Sunday, August 19, 2012

శ్రీ వేంకటేశ్వర సుప్రభాతమ్

కౌశల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే
ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవ మాహ్నికమ్
తా: కౌశాల్యాదేవికి సుపుత్రుడవగు ఓ రామా! పురుషోత్తమా! తూర్పు తెల్లవారుచున్నది. దైవ సంభంధములైన ఆహ్నికములను చేయవలసియున్నది. కావున లెమ్ము.

ఉత్తి ష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ
ఉత్తిష్ఠ కామాలాకాంత త్ర్యైలోక్యం మగళంకురు 2
తా: ఓ గోవిందా! లెమ్ము. గరుడ ధ్వజము కల దేవా! లెమ్ము. ఓ లక్ష్మీ వల్లభా ! లెమ్ము. లేచి ముల్లోకములకును శుభము కలిగింపుము.

మాతఃసమస్త జగతాం మధుకైటభారే
వక్షో విహారిణి మనోహర దివ్యమూర్తే
శ్రీ స్వామిని శ్రితజన ప్రియదాన శీలే
శ్రీ వేంకటేశ దయితే తవ శుప్రభాతమ్ 3

తా: సమస్త లోకములకును మాత్రుదేవతవును, విష్ణుదేవుని వక్షస్థలమందు విహరించుదానవును, మనస్సును ఆకర్షించు దివ్య సుందర స్వరూపము కలదానవును, జదీశ్వరివిని, ఆశ్రితుల కోరికలను నేరవేర్చుదానవును, శ్రీ వేంకటేశ్వరుని సతీమణివి అగు ఓ లక్ష్మీ దేవి! నీకు సుప్రభాతమగు గాక.

తవసుప్రభాత మరవిందలోచనే
భవతు ప్రసన్న ముఖచంద్ర మండలే
విధి శంకరేంద్ర వనితాభిరర్చితే
వృషశైల నాథయితే దయానిధే 4
తా: కమలములను పోలు కన్నులును, చంద్రబింబమువలె ప్రసన్నమైన ముఖమును గల ఓ లక్ష్మీ దేవి! నిన్ను సరస్వతి, పార్వతి, శచీదేవి పూజించుచుందురు. శ్రీ వేంకటేశ్వరుని సతీమణివి, దయానిధివి అగు నీకు సుప్రభాతమగు గాక.

ఆత్యాది సప్తఋషయస్య ముపాస్య సంధ్యాం
ఆకాశ సింధు కమలాని మనోహరాణి
ఆదాయ పాదయుగ మర్చయితుం ప్రసన్నాః
శేషాద్రి శేకరవిభో తవ సుప్రభాతమ్5

తా: అత్రి మున్నగు సప్త మహర్షులను తమ చక్కని సంధ్యావందనమును ముగించి, ఆకాశ గంగ యందలి చక్కని కమలములను తెచ్చి నీ పాదములను చూజించుటకు వచ్చియున్నారు, ఓ వేంకటాచలపతీ! నీకు సుప్రభాతమగు గాక.

పంచాన నాబ్జ భావ షణ్ముఖ వాసవాద్యాః
త్రైవిక్రమాది చరితం విబుధాః స్తువంతి
భాషాపతి: పటతి వాసర శుద్ధి మారాత్
శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతమ్6
తా : శివుడు, బ్రహ్మ, కుమారస్వామి, ఇంద్రుడు మున్నగు దేవతలు త్రివిక్రమావతారము. మున్నగు నీ అద్భుత చరిత్రలను కొనియాడుచున్నారు. బృహస్పతి నీ దగ్గరగా ఉండి నేటి తిథి వారాదుల ఫలములను చదువుతున్నాడు. ఓ వెంకటాచలపతీ! నీకు సుప్రభాతమగు గాక.

ఈ ష త్ప్రపుల్ల సరసీరుహ నారికేళ
పూగద్రుమాది సుమనోహర పాళికానాం
ఆవాతి మందనిల స్సహ దివ్య గంధై:
శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతమ్ 7
తా: కొంచెం వికసించిన తామర పూలయొక్క, కొబ్బరి, పోక మున్నగు చెట్ల అందమైన మోవుల యొక్క సువాసనలతో మలయమారుతము మెల్లగా వీచుచున్నది, ఓ వేంకటేశ్వరా! నీకు సుప్రభాతమగు గాక.

ఉన్మీల్య నేత్ర యుగ ముత్తమ పంజరస్థాః
పాత్రా వశిష్ట కదలీ ఫల పాయసాని
భుక్త్వా సలీల మథ కేళిశుకాః పటంతి
శేషాద్రి శేకరవిభో తవ సుప్రభాతమ్8
తా: ఓ శేషశైలపతీ! చక్కని పంజరములలో వున్న పెంపుడు చిలుకలు తామిది వరకు కొంత భక్షింపగా పాత్రలలో మిగిలియున్న అరటిపండ్లను, పాయసమును తిని వాలాసముగా పాడుచున్నవి. ఓ వేంకటేశ్వరా! నీకు సుప్రభాతమగు గాక!


తంత్రీ ప్రకర్ష మధుర స్వనయా విపంచ్యా
గాయన్త్యనంత చరితం తవ నారదోపి
భాషాసమగ్ర మసక్రుత్కర చారురమ్యం
శేషాద్రి శేకరవిభో తవ సుప్రభాతమ్9
తా: ఓ అనంతా! నారదుడు కూడా మధురముగా ధ్వని చేయు తన వీణ తీగలను మీటుచు, పెక్కు సారులు రమ్యముగా హస్తాభినయము చేయుచు, చక్కని భాషతో నీ దివ్య చరిత్రమును గానము చేయుచున్నాడు. ఓ శేశాశైలాదిశా! నీకు సుప్రభాతమగు గాక.

బృంగావళీ చ మకరంద రసానువిద్ద
ఝుంకార గీత నినదై: సహసేవనాయ
నిర్యాత్యు పాంత సరసీ కమలోదరేభ్యః
శేషాద్రి శేకరవిభో తవ సుప్రభాతమ్10
తా: మకరందమును త్రాగి విజ్రుంభించిన తుమ్మెదల గుంపు ఝుంకార గీత ధ్వనులతో నిన్ను సేవించుటకై సమీప సరస్సులలోని కమలములనుండి బయలువెడలి వచ్చుచున్నవి. ఓ శేషాచలపతీ! నీకు సుప్రభాతమగు గాక.

యోషాగణేన వరదధ్ని విమధ్య మానె
ఘోషాలయేషు దధి మంథన తీవ్ర ఘోషాః
రోషాత్కలిం విదధతే కకుభశ్చ కుంభాః
శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతమ్ 11
తా: ఓ శేషాద్రి నాదుడవగు ఓ వేంకటేశ్వరా! గొల్ల పల్లెలోని గొల్ల పడుచులు పెరుగు చిలుకుచుండగా ఆ చిలికిన ధ్వనికి దిక్కులు ప్రతిధ్వనించుచున్నవి. ఆ ధ్వని, ప్రతిధ్వనులు బట్టి పెరుగు కుండలు, దిక్కులు కలహించుచున్నవా? అన్నట్లు కానవచ్చుచున్నవి. ఓ దేవా! నీకు సుప్రభాతమగు గాక.

పద్మేశ మిత్ర శతపత్ర గతాళివర్గాః
హర్తుం శ్రియం కువలయస్య నిజాంగ లక్ష్మ్యాః
భేరీనినాద మివ భిభ్రతి తీవ్రనాదం
శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం 12
తా: సూర్యుని మిత్రములగు కమలములయందున్న తుమ్మెదలు, తమ దేహకాంతిచే కలువల నల్లని కాంతిని అపహరించుటకు బయలు వెడలి భేరీని వాయించునట్లుగా ధ్వని చేయుచున్నవి. ఓ శేషాచల ప్రభూ! నీకు సుప్రభాతమగు గాక.

శ్రీ మన్నభీష్ట వరదాఖిల లోక బంధో
శ్రీ శ్రీనివాస జగదేక దయైక సింధో
శ్రీ దేవతాగృహ భుజాంతర దివ్య మూర్తే
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్ 13
తా: శ్రీ మంతుడవైన ఓ దేవా! నీవు కోరిన వరములనిచ్చువాడవు. లోకములన్నింటికిని బంధువుడవు. ఓ శ్రీనివాసా! లోకములన్నింటను నీ వొక్కడవే దయా సముద్రుడవు. లక్ష్మీదేవికి నివాసమగు వక్షస్సు కలవాడవు. దివ్య స్వరూపుడవు. ఓ వేంకటేశ్వరా! నీకు సుప్రభాతమగు గాక.

శ్రీ స్వామి పుష్కరిణికా ప్లవ నిర్మలాంగాః
శ్రేయోర్ధినో హరవిరించి సనంద నాద్యాః
ద్వారే వసంతి వరవేత్ర హతోత్త మాంగాః
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్14
తా: బ్రహ్మ, శివుడు, సనందనుడు మున్నగు వారు స్వామీ పుష్కరిణిలో స్నానముచేసి పరిశుద్ధులై తమ మేలునకై ద్వారముకడ బెత్తములవారు తలలపయి కొట్టుచున్ననూ లెక్కింపక కాచుకొనియున్నారు. ఓ వేంకటాచలపతీ! నీకు సుప్రభాతమగు గాక.

శ్రీ శేషశైల గరుడాచల వేంకటాద్రి
నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్యాం
ఆఖ్యాం త్వదయవసతే రనిశం వదంతి
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్15
తా: ఓ వెంకటేశ్వరా! నీ నివాసమగు ఈ పర్వతమును అందరును శేషశైలము, గరుడాచలము, వేంకటాద్రి, నారాయణాద్రి, వృషభాద్రి, వృషాద్రి మున్నగు పేర్లతో నిత్యమూ పిలుచుచుందురు. ఓ దేవా! నీకు సుప్రభాతమగు గాక.

సేవాపరాః శివసురేశ కృశానుధర్మ
రక్షోంబునాథ పావనామ ధనాది నాథాః
బుద్దాంజలి ప్రవిలసన్నిజ శీర్ష దేశాః
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్16
తా: ఈశానుడు, ఇంద్రుడు, అగ్ని, యముడు, నిర్రుతి వరుణుడు, వాయువు, కుబేరుడు అను అష్టదిక్పతులును శిరస్సులపై చేతులు మోడ్చి నీ సేవకయి కాచుకొనియున్నారు. ఓ వేంకటాచలపతీ ! నీకు సుప్రభాతనగు గాక.

ధాటీషు తే విహగరాజ మృగాది రాజ
నాగాధి రాజ గజరాజ హయాధి రాజాః
స్వస్వాధి కార మహిమాధిక మర్ధయంతే
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్17
తా: దేవా! గరుడుడు, మృగరాజు, ఆదిశేషుడు, గజేంద్రుడు, అశ్వరాజును దండయాత్రలయందు తమ తమ శక్తిని చూపుటకు నీ యనుమతిని వేడుచున్నారు. ఓ వేంకటేశ్వరా! నీకు సుప్రభాతమగు గాక.

సూర్యేందు భౌమ బుధ వాక్పతి కావ్యసౌరి
స్వర్భాను కేతుదివిషత్సరి  షత్ప్రదానాః
త్వద్దాస దాస చరమావధి దాసదాసాః
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్18
తా: సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, బృహస్పతి, శుక్రుడు, శని, రాహువు, కేతువు, అను నవగ్రహములు నీదాస, దాసచరమావధి దాసులకు దాసులయి ఉన్నారు. ఓ వేంకటాచలపతీ! నీకు సుప్రభాతమగు గాక.

తత్పాద ధూళి భరిత స్పురితోత్త మాంగాః
స్వర్గాపవర్గ నిరపేక్ష నిజాంత రంగా
కల్పాగమా కలనయా కులతాం లభంతే
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్19
తా: ఓ స్వామీ! నీ పాద దూళిచే శిరస్సు పవిత్రమైన వారు వేరే స్వర్గ మోక్షములను మనస్సులో కూడా కోరారు. ఈ కల్పము అంతమై పోవునేమో అనియే కలత పడుచుందురు. ఓ వేంకటాచలపతీ! నీకు సుప్రభాతమగు గాక.    

తద్గోపురాగ్ర శిఖరాణి నిరీక్ష మాణాః
స్వర్గాపవర్గ పదవీం పరమాశ్ర యంతః
మర్త్యా మనుష్య భువనే మతిమాశ్రయంతే
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్20
తా: స్వర్గ, మోక్షములకు పోవుచున్నవారు మార్గములో నీ గుడి గోపురముల శిఖరములను చూచి ఆనంద పరవశులే మనుష్యులుగా భూలోకమునందే మిమ్ము దర్శించుచూ ఉండవలెనని కోరుచుందురు. ఓ వేంకటేశ్వరా! నీకు సుప్రభాతమగు గాక.

శ్రీ భూమినాయక దాయాది గుణామృతాబ్దే
దేవాధి దేవ జగదేక శరణ్య మూర్తే
శ్రీ మన్ననంత గరుడాది భి రర్చి తాంఘ్రే
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్21

తా: ఓ దేవాది దేవా! నీవు శ్రీదేవికి, భూదేవికి భర్తవు. దయ మున్నగు గుణములకు పాల సముద్రము వంటివాడవు. లోకములకన్నింటికి శరణ మిచ్చువాడవు. నీ వొక్కడవే. అనంతుడు, గరుడుడు, నీ పాదములను సేవించుచుందురు. ఓ వేంకటేశ్వరా! నీకు సుప్రభాతమగు గాక.

శ్రీ పద్మనాభ పురుషోత్తమ వాసుదేవ
వైకుంట మాధవ జనార్ధన చక్రపాణే
శ్రీ వత్స చిహ్న శరణాగత పారిజాత
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్22
తా: ఓ వేంకటేశ్వరా! నీవు పద్మము నాభి యందు కలవాడవు. పురుషోత్తముడవు. వాసుదేవుడవు. వైకుంటుడవు. మాధవుడవు. జనులను రక్షించువాడవు. హస్తమున చక్రము కలవాడవు. శ్రీ వత్స చిహ్నము కలవాడవు. శరణు జొచ్చినవారి పాలిట కల్పవృక్షమవు. నీకు సుప్రభాతమగు గాక.

కందర్పదర్ప హర సుందర దివ్యమూర్తే
కాంతా కుచాంబురుహ కుట్మలలోలదృష్టే
కళ్యాణ నిర్మల గుణాకర దివ్య కీర్తే
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్23
తా: మన్మధుని గర్వము నణచు దివ్య సుందర శరీరము కల ఓ దేవా! నీ దృష్టి తామర మొగ్గలవంటి యువతి కుచములపయి పరిబ్రమించు చుండును. నీవు కీర్తి కలవాడవు. ఓ వేంకటేశ్వరా ! నీకు సుప్రభాతమగు గాక.

మీనాకృతే కమట కోల నృసింహ వర్ణిన్
స్వామిన్ పరశ్వథ తపోధన రామచంద్ర
శేషాంశ రామ యదునందన కల్కిరూప
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్24
తా: ఓ వేంకటేశ్వరా! నీవు మత్స్య , కూర్మ, వరాహ, నరసింహ, వామన, పరశురామ, శ్రీరామ, బలరామ, శ్రీకృష్ణ, కల్కి రూపములను ధరించితివి. ఓ దేవా! నీకు సుప్రభాత మగు గాక.

ఏలాలవంగ ఘనసార సుగంధి తీర్ధం
దివ్యం వియత్సరసి హేమ ఘుటేషు పూర్ణం
ద్రుత్వాద్య వైదిక శిఖామణయః ప్రహృష్టాః
తిష్టంతి వేంకటపతే తవ సుప్రభాతమ్25
తా: ఓ దేవా! వైదికులగు భక్తులు, ఏలకులతోను, పచ్చకర్పూరముతోను పరిమళించు పవిత్ర గంగా జలమును బంగారు కలశముల నిండుగా నింపి తెచ్చి సంతోషముతో నీ సేవకై యెదురు చూచుచున్నారు. ఓ వేంకటేశ్వరా! నీకు సుప్రభాతమగు గాక.

భాస్వానుదేతి వికాసాని సరోరుహాణి
సంపూర్ణయంతి నినదై: కకుభో విహంగాః
శ్రీ వైష్ణవాః సతత మర్దిత మంగళాస్తే
ధామాశ్రయంతి తవ వేంకట సుప్రభాతమ్26
తా: ఓ దేవా! సూర్యుడు ఉదయించుచున్నాడు. కమలములు వికసించుచున్నవి. పక్షులు తమ కిలకిలా రావములతో దిక్కులను నింపుచున్నవి. శ్రీ వైష్ణవులు శుభములను కోరుచూ సన్నిధిలో వేచియున్నారు. ఓ వేంకటాచలపతీ! నీకు సుప్రభాతమగు గాక.

బ్రహ్మాదయ స్సురవరా స్సమ హర్ష యస్తే
సంత స్సనందన ముఖా స్త్వథ యోగి వర్యాః
ధామాంతికే తవ హి మంగళ వస్తు హస్తాః
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్27
తా: ఓ దేవా! బ్రహ్మ మున్నగు దేవతలు, మహర్షులు, సనందనుడు మున్నగు సత్పురుషులు, యోగులును నీ పూజకు తగిన మంగళకర వస్తువులను హస్తములందు ధరించి, నీ సన్నిధికి వచ్చియున్నారు. ఓ వేంకటేశ్వరా!

లక్ష్మీ నివాస నిరవద్య గుణైక సింధో
సంసార సాగర సముత్తరణైక సేతో
వేదాంత వేద్య నిజవైభవ భక్తభోగ్య
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్28

ఇత్ధం వృషా చలపతే రిహ సుప్రభాతమ్
యే మానవాః ప్రతిదినం పటితుం ప్రవృతాః
తేషాం ప్రభాత సమయే స్మృతిరంగ భాజాం
ప్రజ్ఞాం పరార్ధ సులభాం పరమాం ప్రసూతే 29||

No comments:

Post a Comment