Friday, January 11, 2013

ముసలి ఎద్దుకు న్యాయం

 అక్బర్ పాదుషా ప్రజల కోసం న్యాయగంటను ఏర్పాటు చేశాడు. ఎవరికైనా ఏ విషయంలోనైనా అన్యాయం జరిగినా, ఆపద సంభివించినా ఆ గంటని మ్రోగిస్తే అక్భరు ఆ గంట శబ్దం విని, అక్కడికి వచ్చి, ఆ గంట మ్రోగించిన వారి కష్టం తీర్చిపంపుతారు. ఒక రోజు అక్బర్ ఆస్థానంలో సభ నిర్వహిస్తుండగా న్యాయ గంట మ్రోగటం వినిపించింది.

అక్బర్తో సహా అందరూ అక్కడికి వెళ్ళారు. అక్కడ ఒక ముసలి ఎద్దు తన నోటితో గంట తాడుని పట్టి లాగుతూ గంటని మ్రోగించడం వాళ్ళకి కనిపించింది. పాపం! నోరులేని జంతువు కధా.. దాని కష్టమేంటో అది చెప్పలేదు. దాని సమస్యను నువ్వే పరిష్కరించాలి బీర్భల్! అన్నాడు. అక్బర్ జాలిగా ముసలి ఎద్దు వంక చూస్తూ.

అలాగే ప్రభూ అని అక్కడ ఉన్న భటునితో ‘‘ దీన్ని వదిలిపెట్టి, ఇది ఎక్కడికి వెళ్తే అక్కడిదాకా దీని వెనకానే వెళ్ళి చివరికి ఏ ఇంటికి వెళ్తుందో ఆ ఇంటిలోని వ్యక్తిని తీసుకురా’’ అని ఆజ్ఞాపించాడు. భటుడు ఆ ముసలి ఎద్దుని వదిలి పెట్టాడు. అది అలా అలా వెళ్లి ఒక ఇంటినిచేరింది. ‘‘

ఇది నీ ఎద్దేనా ?’’ అని అడిగాడు భటుడు ఆ వ్యక్తిని. అతను అవును అవును నాదే అన్నాడు. ‘‘ నిన్ను రాజుగారు పిలుచుకురమ్మన్నారు!’’ అని చెప్పి అతన్నీ, ఎద్దును తీసుకుని రాజదర్భారుకి వచ్చాడు. ‘‘ ఇది నీ ఎద్దే కదా.. మరీ దీన్ని ఎందుకు వదిలి పెట్టావ్ ?’’ అని అడిగాడు బీర్బల్.

‘‘ ప్రభూ! ఇది వదిలి పెట్టేశాను’’ అన్నాడు ఆ వ్యక్తి. ఇది వయసులో ఉన్నాన్నాళ్ళూ నీకు సేవ చేసింది అవునా ? అలాంటపుడు దీన్ని ఈ వయసులో వదిలేయడం న్యాయామా ? అని అడిగాడు బీర్బల్. ‘‘ కానీ ఈ ముసలి ఎద్దుని ఇంట్లో ఉంచుకుని నేనేం చేయాలి ప్రభూ!’’ అన్నాడు ఆ వ్యక్తి.

 ‘‘ నీకు అమ్మా నాన్నా ఉన్నారా ? ’’ అన్నాడా బీర్బల్. ‘‘ ఉన్నారు ప్రభూ! వాళ్ళు నాతోనే ఉన్నారు’’ అన్నాడా బీర్బల్. ‘‘ముసిలి వాళ్ళయిన వాళ్లు ఇప్పుడు నీకు ఏవిధంగానూ పనికిరారు. వాళ్లకి తిండిపెట్టడం కూడా దండగ, వాళ్లని వదిలేసెయ్’’ అన్నాడు బీర్బల్.

బీర్బల్ ఇలా అనగానే ఆ వ్యక్తి కళ్లు తెరుచుకున్నాయ్. తనని క్షమించమని అడిగి ముసలి ఎద్దుని తీసుకుని వెళ్లిపోయారు. ఆ వ్యక్తికి బీర్బల్ బుద్ది చెప్పిన విధానం అక్బర్ పాదుషాకి ఎంతో నచ్చి, బీర్బల్ ని ఎంతో అభినందించాడు.   

No comments:

Post a Comment