ఉత్తానుపాదుడు అనే రాజుకు ఇద్దరు భార్యలు వారిపేర్లు సునీత, సురుచి,
రాజుగారికి సురుచి అనిని అమితమైన ప్రేమ. ఆమె కొడుకు ఉత్తముడు పెద్దభార్య
అయిన సునీత కొడుకు ధ్రువుడు ఇతడు తండ్రి ప్రేమకు దగ్గరగా ఉండాలనుకునేవాడు.
కాని తండ్రి పినతల్లి అయిన సురుచి ఇంట్లోనే ఎక్కువగా గడిపేవాడు. అందువల్ల
ధ్రువునికి తండ్రి ప్రేమకరువైంది. ఒక రోజు తండ్రితో గడపాలని ధ్రువుడు
పినతల్లి ఇంటికి వెళ్ళాడు.
తండ్రి ఒడిలో ఉత్తముడు కూర్చొని ఉన్నాడు. ధ్రువుడు సంతోషంతో తండ్రి వద్దకు వెళ్ళాడు. తండ్రి ధ్రువుణ్ని చీదరించుకున్నాడు. తండ్రి నిరాధరణకు ధ్రువునికి దుఖ: ఆగలేదు. అది చూసి పినతల్లి కఠినంగా ‘‘ధ్రువా! నీవు నా కడుపున పుడితే మీ తండ్రిగారి తొడపై కూర్చొనే అదృష్టం కల్గేది. ఇప్పుడైనా ఈ సురుచి కడుపున పుట్టించమని శ్రీవారిని ప్రార్థించు అప్పుడు నీకు ఉత్తముని స్థానం లభిస్తుంది’’ అన్నది. పినతల్లి సురుచి.
జరిగిన విషయం అంతా తల్లితో చెప్పాడు ధ్రువుడు. అప్పుడు తల్లి ‘‘ నాయానా ధ్రువా ! నీ పిన తల్లి నిజమే చెప్పింది. తండ్రిప్రేమ కోసమే కాకుండా ఒక పెద్ద ఆశయం పెట్టుకొని శ్రీహరిని గూర్చి తపస్సు చెయ్యి ఫలితముంటుంది. అన్నది తల్లి. తల్లిమాటలకు ధ్రువుడు ఉత్తేజతుడయ్యాడు. తపస్సు చేయుటకు బయలుదేరిన ధ్రువునకు నారధమహార్షి ఎదురయ్యాడు. విషయం తెలసుకొని నవ్వుతూ ఇలా అన్నాడు.
నాయానా ధ్రువా! పసివాడివి. పినతల్లి మాటలకు ఇంత పట్టింపా ? తపస్సు అంటే మాటలు కాదు.! చాలా కష్టమూ నీ నిర్ణయం మార్చుకో’’ అన్నాడు. నారధుడు. నారుధుడు మాటలకు ధ్రువుడు మహార్షీ పినతల్లి మాటలు నాలో రేపిన బాధ అంత ఇంత కాదు. ఉత్తముని కన్న నేను గొప్ప స్థానం సంపాదించాలి. అది పొందటానికి నేను ఎంత కఠోర తపస్సు అయినా చేస్తాను. అన్నాడు. నీ పట్టుదల గట్టిది.
ఆ శ్రీ మహావిష్ణువును మనసున తలచుకొని నిశ్చలమైన మనసుతో తపస్సు చెయ్యి నీ కోరిక తప్పక నెరవేరుతుంది. అని ఆశీర్వదించి నారుధుడు వెళ్ళిపోయాడు. ధ్రువుడు యమునా తీరాన ఉన్న మధువనానికి వెళ్ళి శ్రీహరిని మనసున తలచి ఒంటికాలిపై కొన్ని సంవత్సరాలు కఠోరతపస్సు ఆచరించాడు. అతని తపస్సుకు మెచ్చిన నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు. ధ్రువుడు ఆనందంతో పొంగిపోయి శ్రీహరిని స్తుతిస్తూ ఎన్నోస్త్రోత్రాలు చేసాడు. అంతట విష్ణుమూర్తి ధ్రువా నీ మనస్సునందున్న కోరిక నెరవేరుస్తున్నాను.
ఇంతవరకు ఎవరీ దక్కని ఉన్నదస్థానాన్ని నీవు పొందుతావు. మహారాజువై గొప్పగా రాజ్యమేలుతూ, సుఖసంతోషాలతో జీవించి చివరకు నక్షత్రమై, ఉత్తర దిక్కులో స్థిరంగా వెలుగుతావు. లోకమంతా ఆ నక్షత్రాన్ని ధ్రువ నక్షత్రం అని పిలుస్తారు. అని వరమిచ్చి అదృశ్యమైనాడు. నేటికి కనబడే ఉత్తర దృవం పై ఉన్న నక్షత్రమే ధ్రువ నక్షత్రం. ధ్రువుడు గొప్ప లక్ష్యంతో తపస్సు చేసి, అనుకున్నది సాధించాడు.

No comments:
Post a Comment