పూర్వకాలం , ఆ కాలాన ఒక అగ్రహారం . ఆ అగ్రహారంలో ఒక బ్రాహ్మణ కుటుంబం వారికి ఒక కుమారుడు , ఒక కుమార్తె . ఇద్దరికీ వివాహాలు జరిగాయి .కోడలు కాపురానికి వచ్చినది. కాని కుమార్తె అత్తవారింటికి కాపురానికి వెళ్ళలేదు .బ్రాహ్మణ దంపతులు కూతురు ,కోడలిచేత కార్తీక చలిమళ్ళ నోము నోయించారు. కోడలు శ్రద్దగా వ్రతమాచరించింది. కుమార్తె శ్రద్ధ చూపలేదు . భక్తితో చేయలేదు. ఆమెకు వ్రతమందు నమ్మకం లేదు. విశ్వాసం లేదు. తల్లి దండ్రుల పోరు పడలేక ఏదో చేసింది .
అనంతరం కొంత కాలానికి కుమార్తెను కాపురానికి పంపారు. అక్కడ ఆమె ఎన్నో బాధలు పడ సాగింది .పరిస్థితులు ఏం బాగుండడం లేదు. శాంతి ,సౌఖ్యం లేదు, సంతోషం లోపించింది .
ఒకనాడు తండ్రి కుమార్తెను చూడ వచ్చాడు . తండ్రిని చూసి కుమార్తె విషయమంతా చెప్పి విచారించింది ,ఏడ్చింది .అంత తండ్రి ' అమ్మా ! విచారించకు . నీవు ఈ మారు శ్రద్దగా భక్తితో మరల నోము నాచరించు .నీకు సుఖ శాంతులు కలుగుతాయి .' అని ఊరడించి వెళ్ళిపోయాడు . ఆమె తండ్రి మాటలు విని శ్రద్దగా నమ్మకంతో వ్రత మాచరించింది . పరమేశ్వరుని ఆలయాన శివునకు రుద్రాభిషేకం చేయించినది . అనంతరం 5 గురు ముత్తైదువులకు వాయనము లిచ్చినది . రెండవ సంవత్సరమున పది మందికి వాయనములు యిచ్చినది .అనంతరం మూడవ సంవత్సరమున 15 మందికి వాయనాలు ఇచ్చింది . అది మొదలు ఆమె సుఖంగా జీవించ సాగింది. శాంతి సంతోషం కలిగాయి . సౌఖ్యం సిద్దించింది . అంతా వ్రత మహిమ . పరమేశ్వరుని దయ . సర్వ సంపదలు సిద్దించాయి . అనర్ధాలు తొలగి పోయాయి . స్త్రీలందరూ ఆచరించ తగ్గ వ్రతమిది . ఇదే కార్తీక చలిమిళ్ళ నోము.

No comments:
Post a Comment