Monday, September 3, 2012

విష్ణు కథ - 2

సత్యవ్రతుని మాటలు విని చేప సముద్ర మధ్యానికి చేరి, మహాపర్వతంలాగ సాగరం పొడవునా పెరిగి, ‘‘సత్యవ్రతా! నీ వాక్కు అమోఘంగా పని చేసింది. చూశావా! ఇంకా పనిచేస్తూనే ఉంది. ఇలా ఇంకా, ఇంకా పెరిగిపెరిగి ఏమైపోతానో!'' అన్నది. అప్పుడు సత్యవ్రతుడు రెండు చేతులెత్తి మ్రొక్కుతూ, ‘‘మత్స్యరూపంలో ఉన్న ఓ నారా…ుణుడా! రక్షణ కోరుతున్నటే్ట వచ్చి, నన్ను రక్షంచడానికే మత్స్యావతారం ఎత్తావు.

నీ లీలలు తెలుసుకోవడానికి నేనేమాత్రం!'' అంటూ ఎన్నో విధాల స్తుతించాడు. అప్పుడు మత్స్యావతారంలో ఉన్న విష్ణువు, ‘‘ఓ రాజా! ఏడు దినాలకు కల్పాంతం కాబోతున్నది. ప్రళ…ు జలాల్లో అంతా మునిగిపోతుంది. జ్ఞానం, ఓషధులు, విత్తులు నశించకూడదు. ముందొచ్చే కల్పానికి అవి లేకపోతే ఎలాగ? అందుచేత అవి రక్షంపబడాలి. నీ కోసం పెద్ద నౌక గాఢాంధకారంలో దీపంలాగ వెలుగుతూ వస్తుంది.

అందులో సప్తర్షులు ఉంటారు, ఆ వెలుగు వారిదే! ఓషధుల్నీ, విత్తనాల రాసుల్నీ, నీతో బాటు నౌకలోకి చేర్చు! నా మీద ఉండే కొమ్ము చివరతో, మీరుండే నావను పట్టి ఉంచి మునిగిపోకుండా అన్ని విధాలా నేను రక్షంచుతూ, ఉంటాను. అందుకే నేను ఇలాగ అవతరించాను. బ్రహ్మ మేల్కాంచేవరకూ నావ ధ్రువుణ్ణి దిక్సూచిగా పెట్టుకొని ప…ునిస్తూంటుంది.

రాబోయె కల్పంలో నువ్వు వైవస్వతుడు అనే పేరున మనువుగా ఉంటావు!'' అని ఆదేశించాడు. సత్యవ్రతుడు విష్ణువు ఆనతిని తల దాల్చి వినమ్రుడై మ్రొక్కాడు. మత్స్యావతారం నాలుగు రెక్కలు ఊపుతూ, తోకతో త్రుళ్ళగొడుతూ, ఉవ్వెత్తున లేస్తున్న కెరటాలను చీల్చుకొని, సముద్రంలోకి వెళ్ళింది.

బ్రహ్మ మంచి నిద్ర తీస్తున్నాడు. అంధకారంలో విల…ుకాండ జరుగుతూన్నది. హ…ుగ్రీవుడు అనబడే సోమకాసురుడు తలాతలం నుండి సముద్రం మీదకు వచ్చి, గబ్బిలంలాగ బ్రహ్మ ఉండే సత్యలోకానికి ఎగిరాడు. నిద్ర వచ్చి బ్రహ్మ ఆవులిస్తున్నప్పుడు, అతని నాలుగు ముఖాల నుండి తెలుపు, ఎరుపు, పసుపు, నీలం రంగుల్లో ప్రకాశిస్తున్న నాలుగు వేదాలు వెలుపలికి వచ్చి పక్కనే పడి ఉన్నాయి.

హ…ుగ్రీవుడు వాటిని తస్కరించుకొనిపోయి, సముద్రం అట్టడుగు శిలల పొదల్లో దాచాడు. హ…ుగ్రీవాసురుడు దేవతలకు, విష్ణువుకు ప్రబల విరోధి. వేదాలు లేకుండా బ్రహ్మ సృష్టి చే…ులేడు. కల్పకల్పానికి మంచినీ, ప్రగతినీ పెంపొందించాలనే విష్ణువు సంకల్పం చెడగొట్టడమే వాడి ఉద్దేశం. ప్రళ…ు సముద్రం భూమిని ముంచుతున్న సమ…ుంలో, ఎదురు చూస్తూన్న సత్యవ్రతుడికి అంధకారంలో దూరంగా చిన్న వెలుగు, చుక్కలా కనిపించి పెద్దదౌతూ సమీపిస్తున్నది; అదే సప్తర్షుల కాంతితో నిండిన నావ!

ఓషధులనూ, నానావిధ బీజ సంపదనూ నౌకలోకి చేర్చి సత్యవ్రతుడు అత్యంత భక్తితో నారా…ుణ సంకీర్తనం చేస్తూ నావలో ప్రూయాణిస్తున్నాడు. మత్స్యావతారం ముక్కుపై నిలువుగా పెద్ద కొమ్ము ఉంది. నక్షత్రంలాగ మెరుస్తున్న ఆ కొమ్ము చివరను చుట్టుకొని ఒక మహాసర్పం పెద్ద త్రాటితో కట్టినట్లు ఓడను కలిపి పట్టుకొని, పడగవిప్పి ప్రళ…ు ప్రభంజనాలను పీల్చి దిగమ్రింగుతూన్నది. మత్స్యావతారం తన రెక్కలతో కెరటాలను తూలగొడుతూ సముద్రాన్ని చీల్చుకొని, నావను భద్రంగా తీసుకెళుతూన్నది.

ధ్రువతార గుర్తుగా నౌక పువ్వులాగ తేలుతూ పుయనిస్తూన్నది. సముద్రం అడుగున దాచిన వేదాలను కాపలా కాస్తూ సోమకాసురుడు సముద్రం లోపల తిరుగుతున్నాడు. నాలుగు వేదాలు నలుగురు శిశువులుగా మారి క్యారు మంటూన్న ఆర్తనాదం లీలగా వినవస్తున్నది. మత్స్యావతారం వేదాలను వెతుకుతూ వెళ్ళింది. మహామత్స్యాన్ని చూసి సోమకాసురుడు భీతిల్లుతూనే మొండిధైర్యంతో ముళ్ళగద నెత్తి ఎదుర్కొన్నాడు.

అప్పుడు విష్ణువు నడుము వరకు మత్స్యంగా చతుర్బాహువులతో అవతరించాడు. మత్స్యమూర్తికీ, సోమకాసురుడికీ ఘోరసంగ్రామం జరిగింది. సోమకాసురుడు సముద్రం అట్టడుగు చేరి పారిపోతూంటే విష్ణువు చక్రం ప్రెూగించి వాణ్ణి ముక్కలు ముక్కలుగా నరికి హత మార్చాడు. విష్ణువు పసిబిడ్డల రూపంలో ఉన్న వేదాలను ఎత్తుకొని, ఇద్దరేసి పిల్లల్ని చెరో సందిట చేర్చుకొని నీటి మీదికి వచ్చాడు.

పిల్లలు విష్ణువు కంఠహారంలోని శ్రీవత్స, కౌస్తుభ మణులను చిట్టి చేతులతో ఆడుకుంటూ కిలకిలా నవ్వుతూ కేరింతాలు కొడుతున్నారు. నలుగురు పిల్లలూ తెలుపు, ఎరుపు, పసుపు, నీలం కాంతితో మెరుస్తున్నారు. విష్ణువు మీది చేతుల్లో శంఖచక్రాలు దివ్య తేజస్సుతో ప్రకాశిస్తున్నవి. విష్ణువు మత్స్యావతార మూర్తిని చూసి ఋషులు, సత్యవ్రతుడు మహదానందంతో మైమరిచి చేతులెత్తి మ్రొక్కుతూ స్తోత్రం చేశారు.

ప్రళ…ు సముద్రం శాంతించి భూభాగం ఏర్పడుతూన్నది; నౌక క్రమంగా గమ్యం చేరుకొంది. బ్రహ్మకు పగటి ప్రమాణం ఎంతో రాత్రీ అంతే. అతని నిద్రాకాలం పూర్తికావస్తున్నది. సరికొత్త కల్పం ఆరంభమౌతూన్నది. సరస్వతీదేవి ముందుగా లేచి వీణ సవరించి భూపాలరాగాన్ని పలికిస్తూన్నది. బ్రహ్మ మేలుకొని నాలుగు తలల్లో ఏదో కలత, వెలితి అనిపించి పరికించి చూస్తే వేదాలు లేవు!

వేదాలు పోగొట్టుకొని దిగులుగా ముఖాలు వేలాడదీసుకుని విచారిస్తుండగా, విష్ణువు మత్స్యావతారంతో వేదాలను తెచ్చి అతనికి ఇచ్చాడు. బ్రహ్మ విష్ణువు మత్స్యావతార రూపాన్ని కన్నుల పండుగగా తిలకించి చేతులు జోడించి నాలుగు నోళ్ళతో కీర్తించాడు. ‘‘ఓ నారా…యణా! నీ మత్స్యావతారాన్ని ధ్యానించిన వారికి ప్రళ…ుంలాగ విరుచుకు వచ్చిన ఆపదలన్నీ తొలగిపోతవి, అజ్ఞానాంధకారం పటాపంచ లౌతుంది!''

అని బ్రహ్మ అన్నాడు. మత్స్యావతారం ఎత్తిన కార్యం పూర్తిగా నెరవేరింది. విష్ణువు అంతర్థానమై, తన నివాసమైన వైకుంఠాన్ని చేరాడు. బ్రహ్మ వేదాలు తీసుకొని ఉత్సాహంతో సృష్టి మొదలుపెట్టాడు. కొత్త కల్పానికి వివస్వంతుడనే పేరున ఉదయించిన సూర్యుడికి పుత్రుడుగా సత్యవ్రతుడు శ్రార్ధ దేవుడు-వైవస్వతుడు అనే పేరున మనువైనాడు.

సప్తఋషులు ఆకాశానికి చేరుకొని తమ తమ స్థానాల్లో సప్తర్షిమండలంగా ప్రకాశిస్తూ ధ్రువునికి ప్రదక్షణం చేస్తూ, తిరగసాగారు - అని సూతుడు చెప్పగా మునులు, ‘‘సూత మునీంద్రా! ధ్రువుని చరిత్ర వినగోరుతున్నాము!'' అన్నారు. సూతుడు ఇలా చెప్పసాగాడు: ఈ మహా విశ్వంలో ఉన్నతోన్నతమైన స్థానమే ధ్రువమండలం. అదే విశ్వస్వరూపుడైన విష్ణు శిరస్సుండే తావు.

అంతటి అత్యున్నత పదాన్ని పొందిన ధ్రువుడు ఉత్తానపాదుడు అనే రాజు కొడుకు. ధ్రువుడి తల్లి సునీతి ఉత్తానపాదుడి పెద్ద భార్య, సురుచి చిన్న భార్య. రాజుకు చిన్న భార్య సురుచి మీద మక్కువ ఎక్కువ. ఒకనాడు ఉత్తానపాదుడు సురుచికొడుకు ఉత్తముణ్ణి తన తొడపై కూర్చో బెట్టుకొని ముద్దుచేస్తుండగా, ధ్రువుడు అక్కడకు వచ్చి, తాను కూడా తండ్రి తొడపై కూర్చోవాలని తండ్రి దగ్గిరగా చేరి ఎంతో ఆశతో చూశాడు. సురుచి అక్కడే ఉన్నది.

రాజు ఆమెకు జడిసి ధ్రువుణ్ణి చూసీచూడనట్టు ఊరుకున్నాడు. తమ్ముణ్ణి కూర్చోబెట్టుకొన్నటే్ల తండ్రి తన్ను కూడా ఎత్తి కూర్చోబెట్టుకుంటాడని ఆశించిన ధ్రువుడు బిక్కమొహం వేసి గుడ్ల నీరుపెట్టుకొన్నాడు. పసివాడి బుగ్గలపై కన్నీటి ముత్యాలు మెరిశాయి. అది చూసి సురుచి ఫక్కున నవ్వి, ‘‘దిక్కుమాలిన దానికి పుట్టినవాడా! నువ్వు ఎంత తపస్సుచేసినా, నా కొడుకుతో సమానంగా తండ్రి తొడ మీద కూచునే ెూగం నీకు అబ్బదురా, అబ్బీ!

నా కడుపున పుట్టాలి; నీకా భాగ్యం కలగాలి! అంతే! అన్నట్టు నువ్వు మహా గొప్పగా నారా…ుణ సంకీర్తనం చేస్తూంటావేమో, తపస్సు చేసి, ఆ భాగ్యం కల్గిస్తాడేమో ఆ నారా…ుణుడినే అడిగి చూడు,'' అని హేళన చేసింది. పసివాడి మనస్సు కుతకుతలాడింది; దుఃఖం పెల్లుబికింది, ఉక్కురోషం ముంచుకొచ్చింది. కొరడా తీసుకొని సురుచిని చావబాదాలనిపించింది. కత్తితో నిలువునా చీరె…్యూలనిపించింది. మరుక్షణంలోనే సురుచి, ‘‘నా…ునా! నారా…ుణుడిని నమ్ముకో! తపస్సు చెయ్యి,'' అని ఉపదేశించిన, సద్గురువులాగ కనిపించింది.

అంతటి మహత్తరమైన ఉపదేశానికి నోచుకోని ఉత్తముడు అభాగ్యుడైన వఠ్ఠి అమా…ుకుడిలాగ కనిపించాడు. ఉత్తాన పాద మహారాజు చీకటివలలో చిక్కుకొని బిక్కుబిక్కుమంటున్న దుప్పిలాగ కనిపించాడు. ధ్రువుడు సురుచికి గురూపదేశం పొందిన శిష్యుడిలాగ నమస్కరించి, అక్కడినించి వెళ్ళాడు.

ధ్రువుడి చేష్ట అర్థం కాని సురుచి మొదట నివ్వెర పోయింది. తరవాత, ‘‘కుర్రాడు మంచి వాడే! నాలుగు తిట్టినా మ్రొక్కుతూ వెళ్ళాడు, ఐనా మ్రొక్కకేం జేస్తాడు, నా ఎదట నోరు మెదపడం వాడి తరమా? వాడి తల్లి తరమా?!'' అని అమితగర్వంగా తనలో తాను విపరీతంగా పొంగిపోతూ సరిపెట్టుకుంది. కన్నీటి చారలతో వచ్చిన ధ్రువుణ్ణి చూసి జరిగింది దాసీలవల్ల విన్న సునీతి బావురుమంటూ, ‘‘ఔను, నా…ునా!

దాసీ దానికన్న హీనంగా బతుకుతున్న నా కడుపున ఎందుకు నువ్వు పుట్టాలి? నలుగురెదుట అవమానపడాలి? నీ సవతి తల్లి మాటలు ముమ్మాటికీ నిజం, నీకూ నాకూ ఆ నారా…ుణమూర్తి తప్ప వేరే దిక్కులేదు!'' అన్నది. ఆ మాటలకు ధ్రువుడు ధైర్యంగా లేచి నిలబడి, ‘‘అమ్మా! నేను తపస్సుకు వెళ్తున్నాను!'' అన్నాడు. ‘‘ఏమిటీ! తపస్సు చేస్తావా? సురుచి కడుపున పుట్టాలని వరంకోరుకో!'' అన్నది సునీతి. ‘‘అమ్మా, ఆగు!

మళ్ళీ ఆ మాటే అనకు; నేను నీ కొడుకును. మరెవరికో కొడుకునై పుట్టాలని ఎందుకు కోరతాను? మనల్ని మనం తక్కువ చేసుకోకూడదు. అది ఆత్మహత్యతో సమానం. ధ్రువుడి తల్లి ఎంత భాగ్యశాలి అనేలాగ, దిక్కులకు దిక్కుగా ఉండేలాగ నారా…ుణుణ్ణి కోరుకుంటాను, వస్తాను!'' అని చెప్పి ధ్రువుడు బ…ులుదేరాడు. నారదుడు ఎదురుగా వస్తూ, ‘‘ఓ హెూ, ధ్రువకుమారా! ఆడుకోడానికి బ…ులుదేరినట్టుంది, ఔనా?'' అన్నాడు.

‘‘తపస్సుకు వెళ్తున్నాను, స్వామీ!'' అన్నాడు ధ్రువుడు. ‘‘తపస్సు అనే ఆట ఒకటి ఉందన్న మాట, అలాగే చక్కా ఆడుకో నా…యనా!'' అన్నాడు నారదుడు. ‘‘ఆటకాదు. నిజంగానే శ్రీమన్నారా…యణుణ్ణి గూర్చి తపస్సు చే…ుడానకి వెళుతున్నాను. మునీంద్రా,'' అన్నాడు ధ్రువుడు. ‘‘అలాగా! ఇంత పసిప్రా…యoలో ఏమికోరి తపస్సు చేయబోతున్నావు?'' అని అడిగాడు నారదుడు ఆశ్చర్యంగా.

‘‘మా తండ్రి తొడ మీద కూర్చోబోతే, మా సవతి తల్లి అడ్డుపడి హేళనగా మాట్లాడింది,'' అంటూ జరిగింది వివరించాడు ధ్రువుడు. ‘‘అదా సంగతి, ఓష్‌! ఈమాత్రం దానికి తపస్సెందుకోయి ధ్రువా! నాతో రా, నీ తండ్రి నిన్ను తొడ మీద ఎందుకు కూర్చోబెట్టుకోడో చూస్తాను!'' అన్నాడు నారదుడు. ‘‘ఎవరి ద…యాధర్మాలూ నాకు వద్దు, స్వామీ! అన్నిటికంటె ఉన్నతమైన నారా…యణుని అనుగ్రహం నాకు కావాలి!

అందుకే తపస్సు చేుయడానికి వెళ్తున్నాను!'' అన్నాడు ధ్రువుడు. ‘‘తపస్సంటే మాటలు కాదు, నా…ునా! అరణ్యంలో పులులు, సింహాలు మొదలైన క్రూర మృగాలుంటాయి. ఎండా వానా చలీ అన్నీ బాధగానే ఉంటాయి. నా మాట విను, తిరిగి ఇంటికి పద!'' అన్నాడు నారదుడు. నారదుడి మాటలకు ధ్రువుడు, ‘‘నేను క్షత్రిుయుణ్ణి, పరాభవం సహిస్తూ బతకలేను. నాకు పిరికిమందు నూరిపో…యడానికివచ్చారా, స్వామీ?'' అన్నాడు వినుయoగా. ‘‘నా…యనా, ధ్రువా! నీ దీక్ష తెలుసుకోడానికే అలాగ అన్నాను.

ఒకప్పుడు నేను కూడా దిక్కులేని బాలుడనై ఎన్నెన్నో అవమానాలూ, అగచాట్లూ పడి అడవి చేరి తపస్సు చేసినవాడినే! నువ్వు మధువనానికి వెళ్ళి, ‘ఓం నమో నారా…ుణ' అని జపిస్తూ తపస్సుచెయ్యి. నిన్ను ఆశీర్వదిస్తున్నాను, కృతార్థు డివై రా!'' అని నారదుడు అన్నాడు-ధ్రువుడు ఉత్సాహంగా మధువనం కేసి నడవసాగాడు, అని సూతుడు చెప్పగా విన్న మునులు, ‘‘మునీంద్రా! నారదుడు ఎందుకు అగచాట్లు పడ్డాడు? నారదుడి వృత్తాంతం వినాలని కుతూహలంగా ఉంది!'' అన్నారు.

No comments:

Post a Comment