Friday, January 11, 2013

భిక్ష వేసే అన్నపూర్ణాదేవికి శివుడు పుత్రుడా ?

 పరమేశ్వరుడు అన్నపూర్ణదేవిని భిక్షం అడుగుతున్నట్లు, భిక్షతీసుకుంటున్నట్లు ఉన్న పటాలను మనంధరమూ చూస్తూనే ఉంటాము. ఆ భంగిమలో శంకరుడు పుత్రనితోను, అన్నపూర్ణదేవి తల్లితోనూ పమానము. ఎందు వలనంటే ఏ స్త్రీ అయినా, ఎరికైనా ఆఖరికి తన భర్తను మంచి స్నేహితునిగాను.

సలహాలు ఇచ్చేటప్పుడు మంత్రిగానూ, మార్గదర్శనం చేసేటప్పుడు గురువుగానూ బావిస్తూ, భర్తకు కావలసినవన్నీ సమకూర్చేటప్పుడు దాసీగానూ, సేదతీర్చేటప్పుడు ప్రియరాలిగానూ, సుకపెట్టేటప్పడు బార్యాగానూ ప్రవర్తేం ఏ స్త్రీ అయినా అన్నం పెట్టేటప్పడు తల్లికి ప్రతిరూపమే అవుతుంది. ఈ సత్యన్ని తెలియజెప్సడానికి పటాలను ఆవిధముగా చిత్రించి ఉంటారు.   

సంసార బంధాలను పోగొట్టే జపం ఏది ?

సమస్త లోకాలకూ పురుషోత్తముడైన ఆ శ్రీమహావిష్ణువు యెక్క సహస్ర నామాలను నిత్యం స్తుంతించడం, సేవించడం, జనించడమూ ఉత్తమమైనది. సంసార బంధాలను పోగోట్టేదది విష్ణుసహస్రనామ పారాయణ అని చెప్పవచ్చును. ‘‘లోకాస్సమస్తా సుఖినోబస్తు’’    

కర్పూర గుండం యెక్క ప్రత్యేకత

అయ్యప్ప భక్తులు ఇరుముడి కట్టి తీర్థయాత్రకు సన్నద్దులు అయినపుడే కర్పూరము ధారాళముగా సేకరించుకొని పోవుదురు. దారి మధ్యమున శబరిగిరి క్షేత్రమును చేరు వరకూ ప్రతి దినమూ ప్రాత: సంధ్యా సమయములందు ఇరుముడి కట్టుకు దీపారాధనములను జరుపుటకునూ(స్వామి వారికి కర్పూర దీపము మిక్కిలి ఇష్టమైన ఆరాధన) దారిలోని ఆలయాలలో వెలిగించుటకనూ ఉపయోగించినదిపోగా మిగిలిన కర్పూరమును స్వామివారి సన్నిధానమునందు గల )బలిరాయికి ప్రక్కనుయున్న) కర్పూర గుండము నందు వేసెదరు. మూడు నాలుగు దినములు రాత్రి పగలనక భక్తాదుల వేయు కర్పూరములోనే ఈ హోమ గుండము జాజ్వల్య మానముగా వెలుగును.   

స్త్రీ అంటే ?

 ఈ శబ్దంలోనే సకార – తకార – రకారములున్నాయి.. సకారము : సకారమున్న సత్యగుణము. దాని వర్ణము తెలుపు. ఆ గుణమునందు వినయమూ, అణకువా, సంప్రదాయ సంస్కారమూ, ప్రేమా, హృదయ పరిపూర్ణత, ధ్యాన, వైరాగ్యములున్నాయి.

తకారము : దాని వర్ణము నలుపు, బద్దకమూ, నిర్లక్షమూ, అసహనమూ, మతిమరుపూ, సిగ్గూ, భయములున్నాయి.

రకారము : దాని వర్ణము ఎరుపు, కామమూ, క్రోధమూ, విచ్చలవిడితనమూ, ధైర్యసాహసాలూ, అహమూ, గర్వమదాలున్నాయి. అన్ని గుణాలను కలిగిన స్త్రీని మన ప్రవర్తన ద్వారా సకార గుణములో, తకార గుణములో, రకార గుణంలో ఈ మూడింటిలో ఎందులో ఉంచాలన్నది, ఉంచాలన్నది మగవారి చర్యలే, ప్రవర్తనలే...  

చోడకర్మ సంస్కారము’ అంటే ఏమిటీ ?

 ఓ సంవత్సరకాలం తరువాత శిశువుకు తలనీలాలు తీయడం జరుగుతుంది. ఆరవ నెల అన్నప్రసమైన అనేక రోజులకు  ఈ తలవెంట్రుకలు తీసే కార్యాన్ని చేస్తారు. వెంట్రుకలు తీసిన అనంతరం వెన్న లేక చిలికిన పెరుగుతను శిశువు సున్నితమైన గుండుపై రాయడం జరుగుతుంది. ఆ తరువాత శిశువు తండ్రి శిశివు తలపై గంధలేపనంతో స్వస్తిక్ గుర్తును రాసి నుదుటిపైన బొట్టు పెడుతారు.

స్వస్తిక్ గుర్తు భగవంతుడి తలంపేశిశివు తలంపవుగాక అనే అర్థాన్ని ఇక్కడి స్పురింపజేస్తుంది. కాసేపు తరువాత స్వస్తిక్ గుర్తున్న గుండుపై అంతటా గంధలేపనాన్ని రాయడం జరుగుతుంది. ఈ కార్యాన్ని చోడకర్మ సంస్కారం అని అంటారు. గంథంలో ఔషధీయ గుణాలు ఉంటాయి. గంథలేపనం మెదడును చల్లబరచడమే కాక బుద్దిని వికసింపజేస్తుంది. తల్లిదండ్రులు మరియు ఈ కార్యానికి వచ్చిన వారు శిశివును దీవించి, దీర్ఘయువును ప్రసాదించుమని భగవంతుడిని ప్రార్థిస్తారు.   

పడమర దిక్కు యెక్క ప్రాముఖ్యత ఏమిటి ?

తూర్పు నుండి పడమరవైపు గ్రహనక్షత్రముల నుండి శక్తి- ప్రసారం భూమిపై జరుగును కావున ఇంటి యెక్క వెంటిలేషన్ (కిటికీలు మొదలుగునవి) ఈ దిక్కుగా ఉంచుటచాలా మంచింది. అమితే ఇంటి ముఖద్వారము మాత్రమే పడమరవైపు ఉండుట తగదని చెప్పబడింది. అలాగే పడమర వైపున వెలిగించి ఉంచిన దీపాన్ని ధర్శించుట కూడా మంచిది కాదని చెప్పబడింది.

అయితే సాయంత్రం దైవారాధనలో తూర్పు మరియు పడమర దిక్కులలో రెండువైపులా దీపాన్ని వెలిగించడం మంచిదే అని చెప్పబడుతోంది. నిద్రించునప్పుడు పడమరకు తల వుంచి నిద్రించరాదు అలాగే మునకలు వేసి స్నానము చేయునపుడు ఈ దిక్కకు వైపున ఉండుట మంచిది కాదు. కానీ సాయంకాలం ప్రార్ధనల్లో ఉత్తరం దిక్కుగా గానీ పడమర వైపున గానీ ముఖము నుండి ప్రార్థనలు చేసుకోవచ్చు.   

ధ్రువనక్షత్రం

ఉత్తానుపాదుడు అనే రాజుకు ఇద్దరు భార్యలు వారిపేర్లు సునీత, సురుచి, రాజుగారికి సురుచి అనిని అమితమైన ప్రేమ. ఆమె కొడుకు ఉత్తముడు పెద్దభార్య అయిన సునీత కొడుకు ధ్రువుడు ఇతడు తండ్రి ప్రేమకు దగ్గరగా ఉండాలనుకునేవాడు. కాని తండ్రి పినతల్లి అయిన సురుచి ఇంట్లోనే ఎక్కువగా గడిపేవాడు. అందువల్ల ధ్రువునికి తండ్రి ప్రేమకరువైంది. ఒక రోజు తండ్రితో గడపాలని ధ్రువుడు పినతల్లి ఇంటికి వెళ్ళాడు.

తండ్రి ఒడిలో ఉత్తముడు కూర్చొని ఉన్నాడు. ధ్రువుడు సంతోషంతో తండ్రి వద్దకు వెళ్ళాడు. తండ్రి ధ్రువుణ్ని చీదరించుకున్నాడు. తండ్రి నిరాధరణకు ధ్రువునికి దుఖ: ఆగలేదు. అది చూసి పినతల్లి కఠినంగా ‘‘ధ్రువా! నీవు నా కడుపున పుడితే మీ తండ్రిగారి తొడపై కూర్చొనే అదృష్టం కల్గేది. ఇప్పుడైనా ఈ సురుచి కడుపున పుట్టించమని శ్రీవారిని ప్రార్థించు అప్పుడు నీకు ఉత్తముని స్థానం లభిస్తుంది’’ అన్నది. పినతల్లి సురుచి.

జరిగిన విషయం అంతా తల్లితో చెప్పాడు ధ్రువుడు. అప్పుడు తల్లి ‘‘ నాయానా ధ్రువా ! నీ పిన తల్లి నిజమే చెప్పింది. తండ్రిప్రేమ కోసమే కాకుండా ఒక పెద్ద ఆశయం పెట్టుకొని శ్రీహరిని గూర్చి తపస్సు చెయ్యి ఫలితముంటుంది. అన్నది తల్లి. తల్లిమాటలకు ధ్రువుడు ఉత్తేజతుడయ్యాడు. తపస్సు చేయుటకు బయలుదేరిన ధ్రువునకు నారధమహార్షి ఎదురయ్యాడు. విషయం తెలసుకొని నవ్వుతూ ఇలా అన్నాడు.

నాయానా ధ్రువా! పసివాడివి. పినతల్లి మాటలకు ఇంత పట్టింపా ? తపస్సు అంటే మాటలు కాదు.! చాలా కష్టమూ నీ నిర్ణయం మార్చుకో’’ అన్నాడు. నారధుడు. నారుధుడు మాటలకు ధ్రువుడు మహార్షీ పినతల్లి మాటలు నాలో రేపిన బాధ అంత ఇంత కాదు. ఉత్తముని కన్న నేను గొప్ప స్థానం సంపాదించాలి. అది పొందటానికి నేను ఎంత కఠోర తపస్సు అయినా చేస్తాను. అన్నాడు. నీ పట్టుదల గట్టిది.

ఆ శ్రీ మహావిష్ణువును మనసున తలచుకొని నిశ్చలమైన మనసుతో తపస్సు చెయ్యి నీ కోరిక తప్పక నెరవేరుతుంది. అని ఆశీర్వదించి నారుధుడు వెళ్ళిపోయాడు. ధ్రువుడు యమునా తీరాన ఉన్న మధువనానికి వెళ్ళి శ్రీహరిని మనసున తలచి ఒంటికాలిపై కొన్ని సంవత్సరాలు కఠోరతపస్సు ఆచరించాడు. అతని తపస్సుకు మెచ్చిన నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు. ధ్రువుడు ఆనందంతో పొంగిపోయి శ్రీహరిని స్తుతిస్తూ ఎన్నోస్త్రోత్రాలు చేసాడు. అంతట విష్ణుమూర్తి ధ్రువా నీ మనస్సునందున్న కోరిక నెరవేరుస్తున్నాను.

ఇంతవరకు ఎవరీ దక్కని ఉన్నదస్థానాన్ని నీవు పొందుతావు. మహారాజువై గొప్పగా రాజ్యమేలుతూ, సుఖసంతోషాలతో జీవించి చివరకు నక్షత్రమై, ఉత్తర దిక్కులో స్థిరంగా వెలుగుతావు. లోకమంతా ఆ నక్షత్రాన్ని ధ్రువ నక్షత్రం అని పిలుస్తారు. అని వరమిచ్చి అదృశ్యమైనాడు. నేటికి కనబడే ఉత్తర దృవం పై ఉన్న నక్షత్రమే ధ్రువ నక్షత్రం. ధ్రువుడు గొప్ప లక్ష్యంతో తపస్సు చేసి, అనుకున్నది సాధించాడు.  

జ్ఞానుల మాటలు మనకు ఎలా సహకరిస్తాయి.?

 జ్ఞానులు మాట్లాడుతున్నపుడు జాగ్రత్తగా వినడం ఎంతో అవసరం. అలా శ్రవణం చేసినట్లయితే మనకు సరియైన ప్రేరణ కలగడమే గాక మన జ్ఞానం వికాసవంతమౌతుంది. వారి మాటల్లో తెలుసుకోదగిన అనేకానేక అంశాలు దాగి వుంటాయి. జీవితంలో అనేకానేక ఆకర్షనలు ఉంటాయి. వాటిలో చిక్కితే మనం బ్రష్టులమౌతాము. కావున జ్ఞానుల సుభోధలను సరిగా విని, అర్థం చేసుకొని, జీర్ణం చేసుకున్నట్లయితే చెడు ఆకర్షణా వలయాలలో మనం చిక్కుకోము. కావున సస్సంగం ఎంతో ప్రభావవంతమైనది.

 జీవితంలో ఆపజయాలు మరియు లోటుపాట్లు మన వ్యక్తిత్వాన్ని మరియు నైతికతను బలహీనపరచుతాయి. మన చుట్టు మనల్ని పతనం గావించే వ్యతిరేక శక్తులు ఉంటాయి.(అవి మనుషులు కావచ్చు లేదా గ్రహప్రభావాలు కావచ్చు) కావున ఈ వ్యతిరేక శక్తుల ప్రభావానికి గురికాకుండా ఉండి జీవితంలో విజయాన్ని సాధించుటకు జ్ఞానుల మరియు అనుభవజ్ఞుల సుభోధలు ఎంతగానో తోడ్పడుతాయి.  

కుంకుమార్చన ద్వారా కలిగే పుణ్యం..

కుంకుమార్చన ద్వారా రెట్టింపు పుణ్య ఫలం వస్తుంది. అందుకే వివాహాది శుభకార్యాలప్పుడు అమ్మవారికి కుంకుమార్చన చేయిస్తారు. దేవుని కళ్యాణ సమయంలోనూ కుంకుమార్చన చేస్తారు పండితులు.

 భర్త అనారోగ్యమప్పుడూ, సంతానానికి జరిగే సకల పుణ్య కార్యాల్లోనూ శుభకార్యాల్లోనూ అమ్మవారికి కుంకుమార్చన చేస్తే మహాపుణ్యం కలిగి ఆ స్త్రీకి సుఖ శాంతులు కలుగుతాయి.

గుడికి ఏ ఉద్దేశంతో వెళితే పుణ్యం వస్తుంది... ?

 పక్కవారి నాశనము కోసంమూ, తన లేదా తన వాళ్ళ ఎదుగుదల కోసమూ వెళ్ళే కన్నా భక్తిగా వెళితేనే పుణ్యం వస్తుంది.

 లేదా ఏదైనా పాపం చేసినప్పుడూ నిజంగా పశ్ఛాత్తాపం చెంది, దేవుడికి మొరపెట్టుకుని క్షమించమని అడిగితే ఆ పాపానికి అంతో ఇంతో ప్రాయశ్చిత్తం కలుగుతుంది.

 తల్లికి బిడ్డ ఆకలి ఎలా తెలుసో, భగవంతుని దీవెనలు ఆలస్యం అవ్వచ్చు. ప్రతిఫలం ఆశించకుండా చేసే పూజ మంచి ఫలితాన్నిస్తుంది.    

బదరీనాథ్ ను దర్శించటము ఎంతటి పుణ్యం

బదరీనాథ్ అనగా బదరీవనం. రేగు చెట్టు విస్తారంగా ఉండే ఆ ప్రాతంలో శ్రీమహావిష్ణువు ఒంటి కాలిపై అనేక సంవత్సరాలు తపస్సు చేశాడు. అంతటి పుణ్య ప్రాంతంలోనే సరస్వతీ, అలకనందా నదులు దేవప్రయాగ వద్ద మందాకినీ నదిలో కలుస్తాయి.

అక్కడ్నించి అఖండ గంగగా భూమిపై ప్రవహిస్తోంది. అంతటి పుణ్యక్షేత్రం బద్రీనాథ్, త్రివిక్రముడై శ్రీ మహావిష్ణువు సంచరించిన ప్రదేశాన్ని ఎంతో పుణ్యం చేస్తేగాని దర్శంచే అవకాశంరాదు. రెండుసార్లు దర్శించటమంటే ఎన్నో జన్మల పుణ్యం కలిస్తే గాని సాధ్యమపడదు.    

పసుపు కలిపిన అక్షింతలు వేసి ఆశీర్వదించమనేది ఎందుకు ?

బియ్యము చంద్రునికి చెందిన ధ్యాన్యము, మన: కారకుడైన చంద్రుడి ప్రభావం బియ్యంపై ఉంటుంది. మానవుని దేహాం ఓ విద్యుత్ వలయం. ఆశీర్వదించేవారు చేతిలోకి బియ్యం తీసుకోగానే వారిలోని విద్యుత్ బియ్యానికి అందుతుంది.

 ఆశీర్వాదించే వారికి చర్మవ్యాధులు ఉంటే ఆ ప్రభావం కూడా ఆశీర్వాదంనే తీసుకునే వారిపై పడుతుంది. అందుకే క్రిమిసంహరకమైన పసునుని కలిపి, కేవలం విద్యుత్ మాత్రమే స్వీకరించేలా చేసి పసుపు కలిపిన బియ్యాన్ని అనగా అక్షింతలనిచ్చి ఆశీర్వాధించమంటారు.

 పసుపు లేదా కుంకుమ గానీ, కలపని అక్షింతలను పూజాకార్యక్రమాల్లో గానీ, శుభకార్యల్లోగానీ వాడరు. 

చండ ప్రదక్షిణము చేస్తే ముప్పయి వేల ప్రదక్షిణములు చేసిన ఫలమా ?

 అవునని శాస్త్రాలు చెబుతున్నాయి. శివాలయంలో ప్రదక్షిణ చేస్తున్నపుడు సోమసూత్రాన్ని దాటకూడదు. సోమసూత్రం ఇవతల నుంచి ధ్వజస్థంభం వరకూ, ధ్వజస్థంభం నుంచి మళ్ళీ ప్రదక్షిణగా సోమసూత్రం వరకూ, అక్కణ్ణించి వెనక్కి తిరిగి ధ్వజస్థంభం వరకూ, ధజస్థంభం నుంచి ముందుకు కదలి సోమసూత్రం వరకూ, తిరిగి మళ్ళీ వచ్చిన దిశగా ధ్వజస్థంభం వరకూ, మళ్ళీ అలానే ధ్వజస్థంభం నుంచి సాగి సోమసూత్రం వరకూ, తిరిగి సోమసూత్రం నుంచి వెనుక ధ్వజం వరకూ, అక్కడ్నించి ముందుకు సోమసూత్రం వరకూ, సోమసూత్రం నుంచి ధ్వజం వద్దకూ, ఆపై శివాలయ ధ్వజస్థంభం ఎడమ పక్క వెళ్ళలి. అదే చండ ప్రదక్షిణ, రెండోసారి ప్రదక్షిణ చేస్తే ధ్వజ స్థంభాన్ని తాకరాదు.  

ముసలి ఎద్దుకు న్యాయం

 అక్బర్ పాదుషా ప్రజల కోసం న్యాయగంటను ఏర్పాటు చేశాడు. ఎవరికైనా ఏ విషయంలోనైనా అన్యాయం జరిగినా, ఆపద సంభివించినా ఆ గంటని మ్రోగిస్తే అక్భరు ఆ గంట శబ్దం విని, అక్కడికి వచ్చి, ఆ గంట మ్రోగించిన వారి కష్టం తీర్చిపంపుతారు. ఒక రోజు అక్బర్ ఆస్థానంలో సభ నిర్వహిస్తుండగా న్యాయ గంట మ్రోగటం వినిపించింది.

అక్బర్తో సహా అందరూ అక్కడికి వెళ్ళారు. అక్కడ ఒక ముసలి ఎద్దు తన నోటితో గంట తాడుని పట్టి లాగుతూ గంటని మ్రోగించడం వాళ్ళకి కనిపించింది. పాపం! నోరులేని జంతువు కధా.. దాని కష్టమేంటో అది చెప్పలేదు. దాని సమస్యను నువ్వే పరిష్కరించాలి బీర్భల్! అన్నాడు. అక్బర్ జాలిగా ముసలి ఎద్దు వంక చూస్తూ.

అలాగే ప్రభూ అని అక్కడ ఉన్న భటునితో ‘‘ దీన్ని వదిలిపెట్టి, ఇది ఎక్కడికి వెళ్తే అక్కడిదాకా దీని వెనకానే వెళ్ళి చివరికి ఏ ఇంటికి వెళ్తుందో ఆ ఇంటిలోని వ్యక్తిని తీసుకురా’’ అని ఆజ్ఞాపించాడు. భటుడు ఆ ముసలి ఎద్దుని వదిలి పెట్టాడు. అది అలా అలా వెళ్లి ఒక ఇంటినిచేరింది. ‘‘

ఇది నీ ఎద్దేనా ?’’ అని అడిగాడు భటుడు ఆ వ్యక్తిని. అతను అవును అవును నాదే అన్నాడు. ‘‘ నిన్ను రాజుగారు పిలుచుకురమ్మన్నారు!’’ అని చెప్పి అతన్నీ, ఎద్దును తీసుకుని రాజదర్భారుకి వచ్చాడు. ‘‘ ఇది నీ ఎద్దే కదా.. మరీ దీన్ని ఎందుకు వదిలి పెట్టావ్ ?’’ అని అడిగాడు బీర్బల్.

‘‘ ప్రభూ! ఇది వదిలి పెట్టేశాను’’ అన్నాడు ఆ వ్యక్తి. ఇది వయసులో ఉన్నాన్నాళ్ళూ నీకు సేవ చేసింది అవునా ? అలాంటపుడు దీన్ని ఈ వయసులో వదిలేయడం న్యాయామా ? అని అడిగాడు బీర్బల్. ‘‘ కానీ ఈ ముసలి ఎద్దుని ఇంట్లో ఉంచుకుని నేనేం చేయాలి ప్రభూ!’’ అన్నాడు ఆ వ్యక్తి.

 ‘‘ నీకు అమ్మా నాన్నా ఉన్నారా ? ’’ అన్నాడా బీర్బల్. ‘‘ ఉన్నారు ప్రభూ! వాళ్ళు నాతోనే ఉన్నారు’’ అన్నాడా బీర్బల్. ‘‘ముసిలి వాళ్ళయిన వాళ్లు ఇప్పుడు నీకు ఏవిధంగానూ పనికిరారు. వాళ్లకి తిండిపెట్టడం కూడా దండగ, వాళ్లని వదిలేసెయ్’’ అన్నాడు బీర్బల్.

బీర్బల్ ఇలా అనగానే ఆ వ్యక్తి కళ్లు తెరుచుకున్నాయ్. తనని క్షమించమని అడిగి ముసలి ఎద్దుని తీసుకుని వెళ్లిపోయారు. ఆ వ్యక్తికి బీర్బల్ బుద్ది చెప్పిన విధానం అక్బర్ పాదుషాకి ఎంతో నచ్చి, బీర్బల్ ని ఎంతో అభినందించాడు.   

తిరుమల శ్రీవారికి శుక్రవారంనాడు అభిషేకం చేస్తారు ఎందుకు ?

అపోహ : ఏడుకొండల వానికి ప్రతి శుక్రవారమునాడు జరిగే అభిషేకం ఆ స్వామి యెక్క శక్తి స్వరూపాన్ని తెలియ పరుచటకేనని కొందరు అపోహ పడుతుంటారు.

వాస్తవం : నిజానికి శుక్రవార అభిషేకం స్వామి వక్ష స్థలం పై గల లక్ష్మీదేవిని ఉద్దేశించి నిర్వహించబడుతుందని సంప్రదాయం తెలిసిన పెద్దలు చెబుతున్నారు. శుక్రవారంనాడు లక్ష్మీదేవికి అభిషేకం చేయడం అనేది మనందరికీ తెలిసిన విషయమే కదా!

లక్ష్మీదేవికి అభిషేకం చేయడానికి స్వామి వారి వక్షస్థలాన్ని మాత్రమే తడిపి, సగం తడిపిన స్వామివారిని అలానే వదలివేయరాదు. కనుక లక్ష్మీతోపాటు లక్ష్మీ కాంతుడైన ఆ వెంకటేశ్వర స్వామికి కూడా శుక్రవారంనాడు అభిషేకం చేస్తున్నారు. అని గ్రహించాలి.   

తులసిని ఏ రోజున పూజిస్తే కోరిన కోర్కె నేరవేరుతుంది ?

తులసి చెట్టు నుంచి తలసీదేవి కార్తీక పౌర్ణమినాడు ఆవిర్బవించింది. ఆనాడు ఆ తల్లినీ, విశ్వపావనినీ పూజిస్తే వేల ఆవులను దానం చేసిన ఫలం కలుగుతుందని విష్ణుపురాణం చెబుతోంది. సంతానము కోరేవారూ, వివాహం ఆలస్యం అయినవారూ తులసీ స్తోత్రాన్ని పఠిస్తే తప్పక దోషాలు పోయి సుఖాలు కలుగుతాయి. ప్రతిరోజు తులసి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే కన్యకు పుణ్యపురుషుడు లభిస్తాడు.



గాయత్రి మంత్రం ఎంతటి పాపాలను పోగొడుతుంది ?

మహా మునీశ్వరుడైన పరాశర మహర్షి గాయత్రి మంత్ర పఠన పుణ్యాన్ని శెలవిస్తూ, అశ్వపతి మహారాజుకి ఈ విధంగా చెప్పాడు. ఒక్కసారి జపించినంతనే పగలు చేసిన పాపమూ, పదిసార్లు జపిస్తే రాత్రీ, పగలూ చేసిన పాపకర్మ పాపాలూ, వందసార్లు జపిస్తే నెలంతా చేసిన పాపాలూ, వెయ్యిసార్లు జపిస్తే సంవత్సరంపాటు చేసిన పాపమూ, లక్షసార్లు జపిస్తే సర్వజన్మార్జిత పాపాలూ ఖచ్చితంగా నశిస్తాయి. పదిలక్షల సార్లు జపిస్తే పూర్వజన్మ పాపములూ, వంద లక్షలసార్లు జపిస్తే సకస జన్మల పాపాలూ తొలుగుతాయి.  

వేద ఉపనిషత్తులు పురాణాల ప్రకారము నవగ్రహాలకి ఏ దానాలు చేయాలి ?

 సూర్యుని జిల్లేడూ, చంద్రునకు మోదుగా, అంగారకునకు చండ్రా, బుధునకు ఉత్తరేణూ, గురువునకు రావీ, శుక్రునకు మేడీ, శనికి జమ్మీ, రాహువునకు గణికా, కేతువునకు దర్భ సమిధలూ వాడాలి. నవగ్రహ దానాల విషయానికొస్తే ....

సూర్యునికి చక్కటి ఆవు( లేదా ప్రతిమ)
చంద్రునకు శంఖము, అంగారకునకు ఎర్రని ఎద్దును(ప్రతిమ),
బుధునకు బంగారము(ఆ వర్ణము కలది),
బృహస్పతికి వస్త్రములు, శుక్రునికి తెల్ల గుర్రం (ప్రతిమ),
శనీశ్వరునకు నల్లని ఆవు (ప్రతిమ),
 రాహువు కొరకు పాయసమూ,
కేతువు కొరకు మేకపోతు దానమివ్వాలి.  

అష్ట దారిధ్ర్యాలంటే ?

1. సహాయం చేసేవారు ఒక్కరైనా లేకపోవటము.

2. కనీస అవసరాలకి ధనము లేకపోవడము.

 3. ఒంటి పూట భోజనమును కూడా విపరీతమైన శ్రమ చేయాల్సి రావటము.

4. వినే నాథుడు లేకపోవటము.

5. చినిగిన బట్టలతో ఉండటము.

6. వెళ్లలానికి ఏ వాహనము లేకపోవటము.

7. ధనం ఉన్నా సంతానం లేకపోవటము

8. పుత్రుడు ఉన్నా లేకపోవటము.

 అలేగే అష్టకష్టాల విషయానికొస్తే

ఇష్టం లేకపోయినా తప్పనిసరిగా పనిచేయాల్సి రావటము.
భయంకర దారిధ్ర్యము,
భార్య ఉండీ ఉపయోగపడకపోవటము,
అడుక్కుతినే పరిస్థితి,
అప్పు అడిగినా ఇచ్చేవాళ్ళు లేకపోవటము,
వీసమెత్తు ఉప్పు కూడా అప్పుగా దొరక్కపోవటము,
రెండు కాళ్ళతోనే వెళ్ళాల్సి రావటము,
ఇన్ని దరిధ్రాల మధ్యా,

అష్టకష్టాల మధ్య కూడా ఎంతో మంది అత్యున్నత స్థాయికి వచ్చారు. ఏ కష్టమూ కలకాలం ఉండదు.   

జీవిత గమనంలో మనిషికి ఏది తోడుంటుంది ?

మానవుడు తన వ్యక్తిత్వాన్ని కోల్పోతే సర్వస్వాన్ని కోల్పోయినట్లే అన్నది ఋషి వాక్కు. భారతీయ సంప్రదాయం ప్రకారం సద్దుణమే వెలకట్టడానికి వీలులేనంతటి సత్ సంపద. సద్గుణము ఒక్కసారిగా ఎవరికీరాదు. దాన్ని మనం సాగు చేయాలి. జాగ్రత్తగా పెంచి పోషించాలి.

 దుర్గుణమనే పురుగు పడితే సత్ సంగము లేక సత్ గ్రంథ పఠనము అనే మందును చల్లి సత్ సంగము లేక సత్ గ్రంథ పఠనము అనే మందును చల్లి దుర్గుణాన్ని తుదిముట్టించాలి. శ్రీరాముడిని ఇన్నివేల సంవత్సరాలుగా మానవులు మరిచిపోలేక పోవడానికి గల ప్రధానకారణము అతని వైభవోపేతమైన సద్గుణములే ! అందుకే శ్రీరాముడిని ‘సకల గుణాభి రాముడు’ అని కీర్తిస్తారు.

 మనం కూడా ఈ మంచి గుణాలను సాగుచేసుకుంటూ ఉండాలి. జన్మత: ప్రతి వ్యక్తికి కొన్నిమంచి గుణాలు మరియు చెడు గుణాలు వస్తాయి. పుష్పం విరభూస్తన్నపుడు సువాసన గుభాళించినట్లుగా, మనిషి పెరుగుతన్న కొద్దీ అతనిలోని గుణాలు ఒక్కొటిగా వ్యక్తమవుతుటాయి. ‘ అయ్యో! నాకు చెడు గుణం ఉంది’. అని బాఃధపడరాదు.    

స్త్రీలు పురుషులకు ఎడమ వైపుగా కూర్చోవాలా ?

మను ఋషులు ఇలా స్త్రీలు తమ భర్త పక్కన ఎడమ వైపుగా కూర్చోవాలని చెప్పడం జరిగింది. ఏదైనా శుభకార్యమో లేక వివాహంలోనో స్త్రీని భర్త ఎడమ వైపున కూర్చుండజేస్తారు. స్త్రీ కుడి శక్తిగా పురుషుడు మరియు పురుషుడి ఎడమ సామర్ధంగా స్త్రీ చరించాలని ఈ ఆచారం వెల్లడిచేస్తుందని చెప్పడం జరుగుతుంది.

కుడి భాగం శక్తికి, ఎడమ భాగం సమతౌల్యానికి సంబంధం కలిగి ఉన్నాయి. అర్థనారీశ్వర (శివ శక్తులు ఐక్యమై ఒకే శరీరాన్ని కలిగి ఉండుట) తత్వం ఈ విశ్వాసాన్ని బలపరుస్తుంది. అయితే ఈ విషయాన్ని గతంలో అనేక పరిశోధకులు ఆమోదించలేదు. కానీ ఈ మధ్య కాలంలో కొన్ని విషయాలు వెలుగు చూశాయి.

పురుషుడి ఎడమ భాగం స్త్రీ తత్వాన్ని ప్రతిభింభిస్తుందన్ని కలిగి ఉంటుందని వెల్లడైంది. ఆ కారణంగా, ఈ విషయాన్ని ఏనాడో గ్రహించిన మన పెద్దలు స్త్రీ పురుషుని ఎడమ వైపు కూర్చోవాలని చెప్పడం జరిగింది. కావున దీన్ని ఆచరించి మన సనాతన ధర్మాన్ని గౌరవిద్దాం.    

దేవుని పట్ల అర్చకుని భావన ఎట్లుండవలెను ?

 జయాఖ్య సంహిత ఇలా చెప్తూన్నది.  శ్లొ!! అహం స భగవాన్ విష్ణు: నారయణో హరి:! వాసుదేవో హ్యహం వా, పి భూతాం వాసో నిరంజన:!! భగవదర్చన చేసేవారు (అర్చకులు) తమ మనుసూ, మాటలనూ, క్రియలనూ, సర్వమునూ ఆ భగవంతుడే తనకు ప్రసాదించాడని భావిస్తూ, వాటిని తిరిగి ఆ దేవునికే సమర్పించి...

‘‘ సర్వం విష్ణు మయం జగత్’’ అనే స్థిరమైన భావంతో ‘‘నేను విష్ణు భగవానుడను! నారాయనుడను! నేను హరిని ! సర్వజీవుల యందూ నిండివుండిన వాసుదేవుడను నేనే! అని భావించి తీరాలి. (నాలోనే భగవంతుడున్నాడు! నేనే భగవంతుడిని! అని భావిస్తూ ధర్మాచరణ సాగిస్తూ జీవించే అర్చకులు ఈ రోజుల్లో ఎంతమంది. ఉన్నారూ...?!)  

నిత్య జీవన విధానములో పాటించవలసిన సదాచారములు ఏవేవి ?

నిత్య జీవితంలో పాటించవలసిన, శాస్త్రం నిర్ధేశించిన సధాచారములు చాలానే ఉన్నాయి. ముఖ్యముగా పాటించ వలసిన కొన్నింటిని ఇక్కడ పేర్కొంటున్నాము.

 1. బ్రాహ్మీ ముహుర్తములో ( సూర్యోదయమునకు 1.36 ని. లకు ముందు) నిద్ర నుండి మేల్కొవలేను.

 2. భూమాతకు నమస్కరించవలేను.

 3.రెండు చేతులు చూసుకోవాలెను. 

4.ప్ర్రప్రధముగా తల్లికి, తదుపరి తండ్రికి, గురువుకు, దైవమునకు నమస్కరించవలేను.

 5. కాలకృత్యములను తీర్చుకొనిన పిమ్మట స్నాన మాచరించవలెను

 6. సూర్య నమస్కరాలను (సంధ్యావందనమును) ఆచరించవలెను.

 7. తదుపరి నిత్య జీవన కృత్యములను సాగించుకోవలెను

 8. మధ్యాహ్నం 12-00 గంటలలోపు భోజనము ముగించవలెను. ( ఈ రోజుల్లోని ఉద్యోగస్తులకు, విధ్యార్థులకు దీనిని పాటించడము కష్టమే. కనుక వీరు మాత్రము 1.30 ని.లలోగా ముగించవలెను.)

 9. మరలసాయంత్రం సంధ్యావందనము చేయవలెను.

 10. రాత్రి 9.30 ని.ల లోగా తేలికగా జీర్ణమయ్యే భోజనము చేయవలెను. ముఖ్యముగా ఈ పదింటిని ఆచరించుట ఎంతో ఉత్తమం.    

వివిధ ఆసనాలు – వాటి ఫలితాలు

 ఏయే ఆసనముల మీద కూర్చుని జపం చేస్తే, ఏయే ఫలితాలు పొందుతారు. అంటే...  1.

1. పులిచర్మం – మోక్ష ప్రదము.

 2. జింకచర్మం – జ్ఞానం కలుగుతుంది.

 3. తెల్లని వస్త్రం – కీర్తి ప్రదము.

 4. కంబళి – దు:ఖమును తొలగించుతుంది. పులి చర్మమును గృహస్థులు వాడుట అంత మంచికాదు. ఇటుకలు, రాళ్ళు, పచ్చికనేల – వీటిని ఆసనాలుగా మలుచుకుని నీటిపై కూర్చుని జపము చెయ్యరాదు.  

పంచవిధ స్నానములు అంటే....?

అయిదు రకాలుగా, వివిధ పద్దతులలో చేసే స్నానాలను పంచవిధ స్నానములు అంటారు. అవేమిటో చూద్దాం. 

1.ఆగ్నేయము –‘‘త్ర్యాయుషం జమదగ్నే’’ అనే మంత్రమును పఠిస్తూ శరీరమంతటా విభూతిని రాసుకోవడంజ

 2. వారుణము – నీటిలో మునిగి చేయడం.

 3. బ్రాహ్మము- ‘‘ అపోహిష్టామయో భువ:’’ మొదలైన మంత్రాలను జపిస్తూ ధర్బలతో జలాన్ని మార్జనము చేసుకోవడం. దీనినే మంత్రస్నానము అని కూడా అంటారు

4. వాయువ్యము – సాయంకాల సమయంలో గోవులు ఇళ్ళకు తిరిగొస్తున్నప్పుడు గాలి వీచిన దిశలో వాటి డెక్కల నుండి లేచిన ధూళి తనపై పడేటట్లు చేసుకోవడం.

 5. దివ్యము – ఎండలో వర్షం కురుస్తున్నపుడు శరీరాన్ని తడుపుకోవడం.   

తిరుమల శ్రీవారి హస్తాలు ఆ విధంగా ఎందుకు ఉంటాయి.?

శ్రీ వెంకటేశ్వరస్వామి హస్తాలలో ఒకటి పాదాలను చూపుతున్నట్లు, మరొకటి మోకాళ్లు తాకుతున్నట్లు ఉంటుంది. 

ఇందులోని అంతరార్ధమేమంటే తన దర్శనార్ధం వచ్చే భక్తులకు తన పాదాలనే శరణ్యంగా భావించమని ఒక చేయి తన పాదాలవైపు చూపుతున్నాడు.

మరొక చేయి క్రిందకు చూపుతూ సంసారము మెకాటి బంటి లోతుగలదని, తనను ఆశ్రయించిన వారిని అందుండి ఉధ్దరిస్తానని సూచిస్తున్నాడు.   

కైలాశము నుండి ఆదిశంకరులు తీసుకువచ్చిన అయిదు లింగములు ఎక్కడున్నాయి. ?

కైలాశము నుండి ఆదిశంకరులు తీసుకువచ్చిన అయిదు లింగములు ఎక్కడున్నాయో చూద్దాం.

 1.భోగలింగము – శృంగేరిలో ఉన్నది

 2. వరలింగము – నేపాల్ లో ఉన్నది

 3. ముక్తిలింగము – కేదారేశ్వరంలో ఉన్నది.

 4.యోగలింగము – కాంచీపురంలో(శ్రీకామకోటి మఠంలో)ఉన్నది.

 5.మోక్షలింగము- చిదంబంలో ఉన్నది. ఆదిశంకరులు కైలాసము నుండి తీసుకువచ్చిన అయిదు లింగములు ఇవే. 

వర్ఝ్యం, రాహుకాలం, దుర్ముహూర్తం అంటే ఏమిటీ ?

నక్షత్ర ప్రమాణమును బట్టి విడువ తగిన కాలమును వర్జ్యం అంటారు. దినప్రమాణమును బట్టి – వారమును బట్టి విడువ తగినకాలమును దుర్మూహుర్తం, రాహూకాలము అంటారు. గ్రంథాలలో దుర్మూహుర్తమును మాత్రమే చెప్పారు. రాహుకాలును గూర్చి చెప్పినట్లుగా లేదు. రాహుకాలమును తమిళులు ఎక్కువగా పాటిస్తూ ఉంటారు. మన ప్రాంతమున వర్జ్యము, దుర్మూహూర్తమును పాటిస్తే సరిపోతుంది.  

దశావతారములు ఏఏ తిథుల్లో ఏఏ సమయాల్లో జరిగినవి ?

దశావతారముల తిథులు, సమయములు వివిధ పురాణాలలోనూ, ధర్మశాస్త్రాల్లోను ఈ విధముగా చెప్పపబడినవి.

1. మత్య్సావతారం : చైత్ర బహుళ పంచమి- ప్రాత:కాలమున

 2. కూర్మావతారం : జ్యేష్ఠ బహుళ ద్వాదాశి- ప్రాత: కాలమున

 3. వరహావతారం : చైత్ర బహుళ త్రయోదశి – మధ్యాహ్నం

 4. నరిసింహావతారం : వైశాఖశుద్ధ చతుర్థశీ – ప్రదోష కాలములో

 5. వామనావతారం : భాద్రపద శుద్ధ ద్వాదాశి – మధ్యాహ్నం కాలం

 6. పరశురామవతారం : మార్గశిర బహుళ విదియ – సాయంకాలం

 7. శ్రీరామావతారం : చైత్రశుద్ధ నవమి – మధ్యాహ్న సమయంలో

 8. శ్రీకృష్ణావతారం : శ్రావణ కృష్ణ అష్ఠమి – అర్థరాత్రి సమయంలో

 9.బుద్ధావతారం : భాద్రపద శుధ్ధ సప్తమి – సాయంకాలము

 10. కల్కి అవతారం : భాద్రపద శుక్ల విదియ – ప్రాత:కాలము  (ఇది భవిష్యత్తులో ఎత్తబోయే దశమావతారం )    

చుండ్రు నివారణకు ఎన్నో మార్గాలెన్నో !

ఏ కాలంలో అయినా ఎల్లపుడూ అందరినీ వేధించే సమస్య తలలో చుండ్రు. వయసుతో సంబంధంలేకుండా పెద్దవారికి, చిన్నవారికి తలలో చుండ్రు రావడం సాధారణం. చుడ్రు రావడానికి కారణాలు అనేకం చుండ్రు వంశపారపర్యంగా కూడా వస్తుది. అధిక ఒత్తిడికి గురయిన తలలో చుండ్రు వస్తుంది. నేటి కాలంలో ప్రతి ఒక్కరు ఏదో ఒక విషయానికి వత్తిడికి గురికావడం సహజం. వత్తడికి గురయిన వారికి చుండ్రు అధికంగా వస్తుంది. అలా ఎక్కువ సమయం ఏసి గదుల్లో గడపడం వల్ల, ఫ్యాన్ కింద కూర్చున్నా తలమీద చర్మం పొడిగా అయిపోయి పొట్టులాలేస్తుంది.

షాంపూతో తలస్నానం చేసినప్పుడు చర్మానికి అంటిన షాంపూ పూర్తిగా వదలకపోయినా కూడా చుండ్రు వచ్చే అవకాశం ఉంది. తలకు రాసుకునే షాంపూలో మినరల్స్, ఐరన్ ఎక్కువైనా చుండ్రు పెరగడానికి అవకాశం ఎక్కువ, కలుషిత వాతావరణంకి కూడా చుండ్రును పెంచుతుంది. ఏ వాతావరణంలో నివసించే వారికైనా చుండ్రు వస్తుంది. కాలాలు మారినప్పుడల్లా వాతావరణంలో వచ్చే మార్పులు కూడా తలలో చుండ్రును పెంచుతాయి. శరీరానికి కావలసిన పౌష్ఠికాహారం తీసుకోకపోయినా, శరీరంలోని హార్మోన్లు సక్రమంగా లేకపోయినా కూడా చుండ్రు వస్తుంది.

దీనివల్ల వచ్చే మానసిక ఆందోళన నుంచి బయటపడాలన్నా, చుండ్రుపోవాలన్నా ఎప్పుడూ మందులపై ఆధారపడకూడదు. ఇంట్లోనే తయారు చేసుకొనే కొన్ని పధార్థాలను ఉపయోగించడం. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ బాధ తగ్గించుకోవచ్చు. మీ తలలోని చుండ్రు వస్తే అంతకు ముందు ఆహారపధార్థాలు ఏం తీసుకున్నారో గమనించండి. తినే ఆహారంలో మార్పు వచ్చినా చుండ్రు వస్తుంది. దాని నివారణకు ఎక్కువ ఆకు కూరలు, పీచు పధార్థాలు, విటమిన్ ఎ ఎక్కువగా వుండే పండ్లు తినాలి.

కాయగూరలు, చేపలను ఆహారంలో తీసుకోవాలి. వేపుడు పధార్థాలు, ఎక్కువగా వేడిగా ఉండే పధార్థాలను తినకూడదు. ప్రోటీన్లు ఎక్కువగా ఉండే పధార్థాలను తినాలి. తలను ఎప్పుడూ కప్పి వుంచకూడదు. తలలో తేమ లేకుండా చూసుకోవాలి. తరచుగా తలకు షాంపూ పెట్టి సరైన కండిషనర్ జాగ్రత్తగా వాడాలి. వాటిని వాడినప్పుడు. తలను శ్రద్దగా శుభ్రపరచాలి. యాయిశ్చరేజింగ్ షాంపూ, హెర్బల్ కండిషనర్ ను వాడితే చర్మం పొడిగా అవదు. ఇతరులు వాడిన దువ్వెన, బ్రష్లను ఉపయోగించకూడదు. వాటివల్ల ఇతరుల తలలో ఉండే చుండ్రు మీకు వచ్చే ప్రమాదం ఉంది. అలాగే మీరు చుండ్రుతో బాధపడుతుంటే జుట్టు దువ్వుకున్నాక వెంటనే దువ్వెన బ్రష్ను శుభ్రపరచండి. ఆరు చెంచాల నీళ్ళల్లో రెండు చెంచాలు వెనిగర్ కలపాలి. షాంపూతో తలస్నానం చేశాక. వెనిగర్ నీళ్ళను తలకు పట్టించాలి. ఇలావారానికి ఒకసారి చొప్పున కనీసం మూడునెలలు చేస్తే చుండ్రు తగ్గుతుంది.   

‘‘గురువు’’ అనే మాట ఎలా పుట్టింది ?

 ‘‘ గురువు’’ అనే పదానికి మన సంస్కృతిలో ఒక విశిష్టమైన స్థానం ఉంది. ఛందస్సులో ప్రత్యేక లక్షణాలున్న, కొన్ని అక్షరాల్ని గురువులంటారు. ‘‘ గురువు’’ అనే మాట అలా పుట్టింది. ‘‘ గురువు ’’ అంటే ‘ సన్మార్గాన్ని బోధించేవాడు, ‘‘ ఉపాధ్యాయుడు’’ అనే అర్థాలున్నాయి.

 అజ్ఞానము అనెడి అంధకారమును తొలగించువాడు గురువు. గుకారస్తవంధ కార: స్యాత్ దుశబ్దసన్తిరోరక:! అంధకార నిరోధాత్వాత్ గురు రిత్యభిదీయతే!!   

పరశురాముడు

పూర్వం కన్యాకుబ్జం అనే నగరాన్ని గాధిరాజు పాలించేవాడు. అతని కుమార్తె సత్యవతి. ఆమెను బృగుమహర్షి కొడుకు ఋచీకుడు వివాహమాడాలని అనుకున్నాడు. అతడు గాధిరాజు వద్దకు వచ్చి సత్యవతిని ఇమ్మని అడిగాడు. అందుకు గాధిరాజు "మహాత్మా! ఒక చెవి నల్లగా మిగిలిన శరీరం తెల్లగా ఉండే వేయి గుర్రాలను కానుకగా ఇచ్చి నా కూతురిని వివాహం చేసుకో " అని అన్నాడు. ఋచీకుడు అలాగేఅని చెప్పాడు. అతడు వరుణిని ప్రాంర్ధించాడు. అప్పుడు గంగా నది నుండి వేయి గుర్రాలు ఋచీకుడు కోరిన విధంగా పుట్టాయి. అప్పటి నుండి గంగా నదికి అశ్వతీర్ధం అనే పేరు వచ్చింది. ఆ గుర్రాలను కానుకగా ఇచ్చి ఋచీకుడు గాధి కూతురిని వివాహమాడాడు. ఒక సారి బృగు మహర్షి వారి ఇంటికి వచ్చి కొడుకు కోడలిని దీవించాడు.

కోడలిని వరం కోరుకొమ్మని అడిగాడు. ఆమె మామగారిని చూచి నాకు ఒక కుమారుడు అలాగే నా తల్లికి ఒక కుమారుని ప్రసాదించండి అని కోరింది. అలాగే అని భృగువు "మీరిరువురు స్నానం చేసి నీవు మేడి చెట్టును మీ తల్లి అశ్వత్థ వృక్షాన్ని కౌగలించుకోడి మీ కోరిక నెరవేరుతుంది " అన్నాడు. సత్యవతి, ఆమె తల్లి స్నానం చేసి ఆమె అశ్వత్థవృక్షాన్ని, ఆమె తల్లి మేడి వృక్షాన్ని పొరపాటున కౌగలించుకున్నారు. ఆ విషయం తెలిసిన భృగువు కోడలితో " అమ్మా! నీకు బ్రహ్మకుల పూజ్యుడైన కుమారుడు జన్మిస్తాడు. కాని అతడు దారుణమైన క్షాత్రధర్మాన్ని అవలంబిస్తాడు. నీ తల్లికి ఒక క్షత్రియ కుమారుడు జన్మిస్తాడు. కాని అతడు మహా తపశ్శాలి, బ్రహ్మజ్ఞాని ఔతాడు " అన్నాడు. అప్పుడు సత్యవతి దారుణమైన క్షాత్రధర్మం తన కుమారునికి లేకుండా తన మనుమడికి రావాలని కోరింది.

భృగువు అలాగే జరుగుతుందని చెప్పి వెళ్ళాడు. సత్యవతి గర్భం ధరించి జమదగ్ని అనే కుమారుని కన్నది. ఆ జమదగ్ని ప్రసేన జితుడు అనే రాజు కుమార్తె రేణుకను వివాహమాడాడు. వారికి ఋమణ్వంతుడు, సుషేణుడు, వసుడు, విశ్వావసుడు, రాముడు అనే కుమారులు కలిగారు ఒకరోజు జాదగ్ని భార్య రేణుక నీటికోసం ఒక సరస్సుకు వెళ్ళింది. ఆసమయంలో చిత్రరధుడు అనే రాజు తన రాణులతో జలకాలాడటం చూసింది. ఆ రాజును చూచి రేణుకకు మోహం కలిగింది. రేణుక మనసు చలించడం గ్రహించిన జమదగ్ని ఆగ్రహించి వరసగా తన కుమారులను పిలిచి ఆమెను వధించమని ఆజ్ఞాపించాడు. వారు తల్లిని చంపుట మహాపాపమని నిరాకరించారు. జ్ఞమదగ్ని ఆగ్రహించి వారిని అడవిలో మృగప్రాయులుగా తిరగమని శపించాడు.

ఆఖరిగా రాముని పిలిచి రేణుకను వధించమని చెప్పాడు.అతడు ఎదురు చెప్పక తన చేతిలోని గొడ్డలితో తల్లి తల నరికాడు. జమద్గ్ని సంతోషించి "నా మాట మన్నించి నందుకు నీకేమి వరం కావాలి ? కోరుకో " అన్నాడు. రాముడు "తండ్రీ !ముందు నా తల్లిని బ్రతికించండి.తరవాత నా అన్నలను శాపవిముక్తులను చేయండి. నాకు దీర్గాయువు, అమితమైన బలం ప్రసాదించండి. సదా శత్రుజయం ప్రసాదించండి " అని కోరాడు. జమదగ్ని అతనుకోరిన వరాలన్నీ ఇచ్చాడు. ఒకరోజు సహస్రబాహువులు కలిగిన కార్తవీర్యార్జునుడు వేటాడుతూ అలసిపోయి జమదగ్ని ఆశ్రమానికి వచ్చాడు. జమదగ్ని అతనికి తగిన అతిధి సత్కారాలు చేసాడు. కార్తవీర్యుడు రాజగర్వంతో జమదగ్నిని ఇతర మునులను అవమానించాడు.

పోతూ పోతూ ఆశ్రమంలోని హోమధేనువును దూడను తీసుకు వెళ్ళాడు. రాముడు ఆసమయంలో ఆశ్రమంలో లేడు. రాముడు రాగానే జరిగినదంతా తండ్రి ద్వారా తెలుసుకున్నాడు. రాముడు ఆగ్రహించి కార్తవీర్యునితో యుద్ధం చేసి అతనిని వధించాడు. కార్తవీర్యుని కొడుకులు రాముడి పై పగపట్టారు. కానీ అతనిని ఏమి చెయ్యలేమని గ్రహించి రాముడు ఆశ్రమంలో లేని సమయం చూసి జమదగ్నిని చంపి మునులను నిందించి ఆశ్రమాన్ని ధ్వంశం చేసి వెళ్ళారు. రాముడు ఆశ్రమానికి రాగానే తండ్రి మరణ వార్త విని కృద్ధుడై "అనఘుడు, వీతరాగుడు, కరుణాతరంగుడు అయిన నా తండ్రిని బుద్ధి పూర్వకంగా చంపారు కనుక నేను దుర్జనులైన క్షత్రియులను అందరిని చంపుతాను " అని ప్రతిజ్ఞ చేసాడు. ఇలా భూలోకంలోని క్షత్రియులందరిని సంహరించి ఆ భూమిని కశ్యపునకు దానం ఇచ్చాడు. ఆ తరువాత విరాగియై మహేంద్రగిరిపై తపస్సు చేసుకుంటున్నాడు.  

గోవును పూజించడం దేనికి...?

హిందూ సంప్రదాయంలో గోవును పూజించడం ఓ ఆచారం. దీన్నే గోపూజ అంటారు. దీనికి మన పురాణాల్లో ఎంతో విశిష్ట ఉంది. గోక్షీరం (ఆవుపాలు)లో చతుస్సముద్రాలుంటాయని ఈ పురాణాలు చెపుతున్నాయి. సర్వాంగాలలో సమస్త భువనాలు దాగి ఉంటాయంటాయని వేద పండితులు చెపుతుంటారు. గోవులో వివిధ భాగాల్లో దాగివున్న వివిధ రకాల దేవదేవతల వివరాలను ఓ సారిచూస్తే... గోవు నుదురు, కొమ్ముల భాగంలో శివుడు కొలువుదీరి ఉంటాడట. అందువల్ల కొమ్ములపై చల్లిన నీటిని సేవిస్తే... త్రివేణి సంగమంలోని నీటిని శిరస్సు పై చల్లుకున్నంత ఫలితం లభిస్తుందని పురాణాలు చెపుతున్నాయి.

అంతేకాకుండా, శివ అష్టోత్తరం, సహస్రనామాలు పఠిస్తూ... బిళ్వ దళాలతో పూజిస్తే... సాక్ష్యాత్ కాశీ విశ్వేశ్వరుడిని పూజించిన ఫలితం దక్కుతుందని వేద పండితులు చెపుతుంటారు. అలాగే, గోవు నాసిక భాగంలో సుబ్రహ్మణ్యస్వామి ఉండటం వల్ల నాసికను పూజిస్తే... సంతాన నష్టం ఉండదని, ఆవు చెవివద్ద అశ్వినీ దేవతలు కొలువై ఉంటారని వారు చెపుతారు. అందువల్ల చెవిని పూజిస్తే... సమస్త రోగాల నుంచి విముక్తి కలుగుతుందట. ఆవు కన్నుల దగ్గర సూర్య, చంద్రులు ఉంటారనీ, వాటిని పూజించడం వల్ల అజ్ఞానమనే చీకటి నశించి జ్ఞానకాంతి, సకల సంపదలు కలుగుతాయని చెపుతున్నారు.

ఆవు నాలికపై వరుణ దేవుడు ఉండటం వల్ల అక్కడ పూజిస్తే శీఘ్ర సంతతి కలుగుతుందని చెపుతున్నారు. అదేవిధంగా ఆవు సంకరంలో ఉన్న సరస్వతీదేవిని పూజిస్తే... విద్యాప్రాప్తి. ఆవు చెక్కిళ్ళలో కుడి వైపున యముడు, ఎడమవైపున ధర్మదేవతలు ఉంటారని ప్రఘాడ విశ్వాసం. కనుక వాటిని పూజిస్తే... యమబాధలుండవని, పుణ్యలోక ప్రాప్తి కలుగుతుందని చెపుతారు. ఆవు పెదవుల్లో ప్రాతఃసంధ్యాది దేవతలుంటారట. వాటిని పూజిస్తే... పాపాలు నశిస్తాయని పండితుల అభిప్రాయం. అలాగే, ఆవు కంఠంలో ఇంద్రుడు ఉంటాడని, అందువల్ల దాన్ని పూజిస్తే ఇంద్రియ పాఠవాలు, సంతానం కలుగుతుందట.

ఆవు పొదుగులో నాలుగు పురుషార్థాలు ఉంటాయి. కనుక ఆ చోట పూజిస్తే... ధర్మార్థ, కామమోక్షాలు కలుగుతాయని చెపుతున్నారు. ఆవు గిట్టల చివర నాగదేవతలు ఉంటారట. వాటిని పూజిస్తే... నాగలోక ప్రాప్తి లభిస్తుందని చెపుతున్నారు. వాటితో పాటు.. భూమిపై నాగుపాముల భయం ఉండదట. ఆవు గిట్టల్లో గంధర్వులుంటారు. కనుక గిట్టలను పూజిస్తే... గంధర్వలోక ప్రాప్తి. గిట్టల ప్రక్కన అప్సరసలుంటారు. ఆ భాగాన్ని పూజిస్తే... సఖ్యత, సౌందర్యం లభిస్తుందట. అందువల్ల గోమాతను సకల దేవతా స్వరూపంగా భావించి పూజిస్తుంటారు.  

భక్తి మార్గాన్ని పొందాలంటే ఏ చేయాలి...?

 1. పరమేశ్వరుడే యావత్ ప్రపంచానికి ప్రభువు, అణువణువునా వ్యాపించినా అనంతుడు ఈశ్వరుడే, మనిషి-పశువు అనే భేదం లేకుండా ఈ చరాచర ప్రపంచమంతా ఆ మహా పవిత్రుడైన ఈశ్వర అద్భుతాలతో నిండి ఉంది.

 2. సంపూర్ణుడైన పరమేశ్వరుడు సృష్టించిన ఈ జగత్తులో సుఖము, సౌందర్యమే నిండి ఉంది. ఈ విశ్వాసాన్ని మనస్సు అనుసరించినప్పుడు ప్రపంచం అతి సుందరంగా కనబడుతుంది.

 3. భగవంతుడు ఏది అందిస్తే దానితో తృప్తి చెంది భగవంతుడికి ఎల్లవేళలా కృతజ్ఞులుగా మెలగాలి. కష్టాలు, దుఃఖాలుగా భావించేదేది నిజమైన కష్టాలు కావు. అవన్నీ మన మనస్సుని ఉన్నత స్థాయిలో ఉంచడానికే అనే సత్యాన్ని గ్రహించాలి.

4. మనస్సును బాధపెట్టడంకంటే మించిన పాపం లేదు. ఇతరుల ప్రసన్నతను, సంతోషాన్ని సహించి పంచుకోవడమే పరమధర్మం.

5. నేను, నాది అనే అహం విడచి ఈ సమస్తం భగవంతుడిదే అనే భావాన్ని పరిపూర్ణంగా పొందేందుకు సద్గురువును ఆశ్రయించాలి. తత్ఫలితంగా భగవంతునిలో ఐక్యమయ్యే ఆదర్శ సూత్రాలు అలవడుతాయి. 

‘‘ ఏకాదశీ వ్రతం’’ ఎలా చేయాలి

ఏకాదశీ రోజున వేయి కనులతో వీక్షించి, సేవించి, తరి౦చాలని పండితులు చెబుతున్నారు. ముక్కోటి దేవతలు వైకుంఠమునకు చేరుకొనే శుభపర్వ దినం వైకుంఠ ఏకాదశి. దీనినే ‘ముక్కోటిఏకాదశి’ పేరుతో వైష్ణవాలయాల్లో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ముక్కోటి ఏకాదశి నాడు అన్ని వైష్ణవాలయాల్లో ఉత్తరంవైపు ఉండే వైకుంఠ ద్వారాన్ని తెరుస్తారు. ఈ ద్వారం ద్వార స్వామిని దర్శించుకోవడం పుణ్యప్రదం.

శ్రీమహావిష్ణువుతో బాటు ముక్కోటి దేవతలు ఈ రోజున భువికి దిగివస్తారని శాస్త్రవచనం. దక్షియణాయానంలో దివంగతులైన పుణ్యాత్ములు ఈ రోజున వైకుంఠ ద్వార౦ ద్వారా స్వర్గానికి చేరుకుంటారు. ఈ రోజు ఏకాదశి వ్రతం చేసి, విష్ణువుని పూజించి, ఉపవాసం, జాగరణ పాటించడ౦ వల్ల పుణ్యఫలితాలు లభిస్తాయి. ఏకాదశి ఉపవాస తిథి విష్ణు స్వరూపమైనది.

ఈ వైకుంఠ ఏకాదశీనే ‘పుత్రద ఏకాదశి’ అని అంటారు. ఏకాదశి రోజున ఉపవాసం ఉండాలి. దశమి రాత్రి కూడా భుజించకూడదు. ద్వాదశినాడు ద్వాదశి ఘడియలు వెళ్ళాక ముందే పారణం (భోజనం) చేయాలి. దేవతలకు ఆరునెలలు పగలు, ఆరునెలలు రాత్రి. దక్షిణాయానం రాత్రికాలం. ఈ చీకటి తొలగి దేవతలు వెలుగులోకి వస్తారు. అంటే వారికి పగలు ప్రారంభమైనట్టు.   

శనివార ప్రియుడు శ్రీ ఆంజనేయుడు

హనుమంతుడు శనివారం నాడు జన్మించినందున ఆ రోజు హనుమద్భక్తులు ఆయనను విశేషంగా పూజిస్తారు. పురాణ ఇతిహాసాలు కూడా హనుమంతుని కొలవడానికి శనివారం ప్రశస్తమైనదని పేర్కొన్నాయి. ఈ కారణంగా ఈ దేవస్థానం ప్రతి శనివారం ప్రాతఃకాలం మూడున్నర గంటల నుంచి అర్థరాత్రి దాటాక ఒంటిగంట వరకూ మూయకుండా భక్తులకోసం తెరచి ఉంచుతారు.

అలాగే మంగళవారంనాడు సైతం ప్రాతఃకాలం గం. 3-30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ తెరచి ఉంచుతారు. తిరిగి సాయంత్రం 4 గంటలనుంచి రాత్రి 9.00 గంటల వరకూ తెరచి ఉంచుతారు. మిగిలిన రోజులలో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 11.30 గంట వరకూ, తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకూ భక్తులకోసం తెరచి ఉంచుతారు   

ప్రాత:కాలంలో భూదేవతకు నమస్కరించాలి ఎందుకు

 భారతీయ శిష్టాచారం ప్రకారం మనకు ఉపకరించే వాటిపై సదా కృతజ్ఞతాభావం కలిగి ఉండమే ముఖ్యమైన మానవగుణం. అందుకే సందర్బానుసారముగా అప్పుడప్పుడు జడ వస్తువలైన డోలు, రోకలి, తిరుగలి, పొయ్యి, బావి వంటి వాటికి కూడా పూజలు చేస్తుంటారు.

 వీటికే చేసినపుడు మన పోషణకు అవసరమైన పండ్లు, ఆహారం,నీరు సర్వం భూమి నుండే లభిస్తున్నపుడు మనందరినీ మోస్తున్న తల్లులకు తల్లి అయిన భూమాతకు ప్రాత:కాలంలో నమస్కరించవద్దా ? తప్పక నమస్కరించి మన కృతజ్ఞతను తెలియజెప్పాలి.  

స్త్రీల పుణ్యం ఎలా కరిగిపోతుంది...?

వ్రతాల ద్వారా, పుణ్యాల ద్వారా, పతి సేవల ద్వారా, దానాల ద్వారా, ధర్మాకార్యాల ద్వారా, ఇంకా భర్త చేసిన పుణ్యాల వల్లా స్త్రీలకు పుణ్యం కలుగుతుంది. ఆ పుణ్యం వల్లా, భర్తవల్లా, బిడ్డల వల్లా సుఖాలు కలుగుతాయి. ఎన్ని సత్ కార్యాలు చేసినా సుఖము లేదంటే పుణ్యం ఎప్పటికప్పుడు కరిగిపోతుందని అర్థం. దానికి కారణము రజోగుణము అనగా ఆగ్రహం. కోపము వల్ల ఎంత పుణ్యము ఆర్జించినా పుణ్యఫలమంతా తరిగిపోతుంది. 

దు:ఖాలకూ, బాధలకూ కారణమవుతుంది. ఆ కోపం వల్లే విశ్వామిత్రుడు తన పుణ్యాన్ని మొత్తం అనేక వృధా కార్యాలకి వశిష్టుడు వంటి ఎందరో శాంతమూర్తులపై వినియోగించాల్సి వచ్చింది. ఆవేశం అన్ని వేళలా తగడు. ఆవేశంతో పాటు అబద్దం... అసత్యవాక్కు ఎంతో పుణ్యాన్ని హరించి వేస్తుంది. అసత్యవాక్కు కంటే అబద్దాన్ని చెప్పించటం ద్వారా మొత్తం పుణ్యమే కరిగిపోతుంది. భర్తకు చెప్పే అబద్దం ద్వారా చెయ్యబోయే పుణ్య కార్యాల పుణ్యం కూడా హరించుకుపోతుంది.

విఘ్నేశ్వరుని ప్రసాదం తిన్న తర్వాత ఏం చెయ్యాలి ?

ఒక్క వినాయకుణ్ణి మాత్రమే వేద మార్గం ద్వారా, అపరిశుభ్రంగా పిశాచగణపతి రూపంలోనే ఆరాధిస్తారు. మొదట ధర్మమైన పూజా విషయానికొస్తే వినాయకుని ప్రసాదం తిన్న తర్వాత ఆ నోటితోనే విష్ణుమంత్ర జపం చేస్తే అనంతమైన పుణ్యం, అలాగే ప్రసాదం తిన్న తర్వాత నోరుకడుక్కోకుండా ఏదైనా తిని ఆపై మీ అలవాట్లును కొనసాగించాలి.  

ఎంత పాపాత్ముడైనా మరణించే సమయంలో ‘ హరి నామస్మరణ’ చేస్తే స్వర్గానికి వెళ్తారా? నిజమా?

ఎన్నో పాపాలను చేసినవాడు తన ఆఖరి సమయంలో ‘‘ హరినామస్మరణ’’ చేస్తాడా ? చేసినా అతడు స్వర్గానికెళా వెళ్తాడు ? అనే ప్రశ్నలకు సమాధానం- ‘‘ అప్పటి వరకూ పాపాలు చేస్తున్నవాడు తన అంతిమ సమయంలో ‘‘ హరి నామస్మరణ’’ చేయలేడు.

ఒక వేళ చేశాడు అంటే అతనిలోని ‘‘ పశ్చాత్తాపమే’’ అందుకు కారణం. తాను చేసిన తప్పులకి, పాపాలకి పశ్ఛాత్తాపం చెందాడు అంటే అతను దేవుని అనుగ్రహానికి దగ్గరవుతున్నాడు అనే అర్థం. పశ్ఛాత్తాపానికి మించినదేదీ లేదు.

దీనికి తోడు అతడి అంతిమ సమయంలో ‘‘ హరినామస్మరణ’’ చేయడం వలన అతడు ఖచ్చితముగా ఏ సందేహమూ లేకుండా స్వర్గానికే వెళ్తాడు. ఇది ముమ్మాటికీ నిజం.   

హనుమంతునికి సింధూరం అంటే ఇష్టమా ?

హనుమంతునికి సింధూరం అంటే చాలా ఇష్టం. హనుమంతుడు సింధూరాన్ని అంతగా ఇష్టపడటానికి ఒక కారణం ఉంది. ఒకసారి సీతాదేవి తన నుదటి పై సింధూరం పెట్టుకోవడం చూసిన హనుమ ‘‘ సీతమ్మ తల్లీ! సింధూరం ఎందుకు పెట్టుకున్నావు ? అని అడిగాడంట,

అపుడు సీతమ్మ సమాధానంగా ‘‘ హనుమా ! ఇలా సింధూరంతో అలంకరించుకుంటే మీ స్వామివారి ఆయుష్షు మరింత పెరుగుతుంది.’’ అని చెప్పిందట. అప్పటికపుడు హనుమంతుడు తన ఒళ్లంతా సింధూరాన్ని పూసుకుని రాముడి దగ్గరికు ఆనందంగా గంతులు వేసుకుంటూ వెళ్ళగా, శ్రీరాముడు జరిగిన విషయమంతా తెలుసుకుని,

తనపై హనుమంతునికి గల భక్తికి సంతోషించి ‘‘ ఇక నుండి నీకు సింధూరం సమర్పించి ఎవరైతే పూజిస్తారో, అటువంటి వారి అన్ని కోరికలనూ తీరుస్తాను’’ అని శ్రీరాముడు వరమిచ్చాడట. కనుక హనుమంతునికి ప్రీతికరమైన మంగళవారం నాడు ఆయనకి సింధూరం అలంకరించి పూజించినట్లయితే కోరిన కోరికలన్నీ తీరుతాయి. 

రుద్రాక్ష పుట్టుక – దాని మహిమ

రుద్రాక్ష పుట్టుకకు సంబందించి ఒక గాధ ఉంది. శివుడు దేవతలను రక్షించుటకు త్రిపురాసురుని సంహారార్థం ‘‘ మహాస్త్రము’’ ను రూపొందించి చేపట్టుటకై కొన్ని వేల సంవత్సరములు ‘ దేవత ధ్యానము’ చేయుట జరిగింది.

 తరువాత శివుడు ఆ ధ్యానాన్ని విరమంచి ‘‘ మహాస్త్రము’’ ను చేపట్టటకు కళ్లు తెరవగా శివుని కళ్ల నుండి నీటిబిందువులు రాలి భూమి పై పడి, అవియే అంకురించి ‘‘ రుధ్రాక్ష’’ చెట్లుగా రూపాంతరం చెందినవి. ఇవి రుద్రుని (శివుని) అక్షముల (కళ్ల) నుండి రాలి మొలకెత్తినవి కనుక వీటిని ‘‘ రుద్రాక్ష’’ అనే పేరు వచ్చినది.

 ఎవరైతే రుద్రాక్షలను పవిత్రంగా భావించి శాస్త్రనుసారంగా ధరించుట, స్మరించుట, పూజించుట, దర్శించుట, స్పృశించుట చేస్తారో అటువంటి వారి సర్వపాపములు నశించును. అటువంటి వారు సంపూర్ణమైన ఆరోగ్యమును పొందుతారు.

శ్రీరాముని అత్తగారు ఎవరు ?

శ్రీరాముని అత్తగారు ‘‘ ధన్య’’ ఈమె ధక్షుడి కూతురైన స్వధకు కూతురు. అంటే దక్షుని మనవరాలు. ఒకానొక సందర్భంలో విష్ణువు యెక్క సందర్శనార్ధం సనత్కుమారలు వెళ్లగా వారిని చూసి కూడా ఆమె లేచి నిలబడలేదు.

 ఈమెకు ఇంత అహంకారమా అని సనత్కుమారు ‘ మానవస్త్రీ’ గా జన్మించమని శపించారు. ఆమె వారిని వేడుకోగా ‘‘జనకుడి భార్యనైన నీకు సీత కూతురైనప్పడు నీకు శాప విమోచన జరుగుతుందని’’ సనత్కుమారులు ఆమెకు శాపవిమోచనం గురించి తెలియజేస్తారు. ఆమెయే శ్రీరాముని అత్త.   

గణపతి పూజకి తులసిని ఎందుకు నిషేధించారు.?

తులసిని గణపతి పూజకు నిషేధించడానికి ఒక కారణం ఉంది. అదీ... తులసీ విష్ణుమూర్తిని భర్తగా పొందాలనే కోరికతో బ్రహ్మకై తపస్సు చేస్తుంది. ఈ తపస్సుకి మెచ్చిన బ్రహ్మ ‘‘ విష్ణువును నీవు కోరినట్లే భర్తగా పొందగలవు, అతడే నిన్ను వెతుక్కుంటే నీ దగ్గరకు వస్తాడు’’ అని చెబుతాడు.

 అప్పటి నుండి విష్ణువు రాకకై బదరికా వనంలో తులసి తపిస్తుండగా ఒకనాడు అత్యంత తేజశ్శక్తివంతుడైన వినాయకుడు ఆ బదరికావనంలోకి రావడం జరిగింది. మోహావేశంతో ఉన్న తులసి, అతడే తన మనోవల్లభుడైన విష్ణువు అని భ్రమించి తనను వివాహమాడమని వినాయకుని వెంట పడింది.

వినాయకుడు తులసిని ఎంతగా వారించినా ఆమె వినిపించుకోకపోయేటప్పటికి కోపావేశంతో ‘‘ తులసీ ! మోహంధకారంలో కన్ను మిన్ను కానక ప్రవర్తించిన నీవు ఇక నుండి నా పూజకు అనర్హురాలివి. నా పూజకు నిన్ను నిషేధిస్తున్నాను.’’ అని శాపం ఇచ్చాడు.

 వినాయకుడు శపించగానే తులసికి కమ్మిన మాయ, మోహవేశాలు తొలగిపోయాయి. తులసి ఎంతగానో చింతించి, శాపవిముక్తిని ప్రసాధించమని వినాయకుణ్ణి వేడుకొంది. తలుసి ప్రార్థనతో ప్రసన్నుడైన వినాయకుడు  ‘‘ తల్లీ ! తులసీ ! ఏమి జరిగినా దాని వెనుకాల ఏదో ఒక కారణం తప్పక ఉండి తీరుతుంది. నీవు నాకు మాతృసమానురాలవు. విష్ణుప్రియవు తల్లి పుత్రుణ్ణి పూజించుట తగదు’’ అని వినాయకుడు తులసీక తెలియజెప్పాడు.

 ఈ కారణం వలన వినాయకుని పూజకు తులసిని నిషేధించారు. తెలిసిగాని, తెలియకగాని తులసితో వినాయకుని పూజించకూడదు. అలా చేసినట్లైతే అది మహాపాపమే అవుతుంది. ఒక వినాయక చవితి రోజున మాత్రమే పూజించవచ్చును.  

లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలంటే ?

 ప్రధాన ద్వారం తెరిచి, మిగతా తలుపులన్నీ ఆపై లైట్లు వేయాలి. లక్ష్మీదేవి వచ్చిన గుమ్మం నుంచే వెళ్ళాలనే నియమం లేదు. గృహస్థులే కాదు గృహము కూడు శుచీ, శుభ్రతతో ఉంచాలి. ముంగిట్లో కూడా లక్ష్మీ కళ కనపడాలి. అప్పుడే లక్ష్మీదేవి ముంగిట్లోంచి ప్రధాన ద్వారం గుండా ఇంట్లోకి ప్రవేశింస్తుంది.

 గుమ్మం వద్ద అటూ, ఇటూ చెప్పులు లక్ష్మీదేవి వెనక్కి మరల్చే శక్తులు. గుమ్మం లక్ష్మీ పీఠం కాలితో తొక్కి లోనికి, బైటికి వచ్చి వెళ్తుండకూడదు. ఎవరైనా డబ్బులస్తే వేళ్ళను నోటితో తడిచేసుకొని లెక్కింపవద్దు అలా చేస్తే దోషం.    

సంపదలు ఎలా సమకూరతాయి ?

ప్రపంచంలో దాదాపుగా ప్రతి ఒక్కరికీ ధనం మీద ఆశ ఉంటుంది. ధనం సంపాదించాలని ప్రయత్నిస్తుంటారు. అయితే ధనం మనిషి వద్దకు  కొబ్బరికాయలో కొబ్బరి నీరు చేరినట్టు చేరుతుంది. అదే సిరి పోవాలన్న యోగముంటే (అలాంటి యోగము కలగటానికి మీరే కారణము) ఏనుగు మింగిన వెలగపండులోని గుజ్జు ఏ విధంగా మాయమౌతుందో అలా మీ ధనం పోతుంది. ఆ తర్వాత ఎంత తల బద్దలు కొట్టుకున్నా గుజ్జు అనే సంపద తిరిగి మీకు అందదు. 

రుద్రాక్ష ధారణలో నియమాలు

శివునికి అత్యంత ప్రీతిపాత్రమైనవి రుద్రాక్ష మాలలు. సర్వవేళల్లోనూ రుద్రాక్షమాలను మెడలో ధరించవచ్చు. రుద్రాక్ష ధారణకు సమయ నియమమేమీ లేదు. అయితే సంభోగ సమయంలోనూ, కాలకృత్యముల సమయంలోనూ రుద్రాక్షలు ధరించకపోవుట మంచిది. 

భగవద్గీత... శ్రీ మహావిష్టువు - శ్రీకృష్ణావతరం

రాక్షసుల ఆగడాలను భరించలేక దేవతలు, మహర్షులు పాలకడలిలో పవళించియున్న శ్రీమహావిష్ణువుకు మొరపెట్టుకున్నారు. వారి బాధలను ఆలకించిన ద్వాపరయుగంలో భూమిపై అవతరిస్తానని వారికి అభయమిస్తాడు లక్ష్మీవల్లభుడు. అనంతరం కంసుని చెరలో ఉన్న దేవకీ వసుదేవులకు చెరసాలలో శ్రావణమాసంలో అష్టమినాడు శిష్టుల రక్షించేందుకు శ్రీకృష్ణునిగా జన్మిస్తాడు శ్రీమహావిష్ణువు.

శ్రీకృష్ణుని కంసుని నుంచి కాపాడే నిమిత్తం వసుదేవుడు బాలకృష్ణుని యశోద దగ్గరుకు చేరుస్తాడు. గోకులంలో సోదరుడు బలరామునితో కలిసి పూతన తదితర రాక్షసులను తుదముట్టిస్తాడు యదునందనుడు. అనంతర కాలంలో శ్రీకృష్ణుని లీలలకు గోకులం పరవశించిపోతుంది. కృష్ణుని జన్మవృత్తాంతాన్ని తెలుసుకుని అతనిని తుదముట్టించేందుకు గాను కంసుడు శ్రీకృష్ణుని తన రాజస్థానానికి పిలిపించుకున్న కంసుని సంహరించి ఉగ్రసేనునికి మధురను అప్పగిస్తారు బలరామకృష్ణులు.

మధురలో గార్గముని వద్ద గాయత్రీ మంత్రాన్ని ఉపాసించి న అనంతరం విద్యాభ్యాసానికై సాందీపుని ఆశ్రమానికి బలరామకృష్ణులు చేరుకుంటారు. యుక్తవయస్సు వచ్చిన తరువాత బలరాముడు రేవతిని వివాహమాడగా, రుక్మిణి, సత్యభామలతో పాటుగా పలువురు రాజకుమార్తెలను శ్రీకృష్ణుడు వివాహమాడుతాడు. తనకు అత్యంత ఆప్తులైన పాండవులను ఆదుకుంటూ వారి పట్ల మానురాగాలను గోపాలుడు చాటుకుంటాడు. అంతేకాక శకుని మాయాజూదంలో సర్వం కోల్పోయి అడవులు పాలైన పాండవులకు అడుగడుగునా అండగా నిలిచి వారి అజ్ఞాతవాసానికి ఆటంకాలు లేకుండా కాపు కాస్తాడు.

దాయాదులైన కౌరవ, పాండవుల మధ్య యుద్ధం అనివార్యమౌతుంది. కురుక్షేత్ర మహాసంగ్రామంలో బంధువులపై అస్త్రశస్త్రాలు సంధించడానికి విముఖత వ్యక్తం చేసి వైరాగ్యభావనకు లోనవుతాడు అర్జునుడు. రధసారధి అయిన పాండురంగడు రణక్షేత్రంలో ధర్మక్షేత్రానికి నాంది పలుకుతూ అర్జునునికి భగవద్గీతను బోధిస్తాడు మురారి. కలియుగానికి శ్రీకారం చుడుతూ బోయవాని బాణం పాదాన్ని తాకడంతో అవతారాన్ని ముగిస్తాడు శేషతల్పసాయి.  

శివ పంచాక్షరీ స్తోత్రముతో పరమేశ్వరుణ్ణి ఎలా స్తుతించాలి ?

శివ పంచాక్షరీ స్తోత్రము నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమశ్శివాయ ...

1 మందాకినీ సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమథ నాథ మహేశ్వరాయ మందార పుష్ప బహు పుష్ప సుపూజితాయ తస్మై మకారాయ నమశ్శివాయ ...

 2 శివాయ గౌరీ వదనారవింద-సూర్యాయ దక్షాధ్వర నాశకాయ శ్రీ నీల కంఠాయ వృషధ్వజాయ తస్మై శికారాయ నమశ్శివాయ ...

3 వశిష్ఠ కుంభోద్భవ గౌతమాది మునీంద్ర దేవార్చిత శేఖరాయ చంద్రార్క వైశ్వానర-లోచనాయ తస్మై వకారాయ నమశ్శివాయ ...

 4 యజ్ఞ స్వరూపాయ జటాధరాయ పినాక హస్తాయ సనాతనాయ దివ్యాయ దేవాయ దిగంబరాయ తస్మై యకారాయ నమశ్శివాయ ...

 5 ఫలశృతి పంచాక్షర-మిదం పుణ్యం యః పఠేత్ శివ సన్నిధౌ శివలోక-మవాప్నోతి శివేన సహ మోదతే 

శనివారం రోజు గరుడ భగవానుడ్ని దర్శించుకుంటే

శనివారం పూట గరుడ భగవానుడు దర్శనమిస్తే పుణ్య ఫలితాలు చేకూరుతాయి. పక్షుల్లో రాజుగా విరాజిల్లుతున్న గరుడుడిని శనివారం నాడు లేదా ఏ పూటైనా వీక్షించడం ద్వారా శుభ ఫలితాలుంటాయని పురోహితులు చెబుతున్నారు. అవతారపురుషుడు, మోక్షాన్ని ప్రసాదించే విష్ణుమూర్తికి వాహనుడైన గరుడభగవానుడిని దర్శించుకోవడం ద్వారా సుఖసంతోషాలు చేకూరుతాయని విశ్వాసం.

శనివారం మాత్రమే గాకుండా.. ఆదివారం రోజున గరుడ పక్షిని దర్శించుకుంటే వ్యాధులు తొలగిపోతాయి. ఇంకా సోమ, మంగళ వారాల్లో గరుడభగవానుడి దర్శనం లభిస్తే ముఖ సౌందర్యం పెంపొందడంతో పాటు మానసిక ఆందోళనలు తొలగిపోతాయని పురోహితులు చెబుతున్నారు. బుధ, గురువారాల్లో గరుడ భగవానుడిని దర్శించుకుంటే దుష్టశక్తుల ప్రభావం నుంచి విముక్తి లభిస్తుంది. అలాగే శుక్ర మరియు శనివారాల్లో గరుడ భగవానుడిని దర్శించుకుంటే దీర్ఘాయుష్షు చేకూరడంతో పాటు అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పురోహితులు సూచిస్తున్నారు.

గరుడ దర్శనం లభించకపోతే విష్ణుమూర్తి ఆలయాల్లో స్వామివారిని శనివారం దర్శించుకునే వారికి సకల సంపదలు, ఆర్థికాభివృద్ధి, దీర్ఘసుమంగళీ ప్రాప్తం సిద్ధిస్తుంది. ఇంకా శనివారం పూట సాయంత్రం ఆరుగంటలకు నారాయణ స్వామి ఆలయంలోని గరుడ భగవానునికి నేతితో దీపమెట్టే వారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని విశ్వాసం.   

కన్యలకు వివాహాది దోషాలు తొలగిపోవాలంటే...!

ఎర్రటి ఏడు ప్రమిదలతో దీపమెలిగించే కన్యలకు వివాహాది దోషాలు తొలగిపోతాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ఏ ఆలయంలోనైనా ఏడు ప్రమిదల్లో శుక్రవారం లేదా మంగళవారం పూట నేతితో దీపమెలిగించే కన్యలకు మనస్సుకు నచ్చిన వారితో వివాహం జరుగుతుంది. ఇంకా మహిళలు సైతం ఇలా తొమ్మిదివారాలు దీపమెలిగిస్తే దీర్ఘసుమంగళీ ప్రాప్తం చేకూరుతుంది.

 ఇంకా ఒక ప్రమిదతో దీపమెలిగిస్తే.. విద్యావకాశాలు, ఉన్నత విద్యాభ్యాసం చేస్తారు. రెండు ప్రమిదలతో దీపమెలిగిస్తే.. వృత్తి, వ్యాపారాల్లో అభివృద్ధి ఉంటుంది. మూడు ప్రమిదలతో దీపమెలిగిస్తే.. దీర్ఘ ఆయుర్దాయం చేరూకుతుంది. నాలుగు ప్రమిదలతో దీపమెలిగించే వారికి.. గృహం, వాహనాల కొనుగోలు వంటి శుభఫలితాలుంటాయి. ఐదు ప్రమిదలతో దీపమెలిగిస్తే.. ఉద్యోగావకాశాలు లభిస్తాయి.

 ఆరు ప్రమిదలైతే.. మంచి స్నేహితులు, ఏడు ప్రమిదలైతే.. వివాహదోషాలు తొలగిపోతాయి. ఎనిమిది ఎర్రటి ప్రమిదలతో దీపమెలిగిస్తే.. శత్రుభయం వంటి తొలగిపోతుంది. తొమ్మిది ప్రమిదలైతే.. నవగ్రహదోషాలు హరింపబడుతాయి. పది ప్రమిదలైతే.. శత్రుభయం ఉండదు. 108 ప్రమిదలతో దీపమెలిగిస్తే... అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. 508 ప్రమిదలతో దీపమెలిగించే వారికి వివాహ దోషాలు తొలగిపోయి, మంచి భవిష్యత్తు చేకూరుతుంది. 1008 ప్రమిదలైతే.. సంతాన భాగ్యం కలుగుతుందని పురోహితులు చెబుతున్నారు.  

ప్రతి పూజకీ గోవుపాలే ఎందుకు వాడతారు.?

గోవు సమస్త సృష్టిలోకి పవిత్రమైనది. సకల దేవతలకి నివాస స్థలము. అందుకే పూజాదికార్యాల్లో, వ్రతాల్లో, యజ్ఞాల్లో ఆవుపాలూ, పెరుగూ, నెయ్యి వాడతారు.

 ఆవుపాలంటే సమస్త దేవతలనూ మన శుభకార్యానికి పిలిచినట్టే. అందుకే వారి ఆహ్వానానికి చిహ్నమే ఆవుపాల వాడకము. 

మహాశివుని భస్మమెంతటి పుణ్యశక్తి కలది....

జంబూనదిని పొంది అక్కడి మట్టి బంగారమైనట్టూ, మానససరోవరాన్ని చేరి కాకులు హంసలైనట్టూ, అమృతాన్ని త్రాగితే దైవత్వము వచ్చినట్టూ, శంభుని భూషణమైన భస్మధారణ ద్వారా మహా పుణ్యశక్తి కలుగుతుంది. మంథర పర్వతంపై సనత్కుమారునికి మహాశివుడు భస్మ మహత్యాన్ని వివరిస్తూ, కాల్చిన గోమయమును ఐదు మంత్రాలతో అభిమంత్రించిన భస్మాన్ని లలాటమందూ, రెండు భుజములపై ధరించిన వారికి మహాపాతకాల నుంచి విముక్తి.

 పరుల ధనము అపహరించిన పాపమూ, చేయకూడని వారితో చేసిన సంపర్కపాపమూ, అసత్య దోషాలూ, పరస్త్రీ స్పర్శలవవల్ల కలిగిన పాపాలూ, ఉప పాతకుములూ తొలగిపోతాయి అని పరమేశ్వరుడే శెలవిచ్చాడు.