క్షరసాగరమథన సమ…ుంలో, రాక్షసులు దేవతలను పరిహాసం చేస్తూ, తమ భుజబలం అంతా చూపిస్తూ లాగారు. దేవతలు కూడా మా తక్కువేమీ లేదని లాగారు. మథనం మహావేగంతో సాగింది. ఆ రాపిడికి తట్టుకోలేక వాసుకి మహాసర్పం విషాన్ని కక్కింది. హాలాహలం జ్వాలలు విరజిమ్ముతూ చెలరేగింది. రాక్షసులు చాలామంది మలమలమాడి మసి అ…యూరు. హాలాహల మహాగ్ని విజృంభించి లోకాన్ని దహించే ప్రమాదం ఏర్పడింది.
అదే సమ…ుంలో మందరపర్వతం సముద్రంలోకి కృంగిపోయింది. అందరూ హరహరా అని శివుణ్ణి ప్రార్థించారు. శివుడు హాలాహలాన్ని మ్రింగి, గొంతు లోనే ఉంచి లోకాల్ని రక్షంచాడు, గరళ కంఠు డనిపించుకున్నాడు. గండంతప్పిందిగాని, పర్వతం మునిగిపోయింది. దేవతలు విష్ణువును ప్రార్థించారు. విష్ణువు పెద్ద తాబేలుగా కూర్మావతారం తాల్చి సముద్రంలో కృంగిపోయిన మందరపర్వతాన్ని మూపున మోస్తూ మీదకు తెచ్చాడు.
తాబేలై మందరగిరిని మోస్తూ క్రిందనూ, పర్వతం అటూ ఇటూ బెసక్కుండా పర్వతాగ్రంపై కూర్చొని పాదంతో అదిమిపెట్టుతూ మీదనూ, ఇంకోవంక దేవతలతో కలిసి సముద్రం చిలుకుతూ బహురూపాలతో విష్ణువు కనిపించాడు సాగర మథనం సక్రమంగా సాగింది. క్షరసాగరం నుంచి చంద్రుడు, లక్ష్మి, కల్పవృక్షƒం, కామధేనువు, ఐరావతం ఏనుగు, ఉచై్ఛశ్వం గుర్రం, సుర అనే మత్తూ, ఉత్తేజమూ కల్గించే పానీ…ుమూ, ఇంకా ఎన్నెన్నో ఉద్భవించడం జరిగింది.
చల్లని చంద్రుణ్ణి శివుడు కంఠంలోని హాలాహలం వేడికి ఉపశమనంగా తలపై ధరించి, చంద్రశేఖరుడ…్యూడు. లక్ష్మీదేవి శ్రీవత్సకౌస్తుభ మణులతో కూడిన వైజ…ుంతిమాలను వేసి విష్ణువును వరించింది. విష్ణువు లక్ష్మీ కాంతుడ…్యూడు. సురను దేవతలు స్వీకరించి సురులు అనిపించుకున్నారు. చిట్ట చివరకు అమృతం సిద్ధించింది. విష్ణువు ఆ…ుుర్వేదానికి మూల విరాట్టు అయిన ధన్వంతరి అవతారంతో, అమృత కలశాన్నీ, అనేక ఓషధులనూ ధరించి, పద్మాసనంపై కూర్చొని, సముద్రం నుంచి వచ్చాడు.
అమృతం కోసం పాలసముద్రాన్ని తరిస్తే ప్రారంభంలో హాలాహల విషం పుట్టింది. ఎన్నెన్నో విశేషాలు, దైవసహా…ూలు జరిగాక అమృతం సిద్ధించి లక్షయసాధన అయింది. అందుకే ఏదైనా శమదమాదులతో కూడిన కార్యసాధనకు ‘సాగర మథనం' అనే మాట పర్యా…ుపదంగా నిలిచింది. ధన్వంతరి చేతనున్న అమృత కలశాన్ని రాక్షసులు ఎగరేసుకుపోయి అంతా మాదే అన్నారు. దేవతలు వాళ్ళతో పెనగులాడారు.
దేవదానవుల పెనగులాట ముమ్మరంగా సాగుతున్న ఆ సమ…ుంలో, ముజ్జగాలను సమ్మోహపరిచే జగన్మోహిని అక్కడకు వచ్చింది. ఆమెను చూసి రాక్షసులు పరవశించిపో…ూరు. మోహిని రాక్షసులతో, ‘‘అమృతాన్ని ఇలా తెండి, నేను పంచుతాను!'' అంది. జగన్మోహిని తమతో మాట్లాడినందుకే రాక్షసులు ఉప్పొంగిపోతూ, అమృత కలశాన్ని ఆమెకు అందించారు. రాక్షసులు ఒక వరసను, దేవతలొకవరసను కూర్చున్నారు.
ఉభ…ుశ్రేణుల నడుమ జగన్మోహిని నృత్యం చేస్తున్నట్లు అడుగులు వేస్తూ, అమృతకలశాన్ని నడుమున ఆనించి పంచడానికి త…ూరైంది. ఏమి జరుగుతుందో అని దేవతలు నిశ్చేష్టులై చూస్తున్నారు. ఉన్మత్తులై రాక్షసులు మోహిని సౌందర్య విలాసాలను చూస్తూ తన్మ…ుులౌతున్నారు. దేవతలు కూడా జగన్మోహిని ఎవరో మొదట తెలుసుకోలేక పోయినా, రాక్షసులను మభ్యపెట్టి అమృతాన్ని దేవతలకు మాత్రమే పోస్తున్నప్పుడు, ఆ విశ్వమోహిని విష్ణువే అని గ్రహించి, గుట్టుచప్పుడు కాకుండా అమృతాన్ని తాగుతున్నారు.
జగన్మోహినీ విలాసమంతా విష్ణువు చిద్విలాసమే అని తెలిసిన దేవతలు, నిర్లిప్తంగా అమరత్వం పొందుతూంటే, దైత్యులు జగన్మోహిని మోహజాలంలో పడి ఉన్మత్తులై అమృతాన్ని కోల్పో…ూరు. జగన్మోహిని వంచన చేస్తున్నదని రాహువు అనే ఒకే ఒక తెలివైన రాక్షసుడు కనిపెట్టాడు. అతడు జలరాక్షసి సింహిక కుమారుడు, బహు మా…ూవి. జరుగుతూన్న మోసాన్ని చెప్పినా వినిపించుకొనే స్థితిలో రాక్షసులు లేకపోవడం జూసి, రాహువు దేవతల రూపు ధరించి దేవతల వరుసలో చేరి, అమృతాన్ని త్రాగాడు.
సూర్యచంద్రులు అది గమనించి, మందర పర్వతాగ్రంపై విష్ణువు గానే ఉన్న బహురూపిెున విష్ణువుతో చెప్పారు. విష్ణువు తన చక్రాన్ని రాక్షసుడి పైకి పంపాడు. రాహువు చక్రాన్ని తప్పించుకోవాలని గ్రహాలు తిరిగే అంతరిక్షానికి ఎగిరాడు.
విష్ణుచక్రం వెంబడించి రాక్షసుడి తలను ఖండించి, తలనూ మొండేన్నీ వేరు చేసింది. అమృత ప్రభావం వల్ల తలా, మొండెమూ రెండూ సజీవంగా ఉండి తల రాహువుగా, మొండెం కేతువుగా రెండుగ్రహాలుగా మారి, గ్రహకూటమిలో చేరాయి. రాహుకేతు గ్రహాలతో గ్రహాలు తొమ్మిది అ…్యూయి. సూర్యచంద్రులపై కసితో అమావాస్య, పూర్ణిమ పర్వదినాలలో, రాహుకేతువులు వారిని పట్టి పీడించ సాగారు. ఆ విధంగా సూర్యచంద్ర గ్రహణాలు ఏర్పడ్డాయి.
అమృతాన్నంతా దేవతలకు ఇచ్చి జగన్మోహిని అంతర్థానమైంది. రాక్షసులు తమ తెలివిమాలినతనానికి చింతించి, అప్పట్నించి విష్ణువుకూ, దేవతలకూ బద్ధశత్రువులైనారు. అమృతమథన సందర్భంగా విష్ణువు కూర్మావతారాన్నీ, ధన్వంతరి అవతారాన్నీ, జగన్మోహినీ అవతారాన్నీ ధరించాడు. ధన్వంతరి అమృతంతోబాటు ఓషధులనూ, ఓషధివేదాన్నీ తెచ్చాడు. ధన్వంతరి వైద్యశాస్ర్తానికి అధిదేవతగా, వైద్యుల కులదైవంగా అర్చింపబడ్డాడు.
జగన్మోహిని విశ్వమోహినిగా కీర్తించబడి సౌందర్య విలాసాలకు ప్రమాణంగా చెప్పుకోబడింది. నారదుడు జగన్మోహిని అవతారాన్ని కీర్తిస్తూ, జగన్మోహినీరాగం మహతివీణపై పలికిస్తూ, కైలాసానికి వెళ్ళాడు. పార్వతి అది విని, ‘‘పామరులైన రాక్షసులను వంచించగలిగినంత మాత్రాన జగన్మోహిని అనిపించుకుంటుందా?'' అని అన్నది.
‘‘ఔనమ్మా, ఎంతటివారినైనా రంజింప జేసి ఈ విశ్వాన్నే ఉర్రూగించే విశ్వమోహిని!'' అని అంటూ నారదుడు వెళ్ళాడు. పార్వతి ఆ విష…ూన్ని శివుడితో చెప్పింది. శంకరుడు చిరునవ్వుతో ఆలకించి ఊరుకున్నాడు. తరువాత పార్వతితో కలిసి నందివాహనంపై వైకుంఠానికి వెళ్ళి, విష్ణువుతో, ‘‘నీ జగన్మోహినీ అవతారాన్ని మరొకసారి చూపుతావని వచ్చాము!'' అన్నాడు.
‘‘ఏదో అవసరానికి ఏ వేషమైనా వె…్యుక తప్పదు గదా! నీలాంటి వాడి ముందర అదేమాత్రం లెద్దూ!'' అని అంటూ విష్ణువు మాట్లాడుతూనే అంతర్థాన మ…్యూడు. అంతలో అల్లంత దూరాన పూల బంతితో ఆడుతూ, పాడుతూ జగన్మోహిని కనిపించింది. శివుడు సర్వమూ మరిచి ఆమె వెంట పడ్డాడు. జగన్మోహిని అందకుండా విశ్వాకాశంలోకి దారి తీసింది. శివుడు చేతులుచాచి ఆమె వెంట పడుతున్నాడు.
పార్వతి నిర్విణ్ణురాలై చూస్తూండి పోయింది. శివమోహినీ లీలావినోదాన్ని బ్రహ్మాది దేవతలు కన్నుల పండుగగా తిలకిస్తున్నారు. నంది నివ్వెరపోతున్నాడు. నారదుడు మహతి వీణపై శివరంజని రాగాన్ని మారుమ్రోగిస్తున్నాడు. ముందు జగన్మోహినీ, వెనుక శివుడూ విశ్వాంతరాల్లోకి పరుగులు తీస్తూ కొంత సేపటికి కనిపించలేదు. పార్వతి కైలాసం చేరుకుంది. జగన్మోహిని తేజోమండలాల మధ్య నుంచి దూసుకుపోతూ శివుణ్ణి విశ్వమంతా తిప్పి, తిప్పి, కైలాసానికి చేరుతూ, తన్ను తాకవద్దని శివుణ్ణి వారిస్తూ పార్వతి చెంతకు చేరుతూండగా, శివుడు ఆమె నడుము చుట్టి మోకరిల్లాడు.
‘‘చూశావుటమ్మా, నీ ప్రాణేశ్వరుడి ఆగడం!'' అని అంటూ జగన్మోహిని, శివుడు ఇంకేమి చేస్తాడో అని భ…ుపడుతూ పార్వతి చెంత నిలిచింది. వెనువెంటనే జగన్మోహినీ రూపాన్ని చాలించి విష్ణువు పార్వతి ఎదుట సాక్షాత్కరించాడు. ‘‘అన్నా! నీవు విశ్వమోహన జగన్మోహినీ కేశవస్వామివి! అంతా మీ శివకేశవుల లీలా నాటకమే కద!'' అన్నది పార్వతి విష్ణువుతో. ‘‘అంతేనమ్మా, అంతే లే!'' అంటూ నారదుడు మహతి వాయించుతూ అక్కడికి వచ్చి జగన్మోహిని, శివరంజని రాగాల్లో హరి, హరుల లీలావిలాసాన్ని గానం చేస్తూ ముల్లోకాలూ తిరిగాడు.
శివుడు విష్ణువుతో, ‘‘అమృతం సంగతే మరిచి, నీ జగన్మోహినీ విలాసాన్ని కళ్లారా గ్రోలిన రాక్షసుల్ని మెచ్చుకుంటున్నాను! రసపిపాస అసురుల సొత్తు!'' అని అన్నాడు మందహాసం చేస్తూ. విష్ణువు చిరునవ్వు నవ్వి పార్వతితో, ‘‘అమ్మా, మున్ముందు శివరంజనిగా మా గంగాదేవి దివి నుంచి భువికి అవతరించే వేళ కూడా, ఈ మహాశివుడు ఇలాగే పరవశించి నీకు సవతిని తెచ్చేలాగుంది!''
అని అంటూ అంతర్థానమై వైకుంఠానికి చేరాడు. తరువాతి కాలంలో విష్ణువు కర్దమ ప్రజాపతికి, దేవహూతికి పుత్రుడుగా కపిలావతారం ఎత్తాడు. చిన్నతనం నుంచే గొప్ప జ్ఞానసంపన్నుడై తపస్సు చేసి కపిల మహామునిగా పేరు పొందాడు. కపిలుడు తల్లి దేవహూతికి చెప్పిన అనేక తత్వబోధలు సాంఖెూ్యగంగా ప్రసిద్ధి పొందింది. కపిలమహర్షి పాతాళంలో ఒక గుహలో తపస్సు నిర్విరామంగా చేస్తూన్న కాలంలో, భూమ్మీద సగర చక్రవర్తి నూరవ అశ్వమేధ …ూగాన్ని తలపెట్టాడు.
ఇంద్రుడు …ూగాశ్వాన్ని మా…ుచేసి కపిలమహర్షి తపస్సు చేస్తున్న గుహలో దాచాడు. సగరుడి వెయ్యి మంది కుమారులు గుర్రాన్ని వెతుకుతూ పాతాళానికి బిలం త్రవ్వుకొని వెళ్ళి, కపిలమహర్షి గుహలో చూశారు. కపిలుడే గుర్రాన్ని అపహరించి దాచి, దొంగజపం చేస్తున్నాడని విరుచుకు పడ్డారు.
కపిలుడు కళ్ళు తెరిచి చూసే సరికి వారంతా బూడిద అ…్యూరు. ఆ భస్మరాసులపై విష్ణుపాదాల నుంచి పుట్టి స్వర్గంలో మందాకినిగా ప్రవహిస్తున్న గంగను ప్రవహింపజేసి పితరులను తరింప జే…ుడానికి సగరుడి మునిమనమడైన భగీరథుడు గొప్ప తపస్సు చేసి, గంగా దేవిని ప్రసన్నం చేసుకున్నాడు.
గంగ ధాటిని తట్టుకొని భరించగల శివుణ్ణి తపస్సుతో ప్రసన్నం చేసుకున్నాడు. గంగావతరణంలో శివుడు గంగాదేవిని చూసి పరవశించి గంగను తన జటాజూటంలో గాఢంగా బంధించేసుకున్నాడు. తరువాత భగీరథుడి ప్రార్థనపై ముడిసడలించి కొద్దిగా గంగను వదిలాడు. గంగ భగీరథుడి వెంట వెళ్ళి,అతని పితరుల భస్మరాసులపై ప్రవహించి తరింపజేసింది. పరమశివుడు గంగాధరుడై రంజిల్లాడు. ఆ విధంగా గంగ పార్వతికి సవతి అయింది.
సనకసనందనాది మునులు అనబడే సనకుడు, సనందుడు, సనత్సుజాతుడు, సనత్కుమారుడు అనే నలుగురూ బ్రహ్మ మానసపుత్రులు. ఎప్పుడూ బాలురవలెనే ఉంటారు, విష్ణుభక్తి తత్పరులై విష్ణువును కీర్తిస్తూ, అన్నిలోకాలూ నిరాటంకంగా తిరుగుతూంటారు. వారు విష్ణువును చూడగోరి వైకుంఠానికి వెళ్ళారు. అన్ని ద్వారాలూ దాటి విష్ణు మందిర ద్వారం చేరుకున్నారు. అక్కడ విష్ణువుతో సరిసమానమైన రూపంతో నాలుగు చేతులతో శంఖ, చక్ర, గద, అభ…ు ముద్రలు పట్టి ద్వారపాలకులై ఉన్న జ…ుుడు, విజ…ుుడు ఇది సమ…ుం కాదని మునులను వారించారు.
సనకసనందనాదులు, ‘‘మాకు విష్ణు సందర్శనానికి సమ…ూసమ…ూలు లేవు,'' అంటూ జ…ువిజ…ుులను లక్ష్య పెట్టకుండా విష్ణుమందిరంలోనికి వెళ్ళబోతూంటే, ద్వారపాలకులు గదలు ఎత్తివారిని అడ్డగించారు. సనకాది మునులు, ‘‘మీరు విష్ణు ద్వారపాలకులుగా ఉండతగరు.
రాక్షసులై పుట్టండి!'' అని శపించారు. ద్వారం దగ్గిర కలకలం విని, లక్ష్మివెంట రాగా విష్ణువు తలుపులు తెరుచుకొని అక్కడికి వచ్చాడు. జ…ువిజ…ుులు మునులు తమకిచ్చిన శాపాన్ని చెప్పుకొని ఆక్రోశించారు. మునులు తొందరపడి శపించినందుకు లోలోన చాలా విచారించారు.
No comments:
Post a Comment