పూర్వము
ఒకానొక ఊరిలో ఒక చిన్నది వుండేది. ఆమెకు సవతి తల్లి పోరు ఎక్కువగా
వుండేది. అది భరించలేక ఆ చిన్నది తన అమ్మమ్మ గారి ఇంటికి వేల్లిపోయినది.
సవతి తల్లి ఆ పిల్లను తీసుకు రమ్మని భర్తను వేదించేది. అందకు అతడు
అంగీకరించలేదు. ఒకనాడు సవతి తల్లి తన భర్తతో ఆ పిల్లను తీసుకు రమ్మని
ఎంతగానో పట్టు పట్టింది. అప్పుడు ఆమె భర్త నువ్వే వెళ్లి తీసుకొని
రమ్మన్నాడు. చేసేది లేక సవతి తల్లి ఆ చిన్న దాని తాతగారించికి వెళ్ళింది.
పిల్లను పంపించమని అడిగింది. వారు అంగీకరించలేదు. వారితో జగదమాది
ఆఖరికి ఎలాగైతేనేం వాళ్ళను ఒప్పించి ఆ చిన్న దానిని తన వెంట ఇంటికి తీసుక
వచ్చింది.
ఒక రోజున ఆ చిన్నది తన సవతి తల్లి తులసి పూజ చేయడం చూసింది. తనకు కూడా ఆసక్తి కలిగి ఇంట గల అరిసెలు తెచ్చి నైవేద్యం పెట్టి తులసి దేవిని పూజించింది. ఆమె భక్తికి మెచ్చి తులసి దేవి సాక్షాత్కరించి ఓ చిన్నదానా! గత జన్మలో నువ్వు కన్నె తులసి నోము నోచి ఉల్లంఘించి నందువల్ల నీకు తల్లి పోయి సవతి తల్లి కలిగింది. కనుక నువ్వు కన్నె తులసి నోము నోచుకోమన్నది. ఆ తులసీ దేవి చెప్పిన ప్రకారం ఆ చిన్నది కన్నె తులసి నోమును భక్తి శ్రద్దలతో నోచి సంవత్సరాంతమున ఉద్యాపన చేసుకున్నది. నాటి నుండి ఆ సవతి తల్లి ఆమె పట్ల ప్రేమానురాగాలు కలిగి ఎంతో ఆదరణతో చూసుకునేది.
ఉద్యాపన: తులసమ్మకు పదమూడు జతల అరిసెలు నైవేద్యము పెట్టి పూజచేయ్యాలి. ఒక కన్యకు తలంటు నీళ్ళు పోసి పరికిణి, రవిక ఇచ్చి అరిసెలు వాయనమివ్వాలి.

No comments:
Post a Comment