవునికి పానకం నివేధ్యంగా పెట్టడంతో పానకాల స్వామి ,పానకాల నరసింహస్వామి దేవునిగా ఖ్యాతినర్జించారు ..
కారణం స్వామికి పానకాన్ని నివేధ్యంగా పెట్టి వచ్చే భక్తులకు పానకాన్ని తీర్ధంగా పంచుతారు .
* పానకా తీర్ధాన్ని సేవిస్తే....
దేహంలో ఉత్సహం ఎక్కువ అవుతుంది .కొత్త చైతన్యం వస్తుంది .
దేహంలో వుండే వేడి సమస్తితికి వచ్చే విధంగా చేస్తుంది .
రక్తపోటు ఉన్నవారికి ,తల తిరగడం ,నోరు ఎండిపోయినట్లు ఉండడం జరగదు
రుమాటిజం , ఎముకులుకు సంభందించిన వ్యాధులు నయం అవుతాయి .
నీరసం దరిచేరదు .
* ఆకలి బాగా వేస్తుంది
దేవుని తీర్ధమైన పానకం సేవించటం ద్వార మధుమేహ వ్యాది అదుపులో ఉంటుంది .
జేవితంలో శత్రువుల బాధ ఉండదు బుద్ది చురుకుగా పని చేస్తుంది జ్ఞాపకశక్తి పెరుగుతుంది .

కలిపురుషుడి ప్రభావం ఎవరి యందు ఉంటుంది?

ఒకనాడు పరీక్షిత్ మహారాజు దిగ్విజయ యాత్ర చేస్తున్న సందర్భంలో ఒక ఆశ్చర్య కరమైన విషంయం చూశాడు. ఒంటి కాలు కలిగిన ఎద్దు ఒకటి నిలుచుని ఉంటే, దాని ముందు ఆవు ఒకటి నిలబడి పిల్లలగూర్చి జాడ తెలియక బాధపడుచున్న దానివలే ఏడుస్తూ ఉంది. అప్పుడు ఆ ఎద్దు " ఎందుకు ఏడుస్తున్నావు మంగళ ప్రదురాలా? " అని ప్రశ్నిస్తుంది. అందుకా ఆవు "నేను ఏడుస్తున్నది నాగురించి కాదు, నేడు ఆశ్రీలలనేశుడి లేమి వలన కాలముచే నీకు ఒంటి కలయ్యెను కదా!? అని దుఃఖిస్తున్నాను. ఆ కలి ప్రభావముచే దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు, ధీయుతులకు, నీకు, నాకు, గోవులకు, వర్ణాశ్రమలకు బాధ కలుగుతుంది కదా అని బాధ పడుతున్నాను" అంటుంది.
ఒక్క కాలు మీద ఎద్దు ఎలా నిలబడగలదూ? దానిని చూసి ఆవు విలపించడమేమిటీ? అంటే అక్కడ ఉన్నది మామూలు ఆవూ, ఎద్దులు కాదు. ఆ ఆవు భూదేవి, వృషభం ధర్మ దేవత. కృష్ణ నిర్యాణానంతరం కలియుగం ప్రారంభ సమయంలో కలి ప్రవేశించి నపుడు ఆ కలి పురుషుని ప్రభావం వలన ధర్మము యొక్క ( సత్యము, శౌచము, తపస్సు, దయ అను ) నాలుగు పాదములలో 3 నశించి ఒక్క కాలు మాత్రమే మిగిలినందులకు ఆ భూదేవి విలపించుచున్నది. నశించినవేవి? శౌచము, తపస్సు, దయ అను నవి నశించినవి. మిగిలినది సత్యము. ఇది ఎప్పటికీ నశించదు.
దుష్ట సంగము వలన శౌచము, సమ్మోహము వలన తపస్సు, అహం కారము వలన దయ నశించినవి. అవి నశించుట వలన పైన తెలిపిన 8 మందికీ బాధ కలుగుతుంది.
ఈ విధంగా ఆవు దుఃఖిస్తుండగా అపారమైన కోపం కలవాడు, దండము చేతిలో కలిగినవాడు, రాజు ఆకారంలో ఉన్న వాడు, ఖఠినాత్ముండు అయిన వాడు ఒకడు వచ్చి ఆవును తన కాలితో తన్నాడు. ఆ ఆవు క్రింద పడి పోయినది. ఒంటి కాలు మీద నిలబడిన ఎద్దుని కూడా తన్నాడు. అది కూడా క్రింద పడి పోయినది. క్రింద పడి వాటిని తన చేతిలోని దండముతో విపరీతముగా కొట్టనారంభించాడు. అవి కనులనుండి నీరు కారుతుండగా విలపిస్తున్నాయి.
దూరమునుండి అది చూచిన పరీక్షిత్తు వాటిని సమీపించి ఆ గోవును భూమాతగాను, వృషభమును ధర్మముగాను గుర్తించి అమ్మా మీకీ దీనావస్థ కలుగుటకు కారణము ఎవరు? మీకు మూడు కాళ్లు లేక పోవుటకు కారణము ఎవరు ? ఎంతటి వారైనప్పటికినీ నేను వారి చేతులను ఖండఖండములుగా చేసి మిమ్ము రక్షించెదను సెలవిమ్మని అడిగెను.
అందుకా గోమాత " కొందరు కాలమన్నారు,కొందరు కర్మ అన్నారు, ఇది యుగ సంధి అన్నారు, యుగ లక్షణమన్నారు. ఏవేవో కారణాలు చెప్పారు, ఏది ఏమైనప్పటికినీ వీరి పాదములు తెగిపోయాయి" అన్నది.
పరీక్షిత్తు ఇందాక గోవును బాధించిన వానిగురించి వెతుకు చుండగా, ఆ నృపాకారుడైన వాడు వచ్చి గభాలున పరీక్షిత్తు పాదాలమీద పడి అయ్యా రక్షించండి నేనే నరికేశాను ఆపాదాలు అన్నాడు. నన్ను కలి పురుషుడంటారు. నా ప్రవేశం వలననే ధర్మమునకు 3 పాదాలు తెగిపోయాయి. ఈ కలియుగంలో నేను నిలబడాలంటే ధర్మం నశించాలి. అందుకు అనువుగా భగవంతుడే తన అవతారం చాలించాడు. కానీ నేను ఇంకా సరిగా నా ప్రభావాన్ని చూపకముందే, నీవు నన్ను అవరోధిస్తున్నావు. నేను ఎక్కడికెళితే అక్కడ నీవు ధనుర్భాణాలు పట్టుకు నిల్చుంటున్నావు. అలా కాదు నాకో అవకాశం ఇవ్వు. నువ్వు ఫలానా చోట ఉండు అని చెప్పు. నేనక్కడ ఉంటాను. అంతే కానీ నే వెళ్లినచోటల్లా నీవు అండగా నిలబడితే యుగధర్మం నెరవేరదు. ఇది కలియుగం. నేను ప్రవేశించి తీరాలి. కా బట్టి నాకు కొన్ని స్థానాలు ఇవ్వు. అని వేడుకున్నాడు.
అప్పుడు పరీక్షిత్తు చెప్పాడు. నీకు 4 స్థానాలు ఇస్తున్నాను అక్కడ నీవు ఉండవచ్చు.
1 : జూదశాల యందు నీవు ఉండ వచ్చు.
2 : పాన ( మద్య ) శాలయందు నీవు ఉండవచ్చు.
3 : స్వేఛ్చావిహరిణులై ధర్మమునకు కట్టు బడక ఆచార భ్రష్టులైన స్త్రీల యందు నీవు ఉండవచ్చు.
4 : జీవ హింస జరిగే టటువంటి ప్రదేశములయందు నీవు ఉండవచ్చు.
అది విని కలిపురుషుడు అయ్యా మీరు నాలుగుస్థానాలిచ్చారు. కానీ వాటయందు నేను నిలబడడానికి వీలుకలిగేటట్టు లేదు. ( పరీక్షిత్తు పరిపాలనలో ప్రజలెవ్వరూ వాటి జోలికి వెళ్లరు కనుక ) నాకు ఇంకొక్క స్థానాన్ని ప్రసాదించండి అని అడిగాడు.
అందుకు పరీక్షిత్తు
5 : బంగారం ఇచ్చాను అన్నాడు.
అది విని చాలు మహాప్రభో చాలు అని నమస్కరించి వెళ్లి పోయాడు కలిపురుషుడు.
పరీక్షిత్ మహారాజు ఒంటినిండా బంగారమే.. అలా కలి పరీక్షిత్తు నందు ప్రవేశించాడు. పరీక్షిత్తు ఆ ప్రభావంతో వేటకి ( అహింస కు ) వెళ్లి, అక్కడ తపస్సునందు నిమగ్నుడైన శమీక మహాముని పై చచ్చిన పామును వేస్తాడు. అది తెలిసి శమీక మహర్షి కుమారుడు శృంగి కోపోగ్రుడై "ఏడురోజులలో తక్షకుని చేతిలో మరణించమని" పరీక్షిత్తును శపించడము, రాజ్యానికి తిరిగి వచ్చినతరువాత తన తప్పు తెలుసుకున్న పరీక్షిత్తు పశ్చాత్తాప హృదయుడై ఉండగా శుకుడు వచ్చి భాగవతమును ఏడురోజులలో వినిపిస్తాడు.
కావున పై 5 విషయములందును కలి పురుషుని ప్రభావం ఉండును. వీనిలో దేనికి లోనైననూ మనం నైతికంగా పతనమవుతాము. భగవంతునికి దూరమవుతాము. కలి ప్రభావమునుండి భగవన్నామము ఒక్కటే మనను రక్షించ గలదు.

ఏకబిల్వం శివార్పణం!!!

పరమశివుని పూజించుకునేటప్పుడు మనం ఏకబిల్వం శివార్పణం అంటూ మారేడు దళాలను సమర్పించుకుంటూ పూజించుకుంటుంటాము.
జ్ఞానస్వరూపమయినపరమాత్మయే పరమశివుడు. మనలోని అజ్ఞానాన్ని ( మందబుద్ధిని) రూపుమాపి,
జ్ఞానజ్యోతి’ ని వెలిగించి, మన మనసులను పవిత్రం చేసి, నిర్మలమైన జీవనాన్ని కల్గించమని, జ్ఞానస్వరూపమైన మారేడు దళాలను స్వామికి సమర్పించుకుంటుంటాము.

పూజకుడు – పూజ్యము – పూజ/స్తోత్రము – స్తుత్యము – స్తుతి /జ్ఞాత – జ్ఞేయము – జ్ఞానము అనే అర్థాలను చెబుతున్నారు. ఇలా (3×3) మూడు x మూడును వేర్వేరుగా భావించుటయే త్రిపుతిజ్ఞానం. ఒక వృక్షానికి కొమ్మలు వేరువేరుగా కనిపించినప్పటికీ, ఆధారకాండము ఒక్కటే అయినట్లు, సృష్టి, స్థితి, లయ కారకుడైన ఆ మహాదేవుడు మారేడు దళాలలో మూడుపత్రాలుగా వేరు వేరుగా వున్నట్లు గోచరిస్తున్నాడు.
కానీ, ఆయన సర్వాంతర్యామి. బిల్వపత్ర దర్శనం వలన అత్యంత పుణ్యం లభిస్తుంది. వాటిని స్పృశించటం వలన సర్వపాపాలు నశిస్తాయి.
ఒక బిల్వ పత్రాన్ని శివునికి భక్తిశ్రద్ధలతో అర్పించటం వలన, ఘోరాతిఘోరమైన పాపాలు సైతం తొలగిపోతుంటాయి.అటువంటి త్రిగుణాలుగల బిల్వ దళాన్ని స్వామికి అర్పించుకుంటే ఆయన అనుగ్రహం సులభంగా కలుగుతుంది. పూజకుడవు నీవే, పూజింపబడేది నీవే, పూజాక్రియవు నీవే” అనే భావంతో శివుని పూజించుటయే సరియైన పద్ధతి.
ఈ జ్ఞానరహస్యాన్నితెలుసుకుని – బిల్వపత్రరూపంతో‘త్రిపుటి జ్ఞానాన్ని’ నీ పాదాల చెంత నేను సమర్పిస్తున్నాను అని స్వామికి విన్నవించుకుని ‘శివోహం, శివోహం’ అనే మహావాక్యజ్ఞానాన్ని స్థిరపరిచేదే బిల్వార్చన అవుతుంది.
పవిత్రమయిన ఈశ్వరపూజకు ‘బిల్వపత్రం’ సర్వశ్రేష్టమైనది. శివార్చనలకు మూడురేకులతోనున్న పూర్తి బిల్వదళాన్నే ఉపయోగించాలి. ఒకసారి కోసిన బిల్వపత్రాలు, సుమారు 15 రోజులవరకు పూజార్హత కలిగి ఉంటాయి. వాదిపోయినప్పటికీ దోషం ఉండదు.ఏకబిలపత్రంలోని మూడురేకులలో ఎడమవైపునది బ్రహ్మఅనీ, కుదివైపుది విష్ణువనీ, మధ్యనున్నది శివుడని చెప్పబడుతోంది.
ఇంకా బిల్వదళములోని ముందుభాగంలో అమృతము, వెనుక భాగంలో యక్షులుండటంచేత,బిల్వపత్రంయొక్కమున్డుభాగాన్ని శివునివైపు ఉంచి పూజించాలి. బిల్వవనం కాశీక్షేత్రంతో సరిసమానమైనది అని శాస్త్రవచనం. మారేడుచెట్టు ఉన్నచోట, ఆ చెట్టు క్రింద ‘లింగాకారం’లో శివుడు వెలసి ఉంటాడుట.
ఇంటి ఆవరణలో ఈశాన్యభాగంలో మారేడుచెట్టు ఉంటే, ఆపదలు తొలగి సర్వైశ్వర్యాలు కలుగుతాయి. తూర్పున ఉంటే సుఖప్రాప్తి కలుగుతుంది. పడమరవైపున ఉంటే సుపుత్రసంతాన ప్రాప్తి, దక్షిణవైపు ఉంటే యమబాధాలు ఉండవు.

Friday, June 26, 2015

అయి గిరినందిని

అయి గిరినందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందనుతే |
గిరివర వింధ్య షిరోధిని వాసిని విష్ణువిలాసిని జిష్ణునుతే |
భగవతి హే శితికంఠ కుటుంబిని భూరికుటుంబిని భూరికృతే |
జయ జయ హే మహిషాసురమర్ధిని రమ్యకపర్దిని శైలసుతే ||
సురవరవర్షిణి దుర్ధరధర్శిని దుర్ముఖమర్షిణి హర్షరతే |
త్రిభువనపోషిణి శంకరతోషిణి కల్మషమోషిణి ఘోషరతే |
ధనుజనిరోషిణి దితిసుతరోషిణి దుర్మదశోషిణి సింధుసుతే |
జయ జయ హే మహిషాసురమర్ధిని రమ్యకపర్దిని శైలసుతే ||
అయి జగదంబ మదంబ కదంబవనప్రియవాసిని హాసరతే |
శిఖరిశిరోమణి తుంగహిమాలయ శృంగనిజాలయ మధ్యగతే |
మధుమధురే మధుకైతభగంజిని కైతభభంజిని రాసరతే |
జయ జయ హే మహిషాసురమర్ధిని రమ్యకపర్దిని శైలసుతే ||
అయి శతఖండ విఖండితరుండ వితుండితశుండ గజాధిపతే |
రిపుగజగండ విదారణచండ పరాక్రమశుండ మృగాధిపతే |
నిజభుజదండ నిపాతితఖండ విపాతితముండ భటాధిపతే |
జయ జయ హే మహిషాసురమర్ధిని రమ్యకపర్దిని శైలసుతే ||
అయి రణదుర్మదశత్రువదోదిత దుర్ధరనిర్జర శక్తిభ్రుతే |
చతురవిచారదురీణమహాశివ దూతక్రిత ప్రమతాదిపతే |
దురితదురీహదురాశయదుర్మతి దానవదూత కృతాంతమతే |
జయ జయ హే మహిషాసురమర్ధిని రమ్యకపర్దిని శైలసుతే ||
అయి శరణాగత వైరివధూవర వీరవరాభయదాయకరే |
త్రిభువనమస్తక శూలవిరోధిశిరోదిక్రితామల శూలకరే |
దుమిదుమితామర దుంధుభినాధ మహోముఖరీక్రిత తిగ్మకరే |
జయ జయ హే మహిషాసురమర్ధిని రమ్యకపర్దిని శైలసుతే ||
అయి నిజహుంకృతి మాత్రనిరాకృత దూమ్రవిలోచన దూమ్రశతే |
సమరవిశోషిత శోణితబీజ సముద్భవశోణిత బీజలతే |
శివశివశుంభని శుంభమహాహవతర్పిత భూతపిశాచరతే |
జయ జయ హే మహిషాసురమర్ధిని రమ్యకపర్దిని శైలసుతే ||
ధనురనుసంగారణక్షణసంగ పరిస్పురదంగ నతత్కటకే |
కనకపిశంగ ప్రిశత్కనిశంగ రసద్భటశ్రింగ హతాబటుకే |
క్రుతచతురంగ బలక్షితిరంగ ఘటద్బహురంగ రటద్బటుకే |
జయ జయ హే మహిషాసురమర్ధిని రమ్యకపర్దిని శైలసుతే ||
సురలలనాతత ధేయత ధేయత థాళనిమిత్తజ లాస్యరతే
కుకుభాం పతివరథో గత తాలకతాల కుతూహల నాద రతే
ధింధిం ధిమికిత ధింధింమితధ్వని ధీరమృదంగ నినాదరతే
జయ జయ హే మహిషాసురమర్ధిని రమ్యకపర్దిని శైలసుతే ||
జయ జయ జప్యజయే జయశబ్ద పరస్తుతితత్పర విశ్వనుతే |
భణ భణ భింజిమిభిక్రితనూపుర సింజితమోహిత భూతపతే |
నటిత నటార్ధనటీనటనాయక నాటితనాట్యసుగానరతే |
జయ జయ హే మహిషాసురమర్ధిని రమ్యకపర్దిని శైలసుతే ||
అయి సుమనః సుమనః సుమనః సుమనోహరకాంతియుతే |
శ్రిత రజనీ రజనీ రజనీ రజనీ రజనీకరవక్రవృతే |
సునయనవిభ్ర మరభ్ర మరభ్ర మరభ్ర మరభ్ర మరాదిపతే|
జయ జయ హే మహిషాసురమర్ధిని రమ్యకపర్దిని శైలసుతే ||
సహితమహాహవ మల్లమతల్లిక మల్లితరల్లక మల్లరతే |
విరచితవల్లిక పల్లికమల్లిక భిల్లికభిల్లిక వర్గవృతే |
సిత కృత పుల్లిసముల్లసితారునతల్లజ పల్లవసల్లలితే |
జయ జయ హే మహిషాసురమర్ధిని రమ్యకపర్దిని శైలసుతే ||
అవిరలగండ గళన్మదమేదుర మత్తమతంగజరాజపతే |
త్రిభువన భూషణ భూతకలానిది రూపపయోనిదిరాజసుతే |
అయి సుదతీజనలాలసమానస మోహనమన్మతరాజసుతే |
జయ జయ హే మహిషాసురమర్ధిని రమ్యకపర్దిని శైలసుతే ||
కమలదలామల కోమల కాంతికలాకలితామల భాలలతే |
సకలవిలాసకలానిలయక్రమ కేలిచలత్కల హంసకులే |
అలికులసంకుల కువలయమండల మౌలిమిలద్బకులాలికులే |
జయ జయ హే మహిషాసురమర్ధిని రమ్యకపర్దిని శైలసుతే ||
కరమురళీరవ వీజిత కూజిత లజ్జిత కోకిల మంజుమతే |
మిళితపులింద మనోహరగుంజిత రంజితశైలనికుంజగతే |
నిజగుణభూత మహాశబరీగుణ సద్గుణసంభృత కేలితలే |
జయ జయ హే మహిషాసురమర్ధిని రమ్యకపర్దిని శైలసుతే ||
కటితటపీతదుకూలవిచిత్ర మయూఖతిరస్క్రిత చంద్రరుచే|
ప్రణతసురాసుర మౌళిమణిస్పురదంశులసంనఖ చంద్రరుచే|
జితకనకాచల మౌళిపదోర్జిత నిర్భరకుంజర కుంభకుచే |
జయ జయ హే మహిషాసురమర్ధిని రమ్యకపర్దిని శైలసుతే ||
విజితసహస్ర కరైకసహస్ర కరైకసహస్ర కరైకనుతే |
క్రుతసురతారక సంగరతారక సంగరతారక సూనుసుతే |
సురతసమాది సమానసమాది సమాధి సమాధి సుజాతరతే |
జయ జయ హే మహిషాసురమర్ధిని రమ్యకపర్దిని శైలసుతే ||
పదకమలం కరుణానిలయే వరివస్యతి యోనుదినం శశివే |
అయి కమలే కమలానిలయే కమలానిలయః సకతం న భవేత్ |
తవ పదమేవ పరం పదమిత్యనుశీలయతో మమ కిం న శివే |
జయ జయ హే మహిషాసురమర్ధిని రమ్యకపర్దిని శైలసుతే ||
కనకలసత్కల సింధుజలైరనుసింజినుతే గుణరంగభువం |
భజతి స కిం న సచీకుచకుంభ తటీపరిరంభ సుఖానుభవం |
తవ చరణం శరణం కరవాణి నతామరవాణి నివాసిశివం |
జయ జయ హే మహిషాసురమర్ధిని రమ్యకపర్దిని శైలసుతే ||
తవ విమలేందుకులం వదనేందుమలం సకలం నను కూలయతే |
కిము పురుహూత పురీందుముఖీసుముఖీభిరసు విముఖీక్రియతే |
మమ తు మతం శివనామధనే భవతీ కృపయ కిముత క్రియతే |
జయ జయ హే మహిషాసురమర్ధిని రమ్యకపర్దిని శైలసుతే ||
అయి మయి దీనదయాలుతయ క్రుపయైవ త్వయ భవితవ్యముమే |
అయి జగతో జననీ క్రుపయాసి యథాసి తతానుమితాసిరతే |
యదుచితమత్ర భవత్యురరీకురుతాదురుతాప మపాకురుతే |
జయ జయ హే మహిషాసురమర్ధిని రమ్యకపర్దిని శైలసుతే ||

దేవాలయానికి వెళ్ళినపుడు పాటించవలసిన నియమలు

1)
తీర్ధము తీసుకొనునపుడు ౩సార్లు విడివిడిగా, ఒకదాని తర్వాత మరొకటి కలవకుండా పుచ్చుకొనవలెను. వెంటవెంటనే మూడుసార్లు ఒకేకాలమున తీసుకొనరాదు.
2)
ఒత్తిని నూనెలో తడిపి వెలిగించి, దానితో రెండు ఒత్తులను(దీపారాధన) వెలిగించాలి. ఉదయంపూట తూర్పు దిశగా రెండు ఒత్తులు ఉండేటట్లు దీపము యొక్క ముఖం ఉండాలి. సాయంత్రము పూట ఒక ఒత్తి తూర్పుగా, రెండవది పడమటగా ఉండాలి.
3)
శివునికి అభిషేకం,సూర్యునికి నమస్కారం, విష్ణువుకి అలంకారం, వినాయకునికి తర్పణం,అమ్మవారికి కుమ్కుమపూజ ఇష్టం. ఇవి చేస్తే మంచి జరుగుతుంది.
4)
ధైవప్రసాదాన్ని తినాలి కాని పారవేయరాదు.
5)
దీపమును నోటితో ఆర్పరాదు. ఒక దీపం వెలుగుచుండగా, రెండవదీపాన్ని మొదటిదీపంతో వెలిగించరాదు. దీపం వెలిగించగానే బయటకు వెళ్ళరాదు.
6)
దేవునిపూజకు ఉపయోగించు ఆసనం వేరొకపనికి వాడరాదు.
7)
దేవాలయానికి వెళ్ళినపుడు విగ్రహానికి ఎదురుగా నిలబడి నమస్కారం స్తోత్రములు చదవకూడదు. ప్రక్కగా నిలబడి చేతులు జోడించి నమస్కరించి వేడుకోవాలి.
8)
పురుషులు దేవునికి సాష్టాన్గానమస్కారం చేయవచ్చు.స్త్రీలు చేయరాదు. వారు మోకాళ్ళపై వంగి,నుదురును నేలకు ఆనించి నమస్కారం చెయ్యాలి.
9)
యుద్దమునకై శంఖమును పూరించుచున్న కృష్ణుడు మరియు ఒక్కడే నిలబడి వేణువు ఊదుతున్న కృష్ణుడు ఫోటో గాని,విగ్రహం గాని ఇంటిలో ఉండరాదు. మరియు ధ్యానం చేయుచున్న ఈశ్వరుడు,హనుమంతుడు ఫోటోలు ఉండరాదు. లక్ష్మీ దేవి కూర్చునిఉన్న ఫోటోగాని,విగ్రహంగాని ఉండాలి.నిలబడి ఉన్నది వాడరాదు.
10)
శివ లింగానికి, నందీశ్వరునికి మధ్యలో మనుష్యులు నడవరాదు.
11)
ఉదయం ,సాయంకాలం రెండు సార్లు దీపం పెట్టడం అలవాటు చేసుకోండి.
12)
తులసి దళములను పూజ చేయునపుడు దలములుగానే వెయ్యాలి.ఆకులుగా త్రుంచిన దోషము. మరు జన్మలో భార్యా వియోగము కలుగును. ఏ పుష్పములు అయినా త్రుంచి,ఆకులతో పూజించిన భార్యాభర్తలకు వియోగము సంభవించును.
13)
తాకుట వల్ల దోషము లేనివి:(అంటే అంటూ కానివి) తీర్దయాత్రలందు, పున్యక్షేత్రములందు, దేవాలయములందు,మార్గమునందు,వివాహ
మునండు,సభలందు,పడవలు,కార్లు,రైళ్ళు,విమానాలు మొదలగు వాహనాలలో
ప్రయానమందు స్పర్శ దోషం లేదు.
14)
ఆదివారం సూర్యుని ఆలయం, సోమవారం శివుడు(మరియు)గౌరిమాత ఆలయం, మంగళవారం) ఆంజనేయస్వామి, సుబ్రహ్మణ్యస్వామి ఆలయాలు,బుధవారం వినాయకుడు మరియు అయ్యప్పస్వామి ఆలయాలు, గురువారం సాయిబాబా, దత్తాత్రేయ, వెంకయ్యస్వామి మొదలగు గురువుల ఆలయాలు, శుక్రవారం అమ్మవారి ఆలయాలు, శనివారం వెంకటేశ్వరస్వామి
ఆలయాలు మరియు గ్రామదేవతల ఆలయాలు వారి వారి సంప్రదాయసిద్ధంగా దర్శించుట మంచిది.
15)
ఏ దేవాలయానికి వెళ్ళినా మొదట ధ్వజస్తంభాన్ని దర్శించాలి. శివాలయమునకు వెళ్ళినపుడు మొదట నవగ్రహాలను దర్శించి , ప్రదక్షిణాలు చేసి, కాళ్ళు కడుగుకొని తరువాత శివ దర్శనం చేసుకోవాలి. అదే విష్ణు ఆలయాలు (అనగా రాముడు,కృష్ణుడు,వెంకటేశ్వరస్వామి)
దర్శించినపుడు మొదట విష్ణుమూర్తిని దర్శించి తరువాత మిగతావారిని దర్శించాలి. మొదట పాదములను చూసి,తరువాత ఆపాదమస్తకము దర్శించాలి.
16)
నవ విధ భక్తి మార్గములు: శ్రవణం (వినటం), కీర్తనం(పాడటం), స్మరణము(మనసులో జపించుట), పాద సేవనము, అర్చన(పూజ),
నమస్కారము, దాస్యము(సేవ), సఖ్యము, ఆత్మనివేదనము(మనోనిగ్రహముతో సమర్పించుట) వీటిలో ఏ పద్ధతి ఐనను దేవునికి
ప్రీతికరము.
17)
జపములు మూడు రకములు.అవి: (ఏ) వాచకజపము:అందరికి
వినపడేలా బిగ్గరగా చేసేది. (బి) ఉపామ్సుజపం:ఎవరికి వినపడకుండా
పెదాలను కదుపుతూ చేసేది. (సి) మానసజపం: ఎవరికి వినపడకుండా , పెదాలు
కదపకుండా, మనసులో చేసేది. అన్ని జపాలలో కెల్లా మానసజపం ఉత్తమం,వాచకజపం సామాన్యం,ఉపంసుజపం మధ్యమం.
18)
స్త్రీలు ఓంకారాన్ని జపించకూడదు.
19)
ప్రదక్షిణాలు: వినాయకుని ఒకటి,ఈశ్వరునికి మూడు, అమ్మవార్లకు నాలుగు,విష్ణు మూర్తికి నాలుగు,మర్రిచేట్టుకి ఏడు ప్రదక్షిణాలు చెయ్యాలి

Thursday, June 25, 2015

నమ్మకద్రోహం

దేవీపురం జమీందారు దగ్గర మల్లయ్య నగదు వ్యవహారాలు చూసేవాడు. ఓసారి జమీందారు అతనికి వంద వజ్రాలు ఇచ్చి జాగ్రత్త చేయమన్నాడు. ఓరోజు రాత్రి దివాణంలో దొంగ ప్రవేశించి వజ్రాలు దొంగిలించాడు. మర్నాడు మల్లయ్య వచ్చి చూసేసరికి ఒకటే వజ్రం కనిపించింది. దొంగ హడావుడిలో దాన్ని వదిలేశాడని అర్థమైన మల్లన్నకి దురాశ పుట్టింది. వెంటనే దాన్ని తన తలపాగాలో దాచేసి, ఏమీ ఎరగనట్టు జమీందారు దగ్గరకు వెళ్లి చోరీ సంగతి చెప్పాడు. జమీందారు వెంటనే రక్షక భటులను నలుమూలలా పంపించాడు. కాసేపటికే ఆ దొంగ దొరికి పోయాడు. భటులు వాడిని జమీందారు దగ్గరకు తీసుకు వచ్చి సోదా చేస్తే వజ్రాల సంచీ కనిపించింది. అయితే అందులో 99 మాత్రమే ఉన్నాయి.
'ఏదీ మరో వజ్రం? బయటకి తియ్‌' అంటూ జమీందారు గద్దించాడు. ఆ దొంగ వణికి పోతూ 'నేను సంచీ విప్పి చూస్తే వజ్రాలు కనిపించాయి. వాటిని సంచీలో వేసుకుని పారిపోయానేగానీ, ఎన్ని ఉన్నాయో నాకు తెలియదు' అన్నాడు.
ఆ సమాధానం విన్న మల్లన్నకి వణుకు పుట్టింది. వెంటనే దొంగ దగ్గరకి వెళ్లి వాడి చెంప మీద కొట్టి 'నిజం చెప్పకపోతే వూరుకునేది లేదు' అంటూ దబాయించాడు. ఆ వూపులో అనుకోకుండా మల్లన్న తలపాగా కిందపడి వందో వజ్రం బయటకి దొర్లింది. జమీందారు సంగతంతా గ్రహించి, 'ఇద్దరూ దొంగలే. చెరో వంద కొరడా దెబ్బలు కొట్టి తరిమేయండి' అన్నాడు కోపంగా.
అది విన్న మల్లన్న మొండిగా, 'ఇది అన్యాయం. 99 వజ్రాల దొంగకి, ఒకటి తీసుకున్న నాకూ శిక్ష ఒకటేనా?' అని ఎదిరించాడు.
జమీందారు ఒక్క క్షణం ఆలోచించి 'సరే. నువ్వన్నట్టే శిక్ష మారుస్తాను' అంటూ దొంగవైపు తిరిగి, 'నువ్వు ఎన్ని దొంగిలించావు?' అని అడిగాడు.
'తొంభై తొమ్మిది' అన్నాడు దొంగ.
'అయితే నీకు 99 కొరడా దెబ్బలు' అన్న జమీందారు, ఆపై మల్లన్న వైపు తిరిగి, 'నువ్వు ఎన్నో వజ్రం దొంగిలించావు?' అని అడిగాడు.
'వందోది' అన్నాడు మల్లన్న. 'అయితే వందో దెబ్బ నీకు' అన్నాడు జమీందారు. అమ్మయ్య అనుకున్నాడు మల్లన్న.
భటులు ముందుగా దొంగకి తొంభై తొమ్మిది కొరడా దెబ్బలు కొట్టారు. మల్లన్న వెంటనే 'ఆ వందోది నాకు వేసేయండి' అన్నాడు. జమీందారు నవ్వి, 'వందో దెబ్బ తినాలంటే మొదట తొంభైతొమ్మిదీ భరించాలి కదా? కీలకమైన బాధ్యతలో ఉంటూ నమ్మకద్రోహం చేసిన నువ్వు ఆ దొంగ కన్నా ప్రమాదకారివి' అన్నాడు. మల్లన్న తెల్లబోయి మొత్తం వంద కొరడా దెబ్బలూ తిన్నాడు.

అనంత పద్యనాభుడి అనంత విశేషాలు !!!

కేరళ రాష్ట్రంలో రాజధాని నగరం తిరువనంతపురానికి మూడు-నాలుగు మైళ్ల దూరంలో "శ్రీ పద్మనాభ స్వామి దేవాలయం" వుంది. ప్రస్తుతం ఉన్న గోపురాన్ని మాత్రం 1566లోనే నిర్మించారు.
10008 సాల గ్రామాలతో రూపు దిద్దుకున్న ఈ ఆలయాన్ని ఆసాంతం చూడాలంటే వరుసగా మూడు ద్వారాలను దర్శించుకోవాల్సిందే. ఇక్కడ దీర్ఘ చతురస్రంగా వున్న వరండా నిర్మించడానికి 4000 మంది తాపీ పనివారు, 6 వేల మంది నిపుణులు, 100 ఏనుగులను ఉపయోగించి 7 నెలల్లో పూర్తిచేసారని అంటారు. ఈ దేవాలయ ప్రాంగణం 7 ఎకరాల వరకూ వుంటుంది. ప్రత్యేకమైన టేకుతో బంగారు కవచంతో తయారు చేయబడిన ఈ దేవాలయం ధ్వజ స్తంభం ఎత్తు 80 అడుగులు.
1750 ప్రాంతంలో ట్రావన్ కోర్ను పరిపాలించిన మార్తాండ వర్మ అనంతపద్మనాభ స్వామికి రాజ్యాన్ని అంకితం చేశాడు. ఇక నుంచి రాజులు అనంతపద్మనాభుని సేవకులుగా మాత్రమే రాజ్యాన్ని పరిపాలిస్తారని మార్తాండ వర్మ ప్రకటించారు. అప్పటి నుంచి ట్రావన్ కోర్ రాజులకు అనంత పద్మనాభ దాస అనే బిరుదు కూడా వచ్చింది. నేటికి ఈ ఆలయం ట్రావెన్ కోర్ రాజ కుటుంబీకుల ఆధీనంలోనే ఉంది.
ఆలయం నుంచి లభించిన అపార సంపద ట్రావన్ కోర్ రాజవంశం వారసులకు చెందుతుందని పలువురు అంటున్నా, రాజ వంశానికి చెందిన వారు మాత్రం ఆ సంపద అంతా అనంత పద్మనాభుడికే చెందుతుందనడం వారి అపార భక్తికి నిదర్శనం.
ఈ దేవాలయంలో దైవ దర్శనమంటే, ఆదిశేషుడి మీద శయనించి ఉన్న అనంత పద్మనాభుడి 18 అడుగుల మూర్తిని మూడు ద్వారాల నుంచి-ముఖాన్ని దక్షిణ ద్వారం నుండి, పాదాలను ఉత్తర ద్వారం నుండి, నాభిని మధ్య ద్వారం నుండి దర్శించు కోవడమే. 10008 సాలగ్రామాలతో రూపు దిద్దుకొని, అమూల్యమైన వజ్రాలు పొదిగిన ఆభరణాలు ధరించిన స్వామి ధగధగా మెరిసిపోతూ దర్శనం ఇస్తారు. ఆదిశేషుడిపై యోగనిద్రలో వుండే విగ్రహం ఎదుట వుండే మండపం పై కప్పు ఒకే ఒక్క గ్రైనేట్ రాయితో మలచింది.
శ్రీ మహావిష్ణువు యోగనిద్రా మూర్తిగా దర్శనం ఇచ్చే అనంత పద్మనాభ స్వామి ఆలయం అపురూప శిల్పకళకు నిలయం. ఆలయం లోని స్తంభాలపై అనేక రకాల శిల్పాలు చెక్క బడి వుంటాయి. శ్రీ మహావిష్ణువు కొలువుండే 108 పవిత్ర క్షేత్రాల్లో అనంతపద్మనాభ క్షేత్రం ఒకటి. విష్ణుమూర్తి ఇక్కడ మూడు భంగిమల్లో... శయన భంగిమలో యోగ నిద్రా మూర్తిగా, నిలుచొని, కూర్చొని దర్శనం ఇస్తారు.
ఆలయంలోకి హిందువులను మాత్రమే అనుమతిస్తారు. పురుషులు పంచె, ఉత్తరీయం, స్త్రీలు చీరె ధరించి స్వామి దర్శనం చేసుకోవాలి. ఈ ఆలయంలో ఈ సంప్రదాయాన్ని విధిగా పాటిస్తారు.
"పద్మ నాభ" అంటే పద్మం ఆకారంలో ఉన్న నాభి కల వాడని అర్థం. యోగ నిద్రా మూర్తిగా శయనించి ఉండగా, నాభి నుంచి వచ్చిన కమలంలో బ్రహ్మ ఆసీనుడై వున్న అనంత పద్మనాభ స్వామి దివ్య మంగళ రూపం, నయనానందకరంగా కనిపిస్తుంది భక్తులకు. శేషుడు మీద శయనించిన శ్రీ మహావిష్ణువు చేతి కింద శివ లింగం కూడా ఉంటుంది. ఈ విధంగా, ఆలయం, త్రిమూర్తులకు నిలయంగా వెలిసిపోతుంటుంది.
గర్భగుడితో పాటు గాలి గోపురం మీద కూడా అందమైన శిల్పాలు దర్శనం ఇస్తాయి.ఆలయం ముందు పద్మ తీర్థం అనే కోనేరు ఉంటుంది. ఆలయం లోపల 80 ధ్వజస్తంభాలు ఉండడం ఇక్కడి విశేషం. ఆలయ ప్రాంగణంలో ఉన్న బలిపీఠం మండపం, ముఖమండపాల్లో కూడా దేవతామూర్తుల అపురూప శిల్పాలు కనిపిస్తాయి.
ప్రధాన ఆలయ మండపం ఒక మహాద్భుతం. 365 రాతి స్తంభాలతో ఈ మండపాన్ని నిర్మించారు. ఈ రాతి స్తంభాలతో పాటు మండపం పై కప్పు మీద కూడా దేవతామూర్తుల శిల్పాలను అందంగా చెక్కడం విశేషం.
బ్రహ్మ, వాయు, వరాహ, పద్మ-నాలుగు పురాణాలలో ఈ దేవాలయం ప్రస్తావన వుంది. దేవాలయంలో ఇప్పుడున్న వంద అడుగుల-ఏడంతస్తుల గోపురం పునాదులు 1566 లోనే పడ్డాయి. "పద్మ తీర్థం" అనే విశాలమైన చెరువు సరస్సును ఆనుకుని వుంటుంది దేవాలయం. 365 గ్రానైట్ రాతి స్తంభాలతో కూడిన విశాలమైన దేవాలయ ప్రాకారం, తూర్పు దిశగా విస్తరించి, గర్భ గుడిలోకి దారితీస్తుంది. ప్రాకారం నుండి లోనికెళ్లే ప్రధాన ద్వారం ముందర ఎనభై అడుగుల జండా స్తంభం వుంది.
అనంత శయనుడి విగ్రహాన్ని రూపొందించడానికి వాడిన సాల గ్రామాలను, నేపాల్ లోని గండకి నది ఒడ్డునుంచి తెప్పించారు. సాల గ్రామాలను ఏనుగులపై వూరేగించుకుంటూ అక్కడకు తెచ్చారట. ప్రతి సాల గ్రామం పైన ప్రత్యేకమైన ఆయుర్వేద మిశ్రమంతో తయారుచేసిన పదార్థాన్ని, అతకడానికి వీలయ్యే ప్లాస్టర్ లాగా ఉపయోగించారట. క్రిమి కీటకాల నుంచి విగ్రహం కాపాడబడ్డానికి అలా చేశారంటారు.
ఒక్క ట్రావన్ కోర్ రాజు మినహా ఎవరికీ సాష్టాంగపడి ప్రణామం చేసే అర్హత లేదక్కడ. ఆ రాజులు మాత్రమే "పద్మనాభ సేవకులు" గా పిలువ బడుతారు.
శ్రీ మహావిష్ణువు కొలువుండే 108 పవిత్ర క్షేత్రాల్లో, మూడు భంగిమల్లో ఏదో ఒక భంగిమలో మాత్రమే స్వామి దర్శనమివ్వడం జరుగుతుంది. ఈ దేవాలయంలో మాత్రం, శయన భంగిమలో యోగ నిద్రా మూర్తిగా, నిలుచొని, కూర్చొని స్వామి దర్శనం ఇస్తారు స్వామి.
పద్మనాభ స్వామి విగ్రహం, ముఖం, ఛాతీ మినహా, పూర్తిగా బంగారంతో చేయ బడింది. ముస్లిం రాజుల దండయాత్రలలో విగ్రహాలను ధ్వంసం కాకుండా కాపాడుకోవడానికి ఆయుర్వేద మిశ్రమాన్ని పూతగా వాడేవారు. స్వామి కిరీటం, చెవులకున్న కుండలాలు, ఛాతీని అలంకరించిన భారీ సాల గ్రామ మాల, మొత్తం ఛాతీ భాగం, శివుడి విగ్రహం వున్న చేతికున్న కంకణం, కమలం పట్టుకున్న ఎడమ చేయి, నాభి నుండి బ్రహ్మ వున్న కమలం వరకున్న తీగ, స్వామి పూర్తి పాదాలు కూడా బంగారు మయమే.
కోట్లాది రూపాయల విలువగల అపార సంపద ఆ దేవాలయం నేల మాళిగలలో నిక్షిప్తమై వుందని అత్యున్నత న్యాయస్థానం దృష్టికి పోవడంతో, న్యాయమూర్తుల ఆదేశానుసారం, ఆ నిధి నిక్షేపాలను వెలికితీయడంతో…
లభ్యమైన సంపద అంతులేనిది, అపారమైనది.
ఆ మందిరం భూగర్భంలో వెలువడిన.., వెలువడుతున్న వెలకట్టలేని నిధులకు, ఏకంగా అంతరిక్ష పహారాతో పటిష్ఠమైన భధ్రతను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. గగన తలంలోని ఉపగ్రహ సేవలను ఇందుకోసం వినియోగించుకునేందుకు రంగం సిద్ధమవుతోంది.
సుమారు ఐదువేల సంవత్సరాల క్రితం అక్కడ కట్టబడిన, అత్యంత పురాతనమైన అనంత పద్మనాభుడి ఆలయం ఒకప్పుడు "ఎట్టువీట్టిల్ పిల్ల మార్" అనే ఎనిమిది కుటుంబాల వారి నిర్వహణలో వుండేది.
తర్వాతి కాలంలో ట్రావెన్ కోర్ సంస్థాపకుడైన కేరళ రాజు మార్తాండ వర్మ ఈ ఆలయాన్ని తన అధీనంలోకి తెచ్చుకుని, 1729 సంవత్సరంలో పునరుద్ధరించి, ఆలయానికి తామే సమస్తమంటూ ప్రకటించి, ఆలయంలోని శంఖాన్ని తమ సంస్థానానికి సంకేతంగా పెట్టుకున్నాడు.
తిరుమల ఆస్తులను మించి పోయిన తిరువనంతపురం పద్మనాభుడి సంపద ఎలా వచ్చిందన్న దాని పై ఎవరి వాదనలు వారే వినిపిస్తున్నారు. ఈ గదులకు వేసిన తాళాల తీరు, రాళ్లతో పకడ్బందీగా గదులను మూసి వేసిన వైనం, వాటిని తెరిపించిన కమిటీ సభ్యులను ఆశ్చర్య పరిచింది. ఒక్కో గది తాళాలు తీయడానికి చాలా సమయం పట్టినట్లు అధికారులు చెప్పారట.
అనంత పద్మనాభ స్వామి ఆలయ నేల మాళిగల్లోంచి బయటపడిన సొత్తు విలువ ఎంతనేది అప్రస్తుతం. ఆ సంపదంతా భగవంతుడు కే చెందాలి. దాని పరిరక్షణ ఉపయోగం, న్యాయ బద్ధంగా న్యాయ స్థానాల తీర్పు మేరకు నియమితులయ్యే, ట్రస్టీలే నిర్ణయించడం సమంజసం. ఇన్నాళ్లు, ఇంత పకడ్బందీగా, ఆ సొత్తును కాపాడుకుంటూ వస్తున్న, ని స్వార్థ ట్రావెన్ కోర్ రాజ వంశీయుల వారసులకే ఆ బాధ్యత అప్ప చెప్పడం హర్షణీయంగా వుంటుంది.
ఆ సంపదకున్న పురావస్తు ప్రాధాన్యతా దృష్టితో మాత్రమే దాన్ని చూస్తే, ఆ విలువ మరిన్ని రెట్లనడమే కాకుండా, బహుశా విలువ కట్టలేనిదని కూడా అనాల్సి వస్తుందేమో!
విలువ కట్టడానికి, ఆ సంపదేమన్నా బహిరంగ మార్కెట్లో అమ్మే అంగడి సరుకు కాదు కదా! అందుకే కేరళ రాష్ట్ర ముఖ్య మంత్రి అంతులేని ఆ వింత సంపదంతా పద్మనాభుడిదేనని తేల్చి చెప్పారు…
ఈ అధ్భుత విషయాలన్నింటిని మీరు కల్లారా చూడాలనుకుంటే అనంత పధ్మనాభుడి ధర్శనం చేసుకోవల్సిందే…

శివుడి పుష్పార్చన ఎలా చేయాలి? ఫలితం ఏమిటి?

నిత్యం మనం భగవంతునికి చేస్తున్న పూజలలో పుష్పాలదే అగ్రస్థానం. ఏ స్వామి పూజ అయినప్పటికీ, ఏ తల్లి పూజ అయినప్పటికీ, వారి వారి పూజలలో పుష్పాలకే ప్రాముఖ్యత. ఎన్నో పూజా ద్రవ్యాలుండగా, పుష్పాలకే ఎందుకు ఇంత ప్రాముఖ్యత అని అనిపించవచ్చు. పుష్పం యొక్క ముఖ్యత్వాన్ని అనేక గ్రంథాలు పేర్కొన్నాయి.
పుష్పామూలే వసేద్బ్రహ్మ మధ్యేచ కేశవః
పుష్పాగ్రేచ మహాదేవః సర్వదేవాః స్థితాదలే
పుష్పం మొదట్లో బ్రహ్మ, పుష్పమధ్యమంలో కేశవుడు, పుష్పపు కొనలో మహాదేవుడు నివశిస్తుంటారు. పుష్ప దళాలలో సర్వదేవతలుంటారని ప్రతీతి.
పరంజ్యోతిః పుష్పగతం పుష్పేణైవ ప్రసీదతి
త్రివర్గ సాధనం పుష్పం పుష్టిశ్రీ స్వర్గమోక్షదమ్
పువ్వులలో ఉన్న పరమాత్మ పువ్వులతోనే ప్రసన్నుడవుతుంటాడు. కాబట్టి పుష్పం త్రివర్గ సాధనం. అంటే సంపదలను, స్వర్గాన్ని, మోక్షాన్ని కలిగిస్తుంది.
పుష్పైర్దేవాః ప్రసీదంతి పుష్పేదేవాశ్చ సంస్థితాః
కించాతి బహునోక్తెన పుష్పస్యోక్తి మత్రంద్రికామ్.
పుష్పాలతో దేవతలు ప్రసన్నులవుతుంటారు. ఎందుకంటే వారు పుష్పాలలో నివశిస్తుంటారు. ఇంకా చెప్పాలంటే పుష్పాలలో చైతన్యం ఉంటుంది.
ఇక, మన పురాణాలలో ఒక్కొక్క దేవతకు ఇష్టమైన పువ్వులను గురించి కూడ ప్రస్తావించబడింది. విష్ణువుకు, దుర్గాదేవికి, వినాయకుని రకరకాల పుష్పాలతో పూజించ వచ్చని పేర్కొనబడగా, శివునికి మాత్రం మారేడు ప్రతిచాలన్నట్లుగా చదువుతుంటాం. ఈ విషయాన్నే శ్రీనాథ మహాకవి వర్ణించాడు.
శివుని శిరమున కాసిన్ని నీళ్ళుజల్లి
పత్తిరిసుమంత నెవ్వాడు పారవైచు
కామధేను వతడింట గాడిపసర
మల్ల సురశాఖి వానింట మల్లెచెట్టు
శివలింగంపై కాసిని నీళ్ళు చల్లి, మారేడు ప్రతిని శివలింగంపై పడవేసినప్పటికీ, ఆ భక్తుని ఇంట కామధేనువు ఇంటిపశువుగా ఉంటుంది. ఆ భక్తుని ఇంట కల్పతరువు మల్లెచెట్టుగా ఉంటుంది. అంతటి దయాసముద్రుడు శివుడు. మరి, అంతటి బోళాశంకరునికి మారేడు దళాలు తప్ప మరే పుష్పాలతో పూజించే అవకాశం లేదా?!
ఈ ప్రశ్నకు సమాధానం శివధర్మసంగ్రాహం, శివరహస్యఖండం, లింగపురాణం, కార్తీకమాహాత్మ్యం గ్రంథాలు చెబుతున్నాయి. శివునికి ఇష్టమైన పువ్వుల గురించి ఆ గ్రంథాలు ఇలా చెబుతున్నాయి.
శివుని పుష్పాలతో పూజిస్తే, పది అశ్వమేధ యాగాలు చేసిన ఫలం లభిస్తుంది. ఎవరైతే కనీసం ఎనిమిది పుష్పాలతో శివుని పూజిస్తారో వారికి కైలాసప్రాప్తి కలుగుతుంది. శివుని పూజకు ఉపయోగించే పువ్వులు వాదిపోయినవిగా ఉండ కూడదు. కీటకాడులతో కొరకబదినవిగా ఉండేవి శివ పూజకు పనికిరావు. అలాగే ఇతరుల పూదోటలో పూచిన పువ్వులను దొంగతనంగా తీసుకువచ్చి పూజిస్తే ఫలితం కనిపించదు. ఇంకా పాపం కలుగుతుంది.
శివపూజకు అరణ్యంలో పూచిన పువ్వులకు అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది. గన్నేరు, పొగడ, జిల్లేడు, ఉమ్మెత్త, కలిగొట్టు, పెద్దములక, తెల్లదింటెన, కట్లతీగ పువ్వులు, అశోకపువ్వు, మందారం, విష్ణుక్రాంత, జమ్మి, గులాబి, నెమ్మిపూలు, ఉత్తరేణి, తామర, జాజి, చెంగలువ, సంపెంగ, వట్టివేరు పూలు, నందివర్థనం, నాగకేసరం, పొన్న, పచగోరింట, తుమ్మి, మేడి, జయంతి, మల్లె, మోదుగ, మారేడు దళాలు, కుసుమపూవు, కుంకుమపూవు, ఎర్రకలువలు, నీలిపూలు శివపూజకు ప్రశస్తమైనవి. ఈ పుష్పాలతో ఏ పుష్పాన్ని సమర్పించినప్పటికీ శివ పరమాత్మ ఆనందంతో స్వీకరిస్తాడు. ఈ విషయాన్ని స్వామివారే ఉమాదేవికి చెప్పినట్లు పురాణవాక్కు.
అదేవిధంగా శివుని ఏయే మాసాలలో ఏయే పూలతో పూజిస్తే ఏయే ఫలితం ఉంటుందన్న విషయాన్ని గురించి కూడ చెప్పబడింది. చైత్రమాసంలో శంకరుని నృత్యగీతాలతో సేవిస్తూ, దర్భ పువ్వులతో పూజిస్తే బంగారం వృద్ధి చెందుతుంది. వైశాఖమాసంలో శివుని నేతితో అభిషేకిస్తూ తెల్లని మందారాలతో పూజిస్తే వారికి అశ్వమేధఫలం కలుగుతుంది.
జ్యేష్ఠ మాసంలో పెరుగుతో అభిషేకిస్తూ తామరపువ్వులతో పూజించిన వారికి పరమగతి కలుగుతుంది. ఆషాఢమాసంలో కృష్ణ చతుర్ధశినాడు స్నానం చేసి శివునికి గుగ్గిలంతో ధూపం వేసి తొడిమల తోడిమాలతో కూడిన పుష్పాలతో అర్చించినవారికి బ్రహ్మలోకాన్ని పరమపదం లభిస్తుంది. శ్రావణమాసంలో ఒంటి పూట భోజనం చేస్తూ గన్నేరుపూలతో శివుని పూజించినవారికి వేయిగోదానముల ఫలం లభిస్తుంది. భాద్రపద మాసంలో శివుని ఉత్తరేణి పూలతో పూజించిన వారు హంసధ్వజంతో కూడిన విమానంలో పుణ్యపదానికి చేరుకుంటారు. ఆశ్వయుజమాసంలో పరమశివుని జిల్లేడుపూలతో పూజించినవారు మయూర ధ్వజంతో కూడిన విమానంలో దివ్యపదాన్ని చేరుతారు.
కార్తీకమాసంలో శివుని పాలతో అభిషేకించి జాజిపూలతో పూజించినవారు శివపదాన్ని దర్శించుకుంటారు. మార్గశిర మాసంలో శివుని పొగడపూలతో పూజించినవారు, ముల్లోకాలను దాటి తామున్నచోటికే తిరిగిరాగలరు. పుష్యమాసంలో శివుని ఉమ్మెత్త పూలతో పూజించినవారు పరమ పదాన్ని పొందగలరు. మాఘ మాసంలో శివదేవుని బిల్వదళాలతో అర్చించినవారు, లేత సూర్యుడు, చంద్రుడులున్న విమాన,లో పరమపదానికి వెళతారు. ఫాల్గుణమాసంలో శివుని సుగంధజలంతో అభిషేకించి తుమ్మిపూలతో పూజించినవారికి ఇంద్రుని సింహాసనంలో అర్ధభాగం దక్కుతుంది.
ఇక, శివపూజలో ఒక్కొక్క పువ్వుతో పూజిస్తే, ఒక్కొక్క ఫలితం కలుగుతుంటుంది. శివుని రోజూ జిల్లేడు పువ్వులతో అర్చించేవారు బంగారాన్ని దానం చేసిననంత ఫలితాన్ని పొందుతారు.
శివపూజకు సంబంధించినంత వరకు వేయి జిల్లేడు పువ్వుల కంటే ఒక గన్నేరు పువ్వు ఉత్తమం.
వేయి గన్నేరు పూల కంటే ఒక మారేడు దళం ఉత్తమం.
వేయి మారేడు దళాలకంటే ఒక తామరపువ్వు ఉత్తమం.
వేయి తామరపువ్వుల కంటే ఒక పొగడపువ్వు ఉత్తమం.
వేయి పొగడపువ్వుల కంటే ఒక ఉమ్మేత్తుపువ్వు ఉత్తమం.
వేయి ఉమ్మెత్త పువ్వుల కంటే ఒక ములక పువ్వు ఉత్తమం.
వేయి ములక పూవుల కంటే ఒక తుమ్మిపూవు ఉత్తమం.
వేయి తుమ్మిపూవులకంటే ఒక ఉత్తరేణు పువ్వు ఉత్తమం.
వేయి ఉత్తరేణు పువ్వుల కంటే ఒక దర్భపువ్వు ఉత్తమం.
వేయి దర్భపూల కంటే ఒక జమ్మిపువ్వు శ్రేష్ఠం.
వేయి జమ్మి పువ్వుల కంటే ఒక నల్లకలువ ఉత్తమం అని సాక్షాత్తు శివ పరమాత్మే చెప్పాడు. శివపూజకు పువ్వులన్నింటిలోకి నల్లకలువపువ్వు ఉత్తమోత్తమమైనది. శివునికి వేయినల్ల కలువలతో మాలను అల్లి సమర్పించినవారు, శివునితో సమమయిన పరాక్రమంగలవారై వందల, వేలకోట్ల కల్పాలు నిత్యకైలాసంలో నివశిస్తారు. ఈ పుష్పమాలతో కాక మిగతా పుష్పాలతో పూజించే భక్తులు కూడా ఆయా పుష్పాలకు సంబంధించిన ఫలితాలను పొందుతారు.
పరమశివునికి పొగడపూలంటే అమితమైన ఇష్టం. ఆ స్వామిని ప్రతిదినం ఒక పొగడపువ్వుతో అర్చించే భక్తుడు వేయిగోవులను దానం చేసిన ఫలితాన్ని పొందుతాడు.
ఒక నెలపాటు పొగడపూలతో పూజించినవారు స్వర్గ సుఖాలను పొందుతారు. రెండునెలలపాటు పూజించిన వారు యజ్ఞం చేసినంత ఫలితాన్ని పొందుతారు. మూడు నెలల పాటు పొగడపూలతో అర్చించినవారికి బ్రహ్మలోక ప్రాప్తి. నాలుగు నెలలు పూజించినవారికి కార్య సిద్ధి. ఐదు నెలలు పూజించినవారికి యోగసిద్ధి. ఆరు నెలలు పూజించినవారికి రుద్రలోక ప్రాప్తి కలుగుతుంది.
సాధారణంగా శివునికి బిల్వపత్రాలే ప్రీతిపాత్రమైనవి. మిగతా పత్రాలు ప్రీతికరం కావని అనుకుంటుంటాం. లింగపురాణం ఆ స్వామికి ఇషామైన మరిన్ని పత్రాలను గురించిన వివరాలను అందిస్తోంది. మారేడు, జమ్మి, గుంట గలగర, అడ్డరసము, అశోకపత్రాలు, తమాలము, చీకటి చెట్టు, ఉలిమిడి, కానుగు, నేల ఉసిరి, మాచీపత్రి, నల్ల ఉమ్మెత్త, తామరాకు, నీతికలువ, మెట్టకలువ ఆకులు, సంపెంగ పత్రి, తుమ్మి, ఉత్తరేణి ఆకులను పత్రాలను పూజలో ఉపయోగించవచ్చు. అంటే, ఆయా పుష్పాలు లభించనపుడు, ఆయా పత్రిని ఉపయోగించవచ్చు.
ఇక పుష్పదానానికి సంబంధించినంతవరకు, పుష్పాన్ని గాని, ఫలాన్నిగాని దైవానికి నివేదిస్తున్నప్పుడు ఆ పుష్పం ముఖం బోరగిలబడకూడదు. అలా చేయడంవల్ల దుఃఖం కలుగుతుంది. అయితే ఆ పుష్పాలను లేక పత్రిని దోసిట్లో పెట్టుకుని నివేదించేటప్పుడు బోర్లాపడినప్పటికీ దోషం కాదు. ఉమ్మెత్త, కడిమిపువ్వులను శివునికి రాత్రివేళ సమర్పించాలి. మిగిలిన పూలతో పగిటిపూట. మల్లెలతో రాత్రివేళ, జాజి పూలతో మూడవజామున, గన్నేరుతో అన్నివేళలా పూజించవచ్చు.
ఇప్పటివరకు మనం ఏయే పూలతో శివుని పూజిస్తే ఏయే ఫలితాలు కలుగుతాయో తెలుసుకున్నాం. అయితే మన మనసులోని కోరికననుసరించి కూడ శివునికి పువ్వులను సమర్పించవచ్చు. ఉదాహరణకు ధనం కావాలను కున్నవారు శివుని గన్నేరుపూలతో, మోక్షం కావాలంటే ఉమ్మెత్తపూలతో, సుఖశాంతుల కోసం నల్లకాలువతో, చక్రవర్తిత్వం కోసం తెల్లతామరలతో, రాజ్యప్రాప్తి కోసం ఎర్రతామరలతో, నాగకేసరం, కేసరీపుష్పాలతో అనుకున్న కోరికలు నెరవేరుతాయట. గన్నేరు, అశోకం, ఊడుగు, తెల్లజిల్లేడులతో పూజించిన వారికి మంత్రసిద్ధి, రోజాపుష్పాలతో లాభాసిద్ధి, దంతి ప్రత్తి పూలతో సౌభాగ్యం కలుగుతుంది. కోరుకున్న కన్యను పొందాలంటే శివుని సన్నజాజి పూలతో పూజించాలి. సంతానం కావాలనుకునేవారు శివుని మొల్లపువ్వులతో పూజించాలి. దర్భపూలతో ఆరోగ్యం, రేలపూలతో ధనం, తుమ్మిపూలతో వశీకరణం, కడిమిపూలతో శత్రుజయం కలుగుతుంది. బిల్వదళ పూజ దారిద్ర్యాన్ని తొలగిస్తుంది. శివుని మరువంతో పూజిస్తే సుఖం, లోద్దుగపూలతో పూజిస్తే గోసంపద కలుగుతుంది. మోదుగ, బూరుగు పూలతో పూజిస్తే ఆయుర్వృద్ధి కలుగుతుంది.
ఇక, శివపూజకు పనికిరాని పువ్వుల గురించి మన పురాణ గ్రంథాలు పేర్కొన్నాయి.
మొగిలి, మాధవి, అడవిమల్లి, సన్నజాజి, దిరిసెన, సాల, మంకెన పువ్వులు శివార్చనకు పనికిరావు. బావంచి ఆకులు, పువ్వులు, కానుగపూలు, తాండ్ర ఆకులు, దాసాని, ఎర్రమద్ది, మందార, విషముష్టి, అడవిమొల్ల, తెల్ల విష్ణుక్రాంత, ఎర్ర, తెల్ల గులాబీలు, దిరిసెన పువ్వులు శివపూజకు పనికిరావు. వేప, వెలగ, గురివింద పూలు కూడా శివపూజకు అర్హం కావు.
దశసౌగంధికం పుష్పం నిర్గంధియది భామిని
శాతసాహస్రి కామాలా అనంతం లింగపూజసే
పది సుగంధపుష్పాలతో (ఒకవేళ పరిమళం లేకపోయిన వైనప్పటికీ) శివలింగాన్ని పూజిస్తే, శతసహస్రమాలలతో పూజించిన అనంత పుణ్యఫలం లభిస్తుందని శివధర్మ సంగ్రహం చెబుతోంది

Tuesday, June 23, 2015

కల్పం అంటే 72 మహాయుగాలు.

మహాయుగం అంటే కృత, త్రేతా ద్వాపర, కలియుగాలు..
4,32,000
సంవత్సరాలు కలియుగం. దీనిని రెండుతో హెచ్చవేస్తే
4,32,000 X 2 = 8,64,000, ద్వాపరయుగం. కలియుగాన్ని 3తో గుణిస్తే
4,32,000 X 3 = 12,96,000 త్రేతాయుగం.

కలియుగాన్ని 4తో గుణిస్తే
4,32,000 X 4 = 17,28,000 సత్య లేక కృతయుగం అంటారు..
ఈ యుగాలు అన్ని గుణిస్తే 43,20,000 సంవత్సరాలు కలిపి ఒక మహాయుగం..
ఇలాంటి మహాయుగాలు 72 కలిస్తే ఒక కల్పం అవుతుంది.
311040000
సంవత్సరాలు ఒక కల్పం. ఇది బ్రహ్మ గారికి ఒక
పగలు. ఇంతే సమయం ఒక రాత్రి.
మనం ఇప్పుడు చెప్పుకుంటున్న అవతారాలు ఒక మహాయుగంలో వచ్చినవి కావు. ఇప్పటి వరకు వచ్చిన అవతారాలు 28 మహాయుగాలలో వచ్చాయి. మత్స్యావతారం కల్పం చివరి నుండి కల్పం మొదలయ్యేవరకు
ప్రళయకాలంలో సాగింది.
దీని తరువాత వరాహ అవతారం ఇది మొదటి
మహాయుగంలో జరిగింది. మత్స్యావతారం 3వ మహాయుగంలో జరిగింది.
రామావతారం 24వ మహాయుగంలో
జరిగింది. రామసేతువు వయస్సు ఇప్పటికి 4 మహాయుగాలు దాటింది. అంటే
సుమారుగా చెప్పాలంటే
43,20 000 X 4 = 1,72,80,000
సంవత్సరాలు గడిచింది.
దీనికి 8,64,000 ద్వాపరయుగం + 5116
సంవత్సరాలు కలియుగం కూడా కలుపుకుంటే ఇంచుమించుగా వస్తుంది. అంటే రామసేతు
నిర్మించి 1,81,49116 సంవత్సరాలు గడిచింది.
త్రేతాయుగంలో ఎప్పుడు కట్టారో మనకి తెలియదు కనుక సరిగ్గా చెప్పలేం. మరలా శ్రీకృష్ణుల వారు 28వ ద్వాపర కలియుగాల సంధి కాలంలో అవతరించారు.
ప్రస్తుతం మనం28 వ మహాయుగంలో ఉన్న కలియుగంలో మొదటి పాదంలో ఉన్నాం. ప్రతి
మహాయుగానికి ఒక ఇంద్రుడు మారతాడు. అలాగే ఒక కల్పానికి 7గురు మనువులు ఉంటారు.
ప్రస్తుతం సూర్యుడి పుత్రుడు వైవస్వత మనువు కాలంలో ఉన్నాం. ఇతని తదనంతరం సూర్యుడి రెండో భార్య చ్ఛాయాదేవి కుమారుడు
మనువు అవుతాడు.

విగ్రహాలముందు నేరుగా నిలబడి ప్రార్థించకూడదు..! ఎందుకు?

సాధారణంగా ప్రతిఒక్కరు ఉదయాన్నే లేవగానే ముందుగా తమ ఇష్టదైవాన్ని ప్రార్థించుకుని, ఇంట్లో పూజా కార్యక్రమాలను నిర్వహించుకుంటారు.
మరికొందరు ఉదయాన్నే లేవగానే శుభ్రంగా స్నానం చేసుకుని, దేవాలయాలకు వెళుతుంటారు. కానీ చాలామంది ఇలా నేరుగా దేవాలయాలకు వెళ్లి దేవతలను ప్రార్థించుకోవడం
ద్వారా మానసిక శాంతి లభిస్తుందని ప్రతిఒక్కరు విశ్వసిస్తారు.

పైగా దేవుడిని ఏవైనా కోరికలు కోరినా, అవి వెంటనే నెరవేరుతాయనే నమ్మకంతో భక్తులు
ఎక్కువగా దేవాలయాలకు వెళ్లడానికి మక్కువ చూపిస్తారు. అయితే దేవాలయాలకు వెళ్లినప్పుడు అక్కడ కొన్ని నియమనిబంధనలు,
శాస్త్రాలప్రకారంకొన్ని ఆచారాలను పాటించాల్సి ఉంది.
ఎందుకంటే.. సహజంగా ప్రతిఒక్కరు దేవుడిని ప్రార్థించుకోవడానికి విగ్రహానికి
నేరుగా నిలబడతారు. కోరిన కోరికలు త్వరగాతీరాలనే కాంక్షతో విగ్రహానికి
ముందుగా నిటారుగా నిలబడిపోతారు. కానీ ఇలా చేయడం మంచిది కాదని
సూచిస్తున్నారు పండితులు.
దేవతా విగ్రహానికి సూటిగా కాకుండా.. కాస్త ఎడమ లేదా కుడివైపున నిలబడి దేవుడిని ప్రార్థించుకోవడం ద్వారా దేవానుగ్రహం
లభిస్తుంది.
అదెలా అంటే.. దేవతావిగ్రహాల నుంచి వెలువడే దైవకృపా శక్తి’ తరంగాల రూపంలో ప్రవహిస్తూ, భక్తుని దగ్గరకు చేరుకుంటాయి. అటువంటి సమయంలో మానవదేహం సూటిగా విగ్రహానికి నిలబడితే.. ఆ దివ్యకిరణాలను తట్టుకోవడం అసాధ్యం.
కొన్ని సందర్భాలలో అది హానికరంగా మారవచ్చు. కాబట్టి విగ్రహాలకు సూటిగా కాకుండా.. ఎడమ లేదా కుడివైపున నిలబడి ప్రార్థిస్తే.. దైవానుగ్రహం లభిస్తుంది.అదేవిధంగా
దేవుడిని ప్రార్థించే సమయంలోరెండు చేతులను జోడించి, భక్తిశ్రద్ధలతో స్మరించుకోవాలి.
ఇలా జోడించడం వల్ల మెదడుకు ప్రాణశక్తి లభిస్తుంది. దాంతో శారీరకబలం, బుద్ధిబలం, ఆత్మవిశ్వాసంతోపాటు ఎంతో ఆరోగ్యకరంగా
కూడా వుంటారు.

లేపాక్షి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అనంతపురం జిల్లాకు చెందిన ఒక చారిత్రక పట్టణమే లేపాక్షి. ఇది బెంగళూరుకు 120 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే హైదరాబాదు, బెంగళూరు రోడ్డుకు ఎడమవైపు నుంచి 16 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ లేపాక్షి ఊరిలోకి ప్రవేశించగానే... అతిపెద్ద ఏకశిలా నంది విగ్రహం ఠీవిగా కూర్చున్న భంగిమలో మనకు ఆహ్వానం పలుకుతుంది. పురాతత్వశాఖవారి లెక్కల ప్రకారం ఈ లేపాక్షి బసవన్న 8.1 మీటర్ల పొడవు, నాలుగన్నర మీటర్ల ఎత్తుతో మహా లింగానికి ఎదురుగా కూర్చుని ఉంటుంది.
ఇది భారతదేశంలోనే అతిపెద్ద నంది శిల్పంగా పేరుగాంచింది. తంజావూరు బృహదీశ్వరాలయం, మైసూరులోని చాముండి హిల్, బెంగళూరులోని బసవనగుడిలలో ఉండే నంది విగ్రహాలకంటే, లేపాక్షి విగ్రహమే పెద్దది. మంచి ఆరోగ్యంతో ఉండే చక్కటి కోడెగిత్త విగ్రహమే లేపాక్షి. గంటలు, లోహపు బిళ్లలతో కూడిన పట్టీలు మొదలైన ఎన్నో అలంకరణలు ఉన్నప్పటికీ, ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది మాత్రం నంది మెడలో కనిపించే రెండు గరుడ పక్షులు, వాటి ముక్కుల్లో వేలాడే ఏనుగులే. ఇది ఆ పక్షుల శక్తిని, పరిమాణాన్ని సూచిస్తుంది.
ఆ పేరెలా వచ్చిందంటే...? సీతమ్మతల్లిని రావణుడు చెరబట్టి తీసుకెళ్తుంటే, ఆమెను కాపాడబోయి గాయపడ్డ జటాయువును చూసిన శ్రీరామచంద్రుడు లే పక్షీ అని పిలిస్తే, జటాయువు లేచి నిలుచుందని, అందుకే ఈ స్థలానికి లేపాక్షి అనే పేరు వచ్చిందని చెబుతుంటారు. అలాగే నంది కుడి ఎడమపక్కలలో నృసింహస్వామి ముఖం చెక్కబడి ఉంటుంది. విగ్రహం కుడివైపున నిలబడి నంది దృష్టిలోంచి చూస్తే వీరభద్రాలయంలోని నాగరాజు ఏడు పడగల విగ్రహం కొంత స్పష్టతతో కనిపిస్తుంది. విజయనగర రాజుల కాలంలో నిర్మించబడిన వీరభద్రాలయం గోడలమీద, పైకప్పుమీద అనేక కుడ్య చిత్రాలు మనోహరంగా వ్రాయబడి ఉన్నాయి. ఇక్కడి ముఖ్య విశేషమే లేపాక్షి బసవన్న. వీరభద్రాలయం కూర్మశిల అనే కొండమీద నిర్మించబడింది. కొండ ఆకారం తాబేలు రూపంలో ఉండటం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది. విజయనగర ప్రభువుల కాలంలో లేపాక్షి పెద్ద వాణిజ్య కేంద్రంగానూ, యాత్రాస్థలంగానూ విలసిల్లింది.
అచ్యుతదేవరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని క్రీ.శ. 1530 నుంచి క్రీ.శ. 1542 వరకూ పరిపాలించాడు. ఈయన కాలంలో వీరభద్రాలయ నిర్మాణం జరిగినట్లుగా, ఆలయ గోడల్లోని రాతలు ధృవపరుస్తున్నాయి. ఇక లేపాక్షికి ఆ పేరెలా వచ్చిందంటే.. సీతమ్మతల్లిని రావణుడు చెరబట్టి తీసుకెళ్తుంటే, ఆమెను కాపాడబోయి గాయపడ్డ జటాయువును చూసిన శ్రీరామచంద్రుడు లే పక్షీ అని పిలిస్తే, జటాయువు లేచి నిలుచుందని, అందుకే ఈ స్థలానికి లేపాక్షి అనే పేరు వచ్చిందని చెబుతుంటారు. మరో కథ ప్రకారం చూస్తే... అచ్యుతరాయలు కోశాధికారి విరూపణ్ణ రాజు అనుమతి లేకుండా ప్రభుత్వ ధనంతో ఆలయ నిర్మాణం చేపట్టాడు. నిర్మాణం చాలా వరకూ పూర్తయి, కళ్యాణ మంటపం నిర్మాణం జరుగుతున్న సమయంలో రాజుగారికి ఈ విషయాన్ని విరూపణ్ణ వ్యతిరేకులు చేరవేసారు. దీంతో విరూపణ్ణ ముందుగానే రాజు విధించబోయే శిక్షను తనకు తానుగా విధించుకుని రెండు కళ్లనూ తీసివేసి కళ్యాణ మంటపం దక్షిణవైపున ఉండే గోడకు విసిరి కొట్టాడట. అలా కళ్లు విసిరికొట్టిన ఆనవాళ్ళుగా అక్కడి గోడపైనుండే ఎర్రటి గుర్తులను స్థానికులు చూపుతుంటారు కూడా. అలా లోప- అక్షి (కళ్లు లేని) అనే పదాల ద్వారా ఏర్పడిందే లేపాక్షి అని చెబుతారు. లేపాక్షికి 200 కిలోమీటర్ల దూరంలో మధ్యయుగాలనాటి నిర్మాణ కళతో కూడిన ఒక పురాతన శివాలయం నెలకొని ఉంది. ఈ ఆలయంలో దాదాపు ముప్పై అడుగుల ఎత్తు ఉండే శివలింగాన్ని పెద్ద పాము చుట్టుకుని ఉన్నట్లుగా ఉండే శివలింగం ఉంటుంది. ఇంకా ఈ ఆలయంలో చక్కటి శిల్పకళా చాతుర్యంతో కూడిన స్తంభాలు, మండపాలు, అనేక శివలింగాలు ఉంటాయి. ఈ ఆలయంలో ఇప్పటికీ పూజలు నిర్వహిస్తుంటారు కూడా...! లేపాక్షికి వెళ్ళాలంటే... హిందూపురం నుండి ప్రతిగంటకు బస్సులు వున్నాయి.
ఇక వసతి విషయానికి వస్తే, అక్కడో టూరిస్టు గెస్ట్‌హౌస్ కూడా కలదు. ఇదిలా ఉంటే... లేపాక్షి వీరభద్ర ఆలయంలోని శిల్పాలలో ఎక్కువభాగం పాక్షికంగా దెబ్బతిని కనిపిస్తాయి. ఈ విషయంలో పెద్దగా జాగ్రత్తలేవీ తీసుకున్న ఆనవాళ్లు కనిపించవు. ఇకనైనా ఏపీ టూరిజం శాఖవారు మేల్కొని లేపాక్షి శిల్ప, చిత్ర సంపదలను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Monday, June 22, 2015

ఆలయాల్లో అభిషేకాలు ఎందుకు చేస్తారు.? ఫలితాలేంటి?

ఆలయాల్లోని విగ్రహాలకు అభిషేకాలు చేస్తారు. అభిషేకాల ద్వారా ఆలయాల్లో శుద్ధి చేయడం పరిపాటి. అభిషేకాలకు పలు వస్తువులు, పదార్థాలను ఉపయోగిస్తారు. ఆలయాల్లో జరిగే అభిషేకాలకు వస్తువుల్ని, వివిధ పదార్థాలను సమర్పించుకునే వారికి సకల సంపదలు చేకూరుతాయని విశ్వాసం.
ఆలయాల్లో జరిగే అభిషేకాల ద్వారా లభించే ఫలితాలేంటో పరిశీలిస్తే..
నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే సుఖసంతోషాలు చేకూరుతాయి.
ఆవుపాలతో అభిషేకం చేయిస్తే ఆయుర్దాయం పెరుగుతుంది.
ఆపు పెరుగుతో అభిషేకం చేయిస్తే సంతాన వృద్ధి చేకూరుతుంది.
పంచదారలో అభిషేకం చేయిస్తే శత్రువులు నశిస్తారు.
విభూతితో అభిషేకం చేయిస్తే భోగభాగ్యాలు, మోక్షం సిద్ధిస్తుంది
శంఖువు ద్వారా నీటితో అభిషేకం చేయిస్తే శత్రు భయం ఉండదు.
చందనం, పనీర్‌లను కలిపి అభిషేకం చేస్తే సిరిసంపదలు వెల్లివిరుస్తాయి.
కలశ జలంతో అభిషేకం చేస్తే కార్యానుసిద్ధి చేకూరుతుంది.
మామిడి పండుతో అభిషేకం చేయిస్తే అనుకున్న కార్యాల్లో విజయం సొంతమవుతుంది.
స్వర్ణాభిషేకం చేయిస్తే లాభాలు చేకూరుతాయి.
పంచామృతం (కలకండ, పంచదార, నెయ్యి, పండ్లు, తేనె)తో అభిషేకం చేయిస్తే అష్టైశ్వర్యాలు లభిస్తాయి.
కొబ్బరి బొండాంతో అభిషేకం చేస్తే కుటుంబంలో కలహాలుండవు.
చందనంతో అభిషేకం ద్వారా ఐశ్వర్యం చేకూరుతుంది
పచ్చిబియ్యం పిండితో అభిషేకం చేస్తే అప్పుల బాధ తీరిపోతుంది.
చక్కెర రసంతో అభిషేకం చేయిస్తే ఆరోగ్యం చేకూరుతుంది.
తేనెతో అభిషేకం సుఖసంతోషాలను ప్రసాదిస్తుంది.
అరటి పండుతో అభిషేకం సుఖమయ జీవితాన్ని ప్రసాదిస్తుంది.
అన్నంతో అభిషేకం చేస్తే రాజభోగాలు చేకూరుతాయి.
సుగంధ ద్రవ్యాలతో అభిషేకం సర్వసంతోషాలను ప్రసాదిస్తుంది.
నిమ్మరసంతో అభిషేకం చేస్తే పగ తీరుతుంది.
ఏ రోజున ఏ దేవుడికి అభిషేకం చేయాలి?
వినాయకుడు - ఆదివారం
పరమేశ్వరుడు - సోమవారం
సుబ్రహ్మణ్య స్వామి - మంగళవారం
విష్ణుమూర్తి - బుధవారం
గురు భగవానుడు. సాయి నాథునికి - గురువారం
అమ్మవారికి - శుక్రవారం
శ్రీ కృష్ణుడికి - శనివారం
నవగ్రహాలకు - ఆదివారం
దుర్గాదేవికి - మంగళవారం అభిషేకాలు చేయించాలని పురోహితులు చెబుతున్నారు

112 శక్తి పీఠాలు

పరమేశ్వరుడు పరాశక్తితో వీటన్ని౦టా సన్నిధి చేసి ఉ౦టాడు. వీటిని స్మరి౦చినా, విన్నా భక్తులకు పాపాలు తొలగి ముక్తి లభిస్తు౦ది. అష్టోత్తర శతనామాలను జపి౦చినా, పుస్తకాన్ని ఇ౦ట్లో ఉ౦చుకున్నా దుష్టగ్రహ పీడలన్నీ తొలగిపోతాయి. శ్రాధ్ధ కాల౦లో వీటిని స్మరి౦చినయెడల పితృదేవతలు స౦తృప్తి చె౦దుతారు. ఇవి సాక్షాత్తు ముక్తి క్షేత్రాలు.
108 శక్తి పీఠాలు:
1::వారణాసిలో విశాలాక్షి
2::ముఖనివాస౦లో గౌరి
3::నైవిశ౦లో లి౦గధారిణి
4::ప్రయాగలో లలిత
5:గ౦ధమాదన౦ మీద కౌముకి
6::మానస క్షేత్ర౦లో కుముద
7::దక్షిణ క్షేత్ర౦లో విశ్వకామ
8::ఉత్తర క్షేత్ర౦లో విశ్వకామప్రరూపిణీ
9::గోమ౦త౦లో గోమతి
10::మ౦దర౦లో కామచారిణీ
11::చైత్రరథ౦లో మదోత్కట
12::హస్తినాపుర౦లో జయ౦తి
13::కన్యాకుబ్జ౦లో గౌరి
14::మలయాచల౦పై ర౦భ
15::ఏకామ్ర పీఠ౦లో కీర్తిమతి
16::విశ్వక్షేత్ర౦లో విశ్వేశ్వరి
17::పుష్కర క్షేత్ర౦లో పురుహూతిక
18::కేదార౦లో సన్మార్గదాయిని
19::హిమాలయ౦లో మ౦ద
20::గోకర్ణ౦లో భద్రకర్ణిక
21::స్థానేశ్వర౦లో భవాని
22::బిల్వక్షేత్ర౦లో బిల్వపత్రిక
23::శ్రీశైల౦లో మాధవి
24::భద్రేశ్వర౦ భద్ర
25::వరాహాశైల౦మీద జయ
26::కమలాయ౦లో కమల
27::రుద్రకోటిలో రుద్రాణీ
28::కాల౦జర క్షేత్ర౦లో కాళి
29::శాలగ్రమ౦లో మహాదేవి
30::శివలి౦గక్షేత్ర౦లో జలప్రియ
31::మహాలి౦గ౦లో కపిల
32::మాకోట క్షేత్ర౦లో ముకుటేశ్వరి
33::మాయాపురిలో కుమారి
34::స౦తానక్షేత్ర౦లో లలితా౦బిక
35::గయాక్షేత్ర౦లో మ౦గళాదేవి
36::పురుషోత్తమ పుర౦లో విమలాదేవి
37::సహస్రాక్ష౦లో ఉత్పలాక్షి (సిధ్ధ పీఠాలు)
38::హిరణ్యాక్ష౦లో మహోత్పల
39::విశాపా క్షేత్ర౦లో అమోఘాక్షి
40::పు౦డ్రావర్ధన౦లో పాడల
41::సుపార్శ్వ౦లో నారాయణి
42::త్రికూట౦లో రుద్రసు౦దరి
43::విపులక్షేత్ర౦లో విపులాదేవి
44:మలయాచల౦ మీద కళ్యాణి
45::సహ్యాద్రి మీర ఏకవీర
46::హరిశ్చ౦ద్ర క్షేత్ర౦లో చ౦ద్రిక
47::రామతీర్ఠ౦లో రమణ
48::యమునలో మృగావతి
49::కోటతీర్థ౦లో కోటవి
50::మాధవవన౦లో సుగ౦ధ
51::గోదావరిలో త్రిస౦ధ్య
52::గ౦గాతీర౦లో రతిప్రియ
53::శివకు౦డ౦లో శుభాన౦ద
54::దేవికాతట౦లో న౦దినీదేవి
55::ద్వారవతిలో రుక్మిణీ
56::బృ౦దావన౦లో రాధ
57::మధురలో దేవకి
58::పాతాళ౦లో పరమేశ్వరి
59::చిత్రకూట౦లో సీత
60::వి౦ధ్యపర్వత౦పై వి౦ధ్యావాసిని
61::కరవీరదేశ౦లో మహాలక్ష్మి
62::వినాయకక్షేత్ర౦లో ఉమాదేవి
63::వైద్యనాథ౦లో ఆరోగ్య
64::మహాకాళక్షేత్ర౦లో మహేశ్వరి
65::ఉష్ణతీర్థ౦లో అభయ
66::వి౦ధ్యపర్వత సానువుల్లో నిత౦బ
67::మా౦డవ్య౦లో మా౦డవి
68::మహేశ్వరపుర౦లో స్వాహాదేవి
69::ఛాగల౦డభూమిలో ప్రచ౦డ
70::అమరక౦టక౦లో చ౦డిక
71::సోమేశ్వర౦లో వరారోహ
72::ప్రభాసతీర్థ౦లో పుష్కరావతి
73::సరస్వతిలో దేవమాత
74::తట౦లో పారావారాదేవి
75::మహాలయ౦లో మహాభాగ
76::పయోష్ణిలో సి౦గలేశ్వరి
77::కృతశాచ౦లో సి౦హిక
78::కార్తీక౦లో అతిశ౦కరి
79::ఉత్పలావర్తక౦లో లోలాదేవి
80::శోణస౦గమక్షేత్ర౦లో సుభద్ర
81::సిధ్ధవన౦లో లక్ష్మీమాత
82::భరతాశ్రమ౦లో విశ్వముఖి
83::కిష్కి౦ధపర్వత౦పై తారాదేవి
84::దేవదారువన౦లో పుష్టి
85::కాశ్మీర౦లో మేధాదేవి
86::హిమాద్రిలో భీమాదేవి
87::హిమాద్రిలో తుష్టి, విశ్వేశ్వరి
88::కపాలమోచనక్షేత్ర౦లో శుధ్ధి
89::కాయావరోహణ౦లో మాత
90::శ౦ఖోధ్ధార౦లో ధరాదేవి
91::పి౦డాకార౦లో ధృతి
92::చ౦ద్రభాగాతీర్థ౦లో కళాదేవి
93::అచ్ఛోద౦లో శివధారిణీ
94::వేణాక్షేత్ర౦లో అమృతాదేవి
95::బదరీక్షేత్ర౦లో ఊర్వశి
96::ఉత్తరకురుక్షేత్ర౦లో ఔషధి
97::కుశద్వీప౦లో కుశోదక
98::హేమకూట౦లో మన్మధ
99::కుముదక్షేత్ర౦లో సత్యవాదిని
100::అశ్వత్థ౦లో వ౦దనీయ
101::వైశ్రవణ౦లో నిధి
102::వేదవదన౦లో గాయత్రి
103::శివసన్నిధిలో పార్వతి
104::దేవలోక౦లో ఇ౦ద్రాణి
105::బ్రహ్మవదన౦లో సరస్వతి
106::సూర్యబి౦బ౦లో ప్రభ
107::మాతలలో వైష్ణవీమాత
108::సతులలో అరు౦ధతి
109::స్త్రీలలో తిలోత్తమ
110::చిత్త౦లో బ్రహ్మకళ
111::శరీరధారులలో శక్తిరూపిణీ
112::సతీదేవి అ౦గభూతాలు

బల్లి శాస్త్రం

బల్లి మన పై పడితే ఫలితము, ఏ విధముగా ఉండే అవకాసం ఉన్నది:
శిరస్సు = కలహం
ముఖము నందు =బంధు దర్సనం
కనుబొమ్మల నడుమ = రాజాను గ్రాహం
పై పెదవి =ధన వ్యయం
క్రింది పెదవి = ధన లాభం
ముక్కు చివర =రోగము
కుడి చెవు = దేర్ఘాయువు
ఎడమ చెవి =వ్యాపార లాభం
నేత్రాల యందు = శుభం
గడ్డం నందు =రాజ దండనము
నోటి మీద = ఇస్టాన్న భోజనం
మెడ యందు = పుత్రా జననం
దవడల మెడ =వస్త్ర లాభం
కంఠము నందు = శత్రువు
కుడి భుజం =ఆరోగ్యం
ఎడమ భుజం =స్త్రీ సంభోగం, ఆరోగ్యం
కుడి ముంజేయి = కీర్తి
ఎడమ ముంజేయి =రోగం
హస్తం = ధన లాభం
కనుల మీద =శుభం
చేతి గొళ్ళ యందు = ధన నాశనం
మోకాళ్ళు =స్త్రీ, ధన లాభము
పిక్కల యందు =శుభము
మదములు =శుభము
స్తన భాగం =దోషం
ఉదరం = ధన్య లాభం
రొమ్ము, నాభి = ధన లాభం
పాదం = ప్రయాణం
కాలి గోళ్ళు= నిర్లజ్జ
లింగం = దారిద్యం
జుట్టు కోన =మృత్యువు
దేహము పై పరిగెడితే = దేర్ఘాయువు
మీద పడి, వెను వెంటనే వెళిపోతే, దానంతట అది =మంచిది

పురుషులకు
తలమీద కలహం
పాదముల వెనక ప్రయాణము
కాలివ్రేళ్లు రోగపీడ
పాదములపై కష్టము
మీసముపై కష్టము
తొడలపై వస్త్రనాశనము
ఎడమ భుజము అగౌరవము
కుడి భుజము కష్టము
వ్రేళ్ళపై స్నేహితులరాక
మోచేయి ధనహాని
మణికట్టునందు అలంకారప్రాప్తి
చేతియందు ధననష్టం
ఎడమ మూపు రాజభయం
నోటియందు రోగప్రాప్తి
రెండు పెదవులపై మృత్యువు
క్రింది పెదవి ధనలాభం
పైపెదవి కలహము
ఎడమచెవి లాభము
కుడిచెవి దుఃఖం
నుదురు బంధుసన్యాసం
కుడికన్ను అపజయం
ఎడమకన్ను శుభం
ముఖము ధనలాభం
బ్రహ్మరంద్రమున మృత్యువు
స్త్రీలకు
తలమీద మరణసంకటం
కొప్పుపై రోగభయం
పిక్కలు బంధుదర్శనం
ఎడమకన్ను భర్తప్రేమ
కుడికన్ను మనోవ్యధ
వక్షమున అత్యంతసుఖము,పుత్రలాభం
కుడి చెవి ధనలాభం
పై పెదవి విరోధములు
క్రిందిపెదవి నూతన వస్తులాభము
రెండుపెదవులు కష్టము
స్తనమునందు అధిక దుఃఖము
వీపుయందు మరణవార్త
గోళ్ళయందు కలహము
చేయుయందు ధననష్టము
కుడిచేయి ధనలాభం
ఎడమచేయి మనోచలనము
వ్రేళ్ళపై భూషణప్రాప్తి
కుడిభుజము కామరతి, సుఖము
బాహువులు రత్నభూషణప్రాప్తి
తొడలు వ్యభిచారము,కామము
మోకాళ్ళు బంధనము
చీలమండలు కష్టము
కుడికాలు శత్రునాశనము
కాలివ్రేళ్ళు పుత్రలాభం

సూర్య నమస్కారాలు

సూర్య నమస్కారం అనే పేరు ఒక్కటే అయినా… అందులో 12 రకాల ఆసనాలు ఉంటాయి. ఈ పన్నెండు చేస్తే ఒక వృత్తం పూర్తయినట్లు! ఆసనానికో ప్రయోజనం!
యోగాసనం, ప్రాణాయామం, మంత్రము మరియూ చక్ర ధ్యానం కూడుకుని చేసే సంపూర్ణ సాధనే సూర్య నస్కారాలు. బ్రహ్మ మూహూర్తంలో చేస్తే చాలా ఫలితాన్ని ఇస్తాయి. వేద పురాణాలలో సూర్యనమస్కారాల ప్రస్తావన ఉంది. రావణాసురిడితో యుద్దానికి ముందు రాముడుకి అగస్త్య మహముని సూర్య నమస్కారాలను బోధిస్తాడూ. ఈ శ్లోకాలు వాల్మీకి రామాయణం యుద్ధ కాండలో ఉన్నాయి.
వీటిలో ఒకటి నుంచి ఐదు… ఎనిమిది నుంచి పన్నెండు ఆసనాలు ఒకేలా ఉంటాయి. కుడి, ఎడమల తేడా మాత్రమే ఉంటుంది. ఏ ఆసనంతో ఎలాంటి లబ్ధి చేకూరుతుందో చూద్దాం…
ఒకటి, పన్నెండు: శరీర సమతుల్యత సాధించవచ్చు. శ్వాసకోశ వ్యవస్థ మెరుగుపడుతుంది. వెన్నెముక, మెడ, భుజాల దగ్గర ఉన్న కండరాలు బలోపేతం అవుతాయి.
రెండు, పదకొండు: జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. వెన్నెముక, పిరుదులు బలోపేతమవుతాయి.
మూడు, పది: రక్త ప్రసరణ పెంచుతాయి. కాలి కండరాలను బలోపేతం చేస్తాయి. గ్రంధులపై కూడా ప్రభావం చూపుతాయి.
నాలుగు, తొమ్మిది: వెన్నెముక, చేతి మణికట్టు కండరాలను బలోపేతం చేస్తాయి.
ఐదు, ఎనిమిది: గుండెను బలోపేతం చేస్తాయి. మెడ, భుజాల దగ్గర ఉండే ఒత్తిడిని తగ్గిస్తాయి.
ఆరో ఆసనం: మెడ, భుజాలలో ఒత్తిడిని తగ్గిస్తుంది.
ఏడో ఆసనం: జీర్ణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. వెన్నెముక బలంగా మారడానికి ఉపకరిస్తుంది.
1.నమస్కారాసనం…(ఓం మిత్రాయ నమ:)
సూర్యునికి ఎదురుగా నమస్కారం చేస్తున్నట్లు నిలబడి సూర్యుని నామాన్ని ఉచ్ఛరించాలి.
2.హస్త ఉత్తానాసనం…(ఓం రవయే నమః)
కొద్దిగా శ్వాస పీల్చి రెండు చేతులను పైకెత్తి, తలను, నడుమును వెనుకకు వంచాలి. కాళ్ళు వంచకూడదు.
3.పాదహస్తాసనం…(ఓం సూర్యాయ నమః)
శ్వాస వదలి రెండు చేతులను కాళ్ళకు దగ్గరగా భూమిమీద ఆనించి, తలను మోకాలుకు ఆనించాలి.
4.ఆంజనేయాసనం…(ఓం భానవే నమః )
ఎడమ మోకాలును వంచి పాదాన్ని నేలపై ఉంచి, కుడి పాదాన్ని వెనుకగా వేళ్ళపై ఆనించి, రెండు చేతులను పైకి చాపి, నడుము పైభాగాన్నంతా వెనుకకు వంచాలి. ఈ స్థితిలో శ్వాసను పీల్చి లోపలే ఆపాలి.
5.పర్వతాసనం…(ఓం ఖగాయ నమః)
కాళ్ళు, చేతులు నేలమీద ఆనించి నడుము పైకి ఎత్తి శ్వాస వదలి తిరిగి పీల్చాలి.
6.సాష్టాంగ నమస్కారం…(ఓం పూష్ణే నమః)
ఎనిమిది అంగాలు నేలకు ఆనటం వలన దీనికి ‘అష్టాంగ నమస్కారం’ అని కూడా అంటారు. రెండు కాళ్ళు, రెండు మోకాళ్ళు, రెండు చేతులు, రొమ్ము మరియు గడ్డం – ఈ ఎనిమిది అంగాలు నేలమీద ఉంచి నడుమును కొద్దిగా పైకి లేపాలి. శ్వాసను పూర్తిగా బయటకు వదలి ఆపాలి.
7.సర్పాసనం…(ఓం హిరణ్యగర్భాయ నమః )
శ్వాసను పీల్చి తలను వెనుకకు వంచాలి.
8.పర్వతాసనం…(ఓం మరీచయే నమః)
ఐదవ స్థితివలెనే కాళ్ళు చేతులు నేలమీద ఆనించి నడుమును పైకి ఎత్తి శ్వాస వదలి తిరిగి పీల్చాలి.
9.ఆంజనేయాసనం…(ఓం ఆదిత్యాయ నమః)
నాలుగవ స్థితివలెనే కుడి పదాన్ని నేలపై ఉంచి, మోకాలును మడచి, ఎడమ పాదాన్ని వెనుకగా వేళ్ళపై ఆనించి, రెండు చేతులను, తలను, నడుమును వెనుకకు వంచాలి.
10.పాదహస్తాసనం…(ఓం సవిత్రే నమః)
మూడవ స్థితివలెనే రెండు చేతులను కాళ్ళ దగ్గరగా నేలపై ఆనించి తలను మోకాలుకు ఆనించాలి. శ్వాసను బయటకు వదలి ఆపాలి.
11.హస్త ఉత్తానాసనం…(ఓం అర్కాయ నమః)
రెండవ స్థితివలెనే రెండు చేతులను పైకెత్తి, తలతోపాటు రెండు చేతులను వెనుకకు వంచాలి.
12.నమస్కారాసనం….(ఓం భాస్కరాయ నమః)
నిటారుగా నిలబడి నమస్కారం చేయాలి.
సూర్యోదయం వేళలో సూర్యునికి అభిముఖంగా నిలబడి సూర్య నమస్కారాలు చెయ్యాలి.
సూర్య నమస్కారాల వలన ఊపిరితిత్తులు, జీర్ణకోశం, నాడీ మండలం, గుండె మొదలైన అవయవాలన్నీ బలపడి రక్తప్రసారం సక్రమంగా జరిగి అంగసౌష్టవం పెరుగుతుంది. నడుము సన్నబడుతుంది. ఛాతీ వికసిస్తుంది. వీటి వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
*పైన వివరణ ద్వారా ఒకటవ మరియు పన్నెండవ ఆసనాలు ఒకే విధముగా వేయవలసినవి. (నమస్కార ఆసనం).

ప్రసాదం ప్రాముఖ్యత

గుడిలో దేవుడి విగ్రహం ఒక్కటే కళ్ళకు కనిపించేది. అంతకు మించి సామాజిక స్పృహ కలిగిన సూత్రం ఒకటి గుడిలో దాగి వుంది.గుడి అంటే కేవలం ఆస్తికత్వానికి ప్రతిరూపం అనుకోకూడదు. వాటిని సరిగా వాడుకోగలిగితే, ఎన్నో సామాజిక ప్రయోజనాలు సిద్ధిస్తాయి.
వెనుకటి కాలంలో అవిద్య, అనారోగ్యం, దారిద్యం తాండవిస్తున్న రోజుల్లో గుళ్ళల్లో పూజారులు మాత్రమే నాలుగు అక్షరం ముక్కలు తెలిసిన వాళ్లు. వూళ్ళో రోగం రొస్టు వస్తే వాళ్ళే దిక్కు. కషాయాలు, చూర్ణాలతో వైద్యం చేసేవాళ్ళు. ఆరోజుల్లో జనాలకు అదే పెద్ద వూరట.
కష్టం,సుఖం చెప్పుకుని స్వాంతన పొందాలంటే పూజారులే జనాలకు ‘కౌన్సిలర్లు’’గా కానవచ్చేవారు. నాలుగు మంచిమాటలు చెప్పో , తెలియని దేవుడి పేరు చెప్పో, మానసికంగా అవసరమయిన స్వాంతన వారికి కలిగించేవారు.
ఇక, మనిషికి కావాల్సింది ఆహారం. దానికి మిక్కిలి కొరతగా వుండే ఆ రోజుల్లో గుళ్ళో పులిహారో, పాయసమో చేసి జనాలకు ప్రసాదంగా పంచేవారు. కూటికీ, గుడ్డకూ మొహం వాచిన ఆ రోజుల్లో అదే మహా ప్రసాదం.వూళ్ళల్లో వయోవృద్దులకు, అభాగ్యులకు గుడి ప్రసాదమే మహా భాగ్యం.
నిస్సహాయులకు గుడిలో లభించే పులిహారో, దద్దోజనమో మించింది ఏముంటుంది.పులిహోర, పోషకాలు సమృద్ధిగా వుండే దద్దోజనం, పాయసం వీటికి మించిన భోజనం ఏముంటుంది. ఆ రోజుల్లో గుళ్ళు ఈ సామాజిక బాధ్యతను గొప్పగా పోషించాయి.
మేము తిరుపతి వెళ్లి వచ్చాము అనో, శబరి మలై వెళ్లి వచ్చామనో ప్రసాదం పెడితే కొంతమంది తీసుకోరు. పైగా మేము ప్రసాదం తినము అని అదేదో గొప్ప పని చేసినట్టుగా గొంతు పెట్టి చెప్తారు.
అసలు గుళ్ళల్లో ప్రసాదం ఎందుకు పెడతారు, కేవలం అది భక్తితోనేనా లేక మరేదైనా కారణం ఉందా అని ఆలోచిస్తే మనకు ఒక అద్భుతమైన విషయం బోధ పడుతుంది.
మరే వ్యవస్థలో లేని సోషలిజం మనకు ఈ ప్రసాద వితరణ లో కనపడుతుంది. అదేదో ఊరికే నైవేద్యం పెట్టి మనం లాగించడానికి కాదు అనే తత్వం బోధపడుతుంది.
ఒక ఊరి లో ఉండే ప్రజలందరూ మంచి పౌష్టికాహారం తీసుకునే స్థితిలో ఉండరు.
బాగా డబ్బులున్న వాళ్ళు పేదవాళ్ళ గురించి పట్టించుకోరు. వారికి కూడా మీరు తినే బలమైన ఆహారం పెట్టండి అంటే ఎవరూ ముందుకు రారు. అదే దేముడికి ప్రసాదం చేయించండి, మీకు పుణ్యం వస్తుంది అంటే సంతోషంగా ఒప్పుకుంటారు.
అలా చేయించిన పౌష్టికాహారాన్ని దేముడికి నైవేద్యం పెట్టి ప్రసాదం పేరుతో అన్ని వర్గాల వారికి అందించడం ప్రసాద వితరణ వెనుక ఉన్న అసలు రహస్యం.
మనం తీసుకునే పులిహోర, దద్దోజనం, చక్ర పొంగలి, సెనగలు, కట్టె పొంగలి మొదలైన వాటిల్లో ఇనప ధాతువు (ఐరన్), కార్బో హైడ్రేట్లు, కాల్షియం, పీచు పదార్థాలు, సోడియం, పొటాసియం, ఇంకా అనేక రకాల ఔషధ గుణాలు ఉంటాయి.
కాబట్టి ప్రసాదం పెట్టడం ద్వారా ఊరి లోని జనాలందరినీ బలంగా, ఆరోగ్యంగా ఉంచాలి అనేది మన పెద్ద వాళ్ళ ఉద్దేశ్యం

Sunday, June 21, 2015

వేంకటేశ్వర స్వామి వారికి మొదటి నైవేద్యం ఎందులోనో మీకు తెలుసా?

ఇది వరకు తిరుమలలో “తొండమాన్ చక్రవర్తి” స్వామి వారికి రోజూ బంగారు తులసి దళాలు సమర్పించేవాడట. అప్పట్లో స్వామి వారు భక్తులతో మాట్లాడుతూ ఉండేవారు కూడా. ఈ తొండమాన్ చక్రవర్తి రోజూ స్వామి వారి దగ్గరికి వెళ్లి చెబుతూ ఉండేవాడుట – "స్వామి నేను మీకు రోజూ బంగారు తులసీదళాలతో పూజ చేస్తున్నాను. పైగా, నాకంటే పెద్ద భక్తుడు మీకు ఎవరున్నారు స్వామి?'' అన్నాడుట. స్వామి తొండమానుడుకి ఒక పాఠం చెప్పాలని, నాకు ప్రియమైన భక్తుడు ఈ ప్రాంతానికి దగ్గ లోనే భీముడు అని ఒక కుమ్మరివాడు ఉంటాడు. వాడిని వెళ్లి చూడు అన్నారుట స్వామి. మరుసటి రోజు వెళదాం అని అనుకుని, స్వామి వారి పాదాల క్రింద ఉన్న తులసి దళాలని శుభ్రం చేస్తున్నాడుట. అప్పుడు, తను చేయించిన బంగారు తులసి దళాల క్రింద, మట్టి తులసిదళాలు కనిపించాయుట. స్వామి వారు చెప్పారుట ఈ మట్టి దళాలు, ఆ భీముడే సమర్పించాడు నాకు అని. అప్పుడు మనసులో అనుకున్నాడుట, మట్టి తులసి దళాలు స్వామికి నచ్చాయా, వీడు ఎవరో కాని వెంటనే వెళ్లి కలవాలని బయలుదేరాడుట. ఆ రోజు చాల ఎండగా ఉంది, అప్పటికే నడిచి నడిచి, భీముడి ఇంటి దగ్గరలో స్పృహ తప్పి పడిపోయాడుట. అప్పుడు ఆ భీముడే, తొండమాన్ చక్రవర్తిని లేవదీసి తన ఇంటికి తీసుకువెళ్ళాడుట. తొండమాన్ చక్రవర్తి అడిగాడుట, "ఒరేయ్ నువ్వు ఏమి చేస్తూ ఉంటావు? వేంకటేశ్వర స్వామి వారికి నువ్వంటే చాల ఇష్టం'' అని.
భీముడు అన్నాడు, నేనేం చేస్తాను స్వామి
- కుండ చేసేముందు ఈశ్వరా నన్ను అనుగ్రహించావు.
- కుండలు చేసుకునే శక్తి ని ఇచ్చావు.
- అవి అమ్మితే నాలుగు రూపాయలు వచ్చేట్టు చేసావు
- వాటి వల్ల నా సంసారం సాగుతోంది.
- నీకు కృతజ్ఞతగా ఒక మట్టి తులసి దళం చేసి నీ పాదాల యందు ఉంచుతాను అని అక్కడే ఉన్న కొయ్యతో చేయబడిన శ్రీ వేంకటేశ్వర స్వామి వారి మూర్తికి సమర్పించేవాడుట. ఏ పని మొదలుపెట్టినా “గోవింద” నేను చేయడమేమిటి? నీవే నాతో చేయించు కుంటున్నావు స్వామి'' అనేవాడుట?
అప్పుడు తొండమాన్ చక్రవర్తి అనుకున్నారుట,
వీడేమో – అంతా స్వామి వారే చేయిస్తున్నారు అని అనుకుంటున్నాడు,
నేనేమో – నేను చేస్తున్నాను అని సమర్పిస్తున్నాను.
ఇదే మనమందరము చేసే పెద్ద తప్పిదం.
భీముడు అన్నం తినే ముందు మట్టితో చిన్న మూకుడు చేసి, అందులో అన్నం ముద్ద పెట్టి, స్వామి వారికి సమర్పించి తను తినేవాడుట. స్వామి వారు భీముడి భక్తికి పొంగిపోయి శ్రీదేవి, భూదేవి సహితుడై, దివ్య విమానంలోంచి దిగి, భీముడి పాక ముందు ప్రత్యక్షమయ్యారుట. వెంటనే స్వామి వారు భీముడిని కౌగలించుకుని, భీముడు తన మీద చూపించే భక్తికి పొంగిపోయి, తన ఒంటి మీద ఉన్న ఆభరణాలన్ని భీముడి మెడలో వేసారట. అలాగే శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు, వారి ఆభరణాలన్ని భీముడి భార్యకి తొడిగారుట. స్వామి వారు గరుత్మంతుడిని పిలిచి ఈ జీవుడిని సశరీరంగా, వైకుంఠానికి తీసుకువెళ్ళమని ఆదేశించారు. ఇప్పటికీ స్వామివారి ఆనంద నిలయంలో మొదటి గడప దాటి పెట్టే నైవేద్యం కుండతో చేసిన పెరుగు అన్నం. ప్రతి రోజూ ఒక కొత్త కుండ చేసి అందులోనే నైవేద్యం పెడతారు. అదొక్కటే తింటారు స్వామి వారు.
సారాంశం:
ఎక్కడ భక్తి ఉందో అక్కడ వశుడై పోతాడు స్వామి.
ఎక్కడ గర్వం/అహంకారం ఉన్నాయో అక్కడ ఆయన ఉండరు

శ్రీ మహాలక్ష్మి నివాస స్థానాలు

సర్వ సంపదలకు అధినేత్రి అయిన శ్రీ మహా లక్ష్మి యొక్క కరుణా కటాక్ష వీక్షణాల కోసం ఎదురు చూడని వాళ్ళు ఎవరు ఉండరు. ఆమె దృష్టి మన మిద పడడం కోసం మనం ఎన్నో పూజలు, వ్రతాలూ చేస్తూ ఉంటాము. కానీ, శ్రీ లక్ష్మి దేవి యొక్క నివాస స్థానాలు, ఆమె ప్రీతి కొరకు ఏమి చేయాలి అనేది మనం సూక్ష్మం గ తెలుసుకొందాము. పూజలు, వ్రతాలూ చేయలేని వాళ్ళు జీవన విధానంలో కొద్ది మార్పులు చేసుకోవడం ద్వార లక్ష్మి అనుగ్రహాన్ని పొందవచ్చు.
1. సింహ ద్వారం గడప దగ్గర చెప్పులు చిందర వందరగా పదేయకూడదు. గడప లక్ష్మి స్వరూపం కనుక గడప తొక్కి ఇంట్లోకి రావడం, గడప మిద కాలు వేయడం, గడపకు అటు ఇటు చెరో కాలు వేసి నుంచోవడం వంటి పనులు చేయరాదు. పసుపు, కుంకుమ ఉన్న గడపలు లక్ష్మి దేవికి ఆహ్వానం పలుకుతాయి. అందువల్ల ప్రతి శుక్రవారం గడపకు పసుపు, కుంకుమ తో అలంకరించాలి.
2. ప్రధాన ద్వారం తలుపు మిద ఎర్రని కుంకుమతో స్వస్తిక్ గుర్తు వేసిన మంచిదే.
3. శుచి, శుభ్రత ఉన్న ఇళ్లు లక్ష్మి దేవికి ఆలవాలం. కనుక, ఇంట్లోని పనికిరాని వస్తువులు, విరిగి పోయిన, చెడిపోయిన వస్తువులు ఎప్పటికప్పుడు బయట పారేయాలి.
4. చెడిపోయిన గడియారాలు, విరిగిపోయిన అద్దాలు, చిరిగి, వాడని వస్త్రాలు ఇంట్లో అస్సలు ఉండకూడదు.
5. ముగ్గు వేసిన వాకిలి గుండా లక్ష్మి దేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అందుకే తెల్లవారే వాకిలి ఉడ్చి ముగ్గులు వేసుకోవాలి.
6. ఇంటి ఇల్లాలు గట్టిగ గొంతు పెట్టి మాట్లాడడం, నట్టింట్లో చెడు మాటలు, చెడు తిట్లు తిట్టడం వంటివి చేయకూడదు.
7. ఎక్కడైతే భార్య భర్తలు నిరంతరం కోట్లడుకుంటారో, ఏ ఇంట్లో ఇల్లాలు ఎప్పుడూ అసంతృప్తి గా ఉంటుందో, ఆ ఇంట్లో లక్ష్మి దేవి ప్రవెశించదు.
8. అబద్ధాలు చెప్పేవాళ్ళు, ఇరు సంధ్యలలో భుజించేవారు, నిద్రించే వారు, బద్దకస్తులు ఎక్కడ ఉంటారో, అక్కడ లక్ష్మి దేవి ఉండదు.
9. ఇరు సంధ్యలలో దీపారాధన చేసే ఇంట్లో లక్ష్మి దేవి కొలువై ఉంటుంది.
10. సాయం సంధ్య వేళల్లో సాంబ్రాణి ధూపం ఇంట్లో వేసిన మంచిదే.
11. సత్యవాదులు, ధార్మిక , నైతిక ప్రవర్తన ఉన్న వారి పట్ల లక్ష్మి దేవి ప్రసన్నురాలై ఉంటుంది.
12. వెండి, బంగారు వంటి లోహల్లో, రత్నాలు, ముత్యాలు లో లక్ష్మి దేవి కొలువై ఉంటుంది.
13. అతిగా మాట్లాడే వారు, గురువులను, పెద్దలను అగౌరవ పరిచేవారు, జుదరులు, అతి నిద్రాలోలురు, అపరిశుభ్రంగా ఉండే వారు ఉన్న చోట లక్ష్మి దేవి ఉండలేదు.
14. ప్రతి శుక్రవారం తలస్నానం చేసి, ఎర్రని వస్త్రాలు, పువ్వులు ధరించి, లక్ష్మి పూజ చేసేవారు ఆమె అనుగ్రహం పొందుతారు.
15. చిల్లర పైసలను, పువ్వులను, అన్నాన్ని నిర్లక్ష్యంగా పడేసేవారు ఆమె అనుగ్రహం పొందలేరు

ఆషాఢంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారో తెలుసా…?

గోరింటాకు ఇష్టపడని మహిళలు చాలా అరుదు. పండుగలైనా.. ఫంక్షలైనా ముందుగా ఆడవారు గోరింటాకుకే ప్రాధాన్యత ఇస్తారు.
ఇప్పుడంటే మార్కెట్లో పౌడర్లు.. కోన్స్ లాంటివి రెడీమేడ్ గా దొరుకుతున్నాయి కానీ.. ఇదివరకటి రోజుల్లో ప్రతి ఇంటి పెరట్లో గోరింటాకు చెట్టు తప్పనిసరిగా ఉండేది.
ఆషాఢంలో గోరింటాకుకు చాలా ప్రత్యేకత ఉంది. ఆషాఢమాసం వచ్చేస్తోంది .. అనగానే ఆడవారి అరచేతులు గోరింటాకుతో అందంగా మెరిసిపోతుంటాయి.
ఈ మాసంలో గోరింటాకు పెట్టుకునే ఆచారం మన సంస్కృతిలో ఉంది. అసలు దీని వెనుక ఉన్న మర్మమేంటో.. మీకు తెలుసా..?
ఆషాఢమాసంతో గ్రీష్మరుతువు పూర్తిగా వెళ్లిపోయి.. వర్షరుతువు ప్రారంభమౌతుంది.
గ్రీష్మంలో మన శరీరంలో బాగా వేడి పెరుగుతుంది. ఆషాఢంలో బయట వాతావరణం చల్లబడిపోతుంది.. మన శరీరంలో ఉన్న వేడి.. బయట చల్లబడిన వాతావరణం పరస్పర విరుద్ధం కాబట్టి అనారోగ్యాలు మొదలౌతాయి.
గోరింటాకుకు శరీరంలో ఉండే వేడిని తీసే శక్తి ఉంది. అంతేకాదు రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
అందువల్లే మన ప్రాచీనులు గోరింటాకు ఆషాఢమాసంలో తప్పకుండా పెట్టుకోవాలని చెబుతారు.
మహిళలు.. ఈ ఆషాడంలో అందంతో పాటు..ఆరోగ్యాన్నిచ్చే గోరింటను మీ
అరచేతుల నిండా నింపుకోండి......

ఆంజనేయస్వామివారు తొమ్మిది అవతారాలు

ఆంజనేయస్వామివారు తొమ్మిది అవతారాలు ధరించారు.
అవేంటంటే..
1. ప్రసన్నాంజనేయస్వామి
2. వీరాంజనేయస్వామి
3. వింశతి భుజ ఆంజనేయస్వామి
4. పంచముఖ ఆంజనేయస్వామి
5. అష్టదశ భుజ ఆంజనేయస్వామి
6. సువర్చలాంజనేయస్వామి
7. చతుర్బుజ ఆంజనేయస్వామి
8. ద్వాత్రింశద్భుజ ఆంజనేయస్వామి
9. వానరాకార ఆంజనేయస్వామి.
ఆంజనేయస్వామి రుద్రాంశ సంభూతుడు. నవ అవతార ఆంజనేయస్వామి ఆలయం ఒంగోలులో
ఉంది. ఇక్కడ పంచముఖ ఆంజనేయస్వామి ప్రధాన దైవం. ఆలయాన్ని పంచముఖ
ఆంజనేయస్వామి ఆలయం అని పిలుస్తారు.

పంచభూతాలకు ప్రాముఖ్యతనిచ్చే వాస్తు

 వాస్తు ప్రకారం గృహ నిర్మాణాన్ని చేపట్టేవారు ప్రకృతికి సంబంధించిన పంచభూతాలకు సైతం తప్పక ప్రాధాన్యమివ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే వాస్తుశాస్త్రం పంచభూతాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. అదేసమయంలో పంచ భూతాలకు హిందూ శాస్త్రంలో మంచి ప్రాధాన్యత ఉండటం అందరికీ తెలిసిన విషయమే.
పంచ భూతాలుగా మనం పేర్కొనే ఆకాశం, భూమి, గాలి, నీరు, నిప్పులకు తగిన ప్రాధాన్యం ఇస్తూ గృహాన్ని నిర్మించడం వల్ల ఆ గృహస్థులు ఎప్పుడూ సఖల బోగాలతో వర్ధిల్లుతారని వాస్తుశాస్త్రం పేర్కొంటోంది. పంచభూతాలకు అధిదేవతలైనవారి ప్రాముఖ్యాన్నిబట్టి గృహనిర్మాణం జరగడం ముఖ్యమని వాస్తుశాస్త్రం చెబుతోంది. ఇందులో భాగంగా పంచభూతాల అధిపతులకు అనుగుణంగా ఇంటిని నిర్మించుకున్నట్లైతే గ్రహాల అనుగ్రహంతో యజమానులకు శుభ ఫలితాలు లభిస్తాయని వాస్తు శాస్త్రజ్ఞులు పేర్కొంటున్నారు.
ఉదాహరణకు నిప్పుకు అధిపతి అగ్నిదేవుడు కాబట్టి వంటింటిని నిర్మించేటప్పుడు అగ్నిదేవునికి ఇష్టమైన దిక్కును అనుసరించి వంటగదిని అమర్చటం చేస్తే మంచి ఫలితాలను సంభవిస్తాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. వాస్తు శాస్త్రం రీతిగా పరిశీలిస్తే పంచభూతాల ఆధారంగా ప్లేస్‌మెంట్‌ను నిర్మించుకోవాలి. దీనిప్రకారం వంటగది సూర్యుడు ఉదయించే దిక్కు తూర్పు వైపు ఉండటం మంచిది.
సూర్యరశ్మి వంటగదిపై నుంచి గృహంలోని అన్నీ ప్రాంతాలకు వ్యాపించటం వల్ల సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. మొక్కలు పెంచటంలో కూడా సూర్యరశ్మికి అనుగుణమైనటువంటి ప్రాంతాలలో కలప మొక్కలను పెంచితే దుష్టశక్తులు ఇంటి దరిచేరవు. అంతేగాక అభివృద్ది సూచనలు కూడా అధికంగా కానవస్తాయి.
భారతీయ వాస్తు శాస్త్రం ప్రకారం పంచ భూతాలకు తగిన దిక్కులకు ప్రాముఖ్యత ఇవ్వడం పరిపాటిగా వస్తోంది. దీనిప్రకారం ఏయే దిక్కులు మంచి ఫలితాలను అందిస్తాయంటే …
తూర్పు- గృహంలో శాంతి, ఆరోగ్యం, సంపద చేకూరటం,
పడమర- సంతానాభివృద్ది, స్వచ్ఛత, అభివృధ్ది,
ఉత్తరం- వ్యాపార అభివృద్ది, మంచి భవిష్యత్తు,
దక్షిణం- అదృష్టం, వినోదం, కీర్తి,
వాయువ్యం- తండ్రికి మంచి అభివృధ్ది సూచకాలు, అధిక ప్రయాణాలు,
నైఋతి- తల్లికి సౌఖ్యం,వివాహ సఫలం,
ఈశాన్యం- వృత్తి పరమైన అభివృద్ధి,
ఆగ్నేయం-అదృష్టం,

Friday, June 19, 2015

సాష్టాంగ నమస్కారం అంటే...?

స + అష్ట + అంగ = సాష్టాంగ.
అనగా 8 అంగములతో నమస్కారం చేయడం. అలా నమస్కారం చేసే
సమయంలో ఈ శ్లోకం చదవాలి.
శ్లో !! ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా
పద్భ్యాం కరాభ్యాం కర్నాభ్యాం ప్రణామం సాష్టాంగ ఉచ్యతే !!
అష్టాంగాలు :
ఉరసు అంటే తొడలు,
శిరసు అంటే తల,
దృష్టి అనగా కళ్ళు,
మనసు అనగా హృదయం,
వచసు అనగా నోరు,
పద్భ్యాం - పాదములు,
కరాభ్యాం - చేతులు,
కర్నాభ్యాం - చెవులు.
బోర్లా పడుకుని పై శ్లోకం చదువుకుంటూ నమస్కరించి ఆయా అంగములు నెలకు
తగిలించాలి.
స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేకూడదు.

విష్ణు సహస్రనామ స్తోత్రము లోని విష్ణువు వేయి నామములు- 1నుండి 1000 వరకు

 1) విశ్వం - మనకు గోచరమగు దృశ్యమాన జగత్తంతయు తానైన వాడు.
2) విష్ణు: - విశ్వమంతయు వ్యాపించి ఉన్నవాడు.
3) వషట్కార: - వేద స్వరూపుడు.
4) భూత భవ్య భవత్ ప్రభు: - భూత భవిష్యత్ వర్త మానము లందలి సర్వమునకు ప్రభువైన వాడు.
5) భూత కృద్ - భూతములను సృష్టించిన వాడు.
6) భూత భృత్ - జీవులందరిని పోషించు వాడు.
7) భావ: - సమస్త చరాచర ప్రపంచమంతయు తానే వ్యాపించిన వాడు.
8) భూతాత్మా - సర్వ జీవ కోటి యందు అంతర్యామిగ ఉండువాడు.
9) భూత భావన: - జీవులు పుట్టి పెరుగుటకు కారణమైన వాడు.
10) పూతాత్మా - పవిత్రాత్ముడు.
11) పరమాత్మ - నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపమై కార్య కారణముల కంటే విలక్షణమైన వాడు.
12) ముక్తానాం పరమాగతి: - ముక్త పురుషులకు పరమ గమ్యమైన వాడు.
13) అవ్యయ: - వినాశము కానివాడు. వినాశము లేని వాడు.
14) పురుష: - నవద్వారములు కలిగిన పురము నందు ఉండువాడు.
15) సాక్షీ - చక్కగా సమస్తమును దర్శించువాడు.
16) క్షేత్రజ్ఞ: - శరీరము లో జరుగు క్రియలన్నింటిని గ్రహించువాడు.
17) అక్షర: - నాశరహితుడు.
18) యోగ: - యోగము చే పొందదగిన వాడు.
19) యోగ విదాంనేతా - యోగ విదులకు ప్రభువైన వాడు.
20) ప్రధాన పురుషేశ్వర: - ప్రకృతి పురుషులకు అధినేత.
21) నారసింహవపు: - నరుని సింహమును బోలిన అవయువములు గల వాడు.
22) శ్రీమాన్ - సదా లక్ష్మీ దేవితో కూడి యుండువాడు.
23) కేశవ: - కేశి యనెడి అసురుని వధించిన వాడు.
24) పురుషోత్తమ: - పురుషులందరిలోను ఉత్తముడు.
25) సర్వ: - సమస్తమును తానై అయినవాడు.
26) శర్వ: - సకల జీవులను సంహరింప జేయువాడు.
27) శివ: - శాశ్వతుడు.
28) స్థాణు: - స్థిరమైనవాడు.
29) భూతాది: - భూతములకు ఆదికారణమైన వాడు.
30) అవ్యయనిధి: - నశించని ఐశ్వర్యము గల వాడు.
31) సంభవ: - వివిధ అవతారములను ఎత్తినవాడు.
32) భావన: - సర్వ జీవులకు సమస్త ఫలముల నొసగువాడు.
33) భర్తా: - సకలములను కనిపెట్టి, పోషించువాడు. సకలమును భరించువాడు.
34) ప్రభవ: - పంచభూతములకు, దేశకాలాదులకు మూలమైనవాడు.
35) ప్రభు: - సర్వశక్తి సమన్వితమైనవాడు.
36) ఈశ్వర: - ఒకరి సహాయములేకనే సమస్త కార్యములు నెరవేర్చగల్గిన వాడు.
37) స్వయంభూ : - తనంతట తానే ఉద్భవించిన వాడు.
38) శంభు: - సర్వశ్రేయములకు మూలపురుషుడు.
39) ఆదిత్య: - సూర్యుని యందు స్వర్ణకాంతితో ప్రకాశించువాడు.
40) పుష్కరాక్ష: - పద్మముల వంటి కన్నులు గలవాడు.
41) మహాస్వన: - గొప్పదియగు వేదరూప నాదము గలవాడు.
42) అనాదినిధన: - ఆద్యంతములు లేని వాడు.
43) ధాతా - నామరూపాత్మకమైన ఈ జగత్తునకు అద్వితీయుడై ఆధారమై యున్నవాడు.
44) విధాతా - కర్మఫలముల నందించువాడు.
45) ధాతురుత్తమ: - సర్వ ధాతువులలో ఉత్తమమైన చిద్రూప ధాతువు తానైనవాడు.
46) అప్రమేయ: - ఏ విధమైన ప్రమాణములకు అందనివాడు.
47) హృషీకేశ: - ఇంద్రియములకు ప్రభువు.
48) పద్మనాభ: - నాభియందు పద్మము గలవాడు.
49) అమరప్రభు: - దేవతలకు ప్రభువైనవాడు.
50) విశ్వకర్మా - విశ్వరచన చేయగల్గినవాడు.
51) మను: - మననము(ఆలోచన) చేయువాడు.
52) త్వష్టా - ప్రళయకాలమున సమస్త భూతములను కృశింపజేసి నశింపజేయువాడు.
53) స్థవిష్ఠ: - అతిశయ స్థూలమైన వాడు.
54) స్థవిరోధ్రువ: - సనాతనుడు, శాశ్వతుడైనవాడు.
55) అగ్రాహ్య: - ఇంద్రియ మనోబుద్ధులచే గ్రహించుటకు వీలులేనివాడు.
56) శాశ్వత: - సర్వ కాలములందున్నవాడు.
57) కృష్ణ: - సచ్చిదానంద స్వరూపుడైన భగవానుడు. సర్వమును ఆకర్షించువాడు.
58) లోహితాక్ష: - ఎఱ్ఱని నేత్రములు గలవాడు.
59) ప్రతర్దన: - ప్రళయకాలమున సర్వమును నశింపచేయువాడు.
60) ప్రభూత: - జ్ఞానైశ్వర్యాది గుణసంపన్నుడు.
61) త్రికకుబ్ధామ - ముల్లోకములకు ఆధారభూతమైనవాడు.
62) పవిత్రం - పరిశుద్ధుడైనవాడు.
63) పరం మంగళం - స్మరణ మాత్రముచే అద్భుతముల నంతమొందించి శుభముల నందించువాడు.
64) ఈశాన: - సర్వ భూతములను శాసించువాడు.
65) ప్రాణద: - ప్రాణి కోటికి ప్రాణశక్తి నొసగువాడు.
66) ప్రాణ: - ప్రాణశక్తి స్వరూపమైనవాడు.
67) జ్యేష్ఠ: - వృద్ధతముడు. (సృష్టికి పూర్వమునుండే ఉన్నవాడు)
68) శ్రేష్ఠ: - అత్యంత ప్రశంసాపాత్రుడు.
69) ప్రజాపతి: - సమస్త ప్రజలకు పతి.
70) హిరణ్యగర్భ: - విశ్వగర్భమున నుండువాడు.
71) భూగర్భ: - భూమిని తన గర్భమునందు ఉంచుకొన్నవాడు.
72) మాధవ: - శ్రీదేవికి భర్తయైనవాడు.
73) మధుసూదన: - మధువను రాక్షసుని వధించినవాడు.
74) ఈశ్వర: - సర్వశక్తి సంపన్నుడైనవాడు.
75) విక్రమీ - శౌర్యము గలవాడు.
76) ధన్వీ - ధనస్సును ధరించినవాడు.
77) మేధావీ - ఏకకాలములో సర్వవిషయగ్రహణ సామర్ధ్యము కలిగినవాడు.
78) విక్రమ: - గరుడుని వీపుపై ఎక్కి ఇచ్ఛామాత్రముచే ఎచ్చటైనను విహరించగలవాడు.
79) క్రమ: - నియమానుసారము చరించువాడు.
80) అనుత్తమ: - తనకంటె ఉత్తములు లేనివాడు.
81) దురాధర్ష: - రాక్షసులు కూడా ఎదుర్కోను శక్యము గానివాడు.
82) కృతజ్ఞ: - ప్రాణులు చేయు కర్మములను చేయువాడు.
83) కృతి: - కర్మకు లేదా పురుష ప్రయత్నమునకు ఆధారభూతుడై యున్నవాడు.
84) ఆత్మవాన్ - తన వైభవమునందే సర్వదా సుప్రతిష్ఠుడై యుండువాడు.
85) సురేశ: - దేవతలకు ప్రభువైనవాడు.
86) శరణ: - దు:ఖార్తులను బ్రోచువాడై, వారి ఆర్తిని హరించువాడు.
87) శర్మ - పరమానంద స్వరూపుడు.
88) విశ్వరేతా: - సర్వ ప్రపంచమునకు కారణమైన పరంధాముడు.
89) ప్రజాభవ: - ప్రజోత్పత్తికి కారణభూతుడైన వాడు.
90) అహ: - పగలువలె ప్రకాశించు వాడు.
91) సంవత్సర: - కాలస్వరూపుడైనవాడు.
92) వ్యాళ: - పామువలె పట్టశక్యము గానివాడు.
93) ప్రత్యయ: - ప్రజ్ఞా స్వరూపుడైనవాడు.
94) సర్వదర్శన: - సమస్తమును దర్శించగలవాడు.
95) అజ: - పుట్టుకలేని వాడు.
96) సర్వేశ్వర: - ఈశ్వరులందరికి ఈశ్వరుడైనవాడు.
97) సిద్ధ: - పొందవలసిన దంతయు పొందినవాడు.
98) సిద్ధి: - ఫలరూపుడైనవాడు.
99) సర్వాది: - సర్వమునకు మూలమైనవాడు.
100) అచ్యుత: - స్వరూప సామర్ద్యముల యందు పతనము లేనివాడు.
101) వృషాకపి: - అధర్మముచే మునిగియున్న భూమిని వరహావతారమెత్తి ఉద్ధరించినవాడు.
102) అమేయాత్మ - అపరిమిత స్వరూపము గలవాడు.
103) సర్వయోగ వినిస్సృతః - సర్వ విధములైన సంగత్యములనుండి విడిపడినవాడు.
104) వసు: - సర్వ భూతములయందు వశించువాడు.
105) వసుమనా: - పరిశుద్ధమైన మనస్సు గలవాడు.
106) సత్య: - సత్య స్వరూపుడు.
107) సమాత్మా: - సర్వప్రాణుల యందు సమముగా వర్తించువాడు.
108) సమ్మిత: - భక్తులకు చేరువై భక్తాధీనుడైనవాడు.
109) సమ: - సదా లక్ష్మీదేవితో కలిసి విరాజిల్లువాడు.
110) అమోఘ: - భక్తులను స్తుతులను ఆలకించి ఫలముల నొసగువాడు.
111) పుండరీకాక్ష: - భక్తుల హృదయ పద్మమున దర్శనీయుడైనవాడు. పద్మనయునుడు.
112) వృషకర్మా - ధర్మకార్యములు నిర్వర్తించువాడు.
113) వృషాకృతి: - ధర్మమే తన స్వరూపముగా గలవాడు.
114) రుద్ర: - దు:ఖమును లేదా దు:ఖ కారణమును పారద్రోలువాడు.
115) బహుశిరా: - అనేక శిరములు కలవాడు.
116) బభ్రు: - లోకములను భరించువాడు.
117) విశ్వయోని: - విశ్వమునకు కారణమైనవాడు.
118) శుచిశ్రవా: - శుభప్రధమై శ్రవణము చేయదగిన దివ్యనామములు కలిగినవాడు.
119) అమృత: - మరణము లేనివాడు.
120) శాశ్వతస్థాణు: - నిత్యుడై, నిశ్చలుడైనవాడు.
121) వరారోహ: - జ్ఞానగమ్యమైనవాడు.
122) మహాతపా: - మహాద్భుత జ్ఞానము కలవాడు.
123) సర్వగ: - సర్వత్ర వ్యాపించియున్నవాడు.
124) సర్వవిద్భాను: - సర్వము తెలిసినవాడు.
125) విష్వక్సేన: - అసురుల సేనలను నిర్జించినవాడు. తాను యుద్దమునకు ఉపక్రమించినంతనే అసురసేన యంతయు భీతితో పారిపోవుటచే భగవానుడు విష్వక్సేను డాయెను.
126) జనార్దన: - దు:ఖమును కల్గించువాడు. ఆనందము నొసగూర్చువాడు.
127) వేద: - మోక్షదాయకమైన జ్ఞానమును ప్రసాదించు వేదము తన స్వరూపముగా గలవాడు.
128) వేదవిత్ - వేదజ్ఞానమును అనుభవములో కలిగినవాడు.
129) అవ్యంగ: - ఏ కొఱతయు, లోపము లేనివాడు.
130) వేదాంగ: - వేదములనే అంగములుగా కలిగినవాడు.
131) వేదవిత్ - వేదములను విచారించువాడు.
132) కవి: - సర్వద్రష్ట యైనవాడు.
133) లోకాధ్యక్ష: - లోకములను పరికించువాడు.
134) సురాధ్యక్ష: - దేవతలకు కూడా తానే అధ్యక్షుడైనవాడు.
135) ధర్మాధ్యక్ష: - ధర్మాధర్మములను వీక్షించువాడు.
136) కృతాకృత: - కార్య, కారణ రూపములతో భాసించువాడు.
137) చతురాత్మా - విభూతి చతుష్టయము తన స్వరూపముగా గలవాడు.
138) చతుర్వ్యూహ: - నాలుగు విధముల వ్యూహము నొంది సృష్టి కార్యములను చేయువాడు.
139) చతుర్దుంష్ట్ర: - నాలుగు కోరపండ్లు గలిగినవాడు.
140) చతుర్భుజ: - నాలుగు భుజములు కలిగినవాడు.
141) భ్రాజిష్ణు: - అద్వయ ప్రకాశరూపుడు.
142) భోజన: - భోజ్యరూపమైనవాడు.
143) భోక్తా: - ప్రకృతిలోని సర్వమును అనుభవించు పురుషుడు.
144) సహిష్ణు: - భక్తుల అపరాధములను మన్నించి క్షమించ గలిగినవాడు.
145) జగదాదిజ: - సృష్ట్యారంభముననే వ్యక్తమైనవాడు.
146) అనఘ: - పాపరహితుడైనవాడు.
147) విజయ: - ఆత్మజ్ఞానముతో వైరాగ్యసంపన్నుడై, శ్రేష్టమైన జయమునొందువాడు.
148) జేతా: - సదాజయము నొందువాడు.
149) విశ్వయోని: - విశ్వమునకు కారణభూతమైనవాడు.
150) పునర్వసు: - పదే పదే క్షేత్రజ్ఞుని రూపమున ఉపాధుల నాశ్రయించువాడు.
151) ఉపేంద్ర: - ఇంద్రునికి పై నుండువాడు.
152) వామన: - చక్కగా సేవించదగినవాడు.
153) ప్రాంశు: - ఉన్నతమైన శరీరము గలవాడు.
154) అమోఘ: - వ్యర్ధము కాని పనులు గలవాడు.
155) శుచి: - తన దరిచేరు భక్తులను పవిత్రము చేయువాడు.
156) ఊర్జిత: - మహా బలవంతుడు.
157) అతీంద్ర: - ఇంద్రుని అతిక్రమించినవాడు.
158) సంగ్రహ: - ప్రళయకాలమున సమస్తమును ఒక్కచోటికి సంగ్రహించువాడు.
159) సర్గ: - సృష్టియు, సృష్టికారణమును అయినవాడు.
160) ధృతాత్మా - తనపై తాను ఆధారపడినవాడు.
161) నియమ: - జీవులను వారి వారి కార్యములలో నియమింపజేయువాడు.
162) యమ: - లోపలనుండి నడిపించువాడు.
163) వేద్య: - సర్వులచేత తెలుసుకొనదగినవాడు.
164) వైద్య: - సమస్త విద్యలకు నిలయమైనవాడు.
165) సదాయోగి - నిత్యము స్వస్వరూపమునందు విరాజిల్లువాడు.
166) వీరహా - ధర్మరక్షణ నిమిత్తము వీరులైన అసురులను వధించినవాడు.
167) మాధవ: - అర్హులగువారికి ఆత్మజ్ఞానమును ప్రసాదించువారు.
168) మధు: - భక్తులకు మధురమైన మకరందము వంటివారు.
169) అతీంద్రయ: - ఇంద్రియములద్వార గ్రహించుటకు వీలులేనివాడు.
170) మహామాయ: - మాయావులకు మాయావియైనవాడు.
171) మహోత్సాహ: - ఉత్సాహవంతుడు.
172) మహాబల: - బలవంతులకంటెను బలవంతుడైనవాడు.
173) మహాబుద్ధి: - బుద్ధిమంతులలో బుద్ధిమంతుడు.
174) మహావీర్య: - బ్రహ్మాండములను సృష్టించి, పోషించి, లయింపచేయు శక్తిసామర్ధ్యములు కలిగియున్నవాడు.
175) మహాశక్తి: - మహిమాన్విత శక్తిపరుడైనవాడు.
176) మహాద్యుతి: - గొప్ప ప్రకాశము అయినవాడు.
177) అనిర్దేశ్యవపు: - నిర్దేశించుటకు, నిర్ణయించుటకు వీలుకానివాడు.
178) శ్రీమాన్ - శుభప్రదుడు.
179) అమేయాత్మా - ఊహించుటకు వీలులేని మేధాసంపత్తి కలిగినవాడు.
180) మహాద్రిధృక్ - మందర, గోవర్ధన పర్వతములను అవలీలగా ఎత్తినవాడు.
181) మహేష్వాస: - శార్ఙమను (శారంగ ధనువు) గొప్ప ధనువును ధరించినవాడు.
182) మహీభర్తా: - భూదేవికి భర్తయై, రక్షకుడైనవాడు.
183) శ్రీనివాస: - శ్రీమహాలక్ష్మికి నివాస స్థానమైనవాడు.
184) సతాంగతి: - సత్పురుషులకు పరమగతి అయినవాడు.
185) అనిరుద్ధ: - మరొకరు ఎదురించువారు లేనివాడు.
186) సురానంద: - దేవతలకు ఆనందము నొసంగువాడు.
187) గోవింద: - గోవులను రక్షించువాడు.
188) గోవిదాం పతి: - వాగ్విదులు, వేదవిదులైనవారికి ప్రభువైనవాడు.
189) మరీచి: - తేజోవంతులలో తేజోవంతుడైనవాడు.
190) దమన: - తమకప్పగించబడిన బాధ్యతలనుండి తప్పిపోవు వారిని శిక్షించువాడు.
191) హంస: - నేను అతడే (అహం బ్రహ్మస్మి)
192) సుపర్ణ: - అందమైన రెక్కలు గలవాడు.
193) భుజగోత్తమ: - భుజంగములలో ఉత్తముడు.
194) హిరణ్యగర్భ: - బ్రహ్మకు పుట్టుకనిచ్చిన బంగారు బొడ్డుగల సర్వోత్తముడు.
195) సుతపా: - చక్కటి తపమాచరించువాడు.
196) పద్మనాభ: - హృదయపద్మమధ్యమున భాసించువాడు.
197) ప్రజాపతి: - అనంతజీవకోటికి ప్రభువైనవాడు.
198) అమృత్యు: - మరణముగాని, మరణ కారణముగాని లేనివాడు.
199) సర్వదృక్ - తన సహజ జ్ఞానముచే ప్రాణులు చేసినది,చేయునది అంతయు చూచుచుండువాడు.
200) సింహ: - సింహము. పాపములను నశింపజేయువాడు.
201) సంధాతా - జీవులను కర్మఫలములతో జోడించువాడు.
202) సంధిమాన్ - భక్తులతో సదాకూడియుండువాడు.
203) స్థిర: - సదా ఏకరూపము గలవాడు.
204) అజ: - పుట్టుకలేనివాడు.
205) దుర్మర్షణ: - అసురులకు భరింపశక్యము గానివాడు.
206) శాస్తా - శృతి, స్తృతుల ద్వారా శాసించువాడు.
207) విశ్రుతాత్మా - విశేషముగా శ్రవణము చేయబడినవాడు.
208) సురారిహా - దేవతల శత్రువులను నాశనము చేసినవాడు.
209) గురు: - ఆత్మవిద్యను బోధించువాడు.
210) గురుత్తమ: - గురువులకు గురువైనవాడు.
211) ధామ: - జీవులు చేరవలసిన పరమోత్కృష్ణ స్థానము.
212) సత్య: - సత్య స్వరూపుడు.
213) సత్యపరాక్రమ: - సత్యనిరూపణలో అమోఘమైన పరాక్రమము కలవాడు.
214) నిమిష: - నేత్రములు మూసుకొనినవాడు.
215) అనిమిష: - సదా మేలికొనియున్న వాడు.
216) స్రగ్వీ - వాడని పూలమాలను ధరించినవాడు.
217) వాచస్పతి రుదారధీ: - విద్యలకు పతియైనవాడు.
218) అగ్రణీ: - భక్తులకు దారిచూపువాడు.
219) గ్రామణీ: - సకల భూతములకు నాయకుడు.
220) శ్రీమాన్ - ఉత్కృష్ణమైన కాంతి గలవాడు.
221) న్యాయ: - సత్యజ్ఞానమును పొందుటకు అవసరమైన తర్కము, యుక్తి తానే అయినవాడు.
222) నేతా - జగత్తు యనెడి యంత్రమును నడుపువాడు.
223) సమీరణ: - ప్రాణవాయు రూపములో ప్రాణులకు చేష్టలు కలిగించువాడు.
224) సహస్రమూర్ధా - సహస్ర శిరస్సులు గలవాడు.
225) విశ్వాత్మా - విశ్వమునకు ఆత్మయైనవాడు.
226) సహస్రాక్ష: - సహస్ర నేత్రములు కలవాడు.
227) సహస్రపాత్ - సహస్రపాదములు కలవాడు.
228) ఆవర్తన: - జగత్ చక్రమును లేదా సంసార చక్రమును సదా త్రిప్పుచుండువాడు.
229) నివృత్తాత్మా - ప్రపంచముతో ఎట్టి సంబంధము లేనివాడు.
230) సంవృత: - అవిద్యారూపమైన మాయచే కప్పబడినవాడు.
231) సంప్రమర్దన: - తమోగుణ ప్రధానులైన అజ్ఞానులను పీడించువాడు.
232) అహస్సంవర్తక: - రోజులను చక్కగా నడిపెడి ఆదిత్యరూపుడు.
233) వహ్ని: - యజ్ఞములందు హోమకుండములలో హవిస్సును మోసెడి అగ్ని.
234) అనిల: - ప్రకృతిలో వాయు రూపమునను, ప్రాణులలో ప్రాణ రూపమునను ఉండువాడు.
235) ధరణీధర: - భూభారమును భరించువాడు.
236) సుప్రసాద: - చక్కని అనుగ్రహము కలవాడు.
237) ప్రసన్నాత్మా - రాగద్వేషాదులతో కలుషితముగాని పరిశుద్ధ అంత:కరణ కలవాడు.
238) విశ్వదృక్ - విశ్వమునంతటిని ధరించినవాడు.
239) విశ్వభుక్ - విశ్వమును భక్షించువాడు.
240) విభు: - బ్రహ్మ మొదలు సకల రూపములలో గోచరించువాడు.
241) సత్కర్తా - సజ్జనులను సత్కరించువాడు.
242) సత్కృత: - పూజ్యులచే పూజింపబడువాడు.
243) సాధు: - ధర్మప్రవర్తన గలవాడు.
244) జుహ్ను: - భక్తులను పరమపదమునకు నడిపించువాడు.
245) నారాయణ: - నరులకు ఆశ్రయమైనవాడు.
246) నర: - జీవులను కర్మానుసారము ఉత్తమగతికి నడుపువాడు.
247) అసంఖ్యేయ: -అనంతమైన నామరూపాదులు కలవాడు.
248) అప్రమేయాత్మా - అప్రమేయమైన స్వరూపము కలవాడు.
249) విశిష్ట: - శ్రేష్ఠతముడు. మిక్కిలి గొప్పవాడు.
250) శిష్టకృత్ - శాసనము చేయువాడు.
251) శుచి: - నిర్మలుడై, నిరంజనుడైనవాడు.
252) సిద్ధార్ధ: - పొందదగినదంతయు పొందినవాడు.
253) సిద్ధసంకల్ప: - నేఱవేరిన సంకల్పములు కలవాడు.
254) సిద్ధిద: - జీవుల కర్మానుసారముగా ఫలముల నందిచువాడు.
255) సిద్దిసాధన: - కార్యసిద్ధి కనుకూలించు సాధన సంపత్తి తానే అయినవాడు.
256) వృషాహీ - అనేక వృషాహములు (ధర్మ దినములు) ద్వారా సేవింపబడువాడు.
257) వృషభ: - భక్తుల అభీష్టములను నెరవేర్చువాడు.
258) విష్ణు: - సర్వత్రా వ్యాపించి ఉన్నవాడు.
259) వృషపర్వా: - ధర్మమునకు భక్తుల ధర్మ సోపానములను నిర్మించినవాడు.
260) వృషోదర: - ధర్మమును ఉదరమున ధరించువాడు. (ప్రజలను వర్షించునదిగాయున్న ఉదరము గలవాడు.)
261) వర్ధన: - ఆశ్రితులైనవారి శ్రేయములను వృద్ధినొందిచువాడు.
262) వర్ధమాన: - ప్రపంచరూపమున వృద్ధినొందువాడు.
263) వివిక్త: - మాయాస్వరూపమగువాడు.
264) శృతిసాగర: - శృతులకు నిధియైనవాడు.
265) సుభుజ: - జగద్రక్షణము గావించు సుందరమైన భుజములు గలవాడు.
266) దుర్ధర: - లోకములను ధరించి తనను ఒరులు ధరించేందుకు వీలుపడని భూమాతను ధరించినవాడు.
267) వాగ్మీ - వేదజ్ఞానమును వెలువరించినవాడు.
268) మహేంద్ర: - దేవేంద్రునకు కూడా ప్రభువైనవాడు.
269) వసుద: - భక్తుల అవసరములను సకాలములో సమకూర్చువాడు.
270) వసు: - తాను ఇచ్చు ధనము కూడా తానే అయినవాడు.
271) నైకరూప: - ఒక రూపము లేనివాడై, అనేక రూపములు గలవాడు.
272) బృహద్రూప: - బ్రహ్మాండ స్వరూపము గలవాడు.
273) శిపివిష్ట: - సూర్యునియందలి కిరణ ప్రతాపము తానైనవాడు.
274) ప్రకాశన: - సర్వమును ప్రకాశింప చేయువాడు.
275) ఓజస్తేజో ద్యుతిధర: - ఓజస్సు, తేజస్సు, ద్యుతి కలవాడు.
276) ప్రకాశాత్మా - తేజోమయ స్వరూపుడు.
277) ప్రతాపన: - సూర్యాగ్నుల రూపమున భూమిని తపింపచేయువాడు.
278) బుద్ధ: - ధర్మ, జ్ఞాన, వైరాగ్యములకు నిలయమైనవాడు.
279) స్పష్టాక్షర: - ఓం అనెడి దివ్యాక్షరముద్వారా సూచించబడినవాడు.
280) మంత్ర: - వేదమంత్రముల ద్వారా తెలియదగినవాడు.
281) చంద్రాంశు: - చంద్రకిరణముల వంటివాడు.
282) భాస్కరద్యుతి: - సూర్యతేజమువంటివాడు.
283) అమృతాంశూధ్భవ: - చంద్రుని ఆవిర్భావమునకు కారణమైనవాడు.
284) భాను: - స్వప్రకాశ స్వరూపుడు.
285) శశిబిందు: - చంద్రునివలె ప్రజలను పోషించువాడు.
286) సురేశ్వర: - దేవతలకు ప్రభువైనవాడు.
287) ఔషధం - భవరోగహరమగు దివ్యౌషధము తానైనవాడు.
288) జగతస్సేతు: - ప్రపంచమునకు పరమాత్మకు మద్య వంతెనవంటివాడు.
289) సత్యధర్మ పరాక్రమ: - సత్యజ్ఞానాది ధర్మములు, పరాక్రమము కలవాడు.
290) భూతభవ్య భవన్నాద: - జీవులచే మూడుకాలములందు ప్రార్థించబడువాడు.
291) పవన: - సకలమును పవిత్ర మొనర్చువాడు.
292) పావన: - వాయువునందు చలనశక్తి కల్గించువాడు.
293) అనల: - ప్రాణధారణకు అవసరమైన అగ్ని స్వరూపుడు.
294) కామహా - కామములను అంతము చేయువాడు.
295) కామకృత్ - సాత్వికవాంఛలను నెరవేర్చువాడు.
296) కాంత: - అద్భుత రూపవంతుడై, సర్వులచే ఆకర్షింపబడువాడు.
297) కామ: - చతుర్విధ పురుషార్థములను అభిలషించువారిచే కోరబడువాడు.
298) కామప్రద: - భక్తుల కోర్కెలను తీర్చువాడు.
299) ప్రభు: - సర్వోత్కృష్టమైనవాడు.
300) యుగాదికృత్ - కృతాది యుగములను ప్రారంభించినవాడు.
301) యుగావర్త: - యుగములను త్రిప్పువాడు.
302) నైకమాయ: - తన మాయాశక్తిచే అనేక రూపములను ధరించి, ప్రదర్శించువాడు.
303) మహాశన: - సర్వమును కబళించువాడు.
304) అదృశ్య: - దృశ్యము కానివాడు.
305) వ్యక్తరూప: - భక్తుల హృదయములలో వ్యక్తరూపుడై భాసిల్లువాడు.
306) సహస్రజిత్ - వేలకొలది రాక్షసులను సంగ్రామమున జయించువాడు.
307) అనంతజిత్ - అనూహ్యమైన శక్తి సామర్ద్యములు కలవాడై, రణరంగమున ఎదిరించువారిని జయించు శక్తి కలవాడు.
308) ఇష్ట: - ప్రియమైనవాడు.
309) అవిశిష్ట: - సర్వాంతర్యామియైనవాడు.
310) శిష్టేష్ట: - బుధజనులైన సాధుమహాత్ములకు ఇష్టుడైనవాడు.
311) శిఖండీ - శిరమున నెమలిపింఛమును ధరించినవాడు.
312) నహుష: - తన మాయచేత జీవులను సంసారమునందు బంధించువాడు.
313) వృష: - ధర్మస్వరూపుడైనవాడు.
314) క్రోధహా - సాధకులలోని క్రోధమును నశింపచేయువాడు.
315) క్రోధ కృత్కర్తా - క్రోధాత్ములగువారిని నిర్మూలించువాడు.
316) విశ్వబాహు: - బాహువులు విశ్వమంతట కలవాడు.
317) మహీధర: - భూమిని ధరించినవాడు.
318) అచ్యుత: - ఎట్టి వికారములకు లోనుగానివాడు. ( ఎటువంటి మార్పు పొందనివాడు.)
319) ప్రధిత: - ప్రఖ్యాతి నొందినవాడు.
320) ప్రాణ: - అంతటా చైతన్య స్వరూపమై నిండి, ప్రాణులను కదిలించు ప్రాణస్వరూపుడు.
321) ప్రాణద: - ప్రాణ బలము ననుగ్రహించువాడు.
322) వాసవానుజ: - ఇంద్రునకు తమ్ముడు.
323) అపాంనిధి: - సాగరమువలె అనంతుడైనవాడు.
324) అధిష్టానం - సర్వమునకు ఆధారమైనవాడు.
325) అప్రమత్త: - ఏమరు పాటు లేనివాడు.
326) ప్రతిష్ఠిత: - తన మహిమయందే నిలిచియుండువాడు.
327) స్కంద: - అమృత రూపమున స్రవించువాడు.
328) స్కందధర: - ధర్మమార్గమున నిలుపువాడు.
329) ధుర్య: - సర్వ జీవుల ఉత్పత్తి మొదలగు భారములను మోయువాడు.
330) వరద: - వరముల నొసగువాడు.
331) వాయువాహన: - సప్త వాయువులను బ్రహ్మాండమంతటను ప్రవర్తింపచేయువాడు.
332) వాసుదేవ: - అంతటను నిండియున్నవాడు.
333) బృహద్భాను: - ప్రకాశవంతమగు కిరణతేజముచే విశ్వమును ప్రకాశింపచేయువాడు.
334) ఆదిదేవ: - సృష్టి కార్యమును ప్రారంభించినవాడు.
335) పురంధర: - రాక్షసుల పురములను నశింపచేసినవాడు.
336) అశోక: - శోకము లేనివాడు.
337) తారణ: - సంసార సాగరమును దాటించువాడు.
338) తార: - గర్భ, జన్మ, జరా, మృత్యురూపమైన భయమునుండి తరింపజేయువాడు.
339) శూర: - పరాక్రమము గలవాడు.
340) శౌరి: - బలవత్తరములైన ఇంద్రియ మనోబుద్ధులను అణిచినవాడు.
341) జనేశ్వర: - జనులకు ప్రభువు.
342) అనుకూల: - సర్వులకు అనుకూలుడైనవాడు.
343) శతావర్త: - ధర్మ రక్షణార్థము అనేక పర్యాయములు ఆవిర్భవించినవాడు.
344) పద్మీ - పద్మమును చేతియందు ధరించినవాడు.
345) పద్మనిభేక్షణ: - పద్మమువంటి నేత్రములు కలవాడు.
346) పద్మనాభ: - పద్మము నాభియందుండువాడు.
347) అరవిందాక్ష: - కమలరేకులవంటి కన్నులు గలవాడు.
348) పద్మగర్భ: - పద్మగర్భమున నివసించువాడు.
349) శరీరభృత్ - ప్రాణుల శరీరములను పోషించువాడు.
350) మహర్థి: - మహావిభూతులు కలవాడు.
351) బుద్ధ: - ప్రపంచాకారముతో భాసించువాడు.
352) వృద్ధాత్మా - సృష్టికి పూర్వమే ఉన్నవాడు.
353) మహాక్ష: - గొప్ప నేత్రములు గలవాడు.
354) గరుడధ్వజ: - తన పతాకమునందు గరుడ చిహ్నము కలవాడు.
355) అతుల: - సాటిలేనివాడు.
356) శరభ: - శరీరములందు ప్రత్యగాత్మగా ప్రకాశించువాడు.
357) భీమ: - భీకరమైన శక్తి సంపన్నుడు.
358) సమయజ్ఞ: - సర్వులను సమభావముతో దర్శించుటయే తన పూజగా భావించువాడు.
359) హవిర్హరి: - యజ్ఞములలో హవిర్భాగమును గ్రహించువాడు.
360) సర్వలక్షణ లక్షణ్య: - సర్వప్రమాణములచే సిద్ధించు జ్ఞానముచేత నిర్ణయింపబడినవాడు.
361) లక్ష్మీవాన్ - సదా లక్ష్మీదేవి తన వక్షస్థలమందు కలిగినవాడు.
362) సమితింజయ: - యుద్ధమున జయించినవాడు.
363) విక్షర: - నాశములేనివాడు.
364) రోహిత: - మత్స్యరూపమును ధరించినవాడు.
365) మార్గ: - భక్తులు తరించుటకు మార్గము తాను అయినవాడు.
366) హేతు: - సృష్టికి కారణము అయినవాడు.
367) దామోదర: - దమాది సాధనలచేత ఉదారమైన బుద్ధిద్వారా పొందబడువాడు.
368) సహ: - సహనశీలుడు.
369) మహీధర: - భూమిని ధరించినవాడు.
370) మహాభాగ: - భాగ్యవంతుడు.
371) వేగవాన్ - అమితమైన వేగము కలవాడు.
372) అమితాశన: - అపరిమితమైన ఆకలి గలవాడు.
373) ఉద్బవ: - ప్రపంచసృష్టికి ఉపాదానమైనవాడు.
374) క్షోభణ: - సృష్టికాలమందు కల్లోలము కల్గించువాడు.
375) దేవ: - క్రీడించువాడు.
376) శ్రీ గర్భ: - సకల ఐశ్వర్యములు తనయందే గలవాడు.
377) పరమేశ్వర: - ఉత్కృష్ట మైనవాడు.
378) కరణమ్ - జగదుత్పత్తికి సాధనము అయినవాడు.
379) కారణమ్ - జగత్తునకు కారణమైనవాడు.
380) కర్తా - సమస్త కార్యములకు కర్తయైనవాడు.
381) వికర్తా - విచిత్రమైన ప్రపంచమును రచించినవాడు.
382) గహన: - గ్రహించ శక్యముగానివాడు.
383) గుహ: - వ్యక్తము కానివాడు. కప్పబడినవాడు.
384) వ్యవసాయ: - మానవాళి అభ్యున్నతికి తానే కృషిచేయువాడు.
385) వ్యవస్థాన: - సర్వవ్యవహారములను యధావిధిగ నడుపువాడు.
386) సంస్థాన: - జీవులకు గమ్యస్థానమైనవాడు.
387) స్థానద: - వారివారి కర్మానుసారముగా స్థానముల నందించువాడు.
388) ధృవ: - అవినాశియై, స్థిరమైనవాడు.
389) పరర్థి: - ఉత్కృష్టమైన వైభవముకలవాడు.
390) పరమస్పష్ట: - మిక్కిలి స్పష్టముగా తెలియువాడు.
391) తుష్ట: - సంతృప్తుడు.
392) పుష్ట: - పరిపూర్ణుడు
393) శుభేక్షణ: - శుభప్రధమైన దృష్టిగలవాడు.
394) రామ: - నిత్యానంద చైతన్యములో సదా రమించువాడు.
395) విరామ: - సకలజీవులకు విశ్రాంతి స్థానమైనవాడు.
396) విరత: - విషయ వాంఛలు లేనివాడు.
397) మార్గ: - మోక్షమునకు మార్గము తానైనవాడు.
398) నేయ: - ఆత్మజ్ఞానము ద్వారా జీవులను నడిపించువాడు.
399) నయ: - జీవులను నడిపించి పరమపదస్థితికి గొనిపోవువాడు.
400) అనయ: - తనను నడుపువాడు మరొకడు లేనివాడు.
401) వీర: - పరాక్రమశాలియైనవాడు.
402) శక్తిమతాం శ్రేష్ఠ: - శక్తిమంతులలో శ్రేష్ఠుడైన భగవానుడు.
403) ధర్మ: - ధర్మ స్వరూపుడు.
404) ధర్మ విదుత్తమ: - ధర్మము నెఱింగినవారిలో శ్రేష్ఠుడు.
405) వైకుంఠ: - సృష్ట్యారంభమున పంచమహాభూతములను సమ్మేళనము చేసినవాడు.
406) పురుష: - ఈ సర్వముకంటే పూర్వమునుండువాడు.
407) ప్రాణ: - ప్రాణరూపమున చేష్ట కల్గించువాడు.
408) ప్రాణద: - ప్రాణమును ప్రసాదించువాడు. ప్రాణము లిచ్చువాడు.
409) ప్రణవ: - ఓంకార స్వరూపుడు.
410) పృథు: - ప్రపంచరూపమున విస్తరించినవాడు.
411) హిరణ్యగర్భ: - బ్రహ్మదేవుని పుట్టుకకు కారణమైనవాడు.
412) శత్రుఘ్న: - శత్రువులను సంహరించువాడు.
413) వ్యాప్త: - సర్వత్ర వ్యాపించియున్నవాడు.
414) వాయు: - వాయురూపమున యుండి సకలమును పోషించువాడు.
415) అథోక్షజ: - స్వరూపస్థితి నుండి ఎన్నడును జాఱనివాడు.
416) ఋతు: - కాలరూపమై తెలియబడు ఋతువులై భాసించువాడు.
417) సుదర్శన: - భక్తులకు మనోహరమగు దర్శనము నొసంగువాడు.
418) కాల: - శతృవులను మృత్యురూపమున త్రోయువాడు.
419) పరమేష్ఠీ - హృదయగుహలో తన మహిమచే ప్రకాశించువాడు.
420) పరిగ్రహ: - గ్రహించువాడు.
421) ఉగ్ర: - ఉగ్రరూపధారి
422) సంవత్సర: - సర్వజీవులకు వాసమైనవాడు.
423) దక్ష: - సమస్త కర్మలను శీఘ్రముగా సమర్థతతో నిర్వర్తించువాడు.
424) విశ్రామ: - జీవులకు పరమ విశ్రాంతి స్థానము అయినవాడు.
425) విశ్వదక్షిణ: - అశ్వమేధయాగములో విశ్వమునే దక్షిణగా ఇచ్చినవాడు.
426) విస్తార: - సమస్త లోకములు తనయందే విస్తరించి ఉన్నవాడు.
427) స్థావర: స్థాణు: - కదులుట మెదలుట లేనివాడు.
428) ప్రమాణం - సకలమునకు ప్రమాణమైనవాడు.
429) బీజమవ్యయం - క్షయము కాని బీజము.
430) అర్థ: - అందరిచే కోరబడినవాడు.
431) అనర్థ: - తాను ఏదియును కోరనివాడు.
432) మహాకోశ: - అన్నమయాది పంచకోశములచే ఆవరించినవాడు.
433) మహాభాగ: - ఆనంద స్వరూపమైన భోగము కలవాడు.
434) మహాధన: - గొప్ప ఐశ్వర్యము కలవాడు.
435) అనిర్విణ్ణ: - వేదన లేనివాడు.
436) స్థవిష్ఠ: - విరాడ్రూపమై భాసించువాడు.
437) అభూ: - పుట్టుక లేనివాడు.
438) ధర్మయూప: - ధర్మము లన్నియు తనయందే ఉన్నవాడు.
439) మహామఖ: - యజ్ఞస్వరూపుడు.
440) నక్షత్రనేమి: - జ్యోతిష చక్రమును ప్రవర్తింపచేయువాడు.
441) నక్షత్రీ - చంద్ర రూపమున భాసించువాడు.
442) క్షమ: - సహనశీలుడు.
443) క్షామ: - సర్వము నశించినను తాను క్షయ మెరుగక మిగిలియుండువాడు.
444) సమీహన: - సర్వ భూతహితమును కోరువాడు.
445) యజ్ఞ: - యజ్ఞ స్వరూపుడు.
446) ఇజ్య: - యజ్ఞములచే ఆరాధించుబడువాడు.
447) మహేజ్య: - గొప్పగా పూజింపదగినవాడు.
448) క్రతు: - యజ్ఞముగా నున్నవాడు.
449) సత్రమ్ - సజ్జనులను రక్షించువాడు.
450) సతాంగతి: - సజ్జనులకు పరమాశ్రయ స్థానమైనవాడు.
451) సర్వదర్శీ - సకలమును దర్శించువాడు.
452) విముక్తాత్మా - స్వరూపత: ముక్తి నొందినవాడు.
453) సర్వజ్ఞ: - సర్వము తెలిసినవాడు.
454) జ్ఞానముత్తమమ్ - ఉత్తమమైన జ్ఞానము కలవాడు భగవానుడు.
455) సువ్రత: - చక్కని వ్రతదీక్ష కలవాడు.
456) సుముఖ: - ప్రసన్న వదనుడు.
457) సూక్ష్మ: - సర్వవ్యాపి.
458) సుఘోష: - చక్కటి ధ్వని గలవాడు.
459) సుఖద: - సుఖమును అనుగ్రహించువాడు.
460) సుహృత్ - ఏ విధమైన ప్రతిఫలము నాశించకనే సుహృద్భావముతో ఉపకారము చేయువాడు.
461) మనోహర: - మనస్సులను హరించువాడు.
462) జితక్రోధ: - క్రోధమును జయించినవాడు.
463) వీరబాహు: - పరాక్రమముగల బాహువులు కలవాడు.
464) విదారణ: - దుష్టులను చీల్చి చెండాడువాడు.
465) స్వాపన: - తన మాయచేత ప్రాణులను ఆత్మజ్ఞాన రహితులుగాజేసి నిద్రపుచ్చువాడు.
466) స్వవశ: - సర్వ స్వతంత్రమైనవాడు.
467) వ్యాపీ - సర్వత్ర వ్యాపించియున్నవాడు.
468) నైకాత్మా - అనేక రూపములలో విరాజిల్లువాడు.
469) నైక కర్మకృత్ - సృష్టి, స్థితి, లయము మున్నగు అనేక కార్యములు చేయువాడు.
470) వత్సర: - సర్వులకు వాసమైనవాడు.
471) వత్సల: - భక్తులపై అపరిమిత వాత్సల్యము కలవాడు.
472) వత్సీ - తండ్రి వంటివాడు.
473) రత్నగర్భ: - సాగరము వలె తన గర్భమున రత్నములు గలవాడు.
474) ధనేశ్వర: - ధనములకు ప్రభువు.
475) ధర్మగుప్ - ధర్మమును రక్షించువాడు.
476) ధర్మకృత్ - ధర్మము నాచరించువాడు.
477) ధర్మీ - ధర్మమునకు ఆధారమైనవాడు.
478) సత్ - మూడు కాలములలో పరిణామ రహితుడై, నిత్యుడై ఉన్నవాడు.
479) అసత్ - పరిణామయుతమైన జగద్రూపమున గోచరించువాడు.
480) క్షర: - వ్యయమగు విశ్వరూపమున తెలియబడువాడు.
481) అక్షర: - క్షరమగు ప్రపంచమున అవినాశియై భాసిల్లువాడు.
482) అవిజ్ఞాతా - తెలుసుకొనువాని కంటెను విలక్షణమైనవాడు.
483) సహస్రాంశు: - అనంత కిరణములు గలవాడు.
484) విధాతా - సర్వమునకు ఆధారమైనవాడు.
485) కృతలక్షణ: - వేదశాస్త్రములను వెలువరించినవాడు.
486) గభస్తినేమి: - మయూఖ చక్రమునకు కేంద్రమైనవాడు.
487) సత్వస్థ: - అందరిలో నుండువాడు.
488) సింహ: - సింహమువలె పరాక్రమశాలియైనవాడు.
489) భూతమహేశ్వర: - సర్వ భూతములకు ప్రభువైనవాడు.
490) ఆదిదేవ: - తొలి దేవుడు.
491) మహాదేవ: - గొప్ప దేవుడు.
492) దేవేశ: - దేవదేవుడు.
493) దేవభృద్గురు: - దేవతల ప్రభువైన మహేంద్రునకు జ్ఞానోపదేశము చేసినవాడు.
494) ఉత్తర: - అందరికంటెను అధికుడై, ఉత్తముడైనవాడు.
495) గోపతి: - గోవులను పాలించువాడు.
496) గోప్తా - సర్వులను సంరక్షించువాడు.
497) జ్ఞానగమ్య: - జ్ఞానము చేతనే తెలియబడినవాడు.
498) పురాతన: - సృష్టికి పూర్వమే వున్నవాడు.
499) శరీరభూతభృత్ - శరీరముల నుత్పన్నము చేయు పంచభూతములను పోషించువాడు.
500) భోక్తా - అనుభవించువాడు.
501) కపీంద్ర: - వానరులకు ప్రభువైనవాడు.
502) భూరిదక్షిణ: - యజ్ఞ సమయములలో విశేషముగా దక్షిణ లిచ్చువాడు.
503) సోమప: - యజ్ఞముల యందు యజింపబడిన దేవతలరూపముతో సోమరసమును పానము చేయువాడు.
504) అమృతప: - ఆత్మానందరసమును అనుభవించువాడు.
505) సోమ: - చంద్రరూపమున ఓషధులను పోషించువాడు.
506) పురుజిత్: - ఒక్కడై అనేకమందిని ఎదురించి, జయించగల్గినవాడు.
507) పురుసత్తమ: - ఉత్తములలో ఉత్తముడైనవాడు.
508) వినయ: - దుష్టులను దండించి, వినయము కల్గించువాడు.
509) జయ: - సర్వులను జయించి వశపరుచుకొనువాడు.
510) సత్యసంధ: - సత్యసంకల్పములు, సత్యవాక్కులు గలవాడు.
511) దాశార్హ: - దశార్హుడనువాని వంశమున పుట్టినవాడు.
512) సాత్వతాంపతి: - యదుకులమునకు ప్రభువు.
513) జీవ: - జీవుడు.
514) వినయితా సాక్షీ - భక్తుల యందలి వినయమును గాంచువాడు.
515) ముకుంద: - ముక్తి నొసగువాడు.
516) అమిత విక్రమ: - అమితమైన పరాక్రామము గలవాడు.
517) అంభోనిధి: - దేవతలు, మనుష్యులు, పితరులు, అసురులు ఈ నాలుగు వర్గములు అంభశబ్ధార్థములు, అంభస్సులు తనయందే ఇమిడి యున్నవాడు.
518) అనంతాత్మా - అనంతమైన ఆత్మస్వరూపుడు.
519) మహోదధిశయ: - వైకుంఠమునందు క్షీరసాగరమున శేషతల్పముపై శయనించువాడు.
520) అంతక: - ప్రళయకాలమున సర్వమును అంతము చేయువాడు.
521) అజ: - పుట్టుకలేనివాడు.
522) మహార్హ: - విశేష పూజకు అర్హుడైనవాడు.
523) స్వాభావ్య: - నిరంతరము స్వరూపజ్ఞానముతో విరాజిల్లువాడు.
524) జితమిత్ర: - శత్రువులను జయించినవాడు.
525) ప్రమోదన: - సదా ఆనందమునందుండువాడు.
526) ఆనంద: - ఆనందమే తన స్వరూపముగా గలవాడు.
527) నందన: - సర్వులకు ఆనందము నొసగువాడు.
528) నంద: - విషయ సంబంధమైన సుఖమునకు దూరుడు.
529) సత్యధర్మా - సత్య, ధర్మ స్వరూపుడు.
530) త్రివిక్రమ: - మూడడుగులచే ముల్లోకములు వ్యాపించినవాడు.
531) మహర్షి: కపిలాచార్య: - వేదవిదుడైన కపిలమునిగా అవతరించినవాడు.
532) కృతజ్ఞ: - సృష్టి, సృష్టికర్త రెండును తానైనవాడు.
533) మేదినీపతి: - భూదేవికి భర్తయైనవాడు.
534) త్రిపద: - మూడు పాదములతో సమస్తము కొలిచినవాడు. వామనుడని భావము.
535) త్రిదశాధ్యక్ష: - జీవులనుభవించు జాగ్రుత, స్వప్న, సుషుప్త్య వస్థలకు సాక్షియైనవాడు.
536) మహాశృంగ: - ప్రళయకాల సాగరములోని నావను గొప్పదియైన తన కొమ్మున బంధించి సత్యవ్రతుని ఆయన అనుచరులైన ఋషులను ప్రళయము నుండి రక్షించినవాడు.
537) కృతాంతకృత్ - మృత్యువుని ఖండించినవాడు.
538) మహావరాహ: - మహిమగల వరాహమూర్తి.
539) గోవింద: - గోవులకు ఆనందాన్నిచ్చువాడు. భూమికి ఆధారభూతమైనవాడు.
540) సుషేణ: - శోభనమైన సేన గలవాడు.
541) కనకాంగదీ - సువర్ణమయములైన భుజకీర్తులు కలవాడు.
542) గుహ్య: - హృదయగుహలో దర్శించదగినవాడు.
543) గభీర: - జ్ఞానము, ఐశ్వర్యము, బలము, వీర్యము మొదలగువానిచే గంభీరముగా నుండువాడు.
544) గహన: - సులభముగా గ్రహించుటకు వీలుకానివాడు.
545) గుప్త: - నిగూఢమైన ఉనికి గలవాడు.
546) చక్రగదాధర: - సుదర్శనమను చక్రమును, కౌమోదకీ యను గదను ధరించినవాడు.
547) వేధా: - సృష్టి చేయువాడు.
548) స్వాంగ: - సృష్టి కార్యమును నిర్వహించుటకు అవసరమగు సాధన సామాగ్రి కూడా తానే అయినవాడు.
549) అజిత: - ఎవనికి తలవొగ్గనివాడై జయింపవీలుకానివాడు.
550) కృష్ణ: - నీలమేఘ శ్యాముడు.
551) దృఢ: - చలించని స్వభావము కలవాడు.
552) సంకర్షణోచ్యుత: - విశ్వమంతయు ప్రళయకాలములో కదిలిపోయినను తానూ ఏ విధమైన పరిణామము చెందనివాడు.
553) వరుణ: - తన కిరణములను ఉపసంహరించుకొను సాయంకాల సూర్యుడు.
554) వారుణ: - వరుణుని కుమారులైన వశిష్ఠుడు మరియు అగస్త్యులుగా వ్యక్తమైనవాడు.
555) వృక్ష: - భక్తులకు అనుగ్రహఛాయ నందించువాడు.
556) పుష్కరాక్ష: - ఆకాశమంతయు వ్యాపించినవాడు.
557) మహామనా: - గొప్ప మనస్సు కలవాడు.
558) భగవాన్ - భగమను ఆరు లక్షణములు సమగ్రముగా యున్నవాడు.
559) భగహా - ప్రళయ సమయమున తన విభూతులను పోగొట్టువాడు.
560) ఆనందీ - ఆనందము నొసంగువాడు.
561) వనమాలీ - వైజయంతి అను వనమాలను ధరించినవాడు.
562) హలాయుధ: - నాగలి ఆయుధముగా కలవాడు.
563) ఆదిత్య: - అదితి యొక్క కుమారుడు. వామనుడు.
564) జ్యోతిరాదిత్య: - సూర్యునియందు తేజోరూపమై భాసిల్లువాడు.
565) సహిష్ణు: - ద్వంద్వములను సహించువాడు.
566) గతిసత్తమ: - సర్వులకు గతియై ఉన్నవాడు.
567) సుధన్వా - శార్ఙమను (శారంగ ధనువు) గొప్ప ధనువును ధరించినవాడు.
568) ఖండ పరశు: - శత్రువులను ఖండించునట్టి గొడ్డలిని ధరించినవాడు.
569) దారుణ: - దుష్టులైన వారికి భయమును కలిగించువాడు.
570) ద్రవిణప్రద: - భక్తులకు కావలిసిన సంపదలను ఇచ్చువాడు.
571) దివ: సృక్ - దివిని అంటియున్నవాడు.
572) సర్వదృగ్య్వాస: - సమస్తమైన జ్ఞానములను వ్యాపింపచేయు వ్యాసుడు.
573) వాచస్పతి రయోనిజ: - విద్యలకు పతి, మరియు మాతృగర్భమున జన్మించనివాడు.
574) త్రిసామా - మూడు సామ మంత్రములచే స్తుతించబడువాడు.
575) సామగ: - సామగానము చేయు ఉద్గాత కూడ తానే అయినవాడు.
576) సామ - సామవేదము తానైనవాడు.
577) నిర్వాణమ్ - సమస్త దు:ఖ విలక్షణమైన పరమానంద స్వరూపుడు.
578) భేషజం - భవరోగమును నివారించు దివ్యౌషధము తానైనవాడు.
579) భిషక్ - భవరోగమును నిర్మూలించు వైద్యుడు.
580) సంన్యాసకృత్ - సన్యాస వ్యవస్థను ఏర్పరచినవాడు.
581) శమ: - శాంత స్వరూపమైనవాడు.
582) శాంత: - శాంతి స్వరూపుడు.
583) నిష్ఠా - ప్రళయ కాలమున సర్వజీవులకు లయస్థానమైనవాడు.
584) శాంతి: - శాంతి స్వరూపుడు.
585) పరాయణమ్ - పరమోత్కృష్ట స్థానము.
586) శుభాంగ: - మనోహరమైన రూపము గలవాడు.
587) శాంతిద: - శాంతిని ప్రసాదించువాడు.
588) స్రష్టా - సృష్ట్యారంభమున జీవులందరిని ఉత్పత్తి చేసినవాడు.
589) కుముద: - కు అనగా భూమి, ముద అనగా సంతోషము. భూమి యందు సంతోషించువాడు.
590) కువలేశయ: - భూమిని చుట్టియున్న సముద్రమునందు శయనించువాడు.
591) గోహిత: - భూమికి హితము చేయువాడు.
592) గోపతి: - భూదేవికి భర్తయైనవాడు.
593) గోప్తా - జగత్తును రక్షించువాడు.
594) వృషభాక్ష: - ధర్మదృష్టి కలవాడు.
595) వృషప్రియ: - ధర్మమే ప్రియముగా గలవాడు.
596) అనివర్తీ - ధర్మ మార్గమున ఎన్నడూ వెనుకకు మఱలని వాడు.
597) నివృత్తాత్మా - నియమింపబడిన మనసు గలవాడు.
598) సంక్షేప్తా - జగత్తును ప్రళయకాలమున సూక్షము గావించువాడు.
599) క్షేమకృత్ - క్షేమమును గూర్చువాడు.
600) శివ: - తనను స్మరించు వారలను పవిత్రము చేయువాడు.
601) శ్రీవత్సవక్షా - శ్రీ వత్సమనెడి చిహ్నమును వక్షస్థలమున ధరించినవాడు.
602) శ్రీ వాస: - వక్షస్థలమున లక్ష్మీదేవికి వాసమైనవాడు.
603) శ్రీపతి: - లక్ష్మీదేవికి భర్తయైనవాడు.
604) శ్రీమతాంవరా: - శ్రీమంతులైన వారిలో శ్రేష్ఠుడు.
605) శ్రీ ద: - భక్తులకు సిరిని గ్రహించువాడు.
606) శ్రీ శ: - శ్రీ దేవికి నాథుడైనవాడు.
607) శ్రీనివాస: - ఆధ్యాత్మిక ఐశ్వర్యవంతులైనవారి హృదయముల యందు వసించువాడు.
608) శ్రీ నిధి: - ఐశ్వర్య నిధి.
609) శ్రీ విభావన: - సిరులను పంచువాడు.
610) శ్రీ ధర: - శ్రీదేవిని వక్షస్థలమున ధరించినవాడు.
611) శ్రీ కర: - శుభముల నొసగువాడు.
612) శ్రేయ: - మోక్ష స్వరూపుడు.
613) శ్రీమాన్ - సర్వ విధములైన ఐశ్వర్యములు గలవాడు.
614) లోకత్రయాశ్రయ: - ముల్లోకములకు ఆశ్రయమైనవాడు.
615) స్వక్ష: - చక్కని కన్నులు కలవాడు.
616) స్వంగ: - చక్కని అంగములు కలవాడు.
617) శతానంద: - అసంఖ్యాకమైన ఉపాధుల ద్వారా ఆనందించువాడు.
618) నంది: - పరమానంద స్వరూపుడు.
619) జ్యోతిర్గణేశ్వర: - జ్యోతిర్గణములకు ప్రభువు.
620) విజితాత్మ - మనస్సును జయించువాడు.
621) విధేయాత్మా - సదా భక్తులకు విధేయుడు.
622) సత్కీర్తి: - సత్యమైన యశస్సు గలవాడు.
623) ఛిన్నసంశయ: - సంశయములు లేనివాడు.
624) ఉదీర్ణ: - సర్వ జీవుల కంటెను ఉత్క్రష్టుడు.
625) సర్వతశ్చక్షు: - అంతటను నేత్రములు గలవాడు.
626) అనీశ: - తనకు ప్రభువు గాని, నియామకుడు గాని లేనివాడు.
627) శాశ్వతస్థిర: - శాశ్వతుడు స్థిరుడు.
628) భూశయ: - భూమిపై శయనించువాడు.
629) భూషణ: - తానే ఆభరణము, అలంకారము అయినవాడు.
630) భూతి: - సర్వ ఐశ్వర్యములకు నిలయమైనవాడు.
631) విశోక: - శోకము లేనివాడు.
632) శోకనాశన: - భక్తుల శోకములను నశింపచేయువాడు.
633) అర్చిష్మాన్ - తేజోరూపుడు.
634) అర్చిత: - సమస్త లోకములచే పూజింపబడువాడు.
635) కుంభ: - సర్వము తనయందుండువాడు.
636) విశుద్ధాత్మా - పరిశుద్ధమైన ఆత్మ స్వరూపుడు.
637) విశోధనః - తనను స్మరించు వారి పాపములను నశింపచేయువాడు
638) అనిరుద్ధః - శత్రువులచే అడ్డగింపబడనివాడు.
639) అప్రతిరథ: - తన నెదుర్కొను ప్రతిపక్షము లేని పరాక్రమవంతుడు.
640) ప్రద్యుమ్న: - విశేష ధనము కలవాడు.
641) అమిత విక్రమ: - విశేష పరాక్రమము గలవాడు.
642) కాలనేమినిహా - కాలనేమి యను రాక్షసుని వధించినవాడు.
643) వీర: - వీరత్వము గలవాడు.
644) శౌరి: - శూరుడను వాడి వంశమున పుట్టినవాడు.
645) శూరజనేస్వర: - శూరులలో శ్రేష్ఠుడు.
646) త్రిలోకాత్మా - త్రిలోకములకు ఆత్మయైనవాడు.
647) త్రిలోకేశ: - మూడు లోకములకు ప్రభువు.
648) కేశవ: - పొడవైన కేశములు గలవాడు.
649) కేశిహా: - కేశి యనుడి రాక్షసుని చంపినవాడు.
650) హరి: - అజ్ఞాన జనిత సంసార దు:ఖమును సమూలముగా అంతమొందించువాడు.
651) కామదేవ: - చతుర్విధ పురుషార్థములను కోరువారిచే పూజింపబడువాడు.
652) కామపాల: - భక్తులు తననుండి పొందిన పురుషార్థములను చక్కగా ఉపయోగపడునట్లు చూచువాడు.
653) కామీ - సకల కోరికలు సిద్ధించినవాడు.
654) కాంత: - రమణీయ రూపధారియైన వాడు.
655) కృతాగమ: - శ్రుతి, స్తృతి ఇత్యాది శాస్త్రములు రచించినవాడు.
656) అనిర్దేశ్యవపు: - నిర్దేశించి, నిర్వచించుటకు వీలుకానివాడు.
657) విష్ణు: - భూమ్యాకాశాలను వ్యాపించినవాడు.
658) వీర: - వీ ధాతువుచే సూచించు కర్మలచే నిండియున్నవాడు.
659) అనంత: - సర్వత్రా, సర్వకాలములందు ఉండువాడు.
660) ధనంజయ: - ధనమును జయించినవాడు.
661) బ్రహ్మణ్య: - బ్రహ్మను అభిమానించువాడు.
662) బ్రహ్మకృత్ - తపస్సు మొదలైనవిగా తెలియజేయుబడిన బ్రహ్మకు తానే కర్త అయినవాడు.
663) బ్రహ్మా - బ్రహ్మదేవుని రూపమున తానే సృష్టి చేయువాడు.
664) బ్రహ్మ - బ్రహ్మ అనగా పెద్దదని అర్థము.
665) బ్రహ్మవివర్థన: - తపస్సు మొదలైనవానిని వృద్ధి నొందించువాడు.
666) బ్రహ్మవిత్ - బ్రహ్మమును చక్కగా తెలిసినవాడు.
667) బ్రాహ్మణ: - వేదజ్ఞానమును ప్రబోధము చేయువాడు.
668) బ్రహ్మీ - తపస్యాది బ్రహ్మము తనకు అంగములై భాసించువాడు.
669) బ్రహ్మజ్ఞ: - వేదములే తన స్వరూపమని తెలిసికొనిన వాడు.
670) బ్రాహ్మణప్రియ: - బ్రహ్మజ్ఞానులైన వారిని ప్రేమించువాడు.
671) మహాక్రమ: - గొప్ప పధ్ధతి గలవాడు.
672) మహాకర్మా - గొప్ప కర్మను ఆచరించువాడు.
673) మహాతేజా: - గొప్ప తేజస్సు గలవాడు.
674) మహోరగ: - గొప్ప సర్ప స్వరూపుడు.
675) మహాక్రతు: - గొప్ప యజ్ఞ స్వరూపుడు.
676) మహాయజ్వా - విశ్వ శ్రేయమునకై అనేక యజ్ఞములు నిర్వహించినవాడు.
677) మహాయజ్ఞ: - గొప్ప యజ్ఞ స్వరూపుడు.
678) మహాహవి: - యజ్ఞమునందలి హోమసాధనములు, హోమద్రవ్యములు అన్నిటి స్వరూపుడు.
679) స్తవ్య: - సర్వులచే స్తుతించబడువాడు.
680) స్తవప్రియ: - స్తోత్రములయందు ప్రీతి కలవాడు.
681) స్తోత్రం - స్తోత్రము కూడా తానే అయినవాడు.
682) స్తుతి: - స్తవనక్రియ కూడా తానే అయినవాడు.
683) స్తోతా - స్తుతించు ప్రాణి కూడా తానే అయినవాడు.
684) రణప్రియ: - యుద్ధమునందు ప్రీతి కలవాడు.
685) పూర్ణ: - సర్వము తనయందే గలవాడు.
686) పూరయితా - తన నాశ్రయించిన భక్తులను శుభములతో నింపువాడు.
687) పుణ్య: - పుణ్య స్వరూపుడు.
688) పుణ్యకీర్తి: - పవిత్రమైన కీర్తి గలవాడు.
689) అనామయ: - ఏవిధమైన భౌతిక, మానసిక వ్యాధులు దరిచేరనివాడు.
690) మనోజవ: - మనసు వలె అమిత వేగము కలవాడు.
691) తీర్థకర: - సకల విద్యలను రచించినవాడు.
692) వసురేతా: - బంగారము వంటి వీర్యము గలవాడు.
693) వసుప్రద: - ధనమును ఇచ్చువాడు.
694) వసుప్రద: - మోక్షప్రదాత
695) వాసుదేవ: - వాసుదేవునకు కుమారుడు.
696) వసు: - సర్వులకు శరణ్యమైనవాడు.
697) వసుమనా: - సర్వత్ర సమమగు మనస్సు గలవాడు.
698) హవి: - తానే హవిస్వరూపుడైనవాడు.
699) సద్గతి: - సజ్జనులకు పరమగతియైన వాడు.
700) సత్కృతి: - జగత్కళ్యాణమైన ఉత్తమ కార్యము.
701) సత్తా - సజాతీయ విజాతీయ స్వగత భేదరహితమైన అనుభవ స్వరూపము.
702) సద్భూతి: - పరమోత్కృష్టమైన మేధా స్వరూపుడు.
703) సత్పరాయణ: - సజ్జనులకు పరమగతి అయినవాడు.
704) శూరసేన: - శూరత్వము గల సైనికులు గలవాడు.
705) యదుశ్రేష్ఠ: - యాదవులలో గొప్పవాడు.
706) సన్నివాస: - సజ్జనులకు నిలయమైనవాడు.
707) సుయామున: - యమునా తీర వాసులగు గోపకులచే పరివేష్ఠింప బడినవాడు.
708) భూతవాస: - సర్వ భూతములకు నిలయమైనవాడు.
709) వాసుదేవ: - తన మాయాశక్తిచే సర్వము ఆవరించియున్నవాడు. వసుదేవుని కుమారుడు.
710) సర్వాసు నిలయ: - సమస్త జీవులకు, ప్రాణులకు నిలయమైనవాడు.
711) అనల: - అపరిమిత శక్తి, సంపద గలవాడు.
712) దర్పహా - దుష్టచిత్తుల గర్వమణుచు వాడు.
713) దర్పద: - ధర్మమార్గమున చరించువారికి దర్పము నొసంగువాడు.
714) దృప్త: - సదా ఆత్మానందామృత రసపాన చిత్తుడు.
715) దుర్థర: - ధ్యానించుటకు, బంధించుటకు సులభసాధ్యము కానివాడు.
716) అపరాజిత: - అపజయము పొందనివాడు.
717) విశ్వమూర్తి: - విశ్వమే తన మూర్తిగా గలవాడు.
718) మహామూర్తి: - గొప్ప మూర్తి గలవాడు.
719) దీప్తమూర్తి: - సంపూర్ణ జ్ఞానముతో ప్రకాశించువాడు.
720) అమూర్తివాన్ - కర్మాధీనమైన దేహమే లేనివాడు.
721) అనేకమూర్తి: - అనేక మూర్తులు ధరించినవాడు.
722) అవ్యక్త: - అగోచరుడు.
723) శతమూర్తి: - అనేక మూర్తులు ధరించినవాడు.
724) శతానన: - అనంత ముఖములు గలవాడు.
725) ఏక: - ఒక్కడే అయినవాడు.
726) నైక: - అనేక రూపములు గలవాడు.
727) సవ: - సోమయాగ రూపమున ఉండువాడు. ఏకముగా, అనేకముగా తానే యుండుటచేత తాను పూర్ణరూపుడు.
728) క: - సుఖ స్వరూపుడు.
729) కిమ్ - అతడెవరు? అని విచారణ చేయదగినవాడు.
730) యత్ - దేనినుండి సర్వభూతములు ఆవిర్భవించుచున్నవో ఆ బ్రహ్మము.
731) తత్ - ఏది అయితే వ్యాపించిఉన్నదో అది అయినవాడు.
732) పదం-అనుత్తమం - ముముక్షువులు కోరు ఉత్తమస్థితి తాను అయినవాడు.
733) లోకబంధు: - లోకమునకు బంధువైనవాడు.
734) లోకనాధ: - లోకములకు ప్రభువు
735) మాధవ: - మౌన, ధ్యాన, యోగాదుల వలన గ్రహించుటకు శక్యమైనవాడు.
736) భక్తవత్సల: - భక్తుల యందు వాత్సల్యము గలవాడు.
737) సువర్ణవర్ణ: - బంగారు వంటి వర్ణము గలవాడు.
738) హేమాంగ: - బంగారు వన్నెగల అవయువములు గలవాడు.
739) వరంగ: - గొప్పవైన అవయువములు గలవాడు.
740) చందనాంగదీ - ఆహ్లాదకరమైన చందనముతోను కేయూరములతోను అలంకృతమైనవాడు.
741) వీరహా - వీరులను వధించినవాడు.
742) విషమ: - సాటిలేనివాడు.
743) శూన్య: - శూన్యము తానైనవాడు.
744) ఘృతాశీ: - సమస్త కోరికలనుండి విడువడినవాడు.
745) అచల: - కదలిక లేనివాడు.
746) చల: - కదులువాడు.
747) అమానీ - నిగర్వి, నిరహంకారుడు.
748) మానద: - భక్తులకు గౌరవము ఇచ్చువాడు.
749) మాన్య: - పూజింపదగిన వాడైన భగవానుడు.
750) లోకస్వామీ - పదునాలుగు భువనములకు ప్రభువు.
751) త్రిలోకథృక్ - ముల్లోకములకు ఆధారమైన భగవానుడు.
752) సుమేధా: - చక్కని ప్రజ్ఞ గలవాడు.
753) మేధజ: - యజ్ఞము నుండి ఆవిర్భవించినవాడు.
754) ధన్య: - కృతార్థుడైనట్టివాడు.
755) సత్యమేధ: - సత్య జ్ఞానము కలవాడు.
756) ధరాధర: - భూమిని ధరించి యున్నవాడు.
757) తేజోవృష: - సూర్యతేజముతో నీటిని వర్షించువాడు.
758) ద్యుతిధర: - కాంతివంతమైన శరీరమును ధరించినవాడు.
759) సర్వ శస్త్ర భృతాంవర: - శస్త్రములను ధరించినవారిలో శ్రేష్ఠుడైనవాడు.
760) ప్రగ్రహ: - ఇంద్రియములనెడి అశ్వములను తన అనుగ్రహము అనెడి పగ్గముతో కట్టివేయువాడు.
761) నిగ్రహ: - సమస్తమును నిగ్రహించువాడు.
762) వ్యగ్ర: - భక్తులను తృప్తి పరుచుటలో సదా నిమగ్నమై ఉండువాడు.
763) నైకశృంగ: - అనేక కొమ్ములు గలవాడు, భగవానుడు.
764) గదాగ్రజ: - గదుడను వానికి అన్న.
765) చతుర్మూర్తి: - నాలుగు రూపములు గలవాడు.
766) చతుర్బాహు: - నాలుగు బాహువులు గలవాడు.
767) చతుర్వ్యూహ: - శరీర, వేద, ఛందో మహద్రూపుడైన పురుషుడు. ఈ నలుగురు పురుషులు వ్యూహములుగా కలవాడు.
768) చతుర్గతి: - నాలుగు విధములైన వారికి ఆశ్రయ స్థానము.
769) చతురాత్మా - చతురమనగా సామర్ధ్యము.
770) చతుర్భావ: - చతుర్విద పురుషార్థములకు మూలమైనవాడు.
771) చతుర్వేదవిత్ - నాలుగు వేదములను తెలిసినవాడు.
772) ఏకపాత్ - జగత్తంతయు ఒక పాదముగా గలవాడు.
773) సమావర్త: - సంసార చక్రమును సమర్థతతో త్రిప్పువాడు.
774) అనివృత్తాత్మా - అంతయు తానైయున్నందున దేనినుండియు విడివడినవాడు.
775) దుర్జయ: - జయింప శక్యము గానివాడు.
776) దురతిక్రమ: - అతిక్రమింపరాని విధమును సాసించువాడు.
777) దుర్లభ: - తేలికగా లభించనివాడు.
778) దుర్గమ: - మిక్కిలి కష్టముతో మాత్రమే పొందబడినవాడు.
779) దుర్గ: - సులభముగా లభించనివాడు.
780) దురావాస: - యోగులకు కూడా మనస్సున నిలుపుకొనుటకు కష్టతరమైనవాడు.
781) దురారిహా: - దుర్మార్గులను వధించువాడు.
782) శుభాంగ: - దివ్యములైన, సుందరములైన అవయువములు గలవాడు.
783) లోకసారంగ: - లోకములోని సారమును గ్రహించువాడు.
784) సుతంతు: - జగద్రూపమున అందమైన తంతువువలె విస్తరించినవాడు.
785) తంతువర్థన: - వృద్ధి పరచువాడు, నాశనము చేయువాడు.
786) ఇంద్రకర్మా - ఇంద్రుని కర్మవంటి శుభప్రధమైన కర్మ నాచరించువాడు.
787) మహాకర్మా - గొప్ప కార్యములు చేయువాడు.
788) కృతకర్మా - ఆచరించదగిన కార్యములన్నియు ఆచరించినవాడు.
789) కృతాగమ: - వేదముల నందించువాడు.
790) ఉద్భవ: - ఉత్క్రష్టమైన జన్మ గలవాడు.
791) సుందర: - మిక్కిలి సౌందర్యవంతుడు.
792) సుంద: - కరుణా స్వరూపుడు.
793) రత్నగర్భ: - రత్నమువలె సుందరమైన నాభి గలవాడు.
794) సులోచన: - అందమైన నేత్రములు కలిగిన భగవానుడు.
795) అర్క: - శ్రేష్టులైన బ్రహ్మాదుల చేతను అర్చించబడువాడు.
796) వాజసన: - అర్థించు వారలకు ఆహారము నొసంగువాడని భావము.
797) శృంగీ - శృంగము గలవాడు.
798) జయంత: - సర్వ విధములైన విజయములకు ఆధారభూతుడు.
799) సర్వవిజ్జయీ - సర్వవిద్ అనగా సర్వము తెలిసినవాడు.
800) సువర్ణబిందు: - బంగారము వంటి అవయువములు గలవాడు.
801) అక్షోభ్య: - క్షోభ తెలియనివాడు.
802) సర్వవాగీశ్వరేశ్వర: - వాక్పతులైన బ్రహ్మాదులకు కూడ ప్రభువైన భగవానుడు.
803) మహాహ్రద: - గొప్ప జలాశయము.
804) మహాగర్త : - అగాధమైన లోయ వంటివాడు.
805) మహాభూత: - పంచభూతములకు అతీతమైనవాడు.
806) మహానిధి: - సమస్త భూతములు తనయందు ఉన్నవాడు.
807) కుముద: - కు అనగా భూమి . అట్టి భూమి యొక్క భారమును తొలగించి మోదమును కూర్చువాడు.
808) కుందర: - భూమిని చీల్చుకుపోయినవాడు.
809) కుంద: - భూమిని దానమిచ్చినవాడు.
810) పర్జన్య: - మేఘము వర్షించి భూమిని చల్లబరుచునట్లు జీవుల తాపత్రయములను తొలగించి,వారి మనస్సులను శాంతింపచేయువాడు భగవానుడు.
811) పావన: - పవిత్రీకరించువాడు.
812) అనిల: - ప్రేరణ చేయువాడు, సదా జాగరూకుడు.
813) అమృతాశ: - అమృతము నొసంగువాడు.
814) అమృతవపు: - అమృతస్వరూపుడు శాశ్వతుడు.
815) సర్వజ్ఞ: - సర్వము తెలిసినవాడు.
816) సర్వతోముఖ: - ఏకకాలమున సర్వమును వీక్షించగలవాడు.
817) సులభ: - భక్తితో తనను స్మరించువారికి సులభముగా లభ్యమగువాడు.
818) సువ్రత: - మంచి వ్రతము గలవాడు.
819) సిద్ధ: - సత్వస్వరూపుడై, పూర్ణరూపుడై భగవానుడు సిద్ధ: అని తెలియబడువాడు.
820) శత్రుజిత్ - శత్రువులను జయించువాడు.
821) శత్రుతాపన: - దేవతల విరోదులైన వారిని,సజ్జనులకు విరోధులైన వారిని తపింప చేయువాడు.
822) న్యగ్రోధ: - సర్వ భూతములను తన మాయచే ఆవరించి ఉన్నవాడు.
823) ఉదుంబర: - అన్నముచేత విశ్వమును పోషించువాడు.
824) అశ్వత్ధ: - అశాశ్వతమైన సంసార వృక్ష స్వరూపుడు.
825) చాణూరాంధ్ర నిషూదన: - చాణూరుడను మల్లయోధుని వధించినవాడు.
826) సహస్రార్చి: - అనంతకిరణములు కలవాడు.
827) సప్తజిహ్వ: - ఏడు నాలుకలుగల అగ్నిస్వరూపుడు.
828) సప్తైథా: - ఏడు దీప్తులు కలవాడు.
829) సప్తవాహన: -ఏడు గుఱ్ఱములు వాహనములుగా కలవాడు.
830) అమూర్తి: - రూపము లేనివాడు.
831) అనఘ: - పాపరహితుడు.
832) అచింత్య: - చింతించుటకు వీలుకానివాడు.
833) భయకృత్ - దుర్జనులకు భీతిని కలిగించువాడు.
834) భయనాశన: - భయమును నశింపచేయువాడు.
835) అణు: - సూక్షాతి సూక్షమైనవాడు.
836) బృహుత్ - మిక్కిలి పెద్దది అయిన బ్రహ్మము స్వరూపము.
837) కృశ: - సన్ననివాడై, అస్థూలమైనవాడు.
838) స్థూల: - స్థూల స్వరూపము కలిగియున్నవాడు.
839) గుణభృత్ - సత్వరజోస్తమో గుణములకు ఆధారమైనవాడు.
840) నిర్గుణ: - గుణములు తనలో లేనివాడు.
841) మహాన్ - దేశకాలాదుల నధిగమించి యున్నవాడు.
842) అధృత: - సర్వము తానే ధరించియుండి, తనను ధరించునది మరియొకటి లేనివాడు.
843) స్వధృత: - తనకు తానే ఆధారమైనవాడైన భగవానుడు.
844) స్వాస్య: - విశ్వశ్రేయమునకై వేదములను వెలువరించినవాడు.
845) ప్రాగ్వంశ: - ప్రాచీనమైన వంశము కలవాడు.
846) వంశవర్థన: - తన వంశమును వృద్ధినొందించువాడు.
847) భారభృత్ - భారమును మోయువాడు.
848) కథిత: - వేదములచేత సర్వోత్తముడుగా కీర్తించబడినవాడు.
849) యోగీ - ఆత్మజ్ఞానము నందే సదా ఓలలాడు వాడు.
850) యోగీశ: - యోగులకు ప్రభువు.
851) సర్వ కామద: - సకల కోరికలను తీర్చువాడు.
852) ఆశ్రమ: - జీవులకు విశ్రాంతి స్థానమైనవాడు.
853) శ్రమణ: - భక్తిహీనులను, వివేకరహితులను శ్రమ పెట్టువాడు.
854) క్షామ: - సర్వ జీవులను క్షీణింపజేయువాడు.
855) సుపర్ణ: - రమణీయ పత్రములు కలిగిన వృక్షము తానైనవాడు.
856) వాయువాహన: - వాయు చలనమునకు కారణభూతుడైనవాడు.
857) ధనుర్ధర: - ధనస్సును ధరించినవాడు.
858) ధనుర్వేద: - ధనుర్వేదము తెలిసినవాడు.
859) దండ: - దండించువాడు.
860) దమయితా - శిక్షించువాడు.
861) దమ: - శిక్షానుభవము ద్వారా ఏర్పడు పవిత్రత తానైనవాడు.
862) అపరాజిత: - పరాజయము తెలియనివాడు.
863) సర్వసహ: - సమస్త శత్రువులను సహించువాడు.
864) నియంతా - అందరినీ తమతమ కార్యములందు నియమించువాడు.
865) అనియమ: - నియమము లేనివాడు.
866) ఆయమ: - మృత్యుభీతి లేనివాడు.
867) సత్త్వావాన్ - సత్త్వము గలవాడు.
868) సాత్త్విక: - సత్త్వగుణ ప్రధానుడైనవాడు.
869) సత్య: - సత్పురుషుల విషయములో మంచిగా ప్రవర్తించువాడు.
870) సత్యధర్మ పరాయణ: - సత్య విషయమునందును, ధర్మ విషయమునందును దీక్షాపరుడైనవాడు.
871) అభిప్రాయ: - అభిలషించు వారిచేత అభిప్రాయపడువాడు.
872) ప్రియార్హ: - భక్తుల ప్రేమకు పాత్రుడైనవాడు.
873) అర్హ: - అర్పింపబడుటకు అర్హుడైనవాడు.
874) ప్రియకృత్ - తన నాశ్రయించినవారికి ప్రియము నొసగూర్చువాడు.
875) ప్రీతివర్ధన: - భక్తులలో భవవంతునిపై ప్రీతిని వృద్ధి చేయువాడు.
876) విహాయన గతి: - ఆకాశము ఆశ్రయముగ గలదియైన విష్ణుపదము తానైనవాడు.
877) జ్యోతి: - తన ప్రకాశము చేత సర్వమును ప్రకాశింపచేయువాడు.
878) సురుచి: - అందమైన ప్రకాశము గలవాడు.
879) హుతభుక్ - యజ్ఞములందు ఆవాహన చేయబడిన దేవతల రూపమున హవిస్సులను స్వీకరించువాడు.
880) విభు: - సర్వ లోకములకు ప్రభువైనవాడు.
881) రవి: - తన విభూతియైన సూర్యుని ద్వారా భూమినుండి సర్వరసములను గ్రహించువాడు.
882) విలోచన: - వివిధ రూపముల ద్వారా ప్రకాశించువాడు.
883) సూర్య: - ప్రాణులకు ప్రాణశక్తిని ప్రసాదించువాడు.
884) సవితా: - సమస్త జగత్తును ఉత్పన్నము చేయువాడు.
885) రవిలోచన: - సూర్యుడు నేత్రములుగా కలవాడు.
886) అనంత: - అంతము లేనివాడు.
887) హుతభుక్ - హోమద్రవ్యము నారిగించువాడు.
888) భోక్తా - భోగ్యవస్తువైన ప్రకృతిని అనుభవించువాడు.
889) సుఖద: - భక్తులకు ఆత్మసుఖము నొసంగువాడు.
890) నైకజ: - అనేక రూపములలో అవతరించువాడు.
891) అగ్రజ: - సృష్ట్యారంభమునకు ముందే ఆవిర్భవించినవాడు.
892) అనిర్వణ్ణ: - నిరాశ నెరుగనివాడు.
893) సదామర్షీ - సజ్జనుల దోషములను క్షమించువాడు.
894) లోకాధిష్టానం - ప్రపంచమంతటికి ఆధారభూతుడు.
895) అధ్బుత: - ఆశ్చర్య స్వరూపుడు.
896) సనాత్ - ఆది లేనివాడు.
897) సనాతన సమ: - సృష్టికర్త యైన బ్రహ్మకు పూర్వము కూడా యున్నవాడు.
898) కపిల: - ఋషులలో కపిలుడు తానైనవాడు.
899) కపి: - సూర్యరూపుడు.
900) అవ్యయ: - ప్రళయకాలము నందు సమస్తము తనలో లీనమగుటకు విశ్రామ స్థానమైనవాడు.
901) స్వస్తిద: - సర్వశ్రేయములను చేకూర్చువాడు.
902) స్వస్తికృత్ - శుభమును కూర్చువాడు.
903) స్వస్తి - సర్వ మంగళ స్వరూపుడు.
904) స్వస్తిభుక్ - శుభమును అనుభవించువాడు.
905) స్వస్తిదక్షిణ: - స్మరణ మాత్రముననే సర్వ శుభములు సమకూర్చువాడు.
906) అరౌద్ర: - రౌద్రము లేనివాడు.
907) కుండలీ - మకర కుండలములు ధరించినవాడు.
908) చక్రీ - సుదర్శనమను చక్రమును ధరించినవాడు.
909) విక్రమీ - గొప్ప శూరుడైన భగవానుడు.
910) ఊర్జిత శాసన: - ఉల్లంఘించుటకు వీలులేని శాసనములు కలవాడు.
911) శబ్దాతిగ: - వాక్కుకు అందనివాడు.
912) శబ్దసహ: - సమస్త వేదములు తెలియబడినవాడు.
913) శిశిర: - శిశిర ఋతువువలె చల్లబరుచువాడు.
914) శర్వరీకర: - రాత్రిని కలుగజేయువాడు.
915) అక్రూర: - క్రూరత్వము లేనివాడు.
916) పేశల: - మనోవాక్కాయ కర్మలచే రమణీయముగ నుండువాడై పేశల: అని స్తుతించబడును.
917) దక్ష: - సమర్థుడైనవాడు.
918) దక్షిణ: - భక్తులను ఔదార్యముతో బ్రోచువాడు.
919) క్షమిణాం వర: - సహనశీలు లైన వారిలందరిలో శ్రేష్ఠుడు.
920) విద్వత్తమ: - సర్వజ్ఞత్తము కలిగియుండి, అందరిలో ఉత్తమమైనవాడు.
921) వీతభయ: - భయము లేనివాడు.
922) పుణ్యశ్రవణ కీర్తన: - తనను గూర్చి శ్రవణము గాని, కీర్తన గాని పుణ్యము కలుగజేయును.
923) ఉత్తారణ: - సంసార సముద్రమును దాటించువాడు.
924) దుష్కృతిహా - సాధకులలో యున్న చెడువాసనలను అంతరింప చేయువాడు.
925) ప్రాణ: - ప్రాణులకు పవిత్రతను చేకూర్చు పుణ్య స్వరూపుడు.
926) దుస్వప్న నాశన: - చెడు స్వప్నములను నాశనము చేయువాడు.
927) వీరహా - భక్తులు మనస్సులు వివిధ మార్గములలో ప్రయాణించకుండ క్రమము చేయువాడు.
928) రక్షణ: - రక్షించువాడైనందున భగవానుడు రక్షణ: అని స్తవనీయుడయ్యెను.
929) సంత: - పవిత్ర స్వరూపుడు.
930) జీవన: - సర్వ జీవులయందు ప్రాణశక్తి తానైనవాడు.
931) పర్యవస్థిత: - అన్నివైపుల అందరిలో వ్యాపించి యున్నవాడు.
932) అనంతరూప: - అనంతమైన రూపములు గలవాడు.
933) అనంత శ్రీ: - అంతము లేని శక్తివంతుడైనవాడు.
934) జితమన్యు: - క్రోధము ఎఱగని వాడు.
935) భయాపహ: - భయమును పోగొట్టువాడు.
936) చతురశ్ర: - జీవులకు కర్మఫలములను న్యాయముగా పంచువాడు.
937) గభీరాత్మా - గ్రహింప శక్యము గాని స్వరూపము గలవాడు.
938) విదిశ: - అధికారులైన వారికి ఫలము ననుగ్రహించుటలో ప్రత్యేకత కలిగియున్నవాడు.
939) వ్యాదిశ: - వారి వారి అర్హతలను గమనించి బ్రహ్మాదులను సైతము నియమించి, ఆజ్ఞాపించువాడు.
940) దిశ: - వేదముద్వారా మానవుల కర్మఫలములను తెలియజేయువాడు.
941) అనాది: - ఆదిలేనివాడు.
942) భూర్భువ: - సర్వభూతములకు ఆధారమైన భూమికి కూడా భూ: ఆధారమైనవాడు.
943) లక్ష్మీ: - లక్ష్మీ స్వరూపుడు.
944) సువీర: - అనేక విధములైన సుందర పోకడలు గలవాడు.
945) రుచిరాంగద: - మంగళమైన బాహువులు గలవాడు.
946) జనన: - సర్వ ప్రాణులను సృజించినవాడు.
947) జన జన్మాది: - జన్మించు ప్రాణుల జన్మకు ఆధారమైనవాడు.
948) భీమ: - అధర్మపరుల హృదయములో భీతిని కలిగించు భయరూపుడు.
949) భీమ పరాక్రమ: - విరోధులకు భయంకరమై గోచరించువాడు.
950) ఆధార నిలయ: - సృష్టికి ఆధారమైన పృధ్వి, జలము, తేజము, వాయువు, ఆకాశము అను పంచ మహాభూతములకు ఆధారమైనవాడు.
951) అధాతా - తానే ఆధారమైనవాడు.
952) పుష్టహాస: - మొగ్గ పువ్వుగా వికసించునట్లు ప్రపంచరూపమున వికసించువాడు.
953) ప్రజాగర: - సదా మేల్కొనియుండువాడు.
954) ఊర్ధ్వగ: - సర్వుల కన్నా పైనుండువాడు.
955) సత్పధాచార: - సత్పురుషుల మార్గములో చరించువాడు.
956) ప్రాణద: - ప్రాణ ప్రదాత యైనవాడు.
957) ప్రణవ: - ప్రణవ స్వరూపుడైనవాడు.
958) పణ: - సర్వ కార్యములను నిర్వహించువాడు.
959) ప్రమాణ: - స్వయముగానే జ్ఞానస్వరూపుడై యున్నవాడు.
960) ప్రాణ నిలయ: - సమస్త జీవుల అంతిమ విరామ స్థానమైనవాడు.
961) ప్రాణభృత్ - ప్రాణములను పోషించువాడు.
962) ప్రాణజీవన: - ప్రాణ వాయువుల ద్వారా ప్రాణులను జీవింపజేయువాడు.
963) తత్త్వం - సత్యస్వరూపమైనందున భగవానుడు తత్త్వం అని తెలియబడిన వాడు.
964) తత్త్వవిత్ - సత్యవిదుడైన భగవానుడు తత్త్వవిత్ అని స్తుతించబడువాడు.
965) ఏకాత్మా - ఏకమై, అద్వితీయమైన పరమాత్మ
966) జన్మమృత్యు జరాతిగ: - పుట్టుట, ఉండుట, పెరుగుట, మార్పుచెందుట, కృశించుట నశించుట వంటి వికారములకు లోనుగానివాడు.
967) భూర్భువ: స్వస్తరు: - భూ: భువ: స్వ: అను వ్యాహృతి రూపములు 3 గలవాడు.
968) తార: - సంసార సాగరమును దాటించువాడు.
969) సవితా - తండ్రి వంటివాడైన భగవానుడు.
970) ప్రపితామహః - బ్రహ్మదేవునికి కూడా తండ్రియైనవాడు.
971) యజ్ఞ: - యజ్ఞ స్వరూపుడు.
972) యజ్ఞపతి: - యజ్ఞము నందు అధిష్టాన దేవత తానైన భగవానుడు.
973) యజ్వా - యజ్ఞము నందు యజమాని.
974) యజ్ఞాంగ: - యజ్ఞము లోని అంగములన్నియు తానే అయినవాడు.
975) యజ్ఞవాహన: - ఫలహేతువులైన యజ్ఞములు వాహనములుగా కలవాడు.
976) యజ్ఞభృత్ - యజ్ఞములను సంరక్షించువాడు.
977) యజ్ఞకృత్ - యజ్ఞములను నిర్వహించువాడు.
978) యజ్ఞీ - యజ్ఞములందు ప్రధానముగా ఆరాధించుబడువాడు.
979) యజ్ఞభుక్ - యజ్ఞఫలమును అనుభవించువాడు.
980) యజ్ఞసాధన: - తనను పొందుటకు యజ్ఞములు సాధనములుగా గలవాడు.
981) యజ్ఞాంతకృత్ - యజ్ఞఫలము నిచ్చువాడు.
982) యజ్ఞగుహ్యమ్ - గోప్యమైన యజ్ఞము తానైనవాడు.
983) అన్నం - ఆహారము తానైనవాడు.
984) అన్నాద: - అన్నము భక్షించువాడు.
985) ఆత్మయోని: - తన ఆవిర్భావమునకు తానే కారణమైనవాడు.
986) స్వయంజాత: - మరొకరి ప్రమేయము లేకనే తనకు తానుగ ఆవిర్భవించువాడు.
987) వైఖాన: - ప్రాపంచిక దు:ఖమును నివారించువాడు.
988) సామగాయన: - సామగానము చేయువాడు.
989) దేవకీనందన: - దేవకీ పుత్రుడైన శ్రీ కృష్ణుడు.
990) స్రష్టా - సృష్టికర్త
991) క్షితీశ: - భూమికి నాధుడైనవాడు.
992) పాపనాశన: - పాపములను నశింపజేయువాడు.
993) శంఖభృత్ - పాంచజన్యమను శంఖమును ధరించినవాడు.
994) నందకీ - నందకమను ఖడ్గమును ధరించినవాడు.
995) చక్రీ - సుదర్శనమును చక్రమును ధరించినవాడు.
996) శారంగ ధన్వా - శారంగము అనెడి ధనుస్సు కలవాడు.
997) గదాధర: - కౌమోదకి యనెడి గదను ధరించినవాడు.
998) రథాంగపాణి: - చక్రము చేతియందు గలవాడు.
999) అక్షోభ్య: - కలవరము లేనివాడు.
1000) సర్వ ప్రహరణాయుధ: - సర్వవిధ ఆయుధములు కలవాడు.