దేవతలూ, రాక్షసులూ కలిసికట్టుగా క్షర సాగరమథనం చేసి అమృతాన్ని
సాధించారు. విష్ణువు జగన్మోహినీ రూపంతో రాక్షసులను మోసపుచ్చి అమృతాన్ని
దేవతలపాలు చేశాడు. అమృతం తాగి అమరత్వం పొందిన దేవతలు గర్వంగా తిరగసాగారు.
దానవులకు జరిగిన అన్యా
ూనికి దేవతలపై కసి తీర్చుకోడానికి తారకాసురుడు
ఘోరమైన తపస్సు చేసి, బ్రహ్మదేవుణ్ణి మెప్పించి, చావులేని వరం కోరాడు.
‘‘పుట్టాక ఎప్పుడో ఒకప్పుడు చావు తప్ప నిది; మరోవరం ఏదైనా కోరు,
ఇస్తాను,'' అన్నాడు బ్రహ్మదేవుడు. తారకాసురుడు బాగా ఆలోచించి శివుడి
కుమారుడివల్లనే తప్ప మరేవిధంగానూ తనకు చావులేని వరాన్ని బ్రహ్మనుంచి
పొందాడు. అప్పటికి శివుడి భార్య సతీదేవి దక్ష
ుజ్ఞంలో ెూగాగ్నితో తనువు
చాలించింది. శివుడు ఉన్మత్తుడిలాగ తిరిగి, తిరిగి హిమాల
ు పర్వతాల్లో ఒకచోట
విరాగిగా కఠోర దీక్షతో తపస్సు చేస్తూ ఉన్నాడు.
తారకాసురుడు రాక్షసులందర్నీ కూడ గట్టుకొని విజృంభించాడు. ముల్లోకాలనూ
ఆక్రమించుకుని, కసితీరా దేవతలను చిత్ర హింసలు పెట్టసాగాడు. ఇంద్రాది దేవతలు
హడలిపోయి, తమ దీనావస్థను బ్రహ్మతో మొరపెట్టుకున్నారు. ‘‘శివుడికి కుమారుడు
పుట్టాలి, అతని వల్లనే తారకుడు చావాలి! అలాంటి వరాన్ని తారకుడికి ఇచ్చాను
మరి. ఇంకెరివల్లా తారకాసురుడికి ఎటువంటి హానీజరగదు.
మరోవిధంగా అతడికి చావూ లేదు!''అని బ్రహ్మ చెప్పి దేవతలను
వెంటబెట్టుకుని తరుణోపా
ుం కోసం విష్ణువు దగ్గరికి దారి తీశాడు. ‘‘సతీదేవి
హిమవంతుడికి కూతురుగా పుట్టి పార్వతిగా పెరుగుతూ ఉన్నది. శివుడికి
పార్వతికి పెళ్ళిజరిగేలా చూడండి!'' అని విష్ణువు చెప్పాడు. దేవతలు
నారదుణ్ణి హిమ వంతుడి దగ్గరికి పంపించారు.
నారదుడి ఆదేశం ప్రకారం హిమవంతుడు సతీసమేతంగా, తపస్సులో నిమగ్నుడై ఉన్న
శివుడి దగ్గరికి వెళ్ళి, పూజించి తన కుమార్తె పార్వతి అతని తపస్సుకు
అనుకూలంగా పరి చర్యలు చేస్తూండడానికి అనుమతించవల సిందని కోరాడు. శివుడి
మౌనాన్ని అంగీకారంగా గ్రహించి హిమవంతుడు పార్వతిని శివుడికి పరిచర్యలు
చే
ుడానికి పురమాయించాడు.
చిన్నతనం నుంచీ పార్వతికి శివుడంటే చాలా ఇష్టం. బాలపార్వతికి నారదుడు
శివుడి గురించి అనేక విష
ూలు చెపుతూండేవాడు. శివుడి కథలనూ, గుణగణాలనూ,
మహిమలనూ పదేపదే వినడానికి కుతూహలపడుతూ ఉండేది పార్వతి. పెళ్లాడితే శివుణ్ణే
పెళ్ళాడాలని ఉవ్విళ్లూరేది. అటువంటి శివుడికి పరిచర్యలు చే
ుడం
తరుణప్రా
ుంలో ఉన్న పార్వతికి మహాభాగ్యంగా తోచింది.
తెల్లవారుతూండగా శివుడు తపస్సు చేస్తున్న పరిసర ప్రాంగణమంతా
నెమలిపింఛపుకట్టతో తుడిచి, హిమానీ జలాల్లో మంచిగంధం కలిపి కల్లాపుజల్లి,
ముత్యాల ముగ్గులు తీర్చేది. బంగారు తీగెలతో అల్లి, రత్నాలు కెంపులు పొది
గిన తట్టతో శివుడికి ఇష్టమైన ఫల పుష్పాలను, మారేడు పత్రినీ, తెల్లకలువలనూ
తీసుకెళ్ళి పక్కనుంచేది. బంగారు కమండలువు నిండా హిమశిఖరాల నుంచి జారే
స్ఫటిక జలాలను నింపి, జప మాలతో కలిపి అమర్చిపెటే్టది.
శివుణ్ణి ఆకర్షించడానికి ఎన్నోవిధాలుగా అలంకరించు కుని వెళ్ళేది.
కిన్నెరపై శివుడికి ప్రీతికరమైన భైరవి, ముఖారి, కేదార, శివరంజని మొదలైన
రాగాల్ని ఆలాపించేది. శివుడి చూపులు తనపై పడాలని పదేపదే
ప్ర
ుత్నిస్తూండేది. తపో దీక్షలో నిమగ్నుడై శివుడు ఒక్కసారైనా తనను
పరికించ గలడేమోనని, అతని చల్లని చూపులు తనపై వాలాలని పార్వతి శివుడి
ముఖాన్ని అలా చూస్తూ ఉండిపోేుది.
శివుడు పొరపాటుగా నైనా తన వంక చూడడేమో అని నిరాశా, నిస్పృహలతో
ఊగిసలాడేది. శివుడి మనస్సు చలించడానికి మన్మథుడి అవసరం తప్పనిసరి అని
గుర్తించి, దేవేం ద్రుడు మన్మథుణ్ణి పిలిపించాడు. శివుడికి పార్వతిపై
అనురాగం కలిగేలా చే
ుమని అతణ్ణి అర్థించాడు. వసంతుడు సారథ్యం చేస్తూండగా
మన్మ థుడు చెరకు వింటినీ, పూలబాణాలనూ ధరించి రతీదేవితో చిలుక రథాన్నెక్కి,
ఈశ్వరుడు తపస్సు చేస్తూన్న హిమాల
ు శిఖరాల నడుమ నున్న లో
ును ప్రవేశించాడు.
ఒక్కసారిగా ఆ లో
ు అంతటా వసంతఋతువు వెల్లివిరి సింది. రమణీ
ుంగా
మారింది. కోయిలల సంగీతంతో, తుమ్మెదల ఝంకారంతో అంతా రసమ
ుంగా వెలిగిపోయింది.
తానున్న పరిసరమంతా ఆకస్మికంగా మారిపోయినట్లుగా తోచి, శివుడు కళ్ళు తెరిచి
చూశాడు. అకాల వసంతాగమనానికి ఆశ్చర్యపోతూ, తపోభంగ మైనందుకు నొచ్చుకుంటూండగా
అతని చేతినుంచి జపమాల జారిపడింది.
పార్వతి జప మాల తీసి శివుడికి అందిస్తున్న సమ
ుంలో మన్మథుడు
విరి
ుబూచిన నల్ల ఉమ్మెత్త పూలపొద చాటునుంచి నీలోత్పల బాణాన్ని శివుడి
గుండెకు గురిపెట్టి వదిలాడు. అది తగలగానే శివుడు తృళ్ళిపడి తేరిపార జూశాడు.
అతని మ్రోల మోకరిల్లి రెప్పవాల్చకుండా తననే చూస్తున్న పార్వతి ముఖబింబం
ఎంతో మనోహ రంగా కనిపించింది. తన తపోభంగానికి శివుడు నివ్వెర పడుతూ రుద్రుడై
తన మూడవ కంటిని తెరిచి మన్మథు డిని చూశాడు.
మరుక్షణంలో శివుడి ఫాల నేత్రం నుంచి వెలువడిన జ్వాలల్లో మన్మథుడు కాలి
బూడిద అ
్యూడు. శివుడు దిగ్గున లేచి చరచరా తన కైలాస శిఖరాగ్రం మీదికి
వెళ్ళి పో
ూడు. మన్మథుడి వెన్నంటి ఉన్న రతీదేవి భర్త బూడిద కుప్పమీద
కూలిపోయి భోరుమ న్నది. బ్రహ్మాది దేవతలు వచ్చి పార్వతీ శివుల కళ్యాణం
జరిగినప్పుడు మన్మథుడు తిరిగి బతికి వస్తాడని నచ్చజెప్పి, ఓదార్చి సహగమనం
మానిపించారు.
రతీదేవి మన్మథుడి బూడిద కుప్పనే కనిపెట్టుకొని అలా దివారాత్రాలు
గడపసాగింది. పార్వతికి తన సౌందర్యం పట్ల నమ్మకం పోయింది. శరీరలావణ్యం మీద
మమకారం పోయింది. శివుణ్ణి రంజింపచే
ులేని తన తనువు నిరర్థకంగా తలచి
శివరంజనిగా తపస్సు చే
ుడానికి పూనుకున్నది. కేవలం కొద్ది ఆకు లనుమాత్రమే
తింటూ శరీరాన్ని కృశింప జేసుకొని తపస్సు మొదలుపెట్టింది.
జ
ు, విజ
ు అనే ఇద్దరు చెలికత్తెలు ఆమెకు తోడుగా ఉంటూ ఆమె
ెూగక్షేమాల్ని మేనకా, హిమవంతులకు తెలి
ుజేస్తూ వస్తున్నారు. కొన్నాళ్ళ
తర్వాత పార్వతి పర్ణాలను కూడా తినడం మానివేసి నిరాహారంగా తపస్సు చేస్తూ,
అపర్ణ అని పేరు పొందింది. శివుడు మన్మథుణ్ణి భస్మం చేశాడే గాని, మన్మథుడి
బాణ ప్రభావం ఊరికే పోలేదు.
పార్వతి తపస్సు కూడా ఫలితం సాధించింది. శివుడు మారువేషంతో పార్వతి
దగ్గరకు వెళ్ళి, పార్వతి మనస్సును పరీక్షంచాడు. పార్వతిని మనసారా
మెచ్చుకొని పెళ్ళి చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. సప్త ఋషులను హిమవంతుడి
దగ్గరకు పెళ్ళిపెద్దలుగా పంపించాడు. శివుడంతటివాడికి కన్యాదాత
కాబోతున్నందుకు ఉన్నతోన్నతంగా శిఖరాలు పెంచుకున్నాడు హిమవంతుడు.
ప్రమథగణాలు ముందు నడవగా శివుడు పెళ్ళికుమారుడై హిమవంతుడింటికి తరలి
వెళ్ళాడు. హిమాల
ు శిఖరాలు పెళ్ళి పంది రికి రాటలైనాయి. విష్ణువు, బ్రహ్మ,
ఇంద్రుడు మొదలుగాగల దేవతలు, సప్తర్షుల వెంట వేలాది మహర్షులు, నారదాది
మునిపుంగ వులు అక్కడకు చేరుకున్నారు. పెద్ద ముత్త యిదువు అరుంధతి శివుడి
ఫాలనేత్రం రెప్ప మీదుగా కళ్యాణ తిలకం నిలువుగా దిద్దింది. పెళ్ళి అలంకరణతో
శివుడు చాలా సుందరంగా త
ూర
్యూడు. అప్పుడు అందరూ శివుణ్ణి-- సుందరేశ్వరుడు
అని అన్నారు.
సర్వాలంకార శోభితమై విద్యుల్లతలాగా మెరిసిపోతూన్న పార్వతిని
పెళ్ళికూతురుగా తీసుకొచ్చి విష్ణువు శివుడితో, ‘‘నీవు సుందరే శ్వరుడివి
అయితే, నా చెల్లెలు పార్వతి మీనాక్షదేవి!'' అని అంటూ పార్వతి కుడి చేతిని
శివుడి కుడిచేతిలో పెట్టి ఇద్దర్నీ పెళ్ళిపీటల మీద కూర్చోబెట్టాడు.
శివపార్వతుల వివాహం ఎంత వైభవంగా జరగాలో అంత వైభవంగా జరిగింది. హిమాల
ు
లో
ులో శివుడు, పార్వతి తపస్సులు చేసిన చోటనే దేవశిల్పి విశ్వకర్మ కొత్త
దంపతులైన పార్వతీపరమేశ్వరుల కోసం ప్రత్యేకంగా దివ్యమైన అంతఃపుర మందిరాన్ని
నిర్మించాడు.
మంగళ తూర్యనాదాలు మిన్నంటుతూం డగా చేతులు కలుపుకుని శివుడు, పార్వతి
అందరిమధ్య నడుస్తూ మందిరానికి బ
ులు దేరారు. మందిరాన్ని చేరుకునే దారిలోనే
మన్మథుడి భస్మరాసి ఉన్నది. ఆ బూడిద కుప్పను అంటిపెట్టుకొని రతీదేవి
కన్నీళ్ళతో మోకరిల్లి దోసిలిపట్టి పతిభిక్ష అడుగుతున్న దానిలాగ ఉన్నది.
శివ పార్వతులు ఆమె దగ్గరకు వెళ్ళి, ఆమె తలపై చేతులుంచి దీర్ఘసుమంగళిగా
ఉండు అని దీవించారు. శివుడు మళ్ళీ తన మూడో కంటినే తెరచి ఈసారి చల్లని
వెన్నెల కాంతితో చూడగానే భస్మరాసి మా
ుమై మన్మథుడు నిజరూపంతో లేచి అందరికీ
కనిపించి, చెరుకువింటి నారిని ఝమ్మనిపించి అదృశ్య మై
్యూడు.
అప్పుడు శివుడు రతీదేవితో, ‘‘అమ్మా! నీ భర్త తిరిగి జీవించాడు. నీకు
ఎప్పటిలాగే సదా కనబడుతూనే ఉంటాడు. నీ రెండు కళ్ళకు తప్ప మరే మూడో కంటికీ
కనిపించడు. నీకు తప్ప ఇతరులకు కనిపించడం అతని ఇష్టంపైనే ఉంటుంది. అలాంటి
వరాన్ని అతనికి ఇస్తున్నాను!'' అని చెప్పాడు. పార్వతీ శివులు గృహప్రవేశం
చేశారు. అరుంధతి నూతన దంపతులకు ఎరన్రీటితో దిష్టి తీసి, కర్పూరహారతి
పట్టింది.
అప్పుడు విశ్వకర్మ తెరతో నిండా కప్పబడివున్న ఒక నిలువెత్తు పలకను
పార్వతీ శివుల ఎదురుగా నిలబెట్టి, ‘‘ఇది ఒక గొప్ప అపురూప చిత్ర పటము. ఈ
చిత్రంలో ఇద్దరు చిత్రింప బడిఉన్నారు. ఆ ఇద్దరిలో ఎవరి సౌందర్యం ఎక్కువ
గొప్పదో మా బోటివారికి ఎవ్వరికీ చెప్పశక్యం కాలేదు! అది చెప్పగలవారు
మీరిద్దరేనన్న నమ్మకంతో మీ ముందు పెడుతున్నాను, చెప్పండి!'' అని తెరను
తొలగించాడు.
అది ఒక నిలువుటద్దం! అద్దంలో శివుడు పార్వతి తమ ప్రతిబింబాలను చూసి
ముసి ముసిగా నవ్వుకున్నారు. ‘‘ముసిముసి నవ్వులు సమాధానాలు కావు, చెప్పి
తీరాలి!'' అన్నాడు నారదుడు. శివుడు చిరునవ్వుతో పార్వతిని క్రీగంట చూస్తూ,
‘‘ధగధగా శుక్రునిలాగ మెరు స్తూన్న ముక్కరగల చిత్రాంగి సౌందర్యమే గొప్పది!''
అన్న వెంటనే పార్వతి సిగ్గుతో ఎర్ర బడ్డ చెక్కిళ్ళతో, ‘‘ఆ ముక్కంటి
పురుషుడి సౌందర్యమే సృష్టిలో గొప్పది,'' అని వీణ మీటినట్టు పలికింది.
అందరూ శివపార్వతులపై పుష్పాక్షతలు చల్లివెళ్ళిన తర్వాత కొత్త
దంపతులిద్దరూ పట్టుదిళ్ళు అమర్చిన తూగుటు
్యులపై కూర్చున్నారు.
వారికెదురుగా విశాలమైన గోడమీద మనోహరమైన పెద్ద చిత్తరువు చిత్రింపబడి
ఉన్నది. చిత్రం మధ్యలో అందమైన ఒక ఏనుగుల జంట నాట్యం చేస్తున్నట్లుగా
ముందరికాళ్ళు ఎత్తి ఎదురెదురుగా ఎత్తిన తొండాలను పెనవేసుకొని ఉన్నవి. తోర
ణం కట్టినట్టు ఉన్న ఆ రెండు ఏనుగుల మధ్య నుంచి కనిపిస్తున్న సరోవరంలో పెద్ద
పద్మము వికసిస్తూన్నది. ఆ చిత్రంలో చిత్రింపబడిన ఏనుగుల జంటపై శివపార్వతుల
చూపులు నిలిచాయి. అంతలో పద్మ చిత్రమున్నచోట వెన్నెలవంటి జ్యోతి వెలిగింది.
ఆ వెలుగు క్రమక్రమంగా పెద్దదై వ్యాపించింది. ఆ వెలు గులో శశివర్ణంతో
మెరిసిపోతూన్న విఘ్నేశ్వ రుడు వారికి కనిపించాడు. విఘ్నేశ్వరుడ ముఖము ఏనుగు
ముఖమే అయినప్పటికీ, ఆ ముఖంలో దివ్యత్వం నిండి ఉన్నది. ప్రసన్నత
వెల్లివిరుస్తూన్నది. అతని చూపులు శాంతంగా మేధస్సునూ, శక్తినీ
చాటుతున్నాయి.
అతని దోరపుబొజ్జ నిండుగా తళతళలాడుతున్నది. అభ
ుహస్తంతో అందంగా
నిల్చొనిఉన్న విఘ్నేశ్వరుడు పార్వ తికి ముద్దుల మూటలాగ కనిపించాడు.
విఘ్నేశ్వరుడిని చూస్తూంటే శివుడికీ, పార్వతికీ ఎన్నడూ ఎరగని
అనిర్వచనీ
ుమైన ఆనందమేదో తమలో ఉప్పొంగుతున్నట్లు అనిపించింది.ఆ
ఆనందపారవశ్యంలో నోట మాట రాక విఘ్నేశ్వరుణ్ణి రెప్పవాల్చకుండా చూస్తున్నారు.
విఘ్నేశ్వరుడు ఎడమ పక్కకు సొంపుగా వంపుపెట్టి ఉన్న చిన్నారి తొండాన్ని
సవరించుకుని ఊపుతూ, ముద్దు ముద్దు మాటలతో, ‘‘నేను విఘ్నేశ్వరుణ్ణి!
విఘ్నాలను అరికటే్ట వినా
ుకుడిని! పంచ భూతగణా లకు అధిపతిని! గణపతిని!
చిత్రవిచిత్రమైన రూపం గల చిత్రగణపతిని! మీ ఇరువురి అను రాగ ఫలితంగా శివుడి
తేజస్సుతో కుమార స్వామి పుట్టి తారకాసురుణ్ణి అంతమొంది స్తాడు.
కుమారస్వామికి ముందుగా నేను అవతరించి మీకు పుత్రుడిగా ఉంటాను.
పుత్రగణపతినై అవతరించబోతున్నాను!'' అని చెపుతూంటే పార్వతి అతణ్ణి అందుకొని
ఎత్తుకోవాలని చేతులు చాచింది. విఘ్నేశ్వరుడు వెలుగుతోసహా అంతర్థానమ
్యూడు.
శివుడు, పార్వతి ఆ మందిరంలో ఆనంద సముద్రంలో మునిగి సంసారం సాగిస్తున్నారు. ఆ
సమ
ుంలోనే జగత్తుకు కనీవినీ ఎరగని ఉపద్రవం ముంచుకొచ్చింది.
No comments:
Post a Comment