Tuesday, August 21, 2012

విఘ్నేశ్వరుడు

ఒకానొకప్పుడు లక్ష్మి మానస సరోవరంలో జలకమాడుతూండగా, పార్వతి విష్ణువు వేషం ధరించి లక్ష్మిని సమీపించింది. నవమోహ నంగా కనిపించిన నారాయణుని లక్ష్మి చూసింది. నారాయణుడి వేషంలో ఉన్న పార్వతికి కూడా లక్ష్మి అద్భుత సౌందర్యం అత్యంత మనోహ రంగా కనిపించింది. ఇద్దరూ ఒకసారి సాభి ప్రాయoగా చూసుకున్నారు. ఆ చూపుల కలయికలో సరోవరంలో ఒక స్వర్ణకమలం లేచింది.

అందులో ధగధగ మెరిసిపోతున్న పసిపాప ఉన్నది. లక్ష్మి, నారాయణుని దగ్గిరచేరి ఆప్యా యoగా కౌగలించుకోబోయింది. పార్వతి పగలబడి నవ్వుతూ,‘‘నేను నారాయణుడిని కాను, లక్ష్మీ!'' అని ఆ క్షణమే నిజరూపంతో కనిపించింది. లక్ష్మి, ‘‘అన్నకు తగ్గ చెల్లెలివే, నారాయణి అనిపించుకున్నావులే!'' అన్నది చిన్నగా నవ్వుతూ. పార్వతి, ‘‘అప్పుడు విష్ణువు మోహినీ రూపంతో శివుణ్ణి మాయబుచ్చినదానికి ఇది చెల్లువేసుకో!''అన్నది. స్వర్ణకమలంలోని పసిదాన్ని చూసి ఇద్దరూ మురిసిపోయారు.

అప్పుడు విఘ్నేశ్వరుడు వచ్చి,‘‘తల్లులారా! మీ ఇద్దరి అంశలతో అవత రించిన ఈ బిడ్డ పార్వతి పరంగా జయ, లక్ష్మి పరంగా శ్రీ కలిసి జయశ్రీగా పెరుగుతుంది. ఆమెకు వరుడు కూడా శివకేశవుల అంశలతో అవతరించి ఉన్నాడు!'' అని చెప్పి, పసిదానితో ఉన్న స్వర్ణకమలాన్ని తీసుకువెళ్ళి కావేరీ నదిలో ఉంచి రమ్మని వాయుదేవుడికి చెప్పాడు.
వాయుదేవుడలాగే జయశ్రీని కావేరినదికి చేర్చాడు. దక్షణ ప్రాంతాన్ని పాలించే చక్రవర్తి స్వర్ణ కమలంలో కనిపించిన బాలికను, వరప్రసా దంగా లభించిన పుత్రికగా భావించి, పరమా నందంతో తీసుకువెళ్ళి, నామకరణ మహో త్సవం జరిపించుతూండగా, ఆకాశవాణి, ‘‘జయశ్రీ అని పిలవండి!'' అని పలికింది.

జయశ్రీ రాకుమారిగా పెరిగి ముల్లోకాల్లో అంత సౌందర్యవతి, సాహసవంతురాలు ఉండదనిపించుకున్నది. జయశ్రీకి రాజభవనం కంటే ప్రకృతి సౌందర్యంతో నిండి ఉండే అరణ్యాల్లో విహ రించడమే ఇష్టంగా ఉండేది. ఎల్లప్పుడూ విల్లమ్ములు ధరించి, అరణ్య మధ్యానికి వెళ్ళి వన్యమృగాలను అదుపులో ఉంచుతూ తిరుగుతూండేది. హరిహరాంశలతో అవతరించిన స్వామి కైలాసం వెళ్ళి, విఘ్నేశ్వరుణ్ణి, కుమారస్వామిని కలుసుకోవాలని ఎన్నాళ్ళుగానో అనుకుంటు న్నాడు.

ఒకనాడు అలాగే బయలుదేరి కైలాసం వెళ్ళాడు స్వామి. విఘ్నేశ్వరుడు, కుమార స్వామి ఆనందంగా ముచ్చటలాడుతూ, మానససరోవరం జలవిహారం చేస్తూండగా, విఘ్నేశ్వరుడు, ‘‘ఈ మానససరోవరంలోనే లక్ష్మీ పార్వతుల అద్భుత తేజస్సులతో స్వామికి కాబోయే దేవేరి ఉదయించింది!'' అని ఊరు కున్నాడు. స్వామికి కుతూహలం కలిగినా అణుచు కొని, మరి కొంతకాలం అక్కడ గడిపి, వెళ్ళ బోతున్నప్పుడు, విఘ్నేశ్వరుడు,

‘‘స్వామీ! మాకంటే పెద్దవాడివైన నీవు బ్రహ్మచారిగా ఉండటం బాగాలేదు. సత్వరంగా నీకు కళ్యా ణంతప్పదు!'' అన్నాడు. కుమారస్వామి, విఘ్నేశ్వరుడు స్వామికి ఘనంగా వీడ్కోలు ఇచ్చారు. స్వామి నిజ నివాసానికి చేరుకున్నాడు. ఒకనాడు స్వామి వినోదంగా పెద్దపులి మీద స్వారీ చేస్తూ అరణ్యంలో తిరుగుతూండగా, పులిని ముందుకూ, అటు ఇటూ కదల నివ్వ కుండా చుట్టూరా బాణాలు రివ్వురివ్వున నాటుకున్నాయి. స్వామి బాణాలు వచ్చిన దిశగా కోపంగా చూశాడు. ఆయన కోపం పటా పంచలైంది. విల్లమ్ములతో ఠీవిగా నిల్చుని చిరునవ్వు విసిరిన జయశ్రీ కనిపించి, స్వామి గుండెలో బాణంలాగ గుచ్చుకున్నది. స్వామి అంతర్థానమయూడు. జయశ్రీకి స్వామిని గురించి విఘ్నేశ్వరుడు కలలో కనిపించి అదివరకే చెప్పిఉన్నాడు.

అతనికోసమే వెతుకుతూ అరణ్యాల్లో తిరుగు తున్నది. నారదుడి ఆదేశంతో, చక్రవర్తి జయశ్రీకి స్వయoవరం ఏర్పాటు చేశాడు. రాజాధిరాజు లుగా మారురూపాలతో ఇంద్రాది దేవతలు కూడా వచ్చారు. స్వామి ఒక సాధారణ శబర యువకుడి రూపంతో విల్లమ్ములు ధరించి, పెద్ద నల్లని కుక్కను వెంటబెట్టుకొని వచ్చాడు. రాజాధిరాజులు ఠీవి ఒలకబోస్తూ శబర  యువకుణ్ణీ, అతని పెంపుడు కుక్కనూ ఎక సక్కెం చేశారు.స్వామి సింహద్వారానికి అడ్డంగా, అందర్నీ కారాగారంలో బందీలు చేసినట్టు కుక్కమీద కూర్చున్నాడు. కుక్క పెద్ద„పులిగా మారింది. భయoకరంగా గాండ్రుమన్నది. జయశ్రీ స్వామిని గుర్తించి చరచరా వచ్చి వరమాల వేసి వరించింది. స్వామి జ యశ్రీని పులిమీద ముందు కూర్చుండబెట్టుకున్నాడు. దేవతలకు కోపం వచ్చింది. శబరయువకుడి మీద ఒక్కుమ్మడిగా విరుచుకుపడి, ఆయుధాలు తీశారు.

స్వామి విల్లమ్ములు తీసి అందర్నీ ఎదుర్కొన్నాడు. అతని బాణప్రెూగధాటికి దేవతలు చెల్లాచెదరై, నిజరూపాలతో అస్ర్తాలు ప్రయే గించారు. స్వామిని ఎలాంటి అస్ర్తమూ తాకలేక పోయింది. ఇంద్రుడి వజ్రాయుధం కూడా పనికిమాలినదైంది. అప్పుడు స్వామి తన నిజ రూపంతో హరిహరస్వామిగా సాక్షాత్కరిం చాడు. దేవతలు చేతులు మోడ్చారు, ‘‘శరణం స్వామీ!'' అన్నారు. స్వామి జయశ్రీల కళ్యాణం దేవాదిదేవ తలమధ్య మహావైభవంగా జరిగింది. జయశ్రీతో కలిసి స్వామి ఆనందంగా నిజనివాసానికి వెళ్లాడు. త్రేతాయుగంలో ఆర్యావర్తంలో కోసలుడు, కేకయుడు, వసుమిత్రుడు అనే రాజులు ముగ్గురూ ఆప్తమిత్రులుగా ఉండేవారు. కోసలుడికి కౌసల్య, కేకయుడడికి కైకేయి, వసుమిత్రుడికి సుమిత్ర అనే కుమార్తెలు ఉన్నారు. అెూధ్యను పాలించే దశరథుడికి తమ కుమార్తెలను ఇచ్చి పెళ్ళి చేయాలని ముగ్గురు రాజులకూ ఏకాభిప్రాయoకలి గింది.

దశరథుడు వారిని వివాహమాడడానికి అంగీకరించాడు. ముగ్గురు రాజులూ జైమినిమహర్షి చేత వివాహానికి తగిన లగ్నం పెట్టించారు. జైమిని ముహూర్తం నిర్ణయించి, ‘‘నేను పెట్టిన ముహూర్తబలం ఎటువంటిదంటే, విఘ్నేశ్వరుడి సాక్షగా ఈ ముగ్గురి వివాహం దశరథుడితో జరిగితీరుతుంది! అయితే, వివాహం జరిగే ముందు రాకుమార్తెలకు ఒక రాక్షస గండం కనిపిస్తున్నది.కనుక, వధువులు ముగ్గుర్నీ చాలా జాగ్రత్తగా ఉంచాలి!'' అని చెప్పాడు. ముగ్గురు కన్యలనూ రాజులు ఒక పెద్ద పెటె్టలో భద్రంగా దాచారు. ఆసమయoలో లోకసంచారం చేస్తూ, లంకకు చేరిన నారదుడు రావణాసురుడితో, ‘‘లంకేశ్వరా! అతి త్వరలోనే దశరథుడికి ముగ్గురు రాజకుమార్తెలతో వివాహం కాబో తున్నది. దశరథుడి కుమారుడు నిన్ను హతమారుస్తాడు!'' అని చెప్పాడు.

రావణుడు రాకుమార్తెలను ఎత్తుకు రమ్మని మహోదరుడు అనే గొప్ప రాక్షసుణ్ణి పంపాడు. మహోదరుడు కన్యలను పెటె్టలో భద్రపరిచినది కనిపెట్టి, ఆ పెటె్టను మ్రింగే శాడు. వాడు ఆకాశమార్గంగా సముద్రం మీదుగా లంకకు వెళ్తూండగా, కడుపు నొప్పి వచ్చి పెటె్టను కక్కేశాడు. సముద్రంలో పడి పెటె్ట కెరటాలమీద మెల్లగా కొట్టుకుంటూ పోయింది. దశరథుడు సముద్రం మీద దూరతీరా లకు వెళ్ళి పెద్ద నౌకలో తిరిగి వస్తున్నాడు. ప్రయాణం ఆలస్యమైంది.

అనుకున్ననాటికి చేరలేకపోతున్నందుకు విచారిస్తూ, దశరథుడు సముద్రాన్ని చూస్తూండగా, నౌకవైపే కొట్టుకొని వస్తున్న పెద్ద పెటె్ట కనిపించింది. పెటె్ట నౌకను ఢీకొని పైకప్పు ఊడిపోయింది. అందులో రాకుమార్తెలు కనిపించారు. తాళ్ళ నిచ్చెనలతో వాళ్ళను నౌక మీదకు రప్పించాక, ఆ ముగ్గురూ తాను వివాహం చేసుకోనున్న పెండ్లికుమార్తెలే నని దశరథుడు తెలుసుకున్నాడు. సరిగ్గా అదే సమయానికి జైమినిమహర్హి ముహూర్తం పెట్టాడు.

అప్పుడు అక్కడ విఘ్నేశ్వరుడు ప్రత్య క్షమై, ముగ్గురు రాకుమార్తెలతో దశరథుడి వివాహం జరిపించి, అంతర్థానమయాడు. ముగ్గురు వధువులతో దశరథుడు ఆనందంగా స్వదేశం చేరుకున్నాడు. చిరకాలానికి దశరథుడికి నలుగురు కుమారులు పుట్టారు. పెద్దవాడైన రాముడు కైకేయి కారణంగా సీతతో, లక్ష్మణుడితో అరణ్యవాసం వెళ్ళాడు. రావణుడు సీతను ఎత్తుకుపోయి లంకలో పెట్టాడు.రాముడు హనుమంతుడు, సుగ్రీవుడు మొదలైన వాన రుల సహకారంతో లంకను ముట్టడించి, రావణ సంహారం చేశాడు. ఆ తరవాత సీతతో పుష్పక విమానంలో బయాలుదేరి, వారధి కట్టడం ప్రారంభించిన సముద్రతీరంలో ఆగి, అక్కడ శివపూజ జరిపి, అెూధ్యకు వెళ్ళా లనుకున్నాడు.

శివలింగ ప్రతిష్ఠకు తగిన లింగాన్ని తీసుకు రమ్మని హనుమంతుడిని కైలాసానికి పంపాడు. హనుమంతుడు మనోవేగంతో కైలాసం చేరు కొని, అక్కడ ఉన్న శివలింగాల్లో పెద్ద లింగాన్ని చూసి రెండు చేతులతో ఎత్తబోయాడు. లింగం కొంచమైనా కదల్లేదు. దానికంటే చిన్న లింగాన్ని తీయబోయాడు. అదీ కదల్లేదు. చివరికి అన్నిటికంటే చిన్నలింగాన్ని కూడా ఎత్తలేకపోయాడు. కాలం మించిపోతున్నది.

తన అసమర్థ తకు హనుమంతుడు విచారిస్తుండగా, బుడి బుడి నడకలతో అక్కడికి ఒక పిల్లవాడు వచ్చాడు. ‘‘ఎవరనీవు? హనుమం తుడిలాగే ఉన్నావు, కాని కావు!'' అన్నాడు పిల్లవాడు. ‘‘నేను హనుమంతుడినే! ఒక శివలిం గాన్ని తీసుకురమ్మని రాముడు పంపాడు. ఇంతకూ, నీవెవరవోయి, బాలుడా?'' అన్నాడు హనుమంతుడు. ‘‘ ఇక్కడి లింగాలను ఎవరూ ఎత్తుకు పోకుండా నన్ను కాపలా ఉంచారు గాని, నీవు హనుమంతుడవని చెబుతున్నావు, హను మంతుడు శివుడి అవతారమే అనీ, పంచ ముఖాంజనేయడనీ విన్నాను.నీ పంచ ముఖాలు ఏవీ?'' అన్నాడు పిల్లవాడు అమాయకంగా. అప్పుడు హనుమంతుడు గరుడ, వరాహ, సింహ, అశ్వముఖాలను కలుపుకొని, పంచ ముఖాంజనేయడై, ఉన్నతంగా పెరిగి పిల్ల వాడితో నవ్వుతూ, ‘‘విఘ్నేశ్వరా! నా వంతు అయింది. పంచముఖ విఘ్నేశ్వర రూపంతో కనిపించడం నీ వంతు!'' అన్నాడు.

అప్పుడు బాలుడి రూపంలో ఉన్న విఘ్నేశ్వ రుడు, ఐదు తలలతో సమాన ఎత్తున పెరిగి విశ్వరూపంతో కనిపించాడు. హనుమంతుడు పంచముఖ విఘ్నేశ్వ రుడికి నమస్కరించి, ‘‘పిల్లవాడి రూపంతో వస్తున్నప్పుడే విఘ్నేశ్వరుడివని గ్రహించాను. ఇక్కడి శివలింగాలు కదలకుండా చేసింది నీవే కదా? నీవే ఒక లింగాన్ని ప్రసాదించు!'' అన్నాడు. విఘ్నేశ్వరుడు, ‘‘హనుమా!నీ పంచముఖ రూపం చూడాలన్న కుతూహలంతో నేను ఇలా చేశాను. నీవు శివాంశతో పుట్టినవాడవు, నీకు అడ్డేమిటి? అయినా అడిగావు గనక విశేషాంశలు గల లింగాన్ని నీకు ఇవ్వాలనే, ఎంచి ఉంచాను, తీసుకువెళ్ళు,'' అని చెబుతూ, హనుమంతుడి దోసిట్లో గొప్పదైన జ్యోతిర్లింగాన్ని ఉంచాడు. హనుమంతుడు మామూలు రూపంతో దోసి ట్లోని లింగాన్ని పదిలంగా పట్టుకొని, రివ్వున ఎగిరివెళ్ళాడు.

అప్పటికి కాలాతిక్రమణ జరిగింది. సమయo మించిపోకుండా సీతాదేవి ఇసు కతో శివలింగాన్ని చేసింది. రాముడు జలాభి షేకం చేసి, పూజకు ఉపక్రమించ బోతూండగా, హనుమంతుడు లింగంతో అక్కడ వాలాడు. హనుమంతుడు జరుగుతున్నది చూసి, తోకతో సైకతలింగాన్ని చుట్టి తీసివేయబోయడు. కాని ఇసుక లింగం చెక్కుచెదర లేదు. హనుమంతుడు మరింత తోక గట్టిగా బిగించి లాగితే తోక నొప్పిపెట్టిందేగాని లింగం ఏమాత్రం కదల్లేదు.

అప్పుడు రాముడు హనుమంతుణ్ణి శాంత పరిచి, ‘‘హనుమా! బుద్ధిమంతులు కూడా ఒక్కొక్కప్పుడు పొరపాటు పడుతూంటారు సుమీ! అన్నీ తెలిసినవాడివి, సైకతలింగ మైనా, అది శివునికి ఆనవాలు కదా? ఇంతకూ, ఇప్పుడేం మించిపోయిందిగనక. నీవు తెచ్చిన లింగాన్ని సైకతలింగం దాపునే ప్రతిష్ఠించి, పూజించి మరీ వెళతాను!''అని చెప్పాడు.హనుమంతుడు తను తెచ్చిన లింగాన్ని రాముడికి ఇచ్చి, లెంపలు వేసుకొని సైకత లింగానికి మ్రొక్కాడు. రాముడు హనుమంతుడు తెచ్చినలిం గాన్ని ప్రతిష్ఠించి, యధావిధిగా పూజాక్రమం సీతతో కలిసి జరిపిన పిమ్మట, అందరితో పుష్పకం మీద అయోధ్యకు చేరి, పట్టాభిషిక్తుడయూడు.

No comments:

Post a Comment