గజానన పండితుడి ఇంట కామధేనువులాంటి గంగిగోవు ఉన్నది. నందుడు అనేవాడు
దాని బాధ్యతలు నిర్వహిస్తూ, గజానన పండితుడికి రోజూ చిక్కటి పాలు పితికి
తెచ్చి ఇచ్చేవాడు. ఒకనాడు స్వరకేసరి నందుణ్ణి మంచిగా లోబర్చుకొని, వాడు
చె
్యువలసినదంతా నూరిపోశాడు. గణపతి నవరాత్రి ఉత్సవాలకు కుమా ర్తెనూ,
అల్లుణ్ణీ, మనుమడు గణేశభట్టునూ తీసుకురావడానికి దగ్గిరలోనే ఉన్న కళ్యాణి
నగరానికి గజాననుడి భార్య రెండు రోజుల క్రితమే వెళ్ళి ఉన్నది.
గజాననుడి అమరగానాన్ని విని తరించ డానికి దూరదూరాల నుంచి రసజ్ఞులైన
శ్రోతలు తండోపతండాలుగా వాతాపినగ రానికి చేరుకొంటున్నారు. ఆనాడే ప్రారంభ
దినం. వాతాపిగణపతి ఆల
ు ప్రాంగణంలో గజాననుడు తొలిపాట వినిపించవలసిన రోజు,
వినా
ుక చతుర్థి! వేకువనే నందుడు స్వరకేసరి చెప్పిన ప్రకారంగా లోటాలో ఉన్న
నీళ్ళలో పితికి తెచ్చిన పాలు కొన్ని పోసి, లోటాను అలాగే తీసుకెళ్ళి
గజాననుడికి ఇచ్చాడు.
గజాననుడు లోటాలోని నీళ్ళపాలను జూసి నివ్వెరపడి, ‘‘ఇదేమిటి నందా!
ఎన్నడూ లేంది ఈరోజు పాలలో నీళ్ళుపోసి తెచ్చా వేమిటీ?'' అని అడిగాడు. వెంటనే
నందుడు, ‘‘ఆ గణేశుడి సాక్ష! నేను పాలల్లో నీళ్ళు పోసి తేలేదు, ప్రమాణం
చేసి చెపుతా!''అని బోరవిరుచుకుని అరిచాడు.
గజానన పండితుడి దగ్గర విన
ుంగా ఉండే నందుడు, అంత నిర్భ
ుంగా అరవడం
చూసి ఆశ్చర్యపడుతూ వీధిలోని వాళ్ళు నలుగురూ వచ్చి మూగారు. వీధిని పోతూన్న
వాడల్లే వెళ్తూన్న స్వరకేసరి ఆగి దూరంగా నిలబడిపోయి లోలోపల ముసిముసిగా
నవ్వుకొంటూ చూడసాగాడు.
గజాననపండితుడు చిరుకోపంతో కను బొమలు ముడిచి, ‘‘నందా! ప్రమాణందాకా
వచ్చావూ? ఏదీ ప్రమాణం చెయ్యి చూద్దాం!'' అని అన్నాడు. ప్రమాణం
చే
ువలసివచ్చేసరికి జంకు పుట్టి నందుడు తటపటాయిస్తూంటే, ‘‘అలా దిక్కులు
చూస్తావేం?''అంటూ గజానన పండి తుడు కంచుఘంటలాంటి కంఠధ్వనితో, ‘‘ప్రమాణం
చె
్యువేం మరి?''అని గద్దించగా నందుడికి మరింత దిగులు పట్టుకొంది. దూరంగా
ఉన్న స్వరకేసరి పెద్దమనిషి లాగ వేగంగా ముందుకు వచ్చి, ‘‘అనగానే సంబరమా,
చె
్యురా నందా చెయ్యి!
చెప్పింది సరిగ్గా చెప్పి, దీపం ఆర్పు, భ
ుపడతా వెందుకు!'' అంటూ
నిబ్బరం చెప్తూన్నట్టు కనుసైగ చేశాడు. నందుడు సగం ధైర్యం తెచ్చుకొని,
ఎదురుగా గదిలో స్వర్ణగణేశ ప్రతిమదగ్గిర వెలుగుతున్న దీపం ముందు కెళ్ళి
నిల్చుని, భ
ుం భ
ుంగా హీన స్వరంతో, ‘‘నేనేగాని పాలల్లో నీళ్ళుపోసి తెస్తే,
నా రెండు చేతులూ పడిపోవాలి! లేదా అలాగ అన్న గొంతుకే పడిపోవాలి!'' అని
చెబుతూ, దీపం ఆర్పేస్తూ గట్టిగా కళ్ళు మూసుకున్నాడు.
గజాననుడు దిగ్భ్రాంతితో కొ
్యుబారి పో
ూడు. అతని గొంతు బిగుసుకుపోయి
మాట రాలేదు. ‘‘అెూ్య! ఎంతపని జరిగింది!'' అని నలుగురూ విచారిస్తూంటే,
‘‘ప్రమాణకాలు చేయించడం అంటే మాటలా మరి!'' అని అంటున్న స్వరకేసరి గొంతు విని
నందుడు కళ్ళు తెరిచి, తన చేతులకేమీ కానందుకు ఆనందపడుతూ, గబగబా స్వరకేసరిని
చేరు కున్నాడు. ఆ సమ
ుంలో బాలగణేశభట్టు పరు గెత్తుకుంటూ వచ్చి, ‘‘తాత
్యూ!
బండి దిగి ముందు నేను పరుగెత్తుకుంటూ వచ్చేశా! అమ్మమ్మా వాళ్ళంతా
బండిమీద వస్తున్నారు!'' అని అంటూ తాతగారిని చూసి నివ్వెరబోతూ, నలుగురూ
చెప్పినదంతా విని, పెదవులు బిగించి నడుం మీద చేతులుంచి ధాటిగా నిలబడి,
‘‘నందా, ఆగు!'' అన్నాడు. స్వరకేసరితో వెళ్ళిపోబోతూన్న నందుడు
మంత్రించినట్టుగా ఠక్కున ఆగిపోయి, గదిలో దీపం వెలుగుతూనే ఉండడం చూసి
విస్తుపో
ూడు.
‘‘నువ్వు దీపం సరిగా ఆర్పినట్టులేదు, మళ్ళీ ప్రమాణం చెయ్యి!'' అని
శాసిస్తున్నట్టు బాలభట్టు అన్నాడు. భ
ుం లేదు వెళ్ళి ప్రమాణం చెయ్యి
అన్నట్లుగా స్వరకేసరి నందుడి వీపు పొడిచి ముందుకు తోశాడు. బాలగణేశభట్టు,
‘‘నందా! సరిగ్గా విను, నేనేగాని నీళ్ళల్లో పాలు పోసి ఇస్తే, నా చేతులు
పడిపోవాలి! అని చెప్పి దీపం ఆర్పు! ఊ, త్వరగా కానియ్యి,''అని హుంకరిస్తూ
అన్నాడు. నందుడికి ముచ్చెమటలు పోశాయి. అతడు గజగజలాడుతూ, ‘‘అ
్యుబాబో! నేనీ
ప్రమాణకం చె
్యును.
ఈ స్వరకేసరి చెప్పినట్లుగా, నీళ్ళలో పాలుపోసి తెచ్చి చ్చాను. పాలల్లో
నీళ్ళు పో
ులేదని ప్రమా ణంచేశాను. అంతే! నన్ను రక్షంచండి!'' అని అంటూనే
గబగబా వెళ్ళి, నీళ్ళల్లో పో
ుగా చెంబులో మిగిలి ఉన్న చిక్కటి పాలను తెచ్చి
బాలభట్టు ముందుపెట్టి అలాగే మోకరిల్లు తున్నట్లు పడ్డాడు. అక్కడ
చేరినవారంతా గలగలా నవ్వుతూన్న కోలాహలంలో స్వరకేసరి జాడలేకుండా పారి పో
ూడు.
అతని కోసం కొందరు పరుగున వెళ్ళారు. అప్పుడు గణేశభట్టు నలుగుర్నీ కలి
ు
జూసి, ‘‘చూశారా!
ఈ ప్రమాణకాలు చేసే వారూ, వెనుకదన్నుగా చేయించేవారూ ఎక్కువమంది వఠ్ఠి
మా
ూవులు! మాటలు మారుస్తూ సత్యాన్నే తికమకపెటే్ట ద్రోహులు. అమా
ుకుల్ని
నమ్మించి మోసం చేసే వంచ కులు!'' అని అన్నాడు. ‘‘ఔను! చిన్నవాడివైనా బాగా
చెప్పావు. కళ్ళు తెరిపించావు!'' అని కురవ్రాడి తెలివి తేటల్ని మెచ్చుకుంటూ,
గజానన పండితుడి గొంతుపట్టు విడిపోయినట్లు తెలుసుకొని, అంతా సంతోషిస్తూ
వెళ్ళిపో
ూరు. గణేశభట్టు,‘‘తాత
్యూ!
ఆడంబరమూ, అహంకారమూ లేని పండితుడివైన నువ్వే పామరుడిలాగ, ఇలాంటి
ప్రమాణాల మా
ులో పడ్డావంటే చాలా చిత్రంగా ఉంది కదా!'' అన్నాడు. గజాననుడు
బాలుణ్ణి దగ్గరకు తీసుకుని కన్నులు మూసి, ‘‘ఔను, గణేశా!'' అని అంటూన్న
సమ
ుంలో వీధిలో బండి ఆగింది. గజాననుడు కళ్ళు తెరిచి చూస్తే బాలుడు లేడు;
అప్పుడే బండి మీంచి కిందికి గణేశ భట్టు దూకడం కనిపించింది.
గజానన పండితుడి ముఖం ఒక్క క్షణం జ్యోతిలాగ వెలిగింది. ‘‘గణేశా!'' అంటూ
మహానందంతో ఆనందభైరవి ప్రారంభ స్వరంలాగ అరిచాడు. పావనమిశ్రుడు కథ చెప్పడం
ఆపి, ‘‘పిల్లలూ! ముందు వచ్చిన ఆ గణేశభట్టు ఎవరో చెప్పండి?''అని అనడమే
తరవాయిగా, ‘‘ఇంకెవరు, మన విఘ్నేశ్వరుడే! వాతాపి గణపతి,'' అంటూ పిల్లలూ,
వారితో పెద్దలూ గొంతులు కలిపారు. పావనమిశ్రుడు తిరిగి చెప్పసాగాడు:
‘‘తాతా!'' అంటూ గణేశభట్టు చేతులు చాచి పరుగున వస్తూంటే,‘‘గణేశా!''
అంటూ పండితుడు చేతులు చాచి మనవణ్ణి ఎత్తి, ‘‘గణేశా! విఘ్నేశ్వరుడు
మనల్ని అనుగ్రహిం చాడు. నీ రూపంలో వచ్చి మన ఇల్లు పావనం చేశాడు. ఇది గజానన
మందిరం!'' అని ఆనందపారవశ్యంతో అంటూ అరవై ఏళ్ళు నిండిన ఆ వ
ుస్సులో
చిన్నపిల్లవాడిలాగ గంతులేస్తూ, ‘‘తాండవ నృత్యకరీ గజానన ధిమికిట...''
అంటూ ఆనందభైరవి రాగంలో సమ్మోహన గాత్రంతో పాడుతూన్న పాట ఘంటానాదంలాగ
నగరమంతటా మార్మో గుతూ వినిపించింది. ఆ ఆనందపతాక సన్నివేశంలో స్వరకేసరి
పరుగున వచ్చి, గజానన పండితుడి పాదాలు చుట్టివేసి తల ఆన్చి, ‘‘గురుదేవా!
క్షమించాను అని అంటేగాని మీ పాదాలు వదలను!'' అని అన్నాడు. గజాననుడు
తెప్పరిల్లి, స్వరకేసరిని లేవ నెత్తి, ‘‘స్వరకేసరీ! మనం నిమిత్తమాత్రులం,
అంతా ఆ గజాననుడి లీలావిలాసం!
నువ్వు సంగీతాన్ని శాస్ర్తీ
ుంగా మథించినవాడివి. నేను భక్తికి, మమతకు
ప్రాధాన్యం ఇచ్చి, భక్తితో కూడినప్పుడే సంగీతం ఉన్నతమార్గం అందు కుంటుందని
నమ్మినవాణ్ణి, అంతే! ఇకనుంచి స్వర్ణగణేశ విగ్రహాలు అన్నీ నీ అధీనమే! ఆ
సత్కారాలేవీ నాకు వద్దు. ఇటుపైని నేను సభల్లో పాడను!'' అని అనగానే
గణేశభట్టు, ‘‘తాత
్యూ! నీకోసం నువ్వు ఇంట్లో పాడు కొంటే చాలదు. ఎదుటివారిలో
మంచి అభి రుచినో, ఆనందాన్నో, మమతనో, భక్తినో కలి గించినప్పుడేకదా నీ
పాటకూ, పాండిత్యానికీ సార్థకత!'' అన్నాడు. గజాననుడు చేతులెత్తి జోడిస్తూ,
‘‘ఓ విఘ్నేశా! ఈ మాటలు నా మనవడి నోటితో నువ్వే అంటున్నావు! ఇంతవరకూ నీవు
చెప్పి నట్లుగానే గానం వినిపించాను. ఇక ముందు కూడా నీ ఆనతిప్రకారం అలాగే
నిన్ను కీర్తిస్తాను.
వినేవారి హృద
ూల్లో నర్తించు! సత్కారాలు మాత్రం నాకు అందకుండా చూడు!''
అన్నాడు. అప్పుడు స్వరకేసరి, ‘‘గురుదేవా! మీరు రచించిన కీర్తనలను మీ
రీతిలో పాడినవారికి ఏటేటా స్వర్ణగణేశ విగ్రహం బహూకరింప బడుతుంది; ఆ
విధంగానైనా మా భక్తిగౌరవాల్ని మీపట్ల చూపుకోగల అదృష్టాన్ని అనుగ్రహిం
చండి!''అని అంజలిఘటించి అర్థించాడు.
గజానన పండితుడికి అరవై ఏళ్ళు పూర్తి అయిన సందర్భంగా, అతను వద్దంటున్నా
ఆనాటి సా
ుంకాలం వాతాపిగణపతి ఆల
ు ప్రాంగణంలో ఏర్పాటైన బ్రహ్మాండమైన
మహాసభలో పూలజల్లుల మధ్య షష్ఠిపూర్తి మహోత్సవం వైభవంగా జరిగింది. గజానన
పండితుడు చేతులు జోడించి, ‘‘ఎందరో మహానుభావులు సంగీతాన్నీ, కవిత్వాన్నీ
భక్తికి అంకితం చేసి అదే సన్మార్గమని చెప్పారు!
వారందరికీ వందనాలు. నేనూ అదే నమ్మాను. అంతకంటే నాలో మరే విశేషమూ
లేదు!'' అని చెప్పి, అనేక రాగమాలికలతో, విఘ్నేశ్వ రుణ్ణి కీర్తిస్తూ
అమృతగానాన్ని వినిపించాడు. ఆనాటి శ్రోతల హృద
ూల్లో తాండవించిన
విఘ్నేశ్వరుడు ఎప్పటికీ అలాగే నర్తిస్తూ ఉండిపో
ూడు.
ఈవిధంగా వాతాపినగర చరిత్రలో గజా ననపండితుడి పేరు సువర్ణాక్షరాలతో
నిలిచి పోయింది, అని పావనమిశ్రుడు ముగించాడు. ఒకనాడు చాలామంది పిల్లలు వారి
వెనుక పెద్దలు గుమిగూడి ఒక చిత్రాన్ని వింతగా చూస్తున్నారు. ఆ చిత్తరువులో
ఒక విచిత్రమైన జంతుభూతం చిత్రించబడి ఉంది.
అప్పుడే మంటపంలోకి ప్రవేశిస్తున్న పావనమిశ్రుడు పిల్లల కుతూహల కారణం
గ్రహించి, ‘‘పిల్లలూ! కథ విందురుగాని కోర్చోండి!'' అంటూ చెప్ప
మొదలుపెట్టాడు: ఇంద్రుడు సగరచక్రవర్తి
ూగాశ్వాన్ని దాచాడు. పృథుచక్రవర్తి
ూగం సరిగ్గా పూర్తవ కుండా, గుర్రాన్ని దొంగిలించుకుపోతూ పాషండ వేషాలు
వేశాడు, చే
ురాని పను లెన్నో చేశాడు.
పృథుచక్రవర్తి సంతతివాడైన అభినందను డనే మహారాజు ఇంద్రుడికి భాగం
లేకుండా ఉండే ఒక మహా
ూగాన్ని ప్రారంభించాడు. ఇంద్రుడు పట్టరాని ఉక్రోషంతో
కాలుడిని ఇచ్చకాలతో, సురభోగాలతో బాగా తృప్తి పరిచి, అభినందనుడి
ూగాన్ని
ధ్వంసం చే
ుమని కోరాడు. కాలుడు కాలానికి అధినేత, జీవుల జీవన మరణాలకు కాలుడే
మూలము. కాలుణ్ణి కాల
ుముడు, కాలధర్ముడు అని కూడా అంటారు.
కాలుడు
ుజ్ఞపురుషుణ్ణి ఆవహించి, అభినందనుడి
ూగ హోమాగ్ని నుండి కనీ
వినీ ఎరుగని మహాభ
ుంకరమైన పర్వ తంలాంటి జంతుభూతం వెలువడేలాగ చేశాడు.
ఋత్విజులు, అధ్వర్యులు మొదలైన వారంతా పారిపో
ూరు. అభినందనుడు గణేశభక్తుడు.
అతని గురువైన వశిష్ఠుడు, ‘‘రాజా! ఇలాంటి అవాం తరం రావచ్చునని తెలిసే
హోమగుండానికి ఎదురుగా పెద్ద స్వస్తికాపీఠాన్ని వేయించాను.
స్వస్తిక గణేశుని సంకేత చిహ్నం. గణేశ్వరునికి ప్రతిరూపంగా
పసుపుముద్దను స్వస్తిక కేంద్రంలో పెట్టి ప్రణమిల్లు! ఆ స్వస్తిక అవాంత
రాన్ని నిర్మూలిస్తుంది!'' అని చెప్పాడు. రాజు అలాగే చేశాడు. ఆ స్వస్తిక
ముగ్గు కేంద్రం నుంచి అద్భుత ప్రకంపనంతో నాదం వెలువడి, అణువులు విజృంభించి
పైకెగిసి మహాజంతుభూతాన్ని ఆవరించాయి.
అణువులు పెద్దవిగా పెరు గుతూ ఎలుకలుగా మారాయి. అనేక రంగు రంగుల్లో
మెరిసిపోతూన్న చిటె్టలుకలు చీమల బారుల్లాగ భూతజంతువు నిండా పట్టుకొని
కొరికి కొరికి, బలవంతమైన సర్పము చలి చీమలచేత చిక్కి చచ్చిన విధంగా చేసినై.
భూతజంతువు గిలగిలా తన్నుకొని చచ్చినట్లు చచ్చి అదృశ్యమైంది.
No comments:
Post a Comment