పాండవులు నారదుడు చెప్పిన విధంగానే విఘ్నేశ్వరుణ్ణి భక్తిశ్రద్ధలతో
అర్చిస్తూ, ధౌమ్యుడు పురోహితుడుగా గణేశవ్రతాన్ని చేసి, మారువేషాలతో
విరాటరాజు కొలువులో ఒక సంవత్సరం అజ్ఞాతవాసం జ
ుప్రదంగా ముగించారు. కృష్ణుని
అండతో పాండవులు కౌరవులతో
ుుద్ధంచేసి విజ
ుం పొందారు. హస్తినా పురంలో
ధర్మరాజు పట్టాభిషిక్తుడై రాజ్యపాలన చేస్తూ, అశ్వమేధ
ూగాన్ని చే
ుడానికి
తెలపెట్టాడు.
ూగాశ్వం వెంట సైన్యసమేతంగా అర్జు నుడు బ
ులుదేరాడు. పాండవుల పురోహి
తుడైన ధౌమ్యుడు కూడా అతనితో ఉన్నాడు.
ూగాశ్వం అనేక రాజ్యాల మీదుగా
వెళ్ళింది. రాజులనేకులు ధర్మరాజు పాలనకు విన
ు విధే
ుతలు ప్రకటించారు.
గుర్రం వెళ్తూ, వెళ్తూ ఒక ప్రాంతంలో ఆగిపోయి మరి ముంద డుగు వే
ులేదు.
అర్జునుడు ఆశ్చర్యపోయి ధౌమ్యుణ్ణి ఎందుకిలా జరిగిందని అడిగాడు.
ధౌమ్యుడు ‘చెపుతా పద' అన్నట్లు చూసి దారి తీశాడు. కొంతదూరం వెళ్ళగా ఒక
మహా నగరం కనిపించింది. ఆ నగర మధ్యంలో బ్రహ్మాండమైన విఘ్నేశ్వరుని విగ్రహం
ఉన్నది. ఒక పెద్ద కొండరాతిని మలచిన శిల్పం అది. అత్యంత కళాశోభితమై
విరాజిల్లు తున్నది. ‘‘అర్జునా! విఘ్నేశ్వర దేవుడిని అర్చించి ప్రణామములు
అర్పించు. తరవాత వాతాపి గణపతిగా పేరుపొందిన ఈ దేవుని గురించి, వాతాపినగరం
గురించి సవిస్తరంగా చెప్తాను,'' అని అన్నాడు ధౌమ్యుడు.
అర్జునుడు పూజాక్రమం జరిపి, వాతాపి గణపతిని భక్తి ప్రపత్తులతో
ఆరాధించాక ధౌమ్యుడు వాతాపినగరంలోకి దారి తీశాడు. అతని వెనుక అర్జునుడు
వెళ్ళి నగరాన్ని చూశాడు. ఒకప్పుడు ఆ నగరం మహావైభ వంతో వెలిగిన ఛా
ులు
గోచరించాయి. కాని ఇప్పుడు నగరం ఆలనాపాలనా లేక బీడుపడి వున్నది.
లెక్కకు రాని కొద్దిమంది పౌరులు అక్కడక్కడా బిక్కుబిక్కుమంటూ
కనిపించారు. అర్జునుడి రాకకు వారు చాలా సంతోషంతో స్వాగతం పలికి,
పాలనావ్యవస్థ ఏర్పరచి నగరాన్ని పునరుద్ధారణ చే
ుమని ప్రార్థించారు.
‘‘అర్జునా! ఇది వాతాపినగరం. నగర మధ్యంలో ఉన్న విఘ్నేశ్వరుడు అగస్త్య మహా
మునిచే నెలకొల్పబడిన అద్భుత శిల్పం. ఇది వాతాపిగణపతి క్షేత్రంగా పిలువబడు
తున్నది. దీనిని గురించిన విశేషాలు చెప్తాను విను!''
అంటూ ధౌమ్యుడు చెప్పడం ప్రారం భించాడు: గంగ, కవేరుడు అనే రాజర్షి
కమండలు వులో పడి కావేరిగా రూపు ధరించి, అతని కుమార్తెగా ఆశ్రమంలో
పెరిగింది. అగస్త్యుడు ఆ కన్యను చూసి వివాహం చేసుకుంటానని కవేరుడితో
చెప్పాడు. కవేరుడు తన సమ్మతిని తెలిపి, ‘‘అగస్త్యా! కావేరి అభిమతం కూడా
తెలుసుకుంటే మంచిది గదా!'' అన్నాడు. అగస్త్యుడు ఆశ్రమంలో కావేరితో చను వుగా
ఉంటూ ఉండగా ఒకనాడు కావేరి అతనితో సహ్యపర్వతం మీద వనవిహారం చే
ూలని ఉందని
చెప్పింది.
అగస్త్యుడు కావేరిని తీసుకెళ్ళాడు. వనవిహారం చేస్తూ ఒక చిన్న మడుగులో
తామరపువ్వును చూసి ముచ్చటపడుతూ, కావేరి చరచరా వెళ్ళి, దాన్ని తీసుకోడానికి
మడుగులో అడుగు పెట్టింది. నీటి తాకిడితో ఆమె అమాంతంగా జలరాశిగా మారిపోయి,
వరదలా పొంగి సహ్యపర్వత శిఖరాల నుండి జలజలా జారుతూ కావేరినదిగా పరవళ్ళు
తొక్కుతూ ప్రవహించింది. అగస్త్యుడు కావేరినే తలచుకొంటూ చాలా కాలం
బ్రహ్మచారిగానే ఉండిపోయి, గొప్ప తపస్సు చేసి ఋషిశ్రేష్ఠుడు అనిపించు
కున్నాడు.
ఒకనాడతడు అరణ్యంలో చెట్టు కొమ్మకు తలక్రిందులుగా వ్రేలాడుతున్న
పితృదేవతలను చూసి, ‘‘ఎవరు మీరు? ఎందుకిలా ఉన్నారు'' అని అడిగాడు. వారు
నిట్టూర్పులు విడుస్తూ, ‘‘మా వంశీ కుడు అగస్త్యుడు ఒక ఇంటివాడై సంతానం
కనేవరకూ మాకుఇలాగే ఉండక తప్పదు!'' అని చెప్పారు.
అగస్త్యుడు తన దివ్యదృష్టితో విదర్భ రాజుకు కావేరి అంశతో కుమార్తె
పుట్టి, లోపా ముద్ర పేరుతో పెరిగి
ుుక్తవ
ుస్కురాలై ఉన్నట్లు తెలుసుకొని
వెళ్ళి, ఆమెను తనకిచ్చి వివాహం చే
ువలసిందిగా విదర్భరాజును కోరాడు.
కందమూలాలు తింటూ నార కట్టుకు తిరిగే మునికి, సుకుమారి రాకుమారిని ఎలా
ఇవ్వడం? ఇవ్వకపోతే శపిస్తాడేమో అని రాజు సంశ
ుపడుతూ వ్యాకులచిత్తుడై ఉండగా,
లోపాముద్ర అగస్త్యుడితో నిరభ్యంతరంగా వెంటనే తన వివాహం జరిపించమని
చెప్పింది.
విదర్భరాజు ఆ విధంగానే లోపాముద్రను అగస్త్యమహర్షికిచ్చి వివాహం జరిపి
అతనితో పంపాడు. అగస్త్యుడు లోపాముద్రతో తన ఆశ్రమా నికి వచ్చాక ఒకనాడు, ‘‘నా
పితృదేవతలను పున్నామనరకం నుండి తరింపజే
ుడానికి నీ వలన సంతానం కనాలని
నిన్ను వివాహం చేసుకున్నాను!'' అని లోపాముద్రతో అన్నాడు. అప్పుడామె తన ముతక
చీర చూసుకొని విచారిస్తూ, ‘‘వివాహం చేసుకోగానే సరా!
నేను రాజపుత్రికగా పుట్టి భోగభాగ్యాలతో పెరిగిన దాన్ని. నాకు తగ్గ
మంచి బట్టలు, రత్నాభర ణాలు సమకూర్చడం నీ విధి. అందుకు కావ లసినంత ధనం
సంపాదించుకు రావడం నీ కర్తవ్యం!'' అన్నది. అగస్త్యుడు భార్య మాటలలోని
వాస్తవాన్ని గ్రహించి, అప్పటికప్పుడే ధనసేకరణకు బ
ులుదేరాడు. అతడు చాలామంది
రాజుల దగ్గరికి వెళ్ళి, రాజ్యపాలనకు సరి పడగా మిగిలిన ధనాన్ని
తనకిమ్మన్నాడు.
ఏ రాజు కూడా మిగులు చెప్పలేదు సరికదా, ఎంతో లోటు పడుతూన్నట్లుగా
చెపుతూ, తమకు కూడా ఏమైనా ధనలాభం కలిగే మార్గం చూపమని వేడుకున్నారు.
అగస్త్యుడు హతాశుడై అరణ్యమార్గంలో వెళ్తూ, ఒకచోట ఉన్నతమైన ఒక మహాశిలను
చూశాడు. ఆ రాయి లంబోదరుడైన విఘ్నే శ్వరుడిని పోలినట్టుగా కనిపించింది.
ఆ మహా శిలనే విఘ్నేశ్వరుడిగా భావిస్తూ అగస్త్యుడు నమస్కరించి,
‘‘గణపతీ! తపస్సు తప్పితే రెండో ధ్యాస లేనివాణ్ణి. ధన సంపాదనకు విద్యలేవీ
నాకు తెలి
ువు. ధనం నాకు ఎలాగ లభిస్తుంది? నీవైనా నాకు ఒకదారి చూపవా?''
అంటూ వేడుకున్నాడు. అప్పుడు, ‘‘ఏమిటి, మహర్షీ! శిలతో మంతనాలాడుతున్నావు!''
అంటూ విఘ్నే శ్వరుడు సాక్షాత్కరించాడు.
అగస్త్యుడు ప్రణమిల్లి మ్రొక్కి తన మొర వినిపించాడు.
విఘ్నేశ్వరుడు,‘‘అగస్త్యా! రావలసిన చోటుకే వచ్చావు, రావలసినవాడివే, రావలసిన
సమ
ూనికే వచ్చావు. కొంచెం సేపట్లో ఇల్వలుడు నిన్ను భోజనానికి పిలుస్తాడు,
వెళ్ళు! ఇల్వ లుడి దగ్గిర అంతులేని ధనరాశి మూలుగుతూ ఉంది. ఇప్పుడు నీ వలన
మరొక ముఖ్యమైన కాగల కార్యం కూడా ఉంది!'' అన్నాడు.
అగస్త్యుడు, ‘‘గణపతీ! ఈ మహాశిలలో నీ పోలికలు నాకు కనిపించాయి.
అందుచేత, ఈ శిల అపూర్వగణపతి విగ్రహంగా రూపొం దాలనే నా కోరిక కూడా సఫలం
చెయ్యి!'' అని కోరాడు. విఘ్నేశ్వరుడు, ‘‘అలాగే అవుతుందిలే!'' అని చెప్పి
అంతర్థానమ
్యూడు. అగస్త్యుడు చాలా అలసి ఉన్నాడు. ఆక లిగా కూడా ఉంది.
ఆ
ూసంగా మహాశిలను ఆనుకొని కూర్చొని అలా చూస్తూండగా, అతి థులను
వెంటబెట్టుకుని వస్తున్న ఇల్వలుడు కనిపించాడు.
అగస్త్యుడికి విష
ుమంతా తృటిలో తెలిసిపోయింది. ఆ అరణ్యంలో వాతాపి,
ఇల్వలుడు అనే గొప్ప మా
ూవులైన రాక్షసులు ఋషులను,
ూత్రికులను, బాటసారులను
చంపి ధనాన్ని దోచుకొని, పెద్ద రాతిదుర్గంలో పోగుచేస్తున్నారు.
ధర్మము మూర్తీభవించిన మహారాజు వేషంతో ఇల్వలుడు ఆతిథ్యానికి
తీసుకువచ్చినవారికి విన
ువిధే
ుతలతో మర్యాదలు కుశల ప్రశ్నలు జరుపుతున్న
సమ
ుంలో, వాతాపి బాగా కొవ్వుపట్టిన మేకపోతుగా మారుతాడు. ఇల్వలుడు ఆ మేకను
తెచ్చి చంపి వండించి, మేక మాంసంతో భోజనం పెడతాడు.
అతిథులు భోజనం ముగించి భుక్తా
ూసంతో విశ్రమి స్తున్న సమ
ుంలో ఇల్వలుడు
గొంతెత్తి, ‘‘వాతాపీ!'' అని గట్టిగా పిలుస్తాడు. వాతాపి అతిథుల పొట్టలు
చీల్చుకొని వస్తాడు. ఆ దుర్మార్గులు చేస్తున్న పనికి అగస్త్యుడి ఒళ్ళు
మండిపోయింది. ఇల్వలుడు అగస్త్యుణ్ణి సమీపించి, వీడెవడో చాలా గొప్ప ఋషిలా
ఉన్నాడు. ఇలాంటివాళ్ళన
ు ఎంతమందిని హతమార్చితే అంతమంచిది, అని అనుకుంటూ
సవిన
ుంగా వంగి నమస్కరించి అందరిని పిలిచి నటే్ట భోజనానికి ఆహ్వానించాడు.
అగస్త్యుడు ఆకలితో అలమటించిపో తూన్నవాడిలాగ పరమానందం కనబరిచి, ‘‘ఓ
ధర్మదాతా! నీలాంటివాళ్ళుండబటే్ట ఈ భూమండలం అనంతాకాశంలో ఇలా నిలిచి ఉంది.
పద!'' అంటూ ఇల్వలుడి వెంట రాతి దుర్గానికి వెళ్ళి, ‘‘ఓ అన్నదాతా! చాలా రోజు
లుగా తిండి లేదు, ఆకలి దహించేస్తున్నది. వెయ్యి
ుజ్ఞాలు జరిపించినవాణ్ణి
కావడంవల్ల, మేక మాంసం తప్పితే మరేదీ అరగని రోగం ఒకటి పట్టుకున్నది.
అంచేత, ముందు నాకు ఆ మాంసభోజనం పెట్టి నన్ను పంపించు,'' అన్నాడు.
ఇల్వలుడు, ‘‘స్వామీ! మీకు ఆతిథ్య మిచ్చే మా భాగ్యం చాలా గొప్పది! మీ కోసమే
రాసిపెట్టి ఉన్నది కాబోలు, మా ఇంట చిర కాలం నించీ ఒక మేకపోతు పెరుగుతూ బాగా
కొవ్వుపట్టి ఉన్నది!'' అని చెబుతూ వెంటనే మేక రూపంలో ఉన్న వాతాపిని సేవకుల
చేత చంపించాడు. అగస్త్యుడు మేకను చూసి, ‘‘ఆహా! ఏం మేక, ఏం మేక! వెయ్యి
ూగాలు చేయించా నన్న మాటే గానీ ఇలాంటి మేకను రుచి చూడ లేదు, నా
ునా!
ముందు దీని గుండెకా
ు మొదలైన మేలు ముక్కలన్నీ నాకు పెట్టి, ఆ తర్వాత
మిగతాది అతిథులకు పెట్టు! ముందే చెబుతున్నాను, మరేం అనుకోకు. మాంసం తప్ప
మరేదీ నేను తినలేను సుమా! నేను తిన గలిగినంతా నాకు వడ్డించాలి,
మర్చిపోకు!'' అన్నాడు. ఇల్వలుడు అగ్నిలో మేకను కాల్చి, మాంసం వండించి
అగస్త్యుడికి పెట్టాడు.
ఎంత వడ్డించినా తినేస్తూ అగస్త్యుడు పూర్తి మేకపోతు మాంసం నిమిషాలలో
ఆరగించి గట్టిగా త్రేన్చాడు. ఇల్వలుడు అమిత ఆశ్చ ర్యంతోపాటు కొంచెం భీతి
కూడా పడుతూ, ‘‘స్వామీ! తమరు మంచి ఘనాపాఠీల్లా గున్నారే!'' అన్నాడు.
అగస్త్యుడు చిరునవ్వు నవ్వి, ‘‘ఘనా పాఠీలలో ఘనాపాఠీగా మన పేరు
ముల్లోకా లకూ తెలుసునోయి! ఏదీ, కాస్త మద్యం తెప్పించు! ఒక కుండెడు
చాల్లే!'' అన్నాడు. ఇల్వలుడు మరింత నివ్వెరపోతూ, ‘‘కుండెడు మద్యం తాగుతారా,
స్వామీ!'' అన్నాడు. అగస్త్యుడు, ‘‘మన పొట్టకు సముద్రాలే చాలవు!'' అన్నాడు.
ఇల్వలుడు, ‘‘అలాగే తాగుదురుగాని, మా వాడు వాతాపి తెప్పిస్తాడు!'' అని
చెబుతూ, ‘‘వాతాపీ!''
అంటూ గొంతెత్తి కేకవేశాడు. అగస్త్యుడు నెమ్మదిగా, ‘‘ఇంకెక్కడి వాతాపి!
వాతాపి మరి రాడు. జీర్ణం, జీర్ణం, వాతాపి జీర్ణం!'' అంటూ కడుపు
నిమురుకుంటూ, ‘‘వాతాపి హరించిపో
ూడు!'' అన్నాడు. ఇల్వలుడు ప్రాణభీతితో గజగజ
వణికి పోతూ జాడలేకుండా పారిపో
ూడు. ఆ విధంగా వాతాపి ఇల్వలుల దారుణ హత్యా
కాండల మా
ూనాటకం అంతమైంది.
ఆ తరువాత అగస్త్యుడు మిగతా అతిథు లకు జరిగిందంతా చెప్పి, రాతిదుర్గంలో
కుప్పతెప్పలుగా పడి ఉన్న అస్థిపంజరాల్నీ, కపాల రాసులనూ చూపించాడు. వారంతా
గుండెలు బాదుకుంటూ, బ్రతికి బ
ుట పడ్డందుకు అగస్త్యుడికి కృతజ్ఞతతో
ప్రణమిల్లి మ్రొక్కారు. ఆ దుర్గంలో పదిలంగా భద్రపరిచి ఉన్న ధనరాసుల్ని
అగస్త్యుడు చూశాడు. తనకు కావలసినది పోగా మిగిలిన ధనంతో అక్కడ ఒక మహానగరం
నిర్మించవచ్చు.
వేలాదిమంది ప్రజలు సుఖంగా జీవించవచ్చునని ఆ
ు నకు తోచింది. వెంటనే
అగస్త్యుడు అందరికీ ధనాన్ని పంచడం మొదలుపెట్టాడు. ఆ సంగతి విని, సమీప
రాజ్యాల నుండి ఎంతోమంది ప్రజలు అక్కడకు చేరుకొని, అగస్త్యుడిచ్చిన ధనంతో
ఇళ్ళు కట్టుకొని స్థిరపడ్డారు.
అగస్త్యుడికి విఘ్నేశ్వరుడి ఆకారంలాగ కనిపించిన మహాశిల కేంద్రంగా
చుట్టూరా ఒక మహానగరం త
ూరయింది. వాతాపి జీర్ణంతో ఏర్పడిన ఆ నగరం
వాతాపినగరంగా పేరు పొందింది. అగస్త్యుడు స్వపరిపాలనా సూత్రాలను శిలాఫలకాల
మీద చెక్కించి, నగరంలో పెట్టించాడు. ప్రజలే పాలకులుగా ఆదర్శప్రా
ుమైన
ప్రజారాజ్యం ఏర్పడింది.
No comments:
Post a Comment