Thursday, September 6, 2012

విష్ణు కథ - 10


శ్రీమతి స్యయంవరానికి దేశదేశాల రాజులు, ముల్లోకాల్లోని ప్రముఖులు అంతా వచ్చారు. విష్ణు వేషంతో నారదుడు స్వయంవర మంటపం ప్రవేశించగానే అంతా ఘొల్లున నవ్వారు. తన ముఖం కోతి ముఖంగా మారిందని తెలుసుకొని నారదుడు అవమానంతో ఉడికిపోయాడు.

శ్రీమతి విష్ణువును ధ్యానించింది. విష్ణువు ఆమె ముందు సాక్షాత్కరించాడు. శ్రీమతి మాలవేసి విష్ణువును వరించి, అతనితో వైకుంఠానికి వెళ్ళింది. అది చూసి నారదుడు మరింత కోపంతో పర్వతుణ్ణి కూడగట్టుకొని అంబరీషుడిపై మండిపడ్డాడు. అడిగినప్పుడు తమకు ఇవ్వకుండా శ్రీమతిని విష్ణువుకు అప్పగించినందుకు అంబరీషుణ్ణి నాశనం చేయదలచి, శపించడానికి సిద్ధపడ్డారు.

అప్పుడు విష్ణుచక్రం వచ్చి వారిని వెంట తరిమింది. పర్వత నారదులిద్దరూ వైకుంఠానికి పరుగెత్తారు. అక్కడ శ్రీమతితో ఉన్న విష్ణువును చూసి నారదుడు మరింత ఉడుకుమోత్తనంతో, ‘‘నువ్వు కూడా నీ శ్రీమతిని - అంటే నీ భార్యామణిని పోగొట్టుకొని విలపిస్తావు! నన్ను కోతిముఖంవాడిని చేసి మోసగించావు. వానరులే నీ సహచరులై సహాయపడతారు గాక!’’ అని విష్ణువును శపించాడు. నారదుడి శాపానికి విష్ణువు మందహాసం  చేశాడు. శ్రీమతి లక్ష్మీదేవిగా నిజరూపం పొందింది. మునులను ఆవరించిన మాయ. తొలగింది. జరిగినదానికి సిగ్గుపడుతూ నారద పర్వతులు విష్ణు పాదాల మీద పడ్డారు. నారదుడు విష్ణు పాదాన్ని కన్నీటితో తడుపుతూ, శపించినందుకు నొచ్చుకొంటూంటే విష్ణువు నెమ్మదిగా మందహాసం చేస్తూ, నార దుడి తల నిమిరి, ‘‘నారదా! త్రికాలవేత్తవైన నువ్వు విచారించడమేమిటి! నీ నోటిమాట అమోఘం.


నువ్వు శపించింది కూడా నా సంకల్పమే! నా రామావతార సమయంలో అలాగే జరుగుతుందిలే! అదీ లోకకల్యాణం కోసమే!’’ అని చెప్పాడు. అప్పటినుంచీ అంబరీషుడికి ఎవరివల్లా ఎటువంటి హానీ జరగకుండా, తన చక్రం అతనికి రక్షణగా ఉండేలాగ విష్ణువు అనుగ్రహించాడు. దుర్వాసుడికి తపోబల గర్వంతో బాటు తామసం ఎక్కువ. ఒకనాడు తన ఆశ్రమం నుండి బయలుదేరబోతూండగా, ఆనంద పారవశ్యంతో కన్నులు మూసి విష్ణుసంకీర్తన పాడుతూ వస్తున్న నారదుడు ఎదురయ్యాడు. ‘‘ఓహో, నారదా!

కలహ భోజనంతో కడుపు నిండినట్టుందే! చాలా ఆనంద పారవశ్యంలో మునిగి ఉన్నావు!’’ అంటూ దుర్వాసుడు నారదుణ్ణి పలకరించాడు. నారదుడు కళ్ళుతెరిచి వంగి వంగి  నమస్కరిస్తూ, ‘‘దుర్వాసుల వారికి ప్రణామాలు! అలాంటి దేమీ పడక నకనకలాడుతున్నది గాని, మహర్షీ! విష్ణుభక్తి తత్పరులైన వారిని చూసినపుడల్లా నాకు పరమానందం పొంగుతూనే  ఉంటుందాయె. అంబరీషుణ్ణి చూసి ఇలా వస్తున్నాగదా మరి...’’ అన్నాడు మరొకసారి వంగి ప్రణామం చేస్తూ.

‘‘అంతటివాడా, అంబరీషుడు?’’ అన్నాడు దుర్వాసుడు. ‘‘ఔను, మహర్షీ! విష్ణువు అనుగ్రహం పొందిన రాజర్షిసత్తముడు, ద్వాదశీ వ్రతం అతని ప్రాణం!’’ అన్నాడు నారదుడు. ‘‘ఏమిటి నారదా! ఆ రాజును తెగపొగిడేస్తున్నావు?’’ అన్నాడు దుర్వాసుడు. ‘‘అతణ్ణి చూస్తే తెలుస్తుంది, పొగడ్తకాదని! నీలాంటి మహర్షీశ్వరుడు అతని సదనాన్ని పావనం చేయడం వల్ల, అతని జన్మ ధన్యమౌతుంది. చరితార్థుడై మరింత వినుతికెక్కుతాడు!’’

అని చెప్పి నారదుడు నారాయణ నామజపం చేస్తూ వెళ్ళాడు. నారదుడి మాటలు దుర్వాసుణ్ణి రెచ్చ గొట్టాయి. అంబరీషుడి దగ్గిరికి బయలుదేరాడు. ఏకాదశి ఉపవాసం చేసి, ద్వాదశీవ్రత  సమాప్తిగా అప్పుడే భుజించడానికి అంబరీషుడు సిద్ధమౌతున్నాడు. దుర్వాసుడి రాకకు పరమానంద భరితుడై, అర్ఘ్యపాద్యాదులతో పూజించి, భోజనానికి ఆహ్వానించాడు.


దుర్వాసుడు నదిలో స్నానం చేసి వస్తానని చెప్పి వెళ్ళాడు. వెళ్ళినవాడు ఎంతకూ తిరిగి రాలేదు. ద్వాదశఘడి…ులు మించిపోతున్నవి; ద్వాదశి దాటకుండా భోజనం చే…ుకపోతే వ్రతభంగం అవుతుంది. అతిథి రాకుండా తింటే దోషమౌతుంది! అప్పుడు విజ్ఞులైన పెద్దలు అంబరీషుడితో కొంచెం నీరు చప్పరించితే వ్రతభంగమూ కాదు, అతిథి రాకుండా భుజించిన దోషమూ అంటదు అని చెప్పగా అలాగే అతను జలపారణం చేశాడు.

ద్వాదశి పోయి త్రెూదశి వచ్చినటే్ల హుటా హుటిగా ఆగ్రహావేశంతో పట పట పళ్ళు కొరుకుతూ, జటాజూటాన్ని విప్పి విదలిస్తూ దుర్వాసుడు వచ్చాడు. ‘‘ఓ రాజాధమా! విష్ణుభక్తుడి నంటూ గర్వించి ఆతిథ్యధర్మానికి అపచారం చేస్తావా? నాకే అవమానం తలపెట్టడానికి నీ కెన్ని గుండెలు? నేనెవర్నో తెలుసా? నా పేరు వింటే ముల్లోకాలూ, ముమ్మూర్తులూ గడగడలాడ వలిసిందే! నా శాపానికి తిరుగులేదు, దుర్మరణం పాలౌతావు గాక!’’

అని హుంకరిస్తూన్న దుర్వాసుడి పాదాల మీద తలవాల్చి అంబరీషుడు, ‘‘ఋషీశ్వరా! వ్రతభంగం కాకుండా వుండేందుకు జలపారణం మాత్రమే చేశాను. మన్నించమని వేడుకొంటున్నాను!’’ అన్నాడు విన…ుంగా. దుర్వాసుడు అంబరీషుని తలను తన్ని, ‘‘దుర్వాసుడి కోశంలో మన్నించడం అనేది లేదు! భక్తీ, తపశ్శక్తుల్లో ఏది గొప్పదో నువ్వు స్వ…ుంగా చూద్దువుగాని!’’ అని అంటూ అమిత ఆగ్రహంతో జటాజూటాన్ని సింహంలాగ విదిల్చాడు.

దుర్వాసుడి తపోమహిమ అంతా అతని జడల్లో అనేక శక్తులుగా నిక్షప్తమై వుంది. పొడవైన ఒక జడను తీసి పట్టుకొని మరో చేత్తో ెూగదండాన్ని ఎత్తి ఆడిస్తూ జడను ఝళిపించాడు. జడ నుంచి నిప్పురవ్వలు విరజిమ్ముతూ దట్టమైన నల్లని పొగలు సుడులు తిరుగుతూ ఆకాశానికి లేచాయి. ఆ పొగల్లో భ…ుంకరాకారంతో పర్వతంలా కృత్య అనే మహా భూతం ఆవిర్భవించింది.కృత్య ప్రళ…ుభీకరంగా గర్జిస్తూ అంబరీషుడిని చంపడానికి ఉరకబోతున్న మరుక్షƒణంలో అతనికి రక్షణగా విష్ణువు అనుగ్రహించిన చక్రం జ్వాలలు కక్కుతూ రివ్వునవచ్చి కృత్యను ముక్కలు ముక్కలుగా నరికి మటుమా…ుం చేసింది.


అదిచూసి దుర్వాసుడికి ముచ్చెమటలు పోశాయి. కృత్యను నాశనం చేసిన విష్ణుచక్రం అంతటితో ఆగక, అమిత వేగంతో దుర్వాసుడి మీదకు వెళ్ళింది. దుర్వాసుడు మరొక జడను పెరికి విసిరాడు. పర్వతమంత వజ్రపాషాణం అడ్డునిలిచింది. చక్రం దాన్ని తుక్కు తుక్కుగా తూలగొట్టి దుర్వాసుణ్ణి వెంబడించింది. ఇంకొక జడను ఋషి విసిరాడు! ఆకాశమంత మంచు మేఘం ఏర్పడి వెనువెంటనే చక్రజ్వాలల్లో ఆవిర్లు గక్కుతూ హరించిపోయింది.

దుర్వాసుడు పరుగెత్తుతూంటే అతని జటాజూట మంతా వెంట తరిమే చక్ర జ్వాలలు తగిలి మసి మసి అయింది. ఈ విధంగా అతడి తపశ్శక్తి అంతా ఆహుతి అయిపోయింది. చెట్టనక పుట్టనక, అడవులు నదులు పర్వతాలు దాటుతూ, దుర్వాసుడు పరుగెత్తుతున్నాడు. చక్రం తరుముకొంటూ వస్తోంది; మునిని ముల్లోకాలు తిప్పింది. దుర్వాసుడు బ్రహ్మలోకానికి పరుగు తీస్తుంటే నారదుడు ఎదురుపడి ముసి ముసి నవ్వు లతో, ‘‘హా! తపో సంపన్నులు దుర్వాసులవారేనా! ఏమిటా పరుగు?’’ అని అంటూంటే మారు మాటరాక వెన్నెంటి వస్తోన్న చక్రాన్ని చూపిస్తూ దుర్వాసుడు అదే పరుగున బ్రహ్మముందు పడ్డాడు.

‘‘నేను విష్ణునాభికమలంనుంచి వచ్చినవాణ్ణి, నేనేం చె…్యుగలను? చక్రాన్ని ఎలా వారించగలను?’’ అన్నాడు బహ్మ. ‘‘బ్రహ్మవని వస్తే ఇంతేనా నీ పస! నన్ను రక్షంచగల ఆ మహేశ్వరుడున్నాడులే!’’ అన్నాడు ఋషి. ‘‘ఔను, ఔను, దుర్వాసా! ఆ మాటా నిజమే. ఎంత త్వరగా వెళ్తావో కైలాసానికి, వెళ్ళు వెళ్ళు!’’ అన్నాడు బ్రహ్మ చేతులు దులుపుకొంటూ. కైలాసానికి వెళ్ళి దుర్వాసుడు శివుణ్ణి రక్షంచమని మొరపెట్టాడు. ‘‘చక్రం విష్ణువుది. కోరి విరోధం తెచ్చుకో మన్నావా? వెళ్ళు. నీ దురహంకారానికి ఫలితం అనుభవించక తప్పుతుందా మరి! వెళ్ళు, వెళ్ళు!’’ అన్నాడు శివుడు. దుర్వాసుడు వైకుంఠానికి పరుగెత్తి విష్ణువు ముందు పడి, దీనాతి దీనంగా చక్రాన్నినివారించమంటూ శరణు వేడాడు.


‘‘అంబరీషుడికి రక్షగా నా చక్రాన్ని ఎప్పుడో అనుగ్రహించాను. అందువల్ల, ఇప్పుడు నేనేం చేసేది మహర్షీ? అంబరీషుణ్ణే చక్రాన్ని వారించమని అర్థించు!’’ అన్నాడు విష్ణువు.
దుర్వాసుడు హతాశుడై లేచాడు. అతని అహంకారం నశించింది. అతని తల బోసి పోయివుంది. తపశ్శక్తి అంతా తుడుచుకు పోయింది, భక్తిముందు తపశ్శక్తి ఎందుకూ పనికిరాదని తెలిసింది. అంబరీషుడి దగ్గిరకు బ…ులుదేరాడు. చక్రం శాంతంగా వెంట వెళ్తున్నది.

దుర్వాసుడు పాదాలు పట్టుకోబోతూంటే అంబరీషుడు వారించి, లేవనెత్తి చక్రాన్ని ఆగమన్నాడు. చక్రం వెనక్కి మళ్ళి కొంతసేపటికి అదృశ్యమైంది. అగ్రగణ్యులైన విష్ణువు భక్తుల్లో అంబరీషుడుపేరుపడ్డాడు. సూర్యవంశ రాజుల్లో గాధి ఒక ప్రముఖుడు. గాధి కుమారుడు విశ్వామిత్రుడు, కృతాశ్వుడి దగ్గిర ధనుర్విద్య నేర్చాడు. అనేక అస్త్రాల్ని పొందాడు. అస్ర్తవేత్తగా పేరు పొందాడు.

 విశ్వామిత్రుడు రాజ్యపాలనకు వచ్చాక ఒకనాడు సపరివారంగా వసిష్ఠుని ఆశ్రమానికి వెళ్ళాడు. వసిష్ఠ మహర్షి తన హోమధేనువు మహిమ వల్ల అందరికీ సాదరంగా గొప్ప విందు చేశాడు. పదిలక్షల గోవులను తీసుకొని హోమ ధేనువును ఇమ్మని విశ్వామిత్రుడు అడిగాడు; వసిష్ఠుడు ఇవ్వనన్నాడు. విశ్వామిత్రుడు బలాత్కారంగా గోవును పరివారంచేత తోలించుకొని వెళ్ళబోతూంటే, వశిష్ఠుడు తన తపోబలంతో హోమధేనువు నుండి అనేక మంది శబరెూధుల్ని పుట్టించాడు.


విశ్వామిత్రుణ్ణి అతని పరివారాన్ని ధేనువు నుండి వచ్చిన ెూధులు చిత్తు చిత్తుగా తరిమికొట్టారు. రాజరికం కంటే తపోబలం మిన్న అని తెలుసుకొని విశ్వామిత్రుడు రాజ్యం విసర్జించి అనేక సంవత్సరాలు గొప్ప తపస్సు చేశాడు. తపస్సు సాధించి వసిష్ఠుడితో సమానుడనిపించుకున్నాడు. అప్పటినుంచి విశ్వామిత్రుడు వసిష్ఠుడితో పోటిగా వుంటూ వచ్చాడు.

రావణుడి అనుచరులైన రాక్షసులు తమ తమ బలాలతో ఆర్యావర్తం మీద విరుచుకుపడి …ుజ్ఞ…ూగాల్ని ధ్వంసం చేస్తూ, మునులను ఋషులను బాధించి, ఆశ్రమాలు తగలబెట్టసాగారు. విశ్వామిత్రుడు గొప్ప …ూగం తలపెట్టాడు. అది జరగకుండా మారీచుడు, సుబాహుడు అనే రాక్షస ప్రముఖులూ, తాటక అనే రాక్షసీ పట్టుదలతో ధ్వంసం చేస్తున్నారు. విశ్వామిత్రుడు …ూగభంగానికి చింతాక్రాంతుడై, హిమాల…ు ప్రాంతంలో ఉన్న తన సిద్ధాశ్రమంలో ధ్యానమగ్నుడై కూర్చున్నాడు. ఆ ధ్యానసమాధిలో అతనికి మహావిష్ణువు అవతారంగా సూర్యవంశంలో రఘువు సంతతిలో పుట్టి పెరుగుతూన్న రాముడు కనిపించాడు!

లోకకల్యాణం కోసం రాక్షసనిర్మూలన చే…ువలసి ఉన్న రాముడికి వసిష్ఠుడు నేర్పిన శాస్ర్తవిద్యలెందుకూ అక్కరకు రావు! అందుకు అద్భుతమైన అస్ర్త, శస్ర్తవిద్య, ధనుర్విద్యాపాటవంకావాలి! వాటిని అందించగల గురువు అతనికిప్పుడు కావాలి! రాముడికి అస్త్రాలు ఉపదేశించగల సమర్థుడు విశ్వామిత్రుడు ఒక్కడే!

విశ్వామిత్రుడికి ధ్యానసమాధిలో లక్ష్మీదేవి సీతగా జనకుని కూతురుగా పెరుగుతున్నది కూడా కనిపించింది. సీతారాముల కల్యాణం కూడా త్వరలో జరగాలి. రాముడి వల్లనే తన …ూగరక్షణ కూడా జరగాలి! తనకు తెలిసిన అస్ర్తవిద్య నంతా రాముడికి ఉపదేశించి, ఆ…ున్ను అస్ర్తవిద్యాకోవిదుణ్ణిగా చే…ువలసిన బాధ్యత తనదిగా గుర్తించి విశ్వామిత్రుడు అెూధ్యకు బ…ుల్దేరాడు.






No comments:

Post a Comment