Thursday, September 6, 2012

విఘ్నేశ్వరుడు - 6


‘‘విఘ్నేశ్వరా! ఇప్పుడు నీవు చేసిన గజాసుర నిర్మూలన జ్ఞాపకంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు కలకాలం ఘనంగా జరుగుతూం టాయి. ముందుకాలంలో ప్రజల స్వేచ్ఛ, శ్రే…ుస్సుల కోసం సాగే ఉద్యమాలు గణేశ ఉత్సవాలతో జ…ుప్రదంగా కొనసాగి ఫలి స్తాయి. భూలోకంలో వైభంగా జరిగే ఉత్స వాలన్నిటికీ గణపతి నవరాత్రి ఉత్సవం తిలకంగా ఉంటుంది!'' అని ఆకాశవాణి పలికింది.
 
విష్ణువు విఘ్నేశ్వరుడితో, ‘‘పార్వతీనందనా! మేనల్లుడివని చెప్పి నాకు మరొకపని కూడా కల్పించావా!'' అన్నాడు. విఘ్నేశ్వరుడు, ‘‘మేనమామ వరసపెట్టి కాలనేమి అయిన కంసుణ్ణి మేనమామ గండాన నువ్వెలాగూ పుట్టి, చంపుతావుగదా! ఇలాంటి వరసలన్నీ నీవు నేర్పిన విద్యలేగదా నీరజాక్ష!'' అన్నాడు. విష్ణువు, ‘‘విఘ్నవినాశకా! నీ పరశువు ముందు, నా చక్రా…ుుధం ఏపాటి? నీ గొడ్డలి సాము చూసినప్పుడు మహముచ్చటేసింది సుమా!''అన్నాడు. ‘‘పరశురామావతారంలో నా గొడ్డలి ఎరువు తీసుకెళ్ళి గర్వపోతులైన క్షత్రి…ుుల్ని తెగ నరుకుదువుగానిలే!''అన్నాడు విఘ్నేశ్వరుడు.
 
విష్ణువు, ‘‘గజవిఘ్నాసురుడి మీద ఎక్కి మర్దిస్తున్నప్పుడు నీ బుడిబుడి నడకల గుజ్జు రూపం కూడా నన్నెంతో మురిపించిందోయి!'' అన్నాడు. ‘‘అలాగైతే, వామనుడివై బలిచక్రవర్తిని పాతాళానికి అణగదొక్కుదువుగానిలే!'' అని విఘ్నేశ్వరుడు అన్నాడు.

‘‘నీ బుద్ధి విశేషం కూడా నన్ను అమితంగా ఆకర్షించుతోంది, ఏంచె…్యును,'' అని విష్ణువు అనగా, విఘ్నేశ్వరుడు, ‘‘…ుుగానికి అవసర మైన ధర్మాన్ని ఆ …ుుగంలో స్థాపించడమే గదా, నీ అవతారాలకు మూలకారణం! ధర్మ సంస్థాపనకు, అసలు అర్థం, సంఘం హింసతో, మూఢాచారాలతో కుళ్ళిపోతున్న రోజుల్లో బుద్ధుడవై అవతరించి మానవులకు సక్రమ సంఘజీవ నాన్ని, నిర్వాణాన్ని బోధించుతావులే! మా…ూదేవి స్వప్నంలో నా తెల్లని ఏనుగు రూపం గర్భంలో ప్రవేశించి బుద్ధుడైన సిద్ధా ర్థుడి అవతారానికి నాంది పలుకుతుంది!'' అని చెప్పాడు.
 
ఆ మాటలకు విష్ణువు మహదానందం పొందాడు. పరమాణు రూపంలో ఉన్న విఘ్నం నమస్కరించి, ‘‘విఘ్నరాజా, నీ బానిసను, నీ ఆజ్ఞానువర్తిని, వెళుతున్నాను,'' అని శలవు తీసుకొని కాళింది మడుగుచేరి కాళీ…ుు డుగా దాక్కుంది. విఘ్నం వెనకనే మూషికాసురుడు మూషిక రూపంతో వచ్చి ప్రచ్ఛన్నంగా దాగి, విఘ్నానికి పట్టినగతి చూసి పటపట పళ్ళుకొరికి, నిజ రూపంతో బోర విరుచుకొని విఘ్నేశ్వరుడి ముందు నిలబడి దిక్కులు అదిరేలా సింహ నాదం చేశాడు.
 
విఘ్నేశ్వరుడు బలిష్ఠమైన అతని శరీ రాన్ని సంతృప్తిగా చూశాడు. మూషికాసురుడు నిర్లక్ష్యంగా విషపునవ్వు నవ్వుతూ, ‘‘విఘ్నం నీ బానిస కనుక ఏంచేసినా చేశావుగాని, నేను నీ జన్మవిరోధిని. సింహస్వప్నం అనేమాట వినే ఉంటావే, సింహానై్న నీ కుంభస్థలాన్ని చీలుస్తాను!'' అని అంటూ సింహంగా మారి పెద్దగా గర్జించాడు. విఘ్నేశ్వరుడు, ‘‘సింహమా! నువ్వు జగ జ్జనని వాహనానివి, నిన్ను గౌరవిస్తున్నాను!'' అన్నాడు.
 
సింహం మళ్ళీ గర్జించి ఉరకబోతూంటే, విఘ్నేశుడు, ‘‘శివా, శరభా!'' అని స్మరించాడు. సింహానికి ఎదురుగా శివుని శరభావతారం ఘీంకార గర్జనలుచేస్తూ నిలిచింది. శరభానికి సింహశరీరము, కేసరాలు, కోరలు ఉంటూ ఏనుగు తొండమూ, దంతాలు ఉన్నాయి. మహాసర్పం లాంటి తోకచివర జ్వాలలు కక్కే మకర ముఖము ఉంది. శరభం జూలు అగ్ని శిఖల్లాగా ఎగురుతున్నాయి. శరభం తొండంతో సింహం ముఖం వాచేలా కొట్టింది. సింహం తోకముడిచి పరుగుతీసింది. శరభావతారం మా…ుమైంది.

విఘ్నేశ్వరుడు తొండాన్ని ెూజనం పొడ వున సాగదీసి సింహం నడుము చుట్టిపట్టి ఎత్తాడు. సింహం కిరకిరలాడింది. ఆ సమ …ుంలో ఆకాశగమనం చేస్తున్న నారదుడు ఆనందంతో ‘సా' అని గొంతు సాగదీస్తూ, ‘‘సామజ వరవదనా!'' అంటూ హిందోళ రాగాన్ని ఆలాపించాడు. దేవతలు గుమిగూడి ఆకాశం నుండి వింత చూస్తున్నారు.
 
విష్ణువు, ‘‘విజ…ు విఘ్నేశ్వరా! నువ్వు పట్టిన సింహాన్ని పెంచు కుంటాను, ఇవ్వవూ?'' అన్నాడు. విఘ్నేశ్వరుడు నవ్వి, ‘‘పెంచినటే్ట పెంచి తలా, గోళ్ళూ తీసుకొని నరసింహావతారం ఎత్తి హిరణ్యకశ్యపుణ్ణి చీలుద్దామనా? అదేం కుదరదు. ఈ మృగరాజు అవసరం నాకు ఉంది, నీ నరసింహావతారం నీవు చూసుకోవలసిందే!'' అన్నాడు.
 
తొండం మూషికాసుర సింహాన్ని తిన్నగా తీసుకెళ్ళి మహాశ్వేత ముందు విడిచి అదృశ్య మైంది. మహాశ్వేత భర్తకు హితవు చెప్పినా వినకుండా నిజరూపంతో విఘ్నేశ్వరుడితో ఢీకొనడానికి పరుగుతీశాడు. మహాశ్వేత దేవిని ప్రార్థించింది. దేవి కనిపించి, ‘‘నీ భర్త విఘ్నే శ్వరుడికి ఎలుక వాహనంగా చిరంజీవిగా ఉంటాడు. అలా రాసిపెట్టి వుంది. నీవు కూడా శ్వేతఛత్రానివై నీ భర్తతోబాటు కలకాలం విఘ్నేశ్వరుణ్ణి సేవిస్తూ ఉంటావు!''అని చెప్పి అంతర్థానమైంది.
 
వజ్రదంతుడు కామరూపి గనుక, ఈసారి ఏనుగుల్ని తన్నుకుపోగల గండభేరుండపక్ష రూపంతో, దారిలో కనిపించిన రెండు ఏనుగుల్ని గోళ్ళతో పట్టుకుని ఎగిరి వెళ్తూండగా చెలరేగిన అలజడికి, చిన్నగ్రద్ద రూపంతో ఒక చెట్టుమీద హరిని ధ్యానిస్తూ ఉన్న గరుత్మంతుడికి ధ్యాన భంగమైంది. కోపంతో గ్రద్ద గండభేరుండాన్ని ముక్కుతో పొడిచింది. ఆ పోటుకు వజ్రదం తుడు నేలకూలాడు.
 
గరుత్మంతుడు, ‘‘ఇంతకంటె రుచికరమైన ములుకుపోట్లు తినబోతున్నావు, వెళ్ళు!'' అంటూ ఎగిరిపో…ూడు. మూషికాసురుడు వెళ్ళి విఘ్నేశ్వరుడితో, ‘‘నీకూ ఉన్నాయి, పెద్దదంతాలు, వెలక్కా …ులు నొక్కి తినడానికి తప్ప మరెందుకూ పనికిరావు. నా దంష్టల్రతో వజ్రాల్ని పిండి చేస్తాను. కైలాసాన్ని గుల్ల చేస్తాను, తెలుసునా!'' అన్నాడు.
 
వినా…ుకుడు ఆ మాటలు విని దిక్కులు చూస్తూ, తనలో తాను గొణుక్కుంటూన్న ట్లుగా, ‘‘ఔనౌను, ఎందుకూ కొరగాని దంతాలు ఉండి ఎందుకూ?'' అంటూ ఒక దంతాన్ని పటుక్కున సగానికి విరిచి, పారేసినట్టుగా దూరంగా విసిరేశాడు.

ఆ దంతం గాలిలో గిర్రున తిరుగుతూ ఇంద్రజాలం ప్రదర్శించి వెళ్ళి వజ్రదంతుణ్ణి గుచ్చిగుచ్చి పొడవడం ప్రారంభించింది. రక్తం ధారలుకట్టి కారసాగింది. మహాశ్వేత అది చూడలేక మూర్ఛపోయింది. వజ్రదంతుడు చిన్న ఎలుకగా మారి తుర్రున పారిపోయి రాళ్ళ మధ్య కలుగు చేసుకొని దూరాడు. ఒక దంతాన్ని విరుచుకొని విఘ్నేశ్వరుడు ఏక దంతుడు అనిపించుకున్నాడు.
 
దంతం కూడా కలుగులో దూరి ఎలుకను అలా పొడుస్తూనే వెంబడించింది. తోక వెంట రక్తం జాడకడుతుంటే ఎలుక సొరంగం దొల్చుకుంటూ పాతాళానికీ, పాతాళం నుంచి భూమ్మీదకూ వచ్చి పరుగులుతీసి లోక మంతా చుట్టి చివరకు విఘ్నేశ్వరుడి శరణు జొచ్చి, ‘‘నాకా చావురాదు. నీ దంతం గుచ్చి గుచ్చి చంపుతున్నది, బాధ తప్పించు దేవా!'' అని వేడుకున్న మూషికాసురుడికి విఘ్నేశ్వ రుడు అభ…ుం ఇచ్చాడు. దంతం వచ్చి అతని హస్తం అలంకరించింది.
 
విఘ్నేశ్వరుడు, ‘‘మూషికా! చూట్టానికి చిటె్టలుకవే గాని మహాబలుడివి. మహా కూర్మావతారంతో మంధరపర్వతాన్నీ, ఆది వరాహావతారంతో భూమినీ ఎత్తిన విష్ణువు కంటె బలశాలివి! తగిన వాహనం కుదరక నేను నా లంబోదరంతో నడవలేక అవస్థపడు తున్నాను. నీలాంటి...'' అంటూ చెప్పడానికి సందేహిస్తున్నట్టు నసిగాడు.
 
విఘ్నేశ్వరుడి పొగడ్తకు మూషికాసురుడు పొంగిపోయి, ‘‘స్వామీ! నీ దంతం నాలోని అజ్ఞానాన్ని పారదోలి గుచ్చి గుచ్చి జ్ఞానాన్ని నింపింది. నీకు వాహనం కావడం నా భాగ్యంగా భావిస్తున్నాను,''అంటూ ఏనుగంత ఎలుకగా పెరిగాడు. విఘ్నేశ్వరుడు దానిపై కాలుమోపి కూర్చో బోగా మహామూషికం కీచుకీచుమంటూ అణుక్కుపోయింది. విఘ్నేశ్వరుడు మందహాసం చేసి, ‘‘నా…ునా మూషికా, నీవు చిటె్టలుకగా ఉంటేనే నన్ను సునా…ూసంగా మో…ుగలవు.
 
నా ఆకారా నికి చిటె్టలుక వాహ నమే అన్నివిధాలా అమరు తుంది,''అన్నాడు. మూషికాసురుడు …ుధాప్రకారంగా చిటె్టలుకగా తగ్గిపో…ూడు. విఘ్నేశ్వరుణ్ణి ఎక్కించుకొని చకచకా తిరుగుతూ, ‘‘ఔను స్వామీ! ఇప్పుడు నిన్ను మోస్తున్నటే్ట లేదు!'' అన్నాడు.

మూర్ఛనుండి తేరుకున్న ధవళ, విఘ్నేశ్వ రుడికి నమస్కరించి, ‘‘దేవా! నా భర్త నీకు చిటె్టలుక వాహనంగా ఉంటాడు, నేనుకూడా నీకు శ్వేతఛత్రమై ఉంటాను. ఈ వరం అను గ్రహించు,'' అన్నది. విఘ్నేశ్వరుడు,‘‘అమ్మా! నీ తెల్లని గొడుగు చల్లని నీడ నాకు రక్ష! నా భాగ్యం కొద్ది దొరికింది,'' అంటూ ఎలుకను చూసి, ‘‘వజ్రదంతా, దేవి అనుగ్రహం పొందిన సాధ్వి ధవళ మాటకు తిరుగులేదు. నా వాహనంగా ఉండు, నాతో బాటే నాకు పెటే్టవన్నీ, నువ్వూ హాయిగా తిను! అందరూ మొట్టికా…ులు పెట్టుకొని, మూడు గుంజీలు తీసి లెంపలేసుకుంటూంటే, చాలా సంతోషంగా తృప్తిగా ఉంటుంది. నా ముందు, నీ ముందు కూడా అలాగే అంతా చేస్తూంటారు!''అన్నాడు.
 
‘‘ ఔను దేవా! నేనూ అలాగే కోరదామను కున్నాను. నేను వజ్రదంతుడిగా నా ముందర దేవతల చేత అలాగే చేయిస్తూండేవాణ్ణి. నీ వాహనానై్న కృతార్థుడిన…్యూను!'' అని మూషికుడు అన్నాడు. ధవళ తెల్లని గొడుగుగా విఘ్నేశ్వరుడిపై నిలిచింది. ఆ దంపతులు చిరంజీవులై వినా …ుకుణ్ణి అలాగే సేవిస్తూ ఉంటారు. విఘ్నే శ్వరుడు మూషిక వాహనుడ…్యూడు.
 
విష్ణువు విఘ్నేశ్వరుడితో, ‘‘ ఏకదంతా! మూషికోత్తమవాహనా! నీ వాహనం చూస్తే నాకు అసూ…ుగా ఉందోయి. ఎంత మంచి వాహనాన్ని సంపాదించావు!!,'' అన్నాడు. విఘ్నేశ్వరుడు, ‘‘నీ కల్కి అవతారంలో నా వాహనం నీకు తెల్లని గురమ్రై అంతరి క్షాన్ని దాటి గ్రహాంతరాలకు తీసుకెళ్తుందిలే! మానవులకు కొత్త వలస రాజ్యాలను సమ కూర్చు!'' అన్నాడు.

విష్ణువు, ‘‘ఆహాహా! నీ నోటిచలవ వల్ల అలాగే జరగాలి!'' అని ఆనందించాడు. నారదుడు, ‘‘విజ…ువిఘ్నేశ్వరా! ఇప్ప టికి నీతోబాటే విష్ణువు తొమ్మిది అవతారాలు తెలిశాయి, ఒక్కటి మిగిలింది!'' అన్నాడు. విష్ణువు నారదుణ్ణి చూసి కన్నుగీటి, ‘‘త్వర లోనే ఆ కళ్యాణ ఘడి…ు వచ్చినప్పుడు అదీ తెలుస్తుందిలే! మరీ అంత తొందరెందుకు,'' అన్నాడు. ‘‘ ఎవరి కళ్యాణం దేవా?'' అని అడిగాడు నారదుడు.
 
‘‘మన కళ్యాణ చక్రవర్తి విజ…ువిఘ్నేశ్వ రుడిదే!'' అన్నాడు విష్ణువు. విఘ్నేశ్వరుడు చిరుకోపంగా చూశాడు. ‘‘వెయ్యి విఘ్నాలు కల్పించుకోక తప్పదు!'' అని గట్టిగా అనుకున్నాడు. ‘‘నా…ున్నా…ున, అంతటితో సరిపెట్టు! వెయ్యి విఘ్నాలు పూర్తి అ…్యూక అరవిఘ్నం అయినా కల్పించుకోడానికి చెల్లేది లేదు సుమీ!'' అని విష్ణువు హెచ్చరించాడు. నారదుడు, ‘‘వెయ్యి విఘ్నాలనగా ఏమా త్రం? వెయ్యి విఘ్నాల తర్వాత విఘ్నేశ్వరుడి పెళ్ళి తప్పదు-తప్పదు! సరిసరి మాగరి,'' అని పాడుతూ ముల్లోకాలు తిరిగాడు.
 
శివుడికి పార్వతిపై గల మోహానురాగం తేజస్సుగా మారింది. అగ్నిదేవుడు దాన్ని తీసు కెళ్ళి శరవణ సరస్సు చేరేలాగ చేశాడు. ఆరు ముఖాలతో కుమారస్వామి అవతరించాడు. ఆరుగురు ఋషి భార్యలు అతణ్ణి పెంచి పార్వతీ పరమేశ్వరులకు అప్పగించారు. కుమారస్వామి పెరిగి పెద్దవాడ…్యూడు. గరు త్మంతుడు అతనికి నెమలి వాహనం ఇచ్చాడు. ఇంద్రుడు అతనికి ఎన్నోఆ…ుుధాల్ని ఇచ్చాడు.
 
పార్వతి శక్తిబళ్లాన్ని ఇచ్చింది. కుమారస్వామి పెరిగి పెద్ద అవుతూంటే తారకాసురుడు తల్ల డిల్లిపోతూ భ…ుంతో పీడకలలు కనసాగాడు. కుమారస్వామి గొప్ప తపస్సు చేసి బ్రహ్మ జ్ఞానాన్ని విడమర్చి చెప్పి సుబ్రహ్మణ్యస్వామి అనిపించుకున్నాడు. ఓంకారం గురించిన నిగూఢ రహస్యాల్ని శివుడంతటివాడికే గురువై ఉపదేశించాడు. అన్నదమ్ములైన విఘ్నేశ్వ రుడు, కుమారస్వామి కైలాసంలో పార్వతీ శివుల కనులపండుగగా ఎంతో సఖ్యంగా ఆటపాటలతో విహరిస్తున్నారు. 

No comments:

Post a Comment