Thursday, September 6, 2012

దేవీభాగవత కథలు - 3


వైరాగ్య చిత్తంతో వివాహంచేసుకోనని పట్టు బట్టిన శుకుడికి, వ్యాసుడు తాను రచించిన దేవీభాగవతం చెప్పాడు: విష్ణువు మర్రి ఆకు మీద పిల్లవాడుగా ఉండి, ‘‘నేనిక్కడ పిల్లవాడి రూపంలో ఎందుకున్నాను? నన్ను ఎవరు సృష్టించారు? ఈ విష…ూలు నాకు ఎలా తెలుస్తాయి?'' అని విచారిస్తూంటే, అతన్నిచూసి జాలిపడి దేవి అతనికి సగం శ్లోకంచెప్పి, ‘‘ఇదే సమస్త మూనూ. దీన్ని తెలుసుకుంటే నన్నెరిగినటే్ట,'' అన్నది.
 
విష్ణువు ఆ సగం శ్లోకాన్ని విన్నాడుగానీ, అర్థం చేసుకోలేకపో…ూడు. అతను ఆ సగం శ్లోకాన్ని పఠించసాగాడు. అంతలో మహాదేవి నాలుగు చేతులలో శంఖ, చక్ర,గదాదులు ధరించి, మేలిమి బంగారు బట్టలు కట్టి, తనలాటివారే అయిన శక్తులను వెంటబెట్టుకుని విష్ణువు ఎదట ప్రత్యక్ష మయింది.
 
విష్ణువు ఆమెను చూసి దిగ్భ్రాంతుడై ఏమీ అనలేకపో…ూడు. అప్పుడామె అతనితో, ‘‘మా…ు మూలంగా నన్ను మరిచావు. ఇప్పుడు నువ్వు సగుణుడివి. నేను సత్త్వ శక్తిని, నీ బొడ్డు కమలంలో బ్రహ్మ పుట్టి, రజోగుణంగలవాడై అన్ని లోకాలూ సృష్టి చేస్తాడు. అతను చేసిన సృష్టికి నువ్వు పాలకు డవుగా ఉంటావు. ఆ బ్రహ్మదేవుడి కను బొమలమధ్య నుంచి, క్రోధవశాన రుద్రుడు పుట్టుకొస్తాడు. ఆ రుద్రుడు తీవ్రమైన తపస్సు చేసి, దాని మూలంగా తామసగుణం కలిగిన వాడై, ప్రళ…ుకాలంలో, బ్రహ్మ సృష్టించిన ప్రపంచాన్ని నాశనం చేస్తాడు.

నువ్వు నా సహా…ుంతోనే ప్రపంచాన్ని పోషించవలసిన వాడివి కనక సత్త్వశక్తినైన నన్ను గ్రహించు. నేను ఎల్లప్పుడూ నీ వక్షస్థలంలోనే ఉంటాను,'' అన్నది. ఆమెతో విష్ణువు,‘‘నాకు ఒక అర శ్లోకం వినబడింది. దాన్ని నేను ఎలా విన్నానో నువ్వు చెప్పు,'' అన్నాడు.
 
‘‘నన్ను సగుణగా నువ్వు చూస్తున్నావు. నీకా అరశ్లోకం చెప్పినది నిర్గుణస్వరూపి అయిన పరదేవత. ఇది భాగవతమనే పేరుగల మంత్రం. దీన్ని విడవకుండా పఠించితే శుభాలు కలుగుతాయి,'' అన్నదామె. విష్ణువు ఆ మంత్రబలంతోనే మధుకైట భులను చంపి,వారికి భ…ుపడి తనకు శరణు జొచ్చిన బ్రహ్మకు దాన్ని ఉపదేశించాడు. బ్రహ్మ నారదుడికీ, నారదుడు వ్యాసుడికీ ఉపదేశించారు. వ్యాసుడు మహిమాన్వితమైన ఆ మంత్రాన్ని శుకుడికి ఉపదేశించి, ‘‘దీన్నే నేను అనేక సంహితలుగా విస్తరించి రచిం చాను,'' అన్నాడు.
 
శౌనకాదిమునులు శుకుడి కథ విన్న తరవాత దేవీభాగవత కథలు వినిపించ మన్నారు. సూతుడు ఇలా చెప్పసాగాడు: కోసలదేశపు రాజధాని అెూధ్యానగరాన్ని ధ్రువసంధి అనేరాజు పాలించేవాడు. ఆ…ునకు మనోరమ, లీలావతి అని ఇద్దరు భార్యలు. మనోరమకు సుదర్శనుడనీ, లీలావతికి శత్రుజిత్తు అనీ కొడుకులు కలిగారు. ధ్రువసంధి ఒకనాడు వేటాడుతూండగా సింహం ఒకటి అతనిమీద పడింది. సింహమూ, ధ్రువసంధీ హోరాహోరీ పోరాడి చివరకు ఇద్దరూ చనిపో…ూరు.
 
మనోరమ తండ్రి కళింగదేశపు రాజు వీరసేనుడు, తన అల్లుడు చనిపోయిన వార్త విని మనమడైన సుదర్శనుడి క్షేమం చూడ డానికి వచ్చాడు. అలాగే ఉజ్జయిని నుంచి శత్రుజిత్తు మాతామహుడైన …ుుధాజిత్తు కూడా వచ్చాడు. సుదర్శనుడు, శత్రుజిత్తు ఇరువురిలో ఎవరిని రాజు చే…ుడమా అన్న విష…ుంలో ఇద్దరు మాతామహులమధ్య భేదాభిప్రా…ూలు తలెత్తాయి.
 
ఘర్షణపడ్డారు. ఆ పోరాటంలో …ుుధాజిత్తు వీరసేనుణ ్ణ చంపేశాడు. మనోరమ బిడ్డగావున్న సుదర్శనుణ్ణి వెంట బెట్టుకుని భరద్వాజాశ్రమం చేరింది. భరధ్వా జుడు ఆమెనూ, బిడ్డనూ ఆదరించి, శత్రువుల బారి నుంచి కాపాడి, సుదర్శనుడికి విద్యా బుద్ధులు నేర్పాడు. …ుుక్తవ…ుస్కుడైన సుదర్శనుడికి ఒకరోజు మహాదేవి కలలో కనిపించి అస్ర్తవిద్య ప్రసాదించింది.

కాశీరాజు సుబాహుడి కూతురు శశికళ, అద్భుత సౌందర్యవతి అని విని, సుదర్శనుడు ఆమెను పెళ్ళాడగోరాడు. అదేవిధంగా శశికళ కూడా సుదర్శనుణ్ణే పెళ్ళాడ నిశ్చయించింది. సుబాహుడు తన కుమార్తె శశికళ స్వ…ుం వరం ప్రకటించాడు. నానాదేశాల రాజులూ కాశీకి వచ్చారు. అయితే శశికళ సుదర్శనుణ్ణే పెళ్ళాడతానని పట్టుపట్టింది!
 
రాణి తన కుమార్తె వద్దకు వెళ్ళి, ‘‘అమ్మా, నిన్ను పెళ్ళాడాలని అంతమంది రాజులు వచ్చి ఉండగా, సుదర్శనుణ్ణి పెళ్ళాడతానని పట్టు బట్టి, మన ప్రాణాలమీదికి ఎందుకు తెస్తావు? స్వ…ుంవర సభకు పద. నువ్వు సుదర్శనుణ్ణే వరిస్తానంటే, …ుుధాజిత్తు ఆ సుదర్శనుడితో పాటూ నిన్నూ, నన్నూ, నీ తండ్రినీకూడా చంపేస్తాడు!'' అని హెచ్చరించింది.
 
ఎన్ని చెప్పినా, శశికళ మరొకరిని పెళ్ళాడ నన్నది. ఆమె తండ్రితో, ‘‘నీకు ఈ రాజులంటే భ…ుం అయితే నన్ను సుదర్శనుడికిచ్చి, రథంలో మమ్మల్ని పొలిమేర దాటించు. …ుుద్ధం జరిగితే అతను శత్రువులను తానే చంపేస్తాడు,''అన్నది.
 
‘‘చూడు, తల్లీ! అనేకమందితో విరోధం తెచ్చుకోవటం ఎవరితరమూ కాదు. మిమ్మల్ని పొలిమేర బ…ుట వదిలినంతమాత్రాన ఆ దుర్మార్గులు మిమ్మల్ని చుట్టుముట్టితే మీరు చె…్యుగలిగినదేమున్నది? నాకొక పద్ధతి తోస్తున్నది. సీత పెళ్ళికి పెట్టినట్టుగా నీ పెళ్ళికి ఒక పరీక్ష పెడతాను. అందులో నెగ్గినవాణ్ణి పెళ్ళాడు,'' అన్నాడు సుబాహుడు.
 
‘‘అందువల్ల సమస్య తీరుతుందా? పందెంలో ఎవడో గెలిచి నన్ను పెళ్ళాడతాడు. అప్పుడు మిగిలినవాళ్ళు ఊరుకుంటారా? ఎలాగూ …ుుద్ధం తప్పదు. మహాదేవిని నమ్ము కుని నన్ను సుదర్శనుడికిచ్చి పెళ్ళిచెయ్యి,'' అన్నది శశికళ. ఆమె నిర్ణయించిన పథకాన్ని ఆమోదిం చాడు సుబాహుడు.
 
సుబాహుడు రహస్యంగా వివాహ ప్ర…ు త్నాలు జరిపించి, సుదర్శనుణ్ణి రప్పించి, తన కూతుర్ని అతనికి శాస్ర్తోక్తంగా కన్యాదానం చేశాడు. ఆ సందర్భంలో ఆ…ున తన అల్లుడికి రెండువందల రథాలూ, కొన్నివేల గుర్రాలూ, కొన్ని వందలమంది దాసీలూ, ఇతర కానుకలూ ఇచ్చాడు. అతను మనోరమతో, ‘‘అమ్మా, ఇక నా కూతురు నీ కొడుకు సొత్తు, నీసొత్తు. దాన్ని ప్రేమగా చూసుకో,'' అని నమస్కారం చేశాడు. మనోరమ ఎంతో సంతోషంతో, ‘‘అ…్యూ, మహారాజువై ఉండి కూడా రాజ్యహీనుడైన నా కొడుక్కు నీ కూతుర్ని పెళ్ళిచేశావు! నీవంటి ఉత్తముడు ముల్లోకాలలో ఎక్కడా ఉండడు.

నీ కుమార్తె భారం మాది అయితే, మా భారం నీది!''అన్నది. దానికి సుబాహుడు, ‘‘అమ్మా, నీ కొడుకు రాజ్యవిహీనుడని ఎందుకు అనుకోవాలి? నా రాజ్యం అతనిది కాదా? నా సేన అంతా ఇస్తాను. మనం నీరక్షర న్యా…ుంగా ఉండేటప్పుడు ఒకడు రాజనీ, ఇంకొకడు సేవకుడనీ విచక్షణ దేనికి? జగదంబ అండ ఉండగా విచారం దేనికి?'' అన్నాడు.
 
‘‘ఎంత చల్లనిమాట అన్నావు, బాబూ! నీకు శుభం కలుగుతుంది. నీ రాజ్యాన్ని నువ్వూ, నీ కొడుకులూ సుఖంగా ఏలుకోండి. జగ న్మాత అనుగ్రహంతో నా కొడుకు తన తండ్రి రాజ్యాన్ని తిరిగి సంపాదించుకుంటాడు. గ్రహచారం సరిగా ఉన్నవాడు మట్టి పట్టు కుంటే, బంగారమవుతుంది. ఏది చేసినా కలిసివస్తుంది. అందరూ సహా…ుపడతారు. ఇప్పుడు నా కొడుకు రోజులు మంచివి. కీడు రాదు,'' అన్నది మనోరమ. సుబాహుడు పెళ్ళితంతు పూర్తిచేసి, తన కూతురికి, అల్లుడికి అప్పగింతలూ, అంప కాలూ జరుపుతూండగా, కొందరు వచ్చి, ‘‘రాజా, వధూవరులను ఇప్పుడు పంపకండి. దారిలో శత్రువులు రాక్షసులలాగా కాపువేసి ఉన్నారు,'' అని చెప్పారు.
 
రాజుల సంగతి ఎరిగినవాడు కావటంచేత సుబాహుడు ఆ మాట నమ్మి, అంపకాలు చె…్యుటానికి సంశయించాడు. అప్పుడు సుదర్శనుడు అతనితో, ‘‘రాజా, నువ్వేమీ సంకోచించవద్దు, దేవి నా పక్షాన ఉండగా ఈ రాజులు నన్నేం చె…్యుగలరు?'' అన్నాడు. కాశీరాజు తన అల్లుడికి అంతులేని ధనం ఇచ్చి సాగనంపుతూ, సైన్యంతో సహా తానుకూడా తోడు బ…ులుదేరాడు. దారులు కాచివున్న రాజులు దూరంనుంచి చూసి, ‘‘అదుగో రథం! వాడే సుదర్శనుడు! పెళ్ళాంతోసహా పోతున్నాడు.
 
పట్టుకుని కొడదాం పట్టండి!''అంటూ విజృంభించారు. సుబాహుడు వారికి అడ్డుపడ్డాడు. సుదర్శ నుడు మంత్రం జపిస్తూ, అంబను ధ్యానిం చాడు. ఆ సమ…ుంలో శత్రుజిత్తూ, …ుుధా జిత్తూ అతనిపైకి వచ్చారు. సుబాహుడు వీరావేశంతో శంఖం పూరించి, …ుుధాజిత్తు మీద వరసగా బాణాలు వేశాడు. ఇద్దరికీ తీవ్రంగా …ుుద్ధం సాగింది.
 
అంతలో జగదంబ దివ్యమైన ఆకారంతో, అనేక మహా…ుుధాలతో, పూలమాలలతో, సింహంమీద ప్రత్యక్షమయింది. సుదర్శనుడు ఆనందంతో శరీరం పులకరిస్తూండగా దేవిని తన మామకు చూపి, ‘‘ఇంక మనకు భ…ుమే మిటి?'' అని చెప్పి, రథం దిగి, తన భార్యనూ, మామనూ వెంటబెట్టుకుని, దేవి కాళ్ళకు ప్రణామం చేశాడు.

ఏనుగులు సింహాన్ని చూసి భ…ుపడి ఘీంకారాలు చేస్తే, సింహం వాటిని చూసి గర్జించింది. అదేసమ…ుంలో దారుణంగా గాలివీచి, బీభత్సం చెలరేగింది. రాజులందరికీ కంపరం పుట్టింది. వాళ్ళు దిక్కు తెలి…ునట్టుగా నిశ్చేష్టులై చూడసాగారు. అప్పుడు సుదర్శనుడు సేనాపతితో, ‘‘మహాదేవి మనకు అండగా వచ్చింది. నువ్వు సంశయించక, రాజులమీదికి సేనలు నడి పించు,'' అన్నాడు. కాశీరాజు సేనలు రాజులపైకి విజృం భించాయి.
 
అప్పుడు, తెల్లబోయి చూస్తున్న రాజులతో …ుుధాజిత్తు, ‘‘ ఎవరో ఆడది సింహంమీద వచ్చేసరికి మీకు మతులుపో…ూేుమిటి? ఒక అర్భకుడు ఒక ఆడదాన్ని తోడు తెచ్చు కుంటే ఇందరు రాజులూ కొ…్యుబారిపోతారా? క్షణంలో వాణ్ణి చంపి, రాజు కూతుర్ని వశపరుచు కుందాం, పట్టండి!'' అని, తన మనమడైన శత్రుజిత్తును వెంటబెట్టుకుని, సుదర్శనుడి మీద …ుుద్ధం సాగించాడు.
 
అప్పుడు అంబ అందరి రాజులకూ అన్ని రూపాలలో కనబడి, అందరితోనూ ఒక్కసారే …ుుద్ధంచేసింది. క్షణంలో …ుుధాజిత్తూ శత్రుజిత్తూ బాణాలు తగిలి చచ్చారు. సుబా హుడు ఆనందబాష్పాలు రాల్చుతూ, ఆ పరాశక్తిని స్తోత్రం చేశాడు. తరవాత అతను ఆమెతో, ‘‘తల్లీ, నీ దర్శనంతో ధన్యుణ్ణి అ…్యూను. శాశ్వతంగా నా హృద…ుంలో నిలిచిపో! ఈ కాశిలోనే ఉండిపో. నాకు మరెవరి అండా అవసరంలేదు. భూమి ఉన్నంత కాలమూ ఈ కాశీ ఉంటుందంటారు. కాశీ ఉన్నంతకాలమూ నువ్వు ఇక్కడే ఉండి, మాకు శత్రుభ…ుం లేకుండా చెయ్యి. ఇదే నేను నిన్ను కోరే వరం,'' అన్నాడు.
 
మహాదేవి అందుకు ఒప్పుకున్నది. తరవాత సుదర్శనుడు మహాదేవిని స్తోత్రంచేశాడు. అతను ఆమెను, ‘‘తల్లీ, ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటి? నేనెక్కడికి పోవాలి? నేను స్వ…ుంగా అసమర్థుడనై నప్పటికీ, నీ అండ ఉంటే ఏమైనా సాధించ గలను. అందుచేత నా కర్తవ్యం తెలిపి, నన్ను అనుగ్రహించు,'' అని వేడుకున్నాడు. దానికి దేవి, ‘‘ఇంక చేసేదేమున్నది? నీ భార్యతోసహా అెూధ్యకు వెళ్ళి, సింహాసనం ఎక్కు; తగినవిధంగా రాజ్యం చేసుకో. నిన్ను నేను పైనుంచి కాపాడుతూ ఉంటాను. ప్రతి అష్టమి, నవమి, చతుర్దశికీ నన్ను పూజ చెయ్యి.

నాకు శరత్కాలం ఇష్టం. నవరాత్రి పూజలు చెయ్యి. మాఘ, చైత్ర, ఆశ్వ…ుుజ, ఆషాఢ మాసాలు నాకు ఉత్సవాలు జరిపించు,'' అని హెచ్చరించి అదృశ్యమయింది. తరవాత రాజులు ఒక్కరొక్కరే వచ్చి, ఇంద్రుడికి దేవతలు మొక్కిన విధంగా సుదర్శనుడికి మొక్కి, అంబను స్తుతించారు. వాళ్ళు అతన్ని తమ చక్రవర్తిగా ఆమోదించారు.
 
సుదర్శనుడు అెూధ్యకు చేరే లోపునే వార్తలు చేరాయి.అందుచేత మంత్రులు మంగళవాద్యాలతోసహా ఎదురువచ్చి, సుదర్శ నుణ్ణీ, అతని భార్యనూ నగరంలోకి తీసుకు పో…ూరు. సుదర్శనుడు తన సవతి తల్లి వద్దకు పోయి, కొడుకు చచ్చి ఏడుస్తున్న లీలావతికి నమస్కరించి ఓదార్చి, ‘‘అమ్మా, నీ తండ్రినీ, నీ కొడుకునూ చంపినది నేనుకాదు, మహాశక్తి! నీ పాదాల సాక్షగా చెబుతున్నాను. ఎవరో చేసిన కర్మకు నువ్వెందుకు బాధపడాలి? నన్ను నీ కొడుకులాగే చూసుకో. నీకు ఎల్లప్పుడూ మాతృసేవలు చేస్తాను.
 
నేను పసివాణ్ణి అయి ఉండగా నీ తండ్రి దురుద్దేశంతో నన్ను రాజ్య భ్రష్టుణ్ణిచేస్తే, అది నా ప్రారబ్ధం అనుకున్నాగాని, దుఃఖించ లేదు. నీ తండ్రి నా తాతను చంపేస్తే, నా తల్లి పుటె్టడు దుఃఖంతో నన్ను తీసుకుని అడవిదారిన పోతుంటే, మమ్మల్ని దొంగలు దోచారు. తర వాత గంగాతీరాన ఋష్యాశ్రమంలో తలదాచుకున్నాం. వాళ్ళ అనుగ్రహంవల్ల ఇవాళ ఈ స్థితికి వచ్చాం. ఇప్పటికీ కూడా నాకు ఎవరిమీదా ద్వేషం లేదు,'' అన్నాడు.
 
అతని మాటలు విని లీలావతి సిగ్గు పడుతూ, ‘‘నేను వద్దంటున్నా వినకుండా నా తండ్రి నీకు ద్రోహంచేసి,తాను చావటమేగాక, నా కొడుకునుకూడా చంపాడు. నీ తల్లి నా అక్క, నువ్వు నా కొడుకువు! నేను విచారించవలసిన పనేమిటి? నా వాళ్ళు చావటానికి కారణం నువ్వు కాదని నాకు తెలి…ుదా?'' అన్నది. తరవాత సుదర్శనుడు తన మంత్రులచేత ఒక బంగారు సింహాసనం త…ూరుచేయించి, దానిమీద జగదంబను …ుథావిధిగా స్థాపించి, రోజూ పూజిస్తూ, పట్టాభిషేకం చేసుకుని, సుఖంగా చాలాకాలం రాజ్యం చేశాడు.

No comments:

Post a Comment