పూర్వ కాలం నాటి మాట .ఆరోజులలో ఒక బ్రాహ్మణ దంపతులు ఉండేవారు .వారికి 5 గురు కుమారులు జన్మించారు .యుక్త వయస్సు రాగానే అయిదుగురుకి వివాహములు జరిపాడు తండ్రి .అయిదుగురు ఎవరి కాపురం వారు చేసి కొంటున్నారు. వేరువేరుగా జీవిస్తున్నారు . పెద్ద కోడళ్ళు నలుగురు చాలా గర్వంగా జీవించేవారు. చిన్న కోడలు మాత్రం వినయంగా జీవించేది. అందరికి చిన్న కోడలంటే అలుసు. ఆమెను చులకనగా చూసేవారు. ఆమె సూర్యునకు నమస్కరిస్తూ వినయంగా భక్తిగా జీవితం గడుపుతూ ఉండేది . పెద్దకోడళ్ళు నలుగురూ తమ భర్తలకు లేని పోనివి చెప్పి చిన్నకోడలిని అడవిలో దించి రండని చెప్పారు. భర్తలు భార్యల మాటలు నమ్మి చిన్నకోడలు నిద్రించు చుండగా రాత్రి సమయాన మంచంతో సహా ఆమెను ఎత్తుకొనిపోయి ఒక అడవిలో విడిచి యింటికి వచ్చారు.
తెల్లవారినది ఆమె లేచి చూసే సరికి మంచంతో అడవిలో ఉంది . ఆమె ధైర్యంగా బాధ పడకుండా దగ్గరలో ఉన్న నదిలో స్నానం చేసి సూర్య దేవునకు నమస్కరించి కూర్చుంది. ఇంతలో ఒక గ్రద్ద అటుగా ఎగురుతూ ఒక వరహాల మూట ఆమె వడిలో పడునట్లు జార విడిచి ఎగురుతూ వేల్లిపోయినది. దాంతో ఆమె జమీందారైనది . ధనవంతురాలైనది . ఆ ప్రక్కనే ఉన్న పల్లెకు పోయి సుఖంగా ,హాయిగా జీవించ సాగింది. సిరి సంపదలతో తుల తూగుచూ హాయిగా జీవిస్తూ నిత్యాన్న దానం కార్యక్రమం చేస్తూ పదిమందికి ఉపకారం చేస్తూ సుఖంగా ,హాయిగా జీవిస్తోంది.
ఇక అక్కడ అత్త మామలు ,తోడి కోడళ్ళు .నలుగురు భావలు చాలా దరిద్రులై తిండి లేక అష్ట కష్టాలు పడుతూ జేవిస్తున్నారు. తిండి కోసమై ఊరూరు తిరుగుచూ చివరికి చిన్న కోడలు ఉన్న గ్రామం చేరుకున్నారు. దీన, హీన స్థితిలో ఉన్న వారందరినీ గుర్తించి చిన్న కోడలు ఉపకార బుద్దితో వారందరినీ తన ఇంటికి తీసుకు వచ్చి తలంటి నీరు పోసి కొత్త బట్టల నిచ్చి భోజనాలు పెట్టించింది . అనంతరం అందరూ కలసి కురుళ్ళ గౌరీ నోము నోచుకున్నారు. ఆ వ్రత మహిమ వలన మరల అందరి కందరూ సంపన్నులయ్యారు. చిన్న కోడలి దయవల్ల వారికి మరల మంచి స్థితి కలిగింది . అపకారికి ఉపకారం చేసింది ఆ ఇల్లాలు.
ఇక ఉద్యాపన విషయం వినండి .ఒక సంవత్సర కాలం ప్రతిదినం పద మూడేసి కురుళ్ళు కంచంలో పెట్టి కధ చెప్పుకొని అక్షతలు శిరస్సు నందుంచు కోవాలి. సంవత్సరం పూర్తి అయ్యాక నలుగురు ముత్తైదువులకు తృప్తిగా భోజనం పెట్టాలి. వారిని బాగుగా అలంకరించాలి . అనంతరం కొత్త బట్టలు పెట్టాలి . ఒక కంచం ముత్తైదువు నకు వాయనంగా ఇచ్చుకోవాలి . శ్రద్దగా ఈ వ్రతమాచరించాలి . తప్పక ఫలం సిద్దించ గలదు .నోము నోచి వ్రతం చేసి ఫలం పొందండి . నమ్మకం ప్రధానం లోనివాడు ఫలితం శూన్యం సుమండీ .శ్రద్దా భక్తులతో చేయాలి . తప్పక ఫలం సిద్దిస్తుంది .ఇది నిత్య సత్యం .ఎందరో ఆచరించి ఫలం పొందారు. స్త్రీలందరూ ఈ కురుళ్ళ గౌరీ నోము నోచి గౌరు దేవి దయకు పాత్రులు కండి
సిరి సంపదలు తో తుల తూగండి .హాయిగా, సుఖంగా జీవించండి . విశ్వాసం లేనివారికి ఈ ఫలం దక్కదు. ఫలితం కోసం కాకుండా భక్తిగా చేసుకోవాలి .
No comments:
Post a Comment