తులసి చెట్టు నుంచి తలసీదేవి కార్తీక పౌర్ణమినాడు ఆవిర్బవించింది. ఆనాడు ఆ
తల్లినీ, విశ్వపావనినీ పూజిస్తే వేల ఆవులను దానం చేసిన ఫలం కలుగుతుందని
విష్ణుపురాణం చెబుతోంది. సంతానము కోరేవారూ, వివాహం ఆలస్యం అయినవారూ తులసీ
స్తోత్రాన్ని పఠిస్తే తప్పక దోషాలు పోయి సుఖాలు కలుగుతాయి. ప్రతిరోజు తులసి
చుట్టూ ప్రదక్షిణలు చేస్తే కన్యకు పుణ్యపురుషుడు లభిస్తాడు.
No comments:
Post a Comment