రక్త మాల్యంబర ధరా! శూల శక్తి గదా ధరా ! చతుర్బుజా ! మేష గతా ! వరదా ! మంగళా ! ఋణ హర్తా ! ధన ప్రదా ! లోహితా ! మహారోగ హారకా ! సర్వ దేవ పూజితా అంగారకా ! మహీపుత్రా ! భగవంతా ! భక్త వత్సలా ! నాకు నా నమస్కారములు. అంతులేని నా ఋణములు తీరునట్లు అనుగ్ర హింపుము. నన్ను ధనవంతుని చేయుము. నీవే నాకు శరణ్యము అని నిత్యము కుజ నామములు పటించు వారు తప్పక భాగ్య వంతులు కాగలరు. ఈ స్తోత్రము సర్వ రోగ నివారిణి, సంపత్కారిణి.
No comments:
Post a Comment