Saturday, February 9, 2013

సర్పబంధం గురించి మీకు తెలుసా..!?

వేదాలు, ఇతిహాసాల కాలం నుంచి నేటి వరకు మానవ జీవితాలతో సర్పాలకు విడదీయరాని బంధం ఉంది. కొన్ని సందర్భాల్లో నాగదేవతగా పూజలందుకుంటే, మరికొన్ని వేళల్లో ప్రాణాలు తీసే విషనాగుగా ప్రజల ఆగ్రహానికి కారణం అవుతుంది. అందుకే అనంత పద్మనాభ స్వామి ఆలయంలో నాగబంధం ఉన్న ఆరో నేలమాళిగను తెరిచేందుకు పండితులు అంగీకరించట్లేదనే విషయం తెలిసిందే. నాగజాతి విశేషాల సమాహారం ఇది.

"అనల తేజులు దీర్ఘ దేహులు నైన యట్టి తనూజులన్ వినుత సత్త్వుల గోరె గద్రువ వేపురం వేడ్కతో..." కశ్యపునికి ఇద్దరు భార్యలు. కద్రువ, వినత. ఇది కృతయుంగంలోని విషయం. పుత్ర కామేష్ఠ యాగానంతరం వారి వారి కోరికల ప్రకారం కద్రువకు ఐదు వందల ఏళ్ల పాటు నేతి కుండలలో భధ్రపరచగా కద్రువ గుడ్ల నుంచి శేషుడు, వాసుకి, ఐరావతం, తక్షక, కర్కోటక, ధనంజయ, కాళియ ఇత్యాది నాగుల వెలువడ్డారు. తల్లి తొందర పాటు వల్ల వినత అండాల నుంచి సగం దేహంతో అనూరుడు, ఆ తరువాత మరో ఐదు వందల ఏళ్లకు గరుడుడు జన్మించారని భారతంలోని అది పర్వం ద్వితియాశ్వాసంలో పేర్కొన్నారు.

హారంగా, పడకగా...
ఆది శేషుడు భూభారాన్ని వహించగా, వాసుకి పాల సముద్ర మధనంలో తరిత్రాడుగా ఉపయోగపడ్డాడు. తక్షకుని విషం, చోరత్వం, పరీక్షిత్తు మరణానికి, జనమేజయుడు నిర్వహించిన సర్ప యాగానికి హేతువులైనాయి. కాళీయ మర్దనం కృష్ణావతారంలో ముఖ్య ఘట్టం. శివుని కంఠంలో హారంగా, విష్ణువు పడకగా సర్పాలు వారికి అత్యంత సన్నిహితులైనాయి.

తండ్రి ఒక్కరే అయినా తల్లుల మధ్య గల వైషమ్యం, పిల్లల మధ్య విరోధానికి ఎలా దారి తీస్తుందో నాగులు, గరుత్మంతుడి వృత్తాంతం ద్వారా మనకు అవగతమవుతుంది. తన ఆజ్ఞను మీరినందుకు ఆదాం, ఈవ్‌లను దేవుడు ఈడెను తోట నుంచి బహిస్కరించి వారిని అందుకు పురికొల్పిన సాతాను సర్పాన్ని... నీవు నీ పొట్టపై పాకుతూ, మట్టి తింటూ నీ జీవితం గడుపు. ఈ స్త్రీ, ఆమె కుమారులు నీకు శత్రువులగుదురు గాక! నీవు వారి కాలిపై కాటు వేస్తావు, వారు నీ తలపై గాయపరుస్తారు అని ఆజ్ఞాపించారు.

సర్పం-సప్త ప్రతీకలు
ప్రాచీన కాలం నుంచి సర్పం (సర్పెంట్) సప్త విషయాలకు ప్రతీకగా ఉంది.
1. దేవునిగా- తన తోకను తానే మింగుతుంది కాబట్టి. అంతేగాక అనేక తెగలలో సర్పం సృష్టిలో ప్రముఖ పాత్ర వహించిందని నమ్మేవారు.
2. తన తోకను తానే మింగుతూ వృత్తాకారంలో ఉన్న సర్పాన్ని అనంతానికి చిహ్నంగా ప్రాచీనులు భావించారు. నవీన శాస్త్రజ్ఞుడు 'కెకూలే' ఈ చిహ్నాన్ని కల గని 'బెంజిన్' అణు నిర్మాణాన్ని ఊహించాడని, అదే రసాయన శాస్త్రంలో మరో ముందడగు అయిందని చెబుతారు.
3. పునరుజ్జీవనానికి, పునర్ యవ్వనానికి, కుబుసాన్ని విడిచి తిరిగి శక్తిని పొందడం ద్వారా ఎస్కులేపియస్ దేవునికి ప్రీతిపాత్రమై, సర్పం వైద్యరంగానికి చిహ్నమైంది.
4. గ్రీకులకు, రోమన్లకు సంరక్షక దేవత. హోమగుండాల వద్ద చిహ్నంగా ఉంది. కౌరవుల యుద్ధ పతాకం సర్పం.
5. జ్ఞానానికి
6. సైతానుకు కూడా సర్పాలే గుర్తు.

తొలి మానవుల పతనం
ఈజిప్షియన్లకు, హిబ్రూలకు, కాననైట్లకు, మధ్యధరా ప్రాంతం వారికి, ఉగ్రాయిట్లు, సుమేరియన్లకు సర్పాలు సరప్ (మంట పుట్టించేవి), నాహాస్, పెటెన్, బెటెన్, నాగులుగా సుపరిచితమే. గిల్గామేష్ కథలో నానా కష్టాలు పడి గిల్గామేష్ సాధించుకు వచ్చిన మృత సంజీవనీ లతను సర్పం అపహరించుకొని పోయి మానవులకు మృత్యువు తప్పని సరి చేస్తుంది. ఉదంకుని దగ్గరి కుండలాలపహరించుకొని పోయి తక్షకుడు సర్పయాగంలో తన వంశ వినాశనానికి కారణ భూతుడవుతాడు.

జ్ఞాన ఫలాన్ని ఈవ్, ఆదాం తొలి మానవ దంపతులు తినేలా చేసి సాతాన్ సర్పం తొలి మానవుల పతనానికి కారణమయ్యాడు. ఈజిప్షియన్లకు నాగ దేవతలున్నారు. యురియస్ సర్పం రక్షణకు, ఎపెప్ కీడుకు, ఎనెప్ సంతానానికి దేవతలు. గ్రీకులకు డ్రాగన్ అంటే మహాసర్పం. ప్రాచీన గాథల్లో డ్రాగన్‌లు ఎక్కువ. నాగుల చవితి మనకు అత్యంత ప్రియమైన పండగ. ఓహియో దేశంలో ప్రసిద్ధి కెక్కిన మహా సర్పపు దిబ్బ అమెరికన్ ఇండియన్లకు పవిత్రమైనది. దీని పొడవు అరకిలోమీటరు.

మహారాజయోగం
జూపిటర్ దేవత సర్ప రూపంలో ఒలింపియాకు ప్రత్యక్షమైనాడని అందుకే అతని ఆశీస్సులతో అలెగ్జాండర్ జనించాడని ఓ ఐతిహ్యం. మార్క్ ఏంటోని క్లియోపాత్రను ముద్దుగా 'ద సర్పెంట్ ఆఫ్ ఓ ల్డ్ నైల్' నైలు నదీ సర్పంగా పిలిచేవారట. క్లియో పాత్ర మరణించేప్పుడు 'ఏస్ప్' సర్పాలను పెదాలకు, హృదయంపై కాటు వేయించు కొని నిశ్శబ్దంగా నిష్క్రమించడం మనకు తెలుసు. మొదలయిన పదం తిరిగి వాక్యం చివర వచ్చే కవిత్వ పంక్తులను సర్పెంటైన్ వర్సెస్ అంటారు. సర్ప బంధ కవిత్వం మనకు తెలుసు.

సర్పజాతులు
ఆస్ట్రేలియన్ల ఆదిమ తెగలు ఇంద్రధనుస్సు సర్పం భూమికి పర్వతాలతో, నదులతో నిర్మించిందని నమ్ముతారు. సర్పం కలలోకి రావడం శృంగారానికి, కామేచ్ఛకి చిహ్నంగా ఫ్రాయిడ్ లాంటి మానసిక శాస్త్రజ్ఞులు చెప్పారు. సంవత్సరానికి లక్షమందిని మృతుల్ని చేసే విష జాతి సర్పాలు 600 ఉంటే, మొత్తం 3,000 రకాల పాముల ఉన్నాయని ఒక అంచనా అర్జునుడు నాగకన్య ఉలూచిని పెళ్లాడాడు. కంబోడియాలోని అంగ్‌కోర్ రాజ వంశీకులు తాము బ్రహ్మణ రాజకుమారుడు నాగుల యువరాణిల సంతానమని విశ్వసిస్తారు. హితుడిగాను, శత్రువుగాను సర్పం ప్రసిద్ధమే. అందుకే భగవానుడిలా వాక్రుచ్చినాడు.
"సర్పాణా మస్మి వాసుకిః అనంత శ్చాస్మి నాగానాం..."

కార్తీకమాసంలో దీపదానం చేస్తే పాపం నశించి పుణ్యం వస్తుంది

కార్తీకమాసం వచ్చిందంటే ఆ నెల రోజులు పండుగదినాలే. అందులోను ఈ కార్తీకమాసం ఈశ్వరాధనకు చాలా ముఖ్యమైనది. దేశం నలుమూలలా ఉన్న వివిధ ఆలయాలలో రుద్రాభిషేకాలు, రుద్రపూజ, లక్షబిల్వదళాలతో పూజలు, అమ్మవారికి లక్షకుంకుమార్చనలు, విశేషంగా జరుపుతూ ఉంటారు. అలా జరిపే భక్తులకు సదాశివుడు ప్రసన్నుడై సంతోషం కలిగిస్తాడు.

ఈ మాసంలో వచ్చే సోమవారాలు చవితి ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి, అత్యంత పుణ్యప్రదమైనవి. అత్యంత మహిమాన్వితమైన కాలం "ప్రదోషకాలం". సూర్యాస్తమయమయ్యాక మూడు గడియలు (ఒకగంట) "ప్రదోషోరజనీముఖమ్" రాత్రికి ఆరంభ కాలమే ఈ ప్రదోష సమయం. ఇలా ప్రతినిత్యము వచ్చు ప్రదోషాన్ని నిత్యప్రదోషంగా చెప్తారు. ఈ ప్రదోషం నాలుగు విధాలుగా మహాత్ములు వివరిస్తూ ఉంటారు.

1. నిత్య ప్రదోషం, 2. పక్షప్రదోషం 3. మాస ప్రదోషం, 4. మహాప్రదోషం అని చెప్తారు.

ఇక ఈ ప్రదోషకాలంలో పరమేశ్వరుడు ఏకకాలంలో రెండు రూపాల్ని ప్రదర్శిస్తూ ఎడమభాగాన పార్వతి రెండవ భాగమున పరమేశ్వరరూపంగా "అర్థనారీశ్వరుడుగా" దర్శనమిచ్చేకాలం ఈ ప్రదోషకాలం అని చెప్పబడినది. ఆ సమయమందు ముగ్గురమ్మల తల్లి స్వర్ణరత్న సింహాసనంపై ఆ ప్రదోష సమయాల్లో ఆ తల్లి "అధ్యక్షురాలు"గా అధిరోహించియుండగా పరమేశ్వరుడు పరవశించి తాండవం చేస్తూ ఉంటాడు. ఆ నృత్యాన్ని దర్శించటానికి దేవతలందరూ అక్కడ కొలువుతీరి ఉంటారట. ఆ సమయంలో తాండవ నృత్యానికి అనుగుణంగా సరస్వతి దేవి వీణవాయిస్తూ ఉంటే బ్రహ్మ తాళం వేస్తాడట.

శ్రీమహాలక్ష్మీ గానంచేస్తూ ఉంటే శ్రీహరి మృదంగం వాయిస్తాడట. ఇక ఇంద్రుడు వేణునాదంతో పులకింపచేస్తూ ఉంటాడట. అట్టి ప్రదోష సమాయాల్లో దేవగంధర్వ మహర్షి సిద్ధులందరూ, అట్టి పరమాత్మ స్వరూపాన్ని కొలుస్తూ ఉంటారట. కనుక ప్రదోష సమాయాల్లో ఇతర దేవతలసాన్నిధ్యం కొరకు వేరే ఆలయాలకు పోనక్కరలేదు. కావున అట్టి సమయమందు శివుని ఆరాధిస్తే మనకు శివుని ఆశీస్సులతోపాటు మిగతాదేవతల ఆశీస్సులు కూడా ఏకకాలంలో మనం పొంద గలుగుతామని చెప్పబడినది.

ఇక మన భారతీయ సంస్కృతిలో ఈ దీపారాధన అనేది ప్రధాంనంశం. ఈ దీపదానం చేయుటవల్ల స్త్రీ పురుషులు ఇరువురు పుట్టినది మొదలు వివిధ దశలలో వారు చేసిన పాపాలు అన్నియు ఈ దీపదానముతో అగ్నిలోపడిన మిడుతలవలె పటాపంచలవుతాయని చెప్పబడినది.

ఆపదల నుండి బయటపడాలంటే సాయిని ఆరాధిద్దాం!

ఆపదల నుండి బయటపడాలంటే షిరిడీ సాయిని ఆరాధించాలని పండితులు చెబుతున్నారు. సాయిబాబా పాదాలను ఆశ్రయించడమే ఆరాధన. సాయిబాబాకు ఆర్భాటాలు, ఆడంబరాలు అక్కర్లేదు. నిండైన మనసు చాలు. మనసునే మందిరంగా చేసి సాయిని ఆరాధిద్దాం. మనసులో నిరంతరం బాబాను తల్చుకోవడమే నివేదన.

సాయిబాబాకు భక్తుల గురించే ధ్యాస. మనని భవబంధాలనుండి ఎలా విముక్తుల్ని చేయాలి, అశాశ్వతమైన అనుబంధాల నుండి ఎలా బయట పడేయాలి, ఆధ్యాత్మిక చింతన పెంచి జీవితాన్ని సార్ధకం చేయాలి అనే ఆయన చింత. భగవంతుడు మనిషికి అవసరమైనవన్నీ ఇచ్చి భూమ్మీదకు పంపాడు. మరి అలాంటప్పుడు భగవంతుడు తాను ఇచ్చిన ఆస్తులను, మానవులు సవ్యంగా ఖర్చు పెట్టాలని ఆశిస్తాడు కదా. కనుక మనం దేన్నీ దుర్వినియోగం చేయకూడదు. మనకు ఉన్న ఆస్తులను సద్వినియోగం చేసుకుంటూ, తోటివారికి ఉపయోగపడుతూ, జీవితాన్ని సార్ధకం చేసుకోవాలి.

వివిధ సందర్భాల్లో సాయిబాబా అన్న మాటలు గుర్తుచేసుకుందాం...
''ప్రజల్ని సన్మార్గంలో పెట్టమని భగవంతుడు నన్ను పంపాడు. కానీ, ఈ రోజుల్లో ప్రజలు కాస్తయినా దేవుడిపట్ల భక్తిశ్రద్ధలు లేకుండా కాలం గడుపుతున్నారు. క్షణికమైన మొహావేశాల్లో పడి కొట్టుకుపోతున్నారు. సత్సంగాలపై ధ్యాస, నమ్మకం లేవు. సత్యం మాట్లాడుతూ, ధర్మాన్ని ఆచరించమంటే, అసత్యాలు చెప్తూ, అధర్మంలో తేలుతున్నారు. భక్తిభావన నిలుపుకుంటే మీకే శ్రేయస్కరం. నా ప్రయత్నాన్ని నేను చిత్తశుద్ధితో చేస్తాను.

''పుడుతున్నాం. తింటున్నాం. కాలయాపన చేస్తున్నాం. పుట్టడం, ఆయుష్షు ఉన్నంతవరకు జీవించడం - ఇదేనా జీవితం? ఇందులో ఏమైనా జీవితపరమార్ధం ఉందా? మన జీవితానికి గమ్యం అంటూ ఉండనవసరం లేదా? సరైన, నిర్దుష్టమైన గమ్యాన్ని నిర్ణయించుకుని దాన్ని చేరేందుకు ప్రయత్నించాలి. మనిషి తనను తాను తెలుసుకోలేనంతవరకూ, గమ్యాన్ని నిర్దేశించుకునేంతవరకు జ్ఞానం లేనట్లే. గమ్యం తెలిసివాడే జ్ఞాని. సద్గురువు బోధనలు వింటే, వాటిని పాటిస్తే జీవితం సార్ధకమౌతుంది.

''పుట్టినవారు గిట్టకమానరు. అందరూ మట్టిలో కలిసిపోవలసిందే. అయితే, చావుపుట్టుకల మధ్య ఉన్న జీవితాన్ని సార్ధకం చేసుకోవాల్సిన బాధ్యత మనమీద ఉంది. తోటివారితో వీలైనంత వినయవిధేయతలతో మాట్లాడాలి. జలసాలు, విలాసాలకు దూరంగా నిరాడంబరంగా గడపాలి.

బ్రహ్మరథం అంటే ఏంటి?

ఒకసారి ఇంద్రునికి, బృహస్పతికి మధ్య విభేదం వచ్చి ఇంద్రుడు కించపరిచేసరికి బృహస్పతి స్వర్గాన్ని వీడి వెళ్లిపోయాడు. దాంతో ఇంద్రుడు దేవగురువుగా బృహస్పతి స్థానంలో త్వష్టప్రజాపతి కుమారుడైన విశ్వరూపుణ్ణి నియమించుకున్నాడు.

ఈ విశ్వరూపుడు రాక్షసులపై బంధుప్రీతిని కనబరుస్తూ వారికి హవిర్భావాలు ఇవ్వడంతో ఇంద్రుడు కోపించి విశ్వరూపుణ్ణి సంహరించేసరికి అతడికి బ్రహ్మహత్యాపాతకం ఆవహించింది. దాంతో ఆ దోషాన్ని పోగొట్టుకునేందుకు స్వర్గాన్ని వదిలి వెళ్లిపోయాడు.

అప్పుడు దేవతలంతా కలిసి భూలోకానికి వచ్చి నహుష మహారాజుకు ఇంద్రాధిపత్యాన్ని కట్టబెడతారు. నహుషుడు చాలా గొప్పవాడు. ఎప్పుడైతే ఇంద్రపదవి అతనికి లభించిందో అతడిలో గర్వాంధకారం పొడసూపడం మొదలుపెట్టింది. దాంతో దేవతలు, మహర్షులు, దిక్పూలకులను కించపరచడమే కాకుండా శచీదేవిని కోరతాడు.

అప్పుడు శచీదేవి బ్రహ్మరథంపై ఊరేగి రమ్మని అతడికి షరతు విధిస్తుంది. నహుషుడు సప్తర్షులచేత పల్లకీని మోయిస్తూ అందులో ఆశీనుడై బయల్దేరతాడు. బ్రహ్మరథమనబడే ఆ పల్లకీ మోస్తున్న వారిలో అగస్త్యుడు కూడా ఒకరు. అగస్త్యుడు పొట్టివాడు. అందుచేత అతను పల్లకీ మోసేవైపు ఒరిగిపోతూ ఉంటుంది.

వేదాలను, మంత్రాలను దారంతా అవమానపరుస్తూ... సర్ప సర్ప అంటూ అగస్త్యుడ్ని కాలితో తంతాడు నహుషుడు. సర్ప సర్ప అంటే తొందరగా నడవమని అర్థం. దాంతో కోపించిన అగస్త్యుడు సర్పోభవ అంటూ శపిస్తాడు. సర్పోభవ అంటే సర్పం అవుదువుగాక అని అర్థం.

అగస్త్య ముని సామాన్యుడా... మహా తపస్సంపన్నుడాయె. తక్షణమే నహుషుడు సర్పంగా మారి భూలోకంలోకి వచ్చిపడ్డాడు. ఎప్పుడైతే సర్పంగా మారాడో వెంటనే అతనిలోని గర్వం పటాపంచలైంది. తన తప్పిదానికి పశ్చాత్తాపడి తనకీ రూపం నుండి విముక్తిని కలిగించాలని తిరిగి అగస్త్యుడ్ని పార్థించాడు.

అగస్త్యుడు దయతలచి సర్పరూపంలో ఉన్ని నీవు అడిగే ప్రశ్నలకు ఎవరైతే సమాధానాలు చెపుతారో వారి వల్ల నీకీ రూపం పోతుందని శాపానుగ్రహాన్ని కలిగిస్తాడు. ఆ తర్వాత అరణ్యవాసంలో భీముడు నహుషునికి చిక్కడంతో అతనికి శాపానుగ్రహం లభించి తిరిగి నహుషుడు మానవ రూపాన్ని ధరిస్తాడు. ఇదీ నహుషుని చరిత్ర. బ్రహ్మ వంశీయులు లేదా బ్రహ్మవేత్తల చేత మోయబడే వాహనాన్నే బ్రహ్మరథం అంటారు.

పితృదేవతలకు ప్రియం మహాలయం!

మానవుడు మోక్షాన్ని పొందడానికి దేవయానం, పితృయానం అనే రెండు మార్గాలున్నాయని వేదం చెప్పింది. అలాగే జన్మించిన ప్రతి మానవునికీ దేవఋణం, ఋషిఋణం, పితృఋణం అనే మూడు ఋణాలు ఉంటాయని, వాటి నుంచి విముక్తులైన వారికి మాత్రమే ముక్తి లభిస్తుందనీ వేదం శాసిస్తోంది.

యజ్ఞయాగాదులు, తపోధ్యానాలతో దేవఋణాన్ని, సంతానవంతులై తాతముత్తాలకు పిండప్రదానాలు చేసి పితృ ఋణాన్ని, వేద శాస్త్రాధ్యయన ప్రవచనాలతో ఋషి ఋణాన్ని తీర్చుకోవాలి. అనుశాసనిక పర్వంలో భీష్ముడు అంపశయ్యపై ఉన్నప్పుడు ధర్మరాజు పితృయజ్ఞం గురించి అడిగినప్పుడు భీష్ముడు

ధర్మరాజు! పితృపూజతోనే దేవపూజ సంపూర్ణం అవుతుంది. దేవతలు కూడా పితృదేవతలనే భక్తితో పూజిస్తారు అని చెప్పారు. భాద్రపద కృష్ణపక్షం పితృదేవతల ఆరాధనకు అనువైనది. ఆషాడ కృష్ణపక్షం నుండి లెక్కిస్తే అయిదవదైన భాద్రపద కృష్ణపక్షాన్ని వారంతా ఆశ్రయించుకుని ఉంటారు. అన్నానికి, మంచినీళ్లకు ఇబ్బంది పడుతూ వాటికోసం ఎదురుచూస్తూ ఉంటారు. కనుక ఆ పదిహేనురోజులు శ్రాద్ధకర్మతో వారికి అన్నోదకాలు కల్పించాలి.

మొత్తం వీలుకాకపోతే మొదటి అయిదురోజులు వదిలి చివరి పదిరోజులు, కుదరకపోతే మొదటి పదిరోజులు వదిలి చివరి అయిదు రోజులు చెయ్యాలి. కనీసం నువ్వులు, నీళ్లు వదిలినా అమావాస్యనాడు మాత్రం తప్పకుండా అన్నశ్రాద్ధం పెట్టితీరాలి. పదిహేను రోజుల్లో ఒక్క రోజయినా శ్రాద్ధం పెట్టాలి. తస్య సంవత్సరం యావత్ సంతృప్తాః పితరోధ్రువమ్ (మహాలయంలో ఒక్కరోజు శ్రాద్ధం పెడితే సంవత్సరం పొడుగునా పెట్టినంతగా పితృదేవతలు సంతృప్తి చెందుతారు).

మహాలయ పక్షానికి ఉత్తరకార్తె వస్తుంది. ఆ కార్తెలో పితృయజ్ఞం చేస్తే పితృదేవతలు సంతానాన్ని అనుగ్రహిస్తారు. రవి కన్యారాశిలో ఉండే సమయం ఇది. పార్వణవిధి (అన్నంతో చేసేది)తో చేసే శ్రాద్ధం పితృదేవతల అనుగ్రహంతో ఆరోగ్యాన్ని, జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది.

మహాలయపక్షంలో సూర్యుడు కన్యారాశిలో ఉండగా ఒక్కరోజయినా పితృదేవతలకు పిండప్రదానంతో శ్రాద్ధం చేస్తే వారు సంతోషంతో ఆశీర్వదిస్తారు. అష్టమి, ద్వాదశి, అమావాస్య తిథులలోను, భరణి నక్షత్రం ఉన్న నాడు తిథివారనక్షత్ర విచారణ లేకుండా మహాలయ శ్రాద్ధం పెట్టవచ్చునని హేమాద్రిఖండం చెబుతోంది.

తండ్రి మరణించిన తిథి నిషిద్ధ దినమైనా ఆరోజు శ్రాద్ధం పెట్టవచ్చు. తిథినాడు కుదరకపోతే అష్టమి ఎవరికైనా పనికి వస్తుంది. కొత్తగా పెళ్లి అయిన వారు కూడా మహాలయంలో పిండ దానం చేయవచ్చునని బృహస్పతి చెప్పాడు.

శ్రీవారి పచ్చకర్పూర తిలకాన్ని నుదుటన పెట్టుకుంటే..!?

పచ్చకర్పూర తిలకాన్ని తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రతి రోజు పెడతారు. భక్తులు దేవునికి కానుకలను పంపిస్తే దేవాలయం వారు ప్రసాదమైన పచ్చకర్పూరాన్ని పోస్టు ద్వారా పంపిస్తారు. ఈ ప్రసాదాన్ని తింటారు. మరికొందరు డబ్బాలో పెడతారు. మరికొందరు ఈ ప్రసాదాన్ని ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. దీనికి సమాధానం ఇక్కడ ఉంది.

* స్వామి ప్రసాదమైన పచ్చ కర్పూరాన్ని పాలల్లో వేసుకుని తాగాలి. దాంతో స్వామి ప్రసాదాన్ని సేవించినట్లు అవుతుంది.

* పచ్చ కర్పూరాన్ని కొబ్బరి నూనెలో కలిపి తలకు పూసుకుంటే జుట్టు సుగంధమయం అవుతుంది.

* పచ్చ కర్పూరాన్ని కుంకుమలో కలిపి నుదుటికి పెట్టుకుంటే సాక్షాత్ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఎప్పటికీ ఉంటుంది.

* పచ్చ కర్పూరాన్ని నీటిలో కలిపి ముక్కు, ఎద, నుదుటికి రాసుకుంటే ఎటువంటిజలుబైనా వదలి వెళ్ళవలసిందే! తలనొప్పిసగం నయమైపోతుంది.

* పచ్చ కర్పూరం కుంకుమపువ్వు కలిపి డబ్బుల పెట్టెలో పెడితే ఎక్కువ ధన లాభం కలుగుతుంది.

* వ్యాపారులు ప్రతి రోజు పచ్చ కర్పూరపు కుంకుమను నుదుటికి పెట్టుకుంటే ఆ రోజు ఎక్కువ వ్యాపారం జరుగుతుంది.

* పచ్చ కర్పూరాన్ని తీపి పదార్ధాలకు కలిపి దేవునికి నైవేద్యంగా పెట్టి దానం చేస్తే-మీ ఇంట శుభ కార్యాలు త్వరగా జరుగుతాయి.

* పచ్చ కర్పూరాన్ని కలిపిన నీటిని ప్రతి రోజు తాగితే గ్యాస్ట్రిక్ సమస్య, దంత దుర్గంధం దరిచేరవు.

* పచ్చ కర్పూరంతో హోమం చేస్తే అన్నీ వశీకరణ అవుతాయి.

* పచ్చ కర్పూరాన్ని దేవాలయానికి దానం చేస్తే మీకు రాజ సన్మానం గౌరవం ఎక్కువ అవుతుంది.

* పిల్లలు లేని వారు పాలకు పచ్చ కర్పూరాన్ని జోడించి మంగళవారం శ్రీ సుబ్రహ్మణ్య దేవునికి అభిషేకం చేసి ఆ పాలను తాగుతూ వుంటే అన్ని రకాల గర్భ దోషాలు నివారణ అయి సంతానం కలుగుతుంది.

* పచ్చ కర్పూరాన్ని బ్రాహ్మణులకు దానం చేస్తే అన్ని పనులు త్వరగా నెలవేరి గౌరవం పెరుగుతుంది.

దేవునికి సంపెంగ పువ్వులు సమర్పిస్తే..!?

దేవునికి పుష్పాన్ని అర్పించి ప్రసాదం తీసుకోవటం ద్వారా ఎలాంటి ఫలితం లభిస్తుందని తెలుసుకుందాం.

1. దేవునికి జాజిపూలు అర్పించి ప్రసాదం స్వీకరిస్తే - మీలో ఉన్న దుష్టగుణాలు తొలగి మంచి గుణం వస్తుంది. ఉద్యోగంలో ఉన్నవారి సమస్యలు తొలగిపోతాయి.
2. దేవునికి సంపెంగ పూలు అర్పించి ప్రసాదం స్వీకరిస్తే - మాంత్రిక ప్రయోగాలు మీపై పని చేయవు. శత్రువుల నివారణ సాధ్యమవుతుంది.
3. పారిజాత పూవును అర్పిస్తే - కాలసర్ప దోషం నివారించబడి మనసుకు శాంతి లభిస్తుంది.
4. రుద్రాక్షపూవును అర్పిస్తే - ఎన్ని కష్టాలు వచ్చినా అంతిమ విజయం మీదే అవుతుంది.
5. మొగలిపూలను అర్పిస్తే - అధికారంలో ఉన్నవారి మనస్తాపాలు పరిహరించబడతాయి.
6. లక్కి పూవుతో పూజిస్తే - భార్య, పిల్లలతో కలహాలు లేకుండా సంతోషంగా ఉంటాయి.
7. పద్మం లేదా కమలంతో పూజిస్తే - సమస్త దారిద్ర్య నివారణ, శ్రీమంతులు అవుతారు.
8. మల్లెపూవుతో పూజిస్తే - అన్ని రోగాలు నయం అవుతాయి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది.
9. కల్హర పుష్పంతో పూజ చేస్తే - అందరిలోనూ మీకు గుర్తింపు వచ్చి ఆకర్షణ పెరుగుతుంది.
10. గన్నేరు పూలతో పూజిస్తే - కవులకు కల్పనా సాహిత్యం వృద్ధి చెందుతుంది.
11. కలువ పూవుతో పూజ చేస్తే - స్తంభన తదితర మంత్ర సంబంధ బాధలు తొలగిపోతాయి.
12. పాటలీ పుష్పంతో పూజ చేస్తే - వ్యాపార-వ్యవహారాల్లో అధిక లాభం వస్తుంది.
13. కుంద పుష్పంతో పూజ చేసి ప్రసాదాన్ని స్వీకరిస్తే ముఖంలో అధికమైన తేజస్సు కాంతి వస్తుంది.
14. మల్లెపూవుతో పూజ చేసి ప్రసాదన్ని స్వీకరిస్తే - అన్ని రకాల మానసిక, దైహిక రోగాలు నయం అవుతాయి.
15. కనకాంబరం పూలతో దేవునికి పూజ చేయకూడదు. ఒకవేళ చేసి ప్రసాదాన్ని స్వీకరిస్తే - జీవితం పట్ల వైరాగ్యం వస్తుంది.
16. మాధవీ పుష్పంతో - సరస్వతి, గాయత్రి, శ్రీ చక్రం, శ్రీ రాజరాజేశ్వరి దేవికి జ్యోతిష్యం చెప్పేవారు పూజ చేస్తే మంచి వాక్‌శుద్ధి కలిగి పలికినట్లే జరుగుతుంది.
17. తుమ్మపూలతో ఈశ్వరునికి పూజ చేస్తే - దేవునిపై భక్తి అధికమవుతుంది.
18. నందివర్థనం పూలతో శివునికి పూజ చేస్తే - జీవితంలో సుఖం, శాంతి, ప్రశాంతత లభిస్తుంది.
19. కణగలె పుష్పం - దీనితో దేవునికి పూజ చేస్తే మనను పట్టి పీడిస్తున్న భయం, భీతి తొలగిపోతాయి. గణపతికి ఈ పూలతో పూజ చేస్తే మాంత్రిక బాధల తొలగిపోతాయి. విద్యా ప్రాప్తి సిద్ధిస్తుంది. దుర్గాదేవికి ఈ పూలతో పూజ చేస్తే దేవీ అనుగ్రహంతో శత్రువుల నిర్మూలనం అవుతుంది.
20. పొద్దుతిరుగుడు పువ్వుతో పూజ చేస్తే - పూవును హోమం పూర్ణాహుతికి వేస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి.

పసుపును ప్రసాదంగా ఇంటికి తీసుకొస్తే ఏం చేయాలి!?

పసుపుని సంస్కృతంలో హరిద్ర అని అంటారు. పసుపును అన్ని శుభకార్యాల్లో ఉపయోగిస్తారు. శాస్త్రాల్లో పేర్కొన్న కొన్ని ముఖ్య వస్తువులు ఎవరి నుంచి అయినా పొందవచ్చు. వాటికి మైల ఉండదు. అవేమిటంటే...

1. పసుపు, 2. కుంకుమ, 3. పూలు, 4. పళ్లు, 5. తమలపాకు, 6. వక్క, 7. పాలు, 8. పెరుగు, 9. నేయి, 10. తేనె, 11. కూరగాయలు, 12. తులసి, 13. గంధం అరగదీసే సానరాయి, 14. గంధం చెక్క

వీటిలో పసుపుకు మొదటి స్థానం కల్పించబడింది. అలానే సుమంగళులకు తాంబూలం లేదా ఆకు, వక్క ఇచ్చే సమయంలో మొదట పసుపు ఇచ్చి తరువాత కుంకుమ ఇస్తారు.

పసుపు సౌభాగ్యానికి చిహ్నం. ఈ కారణం చేతనే సుమంగుళులు తన భర్తకు శుభం కోరుతూ మాంగల్యానికి పసుపును ఉంచి నమస్కరిస్తారు.

దేవీ ఆలయాల్లో, నవరాత్రి పూజా సమయంలో దేవికి పసుపుతో చేసే అలంకారాలు ముఖ్యమైనవి. గోదాదేవి లేదా ఆండాళ్ అమ్మవారి దేవాలయానికి మీరు వెళ్లినప్పుడు మీకు పసుపు ప్రసాదాన్ని అందిస్తే మీరు ఏం చేస్తారు? పసుపును ఇంటికి తీసుకు వచ్చి వంటల్లో లేదా స్నానం చేసేందుకు ఉపయోగిస్తారు. అయితే ఇకపై అలా చేయవద్దు.

ప్రసాదంగా పసుపును పొంది ఇంటికి తీసుకు వచ్చినప్పుడు చేయాల్సిన విధాన క్రమం:


1. దేవుని ప్రసాదమైన పసుపును ప్రతి దినం పూజాస్థానంలో ఉంచి పూజిస్తే ఇంటికి, ఇంట్లో ఉన్నవారికి అన్ని విధాలా ధన, కనక, వస్తు, వాహనాలు వృద్ధి చెందుతాయి.

2. పసుపును నీటిలో వేసి స్నానం చేస్తే దేహ కాంతి పెరుగుతుంది. సమస్త చర్మరోగాలు నయం అవుతాయి. పసుపును నీటిలో వేసి చేసే స్నానాన్ని మంగళ స్నానం అని పిలుస్తారు.

3. పసుపుతో గౌరీదేవిని చేసి పూజించటం ద్వారా ఇంట్లో ఉండే వధువుకు ఉన్న వివాహ దోషాలు తొలగిపోయి, త్వరలో వివాహం నిశ్చయమవుతుంది.

4. దేవికి పసుపు రంగు చీరను ఇస్తే ఇంట్లో ఉండే దోషం మరియు దైవ దోషాలు తొలగిపోతాయి.

5. దుకాణాల్లో చాల రోజులుగా అమ్ముడు కాకుండా మిగిలి ఉండే వస్తువులపై కొద్దిగా పసుపు పొడిని చల్లితే వెంటనే వ్యాపారమవుతుంది.

6. పసుపు నీటితో ఇంటిని కడిగితే ఆ ఇంటికి ఆ ఇంటివారికి డబ్బుకు సమస్య రాదు, అప్పుల బాధ తొలగిపోతుంది.

7. కామెర్లు ఉన్నవారి ఇంటి వారు పసుపును దానంగా ఇస్తే కామెర్ల రోగం తొలగిపోతుంది.

8. ప్రతి సంవత్సరం కామెర్లు వచ్చేవారు సుమంగుళులకు పసుపు రంగు చీర తాంబూలాలను దానంగా ఇస్తే కామెర్ల సమస్య తలెత్తదు.

9. గృహదేవతను పసుపు నీటితో కడిగితే విగ్రహాలకు దైవ కళ పెరుగుతుంది.

10. వ్యాపారం జరుగని దుకాణాల్లో శంఖాన్ని పసుపు రంగు కాగితంలో చుట్టి దానిని గల్లాపెట్టెలో ఉంచితే వ్యాపారం బాగా అవుతుంది.

నవగ్రహాలు : చేయాల్సిన పూజలు - వ్రతాలు

భూమిపై ఉండే ప్రతి మానవుని మదిలో వివిధ కోర్కెలు ఉంటాయి. ఇవి నెరవేర్చుకునేందుకు వివిధ రకాల యజ్ఞయాగాదులు, పూజలు పునస్కారాలు చేస్తుంటారు. ముఖ్యంగా ప్రతి ఆలయంలో ఉండే నవగ్రహాలకు ప్రత్యేక పూజలు చేస్తూ.. ప్రదక్షిణలు చేస్తుంటారు. అయితే ప్రకృతిలో ఉన్న నవ గ్రహాలను పూజించేందుకు ప్రత్యేక పూజలు చేయాల్సింది. ముఖ్యంగా వీటి అనుగ్రహానికి వివిధ రకాల వ్రతాలను చేస్తే ఫలితం కనిపిస్తుంది. ఆ నవగ్రహాల అనుగ్రహానికి చేయవలసిన వ్రతాలను ఓ సారి పరిశీలిద్ధాం...

సూర్యగ్రహ అనుగ్రహముకు రథసప్తమి, శ్రీరామనవమి, కేదారేశ్వర, సూర్య చంద్ర వ్రతము చేయాలి. అలాగే చంద్ర గ్రహానికి అమావాస్య సోమతి వ్రతం, కృష్ణాష్టమి వ్రతం, సోమవార వ్రతం, కజుడు అనుగ్రహానికి నాగుల చవితి, నాగ పంచమి, అంగారక చవితి, కాత్యాయనీ వ్రతము, కుజగౌరీ వ్రతము చేయాలి. బుధుడు అనుగ్రహానికి శ్రీ అనంత పద్మనాభ వ్రతము, శ్రీ సత్యనారాయణ వ్రతము, తులసీ వ్రతము, గురు గ్రహానికి శ్రీ సత్యసాయి వ్రతము, శ్రీ సత్యదత్త వ్రతము, త్రినాథ వ్రతాలను చేయాల్సి ఉంటుంది.

అలాగే శుక్రుడు అనుగ్రహానికి వరలక్ష్మీ వ్రతం, వైభవలక్ష్మీ వ్రతం, శ్రీలక్ష్మి కుబేర వ్రతం, సంతోషిమాత, అనఘాదేవి వ్రతాలను చేయాలి. శని గ్రహం అనుగ్రహానికి హనుమద్వ్రతము, శివరాత్రి, శనైశ్చర వ్రతాలు, రాహు గ్రహానికి శ్రీదేవి నవరాత్రి, సావిత్రీ, షోడశగౌరీ వ్రతం, కేతువు అనుగ్రహానికి వినాయక చవతి, సంకష్టహర చతుర్థి, పుత్రగణపతి వ్రతాలు చేస్తే ఫలింత వుంటుందని సిద్ధాంతాలు చెపుతున్నాయి.

పరమేశ్వరుని ప్రదోష నృత్యం గురించి మీకు తెలుసా...!?


ఒకసారి "నటరాజ" భగవానుడైన శివుని తాండవ నృత్యంలో పాల్గొనడానికి రజతగిరి కైలాసపర్వతం మీద సమస్త దేవగణం హాజరయ్యింది. జగజ్జనని ఆదిశక్తి గౌరీమాత అక్కడి దివ్యరత్న సింహాసనం మీద ఆసీనురాలై తన అధ్యక్షతన శివతాండవాన్ని ప్రారంభింపజేయడానికి ఉపస్థితురాలై ఉంది.

నారదమహర్షి కూడా ఆ నృత్య కార్యక్రమంలో పాల్గొనడానికి లోకాలన్నీ పరిభ్రమిస్తూ అక్కడికి చేరుకున్నాడు. కొద్ది క్షణాల్లోనే శివభగవానుడు భక్తి పారవశ్యంతో తాండవ నృత్యం ఆరంభించాడు. సమస్త దేవగణం, ఇంకా దేవతా స్త్రీలు కూడా ఆ నృత్యంలో సహాయకులై వివిధ వాద్యాలను వాయించసాగారు.

పద్మాసనస్థయై సరస్వతీ మాత వీణను, విష్ణుభగవానుడు మృదంగాన్ని, దేవేంద్రుడు మురళిని బ్రహ్మదేవుడు తాళాన్ని చేపట్టి వాద్య సహకారం అందిస్తూండగా లక్ష్మీదేవి గీతాలాపన చేయసాగింది. ఇంకా యక్ష, గంధర్వ, కిన్నెర, ఉరగ, పన్నగ, సిద్ధ, అప్సర, విద్యాధరాది అన్య దేవతాగణం భావ 'విహ్వలురై' శివభగవానునికి నలుదిక్కులా నిలబడి ఆయన్ని స్తుతించడంలో నిమగ్నమయ్యారు.

శివభగవానుడు ఆ ప్రదోష కాలంలో సమస్త దివ్య శక్తుల సమక్షంలో అత్యంతాద్భత లోక విస్మయకర తాండవ నృత్యాన్ని ప్రదర్శించారు. ఆయన ముద్రాలాఘవం చరణ, కటి, భుజ, గ్రీవాల కదలికతో ఉన్మత్తమైనప్పటికి సునిశ్చిమై సాగిన విలోలహిల్లోల ప్రాభవం అందరి మనస్సులను, నేత్రాలను-రెంటినీ ఒక్కసారిగా అచంచలంగా నిలబెట్టింది.

అందరూ భూతభావనుడై శంకరభగవానుని నృత్యాన్ని వేనోళ్ళ కీర్తించారు. ఆదిపరాశక్తి భగవతి (మహాకాళి) ఆయనపై అత్యంత ప్రసన్నురాలైంది. ఆమె శివునితో (మహాకాలునితో) - "భగవాన్! నేటి - నీ నృత్యాన్ని చూశాక నాకు చాలా ఆనందం కలిగింది. నేను నీకు ఏదైనా వరాన్ని ప్రసాదించాలనుకుంటున్నాను." అని పలికింది.

ఆమె వచనాలను విని లోకహితంకరుడైన శంకరుడు నారద ప్రేరితుడై - " దేవీ! ఈ తాండవ నృత్యాన్ని చూసి నీవు, దేవగణం, ఇంకా అన్యదివ్యయోనిజన్య జీవులూ' విహ్వలురై పొందిన ఆనందం భూలోక జీవులకు లేకుండా పోతోంది. మన భక్తులు కూడా ఈ సుఖాన్ని పొందలేకపోతున్నారు.

కాబట్టి పృథ్వీ వాసులకు కూడా ఈ నృత్యం దర్శనభాగ్యం కలిగేలా అనుగ్రహించు, అయితే నేను మాత్రం తాండవం నుండి తప్పుకుని 'లాస్యం' చేయాలని అనుకొంటున్నాను". అని విన్నవించాడు. శివభగవానుని విన్నపాన్ని మన్నించి తక్షణమే ఆదిశక్తి, భువనేశ్వరి మహాకాళీమాత సమస్త దేవతలను విభిన్న రూపాలలో భూమండలం మీద అవతరించాల్సిందిగా ఆదేశించింది.

స్వయంగా ఆమె శ్యామసుందరుడు శ్రీకృష్ణ భగవానునిగా అవతరించి బృందావన ధామానికి విచ్చేసింది శివభగవానుడు (మహాకాలుడు) మధురానగరిలో రాధగా అవతారమెత్తాడు. ఇక్కడ వారిరువురూ కలిసి దేవతలకు సైతం దుర్లభమైన అలౌకిక రాస నృత్యాన్ని ఆరంభించారు.

శివభగవానుని "నటరాజ" నామం (బిరుదు) ఇక్కడ శ్రీకృష్ణ భగవానునికి లభించింది. భూమండలంలోని చరాచర జీవులన్నీ ఈ రాస నృత్యాన్ని తిలకించి పులకించిపోయాయి. పరమేశ్వరేచ్ఛ నెరవేరింది.

వస్త్ర సేవలతో ఎటువంటి ఫలితం లభిస్తుంది..!?

1. ఎవరి ఇంట్లో అన్నానికి వస్త్రానికి చాలా ఇబ్బందులుంటాయో అటువంటివారు దేవునికి వస్త్ర సేవ చేయించినా లేదా దుస్తులను దానం చేస్తే ఇంట్లో అన్న దారిద్ర్యం, వస్త్ర దారిద్ర్యం తొలగిపోతాయి.

2. ఏ వ్యక్తికైతే దేహం మండుతున్నట్లుంటుందో లేదా దురదలు ఎక్కువ పుడుతుంటుందో అటువంటి వారు దేవునికి వస్త్రాల సేవను చేయిస్తే వారికి ఉన్న అన్ని సమస్యలు తొలగిపోతాయి.

3. ఎవరైతే తాము అందంగా కనిపించాలని అనుకుంటారో అటువంటి వారు దేవునికి వస్త్రాలతో సేవను చేయిస్తే అందంగా కనిపిస్తారు.

4. ఎవరైతే దేవునికి వస్త్ర సేవలను చేయిస్తారో వారికి గంధర్వలోకం ప్రాప్తిస్తుంది.

అమ్మవారి దేవాలయాల్లో కూడా దేవి అనుగ్రహం కోసం మూల విగ్రహానికైనా, ఉత్సవ విగ్రహానికి అయినా భక్తులు తమ ప్రార్థనల తరువాత దేవికి పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, చీరలు, గాజులను తదితరాలను సమర్పిస్తారు.

దేవికి అలంకారం చేసే సమయంలో తాము తీసుకువచ్చిన చీరలను దేవికి కట్టించాలని కొందరు ప్రార్థిస్తారు. దేవికి అలంకారం అయిన తరువాత దేవిని కన్నులారా చూసి సంతోషించి భక్తితో నమస్కరించి ఇళ్లకు తిరిగి వెళతారు. కొందరు స్త్రీ దేవాలయాల్లో కూడా దేవికి ప్రతి రోజు వస్త్రలను మార్పిస్తారు. ఇలా చేస్తే సుఖ సంతోషాలతో కూడిన జీవితం ప్రాప్తిస్తుందని భక్తుల విశ్వాసం.

ఉదాహరణకు:
1. మైసూరు చాముండి దేవాలయంలో చాముండేశ్వరి దేవికి
2. శంగేరిలోని శారదాంబకు
3. కొల్లాపురంలోని శ్రీ మహాలక్ష్మి దేవికి
4. కాశ్మీరులోని శారదాదేవికి
5. అస్సాంలోని కామాఖ్య దేవికి.
6. విజయవాడలోని కనకదుర్గమ్మ దేవికి
7. తిరుచానూరులోని పద్మావతి అమ్మవారికి.

ఇలా పలు దేవి దేవాలయాల్లో దేవికి ఒకసారి ఉపయోగించిన వస్త్రాలను మరోసారి ఉపయోగించరు. అమ్మవారి దేవాలయాల్లో వస్త్రాలు సమర్పించేవారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పండితులు చెబుతున్నారు. 

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో గోవు ప్రాధాన్యమేమిటో తెలుసా!?

సంస్కృతంలో 'గో' శబ్దానికి పుంలింగం 'ఎద్దు' అనీ, స్త్రీలింగం 'ఆవు' అర్థం. ఎద్దునూ, ఆవునూ కలిపి చెప్పే పదం సంస్కృతంలో ఒకటే- అదే "గో" అనేది. ఆవు పాడికి సంకేతం. ఆవులో సకలదేవతలూ ఉంటారు. తల్లిపాల తర్వాత అంతటి శక్తినీ, మేధాశక్తినీ ఇవ్వగలవి గోక్షీరాలే. అందుకే పంచామృతాలలో నేయీ పెరుగులనే వాడతారు.

బతికుండగానూ, వ్యక్తి పోవాలంటే చేయవలసింది గోదానమే.. ఇలా గోవుకు సంబంధించి ఎన్నెన్నో విశేషాలున్నాయి. అందుకే అంతటి పవిత్రమైన గోవు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో మొదటి వరుసలో గోవు నడుస్తుంది.

ఇక శ్రీ వేంకటేశ్వర కథలోకి తొంగిచూస్తే, గోవుపాలను తాగే కదా శ్రీనివాసుడు చాలాకాలం జీవించాడు. పద్మావతీ శ్రీనివాసుల కథలో గోవుపాత్ర ఎక్కువేనని బ్రహ్మోత్సవంలో కదిలే గోవులే చెబుతుంటాయి. అదిగాక గోవు తెల్లగా ఉంటుంది. అది సత్త్వగుణానికి చిహ్నం. అందుకే ఆవు- ఎక్కడోగానీ-సాధువుగానే ఉంటుంది.

తిరుమల శ్రీవారి స్వామి ఊరేగింపును దర్శిస్తున్న భక్తులారా సత్త్వగుణంతో ఉండండి. మాలాగా సాధువులుగా జీవించండి ఇలా మేముంటున్న కారణంగానే దేవతలు మాలో నివసిస్తున్నారు.

ఐదురెట్ల పిల్లల్ని ఒక ఈతలో కంటున్నప్పటికీ మా సంతానానికి మించి ఏ పులిజాతీ, సింహజాతీ ఏ ఖండంలోనూ ఉండడం లేదు. కాబట్టి ధర్మమే జయిస్తుందనే విషయానికి మేమే సాక్ష్యం అని మౌనంగా చెబుతూ శ్రీ వేంకటేశుని ఆలయంలో సూక్తి- ధర్మో రక్షతి రక్షిత"ను పదే పదే గుర్తుచేస్తుంటాయి.

"జ్వరం" ఆవిర్భావానికి వేదిక ఏంటో మీకు తెలుసా!?

మనుషులకైనా, పశువులకైనా, మరే ఇతర ప్రాణులకైనా జ్వరం రావటం మానవ వైద్యశాస్త్రంలోనూ, పశు వైద్య శాస్త్రంలోనూ కనిపిస్తుంది. వీటికి వైద్య చికిత్సలు తీసుకోవడం కూడా సహజమే, అయితే ఈ జ్వరం అనేది ఒక జ్వరుడు అనే వాడి రూపాంతరమేనని, జ్వరుడి ఆవిర్భావానికి వేదిక దక్షయజ్ఞమే అయిందని పౌరాణికగాథలు వివరిస్తున్నాయి. పురాణాలలోని అనేక అంశాలను క్రోడీకరించి భీష్ముడు ధర్మరాజుకు ఉపదేశిస్తున్న అంశాలలో ఈ జ్వర ఉత్పత్తి కథ కూడా మనకు కనిపిస్తుంది.

దక్షయజ్ఞంలో పతీదేవికి జరిగిన అవమానం, ఆమె అగ్నికి ఆహుతి కావటం, ఆ తరువాత పరమేశ్వరుడు తన ప్రమథగణాలను పంపి యజ్ఞాన్ని ధ్వంసం చేయటం అందరికి తెలిసిన కథే. దక్షుడి యజ్ఞం అలా ధ్వంసమైనప్పుడు ఆ యజ్ఞం ఒక మృగరూపాన్ని ధరించి ఆకాశానికి ఎగిసి పరుగెత్తడం ప్రారంభించింది. పరమేశ్వరుడు దాన్ని చూసి తన బాణాన్ని ప్రయోగిస్తాడు. ఆ సమయంలో పరమేశ్వరుడి నుదిటి నుంచి ఒక చెమట బిందువు నేలమీద పడింది.

వెంటనే ఒక అగ్ని పుట్టుకొచ్చింది, ఆ అగ్ని నుంచి నిప్పుకణికల్లా మండి పోతున్న ఎర్రటి కళ్ళతోనూ, పచ్చని మీసాలతోనూ, విరబోసుకుని ఉన్న కేశాలతోనూ, నల్లని శరీరఛాయతోనూ, సూదులలాగా నిక్కపొడుచుకుని ఉన్న ఛాయతోనూ, సూదులలాగా నిక్కపొడుచుకుని శరీరం మీద వెంట్రుకలతోనూ ఉండి, ఎర్రటి వస్త్రాన్ని ధరించిన ఒక భీకరాకారుడైన పురుషుడు ఉద్భవించాడు.

వెంటనే ఆ పురుషుడు యజ్ఞాన్ని పూర్తిగా ధ్వంసం చేసి అక్కడ ఉన్న దేవతల మీదకూడా విరుచుకుపడ్డాడు. ఆ బాధలను తట్టుకోలేక దేవతలంతా బ్రహ్మ దగ్గరకు వచ్చి తమను కాపాడమని వేడుకున్నారు. బ్రహ్మ వారందరితో కలిసి వెళ్ళి శివుడిని ప్రార్థించారు. శంకరుడి స్వేదబిందువు నుంచి ఉద్భవించిన జ్వరుడు అనే ఆ ఘోర పురుషుడి బాధ నుంచి తమకు విముక్తిని ప్రసాదించమని మునులు, ఋషులు, దేవతలు అనేక విధాలుగా పరమేశ్వరుడిని వేడుకోవడంతో శివుడు శాంతించి తన నుంచి ఆవిర్భవించిన జ్వరుడిని అనేక భాగాలుగా విభజించారు.

ఆ జ్వరుడి నుంచి ఏర్పడిన భాగాలే అధిక సంఖ్యాకమైన జ్వరాలయ్యాయి. ఆ జ్వరాలు కొన్ని ప్రాణులకు ప్రాణాంతకమైన వ్యాధులుగాను, శరీరభాగాలుగాను రూపొందాయి. నాగజాతికి శిరోవేదనగానూ, సాధారణ సర్పాలకు కుబుసాలుగానూ, పర్వతాలకు శిలాజిత్తుగానూ, నీటికి పాచిగానూ, ఎద్దుల వంటి జంతువులకు డెక్కల చీలికలగానూ, భూమికి చవుడుగానూ, ఇతర పశువులకు దృష్టి దోషంగానూ, గుర్రాలలో గొంతువాపుగానూ, నెమళ్లల్లో పింఛాలుగానూ, చిలుకలకు ఎక్కిళ్ళుగానూ, మానవజాతికి జ్వరంగానూ ఏర్పడింది.

మనిషి పుట్టిన దగ్గర నుంచి మరణించేవరకు అనేక సందర్భాల్లో, అనేక పేర్లతో ఈ జ్వరం సంక్రమిస్తుంటుంది. ఇలా జ్వరం అనేది దక్షయజ్ఞంనాడు ఆవిర్భవించిందని, జ్వరాలలో మహేశ్వరజ్వరాలు, వైష్ణవజ్వరాలు అను కూడా ఉంటాయని అనేక పురాణాలు తెలుపుతున్నాయి. 

ఉగాది నాడు శ్రీమద్రామాయణ పారాయణం చేయండి!

చైత్రమాసం శుక్లపక్షంలో సూర్యోదయ సమయంలో పాడ్యమి తిథి ఏ రోజున వుంటే ఆ రోజున ఉగాది పండుగ పరిగణిస్తారు. ఇంకా బ్రహ్మదేవుడు తన సృష్టిని ప్రారంభించిన తొలిరోజుకు ప్రతీకగా ఉగాది పండుగను జరుపుకుంటారు. ఉగాది రోజున శ్రీరామునిని ఆరాధించడంతో పాటు శక్తి ఆరాధనకు కూడా విశిష్టమని పురోహితులు చెబుతున్నారు.

అలాంటి ఉగాది పండుగ రోజున శ్రీరామ చంద్రమూర్తిని పూజించడం ద్వారా సకల సౌభాగ్యాలు చేకూరుతాయి. ఇంకా శ్రీరాముని ఆరాధన, శ్రీ మద్రామాయణ పారాయణ చేయడం ద్వారా సకల సంతోషాలు ప్రాప్తిస్తాయని విశ్వాసం.

ఉగాది పండుగ నాడు సూర్యోదయానికి ముందే నిద్రలేచి శాస్త్రవిధిగా నువ్వులతో తలంటుకుని, నువ్వు పిండితో ఒంటికి నలుగు పెట్టుకుని, కుంకుడుకాయ రసంతో తలస్నానం చేయండి. తిలకధారణ, నూతన వస్త్రాల ధారణ అనంతరం భగవంతుడిని పూజించాలి. పూజానంతరం పెద్దల ఆశీస్సులను పొందడం, దేవాలయ సందర్శనం చేస్తే పుణ్యఫలములు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు.

బ్రాహ్మమూహూర్తంలో నిద్రలేస్తే దేవతల అనుగ్రహం పొందవచ్చట!

ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చిరాయువును పొందడానికి బ్రాహ్మముహూర్తంలో నిద్రలేచి తీరాలని పండితులు అంటున్నారు. ఆయుర్వేదం- సూర్యుడుదయించుటకు 90 నిమిషాల మునుపటికాలమే బ్రహ్మమూహూర్తం. ఇది బుద్దిని వికసింపజేస్తుంది. ఈ బ్రహ్మముహూర్తంలోనే సూర్యభగవానుడు తన అసంఖ్యాకకిరణాల జ్యోతిని, శక్తిని ప్రపంచంపై ప్రసరింపజేయనారంభిస్తాడు. అప్పుడు వాటి ప్రభావం వల్ల మనశరీరం చురుకుగా పనిచేస్తుంది.

మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. నక్షత్రమండలం నుండి ప్రసరించే కాంతికిరణాలు ప్రాణుల మస్తిష్కాన్ని ప్రభావితం చేస్తాయి. అప్పటి భాస్కరకిరణ పుంజం మానవ శరీరంలోని జీవకణాలను చైతన్యవంతం చేస్తుంది. కాబట్టి ఆ వేళలో మానవుడు తన ప్రాణాలను మహా ప్రాణాలతో సంబంధింపజేస్తే మానవునిలో అపారమైనశక్తి ఉత్పన్నమౌతుందని పండితుల అభిప్రాయం.

ఈ సమయంలో జీవకోటి నిద్రాదశలో ఉంటుంది. ఈ నిశ్శబ్ధవాతావరణంలో ఇంద్రియనిగ్రహాన్ని పాటించే మహర్షులు మేలుకుని ధ్యాన సమాధిని పొంది తపోమయ విద్యుత్తరంగాలను విశ్వవ్యాప్తంగా ప్రసరింపచేస్తూంటారు.

బ్రాహ్మముహూర్తంలో నిద్రిస్తూంటే చేసుకున్న పుణ్యమంతా నశిస్తుంది. బ్రాహ్మే ముహూర్తేయా నిద్రా సా పుణ్యక్షయకారిణీ- అంటారు. పుణ్యనాశానికెవరూ అంగీకరించరూ కదా. కాబట్టి తెల్లవారుజామున నిద్రలేచి తీరాల్సిందే.

నూతన విషయాలు ఆలోచించడానికి, గ్రంథరచన సాగించడానికి, మానసిక వికాసానికి బ్రాహ్మముహూర్తమెంతో సాయపడుతుంది. ఆ సమయంలో రాత్రి అంతా చంద్రకిరణాల నుండి నక్షత్రకిరణాల నుంచి ప్రసరించి అమృతాన్ని గ్రహించి ఉషఃకాలవాయువు వీస్తూంటుంది. ఈ గాలిసోకి శరీరమారోగ్యంగా, ముఖం కాంతివంతంగా, మనస్సు ఆహ్లాదకరంగా, బుద్ధినిశితంగా ఉంటాయి.

కాబట్టి బ్రాహ్మముహూర్తంలో నిద్రలేవడం వల్ల దేవతల, పితరుల అనుగ్రహాన్ని పొందవచ్చు. ఆయువును పెంచుకోవచ్చు. ఆరోగ్యాన్ని సంతరించుకోవచ్చు.

రుద్రాక్ష మాల సవ్య దిశలో తిరిగితే ఆ నీరు తాగవచ్చు!!

రుద్రాక్షలు పర్వతాల మీద ముఖ్యంగా హిమాలయాల్లో కొంత ఎత్తులో పెరిగే ఒక వృక్షజాతి గింజలు. అవి ఇంకా పలు ప్రాంతాల్లో, పశ్చిమ కనుమల్లో కూడా పెరుగుతాయి. ఎక్కువ రుద్రాక్షలు నేపాల్, బర్మా, థాయ్‌లాండ్, ఇండోనేషియాల నుంచి వస్తాయి. రుద్రాక్షలు మీ శక్తితోనే ఒక గూడులాగా తయారు చేసి, వేరే శక్తులు మిమ్మల్ని కలత పెట్టకుండా చేస్తాయి.

అందుకే రుద్రాక్షలు ఎప్పుడూ తిరుగుతూ, వేర్వేరు చోట్ల తినే వారికి చాలా ఉపయోగకరం. మీరు గమనించే ఉంటారు. మీరు కొత్త చోటుకు వెళ్లినపుడు, ఒక్కోచోట మీరు తేలికగా నిద్రలోకి జారిపోతారు. ఇంకొన్ని చోట్ల మీరు అలసిపోయి పడుకున్నా నిద్రరాదు. దీనికి కారణం మీ చుట్టూ పరిసరాల్లో స్థితి మీ తరహా శక్తికి అనుకూలమైంది కాకపోవటం వల్ల.

అందుకే అక్కడ మిమ్మల్ని విశ్రమించనీయదు. సాధువులు, సన్యాసులు ఒకేచోట రెండవసారి పడుకోకూడదు తిరుగుతూ ఉంటారు. అందువల్ల పరిస్థితులు, పరిసరాలు వారికి బాధ కలిగించవచ్చు. అందుకే వారెప్పుడూ రుద్రాక్షలు వేసుకునే ఉంటారు.

ఈ రోజుల్లో మళ్లీ ప్రజలు వారి వృత్తి, వ్యాపార రీత్యా వివిధ ప్రాంతాల్లో తింటారు. పడుకుంటారు. మనిషి ఒకేచోట పడుకుంటుంటే, తింటుంటే వారికి అక్కడ ఒక రకమైన గూడు ఏర్పడుతుంది. కానీ ఎప్పుడూ తిరిగే వారికి, అనేక చోట్ల తినే వారికి, నిద్రించే వారికి, రుద్రాక్ష మీ శక్తితోనే గూటిని ఏర్పరస్తుంది.

ప్రకృతిలో వివిధ రకాలుగా నీరు విషపూరితమయ్యే అవకాశముంది. కాబట్టి అరణ్యాల్లో నివసించే సాధువులు, సన్యాసులు అన్ని చోట్ల మంచినీరు తాగలేరు. అలా తాగితే ఆ నీరు వారిని దుర్బలం చేస్తుంది. కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకం అవుతుంది. ఆ నీటి మీద రుద్రాక్షమాలను పట్టుకుంటే, మాల సవ్య దిశలో తిరిగితే ఆ నీరు తాగవచ్చు. అదే విషపూరితమైన నీరైతే రుద్రాక్షమాల అపసవ్య దిశలో తిరుగుతుంది.

రుద్రాక్ష దుష్ట శక్తుల నుంచి రక్షణగా ఉంటుంది. కొందరు ఇతరులకు హాని కలిగించటానికి కొన్ని దుష్టశక్తులను ప్రయోగించవచ్చు. అయితే ఈ హానికరమైన సంఘటనల నుంచి రుద్రాక్ష కవచంలా పనిచేస్తుంది. ఈ విధంగా శక్తివంతం చేసిన రుద్రాక్షలను గృహస్థులు వేసుకోకూడదు.

రుద్రాక్షకు ఒకటి నుంచి ఇరవై ఒకటి దాకా ముఖాలు ఉండవచ్చు. అవి వివిధ రకాలుగా ఉపయోగపడతాయి. అందుకే రుద్రాక్షను దుకాణంలో కొని వేసుకోకూడదు. కాని పంచముఖి రుద్రాక్ష ఆడ, మగ, పిల్లలు అందరికీ మంచిదే. అది సౌఖ్యానికి, ఆరోగ్యానికి, స్వతంత్రతకూ సర్వత్రాదోహదకారి.

రుద్రాక్ష రక్తపోటుని కూడా తగ్గిస్తుంది. మీ నరాలకు కొంత నెమ్మదిని కలిగించి మీ నాడీ వ్యవస్థకు కొంత స్వాంతన, చురుకుదనాన్ని కలిగిస్తుంది. మీరు మీ జీవితాన్ని పవిత్రం చేసుకుందామనుకుంటే, రుద్రాక్ష మంచి ఉపకరణం.

విడిపోయిన దంపతులను కలిపిన పరమేశ్వరుడు!

చోళులు రాజ్యమేలుతున్న రోజులవి. తమిళనాడు రాష్ట్రంలో సత్త మంగై అనే ఊళ్లో కొన్ని బ్రాహ్మణ కుటుంబాలు నివసిస్తుండేవి. ఆ ఊళ్లోని మఠాలలో పండితులు ప్రతి రోజూ వేదగానం చేసేవారు. మైనాజాతి పక్షులు ఆ వేద ఋక్కులను తియ్యని గొంతుతో అనుకరిస్తూ పాడేవి.

స్త్రీలు లావణ్యాన్ని ఒలకబోస్తూ చెరువులలో దిగి స్నానాలు చేసేవారు. హంసలు ఒకదానితో మరొకటి పోటీపడి చెరువులో దూకి, ఆ సౌందర్యవతులతో ఆటలు ఆడేవి. ఈ ఊళ్లోని పురుషులు ఎంత పవిత్రమూర్తులో, వారి భార్యలు అంత పుణ్యవతులు.

అదే ఊరిలో తిరునీలనక్కర్ అనే శివభక్తుడు ఉండేవాడు. వేదవిహిత కర్మలు తూ.చ తప్పకుండా ఆచరించేవాడు. ప్రతిరోజూ శివాలయానికి వెళ్లి గృహిణిగా తన ధర్మాలు పాటించే ప్రేమైకమూర్తి అయిన భార్యతో పాటు, పూజాదికాలను భక్తిశ్రద్ధలతో నిర్వర్తించేవాడు.

ఒక రోజు నీలనక్కర్ ఆలయంలోని గర్భగుడిలోకి ప్రవేశించాడు. అతనివెంట అతని భార్య కూడా వివిధ రంగులతో శోభించే పుష్పాలతో, బిల్వదళాలతో అనుసరించింది. వినిర్మల భక్తితో పరవశించే హృదయంతో అతను శివుని కీర్తిస్తూ మంత్రాలు పఠించేవాడు. ఆ తర్వాత ప్రగాఢమైన ధ్యానంలో మునిగిపోయాడు.

అతని భార్య ఒక్కొక్కటిగా బిల్వదళాలను శివలింగంపై వేస్తూ అర్చించసాగింది. ఆమె కన్నులు తదేకదృష్టితో శివలింగంవైపే చూస్తున్నాయి. అంతలో విషపూరితమైన ఒక సాలెపురుగు లింగంపై గాలిలో తిరుగాడుతుండటం ఆమె కంటపడింది. ఆమె దానిని తొలగించాలని అనుకుంటుండగానే అది కాస్తా లింగంపై వాలింది

ఒక విషకీటకం లింగంపై పడడం చూడలేక ఆమె తన శక్తినంతా కూడదీసుకుని దానిపైకి ఊదింది. ఆ గాలికి సాలీడు, అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కాని అనుకోకుండా ఆమె నోటివెంట లాలాజలపు తుంపరులు ఆ లింగంపై పడ్డాయి. అదే క్షణంలో ఆమె భర్త కన్నులు తెరిచాడు. అతడు సాలీడును గమనించకుండా తన భార్య చేసిన పనికి కోపోద్రిక్తుడైనాడు.

కళ్లవెంట నిప్పులు కురిపిస్తూ.. అతడు శివునిరై ఎందుకు ఉమ్మివేశావు? అని నిలదీశాడు. లేదు నేనెందుకు ఉమ్మివేస్తాను? శివలింగంపై వాలిన సాలీడును ఊది తొలగించాను అంతే నాకీ అనుకోకుండా ఉమ్మి తుంపరులు లింగంపై పడ్డాయి. అంది భయంతో వణికిపోతూ..

ఈ శివలింగాన్ని నువ్వు అపవిత్రం చేశావు. మరోవిధంగా సాలీడును అక్కడి నుంచి తొలగించి వుండాల్సింది. శివునికే అపచారం చేసిన పాపాత్మురాలివి. నీకు నా హృదయంలోనూ, నా ఇంటిలోనూ స్థానం లేదు.

ఇక్కడి నుంచి నుంచి వెళ్ళిపో.. అని పెద్దగా అరుస్తూ ఆ ఆలయాన్ని విడిచివెళ్లాడు. ఆమె దుఃఖిస్తూ ప్రాధేయపడింది. కానీ ప్రయోజనం లేకపోయింది. ఎక్కడకు వెళ్లాలో తెలియక, ఆ ఆలయంలోనే ఆ రాత్రి గడపాలని నిశ్చయించుకుంది. తనను కాపాడమని ఆమె శివుణ్ణి వేడుకుంది. ఆ విధంగా విడిపోయిన దంపతులను చూసి శివుని హృదయం కరిగిపోయింది.

తనపట్ల వారికిగల ప్రేమకు, భక్తికి ఆయన ఎంతగానో పులకించి, వారిని తిరిగి ఒక్కటి చేయాలని తలచాడు. అర్థరాత్రి అయ్యింది. తిరునీలనక్కర్‌‌కు ఆ రాత్రి కలలో శివుడు ప్రత్యక్షమయ్యాడు. నా శరీరాన్ని సరిగ్గా చూడు నీ భార్య సరైన సమయంలో నాకు సహాయమే చేసింది అన్నాడు శివుడు. అతను తన కళ్లను తానే నమ్మలేకపోయాడు.

తన భార్య గాలి ఊదినచోట తప్పించి, శివుని శరీరంలో మిగిలిన భాగం అంతా బొబ్బలతో, గాయాలతో కనిపించింది. ఉలిక్కిపడి అతను నిద్రలేచాడు. ఎంతటి కఠినత్ముణ్ణి నేను.. శివునిపై ప్రేమతో తన భార్య ఈ పని చేసిందని, అటువంటి ప్రేమను తాను గుర్తించలేకపోయానని తనను తాను తిట్టుకుంటూ ఆలయంలోకి పరుగు తీశాడు.

అక్కడ అతని భార్య తన విధిని తలుచుకుని శోకిస్తూ ఉంది. ఇంతటి భక్తురాలి పట్ల ఎంతటి నిర్దయతో ప్రవర్తించాననుకుంటూ పరమశివుడు నాకళ్లు తెరిపించాడు. నాతో పాటు ఇంటికి రా. మనం ఇకనుండి ఎటువంటి కలతలు లేకుండా సుఖంగా జీవిద్దాం అన్నాడు. ఇలా విడిపోయిన దంపతులను ఆ పరమశివుడు కలిపాడు.

లింగదానము నోము చేస్తే..!?

కార్తీకమాసం సోమవారంనాడు తలస్నానం చేసి పసుపు, కుంకుమలూ, కొబ్బరికాయ, తాంబూలం ఒక కేజీ బియ్యం, పప్పు చింతపండూ అన్నీ తీసికొని శివాలయంలో అభిషేకం చేయించాలి.

సహస్ర నామాలు పారాయణ గావించి తొమ్మిది దీపాలు వెలిగించి, పార్వతీదేవిపై మంచి భక్తిభావం కలిగి, పార్వతీ కళ్యాణం కథచెప్పి ఇంటిదగ్గర ఒక ముత్తయిదువుకు ఒక చీర-జాకెట్టు, పసుపు, కుంకుమ, దక్షిణ తాంబూలాలతో రెండు తేజీల బియ్యం, అరటి పళ్లు, వడపప్పు వాయనమివ్వాలి.

అలా కార్తీక సోమవారాలెన్ని పడిన అన్ని రోజులూ లింగదానం నోము నోచాలి. అక్షతలు వేసుకోవాలి. ఇలా చేస్తే అనుకున్న కార్యాలు నెరవేరడంతో పాటు అష్టైశ్వర్యాలు, సుఖసంతోషాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు. 

ముక్కంటి దేవాలయ భస్మాన్ని నుదుటన ధరిస్తే..!?

ఆదిదేవుడు, పరమేశ్వరుడు, ముక్కంటి ఆలయాల్లో ఇచ్చే విభూతిని ధరిస్తే ఎలాంటి ఫలితాలుంటాయో మీకు తెలుసా.. అయితే ఈ కథనం చదవండి. శివుని దేవాలయ భస్మం ధరించడం ద్వారా.. దేహంలో ఉన్న అన్ని రకాల వ్యాధులు తొలగిపోతాయి. ఈ భస్మాన్ని ధరించడం ద్వారా దేహంలో కాంతి వస్తుంది.

రక్తపోటు లేదా హైపర్ టెన్షన్ ఉన్నవారు భస్మంను ధరిస్తే రక్తపోటు సాధారణ స్థితికి చేరుకుంటుంది. మనస్సుకు ప్రశాంతత లభిస్తుంది. ఎక్కువగా మాట్లాడుతూ ఉండేవారు శివాలయాల్లో ఇచ్చే భస్మాన్ని ధరిస్తే వాగుడు తగ్గిస్తారు. అలాగే వ్యాపారాభివృద్ధి చేకూరాలంటే, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలంటే శివాలయంలో ఇచ్చే విభూతిని ధరించాలని పురోహితులు చెబుతున్నారు.

సూర్యనమస్కారంతో ఆరోగ్యభాగ్యాన్ని పొందండి!

ఆరోగ్యాన్ని కోరేవారు ప్రతినిత్యము సూర్యాతాప స్నానము చేసి తీరాలి. ఈ సూర్య స్నానాన్ని రుతువును అనుసరించి చేయాలి. గ్రీష్మరుతువులో ఉదయం 8 గంటల్లోపు, సాయంత్రం నాలుగు గంటల తర్వాత చేయాలి. ఈ స్నానం 15 నిమిషాలు లేదా అరంగట వరకు చేయవచ్చు.

సూర్యోదయసమయంలో సూర్యనమస్కారాలు చేయాలి. సంప్రదాయం ప్రకారం సూర్యనమస్కారం చేయాలి. ప్రతినిత్యం ప్రాతఃస్నానము చేసిన తర్వాత సూర్యునికి ఎదురుగా నిలబడి పద్ధతులు బట్టి నమస్కరించాలి. ఈ నమస్కారాలు కనీసం 24 సార్లైనా చేయాలి. వీటి ద్వారా శరీరం పుష్టిగా ఉంటుంది. ఆరోగ్యభాగ్యాన్ని పొందవచ్చు. చిరకాలం జీవించవచ్చు.

కడుపునిండా తిని ఎండలో తిరగరాదు. పరగడపున ఎండలో తిరగడంతో ఏమాత్రం కీడుందడు. ఇక సూర్యకిరణాలు ప్రసరించే పండ్లలో కూరగాయల్లో ఆహారపదార్థాల్లో శరీరపుష్టి కలిగించే లక్షణాలుంటాయి.

సూర్యరశ్మి ప్రసరించడం వల్ల టీబీ, క్యాన్సర్, పోలియో మొదలగు జబ్బులను వ్యాపింపచేసే క్రిములు సహజంగా చనిపోతాయి. సూర్యరశ్మి పడే గదిలో ఎంతటి చలికాలమైనా రాత్రిపూట వేడిగా ఉంటుంది. అక్కడ నిద్రించడం ద్వారా ఆరోగ్యాన్ని పొందవచ్చును.

పర్ణ ప్రసాదమంటే ఏమిటో మీకు తెలుసా!?

పర్ణ అంటే ఆకులు అని అర్థం. తిరుమల దేవాలయం నుంచి పాపనాశిని ఆకాశగంగకు వెళ్లే మార్గంలో పరమ భక్త హాథిరాం బావాజీ సమాధి వుంది. దీన్ని హథీరాం మఠం అని అంటారు. ఈ దేవాలయానికి వచ్చే భక్తులకు ప్రసాదాన్ని అందిస్తారు. ప్రసాదాన్ని ఆకు రూపంలో ఇస్తారు. ఆకు అంటే సామాన్యమైన ఆకు అని అనుకోవద్దు. ఆ ఆకు సామాన్యమైంది కాదు. ఆ ఆకు సంజీవని చెట్టుది (సంజీవని ఆకు) ఈ సంజీవని ఆకును తింటే దేహంలోని అన్ని రోగాలు నాశనం అవుతాయి. వీటిలో రెండు రకాల ఆకులు ఉన్నాయి.

ఈ సంజీవిని ఆకును తింటే దేహంలోని అన్ని రోగాలు నయమవుతాయి. వీటిలో రెండు రకాల ఆకులు ఉన్నాయి.
1. సంజీవిని
2. అమృత సంజీవని
సంజీవిని చెట్టు పేరు విన్నంతలోనే మీకు రామాయణంలోని యుద్ధకాండ ప్రకరణంలో హనుమంతుడు సంజీవని అనే పర్వతాన్ని తీసుకువచ్చి లక్ష్మణుడిని బతికించిన వైనం గుర్తుకు వైనం వచ్చి తీరుతుంది.

ఈ సంజీవని చెట్టు ఆకులను తిని హాథీరాం మహరాజు (బావాజీ) జీవితం పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నందున ఈ క్షేత్రానికి వచ్చే భక్తులు ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశ్యంతో ప్రతి ఒక్కరికి సంజీవని ఆకును ఇస్తారు. అందుకే ఈ ప్రసాదానికి పర్ణ ప్రసాదమని పేరు. ఈ సంజీవని ఆకును ఎవరు తింటారో వారి రోగాలన్నీ తొలగిపోతాయి.

సంజీవని ఆకుకు, అమృత సంజీవని ఆకుకు ఉన్న తేడా ఏమిటి?
సంజీవని ఆకులానే అమృత సంజీవని ఆకు కూడా ఉంటుంది. అమృత సంజీవని ఆకును నోటిలో ఉంచుకుని పీల్చుకుంటే నోట్లో నీటి అంశం ఎక్కువ ఉంటుంది. ఈ నీరు అమృత సమానమని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది.

అమృత సంజీవని ఆకును ఒక గుప్పిట అంత నీటితో శుభ్రపరిచి ప్రతిరోజు ఉదయం ఆరు గంటల్లోపు తింటే అసాధ్యమనుకున్న రోగాలైన క్యాన్సర్, గుండెనొప్పులు, ఆస్తమా, మధుమేహం తదితర వ్యాధులు నయం అయిన ఘటనలు చాలా ఉన్నాయి.

ఈ చెట్టు బెంగళూరులోని లాల్‌బాగ్, కబ్బన్ పార్క్ మల్లేశ్వరంలోని అటవీ విభాగం నర్సరీలో లభిస్తుంది. పర్ణ ప్రసాదాన్ని ఆంజనేయ స్వామి పూజల్లో కూడా వాడతారు. తమలపాకులతో మాలను చేసి ఆంజనేయస్వామికి వేస్తారు. అనంతరం తమలపాకు భక్తులకు ప్రసాదం ఇస్తారు. దీనికి కూడా పర్ణ ప్రసాదమనే పేరు.

గాయత్రీ స్నానం ఎలా చేయాలో మీకు తెలుసా!?

గాయత్రీమంత్రంతో కనీసం పదిసార్లైనా అభిమంత్రించిన జలముతో శిరస్సును అవయవాలను ప్రోషించుకుంటే గాయత్రీ స్నానమవుతుంది. దీనివల్ల సమస్త పాపములు పరిహారమవుతున్నాయి. భగవద్ధ్యానము, విష్ణు చింతనము, వేదాంత శ్రవణము, సద్గ్రంథపఠనము ఇటు వంటివన్నీ ధ్యానమయస్నానాల్లో చేరుతాయి.

అలాగే ఏకాదశి, పూర్ణిమ, అమావాస్య మొదలైన పర్వదినాల్లో ఉపవాసముండి ఆత్మవిచారణ సాగిస్తూ జ్ఞానాన్ని సంపాదించడం బోధమయ స్నానం అంటారు. ఉపవాసముంటే పూర్తిగా ఆహారం తీసుకోకుండా ఉండడం.

ఆహారం తీసుకోవడం వల్ల ఏకాగ్రత కుదరదు. భగవధ్ద్యానం సరిగా కుదరదు. అందువల్ల ఉపవాసం చేయమన్నారు. ఉండలేనివారు పాలో, పండ్లో కొద్దిగా తీసుకోవచ్చు. 

వరలక్ష్మీ వ్రతం నాడు బిల్వ వృక్షాన్ని పూజిస్తే..!?

శ్రీమన్నారాయణుడిని మదిలో కొలువై ఉండే లక్ష్మీదేవి ముత్తైదువులు, పూర్ణ కుంభం, పసుపు, కుంకుమ, చందనం, తోరణాలు, అరటి చెట్టు, తమలపాకు, దీపాలు, అరచేయి, ఏనుగు, ఆవులో ఉంటుందని పురోహితులు అంటున్నారు.

అలాగే అందం, ధైర్యం, అణకువ, జ్ఞానం, ధర్మచింతన, కీర్తి, దైవభక్తి కలిగిన వ్యక్తుల్లోనూ లక్ష్మీదేవి కొలువై వుంటుంది. బిల్వ వృక్షం, ఉసిరి వృక్షం, తులసి, పసుపు చెట్లలోనూ లక్ష్మీదేవి నివాసముంటుంది.

లక్ష్మీదేవిని బిల్వ పత్రాలతో పాటు తామర పువ్వు, చామంతి పూవులతో అర్చించవచ్చు. అలాగే వరలక్ష్మీ వ్రతం రోజున బిల్వ వృక్షాన్ని పూజించి ప్రదక్షణలు చేస్తే లక్ష్మీదేవిని అర్చించేందుకు సమానమని పండితులు అంటున్నారు.

కమలాక్ష మాలధారణతో శత్రు జయం తథ్యం...!!

మెడలో మాల ధరించడం సనాతన హైందవ ధర్మాచారం. మంత్రాల సంఖ్యను లెక్కించడానికే ఈ మాలలు ధరించరు. ఔషధాలు, పవిత్ర వృక్షాల తాలుకు గింజలు, బెరడులతో తయారుచేసే మాలల ధారణను మహర్షులు మనకు నేర్పించారు.

కమలాక్ష (కమలం గింజలు) మాల ధరించడం వల్ల శత్రువును జయించవచ్చని తంత్ర సారం పేర్కొంటుంది. ముడులతో కూడిన మాల, పాపాల్ని తొలగిస్తుంది. జిమపేట(జీవ పుత్ర) మాలను సంతాన గోపాలుడి రక్ష రేకుతో ధరించి దేవుళ్ళ నామాలు స్మరిస్తే పుత్రడు జన్మిస్తాడు. కెంపుల మాల సంపదను ఇస్తుంది.

రుద్రాక్ష మాల ధరించి మృత్యుంజయ మంత్రాన్ని జపిస్తే రుగ్మతలు తొలగి, దీర్ఘాయుష్షు కలుగుతుంది. హరీంద్రమాల అడ్డంకులను తొలగించి, శత్రవుల నుంచి రక్షించగలదు. పాలరాళ్ళ మాల అభ్యాసానికి, ఇతరులను ఆకర్షించడానికి సహకరిస్తుంది. తులసి పూసలు, చిన్నచిన్న గవ్వల మాలలు శ్రీకృష్ణుడు, విష్ణుమూర్తిల అనుగ్రహం పొందడానికి సహకరిస్తాయి.

పిల్లల్ని ఇతరుల దృష్టి దోషం నుంచి, రుగ్మతుల నుంచి రక్షించేందుకు పులిగోరు, బంగారు, వెండి, రాగి నాణేల మాలలు ధరింపజేస్తారు. ఇలా ఎన్నో నమ్మకాల నడుమ రకరకాల మాలలు ధరించే ఆచారముంది.

కార్తీక మాసం... శ్రీ మహాలక్ష్మీదేవీ పూజ ఎలా..?!!

దీపం అంటే లక్ష్మీదేవి. ఆ దేవికి సంప్రదాయబద్దంగా పూజలు చేయడం ఆనవాయితి. సర్వసంపదలందించే లక్ష్మీదేవిని అనేక రూపాల్లో పూజిస్తారు. ఆమె ఎవరింట్లో ఉంటే ఆ ఇల్లు సర్వశుభ లక్షణాలతో, సర్వసంపదలతో దేదీప్యమానంగా వెలుగొందుతుంది.

లక్ష్మీదేవిని అనేక రూపాల్లో పూజిస్తారు. అష్టలక్ష్మీ రూపాల్లో కొలుస్తారు. దీపావళినాడు శ్రీమహాలక్ష్మీ పూజ అత్యంత విశేష ఫలితాలు ఇస్తుంది. పండుగనాటి రాత్రి శ్రీమహాలక్ష్మీదేవిని విశేషంగా పూజించాలి. లక్ష్మీదేవికి గురు, శుక్రవారాలు ప్రీతికరమైనవి. అమ్మను ప్రతిరోజూ ధ్యానిస్తే మనోవాంఛితాలు నెరవేరుతాయి. రోజూ కుదరనివారు కనీసం వారంలో ఆరెండు రోజులైనా అష్టోత్తర, సహస్ర నామాలతో ధ్యానించాలి. దీపావళినాటి పూజ మరింత విశిష్టమైనది.

నిప్పు, నూనె, వత్తి....
నూనె, నిప్పు, వత్తి కలిస్తే దీపం అవుతుంది. మూడు విడివిడిగా ఉంటే మూడింటికి పరస్పరం విరోధమే. తైలానికి అగ్నితో, వత్తితో అలాగే అగ్నికి, వత్తికి కూడా విరోధం. మూడు కలిస్తేనే దాని ఉపయోగం. విడివిడిగా ఉంటే విరోధపడేవి మూడూ కలిసి ప్రమిదలో ఉన్నప్పుడు చుట్టూ ఎటు చూసినా కాంతిని నింపుతాయి.

సృష్టి, దానిలోని జీవకోటి రాజస, సాత్విక, తాపన గుణాలతో కూడినవి. ప్రమిదలో వత్తిలాంటిది సత్వగుణం. నూనె లాంటిది తమోగుణం. మంట లాంటిది సత్వగుణం, నూనెలాంటిది తమోగుణం. మంటలాంటిది రజోగుణం. ఇవన్నీ ఒకటికొకటి గిట్టని గుణాలు. కాని మూడూ కలిస్తే కాంతి నిండుతుంది. మంచిమనిషిగా ఉండాలనుకున్న వారు రజస్, తమో గుణాలని అణచివేసి సత్త్వగుణం ఎక్కువుగా అలవరుచుకోవాలి. అప్పుడా వ్యక్తి జీవితం కాంతిమయమవుతుంది. రాగద్వేషాల్ని ఎప్పటికప్పుడు వదిలించుకుంటే రజోగుణం నశిస్తుంది.

ఉత్తముల సాంగత్యం వల్ల, శాస్త్రాల్లోని అనేకమైన విషయాలు తెలుసుకోవడం వల్ల సత్త్వగుణాన్ని పెంచుకోవచ్చు. అందువల్ల తమోగుణం నశిస్తుంది. ఇటువంటి జ్ఞానదీపాలే కావాలి.

కొబ్బరి నూనెతో 40 రోజులు ఆరాధన చేస్తే అప్పులు వసూలు!

సాధారణంగా దైవారాధన సమయంలో దీపారాధనకు వివిధ రకాల నూనెలను వినియోగిస్తుంటారు. కొందరు మంచి నూనెను ఉపయోగిస్తే.. మరికొందరు కొబ్బరి నూనెను వాడుతారు. మరికొందరు నెయ్యితో కూడా దీపారాధన చేస్తుంటారు. అయితే, మంచి నూనె, నెయ్యితో చేసే దీపారాధన కంటే కొబ్బరి నూనెతో దీపారాధన వల్ల మంచి శుభాలు కలుగుతాయని జ్యోతిష్య పండితులు చెపుతున్నారు.

కొబ్బరినూనెతో దీపారాధన చేస్తే కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయని చెపుతున్నారు. ముఖ్యంగా మహాలక్ష్మికి 40 రోజుల పాటు కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే మొండి బకాయిలు కూడా వసూలవుతాయట. కుజదోషం ఉన్నవారు మంగళవారం కానీ, శుక్రవారం నాడు కానీ, కొబ్బరి నూనెతో దీపాలను వెలిగించి పూజచేసి పప్పుతో బొబ్బట్లు చేసి నైవేద్యం పెట్టి వాయనంగా 11 మంది ముత్తైదువులకు దానం ఇస్తే వారికి కుజదోషం తొలగిపోయి సత్వరమే వివాహం అవుతుందని చెపుతున్నారు.

పితృదేవతలకు శ్రాద్ధాలు పెట్టే సమయంలో కొబ్బరినూనెతో దీపారాధన చేస్తే వారివారి పితృదేవతలకు స్వర్గలోకాలు ప్రాప్తిస్తాయని చెపుతున్నారు. ప్రతి శనివారం శ్రీ వేంకటేశ్వరస్వామికి కొబ్బరినూనెతో దీపారాధన చేసి తులసి దళాలతో మాలకట్టి ప్రార్థించి హారంగా వేస్తారో వారికి జీవిత పర్యంతం ఆర్థిక సమస్యలు రావట.

కాశీలోని విశ్వేశ్వరస్వామికి సోమవారం రాత్రి హారతి ఇచ్చేటప్పుడు కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తారో వారికి... వారు కోరుకున్న కార్యాలు నిర్విఘ్నంగా పూర్తవుతాయట. హరిద్వార్‌లో సాయం సంధ్యలో గంగాదీపాన్ని కొబ్బరినూనెతో వెలిగించి నదిలో వదిలితే వారికి, కుటుంబ సభ్యులకు జీవితాంతం ప్రతి ఏటా గంగాస్నానం చేసిన ఫలితం కలుగుతుందట. 

కార్తీకమాసం శివాలయంలో ఆవునేతితో దీప సమర్పణ చేస్తే..?!

కార్తీకమాసంలో సూర్యుడు తులా సంక్రమణలో ప్రవేశించగానే గంగానది ద్రవరూపం ధరించి సమస్త నదీజలాల యందు చేరుతుంది. ఇట్టి జలాశయాలలో విష్ణువు వ్యాపించి ఉంటాడు కనుక కార్తీకస్నానం చేసినవారి పుణ్యం చెప్పనలవికాదు. హపీకూప, నదీస్నాన, జపాదులను ఆచరించేవారు అక్షయమైన అశ్వమేధ ఫలాన్ని పొందుతారని విశ్వాసం.

స్త్రీలుగాని, పురుషులుగాని కార్తీకమాసంలో తప్పనిసరిగా ప్రాతఃస్నానం ఆచరించాలనీ, కార్తీకమాసపు సాయంకాలం శివాలయాలలోగానీ, వైష్ణవ ఆలయాల్లో గానీ దీపారాధన చేయడం వలన అనంతమైన ఫలం లభించడమే గాక, శివాలయ గోపురద్వార, శిఖరాలయందుగానీ, శివలింగసన్నిధినిగానీ దీపారాధన చేయడం వలన అన్ని పాపాలు అంతరించి పోతాయి.

కార్తీకంలో శివాలయంలో ఆవునేతితోగాని, నువ్వులనూనెతో గాని, ఆఖరికి ఆముదంతోగానీ దీప సమర్పణ చేస్తారో, వారు అత్యంత పుణ్యవంతులౌవుతారని, నెల పొడుగునా చేసినవాళ్లు జ్ఞానులై, తద్వారా మోక్షాన్ని పొందుతారని పండితులు చెబుతున్నారు.

పూర్వ జన్మార్జితాలైన పాపాలన్నీ కూడా కార్తీకవ్రతం వలన హరించుకుపోతాయి. కార్తీకంలో వచ్చే ప్రతి సోమవారం నాడు పగలు ఉపవసించి, రాత్రి నక్షత్రదర్శనానంతరం భోజనం చేస్తూ - ఆ రోజంతా భగద్ద్యానంలో గడిపేవాళ్లు తప్పక శివ సాయుజ్యాన్ని పొందుతారని విశ్వాసం.

కార్తీకమాసంలో శ్రీ మహావిష్ణువుకు ఉసిరికాయలతో దీపారాధన చేస్తే!?

కార్తీకమాసంలో ఉసిరిచెట్టు క్రింద శ్రీమహావిష్ణువును ఉసిరికాయలతో దీపారాధన చేసేవారిని చూడడానికి యమునికి కూడ శక్తి చాలదట. కార్తీక మాసంలో వచ్చే సోమ, శని వారాల్లో శ్రీమహావిష్ణువును ఉసిరితో అభిషేకిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఇంకా ఉసిరి చెట్లు ఉన్నతోటలో వనభోజనాలు చేస్తే వారి మహాపాతకాలు సైతం తొలగిపోతాయి.

ఉసిరి ఔషధీ గుణము కలది కనుక, వనభోజనాల వలన ఆరోగ్యం చేకూరుతుంది. ఉసిరిపూజ వలన లక్ష్మీదేవి ఆ భక్తుల ఇండ్లలో స్థిరనివాసం ఏర్పరుచుకుంటుందని, కార్తీకమాసంలో స్నానాలు, దీపారాధన, జాగరణ, తులసి, ఉసిరి పూజల వలన, ధన, ఫల, భూదానాల వలన పుణ్యఫలం లభిస్తుందని పండితులు అంటున్నారు.

ఈ కార్తీకమాసంలో పితృతర్పణ పూర్వకంగా ఎన్ని నువ్వులయితే విడువబడుతున్నాయో అన్ని సంవత్సరాల పాటు పితృదేవతలు స్వర్గంలో నివసిస్తారని విశ్వాసం. యజ్ఞయాగాదులకన్నా కార్తీకవ్రతం వల్ల గొప్ప పుణ్యం లభిస్తుంది.

తీర్థయాత్రల వల్ల కలుగునటువంటి ఫలం, ఈ కార్తీకమాసంలో శ్రీ మహావిష్ణువుని ఎక్కడైతే పూజిస్తారో, అక్కడ భూత, పిశాచ, గ్రహ గణాలు దూరంగా ఉంటాయి. శివుడికి ప్రీతికరమైన జిల్లేడుపూలతో పూజించితే దీర్ఘాయులై, మోక్షాన్ని పొందుతారు. శుద్ధ ద్వాదశినాడు శివునికి మారేడు దళాలతో, జిల్లేడుపూలతో, విష్ణువుకు తులసీ దళాలతో, జాజిపూలతో పూజ అత్యంత శ్రేష్టమని పండితులు చెబుతున్నారు.

ఈ మాసంలో ఉదయం, సాయంత్రంవేళల్లో ఆవు నేతితో గాని, నువ్వులనూనెతో గానీ దీపారాధన చేసి, అభిషేక ప్రియుడైన ఈశ్వరునికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాలు, అర్చనలు చేయడం వలన మహా పుణ్యం లభిస్తుంది.

కార్తీకమాసం విశిష్టత... పుణ్యఫలాలు.. ఆచరించాల్సినవి

కార్తీకముతో సమానమైన మాసము లేదు. విష్ణు దేవునితో సమానమయిన దేవుడు లేడు. గంగతో సమానమగు తీర్థము లేదు అని చెప్పబడినది. తెల్లవారుజామునే నిద్రలేవడం, ప్రవహిస్తూ ఉన్నటువంటి నీళ్లలో స్నానాన్ని చేయడం, బోళాశంకరునికి నిత్యమూ రుద్రాభిషేకం చేయడం, నుదుట విభూతినీ మెడలో రుద్రాక్షల్నీ- లేదా- తులసి పూసల్ని ధరించండం రోజుకి ఒక పూట మాత్రమే భుజించడం, ఉసిరిక చెట్టు నీడలో వనభోజనాలు చేయడం...ఒకటేమిటి? ఇలా ఎన్నెన్నో సంప్రదాయాలని మూటగట్టుకుని తెచ్చింది పవిత్రమైన ఈ కార్తీకమాసం. ఈ కార్తీక మాసంలో చేసే వ్రతములలో ముఖ్యమైనవి కార్తీకస్నానం, ఉపవాసము, కార్తీకదీపము.

కార్తీకస్నానం :
కార్తీక మాసమంతా తెల్లవారుజామున లేచి కృత్తికా నక్షత్రం అస్తమించేలోగానే నదులలో గాని తటాకాలలో గాని అలాంటివి అందుబాటులేనప్పుడు ఇంట్లోని స్నానాల గదిలో అయినాసరే, తలస్నానం చేయాలి. అప్పుడే అది కార్తీక స్నానం అవుతుంది.

ఈ విధంగా నియమంతో స్నానంచేసి శివుడినిగాని, విష్ణవునుగాని, లేదా మరే దైవాన్నైనా సరే ధ్యానించడం వలన, అర్ఘ్యాదులు ఇవ్వడం వలన కురుక్షేత్రం, గంగానది, పుష్కరతీర్థాలలో స్నానం చేసిన ఫలితం లభిస్తుంది. సర్వపాపాలు నశించి పుణ్యఫలితాలు అందుతాయి.

కార్తీకమాసంలో పగలంతా ఉపవాసం చేసి రాత్రి భోజనం చేయాలనేది ఒక నియమం. దీనినే 'నక్తమ్' అంటారు. పగలంతా నిరాహారంగా ఉండలేనివారు పాలవంటి ద్రవపదార్థాన్నిగాని, పండువంటి ఘనపదార్థాన్నిగాని స్వీకరిస్తూ రాత్రివేళ చంద్రదర్శనం చేసుకుని, దీపారాధన చేసుకుని భోజనం చేయాలి.

దీపారాధన :
కార్తీకమాసంలో దీపారాధన చేయడం మహామహిమోపేతమైనది. శివాలయంలోగాని, ఇంట్లోనైనాసరే ప్రాతఃకాలం, సాయంకాలం దీపారాధన చేయడం దైవానుగ్రహం లభ్యమయ్యే విధానం. ఎవరైనాసరే, తెలిసిగాని, తెలియకగాని, ఎక్కడైనా సరే కార్తీకమాసంలో దీపం పెడితే చాలు వారి సర్వవిధ పాపాలు హరింపవేస్తుంది. జ్ఞానం, మోక్షం, ఇహమున శ్రేయస్సు, శుభఫలితాలు కలుగుతాయి. కార్తీకదీప దానంవల్ల నరకప్రాప్తి నివారణ కలుగుతుంది. ఈ మాసములో దీపారాధన స్త్రీలకు విశేష ఫలప్రదము.

దీపం దానమిచ్చుట, బంగారము, నవధాన్యములు గాని, అన్నదానముగాని, శయ్య (మంచం) దానమిచ్చుట వలన స్త్రీలకు ఐదోతనము వృద్ధియగుటేగాక, మంగళప్రదము సౌభాగ్యకరముగా చెప్పబడినది. సూర్యాస్తమయం అయిన వేంటనే సంధ్యాదీపం వెలిగించుట ముగ్గుపెట్టి ఇంటిముందు దీపం పెట్టుట, తులసి కోటలో దీపము పెట్టుట, తులసి పూజ, గౌరీపూజ చేయుట వలన ఆర్థిక బాధలు తొలగును.

కార్తీకమాసములో కొన్ని వస్తువులు నిషేధించడమైనది. అవి వాడరాదు. ఇంగువ, పెద్ద ఉల్లి, వెల్లుల్లి, ముల్లంగి దుంప, గుమ్మడి కాయ, తీయగుమ్మడి, నువ్వులు నిషిద్ధముగా చెప్పబడినవి. ఈ మాసమున మాంసాహారం భుజించుట నిషిద్ధము. పగటిపూట ఆవుపేడతో అలికి, పద్మములతో ముగ్గులు పెట్టి, రంగు రంగుల రంగవల్లిపై కార్తీకదీపం పెట్టి, కార్తీక పూరాణము చదివిన వారికి, వినినవారికి ఏడు జన్మలవరకూ వైధవ్యం కలగదని కార్తీక పురాణము చెపుతున్నది.

ధాత్రీపూజ :
ధాత్రి అంటే ఉసిరిక. ఉసిరిక లక్ష్మీదేవికి ఆవాసమై ఎంతో ఇష్టమైనది. కార్తీకమాసంలో ఈ ఉసిరిక వృక్షం కింది భోజనం చేయడం ఎంతో అదృష్టాన్నిస్తుంది. ఉసిరి వృక్షం మొదట్లో ధాత్రీదేవిని, దామోదర స్వామిని పూజించి, మధుర పదార్థాలను నివేదించాలి. బంధుమిత్రులతో కలిసి ఉసిరిక చెట్టు ఉన్న వనంలో భోజనాలు చేయడం వనభోజనాలుగా ప్రసిద్ధి.

వసుపు గౌరీ వ్రతం ఎలా చేయాలో తెలుసా?

పసుపు గౌరీ వ్రత కథ ఏంటో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవండి. నూరు పసుపు కొమ్ములతో వందరోజులు నోము పట్టే స్త్రీకి వంద సంవత్సరాలు ఐదవతనం ఉంటుంది. ఒక ఊరిలో వేద పండితుని కుమార్తె పసుపు గౌరీనోము పట్టింది. దానిలో నియమం తప్పడం వలన ఆమెకు పుట్టిన సంతానం చనిపోతారు.

అందువల్ల విచారంలో కుంగిపోయిన ఆమె వద్దకు పరమేశ్వరుడు వృద్ధుని రూపంలో వచ్చి అమ్మా నీవు పూర్వం పసుపుగౌరీ నోము పట్టి నియమం తప్పావు. అందువలనే నీ సంతానం నష్టమౌతుంది. అందుచేత నిష్టతో నోము పట్టమని చెబుతారు. దీంతో వేదపండితుని భార్య నియమతో ఈ నోము ఒక సంవత్సరం పట్టింది.

ఒక కేజీ పసుపు, ఒక కేజీ కుంకుమ, వెండి గౌరీ ప్రతిమ చేయించి దానికి ఒక సంవత్సరం పూజ చేసి సంవత్సరాంతమున ఒక ముత్తయిదువుకు జాకెట్ బట్ట దక్షిణ తాంబూలాలతో వాయనం ఇచ్చింది. దీంతో ఆమెకు సంతానం కలిగింది. 

శ్రీవారి మూలవిరాట్టు 110 డిగ్రీల ఉష్ణోగ్రతతో ఉంటుందట!

శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం మూలవిరాట్టు ఎంత డిగ్రీల ఉష్ణోగ్రతతో ఉంటుందో తెలుసా? స్వామి వారి విగ్రహం ఎప్పుడూ 110 డిగ్రీల ఉష్ణోగ్రతను కలిగివుంటుంది. తిరుమల కొండ మూడు వేల అడుగుల ఎత్తు కలది. తిరుమల కొండ ఎప్పుడూ శీతలముతో కూడిన ప్రదేశము.

తెల్లవారు జామున 4.30 గంటలకు చల్లటి నీరు, పాలు, సుగంధద్రవ్యాలతో శ్రీవారికి అభిషేకం చేస్తారు. పట్టు పీతాంబరంతో శ్రీవారి మూలవిరాట్టును సుతిమెత్తగా తుడుస్తారు. గురువారం అభిషేకానికి ముందు వెంకన్న ఆభరణాలను తీసేస్తారు. ఆ ఆభరణాలన్నీ వేడిగా వుంటాయని పురోహితులు అంటున్నారు. మూల విరాట్టు ఎప్పుడూ 110 డిగ్రీల ఉష్ణోగ్రతను కలిగివుండటమే ఇందుకు కారణమని వారు చెబుతున్నారు.

శ్రీవారి ఆలయంలో ప్రతీ ఒక్కటీ అద్భుతమే. హుండి, అభిషేకాలు, పూజా గదులు ఇందులో ప్రత్యేకమైనవి. శ్రీవారి వంటపోటు చాలా పెద్దది. శ్రీవారి ప్రసాదం పొంగలి, పెరుగన్నం, పులిహోర, పోలీ, అప్పం, వడ, జంతికలు, జిలేబి, లడ్డు, పాయసం, దోస, రవ్వ కేసరి, బాదం కేసరి, జీడిపప్పు కేసరిలను ప్రతిరోజూ తయారు చేస్తారు.

అయితే శ్రీవారికి ప్రతిరోజూ కొత్త మట్టి పాత్రలో పెరుగన్నం మాత్రమే నైవేద్యంగా సమర్పిస్తారు. స్వామివారి గర్భగుడిలో పెరుగన్నం మినహా ఏదీ నైవేద్యంగా లోపలికి పోదు. స్వామివారికి నైవేద్యంగా ప్రసాదించే పెరుగన్నం మాత్రం భక్తునికి ప్రసాదంగా లభిస్తే అది మహా భాగ్యం అని పురోహితులు అంటున్నారు.

ఇక స్వామి వారి వస్త్రాల సంగతికి వస్తే.. స్వామివారికి ధరించే పీతాంబరం 21 అడుగుల పొడవు, ఆరు కిలోల బరువును కలిగివుంటుంది. శ్రీవారికి శుక్రవారం బిల్వదళాలతో అర్చన చేస్తారు. పండగ నెల అంతటా బిల్వదళాలనే స్వామివారికి అర్పిస్తారు. శివరాత్రి రోజు శ్రీవారి ఉత్సవమూర్తికి వజ్రంతో విభూది సమర్పించి, తిరుమాడ వీధుల్లో ఊరేగిస్తారు.

శ్రీవారికి స్వర్ణమాల ధరించాలంటే ముగ్గురు పండితులు కావాలట!

కలియుగ వైకుంఠం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి విరాళాలు, కానుకలు కోకొల్లలుగా వస్తుంటాయి. ఏడు కొండలపై వెలసిన శ్రీవారిని దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు వస్తూవుంటారు. అలాంటి మహిమాన్వితమైన శ్రీవారి ఆభరణాల విలువ వెయ్యి కోట్లకు పైగా దాటిందని తెలిసింది.

ఈ ఆభరణాలను భద్రపరిచేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) స్థల కేటాయింపులో మల్లగుల్లాలు పడుతోంది. ఇలా శ్రీవారి నగలను భద్రపరిచేందుకు స్థలం లేకపోవడంతో ఏడాదికోసారి వేలం నిర్వహిస్తోంది. శ్రీవారికి కానుకగా భక్తులు ఆభరణాలను కిలోల బరువుతో సమర్పిస్తూ ఉంటారు.

ఇదిలా ఉంటే శ్రీవారికి ధరించే స్వర్ణమాల 12 కిలోల బరువుతో కూడుకున్నది. దీనిని స్వామివారికి అలంకరించేందుకు ముగ్గురు పండితులు అవసరమట. ఆలయంలోని నీలపు వజ్రం ప్రపంచంలో ఎక్కడా లేదని పురోహితులు చెబుతున్నారు. దీనివిలువ మాత్రమే రూ. వంద కోట్లు.

రాజేంద్ర చోళుడు, కృష్ణదేవరాయలు పలు ఆభరణాలను స్వామివారికి కానుకగా సమర్పించారు. ఆజానుబాహుడైన శ్రీవారు విలువలేని ఆభరణాలు ధరించినా నిరాయుధపాణిగా, కలియుగ ప్రత్యక్ష దైవంగా భక్తులకు దర్శనమిస్తున్నాడు. 

భగవద్గీత.. శ్రీ మహావిష్ణువు ముఖ కమలం నుంచి వెలువడిందట!

శ్రీమద్భగవద్గీత భగవానుడైన శ్రీ కృష్ణుని దివ్యవాణి. అనంత మహిమాపేతమైన భగవద్గీత సమస్త వేదాలసారం. పరమ రహస్యవిషయ సమన్వితనిధి. ఇందులోని లక్ష్యం అతి నిగూఢం. ఇందులో భగవంతుని గుణ ప్రభావ స్వరూపం చెప్పబడింది. తత్త్వరహస్యాలు, భక్తి కర్మ జ్ఞానాది పలువిధ రహస్య విషయాలను వివరించడం జరిగింది. అందువల్లనే గీత సర్వశాస్త్ర శోభితం.

ఇంకా భగవద్గీత శ్రీ మహావిష్ణువు యొక్క ముఖ కమలం నుంచి వెలువడింది. అందుకే వ్యాస భగవానుడు గీత ప్రాశస్త్యాన్ని గురించి ఈ కింది విధంగా చెప్పాడు.

గీతా సుగీత కర్తవ్యా కిమన్యై : శాస్త్ర సంగ్రహై :
యా స్వయం పద్మనాభస్య ముఖపద్మాత్ విని: స్మృతా

ప్రతి వ్యక్తి భగవద్గీతను ఆరు విధాలుగా సేవించాలి. అవి శ్రవణం, కీర్తనం, పఠనం, పాఠనం, మననం, ధారణం అనేవి. అలాచేస్తే శ్రీకృష్ణభగవానుని పాదారవిందాలను సేవించినట్లే అవుతుంది. గీత అనే అనంతరత్నాకరంలో ప్రవేశించి, పరిశోధిస్తే ఆమూల్యమైన జ్ఞాన రత్నాలు లభిస్తాయన్నది నిజం.

ఈ సంసారం అనే సాగరంలో అజ్ఞానమనే సముద్రంలో మునిగి తేలుతున్న జీవులను ఉద్ధరించి, భగవత్ర్పాప్తి కలిగించగలిగేదే "గీత" మాత్రమేనన్నది స్పష్టం. గీతాపఠనం వలన జ్ఞాననిష్ఠతో, కర్మ నిష్ఠతో ప్రవర్తించి మోక్షసిద్ధిని పొందవచ్చు. 

శుక్రవారం పూట ఆలయాలకు వెళ్లే మహిళలు ఎలా వెళ్లాలంటే..?

శుక్రవారం పూట ఆలయాలను సందర్శించుకోవడం ద్వారా సుఖసంతోషాలు చేకూరుతాయి. శుక్రవారాల్లో చేసే పూజల ద్వారా అష్టైశ్వర్యాలు లభించడంతో పాటు ఈతిబాధలు తొలగిపోతాయని విశ్వాసం. అలాంటి మహిమాన్వితమైన శుక్రవారం పూట ఆలయాలకు వెళ్లే మహిళలు ఎలా వెళ్లాలంటే..?

దేవాలయాలను సందర్శించుకునే మహిళలు, కన్యలు సంప్రదాయ దుస్తులను ధరించాలి. చీరలు, లంగా ఓణీలు వంటి ధరించాలి. నుదుట కుంకుమ రంగుతో కూడిన బొట్టు పెట్టుకోవాలి.

ఆలయాల్లో ఇచ్చే పసుపు కుంకుమలను నుదుట కుంకుమ కింద పెట్టడం, విభూతిని నుదుట బొట్టుకు పైన పెట్టడం చేయాలి. విగ్రహాలకు కర్పూరం వెలిగించేటప్పుడు ఆలయాల్లోని దీపాల వెలుగు నుంచో లేదా ఇతరుల వద్ద అగ్గిపెట్టెలను అప్పు తీసుకుని దీపమెలిగించడం కూడదు. ఇలా చేస్తే మీకు కలగాల్సిన శుభ ఫలితాలు ఇతరులకు చేరుతుందని పురోహితులు చెబుతున్నారు.

ఇక శుక్రవారం ఉదాహరణకు విఘ్నేశ్వరునికి ఆలయానికి వెళ్తున్నారంటే.. గరిక మాలతో తీసుకెళ్లండి. గరికమాలను వినాయకునికి ప్రతిశుక్రవారం సమర్పిస్తే.. కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మకం. అలాగే శివాలయానికి వెళ్లేవారు బిల్వపత్రాలను తీసుకెళ్లడం ద్వారా ఈతిబాధలు తొలగిపోయి, సర్వ శుభాలు చేకూరుతాయి.

ఇదేవిధంగా విష్ణుమూర్తి ఆలయాన్ని శుక్రవారం సందర్శించుకునే భక్తులు తులసీ మాలతో వెళ్లండి. అలాగే ఆంజనేయస్వామిని దర్శించుకునే వారు వెన్నముద్దతో వెళ్లడం ద్వారా వ్యాపారాభివృద్ధి కలుగుతుంది.

అదేవిధంగా దుర్గమ్మతల్లిని శుక్రవారం దర్శించుకునే మహిళలు పసుపు, తెలుపు, ఎరుపు రంగుల్లో గల పువ్వులను సమర్పించుకుంటే సర్వసుఖసంతోషాలు చేకూరుతాయి. ఈతిబాధలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పురోహితులు అంటున్నారు.

సంపదలు కోరుకుంటున్నారా.. ఐతే పడమటిముఖంగా కూర్చుని తినండి.!

సిరి సంపదలు, అష్టైశ్వర్యాలు చేకూరాలని కోరుకుంటున్నారా.. అయితే పడమటిముఖంగా కూర్చుని భుజించాలని పండితులు అంటున్నారు. ఆయువును కోరేవారు తూర్పు ముఖంగాను, కీర్తిని కోరేవారు దక్షిణ ముఖంగాను కూర్చోవాలని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. అయితే తల్లిదండ్రులున్నవారు దక్షిణముఖంగా కూర్చోరాదు. అలాగే ఉత్తరముఖంగా ఎవ్వరూ కూర్చుని భుజించకూడదు.

భుజించేటప్పుడు ఇతర ఆలోచనలేవీలేకుండా మొదట మధుర పదార్థాన్ని మధ్య ఉప్పు, పులుపు, కారము, చివర వగరు చేదు మొదట ద్రవ పదార్థాన్ని, మధ్యలో గట్టి పదార్థాలను, కడపటి ద్రవపదార్థాలు తింటుంటే ఆరోగ్యంగా ఉంటారని ఆయుర్వేదం చెబుతోంది. భుజించిన తర్వాత కనీసం నూరడుగులైనా వేయాలి.

ఎందుకంటే భుజించిన వెంటనే కూర్చోవడం వల్ల శరీరం లావెక్కుతుంది. నిద్రించడం వల్ల రోగం వస్తుంది. కొన్ని అడుగులు వేయడం వల్ల ఆయువు పెరుగుతుంది. భుజించిన వెంటనే నిద్రించడం వల్ల అజీర్ణ రోగం వస్తుంది

ప్రసాదము అంటే ఏమిటి... పరమార్థము ఏమిటి?

ప్రసాదమంటే ప్రసన్నత, తేటదనము, నైర్మాల్యము, మనస్సు, విరాళము, గురువాదులచే భుక్తపరిష్ఠమైన అన్నము, కావ్యగుణములలో ఒక లక్షణముగా దేవ నైవేద్యమనే పరిపరి విధాల అర్థాలున్నాయని లాక్షిణికులు చెబుతారు. అటువంటి ప్రసాదం ప్రసన్నముగా చేస్తుందని, సంతోషపెడుతుందని, ఉపశమింప చేస్తుందని, దానిని ప్రసాదకముగా పిలుస్తారని విజ్ఞులంటారు. అనుగ్రహక పూర్వకముగా, ఉల్లాసము కలిగించేదిగా ప్రసాదము పంచి పెట్టడాన్నే ప్రసాదించుట అని చెప్పుకోవచ్చు.

ప్రసన్న వదనం ధ్యాయేత్ అంటూ ప్రసన్నమైన, నిర్మలమైన వదనం, రూపం 'ప్రసాదం' మొదటి లక్షణమని అనుకుంటే, అటువంటి చిదానందతత్వాన్ని కారుణ్యాన్ని చిరునవ్వు చిందిస్తుందని మందస్మిత సుందర వదనారవిందం స్మేరాననం భగవంతుని ప్రతిరూపాలని భగవత్ తత్వాన్ని విజ్ఞులు వివరిస్తారు. జగజ్జనని ప్రశాంతమైన తేజోవంతమైన చిరునవ్వును స్మితవదన ప్రస్తుతిలో 'కావ్యకంఠ వాసిష్ఠగణపతి' అభివర్ణిస్తాడు. చిరునవ్వుల కాంతుల ప్రవాహంలో తనపతిదేవుడైన ఈశ్వరుని మనస్సును మునకలు వేయించే తల్లిగా లలితా సహస్రనామ స్తోత్రంలో చెప్పబడుతుంది.

శ్రీరామ చంద్రుని గుణ గణాల వైభవాన్ని వర్ణిస్తూ వాల్మీకి మహర్షి నవ్వుతూ మాట్లడుతూ వుండేవాడు రాముడని సచనిత్యం ప్రశాంతాత్మి అంటూ స్మిత భాషే అంటూ పేర్కొంటాడు. స్మేరాననం స్మరతి గోపవధూకిశోరం అంటూ లీలాశుకులు కృష్ణన్ని ప్రస్తుతిస్తూ తం సర్వాది గురుం మనోజ్ఞ వపుషం మందస్మితాలం కృతం అని ప్రసన్నవదనంతో ఉండాలని, ప్రసాద భరితమైన జీవితాన్ని గడపడానికి అవసరమైన పరిస్థితులు అన్వేషించాలని ఋగ్వేదం ప్రవచిస్తుంది.

పాండవులకు కనిపించని పరమేశ్వరుడు


కైలాస పర్వతం గురించి మన పురాణాలలో ఎన్నెన్నో కథలు, గాథలు ఉన్నాయి. వాటిలో ఓ కథ ఇలా సాగుతుంది... పాండవులు ఒకసారి హిమాలయాల్లో శివుని జాడ కనుగొనేందుకు ప్రయత్నించారు. వారి ప్రయత్నాన్ని చూసిన పరమశివుడు వారిని ఆట పట్టించదలిచాడు.

పాండవులు తనను కనుగొనలేని విధంగా ఓ జంతు రూపాన్ని ధరించాడు. పరమేశ్వరుడు ఏ జంతువులో ప్రవేశించాడో తెలియక పాండవులు నానా తంటాలు పడ్డారు. చివరకు పాండవుల్లో అత్యంత బలశాలి అయిన భీముడు తాను శివుడు ఎక్కడున్నాడో తేల్చాస్తానని నడుం బిగించాడు.

శరీరాన్ని బాగా పెంచి తన రెండు కాళ్లను అక్కడ ఉన్న రెండు పర్వతాలపై ఉంచి నిల్చున్నాడు. అంతట నలుగురు సోదరులూ ఆ అడవిలోని జంతువులన్నిటినీ భీముడు చాచిన రెండు కాళ్ల మధ్య సందులోంచి వెళ్లేలా తరమసాగారు.

మానవమాత్రుడి కాళ్ల సందులో నుంచి వెళ్లడానికి అడవి జంతువులు సంకోచించవు, కానీ ఈశ్వరుడు అలా చేయడని వారికి తెలుసు. చివరకు ఒక భారీ వృషభం తప్ప అన్ని జంతువులు భీముని కాళ్ల మధ్య నుంచి వెళ్లాయి. భీముడు భారీకాయుడై కాళ్లు సాచి నిలబడడాన్ని చూసి, ఎద్దు రూపంలో ఉన్న పరమేశ్వరుడు భూమిలోనికి చొచ్చుకుపోయాడు.

ఆ వృషభం తల కైలాసం వద్ద పైకి లేస్తే... మూపురం మాత్రం హిమాలయాల్లోని కేదారం దగ్గరే ఉండిపోయిందని విశ్వాసం. కైలాస పర్వతాన్ని జాగ్రత్తగా గమనిస్తే.... ఇప్పటికీ పర్వత శిఖరం మీద ఎద్దు ముక్కు రంధ్రాలు, చెవులు ఆకారం కనిపిస్తాయి. ఇలా కైలాస గిరి గురించి ఎన్నో కథలు పురాణాల్లో ఉన్నాయి.

శ్రీహరి స్తుతి

"సకృదుచ్చరితం యేన హరిదిత్యక్షరద్వయం

బద్ధ: పరికరస్తేన మోక్షాయ గమనం ప్రతి"

ఎవరైతే హరి అనే రెండక్షరాలను నిత్యం స్మరిస్తుంటారో వారు మోక్షానికి వెళ్ళేందుకు ప్రయాణ సన్నద్ధులై ఉంటారు.

పుష్కర స్నాన మహిమ

"జన్మ ప్రబృకియత పాపం స్త్రియావ పురుషేణ
పుష్కర్యోమాత్రశ్య సర్వయే ప్రణశ్యతి"

పుట్టినప్పటి నుంచి స్త్రీ, పురుషాదులచే చేయబడ్డ పాపాలన్నీ పుష్కరిణి నదిలో స్నానం చేయడం వల్ల నశించిపోతుందని, అంతేకాకుండా పూర్వ జన్మల పాపం, త్రికరణాదుల వల్ల చేసిన పాపాలన్నియూ నశించి మోక్ష ప్రాప్తి పొందుతారని బ్రహ్మాండ పురాణం చెబుతోంది. పుష్కర స్నానం చేయడం వల్ల అశ్వమేథయాగం చేసినంత పుణ్య ఫలితాన్నిస్తుంది.

నర్మదా నదిలో తపస్సు, కురుక్షేత్రంలో దానం, కాశిలో మరణం ఎంత మోక్ష ప్రదమో ఈ మూడింటి ఫలితం ఒక్క పుష్కర స్నానం చేయడం వల్ల కలుగుతుందని వేద ఋషులు చెబుతారు.

తొలిగా నదిలో దిగునప్పుడు రేగు పండంత మట్టి ముద్దలను నదిలో వేయాలి. హే... నదీమతల్లీ నీలో నేను స్నానమాచరిస్తున్నాను.... అందుకు నీవు ఆజ్ఞ ఇవ్వాల్సిందిగా ప్రార్ధన చేయాలి. నదికి నమస్కారం చేస్తూ....స్నానం చేసి తుంగభద్ర, వరుణ దేవునికి, బృహస్పతికి, విష్ణుమూర్తికి, భోళాశంకరునికి , బ్రహ్మాది దేవతలకు, వశిష్టాది మునులకు, గంగాది సర్వ నదులకు, సూర్యునికి ఆర్థ్యం ఇవ్వాలి.

నదిజలాలను మూడుసార్లు తీసుకుని ఒడ్డుకు వచ్చి నీళ్లలో నిలబడి శ్లోకాలను పటిస్తూ... కట్టుకున్న వస్త్రంలోని నీళ్లను మూడుసార్లు ఒడ్డుమీద పిండాలి. ధరించిన వస్త్రాలను వదులుకుని నూతన వస్త్రాలను లేదా పొడివస్త్రాలను ధరించాలి. అనంతరం సూర్య ధ్యానం చేయాలి.

పుష్కర సమయంలో స్నానం చేయడం వల్ల జప, ధ్యాన, అర్చన, గాన, తర్పనాది అనుష్టానాలకు, పితృ పిండా ప్రధానాలకు అక్షయమైన పుణ్యం లభిస్తుందని మహర్షులు చెప్పారు.

ఈ కర్మల వల్ల శారీరక, మానసిక, బుద్ధి కల్మషాలు తొలగి మనశ్శాంతి లభించి, పవిత్రులు, పుణీతులు, తేజోవంతులు, ఉత్తేజితులు అవుతారు. ఈ పుష్కర సమయంలో పసిడి, రజతం, భూమి, ధనం, గోవులు, ధాన్యం, లవణాలు, ఔషధాలు, అశ్వం, పండ్లు, బెల్లం, వస్త్రాలు, తైలం, తేనే, కూరలు, పీఠం, అన్నం, పుస్తకం మొదలైనవి వారి వారి శక్త్యానుసారం దానంగా ఇస్తే... సువర్ణ రజితులు, సుఖ సంతోషాలతో బోగ భాగ్యాలతో అలరారుతారు.

భూదానం చేయడం వల్ల భూపతిత్వం, వస్త్రాన్ని దానంగా ఇవ్వడం వల్ల వసులోక ప్రాప్తి కలుగుతుంది. గోవును దానంగా ఇస్తే... రుద్రలోకప్రాప్తి, నెయ్యిని దానంగా ఇస్తే... ఆయుస్సు వృద్ధి, ఔషధాన్ని దానంచేస్తే... ఆరోగ్యవంతులవుతారు. సాలగ్రామందానం చేస్తే... విశ్వలోకాల ప్రాప్తి,తిలదానం వల్ల ఆపదలు కలుగవు

పుష్కరాలు అంటే ఏమిటి...?


మన పురాణాల్లో పుష్కారాల గురించిన కథలు కొన్ని కనిపిస్తాయి. పూర్వం మహర్షులు భారతదేశం పుణ్యనదుల చరిత్ర, మహిమలను ప్రజలకు తెలియచెప్పారు. తీర్థరాజైన వరుణుని సర్వతీర్థాలలో గంగాది మొదలైన ద్వాదశ నదులలో ఒక సంవత్సరానికి ఒక నదిలో నివశించమని కోరారు. మహర్షుల విన్నపానికి వరుణ దేవుడు సమ్మతించాడు.

సూర్య, చంద్రాది గతులను బట్టి పరిగణలోకి తీసుకోవడం కుదరదు. కావున గురు సంచారాన్ని బట్టి తాను ఆయా నదుల్లో నివశిస్తానని మాటిచ్చాడు. దానినిబట్టి ఆయా నదులకు పుష్కరాలు జరుపుకోవాలని మహర్షులు నిర్ణయించారు.

అప్పటి నుంచి బృహస్పతి ఆయా రాశులలో సంచరించినప్పుడు గంగా దేవతాది 12 నదులకు పుష్కర ప్రవేశం కలిగి పుణ్య ప్రదేశాలయ్యాయి.

స్త్రీలు జుట్టు విరబోసుకోరాదంటారు ఎందుకు?

జుట్టు విరబోసుకుని తిరగడం నేడు ఓ ఫ్యాషన్ అయిపోయింది. అయితే మన ఆచార, సాంప్రదాయాల ప్రకారం జుట్టు విరబోసుకోకూడదు. జుట్టు ముడివేసుకుని సువాసన గల పూలు ధరించడం పుని స్త్రీల ఆచారం. పువ్వులకు సుమనస్సులు అని పేరు. వాటి సువాసన వలన మనస్సుకు ప్రశాంతత లభిస్తుంది.

అసలు వెంట్రుకలు, గోళ్లు మన పాపాలకు ప్రతీకలు. అందుకే శ్రీ వేంకటేశ్వర స్వామికి తల నీలాలిచ్చి పాప ప్రక్షాళన చేసుకుంటాం. సహజంగా స్త్రీలలో ఏదేని విషయం పట్ల పట్టుదల పెరిగితే జుట్టు ముడి వేసుకోమని పట్టుపడతారు. ద్రౌపది, దుశ్శాసనుడు తన జుట్టుపట్టుకు గుంజాడన్న రోషంతో ద్రౌపది ఆనాడు జుట్టు విరబోసుకుంది. కనుక అట్టి కార్యాన్ని రోజువారి చేయకూడదంటోంది శాస్త్రం.

గంగానది పుణ్య నదులలో స్నానం చేసే ముందు స్త్రీలు, పురుషులు తమ జుట్టు, గోళ్లు తీయించుకుని నీళ్లలో పడవేయడం, తండ్రి తాతలు మరణిస్తే జుట్టు తీయించుకోవడం మొదలైన ఆచారాల ఆంతర్యమిదేనంటారు.

కుటుంబ సంక్షేమం... స్త్రీ నుదుటి సిందూరం

కనుబొమల నడుమ ఎర్రని బొట్టు పెట్టుకోవడం హైందవ సంప్రదాయం. ఇంటికి వచ్చిన ఏ ముత్తయిదువకైనా బొట్టుపెట్టి పంపడం మన ఆచారం. పాపిడ నడుమ ధరించే ఈ సిందూరం పెళ్లయిందని చప్పడానికి ప్రధాన సూచిక. మేష భగవానుడు అంగారకుడు. అతని రంగు ఎరుపు. ఇది చాలా శుభప్రదమైనదిగా భావిస్తారు. అందువల్లనే ఎర్రని సిందూరాన్ని నుదుటిపైన, పాపిట మధ్యలో ధరిస్తారు.

ఈ రెండూ సౌభాగ్య చిహ్నాలే. పార్వతి, సతీల స్త్రీ శక్తి చిహ్నంగా కూడా సిందూరాన్ని పరిగణిస్తారు. ఎర్రటి రంగు ఆమె ప్రవేశంతో సంపద చేకూర్చుతుందనీ, స్త్రీ ధరించే సిందూరం కుటుంబ సంక్షేమాన్ని, సంతానాన్ని పరిరక్షిస్తుందని విశ్వాసం.

పురుషులు కూడా నుదుట తిలకం ధరించే సంప్రదాయం ఉంది. ఏదైనా మత సంబంధిత కార్యక్రమాలకు, పెళ్లిళ్లవంటి శుభకార్యాలలో ఈ విధంగా తిలకం ధరిస్తారు. మత సంబంధిత సందర్భాలలో వారు తమ కొలిచే దైవాన్ని అనసరించి తిలకం ఆకృతి ఉంటుంది.

విష్ణు భక్తులు "U" ఆకృతిలో తిలకం పెట్టుకుంటే, శైవ భక్తులు మూడు అడ్డగీతలతో దిద్దుకుంటారు. బొట్టు పెట్టుకునే చోట అగ్యచక్ర లేదా ఆధ్యాత్మిక లేదా మూడో నేత్రం ఉంటుందని చెపుతారు. ఇది ప్రధాన నాడీ కేంద్రం. అనుభవాలన్నీ కలగలిపి ఒకేచోట కేంద్రీకరించే బిందువు ఇది.

ఈ ప్రదేశానికి చల్లని ప్రభావం ఉంటుంది. బొట్టు ఆధ్యాత్మిక సౌకర్యాన్ని చేకూర్చి పెట్టడమే కాకుండా దురదృష్టం, దుష్ట శక్తులు దరిచేరకుండా సంరక్షిస్తుందని విశ్వాసం.

పెళ్లిలో వధువు కాలి బొటన వ్రేలు తొక్కిస్తారెందుకు...?

మన శరీరాలు నరాల పుట్టలు. ఈ నరాల ద్వారా విద్యుత్తు ప్రవహిస్తుంటుంది. ఋణ, ధన విద్యుత్తున్న భాగంతో విద్యుత్తు ప్రవహిస్తూ ఉంటుంది. పాజిటివ్ మరియు నెగిటివ్ విద్యుత్తులు రెండూ కలిస్తేనే విద్యుత్తు పుడుతుంది కదా. అంటే అక్కడితో విద్యుత్ ప్రవాహం ఆగిపోతుందన్నమాట.

వరుడు కుడికాలి బొటనవ్రేలితో వధువు బొటనవ్రేలిని తొక్కిస్తే వారిద్దరిలో ప్రవహించే విద్యుత్తు కలిసి ఇద్దరూ ఒకటవుతారు. ఒకరి తలపై ఒకరు జీలకర్ర పెట్టించడం, ఏడడుగులు నడవడం... ఇత్యాది ప్రక్రియలన్నీ ఇద్దరినీ కలిపి ఒకటిగా చేయడం కోసమే.

అందుకే పైకి వారిద్దరుగా కనబడుతున్నా.... మానసికంగా, ఆలోచనాపరంగా ఒక్కటే. లెక్కల్లో 1+1=2. కానీ భార్యాభర్తల లెక్కల్లో 1+1=1. అప్పుడే ఆదర్శవంతమైన జంటగా ఉంటారు.

మీ అహంకారం బద్దలైంది

గుడిలోకి వెళ్లి కొబ్బరికాయ పగలగొట్టినప్పుడు మీ అహంకారాన్ని బద్దలుకొట్టినట్లు అనుకోవాలి. దేవుడు కొబ్బరి ఆరగిస్తాడని కాదు. వివేకమనే ఒకే ఒక దెబ్బతో అహంకారం రెండు ముక్కలు చేయడానికి అది సంకేతం.

కొబ్బరికాయపై ఉన్న పీచును తీసి పగులగొట్టినప్పుడే టెంకాయ ఒకే ఒక దెబ్బకు పగులుతుంది. అదేవిధంగా మనిషి తన హృదయం చుట్టూ పీచులా పట్టి ఉన్న కామక్రోధాదులను తొలగించుకోవాలి.

మానవుడు మహా శక్తి సంపన్నుడు. దుర్వాసలన మూలంగా దుర్భలడవుతున్నాడు. మీలో ఉన్న దివ్యశక్తిని గుర్తించి ఉత్తేజం పొందండి. మంచి మాటలు వినండి. మంచి దృశ్యాలు చూడండి. మంచి ఆలోచనలు చేయండి. మంచి పనులు ఆచరించండి. అప్పుడే మీలోని దుష్ట ప్రవృత్తులన్నీ పటాపంచలవుతాయి. 

'ఓం నమః శివాయ'ను స్మరించండి!

ప్రస్తుత శ్రావణమాసంలో నాలుగు సోమవారాలు వస్తున్నాయి. ప్రత్యేకంగా ఈ నెలలో సోమవారంనాడు శివభక్తులు శివనామ స్మరణలో తరించిపోతుంటారు. శ్రావణమాసంలో సోమవారవ్రతాన్ని పాటిస్తే సకల ఐస్వర్యాలు సిద్ధిస్తాయని పురాణాలు సూచిస్తున్నాయి. దేశంలోని అన్ని ప్రముఖ పట్టణాలలో శివాలయాలలో అందునా శ్రావణమాసం ప్రారంభంనుంచే ప్రత్యేక పూజలు జరుపుతారు. కాని సోమవారంనాడు విశేషమైన పూజలు జరుగుతాయి. సోమవారంనాడు వివిధ ద్రవ్యాలతో శివుడిని అభిషేకం చేస్తుంటారు.

భక్తాగ్రేశరులు శివాలయాలతోపాటు తమ తమ ఇండ్లలోకూడా రుద్రాష్టకాలు, శివమహిమస్తోత్రాలు మొదలైనవాటిని పఠిస్తుంటారు. సాయంత్రంపూట శివాలయాలలో భోలాశంకరుడిని పుష్పాలు, పండ్లు, పలహారాలు మొదలైనవాటితో అలంకరించి పూజలు చేస్తుంటారు.

శ్రావణమాసంలో శివారాధన మహత్యం: శ్రావణమాసంలో శివభగవానుడిని ప్రత్యేకంగా పూజిస్తారు. ప్రత్యేకంగా శ్రావణమాసంలోనే సాగర మథనం జరిగిందని పురాణాలు చెపుతున్నాయి. సాగర మథనం జరిగే సందర్భంలోనే సముద్రంలోనుంచి విషం బయటకు వచ్చింది. ఆ సమయంలో శివభగవానుడు విషాన్ని తన కంఠంలోనింపుకుని ప్రపంచాన్ని కాపాడాడు. కాబట్టి ఈ నెలలో శివారాధన చేయడంతో భోలాశంకరుని కృప కలుగుతుందని పురాణాలు చెపుతున్నాయి.

అత్యద్భుత ఫలితాలనిచ్చే సోమవార వ్రతం: శ్రావణమాసంలో వచ్చే సోమవారాలలో సోమవార వ్రతం పాటిస్తే భక్తులు అమోఘమైన ఫలితాలు పొందుతారని శాస్త్రాలు, పురాణాలు చెపుతున్నాయి.

వివాహిత స్త్రీలు సోమవారపు వ్రతాలను పాటిస్తే కుటుంబంలో శుఖశాంతులు, కీర్తిప్రతిష్టలు సమృద్ధిగా లభిస్తాయి. అదే పురుషులు ఈ వ్రతాన్ని పాటిస్తే కార్యసిద్ధి, వృత్తిలో ఉన్నతి, చదువులో ఉన్నతి, ఆర్థికంగాకూడా బలపడతారని పురాణాలు చెపుతున్నాయి. అదే కన్యలు శ్రావణమాసంలో ప్రత్యేకంగా సోమవార వ్రతాన్ని పాటించి శివకుటుంబపు విధివిధానాలను పూజిస్తే వారికి యోగ్యమైన వరుడు, గౌరవప్రదమైన అత్తగారిల్లు లభిస్తుందని పురాణాలు చెపుతున్నాయి.

బిల్వపత్రము మరియు రుద్రాక్ష పూజలు: శివునికి అత్యంత ప్రీతిపాత్రమైన బిల్వపత్రము, రకరకాల పుష్పాలతో అలంకరించిన దుకాణాలు శివాలయాలకు ఇరువైపులా మనకు దర్శనమిస్తుంటాయి. శివుని పూజలో రుద్రాక్షకుకూడా ప్రత్యేకమైన స్థానం ఉంది.

రుద్రభగవానుని కళ్ళనుంచి జాలువారిన కన్నీటినుంచి రుద్రాక్షలు పుట్టాయని, కాబట్టి ఇవి శివునికి ఎంతో ప్రీతిపాత్రమైనవని పురాణాలు చెపుతున్నాయి. దీంతో శివునికి ప్రీతిపాత్రమైన రుద్రాక్షలు మరియు బిల్వపత్రాలతో శివుని ఆరాధిస్తే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని పురాణాలు పేర్కొంటున్నాయి. 

శివుని పేర్లు...!


వేదాలు, పురాణాలు మరియు ఉపనిషత్తులలో శివునికి అనేక పేర్లతో స్మరిస్తుంటారు. వాటిలో కొన్ని పేర్లు మీకోసం...

హర-హర మహదేవ, రుద్రుడు, శివుడు, అంగీరాగురు, అంతకుడు, అండధరుడు, అంబరీషుడు, అకంప, అక్షతవీర్యుడు, అక్షమాలి, అఘోర, అచలేశ్వరుడు, అజాతారి, అజ్ఞేయ, అతీంద్రియుడు, అత్రి, అనఘ, అనిరుద్ధ్, అనేకాలోచనడు, అపానిధి, అభిరాముడు, అభీరు, అభదన్, అమృతేశ్వర్, అమోఘ, అరిదమ్, అరిష్టనేమి, అర్ధేశ్వర్, అర్థనారీశ్వరుడు, అర్హత్, అష్టమూర్తి, అస్థమాలి, ఆత్రేయ, ఆశుతోష్,

ఇంద్రభూషణుడు, ఇందుశేఖరుడు, ఇకంగ, ఈశాన్, ఈశ్వరుడు, ఉన్నమత్తవేషుడు, ఉమాకాంతుడు, ఉమానాథ్, ఉమేష్, ఉమాపతి, ఉరగభూషణ్, ఊర్ధ్వరేతా, ఋతుధ్వజ, ఏకనయన్, ఎకపాద్, ఎకలింగ, ఎకాక్ష, కపాలపాణి,

కమండలధర, కళాధర్, కల్పవృక్ష, కామరిపు, కామారి, కామేశ్వర్, కాలకంఠ, కాలభైరవ, కాశీనాథ్, కృత్తివాసా, కేదారనాథ్, కైలాశనాథ్, క్రతుధ్వసీ, క్షమాచార్, గంగాధర, గణనాథ, గణేశ్వర, గరళధర, గిరిజాపతి, గిరీష్, గోనర్ద్, చంద్రేశ్వర్, చంద్రమౌళి, చీరవాసా, జగదీశ్, జటాధర, జటాశంకర్, జమదగ్ని, జ్యోతిర్మయ్,

తరస్వీ, తారకేశ్వర్, తీవ్రానంద్, త్రిచక్షు, త్రిధామా, త్రిపురారి, త్రియంబక్, త్రిలోకేశ్, త్రయంబక్, దక్షారి, నందికేశ్వర్, నందీశ్వర్, నటరాజ్, నటేశ్వర్, నాగభూషణ్, నిరంజన్, నీలకంఠ, నీరజ,

పరమేశ్వర్, పూర్ణేశ్వర్, పినాకపాణి, పింగలాక్ష్, పురందర్, పశుపతినాథ్, ప్రథమేశ్వర్, ప్రభాకర్, ప్రళయంకర్, భోలేనాథ్, బైజనాథ్, భగాలీ, భద్ర, భస్మశాయీ, భాలచంద్ర్, భువనేశ్, భూతనాథ్, భూతమహేశ్వర్,

మంగలేశ్, మహాకాంత్, మహాకాల్, మహాదేవ్, మహారుద్ర్, మహార్ణవ్, మహాలింగ్, మహేశ్, మహేశ్వర్, మృత్యుంజయ, యజంత్, యోగేశ్వర్, లోహితాశ్వ్, విధేశ్, విశ్వనాథ్, విశ్వేశ్వర్, విషకంఠ్, విషపాయీ, వృషకేతు, వైద్యనాథ్,

శశాంక్, శేఖర్, శశిధర్, శారంగపాణి, శివశంభు, సతీష్, సర్వలోకేశ్వర్, సర్వేశ్వర్, సహస్రభుజ్, సాంబ, సారంగ, సిద్ధనాథ్, సిద్ధీశ్వర్, సుదర్శన్, సురర్షభ్, సురేశ్, హరిశర్, హిరణ్య, హుత్ సోమ్, స్రుత్వా మొదలైనవి.

మంత్ర జపంతో శివుడ్ని ప్రసన్నం చేసుకోండిలా...!

శ్రావణ మాసంలో శివారాధన చేస్తే భోలాశంకరుని కరుణా కటాక్షాలు లభించి మనోసిద్ధి ఫలిస్తుందని పండితులు అంటున్నారు. ఇక్కడ ఇచ్చిన కొన్ని మంత్రాలు ప్రతి రోజూ రుద్రాక్షమాలతో జపిస్తే ఫలితముంటుందని వారు తెలిపారు.

జపం చేసేటప్పుడు తూర్పు లేదా ఉత్తర ముఖం వైపు కూర్చొని జపించాలి. జపం చేసేముందు శివుడ్ని బిల్వ పత్రాలతో పూజించాలి.

క్రింద పేర్కొనబడిన మంత్రాలను జపించి భోలాశంకరుని కృపకు పాత్రులవ్వండి...

** నమః శివా

** ప్రౌం హ్రీం ఠ

** ఊర్థ్వ భూ ఫట

** ఇం క్షం మం ఔం అ

** నమో నీలకంఠా

** పార్వతీపతయే నమ

** హ్రీం హ్రౌం నమః శివా

** నమో భఘవతే దక్షిణమామూర్తయే మహ్యం మేధా ప్రయచ్ఛ స్వాహ

ఇలా మంత్ర జపం నియమ నిష్టలతో చేస్తుంటే తమరు అనుకున్న అన్ని కోరికలు నెరవేరుతాయని పండితులు సూచిస్తున్నారు.