Friday, January 11, 2013

చుండ్రు నివారణకు ఎన్నో మార్గాలెన్నో !

ఏ కాలంలో అయినా ఎల్లపుడూ అందరినీ వేధించే సమస్య తలలో చుండ్రు. వయసుతో సంబంధంలేకుండా పెద్దవారికి, చిన్నవారికి తలలో చుండ్రు రావడం సాధారణం. చుడ్రు రావడానికి కారణాలు అనేకం చుండ్రు వంశపారపర్యంగా కూడా వస్తుది. అధిక ఒత్తిడికి గురయిన తలలో చుండ్రు వస్తుంది. నేటి కాలంలో ప్రతి ఒక్కరు ఏదో ఒక విషయానికి వత్తిడికి గురికావడం సహజం. వత్తడికి గురయిన వారికి చుండ్రు అధికంగా వస్తుంది. అలా ఎక్కువ సమయం ఏసి గదుల్లో గడపడం వల్ల, ఫ్యాన్ కింద కూర్చున్నా తలమీద చర్మం పొడిగా అయిపోయి పొట్టులాలేస్తుంది.

షాంపూతో తలస్నానం చేసినప్పుడు చర్మానికి అంటిన షాంపూ పూర్తిగా వదలకపోయినా కూడా చుండ్రు వచ్చే అవకాశం ఉంది. తలకు రాసుకునే షాంపూలో మినరల్స్, ఐరన్ ఎక్కువైనా చుండ్రు పెరగడానికి అవకాశం ఎక్కువ, కలుషిత వాతావరణంకి కూడా చుండ్రును పెంచుతుంది. ఏ వాతావరణంలో నివసించే వారికైనా చుండ్రు వస్తుంది. కాలాలు మారినప్పుడల్లా వాతావరణంలో వచ్చే మార్పులు కూడా తలలో చుండ్రును పెంచుతాయి. శరీరానికి కావలసిన పౌష్ఠికాహారం తీసుకోకపోయినా, శరీరంలోని హార్మోన్లు సక్రమంగా లేకపోయినా కూడా చుండ్రు వస్తుంది.

దీనివల్ల వచ్చే మానసిక ఆందోళన నుంచి బయటపడాలన్నా, చుండ్రుపోవాలన్నా ఎప్పుడూ మందులపై ఆధారపడకూడదు. ఇంట్లోనే తయారు చేసుకొనే కొన్ని పధార్థాలను ఉపయోగించడం. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ బాధ తగ్గించుకోవచ్చు. మీ తలలోని చుండ్రు వస్తే అంతకు ముందు ఆహారపధార్థాలు ఏం తీసుకున్నారో గమనించండి. తినే ఆహారంలో మార్పు వచ్చినా చుండ్రు వస్తుంది. దాని నివారణకు ఎక్కువ ఆకు కూరలు, పీచు పధార్థాలు, విటమిన్ ఎ ఎక్కువగా వుండే పండ్లు తినాలి.

కాయగూరలు, చేపలను ఆహారంలో తీసుకోవాలి. వేపుడు పధార్థాలు, ఎక్కువగా వేడిగా ఉండే పధార్థాలను తినకూడదు. ప్రోటీన్లు ఎక్కువగా ఉండే పధార్థాలను తినాలి. తలను ఎప్పుడూ కప్పి వుంచకూడదు. తలలో తేమ లేకుండా చూసుకోవాలి. తరచుగా తలకు షాంపూ పెట్టి సరైన కండిషనర్ జాగ్రత్తగా వాడాలి. వాటిని వాడినప్పుడు. తలను శ్రద్దగా శుభ్రపరచాలి. యాయిశ్చరేజింగ్ షాంపూ, హెర్బల్ కండిషనర్ ను వాడితే చర్మం పొడిగా అవదు. ఇతరులు వాడిన దువ్వెన, బ్రష్లను ఉపయోగించకూడదు. వాటివల్ల ఇతరుల తలలో ఉండే చుండ్రు మీకు వచ్చే ప్రమాదం ఉంది. అలాగే మీరు చుండ్రుతో బాధపడుతుంటే జుట్టు దువ్వుకున్నాక వెంటనే దువ్వెన బ్రష్ను శుభ్రపరచండి. ఆరు చెంచాల నీళ్ళల్లో రెండు చెంచాలు వెనిగర్ కలపాలి. షాంపూతో తలస్నానం చేశాక. వెనిగర్ నీళ్ళను తలకు పట్టించాలి. ఇలావారానికి ఒకసారి చొప్పున కనీసం మూడునెలలు చేస్తే చుండ్రు తగ్గుతుంది.   

No comments:

Post a Comment