హనుమంతునికి సింధూరం అంటే చాలా ఇష్టం. హనుమంతుడు సింధూరాన్ని అంతగా
ఇష్టపడటానికి ఒక కారణం ఉంది. ఒకసారి సీతాదేవి తన నుదటి పై సింధూరం
పెట్టుకోవడం చూసిన హనుమ ‘‘ సీతమ్మ తల్లీ! సింధూరం ఎందుకు పెట్టుకున్నావు ?
అని అడిగాడంట,
అపుడు సీతమ్మ సమాధానంగా ‘‘ హనుమా ! ఇలా సింధూరంతో అలంకరించుకుంటే మీ స్వామివారి ఆయుష్షు మరింత పెరుగుతుంది.’’ అని చెప్పిందట. అప్పటికపుడు హనుమంతుడు తన ఒళ్లంతా సింధూరాన్ని పూసుకుని రాముడి దగ్గరికు ఆనందంగా గంతులు వేసుకుంటూ వెళ్ళగా, శ్రీరాముడు జరిగిన విషయమంతా తెలుసుకుని,
తనపై హనుమంతునికి గల భక్తికి సంతోషించి ‘‘ ఇక నుండి నీకు సింధూరం సమర్పించి ఎవరైతే పూజిస్తారో, అటువంటి వారి అన్ని కోరికలనూ తీరుస్తాను’’ అని శ్రీరాముడు వరమిచ్చాడట. కనుక హనుమంతునికి ప్రీతికరమైన మంగళవారం నాడు ఆయనకి సింధూరం అలంకరించి పూజించినట్లయితే కోరిన కోరికలన్నీ తీరుతాయి.

No comments:
Post a Comment