Monday, August 20, 2012

శ్రీ మహిషాసురమర్దినిస్తోత్రమ్

మహిషాసుర మర్దినీ స్తోత్రము' అను నామమున ప్రసిద్దిలో నున్న ఈ శ్రీదేవీ
స్తోత్రము రాగా యుక్తముగ పాడు కునుటకును లయ బద్దముగ చదువు కొనుటకును చాలా అనుకూలముగ
ఉండుటచే ఎల్లా వారికిని ప్రీతి పాత్ర ముగ నున్నది .అనేక స్తోత్రముల వలనే ఇది యు
శ్రీ శంకరా చార్య విరచితము అని వాడుక .దీనిని శ్రీదేవీ భక్తులు వినియోగించుకొని శ్రీ దేవ్యనుగ్రహ పాత్రులు అగుదురు గాకా  

శ్లోl l అయి గిరినందిని నందితమేదిని విశ్వవినోదిని నందినుతే
గిరివరవింధ్యశిరోధినివాసిని విష్ణువిలాసిని జిష్ణునుతే
భగవతి హే శితికంఠకుటుంబిని భూరికుటుంబిని భూరికృతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే
తా l l పర్వత పుత్రీ ! భూలోక జనులకు సంతోషింప జేయుదాన ! నందుని చే
స్తుతింప బడుదాన!వింధ్య పర్వత నివాసిని !విష్ణు మాయా !శివ పత్ని !
బహు కుటుంబినీ ! మహిషాసుర మర్దినీ !అందమైన కొప్పు కల్గిన పార్వతీ !

శ్లోl lసురవరవర్షిణి దుర్ధరధర్షిణి దుర్ముఖమర్షిణి హర్షరతే
త్రిభువనపోషిణి శంకరతోషిణి కిల్బిషమోషిణి ఘోషరతే
దనుజనిరోషిణి దితిసుతరోషిణి దుర్మదశోషిణి సింధుసుతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే
తా l l  దేవతలకు వారములు ఇచ్చుదానా ! దుష్టులను బెదిరించుదానా !ఎంతటి వీరులను
ఓడించుదాన ! ఆనంద రూపిణి !త్రిలోక పోషిణి శివుని సంతోశ
పరచుదాన!పాపా హారిణి ! రాక్క్షస నాశిని ! అహంకారా నాశినీ ! సకల నదులచే
స్తుతించబడు మహిషాసుర మర్దినీ ! జయ జయ .

శ్లో l l అయి జగదంబ మదంబ కదంబవనప్రియవాసిని హాసరతే
శిఖరిశిరోమణితుంగహిమాలయశృంగనిజాలయమధ్యగతే
మధుమధురే మధుకైటభగంజిని కైటభభంజిని రాసరతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే
తా l l  జగన్మాత ! నా తల్లి !కదంబ వన వాసినీ !హిమాలయ పర్వత
శిఖర మధ్య వాసినీ !మధుర రూపిణి !మధు కైటభ నాశినీ ! రాస క్రీడ పరా ! జయ జయ

శ్లో l l అయి శతఖండ విఖండితరుండ వితుండితశుండ గజాధిపతే
రిపుగజగండ విదారణచండ పరాక్రమశుండ మృగాధిపతే
నిజభుజదండ నిపాతితఖండవిపాతితముండభటాధిపతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే
తా l l శుంభాది రాక్ష సులతో యుద్దమున వారి గజ సేనను వందల కొలది
ఖండములుగా ఖండించిన దాన!శత్రువుల చెక్కిలిని చీల్చు పరాక్రమముగల
సింహమును ఆరోహించు దానా ! నీ భుజ దండములతో ముండాసుర భటులను
పడగొట్టినదాన ! జయ జయ .

శ్లో l l అయి రణదుర్మద శత్రువధోదిత దుర్ధరనిర్జర శక్తిభృతే
చతురవిచారధురీణ మహాశివ దూతకృత ప్రమథాధిపతే
దురితదురీహదురాశయదుర్మతిదానవదూతకృతాంతమతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే
తా l l దుర్మదులైన శత్రువులను వధించుటకు పూను బుద్ద శాలియగు శివుని
దూతగా చేసుకొనిన దాన దురుడ్డు లైన దానవుల రాయబారులకు యముడిగా పనిచేయు గొప్ప బుద్దిగలదానా
మహిషాసుర మర్దినీ జయ జయ .

శ్లో l l అయి శరణాగతవైరివధూవర వీరవరాభయదాయకరే
త్రిభువన మస్తక శూలవిరోధిశిరోధికృతామల శూలకరే
దుమిదుమితామర దుందుభినాద మహో ముఖరీకృత తిగ్మకరే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే
తా l l శరణాగతులైన శత్రువులకును ,వారి పత్నులకును అభయమిచ్చు
హస్తములు కలదానా ! మూడు లోకముల వారి తలల పై శూలముల వలె ఉన్న
శత్రువుల తలలను చీల్చు శూలము కలదానా ! దుందుభి నాదముల తో
మారు మ్రోగు సూర్య మండలము కలదానా ! జయ జయ .

శ్లో l l అయి నిజహుంకృతిమాత్ర నిరాకృత ధూమ్రవిలోచన ధూమ్రశతే
సమరవిశోషిత శోణితబీజ సముద్భవశోణిత బీజలతే
శివ శివ శుంభ నిశుంభ మహాహవ తర్పిత భూత పిశాచరతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే
తా l l తన ఊంఖారముతో ధూమ్ర లోచనుడు మొదలగు రాక్షసులను నిరాకరించి
తరిమిన దాన ! రక్త బీజాసురుని రక్తమును యుద్దములో ఎండింప జేసిన దాన !
శుభ నిశంభులతో యుద్దమున చచ్చిన వీరులతో భూత
పిశాచాములను సంతోష పెట్టిన దాన ! జయ జయ .

శ్లో l l ధనురనుసంగ రణక్షణసంగ పరిస్ఫురదంగ నటత్కటకే
కనక పిశంగపృషత్కనిషంగరసద్భట శృంగ హతావటుకే
కృతచతురంగ బలక్షితిరంగ ఘటద్బహురంగ రటద్బటుకే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే
తా l l వింటిని ఎక్కు పెట్టి కదలిక లక్షనములో కదలచూ మెరయు చేతి
కడియములు కలదానా ! బంగారు వలె పచ్చని పిడులు గల బాణములతో
శత్రువుల శిరోభాగములు త్రుంచి వారిని చంపిన దాన ! రాక్షసులతో
యుద్దములో యుద్ద రంగమున మిగుల గర్జన ధ్వనులు చేయు
వటుక భైరవులు కలదాన ! జయ జయ .

శ్లో l l జయ జయ జప్య జయే జయ శబ్దపరస్తుతి తత్పర విశ్వనుతే
ఝణ  ఝణ ఝిం మిఝిం కృతనూపుర    శింజితమోహిత భూతపతే
నటితనటార్ధ నటీనటనాయక నాటితనాట్య సుగానరతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే
తా l l  జయ శబ్దములను పలుకుచూ నిన్ను స్తుతించు వారి స్తోత్రములను అందుకోనుదానా !
నీ అందెల ఝణ ఝణ ధ్వనులతో నీ పతియగు శివుని మోహింప చేయుదాన!
తాండవ నటనము చేయు నట రాజుకే నాట్యం చేయించ బడిన
నటుల నాట్యం తోను ఆ సమయము యందలి పాటలతోను ఆనందించు దాన ! జయ జయ .

No comments:

Post a Comment