Thursday, September 19, 2013

పార్వతి ప్రియ పుత్రుడు, సేవకుడు గణపతి


పార్వతీదేవికి ఇద్దరు చెలికత్తెలు. వాళ్ళ పేర్లు జయ, విజయ. ఒకసారి వాళ్ళు పార్వతీదేవితో ముచ్చటిస్తూ ఉండగా వారి సంభాషణ ఇలా సాగింది...

''మహాశివుని దగ్గర లెక్కలేనన్ని గణాలు ఉన్నాయి. అయితే, వారిలో మనవాడు అనుకోదగిన వారు ఒక్కరు కూడా లేరు. వాళ్ళంతా శివుని ఆజ్ఞా పాలకులే మన మాటలు వినేవారు కారు. అలాంటప్పుడు మనకు ఆత్మీయం అనుకునే వ్యక్తి, మనకు విధేయుడిగా ఉండేటటువంటి వ్యక్తిని ఒకరిని సృష్టించకూడదా అమ్మా?!" అని అడిగారు.

చెలికత్తెలు అన్న మాటలు పార్వతీదేవిపై ప్రభావం చూపాయి. దేవికి ప్రేరణ కలిగింది కానీ, అప్పటికి మాత్రం మౌనంగా ఊరుకుంది.

యధాప్రకారం కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు పార్వతీదేవి, నందీశ్వరుని ద్వారపాలకునిగా నియమించి అభ్యంగన స్నానం ఆచరించేందుకు వెళ్ళింది. ఆవిడ స్నానం పూర్తికాకుండానే మహాశివుడు వచ్చాడు. నందీశ్వరుని పక్కకు జరగమని తిన్నగా లోనికి వచ్చాడు. దాంతో పార్వతీదేవికి సిగ్గుగా అనిపించింది. చెప్పొద్దూ.. శివుని మీద కోపం కూడా కలిగింది.

ఆ సమయంలో పార్వతీదేవికి మునుపు చెలికత్తెలు తనతో అన్న మాటలు జ్ఞాపకానికి వచ్చాయి. వారన్న మాటలో ఎంతో ఔచిత్యం ఉంది. తనవాడు అయిన వ్యక్తిని కనుక ద్వారం వద్ద కాపలాగా ఉంచినట్లయితే మహాశివుడు ఈవిధంగా నెట్టుకుని, అక్రమంగా లోనికి రాగలిగేవాడు కాదు కదా... తాను ఇలా సిగ్గుతో కుంచించుకు పోవలసిన అగత్యం ఉండేది కాదు కదా... అని ఆలోచించింది.

తనవాడు అనిపించే వ్యక్తి తనకు సదా అందుబాటులో ఉండాలనే ఆలోచన క్రమంగా పెరిగి పెద్దదయింది. కొన్నిరోజులకు ఆ ఆలోచన కార్యరూపం ధరించింది. ఒకరోజు పార్వతీదేవి తన మేనుకు పట్టించిన నలుగుపిండితో ఒక బాలుని ఆకృతిగా తీర్చిదిద్దింది. ఆ బాలుని రూపొందిస్తున్నంతసేపూ ''ఈ బాలకుడు శుభకరుడు, అపూర్వ బలశాలి, సకల సద్గుణుడు, సర్వ లక్షణ సంపన్నుడు, అద్వితీయ తేజోవంతుడు, మహా సుందరుడు కావాలి. ఈ అపురూపమైన బాలుడు నా సేవకుడిగా ఉండాలి. నేను ఏది చెప్తే దాన్ని ఆజ్ఞగా తీసుకోవాలి. తక్షణం అక్షరాలా అమలుపరచాలి...'' అంటూ మధురమైన ఊహల్లో తేలింది.

పార్వతీదేవి తాను స్వహస్తాలతో రూపొందించిన బాలునికి ఊపిరి పోసింది. ముచ్చట కలిగించే వస్త్రాలు తొడిగింది. అనేక అమూల్యమైన ఆభరణాలతో అలంకరించింది. ఆ బాలుని చూస్తే అపురూపంగా, గర్వంగా అనిపించింది. ప్రేమగా స్పృశించి, ఆత్మీయంగా ముద్దు పెట్టుకుని, ''బాలకా! నాకు సంతానం లేదు. ఈ క్షణం నుంచీ నువ్వే నా పుత్రుడివి. నేను ఎలా చెప్తే, అలా వినాలి. నా మాటలు తూచా తప్పకుండా పాటించాలి. ..

''బాలకా, ఇప్పుడు నేను అభ్యంగన స్నానం చేసేందుకు వెళ్తున్నాను.. ఎవర్నీ, ఎట్టి పరిస్థితిలో లోనికి రానీయకు..'' అని చెప్పడమే కాకుండా చేతిలో ఒక కర్ర కూడా ఉంచి మరీ వెళ్ళింది.

పార్వతీదేవి స్నానానికి వెళ్ళిన కొద్దిసేపటికి మహాశివుడు వచ్చాడు. ద్వారం దగ్గర నిలబడిన బాలుని చూసి ఆశ్చర్యపోయి, తప్పుకోమన్నాడు. పార్వతీదేవి స్వయంగా రూపొందించి, నియమించిన బాలుడు కదా, వీల్లేదన్నాడు.

కోపోద్రిక్తుడైన మహాశివుడు, తన గణాలను రప్పించి, కాపలాగా నిలిచిన బాలుని తరిమేయమన్నాడు. దేవగణాలు మూకుమ్మడిగా వచ్చి బాలకునితో యుద్ధం చేశాయి. ఆ యుద్ధాన్ని చూసిన పార్వతీదేవి తల్లడిల్లింది. తన కొడుకును ఒక్కడిని చేసి, ఇంతమంది ఘోరంగా పోరాడుతున్నారే.. ఇదేమైనా న్యాయమా అనుకుంది. దేవి, తన పుత్రునికి సాయపడేందుకు ఇద్దరు శక్తి దేవతలను సృష్టించింది. కానీ ఫలించలేదు.

మహావిష్ణువుతో సహా దేవ గణాలు అందరూ ఏకమై గణపతితో యుద్ధం చేశారు. చివరికి మహాశివుడు, పార్వతీ నందనుని తలను త్రిశూలంతో ఛేదించాడు.

శ్రీ శిరిడీ సాయి తత్వం

ఈ కలియుగంలో మనము ప్రతీ క్షణం తెలిసో, తెలియకో ఎన్నొ పాపాలను చేస్తూ వుంటాం. ధనార్జనే పరమావధిగా బ్రతికే మానవునికి తన దైనందిన జీవితంలో దైవానికి, గురువుకు స్థానం లేకుండా చేసేసుకున్నాడు. తత్ఫలితంగా ఎన్నొ సమస్యలకు, అశాంతికి, ఆందొళనలకు గురవుతున్నాడు. కాని గురువుకు సర్వస్య శరణాగతి చేసిన వారు మాత్రం ఆ గురువు యొక్క అపూర్వ కరుణా కటాక్షాలకు పాత్రులగుతూ ఎంతో సంతోషకరమైన జీవితం అనుభవిస్తున్నారు. అంటే దీనర్ధం గురువు భక్తులకు చింతలు, సమస్యలు, కష్టాలు, కన్నీళ్ళు వుండవని కాదు.కల్లోల కడలిలో క్రుంగిపోతున్నా , తన భక్తులను ఆ గురువే వచ్చి రక్షించి, వారిని ఈ సంసారమనే కడలి నుండి సురక్షితంగా ఒడ్డుకు చేరుస్తాడు. ఆ సద్గురువును నమ్ముకున్న వారు మరింక ఏ విషయం గురించి ఆలోచించనవసరం లేదు. హాయిగా తమ బరువు బాధ్యతలను ఆ సద్గురువు పాదాలకు అప్పగించి నిశ్చింతగా వుండవచ్చు.ఈ సత్యాన్ని గ్రహించిన వారు ధన్యులు. మిగితా వారు మాత్రం అనుక్షణం ఆ బరువు బాధ్యతలను మోయలేక మోస్తూ, కృంగిపోతూవుంటారు.



ఈ కలియుగంలో ఆ సద్గురువుకు సర్వస్య శరణాగతి చెయ్యడమే సాధనమని తెలుసుకున్నాము కదా ! అట్లే సద్గురువు యొక్క బోధలే మనకు వేద శాస్త్రాలు.ఆయన చెప్పిన మార్గమే మనకు అనుసరణీయం.తన భక్తులకు సమర్ధ సద్గురువైన సాయి ఎన్నో బోధలను చేస్తుండేవారు. ఆయనకు బోధలను చేయడానికి ప్రత్యేక సమయం కాని, స్థలం కాని, సమయం కాని అవసరం లేకుండేది. సంధర్భావసరముల బట్టి వారి ప్రభోధము నిరంతరం జరుగుతూ వుండేది. ఓకనాడు ఒక భక్తుడు మశీదులో తన తోటి భక్తుని గురించి విమర్శించసాగాడు. ఆ తోటి భక్తుడు చేసిన మంచి పనులను విడిచి అతడు చేసిన తప్పుల గురించి తీవ్ర పదజాలంతో ఘాటైన విమర్శలను చేయసాగాడు.ఆ దూషణలను విన్న ఇతరులు విసిగిపోయారు. ఆర్త భక్త జన పరాయణుడైన సాయి సన్నిధిలో ఇటువంటి విమర్శలు ఏల అని మనస్సులో బాధపడసాగారు. ఆ భక్తుడు తన తోటి భక్తుడిని విమర్శిస్తూ ఎంతటి పాపం మూటకట్టుకుంటున్నారో సర్వజ్ఞుడైన సాయి గ్రహించారు. ఆ మధ్యాహ్నం శ్రీ సాయి లెండీ తొటకు వ్యాహ్యాళికొ పోయేసమయంలో ఆ భక్తుడు బాబాని దర్శించి ప్రణామం చేసాడు. అప్పుడు శ్రీ సాయి మలమును తింటున్న ఒక పందిని చూపించి " చూడు నాయనా ! అమేధ్యాన్ని ఎంతో ప్రీతిగా తింటున్న ఆ పందిని చూడు.నీ ప్రవర్తన, స్వభావము కూడా అంతే. ఎంత ఆనందంగా నీ సాటి సోదరుని తిడుతున్నావు ? కోటి జన్మలలో ఎంతో పుణ్యం చేయగా నీకీ అరుదైన మానవ జన్మ లభించింది.దీనికి సార్ధకత చేకూర్చడానికి ప్రయత్నించాలి గాని ఈ విధమైన దోషణలను చేసి ఎందుకు కొండంత పాపాన్ని మూటకట్టుకుంటున్నావు ?" సాయి మాటలతో ఆ భక్తునికి తన తప్పు తెలిసి వచ్చింది. వెంటనే క్షంచమంటూ శ్రీ సాయి పాదాలపై పడ్డాడు. శ్రీ సాయి అప్పుడు తన బోధను ఈ విధంగా కొనసాగించారు. " చూడు నాయనా ! ఇతరులను విమర్శించువాడు, దూషణములను చేయువాడు ఒక విధంగా తాను నిందించువానికి సేవ చేస్తున్నాడు. అది ఎట్లనిన, ఇతరులను నిందించడమంటే వారి శారీరక మలినములను తన నాలుకతో నాకి శుభ్రపరచడంతో సమానం.ఇట్టి అపరిశుభ్రమైన కార్యములను చేయడం నీకు తగునా ?భగవంతుని సృష్టిలో అందరూ సమానులే ! ఆ కుల, మత, జాతి , వర్ణ వైషమ్యాలను మనము సృష్టించుకున్నాము.ఎవరి పూర్వ జన్మ సంస్కారములను బట్టి వారు జీవితంలో ప్రవర్తించడం జరుగుతుంది.వారి ప్రవర్తన మనకు నచ్చనంత మాత్రాన, వారిని విమర్శించడం తగదు.ఇతరులను దూషించడం భగవంతుని దూషణతో సమానం.ఒకరు ఇంకొకరిని దూషిస్తే నాకెంతో బాధ కలుగుతుంది, కనుక ఆ పనులను ఇక మీదట చేయవద్దు" మానవ ప్రవర్తనపై శ్రీ సాయి ఎంతటి అపూర్వమైన దివ్య బోధను చేసారో చూడండి. ఆ పరిశుద్ధ పరమేశ్వర అవతార స్వరూపునికి ప్రణమిల్లి ఆ దివ్య సందేశాన్ని మనసులో పదిల పరచుకొని ఆ ప్రకారంగా జీవించి, సాయి అనుగ్రహ, కటాక్షములకు పాత్రులమవుదాము.


సర్వం శ్రీ శిరిడీ సాయి పాదారవిందార్పణమస్తు

శివయ్య లింగరూపంలో వెలసిన "పుణ్యగిరి"

చుట్టూ ఎత్తైన కొండలు, వాటి మధ్యలో జలపాతాల హోరు, కనువిందు చేసే ప్రకృతి సౌందర్యం, ఆ కొండలపై వెలసిన ఉమా కోటిలింగేశ్వర స్వామి, వెరసి భక్తుల మదిని పులకింపజేసేదే "పుణ్యగిరి" దేవాలయం. ఇక్కడ స్నానమాచరించి స్వామివారిని దర్శించుకుంటే సర్వపాపాలూ వైదొలగుతాయని భక్త జనులు ప్రగాఢంగా విశ్వసిస్తుంటారు.

దక్షిణ కాశీగా పిలవబడుతూ, భక్తుల చేత నిత్యపూజలందుకుంటున్న ఉమా కోటిలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంతంలో పూర్వం... ఋషులు తపస్సు చేసి, ఆ పరమశివుడి సాక్షాత్కారం పొందారట. అందుకే ఇక్కడ శివయ్య లింగరూపంలో వెలశాడని పూర్వీకుల కథనం.

పుణ్యగిరి గురించి మరో కథనం కూడా ఉంది. అదేంటంటే... మహా భారత కాలంలో పాండవులు అజ్ఞాతవాసం చేస్తున్న సమయంలో, పుణ్యగిరి కొండపై గల విరాటరాజు కోటలో తలదాచుకున్నారట. ఆ సమయంలో వారు ఇక్కడ పుట్టద్వారా వచ్చే పుణ్యజలంతో స్నానమాచరించి శివుడిని పూజించేవారట.

కాబట్టి... ఇంతటి పవిత్ర స్థలంలో స్నానమాచరించి ఆ పరమశివుడిని దర్శించుకుంటే సర్వపాపాలూ తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. శివరాత్రి పర్వదినాన పుణ్యగిరిలో జాగారం చేసి, ఉమా కోటిలింగేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే నేరుగా కైలాసం ప్రాప్తిస్తుందని భక్త జనులు గట్టిగా నమ్ముతుంటారు.

ఉమా కోటిలింగేశ్వర ఆలయం వెలసిన ప్రాంతంలో కోటిలింగాలు, త్రినాథ గుహ, దార గంగమ్మ పుణ్య జలపాతాలను విశేషంగా చెప్పవచ్చు. అంతేగాకుండా... ఆలయం చుట్టూ ఎత్తయిన కొండలు, మధ్యలో జలపాతాల హోరు, అడుగడుగునా కనిపించే పచ్చగా పరచుకున్న ప్రకృతి అందాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

హిందూ సంప్రదాయ పండుగలతో పాటు శివరాత్రి పర్వదినాన్ని పుణ్యగిరి ఉమా కోటిలింగేశ్వర స్వామి ఆలయంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. శివరాత్రికి తొమ్మిదిరోజులపాటు ఉత్సవాలు జరుగుతాయి. మొదటి మూడు రోజుల ఉత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తుంటారు.

ఈ ఉత్సవాలకు ఆంధ్ర రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా.. ప్రక్క రాష్ట్రాల నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. శివరాత్రి ఉత్సవాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థవారు ప్రత్యేక బస్సు సౌకర్యాన్ని కూడా కల్పిస్తున్నారు.

వసతి, రవాణా సౌకర్యాల విషయానికి వస్తే... విశాఖపట్నం-అరకు మధ్యలో నెలవై ఉన్న ఈ పుణ్యగిరి ఉమా కోటిలింగేశ్వర స్వామి ఆలయానికి ముఖ్యమైన అన్ని ప్రాంతాల నుంచి బస్సు సౌకర్యం ఉంది. శృంగవరపుకోట ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు బస్సులో వెళ్లి అక్కడి నుంచి మూడు కిలోమీటర్ల దూరం కాలినడకన చేరుకోవాల్సి ఉంటుంది. నడవలేనివారు బస్టాండు నుంచి ఆటోలలో కూడా వెళ్ళవచ్చు.

గజేంద్ర మోక్షం లో అంతరార్ధం

పూర్వజన్మలవల్ల, కర్మలవల్ల ప్రోగుచేసుకున్నవాసనలవల్ల ఏర్పడిన బంధాలతో ఇంద్రియ భోగలాలసత్త్వములతో కూడిన 'అహం' (నేను అన్నదేహాత్మభావన) మొసలి కాగా దానిచే పట్టుబడ్డ మానవుడే గజేంద్రుడు.
జనన మరణ చక్రంలో అనేకసార్లు పడి పరిభ్రమిస్తున్నమానవుడు ముక్తి పొందాలంటే అందుకు తనశక్తి మాత్రమే చాలదు. పరమాత్మ అనుగ్రహశక్తి పరిపూర్ణంగా కావాలి. ఆ అనుగ్రహంకై ఈ సంసార బంధాల నుండి, ఇంద్రియభోగలాలసల నుండి విముక్తి కల్గించమని ఆ పరమాత్మనే ప్రార్ధించాలి. ఈ భవసాగరంలో పడిన నన్ను రక్షించమని పరితపిస్తూ రక్షించేంతవరకు వేడుకోవాలి. పరమాత్మ పలికేంతవరకు ప్రార్ధన ఆపకూడదు - అచ్చంగా గజేంద్రుడులా!


తన పరివారంతో మోహంతో కూడి ఒక పెద్ద కొలనులో జలక్రీడలు సాగిస్తున్న గజేంద్రుడు, సంసార సాగరంలో ప్రాపంచిక పరివారంతో మనస్సుతో కూడి కదలాడుతున్న మానవునికి దర్పణం. గజేంద్రుడు మకరేంద్రుడు బారిన పడిన రీతిలో భవసాగరంలో క్రీడిస్తున్న మానవుడు ఆంతర్యామినే మరచి 'అహం' అనెడి మకరం నోటిలో చిక్కుకొని దుఃఖితుడవుతున్నాడు. గజేంద్రుడు తనని తాను రక్షించుకోవడానికి ప్రయత్నం ప్రారంభించినట్లుగానే మానవుడు కూడా అహం అన్న భావం నుండి బయటపడడానికి సాధన అన్న ప్రయత్నం చేయాలి. జలంనందు మొసలికి బలం ఎక్కువ. ప్రాపంచిక సంసారంలో ఇంద్రియభోగలాలసత్త్వంను అలవర్చుకున్న 'అహం' కు కూడా పట్టు ఎక్కువే. ఈ అహం నుండి విడివడాలంటే తన సాధనాబలంతో పాటు ఈశ్వర అనుగ్రహం కావాలని గజేంద్రునిలాగా గ్రహించి త్రికరణశుద్ధిగా ఆ అనంతున్ని అర్ధించాలి. 


గజేంద్ర మోక్ష ఘట్టంలో మొదట గజేంద్రుడు తన శత్రువైన మొసలిని తానుగా జయించడం కష్టమని తెలుసుకొని అందుకు పరమాత్మ మాత్రమే సహాయపడగలడని గ్రహించి పరమేశ్వరుని అనుగ్రహంకై ప్రార్ధించి, అటు పిమ్మట పలుకుటలేదని నిందాస్తుతి చేసి, అంతలోనే పరమభక్తితో వివేక విశ్వాసాలతో నీవు తప్ప ఎవరూ లేరని తనని తాను శరణాగతి చేసుకోగానే ఆ అనంతుడు సుదర్శనచక్రంను ప్రయోగించి మకరసంహారం చేసి దర్శనమిచ్చాడు. ఆలానే మానవుడు కూడా తనకి తానుగా ఈ ప్రారబ్ధవాసనలను అద్దుకున్న 'అహం'భావనను జయించడం కష్టమని గ్రహించి పరమాత్మునికి భక్తివిశ్వాసాలతో ప్రార్ధించి, ఈ జన్మల పరంపరలో పడి అలసిపోతున్నాను, ఈ భవసాగరంలో ఈదలేను, ఈ జనన మరణ చక్రభ్రమణం నుండి నను రక్షింపుము, ఈ వాసనాబంధాలను తీసేయమని, వీటి అన్నింటనందు విముక్తి కల్గించమని (సమస్త ప్రపంచ దృశ్య సంసార భావనా పరిత్యాగమే విముక్తి) వేడుకుంటూ, క్రమేనా కోరిక, కర్మ, అహం సమర్పణ చేస్తూ శరణాగతి స్థితికి వస్తే - అప్పుడు సుదర్శనచక్రమనేజ్ఞానముతో అజ్ఞానఅహంభావనను సంహరించిన పిదప ఆత్మసాక్షాత్కారం అవుతుంది.
జన్మ పరంపరలనుండి విముక్తి పొందడమే ముక్తి. 


'తస్మాత్ భావా భావౌ పరిత్యజ పరమాత్మ ధ్యానేన ముక్తో భవతి' సమస్తమును త్యజించగా చివరకు ఆత్మ ఒక్కటే మిగిలివుంటుంది. అదియే ముక్తి. అదియే మోక్షం. 


ఈ ముక్తి మరణాంతరం వచ్చేది కాదు, బ్రతికుండగానే సాధించాల్సిన స్థితి. దీనిని తెలియజెప్పే కధనమే "గజేంద్ర మోక్షం". గజేంద్రుడు చేసిన ఈశ్వర స్తుతి ఎంతో గొప్ప ఆధ్యాత్మిక ప్రబోధం.

శుద్ధ ఆహారము

ఆహారమును మౌనముగా దైవానికి నివేదనచేసి, దైవమును స్తుతిస్తూ తీసుకున్న ఆహారం శుద్ధాహారం అవుతుంది. 

శుద్ధ ఆహరముచే మనస్సు నిర్మలమవును. శాంతి, దయ, వైరాగ్యం, దైవచింతన, బ్రహ్మభావన కలిగి పరబ్రహ్మప్రాప్తి పొందవచ్చును. 


పుత్రోత్పత్తికి హేతువగు శుక్లశోణితం ఏ అన్నపానీయములచే స్త్రీపురుషులకు ఏర్పడునో అట్టి అన్నము శుద్ధముగా ఉన్నచో - దైవ, మాతాపితరులయందు, గురువులయందు, వేదశాస్త్రాలయందు, సాదు సత్పురుషులయందు విశ్వాసం గల ధర్మాతులైన వంశోద్ధారక సంతానం కలుగుదురని శాస్త్రవచనం. 


మౌనంతో భుజించువారు స్వర్గమును పొందగలరు. దీనియందు సందేహం లేదు. మాట్లాడుతూ భుజించిన అన్నము అశుచి అగుతున్నది. వ్యర్ధవిషయాలు మాట్లాడుచు భుజించు అన్నం అన్నమే కాదు, పాపరూపమే యగును. మౌనంతో భుజించిన భోజనం ఉపవాస సమానమే అగుచున్నది. ఉపవాసం వలన ఎంత ఆత్మశుద్ధి కలుగునో అంత పుణ్యం మౌనంగా భుజించడం వలన కలుగును.

అన్నపూర్ణ విశిష్ఠత


అన్నం పరబ్రహ్మ స్వరూపం. సకల ప్రాణకోటికి జీవనాధారం అన్నం. అన్నపూర్ణ రూపంలో అమ్మ రసపాత్రను ధరించి దర్శనమిస్తుంది. ఆదిభిక్షువైన మహాశివునికి భిక్షపెట్టిన తల్లి అన్నపూర్ణ. ప్రపంచ సృష్టి పోషకురాలు అమ్మ అనే అంతరార్ధం ఈ అవతారికలో కనిపిస్తుంది. అమ్మ ధరించిన రసపాత్ర అక్షయశుభాలను అందిస్తుంది.

అన్నపూర్ణను ధ్యానిస్తే మేధాశక్తి వృద్ధి చెందుతుంది. మధుర భాషణం, సమయస్పూర్తి, వాక్శుద్ది, వాక్సిద్ధి, భక్తిశ్రద్ధలు, ఐశ్వర్యం కలుగుతాయి. భక్తుని సకలసంపూర్ణునిగా అనుగ్రహిస్తుంది ఈ తల్లి. బుద్ధి ఙ్ఞానాలను ఈ తల్లి వరంగా ఇస్తుంది. పరిపూర్ణభక్తితో తనను కొలిచైన భక్తుల పోషణభారం ఈమె వహిస్తుందని అర్షవాక్యం.

ఈ రోజున అమ్మవారిని అన్నపూర్ణగా అలంకరిమ్చి, తెల్లని పుష్పాలతో పూజ చెయ్యాలి. ” హీం శ్రీం, క్లీం ఓం నమోభగత్యన్నపూర్ణేశి మమాభిలాషిత మహిదేవ్యన్నం స్వాహా” అనే మంత్రాన్ని జపించాలి. అమ్మవారికి దధ్యోదనము, కట్టెపొంగలి నివేదనం చెయ్యాలి. అన్నపూర్ణ అష్టోత్తరం, స్తోత్రాలు పారాయణ చెయ్యాలి.

//ఉర్వీసర్వజయేస్వరీ జయకరీ మాతాకృపాసాగరీ
నారీనీల సమానకుంతల ధరీ నిత్యాన్నదానేశ్వరీ
సాక్షాన్మోక్షకరీ సదా శుభకరీ కాశీ పురాధీశ్వరీ
భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ//

అరసవల్లి శ్రీ నారాయణ స్వామిని దర్శించుకుంటే?

శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ దేవాలయమైన ఉషా పద్మినీ ఛాయా సమేత శ్రీ నారాయణ స్వామిని సూర్య కిరణాలు తాకుతాయి. అరసవల్లి దేవస్థానం ప్రాంగణం అనివెట్టి మండపం, ధ్వజస్తంభం నుంచి సుదర్శన ద్వారం మధ్యలో తొలి కిరణాలు గర్భగుడిలోకి మాలవిరాట్టు ఆదిత్యుని శిరస్సును సృశిస్తాయి.

ఆదిత్యునిని సూర్యకిరణాలు తాకిన వైనాన్ని తిలకించేందుకు తండోపతండాలుగా భక్తకోటి అరసవల్లికి తరలివస్తారు. సకల జీవులకూ సంక్షేమాన్ని, ఆయురారోగ్యాలనూ, ప్రసాదించే ఈ స్వామివారి ఇరు చేతులూ అభయ ముద్రలోనే ఉంటాయి.

మాములు రోజులతో పోలిస్తే మాఘ, వైశాఖ, కార్తీక మాసాల ఆదివారాల్లో ఈ క్షేత్రానికి వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. అందులో ముఖ్యంగా రథసప్తమినాడు ఆ సంఖ్య లక్షల్లోకి చేరుకుంటుందన్న విషయం అందరికీ తెలిసిందే.

అలాగే ఉత్తరాయణ, దక్షిణాయన మార్పుల్లో భాగంగా ప్రతిఏటా మార్చి 9, 10, 11, 12 తారీఖుల్లోనూ, అక్టోబర్ 1, 2, 3, 4 తేదీల్లోనూ, స్వామివారి, ధ్రువమూర్తిపై ఆదిత్యునిని తొలికిరణాలు తాకుతాయి. స్వామి పాదాల మీదుగా మొదలై శిరోభాగం వరకూ సూర్యకిరణాలు ప్రసరించే అద్భుత, అపురూపమైన దృశ్యాన్ని తిలకిస్తే సర్వపాపాలు తొలగిపోతాయని ప్రతీతి.

ఇకపోతే... అరసవల్లి క్షేత్రాన్ని ఆరోగ్య క్షేత్రంగానూ స్థానికులు పిలుస్తుంటారు. ప్రత్యేకించి బొల్లి, కంటి వ్యాధులు, కుష్టు, వ్యాధులతో పాటు ఇతర మానసిక, శారీరక రోగాల నుంచి విముక్తి కోసం బాధిత భక్తులు ఇక్కడికొచ్చి స్వామి వారిని దర్శించుకుంటుంటారని ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు.

కాశి

పావన గంగాతీరంలో గంగకు ఉపనదులైన వరుణ - అసి నదుల మధ్య ఒద్దికగా అమరియున్న, అమరధామమే బెనారస్, లేక వారణాశి లేక కాశి. "అంతర్ నేత్రాలు తెరిచే వారణాశి 4000 సంవత్సరాల నాటిది". హైందవ సంస్కృతి ప్రచారంలో, వైజ్ఞానికంగాను, చారిత్రకంగాను అనాది నుండి పేరెన్నిక గన్న పట్టణం, కాశీ మహా పుణ్యక్షేత్రము. ఉత్తరప్రదశ్‌లో ఉన్నది. గంగానదికి ఆవలివైపు బెనారస్, వారణాశి అని, ఈవలివైపు కాశి అని పిలువబడుచున్నది. వరుణ ఘట్టమునకు వాసి ఘట్టమునకు మధ్యనున్నది గనుక, దానికి వారణాశి అని పేరు వచ్చినది.

కాశ్యాంతు మరణాన్ముక్తి అను ఆర్యోక్తి ఉన్నది. కాశీలో మరణిస్తే ముక్తి తప్పక లభిస్తుంది అని దీని అర్ధము. ఎటు చూచినా అయిదు క్రోసులున్న ఈ పట్టణంలో, ఏజీవి మరణించినా ఆ సమయమున కుడిచెవి పైకి ఉంటుంది. ఈశ్వరుడు తారక మంత్రోపదేశము చేసి మోక్షము ప్రసాదిస్తాడు. ప్రళయకాలమందు కూడా, వారణాశికి నాశనము లేదట, ప్రళయకాలము సమీపించు సమయమున, సప్తరుషులు, తాము సురక్షితముగా ఉండు ప్రదేశాన్ని చెప్పమని కోరగా, ప్రళయకాలములో కూడా వారణాశి మునిగిపోకుండా త్రిశూలముతో గ్రుచ్చి ఎత్తి ఉంచుతాను.

గనుక అచట సురక్షితముగా ఉండండి అని సెలవిచ్చినాడు. కాశీ విశ్వనాధుడు, ఆవిముక్త వారణాశ్యాం, త్రికంట విరాజితే అని సంకల్పం చేస్తారు భక్తులు. ఒకప్పుడు వ్యాసుడు తన పదివేల శిష్యులతోను భిక్షాటనకు కాశీరాగా, అతనిని పరీక్ష చేయుటకు గాను, అన్నపూర్ణ విశ్వేశ్వరులు ఏడు దినములు భిక్ష లభించకుండా చేసినారు. అంత కోపితుడై వ్యాసుడు కాశీని శపించబోవ అన్నపూర్ణాదేవి ముతైదువ రూపమున ప్రత్యక్షమై భిక్ష అడిగినది. పిదప శంకరుడు వ్యాసుని కాశీ నుండి బహిష్కరించినాడు. అప్పుడు వ్యాసుడు క్షమింపమని కోరగా, నన్ను జూడవచ్చినవారు, నిన్ను కూడా దర్శిస్తారు. నీవు రాత్రిపూట నన్ను సేవింపవచ్చును అని శంకరుడు సెలవిచ్చినాడట. గంగానది ఆవలి భాగమున వ్యాసకాశి ఉన్నది. అచ్చట గంగ ఉత్తర వాహినిగా ప్రవహిస్తున్నది.

యిప్పటి ఈ మందిరం 1785లో అక్బరు చెల్లెలు అహల్యాభాయి గుడిని తిరిగి నిర్మించినది. మందిర గోపురమునకు 22 మణుగుల బంగారపు రేకు అమర్చినారు.

ఈ బంగారము పూర్వము రణజిత్ సింగు మహారాజుచే స్వామికి అర్పింపబడినది. తెల్లవారుజామున 4 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు విశ్వనాథుని ఆలయం తెరచి యుండును.

మణి కర్ణికా ఘట్టము

గంగానదీ తీరమున 64 స్నాన ఘట్టములు కలవు, అన్నింటికంటే ప్రాముఖ్యమైనది మణికర్ణికాఘట్టము, యాత్రీకులు ఈ ఘట్టమున స్నానముచేసి, విశ్వేశ్వరుని దర్శించుతారు. ఈ ఘట్టమునందెల్లప్పుడు శవ దహనములు జరుగుచుండును, పూర్వము మహావిష్ణవు ఇచట, తన చక్రముతో ఒక తటాకమును త్రవ్వి, దాని తీరమున శ్రీ విశ్వనాధుని గూర్చి తపస్సు చేసెను, శ్రీ విశ్వేశ్వరుడు ప్రత్యక్షమై, ఆ తటాకమును చూచి విఘ్ణ దేవుని తపమునకు మెచ్చుకొనుచు తలయూచెను, అప్పుడు శివుని కుడిచెవినిగల, మణికుండలముజారి, ఆతటాకమున బడెను కావున ఆతటాకమునకు చక్రతీర్థమను పేరు కలిగెను. పిదప కొంత కాలమునకు, ఈ చక్రతీర్ధము మీదుగా నది ప్రవహించినది.

పది దోషాలు పోగొట్టే పావన గంగ

ముఖ్యంగా "గంగకు" దశహరా అని ఓ పేరు ప్రాచుర్యంలో ఉన్నది అంటే పదిరకాల దోషాలను పరిహరించేది అని అర్ధం. సకల పాప నివారిణి, గంగానది స్నానం ఏడేడు జన్మల పాపాలను పోగొట్టే శక్తి కలది.

హరిశ్చంద్ర ఘట్టము

పూర్వము హరిశ్చంద్ర మహారాజు వీరబాహువునకు, సేవకుడై అచటనే కాటికాపరిగా నుండెను. కాని ఇచట మణికర్ణికా ఘట్టములోవలె శవదహన సంస్కారములంతగా జరుగుటలేదు.

కాలభైరవ ఆలయం

విశ్వేశ్వర దర్శనమువలెనే, కాలభైరవ దర్శనంకూడ ముఖ్యం, గదోలియా జంక్షన్ నుండి మైలు దూరము ఉండును పూర్వము బ్రహ్మా అన్నింటికి మూలమగు పరబ్రహ్మము నేనే అను అహంకారముతో, పరమేశ్వరినికూడ దూరాలపములాడెను, అప్పుడు పరమేశ్వరుని తేజమునుండి కాలబైరవుడు, ఉద్భవించి, తన వాడిగోళ్ళతో బ్రహ్మయుక్క 5 వ తల ఊడబెరికెను, అంత ఆతల కాల భైరవుని చేతినంటుకొనిపోయెను. భైరవుడా శిరముతో లోకములన్నియు తురుగుచు కాశీ క్షేత్రమును ప్రవేశించగానే బహ్మహత్య పాతకమంతరించి తనచేతినంటియున్న బ్రహ్మకపాలము భూమిపై బడెను. అది మొదలు, కాల భైరవుడు కాశీయందే వశించియుండెను.

పరమళించిన మానవత్వం

అది కొండలపై వెలసిన దేవాలయం. దైవ దర్శనం కోసం వేలాది భక్తులు గుంపులు గుంపులుగా కాలినడకన మెట్లెక్కి దేవుని దర్శించి మొక్కులు తీర్చుకొని తిరిగి వస్తుంటారు. ఒక భక్త బృందం మెట్లెక్కి పైకి వెళ్తుంటే ఆ గుంపులో కాళ్ళులేని ఒక వికలాంగుడు మెట్లెక్కలేక ప్రయాసపడుతూ ప్రాకుతూ, చెమటలు కార్చుకుంటూ మెట్లెక్కుతున్నాడు. చకచకా ముందుకు సాగుతున్న భక్తులెవరూ ఈ వికలాంగుని పట్టించుకోకుండా వెళ్ళిపోతుండగా ఒక భక్తుడు మాత్రం వికలాంగుని దీనావస్థ చూచి జాలిపడి అతనిని తన భుజాలపై నెక్కించుకొని యాత్రికుల గుంపు వెనుక మెట్లుక్కుతూ ముందుకు మెల్లమెల్లగా సాగుతున్నాడు.

ముందుగా వెళ్ళిన భక్తులు గుడికి చేరి దైవదర్శనానికి గుడిదగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ దేవుడు కనిపించలేదు. దేవుడు మాయమైనందుకు అందరూ ఆశ్చర్యచకితులై ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉండగా కొంతసేపటికి వికలాంగుని ప్రయాసతో మోసుకొని వస్తున్న భక్తుడు గుడిముందు అతనిని దించగానే వికలాంగుడు మాయమైనాడు. గర్భగుడిలో యధాస్థానంలో భగవుంతుడు ప్రత్యక్షమైనాడు. భక్తులంతా ఆశ్చర్యచకితులైనారు.

భగవంతుడు సర్వమానవాళికి తండ్రి. కోర్కెలు తీర్చుకోవడానికి దేవుని ప్రార్థించడం కన్నా సాటి మానవుని నిస్వార్థ ప్రేమతో సేవిస్తే భగవుంతుడు సంతసిస్తాడు. ప్రేమను గురించి పలుమార్లు ప్రవచనాలు చేయుదానికన్నా ప్రతిఫలాపేక్ష లేని నిస్వార్థప్రేమను ప్రదర్శించే భక్తుడు మిన్న.

సంధ్యా వందనం

శ్లో || అపవిత్రః పవిత్రోవా సర్వావ స్దాంగా తో పివా

యస్స్మరేత్సుండరీకాక్షం సబాహ్యా భన్తర శ్శుచిహ్

పుండరీకాక్ష ! పుండరీకాక్ష ! పుండరీకాక్ష !

టీ అపవిత్రః = స్నానము మొదలైనవి ఆచరింపక శుద్దముగా నున్నవాడైననూ, ఎట్టి దురాచారములు, దుర్గుణములు కలవాడైననూ, పవిత్రః వా = స్నానము మొదలైనవి ఆచరించి శుచిగా నున్నవాడైననూ,సదాచారములు గలవాడైననూ, సర్వావ స్దాంగా తో పివా = ఎట్టి అవస్ధలో నున్నవాడైననూ, పుండరీకాక్ష = సర్వ వ్యాపకుండైన ఆ పరమాత్మను, యః = ఎవడు, స్మరేత్ = స్మరించునో , సః = అట్టి పురుషుడు, సభాహ్యాభ్యన్తరః = వెలుపలలో పలకూడ , శుచిహ్ = మహా పవిత్రుడు, భవతి = అగును.

ఆచమనము

1 . కుడి చేతి నాల్గు వ్రేళ్ళనూ దగ్గరగా బెట్టి , ఓం కేశవాయస్వాహా, ఓం నారాయణాయస్వాహా, ఓం మాధవయస్వాహా అని నోటితో ఉచ్చరించుచు, బొటన వ్రేలు మధ్య వ్రేలు మొదటి నుండి , గోకర్ణముగా హస్తమును పెట్టి అర చేతి గుంటలో నురుగుగాని, బుగ్గలు గాని లేకుండ మినపగింజమునుగునంత నీరు ఉంచుకొని, చిటికెన వ్రేలు, దానిప్రక్క వ్రేలును వదులుగ వదిలిపెట్టి ముడుసారులు లోపలకు త్రాగవలెను. బ్రాహ్మణులు అయినవారు మొదట త్రాగిన నీరు బొడ్డు దగ్గరకు పోయిన తరువాత గాని రెండవ సారి త్రాగరాదు. క్షత్రియులు మొదటిసారి త్రాగిన నీరు కంటము దిగిన తరువాత త్రాగవలయును. వైశ్యులు కంటముదాక బోయిన తరువాత త్రాగవచ్చును. 2 . ఓం గోవిందాయనమః, ఓం విష్ణవేనమః అని చెప్పుచు అర చేతులను రెండింటిని కడుగుకొనవలయును. 3 . ఓం మధుసూదనాయనమః, ఓం త్రివిక్రమాయనమః అని చెప్పుచు పెదవులు తుడుచుకోవలయును. 4 . ఓం వామనాయనమః ఓం శ్రీధరాయనమః అని చెప్పుచు శిరస్సుపై ఉదకము చల్లుకోవలెను. 5 . శ్రీ హృషీకేశాయనమః అని అనుచు వామహస్తమున నీళ్ళు చల్లవలెను. 6 . ఓం పద్మనాభాయనమః అని చెప్పుచు పాదములచై నీళ్ళు చల్లుకొ వలయును. 7 . ఓం దామోదరాయనమః అని చెప్పుచు శిరస్సుపై ఉదకమును చల్లుకొనవలయును. 8 . ఓం సంకర్షణాయనమః అని చెప్పుచు చేతి వ్రేళ్ళను గిన్నె వలె ఉంచి గడ్డమును తుడుచుకోవలయును. 9 . వాసుదే వాయనమః, ఓం ప్రద్యుమ్నాయనమః అనుచు వ్రేళ్ళతో ముక్కును వదులుగ పట్టుకోవలయును. 10 . ఓం అనిరుద్దాయనమః, ఓం పురుషోత్తమాయనమః, ఓం అదోక్షజాయనమః, నార సింహాయ నమః అని చెప్పుచు నె త్రములను, చెవులను తాకవలెను. 11 . ఓం అచ్యుతాయనమః అని చెప్పుచు బొడ్డు సృశింపవలెను. 12 . ఓం జనార్ధనాయనమః అని అనుచు చేతివ్రేల్లతో వక్ష స్ధలమును, హృదయమును తాకవలె. 13 . ఓం ఉపెంద్రాయనమః ఓం కృష్ణాయనమః అని అనుచు చేతితో కుడి మూపురమును, ఎడమ మూపురమును తాకవలయును. అనంతరము భూతోచ్చాటన చేయవలెను.

జంట అరటి పళ్ళను తినవచ్చా?

కొంత మంది జంట అరటి పండ్లను తింటే కవల పిల్లలు పుడతారని నమ్ముతారు. 

జంటఫలాలను తినటం ద్వార, స్వామికి అర్పించటం ద్వార , ఎలాంటి దోషము రాదనీ శాస్రాలు చెబుతున్నాయి . 


అందంతో అహంకార పూరితయైన రంభ శ్రీమహావిష్ణువు శాపం వలన భూలోకంలో అరటి చెట్టుగా జన్మించిందని పురాణ సారాంశం. 

తాంబూలంలో మాత్రం జంట అరటిపండును పెట్టకూడదు. దానికి కారణం ఏకఫలమవుతుందనే.

శ్రీ సూర్యాష్టకమ్‌

ఆదిదేవ! నమస్తుభ్యం - ప్రసీద మమ భాస్కర |
దివాకర! నమస్తుభ్యం - ప్రభాకర నమోస్తుతే.

సప్తాశ్వరథ మారూఢం - ప్రచండం కశ్యపాత్మజం |
శ్వేతపద్మధరం దేవం - తం సూర్యం ప్రణమామ్యహమ్‌.

లోహితం రథమారూఢం - సర్వలోకపితామహం|
మహాపాపహరం దేవం - తం సూర్యం ప్రణమామ్యహమ్‌.

త్రైగుణ్యం చ మహాశూరం - బ్రహ్మవిష్ణుమహేశ్వరమ్‌ |
మహాపాపహరం దేవం - తం సూర్యం ప్రణమామ్యహమ్‌.

బృంహితం తేజసాంపుంజం - వాయు రాకాశ మేవ చ |
ప్రియంచ సర్వలోకానాం - తం సూర్యం ప్రణమామ్యహమ్‌.

బంధూకపుష్పసంకాశం - హారకుండభూషితం |
ఏకచక్ర ధరం దేవం - తం సూర్యం ప్రణమామ్యహమ్‌.

తం సూర్యం లోకకర్తారం - మహాతేజఃప్రదీపనమ్‌ |
మహాపాపహరం దేవం - తం సూర్యం ప్రణమామ్యహమ్‌.

తం సూర్యం జగతాం నాథం - జ్ఞానప్రకాశ్యమోక్షదామ్‌|
మహాపాపహరం దేవం - తం సూర్యం ప్రణమామ్యహమ్‌.

సూర్యాష్టకం పఠే న్నిత్యం - గ్రహపీడా ప్రణాశనం |
అపుత్రో లభతే పుత్రం - దరిద్రో ధనవా నభవేత్‌.

ఆమిషం మధుపానం చ యః కరోతి రవేర్ధినే |
సప్త జన్మ భవేద్రోగి - జన్మ జన్మ దరిద్రతా.

స్త్రీ తైలమధుమాంసాని - యే త్యజంతిరవేర్దినే|
న వ్యాధిః శోకదారిద్ర్యం - సూర్యలోకనం చ గచ్ఛతి.

ఏ గుడికి ఏ ఏ వేళల్లో వెళితే ఎంత పుణ్యం?

ఉదయాన్నే శ్రీ మహావిష్ణువు ఆలయానికి, సాయంత్రం పరమేశ్వరుని ఆలయానికి వెళ్ళడం మంచిది. శ్రీ మహావిష్ణువు స్థితికారుడు.

కాబట్టి ఆయన మన జీవన పోరాటంలో నిత్యం వచ్చే సమస్యలను తొలగిస్తాడు. మన బుద్ధి ద్వార ఆపదలను తొలగించి మనల్ని సుఖంగా ఉండేలా చూస్తాడు. 


మహేశ్వరుడు లయకారుడు. కాబట్టి రోజు పూర్తి అవుతున్న సమయంలో దర్శిస్తే రెట్టింపు ఫలాన్ని అందిస్తాడు. తొందర పడకుండా ప్రశాంతంగా నెమ్మదిగా భగవంతున్ని దర్శించాలి.

గుడిలో ఎలా ఉండాలి?

గట్టిగ నవ్వడము, అరవడము,ఐహిక విషయాల గురించి మాటలాడడం చేయరాదు. గుడి పరిసరాలని పరిశుబ్రంగా ఉంచాలి. బగవంతున్ని కనులార వీక్షించి ఆపై కనులు మూసుకొని ధ్యానం చేయాలి. దేవాలయం లో నిలుచుని తీర్థం తీసుకోవాలి. ఇంట్లో కూర్చుని తీర్దం పుచ్చుకోవాలి. దీపారాధన శివుడికి ఎడమ వైపు, శ్రీ మహా విష్ణువుకు కుడివైపు చేయాలి. అమ్మవారికి నూనె దీపమైతే ఎడమపక్కగా, ఆవు నేతి దీపమైతే కుడు వైపు వెలిగించాలి.

నవరాత్రుల్లో అష్టలక్ష్మిని ఇలా స్తుతించండి

నవరాత్రుల్లో అష్టలక్ష్మిని ఇలా స్తుతించండి అష్టలక్ష్మీదేవి అయిన మహాలక్ష్మిని పూజిస్తే సర్వ సుఖాలు చేకూరుతాయని విశ్వాసం. నవరాత్రుల్లో తొలి మూడు రోజులు పార్వతీ దేవిని, మలి మూడు రోజులు లక్ష్మీదేవిని, చివరి మూడు రోజులు సరస్వతీ దేవిని పూజించాలి. ఈ క్రమంలో నవరాత్రుల్లో లక్ష్మీపూజ చేయడం ద్వారా వంశాభివృద్ధి, అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పురోహితులు చెబుతున్నారు.

శ్రీ అష్టలక్ష్మీస్తోత్రము

స్తోత్రములు - దేవి స్తోత్రములు

ఆదిలక్ష్మీ
శ్లో|| సుమనసవందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే
మునిగణ వందిత మోక్ష ప్రదాయిని మంజుల భాషిణి వేద సుతే
పంకజవాసిని దేవ సుపూజిత సద్గుణ వర్షిణి శాంతియుతే
జయ జయహే మధుసూదన కామిది ఆదిలక్ష్మీ సదాపాలయ మాం .

ధాన్యలక్ష్మీ
శ్లో|| అయికలి కల్మస నాశిని కామిని వైదిక రూపిణి వేదమయే
క్షీరసముద్భవ మంగళ రూపిణి మంత్ర నివాసిని మంత్రనుతే
మంగళదాయిని అంబుజవాసిని దేవగణా శ్రిత పాదయుతే
జయ జయహే మధుసూదన కామిని ధాన్యలక్ష్మీ సదా పాలయ మాం .

ధైర్యలక్ష్మీ
శ్లో|| జయవరవర్ణిని వైష్ణవి భార్గవి మంత్ర స్వరూపిణి మంత్రమయే
సురగణ పూజిత శ్రీఘ్రఫలప్రద జ్ఞానవికాసిని శాస్త్రనుతే
భవభయహారిణి పాపవిమోచని సాధుజనాశ్రిత పాదయుతే
జయ జయహే మధుసూదన కామిని ధైర్యలక్ష్మీ సదా పాలయ మాం .

గజలక్ష్మీ
శ్లో|| జయ జయ దుర్గతి నాశిని కామిని సర్వపలప్రద శాస్త్రమయే
రథగజ తురగపదాది సమావృత పరిజన మండిత లోకనుతే
హరిహర బ్రహ్మ సుపూజిత సేవత తాపనివారిణి పాదయుతే
జయ జయహే మధుసూదన కామిని గజలక్ష్మీ సదా పాలయ మాం .

సంతానలక్ష్మీ
శ్లో|| అయిఖగ వాహిని మోహిని చక్రిణి రాగవివర్ధిని జ్ఞానమయే
గుణగణవారిణి లోకహితైషిణి సర్వసప్త భూషిత గాననుతే
మనుజ సురాసుర దేవమునీశ్వర మానస వందిత పాదయుతే
జయ జయహే మధుసూదన కామిని సంతానలక్ష్మీ సదా పాలయ మాం .

విజయలక్ష్మీ
శ్లో|| జయ కమలాసని సద్గతి దాయిని జ్ఞానవికాసిని జ్ఞానమయే
అనుదిన మర్చిత కుంకుమ ధూసర భూషిత వాసిత వాద్యనుతే
కనకధరాస్తుతి వైభవ వందిత శంకర దేశిక మాన్య పదే
జయ జయ హే మధు సూదన కామిని విజయలక్ష్మీ సదా పాలయ మాం .

విద్యాలక్ష్మీ
శ్లో| ప్రణత సురేశ్వరి భారతి భార్గవి శోకవినాశిని రత్నమయే
మణిమయభూషిత కర్ణవిభూషణ శాంతి సమావృత హాస్యముఖే
నవనిధి దాయిని కలిమలహారిణి కామితఫలప్రద హస్తయుతే
జయ జయ హే మధుసూదన కామిని విద్యాలక్ష్మీ సదా పాలయ మాం .

ధనలక్ష్మీ
శ్లో|| ధిమిధిమి ధింధిమి ధింధిమి ధింధిమి దుందుభి నాద సుపూర్ణమయే
ధుమధుమ ధుంధుమ ధుంధుమ ధుంధుమ శంఖ నినాద సువాద్య నుతే
వేదపురాణేతిహాస సుపూజిత వైదికమార్గ ప్రదర్శయుతే
జయ జయ హే మధుసూదన కామిని ధనలక్ష్మీ సదా పాలయ

జమ్మిచెట్టు పూజ

పాండవులు అరణ్యవాసం వెళ్ళేప్పుడు వారి యొక్క ధనస్సు విల్లంబులు, గద మొదలగు ఆయుధములను వెళ్ళే దారిలో జమ్మి చెట్టు మీద పెట్టి వారు మళ్ళి తిరిగి వచ్చె వరకు వాటిని కాపాడమని జమ్మి చెట్టుకు మొక్కి వెళ్తారు, అలా అరణ్యవాసం ముగియగానే విజయ దశమి రోజున, అదే చెట్టు వద్దకు వెళ్ళి పూజలు చెసి వారి వారి వస్తువులను తిరిగి తీసుకుంటారు. తిరిగి రాగానే కౌరవుల మీద విజయం సాదించి రాజ్యాధికారం సాధిస్తారు.

ఈ విధముగా తమకు విజయాలు వరించాలని విజయ దశమి రోజున ప్రజలు జమ్మి చెట్టు వద్దకు వెళ్ళి పూజలు చేసి, ఆ చెట్టు ఆకులను తీసుకు వచ్చి, పెద్దవారికి ఇచ్చి వారి ఆశీస్సులను తీసుకుంటారు. వాహనదారులు , మరియు ఇతర అన్ని రకాల వృత్తుల వారు వారి వారి పనిముట్లను సంబందిత వస్తువులను శుభ్రపరచి, వాటికి పూజలు చేయడం ఆనవాయితి.

శమీ శమయితే పాపం శమీ శతృ వినాశనీ అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియదర్శనీ

మహాశివుని మహిమలు

మునులంతా కలసి చేసిన వినమ్ర పూర్వకమైన అర్ధింపునకు సూత మహర్షి ఎంతగానో సంతోషించాడు. ''ముని శ్రేష్టులారా !మీరు సామన్యులు కారు. ప్రతి నిమిషం భగవంతుని ఆరాధనలో తనువూ ,మనసులను విలీనం చేసిన తపస్వులు మీరు. నియమనిష్ఠలతో కూడిన సదాచార సంపన్నులు, సచ్చీలురు. నిస్వార్థ చింతనతో మీరు ఏది చేసినా ,ఏది కోరినా అది లోకకళ్యాణం కోసమే అవుతుంది .కాబట్టి మీలాంటి అభిలాష గల వారికి చెప్పగలగడం కూడా ఒక విశేషమే. ఆ భాగ్యం నాకు మీ వల్లే రావడం నా పూర్వజన్మ విశేషం .కాబట్టి నేనూ కూడా ధన్యుణ్ణే''.అన్నాడు సూతుడు.

మునులు తల పంకించగా సూతమహర్షి ''ఇంత సౌమ్యంగా నన్ను అర్ధించడంలోనే మీరెంత ఉన్నత చరితులో అర్ధం అవుతుంది .అయినా మీ కోరిక సామాన్యమైనది కాదు. ఆదిపురుషుడైన ఆ పరమేశ్వరుని గురించి ఎంత చెప్పినా ఇంకా ఎంతో కొంత మిగిలే ఉంటుంది. చెప్పిన తరువాత అంతా తెలిసినట్లే ఉంటుంది గానీ, ఆలోచిస్తే ఇంకా తెలుసుకోవడానికి ఎంతో ఉందన్న విషయం ఆశ్చర్యాన్నేకాదు, అభిలాషనూ రేకెత్తిస్తుంది. సనాతనుడు, సనూతనుడు, సదాచారుడు అయిన సర్వేశ్వరుని లీలలు చాలా విచిత్రమైనవి. మహాశివుని లీలలు ఎవరికీ అంత తేలిగ్గా అర్ధం కావు. ఆయన గురించి తెలుసుకోవడమంటే ఒకరకంగా సృష్టి గురించి తెలుసుకోవడమే అవుతుంది. ఎందుకంటే సృష్టే ఆయన. ఆయనే సృష్టి.

ఒకసారి మార్కండేయుడనే గొప్ప శివభక్తుడు శివుని గురించి పూర్తిగా తెలుసుకోవాలన్న అభిలాషతో బ్రహ్మలోకానికి వెళ్ళి, వాణి, విరించిలకు (బ్రహ్మ, సరస్వతి) భక్తితో నమస్కరించి ''విధాతా!నాకు పరమేశ్వరుని గురించి, ఆయన మహత్యాన్నిగురించి కూలంకషంగా తెలుసుకోవాలని ఉంది . తెలియజేసి ధన్యుణ్ణి చేయ''మంటూ ప్రార్ధించాడు. అందుకు బ్రహ్మ''నాయనా !శివుడి గురించి తెలుసుకోవాలంటే నాకంటే బాగా కేశవుడికే తెలుసు .కాబట్టి నీవు వైకుంఠానికి వెళ్ళి నారాయణుడిని అర్ధించు'' అని చెప్పాడు.

బ్రహ్మ మాట విని, మార్కండేయుడు సరాసరి వైకుంఠానికి చేరుకున్నాడు .అక్కడ శేషతల్పంపై లక్ష్మిదేవి పాదాలు వత్తుతుండగా శయన రూపంలో ఉన్న శ్రీమహావిష్ణువుని చూసి చేతులు జోడించి వివిధ రకాలుగా ప్రార్ధనలు చేశాడు మార్కండేయుడు. ఆ స్తోత్రానికి పరవశుడై ''మార్కండేయా !నీవు వచ్చిన పని చాలా విశిష్టమైనది. పరమేశ్వరుని గురించి తెలుసుకోవాలనే అభిలాష, ఉత్సుకత, సంకల్పం ఎంతో ఉన్నతం. అయితే మహాశివుని ఆసాంతం తెలిసినవారు ఎవరూ లేరు. కాబట్టి నీవు పరమేశ్వరుని దగ్గరికెళ్ళి ఆయన గురించి తెలుసుకోవాలన్న నీ సంకల్పాన్ని వ్యక్తం చెయ్యి. నీ కోరిక తప్పక తీరుతుంది'' అన్నాడు వైకుంఠవాసుడు.

మన సంకల్పం బలంగా ఉంటే అది ఎలాగైనా తీరుతుంది. ఒకసారి ప్రయత్నించగానే ఫలితం రాలేదని కుంగిపోకుండా, విసిగిపోయి అనుకున్నదాన్ని మధ్యలోనే విడిచిపెట్టకుండా అది తీరేవరకు యత్నిస్తున్నే ఉండాలి. సంకల్పబలం చిత్తశుద్ధి ఉంటే, అది తీరుతుంది. భగవంతుని సాయం కూడా తప్పకుండా లభిస్తుంది. ఇక్కడ భగవంతుని సాయం అంటే అది తీరేందుకు మార్గం లభ్యం కావడమేనని గ్రహించాలి. మార్కండేయునికి అదే జరిగింది.

మహాశివుని మహిమల గురించి తెలుసుకోవాలన్న కోరిక మార్కండేయునిలో బలంగా ఉంది. ఆ ప్రయతంలో ఇప్పటికే బ్రహ్మ,విష్ణువులను అడిగి కొద్దిగా నిరాశకు గురైనా, తన కోరిక తీర్చగలిగే మార్గాన్ని, తీరుతుందన్న భరోసానూ పొందగలిగాడు. దాంతో అతని ఉత్సహం రెట్టింపైంది. అదే సంతోషంతో కైలాసం వైపుకు తన పయనాన్నిసాగించాడు మార్కం

కార్తిక మాసం

కార్తీకం.. ఈ పేరు వింటే చాలు. భవబంధాలు క్షణాల్లో తొలగిపోయే వీలు. భక్తప్రజాళికిది మంగళకర మాసం. అద్వైతసిద్ధికి అసలైన విలాసం. చాంద్రమానం ప్రకారం సంవత్సరంలోని ఎనిమిదో మాసంగా కార్తీకం మానవాళికి కొంగుబంగారమవుతోంది. సకల చరాచర జగత్తును వృద్ధి చేసే లక్ష్మీపతి, లయం చేసే శంకరుడు ఏకోన్ముఖులై జీవజాలాన్ని ఆదుకునే గొప్ప సమయమిది. శివకేశవులు అభేదమనే నినాదం... పర్యావరణమే ప్రపంచానికి రక్ష అనే విధానం.. ఆరోగ్య సూత్రాలు పంచివ్వగల దివ్యసందేశం.. కార్తీకం నిండుగా అల్లుకున్నాయి. అందుకే ఏ మాసానికీ లేని ప్రత్యేకత దీనికే స్వంతం.

శివకేశవులిద్దరినీ ఏకకాలంలో ఆరాధించి ముక్తిని పొందేందుకు కార్తీకం గొప్పవరం. చంద్రుడు కృత్తికా నక్షత్రం సమీపాన సంచరిస్తాడు గనుకే దీనికి కార్తికమాసం అని పేరొచ్చింది.

క్షీరసాగర విహార...
ముందుగా క్షీరసాగరశయనుడైన నారాయుణ్ణి గురించి చెప్పుకోదలిస్తే ఆషాఢ శుద్ధ ఏకాదశినాడు యోగనిద్రలోకి వెళ్లే పరంధాముడు మళ్లీ కార్తీక శుద్ధ ఏకాదశినాడు చతుర్దశభువనాల వ్యవహార సరళినీ సమీక్షించే కార్యాన్ని చేపడతాడు. ఈ సందర్భంగా పద్మపురాణంలోని సోమకాసుర వధను గుర్తుచేసుకోవాలి. వేదాలను అపహరించి సాగరాంతర్భాగంలోకి చొచ్చుకుపోతున్న ఈ రాక్షసుణ్ణి విష్ణువు మత్స్యావతారమెత్తి సంహరించిన కాలమిదే. సరిగ్గా కార్తీకమాసం పదకొండవరోజున పురుషోత్తముడు మత్స్యావతారంలోకి మారాడని శాస్త్రం చెబుతోంది. దేవాసురులు క్షీరసాగరమథనం చేసిందీ, శ్రీ మహావిష్ణువు శ్రీలక్ష్మిని పరిణయమాడిందీ ఈ మాసంలోనే. క్షీరాబ్ధి ద్వాదశి (చిలుకుద్వాదశి) వంటి పర్వదినాలకు నెలవైంది గనుకనే జనార్థునికి ప్రీతికరమైనమాసంగా కార్తీకం విరాజిల్లుతోంది.

భక్తికీ ముక్తికీ...
కార్తీకానికి శివునికీ ఉన్న బంధం భక్తికీ ముక్తికీ ఉన్న అనుబంధం. త్రిపురాసురసంహారాన్ని చేపట్టి రుద్రుడు లోకాలను శాంతపరిచింది కార్తీకంలోనే. భూమిని రథంగా చేసుకుని, సూర్యచంద్రుల్ని ఆ తేరుకు చక్రాలుగా మార్చుకుని, మేరు పర్వతాన్ని విల్లుగా చేసుకుని, బ్రహ్మసారథ్యంలో శంభుడు ఆ అసురు వధను లోక కళ్యాణకార్యంగా జరిపాడు. కార్తీకంలో శివుడు సజ్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన్య ముఖాలుగా ఉదయసంధ్యనుంచి ప్రదోష కాలం వరకూ అయిదురూపాలతో భక్తులను ఆశీర్వదిస్తాడు.

స్నానం... దానం... దీపం...
స్నానం, దానం, జపం, తపం, దీపం, ఉపవాసం వంటి సన్మార్గాల్లో పయనిస్తూ కార్తీకమాసంలో శివకేశవుల చిత్తాన్ని భక్తులెవరయినా ఇట్టే గెలవవచ్చు. వేకువఝామునే సముద్ర స్నానమో, నదీ స్నానమో లేక నివాసంలోనే శీతల స్నానమో ఆచరించి శుచిర్భూతులై ఈశ్వరార్చన చేసినా, అచ్యుతుణ్ణి శరణువేడినా లేక ఇద్దరినీ కొలిచినా కోరికలు క్షణాల్లోనే నెరవేరతాయి. మనకున్నదాన్లో కొంత భాగాన్ని పాత్ర ఎరిగి దానం చేయడం మరో పుణ్యవిధి. కార్తీకదీపం పేరిట ఈ మాసంలో వెలిగించే ప్రతీ జ్యోతీ అజ్ఞానతిమిరాలను ఆవలకు నెట్టి విజ్ఞాన రేఖలను విరబూయిస్తుంది. ఈమాసంలో ప్రతీ రోజూ దీపం వెలిగించడం మోక్షప్రదం. ముత్తయిదువులంతా కార్తీక దీపాలతో తమ కుటుంబాల్లో వెలుగులు నింపే పుణ్యకాలమిది. ఈ దీపాలు కార్తీకనక్షత్రానికి ప్రతీకలుగా భక్తులు తలుస్తుంటారు. శివాలయాల్లో ఆకాశదీపాలు, కార్తీక శుక్లపక్ష పున్నమి నాటి జ్వాలాతోరణాలు దర్శిస్తే జన్మజన్మల పాపాలు పటాపంచలవుతాయి.

ఉపవాసయోగం...
కార్తీక సోమవారాలు, కార్తీక పున్నమి ఉపవాసాలకు అనుకూలమైన రోజులు. సోమ అంటే చంద్రుడు. శివుని సిగలో వెలిగే చంద్రుని వారం గనుకే సోమవార ఉపవాసానికి అంతటి ప్రాముఖ్యత. రోజంతా శివధ్యానం చేస్తూ భగవంతునికి సమీపంగా ఉండటంతో పాటుగా, శరీరాన్ని సమస్థితిలో ఉంచే నిరాహారం మరో యోగం. కొందరు ఈ ఉపవాసాన్ని రోజు మొత్తాన ఒక మారే ఫలహారం తీసుకుని ఏకభుక్తంగా నిర్వహిస్తారు. మరికొందరయితే వండని పదార్థాలు అంటే పండ్లు, కాయలు తింటూ నక్తం చేస్తుంటారు. ఈ నక్తం కార్తీకమాసం అంతా చేపట్టే భక్తులూ లేకపోలేదు.

సతత హరితం...
పత్రహరితంతోనే మానవాళి మనుగడ ముడి వేసుకుంటుందని చెప్పడం, వృక్షోరక్షతి రక్షితః అనే పిలుపునివ్వడం కార్తీక వనభోజనాల అంతస్సూత్రం. భారతీయ ఆయుర్వేద వైద్యశాస్త్రంలో ఉసిరికున్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ఈ సంగతిని జనావళికి గుర్తుచేసేందుకే ఉసిరి చెట్ల కింద పనస ఆకుల విస్తట్లో జరిగే విందులు. పర్యావరణ ప్రాధాన్యతను తెలియజేసేందుకు సిసలైన రాచమార్గాలు. కార్తీకంలో తులసిమాతను ధ్యానించడం పరమశ్రేష్ఠం. ఉసిరి కాయల మీద ఆవునెయ్యి దీపాలుంచి తులసమ్మను కొలవడం సకల పాప క్షయకరం.

అద్వైతం... మోక్షదాయకం...
ఈ మహామాసంలో హరిహరులిద్దరినీ పూజించే భక్తులకు మోక్షం సంప్రాప్తమవుతుంది. ఆరోగ్యరీత్యాఉపవాసాలు, జపాలు, తపాలు, స్నానాలు ఉత్తమోత్తమమైనవి. కాలుష్య నివారణ జరగాలని పిలుపునిచ్చే వనభోజనాలు అమృతతుల్యమైనవి. అటు మనసును, ఇటు శరీరాన్ని అదుపులో ఉంచుకునేందుకు మానవాళికి ఎంతగానో ఉపకరించేది కార్తీకం. పదకొండు నెలలపాటు మానవజీవితం సాఫీగా సాగేందుకు ఈ ఒక్కనెలయినా మడి, తడి, ఆచారాలు పాటించాలి. అలాంటి వారికి కార్తీకానికి మించిన దైవప్రసాదం వేరొకటుండదు.

లింగాభిషేకములో పరమార్ధం

పానిపట్టుపై శివలింగం అంటే మానవుని హృదయపద్మంపై ఆత్మలింగము. పంచామృతాభిషేకం - భక్తీ, మంత్రజపం, నామస్మరణం, ధ్యానం, కీర్తనంలతో దైవాభిషేకం చేయాలి. జలధారాపాత్ర అనన్య అచంచల నిరంతర సాధనాభక్తికి చిహ్నం, లింగం జీవాత్మకు సంకేతం. జీవాత్మ పరమాత్మలను అనుసంధానం కావించే సాధనమే అభిషేకం.

వివిధ రకాల వత్తులతో... దీపారాధన - ఫలితాలు

* మంచి పత్తితో చేసిన దేవునికి దీపారాధన చేస్తే ఇంట్లో గల పితృదేవతలకు దోషాలు తొలగిపోతాయి.
* తామర తూడులతో వత్తులు చేసి స్వామివారికి దీపారాధన చేస్తే శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కలిగి అప్పుల బాధ తొలగిపోతుంది.
* అరటినార వత్తులతో దీపారాధన చేస్తే ఆ ఇంట్లో మంచి సంతానం కలుగుతుంది.
* జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం వలన శ్రీ గణపతి అనుగ్రహం కలుగుతుంది. అధిక సంపద కలిగి దుష్టశక్తుల పీడ తొలగిపోతుంది.

* పసుపురంగు బట్టలతో దీపారాధన చేయడం వలన జఠర, ఉదర వ్యాధుల, కామెర్ల రోగం తగ్గుతాయి.
* కుంకుమ నీటితో, దానిలో తడిపిన బట్టలతో చేసిన వత్తులతో దీపారాధన చేయడం వలన వైవాహిక చింతలు తొలగిపోతాయి. ఇంటిపై మాంత్రిక శక్తులు ఏమీ పనిచేయవు.
* సంతాన గోపాలస్వామికి దీపారాధన చేస్తే అనుగ్రహంతో సంతానం కలుగుతుంది.
* వత్తులను పన్నీటిలో అద్ది నేతితో దీపారాధన చేయడం వలన శ్రీ మహాలక్ష్మిదేవి అనుగ్రహం ఉంటుంది.

కొబ్బరి నూనెతో దైవారాధన
* కొబ్బరినూనెతో దీపారాధన చేస్తే కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి.
* రావిచెట్టు క్రింద ఉండే నాగ దేవతల విగ్రహాలకు పూజ చేసేటప్పుడు శ్రీ అశ్వథనారా యణస్వామి వారికి కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే దాంపత్య జీవితం సుఖంగా, సంతోషంగా ఉంటుంది.
* కుజదోషం ఉన్నవారు మంగళవారం కానీ, శుక్రవారం నాడు కానీ, కొబ్బరి నూనెతో దీపాలను వెలిగించి పూజచేసి పప్పుతో బొబ్బట్లు చేసి నైవేద్యం పెట్టి వాయనంగా 11 మంది ముతె్తైదువులకు దానం ఇస్తే వారికి కుజదోషం తొలగిపోయి సత్వరమే వివాహం అవుతుంది.

* మహాలక్ష్మీదేవికి కొబ్బరినూనెతో 40 రోజులు ఆరాధిస్తే వారికి రావలసిన అప్పులు వసూలు అవుతాయి.
* ఎవరైతే ప్రతిరోజూ మహాలక్ష్మికి కొబ్బరినూనెతో దీపారాధన చేసి కొబ్బరి, పంచదారన నైవేద్యంగా పెట్టి పూజిస్తారో వారింట్లో శుభకార్యాలు జరుగుతాయి.
* పితృదేవతలకు శ్రాద్ధాలు పెట్టే సమయంలో కొబ్బరినూనెతో దీపారాధన చేస్తే వారివారి పితృదేవతలకు స్వర్గ లోకాలు ప్రాప్తిస్తాయి.

* ఎవరైతే ప్రతి శనివారం నాడు శ్రీ వేంకటేశ్వరస్వామివారికి కొబ్బరినూనెతో దీపారాధన చేసి తులసి దళాలతో మాలకట్టి ప్రార్థించి హారంగా వేస్తారో వారికి జీవిత పర్యంతం ఆర్థిక సమస్యలు రావు.
* హరిద్వార్‌లో సాయంసంధ్యలో గంగాదీపాన్ని కొబ్బరినూనెతో వెలిగించి నదిలో వదిలితే వారికి, కుటుంబ సభ్యులకు జీవితాంతం ప్రతి ఏటా గంగాస్నానం చేసిన ఫలితం కలుగుతుంది.
* ఎవరైతే కాశీలో విశ్వేశ్వరస్వామివారికి సోమవారం రాత్రి హారతి ఇచ్చేటప్పుడు కొబ్బరినూనెతో దీపారాధన చేస్తారో వారికి... వారు కోరుకున్న కార్యాలు నిర్విఘ్నంగా పూర్తవుతాయి.

ధనుర్మాస వ్రతం

సూర్యదేవుడు ధనుస్సురాశిలో ప్రవేశించడంతో మొదలై భోగిపండుగ రోజువరకూ, సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించేంతవరకూ ఉండే మాసం - "ధనుర్మాసం". వైష్ణవ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన మాసం ఇది. మాసమంతా వైష్ణవాలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు. గోదాదేవి రచించిన "తిరుప్పావై" ని ఈ మాసం రోజులు పఠిస్తారు. ముఖ్యంగా కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఈ నెల రోజులు సుప్రభాతానికి బదులుగా తిరుప్పావైని పఠిస్తారు. అటువంటి పవిత్రమైన ధనుర్మాసంలో శ్రీమహావిష్ణువును "మధుసూదనుడు" అనే పేరుతో పూజించాలి. ప్రతిదినం పూజించి మొదటి పదిహేను రోజులూ నైవేద్యంగా పులగం లేదా చెక్కరపొంగలిని, తర్వాతి పదిహేను రోజులు దధ్యోదనమును సమర్పించాలి. ధనుర్మాసం మొత్తం ఇంటి ముందు ఆవుపేడను కలిపిన నీటిని చల్లి బియ్యపుపిండితో అందమైన ముగ్గులు పెట్టి, ముగ్గుల మధ్యలో ఆవు పేడతో చేసి, పసుపు, కుంకుమలు, వివిధ పూలను అలంకరించిన గొబ్బిళ్ళను ఉంచవలెను. ఈ విధంగా చేయడం వల్ల కన్యకు మంచి భర్త లభిస్తాడు, సౌభాగ్యం కలకాలం వర్థిల్లుతుంది అని నమ్మకం.
ధనుర్మాస వ్రతం
ప్రత్యక్ష భగవానుడైన శ్రీసూర్యభగవానుడు మేషరాశి మొదలు పన్నెండు రాశులలో సంచరిస్తుంటాడు. ద్వాదశాత్మడైన ఆదిత్యుడు, తన దివ్యయాత్రలో ధనస్సు రాశిలోనికి ప్రవేశిస్తూనే "ధనుర్మాసం" ప్రారంభమై, సూర్యుడు మకర రాశిలోనికి ప్రవేశించేంతవరకూ, అంటే మకర సంక్రాంతి పర్వదినం ముందురోజు భోగి వరకు వుంటుంది. ఈ నెలరోజుల పాటూ "ధనుర్మాసవ్రతం" ఆచరించాలి.ధనుర్మాసం గురించి మొదట బ్రహ్మదేవుడు స్వయంగా నారద మహర్షికి వివరించినట్లు పురాణకథనం. ధనుర్మాస వ్రత ప్రస్తావన, మహాత్మ్యాలు బ్రహ్మాండ, భాగవత ఆదిత్యపురాణాల్లో, నారాయణ సంహితలో కనిపిస్తుంది.వ్రతం చేయాలనుకునే వారు బంగారం లేదా వెండి లేకపోయినట్లయితే శక్తి మేరకు పంచలోహలతోగాని, రాగితో గానీ శ్రీమహావిష్ణువు విగ్రహాన్ని ఒకదాన్ని తయారుచేయించుకుని పూజాపీఠంపై ప్రతిష్టించుకోవాలి. విష్ణువును 'మధుసూదనుడు' అనే పేరుతో వ్యవహరించాలి. ప్రతి రోజు సూర్యోదయానికి కంటే ఐదు ఘడియలు ముందుగా నిద్ర లేచి కాలకృత్యాలను పూర్తిచేసుకుని, తలస్నానం చేసి నిత్యపూజలు, సంధ్యావందనాలను ముగించి, అనంతరం ధనుర్మాస వ్రతాన్ని ఆచరించాలి. మధుసూధనస్వామిని ఆవు పాలు, కొబ్బరి నీరు, పంచామృతాలతో అభిషేకించాలి. అందుకోసం శంఖాన్ని ఉపయోగించడం శ్రేష్ఠం. శంఖంలో అభిషేక ద్రవ్యాలను ఒక్కొక్కదానినే నింపుకుని, అభిషేకం చేయాలని శాస్త్రవచనం. తర్వాత తులసీ దళాలతోనూ, వివిధ రకాలైన పుష్పాలను ఉపయోగించి స్వామి వారిని అష్టోత్తర శతనామాలతోగానీ, సహస్రనామాలతోగానీ, పూజించాలి. నైవేద్యంగా మొదటి పదిహేనురోజులూ 'చెక్కర పొంగలి' ని గానీ, బియ్యం, పెసరపప్పు కలిపి వండిన 'పులగం'ను గానీ సమర్పించాలి. తర్వాత పదిహేను రోజులూ 'దధ్యోదనం' నైవేద్యంగా సమర్పించాలి. తర్వాత ధూప,దీప, దక్షిణ,తాంబూలాలను సమర్పించి నమస్కరించుకోవాలి. మధుసూధనస్వామివారిని పూజించడంతో పాటూ బృందావనంలో తులసిని పూజించడం చేయాలి. ఈ మాసమంతా విష్ణుపురాణాన్ని, విష్ణుగాథలను చదువుతూగానీ, వింటూగానీ గడపడం, వైష్ణవాలయాలను దర్శించడం చేయాలి. ఈ విధంగా ప్రతిరోజు ధనుర్మాసం మొత్తం ధనుర్మాస వ్రతాన్ని ఆచరించడం శ్రేష్ఠం. నెలరోజుల పాటూ చేయలేనివారు 15 రోజులుగానీ, 8 రోజులుగానీ, 6 రోజులుగానీ, 4 రోజులుగానీ, లేదంటే కనీసం ఒక్కరోజు అయిన ఆచరించాలని శాస్త్రవచనం.


వ్రతాన్ని ఆచరించడం పూర్తయ్యాక శ్రీమధుసూధన స్వామివారి విగ్రహాన్ని -
"మధుసూదన దేవేశ ధనుర్మాస ఫలప్రద తవ మూర్తి ప్రదానేన మమసంతు మనోరథాః||"
అనే శ్లోకాన్ని పఠిస్తూ పండితుడికి దానం ఇవ్వాలి. పండితుడు దానన్ని స్వీకరిస్తూ -
"ఇందిరా ప్రతి గృహ్ణాతు"


అని పండితుడు ఇచ్చే ఆశీర్వచనాన్ని స్వీకరించడం వల్ల సకల కోరికలు సిద్ధిస్తాయని చెప్పబడుతోంది. ఈవిధంగా ధనుర్మాసవ్రతాన్ని ఆచరించడం వలన కోరిన కోరికలు తీరడంతోపాటూ ఇహలోకంలో సౌఖ్యం, పరంలో మోక్షం సిద్ధిస్తుందనేది పురాణ కథనం. ధనుర్మాసవ్రతాన్ని ఒక్కరోజు ఆచరించడం వల్ల వేయిసంవత్సరాల పాటూ నిత్యం వివిధదేవతలను ఆరాధించినంత ఫలం లభిస్తుందనేది పండితాభిప్రయం. కాత్యాయనీవ్రతం లేక శ్రీ వ్రతంఈ వ్రతాన్ని ధనుర్మాసంలో వివాహం కాని అమ్మాయిలు ఆచరించాలని చెప్పబడుతోంది. పూర్వం ఈ వ్రతాన్ని స్వయంగా శ్రీకృష్ణుడి సలహా మేరకు గోపికలు ఆచరించి శ్రీకృష్ణుడినే భర్తగా పొందినట్లు కథనం. శ్రీ గోదాదేవి ఈ వ్రతాన్ని ఆచరించి శ్రీరంగనాథుడిని భర్తగా పొందినట్లు పురాణాలు వెల్లడిస్తున్నాయి.


వ్రత విధానం
ధనుర్మాసంలో ప్రతిరోజూ తెల్లవారుజామునే నిద్ర లేచి, కాలకృత్యాలు తీర్చుకుని తలస్నానం చేయాలి. ఇంటిముందు శుభ్రపరిచి పేడనీటితో కళ్ళాపి చల్లి, బియ్యపు పిండితో ముగ్గులను తీర్చిదిద్ది, ముగ్గుల మధ్యలో ఆవుపేడతో చేసిన గొబ్బిళ్ళను ఉంచి, వాటిని గుమ్మడి, బీర, చామంతి, బంటి వంటి పూలతో అలంకరించి నమస్కరించాలి. అనంతరం కాత్యాయనీదేవిని షోడశోపచారాలు , అష్టోత్తరాలతో పూజించి నైవేద్యం సమర్పించాలి. ఈ విధంగా ప్రతిరోజూ ధనుర్మాసమంతా ఆచరించాలి. తెలుగునాట గొబ్బెమ్మల వ్రతంగా పేరు పడిన ఈ కాత్యాయనీ వ్రతాన్ని కన్యలు ఆచరించడం వల్ల మంచి భర్త లభిస్తాడని శాస్త్రవచనం.

Wednesday, September 18, 2013

జీవాత్మ – పరమాత్మ – మోక్షం అనగానేమి?

ప్రతి మానవుడి (జీవాత్మ ) అంతిమ లక్ష్యం మోక్షం పొందడమే. పరమాత్మ యొక్క తేజస్సుసృష్టి ప్రారంభమగునపుడు. ప్రకృతి యెక్క ప్రబావంతో అనేకానేకములైన ఆత్మలుగా ప్రతిబింబించను. ఇలా అనేకములుగా ఉన్న ఆత్మలనే జీవాత్మలని అంటాం. వాస్తవానికి పరమాత్మ యెక్క ప్రతిబింబమే అలా పధార్థంతో ఏకమైన జీవాత్మ తన నిజమైన ఉనికిని మరచి, పదార్థాన్నే (దేహాన్నే ) తానని భ్రమించి, పుట్టచూ గిట్టుచూ (దేహాలను మార్చుకుంటూ) గమ్యాన్ని మరిచి తిరుగును. ఇలా జీవాత్మ గతి తప్పి తిరగడాన్నే ‘ సంసారం ’ అని అంటారు. అలాంటి జీవాత్మ మానవ జన్మ ఎత్తి తన నిజతత్వాన్ని గురువుల బోధనలతో అర్థం చేసుకొని, బౌతికమైన మరియు మానసికమైన బంధాలనుండి తపోసాధనలతో తెంచుకొని పరమాత్మలో తన ఉనికిని స్థిరం చేసుకోవడాన్నే మోక్షం అని అంటారు. ఇలా మోక్షము పొందడము కేవలము వివేకవంతుడైన మనిషికి మాత్రమే సాధ్యం. ఎప్పుడూ ఉనికి కలిగి వుండి తన తత్వమైన పరమ ఆనందాన్ని పొందుతూ ప్రకృతికి అతీతంగా ఉండునదే పరమాత్మ. కావున ప్రకృతికి అతీతమైన స్థితిని చేరిన ముక్తిపొందిన ఆత్మ తిరిగి జన్మంచదు. కష్టాలపాలు కాదు, నిత్యానందాన్ని శాశ్వతంగా అనుభవిస్తుంది. సర్వవిధ భగవత్ సాధనల పరమ లక్ష్యం జీవాత్మ తన నిజస్థితియైన పరమాత్మ స్థానాన్ని పొందడమే.

గోపూజతో గ్రహదోషాలు నశిస్తాయా?

గోవును పూజించి సేవిస్తే అన్ని గ్రహదోషాలూ పోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. నవగ్రహాలలో ఒక్కో గ్రహానికి,ఒక్కోవారము, ఒక్కో ధాన్యము సూచించపడ్డాయి. ఆయా వారాలలో ఆయా గ్రహాలకు ప్రీతికరమైన ధాన్యాన్ని బెల్లముతో కలిపి ఆవుకు తినిపిస్తే ఆయా గ్రహదోషాలు తొలగిపోయి గ్రహాలు శాంతిస్తాయి. సూర్యుడికి - గొధుమలు, చంద్రునికి- వడ్లు, కుజునికి-కందులు, బుధునికి-పెసలు, గురునికి- శనగలు, శుక్రునికి-బొబ్బర్లు, శనికి-నువ్వులు, రాహువుకి-మినుములు, కేతువుకి-ఉలవలు ఇష్టమైన ధాన్యాలు.

తీర్థాన్ని మూడుసార్లు తీసుకుంటారు. ఎందుకు?

తొలితీర్థము శరీర శుద్ధికి,శుచికి…రెండవ తీర్ధం ధర్మ,న్యాయ ప్రవర్తనకు …మూడవ తీర్ధం పవిత్రమైన పరమేశ్వరుని పరమ పదము కొరకు.

తీర్థ మంత్రం:
అకాల మ్రుత్యుహరణం సర్వవ్యాది నివారణం
సమస్త పాప శమనం విశ్నుపాదోధకం శుభం .

హనుమంతునకు, సువర్చాలకు వివాహం జరిగిందా?

కొన్ని ఆలయాల్లో ఏకంగా వివాహం కూడా జరిపిస్తున్నారు. హనుమంతుడు బ్రహ్మచారి. సూర్యుని కుమార్తె పేరు సువర్చల. హనుమ సూర్యుని వద్ద విద్యాబ్యాసం చేశాడు. ఆ సమయంలో సువర్చల హనుమని ఇష్టపడింది. విషయం తెలిసిన సూర్యుడు విద్యాభ్యాసం అనంతరం హనుమని గురుదక్షిణగా సువర్చలాను వివాహమాడమన్నాడు. హనుమ కలియుగాంతం వరకు ఆగమన్నాడు.

ఆ తర్వాత వివాహం చేసుకుంటానని చెప్పాడు. కాబట్టి సువర్చలను హనుమ కలియుగం అంతమైన తర్వాతే వివాహం చేసుకుంటాడు. ఇచ్చిన మాట ప్రకారం, సూర్యునికిచ్చిన గురుదక్షిణ ప్రకారం.

యజ్ఞోపవీతము నందు 9 పోగులేమిటి?

యజ్ఞోపవీతము తొమ్మిది పోగుల్లో తొమ్మిది దేవతలు ఉంటారు. బ్రహ్మ , అగ్ని, అనంతుడు, చంద్రుడు, పిత్రు దేవతలు, ప్రజా పతి వాయువు, సూర్యుడు , సర్వ దేవతలు నివశిస్తారు.

దేవునికి ఎదురుగా నిలబడి దణ్ణం పెట్టుకోవచ్చా....?

దేవునికి దణ్ణం పెట్టుకోవాలంటే ఆయనకు ఎదురుగా దణ్ణం పెట్టుకోకూడధన్నది నూరుపాళ్ళు నిజం.
ఈ జగత్తును పాలించే ఆ భగవంతున్ని ధర్శించాలనే ఒక ప్రక్కగా నిలబడి ఎంతో వినయంగా భక్తితో నమస్కరించాలి.అంతే తప్ప ఆ పరమేశ్వరుని ఎదురుగా నిలబడి నమస్కరించకూడదు.

దేవాలయాల్లో కూడా ఇందుకు తగినట్లుగానే ఏర్పాటు చేయటం మీరు గమనించవచ్చు. దేవునికి ఎదురుగా నిల్చొని నమస్కరించ కూడదని వేదం చెప్తోంది.


మీరు ఎప్పుడైనా విగ్రహ ప్రతిష్ట జరుగుతునప్పుడు చూసారా ?విగ్రహ ప్రతిష్ట జరిగే రోజున విగ్రహం కనులకు మైనం పెడతారు .విగ్రహం ప్రతిష్ట జరిగాక దేవుని విగ్రహనికి పెట్టిన మైనాన్ని తొలగింహగానే స్వామి వారి ద్రుష్టి మొదట ఆవు దూడ పై పడేలా ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత స్వామి వారు తన రూపం తను అద్దం లో చూసుకోనేల చేస్తారు.అటు పిమ్మట స్వామి వారికి మహహ నివేదిక ఏర్పాటు చేసి అయన ద్రుష్టి ఆహరం మీద పడేలా ఏర్పాటు చేయడం జరుగుతుంది.దీని అర్థం ఏమిటంటే గుడిలో ఉన్న స్వామి వారి ద్రుష్టి సరాసరి ధ్వజస్తంబం క్రింద ఉన్న దైవం మీద పడాలి.వారిదరి మద్య ఎవ్వరు నిలబదకూడదు.

విగ్రహ ప్రతిష్ట జరిగిన రోజునే కాదు ...ఏ రోజునైన స్వామి వారికి అయన వాహనానికి మద్యన ఎవ్వరు కూడా నిలబడకూడదు.అందువలనే దేవుని ఎదురుగా నిలబడి దణ్ణం పెట్టుకోకుడదని అంటారు.ఒక ప్రక్కగా నిలబడి దేవునికి వినయంతో చేతులు జోడించి దణ్ణం పెట్టుకోవాలి. భక్తితో మీ మనసులోని కోరికలని విన్నవించుకోవాలి.మిగతా దేవుల్లందరికి ఎదురుగా నిలబడి నమస్కారం చేయకూడదు కాని శని దేవుణ్ణి మాత్రం ప్రక్కనుంచి చూడకూడదు.శనికి ఎదురుగా వెళ్లి నమస్కారం చేసి ప్రక్కకు వెళ్లిపోవాలి.

శివుని లింగ రూపంలో ఎందుకు పూజిస్తున్నారు?

శివునికి రెండు రూపాలు చెప్పింది శివ పురాణం. నిర్గుణం, సగుణం... నిర్గుణ రూపమే లింగం. సగుణరూపం పంచముఖం, అభిషేకం శివునికి ప్రశస్తం గాన నిర్గుణమైన లింగాన్ని పూజించుటయే శ్రేష్టం. సగుణమైన సాకారం ధ్యానించుటలో ముఖ్యం.

తులసి కాండంలో సమస్త దేవీదేవతలు నివాసముంటారట!

మూలికలలో మహారాణి తులసి. తులసి అనే సంస్కృత పదం. తులసి అంటే సాటిలేనిది అని అర్థం. "యన్మూలే సర్వతీర్థాని సన్మధ్యే సర్వదేవతా యదగ్రే సర్వ వేదాశ్చ తులసీం త్వాం నమామ్యహమ్ " అని శాస్త్రాల్లో చెప్పబడింది.

తులసి మొక్క మధ్య భాగంలో అంటే కాండం నుంచి సమస్త దేవీదేవతలు అగ్రభాగమందు నాల్గువేదాలు, మూలస్థానమందు సర్వతీర్థాలు నివాసముంటాయి. అటువంటి తులసికి నమస్కరిస్తున్నానన్నదే పై శ్లోకం అర్థం.

మన జీవన విధానానికి ప్రకృతి ఆలంబన. ప్రకృతిలో ముడిపడి సాగే జీవనసరళిలోని పురాణగాథలలో అంతర్లీనంగా ఎన్నో వైజ్ఞానిక అంశాలు ఉన్నాయి. పురాణగాథలో ముడిపడిన జీవనశైలిలోని ఆచార వ్యవహారాలన్నీ మానవ జీవన వికాసానికి తోడ్పడతాయి.

తులసిలో మనకు తెలిసిన కృష్ణతులసి, లక్ష్మితులసితో పాటు రామతులసి, అడవితులసి, నేలతులసి, మరువకతులసి, రుద్రజడతులసి, కర్పూరతులసి ఇలా ఎన్నో రకాలున్నాయి. కర్పూరతులసి తైలాన్ని ఓషధీయుత టాయ్‌లెట్స్ సాధనాల తయారీలో విరివిగా వాడతారు. ఈ నూనెను చెవినొప్పికి, క్రిమికీటకాలు, బ్యాక్టీరియాను నిరోధించడానికి ఎక్కువగా వాడతారు.

శ్వాస అవరోధ రుగ్మతలను నయం చేయడానికి రామతులసిని ముందుగా వాడతారు. మలేరియాను రామతులసి నయం చేస్తుంది. అజీర్ణం, తలనొప్పి, హిస్టీరియా, నిద్రలేమి, కలరా వంటివి నయం చేయడానికి తులసిలో మందు ఉంది. రుగ్మతల్ని నయం చేసే గుణాలుగల తులసి మూలికల్లో మహారాణిగా శతబ్దాల తరబడి ప్రసిద్ధి గాంచినది.

అయ్యప్ప మాల ధరించ కూడని సందర్బములు:

కుటుంబములో తల్లి, తండ్రి మరణించిన చొ ఏడాది కాలము సూతకము పాటించ వలెను.కావున ఆ కాలములో తనయులు శబరిమలకు మాల దరించ కూడదు. భార్య మరణించిన చో ఒక ఏడాది,సోదరులు , కుమారులు, అల్లుళ్ళు,మేనత్తలు,మేన మామలు,తాత,బామ్మ మున్నగు వారు మరణించిన చో ముపై దినములు,మనుమళ్ళు,మనుమరాళ్ళు,దాయాదులు మరణించినచో ఇరవై ఒక దినములు, ఇంటి పేరు గలవారు,రక్త సంబంధీకులు, వియ్యాల వారు మరణించినచో పదమూడు దినములు, ఆత్మీయులు, మిత్రులు మరణించినచో మూడు దినములు దీక్ష తీసు కొనరాదు. తల్లి,భార్య,కూతురు,కోడలు,మరదలు మున్నగు వారు ఇదు నెలల గర్బిని ఇనచో మాల ధరించరాదు. దీక్షలో ఉండగా బంధు వర్గాదులలో yevvaru మరనిన్చినాను ఆ వార్త తెలియగానే మాల విసర్జన చెయ్యవలెను.అలా కాక మాలో మాకు మాట పలుకులు లేవు,కనుక మాకు ఆ మరణంతో ఎలాంటి పట్టింపులు లేవు అనకూడదు. ఏ కారణం చేతనైనా మాల విసర్జన జరిగినచో మరల ఆ ఏడాది మాల దరించ రాదు.ఇరుముడి లేకుండా మామూలు దుస్తులతో స్వామీ వారిని దర్శించ వచ్చును.

గృహమందు పూజలు

గృహమందు పూజలు చేయువారు ఈశాన్య గదులందు కాని,వాయువ్య గదులందు కాని పూజలు చేయాలి. అలాగే తూర్పు ఉత్తర దిశా లో ఉన్న గదులలో చేయాలి . పూజ చేయు వారి ముఖము
ఉత్తరమునకు అభిముఖముగా కాని, తూర్పు కు అభిముకముగా కాని ఉండాలి.


దీపారాధనకు వేరుశనగ నూనే ను వాడితే అరిష్టములు కలుగును. ఆవు నెయ్యి తో చేసిన ఐశ్వర్యము, ఆరోగ్యము, సంతోషముకలుగును. నువ్వుల నూనె తో చేస్తే దుష్ట శక్తి భాధలు, శత్రు బాధలు తోలుగుతాయి.


ఆముదము తో చేస్తే ఎకగ్రత ,కీర్తి ప్రతిష్టలు, స్నేహితులు పొందుతారు. కొబ్బరి నూనె గణపతి పూజ కు మేలు చేయును.


ఆవు నెయ్యి, పిప్పి నూనె, వేప నూనె కలిపి దీపారాధన చేయుట మంచిది. 


వెండి కుందులు, పంచ లోహ కుందులు మంచివి. మట్టి కుందులు మాద్యమము. స్టీలు కుందులు అధమము.

పూజ సమయమున అరుణ వస్త్రములు ధరించుట మేలు. పూజ ను విగ్నేశ్వర పూజ తో ప్రారాబించి, ఆంజనేయ పూజతో ఆపుట ఆచారము . పూజ చేస్తూ ఇతరులతో మాటలాడటం, హాస్యముగా వ్యవహరించడము తప్పు.

దీపారాదనలో తెలియకుండా చేసే పొరపాట్లు

స్టీలు కుందుల్లో దీపారాధన చేయరాదు.
అగ్గిపుల్లతో దీపాన్ని వెలిగించారాదు.
ఒకవత్తి దీపాన్ని చేయరాదు. ఏక వత్తి శవం వద్ద వెలిగిస్తారు.
దీపాన్ని అగరవత్తి తో వెలిగించాలి.
దీపారాధన మూడు చోట్ల కుంకుమ పెట్టి అక్షితలు వేయాలి.
విష్ణువుకు కుడివైపు ఉంచాలి. ఎదురుగ దీపాన్ని ఉంచరాదు.
దీపం కొండెక్కితే “ఓమ్ నమః శివాయ ” అని 108 సార్లు
జపించి దీపం వెలిగించాలి.

దేవికి సమర్పించే వస్త్రాలను మహిళలు ధరించవచ్చా!?

అమ్మవారికి ఇచ్చిన వస్త్రాలను మహిళలు, పురుషులు, పిల్లలు ధరించకూడదని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. దేవుని వస్త్రాలను ఆపత్కాలంలో మాత్రమే ఇవ్వాలి. దేవుని వస్త్రాలను మీ తరపున ఇతరులు ధరించేందుకు ఇవ్వకూడదు.

నిద్రించే సమయంలో దేవతా వస్త్రాలను ధరించకూడదు. దేవుని వస్త్రాలను పూజా సమయాల్లో మాత్రమే అనగా స్వర్ణగౌరి, వరలక్ష్మి, మంగళగౌరి పండుగ తదితర సమయాల్లో మాత్రమే దేవికి అలంకారం చేసేందుకు ఉపయోగించవచ్చు.

అయితే నూతన వస్త్రాలను దేవాలయం దేవుని పేరిట కొనుగోలు చేసి వచ్చే దేవతాకర్తలకు ఆశీర్వాదం చేసి ఇస్తే ఉపయోగించుకోవచ్చు. దేవాలయాల్లో దేవుని సన్నిధానంలో జరిగే సభ, సన్మానాల్లో ఇచ్చే వస్త్రాలను ఉపయోగించుకోవచ్చు. దేవుని పేరిట దానం చేసి మిగిలిన వస్త్రాలను ఉపయోగించుకోవచ్చు.

దేవునికి అలంకరించిన వస్త్రాలను దేవాలయం వారు ఆశీర్వదించి ఇస్తే వస్త్రానికి సమర్పించి స్వీకరించాలి. దేవతాకార్యాల్లో దేవునికి నివేదన అయినా లేదా దేవుని ఊరేగింపుల్లో దేవతా వస్త్రాలను ఉపయోగించవచ్చు. హోమంలో ప్రధాన కలశం అలంకరణకు వాడవచ్చు. ఎట్టి పరిస్థితుల్లోనూ దేవతా వస్త్రాలను తొక్కకూడదు.

వివాహ సమయంలో మధ్య తెరగా, ఉపనయంలో మంత్రోపదేశానికి వస్త్ర ప్రసాదాన్ని ఉపయోగించకూడదు. స్త్రీ దేవతలకు అలంకరించిన గాజులను, చీరలను సుమంగళులు దేవుని వస్త్రాలను స్వీకరించకూడదు. తిరిగి ధరించకూడదు.

ఇంటి స్థలం ఎంపిక ఎలా..?


1. స్థలానికి సంబంధించిన నాలుగు భుజాల్లో హెచ్చు తగ్గులున్నా, నాలుగు భుజాల కంటే ఎక్కవ భుజాలు కలిగి ఉన్న స్థలం గృహ నిర్మాణానికి పనికిరాదు. ఇలాంటి స్థలంలో ఇంటి నిర్మాణం చేపడితే అశుభాలు కలుగు తాయని వాస్తు చెబుతోంది.
2. పొడవు ఎక్కువగా ఉండి, భుజాల్లో హెచ్చు తగ్గులుగా ఉండే స్థలం కూడా మంచిది కాదు. ఈ స్థలంలో ఇంటి నిర్మాణం జరిగితే పశు హాని, అనారోగ్యం కలిగిస్తుంది.
3. చేట ఆకారంలో గల స్థలం కూడా ఇంటి నిర్మాణానికి మంచిది కాదు. ఇలాంటి స్థలంలో ఇంటి నిర్మాణం చేపడితే... ఎంత సంపాదించి నా నిలువ ఉండటం అసాధ్యం. క్రమంగా దారిద్య్రానికి దారితీస్తుంది. నిరంతరం మానసిక అశాంతికి గురికావటం కూడా జరుగుతుందని వాస్తు శాస్తజ్ఞ్రులు అంటున్నారు.
4. ఢమరకపు ఆకారంలో ఉండే స్థలం కూడా మంచిది కాదు. ఇలాంటి నేలలో ఇంటి నిర్మా ణం చేపడితే సంతానం కలగటంలో సమస్య లు, నేత్ర సంబంధిత రోగాలు కలుగుతాయి.
5. లాగుడు బండి ఆకారంలో ఉండే స్థలం ఆర్థిక పతనానికి దారి తీస్తుంది.
6. కుంభాకార స్థలంలో కట్టే ఇంటి వల్ల... భయం, అంటు వ్యాధులు, సుఖశాంతులు లోపిం చటం జరుగు తుంది.
7. విసన కర్ర ఆకా ర స్థలం.. ఎటువంటి ఆస్తిమంతుల్నైనా ఆర్థికంగా అణగారిపోయేలా చేస్తుంది.
8. మద్దెల ఆకారంలో గల స్థలాలు భాగస్వాముల మధ్య వివాదాలను సృష్టిస్తాయి. విడిపోయే ఆస్కారాలను అధికంగా కలిగిస్తాయి.
9. అర్థ చంద్రాకార స్థలాల వలన మానసిక భ్రాంతి కలుగుతుంది. తరచుగా దోపిడీలు జరుగుతుంటాయని వాస్తు శాస్త్రం చెబుతోంది.

’L’ ఆకారంలో ఉండే స్థలంలో ఇంటి నిర్మాణం అశుభం...
చతురస్ర, దీర్ఘ చతురస్రాకారంలో ఇంటిని, అపార్ట్‌మెంట్‌ లను నిర్మించాలని వాస్తుశాస్త్రాలు చెబుతున్నాయి. అలా నిర్మించని గృహాలపై విషవాయువుల ప్రభావం ఉంటుం దని పలువురు శాస్తజ్ఞ్రుల విశ్వాసం కూడా. ఇల్లు, ఆపార్ట్‌ మెంట్‌, ఆఫీస్‌ ఇలా ఏదైనా ఒకవిధమైన షేప్‌పై ఆధారపడి నిర్మించటం జరుగుతుంది. అలాకాకుండా నిర్మాణానికి పరిమితం లేని పక్షంలో సీత గీత దాటినట్టు, హద్దుదాటి ప్రత్యేకంగా ఏ గదైనా దాటి నిర్మించటం మంచిది కాదు.అందు చేత గృహాలు నిర్మించేటపుడు జాగ్రత్తతో, వాస్తు ప్రకారం షేప్‌ను పాటించి నిర్మించాలి. ప్రస్తుతం మీ ఇల్లు ‘ఎల్‌’ ఆకారంలో ఉంటే ఇంటిలోని గదులు అలాగే నిర్మించటం అంత మంచిది కాదు. రెండు ‘ఎల్‌’ షేప్‌లు కలవ కూడదు. రెండు ‘ఎల్‌’ షేప్‌లు కలిసి దీర్ఘ చతురస్రాకారం ఏర్పడుతుంది. అయితే ‘ఎల్‌’ షేప్‌ ను వాస్తుశాస్త్రంలో అసంపూర్ణ చిహ్నంగా శాస్తజ్ఞ్రులు స్పష్టం చేస్తున్నారు. ‘ఎల్‌’ ఆకారంలో ఇంటి నిర్మాణం చేపడితే... గృహాలకు సహాయాన్ని అందించే ప్రకృతి సిద్ధమైన శక్తులను దూరం చేసుకునే పరిస్థితి కలుగుతుందని వారి అభిప్రాయం. ఇప్పటికే తమ ఇళ్లలో ‘ఎల్‌’ ఆకారముంటే ఆ ఆకారాన్ని మార్చే విధంగా దీర్ఘ చతుర్రసం వచ్చేలా స్థలానికి ఒకమూల మొక్కను నాటడం గాని, లేదా ఏదైనా పోల్‌ను పాతటం కానీ మంచిది. ఇలా చేస్తే కొంతైనా దుష్ప్రయోజనాలకు దూరంగా ఉంచటానికి సాధ్యపడు తుంది. కాబట్టి ఇంటి నిర్మాణం చతురస్ర లేదా దీర్ఘచతుర స్రాకారాన్ని మాత్రమే కలిగి ఉండాలి. అలా లేని పక్షంలో విద్యా విషయంలో సమస్యలు ఏర్పడటం, కుటుంబంలో చిన్న చిన్న తగాదాలు, భార్యాభర్తల మధ్య స్పర్థలు ఏర్పడతాయని వాస్తు శాస్త్రం పేర్కొంటుంది.

ఆంజనేయునికి తమలపాకులంటే ఇష్టం.. ఎందుకని?

ఆంజనేయుడు నాగవల్లి ప్రియుడు. నాగవల్లి అనగా పాము పడగ వంటి ఆకారము కలిగిన దళములు - తమలపాకులు. ఇవి ఆయనకు ఎందుకిష్టమంటే దేవదానవులు క్షీరసాగర మధనం చేసిన సమయంలో కల్పవృక్షం, కామధేనువు, చింతామణి, లక్ష్మీదేవి, కుశలు, కాలకూట విషము, అమృతము ఆపై నాగవల్లి పత్రములు గూడ ఉధ్భవించినవట.

ఆ ఆకులు సేవించటం ఆరోగ్య భాగ్యానికి హేతువు. తమలములు తమ జన్మలో ఒక్కసారైనా నమలని జన్మ బహుశావుండదని వేమనశతకంలో వివరించెను. జీర్ణశక్తి, ఎముకలపుష్టి, వీర్యవృధ్ధి, ఆకలి కలిగించుట, జఠరాగ్ని రగిలించుట, పైత్యం, అరుచి మొదలైన ఔషధాలన్నీ తమలపాకుల్లో ఉన్నాయి.

అందువలన తమలపాకులతో ఆంజేయునికి దళార్చన చేయాలనుకునే వారు మూలం క్రింద వుండే విధంగా దళపై భాగం ముందునట్లుంచి పూజించవలెను. భక్తులు భగవంతునకు పత్రం, పుష్పం, ఫలం, ఉదకమైనా భక్తితో సమర్పించుట మంచిది.

ఆంజనేయుని దేహము ఆకుపచ్చారంగులో నుండును - సుందరకాండలో వనములు తిరుగుచూ లంకాపురం చరించునప్పుడు అది రక్షణ కవచంగా కాపాడెను. కాబట్టి తమలపాకులతో స్వామిని అర్చిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పండితులు అంటున్నారు.

సుబ్రహ్మణ్యుడు

షణ్ముఖుడు అనగా కుమారస్వామి శివ పార్వతుల తనయుడు.వినాయకుని తమ్ముడు. దేవతల సేనాధిపతి. ఈయనకే 'స్కందుడు' అని, 'కార్తికేయుడు' అని, 'శరవణుడు' అని, 'సుబ్రహ్మణ్యుడు' కూడా పేర్లున్నాయి. ఈయన వాహనము నెమలి. స్కంద పురాణంలో ఈయన గాధ వివరంగా ఉన్నది. ఇతన్ని కొలిచే పర్వదినం సుబ్రహ్మణ్య షష్టి ప్రతి సంవత్సరం మార్గశిర శుద్ధ షష్ఠి రోజు జరుపుకొంటారు.
నెమలి వాహనంతో కుమారస్వామి
ఈయన బ్రహ్మచారి అని కూడా చెబుతారు. ఒక రోజు కార్తికేయుడు ఒక పిల్లిని గిల్లితే ఆయన తల్లికి బుగ్గ మీద గాయమయ్యిందట.జగజ్జనని, "నాయనా! ఈ ప్రపంచములోని ప్రతి ప్రాణిలోనూ నేను వున్నాను, నేను కానిది వేరే లేదు, ఈ సృష్టి అంతా నేనే ! అందువల్ల నువ్వు ఎవరిని గాయపరచినా నన్ను గాయపరచినట్లే అని చెప్పింది. అది విన్న కార్తికేయుడు పెళ్ళి చేసుకోకూడదని నిశ్చయించుకున్నాడు. అందరు స్త్రీలలోను తన తల్లి మూర్తీభవించి ఉంది కనుక తాను ఇక ఎవరినీ పెళ్ళాడలేను అనుకుని కార్తికేయుడు బ్రహ్మచారి గా వుండి పోయాడట.సురాపద్ముడు, సింహముఖుడు, తారకాసురుడు అనే రాక్షసులు లోకకంటకులై దేవతలనూ, మానవులనూ బాధిస్తున్నారు. శివపార్వతుల ఔరస కుమారుడే వీరిని చంపగలడని బ్రహ్మ తెలిపాడు. తన పూలబాణాలతో శివుని తపస్సు భంగముచేసి ప్రణయములోనికి దింపాలని ప్రయత్నించిన మన్మధుడు శివుని కోపాగ్నికి భస్మమయ్యాడు. శివునినుండి వెలువడిన దివ్యతేజస్సు ఆరుభాగాలుగా విభజింపబడింది. వాటిని వాయువు, అగ్ని దేవుళ్ళు గంగానదిలో ఉంచారు. అవి ప్రవాహంలో వెళ్ళి ఒక వనంలో శరంలో (రెల్లుగడ్డిలో) చిక్కుకొని ఆరు చక్కని బాలురుగా మారాయి. వాటికి కార్తీక నక్షత్ర దేవతలు జోలపాడారు. విషయం తెలిసిన పార్వతి 'స్కందా' అని పిలుస్తూ వారిని అక్కున చేర్చుకోగా వారు ఆరు ముఖాలూ, 12 చేతులూ గల ఒకే బాలునిగా అవతరించారు. అందుకే ఆయనకు అన్ని పేర్లు వచ్చాయి


కుమారస్వామి - రాజా రవివర్మ చిత్రం
షణ్ముఖుడు - ఆరు ముఖాలు గలవాడు
స్కందుడు - పార్వతి పిలచిన పదాన్ని బట్టి
కార్తికేయుడు - కృత్తికా నక్షత్ర సమయంలో అవతరించాడు
వేలాయుధుడు - శూలము ఆయుధంగా గలవాడు
శరవణభవుడు - శరములో అవతరించినవాడు
గాంగేయుడు - గంగలోనుండి వచ్చినవాడు
సేనాపతి - దేవతల సేనానాయకుడు
స్వామినాధుడు - శివునకు ప్రణవ మంత్రము అర్ధాన్ని చెప్పినవాడు
సుబ్రహ్మణ్యుడు - బ్రహ్మజ్ఙానము తెలిపినవాడు
మురుగన్ -


శ్రీ వల్లీ దేవ సేన సమేతులైన కుమారస్వామి - సాంప్రదాయిక చిత్రం.
దేవతల కోరిక మేరకు ఈయన సురపద్ముని, సింహముఖుని, తారకాసురుని వధించాడు. ఈయనకు వల్లి, దేవసేన అను ఇద్దరు భార్యలు ఇచ్ఛాశక్తికి, క్రియాశక్తికి స్వరూపాలు. వినాయకుడు నారదునికి కృత్తికావ్రతము ఆచరించమని బోధించాడంటారు.

కంచి-కామాక్షి, మధుర-మీనాక్షి. కాశీ-విశాలాక్షిలను దర్శనం చేసుకుంటే?

సుప్రసిద్ధ దేవి మీనాక్షి సుందేశ్వరులు కొలువైన ప్రాచీన మదురై తమిళ సంస్కృతికి పుట్టినిల్లు. దక్షిణ భారతదేశంలో పర్యటించే ప్రతి యాత్రికునికీ శిల్పకళా పూరితమైన ఆలయాలు ప్రత్యేక ఆకర్షణ. ఈ క్షేత్రంలోనే శక్తి స్వరూపిణి మానవరూపంలో పాండ్యరాజపుత్రికగా పరిపాలనచేసి పరమశివుని సతీమణి అయ్యింది.

దేవలోకాధిపతి అయిన ఇంద్రుడికి బ్రహ్మహత్యా పాతకదోషం చుట్టుకోవడంతో పాపపరిహారం కోసం మదురై సమీపంలోని కదంబవనం వద్ద తపస్సు చేశాడు. స్వయంభూలింగం మహత్యం వల్లే తనకు పాపపరిహారం అయ్యిందని పరమశివుని స్వర్ణకమలాలతో ఆరాధించి, ఆ చోట దివ్యవిమానం నిర్మించాడట.

ఏడవ శతాబ్దంలో ఓ శివాలయం, ప్రహరీగోడలు మాత్రమే ఉండేవి. ఆ తర్వాత పన్నెండవ శతాబ్ధంలో చడయవర్మన్, సుందరపాండ్యన్ పరిపాలనాకాలంలో మీనాక్షీదేవి ఆలయాన్ని సందర్శించారు. ఈ క్షేత్రంలో తొలుత మీనాక్షిదేవిని దర్శనం చేసుకున్న తర్వాతే భక్తులు సుందరేశ్వరుని సేవించడం ఆనవాయితీగా వస్తోంది. చేతిలో రామచిలుకను ధరించి మీనాక్షిదేవిని దర్శనం చేసుకోవడానికి దేశం నలుమూలల నుండి వేలాదిమంది భక్తులు వస్తారు.

భారతదేశంలో కంచి-కామాక్షి, మధుర-మీనాక్షి. కాశీ-విశాలాక్షిలను దర్శనం చేసుకుంటే సర్వసౌభాగ్యాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఉత్సవాల సందర్భంగా పేరొందిన మదురైలో వచ్చే శ్రావణం, పుష్యమాసాల్లో అమ్మవారికి అంగరంగవైభవంగా వేడుకలు జరుగుతాయి. మీనాక్షిదేవి ఆలయంలో నిర్వహించే ఈ ప్రత్యేక ఉత్సవాలకు దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు హాజరవుతారు.

ఆంజనేయుడికి ఇష్టమైన పుష్పాలేంటో మీకు తెలుసా?

వైశఖమాసి కృష్ణాయాం - దశమ్యాం మందవాసరే!
పూర్వాభాద్రాభ్య నక్షత్రే - వైధ్రుతౌ హనుమా నభూతే||

ఆంజనేయ స్వామి వసంతఋతువు, వైశాఖ మాసం కృష్ణపక్షంలో, దశమి తిధి, శనివారం, పూర్వాభాధ్రా నక్షత్రమున, వైధృతౌ మధ్యాహ్న కాలమున అంజనీదేవికి జన్మించాడు.

ఆంజనేయుడు అంజనాదేవి కేసరుల ముద్దుబిడ్డ. సదా రామనామామృతపాలన సేవితుడై గంధమాధశైలి యందు వసించు చిరంజీవి. ఆంజనేయ నామమహిమ అనితరమైనది.

అలాంటి మృత్యుంజయుడైన ఆంజనేయుని పొన్నపువ్వు, మొగలి, పొగడ, నంధివర్ధనము, మందారము, కడిమి, గజనిమ్మ, పద్మము, నల్లకలువ, మద్ది, సువర్ణ పుష్పం, గౌరీ మనోహరం, ఎర్ర గన్నేరు, కనకాంబర, ములుగోరిట, మెట్ట తామర, పొద్దు తిరుగుడూ, మంకెన, బండికెరి వెంద, అడవిమల్లె, కొండగోగు దింటెన, సన్నజాజి, మల్లె, గులాబి, మోదుగ, సంపంగి, జిల్లేడు, చంధ్త్ర కాంత, సురపున్నాగ, కుంకుమ పువ్వు మొదలగు పుష్పాలు ఇష్టం.

అలాగే తులసి, మాచిపత్రి, ఎర్రకలువ, గోరింట, ఉత్తరేణి, పసుపు, అక్షింతలు, తిరుమారేడు, నేరేడు, తమలాపాకులు కూడా ఆంజనేయుని ప్రీతికరమైనవని పండితులు అంటున్నారు. పైన చెప్పిన పుష్పాలు, పత్రాలతో స్వామివారి పూజిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి.

మామిడాకులు లేకుండా ఏ శుభకార్యం జరగదు.. ఎందుకని?

ప్రేమకు, సంపదకు, సంతానాభివృద్ధికి ప్రతీక మామిడి. జీవితంలో ముఖ్యమైన ఈ మూడింటినీ అందించే మొక్కగా మామిడిని పూజిస్తారు రామాయణం, మహాభారతం వంటి గ్రంథాలతో పాటు అనేక ఇతర పురాణాలలో మామిడిమొక్కల ప్రస్తావన ఉంది.

మామిడాకుల పాత్ర లేకుండా ఏ శుభకార్యం జరగదు. మంగళతోరణాలు కట్టేందుకు వాడేది మామిడి ఆకులనే. పూజకు ముందుంచే పూర్ణకుంభంలో అమర్చేది మామిడి ఆకులనే.

పూర్ణకుంభమంటే భూదేవిరూపం. అందులో పోసే నీరు మనజీవితానికి మూలాధారమైనవి. ఆ కుంభంలో ఉంచే కొబ్బరికాయ, అమర్చే మామిడి ఆకులు జీవితాన్ని సూచిస్తాయి. ఆ పూర్ణకుంభం అమరిక లక్ష్మీదేవి రూపమవుతుంది.

మామిడి తోరణాలు శుభకార్యాలకు కడతారు. భగవంతుని పూజించేందుకు మామిడిని వాడతారు. భారతీయ సాహిత్యంలో మామిడిని స్తుతించిన విధంగా మరొకచెట్టును స్తుతించలేదు. దీనిని కల్పవృక్షమన్నారు. మామిడి పువ్వును మన్మథుని బాణాలలో ఒకటిగా కాళిదాసాది కవులు వర్ణించారు.

క్రీ.పూ. 150 కాలం నాటి సాంచీ స్థూపంమీద మామిడిచెట్టు, పండ్లు అద్భుతంగా చెక్కడం కనిపిస్తుంది. శిల్పకళతో పాటు అనేక ఇతర హస్తకళల్లో మామిడిరూపం కనిపిస్తుంది.

భక్తితో సమర్పిస్తే పత్రమైనా పావనమే

భక్తి పూర్వకంగా, పరిశుద్ధమైన మనస్సుతో ఎవరైతే నాకు ఒక ఆకును గాని, పుష్పమును గాని, పండును గాని, కొద్దిపాటి జలమును గాని సమర్పిస్తారో అట్టివారి భక్తి నైవేద్యాన్ని తృప్తిగా విందారగిస్తానని శ్రీకృష్ణ్భగవానుడు ‘గీత’లో చెప్పాడు. నిజమైన భక్తి నిశ్చలమైన, పరిశుద్ధమైన మనస్సుతోనే సంప్రాప్తిస్తుంది. ఎవరైతే దైవాన్ని పరిశుద్ధమైన, నిష్కపటమైన మనస్సుతో పూజించి తరిస్తారో అలాంటి వారిని ఆ దైవం వెన్నంటే ఉండి కాపాడుతుంది. 

భగవదారాధనలో పుష్పాల పాత్ర అమోఘమైనది. సాక్షాత్తు శ్రీకృష్ణ్భగవానుడే తన అర్చనా విధానంలో పుష్పాలను చేర్చడం ఇందుకు నిదర్శనం. అందువల్ల పూజా విధానంలో పుష్పాలు తప్పనిసరి అయిన వస్తువులుగా మారాయి. అస్సలు ఈ పూజా విధానంలో ఎలాంటి పుష్పాలు వాడాలి? ఏ దేవతను ఏ పుష్పాలతో పూజిస్తే సత్ఫలితాలు వస్తాయోనన్న సందేహం వెంటాడుతుంది.

అయితే దేవునికి సమర్పించే పుష్పం ఏదైనా అది శుచి అయి, శుభ్రతతో కూడుకున్నదై ఉండాలని పెద్దలు చెబుతారు. పురిటివారు, మైలవారు, బహిష్టులయిన స్ర్తిలు పుష్పాలను తాకరాదు. అలాంటి పుష్పాలు పూజకు పనికిరావు. అలాగే భూమిపై పడ్డ పుష్పాలు, వాసన చూసిన పుష్పాలు, కడిగిన పుష్పాలను పూజకు వినియోగించరాదని శాస్త్రం చెబుతోంది. శుచిగా, స్నానమాచరించిన తర్వాత కోసిన పత్ర, పుష్పాలనే దైవ పూజా కార్యక్రమాలకు ఉపయోగించాలిట. వాడిపోయినవి, ముళ్ళుతో కూడుకున్నవి, అపరిశుభ్రమైనవి, దుర్గంధ పూరితమయిన పుష్పాల వినియోగం శ్రేయస్కరం కాదని శాస్త్రాలు చెబుతున్నాయి.


అలాగే కంఠాన గంధాన్ని, చెవిలో పుష్పాన్ని ధరించాలట. జుట్టు ముడియందు తులసి దళాన్ని ధరించరాదట. తామర పువ్వులు, కలువ పువ్వులు, జాజులు, చామంతి, నందివర్ధనములు, మందారము, నీలాంబరాలు, కనకాంబరాలు, మాలతి, పారిజాతాలు, పద్మాలు, మంకెన, మునిగోరింట, ఎర్రగనే్నరు, గరుడవర్ధనము, నిత్యమల్లి పుష్పాలు పూజలకు పవిత్రమైనవిగా చెబుతారు. సూర్యభగవానుడ్ని, విఘ్నేశ్వరుని తెల్లజిల్లేడు పుష్పాలతో పూజించాలట.


విష్ణ్భుగవానుని తులసి దళాలతో, శ్రీమహాలక్ష్మిని తామర పువ్వులతో, గాయత్రిదేవిని ‘మల్లిక’, ‘పొగడ’, ‘కుశమంజరి’, ‘మందార’, ‘మాధవి’, జిల్లేడు, ‘కదంబ’, ‘పున్నాగ’, ‘చంపక’, గరిక పుష్పాలతో పూజించాలిట. అలాగే ‘శ్రీచక్రాన్ని’. తామరపువ్వులు, తులసి దళాలు, కలవ పూల, జాజి, మల్లె, ఎర్రగనే్నరు, ఎర్ర కలువపూలు, గురువింద పుష్పాలతో పూజించాలి. అలాగే మహాశివుని మారేడు దళాలతో పూజించడంవల్ల పరమేశ్వరుడు సంతృప్తిచెంది కోరిన వరాలన్నీ నెరవేరుస్తాడంటారు. అలాగే పవళ మల్లె పుష్పాలతో పూజిస్తే మంచి కోర్కెలు, మంచి ఆలోచనలు ఉద్భవిస్తాయట. ‘మంగిషం’ పుష్పాలతో పూజ ఓర్పును, శాంతిని, సహనాన్నిస్తుంది. విరుచి పుష్పాలు మనసుకు ప్రశాంతతను, ‘ఎరుక’ పుష్పాలు ఆత్మస్థయిర్యాన్ని, అరళి పుష్పాలు సత్యసందతను పెంపొందిస్తాయట.
అలాగే తెల్ల తామరలతో దైవాన్ని అర్చిస్తే భక్తి పెరుగుతుంది. తులసి దళాలు ఆధ్యాత్మిక వికాసాన్ని, గనే్నరు, జీవంతి పుష్పాలు ముక్తికి, మల్లెపుష్పాలు, నిష్కల్మషబుద్ధిని, సంపెంగ పుష్పాలు అభివృద్ధిని, నాగలింగ పుష్పాలతో పూజిస్తే ఆర్థికాభివృద్ధి జరుగుతుందని శాస్తవ్రచనం. అలాగే ఎర్ర పుష్పాలు శ్రీ మహాలక్ష్మికి ప్రీతికరం. ఈ పుష్పాలతో పూజవల్ల శ్రీమహాలక్ష్మి సంతుష్టురాలై, అభీష్టసిద్ధినిస్తుంది. అలాగే తామర, శంఖ పుష్పాలతో చేసే పూజవల్ల అష్టైశ్వర్యాలు, మారేడు దళాలతో చేసే పూజవల్ల జ్ఞానాభివృద్ధి కలిగి ముక్తికలుగుతుందని శాస్త్రాల ద్వారా అవగతమవుతుంది. అయితే భగవంతునికి సమర్పించే ఏ పుష్పమైననూ భక్తితో, పరిపూర్ణమైన విశ్వాసంతో సమర్పించాలి తప్ప విశ్వాసం, భక్తిలేకుండా పుష్పాలు సమర్పించడంవల్ల ప్రయోజనం ఉండదని శాస్త్రాలు చెబుతున్నాయి.


భగవత్ భక్తికలవారు ప్రథమంగా దైవాన్ని పుష్పాలతోనే పూజించాలట. భక్తితో పరిపూర్ణత సాధించిన తర్వాత, సర్వాంతర్యామి అయిన ఆత్మస్వరూపుని మనఃపుష్పాలతో పూజించాలని పెద్దలు చెబుతారు. అయితే మనఃపుష్పాలతో పూజించే సమయం ఎప్పుడు దొరుకుతుంది? అసలు ఆత్మస్వరూపానికి ఎలాంటి సందర్భాలలో పూజా విధులు చేయగలుగుతారని ప్రశ్నించుకుంటే, అది భక్తిలో పరిపూర్ణత సాధించినపుడేనని సమాధానం దొరుకుతుంది. భగవంతునిపై నిశ్చలమైన భక్తి, విశ్వాసాలను ఉంచి, నిష్కల్మషంగా, ఫలాపేక్ష లేకుండా ఆరాధిస్తే ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది.


అలాంటి సందర్భాలలోనే అహింస, ఇంద్రియ నిగ్రహం, భూత దాయ, క్షమాగుణం, శాంతిత్వం, తపస్సు, ధ్యానం, సత్యం అనే పుష్పాలను భగవంతునికి భక్తులు స్వయంగా సమర్పించగలిగే శక్తి ఏర్పడుతుంది. అలాంటి స్థితి ఏర్పడిననాడు ప్రతి ఒక్కరూ, ప్రతి అణువులో భగవంతుని చూడగలుగుతారు. ఫలితంగా విశేషమైన ఆధ్యాత్మికానందానికి లోనై, అపూర్వమైన ఆధ్యాత్మిక ప్రపంచంలో విహరించగలుగుతారు.

సద్గతులనిచ్చే గోవ్రతం

మన దైనందిన జీవితంలో మనతోపాటు మమేకమై కలసిపోయిన జీవి గోవు. గోవుని శ్రీమన్నారాయణుడి  రూపంగా
పురాణాలు చెబుతున్నాయి. ఈ చరాచర సృష్టిలోని సమస్త దేవతలు గోవులో నిక్షిప్తం అయి ఉన్నాయని, ఆ కారణంగా గోవును వధించడం, దూషించడం పాపంగా పురాణాల ద్వారా అవగతమవుతోంది. అనాదిగా గోవును దైవస్వరూపంగా పూజిస్తున్నారు. 


మన నిత్య జీవితంలో ‘గోవు’ ఓ ప్రధానావసరంగా మనం  వినియోగించుకుంటున్నాం.  గోవుపాలు, పంచకం, నెయ్యి, పేడ ఇవన్నీ మనకు ఎంతగానో ఉపయోగపడ్తున్నాయి. భౌతిక ప్రపంచంలో మనకు చేదోడువాదోడుగా ఉంటున్న ఈ గోవును పురాణాలలో దైవంగా అభివర్ణించారు. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి రూపమైన గోవును పూజించడం, అందునా ఓ  పద్ధతి  ప్రకారం పూజించడం సమస్త పుణ్యాలనిస్తుందంటారు. దీనికి సంబంధించి ఓ పురాణ గాథ ఒకటి వాడుకలో ఉంది.


పురాణ గాథ:-
పూర్వమొకపుడు పాండురాజు భార్య అయిన కుంతీదేవి, తన మేనల్లుడు, శ్రీమన్నారాయణుడి అంశ అయిన శ్రీకృష్ణ్భగవానుని దగ్గరకు వెళ్ళి ‘‘మధుసూదనా...స్ర్తిలు దోషభూయిష్టమైన రుతుకాలంలో ఇంట్లోవారిని ముట్టుకోవడం, సూదితో వస్త్రాలను కుట్టడం లాంటి పనులు తెలిసీ తెలియక చేస్తూ వుంటారు. అలాగే పెద్దలను
నిందించడం, స్వపర  ద్రవ్యాపహరణం లాంటి దుష్కర్మలు తెలిసికొని, తెలియక కాని చేస్తూ వుంటారు. అలాంటి
దుష్టకార్యాలు చేసినపుడు సంక్రమించిన పాపాలు పోవడానికి ఆచరించాల్సిన వ్రతమొకదానిని చెప్పమని అడిగిందట. దానికి శ్రీకృష్ణ్భగవానుడు, కుంతీదేవిని ఉద్దేశించి, ఆయా పాపాలన్నీ పోవడానికి గోవ్రతమనే వ్రతం
ఉందని దానిని ఆచరిస్తే ఆయా పాపాలన్నీ పోయి, సర్వసౌఖ్యాలు సొంతమవుతాయని చెప్పాడు. ఈ
వ్రతం నాలుగు విధాలుగా ఉంటుందని, దీనిని ఆచరిస్తే పాప విముక్తులై, పుణ్యం సిద్ధిస్తుందని చెప్పాడు. అలాగే జపతపాలు, వ్రతోపవాసాలు తదితరాలవల్ల కలిగే పుణ్యం గోవ్రతంవల్ల కూడా కలుగుతుందని చెప్పాడు.
సూర్యుడు మకరంలోకి ప్రవేశించినపుడు కానీ, రథసప్తమినాడు కానీ, తమ జన్మనక్షత్రానికి అనుకూలమైనపుడు ఈ వ్రతాన్నిఆరంభించాలి. అలాగే రజోదోషం వీడిన స్ర్తిలు 18 నెలల తరువాత ఈ వ్రతాన్ని ఆచరించాలి. మకర సంక్రాంతి, రథ సప్తమి, మంగళవారంతో కూడినకృష్ణచతుర్దశి, కార్తీకం, మార్గశిర మాసాలలో ఈ వ్రతాన్ని ఆచరిస్తే సమస్త దోషాలు మటుమాయవౌతాయి. శ్రీకృష్ణుని సూచనమేరకు కుంతీమాత ఈ వ్రతాన్ని ఆచరించి, సద్గతి పొందింది. ఆనాటినుంచి ‘గోవు’దైవంగా పూజింపబడ్తూ, నీరాజనాలందుకుంటోంది. 


గోవ్రతం చేయడానికి నియమాలు:
* ఈ వ్రతం చేసేవారు ప్రాతఃకాలంలోనే నదీ స్నానం చేయాలి.
* నిత్యపూజాదికాలను ముగించుకున్న తర్వాత ఇంటికి తూర్పున మంటపం వేయాలి. అయిదు రంగులతో స్వస్తిక్,
పద్మక, నాగబంధాది మండలాలను నిర్మించాలి.
* లక్ష్మీనారాయణుడి ప్రతిమను బంగారం, వెండి లేదా యథాశక్తి చేయించి పంచామృతాలతో అభిషేకించాలి.
* ఆవు, దూడ కల ప్రతిమను బంగారు, లేదా వెండి లేదా యథాశక్తి చేయించాలి. అనంతరం పంచామృతాలతో అభిషేకించాలి.
* ఆ ప్రతిమలను బియ్యపురాశిలో ఉంచి పంచ పల్లవమాలతో పంచ వల్కలములతో నలంకరించి కలశాన్ని కొత్త వస్త్రాల చాపుతో చుట్టి పూజించాలి.
* అనంతరం దూడ కల్గినటువంటి ఆవును పూజించాలి.
* ఆవును రాత్రి నాలుగు జాములయందు పూజించి పురాణ శ్రవణాదులతో రాత్రి జాగారం చేయాలి.
* తర్వాత సంప్రదాయానుసారంగా అగ్నిప్రతిష్టచేసి, సమిధలు, పాయసాన్ని హవిస్సు చేసి, హోమం చేయాలి.
పూర్ణాహుతినిచ్చిన తర్వాత ఆచార్యునికి ప్రతిమను, వస్త్రాలతో దానమీయాలి.
* గో దానాన్ని శక్తి ఉంటే మిగిలిన దశ/షోడశ దానాలను చేసి పనె నండు మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి.


ఇలా ఈ వ్రతాన్ని ఆచరించేవారు అన్ని వేదాలు చదివితే వచ్చే పుణ్యఫలాలను అన్ని తీర్థాలందు స్నానమాచరించిన
పుణ్యఫలాలను పొంది సద్గతులను పొందుతారని శ్రీకృష్ణ్భగవానుడు చెప్పాడు. 

Tuesday, September 17, 2013

మహా శివరాత్రి

విశిష్టత

మాఘ మాసం అమావాస్య ముందు రాత్రి శివరాత్రి జరుపుకుంటారు. అమావాస్య కలియుగానికి ప్రతీక. కలియుగం అజ్ఞాన అంధకారాలకు నెలవు. ఈ అజ్ఞాన అంధకారాలను ప్రాలదోలుతూ మహేశ్వరుని ఆవిర్భావమే మహా శివరాత్రి. శివరాత్రి దినాన శివుని లింగ రూపంలో - "లింగోద్భవ మూర్తి" లేక "జ్యోతిర్లింగరూపం" లో పూజిస్తారు. లింగం తేజో రూపం. దీనికి ఆది,అంతం లేదు. నిర్గుణుడూ, అరూపుడూ అయిన ఆ తేజోమూర్తి రూపమే లింగం. శివరాత్రి తో సంబంధించిన ఎన్నో కధలు ఉన్నాయి. శివోభావం, లింగోద్భవం, శివతాండవ ఆద్యం, కాలకూట సేవనం, బిల్వ పత్రాల యొక్క గొప్పతనాన్ని చెప్పే వేటగాని కధ తదితరులు. మహాభారతం శాంతిపర్వంలో భీష్ముడు అంపశయ్య మీద ఉండగా చేసిన ధర్మప్రసంగాలలో చిత్రభానుమహారాజు చేసిన మహాశివరాత్రి దీక్ష గురించి వివరించాడు. ఆ కధ – "ఒకానొక కాలంలో జంబూద్వీపం సమస్తమునూ ఇక్ష్వాకు మహారాజు చిత్రభానుడు పరిపాలించేవాడు. ఒక మహాశివరాత్రినాడు అతడు, అతడి భార్య కలిసి ఉపవాసము ఆచరిన్చుతున్న సమయములో వారి మందిరానికి అష్టావక్రమహాముని రావడం జరిగింది. ముని కుతూహలంతో ఉపవాసానికి కారణం అడగగా, పూర్వ జన్మ జ్ఞానం కల్గిన చిత్రభానుడు ఈ విధంగా తెలిపాడు. పూర్వజన్మమున చిత్రభానుడు, సుస్వరుడనే వేటగాడు. జంతు పక్ష్యాయదులను చంపి అమ్ముకొనే వృత్తి చేయువాడు. ఒక రోజు వేట చేస్తూ అడవిలో సంచరిస్తూండగా బాగా చీకటి పడిపోయింది. తను ఒక లేడిని చంపినా ఇంటికి తీసుకెళ్ళే విధానం ఆ చీకటిలో తోచలేదు. ఇక ఏమి చెయ్యలేక, ఆ రాత్రికి ఒక బిల్వ వృక్షముపై తలదాచుకున్నాడు. ఆకలి దప్పికలతో బాధించిన వాడై, రాత్రంతా మేలుకొనే ఉన్నాడు. తన భార్య బిడ్డలు తిండి లేక యెంత బాధపడుతున్నారో తలచుకొని రోదించాడు. రాత్రి నిద్ర పొతే ఎక్కడ జంతువుల పాలు పడే ప్రమాదం ఉన్నదోనని నిద్ర రాకుండడానికి బిల్వ పత్రాలను ఒకటి ఒకటి తుంచి చెట్టు కిందకు వేయడం మొదలుపెట్టాడు. తెల్లవారిన తర్వాత తను చంపిన జంతువుని అమ్మి, ఆహారమును కొనుక్కొని, ఇంటికి తెరిగి వెళ్ళాడు. తను ఆహారం తీసుకొనడానికి ఉపక్రమించిన సమయంలో ఇంటి బయట అన్నార్తుడై ఒక వ్యక్తి రాగా, దయ కలిగినవాడై, ముందు అతడికి ఇచ్చి తర్వాత తను తిన్నాడు. ఆ వేటగాడు చనిపోవుకాలం ఆసన్నమైనప్పుడు, శివదూతలు అతడి ఆత్మను శివలోకానికి తోడుకొని పోయారు. అక్కడ అతడికి తను అడవిలో చిక్కుకొన్న రోజున చేసుకున్న పుణ్యం తెలిసి వచ్చింది. ఆ బిల్వ వృక్షం కింద ఒక లింగం ఉంది. ఆ వేటగాడు తన కన్నీరుతో స్వామికి తెలియకనే అభిషేకం చేసాడు. బిల్వపత్రాలను వదిలి పూజ చేసాడు. అన్నపానీయాలు లేక ఉపవాసం ఉన్నాడు. ఆ రాత్రి మహాశివ రాత్రి. మర్నాడు వేరొకరికి ఆహరం సమర్పించి తను సేవించాడు. శివ రాత్రి విశిష్టతను స్వయంగా స్వామే పార్వతీదేవికి ఇలా వివరించాడు - "మాఘ మాసంలో పద్నాలగవ రాత్రి అయిన అమావాస్య నాకు ఎంతో ప్రీతివంతమైనది . ఈ దినమున కేవలము ఉపవాసము చేయటమే ఎన్నో స్నానములు, దానములు, పుషా, నైవేద్య సమర్పణలకన్న గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. మణులు కన్నా కొన్ని బిల్వ పత్రాలతో పూజ చేస్తే చాలును. 


ఉపవాసము ఉండి, రాత్రి నాల్గుఝాములలో నాకు అభిషేకము చెయ్యాలి. మొదటిఝాము పాలతోనూ, రెండవఝాము పెరుగుతోనూ, మూడవఝాము నెయ్యితోనూ, చివరిఝాము తేనేతోనూ చేస్తే ఎంతో ఫలితము. మర్నాడు ఉదయమున, సాధువులకు ఆహారము సమర్పించి, పూజా కార్యక్రమములను పూర్తి చేసుకొని తర్వాత ఉపవాసాన్ని చాలించాలి. ఈ ఆచారాన్ని మించినది వేరొకటి లేదు!!” ఈ రోజున స్వామిని జ్యోతిర్లింగరూపంలో సేవించడం ఆనవాయితి. రాత్రంతా జాగరణ చేసి, ఉపవాసముండి, శివ పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తారు. నాల్గుఝాములు అభిషేకం చేసి, బిల్వ పత్రాలతో పూజలు విశేషంగా చేస్తారు. శివుడు సన్యాస మూర్తి. అందుకే సన్యాస దీక్షను స్వీకరించే వారు ఈ రోజున దీక్షను తీసుకుంటారు.

భక్తిలో రకాలు

శ్రవణ భక్తి : సత్పుతురుషుల వాక్యాలు, సంద్గ్రంథాలు విన్న మానవుడు మంచివాడుగా మారడానికి వీలవుతుంది. ఇది జ్ఞానానికి మార్గం చూపుతుంది. దీనివలన మానవులకు భగవంతుని పట్ల విశ్వాసం పెరుగుతుంది. పరీక్షిత్తు శ్రవణ భక్తి నాశ్రయించి మోక్షాన్ని పొందాడు.

కీర్తనా భక్తి : భగవంతుని గుణ విలాసాదులను కీర్తించుట కీర్తనా భక్తి. భగవంతుని సాఅక్షాత్కరింప చేసుకోడానికి కీర్తన భక్తి ఉత్తమమైనది. వాల్మీకి, నారదుడు, తుంబురుడు, ప్రహ్లాదుడు, ఆళ్వారులు, నయనార్లు, రామదాసు మొదలైన వారు కీర్తన భక్తితో పరమపదం పొందారు.
స్మరణ భక్తి : భగవంతుని లీలలను మనస్సులో నిలుపుకొని స్మరించుట స్మరణ భక్తి. ఇది నామస్మరణం, రూపస్మరణం, స్వరూపస్మరణం అని మూడు విధాలు. మునులు, ప్రహ్లాదుడు, ధ్రువుడు, తులసీదాసు త్యాగరాజు మొదలైన వారు స్మరణ భక్తితో ధన్యులైనారు.


పాదసేవన భక్తి : భగవంతుని సర్వావయవాలలో ప్రాముఖ్యం వహించినవి పాదాలు. వీటిని సేవించడం భక్తులు భగవంతుని పవిత్రసేవతో సమానం. భరతుడు, గుహుడు మొదలైన వారు ఈ పాదసేవ ద్వారా ముక్తులైనారు.


అర్చన భక్తి : ప్రతిరోజు తులసి పుష్పాదులు, ఇతర సుగంధ ద్రవ్యాలను సమర్పించి అర్చారూపంలో దేవుని పూజించడం అర్చనా భక్తి. మానవులు తాము నమ్ముకున్న భగవంతుని అర్చనా మూర్తులను ప్రతిష్టించుకొని పూజాద్రవ్యాలతో ధూప దీప నైవేద్యాలతో దేవతలను అర్చించడం ప్రస్తుత సమాజంలో ఎంతో ప్రాచుర్యంలో ఉంది

.
వందన భక్తి : వందనం అనగా నమస్కారం. తన యందు మనస్సు నుంచి భక్తులై పూజింపుమని, నమస్కరింపుమని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఉద్భోవించాడు. ఎన్ని యాగాలు చేసినా, శాస్త్రాలు చదివినా భగవంతుని నమస్కరించని వాడు ఆ ఫలితాన్ని పొందలేడు.


దాస్య భక్తి : ప్రతి మానవుడు తనకు ఇష్టమైన దేవునకు ఎల్లప్పుడు సేవకుడై, దాసుడై భక్తి శ్రద్ధలతో పూజించాలి. కులశేఖర అళ్వారు దాస్య భక్తికి అత్యంత ప్రాధాన్యమిచ్చారు. హనుమంతుడు, లక్ష్మణుడు మొదలైన వారు దాస్య భక్తి నాశ్రయించి ముక్తిని పొందారు.


సఖ్య భక్తి : సఖ్యం అనగా స్నేహం. స్నేహం కలగని మంచిలేదు. భగవంతునితో సఖ్యమేర్పరచుకున్న వారు ధన్యులు. అర్జునుడు, సుగ్రీవుడు మొదలైన వారు సఖ్య భక్తితో స్వామికి ప్రీతిపాత్రులైనారు.


ఆత్మ నివేదన భక్తి లేదా ప్రపత్తి : ఆత్మనివేదన మనగా భగవంతుడు తప్ప అన్యులెవరూ లేరని శరణాగతి కోరడం. భక్తి మార్గాలన్నిటికన్నా ఆత్మనివేదన మోక్షమార్గానికి సులభమైన మార్గం. ఈ మార్గాన ద్రౌపతి, గజేంద్రాదులు ముక్తులైనారు.

భారతదేశంలో అతిపెద్ద నంది శిల్పం.. లేపాక్షి

"సీతమ్మతల్లిని రావణుడు చెరబట్టి తీసుకెళ్తుంటే, ఆమెను కాపాడబోయి గాయపడ్డ జటాయువును చూసిన శ్రీరామచంద్రుడు లే పక్షీ అని పిలిస్తే, జటాయువు లేచి నిలుచుందని, అందుకే ఈ స్థలానికి లేపాక్షి అనే పేరు వచ్చిందని చెబుతుంటారు."

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అనంతపురం జిల్లాకు చెందిన ఒక చారిత్రక పట్టణమే లేపాక్షి. ఇది బెంగళూరుకు 120 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే హైదరాబాదు, బెంగళూరు రోడ్డుకు ఎడమవైపు నుంచి 16 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ లేపాక్షి ఊరిలోకి ప్రవేశించగానే... అతిపెద్ద ఏకశిలా నంది విగ్రహం ఠీవిగా కూర్చున్న భంగిమలో మనకు ఆహ్వానం పలుకుతుంది.

పురాతత్వశాఖవారి లెక్కల ప్రకారం ఈ లేపాక్షి బసవన్న 8.1 మీటర్ల పొడవు, నాలుగన్నర మీటర్ల ఎత్తుతో మహా లింగానికి ఎదురుగా కూర్చుని ఉంటుంది. ఇది భారతదేశంలోనే అతిపెద్ద నంది శిల్పంగా పేరుగాంచింది. తంజావూరు బృహదీశ్వరాలయం, మైసూరులోని చాముండి హిల్, బెంగళూరులోని బసవన్న గుళ్లలో ఉండే నంది విగ్రహాలకంటే, లేపాక్షి విగ్రహమే పెద్దది.

తెలుగు సంవత్సరాలు ఎన్ని... ఆ పేర్లు ఎలా వచ్చాయి...?

తెలుగు సంవత్సరాలు 60 అని అందరికీ తెలుసు కానీ వాటికి ఆ పేర్లు ఎలా వచ్చాయనేది మాత్రం కొందరికే తెలుసు. అయితే వాటి వెనుక ఓ కథ ఉంది. నారదమహాముని ఓసారి విష్ణు మాయ వల్ల స్త్రీగా మారి, ఓ రాజును పెళ్లాడతాడు. వారికి 60 మంది పుత్రులు జన్మిస్తారు. ఓసారి ఆ రాజు తన పుత్రులతో యుద్ధానికి వెళితే అంతా చనిపోతారు.

అప్పుడు ప్రార్థించిన నారదుడిని విష్ణువు కరుణిస్తాడు. నీ పిల్లలు 60 సంవత్సరాలుగా కాలచక్రంలో తిరుగుతుంటారు అని వరమిస్తాడు. అవే మన తెలుగు సంవత్సరాలుగా ప్రస్తుతం వాడుకలో ఉన్నాయి.

మన తెలుగు సంవత్సరాల పేర్లు :

1. ప్రభవ, 2. విభవ, 3. శుక్ల, 4. ప్రమోదూత, 5. ప్రజోత్పత్తి, 6. ఆంగీరస, 7. శ్రీముఖ, 8. భవ, 9. యువ, 10. ధాత, 11. ఈశ్వర, 12. బహుధాన్య, 13. ప్రమాథి, 14. విక్రయ, 15. వృక్ష, 16. చిత్రభాను, 17. స్వభాను, 18. తారణ, 19. పార్థివ, 20. వ్యయ, 21. సర్వజిత్, 22. సర్వధారి, 23. విరోధి, 24. వికృతి, 25. ఖర, 26. నందన, 27. విజయ, 28. జయ, 29. మన్మథ, 30. దుర్ముఖి, 31. హేవలంభి, 32. విలంబి, 33. వికారి, 34. శార్వరి, 35. ప్లవ, 36. శుభకృత్, 37. శోభకృత్, 38. క్రోధి, 39. విశ్వావసు, 40. పరాభవ, 41. ప్లవంగ, 42. కీలక, 43. సౌమ్య, 44. సాధారణ, 45. విరోధికృత్, 46. పరీధావి, 47. ప్రమాదీచ, 48. ఆనంద, 49. రాక్షస, 50. నల, 51. పింగళ, 52. కాళయుక్త, 53. సిద్ధార్థి, 54. రౌద్రి, 55. దుర్మతి, 56. దుందుబి, 57. రుధిరోద్గారి, 58. రక్తాక్షి, 59. క్రోధన, 60. అక్షయ.

స్రీలు రుద్రాక్షను ధరించవచ్చా ?

ప్రకృతి పరంగా స్రీ ఇబ్బందిపడే ఆ మూడు రోజులు నిషిద్దము. అలాగే ఇరవై ఒక్క రోజుల పురిటి సుతకమప్పుడు నిషిద్దము.

అలాగే అశౌచదినాలు..... ఇక తప్పనిసరిగా ధరించాలంటే మహిళలు గళసీమలో ధరించాలి. అయితే ఇవన్ని అవరోధాలను అధిగమించి మహిళలు రుద్రాక్షను ధరించి పవిత్రంగా ఉంచలేరు. కాబట్టి , స్రీలు రుద్రాక్షను ధరించకూడదని చెప్పారు

అనామిక వేలికి ఉంగరం ధరించాలా?

స్రీ పురుషుల ఉంగరపు వేలు......జీవనాడుల్లోని ఓ ముఖ్యనాడి ఈ ఉంగరం వేలువరకు ఉంటుంది. ఆ నాడికి ఒత్తిడి కావాలి. ధనంతో సంబంధం లేకుండా బంగారం, వెండి, ఇత్తడి, రాగి....ఏదో ఒక ఉంగరాన్ని ఉంగరపు వేలికి ధరించమని వట్టిగా ఉండకూడదని పెద్దలు, శాస్రాలు సెలవిస్తున్నాయి.

శివాలయనికేళ్ళినప్పుడు ముందుగా నవగ్రహాలను దర్శించుకోవాలా లేక శివుణ్న ?

పరమేశ్వరుని ఆలయములో నవగ్రహాలు వుంటాయి. చాలా మందికి ముందు ఎవరిని దర్శించుకోవాలో అని ఒక్కింత సందిగ్థత వుంటుంది. మహేశ్వరుడు ఆదిదేవుడు. పాలకుడు. కర్తవ్యాన్ని బోధించేది శివుడు. ముందుగా శివుణ్ణి దర్శించుకోవాలి. 

లేదా నవగ్రహాలను దర్శించిన, శివుడి కరుణకు ఎలాంటి ఇబ్బంది వుండదు. అలాగే శివుణ్ణి ప్రార్థించిన నవగ్రహాలు తమ స్వామిని ముందుగా కొలిచినందుకు అనుగ్రహాన్ని ప్రసాదిస్తాయి .

శ్రీకృష్ణ భగవానునికి ఇష్టమైన పూలు?

కలువ పువ్వు, ఎర్ర గన్నేరు పువ్వు, శనగ పువ్వు, సంపెంగ పువ్వు, మల్లె పువ్వు, మోదుగ ఆకులు, గరికె, గంటగలగర పువ్వులు, తులసి దళములు ఇవి శ్రీకృష్ణునకు చాల ఇష్టమైనవి. అన్ని పువ్వుల్లోకి నల్లకలువ పువ్వు వెయ్యి రెట్లు ఎక్కువ ఇష్టమైనది.

ఎర్ర తామర కంటే తెల్ల తామర పువ్వు ఇంకా వెయ్యిరెట్లు ఎక్కువగా ప్రీతికరమైనది. తెల్ల తామర పువ్వు కంటే కూడా తులసి ఇంకా వెయ్యి రెట్లు ఎక్కువ ఇష్టమైనది. తులసి పుష్పము కంటే, శివలింగ పుష్పం కంటే సౌర్య పుష్పం శ్రీకృష్ణునికి మిక్కిలి ప్రీతికరమైనది. ఏ పూలు దొరకని యడల తులసి దళములతోనైన , శ్రీకృష్ణుని పూజించాలి. తులసి దళములు దొరకని యడల తులసి చెట్టు వుండే చోటులోని మట్టి తీసుకువచ్చి దానితో శ్రీకృష్ణుని పూజ భక్తిపూర్వకముగా చేయచ్చు.

గృహంలో దేవతవిగ్రహాలు ఎంత ఎత్తు ఉండవచ్చు?

గృహంలోని దేవత విగ్రహం రెండు అంగుళాలు మించి ఉండక పోతే మంచిది. ఆ ఎత్తు దాటితే స్వామికి మీరు చేసేటువంటి పూజ తృప్తినివ్వదు. దాని వల్ల అనవసర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుంది. అలాగే కుంకుమ పూజ చేస్తున్నప్పుడు అమ్మవారి ముఖం మీద పడేలా పూజ చేయకూడదు.

ధ్వజస్తంభం లేదా దేవాలయపు గోపురం నీడ పడిన ప్రదేశంలో ఎందుకు కాపురం ఉండకూడదు?

అది పరమాత్మ ఆవహించిన ప్రదేశం. ఆ ప్రదేశం దేవుని స్వంతం. అలా నీడ పడటం ద్వారా, సూర్యరశ్మి పడాల్సినంత పడదు. తర్వాత ఎన్నో అనారోగ్యాలు. అందుకే నీడ పడకూడదని శాస్రం చెబుతోంది. తాను ఉన్నటువంటి ప్రదేశంలో అనారోగ్యం స్వామికి ఎంత మాత్రము ఇష్టం ఉండదు కదా.

ఐశ్వర్యానికి కారుకుడు ఈశ్వరుడు

ఐశ్వర్యానికి కారుకుడు ఈశ్వరుడు(శివుడు). ఈశ్వరానుగ్రహంతో ఐశ్వరం పొందిన కుబేరుడికి ఒకసారి తానే ధనవంతుడిననే అహకారం కలిగింది. అందువల్ల దేవతలందరికి మంచి విందు భోజం ఏర్పాటు చేసి తన గొప్పతనాన్ని చాటుకోవాలని తలచాడు కుబేరుడు. దేవతలందరిని ఆహ్వానించి, శివపార్వతులను ఆహ్వానించడానికి కైలాసానికి వెళ్ళాడు. శివుడు కొండల్లో ఉంటాడు, ఒక ఇల్లు కూడా ఉండదు,నా ఇంటిని చూసి శివుడు ఆశ్చర్యపోతాడు, ఎంత బాగుందో అంటూ పొగుడుతాడు, అప్పుడు దేవతల్లో నా కీర్తి పెరుగుతుందనే ఆలోచనలతో కైలాసం చేరుకున్నాడు.

శివుడు సర్వాంతర్యామి, ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఏమంకుంటున్నారో అన్ని తెలుసుకోగలడు. కుబేరుడు అహాన్ని పసిగట్టాడు. పార్వతీదేవి కూడా కుబేరుడి పధకాన్ని అర్దం చేసుకుంది. కుబేరుడు వచ్చేసరికి శివపార్వతులు మాట్లాడుకుంటున్నట్టు నటించారు. కుబేరుడు వచ్చి, మహాదేవా! మేరు, పార్వతీదేవి కలిసి మా ఇంట్లో నిర్వహించే విందు భోజనానికి తప్పక రావాలి అన్నాడు. శివుడు తనకు కుదరదన్నాడు, భర్త రాకుండా తానుకూడా రానన్నది పార్వతీ దేవి. ఇంతలో వినాయకుడు కైలాసానికి వచ్చాడు. వస్తూనే 'అమ్మా! ఆకాలేస్తోంది, ఏదైనా ఉంటే పెట్టు' అన్నాడు గణపతి. పార్వతీదేవి గణపతి వైపు కనుసైగ చేసి 'కుబేరా! మా గణపతి మీ ఇంటికి విందుకు వస్తాడు' అనగా, శివుడు 'ఔనౌను, గణపతికి విందు భోజనం అంటే మహాఇష్టం. మా బదులుగా గణపతిని తీసుకెళ్ళూ' అన్నాడు పరమశివుడు.

హా! ఈ ఏనుగు ముఖమున్న పసిపిల్లవాడా, నా ఇంటికి విందుకోచ్చేది. ఎంత తింటాడులే అనుకుంటూ గణపతిని తీసుకుని అలకాపురిల్ఫ్ ఉన్న తన భవనంలోకి తీసుకెళ్ళి, తన భవనంలో ఉన్న సౌకర్యాలను, ఇతర సంపదలను చూపిచసాగాడు. ఇవన్నీ వ్యర్ధం, త్వరగా ఆహారం పెట్టండి అని గణపతి అనగా, కుబేరుడు భోజనం సిద్ధం చేయవలసిందిగా అక్కడున్న పనివారికి ఆజ్ఞ చేశాడు.

వెంటనే బంగారు కంచం పెట్టి, రకరకాల తీపి పదార్ధలు, పానీయాలు, కూరలు, పండ్లు..... గణపతికి వడ్డించారు. కుబేరుడు చూస్తుండగానే ఒక్కపెట్టున గణపతి కంచంలో ఉన్న ఆహారాన్ని, అక్కడ పాత్రల్లో పెట్టిన ఆహారాన్ని తినేశి, ఇంకా తీసుకురండి అంటూ ఆజ్ఞ చేశాడు. సేవకులు వంటశాలలో ఉన్న ఆహారం మొత్తాన్ని తీసుకువచ్చి గణపతికి వడ్డించారు. అయినా గనపతి ఆకలి ఇసుమంతైనా తగ్గలేదు, కడుపు నిండలేదు. ఇంకా కావాలి అంటూ గణపతి అడిగాడు.

వంటవారికి ఆహారం వండడం గణపతికి వడ్డించడమే పనైపోయింది. కాసేపటికి కుబేరుడి వంటశాల మొత్తం ఖాళీ అయిపోయింది. విషయం కుబేరుని తెలిసింది. తన సంపద మొత్తం తరిపోతోంది కానీ, గణపతి కడుపు నిండడంలేదు, ఏమి చేయాలో అర్ధంకాలేదు. ఇంతలో గణపతి ఆగ్రహంతో ఊగిపోతూ కుబేరుని పిలిచి, నీ ఇంటికి విందుకు రమ్మని, నాకు ఆహారం పెట్టకుండా అవమానిస్తున్నావ్ అంటూ పలికాడు. కుబేరుడికి విషయం అర్ధమైంది. తనకున్న సంపద ఆ పరమాత్ముడిని ఏ మాత్రం సంతృప్తి పరచలేదని, అన్ని ఇచ్చిన భగవంతుడినే దగ్గరే దర్పాన్ని చూపాలనుకోవడం మూర్ఖత్వమని, తన అహకారం అణచడానికే దైవం ఈ విధంగా చేశాడని గ్రహించి పరుగుపరుగున కైలాసానికి వెళ్ళాడు.

శివా! శంకరా! నేవే దిక్కు. ధానానికి నన్ను నీవే అధిపతిని చేశావని మరిచి అహకారంతో ప్రవర్తించాను. అందుకు ప్రతిగా గణపతి నా సంపద మొత్తాన్నీ ఖాళీ చేసి, అన్ని ఇచ్చిన భగవంతుడే, అహంకరించినవారి సర్వసంపదలు తీసివేస్తాడని నిరూపించాడు. మీ బిడ్డడైన గణపతి ఆకాలి తీర్చలేకపోతున్నాను. ఏదైనా మార్గం చూపించండి అన్నాడు. అప్పుడు శివుడు "కుబేరా! నేవు ఇంతసేపు అహకారంతో గణపతికి భోజనం పెట్టావు. అందుకే గణపతి సంతృప్తి చెందలేదు. గణపతికి కావల్సినది భక్తి మాత్రమే. నీకు ఎంత ఉందన్నది అతనికి అనవసరం, నీవు ఎంత భక్తితో సమర్పించావన్నది మత్రామే గణపతి చూస్తాడు. ఇదిగో ఈ గుప్పేడు బియ్యం తీసుకుని, అహకారం విడిచి, చేసిన తప్పకుని ఒప్పుకుని పరమభక్తితో గణపతికి స్మార్పించు" అన్నాడు.

కుబేరుడు ఆ గుప్పెడు బియ్యాన్ని ఉడికించి, గణపతికి భక్తితో సమర్పించాడు. ఆ గుప్పేడు బియ్యం తినగానే గణపతికి కడుపు నిండి, త్రేనుపులు వచ్చాయి. గణపతి సంతృప్తి చెందాడు.

మనం దేవుడికి ఎంత సమర్పించామన్నది కాదు, ఎంత భక్తితో ఇచ్చామన్నది ముఖ్యం. కుబేరుడి అహకారాన్ని అణిచివేసిన గణపతి, మనలోని అహకారాన్ని కుడా పటాపంచలు చేయుగాకా.

గణపతి ఆరాధన అన్ని రంగాలవారికి విశేషఫలాన్ని ఇస్తుంది

గణపతి దేవతలకు ఆదిదేవుడు. గణాలకు మహాగణపతి. విఘ్నాలకు నాయకుడు, విద్యలన్నిటికి గురువు, నాట్యాకారులకు నాట్యాచార్యుడు, కవులకు ఆదికవి, పార్వతీదెవి గారాల బిడ్డ, అమ్మ చేతి పసుపు ముద్ద.

అటువంటి గణపతిని పరమభక్తితో గణపతిని పూజించడం వలన నాకు అది ప్రాపతిస్తుంది, ఈ ఫలాన పని జరుగుతుందన్న ఫలాపేక్ష లేకుండా, నిత్యం ఆరాధించడం వలన త్వరితంగా జ్ఞానం సిద్ధించి తీరుతుంది. ఎటువంటి విద్యనైనా వినగానే నేర్చుకోగలిగిన 'ఏకసంధాగ్రహణ' శక్తి లభిస్తుంది. గణపతిని గురువుగా భావించి పూజిస్తే, స్వయంగా గణపతి మన మనసులో ఉండి మనకు విద్యలను నేర్పిస్తాడు. బుధగ్రహానికి అధిదేవతగా గణపతిని చెప్తారు. గణపతికి గరిక సమర్పించడం వలన మేధస్సు వృద్ధి చెందుతుంది. అన్ని విద్యలకు గురువు కనుక విద్యను ఇట్టే ఇచ్చేస్తాడు.

గణపతి సర్వజనులను వశం చేసుకోగలిగిన వశీకరణ విద్యను ప్రసాదిస్తాడు. కళాకారులు, నటుల ఎదుగుదలకు కావల్సినది ప్రజల అభిమానం, అందుకోసం ప్రజలందరిని వశం చేసుకోగలగాలి. ఈ వశీకరణం నిత్యం గణపతిని ఆరాధించేవారికి సహజంగానే ప్రాప్తిస్తుంది.

గణపతి ఆరాధన సృజనాత్మకతను వృద్ధి చేస్తుంది. సినిమారంగంలో ఉన్నవారు, యానిమేషన్ రంగంలో ఉన్నవారికి అవసరమైనది సృజనాత్మకత(క్రియేటివిటి). గణపతి నిత్యం భక్తితో కలిచేవారికి సృజనాత్మకత సహజంగానే సిద్ధిస్తుంది.

జ్యోత్సిష్యులకు వాక్కు ప్రధానం. జ్యోతిష్యం సక్రమంగా చెప్పాలంటే గణపతి అనుగ్రహం ఉండాలి. యోగులకు తమ శరీరంలో ఉన్న కుండలిని శక్తి జాగృతమవ్వాలి. గణపతి మూలాధారచక్రంలో ఉంటాడు. మూలాధరానికి అధిష్టాతయై కుండలిని శక్తికి రక్షకుడిగా ఉంటాడు. వాస్తు శాస్త్రంలో గణపతి వాస్తు పురుషుడు. గణపతిని ఈశాన్యంలో కానీ, లేక మనకు అనుకూలంగా ఉన్న ఏ దిక్కులోనైనా నెలకొల్పి, రోజు ఒక చిన్న బెల్లం ముక్క నైవేధ్యం పెట్టి, దీపారాధన చేస్తే, ఇంట్లో ఉన్న వాస్తు దోషాల పాలిట కాలుడై సర్వదోషాలను హరిస్తాడు వినాయకుడు.

గణపతి లీలావైభవం ఎంతని చెప్పుకోగలం.

ఓం ఏకదంతాయ విద్మహే
వక్రతుండాయ ధీమహి
తన్నో దంతిః ప్రచోదయాత్ ||

ఏకదంతుడు, వక్రతుండుడైన గణపతిని మన మనసును ప్రభావితం చేయుగాకా. మనలని మంచి మార్గంలో నడిపించిగాకా.