పూర్వము ఒక
రాజ్యములో రాజు భార్య మంత్రి భార్య కలిసి శాఖ దానము నోమును నోచారు. ఒక
సంవత్సరము పాటు మంత్రి భార్య ప్రతి రోజు ఒక తోటకూర చెట్టును కొంత దక్షిణతో
కలిపి ఒక విప్రునకు దానమిస్తుండేది. రాజు భార్య సంవత్సరమునకు సరిపడు
తోటకూర చెట్లు తెప్పించి విప్రులను రప్పించి వారికి దక్షిణ తామ్బూలాడులతో
ఒక్క సారిగా దానమిచ్చింది. కాలం గడుస్తున్దగ్తా మంత్రి భారీ సుఖ
సంతోషములతో ఆనందముగా జీవిస్తున్నది. రాజు భార్యకు సుఖ శాంతులు లేక
కష్టాలతో జీవిస్తుండేది.
ఈ విషయం మంత్రి భార్య వద్దకు వెళ్లి చెప్పి మనమిద్దరమూ శాఖ దానము చేసితిమిగాడా మరి నీకు సుఖ శాంతులు కలుగుటకు కారణమేమిటి అని ప్రశ్నించినది. అందుకా మంత్రి భార్య మహారాణి ఒక్క సారిగా వ్రతమును పూర్తి చేయాలన్న తొందరపాటు భావంతో మీరు వ్రత నియమాన్ని కూడా ఉల్లంఘించి సంవత్సరం రోజులపాటు ప్రతీ రోజు పంచవలసిన తోటకూర చెట్లను దక్షిణ ను ఒకే రోజు పంచడం వల్ల వ్రత విధి విదానాలను ఆచరించ కుండా వ్రతమును పూర్తి చేసినందువల్ల మీకు మనఃశాంతి లోపించి దు:ఖము కష్టములు కలుగుటకు కారణమని మరలా శాఖ దానము నోమును నోచి భక్తితో ప్రతి రోజు శాఖమును దక్షినలతో కలిపి ఏడాదిపాటు దానము చేయవలసినదని మంత్రి భార్య రాజు భార్యకు చెప్పింది. ఆమె మాటల యందు నమ్మకము వుంచి రాజు భార్య శాఖ దాన నోమును భక్తితో వ్రాతవిది విదానములతో నియమముతో వ్రతమును పూర్తి చేసినందువల్ల ఆమె స్థితి మారి కష్టాలు తొలగి సుఖ సంతోషాలతో ఆనందముగా జీవించింది.
ఉద్యాపన: ఒక బ్రాహ్మణుడిని పిలిచి తలంటి నీళ్ళు పోసి తోటకూర చెట్టును పదమూడు నాణాలను దక్షిణగా ఆ విప్రునకు దానమివ్వాలి.

No comments:
Post a Comment