Thursday, September 6, 2012

లక్ష్మీ కుభేర వ్రతకథ


                                                 
             


మొదటి అధ్యాయము 
            వింధ్య పర్వత ప్రాంతాన మహావృక్ష లతాడులతో విరాజిల్లుచున్న నైమిశారణ్యమను ఒక మహారన్యము గలదు.  అందు తపోసంపన్నులు, మహామునులు, పురాణ పండితులు నిత్యం సంచరిన్చుసున్దేదివారు.  ప్రతినిత్య పురాణ శ్రవణములు  నిర్వహించుచూ  , రాబోవు కాలగతి, గురించి శౌనకాది మహర్షులందరూ, నిత్య యాగములు నిర్వహించుకొని ప్రస్తుత విషయ చర్చ కొరకు పురాణ ప్రసిద్దుడగు సూత మహర్షిని విధి విదానముగా నాహ్వానించిరి.  ఆతిధ్య మర్యాదలిచ్చి సభావేదిక మీద అలంకరింప జేసి సూతుల వారిని ఈ విధముగా ప్రశ్నించిరి.  

             ఓ సూత మహర్షీ!  మానవలోకమందు జనుల వుపద్రవములను పోగొట్టుకొనుటకు భార్యాభర్తల అన్యోన్య అనురాగాములతో సౌభాగ్య సంతతిని పొందుటకు, దారిద్ర్య బాధల నివారణకు దైవానుగ్రహమును పొందుటకు, ఏదైనా ఒక వ్రాతమున్నచో సెలవివ్వండి అని కోరిరి.   అంతట సూతులవారు తన దివ్యదృష్టితో  ఆలోచించి ఓ తపోధనులారా!  నేను చెప్పినది ప్రశాంత చిత్తులై వినుడు.  మీరు ధన్యజీవులై ఉంది పరులను తరింప జేయు ఒకానొక పవిత్రమైన కుభేర వ్రత విధానము చెప్పుచున్నాను వినుము.

              కలియుగమునందు ఒకానొక వైశ్య కులజుడు పవిత్రవంతుడై, యజ్ఞయాగాది విధులను ఎంతో భక్తి శ్రద్దలతో  విదులాచరించుచూ ఉండెను.  అతనికి కలిమిలేములు కావడి కుండలవలె నున్దేడివి.  ఏ రోజున కెంత ధనము కావలేయునో అంట మాత్రమె ధనము అనుకోనకుండా పొంది, జీవనము చేయుచుండెను.  అతని కోరిక మేర ధనము లభించక నానా విధ కష్టములను అనుభవించుచూ పురాణ వాజ్మయ విధానమును చదువ నారంభించెను.  కొన్ని దినములకు ధనప్రాప్తి  రూపమగు కుభేర వ్రత విధానమును, ధనలక్ష్మిదెవి అనుగ్రహ విధానము గాంచెను.  తాను గాంచిన విధివిధానా సహితముగా వ్రతాదుల నాచరించి, ఇహపర సౌభాగ్యార్ధ పుత్రపౌత్రికాది రాజవంతుడై, కడకు దైవత్వము లీనమైనట్లు ఉండెను.  అతని కథను, అతడు ఆచరించిన కుభేర వ్రాతవిదానమును, ధనలక్ష్మి అనుగ్రహమును చెప్పుచున్నాను వినుము.

              కార్తీక మాసమునందు గాని, శ్రావణ మాసమునందు గాని, ఆశ్వీయుజ మాసమునందు గాని ప్రతి గురువారామునందు గాని, ప్రతి శుక్రవారమునందు గాని పంచాంగ శుద్దిగల శుభలగ్నము నందు ఉదయము నందు వ్రతము నారంభిన్చావలేయును.  దంపతులు గాని, ముత్తైదువులైన  స్త్రీలతో వ్రతము నారంభించావలెను.  యీ వ్రతము 11 సార్లు చేసినచో మనోవాంచ శీఘ్రముగా లభించును.  ధనలక్ష్మి అనుగ్రహముతో కుభేర రూపమైన ధనప్రాప్తి గలుగుటకు అత్యంత సులభమైన మార్గమిదే.  

రెండవ అధ్యాయము:
                వ్రత నియమ దినమునకు పూర్వపు రోజున ఉదయం అభ్యంగన స్నానమాచరించి గృహమును నానావిధ రంగవల్లులతో నలంకరించి పూజామందిరాన ఒక పీత వుంచి, దానిపై పసుపు వస్త్రమొక్కటి పరచి, బియ్యముపోసి, ధనలక్ష్మిదెవి సహిత కుభేరుని పటమును దానిపై వుంచి ఒక కలశమును పసుపు, పూలతో అలంకరణము చేసి, టెంకాయ మీద రవిక నుంచి కలశమును స్తాపొంచి పూజించవలెను.  వ్రతము ముగియు వరకు అఖండ దీపారాదనము ఆవు నెయ్యిలో నుండవలెను, ఒక్కపూట మాత్రమె భోజనాడులను చాయవలెను.  చాపమీద మాత్రమె పరున్దవలేయును, ఇయ్యది శుభసూచిక వ్రత దీక్షగా నేరుంగ  వలెయును.

              వ్రత సామాగ్రి నంతయును సిద్దపరచుకొని, తొలుత గానేషుని పూజించి, తదుపరి నవగ్రహాలు దిక్పాలకులను వారి వారి మంత్రములతో నర్చించి, ఒక కలశము మీద ధనలక్ష్మి దేవిని, అష్టోత్తర నామాలతో పూజించవలెను.  పిదప కుభేర దేవునికి (ప్రతిరూపముగా ఒక వెండి రూపాయి నుంచి) లేదా కుభెఅ ప్రతిమకు పంచామృత స్నానాదులను గావించి వ్రత విధానము నందు చెప్పబడిన అష్టోత్తర శతనామాలను చదువుతూ వివిధ పుష్పములతో, అక్షతలతో పూజించి వివిధ రకములైన పిండి వంటకములతో నివేదన చేసినచో కుభేరుడు కరుణించి, లక్ష్మిదెవి ఆనతితో ధనవంతునిగా చేయగలదని పురాణ వచనమై వున్నది.  

               పూర్వము కాంచీపురమున దేవదత్తుడు, దేవదూరుడు అను ఇద్దరు వైశ్యులు కలరు.  వారిలో దేవదత్తుడు మంచి వ్యాపారవేత్త.  సూక్ష్మమైన తెలివిగలవాడు.  దాన ధర్మవంతుడు.  బహు సంతానముతో దారిద్ర్యముతో భాదపడుతూ ఉండెడివారు.  దేవదూరుడు భక్తి లేనివాడు.  మొండి ధైర్యము గలవాడు.  సంతానము భార్య అన్యోన్యత లేనివాడు.  ధనముగాలిగినాను పిసినారితనముతో అత్యాశచే జీవనము చేయు చుందేదివాడు.  

              వారిద్దరూ వ్యాపార నిమిత్తము అనేక గ్రామాలు తిరుగుచూ దేవ వరమనేది గ్రామమునకు చేరిరి.  అచ్చట వ్యాపారము సరిగా జరుగక తిరిగి అలసిపోయి ఒక దేవాలయమున విడిదిగాన్చిరి.  ఆ దేవాలయము మహా విష్ణువు లక్ష్మిదెవి సూర్యాది నవగ్రహములది.  అక్కడ ఆయా దేవార్చనలు సలిపి ముఖ మండప ప్రాంగణమునందు ఇద్దరునూ భోజనాడులను చేసి నిద్రించిరి.  మరునాడు వేకువ జామున నిద్రమేల్కొని కాలక్రుత్యాడులను విర్వహించుకోనగా, నూరు సంవత్సరాలు నిందబోవుచున్న భార్య భర్తలవలె నున్న స్త్రీ, పురుషులు  వచ్చి "నాయనలారా! మీదేవూరు? ఎండు నిమిత్తము ఇచ్చటకు వచ్చితిరి?  రాత్రి ఇచ్చట నిద్రించిరి గదా! మీరు సంతృప్తి పొందినారా?  మీకేమైనా విచిత్రములు గోచరిన్చినవా?  అని అడిగెను.  

           అంతట ఆ వర్తకులు ఇద్దరు ఆ వృద్ద దంపతులకు నమస్కరించి మాది కాంచీపురము.  మేము దారిద్ర్యముచే అనేక బాధలు పడుచూ వ్యాపారము కొరకై ఈ పల్లె వచ్చినాము.  కొద్ది వ్యాపారము చేసినాము గాని ఫలము మాత్రం శూన్యం.  అందుచే దైవసన్నిధి యందు నిద్రించుట మేలని బసగావిన్చినాము.  ఇప్పుడు మరియొక గ్రామము తరలి వెళ్ళు చుంటిమి  అని ఎంతో నిరాశ తో సమాదానమిచ్చిరి.  

మూడవ అధ్యాయము:
              తొందరపదవద్దు, ఇది మహాక్షేత్రము.  ఇందు ధనలక్ష్మిదెవి కరుణచే కుభేరునివడ్డ ధనము మీరు పొందాలంటే, నేను చెప్పిన విధానము ఆచరించినచో శీఘ్రముగా ధన ప్రాప్తి కలుగును.  అని విధానము కూడా చెప్పి అదృశ్యమైనాడు.   అంతట వైష్యులిద్దరు సంతోషముతో అక్కడనే ఉంది వ్యాపారములు చేయుచూ కొంతకాలము ఆ దేవాలయము నందు బస చేస్తూ వృద్ద దంపతులు భోదించిన విధులు తూచా తప్పకుండ ఇద్దరు వ్రతము చేయు చున్నారు.  కాలము గడచిపోవుచున్నది.  ఇంటి దారి వేడుకుచూ ధనముపొందవలేనని ఆశతో వారి భార్య పుత్రుల వద్దకు చేరిరి.  వారి వారి పూర్వ జన్మ సుకృతముచే, వారు ఆచరించిన శ్రీ ధనలక్ష్మి కుభేర వరాదులచే, ఒకనాటి అర్ధరాత్రి పరమ పావన నేత్రియగు ధన లక్ష్మి యొక్క ధనాధిపతి యగు కుభేరుని యొక్క సంపూర్ణ అనుగ్రహము లబించాగా, వారిరువురు స్వప్నమున ధనలక్ష్మి కుభేరులు దీవించి వెళ్ళిరి.  ఆ దీవెనల ఫలితముగా మరునాడు ఉదయం మేల్కొనగానే పై వృత్తాంతమును ఒకరికొకరు తర్కించుకొని, వ్యాపారాదులు చేయుచూ నుండిరి. క్రమేపి ధనవంతులుగా మారి కీర్తి గడిన్చియున్నారు.  కొంతకాలము తర్వాత దేవదూరుడు ఐశ్వర్య మదముచే పిసినారి తనముచే ఆ ధనాకర్షణ శ్రీ లక్ష్మి సహిత కుభేర వ్రతమును మరచినాడు.  వ్రతము ఆచరిమ్పకపోవుట వలన జ్యేష్టా దేవి వచ్చి దేవదూరిని గృహములో తాన్దవించుట ప్రారంభించెను.  ఈ కారణమున దేవదూరుడు శ్రీ లక్ష్మి కుభేర దేవతా వలన పొందగలిగిన ఐశ్వర్యము వ్యాపారములో నష్టము వచ్చి ధనమును కోల్పోయి తుదకు భార్య, పుత్రులను అన్నపానాడులకు పస్తు ఉంచవలసిన పరిస్థితి ఏర్పడెను.  

                కాని దేవదత్తుడు మాత్రము తన ఐశ్వర్యము అంతయు ధనలక్ష్మి కుభేర దేవతలా అనుగ్రహము వలన వచ్చినదే అని భావించి వ్రతము క్రమము తప్పక ఆచరిన్చేదివాడు.  కావున ఇతని గృహములో అశ్తలక్ష్మి దేవతలు ఆశ్రయించి వున్నారు.  ఒకనాడు తన అహంకారమును చంపుకొని దేవ దూరుదు దేవదాట్టుని గృహమునకేగి తనకు ఆర్ధిక సహాయము చేయుమని ప్రార్ధించగా అంతట దేవదత్తుడు "నీవు ఆ వృద్ద దంపతులు ఉపదేశించిన వ్రతము నియమముగా క్రమం తప్పి ఆచరించక పోవుట వలననే నీకు ఈ కష్టములు సంప్రాప్తిన్చినవని" గుర్తు చేసి కొంత ధనమును ఇచ్చి పంపెను.  ఈ విషమును వెంటనే భార్య పుత్రులకు దేవదూరుడు తెలుపగా వారు వెంటనే లక్ష్మికుభెర వ్రతము మరల భక్తితో చేసి తమ తప్పిదము క్షమింపమని లక్ష్మి సహిత కుభేర దేవుడిని వేడెను.  తర్వాత వారు ధనలక్ష్మి కటాక్షముచే కొలది దినములకే వ్యాపారములో లాభములు వచ్చి ధనవంతులిరి.  

                కావునా ఆనాటినుండి అన్ని ప్రాంతములందు ధనలక్ష్మి కుభేర వ్రాతమునాచారించి క్రుతార్దులగుచున్నారు.  ఈ వ్రతము 11 ఆచరించినచో దహన ధాన్య వృద్ది కలుగును.  5  మార్లు ఆచరించినచో సంతాన వృద్ది కలుగును.  3  సార్లు ఆచరించినచో వివాహము జరుగును, 16 సార్లు ఆచరించినచో వ్యాపారాభి వృద్ది కలుగును, 27  సార్లు ఆచరించినచో శాశ్వత ధన సౌభాగ్యవంతుడు అగును అని స్కాంద పురాణము నందు పేర్కొనబడినది.  

               ఇతి లక్ష్మికుభేర వ్రతకథ సమాప్తం.

No comments:

Post a Comment