Monday, September 3, 2012

విష్ణు కథ -1


పాలసముద్రంలో ఉన్న త్రికూట పర్వ తానికి ఇనుము, వెండి, బంగారాల మూడు శిఖరాలు; ఆ శిఖరాల నడుమ ఫలవృక్షాలతో నిండిన మహారణ్యం. ఆ వనంలో గజేంద్రం అనే మదపుటేనుగు తన భార్యలైన దశలక్షకోటి ఆడ ఏనుగులతో విహరిస్తూ దాహం తీర్చుకోడానికి మహావనం మధ్యనున్న సరోవరానికి బ…యలుదేరింది.

దాహం తీరాక జలవిహారంపై బుద్ధిపుట్టి, తన ఆడ ఏనుగులతో సరోవరాన్ని అల్లకల్లోలం చేస్తూ విజృంభించి జలకేళిలో లీనమై ఉన్న గజేంద్రాన్ని, గొప్ప మొసలి కోరలు గుచ్చి ముందరి కాలొకటి పట్టుకొన్నది. బాధతో గజేంద్రం చేసిన ఘీంకారానికి ఆడ ఏనుగులు బెదిరి చెల్లాచెదరుగా సరోవరం చుట్టూరా ఒడ్డు చేరుకొని, గజేంద్రం పడుతూన్న బాధ చూసి ఏడుస్తూ నిలబడాేు్డగాని, మొసలి పట్టునుండి ఎలా తప్పించాలో వాటికి తోచలేదు.

గజేంద్రం మొసలి బారినుంచి తప్పించుకోడానికి ఎన్ని ప్రయుత్నాలు చె్యాలో అన్నీ చేస్తూ తల్లడిల్లిపోసాగింది. ఏనుగులు శోకాలు పెడుతూనే, ఆకలి తీర్చుకుంటూ, వేరే జలాశ్ర…యాలకు వెళ్ళి నీరు తాగి వస్తూపోతూ సరోవరం చుట్టా తిరుగుతూ కన్నీరు కారుస్తున్నాయి.

సరోవరంలో నిర్విరామంగా కరిమకరాల పోరాటం సాగుతూనే ఉన్నది. ఏనుగు దంతాలతో మొసలిని పొడిచేది. మొసలి ఎగిరి మీదపడి ఏనుగు శరీరమంతా రక్తధారలు కారేట్లుగా వాడిగోళ్ళతో బలంగా రక్కేది. ఏనుగు తొండంతో మొసలి వీపు బాదేది, మొసలి కరుకుల తోకతో ఏనుగును ఎడాపెడా కొటే్టది.

ఏనుగు మొసలి మీద పడి నాలుగు కాళ్ళతో కుమ్మే…యాలని చూస్తే, మొసలి నీటి అడుగున దాగి ఉండేది. ఏనుగు ఎంతకూ మొసలి జాడ లేకపోవడం చూసి ఒడ్డు చేరబోతూంటే, తటాలున మకరం ఏనుగును పట్టుకొని లాక్కుపోయి నీట ముంచేది. అలాగ ఎన్నిసార్లో ఏనుగును ముప్పతిప్పలు పెట్టింది. ఏనుగుకూ మొసలికీ నిర్విరామంగా పోరాటం వెయ్యి సంవత్సరాలు సాగింది.

గజేంద్రం స్వశక్తిని నమ్ముకొని ఎంత సాహసించి పోరాడినా క్రమక్రమంగా శక్తి సన్నగిల్లింది. మొసలి జలగ్రహం! నీటిలో దాని బలం ఎక్కువ. ఏనుగు రక్తం పీలుస్తూ అది మరింత బలంతో బాగా ఒళ్ళు పెంచింది. మొసలి పట్టునుంచి మోక్షం పొందడం మరింక దానికి సాధ్యం కాదు! ‘‘దాహం తీర్చుకోడానికి ఈ సరోవరానికి నేరక వచ్చాను. దాహం తీర్చుకొని వెళ్ళిపోకుండా సరస్సులో ఎందుకు దిగాను? నా పాడుబుద్ధే నన్ను మొసలికి పట్టి ఇచ్చింది!''

అంటూ గజేంద్రం చింతించరసాగింది. ‘‘నన్నెవరు రక్షస్తారు? ఎవరిని పిలవాలి? నన్ను నేను రక్షంచుకోలేని స్థితిలో ఉన్నా, నా మనస్సులో ఏ మూలనో నేను కాపాడబడగల అవకాశం ఏదో ఉన్నదనే ఆశ! ఆ ఆశవల్లనే రక్షణ కోరుకుంటున్నాను! అంటే నా ఆశకు ఆధారం ఏదో ఉండి తీరాలి! అదే దేవుడని పిలుస్తున్నాను! దేవుడు, భగవంతుడు, ఈశ్వరుడు అనే భావనకు ఆదిమూలమైన ఓ దేవుడా! కారణాలన్నిటికీ నువ్వే కారణానివి! నాలాంటి మదగర్వితులైన మంద మదమతి జీవులు ఆపద రానంతవరకు నిన్ను తలవరు!

బాధపడితేనేగాని నీ అవసరం బోధపడదు. ఉన్నాడు ఉన్నాడు అనేవాడు ఉన్నాడో, లేడో అనే ఆందోళన పడందే నువ్వు కనిపించవు!'' అని పరిపరి విధాల చింతనలోపడ్డ గజేంద్రానికి మొసలి పెడుతున్న బాధ కొంత తగ్గినట్లు అయింది. ఎప్పుడైతే గజేంద్రుడు చింతన మొదలు పెట్టాడో, ఆ క్షణంలోనే మొసలి కోరల కుదుళ్ళలో సలుపు పుట్టింది. గుండెదడ చురుక్కుమనిపించింది. అయినా అది మరింత రోషంతో గజేంద్రం కాలిని నొక్కి, నొక్కి పిప్పి చేస్తూనే ఉన్నది. ‘‘జీవుల చెడ్డనూ, బాధనూ హరించే వాడివి! అంతటా ఉండేవాడివి, వ్యాపిస్తూనే ఉండేవాడివి!


దేవుళ్ళకు మూలమైన దేవుడా! ఈ జగత్తు జనించే హేతువుకు నువ్వే మూలహేతువు! నన్ను రక్షంచమని ఎంత బలంగా నిన్ను కోరుతానో అంత వేగంగా నన్ను నీవు రక్షంచుతావని నమ్ముతున్నాను, రక్షంచితీరగలవు! అన్నీ నువ్వే అవుతూ మాటకూ, మనస్సుకూ అందనివాడివిగా ఉండే ఓ సర్వేశ్వరుడా! నాలాంటి దీనులను ఆదుకునే బాధ్యత నీదే కదా!

జీవశక్తులన్నీ నశించిపోయిన నాలో, ఇప్పుడు కన్నీరు హరించిపోయింది. నిన్ను ఎలుగెత్తిపిలవలేను సరికదా, నా నుంచి చిన్న మూలుగు కూడా రాదు, స్పృహ కూడా తప్పుతున్నది. నన్ను రక్షంచినా మానినా అంతా నీ ఇష్టం! నీవు తప్పితే నాకు ఇంకేదిక్కూ, ధ్యాసా లేదు!'' అంటూ గజేంద్రుడు శక్తినంతా కూడదీసుకొని తొండాన్ని ఎత్తి పిలుస్తున్నట్లుగా తిన్నగా చూశాడు. మొసలికి మెల్లమెల్లగా బలం తగ్గిపోతున్నదని పించింది, నోరు జారుతున్నట్లు, చేతులు ఆడనట్లు కంఠం బిగుసుకుంటున్నట్లు తోచింది.

తాను ఉన్నదీ లేనిదీ తెలి…ుని స్థితిలో ఏనుగు కళ్ళు మూత పడుతూంటే, అలాగే ఏమాత్రం చలనం లేకుండా ఉండిపోయింది. అప్పుడు విష్ణువు వచ్చాడు. ఆకాశమంతా అతని రూపంతో నిండి పోయింది. తానొక సూక్ష్మమైన అణువును అని గజేంద్రానికి అనిపించింది. వస్తూనే విష్ణువు చేతనున్న చక్రాన్ని విడిచాడు. అభ…ుముద్రగా పతాక హస్తం పట్టాడు. ప్రచండ వేగంతో గిర్రున తిరుగుతూ వచ్చి విష్ణుచక్రం మొసలి తల నరికింది.

మొసలి ఒక గంధర్వుడు, హుహూ అనేది అతడి పేరు. దేవలుడు అనే ఋషి నీటిలో నిల్చుని ఉండగా నీటిలోంచి కనపడకుండా వెళ్ళి మొసలిలాగ, ఋషి కాలు పట్టుకున్నాడు. ఋషి ఆ గంధర్వుణ్ణి మొసలిగా పడి ఉండు అని శపించాడు.

విష్ణు చక్రంతో ఆ శాపం తీరింది. మొసలి బారినుంచి విముక్తి పొందిన గజేంద్రాన్ని సరస్సు నుంచి వెలుపలకు లాగి విష్ణువు అరచేత్తో దాని కుంభస్థలాన్ని ఆప్యా…ుంగా నిమిరాడు. దేవదేవుడి ఆ స్పర్శకు గజేంద్రం పోయిన జవసత్వాల్నీ, శరీరపుష్ఠినీ తిరిగిపొందింది. తన పూర్వజన్మ జ్ఞానం కూడా కలిగింది. గజేంద్రం వెనకటి జన్మలో విష్ణుచింతనా తత్పరుడైన ఇంద్ర ద్యుమ్నుడనే మహా రాజు.

విష్ణుధ్యానంలోవున్న అతను అగస్త్య మహర్షి రాకను గమనించలేదు. ఋషి కోపగించి మదగజమై పుట్టుదువు గాక అని శపించాడు. ఆ రాజే గజేంద్రంగా పుట్టి మోక్షణపొందాడు. గజేంద్రమోక్షణ కథను సూతమహర్షి నైమిశారణ్యంలో జరుగతున్న సత్ర…ూగానికి వచ్చిన శౌనకాదిమునులకు వివరంగా చెప్పాడు. మునులు సూతుడితో, ‘‘మునీంద్రా! గజేంద్రమోక్షణ కథ కేవలం ఒక ఏనుగుకు చెందినదిగా లేదు.

జీవకోటి అంతకూ ముఖ్యంగా అనేక బంధాలతో బాధలో చిక్కుకుని సతమతమే్యు మానవజీవికి వర్తించే కథలాగ వున్నది,'' అని అన్నారు. సూతుడు, ‘‘ఔను, గజేంద్రమోక్షం అంతరార్థంతో కూడినదే! ఎవరు ఎలాగ అన్వయించుకున్నా సరిపోతుంది. కాలం విష్ణువు అధీనంలోనే ఇమిడి వున్నది. కాలచక్ర భ్రమణంలో ఎన్నో సమస్యలూ బాధలూ కష్టాలూ సమసిపోతూంటాయి,'' అని చెప్పాడు.

మునులు, ‘‘మునివర్యా! గజేంద్రమోక్షాన్నిబట్టి కారణకారణుడు, సర్వేశ్వరుడు విష్ణువు అని తెలుస్తున్నది. అటువంటి విష్ణుకథను పూర్తిగా వినాలని ఉవ్విళ్లూరుతున్నాం. నీ ముందు మేము పిల్లలవంటి వాళ్ళం. కనుక విష్ణువును గూర్చిన విశేషాలన్నీ మాకు సులభంగా బోధపడేలాగ వినిపించ ప్రార్థిస్తున్నాం. వ్యాసమహర్షి వలన సమస్తపురాణాలనూ ఇతిహాసాలనూ, వాటిలోని విశేషార్థాలనూ ఎరిగిన నీవు ఒక్కడివే మమ్మల్ని కృతార్థుల్ని చేయగలవు!'' అని అన్నారు.

సూతుడు వారి మాటలకు ఎంతగానో సంతసించి, ‘‘అలాగే విందురుగాని. వ్యాసమహర్షి విష్ణువును గురించిన అనేక లీలావతార విశేషాంశాలతో ప్రత్యేకంగా మహాభాగవతాన్ని రచించి, తనకుమారుడైన శుకునికి బోధించాడు.

విష్ణుకథను విని తరింపగోరిన పరీక్షత్తు మహారాజుకు శుకెూగి దాన్ని చెప్పాడు. గజేంద్రాన్ని రక్షంచ వచ్చిన విష్ణువు అవతరణ ‘ఆదిమూలావతారం' అని పేర్కొనబడింది. విష్ణువు అనేక అవతారాలు ఎత్తాడు. వాటిలో పరిణామ దశలను అనుసరించే దశావతారాలు అనబడే పది అవతారాలు ముఖ్యమైనవి. నారము అంటే నీరు. నీటికి మూలమైనవాడు కనుకనే విష్ణువు నారా…యణుడైనాడు.

నారాయణుడి నుంచి నీరుపుట్టింది. నీటినుంచి జీవం పుట్టింది. విష్ణువు జలచరమైన చేపగా అవతరించాడు. అదే మత్స్యావతారం! విష్ణువు దశావతారాల్లో మత్స్యావతారం మొదటిది. విష్ణువు నీటితో నిండిన నీలమేఘం రంగులో ఉంటాడు. మేఘంలో మెరుపువున్నటే్ట విష్ణువు తేజోమయుడు. అతని నుంచి వచ్చిన జలం కూడా తేజస్సుతో నిండి తెల్లని వెలుగు చిమ్ముతూంటుంది. ఆ జలమే కారణోదక క్షరసాగరం!

క్షరసాగరంలో అనంతమైన కాలం శేషసర్పం రూపంతో చుట్టలు చుట్టకొని ఉంటుంది. శేషువుకు వెయ్యి పడగలు. చివర అంటూలేని శేషువుపై శేషశాయిగా విష్ణువు పవ్వళించి వుండగా, అతని బొడ్డు నుంచి నాళంతో గొప్పపద్మం పైకిలేచింది. ఆ పద్మంలో బ్రహ్మ ఆవిర్భవించాడు. బ్రహ్మ అన్నిటినీ సృజించాడు. అనంతమైన కాలం …యుగాలుగా సాగుతూంటుంది. కృత-త్రేతా-ద్వాపర-కలియుగాలు కలిసి ఒక మహా…యుగం.

వెయ్యి మహా…యుగాలు కలిసి ఒక కల్పం. కల్పం బ్రహ్మకు ఒక పగలు. పగలు పూర్తికాగానే అతనికి నిద్రముంచుకొస్తుంది. అదే కల్పాంతం. అప్పుడు అంతటా గాఢాం ధకారం అలుముకొంటుంది. విష్ణువు నుంచి వెలువడిన సంకర్షణాగ్ని వేడిమి అన్నిటినీ మాడ్చివేస్తుంది. పెనుగాలులు వీస్తుంటే కారుమేఘాలు గుంపులు గుంపులుగా ఏనుగుతొండాల్లాంటి జలధారలు ఎడతెరిపి లేకుండా కురుస్తాయి.

మహాసముద్రం ఆకాశాన్నంటి పొంగుతుంది. భూ, భువర్‌, స్వర్లోకాలు మునిగి పోతాయి. ఎటు చూసినా జలబీభత్సం తప్పితే మరేమీవుండదు. ఆ విధంగా ప్రళయo. సంభవిస్తుంది. బ్రహ్మ నిద్రపోేు రాత్రి అంతా మహా ప్రళ…ుకాలం! అది కల్పాంతం దగ్గిరవుతూన్న సమ…యo: సత్యవ్రతుడు అనే రాజర్షి నదిలో స్నానం చేసి నారా…ుణ ధ్యానం చేసి, అర్ఘ్యం ఇవ్వబోయేటప్పుడు, అతని దోసిట్లోకి బంగారం రంగులో వున్న చిన్న చేప వచ్చింది.

సత్యవ్రతుడు దాన్ని నదిలో విడిచిపెట్ట బోతూంటే, ఆ చిన్నారి చేప, ‘‘ఓ రాజా! మా చేపజాతి మంచిదికాదు. చిన్న చేపల్ని పెద్ద చేపలు మింగేస్తాయి. వాటి నుంచి తప్పించుకున్నా, జాలర్లు వలపన్ని పట్టి చంపుతారు. అందుచేత, నీ రక్షణకోరి నీ దోసిలిలోకి వచ్చాను, నిర్ద…యగా నన్ను విడిచిపెట్టకు!'' అని పలికింది. సత్యవ్రతుడు చేపను తన కమండలంలో వుంచి తన నగరికి తీసుకువెళ్ళాడు.

సత్యవ్రతుడు మహారాజుగా రాజ్యపాలన చేస్తూనే గొప్ప తపస్సుచేసిన రాజఋషి. నిరంతర విష్ణుభక్తితత్పరుడు, గొప్ప జ్ఞానసంపన్నుడు. కమండలంలో ఉంచిన చేపపిల్ల, మర్నాటికే నిండుగా పెరిగి అందులో ఇమడలేక ఉక్కిరి బిక్కిరవుతూ, ‘‘రాజా! నన్ను ఇందులోంచి తీసి, కాస్త పెద్ద చోటులో చేర్చు!'' అంటూ ఆర్తనాదం చేసింది. ఆ చేపను పెద్ద నీటి తొటె్టలో విడిచిన కొద్దిసేపటికే చేప ఎదిగి అది కూడా చాలకపోగా, సత్యవ్రతుడు దాన్ని చిన్న మడుగులో వేశాడు.

చేప పెరిగిపోతూనే ఉంది. మడుగు నుంచి పెద్ద సరోవరానికీ, సరోవరం నుంచి మహాజలాశ్ర…ూనికి చేర్చినా, అలా పెరిగిపోతున్న మహామత్స్యాన్ని సముద్రానికి చేర్చగా, ‘‘ఓ రాజర్షీ! నీ రక్షణ కోరిన నన్ను సముద్రంలో వదిలిపోతావా? ఇది న్యా…యమేనా? మొసళ్ళు, తిమింగిలాలు నన్ను మింగవా?'' అని మత్స్యం నిలదీసి అడిగింది. సత్యవ్రతుడు, ‘‘ఓ మహామీనమా! ఇంతకంటే నేను చే…యగల్గిందేముందో నువ్వే చెప్పు! క్షణానికి శత ెూజనాలు పెరిగేలా ఉన్న నిన్ను ఏదీ మింగలేదు కదా!'' అన్నాడు.

No comments:

Post a Comment