అక్క చెల్లెళ్ళు ప్రసన్నవదనా, మోహనా వరసగా విగ్రహాల్ని చూసుకుంటూ
వెళ్ళి, నిరుత్సాహంగా మరలబోతూ, అవతల పిల్లల కోలాహలానికి ఆశ్చర్యంగా చూశారు.
‘‘అక్కడ ఒక తక్కువ రకం రంగుల విగ్రహం ఉందిలెండి!'' అంటూ ఎవరో అనడం
వాళ్ళకు వినిపించింది. అది విని మోహన, ‘‘పదవే, అక్కా! అదేదో తక్కువలోనే
దొరుకుతుందిలా ఉంది!'' అంటూ ప్రసన్నవదన చేయి పుచ్చుకుని అటు దారితీసింది.
అంతా ఆడా, మగా జనం ప్రదర్శనశాలలో ఒక్కరు మిగలకుండా వారిని వెంబడించారు.
ప్రసన్నవదన వెళ్ళి, వరహాల సంచిని విగ్రహం ముందు పెట్టి, తన మెడలోని పచ్చల
రత్నాల హారాన్ని తీసి విచిత్రుడి చేతికి కంకణంలాగ చుట్టింది. అది చూసి జనం,
‘‘వీళ్ళకేదో పిచ్చి ఉంది! అలాంటి గొప్ప విగ్రహాల్ని కాదని ఇక్కడ డబ్బు
ధారపోస్తున్నారు!'' అన్నారు.
ప్రసన్నవదన వాళ్ళతో, ‘‘ఇక్కడున్న విగ్రహంలో ఏ విశేషాన్ని చూసి
పిల్లలంతా మురిసి ముచ్చట పడుతున్నారో, ఆ విశేషమే మమ్మల్ని ముగ్థుల్ని
చేసింది. బాల దీవనలు బ్రహ్మ దీవనలు, పిల్లలు దైవ సమానులనీ అంటారు. అందుకే
వారి ఎన్నికను శిరసావహించాము,'' అన్నది.
‘‘మట్టి శిల్పంలో లేని రూపసౌందర్యాన్ని, సొంపుల్ని సామాన్యమైన జేగురు,
సున్నము, బొగ్గు మొదలైన రంగులతోనే ఎంతో మూర్తివంతంగా తీర్చిదిద్దిన
చిత్రకారుని ప్రతిభ అమోఘంగా ఉంది. మా బహూకరణం అతి స్వల్పం!''అని మోహన
అన్నది.
ఆ సమ
ుంలో, విచిత్రుడి వృద్ధ జననీ జనకులు అక్కడికి వచ్చారు. ‘‘నా
ునా,
పావనా! వాతాపి గణేశుడి కృప వల్ల మా అన్వేషణ ఫలించింది, ఇంతవాడివై
కనిపించావు!'' అంటూ కుమారుణ్ణి కౌగిలించుకుని ఆనందబాష్పాలు రాల్చారు.
అప్పుడు విచిత్రుడు బాల్యం దాటుతున్న నవ
ుువకుడు. తల్లిదండ్రులను చూసి
మహదానందం పడ్డాడు. గతం అంతా గుర్తుకొచ్చింది. తన పేరేమిటో తెలిసింది. వారి
సమాగమాన్ని చూసి, ప్రసన్నవదన తృప్తిపడుతూ, ‘‘ఇప్పుడిప్పుడే మా కోరిక
నెరవేరింది, మా మొక్కు చెల్లించుకుంటాము,'' అని చెప్పింది.
క్షణాల మీద జనం అక్కడ పెద్ద పందిరి వేశారు. విశాలమైన వేదిక అమర్చారు.
ప్రసన్నవదన వినా
ుక విగ్రహాన్ని అంటిపెట్టుకు కూర్చుని తాళాలు వాయిస్తూ,
‘‘తాండవ నృత్యకరీ గజానన...'' అని కీర్తన మొదలుపెట్టింది. వేదికపై మోహన
విద్యుల్లతలాగా నృత్యం చేస్తూంటే, జనం పరవశించిపోతూ ఆనందతరంగాల్లో
ఊగిపోతున్నారు. ప్రసన్నవదన గానం గజానన పండితుడికి వినిపించింది!
అప్పుడు గజాననుడు శతాధిక వృద్ధుడై ఇల్లు కదలలేని స్థితిలో ఉన్నాడు.
అతనికి ఎక్కడలేని జవసత్వాలు వచ్చాయి. పరుగులాంటి నడకతో పందిట్లోకి చేరుతూనే
ప్రసన్నవదనను చూసి చేతులెత్తి జోడించి సాగిలపడి అలాగే కదలా మెదలక
ధ్యానముద్రలో ఉండిపో
ూడు.
నృత్యం చేస్తూ, చేస్తూ మోహన పెద్దదైన వినా
ుక విగ్రహాన్ని అవలీలగా
భుజానికెత్తుకుంది. అది చూసి తెప్పరిల్లిన జనం, ‘‘అంత బరువు
మో
ులేవమ్మా!'' అని అంటూంటే మోహన,‘‘నాకు అలవాటేగా!'' అని చెప్తూ
విగ్రహాన్ని, భుజాన మోస్తూ, నాట్యంచేస్తూన్న నడకతో బ
ులుదేరింది. జనం అంతా
ఆమె వెనకనే వెళ్ళారు. ఆ సందట్లో ఎప్పుడో అదృశ్యమైన ప్రసన్నవదన సంగతే ఎవరికీ
పట్టలేదు.
ధ్యానముద్ర నుండి గజాననుడు కళ్ళు తెరిచాడు. ఎదురుగా విగ్రహమున్నచోట
మెరుస్తున్న వరహాలతో నిండుగా ఉన్న బంగారు జలతారు సంచి కనిపించింది.
పాదాలచెంత విచిత్రుడు మోకరిల్లి కూర్చుని ఉన్నాడు. గజాననుడు విచిత్రుడితో,
‘‘ఆల
ు మంటప కుడ్యాలను గణేశ లీలల చిత్రశోభితం చెయ్యి! అందుకు కావలసిన
ధనాన్ని ప్రసన్నవదనుడైన విఘ్నేశ్వరుడే ఆనందంగా అందించాడు గదా!'' అంటూ
లేచాడు.
గజానన విచిత్రులిద్దరూ ఊరేగింపుగా వెళ్తున్న జనంతో కలిశారు. మోహన
విగ్రహంతో ఆల
ు పుష్కరిణికి చేరుకుని తటాక సోపానాలు దిగుతూ మా
ుమై, ఆమెకు
మారుగా చిటె్టలుక విగ్రహాన్ని వీపున మోస్తూ నీటిలోకి పరుగు తీసింది. ఆ రోజే
విగ్రహాల్ని జల నిమర్జనం చేసే ఉత్సవ దినం.
విగ్రహం తటాక మధ్యానికి చేరుకుని, కోటి పూర్ణిమల కాంతిపుంజంగా
భాసించింది. ఆ కాంతిలో అభ
ుహస్తంతో ఆశీర్వదిస్తూ విఘ్నేశ్వరుడు లీలగా
కనిపించి, అంతర్థానమ
్యూడు.
గజాననుడు విచిత్రుణ్ణి గాఢాలింగనం చేసుకుని,‘‘నా
ునా,పావనా!నీ మూలంగా
వాతాపి నగరానికి పావనత మిశ్రమమైంది. నీవు పావన మిశ్రుడివి!'' అని చెప్పాడు,
అంటూ పావనమిశ్రుడు ఆగకుండా, ‘‘గర్భాల
ు ముఖద్వారం మీది చిత్తరువు మహాభారత
రచన...'' అంటూ చెప్పుకు పోతుంటే,
ుువ చిత్రకారుడు, ‘‘గురుదేవా!'' అంటూ
పావనమిశ్రుడి పాదాలను చేతులతో చుట్టి, ‘‘మీ పావన చరిత్రను విన్న నేను
ధన్యుణ్ణి! నా పేరు ఆనందుడు. మీ పావన నామాక్షరి మొదటి రెండు అక్షరాల్ని
మార్చి, నా పేరు ముందు చేర్చి, ‘వపానందుడు' అనిపించుకుంటాను. ఈ మంటపం పావన
చిత్రాల
ుం! ఈ చిత్రాలకు ప్రతికృతులు రచిస్తాను. ముందుతరం వారికి మీరు
చెప్పిన కథలన్నీ చెప్తాను. అనుగ్రహించండి!'' అంటూ భక్తితో శిరస్సు వంచాడు.
మెరుస్తున్న వెండి జుట్టుతో, ముడతలు పడ్డ విశాల ఫాలంతో వార్థక్యం
పైబడ్డా, మనసుకు ముసలితనం రానివ్వని పావనమిశ్రుడు
ుువకుడి తలపై చేత్తో
ఆశీర్వదిస్తూ, మందహాసం చేసి మళ్ళీ చెప్పసాగాడు :
వ్యాసుడు తాను చెప్పబోేు మహాభారతాన్ని వ్రా
ుగల సమర్థుడు ఎవరా అని
ఆలోచిస్తూండగా, బ్రహ్మ సాక్షాత్కరించి, విఘ్నేశ్వరుణ్ణి లేఖకుడిగా
పెట్టుకోమన్నాడు. బ్రహ్మ ఆదేశానుసారం వ్యాసుడు విఘ్నేశ్వరుణ్ణి
ప్రార్థించాడు. విఘ్నేశ్వరుడు ప్రసన్నుడై, ‘‘వ్యాసా! నీ ధోరణిలో నీవు
చెప్పుకుపోతూండాలి, నా వంక చూడకూడదు సుమీ!'' అని చెప్పి వ్రాతకు
కూర్చున్నాడు.
విఘ్నేశ్వరుడు తన దంతం ముక్కనే గంటంగా పట్టి, మోపినది ఎత్తకుండా
వ్రాస్తున్నాడు. వ్యాసుడు అరమోడ్పు కన్నులతో ధ్యానమగ్నుడై చెప్తున్నాడు.
ఎదురుగా హిమాల
ు శిఖరాగ్రం నుంచి పడుతున్న జలపాతం మధ్యమావతి రాగంలాగా మంద్ర
గంభీరంగా నేపథ్య సంగీతం లాగా శృతి పోస్తున్నది. దేవదారు వనాలు
తలలూపుతూన్నవి. జలజల పారే నదాలు అనంత రాగమాలికలు ఆలపిస్తున్నవి. మహాభారతరచన
ధారావాహికంగా, నిర్విరామంగా సాగుతూన్నది.
పుట్టు గ్రుడ్డి, ధృతరాష్ర్టుడు హస్తినాపుర సింహాసనాన్ని అలంకరించాడు.
తమ్ముడు పాండురాజు సామ్రాజ్యభారాన్ని మోస్తూ విస్తరింపజేశాడు. పాండురాజుకు
పంచపాండవులూ, ధృతరాష్ర్టుడికి నూరుగురు కౌరవులూ పుట్టారు.
చిన్ననాటి నుంచే కౌరవ పాండవుల మధ్య స్పర్థ, అసూ
ులు వర్థిల్లాయి.
వ్యాసుడు చెప్తున్నాడు విఘ్నేశ్వరుడు వ్రాస్తున్నాడు. సభాపర్వం
సాగుతున్నది. మ
ుసభలో పరాభవం పొందిన దుర్యోధనుడు ప్రతీకారంగా పాండవుల్నీ
వారి భార్య ద్రౌపదినీ జూదంలో గెల్చుకుని ద్రౌపదీ వస్త్రాపహరణ తలపెట్టాడు.
భీముడు దుర్యోధనుడి రక్తం తాగుతానని సింహగర్జన చేశాడు.
పాండవులు వనవాసం చేశారు. విరాటరాజు కొలువులో అజ్ఞాతవాసం చేస్తున్నారు.
సైరంధ్రిగా ఉన్న ద్రౌపదిని కీచకుడు అవమానించి భీముడి చేతిలో ముద్ద ్యూడు.
ఉత్తర గోగ్రహణంలో బృహన్నల విజ
ుుడ
్యూడు. మహాభారతంలో సుందరకాండగా
విరాటపర్వం సాగింది. జలపాతం కళ్యాణిరాగం ధ్వనిస్తున్నది. అభిమన్యుడికి
ఉత్తరకు వివాహం జరిగింది. కృష్ణుడు రా
ుబారం వెళ్ళి పాండవులకు ఐదు ఊళ్ళు
ఇస్తే చాలన్నాడు. దుర్యోధనుడు సూది మొనపాటి నేల కూడా ఇవ్వనన్నాడు.
ుుద్ధం అనివార్యమైంది. హిమాల
ు ఝరి కదన కుతూహల రాగం ఆలపిస్తూ శిఖరాలు
విరిగి పడుతున్నవా అన్నట్లుగా పడి హెచ్చిపడుతూన్నది. హిమానీ నదాలు
గుర్రాల్లా దౌడు తీస్తున్నాయి.
కృష్ణుడు అర్జునుడి రథసారధి అ
్యూడు. అర్జునుడికి భగవద్గీతను
ఉపదేశిస్తున్నాడు. జలపాతం సామసౌరాష్ట్ర దేవగాంధార రాగాలను వినిపిస్తున్నది.
భీష్ముడు అంపశ
్యు చేరాడు. ద్రోణుడు పద్మవ్యూహం పన్నాడు. అభిమన్యుణ్ణి
పదిమందీ కలిస్తేనేగానీ చంపలేకపో
ూరు. సుభద్ర పుత్రశోకం లాగ జలపాతధ్వని
ముఖారి రాగంగా వినిపిస్తున్నది.
అర్జునుడు విజృంభించాడు. ద్రోణుడి తల ద్రుష్టద్యుమ్నుడు నరికాడు. అనేక
అనర్థాలు సంతరించుకున్న కర్ణుడిని నమ్ముకున్న దుర్యోధనుడు కర్ణుడి చావుతో
చిత్త
్యూడు. భీముడు దుశ్శాసనుణ్ణి చంపాడు. దుర్యోధనుడి తొడలు
విరగ్గొట్టాడు.
జూదంలో ఓడిపోయిన ధర్మరాజు తమ్ములతో
ుుద్ధంలో విజ
ుదుందుభి
మ్రోగించాడు. కృష్ణుడు అవతారం చాలించాడు. పరీక్షత్తుకు పట్టంకట్టి పాండవులు
ద్రౌపదితో మహాప్రస్థానం బ
ులుదేరారు. ధర్మానికి చావు లేదు, చివరకు
నిలబడేది ధర్మమొక్కటే అన్నట్లుగా ధర్మరాజు మేరు శిఖరాగ్రం మీద నిలబడ్డాడు.
జలపాత ధ్వని క్షణిస్తూన్నది. అంతటా గంభీర నిశ్శబ్దం ఆవరించుకున్నది.
వ్యాసుడు చెప్పింది విఘ్నేశ్వరుడు వ్రాస్తున్నాడా? లేక విఘ్నేశ్వరుడు
వ్రాసింది వ్యాసుడు చెపుతున్నాడా? అన్నట్లు చకచకా భారత రచన సాగింది.
సత్యలోకంలో పద్మాసనంపై బ్రహ్మ సంతృప్తిగా చిరునవ్వు చిందిస్తూ,
సాభిప్రా
ుంగా సరస్వతి వంక చూశాడు. వెంటనే సరస్వతీ దేవి వీణ మీటుతూ
శ్రీరాగాన్ని పలికించింది. మహాభారతం చెప్పడం పూర్తి కావస్తున్నది. చివరి
పర్వంలో వున్నది.
సరస్వతీదేవి సత్యలోకం నుంచి మంగళాచరణంగా శ్రీరాగం ఆలాపిస్తున్న
వీణానాదం, తాను చెప్పుతున్న కథనానికి అంతరా
ుంగా వ్యాసుడి చెవిని సోకింది.
ఇంకా చెప్పవలసినది చాలా ఉంది. వ్యాసుడు ఆదమరుపుగా లేఖకుడి దెసతేరి చూశాడు.
మరుక్షణంలో విఘ్నేశ్వరుడు అంతర్థానమ
్యూడు.
మహాభారత గ్రంథం మీద ఆకాశం నుండి అక్షంతల్లాగ పువ్వులు జలజలా రాలాయి.
వ్యాసుడు ఆత్రంగా గ్రంథాన్ని విప్పి పరిశీలనగా చూశాడు. తాను ఇంకా
చెప్పదలచినదంతా ఒక్కఅక్షరం తేడా లేకుండా సంపూర్ణంగా వ్రా
ుబడి ఉంది.
వ్యాసుడు ఆనందాశ్చర్యాలతో పులకించిపోతూండగా, మహతి వీణపై హంసధ్వనిరాగం
వినిపించింది. నారదుడు వస్తూనే, ‘‘ఏమిటి మహాభారత మహర్షీ! ఆశ్చర్యపడిపోతూ
చూసుకుంటున్నావు?'' అన్నాడు. వ్యాసుడు జరిగినది చెప్పాడు.
‘‘అంటే, నీవు చెప్పేది చెప్పకుండానే ముందుగానే నీ లేఖకుడు వ్రాసుకుంటూ
వచ్చాడన్న మాట!'' అన్నాడు నారదుడు మందహాసం చేస్తూ. ‘‘ఔను, నారదా! అదే
జరిగింది. అటువంటి లేఖకుడు ఎలాంటి తపస్సులు చేసినా ఎవరికీ లభించడు కదా!
నేను ధన్యుణ్ణి! నా సంకల్పం జ
ుప్రదమైంది. మహాభారతాన్ని ‘జ
ుం'అని కూడా
పేర్కొంటున్నాను!'' అనిచెప్తూ వ్యాసుడు చేతులు జోడించి విఘ్నేశ్వరుణ్ణి
భక్తితో ధ్యానించాడు. మహాభారతం దగ్గర పెద్ద జ్యోతి పెరుగుతూ కనిపించింది. ఆ
జ్యోతి విఘ్నేశ్వరుడి ఆకారంగా రూపొందింది.
విఘ్నేశ్వరుడు సాక్షాత్కరించి, ‘‘వ్యాసమహర్షీ! నీ మహాభారతం అద్వితీ
ు
మహాకావ్యమై పంచమవేదంగా పరిగణింపబడుతూ కీర్తింపబడుతుంది!''అని, వ్యాసుణ్ణి
ఆశీర్వదిస్తూ అంతర్హితుడ
్యూడు. విఘ్నేశ్వరుడిచేత అతని దంతపు గంటంతో
లిఖింపబడి అక్షరసిద్ధి పొందిన మహాభారతం అన్ని కాలాల్లో సారస్వతాకాశంలో
మిలమిల మెరిసే చుక్కల్లో చందమామగా నిలిచింది.
No comments:
Post a Comment