Friday, April 17, 2015

లక్ష్మీ కటాక్షం పొందడం కోసం చేయాల్సిన పూజలు

అమృత ప్రాప్తి మంత్రం :

శంఖినీ యక్షిణీ సాధన మంత్రం

శంఖ ధారడీ శంఖ ధరనే హ్యీం హ్యీం క్లీం శ్రీ స్వాహా

ఈ మంత్రాన్ని వటవృక్షం కింద కూర్చుని పదివేలసార్లవరకు జపించాలి. దీనిని జపించేముందు ఉదయాత్పూర్వం ప్రారంభించి, సూర్యోదయానికి ముందుగానే ముగించుకోవాలి. నెయ్యితో వెయ్యిసార్లవరకు ఈ మంత్రాన్ని హవనం చేస్తే.. చంద్రికా యక్షిణీ ప్రసన్నం పొంది అమరత్వాన్ని ప్రసాదిస్తుంది. అయితే ఈ మంత్రం ఎప్పుడుపడితే అప్పుడు, ఎవరుపడితేవారు జపించకూడదు. అన్నివిధాలుగా పవిత్రంగా వుండేవారికి మాత్రమే ఇది వర్తస్తుంది. అటువంటివారికే పలితాలు దక్కుతాయి. ఇతరుల ఎంతచేసినా ఫలితం శూన్యం.

రుణ విముక్తి కోసం చిన్న పూజ :

రుణ సమస్య అనేది చాలా విచిత్రమైంది. ఇందులో కూరుకుపోయినవారు బయటపడ్డం చాలా కష్టం. ఈ సమస్య నుంచి బయటపడ్డానికి అన్యరకాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ సాధ్యంకాదు. కేవలం కొంతమందికి మాత్రమే అలా సాధ్యపడుతుంది. అయితే ఈ రుణం నుంచి విముక్తి పొందడానికి ఒక చిన్న ఉపాయం కూడా వుంది.

దీపావళి పండుగరోజు అర్థరాత్రి 12 గంటల సమయంలో 5 గులాబీ పూలను తెచ్చుకోవాలి. తరువాత ఒకటిన్నర మీటరు పొడవున్న తెల్లటి వస్త్రాన్ని తీసుకుని, మీ ముందు పరుచుకోవాలి. ఆ వస్త్రాన్ని నలువైపులా మడుచుకోవాలి. తరువాత ఐదు గులాబీలను గాయత్రీమంత్రాన్ని పఠిస్తూ.. ఆ తెల్లటి వస్త్రంలో వుంచాలి. ఆ విధంగా తయారుచేసుకున్న దానిని భగ్రంగా ఒకచోట దాచిపెట్టుకోవాలి. ఇలా చేస్తే.. త్వరగా మీరు రుణ విముక్తి పొందుతారు.

గాయత్రి మంత్రం :

ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యమ్‌
భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్‌

ప్రతిరోజూ ఉదయాన్నే లేవగానే ఈ మంత్రాన్ని జపించడంతో సిరిసందదలతోపాటు ప్రత్యేకమైన లాభాలు కూడా కలుగుతాయి.

ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవసాయ,

ధన ధాన్యాధిపతయే ధన ధాన్య సమృద్ధి మేఁ దేహి దాపయ స్వాహా!

ప్రతిరోజూ తొమ్మిదిసార్లు ఈ మంత్రాన్ని జపించుకోవాలి. మంత్రాన్ని జపించిన తరువాత పసుపురంగులో వున్న మిఠాయిలను పిల్లలకు పంచాలి. అలాగే గంగాజలాన్ని మీరు పనిచేసే చోట జల్లుకోవడంతో మంచి పురోభివృద్ధిని పొందుతారు. అలాగే లక్ష్మీదేవి కృపతో ధనధాన్యాలు పొందుతారు.

ఆకర్షణ వృద్ధి కోసం :


పూజా కార్యక్రమాలను నిర్వహించుకున్న స్థానంలో ఒక బంతి పూవులను తీసుకోవాలి. ఆ పూలను పసుపుతో పూజించి, నీటితో చిదుముకోవాలి. ఎక్కడికైనా వెళ్లేటప్పుడు దానిని తిలకంగా దిద్దుకుంటే.. మిమ్మల్ని చూసేవారు మీవైపు ఆకర్షితులవుతారు. ముఖ్యంగా వివాహసంబంధాలకు వెళ్లినప్పుడు దీనిని పాటిస్తే.. మంచి ప్రయోజనాలు పొందుతారు.

No comments:

Post a Comment