Wednesday, September 12, 2012

మాఘ గౌరీ నోము

  పూర్వం ఒక గ్రామంలో ఒక బ్రామ్హన దంపతులకు లేక లేక ఒక కుమార్తె పుట్టింది.  ఆమెను అల్లారుముద్దుగా పెంచారు.  యుక్త వయస్సు రాగానే ఆ కన్యకు అత్యంత వైభవంగా వివాహం చేసారు.  పెళ్లి అయిన ఐదవ నాడే వరుడు మరణించి  ఆ కన్యా విధవరాలైంది.  కుమార్తె ప్రారబ్ధమునకు ఆ తల్లి దండ్రులు ఎంతగానో దు:ఖించారు.  తీర్ధయాత్రల వలన పుణ్యము ప్రశాంతత కలుగుతుందని ఆ దంపతులు తమ కుమార్తెను తీసుకుని పుణ్య క్షేత్రాలు దర్శిస్తూ తిరుగుతూ వున్నారు.   

           ఇలా తిరుగుతున్నా వారికి ఒకనాడు ఒక చెరువు వద్ద ముత్తైదువులు ఒకచోట, విధవరాల్లందరూ ఒక చోట చేరి పద్మములతో పూజలు చేస్తూ కనిపిస్తోన్నారు.  అదేమిటో తెలుసుకొనవలేనన్న కుతూహలం కలిగి వారు ఆ చెరువు వద్దకు వెళ్ళారు.  అక్కడగల పుణ్య స్త్రీలలో వున్న పార్వతీదేవి వృద్దురాలి రూపంలో కనిపించింది.  వీరిని సమీపించింది.  


దంపతులు ఆమెను అక్కడ జరుగుతున్నదేమిటి అని ప్రశ్నించారు .  వృద్ద రూపంలో వున్న పార్వతీదేవి చేరదీసి ఇది పుణ్యకా వ్రతమని చెప్పి వారి కుమార్తెను చెరువులో చేయించి దోసెడు ఇసుకను ఆమెచేత గట్టున వేయించింది  .  ఆ ఇసుక  పసుపుగా మారింది.  మరల స్నానం చేయించి దోసెడు ఇసుక గట్టున వేయించాగా అది కుంకుమ గా మారింది.  మూడవ పర్యాయము స్నానం చేయించి దోసెడు ఇసుకను ఒడ్డున వేయించాగా అది కొబ్బరికాయగా మారింది.  ఆ నాలుగు అయిదుసార్లు ఆ వితంతువు చేత చేయించగా బెల్లముగా జీలకర్రగా మారింది.  అంట అమ్మవారు ఓ దంపతుల్లారా! చింతించక మీ బిడ్డ వైధవ్యం తొలగి పోయే మార్గం చెబుతాను మీ అమ్మాయిచేత అయిదు సంవత్సరాలు మాఘ గౌరీ నోమును నూయించండి అని చెప్పి మాయమైనది.   

             అంత ఆ తల్లి దండ్రులు ఆనందిన్చినవారై తమ కుమార్తెను తీసుకుని స్వగ్రామం వెళ్లి కుమార్తె చేత మాఘ గౌరీ నోముని అయిదు సంవత్సరాలు చ్యించారు.  అంట ఆమెకు పునర్వివాహమై జీవితకాలం ముమంగాలిగా జీవించింది.   


ఉద్యాపన:  ఈ నోమును మాఘమాసములో అమావాస్య వెళ్ళిన పాడ్యమి నాడు పొదలు పెట్టాలి.  ఆ నెల రోజులు ప్రతిరోజూ స్నానం చేసి నీలాతరేవులో పసుపుతో గౌరీదేవిని పెట్టి పువ్వులు, పసుపు, కుంకుమ లతో పూజించాలి.  మొదటి సంవత్సరము సేరుమ్బావు (1-1/4kg) పసుపు రెండవ సంవత్సరము  
సేరుమ్బావు
  (1-1/4kg)  కుంకుమ,  మూడవ సంవత్సరము (1-1/4kg) కొబ్బరి, నాలుగవ సంవత్సరము 1-1/4kg బెల్లము, అయిదవ సంవత్సరము సేరుమ్బావు (1-1/4kg) జీలకర్ర ముత్తైదువులకు దానమివ్వాలి.  ఉద్యాపన చెప్పుకుని ముత్తైదువులకు భోజనము పెట్టి, పసుపు, కుంకుమ, రవికెల గుడ్డలు ఇవ్వాలి.  

No comments:

Post a Comment