Sunday, August 19, 2012

నిత్యమూ చదువవలసిన ప్రత్యేక స్తోత్రములు

దేవతా దర్శనము చేయునపుడు పటించవలసిన స్తోత్రములు
గణేశ స్తుతి
తొలుత నవిఘ్నమస్తనుచు ధూర్జటి నంద నీకు మ్రొక్కెదన్
ఫలితము సేయుమయ్య నిను బ్రార్ధన జేసెడ నేకదంత నా
వలపలి చేతి గంటమున వాక్కున నెప్పుడు బాయకుండు మీ
తలపులలోన నేవేగతి దైవ వినాయక లోక నాయకా.

శ్రీ వేంకటేశ్వర స్తుతి.
వినా వేంకటేశం ననాథో నా నాథ
సదా వేంకటేశం స్మరామి స్మరామి
హరే వేంకటేశ ప్రసీద ప్రసీద
ప్రియం వేంకటేశ ప్రయచ్చ ప్రయచ్చ

శ్రీరామ స్తుతి
శ్రీరాఘవం దాశరథాత్మజ మప్రమేయం
సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం
ఆజానుబాహు మరవింద దళాయతాక్షం
రామం నిశాచర వినాశకరం నమామి.

శ్రీ కృష్ణ స్తుతి
కస్తూరీ తిలకం లలాట ఫలకే వక్ష స్థలే కౌస్తుభం
నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం
సర్వాంగే హరిచందనంచ కలయం కంటేచ ముక్తావళీ:
గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి:

శ్రీ దుర్గా స్తుతి
అమ్మలగన్న యమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ , చాలపె
ద్దమ్మ! సురారులమ్మ గడుపారడి పుచ్చినయమ్మ ! తన్నులో
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ములనుండెడి యమ్మ,దుర్గ!మా
యమ్మ! కృపాబ్ది యిచ్చుత మహాత్త్వక విత్వ పటుత్వ సంపదల్ ||

                          ధ్యాన స్తోత్రములు
                  కొన్ని సమయములయందు పటించవలసినవి
గురు ప్రార్ధన
శ్లో|| గురుబ్రహ్మ గురువిష్ణు: గురుర్దేవో మహేశ్వరః |
గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః ||

నిద్ర లేచునపుడు
శ్లో|| కరాగ్రే వసతే లక్ష్మీ: కరమధ్యే సరస్వతీ
కరమూలే స్థితా గౌరీ, ప్రభాతే కరదర్శనమ్ ||

నిద్రపోవునపుడు
శ్లో || రామస్కందం హనుమంతం, వైనతేయం వృకోదరం
శయనే యస్మరేత్ దుస్స్వప్న స్తశ్యనశ్యతి ||

స్నానం చేయుటకు ముందు
శ్లో|| అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాంగ తోపివా
యః స్మరే త్పుండరీ కాక్షం సబాహ్యాంభ్యంతర శ్శుచి: ||

స్నానం చేయునపుడు
శ్లో|| గంగేచ యమునే కృష్ణే, గోదావరి సరస్వతి
నర్మదే సింధు కావేరి, జలేస్మిన్ సన్నిధిం కురు ||
కావేరీ తుంగభద్రాచ, కృష్ణవేణి చ గౌతమీ

భాగీరథీ చ విఖ్యాతాః, పంచగంగా: ప్రకీర్తితాః ||
నదినీ నళినీ సీతా, మాలినీ చ మహాపగా
విష్ణుపాదాబ్జ సంభూతా, గంగాత్రి పథ గామినీ ||
భాగీరధీ భోగవతీ, జాహ్నవీ త్రిద శేశ్వరీ
ద్వాదశైతాని నామాని, యత్ర యత్ర జలాశయే ||
తత్ర తత్ర స్థితాగంగా, సర్వపుణ్య ఫలప్రదా
భవేత్ స్మరణ మాత్రేణ, సర్వదేవ నమస్కృతా ||

ప్రదక్షిణ నమస్కారము
శ్లో|| యానికానిచ పాపాని, జన్మాంతర కృతానిచ
తానితాని ప్రణశ్యంతి, ప్రదక్షిణ పదేపదే ||
సర్వపాపా ప్రశమనం, సర్వ సంపత్ప్రదాయకమ్
ప్రదక్షిణం కరోమీశ, తవ జ్ఞాన ప్రదాయినే ||
అన్యథా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ
తస్మాత్ కారుణ్య భావేన, రక్ష రక్ష జనార్ధన ||

భోజనము చేయుటకు ముందు
శ్లో || అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహ మాశ్రితః
ప్రాణాపాన సమాయుక్తః పచామ్యాన్నంచ తుర్విధం ||

భోజనము చేయునపుడు
శ్లో|| బ్రహ్మార్పణం బ్రహ్మ హవిర్బ్ర హ్మాగ్నౌ బ్రహ్మాణా హుతమ్ ||
బ్రహ్మైవ తేన గన్తవ్యం, బ్రహ్మకర్మ సమాభినా ||

భోజనము చేసిన తరువాత
శ్లో|| అగస్త్యం కుంభ కర్ణం చ శమ్యం చ బడబానలం
ఆహార పరిణామార్ధం స్మరామి చ వృకోదరం ||

గరుడ దర్శనము చేయునపుడు
శ్లో|| కుంకుమాంకిత వర్ణాయ కుందేందు ధవళాయ చ
విష్ణువాహ నమస్తుభ్యం పక్షి రాజాయతే నమః ||

పిడుగు పడినపుడు
శ్లో|| అర్జునః పల్గుణః పార్ధః కిరీటీ శ్వేత వాహానః
భీ భత్సుర్విజయః కృష్ణ స్సవ్యసాచీ ధనంజయః ||

సంధ్యా దీపదర్శనము చేయునపుడు
శ్లో || దీపంజ్యోతి: పరబ్రహ్మ దీపం సర్వత మోపహమ్
దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం నమోస్తుతే ||
(సంధ్యాకాలమందు కాక పూజా సమయము లందు కూడా 'దీపేన సాధ్యతే సర్వం దీపదేవ నమోస్తుతే'  అనవలెను.)

అశ్వత్ధ దర్శనము చేయునపుడు
శ్లో|| మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపిణీ
అగ్రతో శివరూపాయ వృక్ష రాజాయతే నమః ||

ఇంటినుంచి బయల్దేరునపుడు దుశ్శకున నాశమునకు
శ్లో|| యశ్శివో నామరూపాభ్యాం యాదేవీ సర్వమంగళా
తయో స్సంస్మరణా త్సుంసాం సర్వతో జయమంగళం ||
లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః
యేషా మిందీ వరశ్యామో హృదయస్థో జనార్దనః
అగ్రతః ప్రుష్టత శ్చైవ పార్శ్వత శ్చ మహాబలాః
ఆకర్ణ పూర్ణ ద న్వానౌ రక్షేతాం రామ లక్ష్మణౌ ||
సంనద్దః కవచీ ఖడ్గ చాపబాణథ రోయువా
గచ్చన్మ మాగ్రతో నిత్యం రామః పాతు సలక్ష్మణః ||

నూతన వస్త్రములు ధరించుటకు శుభదినములు
ఆదివారము  - కుంటుపడును; సోమవారము - కంటతడినిడును; మంగళవారము - అంటిన పాపంబు వచ్చును; బుధవారము - అతి సుఖమిచ్చును; గురువారము - ఇంటికి చుట్టము వచ్చును; శుక్రవారము - వెంటనే వస్త్రములు వచ్చును; శనివారము - వేగమే మాయును.

కన్నతల్లి ప్రార్ధన
శ్లో|| నాగాయ యత్ర్యా: పరో మంత్రో, నమాతు: పర దేవతాః
న హరే: పరత స్త్రాతా, నానృతా త్పాతకం పరమ్ ||
తనురిద మభి వృద్ధిం సమవాప్యాస్తే సర్వదేవతా శక్త్యా
దేవ్యా యయావికలయా మాత్రే తస్యైన మోస్తు భవత్యై ||

కన్నతండ్రి ప్రార్ధన
శ్లో||  యస్మాత్పార్ధివ దేహః, ప్రాదురభూద్యేన భగవతా గురుణా
సంతునమాంసి సహస్రం, తస్మై సర్వజ్ఞ మూర్తయే పిత్రే  ||

గాయత్రీ మంత్రము  
శ్లో|| యోదేవ స్సవితాస్మాకం ధి యోధ ర్మాది గోచరాః,
ప్రేరయే త్త స్య  యద్భర్గ స్త ద్వరేణ్య ముపాస్మ హే ||

No comments:

Post a Comment