సత్యలోకంలో కమలాసనం మీద కూర్చుని, పగలంతా సృష్టి చేసి, చేసి అలసిన
బ్రహ్మకు, కల్పాంతం సమీపించటంతో నిద్రమత్తు ఆవరించింది. ఆ నిద్రమత్తులో
ఆ
ున ఆవులించినప్పుడల్లా పర్వతశిఖరాగ్రాలు చిట్లి, అగ్నులను వెదజల్లాయి.
నిద్రపటే్ట సమ
ూన కళ్ళు చెమ్మగిల్లగా, ఆకాశంలో గుంపులు, గుంపులుగా కూడిన
ప్రళ
ు మేఘాలు మెరుపులతో, భ
ుంకరంగా గర్జిస్తూ, ఏనుగు తొండాలవంటి ధారలతో
వర్షించి, లోకాన్ని జలమ
ుం చేశాయి.
ఆ
ున కనురెప్పలు బరువుగా వాలడం ప్రారంభించేసరికి అన్ని దిక్కులా
గాఢాంధ కారం అలుముకున్నది. ఈప్రళ
ు పరిస్థితిలో బ్రహ్మ నిద్రిం చాడు.
ఆ
ునకు ప్రళ
ుమనేది రాత్రి కాలం. తిరిగి నూతన కల్పారంభంకానున్న సమ
ుం
ఆసన్నమైంది. సరికొత్త జగత్తు మీద వెలుగు ప్రసరించబోతున్న తరుణంలో
సరస్వతీదేవి వీణ సవరించి భూపాల రాగ స్వరాలను మెల్లగా పలికిస్తూండగా
బ్రహ్మకు మెలకువ వచ్చింది.
ఆ
ున పద్మాసనం వేసి కూర్చుని, నాలుగు ముఖాలతో, నాలుగు దిక్కులూ
కల
ుచూశాడు. కిందవున్న జగత్తు అంతా నీటిమ
ుమై మహాపర్వతాల్లాంటి కెరటా లతో
కల్లోలంగా ఉంది. ఆ తరంగాల మధ్య ఒకచోట కళ్ళను మిరుమిట్లుకొల్పే తెల్లని
కాంతిరేఖకనిపించింది. ఆ కాంతిలో తరంగా లపై తేలుతూ ఒక పెద్ద మర్రి ఆకు,
దానిపై చందమామలాంటి పసివాడు పడుకుని కుడి కాలి బొటనవేలు చప్పరిస్తూ
కనిపించాడు.
బ్రహ్మ చేతులు జోడించి, కన్నులుమూసి ధ్యానించి తెరచినంతలో ఒక వింత
దృశ్యం కనిపించింది. ఆ పసివాడు విశ్వవిరాట్ స్వరూపుడైన
పరబ్రహ్మమేనని--బ్రహ్మకు అనుభవపూర్వకంగా తెలిసినవిష
ుమే. కాని ఇప్పుడా
పిల్లవాని తల ఏనుగు తలను పోలి, చిన్నారి తొండంతో కుడిపాదాన్ని పట్టి నోటిలో
పెట్టుతూన్నట్టుగా కనిపించింది.
ఆ ముఖం చాలా ప్రసన్నంగా ఉంది. పిల్లవాడు చంద్రకాంతితో
ప్రకాశిస్తున్నాడు. నాలుగు చేతులు కలిగి ఉన్నాడు. బ్రహ్మ ఆశ్చర్యంగా
చూస్తూన్న మరునిముషంలో, ఆకుతోసహా ఆ పిల్లవాడు అదృశ్యమ
్యూడు. బ్రహ్మకు ఆ
ప్రదేశాన ఎత్తుగా లేచిన పెద్ద మట్టిదిబ్బ ఒకటి కనిపించింది. క్రమక్రమంగా
నీటినుంచి సువిశాలమైన భూభాగాలూ, సముద్రభాగాలూ ఏర్పడ్డాయి. బ్రహ్మ సృష్టికి
పూనుకున్నాడు. మొదట పర్వతాలూ, నదులూ ఏర్పడాలని సంక ల్పించి కమండలం లోంచి
నీరు తీసి జగత్తు మీద చల్లాడు.
తరవాత వృక్షాలనూ, సస్యాలనూ, ఖనిజాలనూ సంకల్పించాడు. పిమ్మట కద లాడే
జీవరాశిని--మొదట సముద్రంలో చేప లనూ, భూమ్మీద జంతుజాలాన్నీ, క్రిమికీట
కాదుల్నీ, పక్షుల్నీ సృజించాడు. తరవాత మను ష్యులను సంకల్పించి
కమండలోదకాన్ని చిలికాడు. బ్రహ్మ సృష్టి చేస్తున్నంతసేపూ సరస్వతీ దేవి వీణ
వాయిస్తూనే ఉన్నది. ఎందువల్లనో అనుకోనివిధంగా వీణ అపశృతి పలికింది.
సరస్వతి నివ్వెరపోతూ కిందకు చూసి మరింత నివ్వెర పడింది. బ్రహ్మ
,అర్ధాంగి నివ్వెరపాటు అర్థంకాక కమలాసనం నుంచి వంగి కిందికి చూశాడు.
పర్వతాలు బోర్లపడుతూ శిఖరాలు భూమి లోకి పాతుకుని వెడల్పుగా పర్వత పాదాలు
సూర్యరశ్మి పడకుండా గొడుగుల్లాగా ఎదుగు తూన్నవి. సముద్రతరంగాల మీద జలచరాలు
తేలుతూ కుప్పిగంతులు వేస్తున్నవి. కొన్ని నిటారుగా ప
ునిస్తున్నవి.
కొన్ని పక్షుల్లా ఎగురుతున్నవి. జంతువులూ చాలా అనర్థాలతో పుట్టాయి;
తలలు లేకుండా కొన్ని, వెనుక కాళ్ళు లేకుండా కొన్ని, ఒంటికాలివీ, మూడు
కాళ్ళవీ, కళ్ళూ, చెవులూ అన్నీ వుండి నోరు అనేది లేనివీ, తోకలకు తలలున్నవీ,
తలకు తోకలున్నవీ కనిపించాయి. పక్షులకు రెక్కలు లేవు. అవి నడవాలంటే
కాళ్ళులేక నేల మీద దొర్లుకుంటున్నవి. ఈ వక్రతలన్నీ గమనించి బ్రహ్మ ఎంతగానో
కలవరపడుతూ తన ఉత్తమోత్తమ మనుష్య సృష్టి ఎలాగుందో నని ఆత్రంగా చూశాడు.
మనుషులలో కొందరికి రెండు తలలు ఉన్నాయి. అందులో ఒకటి స్ర్తీది,రెండోది
పురుషుడిది.
పురుషులు
జానెడు, బెత్తెడుగా ఉన్నారు. స్ర్తీలు పెద్ద ఏనుగుల్లాగా, తాటిచెట్లలాగా
ఉన్నారు. వీపులకు తలలు అతికించినట్లున్న వాళ్ళూ, నాలుగు, మూడు, ఒంటికాళ్ళ
వాళ్ళూ, పొట్టకే పెద్దనోళ్ళున్న కబంధులూ ఆక్రందనలు చేస్తూ కనిపించారు.
జంతువులు మోరలు పైకెత్తి దీనంగా అరుస్తున్నవి. మూగగా చూస్తున్నవి.
బ్రహ్మను నిందిస్తూన్నట్లుగా గింజుకుంటున్నవి, కదను తొక్కుతున్నవి. ఒక
జానెడు మగవాడు తాటిచెట్టంత వికృతాకారిణి అయిన స్ర్తీని చూపిస్తూ, ‘‘ఓ
బ్రహ్మదేవా! ఇలాంటి స్ర్తీతో నేనెలా సంసార సాగరం ఈదేది?''అంటూ ఆకాశానికి
తలపెట్టి పెద్దగా అరుస్తున్నాడు. ‘‘నాలుగు తలలంటూ ఉన్నా, అసలు తల అంటూలేని
ఓయి బ్రహ్మదేవుడా! మమ్మ ల్నెందుకిలాగ పుట్టించావు?'' అంటూ వికృతాకారాల
మనుషులు చేస్తూన్న ఆక్రంద నలు మిన్నుముట్టుతున్నవి.
బ్రహ్మ నాలుగు తలలూ గిర్రున తిరిగి పో
ూయి. ఎనిమిది కళ్ళూ
బైర్లుకమ్మాయి. తెల్లబోతూ బ్రహ్మ సరస్వతి వంక అెూమ
ుంగా చూశాడు. అతని
నాలుగు తెల్ల మొహాలనూ చూసి సరస్వతి సరసంగా చిరునవ్వుతో సరిపెట్టి
ఊరుకున్నది. ‘‘ఎందుకిలా జరిగింది? సక్రమమైన సృష్టి జరపాలనే
సత్సంకల్పంతోనేకదా నేను సృష్టికి పూనుకున్నాను; ఇలాగ ఎందుకు జరిగింది?''
అని తనలోతాను అనుకుంటు న్నట్లుగా గట్టిగా తలలు పైకెత్తి అరిచాడు బ్రహ్మ.
అతని ప్రశ్న దశదిశలా మారుమ్రోగింది. అెూమ
ుంగా వెర్రిచూపులు చూస్తున్న
బ్రహ్మకు పెద్ద వెలుగు కనిపించింది. ఆ వెలుగులో ఒక అద్భుతమూర్తి
కనిపించాడు. ఆ మూర్తికి ఏనుగు తల ఉన్నది. నాలుగు చేతులలో పాశము, అంకుశము,
కలశము, పరశువు ధరించి ఉన్నాడు. పూర్ణచంద్రుడివలె ప్రకాశిస్తున్నాడు.
తెల్లని అతని ఉత్తరీ
ుము ఆకాశమంతటా రెపరెపలాడుతూ ఎగురుతు న్నది.
అప్పుడు సరస్వతి వీణ ఓంకారనాదం చేసింది. సరస్వతీదేవి వేళ్ళు వాటంతట
అవే వీణపై నాద నామక్రి
ూరాగాన్ని పలికిస్తూ, మా
ూ మాళవ గౌళరాగానికి మారుతూ,
హంసధ్వనిరాగాన్ని అందుకున్నవి. గజాననుడై సాక్షాత్కరించిన ఆ దివ్యమూర్తి
వటపత్రంపై నిలుచుని బ్రహ్మను అభ
ుముద్రతో ఆశీర్వ దించాడు. అతని చుట్టూరా
శరత్కాల పూర్ణిమ నాటి వెన్నెలవంటి వెలుగు ఆవరించి ఉన్నది.
బ్రహ్మ అప్ర…ుత్నంగా చేతులు జోడించి నమస్కరిస్తూ, మహానుభావా! అద్భుత
మూర్తివైన నీ వెవ్వడవు? నీవెవరో తెలుసు కోలేని అజ్ఞానిని,
అనుగ్రహించు!అని అడిగాడు. నా…ునా! బ్రహ్మదేవా! సంకల్పం వెను కనే
వికల్పం వెంటాడుతూంటుంది; అదే విఘ్నం! విఘ్నాన్ని అరికట్టి సంకల్పాన్ని నెర
వేర్చే నేను విఘ్నేశ్వరుడను! విఘ్నాలకు నా…ుకత్వం వహించే వికల్పాన్ని నా
గొడ్డ లితో ఛేదించి ప్రతి కార్యాన్నీ నిండు కలశం లాగ జ…ుప్రదం చేసే విఘ్న
వినా…ుకు డిని.
పంచభూతములనబడే పృథ్వి, నీరు, అగ్ని, వా…ుువు, ఆకాశములనే భూత గణానికి
అధిపతినైన గణపతిని. ఆహార ధాన్యాల్ని ఫలించే సస్యాల్ని నాశనం చేసే మదించిన
ఏనుగులవంటి విఘ్నాలను నా వాడిగల అంకుశంతో అదుపులో పెడుతూ వాటిని నా పాశము
అనే బలమైన తాటితో కట్టి ఉంచే నన్ను, విఘ్నేశ్వరుడు అని పిలువు! అని గంభీర
స్వరంతో విఘ్నేశ్వ రుడు పలికాడు.
అప్పుడు బ్రహ్మ, దేవా! విఘ్నేశ్వరా! నా సృజన శక్తికి ఎందుకలాగ
ఘోరమైన విఘ్నం జరిగింది? ఇన్ని వంకరలెందుకు ఏర్పడ్డాయి? ఉత్తమంగా సృష్టి
జరిగే మార్గం వివరంగా చెప్పు! అన్నాడు. విఘ్నం గురించి నీకు తెలి…ూలనే
ఇదంతా జరిగింది. మర్రి ఆకుపై బాలగణ పతిగా కనిపించిన వటపత్ర గణపతినే నేను.
అప్పుడు నా గురించి ఆలోచించలేకపో…ూవు.
నా గురించి ఆలోచించడమంటే విఘ్నం గురించి ముందు జాగ్రత్తపడే జ్ఞానాన్ని
కలిగి ఉండ టమే! ఆ జ్ఞాన స్వరూపుణ్ణే నేను! బ్రహ్మ మొదలుకొని బుద్ధిగల
ప్రతిజీవీ కార్యరంగా నికి దిగేముందు విఘ్నం రాకుండా జ…ు ప్రదంకావడానికి తగు
జాగ్రత్తనూ, జ్ఞానాన్నీ కలిగిఉండక తప్పదు! ఏనుగు అడుగు వేసేముందు నేల
గట్టితనాన్ని తెలుసుకుని మరీ నడుస్తుంది; ప్రాణుల్లో ఏనుగు బుద్ధి బలం
దానిలాగే చాలా పెద్దది.
ఏనుగంత విశేష మేధస్సును కలిగి ఉండాలనే సూచ నగా నేను గజాననుడిగా
ఉన్నాను. నీవు నిద్రి స్తూన్న సమ…ుంలో రాక్షసుడైన నరకా సురుడు నీ నాలుగు
వేదాల్నీ అపహరించి సముద్రం అడుగున దాచాడు; మహావిష్ణువు మత్స్యావతారం దాల్చి
వాణ్ణి సంహరించి నీ వేదాల్ని భద్రంగా తెచ్చి వటపత్రశాయినై ఉన్న నా దగ్గర
ఉంచాడు.
ఇవిగో! వాటిని తిరుగ గ్రహించి సృష్టి నిర్వర్తించు! అని చెప్పి,
విఘ్నేశ్వరుడు బ్రహ్మకు వేదాలను ఇచ్చాడు. బ్రహ్మ వాటిని అందుకుని పరమానం
దంతో విఘ్నేశ్వరుణ్ణి స్తుతించుతూ, విఘ్నే శ్వరా! నేను సృష్టి సంకల్పించే
ముందు నిన్ను ధ్యానించి, మనసారా నిన్ను పూజించి మరీ కార్య రంగానికి
ఉపక్రమించేవరం అనుగ్రహించు! అవకతవకలుగా త…ూరైన సృష్టి ఉపసంహ రించుకునేలాగ
చెయ్యి! అని కోరాడు.
విఘ్నేశ్వరుడి ప్రభావం వల్ల అంతవరకు జరిగిన వంకరటింకరల సృష్టి అంతా
క్షణంలో మటుమా…ుమైంది. అప్పుడు విఘ్నేశ్వ రుడు మళ్ళీ బ్రహ్మతో, బ్రహ్మదేవుడా! వక్ర తను తుండతుండములుగా ముక్కలు చేసేవాడిని గనుక, నేను
వక్రతుండుడు అనే పేరుకు సార్థ్ధకంగా నా తొండాన్ని వక్రంగా ఉంచుతూంటాను.
వక్రతుండుణ్ణి అయిన నన్ను ధ్యానించి తలపెట్టిన నీ పని కూడా వంకర పోదు! నీవు
కోరుకున్నటే్ల నన్ను ధ్యానించి సృజించు.
సృజించటం ఒక కళ! ఆ కళ ఎటువంటి వంకరటింకరలు పోకుండా జగత్తు నీవు మలచిన
కళానిల…ుంగా భాసిస్తుంది! నీకుమల్లే జగత్తులో అందరికీ అందుబాటుగా తొలి
పూజలందుకునే విఘ్నేశ్వరుడిగా విఘ్నాల నుంచి కాపాడుతూ, సంకల్పసిద్ధిని
కలిగించే సిద్ధివినా…ుకుడుగా, సకల గణాలకూ అధి పతిగా గణపతినై శివ పార్వతులకు
కొడుకుగా అవతరిస్తాను!అని చెప్పి, బ్రహ్మను దీవించి అంతర్థానమ…్యూడు.
సరస్వతీదేవి బ్రహ్మకేసి చిరునవ్వు నవ్వి హిందోళ, శ్రీరాగాలతో
మంగళస్వరాల్ని మహా కాశం పులకరించేట్లుగా వీణపై వినిపించింది. బ్రహ్మ, విఘ్నేశ్వరా…ునమః! అంటూ సృష్టిని ప్రారంభించాడు. సృష్టి మరింత అందంగా
నిర్విఘ్నంగా సాగింది.
గంభీర మైన పర్వత పంక్తులూ, అమృతజలాలతో నదులూ, సుందర వనాలూ, రంగు రంగుల
బొమ్మల్లాంటి జంతుజాలమూ, శారీరకం గానూ, మానసికంగానూ ఉన్నతులూ, బల వంతులూ
అయిన మనుషులతో జగత్తు బ్రహ్మ చేసిన కళానిలయం విలసిల్లింది. వాగ్దేవి
అయిన సరస్వతి తన వాణిని సంగీ తంలా ప్రాణికోటికి స్వరపరిచింది. జీవకోటి
సలక్షణంగా పెరిగింది. ఊడలు చిమ్మే వట వృక్షంలాగ జగత్తు వర్థ్ధిల్లింది.
No comments:
Post a Comment