Thursday, September 6, 2012

విష్ణు కథ - 16

కృత, త్రేతా యుగాల తర్వాత ద్వాపర యుగంలో రాక్షసులు విపరీతంగా మనుషులై పుట్టి, భూమికి బరువయ్యారు. భూదేవి విష్ణువుతో మొరపెట్టింది.

విష్ణువు, ‘‘దేవీ! కృష్ణావతారం ఎత్తి, నీ ఆర్తి తొలగిస్తాను!’’ అని అభయమిచ్చాడు.

ఆదికాలం నుంచీ విష్ణువుకు ప్రబల శత్రువైన కాలనేమి రాక్షసుడు కంసుడుగా పుట్టి, మధురానగరాన్ని పాలించే ఉగ్రసేనుడి కుమారుడనిపించుకున్నాడు.

దేవాసుర యుద్ధంలో, దానవ నాయకుడై విష్ణువుతో భీకరంగా పోరాడిన విప్రచిత్తి, మగథ రాజ్యాన్నేలే జరాసంధుడై పుట్టి, రాజులను తెచ్చి భైరవుడికి బలులిచ్చి అతి శ్రద్ధగా దీక్షతో అర్చిస్తున్నాడు. కంసుడు జరాసంధుడి అల్లుడు.

ఉగ్రసేనుడి తమ్ముడి కుమార్తె దేవకికి, యదువంశ రాజైన వసుదేవుడితో వివాహం జరిగింది. కంసుడు వారిని రథం మీద తీసుకుపోతూండగా, ఆకాశవాణి - దేవకి ఎనిమిదో సంతానంవల్ల కంసుడు చంపబడతాడు - అని పలికింది.

కంసుడు దేవకిని చంపకుండా వసుదేవుడు అడ్డుపడి, ఆమె ప్రసవించే బిడ్డల్ని అప్పగిస్తానని కంసుడికి ఇచ్చిన మాట తప్పకుండా, ఆరుగుర్ని అప్పగించాడు.

దేవకి ఏడవ గర్భాన విష్ణువు అంశతో ఆదిశేషుడు పడ్డాడు. ఆ పిండాన్ని గోకులంలో ఉన్న వసుదేవుడి మరొక భార్యయైన రోహిణి గర్భాన చేర్చి, పిమ్మట నందగోపుడి భార్య యశోదకు కూతురుగా పుట్టమని యోగ మాయాదేవిని విష్ణువు ఆదేశించాడు.

దేవకి ఏడవగర్భం ప్రసవం రాకుండా అణగారిపోయింది. తర్వాత దేవకి ఎనిమిదోసారి గర్భం ధరించిన వెంటనే, దేవకీ వసుదేవుల్ని కంసుడు కారాగారంలో పెట్టాడు.

అది శ్రావణ మాసం. కృష్ణపక్షం. అష్టమి ప్రవేశించింది. చంద్రుడు రోహిణీ నక్షత్రంతో   ఉన్నాడు. నడి రాత్రి. కావలి భటులకు చావునిద్ర ముంచుకొచ్చింది. దేవకి ప్రసవించింది. విష్ణువు కృష్ణుడుగా అవతరించాడు. చెరసాల తలుపులు తెరుచుకున్నాయి.

విష్ణువు ఆదేశంతో వసుదేవుడు బిడ్డడిని యమునానదిని దాటించి, అదే సమయంలో గోకులంలో అందర్నీ మాయనిద్ర ఆవహించగా, ఆ నిద్రలోనే ఆడపిల్లను ప్రసవించిన యశోద పక్కలో పిల్లవాణ్ణి ఉంచి, ప్రాణం లేనట్లున్న పిల్లను సంగ్రహించుకొని తిరిగి వెళ్ళాడు.

చెరసాల చేరగానే దిక్కులు పిక్కటిల్లేలాగ ఆ శిశువు క్యారుమని గగ్గోలు చేసింది.

కంసుడు శిశువును వధ్యశిల పైకొట్టి చంపబోగా పైకెగసి, పకపక నవ్వుతూ, ‘‘ఓరి, కంసా! నిన్ను చంపేవాడు క్షేమంగా ఉన్నాడులే!’’ అని చెపుతూ, దుర్గాదేవిగా కనిపించి అంతర్థానమైంది.

కంసుడు భయంతో, ఆగ్రహంతో దేవకీ వసుదేవుల ఎదుట వారి ఆరుగురి బిడ్డల్నీ తెగటార్చాడు.

గోకులంలో కృష్ణుడు పుట్టినందుకు కృష్ణాష్టమి, గోకులాష్టమిగా వేడుకలు జరిగాయి. అంతకుముందే కృష్ణుడికి అన్నగా రోహిణికి బలరాముడు పుట్టాడు.

నారదుడు కంసుడి దగ్గిరికి వచ్చి, ‘‘కంసా! నువ్వు ఉగ్రసేనుడి కుమారుడివి కావు; కాలనేమివి! నిన్ను చంపాలని పుట్టిన ఆ విష్ణువు ఎక్కడో ఉన్నాడని వింటివి గదా? నీ పిలుపు కోసం రాక్షసులు ఎదురు చూస్తున్నారు!’’ అని హెచ్చరించి వెళ్ళాడు.

ఉగ్రసేనుడితో వివాహమై, విరహంతో ఉన్న ఉగ్రసేనుడి రాణివద్దకు ఒక రాక్షసుడు ఉగ్రసేనుడి రూపంతో వెళ్ళినప్పుడు, కాలనేమి ఆమె గర్భంలో ప్రవేశించి కంసుడుగా పుట్టాడు.
కంసుడు ఉగ్రసేనుడిని కారాగారంలో వేయించి సింహాసనం ఆక్రమించాడు.
పసివాళ్ళను చంపమని పూతన రక్కసిని పంపాడు. ఊరూరా పసిపాపల్ని చంపుతూ, మానవకాంత రూపంతో వెళ్ళి పాలీయ వచ్చిన దాని ప్రాణాలు పీల్చి చంపాడు కృష్ణుడు.

యవనమ్లేచ్ఛులకు రాజైన కాలుయవన రాక్షసుడిని జరాసంధుడు కృష్ణుడి మీదకు ఉసిగొల్పాడు.

కృష్ణుడు కాలుయవనుడికి దొరక్కుండా పరుగెత్తి ముచికుందుడు నిద్రిస్తున్న గుహలో జొరబడి దాక్కున్నాడు.

ముచికుందుడు ఇక్ష్వాకుల నాటి మాంధాత కుమారుడైన గొప్ప రాజు. యుద్ధాల్లో దేవతలకు గొప్ప సహాయం చేశాడు. దేవతలు వరం కోరుకోమనగా మోక్షాన్ని కోరాడు. ద్వాపరయుగంలో కృష్ణుడి దర్శనం అనంతరం సిద్ధిస్తుందని దేవతలు చెప్పగా అంతవరకు నిద్రను, నిద్రాభంగం చేసినవారు తను చూడగానే భస్మం కావలెనని కోరుకున్నాడు.

కాలయవనుడు ముచికుందుణ్ణి కృష్ణుడనుకొని తన్నాడు. నిద్రాభంగమై ముచికుందుడు తీక్ష్ణంగా చూసేసరికి కాలువనుడు బూడిద అయ్యాడు.

కృష్ణుడు ముచికుందుడికి దర్శనమిచ్చి, బదరికాశ్రమం చేరుకొని తపస్సు చేశాక మోక్షం సిద్ధిస్తుందని చెప్పాడు.
జయ, విజయులు వారి మూడో జన్మగా కృష్ణుని శత్రువులుగా శిశుపాలుడు, దంతవక్త్రుడుగా పుట్టారు.
చేదిదేశానికి రాజైన దమఘోషుడికి కుమారుడుగా శిశుపాలుడు నాలుగు చేతులతో, మూడు కన్నులతో పుట్టాడు. ఎవరు ఎత్తుకున్నప్పుడు మూడో కన్ను, రెండు చేతులు మాయమవుతాయో అతని చేతనే చంపబడతాడని ఆకాశవాణి చెప్పింది. శిశుపాలుడి తల్లి సాత్వతి వచ్చిన వారందరికీ పిల్లవాణ్ణి ఎత్తుకోమని ఇస్తుండేది.

కృష్ణ బలరాములకు సాత్వతి అత్త అవుతుంది. తన పిల్లవాణ్ణి వారికీ ఇచ్చింది. కృష్ణుడు ఎత్తుకోగానే పిల్లవాడు సాధారణ రూపుడ్యూడు.

శిశుపాలుడిని నూరు తప్పుల వరకు విడిచి పుచ్చమని సాత్వతి అర్థించింది. కృష్ణుడు అలాగేనని ఆమెకు మాట ఇచ్చాడు.

శిశుపాలుడు రాజై జరాసంధుడితో చేరి అత్యాచారాలూ, అపరాధాలూ చేస్తూ వచ్చాడు. అతడికి తమ్ముడు దంతవక్త్రుడు తోడైనాడు.

జరాసంధుడు మాటిమాటికీ మధురా నగరంపై దాడి చేస్తూంటే కృష్ణుడు పలు మార్లు ఓడించి, తరిమికొట్టి, దుర్మార్గులైన రాజులెందర్నో కడతేర్చాడు.

కృష్ణుడు సముద్రుణ్ణి చోటు అడిగి సముద్ర మధ్యంలో విశ్వకర్మచేత సురక్షతమైన ద్వారకానగరాన్ని వైభవోపేతంగా నిర్మింపజేసి తనవారినందరినీ ద్వారకకు తరలించాడు.

జరాసంధుడు చివరిసారిగా శిశుపాలుడు, దంతవక్త్రుడు, పౌండ్రకుడు, సాళ్వుడు మొదలైన తన అనుయాయులైన రాజులందర్నీ కూడగట్టుకొని మధురను ముట్టడించాడు.

అంతకుముందే యాదవుల్నీ, మధురా ప్రజనూ, ద్వారకకు పంపించిన కృష్ణ బలరాములు ప్రవర్షణగిరికి చేరుకొని శిఖరాగ్రాన్ని అధిరోహించారు.

జరాసంధాదులు ప్రవర్షణ గిరి చుట్టూరా మంటను పెట్టి గిరిని కాల్చారు. కృష్ణ బలరాములు ఆకాశ మార్గాన ద్వారకకు సురక్షతంగా చేరుకున్నారు.

జరాసంధుడూ, శిశుపాలుడూ కృష్ణ బలరాములు దగ్థమై ఉంటారని పొంగిపోతూ వెళ్తుంటే, ద్వారక నుండి కృష్ణుడు పూరించిన శంఖధ్వని విని తెల్లముఖాలతో ఒకర్నొకరు చూసుకున్నారు.

శిశుపాలుడు అక్కసుకొద్దీ మధురా నగరాన్ని నిప్పుపెట్టి కాల్చాడు. జరాసంధుడు నౌకల మీద ద్వారకను ముట్టడించాలని సైన్యాలను పంపాడు. పెను తుఫానులో చిక్కుకొని నౌకలన్నీ మునిగిపోయాయి. జరాసంధుడు ఈవలి సముద్రం ఒడ్డున కెరటాల విజృంభణ చూస్తూండగా, ‘‘తాతా!’’ అన్న కృష్ణుడి పిలుపు, పకపక నవ్వు వినిపించింది.

సముద్ర మధ్యంలో ఒక గుట్ట మీదనిల్చుని నవ్వుతున్న కృష్ణుడు కనిపించాడు.

‘‘జరాసంధా! ఇప్పుడు నువ్వేమీ చేయలేవు. ద్వారకకు సముద్రుడు నిన్ను చేరనివ్వడు. నీకు నా చేతిలో చచ్చే అదృష్టం లేదు.నీ సమబలుడైన వాడిచేత చస్తావు. కొంతకాలం గతించాక మళ్లీ పునర్దర్శనం, వెళ్ళు!’’ అన్నాడు కృష్ణుడు.

విదర్భ రాజైన భీష్మకుడికి కుమార్తెగా లక్ష్మి రుక్మిణిగా పుట్టింది. బాలప్రాయం నుంచీ కృష్ణుడే తన నాథుడని చెప్పుకొనేది. అటువంటి రుక్మిణిని, రుక్మిణి అన్న రుక్మి కృష్ణుని శత్రువర్గంలో చేరి చెల్లెలికి శిశుపాలుడితో వివాహం చెయ్యడానికి సర్వసన్నాహాలు చేశాడు.

ఆ వివాహం తప్పించి తన్ను చేపట్టి రక్షంచమని రుక్మిణి కృష్ణుడికి తమ పురోహితుడి ద్వారా కబురు పంపింది.

పెళ్ళికి ముందు రుక్మిణి దుర్గను పూజించి, ఆలయం నుంచి వస్తూండగా, కృష్ణుడు రుక్మిణి చేయిపట్టి నాలుగు గుర్రాలు పూన్చిన తన రథం మీదకు ఎక్కించుకొన్నాడు. రుక్మి, శిశుపాల జరాసంధాదులు ఎదుర్కొన్నారు.
బలరాముడు యాదవ వీరులతో వెనుకనే వచ్చి తమ్ముడితో కలిశాడు.

కృష్ణుడు శిశుపాలుణ్ణి తరిమికొట్టాడు. బలరాముడు జరాసంధుడినీ ఓడించి తరిమాడు. శత్రు రాజులందర్నీ కృష్ణ బలరాములు చిందర వందర చేశారు. కృష్ణుడు విజయశంఖం పూరించి రుక్మిణిని రథం మీద ఎత్తుకుపోతూంటే వెంట తలపడిన రుక్మిని ఓడించి జుట్టూ, మీసమూ గొరిగి పరాభవించి విడిచి పెట్టాడు. రుక్మి మరెప్పుడూ కృష్ణుడి జోలికి పోలేదు.

క్షత్రియ వీరుడికి తగిన రాక్షస వివాహంగా ఎత్తుకు వచ్చిన రుక్మిణీ కళ్యాణం కృష్ణుడితో ద్వారకలో ఎంతో వైభవంగా జరిగింది.

తరువాత కృష్ణుడు నీలాపనింద తొల గించుకోడానికి అరణ్యం పట్టి, గుహలో జాంబవంతుడితో యుద్ధం చేసి, శ్యమంతక మణిని తెచ్చి, సత్రాజిత్తుకి ఇచ్చి, భూదేవి అంశగల అతని కుమార్తె సత్యభామను వివాహం చేసుకొన్నాడు. తరువాత జాంబవతి, మిత్రవింద, కాళింది, లక్షణ, భద్ర, నాగ్నజితిలను వివాహం చేసుకొని అష్ట మహిషులతో అష్ట సిద్ధులుగల యోగపురుషుడిలాగ, అష్ట ఐశ్వర్యాలతో తులతూగుతూ, ద్వారక రాజధానిగా యాదవులకు ప్రధాన నాయకుడై వెలుగొందుతున్నాడు.

No comments:

Post a Comment