Thursday, September 6, 2012

విఘ్నేశ్వరుడు - 19


గుహ ద్వారాన్ని మూసి ఉన్న కొండంత రాతిని గులకరాయిలాగ తొండంతో లాగేసి, గజ రాజు లోపలికి వెళ్ళి కొంతసేప…్యూక రత్నాల నగలను కట్టలు కట్టలుగా తొండంతో తీసు కొచ్చి సౌదామిని ముందు కుప్పవేసింది. చంద్రహారాల్నీ, కంఠాభరణాల్నీ ఆమె మెడ నిండా వేసి, తండ్రి బిడ్డను బుజ్జగించి చెప్పి నట్లుగా వీపు నిమిరి, మిగతా నగలను ధరిం చినన్ని ధరించి, తక్కినవి మూటగట్టుకొని తీసుకెళ్ళమని సైగచేసి చెప్పింది.
 
సౌదామిని అలాగే చేశాక, ఏనుగు ఆమెను మెల్లగా అరణ్యం దాటించి కళ్యాణినగర సమీపాన విడిచి, అరణ్యంలోకి వెనుతిరిగి వెళ్ళిపోయింది. బంగారు విగ్రహంలాగ నగలతో తళుక్కు, తళుక్కున దేదీప్యమానంగా మెరుస్తున్న కోడలిని చూసి కలహకంఠి నిర్ఘాంతపోయి, కొంతసేపటికి సంబాళించుకొని, మెల్ల మెల్లగా ఆ నగలన్నీ ఎలాగ వచాెూ్చ చెప్పేవరకూ వేధించి, సౌదామిని చెప్పినదంతా విని, ‘‘ఏను గకు వెలగపళ్ళు అంత ఇష్టమన్నమాట!''
 
అని తల పంకించి, వెంటనే సంతకు వెళ్ళి సంచి నిండా వెలగపళ్ళు కొనుక్కు వచ్చింది. నగలు నింపుకొని రావడానికి ఒక గట్టి గోతాన్ని భుజాన వేసుకొని, వెలగపళ్ళ సంచితో ఉత్సాహంగా అడవికేసి కలహకంఠి బ…ులు దేరింది. అరణ్యం ప్రవేశించి కోడలు చెప్పిన గుర్తుల ప్రకారం ఎంత వెతికినా వెలగచెట్టు కనపడక విసిగి, ఒక చింతచెట్టు కింద చతికిలబడి, తినాలని వెలగపండు తీసింది.
 
తినాలనే తీసినా ఎలాగో నిగ్రహించుకొని, వెలగపండు చేత్తో ఎత్తి పట్టుకొని, చుట్టు పక్కల కల…ుజూసి గొంతు సవరించుకొని, ‘‘ఏనుగా రా రావే! వెలగపళ్ళు తినవే! ‘‘నగలెన్నో తేవే! నా కోర్కె తీర్చవే! ఏనుగా రా! వేగంగా రా!'' -- అంటూ భజనపాట మొదలుపెట్టింది.

పాట సాగుతున్నది. ఏనుగు రాలేదుగాని, అడవి దద్దరిల్లేలాగ గాండ్రుమనే అరుపు వినిపించింది. అది ఏనుగు ఘీంకారం కాబోలు అనుకొని కలహ కంఠి సంతోషపడుతూ మెడ చాచి చూడగా దూరంలో పెద్దపులి దూకుతూ రావడం కనిపించింది. భుజం మీది గోతాన్ని వదల కుండా కలహకంఠి తిరిగి చూడకుండా పరుగెత్తి, పరుగెత్తి రొప్పుతూ పడిపోయింది. ఆ పడడం సరిగా గుహ దగ్గిరే పడింది.
 
గుహ తెరిచే ఉంది. తన అదృష్టానికి కలహకంఠి పొంగిపోతూ గుహ లోకి వెళ్ళింది. గుహలో కుప్పలు తెప్పలుగా ఉన్న నగలు చూసి పిచ్చెత్తినదానిలాగ తల ముని గేలాగ నగలన్నీ వేసుకొని, గోతం నిండా నగలు కుక్కి మూతి కట్టి, ఎత్తలేక ఎత్తి, మో…ులేక మోస్తూ, నడవలేక నడుస్తూ గుహ మొదటికి వచ్చేసరికి గుహ మూత బడిఉంది. ఎదురుగా చీకటిలో ఎరగ్రా నిప్పుకణికల్లా మెరుస్తున్న కళ్ళతో, తెల్లగా మెరుస్తున్న కోరపళ్ళతో పగలబడి నవ్వు తున్న పెద్ద బ్రహ్మరాక్షసి చీకటిలో చీకటిలాగ కనిపించింది.
 
ఆ భూతం ప్రతిధ్వనితో గుహ కంపించి పోేులాగ, ��ఓహ్హో! కలహకంఠీ! నువ్వు కోడలిని కాల్చుకుతినే అత్తవైతే, నేను అత్తను చిత్రహింసతో తినేసిన మహాగొప్ప కోడల్ని! నా చరిత్ర విను!�� అంటూ చెప్పడం ప్రారం భించింది: వెనుకటికి నేను చురకత్తిలాంటి అంద కత్తెను. అమ్మా, నాన్నా పెట్టిన పేరు కలహంసి; కాపురానికెళ్ళాక, నా నోటి ప్రతాపానికి ఆ పేటంతటికీ నేను సంపాదించుకొని సార్థక పరుచుకొన్న పేరు కలహదుందుభి.
 
వ్వెంత చెడ్డ అత్తవో, కలహకంఠీ! నా అత్త అంత ఉత్తమురాలు, అమా…ుకురాలు, పరమసాధువు. నేను కాపరానికి వెళ్ళి ఏడాది తిరక్కుండానే నా మొగుడు ఇల్లు విడిచి దేశాలపాల…్యూడు. అంటే నేనెంత ఉత్తమ ఇల్లాలినో ఊహించుకో! నాకు నగల పిచ్చి ఇంతా అంతా కాదు. బంగారు పంటలు పండే భూములు పుట్రలు అమ్మించి రకరకాల నగలు చేయించుకున్నాను. మా అత్త ముక్కుపుల్ల నుంచి అన్నీ నాకే ఇచ్చేసింది.

అటువంటి అమా…ుకురాలైన అత్తను, ఒక పూటైనా సరిగా తిననిచ్చేదాన్నిగాను. చిక్కి శల్యమైన వృద్ధురాలిచేత ఇంటి చాకిరీ అంతా చేయించేదాన్ని. చివరికి నా అత్త, మామ విసిగిపోయి వాతాపిక్షేత్రంలోని విఘ్నేశ్వరుని దర్శించి అక్కడే కన్ను మూద్దామని బ…ులుదేరారు. ఆ సమ…ుంలో నా అత్త చేతుల్లో ఉన్న చిన్న మూట చూసి అదేమిటని దూకుడుగా దాన్ని లాక్కోవడంతో, ఆవిడ తూలి కిందపడిపోయి, ఆ…ూసంతో రొప్పుతూ కన్ను మూసింది.
 
అంతవరకూ ఎంతో సహనంతో నా అత్యా చారాలన్నీ చూస్తూ పల్లెత్తు మాట అనని నా మామగారు, భార్య మరణాన్ని చూసి ఆప లేని దుఃఖంతో, పైకుబికిన కోపంతో, ��పాపిష్ఠి దానా! ఎంత ఘోరానికి ఒడిగట్టావు?నువ్వు మా కోడలివైపోయినావు. లేకుంటే శపించే వాణ్ణి! ఎప్పటికైనా, మా ఒక్కగానొక్క కొడుకు తిరిగి వస్తాడనీ, నువ్వు వాణ్ణి సుఖపెట్టగల వనేఆశతో, అన్నీ సహించాము; కడసారి కోరుతున్నాను - వాడొస్తే సరిగా చూడు!��
 
అని చెబుతూ అలాగే ప్రాణాలు విడిచి భార్య తోనే సహగమనం చేశాడు. ఆ…ున గొప్ప నిష్ఠాపరుడు, తపశ్శాలి. అదే సమ…ుంలో, ఒక సన్యాసి అక్కడికి వచ్చాడు. నా అత్తమామల మృతదేహాలపై పడి భోరున రోదిస్తూ, నేను లాక్కోబోేు టప్పుడు కిందపడిన మూటను తీసి విప్పాడు. అందులో రెండు చిరుగుల బట్టలు తప్ప మరేమీ లేవు. ఆ సన్యాసి నన్ను వజ్రాల్లాంటి కళ్ళతో కాల్చేస్తున్నట్టు చూస్తూ, ��నువ్వు బ్రహ్మ రాక్షసిగా పుట్టవలసినదానివి!��
 
అని అన్నాడు. అంతే, తర్వాత వృద్ధ దంపతుల ఉత్తరక్రి…ులు జరిపి వెళ్ళిపో…ూడు. ఆ సన్యాసి ఎవరో కాదు, నా రూప విలాసా లకు పరవశించి కోరి చేసుకున్న నా భర్తే! అని బ్రహ్మరాక్షసి చెప్పి కాస్సేపాగి మళ్ళీ చెప్ప సాగింది: నా నగల పిచ్చి, ధనవ్యామోహం నన్ను ఎంతవరకు ఈడ్చుకు వచ్చా…ుంటే, నేను కొంతమంది గజదొంగలను చేరదీశాను.
 
దొంగల రాణిని అనిపించుకున్నాను. ఈ గుహలోనే దొంగలు గొప్పగొప్ప నగలను ధనరాసులను పోగుపోస్తూండేవారు. అంతా నా స్వంతం చేసుకోవాలన్న పేరాశతో ఒక నాడు దొంగలకు విషభోజనం పెట్టాను. వాళ్ళు చచ్చేముందు చావు తెగింపుతో కసిగా నన్ను ఇందులో ఉంచి గుహను పెనుబండతో కప్పేశారు.

కలహకంఠీ! ఇదే గుహలో, ఆ నగల్నీ, ధనరాసుల్నీ చూసుకుంటూ అలాగే మాడి మాడి కన్ను మూసి, ఇలాగ భూతాన్నయి పడి ఉన్నాను. నీకు బుద్ధి వచ్చేలాగ చేస్తే, నా పిశాచజన్మ శాపం తీరిపోతుందని, నీ కోడలి కారణంగా నిన్న ఈ గుహలోకి వచ్చిన ఏనుగు వలన తెలిసింది. ఏనుగు నీ కోడలికి ఇచ్చినవన్నీ అసలు నగలే; ఇప్పుడు నువ్వు పెట్టుకున్నవీ, అత్యాశ కొద్దీ పోగుచేసి గోతాం నిండా కట్టుకున్నవీ ఏమిటో ఒక్కసారి చూసుకో!
 
అన్నది బ్రహ్మ రాక్షసి. కలహకంఠి భుజానికెత్తుకొన్న గోతం కట్టు విడి దాంట్లోంచి పాములూ, జెర్రులూ, కొండతేళ్ళూ ఊడిపడుతూ జరజరా గుహ నలుమూలలకూ పాకాయి. ఒంటిమీద పాములూ, తేళ్ళూ పాకు తూంటే బెంబేలు పడిపోతున్న కలహకంఠిని చూసి గుహ మారుమ్రోగుతూండగా బ్రహ్మ రాక్షసి వికవికా నవ్వుతూ, ��నువ్వు కోడలిని కాల్చుకు తినే కలహకంఠివి, నేను అత్త మామల ఉసురుపోసుకున్న కలహ దుందు భిని!
 
ఉత్తమురాలైన నీ కోడల్ని మంచిగా చూసుకొంటే సరేసరి, లేదా ఈ గుహలో నాలాగ బ్రహ్మరాక్షసివై పడి ఉండటం ఇహ నీ వంతు అవుతుంది! విన్నావా, కలహకంఠీ!�� అని చెప్పింది. కలహకంఠి లెంపలువేసుకొని, రాక్షసికి దణ్ణంపెట్టి, ��బుద్ధివచ్చింది, కోడల్ని పువ్వు లాగ చూసుకుంటాను. గుహ నుండి నన్ను బ…ుటపడనిచ్చి, అరణ్యం దాటించు!�� అని మొరపెట్టింది. బ్రహ్మరాక్షసి కలహకంఠిని అడవి దాటించి కళ్యాణినగరం పొలిమేరకు చేర్చి, ��మాట తప్పావో, బ్రహ్మపిశాచివై గుహలో ఉంటావు, జాగ్రత్త!��
 
అని హెచ్చరించి భగ్గుమని మండిపోయి అదృశ్యమైంది. కలహకంఠి బ్రతుకు జీవుడా అని ఇంటికి బిరబిరా వెళ్ళి, సౌదామిని ముందు మోకరిల్లి, మోకాళ్ళు పట్టుకొని, ��అమ్మా, సౌదామినీ! నన్ను మన్నించు. కొడుకూ, కోడలూ చిలకా గోరువంకల్లాగ ఉంటే చూసి సంతోషించడం కంటే నాకీ జన్మకు కావల్సిందేమీ లేదు!�� అన్నది. అత్త పరివర్తనానికి కారణం విఘ్నేశ్వరుడి కటాక్షం అని సౌదామిని సంతోషించింది. కలహ కంఠి తిరిగి కలకంఠి అనిపించుకొన్నది.

పావనమిశ్రుడు కథను ముగించి, ��పిల్లలూ! ఏనుగు ఎవరో చెప్పుకోండి చూద్దాం!�� అన్నాడు. పిల్లలే కాకుండా, పెద్దలు కూడా ఆనందో త్సాహాలతో గొంతెత్తి, ��విఘ్నేశ్వరుడు! మన విఘ్వేశ్వరుడే!�� అంటూ గొల్లున లేచి ప్రసాదం తీసుకొని ఇళ్ళకు వెళ్ళారు. ఆల…ు మంటపంలోని కుడ్యచిత్తరువు లకు సంబంధించిన కథలను, రోజూ పావన మిశ్రుడు చెబుతూంటే, వీనుల విందుగా వింటూన్న పిన్నల, పెద్దల మనస్సులనిండా, విఘ్నేశ్వరుడిపై బలమైన భక్తి వర్థిల్లింది.
 
ఒకనాడు ఒక సంగీత కళాభిమాని, ఒక కుడ్యచిత్తరువులో తంబుర మీటుతూ ఒక విద్వాంసుడు గానం చేస్తూంటే, వివిధ భంగి మల్లో విఘ్నేశ్వరుడు నృత్యం చేస్తూండడం చూసి, ఆ చిత్ర చరిత్ర చెప్పమని కోరాడు. పావనమిశ్రుడు చెప్పడం మొదలుపెట్టాడు: వాతాపినగరం కళలకు కాణాచిగా కవిపండిత, గా…ుక, విద్వాంసులకు పుట్టినిలై్ల విలసిల్లు తూన్నది. గజాననపండితుడు నగరంలో అగ్రగ ణ్యుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి; ముఖ్యంగా గొప్ప గా…ుకుడు.
 
అతని గాత్రంలో సమ్మో హనశక్తి ఉండేది. వాతాపిగణపతిపై ఎన్నెన్నో కీర్తనలు రచించి పాడుతూండేవాడు. అతని మనుమడు బాలగణేశభట్టు టింగుటింగున తాళాలు వాయిస్తూండేవాడు. గజాననుడు �ధిమికిట ధిమికిట తాండవ నృత్యకరీ గజానన...� అనే పల్లవిని ఎత్తుకొని ఆనందపారవశ్యంతో రాగాలు మారుస్తూ, అనేక రాగాల్లో పాడుతూంటే, గజాననుడైన విఘ్నేశ్వరుడు ఇంద్రధనుస్సు రంగుల్లో అనేక రూపాల్లో నర్తిస్తూ శ్రోతల కన్నులకు కటే్టవాడు.

హంసధ్వని రాగంలో తెల్లని రాజహంస లాగ, మా…ూమాళవరాగంలో ఉద…ురవి బింబంలాగ, భైరవిరాగంలో ఎరత్రామరలాగ, హిందోళరాగంలో నీలాకాశంలాగ, నీలాం బరిరాగంలో నీలికలువలాగ, ఆనందభైరవి రాగంలో అరవిచ్చిన తెల్లకలువలపై విరిసిన పున్నమివెన్నెలలాగ విఘ్నేశ్వరుడు లీలగా కనిపించేవాడు.
 
గజాననపండితుడికి సత్కారాలమీద, సన్మానాలమీద కాంక్ష ఏ కోశానా లేకపోయినా, అత్యున్నత సత్కారమైన బంగారుగణేశ ప్రతిమ అతనికే ప్రతి సంవత్సరం వస్తూండేది. ఆ ప్రతిమలతో అతని ఇల్లు నిండిపోయింది. దేశాంతరంగా చాలామంది మహామహా విద్వాంసులకే గజాననుడంటే ఎనలేని గౌర వమూ, గురుభావమూ ఉంటున్నా, వాతాపి నగరంలో కొంతమందికి అతనిపై అసూ…ు బాగా పెరిగింది.
 
వారందరికీ నా…ుకుడు స్వరకేసరి. స్వరకేసరి ఎప్పుడూ విద్వత్తు చూపడానికి గొప్ప తాపత్ర…ుపడేవాడు. అతను గళం విప్పితే సింహగర్జనలు వెలువడేవి. మద్దెల వాయించేవాడిని ముప్పుతిప్పలు పెడుతూ వీరవిహారం చేస్తూన్నట్లు పాడేవాడు. గజానన పండితుడికి అటువంటి విద్వత్తు ప్రదర్శించు కోవాలనే …ూవ లేకపోవడమే కాకుండా, విఘ్నేశ్వరుడిపై భక్తితో తన్మ…ూవస్థలో పడి తాళం తప్పుతూ, మరొకప్పుడు పాడుతూ, పాడుతూ మూగబోతూండేవాడు.
 
అటువంటి సందర్భాలను స్వరకేసరి ప్రభృతులు గజా ననుడికి శాస్ర్తపాండిత్యం లేదనీ, కేవలం అతనిది మనోధర్మగానమనీ గాలిపాట అనీ హేళనగా ప్రచారం చేస్తూ, అక్కసు తీర్చు కుంటూండేవారు. గజాననుడికి ఎవరేమన్నా, ఏమనుకుంటూన్నా ఆ ధ్యాసే ఉండేది కాదు. మనసులోని విఘ్నేశ్వరుడితో ఏకాంతంలో మంతనాలాడుకొంటున్నట్లు పాడేవాడు.
 
అందులో ఏదో అనిర్వచనీ…ుమైన శక్తి వింటున్నవారిని మైమరపించి దివ్యలోకాల్లోని ఆనందసాగరాల్లో ముంచి తేల్చేది. ఏవిధంగానైనా ఆ సంవత్సరం స్వర్ణగణేశ విగ్రహం గజాననపండితుడి ఇల్లు చేరకుండా చే…ుడానికి స్వరకేసరి బాగా ఆలోచించి, ఒక గొప్ప పథకం వేశాడు.

No comments:

Post a Comment