Saturday, August 18, 2012

దీప దాన నోము

శ్రీరస్తు
దీనిని శంకరుడు పార్వతికి ఉపదేశించాడు. పవితమైన నోమిది - ఫలదాయినీ మహత్యం గలది.దివ్యమైనది.భవ్యమైనది ప్రతినిత్యం
దీపదానముల నోము దీవించు నోము
దీపదానముల నోము దివ్యమైన నోము
దీపదానముల నోము భవ్యమైన నోము
దీపదానముల నోము ఇహలోక సుఖదయినీ
దీపదానముల నోము పరలోక మోక్షదాయినీ
అని అంటూ శుచిగా పవిత్రంగా ప్రతినిత్యం పవిత్రాక్షతలు శిరమున జల్లుకోవాలి. సంవత్సరాంతమున ఉద్యాపన చెప్పుకోవాలి.ఉద్యాపన వినండి.

ముప్పదిరెండు వెండి ప్రమిదలు చేయించుకోవాలి.పదమూడు పోచలు కలిపినా దారంతో ఎనిమిది ముక్కలు చేసికోవాలి. వత్తులు తయారు చేసుకోవాలి.వెండి ప్రమిదలలో నూనె పోసి లేదా నెయ్యి వేసి వత్తులు వెలిగించాలి.వాటిని దక్షిణ తామ్బూలములతో చక్కని ఉత్తముడైన బ్రాహ్మణునకు దానమీయాలి.దీపదానం స్వర్గానికి మార్గం చూపుతుంది. నరకయాతనలు కలుగవు.భక్తి,శ్రద్ధలతో ఆచరించాలి.నిర్లక్ష్యం చేయకూడదు.నమ్మకం ప్రధానం.నోము నోచిన వారు వాయనం అందుకొనేవారు ఉత్తములై ఉండాలి.అహంకారం గర్వం కూడదు.భక్తి ముఖ్యం.శ్రద్ధ అవసరం. స్త్రీలందరూ చేయవచ్చును.ఈ వ్రతాచారణ వలన వెలుగు సిద్ధిస్తుంది.సంపద కలుగుతుంది.సుఖశాంతులు భోగభాగ్యాలు సంఘమన్ననూ మర్యాద చేకూరతాయి."దీపం జ్యోతి పరబ్రహ్మ" అని కదా మన పెద్దలు చెప్పారు.

ఆలోచన వద్దు - ఆచరణ ముద్దు
నాస్తుకులు చేయొద్దు - ఆస్తికులు మానొద్దు

No comments:

Post a Comment